Saturday, November 4, 2023

𝐈𝐟 𝐰𝐞 𝐝𝐢𝐝𝐧'𝐭 𝐡𝐚𝐯𝐞.....

 *ॐశ్రీవేంకటేశాయ నమః*
💝💝𝐘𝐨𝐮 𝐜𝐚𝐧'𝐭 𝐡𝐞𝐚𝐥 𝐢𝐧 𝐭𝐡𝐞 𝐬𝐚𝐦𝐞 𝐞𝐧𝐯𝐢𝐫𝐨𝐧𝐦𝐞𝐧𝐭 𝐭𝐡𝐚𝐭 𝐦𝐚𝐝𝐞 𝐲𝐨𝐮 𝐬𝐢𝐜𝐤.
💝💝𝐒𝐭𝐨𝐩 𝐭𝐫𝐲𝐢𝐧𝐠 𝐭𝐨 𝐦𝐚𝐤𝐞 𝐭𝐡𝐞 𝐰𝐫𝐨𝐧𝐠 𝐩𝐞𝐨𝐩𝐥𝐞 𝐥𝐨𝐯𝐞 𝐲𝐨𝐮 𝐭𝐡𝐞 𝐫𝐢𝐠𝐡𝐭 𝐰𝐚𝐲.
💝💝𝐒𝐨𝐦𝐞𝐭𝐢𝐦𝐞𝐬 𝐩𝐞𝐨𝐩𝐥𝐞 𝐩𝐫𝐞𝐭𝐞𝐧𝐝 𝐲𝐨𝐮'𝐫𝐞 𝐚 𝐛𝐚𝐝 𝐩𝐞𝐫𝐬𝐨𝐧 𝐬𝐨 𝐭𝐡𝐞𝐲 𝐝𝐨𝐧'𝐭 𝐟𝐞𝐞𝐥 𝐠𝐮𝐢𝐥𝐭𝐲 𝐟𝐨𝐫 𝐡𝐨𝐰 𝐭𝐡𝐞𝐲 𝐭𝐫𝐞𝐚𝐭𝐞𝐝 𝐲𝐨𝐮.
💝💝𝐈𝐟 𝐰𝐞 𝐝𝐢𝐝𝐧'𝐭 𝐡𝐚𝐯𝐞 𝐏𝐫𝐨𝐛𝐥𝐞𝐦𝐬, 𝐰𝐞 𝐰𝐨𝐮𝐥𝐝 𝐧𝐞𝐯𝐞𝐫 𝐥𝐞𝐚𝐫𝐧 𝐒𝐭𝐫𝐞𝐧𝐠𝐭𝐡;
❤️~𝐈𝐟 𝐰𝐞 𝐝𝐢𝐝𝐧'𝐭 𝐡𝐚𝐯𝐞 𝐒𝐭𝐫𝐮𝐠𝐠𝐥𝐞𝐬, 𝐰𝐞 𝐰𝐨𝐮𝐥𝐝 𝐧𝐞𝐯𝐞𝐫 𝐥𝐞𝐚𝐫𝐧 𝐑𝐞𝐬𝐢𝐥𝐢𝐞𝐧𝐜𝐞;
❤️~𝐈𝐟 𝐰𝐞 𝐝𝐢𝐝𝐧'𝐭 𝐡𝐚𝐯𝐞 𝐃𝐞𝐥𝐚𝐲𝐬, 𝐰𝐞 𝐰𝐨𝐮𝐥𝐝 𝐧𝐞𝐯𝐞𝐫 𝐥𝐞𝐚𝐫𝐧 𝐏𝐚𝐭𝐢𝐞𝐧𝐜𝐞;
❤️~𝐈𝐟 𝐰𝐞 𝐝𝐢𝐝𝐧'𝐭 𝐡𝐚𝐯𝐞 𝐇𝐨𝐩𝐞𝐥𝐞𝐬𝐬𝐧𝐞𝐬𝐬, 𝐰𝐞 𝐰𝐨𝐮𝐥𝐝 𝐧𝐞𝐯𝐞𝐫 𝐥𝐞𝐚𝐫𝐧 𝐅𝐚𝐢𝐭𝐡;
❤️~𝐈𝐟 𝐰𝐞 𝐝𝐢𝐝𝐧'𝐭 𝐡𝐚𝐯𝐞 𝐬𝐮𝐟𝐟𝐞𝐫𝐢𝐧𝐠, 𝐰𝐞 𝐰𝐨𝐮𝐥𝐝 𝐧𝐞𝐯𝐞𝐫 𝐥𝐞𝐚𝐫𝐧 𝐂𝐨𝐦𝐩𝐚𝐬𝐬𝐢𝐨𝐧!
