Friday, August 5, 2022

నేను ఎవరు?

 నేను ఎవరు?


ప్రతి ఒక్కరూ నేను నేను అంటుంటారు. అసలు ఈ నేను ఎవరు?

నేనులు ఎన్ని ఉన్నాయి. ఈ నేను లు అన్నీ ఒకటేనా?

ఇల్లు నాది అన్నాం.. నేను ఇల్లా..? కాదు గదా..!

నా వాహనం, నా భూమి, నా కుటుంబం, నా పిల్లలు, నా భార్య అన్నాం.. మరి ఇవన్నీ నేను కాదు గదా..!

అలాగే నా శరీరం అన్నప్పుడు శరీరం నేనెలా అవుతాను..?

నా మనస్సు అన్నప్పుడు నేను మనస్సునెలా అవుతాను.. శరీరం కన్నా, మనస్సు కన్నా నేను వేరుగా ఉండి ఉండాలి గదా..!

ఎవరా నేను..?

మనిషినెవరు సృష్టించారు? భగవంతుడు... అని భగవంతుడు చెప్పాడా? మనం అనుకుంటున్నాం. అంటేఎవరూ సృష్టించలేదు. ప్రతిమనిషీ'నేను' అనుకుంటూ తనకొక ప్రత్యేక గుర్తింపును,ఉనికిని తనకు తాను సృష్టించుకుంటున్నాడు.

నిజానికి మనిషికి, అంటే మనకు తెలీదు. నిజానికి చాలామందికి తెలుసు. ఏమిటీ భిన్న వ్యక్తీకరణ? నిజమే అయితే రెండూ నిజమే. తెలీని అమాయక స్థితిలో చాలామంది తెలిసీ చెప్పలేని ఆత్మస్థితిలో మరెంతోమంది ఉంటున్నారు.

నిజానికి అన్ని నేనులు కలిసి నేనైన నేనే నేను.

అదే ఆత్మ... అంటే నేను ఆత్మను అని తెలుసుకోవాలి.

నేను' అంటే దేహస్థితి కాదు. బాహ్యస్థితి కాదు. ఆది లేని, అంతం లేని ఆత్మ ధృతి. నివురుగప్పిన నిప్పులా లోలోన ప్రజ్వరిల్లుతున్న ఎప్పుడూ 'శాంతికాని' మహాకాంతి దీపం. ఎన్నడూ వాడని అనంత శాంతి పుష్పం. దేహం అంటే సప్త ధాతువులు, పంచ కోశాలు, వాయువులు, నాడులు. ఆత్మను కప్పిఉంచిన ఆధారాలు. ఔను... బంగారు పళ్లానికి కూడా గోడ చేర్పు కావాలి. వజ్రానికీ బంగారు ఆభరణపు ఆధారం కావాలి. జీవాత్మకు దాన్ని నిలిపి ఉంచగల ఉపాధి కావాలి. అదే దేహం. పంచకోశ నిర్మిత దేహం.

ఈ హోదాలు వారి వత్తిని చూపిస్తాయి. అది  అంతవరకే ఉండాలి. ‘అహంభావము’ ‘అహంకారం’ అని రెండు రకాల పదాలు సాధారణంగా వాడుతూ వుంటాము. ఈ రెండూ ఒకే అర్థం కలిగినవి కావు. నేను కాని దాన్ని నేననుకోవడం అహంకారం..

ఇది నాది అనుకుంటే హక్కు ఉనట్టు, నాకు మటుకే సొంతం అనుకుంటే స్వార్ధం ఉన్నట్టు, నేను చేయగలను అనుకుంటే ఆత్మ విశ్వాసం, నేనే చేస్తున్నాను నేను మటుకే చేయగలను అనుకుంటే అహంకారం, ఈ నేను అనేది దైవం చేతనే నడిచేది నడిపించేది కూడా ఆ శక్తే, అయితే ఆలోచనాశక్తి ని బుద్దిని మానవునికే అప్పగించింది దైవం. ఎందుకంటే ఆ ఆలోచన విధానమే నీ స్థాయిని ఇహపర లోకాలలో నిర్ణయిస్తుంది.. నీ ఆలోచనా విధానంలో సత్యం న్యాయం ధర్మం ఉంటే నీ బుద్ధికి తగట్టు ఆ దైవం నీకు తోడు గా నడుస్తుంది, అదే బుద్ధి అహంకారంతో నిండిపోయి నేను రాక్షసుడిగా జీవిస్తానా, లేక మానవుని గానా లేక దేవుని గా జీవిస్తానా అనేది ఈ నేను అనే నేను నిర్ణయించుకోవాలి.

 రాక్షసుడు, దేవుడు అనే వారు ఎక్కడో లేరు మన జీవన విధానం లోనే ఉన్నారు. మానవుడు తన స్థాయి తగ్గించుకుని జీవిస్తే అదే రాక్షసుడు. మానవుడు తన కంటే ఉన్నతమైన లక్ష్యాలతో జీవిస్తే అతనే భగవంతుడు. చివరికి మానవుడు మన జీవన విధానంలోనే ఉన్న దేవుని వదిలి ఎక్కడెక్కడో వెతుకుతున్నాడు ఈ జీవితం ఎన్నో జన్మల పుణ్యం జీవితం అంటే  జీవించడానికే. జీవించడమే గొప్ప సాధన.

సరిగ్గా జీవిస్తే మానవత్వం వెల్లివిరుస్తుంది. గొప్పగా జీవిస్తే దివ్యత్వం కనిపిస్తుంది. జీవించడంలో ఉండే మాధుర్యాన్ని ముందుగా తెలుసుకోవాలి. జీవన సౌందర్యంలో ఉండే తాత్వికతను గుర్తించాలి. ఆటుపోట్లతో, హెచ్చు తగ్గులతో, సుఖ దుఃఖాలతో ఎలాంటి జీవితం వచ్చినా  తలవంచుకుని అనుభవించాలి. నేల విడిచి సాము చేసినట్లు జీవితాన్ని గాలికి వదిలెయ్యకూడదు. జీవితంతో చక్కటి ప్రయాణం చేస్తే సాధన శిఖరాలకు చేరినట్లే. ‘ఒక దీపం మరో దీపాన్ని వెలిగించినట్లు పదిమంది జీవితాల్లో కాంతిని నింపాలి.

అంతకంటే మనిషికి సార్థకత లేదు’ ఈ సత్యం తెలుసుకున్న మానవుడు చివరికి ఇలాంటి పనులకే పూనుకొంటాడు.. పూనుకోవాలి. ఆధ్యాత్మిక జీవితం అనేటప్పటికి సాధనలమయం అనే భావన ఉంది. పుట్టుక నుంచి మరణం వరకు  మంచి పనులే సాధన. ఏం చేస్తున్నామో ఎరుకతో చేస్తే అంతా అద్భుతమైన సాధన. లేకపోతే బతుకే అయోమయం.


జంతువు, పురుగు, పక్షి, పాము, చెట్టు... అన్నీ స్వార్థం లేక జీవిస్తున్నాయి. మరి మనమెందుకిలా?

నేను అనేది లేకుండా హాయిగా జీవించలేకపోతున్నాం..? బుద్ధి కలిగి ఉండటం మనిషికి వరం, శాపం కూడా.

చిన్న ‘నేను’ నుంచి పెద్ద ‘నేను’ వరకు సాగే అతిపెద్ద జీవనమే అత్యంత అద్భుతమైన సాధన. చిన్న నేను అర్జునుడు. పెద్ద నేను శ్రీ కష్ణుడు. అతి పెద్ద జీవనం కురుక్షేత్ర యుద్ధం. ఇది అర్థమైతే అదే అత్యంత అద్భుతమైన సాధన.

శ్రీరాముడు మనిషిగా జీవించి తన కర్తవ్యం నిర్వహించి, దేవుడిగా పేరు తెచ్చుకున్నాడు.

జీవితం అవకాశం ఇస్తుంది. దాన్ని సద్వినియోగ పరుచుకోవాలి.

కారణజన్ముడికైనా, సాదారణ జన్ముడికైనా బాధలు, కష్టాలు ఒకటే. విధిరాత మారదు. జీవితాన్ని భయపెట్టేవాడికి జీవితమే భయపడుతుంది. మనలో ఉండే అద్భుతమైన, అసాధారణమైన, అసామాన్యమైన గుణగణాలు చూసి లోకం మోకరిల్లుతుంది.


అసలు ఈ శరీరం నాదని, మనస్సు నాదని, బుద్ధి నాదని, ఎలా తెలుసుకుంటున్నాం? ఆత్మవల్లనే తెలుసుకుంటున్నాం. నాది అనే వస్తువుకు, నాకు మధ్య సంబంధం ఏమిటి? హక్కుదారుకు, వస్తువుకు మధ్య ఉండే సంబంధం. ఇది నా ఇల్లు అంటే నేను ఇల్లు కాదు. ఇంటి హక్కుదారును.  నావి అంటే అవన్నీ నేను కాదు. వాటి హక్కుదారును మాత్రమే. మరి హక్కుదారైన నేనెవరిని..?  ఈ నేను కాస్త నాది, నాకు అనే స్వార్థంతో ఉంది. హోదాలతో కూడిన పేర్లన్నీ అహంకారంతో కూడుకున్నవే.

ఆ మహోన్నతమైన ఆత్మస్థితిని, స్థాయిని ధరించగల ఒక వజ్రకవచం, ఒక అమృత కలశం కావాలి. కాబట్టే రక్త మాంస సంతులితమైన దేహాన్ని డెబ్భైరెండు వేల నాడులతో, పంచకోశాలతో, వాయువులతో, ఇరవైతొమ్మిది తత్వాలతో, ఆధ్యాత్మిక హృదయంతో (కుడివైపున ఉంటుంది), మేరు దండంతో, దానిలోని షట్ చక్రాలతో, ఇడా పింగళ సుషుమ్ననాడులతో, సహస్రార కమలంతో అత్యున్నతంగా, పరమోత్కృష్టంగా అలంకరించాడు భగవంతుడు. వాటన్నింటినీ కాపాడేందుకు, సమన్వయం చేసేందుకు రుధిరం, మజ్జ, అస్థులు, నేత్రాలు, చక్రాలు,జిహ్వ... ఒకటేమిటి అంగుళమంగుళాన ఒక అధిష్ఠానదేవత. అంటే ఆత్మ శాశ్వతం అయినప్పుడు, ఎవరూ సృజించనిదైనప్పుడు దాని ఉపాధి అయిన శరీరాన్నిమాత్రం మరెవరో సృష్టించారా? ఆలోచిద్దాం... సాలెపురుగు తన చుట్టూ తన రక్షణ కోసం తానే అందమైన, భద్రమైన గూడు అల్లుకుంటుంది. అవసరం తీరిపోయాక ఆ గూడును మళ్ళీ తనలోకే లయం చేసుకుంటుంది. ఆత్మ అవధానమూ అంతే. అమృతాత్మ స్వరూపుడైన మానవుడు ఒక్కసారి కుబుసంలా తన దేహకోశాన్ని విస్మరిస్తే, విదిలిస్తే, వదిలేస్తే ఆత్మ కుండలిని తేజో విరాజమానం అవుతుంది. దేహం రక్షక పత్ర సమానం. సుందర సుకుమార సుమాన్ని ధరించినంత మాత్రాన అదే పుష్పమై పోదు. రక్షక పత్రాలు వాలిపోవలసిందే. రాలిపోవలసిందే. పుష్పం జగజ్జేయమానంగా వికసించి వెలిగిపోవలసిందే. మనిషి 'నేను'ను శరీరమే అనుకున్నప్పుడు, ఆ దేహభావంతో తాదాత్మ్యం చెందినప్పుడు... ఆదేహాన్ని సృజించినవాడు... అనుమానమేల... ఆభగవంతుడే. 'నేను' ఆత్మే అనుకున్నప్పుడు ఆత్మకు జనన మరణాలు లేవు. సృజన సంహారాలు లేవు. ఆత్మ శాశ్వతుడే. స్వయంభువే. ఈ సృష్టిలో ఒక శాశ్వత నియమం ఉంది. ఏ పదార్థాన్నీ ఎవరూ సృష్టించలేదు. నాశమూ చేయలేరు. ఆ శక్తి ఒక్క భగవంతుడికి మాత్రమే ఉంది. ఎవరైనా దేన్నైనా సృష్టించారంటే మరో చోటునుంచి తెచ్చుకోవటమే. నాశనం చేశారంటే మరో రూపంలోకి మార్పు చెందటమే. వాయువు నీరవుతుంది. నీరు మంచు అవుతుంది, మళ్ళీ మంచు నీరవుతుంది. నీరు వాయువవుతుంది. కేవలం మార్పు అంతే. ఉన్నదేదో ఉంది. అది పోదు.లేనిదేదీ రాదు. మనిషి కృత్రిమ 'నేను'లోంచి బయటపడాలి. స్వయంభువు జాగృతం కావాలి. మహితాత్మకం కావాలి. దానికి... ఈ శరీరంతో తాదాత్మ్యం చెందిన మనిషి సాధన (ధ్యానసాధన ) తో కొంత- దేహభావంలోంచి తొలుచుకుని ఆత్మభావంలోకి చేరుకోవాలి. నేను అసలు నేనులోకి తాదాత్మ్యం చెందితే ఇక నేను, నీవు, దేహం, సృజన, మరోటీ మరోటీ... ఏదీ లేని శుద్ధాత్మ. అంతే


సేకరణ. మానస సరోవరం 👏

నీవెవరివో నువ్వు కనుక్కో pdf ebook - రమణ మహర్షి




నీవెవరివో నువ్వు కనుక్కో - రమణ మహర్షి pdf ebook download link

Thursday, August 4, 2022

మంచి మాట..లు(03-08-2022)

బుధవారం --: 03-08-2022 :--
ఈ రోజు AVB మంచి మాట..లు
కష్టం ఎవరూ కొనేది కాదు ఆనందం ఎవరు అమ్మేది కాదు,,జీవితం ఇచ్చే అనుభవాలే కష్టసుఖాలు,,అబద్ధం అర్థం అయినంత త్వరగా నిజం అర్థం కాదు అందుకే అబద్ధం చెప్పేవారు మంచివారు అవుతున్నారు,,, నిజం చెప్పేవారు చెడ్డవారు అవుతున్నారు,, ఒక వ్యక్తి యొక్క పరిచయం అతని ముఖంతో ప్రారంభమైనప్పటికీ అతని నిజమైన గుర్తింపు అతని మాటలు ఆలోచనలు మరియు పనుల ద్వారా మాత్రమే గుర్తించబడుతుంది .

చదువు ద్వారా సంస్కారం నేర్చుకున్న వాడు అనుభవం ద్వారా గుణపాఠం నేర్చుకున్న వాడు జీవితంలో ఎప్పటికీ ఓడిపోడు ,,,జీవితంలో అందరికీ నచ్చినట్లు బ్రతకాలి అనుకుంటే మరో జన్మలో డబ్బుగా మాత్రమే పుట్టాలి .

ఈ రోజుల్లో నిజం మాట్లాడే వారు నీచుడు అబద్ధం చెప్పేవారు ఆప్తుడు సహాయం చేసేవారు సన్యాసి,,, మోసాలు చేసేవారు మహాత్ముడు ,, నిజాయితీగా ఉండేవారు ఎప్పుడూ ఒంటరి వాడే

ఉన్నవాడు చచ్చి పోయాడని విగ్రహం పెట్టి మాల వేయడం కన్నా లేనివాడు చావకూడదు అని ఆకు వేసి అన్నం పెట్టడం మిన్న,,,నా ఆలోచన సత్యం అంటే తెలుసుకునేది.. ధర్మం అంటే ఆచరించేది..ఏది ఉంది ఏది లేదు అని చెప్పేది సత్యం,,ఏది చేయకూడదు చెప్పేది ధర్మం,,, అన్వేషించేది మనిషి,,, ఆగనిది కాలం,,,ఆకర్షించేది మనసు,,,అందనిది ఆకాశం,, అంతరించేది జీవితం,,, తోడుండేది మనం చేసిన మంచితనం

సేకరణ ✍️AVB సుబ్బారావు 🇮🇳

హిందూ వివాహం

హిందూ వివాహం

                ➖➖➖✍️

కన్యను దానం చేస్తున్నానని పలికేవాడు అగ్ని.

తథాస్తు అనే వాడు వాయువు.

దంపతులు చాలా బాగున్నారని అనే వాడు చంద్రుడు.

ఇవన్నీ నిజమే అని వంత పలికే వాడు - ఆనందించే వాడు సూర్యుడు.

సృష్టిలో దాంపత్యం అపూర్వమైనది. పవిత్ర కార్యం. ధర్మార్ధకామాదులకనువై విరాజిల్లునది.

ధర్మార్థ కామ మోక్షాలనే నాలుగు పురుషార్థాలలో ఒకటైన కామాన్ని, ధర్మ బద్ధం చేయడానికి పెద్దలు, ఋషులు ఎంచుకున్న ఏకైక మార్గం వివాహం.

ధర్మం ప్రాతిపదికగా,  అర్థం-కామం సాధించడానికి భారతీయ హిందూ సాంప్రదాయ మూల సూత్రంగా రూపొందించిన విధానం "వివాహం".

వివాహ ప్రక్రియతో స్త్రీ పురుషుల కర్తవ్య నిర్వహణా మార్గం సుగమం చేయబడింది. ఈ ప్రక్రియ భవిష్యత్ జీవిత ప్రణాళికకు మార్గదర్శిగా పనిచేస్తుంది. ఇక ఆ ప్రణాళికే అతి పవిత్రమై, సమాజానికి మేలు చేసే దిశగా అనుక్షణం దంపతుల కర్తవ్యాన్ని గుర్తుచేస్తుంటుంది. 

