Monday, June 7, 2021

నైవేద్యాల పేర్లు (తెలుగు పేర్లు – సంస్కృతం పేర్లు)

నైవేద్యాల పేర్లు
🍌🍎🍈🍇🥥🍊🍋

(తెలుగు పేర్లు – సంస్కృతం పేర్లు)
|| పళ్ళు ||
అరటిపండు – కదళీఫలం
ఆపిల్ – కాశ్మీరఫలం
ఉసిరికాయ – అమలక
కిస్మిస్ – శుష్కద్రాక్ష
కొబ్బరికాయ పూర్తిగా – నారికేళం
కొబ్బరికాయ ౨ చిప్పలు – నారికేళ ఖండద్వయం
ఖర్జూరం – ఖర్జూర
జామపండు – బీజాపూరం
దబ్బపండు – మాదీఫలం
దానిమ్మపండు – దాడిమీఫలం
ద్రాక్షపళ్ళు – ద్రాక్షఫలం
నారింజ – నారంగ
నిమ్మపండు – జంభీరఫలం
నేరేడుపండు – జంబూఫలం
మామిడి పండు – చూతఫలం
మారేడుపండు – శ్రీఫలం
రేగు పండు – బదరీ ఫలం
వెలగపండు – కపిత్తఫలం
సీతాఫలం – సీతాఫలం

|| విశేష నివేదనలు ||
🫕🍓🍱🍓🍚🍓🧆🍓
అటుకులు – పృథక్
అటుకుల పాయసం – పృథక్పాయస
అన్నము (నెయ్యితో) – స్నిగ్ధౌదనం
అన్నం (నెయ్యి,కూర,పప్పు,పులుసు,పెరుగు) – మహానైవేద్యం
ఉగాది పచ్చడి – నింబవ్యంజనం
కట్టుపొంగలి (మిరియాలపొంగలి) – మరీచ్యన్నం
కిచిడీ – శాకమిశ్రితాన్నం
గోధుమనూక ప్రసాదం – సపాదభక్ష్యం
చక్కెరపొంగలి – శర్కరాన్నం
చలిమిడి – గుడమిశ్రిత తండులపిష్టం
నిమ్మకాయ పులిహోర – జంభీరఫలాన్నం
నువ్వులపొడి అన్నం – తిలాన్నం
పరమాన్నం (పాలాన్నం)- క్షీరాన్నం
పానకం – గుడోదకం, మధురపానీయం
పాయసం – పాయసం
పిండివంటలు – భక్ష్యం
పులగం – కుశలాన్నం
పులిహోర – చిత్రాన్నం
పెరుగన్నం – దధ్యోదనం
పేలాలు – లాజ
బెల్లపు పరమాన్నం – గుడాన్నం
వడపప్పు – గుడమిశ్రిత ముద్గసూపమ్
వడలు – మాసపూపం
శెనగలు (శుండలు) – చణకం
హల్వా – కేసరి

|| వివిధ పదార్థాలు ||
🍯🍯🍯🍯🍯🍯
అప్పాలు – గుడపూపం
చెరుకుముక్క – ఇక్షుఖండం
చక్కెర – శర్కర
తేనె – మధు
పాలు – క్షీరం
పెరుగు – దధి
బెల్లం – గుడం
వెన్న – నవనీతం

Source - Whatsapp Message

సంతృప్తి కథ

మోటివేషన్... మంచి కథ..... సంతృప్తి కథ
ఆఫీస్ కు రెండు రోజులు సెలవు రావడంతో అమ్మా, నాన్నలతో గడపడానికి మా ఊరికి బయలుదేరాను.

బస్టాండ్ కు చేరుకున్న నేను, అప్పుడే వచ్చిన బస్ ఎక్కాను.
పరిస్థితి చూస్తే కూర్చోడానికి సీటు దొరికేలా లేదు.
అప్పుడే.. ఒకతను లేచి నిలబడి అతని సీటు నాకు ఇచ్చి, అతను వేరే దగ్గరకి వెళ్ళి నిలుచున్నాడు.

హమ్మయ్య.. అనుకుంటూ అతనికి థాంక్స్ చెప్పి అక్కడ కూర్చున్నాను.

నాకు సీటు ఇచ్చిన అతనికి పక్కనే ఒక అతను లేవడంతో అతను ఆ సీట్లో కూర్చోవడం జరిగింది.

ఇంతలో వేరే అతను బస్సు ఎక్కడంతో అతను లేచి నిలబడి మళ్లీ అతని సీటు ఆ వచ్చిన అతనికి ఇచ్చాడు.

ఇలా అతను తరువాత నాలుగు అయిదు స్టాపులలో అందరికీ అలాగనే అతను కూర్చున్న సీటు ఇవ్వడం చేస్తూ ఉన్నాడు.

ఇదంతా గమనిస్తున్న నేను, చివరి స్టేజీలో బస్సు దిగబోయే ముందు అతనితో మాట్లాడాను.

‘’నువ్వు కూర్చోకుండా ప్రతిసారి నీ సీటు వేరే వాళ్లకు ఎందుకిస్తున్నావు?” అని అడిగాను.

అతని సమాధానం నన్ను ఆశ్చర్యపరిచింది. ‘’నేను ఏమి చదువుకోలేదు, డబ్బున్నవాణ్ణి కూడ కాదు. కూలి పనులు చేసుకునే వాణ్ణి. ఏ విధంగానూ ఎవరికీ ఏమి ఇవ్వలేక పోయాను. అందువలన నేను రోజూ ఈపని చేస్తున్నాను. ఈ పని తేలిక కూడ” అన్నాడు.

"కూలి చేసుకునే నాకు నిలబడడం కష్టం కాదు. నేను సీట్ ఇచ్చిన వారు తిరిగి నాకు కృతజ్ఞతలు చెప్తారు.

ఎవరికీ ఏమీ ఇవ్వలేని నాకు, ఈ తృప్తి చాలు.

ఆ తృప్తితో నాకు సుఖంగా నిద్రపడుతుంది” అన్నాడు.

నాకు నోటంట మాట లేదు. ప్రతిరోజూ ఏదో ఒకటి ఇవ్వటం అంటే అది వారికి గిఫ్ట్ తో సమానమే...

ఎదుటివాళ్లకు ఇవ్వాలంటే మన దగ్గర ఏమీలేకపోయిన ఇవ్వచ్చు అని అతన్ని చూచి తెలుసుకొన్నాను.

మనం ధనవంతులం, స్థితిమంతులం ఐతేనే ఒకళ్లకు ఇవ్వగలం అనుకోవటం తప్పు.

ఇచ్చే మనసున్న ఎవరైన "ధనవంతుడే" అని అతన్ని చూశాక తెలుసుకున్నాను.

ఒకరికి ఇవ్వడంలో గల "సంతృప్తి", మరెందులోనూ రాదని అర్థమైంది

మిత్రులారా దయచేసి

సేవాగుణాన్ని , సంతృప్తిని పిల్లలలో అలవరచండి.

మనం కూడా అలవరచుకునే ప్రయత్నం చేద్దాం.!

"మానవసేవే మాధవసేవగా తరిద్దాము." 🙏🏻*

Source - Whatsapp Message

తేనె ఎన్ని రోజులైన చెడిపోదు, కారణం?

తేనె ఎన్ని రోజులైన చెడిపోదు అని నేను చదివాను.దానికి కారణం తెలియజేయగలరు?
స్వచ్ఛమైన తేనే గాలి సోకని డబ్బాలో ఉంచితే ఎన్నిరోజుల అయినా చెడిపోదు.

ముఖ్య కారణాలు:

1. తేనే గాలిలో వున్న తేమను ఆకర్షిస్తుంది. బాక్టీరియా తేనే ని తగిలినపుడు దానిలోవున్న తేమను బలవంతంగా బయటకు తెస్తుంది అందువలన బాక్టీరియా అద్దమువలె పగిలి చనిపోతుంది. మనం వాడే ఆల్కహాల్ sanitzers కూడా ఈ సూత్రము ద్వారానే పనిచేస్తుంది.

2. తేనె ఆసిడ్ లాగా ఉంటుంది (ప్ హెచ్ 3. 26 --4.48). చాలా రకాల బాక్టీరియా లు అందులో బతకలేవు .

ఐతేయ్ ఇలాంటిస్వభావం కలిగిన పదార్దాలు చాలా వున్నాయి కానీ తేనె మాత్రమే పాడవదు

3. పువ్వు యొక్క మకరందం నుండి ఫీనోలిక్ ఆసిడ్స్ తేనెటీగల ద్వారా తేనెలోకి వస్తాయి. అవి మైక్రోబ్స్, ఫంగస్ ని నాశనం చేస్తుంది

4. తేనెలో వున్న emzymes వలన కొంచం hydrogenperoxide ఉత్పత్తి అవుతుంది

ఈ కారణాలవలన బాక్టీరియా, ఫంగస్ లాంటివి తేనె లో బతకలేవు, అందువలన తేనె చెడిపోదు. ఈ కారణాలవలన తేనె ని గాయలమీద, పుండ్లమీద natural ఆయింట్మెంట్ లాగా వాడుతారు

ఐతేయ్ మార్కెట్లో వున్న కొన్ని కంపెనీస్ తేనెని వేడిచేసి, ఇండస్ట్రియల్ ప్రాసెస్ చేయటంవల్ల అది సహజ స్వభావం కోల్పోయి పాడవుతుంది. ఇలాంటి తేనె వలన ఆరోగ్యానికి పెద్దగా ఉపయోగం ఉండదు.

తేనెటీగలు seal చేసిన పచ్చి తేనె చెడిపోదు ఆరోగ్యానికి ఉపయోగం. నమ్మకమైన రైతు ద్వారా తేనె కొనండి. మీకు రైతులు అందుబాటులో లేకపోతె నాకు మెసేజ్ పంపండి(9392009104).

ఇంకా ఏమైనా ప్రశ్నలు ఉంటే నన్ను అడగండి

Source - Whatsapp Message

భోజనము చేసాక ఏమి చేయకూడదు ?

భోజనము చేసాక ఏమి చేయకూడదు ?
భోజనము అయ్యాక చేయకూడని ఏడు ప్రమాదకర చర్యలు

1 . భోజనము చేయగానే నడక వద్దు :: తినగానే వంద అడుగులు నడుస్తే 99 ఏండ్లు జీవిస్తారు అని నానుడి, కాని అది నిజమా ? నిజము ఏమిటంటే జీర్ణక్రియ (ప్రక్రియ) లో మనము తిన్న ఆహారములోని పోషకాలను మన నడకతో ప్రతికూల చర్య వలన శరీరము గ్రహించలేకపోతుంది,

2 . భోంచేయగానే పడుకోవడము వద్దు :: ఆంగ్లం లో ఒకసారి చదివాను After lunch sleep a while-After suppers walk a mile అని, కాని భోంచేయగానే పడుకోవడము వలన జీర్ణక్రియ సక్రమంగా జరుగదు,ఇందువలన జీర్ణకోశ వ్యాధులు ( గ్యాస్ట్రిక్‌ మరియు ఉదరకోశ సమస్యలు) ఏర్పడుతుంది కాబట్టి కొద్ది సమయం తర్వాత పడుకోవాలి,

3 . భోంచేయగానే పళ్లు తినవద్దు :: భోజనం చేయగానే పళ్లు తినటం వల్ల కడుపు ఉబ్బరం ఔతుంది ! కాబట్టి పళ్లను భోజనానికి గంట ముందు లేదా ఒకటిరెండు గంటల తర్వాత నైనా తినొచ్చు,

4 . టీ త్రాగరాదు :: ఛాయ్‌పత్తా (Tea leaves 🍃)లో ఆమ్ల గుణాలు ఎక్కువ కావున మనం తిన్న ఫ్రొటీన్‌ కలిగిన ఆహారము ఆమ్లాలతో చర్య జరిగి జీర్ణక్రియలో సమస్యలు రావచ్చును/వచ్చును ,

5 . నడుము బెల్టు వదులు చేయరాదు :: తినంగనే నడుము బెల్టు వదులు చేయటం కారణంగా తిన్న ఆహారం సులువుగా ఒక్కసారిగా క్రిందకు జాఱి ప్రేగులు మడతబడటం లేదా మూసుకొని పోవడం కావచ్చు/ సంభవిస్తుంది ,

6 . స్నానము చేయరాదు :: భోజనము తర్వాత స్నానం చేయటం వల్ల శరీరానికి, కాళ్లకు చేతులకు అధిక రక్త ప్రసరణ జరుగుతుంది, అందువల్ల కడుపుకు తక్కువ రక్తప్రసరణ జరగడం వలన జీర్ణక్రియ మందంగా జరుగుతుంది/జీర్ణకోశ వ్యాధి బారిన పడవచ్చును,

7. పొగ త్రాగరాదు :: వైద్య నిపుణుల సలహాలే కాకుండా వైద్య నిపుణుల ప్రయోగాలలో కూడ గమనించినది ఏమిటంటే భోజనము చేసిన తర్వాత పొగత్రాగడం వల్ల కాన్సర్‌ వచ్చే అవకాశాలు ఎక్కువ అని ఋజువైనది,

( తెలిసినవి, పెద్దలు చెప్పినవి, చదివినవి , సేకరించినవి క్రోఢీకరించి రాసినది)

Source - Whatsapp Message

చేతిని ఉపయోగించి భోజనం చేస్తే కలిగే సైంటిఫిక్ లాభాలు

✋చేతిని ఉపయోగించి భోజనం చేస్తే కలిగే సైంటిఫిక్ లాభాలు🤘

✍️ మురళీ మోహన్

👌డైనింగ్ టేబుల్ మీదికి స్పూన్స్, ఫోర్క్ లు వచ్చి చేతితో భోజనం చేసే వాడిని అనాగరికుడిగా చూస్తూ వెక్కిరిస్తున్న తరుణమిది.

తిండేదైనా ఫోర్క్ పక్కా అయి కూర్చుంది ఈ వేళ..?

హోటల్ లో ఎవరైనా పద్దతిగా చేతితో అన్నం కలుపుకొని తింటుంటే అందరూ అతడిని వింత గా చూసే పరిస్థితి ఏర్పడింది.

ఇక మన ఇంట్లో చిన్న పిల్లలకు సైతం స్పూన్స్ అలవాటు చేస్తున్నారు ఈ తరం తల్లీదండ్రులు.

దానికి వాళ్లు చూపిస్తున్న ప్రధాన కారణం.. చేతులు శుభ్రంగా ఉండవు కదా..! అని.

అయితే ఓ సారి చేతిని ఉపయోగించి భోజనం చేస్తే కలిగే సైంటిఫిక్ లాభాలను ఓ సారి చూద్దాం.

ఇది చదివాక ఎక్కడున్నా…?
మీరు పద్దతిగా చేతిని ఉపయోగించి భోజనం చేస్తారని ఆశిస్తున్నాను

చేతితో ఆహారాన్ని తీసుకోవడం వలన కలిగే ప్రయోజనాలు:
( As Per Science)

1.చేతిస్పర్శ వల్ల శరీరానికి బలం చేకూరుతుంది.

✋✋✋✋✋✋✋✋

2.చేతితో ఆహారం తీసుకోవడం వలన కొన్ని మిలియన్ల నరాలు మన మెదడుకు సిగ్నల్స్ ని పంపిస్తాయట.

✋✋✋✋✋✋✋

3.అహారాన్ని చేతితో టచ్ చేయగానే, ఫుడ్ తీసుకునే విషయం మెదడు పొట్టకు సంకేతమిస్తుంది. అలా కడుపులో జీర్ణరసాలు, ఎంజైమ్స్ రిలీజ్ కావడం వలన జీర్ణశక్తి బాగా జరుగుతుంది.

🖐🖐🖐🖐🖐🖐🖐🖐🖐

4.చేత్తో ఆహారం తీసుకోవడం వలన ఆరోగ్యంగా ఉండటమే కాకుండా, ఎటువంటి ఆలోచనలు లేకుండా ఒకే ధ్యాసలో ఉంటాం.

🖐🖐🖐🖐🖐🖐🖐🖐

6.మన ఆహారాన్ని నూనె మరియు ఎక్కువగా ఉపయోగిస్తాం.ఇలా తయారుచేసుకున్న ఆహారాన్ని స్పూన్స్, ఫోర్క్స్ తో తీసుకోవడం వలన ప్రతిచర్య ఏర్పడి రుచిపోతుందట.

🖐🖐🖐🖐🖐🖐🖐🖐🖐

7.వేళ్ళతో ఆహారం కలుపుకొని, ముద్దలుగా ఒక్కో పదార్థాన్ని కలుపుకోవడం వలన రక్తప్రసరణ బాగా జరుగుతుందట.

🖐🖐🖐🖐🖐🖐🖐🖐🖐

8.చేతివేళ్ళతో ఆహారం తీసుకోవడం వల్ల,వేళ్ళు పెదాలకు తగలగానే నోటిలో లాలాజలం ఊరుతుంది.

🖐🖐🖐🖐🖐🖐🖐🖐🖐

9.ఇంకా చేతివేళ్ళతో మనం ఆహారం తీసుకోవడం వలన అనారోగ్యం పాలుకాకుండా,ఆరోగ్యవంతంగా ఉంటారు. జీర్ణ ప్రక్రియ బాగా జరుగుతుంది. ఇలా చేయడం ఒక వ్యాయామంలా ఉంటుంది. పురణాల పరంగా…

చేతిలో ఉండే ఒక్కో వేలు ఒక్కో తత్వాన్ని కలిగి ఉంటుంది.

🖐🖐🖐🖐🖐🖐🖐🖐🖐

బొటనవేలు: అగ్నితత్వం
--------------

చూపుడు వేలు: వాయుతత్వం
--------------

మధ్యవేలు: ఆకాశం
--------------
ఉంగరపు వేలు: భూమి
--------------
చిటికిన వేలు: జలతత్వం
--------------
ఈ అయిదు వేళ్ళ స్పర్శ ఆహారానికి తగిలినపుడు జీవశక్తి ఉత్తేజితం అవుతుంది. ✋
🍃🍍🍎🌿🍐🍊🍑🍒🌽🍆🍌🍃

Source - Whatsapp Message

మనం జీవితంలో విజయవంతం కావాలంటే ఏది తోడ్పడుతుంది? మన అదృష్టమా? మన తలరాతా? భగవంతుడా? లేక మన కృషి ..?

🕉️ మనం జీవితంలో విజయవంతం కావాలంటే ఏది తోడ్పడుతుంది? మన అదృష్టమా? మన తలరాతా? భగవంతుడా? లేక మన కృషి ..?🕉️

✍️ మురళీ మోహన్

👌సద్గురు: అదృష్టం, తలరాత, భగవంతుడు, కృషి. బహుశా ఇవన్నీనేమో. సరే అదృష్టం విషయానికి వస్తే, అది మీ చేతుల్లో లేని విషయం. మీరు భగవంతుడు అన్నా, అదీ మీ నియంత్రణలో లేని విషయం. మీ తలరాత కూడా మీ నియంత్రణలో లేని విషయమే. మీరు చేయగలిగింది ఏముంది..? మీకు ఏది కావాలో దానికోసం కృషి చేయడం. బహుశా మీరు పూర్తిగా నూటికి నూరు శాతం మనస్సు పెట్టి కృషి చేస్తే అది జరుగుతుందేమో.