💝💝𝐄𝐯𝐞𝐫𝐲𝐨𝐧𝐞 𝐢𝐬 𝐛𝐞𝐚𝐮𝐭𝐢𝐟𝐮𝐥 𝐢𝐧 𝐭𝐡𝐢𝐞𝐫 𝐨𝐰𝐧 𝐥𝐢𝐟𝐞.
💕~𝐘𝐨𝐮 𝐚𝐫𝐞 𝐧𝐨𝐭 𝐛𝐨𝐫𝐧 𝐭𝐨 𝐢𝐦𝐩𝐫𝐞𝐬𝐬 𝐚𝐧𝐲𝐨𝐧𝐞.
💕~𝐋𝐨𝐯𝐞 𝐲𝐨𝐮𝐫𝐬𝐞𝐥𝐟 𝐞𝐧𝐣𝐨𝐲 𝐲𝐨𝐮𝐫 𝐨𝐰𝐧 𝐜𝐨𝐦𝐩𝐚𝐧𝐲.
💕~𝐈𝐟 𝐲𝐨𝐮 𝐞𝐧𝐣𝐨𝐲 𝐛𝐞𝐢𝐧𝐠 𝐚𝐥𝐨𝐧𝐞 𝐧𝐨𝐭𝐡𝐢𝐧𝐠 𝐜𝐚𝐧 𝐡𝐮𝐫𝐭 𝐲𝐨𝐮 .
💝💝𝐋𝐢𝐟𝐞 𝐢𝐬𝐧'𝐭 𝐚𝐥𝐰𝐚𝐲𝐬 𝐟𝐚𝐢𝐫 𝐚𝐧𝐝 𝐜𝐚𝐧 𝐠𝐞𝐭 𝐮𝐠𝐥𝐲 𝐟𝐨𝐫 𝐧𝐨 𝐚𝐩𝐩𝐚𝐫𝐞𝐧𝐭 𝐫𝐞𝐚𝐬𝐨𝐧. 
💓~𝐒𝐨𝐦𝐞𝐭𝐢𝐦𝐞𝐬 𝐭𝐡𝐢𝐧𝐠𝐬 𝐰𝐢𝐥𝐥 𝐠𝐨 𝐰𝐫𝐨𝐧𝐠 𝐟𝐨𝐫 𝐥𝐨𝐧𝐠 𝐭𝐢𝐦𝐞 𝐚𝐧𝐝 𝐲𝐨𝐮 𝐜𝐚𝐧'𝐭 𝐚𝐥𝐰𝐚𝐲𝐬 𝐜𝐨𝐧𝐭𝐫𝐨𝐥 𝐢𝐭.
💓~𝐀 𝐜𝐡𝐚𝐧𝐠𝐞 𝐨𝐟 𝐩𝐞𝐫𝐜𝐞𝐩𝐭𝐢𝐨𝐧 𝐜𝐚𝐧 𝐛𝐞 𝐚 𝐩𝐨𝐰𝐞𝐫𝐟𝐮𝐥 𝐭𝐨𝐨𝐥 𝐭𝐨 𝐬𝐨𝐨𝐭𝐡𝐞 𝐲𝐨𝐮𝐫 𝐩𝐚𝐢𝐧 𝐚𝐧𝐝 𝐡𝐞𝐥𝐩 𝐲𝐨𝐮 𝐧𝐚𝐯𝐢𝐠𝐚𝐭𝐞 𝐭𝐡𝐫𝐨𝐮𝐠𝐡 𝐭𝐡𝐞 𝐮𝐧𝐜𝐞𝐫𝐭𝐚𝐢𝐧𝐭𝐢𝐞𝐬 𝐨𝐟 𝐥𝐢𝐟𝐞. 𝐖𝐡𝐞𝐧 𝐲𝐨𝐮 𝐜𝐡𝐚𝐧𝐠𝐞 𝐭𝐡𝐞 𝐰𝐚𝐲 𝐲𝐨𝐮 𝐥𝐨𝐨𝐤 𝐚𝐭 𝐜𝐞𝐫𝐭𝐚𝐢𝐧 𝐭𝐡𝐢𝐧𝐠𝐬, 𝐭𝐡𝐞 𝐭𝐡𝐢𝐧𝐠𝐬 𝐲𝐨𝐮 𝐥𝐨𝐨𝐤 𝐚𝐭 𝐰𝐢𝐥𝐥 𝐚𝐥𝐬𝐨 𝐜𝐡𝐚𝐧𝐠𝐞. 𝐃𝐨𝐧'𝐭 𝐥𝐢𝐦𝐢𝐭 𝐲𝐨𝐮𝐫𝐬𝐞𝐥𝐟, 𝐨𝐫 𝐲𝐨𝐮 𝐰𝐢𝐥𝐥 𝐠𝐞𝐭 𝐬𝐭𝐮𝐜𝐤.