వివాహానికి మరో పేరు "పరిణయం". దీనిని అసలు "పరిణయనం" - "పరి-నయనం" అనికూడా అంటారు.

వధూవరులిద్దరు ఒకరి దృష్టిలో మరొకరు పడి, భవిష్యత్ దంపతులుగా, కష్ట-సుఖాలను సమంగా పంచుకుంటూ, జీవితాంతం కలిసి - మెలిసి వుందామని - వుంటామని కంటి సైగల ద్వారా తెలియపర్చుకోవడమే పరిణయం.

వధూ-వరులను కళ్యాణవేదికపై, తూర్పు-పడమర ముఖంగా కూచోబెట్టి, మధ్య ఉత్తర-దక్షిణ ముఖంగా తెరను అడ్డం పెట్టి, ఇరువురి చేతికి "జీల కర్ర- బెల్లం" కలిపిన ముద్దను ఇస్తాడు పురోహితుడు. 

మొదట…

పెళ్ళిచూపుల కార్యక్రమం పూర్తి అయిన పిదప, అమ్మాయి-అబ్బాయిల జాతకాలను అనుసరించి జ్యోతిష్యంలో అనుభవమున్న పండితులతో పెళ్ళికి తగిన ముహూర్తం నిర్ణయించబడుతుంది. వారు నిర్ణయించిన ముహూర్తానికి వరుడు-వధువు ఒకరి తలపై ఇంకొకరు "జీలకర్ర-బెల్లం" పెట్టడం జరుగుతుంది. నిజానికిదే సుముహూర్తం (జీల కర్ర-బెల్లం శిరస్సుపై వుంచడం). మంగళ వాయిద్యాలు మోగిస్తుంటే, పురోహితుడు మంత్రాలు చదువుతుంటే, గౌరీ దేవిని ధ్యానించుకుంటూ వధువు, వరుడు ఏక కాలంలో నిర్ణయించిన ముహూర్తానికి ఒకరి శిరస్సు మీద మరొకరు (బ్రహ్మ రంధ్రం మీద) జీలకర్ర-బెల్లం కలిపిన ముద్దను వుంచుకుంటారు. 

సుముహూర్త కాలంలో పెద్దల ఆశీర్వాదాన్ని పొందుతారు. పురోహితుడి తర్వాత, తల్లి-తండ్రులతో మొదలయ్యి, పెద్దలందరూ అక్షితలు చల్లుతారు దంపతులు మీద.

జీల కర్ర-బెల్లం ముద్దను వధూవరులు పెట్టుతున్న సమయంలో, పురోహితుడు చదివిన మంత్రానికి....

"వరుణుడు, బృహస్పతి, మీకు శాశ్వతమైన స్థానాన్ని ఇచ్చెదరు గాక ! అగ్ని, దేవతలు మిమ్ములను దీవించెదరు గాక ! పంచభూతాలు స్థిరంగా వుండు గాక ! ఈ సుముహూర్తం మీకు శుభ ముహూర్తం అగుగాక !" అని అర్థం వస్తుంది. 

జీలకర్ర-బెల్లం మిశ్రమంలో పరస్పరాకర్షణ వుంటుందని మన పెద్దలు చెప్పడమే కాకుండా, శాస్త్రజ్ఞులు కూడా అంగీకరించారు. 

ఇక,  వధూవరులమైన మేమిద్దరం, ఆ తర్వాత, సకల దేవతలకు నమస్కరించి, "నూతన దంపతులమైన మా ఇరువురి ప్రేమానుబంధం చాలా గొప్పది. మా బంధాన్ని పితృదేవతలు కూడా ఆశీర్వదించారు. వారి ఆశీస్సులతోనే మేం భార్యా-భర్తలం అయ్యాం. ఈ శుభ సమయంలో బంధువులైన మీరందరూ ఆనందంగా వుండండి. వధువు బంధువులు కొద్దిగా మానసిక ఆందోళనకు గురికావడం సహజమే" అని మంత్రాల ద్వారా పురోహితుడు అనిపిస్తాడు. 


ఇక ఇక్కడినుంచి మాంగల్య ధారణ తంతు మొదలవుతుంది.

వివాహం అయినప్పటి నుంచీ, మహిళలు "మంగళ సూత్రం" ధరించడం భారతీయ సంప్రదాయం - హిందువుల ఆచారం. ఈ ఆచారం ఈనాటిది కాదు. పెళ్ళి నాడు వరుడు వధువుకు తాళికట్టే సాంప్రదాయం అనాదిగా వస్తున్నది. 

మంగళ సూత్రం అనే శబ్దం సంసృతం నుండి పుట్టింది. సంసృతంలో 'మంగళ' అంటే శోభాయమానం అని, శుభప్రదం అనీ అర్ధాలున్నాయి. సూత్రం అంటే తాడు ఆధారమైందని అని అర్థం.

సాధారణంగా మంగళసూత్రాన్ని సన్నని పోగులు, దారాలు కలిపి దానికి పసుపు రాసి తయారు చేస్తారు. ఇలా కలపబడిన తొమ్మిది లేదా పదకొండు దారాలతో (లేదా ఎవరెవరి ఆచారం ప్రకారం వారి పద్ధతిలో) తాళిని తయారు చేస్తారు. మంగళసూత్ర ధారణకు ముందు, మేనమామ గారు పెట్టిన "మధు పర్కం చీరె"ను, వధువుతో ధరింపచేస్తారు. వధూవరులు ఇద్దరూ మధుపర్కధారణతో మంగళసూత్ర ధారణ కార్య క్రమానికి సిద్ధమవడం ఆచారం.

సమస్త శుభాలకు, మంగళప్రదమైన కర్మలకు నిలయమైంది కాబట్టి, దీనికి, మంగళ సూత్రం అని పేరొచ్చింది. మంగళ సూత్రాలకు గౌరీ దేవి అనుష్టాన దేవత. దీన్నే "శతమానములు" అని కూడా అంటారు. బంగారంతో చేయబడ్తాయివి. రెండు సూత్రాలలో (శత మానములు) ఒకటి అత్తింటి వారు, ఇంకోటి పుట్టింటి వారు చేయించడం ఆచారం. మంగళ వాయిద్యాలు మారుమోగుతుంటే, పురోహితుడు "మాంగల్యం తంతునానేనా మమజీవన హేతునా ! కంఠే బద్నామి సుభగే త్వం జీవ శరదాం శతం !!" అని చదువుతుంటే, వరుడితో మంగళ సూత్రాన్ని, వధువు మెడలో ధారణ చేయించుతారు, పురోహితుడు  మూడు ముళ్లు వేయమంటారు. 

మూడు ముళ్లంటే, మూడు లోకాలకు, త్రిమూర్తులకు, సత్వ-రజ-తమో గుణాలకు సంకేతం.

చదివిన మంత్రానికీ అర్థముంది-

"ఓ సుందరీ ! ఈ మంగళ సూత్రాన్ని, నీ మెడలో కడుతున్నాను. ఇది సౌభాగ్యాన్ని కలిగిస్తుంది. నా జీవితం దీనిపైనే ఆధారపడి వుంది. నీవు శతాయుర్ధాయం కలదానివిగా వుండు" అని. 

మంగళ సూత్ర ధారణ అవుతూనే వేద పండితులు ఆశీర్వదించుతారు.

"శతమానం భవతి, శతాయుః పురుషశ్శతేంద్రియే !" అనే మంత్రాన్నీ చదువుతారు. అందుకే, వీటికి "శత మానములు" అని పేరొచ్చింది.

పుట్టినింటికి, మెట్టినింటికి గౌరవ మర్యాదలు-పరువు ప్రతిష్టలు స్త్రీల వలనే లభిస్తాయి. పుట్టింట్లో పెరిగి, అత్తగారింటికి చేరి, బరువు-బాధ్యతలు స్వీకరించిన స్త్రీకి పుట్టిల్లు-అత్త గారిల్లు రెండు కళ్ల లాంటివి. ఉభయ వంశాలకు మంచి కీర్తిని చేకూర్చి పెట్టగలను అని తెలియ చేసేందుకే రెండు సూత్రాలను మహర్షులు నిర్ణయించారని హిందువుల నమ్మకం. 

భర్త సుఖ దుఃఖాలు తనవేనని, పుట్టింటి-అత్తింటి వారి మంచి-చెడులు తనవేనని, ధర్మమోక్షాలు-అర్థకామాలు తన సంబంధం ద్వారా భర్తకు లభింప చేయనున్నానని, సంపదకు-సంతానానికి తనే కారణమవుతాననే విషయాలు ఎల్లవేళలా గుర్తుండే విధంగా ప్రవర్తించడానికి మంగళ సూత్రాలను వధువు ధరిస్తుందని హిందువుల నమ్మకం.

మాంగల్య ధారణ అనంతరం అత్యంత కోలాహలంగా-ఇరువైపు బంధుమిత్రుల మధ్య పోటీలాగా జరిగే తంతు వధూ-వరులు "తలంబ్రాలు" పోసుకోవడం. 

ఎందుకంటే, వధూవరులుతో పాటు, బంధుమిత్రులకు కూడా చక్కటి వినోదాన్ని-ఆనందాన్ని కలిగించే కార్యక్రమం ఇది. మంగళసూత్ర ధారణ పూర్తైన తరువాత తలంబ్రాల అక్షతలు తల మీదుగా పోసుకోవడం హిందూ సాంప్రదాయం. దీనిని అక్షతా రోహణం అని కూడా అంటారు కొందరు. 'క్షత' అంటే విరుగునది - 'అక్షత' అంటే విరగనిది. అంటే, "వివాహ బంధం" విడదీయరాని బంధం కావాలని భావం. 

"తలన్+బ్రాలు" అంటే తల నుండి క్రిందికి జారేవి అని కూడా అర్థం. అర్థాలు ఏవైనా, ఇదొక ఆనందప్రదమైన ఆచారం. వధూవరుల గృహస్థాశ్రమ జీవితం శుభప్రదంగా, మంగళప్రదంగా వుండాలని "మంగళ ద్రవ్యాలతో" చేయించే పవిత్రమైన వైదిక ప్రక్రియ ఇది.

పసుపు-బియ్యం-నెయ్యి-ఆవు పాలు అనే మంగళ ద్రవ్యాలతో ఈ తంతు జరిపిస్తారు.

కన్యను దానం చేస్తున్నానని పలికేవాడు అగ్ని. తథాస్తు అనే వాడు వాయువు. దంపతులు చాలా బాగున్నారని అనే వాడు చంద్రుడు. ఇవన్నీ నిజమే అని వంత పలికే వాడు-ఆనందించే వాడు సూర్యుడు.

ఇవన్నీ అర్థం వచ్చే రీతిలో పురోహితుడు చెపుతున్న మంత్రాల మధ్య, వరుడి చేతితో కొబ్బరి చిప్పలో తీయించిన తలంబ్రాలు వధువు తలపైన మొదట పోయిస్తారు. "నీవలన నాకు సంతానం అభివృద్ధి చెందుగాక" అని వరుడితో అనిపించుతారు. దానికి వధువు సమాధానం చెప్పకుండా, అంగీకార సూచకంగా, పురోహితుడు చెప్పిన పద్ధతిలో, వరుడి లాగనే తలంబ్రాలు తీసుకొని, వరుడి శిరస్సుపై పోస్తుంది. మొదటిసారి అలా పోస్తున్నప్పుడు, "పుట్టబోయే సంతానానికి పాల కొరకు" అన్న అర్థం వచ్చే రీతిలో, "నా పశు సంపద అభివృద్ధి చెందుగాక" అని వధువుతో అనిపించుతారు. దీనికి అంగీకార సూచకంగా వరుడు తలంబ్రాలు పోయాలి. ఇలా మూడు పర్యాయాలు ఇలాంటి అర్థస్ఫూర్తిగల మంత్రాలు చదువుతుంటే, వధూవరులు తలంబ్రాలు పోసుకుంటారు. చివరికి అదొక పోటీలాగా ఒకరి శిరస్సుపై మరొకరు పోసుకోవడం ఇటీవలి కాలంలో ఆచారంగా మారింది. తలంబ్రాల పళ్లెం ఎత్తి శిరస్సుపై కుమ్మరించడం కూడా పరిపాటై పోయింది. 

ఈ తంతు ముగిసిన తర్వాత, "బ్రహ్మ ముడి" వేడుక జరుగుతుంది. వధువు చీరె కొంగు అంచును, వరుడి ఉత్తరీయం అంచుకు కలిపి ముడివేస్తారు. బ్రాహ్మణుల ఆశీర్వచనాలను దంపతుల కొంగులలో ముడి వేయడం అనే భావన వుందిందులో. ఇకనుంచి, ఇరువురు కలిసి-మెలిసి అన్ని కార్యక్రమాలు నిర్వహించాలని, "ఇంటి యజమానురాలు" గా అన్ని బాధ్యతలు స్వీకరించి, నీ ఇంటిని నువ్వే చక్కదిద్దు కోవడానికి రమ్మని, వేద మంత్రాల ద్వారా వధువుని కోరుతాడు వరుడు.✍️

🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

అసలైన ఆనందం ..మన లోనే ఉంది.

🕉హరి ఓం 🙏 శ్రీలత    ✍️ సేకరణ: శుభోదయం.. .  అసలైన ఆనందం ..మన లోనే ఉంది.   

  • బయటి ప్రపంచంలో ఎంత సాధించినా ఎన్ని సాధించినా మరుక్షణమే అవి పాతబడిపోయి సాధించినప్పుడు ఉన్న ఆనందం మరుక్షణమే కనుమరుగైపోతుంది. అంతలా మన చుట్టూ ఉండాల్సిన వాటికంటే ఎక్కువ ఉన్నాయి. అందుకోవాల్సిన వాటికంటే ఎక్కువ అందుబాటులో ఉన్నాయి. ఫలితం వెంటనే మొహం మొత్తేస్తుంది.    
  • ఇది సాధిస్తే నా జీవితం ధన్యం అనుకుని దానికోసం తీవ్రంగా శ్రమించి సాధిస్తే తీరా మరుక్షణమో లేక మరోకరోజో మరొక లక్ష్యం వచ్చి చేరుతుంది. ఇలా ఎన్నో లక్ష్యాలు ధన్యం అయినట్టే అనుకున్నవి. కాని ఎన్ని సాధించినా వాటి ఆనందం ఈరోజు ఉందా! ఉందా! అంటే లేదనే చెప్పాలి.    
  • ఎందుకంటే అసలైన ఆనందం మనలోనే ఉంది. ఇది ఎలా తెలుసుకోవడం?   
  • ఏదైనా ఉంటేనే కనబడుతుంది. లేకపోతె లేదు. ఇదే కదా సూత్రం. అలానే నీలో ఉన్న భావతరంగాలు అంటే సంతోషం, దుఖం, ఆనందం, బాధ సుఖం, ఇవన్ని నీలోనే ఉన్నాయి. అవి సందర్భాన్ని బట్టి ప్రకటితమౌతున్నాయి. వస్తువే లేకపోతేతీసుకోవడానికి ఏమి ఉండదు. ఈ భావాలు నీలో నిగూఢంగా ఉన్నాయి కనుక ఆయా సందర్భాలను బట్టి అవి వ్యక్తమవుతున్నాయి.   
  • సాధారణంగా అనారోగ్యం వస్తే మందులు వేసి ఆరోగ్యం బాగుచేశామని చెప్తారు. నిజానికి ఆరోగ్యం ఉంది. మందు వేసింది అనారోగ్యానికే. వ్యాధి నయం చేశారు అంతే. ఆరోగ్యం చెడిపోవడం బాగుపడటం ఉండదు. శరీరానికి వ్యాధి వచ్చినప్పుడు ఔషదం ఇచ్చి వ్యాధి తగ్గిస్తారు.  
  • నిజానికి ఆనందం నీలో ఉంది. కాకపోతే ప్రాపంచిక వ్యవహారాలతో మనస్సుని మలినం చేసుకొని ఆనందం అంటే ప్రపంచంలో ఫలానా సాధిస్తేనే దొరుకుతుంది అనే ఒక భ్రమలో పడిపోయారు. ప్రపంచంలో ఏమీ లేదు. ఉన్నదంతా నీలోనే ఉంది. ప్రపంచాన్ని చూసి ఇలా ఉంటే సుఖం, ఇలా ఉంటే దుఃఖం, ఇలా ఉంటే సంతోషం, ఇది సాధిస్తే ఫలానా అని లోనే కొలువై ఆనందానికి దూరంగా వెళ్ళిపోతున్నారు 

భగవంతునికి నీవు ఎంత దూరంలో వుంటే, భగవంతుడు నీకు అంతే దూరంలో ఉంటాడు. – రమణ మహర్షి.

 అరుణాచల శివ 🙏🏻

🔹🔸🔹🔸🔹🔸🔹

భగవంతునికి నీవు ఎంత దూరంలో వుంటే, భగవంతుడు నీకు అంతే దూరంలో ఉంటాడు. – రమణ మహర్షి.

కష్టాలలో ఉన్న భక్తులకు భగవంతుడు ఎప్పుడూ తోడుగానే ఉంటాడు. మనిషి చేయవల్సినదంతా పరమేశ్వరునిపై నమ్మకం కలిగి ఉండడమే, మాధవా, మధుసూదనా అని మనసులో తలిస్తే చాలు భక్తులను కటాక్షిస్తాడు నారాయణుడు. తల్లీ, తండ్రి నారాయణుడే, గురువు, చదువు నారాయణుడే, యోగం, యాగం నారాయణుడే. ముక్తి దాత నారాయణుడే. 

కష్టాలలో ఉన్న భక్తులను ఆదుకోవడానికి శ్రీహరి ఎన్నడూ ఆలస్యం చేయడు. జాతి బేధాలు మనుషులకే కానీ పరమేశ్వరుడికేలా!!!