ఎదో ఉరికే కృషి చేయడం అనేది మూర్ఖత్వం అవుతుంది, ఉరికే కష్టపడడం అనేది మిమ్మల్ని గమ్యానికి చేర్చదు. మీరు సరైన పనిని సరైన సమయంలో సరైన చోట చేయడం అనేది చాలా ముఖ్యం కదా?ఇవన్నీ జరగడానికి మీకు తెలివితేటలు కావాలి. మీరు జీవితంలో చేయాల్సిందల్లా ఇంతే – మీ తెలివితేటలని, దృక్పదాన్ని పెంచుకోవడం. ఇది కనక మీరు చేస్తూ ఉంటె మీ జీవితం దానంతట అదే మెరుగవుతు ఉంటుంది.

మీ అవగాహనా శక్తి ని పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తే మీ సామర్ధ్యం దానంతట అదే పెరుగుతుంది

మనుషులు చేస్తున్న పొరపాటు ఏమిటంటే, వారి సామర్ధ్యాన్ని పెంచుకోవాలని చూస్తున్నారు. కాని మీరు చేయవలసింది సామర్ధ్యాన్ని పెంపొందించుకునే ప్రయత్నం కాదు, మీ అవగాహనా శక్తి ని పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తే మీ సామర్ధ్యం దానంతట అదే పెరుగుతుంది. చూడండి, ప్రతి ఒక్కరూ డాక్టర్ అవ్వాలి అనుకుంటున్నారు, ఈ రోజుల్లో కాదేమో కాని పాతిక సంవత్సరాల క్రితం అంతే. మీకు మెడిసిన్లో సీట్ రాలేదనుకోండి, ఎం చేయాలి? అప్పుడు ఇంజినీర్ అవ్వాలి అనుకుంటారు. సరే, మీరు డాక్టర్ అయ్యారు అనుకుందాం, అందరూ యోగా చేసి జబ్బులు ఏమి తెచ్చుకోలేదు అనుకుందాం. చాలా కొద్దిమంది నిజంగానే ఒక డాక్టర్ అవ్వాలి అన్న ఉద్దేశంతో డాక్టర్ అవుతున్నారు, మిగతావారందరూ ఎందుకు డాక్టర్లు అవుతున్నారంటే ఇది ఒక మంచి వ్యాపారం అనుకుంటున్నారు. అవునా? ఎవరో అనారోగ్యం మీకు మంచి వ్యాపారం, అవునా? సరే నేను ఇందులోకి లోతుగా వెళ్ళను, ఎందుకంటే ఇది నన్ను బాధిస్తుంది. నిజంగా కొద్ది మంది మాత్రమే మానవాళికి సేవ చేయాలి అనుకుని డాక్టర్ అవుతున్నారు , అది చాలా గొప్ప విషయం.

మీరు మీ జీవితాన్ని పూర్తిగా ఆస్వాదిస్తున్నారా లేదా, మీరు చేయగలిగిందంతా మీరు చేస్తున్నారా లేదా అన్నదే అసలు విషయం

ఒక రోజు అందరూ ఆరోగ్యంగా అయ్యారు అనుకుందాం, ఆరోగ్యంగా అయిపోవడం అన్నది చాలా మంది డాక్టర్లకి ఇష్టంలేదు అవునా? మీరు డాక్టర్ అవ్వచ్చు, రాజకీయనాయకుడు అవ్వచ్చు లేదా యోగి అవ్వచ్చు, మీరు ఎం అయ్యారు అనేది కాదు ఇక్కడ విషయం. మీరు మీ జీవితాన్ని పూర్తిగా ఆస్వాదిస్తున్నారా లేదా, మీరు చేయగలిగిందంతా మీరు చేస్తున్నారా లేదా అన్నదే అసలు విషయం. మీరు “నా తెలివి తేటల్ని ఎలా పెంచుకోగలను” అని ఆలోచించకండి. జీవితం ఎలా ఉందో అలా చూడగలిగితే, ఇక్కడ బతకడానికి కావలసిన తెలివితేటలు అవే వస్తాయి. మీరు జీవితాన్ని అది ఉన్న విధంగా చూడలేక పోతున్నారనుకోండి, అప్పుడు మీ తెలివితేటలే మీకు విరుద్ధంగా పని చేస్తాయి. ఇప్పుడు చూడండి, ఈ ప్రపంచంలో చాలా మంది తెలివిగల వాళ్ళు వారికి వారే కీడు చేసుకుంటున్నట్టు కనిపిస్తుంది కదా? ఎందుకంటే వారికి తెలివితేటలు ఉన్నాయి కాని జీవితం పట్ల అవగాహన లేదు.

మీకు సామాజిక విజయం మాత్రమే కాకుండా నిజమైన విజయం కావాలంటే, మీరు జీవితాన్ని ఎలా ఉందో అలా చూడగలగాలి. మీరు విషయాలని ఎలా ఉన్నాయో అలా చూడగలిగినప్పుడు, జీవితం మీకు ఒక ఆట అయిపోతుంది. ఈ ఆటని బాగా ఆడగలిగారు అనుకోండి, అప్పుడు మీరు విజయం సాధించారు అని జనం అంటారు. మీరెప్పుడు “నేను విజయం సాధించాలి” అని అనుకోకూడదు, నేను ఈ జీవితాన్ని పరిపూర్ణంగా ఎలా చేసుకోవాలి అని ఆలోచించాలి. మీరు ఇలా చేస్తూ ఉంటే, జనం ఏదో ఒక రోజున మీరు విజయం సాధించారు అని అంటారు, కాని మీ అంతట మీరు “నేను విజయం సాధించాలి” అని ఆలోచిస్తూ కూర్చో కూడదు. ఇలా ఆలోచిస్తూ మాత్రమే ఉంటే జరిగేదల్లా కేవలం మీరు బాధపడి మీ చుట్టూ ఉన్నవారిని బాధపెట్టడం అంతే. ఎందుకంటే మీరు విజయం అని దేనిని అనుకుంటున్నారు? అందరూ మీ కంటే కింద ఉండాలి, మీరు ఎవరి నెత్తినో ఎక్కి పిండి కొట్టాలి అని అంతే కదా?

మీరు ఎప్పుడు విజయం గురించి ఆలోచించకండి. మిమ్మల్ని ఒక పరిపూర్ణమైన జీవితంగా ఎలా మార్చుకోవాలి అని ఆలోచించండి. ఒక రోజున అది అనుభూతిలోకి వచ్చినప్పుడు మీరు విజయవంతులు అవుతారు, మీ చుట్టూ ఉన్న మనుషులు దాన్ని గ్రహించగలుగుతారు. కాని మీ అంతట మీరు ఎప్పుడు నేను ఎలా విజయం సాధించాలి అని ఆలోచించడం జీవితం పట్ల సరైనది కాదు.🤔

Source - Whatsapp Message

హిందూ మతం ('సనాతన ధర్మం' గా కూడా వ్యవహరిస్తారు) ప్రపంచములో వేల సంవత్సరాల క్రితం పుట్టిన ఒక పురాతన మతం.

🙏🙏🙏🙏🙏🌺🌺🙏🙏🙏🙏🙏

హిందూ మతం ('సనాతన ధర్మం' గా కూడా వ్యవహరిస్తారు) ప్రపంచములో వేల సంవత్సరాల క్రితం పుట్టిన ఒక పురాతన మతం. ఈ పురాతన మతం తాలుకా ఆనవాళ్ళు లభ్యమైన శాసనాలు, దేవాలయాలు, ధ్వజస్తంభాలు, విగ్రహాలు మొదలగునవి కార్బన్ డేటింగు ఆధారంగా వాటి కాలాల బట్టి ఎంత పురాతనమైనదని ఒక అంచనా వేయవచ్చు... ‘భరతవర్ష' భారతదేశంలోని ప్రధానంగా ఉండే ఈ మతం సనాతన, వైధిక మతంగానూ తరువాత హిందూ మతం గా గుర్తింపు పొందింది.

1.) మహాభారతం 5,120 సంవత్సరాలు.
2.) రామాయణం మహాభారతం కన్నా పురాతనమైనది లక్షల సంవత్సరాల క్రితం.
3.) సింహాచలం 8,000 సంవత్సరాలు , తిరుమల.
4.) తిరుపతి 6,000 సంవత్సరాలు.
5.) శ్రీ శృంగార వల్లభ స్వామి శోభాయమానంగా స్వయంభువుగా కొలువుదీరిన దేవాలయానికి 9000 (తొమ్మిది వేల ససంవత్సరాలు).
6.) శ్రీశైలం ఆలయ ధ్వజస్తంభం వయస్సు 3,000 సంవత్సరాలు.
7.)6000 సంవత్సరాల పూర్వం చెక్కిన రామ, హనుమ చిత్రాలు, ఇరాన్.
8.)3000 సవత్సరాల పూర్వం మన్సేశ్వర శివాలయం,పాకిస్థాన్.
9.) 400 సంవత్సరాలకు కింద నిర్మించిన #శివాలయం,ఇండోనేషియా.
10.)600 సంవత్సరాలకు పూర్వం నిర్మించిన హింగ్లాజ్ మాత దేవాలయం పాకిస్థాన్.
11.)700 సంవత్సరాలకు పూర్వం నిర్మించిన ఇండోనేషియా లోని వాల్కనో కొండమీద నిర్మించిన గణేష్ విగ్రహము.
12.)800 సంవత్సరాల విష్ణుదేవాలయం, కాంబోడియా.
13.)800 సంవత్సరాలకి పూర్వం నిర్మించిన #డాకేశ్వరీ మాత దేవాలయం, బంగ్లాదేశ్.
14.)1000 సంవత్సరాలకు పూర్వం నిర్మించిన శివాలతేజ దేవాలయం, పాకిస్థాన్.
15.)1100 సంవత్సరాల పూర్వం నిర్మించిన #నల్లూర్ కండస్వామి దేవాలయం, శ్రీలంక.
16.)1200 సవత్సరాల పూర్వం నిర్మించిన #ప్రంబనన్ దేవాలయం, ఇండోనేషియా.
17.)1500 సంవత్సరాల క్రితం నిర్మించిన పశుపతినాథ్ దేవాలయం, నేపాల్.
18.) రామసేతు 18,400 సంవత్సరాలు అంతకన్నా ఎక్కువ వయసు (Ram Setu 18,400 years old: Study.)
19.) భూమర ఆలయం భారతదేశంలోని మధ్య ప్రదేశ్ లో సత్నా ప్రదేశంలో ఉంది. ఇది 6 వ శతాబ్దపు గుప్త శకం హిందూ రాతి ఆలయం. ఉన్నాయి. క్రీస్తు పూర్వం 484 నాటి ఒక శాసనం లభ్యమైనది. 2,484 సంవత్సరాలు క్రితం.
20.) ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో ఉన్న గుడిమల్లం గ్రామంలోని శివుడు దేవాలయంలోని శివలింగం క్రీస్తు పూర్వం ఒకటో శతాబ్ద కాలం నాటిదని పురావస్తు శాఖ గుర్తించింది, 2,100 సంవత్సరాల క్రితం.
21.) మొట్టమొదటిగా ఖారవేలుడి (క్రీస్తు పూర్వం ఒకటో శతాబ్దం) శాసనంలో ‘భరతవర్ష’ అనే ప్రస్తావన కనిపిస్తుంది. భరతవర్ష అనే పదం అంతకన్నా పురాతనమైనది... ‘భరతవర్ష’ ఎక్కువగా పురాణాల్లో కనిపిస్తుంది. 2,100 సంవత్సరాలు క్రితం.
22.) రాజస్థాన్, పుష్కర్ లోని దాదాపు రెండు వేల సంవత్సరాలకు పూర్వం నిర్మించిన బ్రహ్మ దేవాలయం. 2,000 సంవత్సరాలు క్రితం.
23.) ఏక లింగ దేవాలయం, ఉదయ్ పూర్ కు 22 కిలోమీటర్ల దూరంలోని కైలాస్ పూర్లోనే ఏక లింగ శివుడు దేవాలయం ఉంది. అత్యంత ప్రాచీనమై ఈ దేవాలయాన్ని క్రీస్తు పూర్వం 734 లో బాపా ఏవాల్ నిర్మించినట్లు చెబుతారు. 2,734 సంవత్సరాలు క్రితం.
24.) చిత్తూరు జిల్లాలో 2,200 యేళ్ళ నాటి పురాతన ఆలయం! క్రీస్తు పూర్వం 2-3 శతాబ్దాల కాలం నాటి గుడిమల్లం ఆలయం.
25.) క్రీస్తు పూర్వం 3,000-1,500 సంవత్సరాలు క్రితం నాటి సింధునాగరికత కాలం. 5,000 సంవత్సరాలు నుంచి 3,500 సంవత్సరాలు క్రితం.
26.) బుద్ధుడి జననం క్రీస్తు పూర్వం 576 సంవత్సరాలు క్రితం. 2,576 సంవత్సరాలు క్రితం.
27.) క్రీస్తు పూర్వం 327-326 భారత దేశంపైకి అలెగ్జాండర్ దండయాత్ర. అంటే 2,327 సంవత్సరాలు క్రితం.
28.) 273 - 232 అశోకుడి పాలన. అంటే 2,273 నుంచి 2,232 సంవత్సరాలు క్రితం.
బుద్ధుడు మరియు అశోకుని మధ్య గడిచిపోయిన కాలం 300 సంవత్సరాలు.
29.) క్రీస్తు పూర్వం 58-విక్రమ శకం ప్రారంభం. అంటే 2,058 సంవత్సరాలు క్రితం.
30.) క్రీస్తు శకం 380-విక్రమాధిత్యుడి పట్టాభిషేకం.
అంటే సుమారు 1,640 సంవత్సరాలు క్రితం.
31, ఈ ఎనిమిదిశివాలయాలు
వెయ్యి సంవత్సరాల కన్నా ఎక్కువ పురాతనమైనవి, ఇవి ఒకదానికొకటి 500నుండి
600కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి.అయితే,
వారి రేఖాంశ రేఖ ఒకటే.

పరమపవిత్రమైన మూడు స్థలాలలో మనం రెంటిని చూడగలం,ఒకటి ఎల్లోరా, రెండవది ఆంగ్కోర్ వాటి కానీ ఒక్కటి మాత్రం కష్టసాధ్యం. అదే మక్కా.

సరళమైన భాషలో చెప్పాలంటే అన్ని దేవాలయాలు సరళ రేఖలో వ్యవస్థాపించబడ్డాయి.
ప్రాచీన హిందూ ఋషులకు భౌగోళిక అక్షాన్ని కొలిచే మరియు ఈ ఏడు శివాలయాలన్నింటినీ సరళ రేఖలో నిర్మించిన సాంకేతికత ఉందా?
కొలత వ్యవస్థ లేకుండా ఈ దేవాలయాలను సరళ రేఖలో చేయడం సాధ్యం కానందున ఇది జరగవచ్చు,
ముఖ్యంగా అవి ఒకదానికొకటి వందల కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడు.

ఈ దేవాలయాలన్నీ భౌగోళికంగా
79 ° E, 41 ’, 54” రేఖాంశ రేఖలో ఉన్నాయి.
ఏ శివాలయాలు ఉన్నాయో తెలుసుకోండి ...
1)కేదార్‌నాథ్ ఆలయం - ఉత్తరాఖండ్ - (30.7352 ° N, 79.096)
2)కాలేశ్వరం -కాలేశ్వర ముక్తేశ్వర్ స్వామి ఆలయం - తెలంగాణ - (18.799 ° N, 79.90)
3)శ్రీ
కాళహస్తి - శ్రీ కాళహస్తేశ్వర ఆలయం - ఆంధ్రప్రదేశ్ - (13.789 ° N, 79.79)
4)కాంచీపురం - ఏకాంబరేశ్వర్ ఆలయం - తమిళనాడు - (12.94 ° N, 79.69)
5) తిరువనైకవల్ - జంబుకేశ్వర్ ఆలయం - తమిళనాడు - (10.853 ° N, 79.70)
6) తిరువన్నమలై - అన్నామలైయార్ ఆలయం తమిళనాడు - (12.231 ° ఎన్, 79.06)
7) చిదంబరం - తిల్లైనటరాజ్ ఆలయం - తమిళనాడు - (11.39 ° N, 79.69)
8)రామేశ్వరం - రామనాథస్వామి ఆలయం - తమిళనాడు - (9.2881 ° ఎన్, 79.317)
అన్ని పెద్ద దేవాలయాలు లేదా మఠాలు తమలో తాము ఒక రకమైన గ్రిడ్ పనిలో ఉన్నాయి.
చిత్రంలో ఉన్న ఆలయం కూడా ఒక ప్రత్యేక స్థానంలో ఉంది.

(హరిహరేశ్వర్ మహాత్మ్య అనే వేద పుస్తకం, దీనిలో హరి అంటే 'విష్ణు' మరియు "హరా" అంటే "శివ" అని అర్ధం, వాటి ప్రాముఖ్యత వివరించబడింది, అదే పుస్తకంలో మక్కా హిందూ చరిత్రను వివరిస్తుంది ...

అంటే, విష్ణువు యొక్క మూడు దశలలో ఒకటి "#గయా" నగరంలో, రెండవది #మక్కా(శివాలయం అని కూడా చెప్తారు) నగరంలో మరియు
మూడవది #శుక్ల
తీర్థ సమీపంలో ఉంది. ఆ మూడవ పోస్ట్ యొక్క స్థానాన్ని కనుగొనడం అవసరం. ఆ స్థలం యొక్క జ్ఞాపకశక్తి చరిత్ర యొక్క గందరగోళంలో నాశనం అవుతుంది.
క్రెడిట్: భారత్ దుబే జీ
భవాని పరశురామ్

32, #కైలాసపర్వతం
ఇది మానవ నిర్మితమని రష్యా శాస్త్రవేత్తల బృందం నమ్మకం.ఈ సంబంధం గురించి #హిందూ
గ్రంధాలు ఏమి చెబుతున్నాయి ??

రష్యన్ శాస్త్రవేత్తల పరిశోధనా బృందం #కైలాసపర్వతం
ఒక ఖచ్చితమైన కొలతపై నిర్మించిన విధానం,ల్ అని ఇది సహజ పర్వతం కాదు అని,
ఇది మానవ నిర్మిత పిరమిడ్ అని పేర్కొంది.
ఈజిప్ట్ యొక్క పిరమిడ్ 10,000 సంవత్సరాల వయస్సు మాత్రమే, కానీ కైలాస పర్వతం
#మిలియన్ల
సంవత్సరాలవయస్సు .....
ఇది ఎంత పురాతనమైనప్పటికీ,
సహజమైన లేదా యాదృచ్ఛికమైనప్పటికీ,
దీనిని మంచి ఇంజనీర్ నిర్మించారు అని చెప్పారు
రెఫ్ ఇచ్చాను చూడగలరు ....

దీనికి అనుకూలంగా, రష్యా శాస్త్రవేత్తలు కైలాస పర్వతం పై 4 అక్షరాలు రాశారని, మనుషులు లేకుండా ఎలా సాధ్యమవుతుందని పేర్కొన్నారు. నిజానికి --- మనము కూడా ఆ ఫోటోలను చూశాము, మరియు ఆశ్చర్యపోయాము,
కైలాస పర్వతం హిందూ చిహ్నంగా మిగిలిపోయింది ...
కైలాస పర్వతం ఎలా ఏర్పడిందో ఇప్పుడు పురాణాల నుండి మనకు తెలుసుకోండి.