💓~𝐘𝐨𝐮 𝐃𝐨𝐧'𝐭 𝐡𝐚𝐯𝐞 𝐭𝐨 𝐰𝐚𝐢𝐭 𝐨𝐧 𝐋𝐢𝐟𝐞 𝐭𝐨 𝐛𝐞 𝐟𝐚𝐢𝐫 𝐭𝐨 𝐟𝐢𝐧𝐝 𝐦𝐞𝐚𝐧𝐢𝐧𝐠 𝐢𝐧 𝐲𝐨𝐮𝐫 𝐞𝐱𝐢𝐬𝐭𝐞𝐧𝐜𝐞 𝐛𝐞𝐜𝐚𝐮𝐬𝐞 𝐭𝐡𝐢𝐧𝐠𝐬 𝐦𝐚𝐲 𝐧𝐞𝐯𝐞𝐫 𝐠𝐨 𝐚𝐬 𝐩𝐥𝐚𝐧𝐧𝐞𝐝. 𝐈𝐭𝐬 𝐧𝐨𝐭 𝐰𝐨𝐫𝐭𝐡 𝐩𝐮𝐭𝐭𝐢𝐧𝐠 𝐲𝐨𝐮𝐫 𝐥𝐢𝐟𝐞 𝐨𝐧 𝐡𝐨𝐥𝐝 𝐢𝐧 𝐜𝐚𝐬𝐞 𝐲𝐨𝐮 𝐝𝐨𝐧'𝐭 𝐠𝐞𝐭 𝐰𝐡𝐚𝐭 𝐲𝐨𝐮 𝐰𝐚𝐧𝐭. 𝐈𝐟 𝐲𝐨𝐮 𝐜𝐚𝐧'𝐭 𝐟𝐢𝐧𝐝 𝐦𝐞𝐚𝐧𝐢𝐧𝐠. 𝐂𝐫𝐞𝐚𝐭𝐞 𝐢𝐭!

💝💝𝐖𝐡𝐞𝐧 𝐬𝐨𝐦𝐞𝐨𝐧𝐞 𝐭𝐫𝐞𝐚𝐭𝐬 𝐲𝐨𝐮 𝐥𝐢𝐤𝐞 𝐲𝐨𝐮'𝐫𝐞 𝐣𝐮𝐬𝐭 𝐨𝐧𝐞 𝐨𝐟 𝐦𝐚𝐧𝐲 𝐨𝐩𝐭𝐢𝐨𝐧𝐬, 𝐡𝐞𝐥𝐩 𝐭𝐡𝐞𝐦 𝐧𝐚𝐫𝐫𝐨𝐰 𝐭𝐡𝐞𝐢𝐫 𝐜𝐡𝐨𝐢𝐜𝐞 𝐛𝐲 𝐫𝐞𝐦𝐨𝐯𝐢𝐧𝐠 𝐲𝐨𝐮𝐫𝐬𝐞𝐥𝐟 𝐟𝐫𝐨𝐦 𝐭𝐡𝐞 𝐞𝐪𝐮𝐚𝐭𝐢𝐨𝐧. 