నారాయణుడికి పరామభక్తుడైన ప్రహ్లాదుడు రాక్షస రాజు హిరణ్యకశిపుని పుత్రుడు. హిరణ్యకశిపుడు నారాయణుడినే అంతం చేయాలనీ పట్టుబట్టినవాడు, మునులను, దేవతలనూ, ఋషులనూ అనేక విధాలుగా బాధించాడు. కన్నబిడ్డను సైతం హతమార్చాలనుకున్న హిరణ్యకశిపుని అంతం చేయడానికి నృసింహ అవతారమెత్తాడు శ్రీహరి. బ్రహ్మ ఇచ్చిన వరంతో తనకు చావులేదని గర్వంతో ఉన్న హిరణ్యకశిపుణ్ణి మనిషి కాకుండా, మృగము కాకుండా, నరసింహ అవతారమునెత్తి పగలూ కానీ, రాత్రి కానీ సంధ్య సమయమున, ఇంటిలోనూ కాకుండా, బయటనూ కాకుండా గడప మీద ఏ ఆయుధమూ లేకుండా చేతి గోళ్ళతో పొడిచి హతమార్చాడు. భక్తితో శ్రీహరిని స్తుతించిన ప్రహ్లాదుని రక్షించాడు.

భగవంతుని లీల ఏమిటంటే నారాయణుడిని అంతగా ద్వేషించి, శ్రీహరిని అంతం చేయాలనుకున్న హిరణ్యకశిపుడు సైతం ముందు జన్మలో హరి భక్తుడే.

 దేవతలకే అర్ధం కానీ నారాయణుడి లీలలు మనిషికి ఎలా అర్ధం అవుతాయి? తాను ఏ పని చేసినా ఏ అవతారమెత్తినా అది లోకకళ్యాణార్థమే. దుష్ట శిక్షణకు, శిష్ట రక్షణ కోసమే నారాయణుడి దశావతారాలు. 

సంసార సాగరాన్ని సులభంగా దాటడానికి భగవంతుని సేవ సులభమైన నావ. సుఖదుఃఖాల్లో మనసులో దైవ చింతన ఎల్లప్పుడూ మనల్ని రక్షిస్తూనే ఉంటుంది. 

ఆ రక్షణ ఏ రూపంలోనైనా కావచ్చు. మనిషి రూపంలో, గాలి, నీరు, పంచభూతాలు ఇలా ఏ రూపంలోనైనా మనల్ని నిరంతరం రక్షించేది ఆ భగవంతుడే.....

🔹🔸🔹🔸🔹🔸 

మనుషులు కూడా అంతేనోయ్... కనిపించని బంధాలేవో మనల్ని ఇక్కడే కట్టేసినట్టు వ్యవహరిస్తాం... కదలం, ఉన్నచోటు వదలం... నిజానికి అవన్నీ భ్రమాత్మక బంధాలు... అవేమీ లేవనే నిజం తెలిస్తే చాలు... ప్రపంచమంతా నీదే...

 ఓ రైతు తన మూడు గాడిదలను అమ్మేయడానికి అంగడికి తీసుకెళ్తున్నాడు... మార్గమధ్యంలో ఓ నది కనిపించింది... అసలే నడిచీ నడిచీ ఒళ్లంతా చెమట చిటచిట... స్నానం చేస్తే పుణ్యం, శుభ్రత రెండూ దక్కుతాయని అనుకున్నాడు... 

ఆ గాడిదల్ని కట్టేయడానికి తన దగ్గర రెండే తాళ్లున్నాయి... మరి మూడో గాడిదను కట్టేయడం ఎలా..?

ఓ సన్యాసి అలా నడిచిపోతున్నాడు... తనను పిలిచాడు... స్వామీ, నీ దగ్గర ఓ తాడు ఉంటే ఇవ్వవా...? కాసేపు నా గాడిదను కట్టేస్తా, నా స్నానం కాగానే నీ తాడు నీకు తిరిగి ఇచ్చేస్తా...

నా దగ్గర తాడు లేదు కానీ ఓ ఉపాయం చెబుతాను అన్నాడు ఆ సాధువు...

నీ దగ్గర ఉన్న తాళ్లతో ఆ రెండు గాడిదలను కట్టెయ్... మూడోది చూస్తూనే ఉంటుంది... తరువాత దీని వెనక్కి వెళ్లి తాడుతో చెట్టుకు కట్టేస్తున్నట్టు నటించు...

సాధువు చెప్పినట్టే చేశాడు... నదీస్నానం పూర్తిచేశాడు... వెనక్కి వచ్చి ఆ రెండు గాడిదల కట్లు విప్పేశాడు... అదిలించాడు, తను ముందు నడుస్తున్నాడు... కాసేపయ్యాక చూస్తే రెండు తనతో వస్తున్నాయి కానీ మూడో గాడిద మాత్రం ఆ చెట్టు దగ్గర నుంచి అస్సలు కదలడం లేదు...  అక్కడే ఉండిపోయింది... 

తట్టాడు, కొట్టాడు, తిట్టాడు... ఊహూఁ... ఫలితం లేదు... అటూఇటూ చూస్తుంటే అదే సాధువు కనిపించాడు... స్వామీ, స్వామీ, ఇది మొరాయిస్తోంది, కదలనంటోంది...

అసలు నువ్వు కట్లు విప్పితే కదా, అది కదిలేది... అన్నాడు సాధువు...

అసలు నేను కట్టేస్తే కదా విప్పేదిా... అంటాడు రైతు...

అవునోయీ, అది నీకు తెలుసు, నాకు తెలుసు, ఆ గాడిదకు తెలియదు కదా... తను ఇంకా కట్టేసి ఉన్నట్టే భావిస్తోంది... 

అయ్యో, మరేం చేయాలిప్పుడు..?

కట్లు విప్పితే సరి... కదులుతుంది... 

అసలు కట్టేస్తే కదా... విప్పేది... 

పిచ్చోడా... కట్టేసినట్టు ఎలా నటించావో, విప్పేసినట్టు కూడా నటించవోయ్... 

రైతు అలాగే చేశాడు... గాడిద ముందుకు కదిలింది, మిగతా రెండింటితో కలిసింది... రైతు సాధువు వైపు అయోమయంగా చూశాడు... 

‘‘మనుషులు కూడా అంతేనోయ్... కనిపించని బంధాలేవో మనల్ని ఇక్కడే కట్టేసినట్టు వ్యవహరిస్తాం... కదలం, ఉన్నచోటు వదలం... నిజానికి అవన్నీ భ్రమాత్మక బంధాలు... అవేమీ లేవనే నిజం తెలిస్తే చాలు... ప్రపంచమంతా నీదే...

అర్థమయ్యీ కానట్టుగా ఉంది... అవును, మరి తత్వం, సత్యం ఎప్పుడూ సంపూర్ణంగా అర్థం కావుగా... రైతు కాసేపు బుర్ర గోక్కున్నాడు... సాధువుకు ఓ దండం పెట్టి తన గాడిదల వైపు కదిలాడు.😐😐😐🙏

మనసును ఆత్మభావం నుండి దూరంచేసే దేహాత్మబుద్ధికి కారణం ఏమిటి ?

 🙏🕉🙏                    ...... *"శ్రీ"*


                 💖💖💖

       💖💖 *"297"* 💖💖

💖💖 *"శ్రీరమణీయం"* 💖💖

     

*"మనసును ఆత్మభావం నుండి దూరంచేసే దేహాత్మబుద్ధికి కారణం ఏమిటి ?"*

*************************


*"ఇంద్రియాలే ! మనలోని ఆత్మ పరిపూర్ణ శాంతితోనే ఉంటుంది. కానీ మన మనసు ఆ ఆత్మ శాంతిని పొందలేక పోతుంది. అందుకు కారణం ఇంద్రియాలు అందించే అనుభవాలు. అవే మనసు ఆత్మభావన నుండి దూరంచేసి శరీర భావన కలిగిస్తున్నాయి. కళ్ళు, ముక్కు, చెవులు, చర్మం, నాలుక అనే ఐదు బాహ్యేన్ద్రియాలు. ఇది మనకు రూపాన్ని, వాసనను, శబ్దాన్ని, స్పర్శను, రుచిని అందించే పరికరాలు. మన శరీరానికి కష్టసుఖాలు, మనసుకు సంతోష, దుఃఖాలు కలిగేది ఈ ఇంద్రియాల వల్లే ! మనం నిద్రించేటప్పుడు ముందుగా బాహ్యేన్ద్రియాలు సద్దుమణిగి అంతరేంద్రియాల భావన మిగిలి ఉంటుంది. అదే కొంతసేపు స్వప్నంగా నిలిచి ఉంటుంది. ఆ తర్వాత గాఢనిద్రలో ఇంద్రియాలు పూర్తిగా అణిగి ఉంటాయి. అక్కడ ఏ భావనలేని శాంతి స్థితి మాత్రమే ఉంటుంది. ఇది ప్రతి ఒక్కరికీ అనుభవం లోనిదే !ఈ శాంతిని నిత్యజీవితంలో కూడా సాధించటమే ఆధ్యాత్మిక జీవనం "!*


*"{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}*

           🌼💖🌼💖🌼

                 🌼🕉🌼

                

సమాజం గాడితప్పిందీ అయోమయంలో ఉన్నాం !!

 సమాజం గాడితప్పిందీ
అయోమయంలో ఉన్నాం !!

తరగతిగదిలో ముద్దుపెట్టుకుంటున్న విద్యార్థులు!
పెళ్ళిపీటలపై ముద్దులాడుకుంటున్న వధూవరులు !!
వివాహవేదికపై నాట్యం చేస్తున్న వధువు !
కల్యాణమండపంలో వధువును కొడుతున్న వరుడు!!
పబ్బులో పోట్లాడుకుంటున్న యువతీయువకులు !
నడివీధిలో నవ్వులపాలవుతున్న మద్యపాన ప్రియులు !!
పట్టపగలు ప్రాణం తీస్తుంటే పట్టించుకోని పౌరులు!
ఫోను నొక్కుకుంటూ నాకెందుకనుకుంటున్న ప్రజలు!!
ప్రియురాలిని పొడిచి చంపుతున్న ప్రియుడు !
ప్రియుడి గొంతుకోస్తున్న ప్రియురాలు!!
భార్యతో వ్యభిచారం చేయిస్తున్న భర్త !
ప్రియుడితో భర్తను చంపిస్తున్న భార్య!!
నెలలపిల్లను నేలకేసి కొడుతున్న తండ్రి!
ఆడపిల్లని చెత్తకుప్పలో వేస్తున్న తల్లి !!
తల్లితండ్రులను తరిమికొడుతున్న తనయులు!
ఆస్తిలేదని వెళ్లగొడుతున్న వారసులు !!
వేరేకులంవాడిని వివాహమాడిందని సోదరిని సంహరిస్తున్న సహోదరులు!
మరోమతంవారిని మనువాడాడని మట్టుబెడుతున్న బంధువులు !!
వెల్లువవుతున్న విడాకులు!
వీచేనా విలువల వీచికలు !!
పేట్రేగిపోతున్న పదవీకాంక్ష!
ఫలించేనా ప్రజల ఆకాంక్ష!!
ఆధునికత అవధులు దాటిపోతుంది!
అనుభవం పరిధులు మించిపోతుంది!!
వ్యక్తిగత స్వేచ్ఛ విశృంఖలమయ్యింది!
విశృంఖలత వెర్రి తలలు వేస్తుంది !!
అన్యాయం న్యాయం చెబుతోంది!
అక్రమాలు అంబరమంటాయి!!
నేరాలు నింగిని తాకాయి!
ఘోరాలు గొప్పలుపోతున్నాయి !!
అలుముకుంటున్న అరాచక రీతులు !
ఆందోళనకలిగిస్తున్న ఆటవికతాగమన సూచికలు!!
విశృంఖలత సోపానాలపై జీవనగతులు !
వికారం కలిగిస్తున్న వ్యవహార తీరులు!!
స్వేచ్చాజీవనమని సంబరపడుతున్నాం!
సరదాగా ఉంటున్నామని సంతోషపడుతున్నాం!!
ఆటవికత ఆవరిస్తోందని అరాచకత్వం అలుముకుంటోందని అవగతంకాని అయోమయంలో ఉన్నాం!!

మనం ప్రస్తుతం చేస్తున్న పెళ్లిళ్ళు సాంప్రదాయ బద్ధమైనవేనా ? అసలు పెళ్లి పేరుతో మనం చేసే పనులు కరెక్టేనా?

 మనం ప్రస్తుతం చేస్తున్న పెళ్లిళ్ళు సాంప్రదాయ బద్ధమైనవేనా ?


అసలు పెళ్లి పేరుతో మనం చేసే పనులు కరెక్టేనా? 

ఒక్కసారి గుండె మీద చెయ్యి వేసుకుని చెప్పండి. 

కాలంతో పాటు మన పద్ధతులు కూడా మారాలి అనే చట్టుబండ కబుర్లు కాదు.. మనస్ఫూర్తి గా చెప్పండి కరెక్టేనా? 


ముందు ప్రస్తుతం మనం చేస్తున్న పెళ్లిళ్ళకు అనుకరణలు, ఆర్భాటాలు, అట్టహాసములు మానుకోవాలి! 

కాలంతో పాటు మనం కూడా మారాలి అనే వింత పోకడ లో పెళ్లి లో మనం చేస్తున్న తప్పులు 👇

**************

👉నిశ్చయ తాంబూలానికే జంటను కలపడం,

👉పెళ్ళికి ముందే ప్రీ వెడ్డింగ్ వీడియో షూట్లు చేయటం,

👉గొప్ప కోసం ఈవెంట్స్ చేయటం,

👉ఆర్భాటంగా మండపాలు కట్టడం,

👉మెహిందీ పేరుతో,సంగీత్ పేరుతో తాగి తందనాలాడడం..

👉డిజైనర్ శారీస్ కు వేలకు వేలు ఖర్చుపెట్టడం,

👉బ్రైడల్ మేకప్పంటూ బలిసినట్టు రెచ్చిపోవడం,

👉పట్టెడన్నానికి ప్లేటు రేటు పెంచుతూ పోవటం ,ఆప్యాయత అన్న పదానికి అర్ధమే లేకుండా పోవడం.. 

👉దావత్ పేరుతో మద్య, మాంసాలను సేవించి,వికృత నాట్యాలు చేయడం, 

👉కడుపు కట్టుకుని దాచింది హారతిచేయటం,

*మధ్యతరగతి మనిషికి అవసరమా?


👉*ఒకడిని చూసి ఒకడు,

*👉ఒకడ్నిమించి ఒకడు

వెర్రెక్కి పోతున్నారు

నేటి కాలంలో.


*ఎంత తింటాడు మనిషి?

*దేంట్లో దొరుకుతుంది వినోదం?

*ఎలా చేయాలి వేడుక?

*ఎలా ఖర్చు పెట్టాలి కష్టార్జితం?

*ఏ రకంగా పెరుగుతుంది ఆప్యాయత?

*ఏది కడితే వస్తుంది హుందాతనం?

*ఏ విధంగా ఇనుమడిస్తుంది అందం?

*ఎలా పెరుగుతుంది ఆకర్షణ?

👉*ఏ విధంగా బలపడుతుంది బంధం?

ఒక్కసారి, ఆలోచించి ఆచరిస్తే,

పెళ్ళితో వస్తుంది జీవితంలోకి కళ.


*పదిమందితో పట్టెడన్నం తింటే,

*మనసు విప్పి హాయిగా మాట్లాడుకుంటే,

*కార్యం జరిగే ఇంట చేతనైనంత సాయం చేస్తే,

*సహజమైన అందానికి పెద్దపీట వేస్తే, 

*సాంప్రదాయం విధానానికి కట్టుబడి ఉంటే,

*దాచిన సోమ్ము సద్వినియోగ పడితే,

కార్యం చేసినవాడి బతుకు చీకటి కాదు. మధ్య తరగతి బతుకుల్లో వెలుగు పోదు.


*👉ముహూర్తం చూసి పారేసే కార్డుకి,

*పెళ్ళయిన వెంటనే తీసేసే పందిరికీ,

*చెమటపడితే కారిపోయే రంగుకీ,

*పెళ్ళినాడు మాత్రమే కట్టే వలువలకీ,

*నాలుగు మెతుకు తింటే నిండిపోయే కడుపుకీ,

*సరదాగా కబుర్లు చెపితే వచ్చే నవ్వుకీ,

*ఒక్కరోజులో ముగిసిపోయే వేడుకకీ,

ఉన్నదంతా ఊడ్చిపెడితే

పదికాలాలు బతకడానికొచ్చే 

కొత్తమనిషికి

తర్వాత పెట్టేది ఏమిటి?


*👉అప్పు చేసి ఖర్చుచేసే,

వెర్రితనం కాదు పెళ్ళంటే!

*ఇంటికి దీపాన్ని తెచ్చుకునే

ఇంగితమైన పని వివాహ మంటే!

*శక్తికి మించి ఎగరటం,

*అప్పుచేసి ఆర్బాటం చేయటం


*ముమ్మాటికీ తప్పు👌*.


*కళ్యాణానికి కాస్త ఖర్చు చాలు, కలిసుండటానికే కావాలి ధర్మ,అర్ధములు*. *ఇది తెలుసుకున్ననాడు ప్రతినిత్యం బ్రతుకులో శ్రీరస్తు! శుభమస్తు! అవిఘ్న మస్తు*


తెలుగు భాష ను మన ఇళ్ల లోనే వాడటం మానేశామా ?

 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼తెలుగు భాష ను మన ఇళ్ల లోనే వాడటం మానేశామా ?*

డోర్ లాక్ చెయ్యకండి, నేను వెళ్తున్నా డోర్ లాక్ చేస్కో’, ‘నా కార్ కీస్ ఎక్కడ ? ’ఇందులో ‘కీస్’ కు అచ్చ తెలుగు పదం వాడొచ్చు. కానీ మనం వాడం.