మన పురాణాలలో, మేము ఈ విషయం యొక్క రహస్యాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించాము, అప్పుడు మాకు తెలిసింది,భూలోకం లోని కైలాస పర్వతం శివుడి ఆదేశానుసారం శివుడి కోసం స్వయంగా ఏర్పడిన ఊహకు అందని భారీ లోకం.
ఇది,దీని గొప్పతనం గురించి ఏమని చెప్పాలి? ఇంద్రుడి అమరావతి కూడా దాని ముందు గ్రామీణ ప్రాంతంగా అనిపించింది.
విశ్వకర్మ భగవంతుడు కైలాస పర్వతానికి వెళ్లి సకల నిర్మాణలు చేసి ఉండవచ్చు
విశ్వకర్ముడు నటించాడు,
కుబేరుడు సహకరించాడు.
దీని అర్థం స్పష్టంగా ఉంది, కైలాస పర్వతం #స్వచ్ఛమైన
బంగారంతో నిర్మించబడింది. #సూర్యకిరణాలుపడినవెంటనే కైలాస పర్వతం లోపల #బంగారం_ప్రకాశిస్తుంది.

శివుపురానికి స్పష్టమైన వర్ణన ఉంది,
శివునికి దేవతల గొప్ప ఇంజనీర్ కుబేరుడు,
ఈ సంఘటన 300 మిలియన్ సంవత్సరాల క్రితం జరిగి ఉంటుంది....
గురు
భవాని పరశురామ్
🙏🙏🙏🙏🌺🌺🌺

Source - Whatsapp Message

మంచి మాట....లు

చంద్రః%
దథిశంఖ తుషారాభం క్షీరార్ణవ సముద్భవం (క్షీరోదార్ణవ సంభవం) ।
నమామి శశినం సోమం శంభో-ర్మకుట భూషణం ॥

ఆత్మీయ బంధుమిత్రులకు ఇందు వాసరః (సోమవారపు) శుభోదయ శుభాకాంక్షలు 💐🤝
మీకు మీ కుటుంబసభ్యులకు అది దంపతులు పార్వతి పరమేశ్వరుల అనుగ్రహం తో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలతో నిండునూరేళ్ళు ఆనందంగా జీవించాలని కోరుకుంటూ..

సోమవారం :- 07:06:2021
ఈ రోజు AVB మంచి మాట....లు

ఏదైనా చేయాలంటే ముందే ఆలోచించుకోండి ఒకటికి పదిసార్లు కాని పని మొదలు పెట్టినతరవాత ఆలోచనలు పనికిరావు


ఈ ప్రపంచం చెడ్డవారి వల్ల చెడిపోలేదు చెడుని ప్రశ్నించకుండా చెతులుకట్టుకున్న మంచివారి వల్ల చెడిపోతుంది దైర్యంగా అడుగలేని భయస్తుల వల్ల మనకెందుకులే అనుకునే స్వార్థపరుల వల్ల చెడిపోతుంది...

మనం ప్రశ్నించకుండా మౌనంగా ఉన్నప్పుడే మంచివాళ్ళం ఎప్పుడైతే ఆ మౌనం భరించలేక ఎందుకు అని ఎదురు ప్రశ్నస్తామో అప్పుడే మనమెంత మంచి చేసినా అన్నీ మరిచిపోయి మనకు ఎక్కడా లేని చెడుతనాన్ని అంటగట్టి మనకే తెలియకుండా మనల్ని ప్రపంచానికి ఇంకోలా పరిచయం చేస్తారు . ఎంత విచిత్రమో ఈ మనషులు .

మనిషి సక్రమముగా బ్రతకడం మానేసిన దగ్గర్నుంచి అన్నీ అక్రమాలే . అక్రమ సంపాదనలు , అక్రమ కట్టడాలు , అక్రమ అధికారాలు , అక్రమ చావులు . అన్ని అక్రమాలే .

ఆశపడిన ప్రతీది మనకు దొరకపోవచ్చు అంత మాత్రాన మనం దూరదృష్టవంతులమని కాదు ! అంతకు మించిన అదృష్టం ఎదో మన కోసం ఎదురుచూస్తుందని మరచి పోకు నేస్తమా

కరోనా కు ప్రభుత్వ సూచనలు పాటిస్తూ ఇంట్లోనే ఉందాం క్షేమంగా ఉందాం తప్పనిసరి గా బయటకు వెళ్ళవలసి వస్తే మాస్క్ సక్రమముగా దరిస్తూ వ్యక్తిగత దూరం (సుమారు 6 అడుగులు ) పాటిస్తూ ఇంటికి క్షేమంగా చేరుదాం మిత్రమా 🤝
సేకరణ ✒️మీ ఆత్మీయ బంధువు AVB సుబ్బారావు 💐🤝

Source - Whatsapp Message

ఇది ఒక యదార్థ కథ. కొందరికైనా స్ఫూర్తి దాయకంగా ఉంటుందని పోస్ట్ చేస్తున్నాను.

ఇది ఒక యదార్థ కథ. కొందరికైనా స్ఫూర్తి దాయకంగా ఉంటుందని పోస్ట్ చేస్తున్నాను. చివరి వరకు చదవగలరు.🙏🙏

..కొన్ని నెలల క్రితం, కొత్తగా ఒక పనిమనిషి చేరింది, నాకు పనిమనిషి అన్న పదం పలకడం ఇష్టం ఉండదు, మీకందరికి అర్థం కావటానికి ఇలా రాశా, ఇక ఈ వ్యాసం లో ఈ పదాన్ని ఊయోగించను. ఈవిడ పేరు గౌసియా. మూడు నాలుగు రోజుల తరువాత, అడిగా అక్కా ఎక్కడ మీ ఇల్లు, ఎంత మంది పిల్లలు, ముగ్గురు అమ్మాయిలు అండి, పెళ్లిళ్లు అయ్యాయా, లేదండి ఇంకా చదువుకుంటున్నారు. OK, ఏం చదువుకుంటున్నారు అని క్యాజుల్ గా అడిగా, పెద్ద అమ్మాయి MSC ఆర్గానిక్ కెమిస్ట్రీ చేసి డిగ్రీ కాలేజ్ లో కాంట్రాక్ట్ లెక్చరర్ గా చేస్తోంది, ఆ అంటూ నోరు తెరిచా, రెండో అమ్మాయి MSC computers మొదటి సంవత్సరo, మూడో అమ్మాయి ఎంబీబీస్ రెండో సంవత్సరం. ఆ అని నోరు వెళ్ల బెట్టా. నర్సింగా అన్నా, కాదు అన్నా mbbs ఏ అంది. నాకు అర్థం కావటం లేదు, ఈవిడ ఏమంటోంది, ఏం మాట్లాడుతోంది. ఈవిడకు ఏం మాట్లాడుతోందో అర్థం అవుతోందా? మళ్ళీ అడిగా, అవే సమాధానాలు, MBBS ఫ్రీ seat ఆ అని అడిగా, అవును అన్నా, ఫ్రీ సీట్ యే, అదేదో బిల్డింగ్ ఫీజ్ అంటా, దానికే తంటాలు పడుతున్నా కట్టడానికి. ఎక్కడ చదువుకున్నారు అమ్మ మీ పిల్లలు అని అడిగా, స్కూల్ గురుంచి, ఇక్కడే మన వీధి బడిలోనే. 10 తరగతి వరకు. లాంగ్ టర్మ్ గట్రా వెళ్లిందా ఎంబీబీస్ అమ్మాయి అని అడిగా, ఏం లేదయ్యా, మాములు కాలేజ్ యే, నాకు ఈ చదువుల గోల ఏం తెలీదయ్యా, ఇప్పుడు ఇప్పుడే కాస్త నోరు తిరుగుతోంది. ఏం చదువుకున్నావు అమ్మా నువ్వు అని అడిగా, అయ్యో మీరు అడగద్దoడి, రెండు లో మానేశా. నాకు కూడికలు, తీసివేతలు కూడా రావు. చాలా కష్టాలు పడ్డాను పిల్లలను ఈ స్థాయికి తీసుకురావటానికి. మీ ఆయన అన్నా, ఆయన అందరి లాగే, ఇంటి విషయాలు ఏo పట్టదు. ఆయన త్రాగుడు, 100 రూపాయలు సంపాదిస్తే 10 రూపాయలు ఇంట్లో ఇవ్వడం కూడా గగనం. ఇప్పుడు ఇప్పుడు కొంచం మారుతున్నడు, పాప డాక్టర్ కోర్స్ చేరిన తరువాత. అప్పుడు స్పృహలోకి వచ్చాడు తన పిల్లలు ఎదో సాధిస్తున్నారు అని. మా పెద్ద అమ్మాయిని ఏడో తరగతి లో చదువు మానిపించేసా, కానీ వాళ్ల టీచర్ ఇంటికి వచ్చి, నన్ను మందలించి, మంచి తెలివి గల అమ్మాయి, చక్కగా చదువుకొంటోంది అని చెప్పి బడికి తీసుకొని వెళ్ళింది. అప్పటికి అర్థం అయ్యింది నాకు, నా పిల్లలు తెలివి గల వాళ్ళు అని, నా పిల్లల చదువులు ఆగ కూడదు అని ఇంకో రెండు ఇల్లులు ఎక్కువ ఒప్పుకోవటం మొదలు పెట్టా. ఇంట్లో సరిగ్గా కరెంట్ కూడా ఉండేది కాదు, మూడు మూడు నెలలు బిల్ కట్టలేక పోయే దాన్ని, పిల్లలు ఆలాగే బుడ్డి దీపాల్లో చదువుకున్నారు. ఇప్పుడు కాస్త పర్వాలేదు, పెద్ద అమ్మాయి కాస్త సంపాదిస్తోంది. ఎలాగో కిందా మీదా పడుతున్నాను అంది. నాకు నోట మాట రాలేదు. ఒక మహిళ, భర్త త్రాగుబోతు, ఇంతగా కష్టపడి పిల్లలనుఁ ఇంతగా వృద్ధిలోకి తెచ్చిందా. లక్షలు, లక్షలు పోస్తుంటే పిల్లలు చడవట్లేదు, నా పిల్లలు వీళ్ళలా సగం చదువుకున్నా చాలు అనుకున్నా.

అంతే నాకు అర్జంట్ గా వీళ్ళ ముగ్గురిని కలవాలి అనిపించింది. నాకు మీ ముగ్గురు అమ్మాయిలతో మాట్లాడాలి, నాకు పరిచయం చేపియ్యాలి అని అడిగా, అలా మా పిల్లలను చూసినట్లు ఉంటుంది అన్నా. నేను ఆడిగినట్లే ముగ్గురిని తీసుకొని సాయంత్రం వచ్చింది గౌసియా అక్కా. ముగ్గురు వాళ్ళ అమ్మతో పాటు నేల పై కూర్చున్నారు. నా మనస్సు చివుక్కుమంది. ఎంత గానో బ్రతిమాలుకుంటే గాని, కుర్చీల పై కూర్చో లేదు. గౌసియా అక్క నేల పైనే. నాకు అలవాటే అన్నా, నా పిల్లలు నాలా మిగిలి పోకూడదు అనే నా శ్రమ అంతా. మీలాంటి గొప్ప వాళ్ళ తో పాటు సరిసమానంగా కూర్చున్నారు చూడండి ఇది చాలు, అంది కళ్ళ నీళ్లతో. నేను కాదు, వీళ్లు కాదు, నువ్వు గొప్ప దానివి అక్కా అన్నా.

మొదటి పది నిమిషాలు ముగ్గరు ముడుచుకు కూర్చున్నారు, తరువాత కొంచం కొంచం మాట్లాడ్డం మొదలు పెట్టారు. తాము పడిన కష్టాలు, పడుతున్న కష్టాలు, ఎలా సీట్లు తెచ్చుకొంది, ఎంతో కొంత స్కాలర్షిప్ లు రావటం, అవి సహాయపడ్డం. నిజంగా ఇలాంటి వారే పథకాలకు అర్హులు. కానీ 80 శాతం అనర్హులు నోట్లోకి పోతున్నాయి.

వీళ్లకు ఏదన్నా సహాయం చేద్దాం అని గట్టిగా మనసులో అనుకున్నా. అడిగా, ఎంత అనుకువ గా ఉన్నారో, అంత ఆత్మవిశ్వాసం, ఆత్మాభిమానం మెండుగా ఉన్నాయి. ఏమి అడిగినా, ఆహా వద్దు అనే సమాధానం. నేను, నా అర్ధాంగి అడగంగా, అడగంగా, ఒక two వీలర్ తీపించండి, ముగ్గరo ఊయోగించుకుంటాం, మీకు నెల నెలా ఇస్తాం, మేము లోన్ లో తీసుకోలేము, అనవసరమైన వడ్డీ అన్నారు. Two వీలర్ ఉంటే, కాస్త సౌలభ్యoగా ఉంటుంది, సగం డబ్బులు ఆటో లకు అయిపోతున్నాయి, మా ఏరియా దగ్గర షేర్ ఆటోలు దొరకవు, దొరికే స్టాప్ వరకు నడచి అలిసిపోవటం, సమయం కూడా వ్యర్థo. Two వీలర్ ఉంటే అలిసిపోము, మిగిలిన సమయాన్ని చదువుకునేందుకు ఉపయోగించుకుంటాము అన్నారు.

Two వీలర్ తీపించా మొత్తం డబ్బులు కట్టి, ఒక తొమ్మిది నెలల్లో నాకు ఒక పైసా వదలకుండా మొత్తం తీర్చేశారు, ఒక పది వేలు ఉంచుకోండి అన్నా వినకుండా. పెద్ద అమ్మాయి ఇద్దరిని డ్రాప్ చేసిన తరువాత తన కాలేజ్ కు వెళ్లి పోతుంది. మళ్ళీ ఇద్దరని పికప్.

పెద్ద అమ్మాయి JL పోస్టలకు సన్నద్ధం అవుతోంది. రెండో అమ్మాయి software ఫీల్డ్ వైపు వెళ్ళాలి అని.

చెప్పటం మరిచా ఇప్పుడు పెద్ద అమ్మాయి మా పిల్లలకు హోమ్ ట్యూటర్. ప్రతి రోజు రెండు గంటలు. ఒక రెండు నెలల నుంచి ఉభయులము మాట్లాడుకొని, కొరొనా వలన కాస్త బ్రేక్ తీసుకున్నాం.

వీళ్ళ స్టోరీ ఈనాడు, ఆంధ్రజ్యోతిల్లో వేపించాలని విలేఖరులతో మాట్లాడా, ఉద్యోగం వచ్చిన తరువాత ఇస్తాం, అప్పటి వరకు వద్దని పెద్ద అమ్మాయి సున్నిత తిరస్కారం.

ఏదో సినిమాలో అమ్మకంటే పెద్ద యోధురాలు ఎవరు ఉండరు అంటాడు హీరో, మనకు తెలియని గౌసియా అక్క లాంటి యోధురాళ్లు ఎందరో.......

ఒకసారి గౌసియా అక్కతో అన్నా, ఇంకో రెండు సంవత్సరాలు కష్టం మీకు, తరువాత పిల్లలు చూసుకుంటారు మిమ్మల్ని అని, ఏం అన్నా నన్ను పనిలో నుంచి తీసేయ్యాలి అనుకుంటున్నారా, నా ఒంట్లో శక్తి ఉన్నంత వరకు నేను నా పని మానను.

గౌసియా అక్కను అడిగా, మీ ఆయన మీద కోపం లేదా అని, లేదు అన్నా, పిల్లలకు ఉంది, అయినా వీళ్ళు తమ చదువులు అయిపోయి, పెళ్లిళ్లు చేసుకొని వెళ్లి పోతే తను నేనే కదన్నా, కోపాలు, తాపాలు పెట్టుకుంటే అవుతుందా అని సమాధానం. చిన్న చిన్న వాటికి గొడవలు పడి విడి పోతున్న జంటలకు ఈమె పెద్ద సమాధానం.

ఒకసారి పెద్ద అమ్మాయి అంది, మా నాన్న తన స్నేహితుల ముందర మా గురుంచి గొప్పగా చెబుతుంటాడు, అక్కడే మొహం ముందరే చెబుతాం, ఇదంతా మా అమ్మ కష్టం అని, ఇంకో విషయం మా పిల్లలకు ముక్కు మీద కోపం.

women empowerment గురుంచి రాయమన్నారు, నాకు రాయటానికి దీని కంటే మంచి సబ్జెక్ట్ ఇంకొకటి కనబడలేదు.

...సేకరణ
✍️✍️✍️✍️

Source - Whatsapp Message

మంచి పదాలు, చెడు అర్థాలు

మంచి పదాలు, చెడు అర్థాలు-
--సంకా ఉషారాణి

ఆధునిక కాలంలో భగవంతునికి, పూజకు, ఆరాధనకూ ఆధ్యాత్మిక అంశాలకు చెందిన హిందూధార్మిక పదాలను తెచ్చి అతి నీచమైన అర్థాలలో ప్రయోగించే ఒక అధమమైన ప్రక్రియ మన లోకి ప్రవేశించింది. ఎంతో చదువుకున్నవారు, తమ ధర్మాన్ని ప్రేమించేవారు కూడా తమకు తెలియకుండానే ఆ పదాలను వాడేసే విధంగా జనబాహుళ్యంలోనికి సినిమాల ద్వారా, ఇతర మీడియా విధానాల ద్వారా, ప్రచారసాధనాల మాధ్యమంగా సామాన్యులకు చొప్పించటం జరిగింది. ఇట్ల పదప్రయోగం చేయటం మన ధర్మానికి అవమానకరమే కాక, భాషకు ఉన్న సాహిత్య, ఆధ్యాత్మిక, ధార్మిక విలువలను దిగజార్చే ప్రయత్నం కూడా అవుతుంది. ఆధ్యాత్మిక బలం కలిగించి, సంస్కృతికి దర్పణాలైన చక్కని భావాలను ఇట్ల నీచమైన, హేయమైన అర్థాలలో వాడటం అనేది ఒక పైశాచికత్వమే అనిపిస్తుంది.

చక్కని తెలుగు పదాలలో చేరిన ఈ భావ కాలుష్యం గుర్తించి, ఇప్పటికైనా తీసేసే ప్రయత్నం జరగాలి. కనీసం కొందరైనా ఆ పదాల వాడకం గురించి తెలుసుకుని, ఇతరులకు వివరణతో సహా అందించి, ఆ ప్రయోగాలను వాడటం తప్పు అని, వారి చేత కూడా మాన్పింప చేయవలసిన అవసరం ఉంది. నాకు అందిన కొన్ని ప్రయోగాలు- వాటి అసలు అర్థం, కావాలని చెడిపి, వక్రీకరించిన అర్థం ఇక్కడ ఇస్తున్నాను.

1. భాగవతం - భాగవతమంటే భగవంతునికి, ఆయన భక్తులకు చెందిన చక్కని కథలు, ఆధ్యాత్మిక అంశాలకు నెలవు. ఈ పదాన్ని ముఖ్యంగా ‘నేరం, జుగుప్స కలిగించే ఉదంతం, విషయం’ అని చెప్పటానికి వాడుతున్నారు. “..ఈ భాగవతం బయటకు వచ్చింది”. “ఎన్నాళ్ళుగా సాగోతంది ఈ భాగవతం..?” అంటూ అసహ్యకరమైన సన్నివేశాలకు ఈ మాటను ప్రయోగించటం వ్యాసభాగవతానికి అత్యంత అవమానకరం.

2. కుంభకోణం - ఇది తమిళనాడులో ఉన్న ఒక దివ్యతీర్థక్షేత్రం. దీన్ని (తెలుగులో వేరే పదమే లేనట్టుంది) ఘోటాలా, గఫ్¬లా (పెద్ద ఎత్తున మోసపూరిత కార్యం) అనే అర్థాలలో వాడుతున్నారు.

3. సోది - ఇది ఒక దివ్యదృష్టితో భవిష్యత్తు చెప్పే పారంపరిక ప్రక్రియ. దానికి సంబంధించిన నియమాలు, పద్ధతులు అనాదిగా ఉన్నాయి. ఈ పదాన్ని ‘అనవసరమైన మాటలు, అసంబద్ధ ప్రేలాపనలు’ అనే అర్థానికి వాడుతున్నారు. “ఊరికే సోది పెట్టకు” అంటూంటారు.