💞~𝐒𝐨𝐦𝐞𝐭𝐢𝐦𝐞𝐬 𝐲𝐨𝐮 𝐡𝐚𝐯𝐞 𝐭𝐨 𝐭𝐫𝐲 𝐧𝐨𝐭 𝐭𝐨 𝐜𝐚𝐫𝐞, 𝐧𝐨 𝐦𝐚𝐭𝐭𝐞𝐫 𝐡𝐨𝐰 𝐦𝐮𝐜𝐡 𝐲𝐨𝐮 𝐝𝐨. 𝐁𝐞𝐜𝐚𝐮𝐬𝐞 𝐬𝐨𝐦𝐞𝐭𝐢𝐦𝐞𝐬 𝐲𝐨𝐮 𝐜𝐚𝐧 𝐦𝐞𝐚𝐧 𝐚𝐥𝐦𝐨𝐬𝐭 𝐧𝐨𝐭𝐡𝐢𝐧𝐠 𝐭𝐨 𝐬𝐨𝐦𝐞𝐨𝐧𝐞 𝐰𝐡𝐨 𝐦𝐞𝐚𝐧𝐬 𝐬𝐨 𝐦𝐮𝐜𝐡 𝐭𝐨 𝐲𝐨𝐮. 𝐈𝐭'𝐬 𝐧𝐨𝐭 𝐩𝐫𝐢𝐝𝐞 - 𝐢𝐭'𝐬 𝐬𝐞𝐥𝐟-𝐫𝐞𝐬𝐩𝐞𝐜𝐭. 
💓~𝐃𝐨𝐧'𝐭 𝐞𝐱𝐩𝐞𝐜𝐭 𝐭𝐨 𝐬𝐞𝐞 𝐩𝐨𝐬𝐢𝐭𝐢𝐯𝐞 𝐜𝐡𝐚𝐧𝐠𝐞𝐬 𝐢𝐧 𝐲𝐨𝐮𝐫 𝐥𝐢𝐟𝐞 𝐢𝐟 𝐲𝐨𝐮 𝐬𝐮𝐫𝐫𝐨𝐮𝐧𝐝 𝐲𝐨𝐮𝐫𝐬𝐞𝐥𝐟 𝐰𝐢𝐭𝐡 𝐧𝐞𝐠𝐚𝐭𝐢𝐯𝐞 𝐩𝐞𝐨𝐩𝐥𝐞. 
💞~𝐃𝐨𝐧'𝐭 𝐠𝐢𝐯𝐞 𝐩𝐚𝐫𝐭-𝐭𝐢𝐦𝐞 𝐩𝐞𝐨𝐩𝐥𝐞 𝐚 𝐟𝐮𝐥𝐥-𝐭𝐢𝐦𝐞 𝐩𝐨𝐬𝐢𝐭𝐢𝐨𝐧 𝐢𝐧 𝐲𝐨𝐮𝐫 𝐥𝐢𝐟𝐞. 𝐊𝐧𝐨𝐰 𝐲𝐨𝐮𝐫 𝐯𝐚𝐥𝐮𝐞 𝐚𝐧𝐝 𝐰𝐡𝐚𝐭 𝐲𝐨𝐮 𝐡𝐚𝐯𝐞 𝐭𝐨 𝐨𝐟𝐟𝐞𝐫, 𝐚𝐧𝐝 𝐧𝐞𝐯𝐞𝐫 𝐬𝐞𝐭𝐭𝐥𝐞 𝐟𝐨𝐫 𝐚𝐧𝐲𝐭𝐡𝐢𝐧𝐠 𝐥𝐞𝐬𝐬 𝐭𝐡𝐚𝐧 𝐰𝐡𝐚𝐭 𝐲𝐨𝐮 𝐝𝐞𝐬𝐞𝐫𝐯𝐞.