ఎందుకు ? 

ఓ ఇరవై యేళ్ళు వెనక్కి వెళితే, 

తలుపు తాళం వేసుకో, గడియ పెట్టుకో అనే వాళ్ళం. ఇవేకాదు, చిన్నతనంలో విన్న, వాడిన తెలుగు మాటలు మనమే మర్చిపోతున్నాం. నిన్న మొన్నటి వరకు మనం మాట్లాడిన మాటలు మన పిల్లల కు నేర్పించాల్సింది పోయి, మనమిలా ఎందుకు మారిపోయాం ?

మన తెలుగులో మాటలు లేవా ? 

ఎందుకు లేవు, భేషుగ్గా ఉన్నాయి !

కానీ మనం పలకం. 

వంటింటిని......కిచెన్ చేసాం. 

వసారా.....వరండాగా మారింది. 

ఇలా చావడి, పంౘ, ముంగిలి, నట్టిల్లు, తలవాకిలి, నడవ, పెరడు, ఇవన్నీ మరచిపోయాం.

మన ఇళ్ళ కు చుట్టాలు, బంధువులు రావడం మానేసారు. గెస్ట్‌ లే వస్తారు. 

ఆ వచ్చిన వాళ్ళు మనింట్లో అన్నం తినరు. ఏ లంచో, డిన్నరో చేస్తారు. 

భోజనానికి కూర్చున్నాక కంచాలు పెట్టటం మానేసి ప్లేట్లు పెడుతున్నాం. 

అందులో వడ్డించే వన్నీ.......

రైస్, కర్రీ, గ్రేవీ, ఫ్రై వగైరాలే.

అన్నం, కూర, ఇగురు, పులుసు, వేపుడు, తినండి అంటే, ఇంకేమన్నా ఉందా, వాళ్ళేమనుకుంటారో అని భయం. అంగడి (కొట్టు) కి వెళ్ళేటప్పుడు సంచి తీసుకెళ్ళం. 

బ్యాగ్ పట్టుకుని షాప్‍ కు వెళ్తున్నాము. అందులో వెజిటబుల్స్, ఫ్రూట్స్ వేసుకుంటాము. కూరగాయలు, పళ్ళు కుళ్ళిపోయున్నాయి గదా మరి.

ఏమండీ మీ మనవరాలికి కానుపు అయ్యిందా అని ఆ మధ్య ఓ పెద్దావిడను అడిగా. ఏంటమ్మా డెలివరీ అయిందా అనకుండా నువ్వింకా కానుపు అంటావేంటి ? అని ఎదురు ప్రశ్న వేసింది. బిత్తరపోవడం నావంతయింది. 

టీ.వీ లో వచ్చే ఆరోగ్య కార్యక్రమాలు, 

వంటా - వార్పు కార్యక్రమాలు రోజూ చూసే వాళ్ళ కు అలవోకగా ఆంగ్ల పదాలు పట్టుబడతాయి మరి. 

అందుకే ఆవిడ అలా అని ఉండొచ్చు. 

టీ.వీ వంటల కార్యక్రమం లో ఒకావిడ మన కు వంటకం ఎలా చెయ్యాలో చెబుతుంది. 

అది ఏ భాషో మీరే చెప్పండి. 

‘కొంచెం సాల్ట్, మిర్చీపౌడర్, ధనియాపౌడర్, జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్‍చేసి ఫైవ్ మినిట్స్ కుక్ చెయ్యలి, స్టౌవ్ ఆఫ్‍ చేసి మసాలా పౌడర్ యాడ్ చేసి బాగా మిక్స్ చెయ్యాలి.’ ఇలాసాగుతుంది. 

మరి మన కూరల కు అల్లం, వెల్లుల్లి, ఉప్పూ, కారాల రుచులు ఎలా తగుల్తాయి?

నిన్న మా పక్కింటాయన వచ్చి 

‘మా సిస్టర్స్ సన్ ది మేరేజ్ ఉందండి, ఊరికి వెళ్తున్నాం, ఇల్లు కాస్త చూస్తుండండి’ అని చెప్పి వెళ్ళాడు. 

మేనల్లుడి పెళ్ళి అనడంలో ఎంత దగ్గరితనం ఉంటుంది ? ఎందుకిలా ముచ్చటైన పదాల్ని వాడటానికి కూడ మనం వెనుకాడుతున్నాం ?

అమ్మ, నాన్న అని పిలవడం ఎప్పుడో మానేసాం. అత్త, మామ, బాబాయ్, పిన్ని, పెద్దమ్మ, పెదనాన్న 

అందరూ పోయి ఆంటీ అంకుల్ మిగిలారు. ఇప్పుడు అక్క, అన్నా, బావ, మరిది, వదిన, మరదలు వగైరాలంతా దూరమై కజిన్స్ అయిపోయారు.

పిల్లల్ని బడికి పంపడం కూడ మానేసాం. స్కూల్‍ కు పంపిస్తాం. 

సరే బడికి వెళ్ళాక వాళ్ళకు ఎలాగూ ఇంగ్లీషు లో మాట్లాడక తప్పదు. 

ఇంటి దగ్గరన్నా తెలుగు మాటలు మాట్లాడాలని అనుకోము. 

మనం ఎందుకు నిన్నటి వరకు వాడిన తెలుగు మాటలను వదిలేస్తున్నాం ? ఎక్కువ ఇంగ్లీషు పదాలు వాడితే మనకు సమాజంలో గౌరవం లభిస్తుంది అనుకుంటున్నామా ? తెలుగు మాటలు మనకు మొరటుగా ఎందుకనిపిస్తున్నాయి ? ఇది పరభాషా వ్యామోహం మాత్రమే కాదు, నాకూ ఇంగ్లీషు ముక్కలు వచ్చు, నేనేం తక్కువ కాదు అని మనకి మనం చెప్పుకోవడం, 

ఇతరులు అనుకోవాలన్న భావన.

ఇలా ఆలోచిస్తాం కాబట్టే మన తెలుగు భాషకు దిక్కులు లేకుండా పోయాయి. ఇప్పుడు మాత్రం పల్లెలు పట్టణాలు అనే తేడా లేకుండా అందరికీ ఇంగ్లీష్ మాటలు బాగా వంటపట్టాయి.

అలాగని వాడుకలో ఉన్నమాటలను వదిలేసి పరభాషా పదాలు వాడటం వల్ల భాష క్షీణించి పోతుంది. బయటకెళితే ఎలాగు తప్పదు అనుకున్నా, కనీసం ఇంటి గోడల నడుమైనా ఆపని చేద్దాం. అవసరం లేని ఆంగ్ల పదాలకు డోర్  లాక్ చేసి, అచ్చ తెలుగు మాటలకు తలుపులు తెరుద్దాం.

#ఆస్కార్ వైల్డ్ కొటేషన్లు

 #ఆస్కార్ వైల్డ్ కొటేషన్లు

నిజంగా నువ్వు ప్రేమించాలని వుంటే అది నీ కోసం కాచుకొని వుంటుంది. 

ప్రతి మనిషి దేన్నయితే ప్రేమిస్తాడో  దాన్నే చంపుతాడు.

రూపాన్ని బట్టి తీర్పు చెప్పలేని వాళ్ళు వివేచానపరులు కాదు.

ఎల్లుండి చేయదగ్గ పని రేపటి వరకు కూడా ఆపను.

ఖచ్చితమైన వ్యక్తిత్వమంటే ఎదిరించడం కాదు, శాంతి.

విద్యాభ్యాసం గౌరవనీయమే కాని ఎల్లప్పుడూ ఒకటి గుర్తుంచుకోవాలి. ఉపయోగకరమైనదేది అక్కడ బోధించరని.

ఓ మానసిక రోగికి ప్రతి వస్తువు వెల తెలుసు కాని ఏ వస్తువు విలువ తెలియదు.

పిల్లల్ని మంచివాళ్ళుగా తీర్చిదిద్దాలంటే  వాళ్లను సంతోషపెట్టడమే.

గతించిన రోజుల్ని కొనేంత ధనవంతుడు లేడు.

ఒక్కోసారి నేను అనుకుంటాను "దేవుడు మనిషిని సృష్టించడంలో తన శక్తిని ఎక్కువగా అంచనా వేసుకున్నాడు."

పురుషుడు నీతిగా ఉండటం కపటత్వం. స్త్రీ నీతిగా ఉండటం సహజం.

అతన్ని గురించి  అతను ఆలోచించడం  స్వార్ధం కాదు. అతన్ని గురించి అతడు ఆలోచించనివాడు  ఆలోచించలేనేలేడు.

ఉదయం లేవగానే నిన్న చేసిన తప్పును గుర్తు చేసుకో.ఆ తప్పు ఇక పునరావృతం కాదు.

తన తప్పుకు ప్రతివాడు పెట్టుకొనే అందమైన పేరు అనుభవం.

వాదనలు నిష్ప్రయోజనమైనవి. వాటికీ దూరంగా ఉండండి.

మంచిగా వుండటం కన్నా, అందంగా ఉండటం మంచిది. అనాగరికంగా ఉండే కన్నా మంచిగా ఉండటం మంచిది.

మనలో ఏదో కోల్పోయాం,అదే ఆశ.

చరిత్రంతా భావనల యుద్ధక్షేత్రమే.

గొప్ప ఆలోచనలన్నీ ప్రమాదభరితమైనవే.

ఓ భావన విలువ అది వ్యక్తం చేసిన మనిషి స్వచ్చతను బట్టి ఉంటుంది.

ఆవేశం మనిషిని తప్పుదారి పట్టిస్తుంది.

అతి చెడ్డపని కూడా మంచి ఉద్దేశ్యంతోనే మొదలవుతుంది.

మంచికి ఆనందపు ముగింపు, చెడుకి భాధాకర ముగింపు అదే కధకు సరైన ముగింపు.

ద్వైదీభావంగా జీవించకు,చెడ్డవాడిగా కనిపిస్తూ అన్నివేళలా మంచి పనులే చేయకు,అదే కపటమంటే.

జాతీయత కల్పన యొక్క కోరిక. 

☀

సోషల్ మీడియా నా కళ్ళు తెరిపించే వరకూ....

 *సోషల్ మీడియా నా కళ్ళు తెరిపించే వరకూ....*

గాంధీ మాత్రమే మనకు స్వతంత్రం తెచ్చాడు అనుకునే వాణ్ణి

నెహ్రూ స్వతంత్రం తర్వాత ఇండియాకు దేవుడు అనుకునే వాణ్ణి 

మొఘల్స్ చరిత్ర సృష్టించారు అనుకునే వాణ్ణి

టిప్పు సుల్తాన్ గొప్ప స్వతంత్ర యోధుడు అనుకునే వాణ్ణి

మదర్ తెరీసా అంటే నడిచే సేవా దేవత అనుకునే వాణ్ణి

కమల్ హాసన్ ఒక నట అద్భుతం అనుకునే వాణ్ణి

ఆమిర్ ఖాన్ సినిమాలు పిచ్చిగా అభిమానించే వాణ్ణి

కేజ్రీవాల్ ఒక నూతన శకానికి ప్రారంభం అనుకునే వాణ్ణి

చంద్రబాబు నాయుడుని మనసంతా నింపుకునే వాణ్ణి

అమర్త్య సేన్ మన దేశానికి వన్నె తెచ్చాడనుకునే వాణ్ణి

మలాలా యుసుఫ్జాయ్ ఒక పోరాట ధీశాలి అనుకునే వాణ్ణి

బర్ఖ దత్ జర్నలిస్ట్ వృత్తిలో ఒక వజ్రం అనుకునే వాణ్ణి

మేధా పాట్కర్ గొప్ప సమాజ సేవిక అనుకునే వాణ్ణి

గురు పూర్ణిమ అంటే బురిడీ బాబానే అనుకునే వాణ్ణి

అక్టోబర్ రెండు అంటే గాంధీని మాత్రమే తలుచుకునే వాణ్ణి

నవంబర్ 14 అంటే పిల్లల దినోత్సవం అని గుడ్డిగా నమ్మే వాణ్ణి

హిందూ ముస్లిం భాయ్ భాయ్ అని అనుకునే వాణ్ణి

🙄🙄😃😃😃😃😃🙄🙄

Thanks to Social Media, I am now what I should have been long black... which is :

Anyone knows upto 10th table, From 11th to 99th, any table, very easy!

 *Very interesting*.... 
Upto which number do you know your  tables? 
At least Upto 10, awesome! 
You have crossed the mountain! 😀😁🙂
Don't worry for the rest of the tables! 
From 11th to 99th, any table,  very easy! 
I didn't know this. Because this vedic mathematics was not taught to us in school of this secular country! 
How to write Table of any two digit number?
For example Table of  *87*
First write down *table of 8 then write down table of 7 beside it*
08     0 7   (08+0)       87
---------------------------
16     1 4   (16+1)   174
24     2 1   (24+2)     261
32     2 8   (32+2)     348
40     3 5    (40+3)    435
48     4 2   (48+4)     522
56     4 9   (56+4)     609
64     5 6   (64+5)     696
72     6 3   (72+6)     783
80     7 0   (80+7)     870
Now table of 38
03      0 8     (3+0)        38
06      1 6     (6+1)        76
09      2 4     (9+2)     114
12      3 2    (12+3)    152
15      4 0    (15+4)    190
18      4 8    (18+4)    228
21      5 6    (21+5)    266
24      6 4    (24+6)    304
27      7 2    (27+7)    342
30      8 0    (30+8)    380
33      8 8    (33+8)    418
36      9 6    (36+9)   456
Now table of 92
 09      02      (09+0)        92
 18      04      (18+0)      184
  27     06      (27+0)      276
  36     08      (36+0)     368
  45    10       (45+1)     460
  54    12       (54+1)     552
  63    14       (63+1)     644
  72    16       (72+1)    736
  81    18      (81+1)     828
  90     20      (90+2)     920
  99     22      (99+2)   1012
108    24    (108+2) 1104
This way one can make Tables from 10 to 99
Share this intelligence booster.
The brilliance of our country is full of unthinkable treasures! In olden times in all schools, Gurus (teachers) used to teach children maths in Vedic way until the Britishers and other anti forces washed it away. 
This is our Vedic Mathematics!!.
If you share with your children,  friends, family they will know the Indian culture.....
🙏💐🙏
Incredible India...

మానవులుగా బతకటం కాదు.మానవత్వంతో బతకాలి.

 *జనరల్ బోగీలో వెళ్ళినా, ఫస్ట్ క్లాస్ లో ప్రయాణించినా స్టేషన్ రాగానే*—ఒకేసారి దిగిపోతారు 

*పక్కనెంత మందున్నా, ఎంత సంపదున్నా ఏంటి ?30 లక్షల కారైనా, 3 వేల సైకిలైనా రోడ్డు ఒకటే.. పదంతస్తుల మేడైనా, పూరిగుడిసైనా*—వదిలేసే పోవాలి !

*ఇద్దరు కొట్టుకుంటే.. ఒక్కరే గెలుస్తారు. రాజీపడితే...*—ఇద్దరూ గెలుస్తారు 

ఐకమత్యం అంటే మనం కుక్కమీద రాయి విసిరితే కుక్కపారిపోతుంది. అదే.. తేనెతుట్టి మీద విసిరితే మనమే పారిపోవాలి

దేవుడి కోసం తీర్ధాలు, పుణ్య క్షేత్రాలంటూ తిరుగుతావ్, ఆయనెక్కడో లేడు. శ్వాస తీసుకుంటూ సృష్టితో నువ్వేసుకున్న 'లంకె'లోనే వున్నాడు.

కష్టమొస్తే భగవంతుణ్ణి కొలుస్తావు. ఆయన నీకు రాబోయే కష్టాన్ని ఆపడు. నిత్యం స్మరిస్తే కొండంత కష్టాన్ని గోరంత చేసి, సులువుగా దాటే శక్తి నీకిస్తాడు. కష్టాలు కుంభవృష్టిలా నిన్ను ముంచేస్తే... నీకు గొడుగుపట్టి కాపాడతాడు... గుర్తుంచుకో 

కొబ్బరిచెట్టు పెరిగే కొద్దీ పాత మట్టలు రాలిపోతాయి. జ్ఞానం కలిగే కొద్దీ తన పర భేదాలు తొలగి పోతాయి.

పుండు మానితే పొలుసు అదే పోతుంది. పుండు మానకుండానే పొలుసు పీకేస్తే… పుండు తీవ్రమై రక్తం కారుతుంది జ్ఞానసిద్ధి అంచెలంచెలుగా కలగాలి. ఆత్రపడితే లాభం లేదు !

సముద్రమంత సమస్యొచ్చిందని దిగులుపడకు. ఆకాశమంత అవకాశం కూడా వుంది. తలెత్తి చూడు ముందు. నీపై నీకు నమ్మకం కావాలి.

నీపై నమ్మకం నీకు బలం. నీపై అపనమ్మకం అవతలివారికి బలం !నీ బలం ఎవరికీ తెలియక పోయినా నీవు బ్రతికేయవచ్చు.. నీ బలహీనత మాత్రం ఎవరికీ తెలియనివ్వకు నిన్ను నిన్నుగా బ్రతకనివ్వరు !

మరణం అంత మధురమైనదా ? ఒక్కసారి దాన్ని కలిసిన వారు వదిలిపెట్ట లేరు ?ప్రకృతికి కూడా అదంటే ఎంత పక్షపాతం ! ప్రాణం పోయిన జీవుల్ని నీళ్ళలో తేలుస్తుంది. ప్రాణమున్న జీవుల్ని నీళ్ళలో ముంచుతుంది 

నీ పరిసరాలనెంత శుభ్రంగా వుంచినా నీకు అనారోగ్యం రావచ్చు. బుద్ధి అనే ఆసుపత్రిలో ఆలోచనలు అనే వైద్యుడు నీ రోగాలను తగ్గించగలడు. వాటిని ఆరోగ్యంగా వుంచుకో._

వెంటరాని ఇంటిని, ఒంటిని రోజూ కడుగుతావ్.. నీవెంట వచ్చే మనసునెప్పుడు కడుగుతావు ?