4. కైంకర్యం - భక్తిభావంతో తమ ఇష్టంతో భగవంతునికి సమర్పణం చేసే వస్తువు, సేవ ఈ పదానికి అసలు అర్థం. ఇది దేవాలయ పరంపరలోని పదం. దీన్ని ‘ఏదైనా తమకు చెందని వస్తువును, ఆస్తిని, లేదా ధనాన్ని తమ స్వంతం కోసం వాడుకునేందుకు అనైతికంగా తీసేసుకోవటం’ అనే అర్థానికి వాడుతున్నారు.

5. తీర్థం పుచ్చుకోవటం - ఇది గుడిలో దేవునికి సమర్పించి, భక్తులకు ఇచ్చే తులసినీరు, పాలు, కొబ్బరి నీరు, లేదా కర్పూరాదులు కలిపిన పానీయం. ఈ పదాన్ని ‘మద్యపానానికి, కల్లు తాగటానికి’ బదులుగా వాడుతున్నారు. ఎంత అసహ్యకరం!

6. ప్రేమాయణం - రామాయణం అనే మాటకు చెడుపు. సమస్య ఏంటంటే చాలామటుకు సామాన్యులకు ప్రేమకు, కామానికి తేడా తెలియదు. స్త్రీపురుషులు పరస్పరం ఏరకమైన ఆకర్షణకు లోనైనా దాన్ని ప్రేమ అనుకోవటం కద్దు. అటువంటి వాటిల్లో కొన్నిసార్లు హేయమైన సంబంధాలు ఏర్పడుతుంటాయి. వాటికి కూడా ఈ పదాన్ని వాడటం చాలా కష్టకరంగా ఉంటుంది.

7. ఎగనామం పెట్టటం, పంగనామం పెట్టటం - ఇది వైష్ణువుల ఆచారం చూపించే ఒక సంకేతం. నుదుట పెట్టే మూడు నిలువు గీతలు. వాటిని తిరునామాలు అంటారు. ఆ పదాన్ని ‘బడికి పోకుండా ఇంట్లో ఉండటం, తప్పించుకుపోవటం, చెప్పకుండా మానివేయటం, తీసుకున్న రుసుము చెల్లించకపోవటం’ వంటి అర్థాలలో వాడి అవమానిస్తున్నారు.

8. నైవేద్యాలు - భగవంతునికి భక్తితో సమంత్రంగా ఇచ్చి, తరువాత భక్తులు సేవించే ఆహారం ఈపదానికి అర్థం. దాన్ని సామాన్యంగా తినే అన్నానికి వాడటం తప్పు. “మా ఇంట్లో ఇంకా నైవేద్యాలు కాలేదు..” అంటే మేమెవ్వరం ఇంకా అన్నాలు తినలేదు, మా భోజనాలు కాలేదని అర్థం. చివరకు లంచాలు తీసుకోవటంలో కూడా ఈ పదం ప్రయోగం కనిపిస్తోంది.

9. ఊరేగటం - భగవంతునికి చేసే వాహన సేవ. సామాన్యులు చూడటానికి అనువుగా ఆయన విగ్రహాలను నగర సందర్శనం చేయించటమే ఊరేగింపు. ఈ పదాన్ని ‘ఏ పనీ లేకుండా గాలికి తిరగటం’ అనే అర్థానికి, ఏ ప్రయోజనం లేకుండా సమయం గడుపుతూ, ఇంటి బయట కాలక్షేపం చేయటం అనే అర్థానికి వాడుతున్నారు. “ఇంతసేపు ఎటు ఊరేగి వచ్చావు..?” అంటూ దెప్పి పొడవటానికి వాడుతున్నారు.
'ఊరేగించుట' అన్నది తెలియక జానపదులు అనేమాట. మనం భగవంతుడి విషయంలో ఆ పదం వాడకూడదు. అసలు పదం = 'ఊరు ఎఱిగించుట' కాలక్రమేణా ఊరేగించుట అయింది. ఊరిలో ప్రతి ఇంటి ముందుకు స్వామిని పల్లకీలో తీసుకవెళ్లి తెలియజేస్తారు(ఎఱుక చేస్తారు).

10. స్వాహా చేయటం - ఇది స్వాహా అనే పవిత్రమైన మంత్రం. స్వాహాదేవి అగ్నిదేవుని భార్య కూడా. ‘అగ్నయే స్వాహా,’ అని ‘ఇంద్రాయ స్వాహా’ అని హవిస్సును ఆయా దేవతలకు చెందింపచేసే వాక్కు. ఈ పదాన్ని ‘అవినీతిగా, తనకు చెందని ధనం తస్కరించటం’ అనే అర్థానికి బదులుగా వాడుతున్నారు. “భూములు స్వాహా చేశారు.. గనులు స్వాహా చేశారు..” వంటి అతి నీచమైన అర్థంలో వాడకం కనిపిస్తున్నది.

11. (బూతు)పురాణం - పురాణాలు వ్యాసుడు రచించిన అమూల్య జ్ఞానభాండాగారాలు. వాటిని ప్రజల ధార్మిక ఉద్బోధ కోసం వాడారు. కానీ ఇప్పుడు అతి నీచమైన వ్యవహారాలకు ‘బూతు’ అనే పదం కూడా చేర్చి పురాణశబ్దాన్ని వాడుతున్నారు. “ఎప్పటి నుంచి సాగుతున్నదీ బూతు పురాణం” అంటూ అసహ్యకరమైన సందర్భాలలో అనైతికమైన ప్రేమవ్యవహారాలలో దీన్ని వాడుతున్నారు.

12. పురాణకాలక్షేపమా, హరికథాకాలక్షేపమా, పురాణం విన్నట్టు - పురాణాలు, హరికథలు కూడా మహాపురుషుల కథలను, భాగవదంశాలను శ్రద్ధగా వినటానికి, ఆలోచించి ఆచరణలో పెట్టే మంచి విషయాలను సులువుగా ప్రజలకు అర్థమ్యే రీతిలో అందించే ప్రయత్నం. పురాణం కూడా ఏం ఊరికే విని వదిలేసేది కాదు. మహర్షుల ఆలోచనా విధానాన్ని పట్టుకుంటే జీవితంలో చాలా ఉత్తమమైన సాధనమార్గంలో సులువుగా ప్రవేశించవచ్చు. కానీ దాన్ని విద్యార్థి పాఠం వినకపోతే “ఇదేం పురాణకాలక్షేపమా విని మర్చిపోవటానికి..?” లేదా, “హరికథలాగ వింటే ఏమీ అర్థం కాదు..” అంటూ దెప్పిపొడవటానికి వాడుతున్నారు.

13. మహాభారత యుద్ధం - చిన్న చిన్న సందర్భాలలో ఏదైనా గొడవ జరగిన వెంటనే వారిద్దరి మధ్య మహాభారత యుద్ధం జరిగింది అంటారు. మహాభారతం ధర్మయుద్ధం. అందులో కృష్ణుడు ధర్మపక్షపాతియై సక్రమంగా నిర్వహించాడు. ఆ సంగతి మరచి అనవసరమైన చిన్నాచితకా గొడవలకు దాన్ని వాడటం తప్పు.

14. పతివ్రత - భర్తయే తన సర్వస్వంగా భావించి, ఆయన సేవే తన వ్రతంగా కలిగిన స్త్రీ. కానీ ఇప్పుడు ఈ పదాన్నే ఎంతో అసహ్యకరంగా సరిగ్గా విరుద్ధార్థంలో వాడుతున్నారు. భర్తను గణించక, వివాహేతర సంబంధాలు పెట్టుకునే స్త్రీ వరకు చాలా హేయమైన అర్థాలను ఈ పదానికి ఆపాదించారు.

15. విశ్వరూపం - ఇది భగవంతుని సమగ్రమైన తత్త్వాన్ని ప్రతిపాదించే రూపం. కానీ ప్రస్తుతం నిర్వస్త్రంగా ఉండటం అనే అర్థానికి ఈ పదాన్ని వాడుతున్నారు. విశ్వరూపసందర్శన యోగం అని భగవద్గీతను వినేవేళ అటువంటి అర్థాలు స్ఫురించటం వల్ల మనస్సుకు ధర్మగ్లాని కలిగి ఎంత విక్షేపమవుతుందో వివరించనవసరం లేదు.

16. చాదస్తం - ఛాందసం అనే మాటకు వికృతి. ఛందస్సు అంటే వేదం అని ఒక అర్థం. వైదికభావాలు కలిగి ఉండటాన్ని ఛాందసం అంటారు. కానీ ఇప్పుడు ఇదే పదం ‘పాతభావాలు పట్టుకుని వేలాడటం, ధర్మం, న్యాయం, నీతి నియమం అని మాట్లాడటా’నికి వాడుతున్నారు. పాతభావాలు అన్నీ వర్జ్యాలు కాదు. కొత్తది అంతా సరైనది అనీ కాదు.

17. గోవింద - గోవిందా గోవింద.. అని భక్తితో భక్తులు తమ వేంకటేశ్వరుని తలచుకుంటారు. కొండ ఎక్కుతూ స్మరణ చేస్తారు. గోవింద నామం అన్ని నామాలలో ప్రశస్తమైనదని భావిస్తారు. కానీ ఇప్పుడు అదే పదం ‘దొంగిలించిన వస్తువు’ కోసం ప్రయోగిస్తున్నారు. ఏదైనా వస్తువును మనం పోగొట్టుకుంటే, అది తిరిగిరాదని సూచిస్తూ, “ఇంకేముంది.. అంతా గోవిందా..” అంటారు. అంటే గోవిందునికి ఏదైనా అర్పిస్తే మంచిదంటారు. అట్లాంటిది దాన్ని ‘దొంగిలించిన వ్యక్తికి సమర్పించటం’ అనే అర్థంలో వాడటం ఎంతో హేయం.

18. తాండవం చేయటం - తాండవం అంటే శంకరుడి నృత్యం. ఆయన నృత్యప్రియుడు. సంధ్యావేళలలో నృత్యం చేసి అందరినీ ఆనందింపచేస్తాడు. ‘తలపు కదలికలే శివతాండవం’ అని ఆధ్యాత్మికసంకేతాలలో చెప్తారు. అటువంటి పవిత్రమైన తాండవ పదాన్ని ‘దేనికైనా రభస చేయటం’ గురించి, ‘కొట్లాట గొడవ చేయటం’ గురించి అంటున్నారు.

19. చిందు వేయటం - చిందు అంటే చక్కని లయప్రకారం భజనపాట పాడుతూ నృత్యం చేసే ప్రక్రియ. కోలాటం లాగ, తప్పెట్ల భజన లాగ అది కూడా ప్రసిద్దమైన ఒక దేశీ పద్ధతి. ఆ పదానికి ‘కోపంతో అరవటం, గొడవ చేయటం’ గురించి అర్థం చేర్చి వాడతున్నారు.

20. భజనచేయటం - భగవంతునికై పాటలు పాడటం అనేది అసలు అర్థం. వాయిద్యాలతో, చప్పట్లతో చిన్నచిన్న మాటలు, లేదా సరళమైన వాక్యాలతో కూడిన, సులువైన రాగాలతో కూర్చిన నామాల సంకీర్తనం భజన. దాన్ని ‘ఇతరులను అనవసరంగా పొగడటం, పని వ్యాజంగా ప్రశంసించటం’ అనే అర్థంలో వాడుతున్నారు.

ఇంకా కొన్ని-

21. భట్రాజు పొగడ్తలు -
22. శఠగోపం -
23. మాయదారి సంత -
--సంకా ఉషారాణి

Source - Whatsapp Message

Sunday, June 6, 2021

సాధనమున పనులు సమకూరు ధరలోన

ఒకసారి ఇంద్రుడు రైతులు పనిచేస్తున్న తీరుపై అసంతృప్తి చెందాడు. వెంటనే
"నేటి నుండి మరో పన్నెండు సంవత్సరాల వరకు వర్షం కురవదు, కాబట్టి మీరు వ్యవసాయం చేయలేరు" అని ప్రకటించాడు.

రైతులంతా కలిసి ఇంద్రుడిని వేడుకోగా, అప్పుడు ఇంద్రుడు "సరే... పరమ శివుడు ఎప్పుడు డమరుకం వాయిస్తే, అప్పుడు వర్షం కురుస్తుంది" అని వరమిచ్చినట్టే ఇచ్చి, వచ్చే పన్నెండు సంవత్సరాల పాటు డమరుకం వాయించ వద్దని రహస్యంగా శివునికి చెప్పాడు.

రైతులు పరమ శివుడి దగ్గరకు వెళ్లి ఎంత బతిమాలినా... పన్నెండు సంవత్సరాల తరువాత మాత్రమే డమరుకం వాయిస్తానని చెప్పాడు.

రైతులు ఏమి చేయాలో తెలియక, పన్నెండు సంవత్సరాలు గడవడం కోసం వేచి చూడసాగారు.

కానీ ఒక రైతు మాత్రం తోటి రైతులు వెక్కిరిస్తున్నా లెక్క చేయకుండా ప్రతి సంవత్సరం పొలం దుక్కి దున్నడం, విత్తడం, ఎరువులు వేయడం వంటి పనులు క్రమం తప్పకుండా చేస్తూనే వున్నాడు.

మూడు సంవత్సరాల తర్వాత, ఎప్పటి లాగానే ఆ రైతు పంట వేశాడు. మిగిలిన వారు అందరూ కలసి వెళ్లి "వర్షం పడదని తెలిసి కూడా ఎందుకు సమయం మరియూ శ్రమ వృధా చేస్తున్నావు" అని అడగ్గా...

దానికి ఆ రైతు "వర్షం లేకుంటే పంట పండదు అని నాకూ తెలుసు, కానీ తీరా పన్నెండు సంవత్సరాల తరువాత వర్షం కురిసినా అప్పటికి వ్యవసాయం పనులు మరిచి పోకుండా వుండేటందుకే ఈ పనులు చేస్తున్నాను" అని చెప్పాడు.

ఇదంతా విన్న పార్వతి ఆ రైతు వ్యక్తిత్వం గురించి శివునికి గొప్పగా చెప్పి... తమరు డమరుకం వాయించడం మరచి పోలేదు కదా, అన్నది చమత్కారంగా.
అంతట పరమ శివుడు ఇదిగో చూడు అంటూ అప్రయత్నంగా డమరుకం వాయించాడు.

తక్షణమే వర్షం కురిసింది. దీంతో ఆ రైతు పొలంలో పంట బాగా పండగా... మిగిలిన రైతులకు కడుపు మంటే మిగిలింది.

కాబట్టి విద్యార్థులారా......

ఈ లాక్ డౌన్ ఎత్తి వేయడానికి వారం పట్టొచ్చు, నెల పట్టొచ్చు.

మనం ఎలా ఉన్నా చదువుకి సంబంధించిన విషయాలలో (లాక్ డౌన్ తో సంబంధం లేకుండా) నైపుణ్యాన్నీ మరియూ జ్ఞానాన్నీ పెంచుకునేందుకు నిరంతర ప్రయత్నం చేయాలి.

ముగింపు : ఎదురు చూస్తూ సమయం వృథా చేయకుండా... రేపటి రోజున ఏమి చేయాలో దానికి సన్నద్ధం కావాలి.
అంతేగాని పరీక్షలు రద్దు అవుతాయని ఊహల పల్లకిలో విహరిస్తూ సమయం వృధా చేసుకుంటే మీ పరిస్థితి ఒకసారి ఊహించుకోండి



"సాధనమున పనులు సమకూరు ధరలోన"*

😊 😊 😊 😊 😊 😊 😊 😊

Source - Whatsapp Message

ఇచ్చుటలో ఉన్న హాయి

ఇచ్చుటలో ఉన్న హాయి రేడియోలో టెలిఫోన్ ద్వారా ఇంటర్వ్యూ జరుగుతోంది. అనౌన్సర్, కోటీశ్వరుడైన అతిధిని అడిగాడు- మిమ్మల్ని అత్యధికంగా సంతోష పెట్టినదేది?

ఆ కోటీశ్వరుడు ఇలా చెప్పాడు "నేను నా జీవితంలో నాలుగు దశల్లో సంతోషాన్ని చూశాను. చివరికి నిజమైన సంతోషం అంటే ఏమిటో అర్థం చేసుకోగలిగాను.

మొదటి దశలో సంపదను, విలాసవంతమైన వస్తువులను సమకూర్చుకోవడంలో ఆనందాన్ని పొందాను. కానీ అది నేను అనుకొన్న సంతోషం కాదు.

ఇక రెండో దశలో అత్యంత ఖరీదైన (విలాస)వస్తువులను సేకరించడం మొదలు పెట్టాను. అయితే వాటి వల్ల లభించే ఆనందం కూడా తాత్కాలికమైనదే!
అని తెలుసుకున్నాను" వ్యామోహాన్ని కలిగించిన ఆ విలువైన వస్తువుల ద్వారా లభించిన ఆనందం ఎంతోకాలం నిలవలేదు.
ఇక మూడో దశలో కూడా పెద్ద ప్రాజెక్టులు అంటే ఫుట్బాల్, క్రికెట్ టీమ్ లను కొనుగోలు చేయడం, విలాసవంతమైన పర్యాటక విశ్రాంతి క్షేత్రాలను కొనుగోలు చేయడం వంటివి అన్నమాట. అయితే ఇక్కడ కూడా నేను ఊహించిన ఆనందాన్ని ఎంతోకాలం పొందలేక పోయాను.

ఇక ఆ నాలుగో దశ ఏమిటంటే -నా స్నేహితుడొకరు, దివ్యాంగులైన పిల్లల కోసం కొన్ని చక్రాల బళ్ళు కొనివ్వమని అడిగాడు. స్నేహితుని కోరికను మన్నించి వాటిని కొన్నాను.
అయితే నా స్నేహితుడు తనతో వచ్చి వాటిని స్వయంగా ఆ పిల్లలకు నేనే అందజేయాలని పట్టుపట్టాడు. చివరికి ఒప్పుకుని అతడితో వెళ్లాను.
నా చేతుల మీదగా పంపిణీ కార్యక్రమం జరిగింది. ఆ పిల్లల మొహాల్లో, కళ్ళల్లో ఆనందపు మెరుపులు, వెలుగులు గమనించాను. ఆ పిల్లలు ఆ వీల్ చైర్స్ లో కూర్చుని అటు ఇటు సంతోషంగా తిరగడం చూశాను. వాళ్ళంతా ఏదో విహారయాత్రకు వెళ్ళినట్లు వినోదించడం చూశాను.

అయితే చివరికి వారి నుంచి వీడ్కోలు తీసుకుని, నేను వెళ్ళిపోతున్న సమయంలో నిజమైన సంతోషం ఏమిటో తెలిసి వచ్చింది.

ఒక పిల్లవాడు నా కాళ్ళను పెనవేసుకుని ఆపాడు. నేను సున్నితంగా విడిపించుకో చూశాను. అయితే ఆ పిల్లవాడు నా మొహంలోకి పరీక్షగా చూస్తూ, తన చేతి పట్టును మరింత బిగించాడు.
నేను కాస్త వంగి అనునయంగా ఆ పిల్ల వాడిని అడిగాను- నీకు ఇంకా ఏమైనా కావాలా? అని.