Ⓒ ❤️ *ॐ श्री वेंकटेश्वराय नम:*
💕 *_~𝐒𝐫𝐞𝐞𝐫𝐚𝐦 𝐋𝐚𝐱𝐦𝐢𝐧𝐚𝐫𝐚𝐲𝐚𝐧𝐚 𝐌𝐮𝐫𝐭𝐡𝐲_*

సాధన చతుష్టయం, నౌకాగ్ర కాకవత

 *ॐశ్రీవేంకటేశాయ నమః*
💝💝 *వివేకం, వైరాగ్యం, ఇంద్రియ నిగ్రహం, మోక్షం అనబడే ఈ నాలుగింటిని సాధన చతుష్టయం అంటారు.*
💖 *~వీటిని గుర్తెరిగి సాధన సాగిస్తే ‘బ్రహ్మ విచారణ’ కలుగుతుంది. సాధనా క్రమంలో అవరోధాలు ఎన్నో వస్తుంటాయి. వాటిని ‘నౌకాగ్ర కాకవత’ పద్ధతిలో అధిగమించాలని చెబుతారు ప్రాజ్ఞులు. ఇంతకీ ‘నౌకాగ్ర కాకవత’ అంటే ఏమిటీ*
❤️ *ఒకానొక నౌకాశ్రమంలో నావ ఒకటి సముద్రయానానికి సిద్ధంగా ఉంది.*

💞 *ఆ నావలో తెరచాప కట్టడానికి పొడవాటి కఱ్ఱ ఒకటి ఉంది. దానిపై ఒక కాకి వాలింది. ఇంతలో నావ బయల్దేరింది. ఈ విషయాన్ని కాకి గుర్తించలేదు. కాసేపట్లోనే నావ సముద్రంలో నాలుగు మైళ్ల దూరం వరకు వెళ్లిపోయింది. అప్పుడు కాకి దిక్కులు చూడటం మొదలు పెట్టింది. ఎక్కడికి వెళ్లాలన్నా చుట్టూ సముద్రం. కనుచూపు మేరలో తీరం కనిపించడం లేదు. కాకి ఎగురుతోంది. కొంత దూరం వెళ్లి మళ్లీ వచ్చి ఆ కఱ్ఱపైన వాలుతోంది. ఏం చేయాలో అర్థం కాక ఆ నావ అవతలి తీరం చేరే వరకూ ఆ కఱ్ఱ మీదనే కాకి అలాగే కూర్చుండిపోయింది.*
💓 *’బ్రహ్మ విచారణ’ చేయాలంటే వివేకం ఉండాలి. ఇంద్రియ నిగ్రహం కావాలి. వైరాగ్య చింతన ఏర్పడాలి. అప్పుడే మోక్షం వైపు అడుగులు పడతాయి. ఇవి జరగాలంటే సాధనలో వైక్లభ్యం కలిగించే అవకాశాలన్నింటినీ వదులుకోవాలి. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ అనే ఇంద్రియ సుఖాలు కలిగించే కొమ్మలపై వాలిపోయే అవకాశం లేకుండా చేసుకోవాలి. ఇంద్రియ నిగ్రహం అప్పుడు కలిగి మనసులో పరమాత్మ గురించి ఆలోచన మొదలవుతుంది. అక్కణ్ణుంచి వైరాగ్యం పుడుతుంది. చివరకు మోక్ష సాధనే లక్ష్యంగా బ్రహ్మవిచారణకు అవకాశం ఏర్పడుతుందా మనసులో.*
Ⓒ❤️ *ॐశ్రీవేంకటేశాయ నమః*
💕*~సకల జనుల శ్రేయోభిలాషి,*
*శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి*

Friday, November 3, 2023

 *ॐశ్రీవేంకటేశాయ నమః*
💝💝𝐍𝐨𝐭𝐡𝐢𝐧𝐠 𝐡𝐮𝐫𝐭𝐬 𝐦𝐨𝐫𝐞 𝐭𝐡𝐚𝐧 𝐛𝐞𝐢𝐧𝐠 𝐝𝐢𝐬𝐚𝐩𝐩𝐨𝐢𝐧𝐭𝐞𝐝 𝐛𝐲 𝐭𝐡𝐞 𝐩𝐞𝐫𝐬𝐨𝐧 𝐰𝐡𝐨 𝐲𝐨𝐮 𝐭𝐡𝐨𝐮𝐠𝐡𝐭 𝐰𝐨𝐮𝐥𝐝 𝐧𝐞𝐯𝐞𝐫 𝐡𝐮𝐫𝐭 𝐲𝐨𝐮.
💝💝𝐌𝐚𝐤𝐞 𝐘𝐨𝐮𝐫 𝐋𝐢𝐟𝐞 𝐁𝐞𝐭𝐭𝐞𝐫:~
💓𝐈𝐟 𝐲𝐨𝐮 𝐛𝐨𝐫𝐧 𝐩𝐨𝐨𝐫, 𝐢𝐭𝐬 𝐧𝐨𝐭 𝐲𝐨𝐮𝐫 𝐦𝐢𝐬𝐭𝐚𝐤𝐞,
💕~𝐁𝐮𝐭 𝐢𝐟 𝐲𝐨𝐮 𝐝𝐢𝐞 𝐩𝐨𝐨𝐫, 𝐢𝐭’𝐬 𝐲𝐨𝐮𝐫 𝐦𝐢𝐬𝐭𝐚𝐤𝐞..!