నిజాయితీపరులు సింహం లాంటి వాళ్ళు. సింహం కూర్చోటానికి సింహాసనమెందుకు ? అదెక్కడ కూర్చుంటే అదే సింహాసనం. నిజమైన నిజాయితీపరులకు గుంపు అక్కర్లేదు !


ముని-మహర్షి-తపస్వి-యోగి.. వీరు వేరు వేరు._
మౌనంగా వుండేవాడు ముని._
నియమ నిష్టలతో తపింప చేసుకునే వాడు తపస్వి._ 
అతీంద్రియ శక్తుల్ని ఆకళింపు చేసుకున్నవాడు ఋషి._ 
ధ్యానంలో మునిగి వుండేవాడు యోగి._

పండు తింటే అరిగిపోతుంది. తినకపోతే ఎండిపోతుంది. జీవితం నువ్వు ఖుషీగా గడిపినా, భయపడుతూ గడిపినా కరిగిపోతుంది !

ఇప్పటిదాకా ఇతరుల కోసమే (నా వాళ్ళనుకుంటూ) బతికేశావు. ఇప్పటికైనా ఆరోగ్యంగా, ఆనందంగా నీకోసం నువ్వు బతుకు

వచ్చే జన్మలో నువ్వెవరో, ఎక్కడ, ఎలా పుడతావో, అసలు జన్మ వుందో లేదో తెలీదు._

నువ్వు 'నా వాళ్ళు నా వాళ్ళు' అనుకుంటుంటే వాళ్ళు తర్వాత 'వాళ్ళ వాళ్ళ కోసమే' బతుకుతారు. నీకంటూ ఎవరూ ఉండరు. ఏమీ మిగలదు !

అర్ధం చేసుకుంటే.. పుట్టిందగ్గర్నుంచీ- పోయేందుకే మన ప్రయాణం ! ఈ మాత్రం దానికి పుట్టటమెందుకో తెలియదు. తెలుసుకోటం లోనే వుంది కిటుకంతా.. అందుకే ఈ జీవితమంతా !

మరణం దగ్గర పడితేనే మహా సత్యాలు బోధపడ్తాయ్.

పని చేయటానికి పనిమనిషి దొరుకుతుంది. వంట చెయ్యటానికి వంటవాళ్ళు దొరుకుతారు. రోగమొస్తే నీ బదులు భరించటానికి ఎవరూ దొరకరు.

వస్తువుపోతే దొరకచ్చు.. జీవితం పోతే మళ్ళీ దొరకదు తెరపడే రోజు ఏం తెలిసినా ప్రయోజనమేంటి ?  

*మానవులుగా బతకటం కాదు.మానవత్వంతో బతకాలి.*🙏🙏

Wednesday, August 3, 2022

వైరాగ్యం

 *🧘‍♂️135-కర్మ - జన్మ🧘‍♀️*

 *వైరాగ్యం:-* 

అప్పుడు..

*ఏవం బద్దస్తథా జీవః కర్మనాశే సదాశివః!* 
*పాశమద్దస్తథా జీవః పాశముక్తస్సదాశివః!!*

                   -- స్కందోపనిషత్తు 

*భావం:-* 

*పొట్టుతో వున్నంతవరకే ఏ విత్తనమైనా మొలిచేది. పొట్టు పోతే ఏ గింజా మొలకెత్తదు. అలాగే అజ్ఞానం వుండే దాకానే జనన మరణాలు వుంటాయి. బ్రహ్మ నిష్ణా, జ్ఞాన విచారాలతో ఆవిద్య తొలగిన జీవుడు ఇక జనన మరణాలని పొందడు. అదే ముక్తి.*

 మనం తీర్చాల్సిన కర్మలు వున్నంతకాలం మనం మానవులం. అవన్నీ శేషం లేకుండా తొలగిపోతే మనం జీవనముక్తులం అవుతాం. జీవన ముక్తుడు ప్రారబ్ద కర్మలు నశించేదాకా శరీరధారియై తర్వాత మరణిస్తాడు కాని వెంటనే శరీరం రాలిపోదు.

ఇక మళ్ళీ పుట్టడానికి ఒక్క కర్మా మిగలని జీవన్ముక్తుడు మెలకువతోనే, స్పృహలోనే నిర్భయంగా తన శరీరాన్ని వదలగలడు. కర్మలన్నీ ఖర్చయిన యోగి శరీరం నించి ప్రాణం బయటకి వెళ్ళదు. అతని సహస్రారంలోనే అది కలిసిపోతుంది. 

అదే ముక్తికి మార్గము. దీనికి మూలము భక్తి, శ్రద్ధ, అభ్యాసము. కనుక వీటిని ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయకూడదు..

 *🕉️ జై శ్రీమన్నారాయణ 🕉️🌺🙏ఓం నమో భగవతే వాసుదేవాయ🙏🌺*

*_🌴మానవుడు ఎంత జ్ఞానం సంపాదించినా, తెలుసుకోవలసినది తెలుసుకోలేకపోతే ఆ జ్ఞానం వృధాయే. తెలుసుకోవలసింది తెలుసుకోవాలంటే దానికి శ్రద్ధ, భక్తి ముఖ్యం. పరమాత్మను చేరుకోవాలంటే గురువు మీద, పరమాత్మ మీద శ్రద్ధ, అచంచలమైన భక్తి, విశ్వాసము కలిగి ఉండాలి. జపము, ధ్యానము, కీర్తన, స్మరణ.. వీటితో భగవంతుని ఆరాధించాలి. అప్పుడు భక్తునికి మంచి బుద్ధి పుడుతుంది. మనస్సు చెడు మార్గం నుండి మంచి మార్గంలోకి మళ్లుతుంది. గురువు దగ్గర నుండి, శాస్త్రములు పురాణముల నుండి జ్ఞానము సంపాదిస్తాడు. తరువాత తెలుసుకోవలసిన పరమాత్మ గురించి తెలుసుకుంటాడు. అదే ముక్తికి మార్గము. దీనికి మూలము భక్తి, శ్రద్ధ,  అభ్యాసము. కనుక వీటిని ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయకూడదు..🌴_* 

విచక్షణా జ్ఞానం

 *విచక్షణా జ్ఞానం*

*మానవులు పుట్టుకతోనే ‘ఇది కావాలి, అది వద్దు!’ అనే రాగద్వేషములతో పుడుతున్నారు. వీటి వ్యామోహములో పడి మానవుడు తన విచక్షణా జ్ఞానము కోల్పోతున్నాడు. అజ్ఞానములో పడిపోతున్నాడు. రాగద్వేషాల వలన కలిగే సుఖములను దు:ఖములను అనుభవిస్తున్నాడు.

*మానవులకు పుట్టుకతోనే రాగద్వేషములు, ఇష్టాఇష్టాలు, సుఖదు:ఖాలు సంక్రమిస్తాయి. ఇవి అన్నీ ప్రకృతిలో ఉన్న సత్వ, రజస్, తమో గుణముల సమ్మేళనమే. ఇవి అన్నీ చేరి ఆత్మకు, మనసుకు మధ్య అడ్డుగోడలా నిలుస్తాయి. దానినే వ్యామోహము, మాయ, అజ్ఞానము, తెలియని తనము అంటారు. ఆ కారణం చేత మానవులు తమ జీవితమంతా ఈ ద్వంద్వాలలో పడి కొట్టుకుంటూ, తమలో ఉన్న ఆత్మస్వరూపమును గురించి తెలుసుకోలేక పోతున్నారు. తమలో ఉన్న ఆత్మానందాన్ని విడిచిపెట్టి, సుఖం కోసం, ఆనందం కోసం బయట వెతుక్కుంటూ ఉంటారు.

*సామాన్య మానవుడు ధనంలో, ఆస్తిలో, బంధువులలో, పరాయి స్త్రీలసంగమంలో, పదవిలో, ఇలా రకరకాలుగా బయట ఉన్న ఆనందం కొరకు నిరంతరం వెతుకుతూనే ఉంటాడు. వాటి కోసం నానాపాట్లు పడుతుంటాడు. సుఖం కోసం పరుగు! దు:ఖాన్నుండి తప్పించుకోడానికి పరుగు!పదవి కోసం పరుగు..! నిరంతరం పరుగెడుతూనే ఉంటాడు. ఈ పరుగులో పడి పరమాత్మను తెలుసుకోలేక పోతున్నాడు. దీనినే “ద్వన్ద్వమోహేన" అంటే ద్వంద్వాల వల్ల కలిగే మోహం. ఇది సామాన్యమైన మోహం కాదు. దట్టమైన మోహం. ఈ మోహానికి తగ్గట్టు అన్నీ నేనే చేస్తున్నాను అనే అహంకారం ఒకటి. దీనితో పాటు లెక్కలేనన్ని కోరికలు. వాటిని తీర్చుకోడానికి అడ్డమైన పనులు చేయడం. అవితీరకపోతే కోపం, ద్వేషం, పగ! మనసు అల్లకల్లోలం కావడం. అటువంటప్పుడు ఎలా ఏకాగ్రత కలుగుతుంది? ఏకాగ్రత లేనిదే ధ్యానం కుదరదు. ధ్యానం చేస్తేనే కానీ ఆత్మస్వరూపం అర్థం కాదు. కాబట్టి చూచిందల్లా నాదవ్వాలి అనే ఇచ్ఛను, కోరికలను వదిలిపెట్టాలి.

*దీని తరువాత వచ్చేది ద్వేషము. తనకు ఇష్టం లేని వస్తువుల మీద, మనుషుల మీద ద్వేషం పెంచుకోవడం. ఆ ద్వేషం కోపంగా మారుతుంది. ఆ కోపంతో కలిగే విషపరిణామాలు మనం చెప్పుకున్నాము. కోపం వలన సమ్మోహము, దానివలన స్మృతి విభ్రమం కలుగుతుంది. దాని వలన బుద్ధినాశనం అవుతుంది. తుదకు జరిగేది సర్వనాశనం.

*అందుకే ‘ఇచ్ఛాద్వేషములు అనే ద్వంద్వములను వదులుకోవాలి!’ అని పరమాత్మ చెప్పాడు. ఇవన్నీ కూడా పుట్టుకతోనే వస్తాయి. మధ్యలోరావు. పూర్వజన్మ సంస్కారం వలన వస్తాయి. వాటిని అధిగమించడానికి ప్రయత్నించాలి కానీ వాటి వ్యామోహంలో పడి పోకూడదు. వివేకం పెంపొందించుకోవాలి. 

భగవంతునికి భక్తునికి మధ్య 'అహం' అనేది పెద్ద అడ్డు గోడ వంటిది.

 పెద్ద అడ్డు గోడ --- 'అహం'

🙏🌷🙏
భగవంతునికి భక్తునికి మధ్య 'అహం' అనేది పెద్ద అడ్డు గోడ వంటిది. దానిని పడగొడితే తప్ప భగవంతుడు కానరాడు.

’మేము ఎన్ని సంవత్సరాలు పూజలు చేసినా భగవంతుడు మాకు అనుగ్రహం చూపడం లేదు!’ అని అనుకుంటూ ఉంటారు.

అయితే మనలో ' నేను, నాది' అనే అహంకారం ఉన్నంత వరకూ ఆయన మనకు చిక్కడు!

చిక్కకపోతే అనుగ్రహము దొరకదు. అనుగ్రహము లేకుంటే ఆనందము కలుగదు.

కనుక 'నాకు అంతా తెలుసు, ఇది నా వల్లనే జరిగింది, నేనే చేశాను' అనే భావన నుండి 'ఇదంతా భగవంతునిదే , ఆయన అనుగ్రహం వల్లనే నేను ఇది పొందగలిగాను, అంతా అయన సంకల్పం మేరకే జరుగుతుంది, నేను కేవలం అయన చేతిలో ఒక పనిముట్టును మాత్రమే! ' అనే సత్యములోకి రావాలి.

అపుడు ‘అహం’ అనే గోడ దానికదే పడిపోయి పరమానంద స్వరూపుడు అయిన పరమేశ్వరుడు కనిపిస్తాడు. తన అనుగ్రహమును పుష్కలంగా మనపై కురిపిస్తాడు.

🙏🌷🙏

సేకరణ

ఈ రోజు కొన్ని జీవిత సత్యాలు.

 ఈ రోజు కొన్ని జీవిత సత్యాలు.

భయపడుతూ కూర్చుంటే
బతకలేవు.
తప్పో, ఒప్పో
ఒక అడుగు ముందుకేసి చూడు..
గెలుపు అయితే
ముందుకు నడిపిస్తుంది.
ఓటమి అయితే
తర్వాత ఏం చేయాలో నేర్పిస్తుంది.

🍀🌹💥🌀🏵️🌼🌻🍁

ఆస్తులు సంపాదించిన లేదని
కన్నవారి మీద,
కోరికలు తీర్చలేదని
దేవుడి మీద
ద్వేషం పెంచుకోకు..
కని పెంచటం వరకే
కన్నవారి బాధ్యత.
కాపాడటం వరకే
దేవుడి బాధ్యత.
సంపాదించడం, సాధించటం
నీ ప్రయత్నం మీద
ఆధారపడి ఉంటుంది.

🍀🌹💥🌀🏵️🌼🌻

దుర్మార్గులతో
స్నేహం పనికిరాదు.
విరోధమూ పనికిరాదు.
ఉదాసీనంగా ఉండడం
నేర్చుకోవాలి.
నిప్పును పట్టుకుంటే కాలుతుంది.
పోనీ చల్లారిన తర్వాత
పట్టుకున్నా..
మసి అంటుతుంది.
దుర్మార్గుల పరిచయమూ అంతే..!!

🍀🌹🌀🏵️💥🍁🌻

జీవితంలో ఒదిగి
ఉండగలిగిన వారే
త్వరగా ఎదగ గలుగుతారు.
పరిస్థితులు ఎంతగా అణచి వేసినా
అంతిమ విజయం వారిదే...
కొన్ని కష్టాలు అనుభవాలను ఇచ్చి
మనిషిని శక్తివంతుడిగా మారుస్తాయి...
ఒదిగి ఉండటం చిన్నతనం కాదు...
రేపటి విజయానికి తొలిమెట్టు.....!!

🍀🌹🍁🌀🏵️🌼🌻

నువ్వు బాగున్నప్పుడు
పువ్వులాంటి మాటలు
విసిరినవారే....
నువ్వు బాగోలేనప్పుడు
రాళ్ళలాంటి కఠినమైన
మాటలు విసురుతారు....
అందుకే నువ్వు బాగోలేనప్పుడు
ఎలా ఉన్నావో...బాగున్నప్పుడు
కూడా... అలాగే ఉండు...
రెండు సందర్భాల్లో అలాగే ఉండు.
రెండు సందర్భాల్లో నీతో...
ఉన్న వారే...నీ వారు....!!

శుభోదయం చెప్తూ మానస సరోవరం 👏

సేకరణ

గడచి పోయిన క్షణాలు మళ్లీ రావు

 గడచి పోయిన క్షణాలు మళ్లీ రావు


కాలం నిరంతర ప్రవాహం లాంటిది. ఒక్క నిమిషం కూడా ఎవరి కోసం ఆగకుండా అది సాగిపోతూనే ఉంటుంది. పాతనీరు పోయి కొత్తనీరు వచ్చి చేరినట్లు పాత రోజులు గడిచిపోయి.. కొత్త రోజులు వస్తూ వుంటాయి. రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు, దశాబ్దాలు, శతాబ్దాలు మాత్రమే కాదు.. యుగాలకు యుగాలే కాలప్రవాహంలో కలిసిపోతూ వుంటాయి. గడిచిపోయిన క్షణం కూడా మళ్లీ తిరిగి రావటం అసంభవం. అందుకే కాలం విలువను ప్రతి ఒక్కరూ తెలుసుకుని- ప్రతి క్షణాన్నీ ఆస్వాదిస్తూ, అర్థవంతం చేసుకుంటూ తనకు, తనతోపాటు ఇతరులకూ కాలం ఉపయోగపడేలా చూసుకోవాలి. కాలం లాగే మనిషి జీవితం కూడా ప్రవాహం లాంటిదే. బా ల్యం, కౌమార, యవ్వన, వృద్ధాప్యాలు చూస్తూండగానే గడిచిపోతూ ఉంటాయి. ప్రవాహ ఉధృతిలో మనిషి జీవితం ఎన్నో ఆటుపోట్లకు గురవుతూ ఉంటుంది. ప్రతి ఒక్కరి జీవితం ఎత్తుపల్లాలు, ఒడిదుడుకులు చూస్తుంది. ఒక్కోసారి అనుకోని దుర్ఘటనల కారణంగా ఉన్నచోట ఉన్నట్లే కాలం స్తంభించినట్లు అనిపిస్తుంది. అందుకే అంటారు తత్త్వవేత్తలు ‘ఇది జీవితం..’ అని!

జీవితం తనంతట తాను నడిచేదే అయినా- కొన్ని విషయాలకు సంబంధించి దాని పగ్గాలు మన చేతుల్లోనే ఉంటాయి. మన జీవితాన్ని మనం హాయిగా, సుఖంగా.. ఓ పాటలా, ఆటలా గడపాలంటే అందుకు మనవంతు ప్రయత్నం చేయాల్సిందే. జీవితాన్ని మంచిదారిలో నడిపించగల చోదక శక్తి, సామర్థ్యాల కోసం అభ్యాసం చేస్తే మన జీవితం మన సొంతం అవుతుంది. మంచి మనసు, ఆరోగ్యకరమైన అలవాట్లు, చక్కటి వ్యక్తిత్వం అలవరచుకోగలిగిన వాళ్లకి మాత్రమే ఇవి సాధ్యమయ్యేవి. జీవితంలో ఏదో సాధించాలని తపనపడే వాళ్లకు ప్రతి ఉదయం శుభోదయమే. ప్రతిరోజూ జీవన గమనంలో ఒక ముందడుగే. గమ్యం కోసం కృషిచేసేవారికి ప్రతిదినం ఒక వరం లాగే ఉంటుంది.