అప్పుడు ఆ పిల్లవాడు ఇచ్చిన సమాధానం నాకు నిజమైన ఆనందాన్ని కలిగించడమే కాదు, నా జీవితాన్నే మార్చేసింది. ఆ పిల్లవాడు ఏమన్నాడూ అంటే

"నేను మీ ముఖాన్ని బాగా గుర్తు పెట్టుకోవాలి అనుకుంటున్నాను. ఎందుకంటే స్వర్గంలో నేను మిమ్మల్ని మళ్లీ ఎప్పుడో కలుసుకున్నప్పుడు, మిమ్మల్ని గుర్తుపట్టాలిగా, మళ్లీ ఒకసారి అప్పుడు నా కృతజ్ఞతలు తెలియజేయాలని". ఆ మాటలకు భగవంతునికి ఎన్నెన్నో కృతజ్ఞతలు తెలుపుకున్నాను, జీవితపరమావధి అనుగ్రహించినందులకు.🙇‍♀️🙏

Source - Whatsapp Message

పంచుకుంటే నష్టపోయేది లేదు..!

🙏🙏🙏🙏🙏🙏🙏🙏
పంచుకుంటే నష్టపోయేది లేదు..!

అది హిమాలయాలకు దగ్గరలోని ఒక పల్లెటూరు. ఆ ఊరి చివర ఒక ఆశ్రమం ఉండేది. ఒక రోజు ఊరిలోని ఒక రైతు ఆ ఆశ్రమంలోకి ప్రవేశించాడు.

నేరుగా అక్కడ ఓ చెట్టు కింద ధ్యానం చేసుకుంటున్న సాధువు దగ్గరకి వెళ్లాడు. కళ్లు తెరిచి చూసిన సాధువుకి రైతు, రైతు చేతిలో యాపిల్ పళ్లు కనిపించాయి.

'స్వామీ నేను ఎప్పుడు ఈ ఆశ్రమంలోకి అడుగుపెట్టినా మీరు నన్ను ఆదరంగా చూసేవారు. నా సమస్యలని విని సానుకూలమైన పరిష్కరాలు చెప్పేవారు. పంటలు సరిగా పండక నాకు నష్టం వచ్చినప్పుడు నా ఆకలిని తీర్చేవారు. నేను నాటిన యాపిల్ చెట్లు ఈసారి విరగకాశాయి. మీరు నా పట్ల చూపించిన అభిమానానికి కృతజ్ఞతగా వాటి పళ్లను మీకు ఇవ్వాలనుకుంటున్నాను
కాదనకండి!' అంటూ సాధువు చేతిలో పళ్లని ఉంచి వెళ్లిపోయాడు.

రైతు తన పట్ల చూపిన కృతజ్ఞతకి సాధువు మురిసిపోయాడు. 'తన గురువుగారు చూపిన సన్మార్గంలో నడవడం వల్లనే కదా, ఇలాంటి జనానికి తన పట్ల గౌరవం ఏర్పడింది!' అనుకున్నాడు.

వెంటనే తన దగ్గర ఉన్న పళ్లను గురువుగారికి ఇవ్వాలని అనిపించింది.

గురువుగారి గదిలోకి ప్రవేశించి ఆయన పాదాల దగ్గర యాపిల్ పళ్లను ఉంచి జరిగిందంతా చెప్పాడు.

తన శిష్యుడు ప్రయోజకుడు కావడం చూసి గురువుగారికి ముచ్చట వేసింది. అంతకుమించి, అతనికి లభించిన బహుమతిని తన పాదాల దగ్గర ఉంచడం చూసి ఇంకా సంతోషం కలిగింది.

అంతలో గురువుగారికి ఆశ్రమంలోని ఇతర శిష్యులు కూడా గుర్తుకువచ్చారు.

వారిలో ఒక శిష్యుడు పాపం వారం రోజుల నుంచీ విపరీతమైన జ్వరంతో బాధపడుతున్నాడు.

వెంటనే ఆ శిష్యుని గదిలోకి ప్రవేశించారు గురువుగారు. గురువుగారి రాకతో శిష్యుడు పరమానందభరితుడయ్యాడు.

ఆయన పరామర్శనీ,
దాంతోపాటుగా అందించిన యాపిల్ పళ్లనీ చూసేసరికి అతని రోగం సగం తగ్గిపోయినంత ఓపిక వచ్చేసింది.

ఆ యాపిల్ పళ్లని చూస్తూ కూర్చున్న శిష్యుడికి రోజూ తన బాగోగులు చూసుకునే వంటవాడు గుర్తుకువచ్చాడు.

పాపం ఆ వంటవాడు తనకి ఏ ఆహారం సరిపడుతుంది..? ఎలాంటి పథ్యం చేయాలి..? అన్న విషయాలను చాలా శ్రద్ధగా గమనించేవాడు.

శ్రమ అనుకోకుండా తనకి రోజూ ప్రత్యేకంగా వంట చేసేవాడు. వెంటనే తన కృతజ్ఞతకి గుర్తుగా శిష్యుడు వంటగదిలోకి వెళ్లి వంటవాడి చేతిలో యాపిల్ పళ్లని ఉంచాడు.

యాపిల్ పళ్లని చూసిన వంటవాడికి నోట మాట రాలేదు. ఏదో ఆశ్రమంలో ఉంటూ నలుగురితో పాటుగా పొట్ట నింపుకుందామని అనుకున్నాడు కానీ, వారు తనని ఇంత గౌరవంగా చూసుకుంటారని అతడు అనుకోలేదు.

యాపిల్ పళ్లదేముంది! తాను ఎప్పుడూ తినేవే! కానీ ఈసారి చేతికి వచ్చిన పళ్లు చాలా అపురూపమైనవి. అవి తన పట్ల ఓ సాధువు చూపిన అభిమానానికి గుర్తు.

అందుకనే వాటిని తన ఇంటికి తీసుకువెళ్లి కొడుకు చేతిలో పెట్టాడు. రోగంతో బాధపడిన శిష్యుడికి తను చేసిన సేవ గురించి చెబుతూ...'నువ్వు కూడా నాలాగా ఇతరుకు సాయపడే గుణాన్ని అలవర్చుకోవాలి' అంటూ భుజం తట్టాడు.

'తండ్రి చెప్పింది నిజమే కదా!' అనిపించింది కొడుకుకి.

ఒకసారి తమ గతాన్నంతా కొడుకు నెమరువేసుకున్నాడు. ఏడాది క్రితం తమ కుటుంబం కటిక దరిద్రంలో ఉండేది. వంటవాడి ఇంట్లో వండుకునేందుకు గింజలే లేవయ్యే!

అలాంటి పరిస్థితుల్లో తమ ఇంటికి వచ్చిన ఓ సాధువు తన తండ్రిని తీసుకువెళ్లి వాళ్ల ఆశ్రమంలో చేర్పించాడు.

'ఈ రోజున తను వేళకి ఇంత తినగలుగుతున్నాడంటే ఆ ఆశ్రమం చలవే!' అనుకున్నాడు కొడుకు.

వెంటనే ఆశ్రమం వైపు బయల్దేరాడు. అక్కడ పదులకొద్దీ సాధువులు తిరుగుతున్నారు. కానీ ఆ రోజు తన తండ్రికి సాయం చేసిన వ్యక్తిని మాత్రం స్పష్టంగా గుర్తుపట్టాడు కొడుకు.

పరుగెత్తుకుంటూ వెళ్లి పళ్లని అతని చేతిలో పెట్టాడు. ఆ సాధువు ఎవరో కాదు....

పళ్లని గురువుగారి పాదాల చెంత ఉంచినవాడే!

సంతోషాన్ని ఒకరితో పంచుకోవాలనుకుంటే, అది తిరిగి ఎలా తన దగ్గరకే వస్తుందో సాధువుకి అర్థమైపోయింది.

*

(ఆత్మీయులారా! పంచుకునే గుణం ఉంటే ప్రతి ఒక్కరి మనసూ ఎంతో
తృప్తి చెందుతుంది కదా!!.)

మనం చేసే ఉపకారము, మంచి పని, మరలా ఏదో ఒక విధంగా రెట్టింపుగా మనకే తిరిగి వస్తుంది.
సర్యేజన సుఖీనోభవంతు

Source - Whatsapp Message

Walking Experiment on Diabetes ఫలితాలు

Diabetics - తప్పని సరిగా ఇది చదవండి . మీకు చాలా ఉపయోగం .
మీకు Diabetes లేక పోతే, మీకు తెలిసి అది ఉన్న వారికి పంపండి . వారికి ఉపయోగం ! 😊

ఇంగ్లాండు లో ఒక పరిశోధన నిర్వహించారు .
Walking Experiment on Diabetes ఫలితాలు :

రోజుకు ఒక అర గంట, లేక 45 నిముషాలు వాకింగ్ ( పొద్దున్న కానీ , సాయంత్రం కానీ , వారి వారి వీలును బట్టి ) ఏకబిగిన నడిచే వారికంటే, పొద్దున్న ఒక 5 నుంచి 10 నిముషాలూ, మధ్యాన్నం లంచ్ తరువాత 10 నిముషాలూ, రాత్రి డిన్నర్ తరువాత ఒక 10 నిముషాలూ , అలా మొత్తం రోజులో మొత్తం మీద అరగంట వాకింగ్ చేయడం వల్ల రక్తం లో సుగర్ నిల్వలు బాగా తగ్గుతాయి అని తేలింది !

అలా తిన్న 5 నిముషాల లోపు లేచి , 5-10 నిముషాలు వాకింగ్ చేసిన వారి రక్తం లో Sugar నిలవలు 11% నుంచి 44% శాతం వరకు తగ్గినట్లు వారు నిర్వహించిన Blood Test లలో తేలింది !

కాబట్టి, Diabetics వరకు , ఎంత సేపు వాకింగ్ చేశారు , ఎంత దూరం నడిచారు ? అనే దానికంటే , టైమింగ్ , అనగా ఎప్పుడు నడిచారు ? అనే దానికి ప్రాధాన్యత ఉన్నట్లు తేలింది !

ఈ పరిశోధన , ఇంగ్లాండ్ లో 23 దఫాలు గా నిర్వహించారు . ఇందులో పెద్ద సంఖ్య లో, అనగా 12 లక్షల మంది డయాబెటిస్ ఉన్నవారు వాలంటీర్స్ గా సహకరించారు . ఈ పరిశోధన 40 రోజుల పాటు సాగింది .
వారు వాడే Medicines Dosage లలో ఏమీ మార్పు లేదు .

ఇందులో సగం మంది ని, రోజు కు ఏకబిగిన 45 నిముషాలు నడవ మన్నారు . మిగతా సగం మందిని 3 పూటలా , తిన్న వెంటనే ( తిన్న 5 నిముషాల లోపే , లేచి ) 10 నిముషాలు నడవమన్నారు .
40 రోజుల తరువాత 2 గ్రూపు లకీ Blood Test లు చేశారు

దానిలో ఈ సత్ఫలితాలు వెల్లడి అయ్యాయి . ముఖ్యం గా, రాత్రి Dinner తరువాత 10 నిముషాలు నడిచిన వారి లో Sugar శాతం 22% తగ్గిందని వెల్లడి అయింది .

Sugar ఉన్నవారు , స్త్రీలైనా , పురుషులైనా , మొత్తం మీద వారానికి 150 నిముషాలు యావరేజి న వాకింగ్ చెయ్య వలసిందే అని ఏకగ్రీవం గా వెల్లడి అయింది .
Action point :
తిన్న వెంటనే TV చూస్తూ కూర్చోకండి. లేచి , మీ ఇంటి గదుల్లో నే అయినా సరే , గడియారం చూసుకుని 10 నిముషాలు నడవండి . 3 పూటలా చేయండి. 40 రోజుల తరువాత blood test చేయించుకోండి.
Original Article Link ను ఇక్కడ ఇస్తున్నాము .


https://www.webmd.com/diabetes/news/20161018/have-type-2-diabetes-try-walking-after-eating.

నాకే ఇన్ని కష్టాలా?

నాకే ఇన్ని కష్టాలా

ఒకరోజు ఒక అమ్మాయి తండ్రి దగ్గరకి వచ్చింది,
" నాన్నా..! నేను ఈ కష్టాలు పడలేను. నాకు జీవితం అంటేనే విసుగేస్తోంది.
నాకే ఇన్ని కష్టాలు రావాలా..? " అంటూ తన బాధలను చెప్పుకుంటూ
వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టింది.

తండ్రి మౌనంగా విన్నాడు. ఏమీ మాట్లాడలేదు.
చిన్నగా నవ్వుకుంటూ వంటింట్లోకి నడిచాడు.

గ్యాస్ పొయ్యి మీదున్న - మూడు బర్నర్ల మీద మూడు గిన్నెలు పెట్టాడు.
వాటిల్లో నీళ్ళు పోసి ఒకదానిలో బంగాళా దుంపలు ( ఆలుగడ్డలు),
మరొకదానిలో కోడిగుడ్లు, ఇంకో గిన్నెలో కాఫీగింజలు వేశాడు.

తండ్రి తనతో అలా నిర్లక్ష్యముగా ఉండి,
ఏమీ మాట్లాడకుండా చేస్తున్న పని మీద కోపం వస్తున్నా -
అలాగే చూడసాగింది ఆ అమ్మాయి.

అలా 20 నిముషాలు మరిగించాక - స్టవ్ ని కట్టేసి, ఆ గిన్నెలను దింపి,
వాటిని కూతురు ముందు పెట్టి ఏమి జరిగిందో పరిశీలింఛి చెప్పమన్నాడు.

నాన్న ' అలా ఎందుకు చేసాడా పని..' అని అయోమయముగా ఉన్న ఆ కూతురు వాటిని పరిశీలించాక అంది,

" ఏముందీ..! దుంపలు మెత్తబడ్డాయి. కోడిగుడ్డు గట్టిపడింది.
కాఫీ డికాషన్ వచ్చింది........
అయినా ఇదంతా నన్ను ఎందుకు అడుగుతున్నావు నాన్నా?.. " అంది.

అప్పుడు ఆ తండ్రి చిన్నగా నవ్వి,

" ఆ మూడింటికీ ఒకే రకమైన ప్రతికూలత ఎదురయ్యింది. అంటే ఒకేలా ఒకే రకమైన గిన్నెల్లో, అదే గ్యాస్ వేడినీ, వేడి నీటినీ చవిచూశాయి.

కానీ, ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా స్పందించాయి అని గమనించావా?
మామూలుగా గట్టిగా ఉండే దుంపలు ఇప్పుడు మెత్తబడ్డాయి.
చితికిపోయే గుడ్డు గట్టిపడింది.
గట్టిగా ఉండే కాఫీ గింజలు మెత్తపడి, వాటిలోని రసాన్ని ఊరించి,
నీటిరంగునే మార్చింది.. అవునా..!!

ఇప్పుడు చెప్పు..

వీటిల్లో - నీవు ఎలా ఉండాలి అనుకుంటున్నావు?

మెత్తబడిపోతావా..? ( ఇప్పుడు నీవున్న స్థితి అదే.. )

గట్టిపడిపోతావా..?

పరిస్థితులను మారుస్తావా...?

ఇక్కడ నీదే ఎంపిక,
దానిమీదే ఇందాక నీవడిగిన ప్రశ్నకి సమాధానం ఉంది.." అన్నాడు.

ఆ అమ్మాయి మొఖంలో ఏదో తెలీని వెలుగు. కన్నీళ్లు ఆగిపోయాయి. బాధలేదు.

దాని బదులుగా ఆ కళ్ళల్లో అంతులేని ఆత్మవిశ్వాసం కనిపించింది..

" నాన్నా! యూ ఆర్ మై రియల్ హీరో.. అంటూ కృతజ్ఞతాభావంతో అంది.

హ్యాపీ సండే. మానస సరోవరం 👏

Source - Whatsapp Message

ఆలోచనలు రాకుండా చేసుకోవటం సాధ్యమవుతుందా ?

🌸"ఆలోచనలు రాకుండా చేసుకోవటం సాధ్యమవుతుందా ?"🌸

_అస్సలు సాధ్యం కాదు. ఆలోచనలను పరిశుద్ధం చేసుకోవాలి కానీ అవి రాకుండా చేస్తానంటే కుదిరేది కాదు.

ఎందుకంటే మన జీవనం అంతా ఆలోచనలతోనే ముడిపడివుంది.

మనకి మల్లెపూల వాసన వచ్చిందంటే అప్పటికే అక్కడి గాలి మల్లెపులతో మమేకత చెందిందని అర్ధం.

అంటే గాలే మల్లెపూల వాసనగా మారింది. ఆ గాలిని, వాసనను ఎలా విడదీస్తాం ?

కాకపోతే ఆ మల్లెల వాసన గాలి సహజగుణం కాదని తెలుసుకోగలుగుతాం.

అలాగే శరీరంతో మమేకత చెంది దేహ అవసరాలన్నీ తానుగా వ్యక్తంచేసే మనసుని దేహం నుండి వేరుచేయలేం.
మనసు దేహంగా మారింది.

కాబట్టే ఆకలి వేస్తుందన్న విషయం గుర్తించగలుగుతుంది.

జ్ఞాని అయినా ఆకలిని మనసుతో గ్రహించాల్సిందే. కాకపోతే ఆ అవసరం మనసుది (తనది) కాదని, దేహానికి చెందిందని తెలుసుకొని జీవిస్తాడు.

భగవంతుని సృష్టిలోనే దేహంతోపాటు ఆలోచన కూడా ఒక భాగంగా ఉంది. దాన్ని వదిలించుకుందామని అనుకుంటే ఇక జీవనం ఉండదు.

ప్రజ్ఞగా ఉన్న మనసు ఆలోచించకుండా ఎలా ఉంటుంది ? మనం జన్మించినదే కర్మ పూర్తిచేసుకోవటం కోసం.

అందుకే ఆలోచన లేకుండా సాధ్యం కాదు !

మానస సరోవరం 👏

Source - Whatsapp Message

నేటి ఆణి ముత్యాలు.

నేటి ఆణి ముత్యాలు.

🍃🌹మనం చేసే ప్రతి పని , చెప్పే ప్రతి మాట ప్రతి ఒక్కరికీ నచ్చాలన్న నియమం ఎప్పుడూ పెట్టుకో వద్దు.అది మనలో దుఃఖాన్ని కలిగిస్తుంది.

🍃🌹మన శక్తిని బాధపడటానికి కాకుండా విశ్వసించడానికి, ఎదగడానికి, ఇతరుల బాధ నివారించడానికి, వినియోగిస్తే సత్ఫలితాలను పొందగలుగుతాము.

🍃🌹ఎక్కడ అయితే అవసరానికి కాకుండా.....
ఆత్మీయతకు మాత్రమే చోటు ఉంటుందో.....
ఎక్కడ అయితే చేసిన తప్పుకు క్షమాపణ అడిగితే మన్నించే వీలు ఉంటుందో..
ఎక్కడ అయితే మాట పట్టింపులకు ప్రాధాన్యత ఉండదో..
అక్కడ బంధాలు బలంగా ఉంటాయి..
అక్కడ మనుషులతో పాటు మనసులు కూడా మాట్లాడతాయి..!!


🍃🌹నిప్పుకి, సుత్తికి, భయపడితే
ఇనుము ఎప్పటికీ కత్తి కాదు!

"జీవితంలో కూడా అంతే....
నిప్పులా నిన్ను కాల్చుతూ...
సుత్తిలా నిన్ను

గాయపరుస్తారు కొందరు!

అయిన....
వాటిని అధిగమించగలిగితే,

ఎలాంటి పరిస్థితులు ఐయిన
జయించి విజయం సాధించ వచ్చు

🌅శుభోదయం చెప్తూ
మానస సరోవరం.