💓𝐁𝐨𝐫𝐧 𝐰𝐢𝐭𝐡 𝐩𝐞𝐫𝐬𝐨𝐧𝐚𝐥𝐢𝐭𝐲 𝐢𝐬 𝐚𝐧 𝐚𝐜𝐜𝐢𝐝𝐞𝐧𝐭,
💕~𝐁𝐮𝐭 𝐝𝐲𝐢𝐧𝐠 𝐢𝐧 𝐚 𝐩𝐞𝐫𝐬𝐨𝐧𝐚𝐥𝐢𝐭𝐲 𝐢𝐬 𝐚𝐧 𝐚𝐜𝐡𝐢𝐞𝐯𝐞𝐦𝐞𝐧𝐭..!
💓𝐘𝐨𝐮𝐫 𝐛𝐢𝐫𝐭𝐡 𝐦𝐚𝐲 𝐛𝐞 𝐧𝐨𝐫𝐦𝐚𝐥,
𝐁𝐮𝐭 𝐲𝐨𝐮𝐫 𝐝𝐞𝐚𝐭𝐡 𝐬𝐡𝐨𝐮𝐥𝐝 𝐛𝐞 𝐇𝐢𝐬𝐭𝐨𝐫𝐲..!
💕~𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐧𝐨𝐧𝐞,
𝐁𝐮𝐭 𝐥𝐞𝐚𝐫𝐧 𝐟𝐫𝐨𝐦 𝐞𝐯𝐞𝐫𝐲𝐨𝐧𝐞..!
💓𝐏𝐫𝐚𝐜𝐭𝐢𝐜𝐞 𝐥𝐢𝐤𝐞 𝐚 𝐝𝐞𝐯𝐢𝐥,
💕~𝐀𝐧𝐝 𝐩𝐥𝐚𝐲 𝐥𝐢𝐤𝐞 𝐚𝐧 𝐚𝐧𝐠𝐞𝐥..!
💓𝐃𝐨 𝐨𝐫 𝐃𝐢𝐞 𝐢𝐬 𝐚𝐧 𝐨𝐥𝐝 𝐜𝐨𝐧𝐜𝐞𝐩𝐭,
💕~𝐃𝐨 𝐢𝐭 𝐛𝐞𝐟𝐨𝐫𝐞 𝐝𝐢𝐞 𝐢𝐬 𝐭𝐡𝐞 𝐧𝐞𝐰 𝐜𝐨𝐧𝐜𝐞𝐩𝐭..!
💝💝𝐊𝐚𝐫𝐦𝐚 𝐬𝐚𝐢𝐝:~
💞𝐖𝐡𝐞𝐧 𝐬𝐨𝐦𝐞𝐛𝐨𝐝𝐲 𝐢𝐬 𝐍𝐎𝐓 𝐑𝐈𝐆𝐇𝐓 𝐟𝐨𝐫 𝐲𝐨𝐮, 𝐆𝐨𝐝 𝐰𝐢𝐥𝐥 𝐜𝐨𝐧𝐭𝐢𝐧𝐮𝐨𝐮𝐬𝐥𝐲 𝐮𝐬𝐞 𝐭𝐡𝐞𝐦 𝐭𝐨 𝐡𝐮𝐫𝐭 𝐲𝐨𝐮 𝐮𝐧𝐭𝐢𝐥 𝐲𝐨𝐮 𝐚𝐫𝐞 𝐒𝐓𝐑𝐎𝐍𝐆 𝐄𝐍𝐎𝐔𝐆𝐇 𝐭𝐨 𝐥𝐞𝐭 𝐭𝐡𝐞𝐦 𝐠𝐨.
💝💝𝐖𝐞 𝐚𝐫𝐞 𝐨𝐟𝐭𝐞𝐧 𝐥𝐞𝐭 𝐝𝐨𝐰𝐧 𝐛𝐲 𝐭𝐡𝐞 𝐦𝐨𝐬𝐭 𝐭𝐫𝐮𝐬𝐭𝐞𝐝 𝐩𝐞𝐨𝐩𝐥𝐞 𝐚𝐧𝐝 𝐥𝐨𝐯𝐞𝐝 𝐛𝐲 𝐭𝐡𝐞 𝐦𝐨𝐬𝐭 𝐮𝐧𝐞𝐱𝐩𝐞𝐜𝐭𝐞𝐝 𝐨𝐧𝐞𝐬. 