అలాంటిది- సంవత్సరం అంటే ఎన్ని రోజులు..? ఎన్ని వరాలు..? 365 వరాలు. సద్వినియోగం చేసుకున్నవాళ్లకి బతుకంతా పండుగే. ఆశలు, ఆశయాలు, లక్ష్యాలు అందరి జీవితాల్లోనూ పెద్దవి, గొప్పవి అయి వుండాలన్న నిబంధన ఏమీ లేదు. ఎవరి అభిరుచి,స్థాయిని బట్టి దొరికిన అవకాశాలను ఎంతవరకు సార్థకం చేసుకోగలిగారన్నదే ప్రధానం. నది వద్దకు మనం నీళ్ల కోసం చెంబు తీసుకువెళితే.. చెంబుడు నీళ్లే మనకు దక్కుతాయి. కుండ పట్టుకెళ్ళఓగలిగితే కుండెడు నీళ్లు దొరుకుతాయి. పాత్ర ఎంతటిదైనా ‘దాహం తీరింది కదా’ అన్నదే మనిషికి ఆనందాన్ని కలిగించే విషయం. సంతృప్తిని మించి ఆనందం ఈ ప్రపంచంలో మరొకటి లేదు. ‘ఎంత చెట్టుకు అంత గాలి’ అన్న జీవన సూత్రం అందరికీ ఏదో ఒక సందర్భంలో ఎదురయ్యే అనుభవమే. మనం ఏటా పుట్టినరోజు వేడుకల్ని జరుపుకుంటాం. అలాగే, మనకు ఇంతలా ఉపకారం చేస్తున్న కాలానికీ (అది ఎప్పుడు పుట్టిందో కచ్చితంగా తెలియకపోయినా) కూడా ఒక పుట్టిన రోజు, ఆ సందర్భంగా వేడుక ఉండాలి కదా! అది తెలుగువాళ్ళు చేసుకునే ఉగాది కావచ్చు.. మళయాళీలు చేసుకునే ఓనమ్ కావచ్చు.. బెంగాళీలు చేసుకునే పొహెలా బైశాఖీ కావచ్చు.. ఎవరి లెక్కలను బట్టి వారు ఏటా ఒకసారి ‘కొత్త సంవత్సరం’ సంబరాలు చేసుకుంటారు. ఇంగ్లీషు లెక్కల ప్రకారం జనవరి ఫస్ట్‌న జరిగే న్యూ ఇయర్ వేడుకలను మాత్రం ప్రపంచమంతా పండగలా జరుపుకుంటుంది.

కుటుంబ సభ్యులతోనో, బయట ఫ్రెండ్స్‌తోనో, పబ్బుల్లోనో, క్లబ్బుల్లోనో, ఫామ్‌హౌసుల్లోనో ఆటపాటలతో సరదాగా గడపడం ఆనవాయితీగా మారింది. ఈ కొత్త సంవత్సరం అడుగిడిన సమయంలో కూడా సర్వత్రా ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. శుభాకాంక్షలు చెప్పుకోవడంలోనూ కొత్త పోకడలు చోటుచేసుకున్నాయి. పలు కార్పొరేట్ సంస్థలు, ప్రయివేట్ కంపెనీలు, వ్యాపార సంస్థలు తమ ఉద్యోగులకు, కస్టమర్స్‌కి గ్రీటింగ్స్, మెసేజీల ద్వారా శుభాకాంక్షలు అందజేశాయి. ఇలాంటి ప్రయత్నాలు ఆయా సంస్థ వ్యాపారాభివృద్ధికి కూడా దోహదం చేస్తాయి. కొత్త సంవత్సరంలో అందరికీ మంచి జరగాలని ఆలయాలకు వెళ్లి పూజలు చేసిన వారూ ఉన్నారు. ఎవరు ఏ పద్ధతిలో న్యూ ఇయర్ వేడుకలను జరుపుకున్నా- దాని వెనుక అంతరార్థం, అందరి అభిలాష ఒక్కటే. అంతా సుఖసంతోషాలతో బాగుండాలని. అయితే, ఇలా కోరుకోవడంతోనే వేడుక ముగిసిందనుకుంటే- అది అసంపూర్ణమే అవుతుంది. కొత్త సంవత్సరం ప్రారంభం వేళ- ప్రతి ఒక్కరూ తమ ఆకాంక్షలను గుర్తు చేసుకోవడమే కాదు, కొన్ని నిర్ణయాలూ తీసుకోవలసి ఉంటుంది. మనలోని లోపాలను, బలహీనతలను మనమే తెలుసుకుని వాటిని అధిగమించేందుకు కొత్త సంవత్సరంలోనైనా సంకల్ప బలంతో ప్రయత్నించాలి.

డిసెంబర్ 31.. క్యాలండర్లో చివరి తేదీ.. అలాగే జనవరి 1 క్యాలండర్లో మొదటి తేదీ మాత్రమే.....

ఈ రెండు తేదీలకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరమే లేదు.. మీ జీవితాల్లో కొత్తగా వచ్చే మార్పేమీ ఉండదు.. పోయేదీ ఏమీ లేదు.. గోడకు కొత్త క్యాలండర్ తగిలించుకోండి.. డైరీ రాసే అలవాటు ఉంటే కొనుక్కోండి.. లేదంటే ఎవరైనా గిఫ్ట్ ఇస్తే తీసుకోండి..

చాలా మందికి డిసెంబర్ 31 తేదీని తలచుకోగానే ఎక్కడలేని పూనకం వచ్చేస్తోంది.. తాగాలి, తినాలి, చిందులేయాలి, రోడ్లపై హ్యాపీ న్యూ ఇయర్ అంటూ వెర్రి కేకలు వేస్తూ ర్యాష్ డ్రైవింగ్ చేయాలి.. ఇదీ వారి సైకాలజీ.. ఇదెక్కడి సంస్కృతి? ఇందు వల్ల వారికి కాని, సమాజానికి గానీ ఏమైనా మేలు జరుగుతోందా? ఆలోచించండి.. ఎందుకీ పనికి మాలిన వేడుకలు.. ఈ వేడుకలు జరుపుకోవడం వల్ల లాభ పడేది మద్యం అమ్మకాల వల్ల వైన్ షాపులు, బార్ల ఓనర్లు.. ప్రభుత్వానికి ఖజానా నిండుతుంది.. క్లబ్బులు, హోటళ్లకు, బేకరీ షాపుల వాల్లకు ఆదాయం.. చమురు వదిలేది మాత్రం మీకే.. ఒళ్లు గుళ్లయ్యేదీ మీకే.. ఉత్సాహం శృతి మించితే విషాదం కూడా..

జనవరి 1న న్యూ ఇయర్ జరుపుకోవడం తప్పా, ఒప్పా అని నేను చర్చించదలచుకోలేదు.. కానీ అర్థం లేని వేడుకల కోసం కాలాన్ని, డబ్బును వృధా ఎందుకు చేసుకోవడం?.. అంతగా ఉత్సహంగా ఉంటే అందరికీ శుభం కలగాలని మీ ఇష్ట దైవాన్ని మొక్కుకోండి.. పనికి మాలిన సంబరాల కోసం పెట్టే ఖర్చును సామాజిక సేవా కార్యక్రమాల కోసం ఉపయోగించండి.. ఇందు వల్ల కాస్త పుణ్యం, పురుషార్థం ఉంటుంది..

ఎవరికివారు మేలు చేసుకునేందుకు, ఇతరులకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు నిర్ణయాలు తీసుకోవాలి. భవిష్యత్తు గురించి సరికొత్త కలకు మనసులోనే నాంది పలుకుతూ, మన ఆశయాలకు, ఆకాంక్షలకు మరింత పుష్టిని కలిగించేలా మరింత సంకల్పానికి మనసులో చోటు కల్పించగలగాలి. మంచి మనిషిగా, గొప్ప వ్యక్తిగా తనను తాను తీర్చిదిద్దుకోవటానికి న్యూ ఇయర్ వేడుకలు స్ఫూర్తిని కలిగిస్తాయ. కలలు సాకారమైనపుడే కాలానికి సార్థకత సాధ్యమవుతుంది.


సేకరణ. మానస సరో వరం 👏

అధికారం ధనం ప్రేమ..కర్మ సిద్ధాంతం

 అధికారం ధనం

ప్రేమ..కర్మ సిద్ధాంతం

➖➖➖

ఒక వ్యక్తి ని పరీక్షించ దలచుకుంటే అధికారం కానీ ధనం కానీ లభింప చేయాలి. అతడి అంతర్గత గుణం వ్యక్తిత్వం వెలికి వస్తాయి.

భగవంతుడు కొన్ని ఇచ్చి పరీక్షిస్తాడు. కొన్ని దూరం చేసి పరీక్షిస్తాడు. ప్రారబ్ధ కర్మలో ఈ అధికార ధనాలు పొందాలనే ఉంది కాని, దాని వల్ల అహంకారం పొందమని కానీ, దుర్వినియోగం చేయమని కానీ లేదు.

కర్మ సిద్ధాంతానుసారం దుర్వినియోగం అంటే ఏమిటో తెలుసుకోవాలి.

మనకి లభించిన శక్తి ఒక సత్కర్మ ఫలితమే అని గ్రహించాలి.. అలా లభించిన శక్తి పది మందికి ఉపయోగ పడేలా చేయక పోయినా, లాభంతో , స్వార్ధంతో అహంకారంతో తన స్వ ప్రయోజనానికి మాత్రమే పరిమితం చేసుకుంటే , లభించిన ఆ శక్తి, తిరిగి ఎప్పటికి , ఏ జన్మ కి లభించదు. తిరిగి మళ్లీ ఆ శక్తి పొందాలంటే, అంతటి కృషి శ్రమ అటువంటి కర్మ చేయ వలసిందే.

అధికారం ద్వారా ఇతరులకు బాధ కలిగిస్తే, హింస పెడితే, ఆ ఆధికారం ఒక భయంకర చక్రం లా తిరిగి అతడి పైకి వస్తుంది.. తాను ఇతరులను ఎలా పీడించాడో , దుఃఖం కలిగించాడో మరచి పోయి , " దేవుడు కాపాడడా ? అని ఒకరోజు దుఃఖిస్తాడు.

ఇదే విధం గా ఎంతో ప్రేమ ని పొందినా తిరస్కరించి , అవమానించి , దూరం చేసినా, ఇదే ఫలం. తల్లి తండ్రి. ప్రేయసీ ప్రియులు అక్క తమ్ముడు ప్రతి బంధానికి ఈ కర్మ వర్తిస్తుంది.

ప్రేమ కి ద్రోహం చేస్తే , తిరిగి , తాను కోరుకున్న చోట ఆ ప్రేమ లభించక పోగా , అదే ద్రోహానికి మోసానికి గురి అవుతారు. ప్రతి ఒక్కరు తాను ఇతరుల పట్ల ఎలా ప్రవర్తించారో జ్ఞాపకం తెచ్చుకోరుగా.

ప్రతి ఒక్క కర్మ స్వయం కృతమే. దీనిని తెలుసు కోకుండా భగవంతుడిని నిందిస్తారు. అధికారం పొందగానే సర్వ విధ జ్ఞానం పొందినట్లు అనిపిస్తుంది. అధికారమే సంపూర్ణం గా. వినయాన్ని. హరిస్తుంది. ప్రతి మాట. ఒక దుష్కర్మ గా మారి ఒక శరం లా తిరిగి వస్తుందని గ్రహించరు.

వ్యంగ్యాలు వెటకారాలు పరుష వాక్కులు ఉత్తముడని తెలిసినా నింద లు వేస్తూ హృదయాన్ని గాయ పరుస్తూ మాట్లాడే అహంకారులు ఎందరో. ఉన్నారు. దీనికి కర్మ ఫలం గా వారి మనస్సు భవిష్యత్తు లో అతి దారుణంగా శిక్షించ బడుతుంది అనే విషయం గ్రహించరు ఆనాడు. పరుష వాక్కులు చాలా " తప్పు " అనే విషయం గ్రహిస్తారు.

అహంకారం విపరీతం అవుతుంది తన క్రింద పని చేసే వాళ్ళందరు తెలివి తక్కువ వాళ్ళు గా కనిపిస్తారు.. తన క్రింద పనిచేసే వారికి కీర్తి పేరు వస్తే తమ గొప్పతనం తగ్గిపోతుందని...వారిని ప్రతిక్షణం కించ పరుస్తూ అవమానిస్తూ మాట్లాడతారు.. ఈ అధికారం లేకపోతే తాము ఇలా మాట్లాడ లేమనే విషయం వారికి గుర్తుకు రాదు.

చాలామంది అధికారులు ఆత్మన్యూనత భావం తో బాధ పడతారు. దీని వలన ఒక భజన బృందం చుట్టూ ఏర్పడుతుంది.ఇది పతనానికి మార్గం.

వంద యజ్ఞాలు చేసి ఇంద్ర పదవి పొందిన ‘నహుషుడు’ అధికారంతో గర్వించి సప్త ఋషులను అవమానించాడు. ఒక సర్పమయి అరణ్యంలో పడి ధర్మరాజుతో తన దీన గాధ చెప్పుకుంటాడు.

వినయం కలిగిన అధికారులు చాలా తక్కువ..

మీ మాట లోని శృతి లో మీ అహంకారం లేదా వినయం శాంతం సౌజన్యం వినిపిస్తాయి .


డా.పి.ఎల్.ఎన్.ప్రసాద్.

సేకరణ

🔥🔥పుణ్యకార్యాలే చేయాలి!🔥🔥 🍒పాప, పుణ్యాల అనుభవం ఎంత కాలం?

 🔥🔥పుణ్యకార్యాలే చేయాలి!🔥🔥

🍒పాప, పుణ్యాల అనుభవం ఎంత కాలం?

🍒మానవజన్మ ఎలా పుడుతుంది? 

అన్నది ప్రశ్న అయితే....స్త్రీ, పురుషుల సంయోగమే.. మానవ జన్మకు మూలకారణం... అన్నది జవాబు.

అది భౌతిక పరమైన జవాబే కానీ., సరైన జవాబు అది కాదు.

🍒మరి ఏది సరైన జవాబు?

చేసుకున్న పాప, పుణ్యాల అనుభవం కోసమే ఈ జన్మ అనునది ఆధ్యాత్మికమైన జవాబు.

అయితే... ఎంతకాలం ఈ అనుభవం? అనేదీ ప్రశ్నే. దానికీ జవాబు ఉంది.

🍒చేసిన పాప, పుణ్యాల గురించి ఈ లోకంలో తలచుకున్నంత కాలం... ఆ పాప, పుణ్య ఫలాన్ని అనుభవించ వలసిందే.

ఇదేం తీర్పు... దీనికేదైనా నిదర్శనముందా...అనే సందేహం కలగచ్చు.

🍒ఏ సందేహానికైనా సరైన జవాబు చెప్పే సామర్థ్యం మన రామాయణ, భారత, భాగవతాలకే ఉంది. దీనికి సంబంధించిన కథ ఒకటి మహాభారతంలో ఉంది.

🍒ఆ కథ ఏమిటంటే....

కృతయుగకాలంలో., ఇంద్రద్యుమ్నుడు అనే చక్రవర్తి ఈ భూలోకాన్ని ధర్మబధ్ధంగా, ప్రజారంజకంగా పరిపాలిస్తూండేవాడు. ఆయన గొప్ప దాత. దశమహాదానాలే కాక షోడశమహాదానాలు విరివిగా చేసాడు. అంతేకాక ఎన్నో పుణ్యకార్యాలు కూడా చేసాడు. ఇంద్రద్యుమ్నుడు చేసిన పుణ్యకార్యాల వల్ల, అతను మరణించాక., దేవదూతలు వచ్చి అతన్ని సరాసరి స్వర్గలోకం తీసుకెళ్లారు. ఇంద్రద్యుమ్నుడు స్వర్గంలో సుఖభోగాలు అనుభవిస్తూ... ఆనందిస్తున్నాడు. అలా ఎంతకాలం అయిందో అతనికే తెలియదు.

🍒ఒకరోజు ఇంద్రద్యుమ్నుని దగ్గరకు దేవదూతలు వచ్చి, ‘నీవు చేసుకున్న పుణ్యఫలం అయిపోయింది. నీవు స్వర్గంలో ఉండే అర్హత లేదు. భూలోకానికి వెళ్లిపో’ అన్నారు.‘అదేమిటి.. నా పుణ్యఫలం అప్పుడే తీరిపోవడమేమిటి... ఇంకా చాలా ఉంది’ అన్నాడు ఇంద్రద్యుమ్నుడు.‘నిరూపిస్తావా’ అని అడిగారు దేవదూతలు.‘నిరూపిస్తాను.. నన్ను భూలోకం తీసుకొని వెళ్లండి’ అన్నాడు ఇంద్రద్యుమ్నుడు.

🍒దేవదూతలు అతన్ని భూలోకం తీసుకు వచ్చారు.

ఇంద్రద్యుమ్నునకు భూలోకం చాలా కొత్తగా కనిపించింది. అతనికి తెలిసున్న వారెవరూ కనిపించలేదు. ఆ కాలంలో భూలోకవాసులందరిలోకి అతివృద్ధుడు మార్కండేయుడు ఒక్కడే అని తెలిసి..... దేవదూతలతో అతని దగ్గరకు వెళ్లి ‘నేనెవరో తెలుసా’ అని అడిగాడు ఇంద్రద్యుమ్నుడు.