Source - Whatsapp Message

ఆలోచనే ఆయుధం

🌸ఆలోచనే ఆయుధం🌸

మనిషి ఆలోచనా జీవి. ఎప్పుడూ ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటాడు. ఆ ఆలోచనలు నిద్రలోనూ
వదిలిపెట్టవు. రోజూ మనకు అరవైవేల ఆలోచనలు వస్తుంటాయి. అందులో తొంభైశాతం
నెగెటివ్‌ ఆలోచనలే. చాలా సందర్భాల్లో, ఒకే ఆలోచన పదేపదే బుర్రను తొలిచేస్తూ
ఉంటుంది. ఒక్కటీ పనికొచ్చేది ఉండదు. మన మనసుకు ఓ పరిమితి ఉంది. ఒకసారి ఒక
విషయాన్ని మాత్రమే ఆలోచిస్తుంది. ఆ ఒక్క ఆలోచనా గాలివాటంగా వచ్చేదే
ఎందుక్కావాలి? మనం ఎంచుకున్నదే కావచ్చుగా! మనం ఏం ఆలోచించాలన్నది మనమే
నిర్ణయించుకోవచ్చుగా. అదేం అసాధ్యం కాదు. సాధనతో సమకూరుతుంది. ప్రాణాయామంలో,
ధ్యానంలో జరిగేది అదే.

నోబెల్‌ సాధించాలి, శాస్త్రవేత్తగా పేరుతెచ్చుకోవాలి, ...ఇలా ఓ పట్టాన
నిద్రపోనివ్వని పాజిటివ్‌ ఆలోచనలకు స్పష్టమైన రూపం వస్తే, అదే లక్ష్యం. ఈ
దశలోనే 'ఎలా' అన్న ప్రశ్న తలెత్తేది. ఎదగాలనుకుంటాం. ఎలా ఎదగాలో తెలియదు.
సాధించాలనుకుంటాం. ఎలా సాధించాలో తేల్చుకోలేం. ఈ సమయంలో ఎటెళ్ళాలో తెలిపే
దిక్సూచి కావాలి. ఏ దారి మనల్ని గమ్యానికి చేరుస్తుందో తెలిపే రోడ్‌మ్యాప్‌
కావాలి. ఎంత సమయంలో ఎంతదూరం వెళ్ళలగలవో లెక్కగట్టడానికి కత్తిలాంటి
కాలిక్యులేటర్‌ కావాలి. ప్రతినిమిషం, ప్రతిగంటా గంటకొట్టి వెన్నుతట్టడానికి
గడియారం కావాలి. రోజులు గడిచిపోతున్నాయని చెవి మెలేసి మరీ గుర్తుచేయడానికి
క్యాలెండరు కావాలి. పరిపూర్ణమైన ప్రణాళికలో ఈ సాధన సంపత్తి అంతా ఉంటుంది.

సేకరణ. మానస సరోవరం 👏

Source - Whatsapp Message

Saturday, June 5, 2021

మంచి మాట.. లు

శనిః
నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం |
ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం ||

రాహుః
అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్ధనం |
సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం ||

కేతుః
ఫలాశ పుష్ప సంకాశం తారకాగ్రహమస్తకం |
రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం ||

ఆత్మీయ బంధుమిత్రులకు స్థిర వాసరః (శనివారపు) శుభోదయ శుభాకాంక్షలు 💐
శ్రీ లక్ష్మి పద్మావతి సమేత కలియువాసుడు ఏడుకొండల వేంకటేశ్వరస్వామి వారు , వల్లి దేవసేన సమేత సుబ్రమణ్యస్వామి వారు మరియు మా ఇంటి దైవం శ్రీ గుంటి ఆంజనేయస్వామి వార్ల అనుగ్రహంతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు ఆనందంగా జీవించాలని కోరుకుంటూ.. అందరు బాగుండాలి.. అందులో మనం ఉండాలి సర్వేజనా సుఖినోభవంతు

శని వారం :-05.06.2021
ఈ రోజు
AVB మంచి మాట.. లు

మన
అనుకుంటే పరాయి వారు కూడా మనవారే నీకు నువ్వు గిరి గిసుకుంటే నువ్వు ఒక్కడివే మిగులుతావు అయినవారు కూడా పరాయివారువుతారు


జీవితం ఎవరికి
శాశ్వతం కాదు మనం సంపాదించిన ఆస్తులు మనకు శాశ్వతం కాదు శాశ్వతంగా నిలిచేది ఒక్కటే అదే మన మంచితనం .

ఆత్మ విశ్శాసం దెబ్బతింటే సామర్థ్మం పని చెయ్యదు అందుకే ఎప్పుడూ ఆత్మ విశ్శాసాన్ని కోల్పోకండి ! ఎ బంధాం లో అయితే క్షమించే గుణం ప్రేమించే మనసు ఉంటుందో ఆ బంధం ఎప్పటికి విడిపోదు

ఎవరైనా సరే నువ్వు
వాళ్ళతో ఉన్నంతకాలమే నిన్ను పట్టించుకుటారు ప్రేమాభిమానాలు పొంగించేస్తారు ఒక్కసారి వాళ్ళకి దూరంగా ఉండి చూడు నిన్ను మర్చిపోతారు అసలు నువ్వు ఉన్నావో పోయవో అనే ఆలోచన కూడా వాళ్ళకి రాదు .

మనకు
కోపంతో వచ్చిన మాటలు పట్టుకుంటే మనసు విరిగీపోతుంది . అదే కోవం వెనకున్న బాధను తెలుసుకుంటే బంధం నిలబడుతుంది . అలా ఉండగలగడానికి మనకు కావలసిన ఆయుధాలు చిరునవ్వు మౌనం చిరునవ్వు మౌనం రెండు గొప్ప ఆయుధాలు చిరునవ్వుతో చాల సమస్యలు పరిష్కరించుకోవచ్చు మౌనం తో చాల సమస్యలు రాకుండా చూసుకో వచ్చు .

సేకరణ ✒️
మీ ఆత్మీయ బంధువు AVB సుబ్బారావు 💐🤝

Source - Whatsapp Message

మంచి మాటలు.....

అబద్దం అప్పు వంటిది,

అవసరానికి ఒక్కసారి అబద్ధం ఆడితే

ఇంకా దానికి వడ్డీ కట్టినట్లు మరీ కొన్ని అబద్ధాలు చెప్పక తప్పదు.......


నిజం నిప్పు వంటిది,

అది చెప్పే వాడి నాలుకకు చేదుగా,

వినేవాడి చెవులకు మంటగా ఉన్న కూడా మంచే చేస్తుంది......


తప్పు మన మీద ఉంటే మనల్ని మించిన లాయర్ ఉండడు......

తప్పు ఇతరులపై ఉంటే మనల్ని మించిన జడ్జి వుండడు....


తప్పు చెయ్యడానికి ఎవ్వరు భయ పడడం లేదు.....

చేసిన తప్పు బయట పడకుండా ఉండడానికి మాత్రమే భయపడుతున్నారు.......


గెలవటం గొప్ప కాదు..

ఓడిపోవడం తప్పు కాదు..

మళ్లీ ప్రయత్నించకపోవడం అతి పెద్ద తప్పు....


గెలిచి చూపించు నీ కోసం కాదు...

నిన్ను అవమాన పరిచిన వారి కోసము కాదు....

నిన్ను నమ్ముకున్న వారి కోసం....

మహావృక్షం కూడా మౌనంగానే ఎదుగుతుంది......

అలాగే

మహానుభావులుగా మిగలాలంటే మాటలకంటే చేతలకు ఎక్కువ ప్రాముఖ్యతనివ్వాలి...


" పుట్టడం, పెరగడం, కోరినది లభించక పోవడం, మరణించడం అన్ని బాధలే......

ఇవి లేకుంటే జీవితం లేదు.. "

" మనకి సహాయం చేసినవాడిని,

అవమానించిన వాడిని ఎప్పుడు మరవకూడదు

ఎందుకంటే వారిద్దరూ మన అభివృద్ధికి సోపానాలే...... "


జీవితంలో విలువలు ముఖ్యం

ప్రేమ, సత్యం, ధర్మం, శాంతి, అహింస ముఖ్యమైన విలువలు

ఒకరు గొప్పవారు అవ్వచ్చు. కాలేక పోవచ్చు.

అనుకున్నంతగా పేరు ప్రఖ్యాతులు, అధికారం, ధనం పొందవచ్చు.

పొందలేకపోవచ్చు.

కానీ,

మంచివారు అవ్వటానికి మాత్రం తప్పకుండా కృషి చేయాలి..

నిజాయితీతో, నిబద్ధతతో ప్రయత్నించాలి.

పది మందికి ఉపయోగపడే పనులు, పరమాత్మ మెచ్చే పనులని గమనించాలి.

హృదయాన్ని స్వచ్ఛంగా ఉంచుకోవటానికి ప్రయత్నించాలి.

ఆలోచనల్లో స్పష్టత కలిగి ఉండాలి.

మాటల్లో ఆత్మీయత, సూటి దనం, పొందికను సాధించాలి..

మన చేతలు ఇతరులపైనే కాకుండా మన ఆలోచనలపై కూడా ప్రభావాన్ని కలిగి ఉంటాయి.

విలువల గురించిన ధ్యాస మన శ్వాస కావాలి.

జీవితం ఆనందమయం కావాలి.

అందరి ఆనందానికి, అందరూ కృషి చేసి

చక్కని వాతావరణాన్ని సృష్టించటంలో మన పాత్ర మనం మనస్ఫూర్తిగాపోషించాలి.


పానకంలో మునిగినా గరిటకు తీపి తెలియనట్లే

జ్ఞానుల మధ్య ఉన్నా మూర్ఖుడు ఏమీ నేర్చుకోడు.

శుభోదయం

Source - Whatsapp Message

Stockdale Paradox అనేపదం ఎప్పుడైనా విన్నారా?

Stockdale Paradox అనేపదం ఎప్పుడైనా విన్నారా?

James Stockdale అనే అమెరికన్ సైనికుడు – వియత్నాం యుద్ధం లో యుద్ధఖైదీగా మరి కొందరు తోటి అమెరికన్ సైనికులతో సహా దొరికిపోయాడు..

వీరిని జైలులో పెట్టడం జరిగింది... ఇతనితోపాటు ఆ జైలులో ఉన్న సైనికులు, తాము క్రిస్టమస్ కు బయటకొచ్చేస్తామని ఆశించారు. కాని కుదరలేదు.

మళ్ళీ న్యూఇయర్ కు వదిలేస్తారను కున్నారు. వదల్లేదు.

ఈస్టర్ కు వదులుతారనుకుంటే, అప్పుడూవదల్లేదు.

ఇలా ప్రతీ సంవత్సరం వదిలేస్తారనుకుంటే వదలడం లేదు.

ఇలా ప్రతీ సంవత్సరం పెట్టుకున్న HOPE నెరవేరకపోవడంతో రెండు మూడేళ్ళల్లో ఒక్కొక్కరు చచ్చిపోవడం జరిగింది.

ఇలా తోటివారందరూ చనిపోతున్నా , Stockdale మాత్రం బ్రతికే వున్నాడు....!

కారణం....?

Extreme or too much hope చాలా ప్రమాదకరం.

మనం అనుకున్నది జరగకపోతే Disappoint అవుతాం.

అలాకాకుండా Stockdale లాగా Final గా శుభమే ఉంటుందని నమ్మడం కొన్నిసార్లు మంచే చేస్తుంది.

Stockdale మాత్రం ప్రతీ సంవత్సరం, ప్రతీసారి తాను బయటకు వచ్చేస్తానని మాత్రం ఆశించలేదు. ఎప్పటికైనా తాను విడుదల అవుతానని మాత్రం అనుకున్నాడు. ఖచ్చితంగా తాను బయటకువెళ్ళి తనవాళ్ళను తప్పకుండా కలవగలననే నమ్మకం పెట్టుకున్నాడు.

అంతేగాని... మిగిలినవాళ్ళలాగా point of time గురించి గానీ, period of time గురించి గాని ఆలోచించలేదూ. మిగిలిన వారిలాగా Extreme Hope పెట్టుకోలేదు.
కాని తనకథకు మాత్రం Happy Ending ఉంటుందని మాత్రం నమ్మకం పెట్టుకున్నాడు.

ఆఖరికి ఏడున్నర సంవత్సరాల తరువాత అతను జైలునుండి రిలీజయ్యాడు. కాని తన తోటివారు మాత్రం అప్పటికే చనిపోయారు.

ఇలా ఇతను బ్రతకడానికి తోడ్పడిన ఈ ఆలోచనా విధానాన్నే Stockdale Paradox అంటారు.

ఇప్పుడు ఈ thought process కరోనా విషయంలోనూ అవసరమే.

ఇప్పుడు తగ్గుతుంది, అప్పుడు తగ్గుతుందనే short term Extreme Hopes పెట్టుకునేకన్నా. ఖచ్చితంగా మనం ఈ pandemicను దాటుకుని గతంలో లాగానే చక్కగా, సంతోషంగా తిరగగలుగుతామనే నమ్మకాన్ని ఉంచుకుని , ప్రస్తుత పరిస్థితిని అర్థం చేసుకుని, ఓపికగా ఎదురు చూడండి.

కరోనాకే బోర్ కొట్టి - అది మనల్ని వదలి వెళ్ళే రోజు ఎంతో దూరం ఉండబోదని నా ఉద్ధేశం.
Happy Ending కు ఎదురుచూద్ధాం.

ఆతరువాత Stockdale అమెరికన్ సైన్యంలో admiral గా పనిచేసాడు. ఆతరువాత ఆయన రాసిన పుస్తకం A Vietnam Experience.

ఆతరువాత Jim Collins అనే ఆయన Good to great అనే Book లో ఈ Stockdale Paradox గురించి వ్రాయడం జరిగింది.

ఈ Stockdale Paradox Theory ని ఈ మధ్యనే Harvard university , తమ Business School meeting లో,
కరోనా విషయంలో ఈ papers ని release చేసింది.......
వీలుకుదిరితే ఆ పుస్తకాలు చదవండి. Stockdale Paradox Theory ని మర్చిపోకండి.

100 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే మన ఓపికను పరిష్కరించుకోగలిగే అవకాశం వస్తుంది.

మనకి అద్భుతమైన ఓపిక ఉందనే విషయం మనకి ఇప్పటికే అర్థమైపోయింది.

ఇంకెంత కొంతకాలమే ఈ పరీక్ష!

చివరిదాకా ఓపికతో ఉన్నవాడే , యుద్ధాన్ని గెలవగలడు.

ఇంకో విషయం -
ఇంత భయంకరమైన కరోనానే ఓపిక తో జయించగలిగినపుడు – భవిష్యత్ లో మీ జీవితంలో కి అడుగు బెట్టేవి చాలా చిన్నసమస్యలైపోతాయి.

అన్నింటికన్నా పెద్దసమస్య - మరణం.

దానినే మీరు ఎదుర్కోని బయటకు రాగలిగినపుడు.

ఇక మిగిలిన సమస్యలన్నీ చాలా చిన్నవి. తేలికగా పరిష్కరించగలరు.

This is nothing but Survival Psychology , in Crisis Management .

All the best...!!!
👏👏👏👏👏

Source - Whatsapp Message

మనిషి హృదయం

మనిషి హృదయం
చెట్టును చెట్టుగానే చూస్తాడు. చెట్టులో ఏమీ అందం కనిపించదు. పుట్టను మట్టిగా చూస్తాడు. పుట్టలో చీమలు ఉన్నాయా, పాముందా అనేవి అతడికి అనవసరం. మంద్ర స్థాయిలో వీచినా, తీవ్రంగా వీచినా... గాలి గాలే. అందులో ప్రాణవాయువు ఉంటుంది. మనం బతుకుతున్నాం. అది కలుషితం కావడం వల్ల రోగాల పాలవుతున్నాం.
మనిషి గలగల పారే నదిని చూస్తాడు. అందులో నాచు, క్రిమి, కీటకాలు ఉంటాయి. ఆ నీళ్లు నేరుగా వాడకూడదు అంటాడు. సూర్యుడు వస్తాడు. వెళతాడు. అది ఆయన పని. చంద్రుడు సూర్యుడి మీద ఆధారపడి బతుకుతాడు. స్వయం ప్రకాశం లేదు. గ్రహాలంటారా? అవి సౌర వ్యవస్థలో ఒక భాగం. అలా తిరుగుతూనే ఉంటాయి. పని లేనివాళ్లు తిరుగుతున్నట్లు... ఇదీ వరస. ఇలా ఉంటాయి ఆ వ్యక్తి ఆలోచనలు... ప్రకృతిలో కలిసి బతుకుతాడు. ప్రకృతితో ఏం సంబంధం లేనట్లే ఉంటాడు. ప్రకృతిని ఒక యాంత్రిక వ్యవస్థగా చూస్తాడు.
సంఘంలో అందరితో కలిసి ఉన్నట్లు కనిపిస్తాడు. కాని అన్నీ వ్యావహారిక వ్యాపార సంబంధాలే నెరపుతుంటాడు. డబ్బు లేకపోతే గౌరవం ఎక్కడ ఉంది? అసలు గౌరవం ఎక్కడ ఉంది? అన్నీ ఇచ్చి పుచ్చుకోవడాలే కదా. కనుక వ్యాపారం లేకపోతే బతుకే లేదంటాడు.
భావాలు, స్పందనలు, సౌందర్య ఆరాధన, లాలిత్యం, సౌకుమార్యం, జీవనం మీద నమ్మకం... అతడిలో మచ్చుకైనా కానరావు.
పుట్టాం. బతుకుతున్నాం. చావాలి. దానికోసం ఎదురు చూడాలి. అంతా భౌతికమే. కనిపిస్తున్నవాడే మనల్ని రక్షించడం లేదు. కనపడనివాడు ఏం రక్షిస్తాడు? అదంతా పెద్ద భ్రమ. మాయ. కొంత మంది మనుషులు కూడగట్టుకొని చేస్తున్న గారడి అని తలపోస్తాడు.
ఇలాంటి భావాలతో కొంతమంది మనుషులు ఉంటారు. వాళ్లనెవరూ కాదనలేరు. వాళ్లు ప్రపంచాన్ని చూసే విధానం భిన్నంగా ఉంటుంది.
మనిషి మనిషిలా ఉండాలి. సహజ మానవ స్పందనలను నిగ్రహించుకుని హృదయాన్ని కోల్పోకూడదు. హృదయం లేకపోతే ప్రేమ ఉండదు. ప్రేమ లేకపోతే విశ్వ సౌందర్యం తెలియదు. ఈ జగత్తును ఇంత అద్భుతంగా సృష్టించడం వెనక విధాత ఉద్దేశాన్ని ఎప్పటికీ గ్రహించలేం.
ఏకత్వంలో భిన్నత్వం భిన్నత్వంలో ఏకత్వం సృష్టి సూత్రం. అంతా ఒక గొప్ప సంగీత వాయిద్యం మీద పలికించే దివ్య రాగాల ఝరి.
నిమిత్తమాత్రంగా ఉండటం మంచిదే. అది జ్ఞానోదయమై సత్య రహస్యం తెలుసుకున్నప్పుడు ఏర్పడిన దివ్య వైరాగ్య స్థితి. అజ్ఞానంతో తప్పుడు అభిప్రాయాలు ఏర్పరచుకుని హృదయానికి, మనసుకు ఉన్న లంకెను తెంచుకుని తామరాకు మీద నీటిబొట్టులా బతుకుతున్నానని చెప్పుకోవడం సరి కాదు.
సత్యం శివం సుందరం ఏమిటో బోధపడాలంటే మనసులోని యాంత్రికతను తొలగించుకుని, తర్క వితర్కాలతో కూడిన మనసును జీవన తత్వంలో ఉన్న ప్రేమతో అనుసంధానం చేసుకోవాలి. నమ్మకం, అపనమ్మకం మధ్యలో సత్యం నివసిస్తుంది. గొప్ప ఆలోచనలు దాన్ని చూపిస్తాయి.
మనిషి మట్టి మనిషే. అతడి హృదయం మాత్రం మట్టి కాదు. ప్రపంచం ఎలా ఉందో అలా చూడాలంటే లోపలికి చూడటం ఒక్కటే మార్గం. అక్కడ మట్టి మీద మొలిచిన మహా సౌందర్యలోకాలు ఎన్నో ఉన్నాయని అంతస్సౌందర్య వీక్షకులైన జ్ఞానులు చెబుతారు!