❤️~𝐒𝐨𝐦𝐞 𝐦𝐚𝐤𝐞 𝐮𝐬 𝐜𝐫𝐲 𝐟𝐨𝐫 𝐭𝐡𝐢𝐧𝐠𝐬 𝐭𝐡𝐚𝐭 𝐰𝐞 𝐡𝐚𝐯𝐞𝐧’𝐭 𝐝𝐨𝐧𝐞, 𝐰𝐡𝐢𝐥𝐞 𝐨𝐭𝐡𝐞𝐫𝐬 𝐢𝐠𝐧𝐨𝐫𝐞 𝐨𝐮𝐫 𝐟𝐚𝐮𝐥𝐭𝐬 𝐚𝐧𝐝 𝐣𝐮𝐬𝐭 𝐬𝐞𝐞 𝐨𝐮𝐫 𝐬𝐦𝐢𝐥𝐞. ❤️~𝐒𝐨𝐦𝐞 𝐥𝐞𝐚𝐯𝐞 𝐮𝐬 𝐰𝐡𝐞𝐧 𝐰𝐞 𝐧𝐞𝐞𝐝 𝐭𝐡𝐞𝐦 𝐭𝐡𝐞 𝐦𝐨𝐬𝐭, 𝐰𝐡𝐢𝐥𝐞 𝐬𝐨𝐦𝐞 𝐬𝐭𝐚𝐲 𝐰𝐢𝐭𝐡 𝐮𝐬 𝐞𝐯𝐞𝐧 𝐰𝐡𝐞𝐧 𝐚𝐬𝐤 𝐭𝐡𝐞𝐦 𝐭𝐨 𝐥𝐞𝐚𝐯𝐞. 
❤️~𝐓𝐡𝐞 𝐰𝐨𝐫𝐥𝐝 𝐢𝐬 𝐚 𝐦𝐢𝐱𝐭𝐮𝐫𝐞 𝐨𝐟 𝐩𝐞𝐨𝐩𝐥𝐞. 𝐖𝐞 𝐣𝐮𝐬𝐭 𝐧𝐞𝐞𝐝 𝐭𝐨 𝐤𝐧𝐨𝐰 𝐰𝐡𝐢𝐜𝐡 𝐡𝐚𝐧𝐝 𝐭𝐨 𝐬𝐡𝐚𝐤𝐞 𝐚𝐧𝐝 𝐰𝐡𝐢𝐜𝐡 𝐡𝐚𝐧𝐝 𝐭𝐨 𝐡𝐨𝐥𝐝! 
❤️~𝐀𝐟𝐭𝐞𝐫 𝐚𝐥𝐥 𝐭𝐡𝐚𝐭’𝐬 𝐥𝐢𝐟𝐞, 𝐥𝐞𝐚𝐫𝐧𝐢𝐧𝐠 𝐭𝐨 𝐡𝐨𝐥𝐝 𝐨𝐧 𝐚𝐧𝐝 𝐥𝐞𝐚𝐫𝐧𝐢𝐧𝐠 𝐭𝐨 𝐥𝐞𝐭 𝐠𝐨.

💝💝𝐁𝐞 𝐡𝐮𝐦𝐛𝐥𝐞. 𝐘𝐨𝐮 𝐦𝐚𝐲 𝐛𝐞 𝐰𝐫𝐨𝐧𝐠.
💞~𝐁𝐞 𝐡𝐚𝐫𝐝 𝐰𝐨𝐫𝐤𝐢𝐧𝐠. 𝐘𝐨𝐮 𝐦𝐚𝐲 𝐛𝐞 𝐥𝐮𝐜𝐤𝐢𝐞𝐫.
💞~𝐁𝐞 𝐤𝐢𝐧𝐝. 𝐘𝐨𝐮 𝐦𝐚𝐲 𝐛𝐞 𝐫𝐞𝐦𝐞𝐦𝐛𝐞𝐫𝐞𝐝. 
💞~𝐁𝐞 𝐠𝐞𝐧𝐞𝐫𝐨𝐮𝐬. 𝐎𝐭𝐡𝐞𝐫𝐬 𝐦𝐚𝐲 𝐫𝐞𝐜𝐢𝐩𝐫𝐨𝐜𝐚𝐭𝐞.