🍒‘మీరెవరో నాకు తెలియదు. అయితే నాకన్న వృద్ధుడు ‘ప్రావారకర్ణుడు’ అనే గుడ్లగూబ ఉంది. వెళ్లి దాన్ని అడుగుదాం రండి ’ అన్నాడు మార్కండేయుడు.

🍒అందరూ కలిసి ఆ గుడ్లగూబ దగ్గరకు వచ్చారు.

 ‘నేనెవరో తెలుసా’ అని అడిగాడు ఇంద్రద్యుమ్నుడు. ‘మీరెవరో నాకు తెలియదు. అయితే నాకన్న వృద్ధుడు ‘నాళీజంఘుడు’ అనే కొంగ ఉంది. వెళ్లి దాన్ని అడుగుదాం రండి ’ అన్నాడు ప్రావారకర్ణుడు.

అందరూ కలిసి ఆ ఆ కొంగ దగ్గరకు వచ్చారు.

🍒 ‘నేనెవరో తెలుసా’ అని అడిగాడు ఇంద్రద్యుమ్నుడు.‘మీరెవరో నాకు తెలియదు. అయితే నాకన్న వృద్ధుడు ‘ఆకూపారుడు’ అనే తాబేలు ఉంది. వెళ్లి దాన్ని అడుగుదాం రండి ’ అన్నాడు నాళీజంఘుడు.అందరూ కలిసి ఆ తాబేలు దగ్గరకు వచ్చారు. ‘నేనెవరో తెలుసా’ అని అడిగాడు ఇంద్రద్యుమ్నుడు.

🍒మీరెవరో నాకు బాగా తెలుసు. మిమ్మల్ని నేనెలా మర్చిపోతాను.., మీరు ఇంద్రద్యుమ్న చక్రవర్తి. మీరు ఎన్నో యఙ్ఞాలు చేసారు. నన్ను ఎన్నోసార్లు కాపాడారు. దానాలు చెయ్యడంలోనూ మీరు చక్రవర్తే. ఆ కాలంలో మీరు చేసిన గోదానాలు అనంతం. దానగ్రహీతలైన బ్రాహ్మణులు ఆ గోవులను తోలుకుంటూ వెడుతూంటే.. ఆ గోవుల కాలి గిట్టల తొక్కుడు చేతనేకదా ఈ కొలను ఏర్పడింది. అందుకే ఈ కొలనుకు ‘ఇంద్రద్యుమ్నము’ అని నీ పేరే పెట్టారు ప్రజలు. నా సంతతి వారంతా ఈ కొలనులోనే ఇప్పటికీ..నివసిస్తున్నారు’ అన్నాడు ఆకూపారుడు.

🍒దేవదూతలు ఆ సమాధానంతో తృప్తిచెంది.. ఇంద్రద్యుమ్నుని తిరిగి స్వర్గానికి తీసుకుని వెళ్లారు. ఇదీ కథ.

🍒కనుక కలకాలం అందరూ చెప్పుకునే విధంగా పుణ్యకార్యాలే చెయ్యాలి.

🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🙏🏽🙌🏿🌹🙊 హితోక్తులు

 🙏🏽🙌🏿 లక్ష్మిశ్రీవేంకటేశ్వరస్వామి జ్ఞానపీఠం రేణిగుంటరోడ్డు.తిరుపతి

వ్యవస్థాపకులు .ధర్మఛారౄ
'తిరుపతి' శ్రీనివాసరావు
కర్మయోగి..ప్రధాన నిర్వహకులు
9390216263..9550804092 🙏🏽🙌🏿🌹🙊 హితోక్తులు
👉🏼 Comfort అనేది,
పెద్ద పెద్ద బంగ్లాల్లో,
బ్యాంక్ లాకర్లో దాచిన బంగారంలో,
బీరువాలో దాచిన డబ్బులో,
చుట్టూ చేరి పదిమంది కొట్టె చప్పట్లల్లో,
అక్కడెక్కడా ఉండదు..?
నా దగ్గర కోల్పోవడానికేం లేదు,
అనే తృప్తిలో ఉంటది..
మన నుండి వచ్చే ప్రతి ఆలోచన మరో మనిషికి వెలుగు చూపించేదిగా ఉండాలి
కానీ చీకట్లోకి నెట్టేసేదిగా ఉండకూడదు
కాలికింద ఉంది కదా అని
ధూళిని చులకనగా చూడకు.
కళ్ళలో పడినప్పుడే తెలుస్తుంది
దాని సత్తా ఏమిటో.
అందుకే
ఎవరినీ తక్కువ అంచనా వేయకు
మీ సహాయం కోసం,
చేతులు చాచిన ఎవ్వరిని చులకనగా చూడకూడదు,
ఈ రోజు నీ time బాగుండొచ్చు,
రేపు ఎక్కడుంటావో...? ఎలా ఉంటావో...? ఎవరికెరుక...?
ఎవరు మనకు నిజమైన స్నేహితులో,
మన పరిస్థితి తారుమారైనప్పుడు తెలుస్తుంది.💥☝

👉🏼 వినేటప్పుడు వినయంతో వినాలి.నిజానిజాలు గ్రహించాలి.
మాట్లాడేటప్పుడు మర్యాదతో మాట్లాడాలి గర్వంతో కాదు.
అడిగేటప్పుడు
ఆప్యాయతగా అడగాలి. లోన ఒకటి బయట ఒకటి కాకూడదు.
సమాధానం చెప్పేటప్పుడు
సంస్కారంతో చెప్పడం.
కాదన్నపుడు ముద్దుగా కాదనడం
ఇవే ఒక మనిషి యొక్కగొప్ప లక్షణాలు.
ఈ లక్షణాలు మనలో ఉంటే..
ప్రపంచంలో మనల్ని ప్రేమించని
మనిషి అంటూ ఎవరు ఉండరు.
అవసరం ఉన్నప్పుడు వచ్చే మాటలు "పొగడ్తల"తో ఉంటాయి,
అవసరం లేనప్పుడు వచ్చే మాటలు "పొగరు"తో ఉంటాయి.!
బతకడం కోసం నటిస్తే లేదు తప్పు...?
నటిస్తూ మోసం చెయ్యడమే తప్పు.!
కులం కుర్చీని ఇవ్వకుంటే..
గుణం గుర్తింపు ఇస్తుంది.!
జ్ఞానవంతమైన మాటలు,
నలుగురిలో హేళనగా ఉంటాయ్!
“అణిచివేత“ ఆ రోజులలో కంటే,
ఈ రోజులలోనే ఎక్కవ..
లోలోనే జరిగిపోతాంది

సేకరణ

శ్రీ రమణీయం గ్రంథం నుంచి శ్రీ రమణమహర్షి జీవిత చరిత్ర

 🧘‍♂️ *27- శ్రీ రమణ మార్గము* 


*శ్రీ రమణీయం గ్రంథం నుంచి శ్రీ రమణమహర్షి జీవిత చరిత్ర*


*ముందుమాట*


నేను చదువుకునే రోజుల్లో, చలంగారి రచనలు చదివి, ఆయనకో ఉత్తరం రాశాను. దానికి సమాధానంతో పాటు, భగవాన్ శ్రీ రమణమహర్షి ఫొటో ఒకటి పంపించారు.


ఆ భగవానెవరో , నాకు తెలియదు కాని ఆ ఫొటోలో వున్న ఆయన - His Gracious Smile ఆ క్షణాన నన్ను ఆకర్షించి, ఆకట్టుకుంది. అంతే! వెంటనే ఆ పటాన్ని ఫ్రేమ్ కట్టించాను. దాన్ని చూసి నా మిత్రులు కొందరు చిరునవ్వారు.


ఆ తర్వాత నాలుగేళ్ల కు చిన్నారావుగారితో కలిసి చలం గారిని చూడ్డానికి, తిరువణ్ణామలై వెళ్ళాను. ఆ మధ్యకాలంలో చలంగారు భగవాన్ మీద రాసిన కొన్ని వ్యాసాలు చదివాను. భగవాన్ ప్రతి ఒక్కరినీ ‘‘నిన్ను నీవు తెలుసుకో” అంటారు. ఎవరికైనా ఆ సూచన సరైనదీ, సూటియైనదే అనిపించింది.


శ్రీ రమణస్థాన్ లో వున్నన్ని రోజులూ, రోజూ చలంగారితో కలిసి, శ్రీ రమణాశ్రమానికి వెళ్లేవాడిని. తిరిగి శ్రీ రమణస్థానానికి వస్తే, సౌరిన్గారు భగవాన్ గురించి ఎన్నో సంగతులు చెప్పేవారు.


ఆ తర్వాత నాకు సంవత్సరంలో ఎక్కువ కాలం శ్రీ రమణ స్థాన్లో వుండే అవకాశం లభించింది. ఆ కాలంలో భగవాన్ రచనలను, భగవాన్ గురించి అనేకమంది రాసిన గ్రంథాలను, పత్రి వచ్చిన సమాచారాన్ని, శ్రీ రమణాశ్రమ గ్రంథాలయంలో లభ్య విషయాల్ని చదివి, నాసంస్కార స్వభావాల్ని బట్టి భగవాన్ని గ్రహించాను.


భగవాన్ గురించి నాకేమి అర్థమైందో, దాన్నంతా,  ఆయన మాటలతోనే రాసుకున్నాను. చివరికి అది ఆయన జీవిత తత్వంగా రూపొందింది.


-🖌️కృష్ణ



*పరిచయం*


ఈ భూమి మీద అప్పుడప్పుడూ, అక్కడక్కడా అపురూపంగా పూసే పువ్వులు వంటివారు ఈ గురువులూ, జ్ఞానులూ, మహర్షులూ, ప్రపక్తలు. అటువంటి వారిలో, భగవాన్ శ్రీ రమణ మహర్షి ఒకరు. సృష్టి తమకు ఇచ్చిన సౌందర్యాన్ని, సౌరభాన్ని వెదజల్లి, కొంతకాలం ఈ భూమి మీద వుండి, తక్కిన వాటిమల్లేనే ఆ పువ్వులూ నేల రాలిపోతాయి. మనం వివేకవంతులమైతే, ఆ అందాన్ని అనుభవించి, ఆ సౌరభాన్ని ఆఘ్రాణించి ఆనందిస్తాం. మహర్షుల విషయంలోనూ అంతే !


ఇరవైఐదు వందల సంవత్సరాల క్రిందట బుద్ధ భగవానులూ, పన్నెండు వందల సంవత్సరాల కిందట శ్రీ శంకరాచార్యులూ మహాభినిష్క్రమణ గావించారు. వారు తాము తెలుసుకున్న సత్యాన్ని ప్రపంచానికి తెలియజెప్పాలని ప్రచారం చేసి, బోధించారు. వారి మాదిరిగా కాక, భగవాన్ మహాభినిష్క్రమణ గావించినా, అరుణా చలంలో సహజ సమాధిస్థితిలో స్థిరనివాసులై, తన్నర్థించిన వారికి ఆత్మ విచారణ మార్గాన్ని సూచించారు.


తమను తాము తెలుసుకున్న మహాత్ములందరూ బాహ్య విషయాల్లో ఒకే విధంగా ఉండకపోవచ్చు. కాని, వారంతా ప్రేమ మయులు, కరుణాస్వరూపులు. వారు ఏం చేసినా, ఏం చెప్పినా, ఏం రాసినా - గీసినా - పాడినా అదంతా సమస్త ప్రాణికోటి పురోభి వృద్ధికోసమేనని, మనం గ్రహించాలి. ఎందుకంటే, జీవితంలో సత్యాన్వేషణ చేసిన మహాత్ములందరూ, కొన్ని జీవన ఫలాల్ని పోగుజేసి, బుట్టల్లో నింపుతారు. అటువంటివారు ప్రజల మధ్య వున్నా, రోడ్డు పక్కన కూర్చున్నా, ఎక్కడ ఎట్లా వున్నా, తాము సేకరించిన ఫలాలను, ప్రేమతో తమ తమ రీతుల్లో అందరికీ పంచుతారు.


మధురకు ముఫ్పై మైళ్ళ దూరంలో “తిరుచ్చు?" అనే గ్రామంలో, 30-12-1879 న, సామాన్య బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన వెంకట్రామన్ కి , హైస్కూల్లో చదివేరోజుల్లో - పదహారవ - ఏట - అతని ఆశ, ప్రయత్నం, కోర్కె, సాధన, ధ్యానం, తపం, : జపం, యోగం, శిక్షణ, నియమ - నిష్టలు, ఏమీ లేకుండానే అకస్మాత్తుగా మృత్యు అనుభవం కలిగింది. అది అన్ని అనుభవాల్లోకి శక్తి వంతమైన ఏకత్వానుభవం.


ఆ అనుభవంతో వెంకట్రామను సద్యోముక్తి కలిగింది. సర్వైక్యభావం సిద్ధించింది. అసలు పరమార్ధాన్ని తెలుసుకున్నారు. ప్రత్యేక గురువు అంటూ ఎవరూ లేకుండానే, కేవలం స్వబుద్ధితో విరాట్ స్వరూపాన్ని, ఆత్మ శాశ్వతత్వాన్ని, అసలు సత్యాన్ని, అంతిమ జ్ఞానాన్ని అవగాహన చేసుకున్నారు. అఖిల జగదాచార్య సింహాసనాన్ని అధిష్టించారు.


అనుభవంతో, సూర్యోదయమైన తర్వాత పద్మం వికసించినట్లు, మృత్యు వెంకట్రామన్ హృదయ పద్మం, పూర్తిగా విచ్చుకుంది. అప్పటి నుంచి ఆయన ఆత్మనిష్టులై, సహజ సమాధి స్థితిలో వున్నారు.


మెరపువలె వచ్చిన ఆ అనుభవం, మెరపువలె పోక, ఆ స్థితి ఆయనలో చివరి వరకు స్థిరంగా నిలిచింది. ఆ తర్వాత అన్నీ వదిలేసి, అరుణాచలం చేరి, ఏదీ అంటకుండా, ఏదీ పట్టకుండా, ఏదీ తనకు కప్పకుండా, ఏదీ తనను మూయకుండా, బాధించకుండా, బంధించకుండా ఏదీ భారంకాకుండా అలలు అణగిన మహాసాగరం మాదిరిగా, ఆత్మలోతుల్లో మరో యాభైనాలుగేళ్ళు జీవించారు.


క్రమంగా ఆయన చుట్టూ భక్తుల, శిష్యుల, పరిచారకుల, జిజ్ఞాసువుల, సాధకుల, సాధువుల, యాత్రికుల, మేధావుల రూపంలో పెద్ద ప్రపంచం అల్లుకుంది. స్థితప్రజ్ఞుడై సమస్త వాంఛల్ని విసర్జించి,కష్ట సుఖలకు, రాగ ద్వేషాలకు, భయక్రోధాదులకు అతీతుడై, అరుణాచలంపై సహజ సమాధి స్థితిలోవుండి, నిత్య కృత్యాల్ని నిర్వర్తించుకుంటున్న వెంకట్రామన్ని. కావ్య కంఠ గణపతి శాస్త్రిగారు చూశారు. అందరూ అన్ని కాలాల్లో ఏ సత్యాన్ని వెదికారో, ఏ జ్ఞానాన్ని కాంక్షించారో, ఆ సత్యమే.ఆ జ్ఞానమే అరుణాచలంపై వారికి దర్శన మిచ్చింది. ఆ తర్వాత ఆయన వెంకట్రామన్ సంగతులు అడిగి తెలుసుకుని, వారికి "భగవాన్ రమణ మహర్షి," అని నామ కరణం చేశారు.


క్రమంగా గ్రంథాలూ, అనుభవాలూ, ఉవాచలూ వెలువడ్డాయి. దేశ విదేశీయులు భగవాని కి ఆకర్షితులయ్యారు. గొప్ప, గొప్ప నిర్మాణాలతో త్వరలో శ్రీరమణా శ్రమం ఏర్పడ్డది.


భగవాన్ కౌపీనధారియై, చాలా వరకు మౌనంగా వున్నా, ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తూవుండేవారు. ఆయన దర్శనం అందరికీ, అన్ని వేళలా అందుబాటులో వుండేది. సహజమైన ఆయన చిరునవ్వు, సమ్మోహనమైన ఆయన చూపు, నిర్మలమూ పవిత్రమూ అయిన ఆయన వదనం, పసిబిడ్డవంటి తత్వం, ప్రతిఒక్కరినీ ఆకర్షించేవి.


అటువంటి మహోన్నత స్థితిలో వున్న భగవాన్ జీవితం, ఆశ్రమంలో ఓ నిర్ణీత కార్యక్రమంలో లిప్తపాటు తేడా లేకుండా నడిచింది. ఆయన ప్రతి పనినీ తనదిగా, ప్రేమగా, జాగ్రత్తగా, నెమ్మదిగా చేసేవారు. ఏ వస్తువు ఎక్కడ వుండాలో, అక్కడ వుండేటట్లు చూసేవారు. రేడియో ప్రకారం గడియారాన్ని సరిచేయించే వారు. రోజూ కేలండర్ మార్పించేవారు. హాలూ, సోఫాలూ శుభ్రంగా వున్నాయో, లేదో గమనించేవారు.


జీవితంలో అనేక విధాల అణగారినవారూ, అధోగతిలో వున్నవారూ, శారీరకంగా మానసికంగా అలసినవారూ, భగవాన్ సమక్షంలో శాంతిని, ఆనందాన్ని అనుభవించేవారు.