మానస సరోవరం 👏

Source - Whatsapp Message

Friday, June 4, 2021

దివ్య సంపద.

దివ్య సంపద.

సంపదలన్నీ సుఖ సౌఖ్య సంతోషాలకేనన్న బలమైన అపోహ ప్రజల్లో ఉంది. ప్రాపంచిక సంపదలన్నీ చేతులు మారుతున్నవే తప్ప స్వయంసృష్టిగా చెప్పదగ్గవి తక్కువ. వంశానుగతంగా సంక్రమించే పూర్వీకుల ఆస్తులన్నీ ఇలా లభిస్తున్నవే.
అర్థశాస్త్ర గ్రంథకర్త చాణక్యుడు సంపదను కూడబెట్టడాన్ని వ్యతిరేకించాడు. ఏ రోజు ఆదాయం ఆ రోజుకు సరిపోతే చాలన్నాడు. అప్పుడు మనిషి స్వార్థమనే బోనులో బందీ కాడు.
రాజ్య నిర్వహణ కోసం పాలకుడు పటిష్ఠమైన ఆర్థిక వ్యవస్థ కలిగి ఉండాలని ‘శుక్రనీతి’ చెబుతుంది. కష్టార్జితమే న్యాయార్జితమని విదురనీతి శాస్త్రం బోధిస్తుంది.
ప్రపంచంలో అన్యాయార్జన కోసం ఆరాటపడేవాళ్లే ఎక్కువగా కనిపిస్తారు. మాయాద్యూతంలో పాండవుల సంపదను దోచుకున్న దుర్యోధనుడు, సూది మోపిన స్థలాన్ని కూడా తిరిగి ఇవ్వనన్నాడు. అలా ఉంటుంది సంపద మీద వ్యామోహం. కానీ, వ్యామోహాల పర్యవసానాలన్నీ దుఃఖాంతంగానే ఉంటాయి. దుఃఖం తప్పదని తెలిసినా వ్యామోహాన్ని వదులుకోరు. ధృతరాష్ట్రుడి విపరీత పుత్రవ్యామోహం లోకప్రసిద్ధం.
మహాకవి భారవి తండ్రి తన పుత్రప్రేమను గుప్తంగా ఉంచుకుని, అందుకు కారణం కుమారుడి క్షేమమేనని చెప్పడం గుర్తుంచుకోదగిన చారిత్రకాంశం. సంతానం సాధించిన విజయాలను తండ్రి అభినందించి ప్రోత్సహించాలి. అతిగా పొగడకూడదు.
సంపద అంటే కేవలం ధనధాన్య వస్తువాహనాలు కావు. సరస్వతీ ప్రసాదాలుగా చెప్పుకొనే కళా సాహిత్య స్వరూపాలు కూడా. అక్షర సంపదలన్నీ అక్షయమే. కోటీశ్వరులు, మహారాజులు కూడా కవులకు, కళాకారులకు చేతులు జోడించక తప్పదు. లక్ష్మీ కటాక్షం కన్నా సరస్వతీ కటాక్షమే గొప్పదని రుజువైన సంఘటనలు ఎన్నో ఉన్నాయి.
శ్రీకృష్ణదేవరాయలు అల్లసాని వారికి గండపెండేరం తొడిగినా, తన శ్రోత్రియత్వాన్ని పక్కనపెట్టి విశ్వనాథవారు కవికోకిల జాషువాను గండపెండేరంతో సత్కరించినా- అందుకు వారి అక్షర సంపదే కారణం.
తరతరాల సంపద ఆర్జించి వారసులకివ్వడంతో తమ కర్తవ్యం ముగిసిపోయిందనుకునేవారే ఎక్కువ. వారసులకు సంస్కారం, సంప్రదాయాలను కూడా ఇవ్వకపోతే, కొండంత సంపదైనా కళ్లముందే కరిగిపోతుంది. ఉత్తమ గుణాలు కలిగి ఉన్నవారికి ప్రాపంచిక సంపదల పట్ల ఆసక్తి ఉండదు. వారు అంతర్ముఖులై అంతర్యామిని ఆరాధించడంలో నిమగ్నులై ఉంటారు. దేహాన్ని కేవలం జీవన వాహనంగా భావిస్తారు. ఆత్మభావనతో జీవిస్తారు. చూసేవారికి వారు కాలాన్ని వ్యర్థం చేస్తున్నారనిపిస్తుంది. కానీ వారు జీవితానికి అర్థం చేకూర్చుకుంటున్నారని తెలియదు.
వాల్మీకి పుట్టలో కూచుని కాలం వ్యర్థం చేశాడా? శ్రీరమణులు, అరవిందులు, శ్రీరామకృష్ణులు ఏమీ సాధించలేదా? వారంతా దివ్య సంపదలు ఆర్జించారు. వాటిని ఆశ్రితులకు, జిజ్ఞాసువులకు ఉదారంగా పంచిపెట్టారు.
భారతదేశం దివ్యమైన ఆధ్యాత్మిక సంపదలకు నెలవు. ఎందరో మహానుభావులు తరతరాలకు సరిపడా దివ్య సంపదను వారసత్వంగా ఇచ్చారు. ఆ విషయాన్ని గుర్తించని వారంతా ప్రాపంచిక సంపదలకు ప్రాధాన్యమిస్తున్నారు. కొన్ని తరాలకు సరిపడా కూడబెట్టి వారసులకు ఇచ్చామని ఘనంగా భావిస్తున్నారు. కానీ, దివ్య సంపదను కోల్పోయామన్న గ్రహింపు లేకపోవడం ఒక జీవితకాలపు నష్టం.

సేకరణ. మానస సరోవరం

Source - Whatsapp Message

ఆధ్యాత్మిక ఆనందం

🕉️ఆధ్యాత్మిక ఆనందం🕉️

📚✍️ మురళీ మోహన్
🔅🔅🌷🌷🌷🔅🔅

💫🌺ఆనందం అంటే బాధలు లేకపోవడం కాదు. బాధలు మనల్ని బాధించకపోవడం.

💫🌺బాధ గురించిన భావనలే మనల్ని బాధకంటే ఎక్కువగా బాధిస్తాయి. కురుక్షేత్ర యుద్ధం ప్రారంభించకుండానే అర్జునుడు విషాద యోగంలో మునిగిపోయాడు. బంధుమిత్రులను సంహరించి రాజభోగాలను అనుభవించలేనని వాపోయాడు.
ధర్మానికి విరుద్ధంగా శత్రుపక్షంలో ఉన్న కౌరవులు పాండవుల పట్ల ఎప్పుడూ ద్రోహ బుద్ధితోనే ఉన్నారు.
ధర్మపక్షపాతి శ్రీకృష్ణుడు ఆ విషయాన్నే చెబుతూ ‘అర్జునా! నీవు చంపకపోయినా ఇందులో బతకగల వారెవ్వరూ లేరు... చంపడం, చావడం నీ చేతిలో లేదు. నీవు కేవలం నిమిత్తమాత్రుడివి. యుద్ధం చెయ్యడం వరకే నీ కర్తవ్యం. అది పాటించు చాలు’ అంటాడు.

అధర్మనాశనానికి అర్జునుణ్ని కేవలం ఒక ఉపకరణంగా, ఆయుధంగా శ్రీకృష్ణుడు ఉపయోగించుకున్నాడు. సంహార సంకల్పం పరమాత్మది.

🌺 నిర్మలమైన అంతరంగం గలవారికి సుఖదుఃఖాల అనుభూతి ఉండదు. శ్రీరమణులు క్యాన్సర్‌ వచ్చినప్పుడూ బాధపడిన సూచనలు ఆయన ముఖంలో ఎన్నడూ కనిపించేవి కావు.
అదే మందహాసం, అదే నిర్లిప్తత!
సాధారణ వ్యక్తులకది అసాధ్యం. సాధనతోనే అసాధ్యాన్ని ఎవరైనా సుసాధ్యం చేసుకోగలరు.
ప్రతి మనిషికీ వారి వారి ఆలోచనలు, అభిరుచులను బట్టి జీవిత లక్ష్యాలు ఉంటాయి.
అవి ఎవరికి వారికే ప్రత్యేకం. ఆనువంశికంగా ప్రజ్ఞాప్రాభవాలు లభించవు.
అల్లసాని పెద్దన కొడుకు, కాళిదాసు కుమారుడు మహాకవులుగా రాణించిన దాఖలాలు లేవు.
రాజు కొడుకు రాజు అవుతాడు. కానీ, రాజ్యాన్ని రక్షించుకొనే సామర్థ్యం కచ్చితంగా ఉంటుందని చెప్పలేం.
అలా ఉండి ఉంటే రాజవంశాలు అంతరించేవి కావు.

మహాకవి జాషువా చెప్పినట్లు- ఎంతటి చక్రవర్తులైనా కలకాలం ఇల మీద ఉండరు. అందరూ రుద్రభూమిలో శయనించవలసిన వారే.

🌺ప్రాపంచిక సుఖాలన్నీ సంతోషాన్ని కలిగిస్తాయి తప్ప ఆనందాన్ని ఇవ్వలేవు. ఆధ్యాత్మిక జీవితానికి పూర్తిగా అంకితమైన వారు ఆనందభావనతో ఉంటారు.

🌺ఆనందం అంటే మాటలకందని అనుభూతి. ఆ అనుభూతి వారి ముఖంలో నెలవై ఉంటుంది. ఎంతటి కష్టానికైనా వారు చలించరు. మేరుపర్వతంలా ధీరువై ఉంటారు. సేవను భాగ్యంగా భావిస్తారు. సహాయాన్నే వారు సేవగా తలుస్తారు.

ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా, ఎక్కువ తక్కువల తేడా చూపకుండా, మానావమానాలు పట్టించుకోకుండా సేవలు చేసేవారే నిజమైన ఆధ్యాత్మిక జీవనం గడిపేవారిగా మనం గుర్తించవచ్చు. అలాంటివారు ఎంతో అరుదుగా కనిపిస్తారు. పురుషులందు పుణ్యపురుషులంటే అలాంటి వారే.

🌺ఆదర్శం అంటే చెట్టును మెచ్చుకుంటూ నీడలో హాయిగా విశ్రాంతి పొందడం కాదు... మరికొన్ని మొక్కల్ని నాటడం. వాటిని పెంచి పోషించడం, కాపాడటం. ఆ విధంగా మరెందరికో మేలు చెయ్యడం. అందరికీ మేలు జరిగే పనులు చెయ్యడంలోనే అనిర్వచనీయమైన ఆనందం లభిస్తుంది.

ఈ సత్యం తెలుసుకోలేక స్వార్థంలోనే ఆనందం లభిస్తుందని ఎందరో భావిస్తుంటారు.
ప్రాపంచిక ఆనందాలనేవి తాత్కాలికమే. మనకు ఎన్నో అనుభూతుల్ని ఇచ్చే శరీరమూ శాశ్వతం కాదు. ఒక్క ఆధ్యాత్మిక ఆనందమే శాశ్వతం. దాని చిరునామా అంతర్యామి అంతరాలయమే.
వెతుక్కోవలసింది మనమే. ఎవరెన్ని బోధలు చేసినా, అన్ని బాధలకూ ఓర్చి అంతర్యామిని దర్శిస్తే అప్పుడు తరగని ఆధ్యాత్మిక ఆనందం మన సొత్తవుతుంది.👍

Source - Whatsapp Message

Wednesday, June 2, 2021

భారతదేశానికి సముద్రమార్గాన్ని కనుగొన్నవాడు వాస్కోడగామా అనడం ఎంతవరకు సత్యం..!

భారతదేశానికి సముద్రమార్గాన్ని కనుగొన్నవాడు వాస్కోడగామా అనడం ఎంతవరకు సత్యం..! అదే విషయం మనం ఇప్పుడు తెలుసుకుందాం. మనదేశంలో ఆంగ్లేయుల ద్వారా ప్రచారం చేయబడిన భ్రమలలో ఇదొకటి. ఇందులో వాస్కోడగామా భారత్ రావడం మాత్రమే సత్యం. కాని ఆయన ఎలా వచ్చాడనేది తెలిసికొంటేనే మనకు సత్యం ఏమిటో తెలుస్తుంది.
సుప్రసిద్ధ పురాతత్వ వేత్త, పద్మశ్రీ డా. విష్ణు శ్రీధర వాకణ్‌కర్ ఇలా తెలిపినారు: “నేను నా పర్యటనలో భాగంగా ఒకసారి స్పెయిన్ వెళ్ళినాను. అక్కడ నాకు వాస్కోడగామా డైరీ లభించింది. దానిలో వాస్కోడగామా భారత్‌కు ఎలా వచ్చాడో వివరంగా ఉంది. అందులో ఆయనిలా వ్రాసినాడు: నా పడవ ఆఫ్రికాలోని జాంజిబారు తీరం చేరుకొన్నప్పుడు నా ఓడ కన్నా మూడురెట్లు పెద్దగా ఉన్న ఓడను అక్కడ నేను చూసినాను. ఒక ఆఫ్రికన్ దుబాసిని తీసికొని ఆ పెద్ద ఓడయొక్క యజమానిని కలిసినాను. ఆ యజమాని పేరు స్కందుడు.
గుజరాతీ వ్యాపారి. భారతదేశం నుండి జాజి చెట్టు మరియు టేకు చెట్టు కలపను, మసాలా ద్రవ్యములు తీసికొని వచ్చాడు. వానికి బదులుగా ముత్యములు తీసికొని కొచ్చిన్ ఓడరేవుకు వచ్చి వ్యాపారం చేసేవాడు. వాస్కోడగామా స్కందుడను పేరు గల ఆ వ్యాపారిని కలుసుకొనుటకు వెళ్ళినపుడాతడు సాధారణ వేషంలో ఒక చిన్న మంచముపై కూర్చుండియున్నాడు. అతడు వాస్కోడగామాతో ఎక్కడికి వెళ్ళుచున్నారని అడిగినాడు. వాస్కోడగామా హిందూదేశం చూడటానికి వెళ్తున్నానన్నాడు. అప్పుడా వ్యాపారి నేనూ రేపు అటే వెళ్తున్నాను. నా వెనుక అనుసరించి రమ్మన్నాడు. ఆ విధంగా ఆ వ్యాపారి ఓడను అనుసరించి వచ్చి వాస్కోడగామా భారత్ చేరినాడు.

ఈ సత్యం స్వతంత్ర భారతంలోనైనా మన నవతరానికి చెప్పవలసింది. కాని దురదృష్టవశాత్తు అలా జరగటం లేదు. పై సంఘటన చదివిన పిమ్మట మన మనసులోనికి ఒక ఆలోచన తప్పక వస్తుంది. నౌకా నిర్మాణంలో ఇంత ఉన్నతస్థితిలోనున్న దేశంలో ఇప్పుడా విద్య ఎందుకు నశించిపోయింది? ఆంగ్లేయులు వచ్చిన పిదప వారిపాలనలో ఒక పథకం ప్రకారం కుట్రపన్ని నౌకానిర్మాణ పరిశ్రమను నాశనం చేసినారనే చారిత్రక సత్యాన్ని తప్పక తెలిసికోవాలి. ఈ చరిత్రను వివరిస్తూ ప్రఖ్యాత చరిత్రకారుడు శ్రీ గంగా శంకరమిశ్రా ఇలా వ్రాసినారు

పాశ్చాత్యులు భారతదేశానికి రాకపోకలు సాగించినపుడు వారిక్కడి ఓడల్ని చూసి ఆశ్చర్యపోయినారు. 17 వ శతాబ్దం నాటివరకు కూడా ఐరోపావారి ఓడలు అధికాధికంగా ఆరువందల టన్నుల సామర్థ్యం మాత్రమే కలిగి ఉండేవి. కాని భారత్‌లో “గోఘా” పేరుగల పెద్ద ఓడలు 15 వందల టన్నుల సామర్థ్యం కలిగి ఉన్నట్లు ఐరోపావారు తెలిసికొన్నారు. ఐరోపా కంపెనీలు ఇలాంటి పెద్ద ఓడల్ని వినియోగించడం మొదలు పెట్టాయి. నైపుణ్యము గల హిందూదేశ కార్మికుల ద్వారా పెద్ద ఓడల్ని తయారుచేయించే పరిశ్రమల్ని అనేకం ప్రారంభించారు. 1811 సంవత్సరంలో లెఫ్టినెంటు వాకర్ ఇలా వ్రాసినాడు:
బ్రిటిషువారి ఓడలన్నీ ప్రతి పన్నెండేళ్ళకు మరమ్మతుల పాలయ్యేవి. కాని భారతీయ ఓడలు టేకుకర్రతో చేయబడి 50 సంవత్సరాలకు పైగా ఎలాంటి మరమ్మతులు అవసరం లేకుండానే పనిచేసేవి. ఈస్టిండియా కంపెనీ వద్ద “దరియా దౌలత్” అనే పేరు గల ఒక ఓడ ఉండేది. అది 87 సంవత్సరాలపాటు మరమ్మతులు లేకుండా చక్కగా పనిచేసింది. భారతదేశంలో ఓడల నిర్మాణానికి సీసం కర్ర ( చండ్రచెట్టు కలప ), సాల వృక్షము కర్ర, టేకు కర్ర – – *ఈ మూడు రకాల కలప వాడేవారు.
1811లో ఒక ఫ్రెంచి యాత్రికుడు వాల్ట్ జర్ సాల్విన్స్ “లే హిందూ” అనే పుస్తకం వ్రాసినాడు. “ప్రాచీన కాలం నుండి నౌకా నిర్మాణ కళలో హిందువులు చలా ఆరితేరియున్నారు. నేడు కూడా వారీ కళలో యూరపువారికి పాఠము చెప్పగల సమర్థులే. ఆంగ్లేయులు హిందువుల నుండి నౌకా నిర్మాణ కళను నేర్చుకొనుటకు చాలా ఉత్సాహం చూపేవారు. హిందువల వద్ద అనేక విషయాలు తెలుసుకొన్నారు.

భారతీయ ఓడలలో సౌందర్యం, నాణ్యత కలగలసి ఉండేవి. ఈ ఓడలు హిందువుల యొక్క నిర్మాణ కౌశల్యానికి మరియు ధైర్యసాహసాలకూ ప్రతీకలుగా ఉన్నవి.” ముంబాయిలోని పరిశ్రమలో 1736 నుండి 1863 వరకు 300 పెద్ద ఓడలు తయారైనవి. వీనిలో ఎక్కువ ఓడలను ఆంగ్లేయ నౌకాదళం “షాహీబేడే”లో చేర్చుకొన్నారు. వీనిలో “ఏషియా” అను పేరుగల ఓడ 2289 టన్నుల సామర్థ్యం కలది. దానిలో 84 ఫిరంగులు అమర్చబడి యుండెను. బెంగాలులోని హుగ్లీ, సిల్‌హట్, చట్టగాఁవ్, ఢాకా మొదలగు చోట్ల నౌకా నిర్మాణ పరిశ్రమలుండేవి. 1781 నుండి 1821 వరకు, 1,22,693 టన్నుల సామర్థ్యం గల 272 ఓడలు కేవలం ఒక హుగ్లీలోనే తయారైనవి. ఇది అసలు చరిత్ర..!




https://www.facebook.com/100004863932006/posts/1708957052609743/?sfnsn=scwshmo

Tuesday, June 1, 2021

తక్కువ వైబ్రేటింగ్ ఫ్రీక్వెన్సీ [Vibrating frequency] కలిగిన మనుషుల్లో వైరస్ ప్రాణాంతకం అవుతుంది !

💫 తక్కువ వైబ్రేటింగ్ ఫ్రీక్వెన్సీ [Vibrating frequency] కలిగిన మనుషుల్లో వైరస్ ప్రాణాంతకం అవుతుంది ! 💹

నేను చెప్పే విషయం ఆధ్యాత్మికులు అర్థం చేసుకోగలుగుతారు. మిగతా వాళ్ళు కూడా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారని ఆశిస్తాను.

ఈ పూర్తి విశ్వం నాద మయం. సృష్టిలోని 'ప్రతీ వస్తువూ, జీవి' ఒక నిర్దుష్టమైన ప్రకంపన సామర్థ్యాన్ని అంటే Vibrating frequency కలిగి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనందరిని భయపెడుతున్న Covid వైరస్ కూడా ఇందుకు మినహాయింపు కాదు. దాని Vibrating frequency 5.5 Hz ఉంటుంది. ఇది 25Hz Vibrating frequency దగ్గర మనలేదు.

ఇంతకు మించిన ప్రకంపన సామర్థ్యం కలిగిన వారిలో Covid పెద్ద ప్రమాదకారి కాదు. కేవలం కాస్త అనారోగ్యం కలిగించగలదు అంతే. చాలా త్వరగా కోలుకుంటారు. అంటే ఇప్పుడు పెంచుకోవాల్సింది Vibrating frequency.

ముందు మనుషుల్లో Vibrating frequency ఎందుకు తగ్గుతుందో తెలుసుకుందాం.
భయం
ఫోబియా
అనుమానం
ఆందోళన
ఒత్తిడి
కోపం
ద్వేషం
దురాశ
మోసం
బాధ
విపరీతమైన మోహం వంటివి మనలోని ప్రకంపనా సామర్థ్యాన్ని తగ్గిస్తాయి.

ప్రస్తుతం భూమండల సగటు Vibrating frequency 27.4Hz. Hospitals, Cellarls, జైళ్ల వంటి కొన్ని ప్రదేశాలు చాలా తక్కువ frequency లో ఉంటాయి. వీటి frequency దాదాపు 20hz ఉంటుంది. లేదా అంతకంటే తక్కువ ఉంటుంది. ఇలాంటి చోటుల్లో వైరస్ ప్రమాదకరంగా మారుతుంది. అలాగే తక్కువ Vibrating frequency కలిగిన మనుషుల్లో వైరస్ ప్రాణాంతకం అవుతుంది.

భావోద్వేగాల frequency మనుషుల్లో ఉండే భావోద్వేగాలు ఎంత ఫ్రీక్వెన్సీతో Vibrate అవుతాయో ఒక సారి చూద్దాం.

బాధ - 0.01 Hz
భయం - 0.2 - 2.2
చికాకు - 0.9 - 6.8
చప్పుళ్ళు - 0.6 - 2.2
గర్వం - 0.8
దర్పం - 1.9

ఇవ్వన్నీ తక్కువ స్థాయి frequency తో ఉండే భావోద్వేగాలు. వీటి వల్ల మనుషుల Vibrating frequency చాలా పడిపోతోంది. ఫలితంగా నిరోధక వ్యవస్థ బలహీన పడుతుంది. ప్రస్తుతం ఇది చాలా ప్రమాదకరం.

ఏది మంచిది ? ఎక్కువ frequency కలిగిన ప్రవర్తన అలవరచుకోవడం ఇప్పుడు అత్యవసరం. ఎటువంటి ప్రవర్తన ద్వారా అది సాధ్యమో చూద్దాం.

దయ - 95 Hz
కృతజ్ఞత -250
సహనుభుతి - 150
బేషరతు ప్రేమ - 250hz
So... Comon let's vibrate higher.

ప్రేమించటం, కృతజ్ఞత కలిగి ఉండటం, క్షమించడం, కళాసాధన, యోగ, ధ్యానం, సూర్యరశ్మిలో నడవటం, ప్రకృతి ఆరాధన వంటి చిన్న చిన్న సాధనలతో మనం High frequency లో Vibrate కావచ్చు.

సహజమైన ఆహారం తీసుకోవడం ద్వారా, అంతెందుకు స్వఛ్చమైన నీటిని తాగడం ద్వారా మనం మన Vibrating frequency ని పెంచుకోవచ్చు. కేవలం కొద్ది సమయం దైవ సాన్నిధ్యంలో గడపడం, ప్రార్థన చెయ్యటం ద్వారా 120 నుంచి 35O Hz వరకు మన ఫ్రీక్వెన్సీని పెంచుకోవచ్చు.

ఆలస్యం వద్దు ఇక ఆ పనిలో ఉండాల్సిన అవసరం ఏర్పడింది. పదండి... నవ్వుదాం, నవ్విద్దాం, ప్రేమిద్దాం, ఆడుదాం, పాడుదాం, ధ్యానిద్ధాం, పూజిద్దాం, సకల సృష్టితో అనుసంధానమై కృతజ్ఞత కలిగి మెలుగుదాం. మన Vibrating frequency ని పెంచుకుందాం !

[ఈ సమాచారం మొత్తం power vs force అనే పుస్తకం నుంచి సేకరించింది. ఇది డేవిడ్ హాకిన్స్ రాసిన Doctoral thesis లోనిది]

🙏🇮🇳😷🥦🔮🕊️💉💫🥀

Source - Whatsapp Message

కేశవ నామాలు-గణిత భూమిక

కేశవ నామాలు-గణిత భూమిక

విష్ణుమూర్తికి24పేర్లున్నాయి.వాటిని కేశవనామాలంటారని మనకు తెలుసు.

ఇవి 24మాత్రమే ఎందుకు ఉన్నాయి?వీటికి కాలచక్రానికి,గణితానికి ఏమైనా సంబంధం వున్నదా?

ఈ 24 కు గణిత పరమైన భూమిక ఏమిటి?
చూద్దాం.

విష్ణుమూర్తిని చతుర్భుజుడు అంటాం.అంటే నాలుగు చేతులు గలవాడని కదా?
ఈ నాలుగు చేతుల్లో శంఖం,చక్రం, గద,పద్మాలను ధరించి మనకు దర్శనమిస్తాడు.

నిశితంగా పరిశీలిస్తే, ఈ నాలుగు ఆయుధాల యొక్క అమరికలలో వచ్చే మార్పుల వల్ల ఖచ్చితంగా 24 వేరువేరు రూపాలు విష్ణువునకు ఏర్పడతాయి.
ఈ 24 రూపాలనే కేశవనామాలంటారు.

1.కేశవ నామాలలో మొదటి నామం కేశవ.

కేశవ రూపంలో స్వామి కుడివైపు ఉన్న రెండు చేతులతో
పద్మము, శంఖము
ధరించి ఎడమ వైపు ఉన్న రెండు చేతులతో
గద,చక్రం
ధరించి ఉంటాడు.

2.విష్ణువు యొక్క మరొక నామము మాధవ.

ఈ రూపంలో కుడి వైపు రెండు చేతులతో
గద,చక్రం ధరించి,ఎడమవైపు ఉన్న రెండు చేతులతో
పద్మము,శంఖము ధరించి ఉంటాడు.

3.మధుసూధన రూపంలో

కుడివైపు చేతులతో చక్రం, శంఖము
మరియు ఎడమవైపు చేతులతో
గద,పద్మము ధరించి ఉంటాడు.

ఈవిధంగా ప్రతి పదిహేను రోజులకు(పక్షానికొకసారి)

పౌర్ణమికి, అమావాస్య కు తన ఆయుధాలను చేతులు మార్చుకుంటూ ఉంటాడు శ్రీ మహా విష్ణువు.

ఈ మార్పులు లేదా అమరికలను మనం గణిత శాస్త్ర పరిభాషలో ప్రస్తారాలు(permutations)
అంటాం.
అనగా 4 వస్తువులను 4!
(4 factorial) విధాలుగా అమర్చవచ్చు.

4! = 4×3×2×1=24

శంఖాన్ని 'శ' తోను,
చక్రాన్ని 'చ' తోను,
గదను 'గ' తోను,
పద్మాన్ని ' ప'తోను సూచిస్తే,

ఆ 24 అమరికలు క్రింది విధంగా వుంటాయి.

1) శచగప 2) శచపగ
3) శపచగ 4) శపగచ
5)శగచప 6)శగపచ
7)చపగశ 8)చపశగ
9)చగపశ 10)చగశప
11)చశగప 12)చశపగ
13)గపశచ 14)గపచశ
15)గచశప 16)గచపశ
17)గశపచ 18)గశచప
19)పచగశ 20)పతశగ
21)పశగచ 22)పశచగ
23)పగశచ 24)పగచశ.

[పైవన్నీ ఒక క్రమంలో ఉన్నట్లు పరిశీలించి ఉంటారు.]

ఈ 24 నామాలు పెద్దలందరికీ తెలిసినా‌...

మరోసారి క్రింద ఉదహరిస్తున్నాను.

కేశవ,నారాయణ
మాధవ,గోవింద
విష్ణు,మధుసూధన
త్రివిక్రమ,వామన
శ్రీధర,హృషీకేశ
పద్మనాభ,దామోదర
సంకర్షణ,వాసుదేవ
అనిరుధ్ధ,ప్రద్యుమ్న,
పురుషోత్తమ,అధోక్షజ
నారసింహ,అచ్యుత
జనార్ధన,ఉపేంద్ర
హరి శ్రీకృష్ణ.

ఈ నాలుగు ఆయుధాలను అన్ని విధాలుగాను మార్చుకోవటానికి
24 పక్షాలు అంటే
12 నెలలు
అనగా ఒక సంవత్సరం పడుతుంది.

🌻ఈ విషయాలను తెలియజేసిన శ్రీ చిర్రావూరి కుమారాంజనేయ గారికి వేనవేల ప్రణామాలు.

Source - Whatsapp Message

మంచి మాట .. లు

కుజః
ధరణీ గర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం |
కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం ||🙏

ఆత్మీయబంధుమిత్రులకు భౌమ వాసరా (మంగళవారం ) శుభోదయ శుభాకాంక్షలు. మా ఇంటి దైవం శ్రీ గుంటి ఆంజనేయస్వామి వారు తిరుత్తణి వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి వారి అనుగ్రహంతో మీరు మీ కుటుంబసభ్యులు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలతో నిండునూరేళ్ళు ఆనందం గా జీవించాలని కోరుకుంటూ.. పూర్వజన్మ సుకృతంతో భగవంతుడు తన ప్రతినిధులుగా కొందరికి అష్టైశ్వర్యాలు ఇచ్చి జీవులకు సహాయపడటానికి అవకాశం ఇచ్చారు.. కాని కొందరు స్వార్థంతో తనతో తీసుకెళ్లలేని సంపద ను అవసరమైన ఆపదలో ఉన్న ఎవరికీ సహాయం చేయకుండా మొత్తం తనదే అనే భావనతో ఉంటున్నారు.. అది అన్ని విధాలా అనర్థదాయకం.. దయచేసి భగవంతుడు మీకు ఇచ్చిన సువర్ణ అవకాశం సద్వినియోగం చేసుకోండి.. ఆపదలో ఉన్నా వారికీ సహాయపడండి 🙏

01.06.2021:-మంగళవారం

ఈ రోజు AVB మంచి మాట.. లు

భాదే బలహీనుడిని బలవంతుణ్ణి చేస్తుంది.. భయమే పిరికివాడిని ధైర్యవంతుడుని చేస్తుంది.. వైఫల్యమే మనిషిని వివేక వంతుడిని చేస్తుంది.. పోయేవరకు వీలైనంత మంది శ్రేయోభిలాషులను పరిచయం చేసుకోండి ... పెట్టుబడి మీ వ్యక్తిత్వం... ఉత్సాహంగా శ్రమించడం ...అలసటను ఆనందంగా, అనుభవించడం.. విజయానికి ప్రాథమిక లక్షణం!!

అశ్రద్ధ అనేది మనిషిని లోతైన అగాధంలోకి నెట్టేస్తుంది,, అందుకే మనిషి జీవితంలో ప్రతి క్షణం జాగ్రత్త అవసరం,, అశ్రద్ధ అనేది ఎప్పుడు పనికిరాదు,,



మనకు ఎదురు పడితే పలకరించేవాళ్ళు ఎంతమందైనా ఉంటారు కానీ ప్రతిరోజూ గుర్తుపెట్టుకుని మనల్ని పలకరించే వాళ్ళు ఉండటం మన అదృష్టం

కొన్ని మంచి మాటలు ఇంట్లో వాళ్ళకి చేదు కషాయంలా ? బయటి వాళ్ళకి తియ్యని తేనెలా ఉంటాయి . మనం ఎవరి గురించి ఎక్కువగా ఆలోచించకుడదు అది మనకు మనశ్శాంతిని దూరం చేస్తుంది ఏం జరిగినా అది దైవ నిర్ణయం అని భావించు మన మనసు ప్రశాంతంగా ఉంటుంది .

మనం ఎవరికైన సహాయం చేసిన మంచినిచేసిన మరుక్షణంలోనే మనం మరచిపోవాలి , మనకు మంచి చేసిన మనిషిని మరణించే క్షణం వరకు గుర్తుంచుకోవాలి

అందరు జాగర్తలు పాటించండి క్షేమముగా ఉండండి 💐
సేకరణ ✒️మీ ఆత్మీయ బంధువు AVB సుబ్బారావు 💐🤝

Source - Whatsapp Message

Monday, May 31, 2021

శివుడు అర్ధనారీశ్వరుడుగా ఎందుకు అవతరించవలసి వచ్చింది? ఈ అవతరణం వెనుక ఉన్న రహస్యమేమిటి?

🕉️శివుడు అర్ధనారీశ్వరుడుగా ఎందుకు అవతరించవలసి వచ్చింది? ఈ అవతరణం వెనుక ఉన్న రహస్యమేమిటి?

✍️ మురళీ మోహన్

🙏 అర్ధనారీశ్వరతత్వం మానవాళికి ఇచ్చే మహాసందేశమేమిటి? అనే విషయాలను విరించే కథ శివపురాణంలోని శతరుద్ర సంహితంలో కనిపిస్తుంది. నందీశ్వరుడు బ్రహ్మమానస పుత్రుడైన సనత్కుమారుడికి ఈ కథను వివరించాడు. పూర్వం బ్రహ్మదేవుడు ప్రజలను వృద్ధి చేయడం కోసం తనదైన పద్ధతిలో సృష్టిని చేయసాగాడు. కానీ అలా తానొక్కడే ప్రాణులను రూపొందిస్తూ జీవంపోస్తూ ఎంతకాలంగా తన పనిని తను చేసుకుపోతున్నా అనుకున్నంత సంఖ్యలో ప్రజావృద్ధి జరగలేదు. ఇందుకు ఎంతగానో చింతిల్లిన బ్రహ్మదేవుడు పరమేశ్వరుని గురించి తీవ్రంగా తపస్సు చేశాడు. బ్రహ్మ చేసిన కఠిన తపస్సుకు మెచ్చిన శివుడు ప్రసన్నుడయ్యాడు. అయితే బ్రహ్మకు ఆ క్షణాన ప్రసన్నమైన శివుడు అంతకు ముందులా కాక ఒక తేజోవంతమైన విచిత్ర స్వరూపంతో ప్రత్యక్షమయ్యాడు.

సగం పురుషుడు, సగం స్త్రీ రూపంగల దేహంతో ఆ శివస్వరూపం వెలుగొందసాగింది. పరమశక్తితో కూడి ఉన్న ఆ శంకరుడిని చూసి బ్రహ్మదేవుడు సాష్టాంగ ప్రణామం చేసి అనేక విధాల స్తుతించాడు. అప్పుడు శివుడు బ్రహ్మదేవుడితో బ్రహ్మసృష్టికి సహకరించటానికే అర్ధనారీశ్వర రూపాన్ని తాను ధరించి వచ్చినట్లు చెప్పాడు. అలా పలుకుతున్న శివుడి పార్శ్వభాగం నుండి ఉమాదేవి బయటకు వచ్చింది. బ్రహ్మదేవుడు ఆ జగన్మాతను స్తుతించి సృష్టి వృద్ధి చెందటం కోసం సర్వసమర్ధమైన ఒక రూపాన్ని ధరించమని తనకుమారుడైన దక్షుడికి కుమార్తెగా జన్మించమని బ్రహ్మదేవుడు ఉమాదేవిని ప్రార్ధించాడు. ఆమె బ్రహ్మను అనుగ్రహించింది. ఆ వెంటనే భవానీదేవి కనుబొమ్మల మధ్య నుండి ఆమెతో సమానమైన కాంతులు గల ఒక దివ్యశక్తి అక్కడ అవతరించింది. అప్పుడా శక్తిని చూసి పరమేశ్వరుడు బ్రహ్మతపస్సు చేసి మెప్పించాడు. కనుక ఆయన కోర్కెలను నెరవేర్చమని కోరాడు. పరమేశ్వరుని ఆ ఆజ్ఞను ఆమె శిరసావహించింది.

బ్రహ్మదేవుడు కోరినట్లుగానే అనంతరం ఆమె దక్షుడికి కుమార్తెగా జన్మించింది. ఆనాటి నుంచి ఆలోకంలో నారీ విభాగం కల్పితమైంది. స్త్రీ, పురుష సమాగమ రూపమైన సృష్టి ఆనాటి నుండి ప్రవర్తిల్లింది. స్త్రీశక్తి సామాన్యమైనది కాదని ప్రతివారు స్త్రీమూర్తులను గౌరవించి తీరాలని ఆది దేవుడు, ఆది పరాశక్తి ఇద్దరూ సమానంగా ఎంత శక్తి సామర్ధ్యాలు కలిగి ఉన్నారో ఈ లోకంలో ఉండే పురుషులతో స్త్రీలు కూడా అంతే శక్తిసామర్ధ్యాలు కలిగి ఉన్నారనే విషయాన్ని ఈ కధాసందర్భం వివరిస్తుంది. అంతేకాక సృష్టి స్థితి, లయ కారకులో సృష్టికర్తా అయిన బ్రహ్మదేవుడు తొలుత తాను ఒంటరిగా సృష్టిని ప్రారంభించిన, దానివల్ల ఎక్కువ ఫలితం కలుగలేకపోయిందని పరమేశ్వర అనుగ్రహంతో స్త్రీత్వం అవతరించిన తర్వాతే సృష్టి విశేషంగా పరివ్యాప్తమైందని ఈ కథ వివరిస్తుంది. స్త్రీశక్తి విశిష్టతను తెలియజెప్పేందుకు పరమేశ్వరుడు బ్రహ్మదేవుడికి అర్ధనారీశ్వర రూపంలో అవతరించాడు. కనుక పురుషాధిక్యాన్ని ప్రదర్శించటం కానీ, స్త్రీలను, స్త్రీ శక్తిని కించపరచటం కానీ ఎంతమాత్రమూ దైవ హితం కాదనే విషయాన్ని ఈ కధలో మనం గమనించవచ్చు.🙏

Source - Whatsapp Message