భగవాన్ సన్నిధే, ఒక దివ్యబోధ. కాని, కొందరు ప్రశ్నల జాబితాతో వచ్చేవారు. అడిగిన వెంటనే భగవాన్ అందరికీ సమా ధానం చెప్పేవారు కాదు. కాని, ఎప్పడో ఒకప్పుడు, ఓపికతో వేచి వున్న వారికి, వారి ప్రశ్నలకు ఆయన్నించి సమాధానం వచ్చేది. కొందరు ఆయన సన్నిధిలో కూర్చోగానే, తమ సంశయాల ప్రశ్నల సంగతే మరచిపోయేవారు. “ఆయన సమక్షంలో అప్రయత్నంగా మనసు తిరుగుళ్ళూ, ఆలోచనల పోకళ్ళూ అద్భుతంగా అణగేవి” అంటారు. అనుభవజ్ఞులు.


"భగవాన్ ఎదురుగా కూర్చుని లోదృష్టితో గమనిస్తే ఆరాటం, ఆందోళన, అశాంతి పోయి, హాయిగా, ఆనందంగా వుండేవార” మని కొందరు అంటారు.


“ఆయన సన్నిధిలో ఒక అసాధారణమైన, చిత్రమైన, అద్భుతమైన - అన్నిటికీ భిన్నమైన వాతావరణం వుండేది” అని కొందరు చెప్పేవారు.


తాము ఏ అరమరికా, వేరు ఆలోచనా లేకుండా తమను భగవానికి అర్పించుకుని, ఆశ్రమవాసం గడిపేవారంతా, ఏదో ఒక పని చేస్తూ, ఎప్పుడూ భగవానికి సన్నిహితంగా వుండేవారు. ఆ సన్నిహితమే వారి జీవితాలకు ఒక వరంగా, అదృష్టంగా, ఆనం దంగా భావించేవారు. ఆర్తులకూ, అన్వేషకులకూ, భక్తులకూ, సాధువులకూ, పరిచారకులకూ, యాత్రికులకూ అందరికీ శ్రీ రమణా శ్రమంలో భగవాన్ ఒక దీపస్తంభంలాగ నిలిచి వెలిగారు. సన్నిధిలో వున్న వారినే గాక, తన మార్గాన నడిచే వారందరికి ఆయన మార్గ దర్శకుడు. శారీరక-మానసిక అలసట చెందిన వారు ఆ మహావృక్షం క్రింద సేదదీర్చుకునేవారు. పాతాళగంగ మాదిరిగా ఆయన ఎంతో మంది దప్పిక తీర్చారు. అంతేకాని వారిపై మూఢనమ్మకాన్ని రుద్ద లేదు. ఏ అతీత శక్తుల్నీ ప్రదర్శించలేదు.


తనను సమీపించి ప్రశ్నించిన వారిని “ముందు నిన్ను నీవు తెలుసుకో! తర్వాత అన్నీ తెలుస్తాయి” అనేవారు భగవాన్. పండితులు, పీఠాధిపతులు, మతాధిపతులు సామాన్యమైన ఆ సలహా, సూచన విని, “తమకు ఆ మాత్రం తెలియదా” అని కొందరు అహంకరించేవారు. తమకు సరిగ్గా సమాధానం చెప్పలేదని మరి కొందరు బాధపడేవారు. భగవాన్ తమను మూర్ఖులుగా భావించారని కొందరు ఆవేశపడేవారు. ఎందుకంటే, భగవాన్ సలహా, సూచన తమకు ఏనాడో తెలుసునని వారి భావన. అందుచేత తమసంగతి కాక, మరి ఏ సంగతి అయినా చెప్పమనేవారు. ఆ సంగతులు చాలా వరకు పునర్జన్మ, మృత్యువు తర్వాత ఏమిటి - మొదలైన విషయాలు.


కాని, గణపతిశాస్త్రిగారు భగవాన్ జీవిత చరిత్ర రాస్తూ, “భగవాన్ పుట్టినరోజు మానవాళికే మహనీయమైనది. అది చరిత్రలో మరపురాని రోజు. ఈ తరానికి భగవాన్, మహాప్రవక్త. బుద్ధుడు, శంకరాచార్యులు మొదలైన వారివలె, ముందు తాను బంధ విముక్తులై, తర్వాత యావత్ మానవాళిని ప్రేమతో విముక్తిపరచ యత్నించారు. ఆత్మశక్తితో ధర్మాన్ని స్థాపించారు. బుద్ధుని దీక్ష, దయ, ప్రేమ, సమత్వం శంకరాచార్యులవారి మేధాశక్తి, వితరణ, వివేకం, తాత్విక దృక్పథం కలిసి పుంజుకున్న పుణ్యమూర్తి భగవాన్.


“భగవాన్ తీక్షణమైన చూపు, సూర్యకాంతి వంటిది. దయకల ఆయన చిరునవ్వు, చంద్రకాంతివలె చల్లగా, హాయిగా, శాంతి నిచ్చేది.

మూర్తీభవించిన చిదానందమూర్తివలె కనుపిస్తారు భగవాన్,” అని వర్ణించారు.


 *ఓం అరుణాచలశివ* 

Tuesday, August 2, 2022

అహింస

 *అహింస*

*​‘అహింసా పరమో ధర్మః అహింసా పరమం తపః’ అని భారతం ప్రబోధించినట్టే అహింసను సర్వమతాలు సమర్ధించాయి.

*‘సకల జీవుల పట్ల దయతో ప్రవర్తిస్తూ   హింసించకపోవడమే అహింసయని, ఏనుగు పాదముద్రలో సకల జంతువుల పాదముద్రలు ఇమిడినట్టే,  అహింసలో  సర్వధర్మాలు ఇమిడి  ఉంటాయని’  యుధిష్ఠిరునికి ఉపదేశిస్తాడు  భీష్ముడు.

​*"హింస అధర్మమైనప్పుడు వేదోక్త ధర్మము ముక్తిప్రదం కాదనియు, ధర్మశాస్త్రాలలో చెప్పబడిన సోమపానము, పశుహింస , మాంసభక్షణము వంటి  అనాచారాలు మోక్ష హేతువులు కాదని” వాదించిన  శుకుడితో..  "యఙ్ఞకర్మల హింస ఉపాధి చేత హింస కానందున అహింసయేననియు,  విరక్తుడు ధర్మ నిరతితో , ముముక్షువులు నిరహంకారంగా చేసే హింసలు  అహింసయేనని” జనకుడు   వివరించినట్టు  దేవీభాగవతం తెలిపింది.

*“నేల, నీరు, ఆకాశం జీవులతో నిండి ఉన్నందున,  రైతు పొలం  దున్నుచున్నప్పుడు, మానవుడు నీరు త్రాగుతున్నప్పుడు  లేక   గాలి పీల్చుచున్నప్పుడు జీవులెన్నో నశించక తప్పదనియు,  హింస చేయనివాడు లోకంలోనే  ఉండడనియు” పార్వతీదేవితో శివుడు పలికినట్టు అనుశాసనిక పర్వం తెలిపింది.

*“యుద్ధం హింసతో కూడినప్పటికీ క్షత్రియ ధర్మం ప్రకారం  యుద్ధ నివారణ చర్యలు విఫలమైనప్పుడే రణరంగానికి దూకాలని” భగవద్గీత చెప్పినట్టుగా  రాజ్య పాలకులు సంధి  ప్రయత్నాలకే  ప్రాధాన్యత ఇవ్వాలి.

*కృష్ణ రాయబారం విఫలమైన తరువాతనే కురుక్షేత్ర సంగ్రామం ,   అంగద రాయబారం విఫలమైన తరువాతనే  రామరావణ యుద్ధం  జరిగినట్టు ఇతిహాసాలు తెలిపాయి.

 *‘దానము, ధర్మము, తపస్సు, అహింస, యఙ్ఞము, పరిశుద్ధత, మంత్రము, అనుష్ఠానము, సత్యము - అహింసా రూపాలనియు, అహింస అనే సంపద ఉంటే అన్ని సంపదలు ఉన్నట్లేనని’ గ్రంథాలు  బోధించినట్టుగా  సర్వశ్రేష్టమైన అహింసా మార్గాన్ని అనుసరించడం  ఉత్తమం.

​*‘అహింసను మించిన శ్రేష్టమైన ధర్మం,  హింసను మించిన  క్రూరమైన అధర్మం లేదని’ మలయాళ స్వామి పలికినట్టు సత్యం, అహింసలనే   ఆయుధాలుగా ధరించి   ఆంగ్లేయుల నుండి భారత స్వాతంత్య్రం సాధించాడు మహాత్మా గాంధీ. యుద్ధకాంక్షతో రగిలిపోయిన అశోకుడు కళింగ యుద్ధానంతరం అహింసనే  ఆశ్రయించినట్టు చరిత్ర తెలిపింది.

​*“జనులు స్వీకరించే ఆహారానికి అనుగుణంగానే  ఆలోచనలు కలుగుతాయనియు,  ఆలోచనల ప్రకారమే  జీవన విధానం ఉంటుందనియు, ఆహారం విషయంలో తగిన జాగ్రత్తలు  అవసరమని’  కబీర్ దాస్, ‘మాంస భక్షకుల  హృదయం కఠిన తరమవుతుంది కనుక  పరమాత్మ ప్రకటితం కాదని’  దాదూ దయాళ్  చాటిన  సత్యాన్ని గ్రహించి   సర్వజీవుల యెడల  దయగా ప్రవర్తిస్తూ జీవించడమే ఆయురారోగ్యాలను కాపాడుతూ అంతర్యామిని చేరే  మార్గాన్ని సుగమం చేస్తుంది.

          ….నారంశెట్టి ఉమామహేశ్వరరావు. 

మాయ ఎలా అవహిస్తుంది ?* *దాని నుండి ఎలా బయటపడాలి !?

 అరుణాచల👏

 *మాయ ఎలా అవహిస్తుంది ?* *దాని నుండి ఎలా బయటపడాలి !?* 

కోరిక, మోహం రూపంలో మాయ మన మనసును అవహిస్తుంది. 

మనలో పూర్తి జ్ఞాన-వైరాగ్యాలు కలిగే వరకు మాయ మనలను వదిలిపెట్టదు. 

మనం లౌకిక విషయాల్లో ఇరుక్కుపోయేందుకు మాయ చేసేందుకు అలవాటు పడ్డాం.

 ఇప్పుడు అనుభవిస్తున్న విషయాన్ని మళ్ళీ కావాలనుకోవటం, అప్పటికి లేని విషయాలను కావాలని అడగటం కోరిక అవుతుంది.

 లభించింది శాశ్వతంగా ఉండాలన్న ఆశ మోహం అవుతుంది. 

కోరిక, మోహం లేని స్థితి వైరాగ్యం. 

ఇప్పుడు మనం ఏఏ విషయాల్లో మాయలేకుండా ఉన్నామో ఆయా విషయాల్లో మనం విరాగులమే అవుతాం.

 అదే స్థితి అన్ని విషయాల్లోనూ పొందితే సంపూర్ణ విరాగులం అవుతాం. 

వైరాగ్యం, ఆత్మసాక్షాత్కారం వేర్వేరు కాదు.

 మన యదార్ధస్థితిని తెలుసుకోవటమే రెండింటి ఫలం. 

తద్వారా మాయ నుండి బయట పడవచ్చు  .


 ----శ్రీరమణీయం నుండి

మంచి మాట..లు(01-08-2022)

 సోమవారం --: 01-08-2022 :--

ఈ రోజు AVB మంచి మాటలు

ఒక బంధం బాగుండాలి అంటే ఒకరిమాట మరోకరు గౌరవించాలి కానీ ఇద్దరిలో ఏ ఒక్కరు నోరు జారినా ఆ బంధం చేజారిపోతుంది బంధం బలపడాలన్నా బలహీన పడాలన్న మాటలే కారణం అవుతాయి , మాటకంటే బంధం విలువైనది నేస్తమా !

ఆకలితో ఉన్నప్పుడు అన్నం పెట్టినవారిని , అవసరంలో ఉన్నప్పుడు ఆదుకున్న వారిని ఆపదలో ఉన్నప్పుడు రక్షించిన వారిని మరిచిపోయిన మనిషి బతికి ఉన్నా చచ్చనట్టే .


మిత్రమా ! మనం జీవితంలో అన్నీ కోల్పోయినా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకూడదు , అదొక్కటి మనకుంటే చాలు మనం కోల్పోయిన వాటిన్నింటిని తిరిగి దక్కించుకోవచ్చు .

మనతో రోజు మంచిగా మాట్లాడేవారందరు మంచివారేమి కాదు ,కొందరు మాత్రమే మంచితనం ఉన్నవారు ఉంటారు,,నమ్మకాన్ని అవసరానికి వాడుకుని ఏదో ఒక్కరోజు వాళ్ళు బుద్ధి చూపిస్తారు .

నీ కోసం నీ జీవితం కోసం నీ కన్నా ఎక్కువ గా ఆలోచించేవారు, నువ్వు బాగుంటే చాలని తపన పడేవారు,,, ఎవరో ఒకరుతప్పక ఉంటారు . నువ్వు వారికి ఏదో చెయ్యాలని ఆశించరు నువ్వు చెయ్యాల్సిందల్లా వారు నీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని కాపాడుకోవాడమే .

మనం ఎంత 
ఓపికతో ఉంటామో అంత అగ్రస్థానంలో ఉంటాము . మనం ఎదుటి వారికి ఎంత దూరంగా ఉంటామో అంత గౌరవం మనకుంటుంది , మనం ఎదుటి వారినీ ఎంత తక్కువ ప్రేమ చూపిస్తామో అంత మనశ్శాంతి మనకు ఉంటుంది . మనం ఎదుటి వారిపై ఎంత తక్కువ ఆశ పడతమో అంత ప్రశాంతత ఉంటుంది . మనం ఎదుటి వారితో ఎంత తక్కువ మాట్లాడుతమో అంత విలువ మనకు ఉంటుంది .

సేకరణ ✒️ 
AVB* సుబ్బారావు ,9985255805
💐🕉️🤝🌹🌷

మంచి మాట..లు(31-07-2022)

ఆదివారం :-31-07-2022

ఈ రోజు AVB మంచి మాట..లు

చూడు మిత్రమా
మనకి అన్నం పెట్టిన వారు పెట్టి మరిచిపోవచ్చు, కానీ తిన్నవారు ఎప్పుడు మరిచిపోకూడదు, మనకి సహాయం చేసిన వారు చేసి మరిచి పోవచ్చు, కానీ సహాయం పొందిన వారు ఎప్పుడు మరిచిపోకూడదు, అలా మరిచిపోయిననాడు మన కంటే 🐕 ఇది వంద రేట్లు మేలు..గుర్తుంచుకో,,

మనసులో విషం పెట్టుకొని పైకి నవ్వుతూ మాట్లాడే వారు మన చుట్టూ చాలామందే ఉన్నారు, అలాంటి వారికి మన మౌనమే చెప్పుదెబ్బ,,

జీవితంలో ఒకటి గుర్తుంచుకో,, వెయ్యిసార్లు వెయ్యిమందిని యుద్ధంలో ఓడించిన వాడికంటే తన మనసును తాను జయించిన వాడే గోప్పవాడు, అందుకే మనసును అదుపులో పెట్టుకోవడం అంత సులభం కాదు,,

టైం బాలేనప్పుడు సింహం కూడా ఏ సర్కస్ లోనో, ఏ జూ లోనో కుప్పిగంతులు ఎయ్యాల్సి వస్తుంది, మనం కూడా అంతే, మన టైం బాలేనప్పుడు పొంతన లేని జీవితం గడపాల్సి వస్తుంది, ప్రతి అడ్డమైన వాడితో మాట పడాల్సి వస్తుంది, అంతమాత్రాన మనం తగ్గినట్టు కాదు, నెగ్గే రోజు ఇంకా రాలేదంతే,,
సేకరణ ✍️ AVB సుబ్బారావు*_ 🤝

సేకరణ

మంచి మాట.. లు(30-07-2022)

 శని వారం :-30.07.2022

ఈ రోజు AVB మంచి మాట.. లు

మన అనుకుంటే పరాయి వారు కూడా మనవారే అవుతారు,,,నీకు నువ్వు గిరి గిసుకుంటే నువ్వు ఒక్కడివే మిగులుతావు అయినవారు కూడా పరాయివారువుతారు

జీవితం ఎవరికి శాశ్వతం కాదు మనం సంపాదించిన ఆస్తులు మనకు శాశ్వతం కాదు శాశ్వతంగా నిలిచేది ఒక్కటే అదే మన మంచితనం .

ఆత్మ విశ్శాసం దెబ్బతింటే సామర్థ్యం పని చెయ్యదు, అందుకే ఎప్పుడూ ఆత్మ విశ్శాసాన్ని కోల్పోకండి ! ఎ బంధం లో అయితే క్షమించే గుణం ప్రేమించే మనసు ఉంటుందో ఆ బంధం ఎప్పటికి విడిపోదు

ఎవరైనా సరే నువ్వు వాళ్ళతో ఉన్నంతకాలమే నిన్ను పట్టించుకుటారు ప్రేమాభిమానాలు పొంగించేస్తారు, ఒక్కసారి వాళ్ళకి దూరంగా ఉండి చూడు నిన్ను మర్చిపోతారు అసలు నువ్వు ఉన్నావో పోయవో అనే ఆలోచన కూడా వాళ్ళకి రాదు .

మనకు కోపంతో వచ్చిన మాటలు పట్టుకుంటే మనసు విరిగీపోతుంది . అదే కోవం వెనకున్న బాధను తెలుసుకుంటే బంధం నిలబడుతుంది . అలా ఉండగలగడానికి మనకు కావలసిన ఆయుధాలు చిరునవ్వు మౌనం చిరునవ్వు మౌనం రెండు గొప్ప ఆయుధాలు చిరునవ్వుతో చాల సమస్యలు పరిష్కరించుకోవచ్చు మౌనం తో చాల సమస్యలు రాకుండా చూసుకో వచ్చు .

సేకరణ ✒️మీ ఆత్మీయ బంధువు AVB సుబ్బారావు  💐🤝