💞~𝐁𝐞 𝐜𝐮𝐫𝐢𝐨𝐮𝐬. 𝐘𝐨𝐮 𝐦𝐚𝐲 𝐬𝐭𝐚𝐲 𝐭𝐞𝐚𝐜𝐡𝐚𝐛𝐥𝐞.
💞~𝐁𝐞 𝐭𝐫𝐮𝐬𝐭𝐰𝐨𝐫𝐭𝐡𝐲. 𝐘𝐨𝐮 𝐦𝐚𝐲 𝐬𝐞𝐞 𝐟𝐮𝐫𝐭𝐡𝐞𝐫.
💞~𝐁𝐞 𝐟𝐨𝐫𝐠𝐢𝐯𝐢𝐧𝐠. 𝐘𝐨𝐮 𝐦𝐚𝐲 𝐟𝐞𝐞𝐥 𝐥𝐢𝐠𝐡𝐭𝐞𝐫.
💞~𝐁𝐞 𝐲𝐨𝐮𝐫𝐬𝐞𝐥𝐟. 𝐘𝐨𝐮 𝐰𝐢𝐥𝐥 𝐛𝐞 𝐡𝐚𝐩𝐩𝐢𝐞𝐫.
💝💝𝐒𝐢𝐥𝐞𝐧𝐜𝐞 𝐢𝐬 𝐭𝐡𝐞 𝐛𝐞𝐬𝐭 𝐫𝐞𝐯𝐞𝐧𝐠𝐞 𝐛𝐞𝐜𝐚𝐮𝐬𝐞 𝐢𝐭 𝐜𝐚𝐮𝐬𝐞𝐬 𝐭𝐡𝐞 𝐩𝐞𝐫𝐬𝐨𝐧 𝐰𝐡𝐨 𝐡𝐮𝐫𝐭 𝐲𝐨𝐮 𝐭𝐨 𝐰𝐨𝐫𝐫𝐲 𝐚𝐧𝐝 𝐰𝐨𝐧𝐝𝐞𝐫 𝐰𝐡𝐚𝐭 𝐲𝐨𝐮'𝐫𝐞 𝐮𝐩 𝐭𝐨. 
💓~𝐈𝐭'𝐬 𝐚𝐥𝐬𝐨 𝐚 𝐰𝐚𝐲 𝐨𝐟 𝐠𝐚𝐢𝐧𝐢𝐧𝐠 𝐜𝐨𝐧𝐭𝐫𝐨𝐥 𝐨𝐯𝐞𝐫 𝐭𝐡𝐞 𝐬𝐢𝐭𝐮𝐚𝐭𝐢𝐨𝐧 𝐛𝐲 𝐫𝐞𝐟𝐮𝐬𝐢𝐧𝐠 𝐭𝐨 𝐠𝐢𝐯𝐞 𝐭𝐡𝐞 𝐨𝐭𝐡𝐞𝐫 𝐩𝐞𝐫𝐬𝐨𝐧 𝐭𝐡𝐞 𝐬𝐚𝐭𝐢𝐬𝐟𝐚𝐜𝐭𝐢𝐨𝐧 𝐨𝐟 𝐡𝐞𝐚𝐫𝐢𝐧𝐠 𝐟𝐫𝐨𝐦 𝐲𝐨𝐮. 
💓~𝐏𝐥𝐮𝐬, 𝐢𝐭 𝐜𝐚𝐧 𝐛𝐞 𝐯𝐞𝐫𝐲 𝐟𝐫𝐮𝐬𝐭𝐫𝐚𝐭𝐢𝐧𝐠 𝐟𝐨𝐫 𝐭𝐡𝐚𝐭 𝐩𝐞𝐫𝐬𝐨𝐧 𝐢𝐟 𝐭𝐡𝐞𝐲 𝐜𝐚𝐧'𝐭 𝐠𝐞𝐭 𝐚𝐡𝐨𝐥𝐝 𝐨𝐟 𝐲𝐨𝐮 𝐨𝐫 𝐟𝐢𝐠𝐮𝐫𝐞 𝐨𝐮𝐭 𝐰𝐡𝐚𝐭 𝐡𝐚𝐩𝐩𝐞𝐧𝐞𝐝.
Ⓒ ❤️ *ॐ श्री वेंकटेश्वराय नम:*
💕 *_~𝐒𝐫𝐞𝐞𝐫𝐚𝐦 𝐋𝐚𝐱𝐦𝐢𝐧𝐚𝐫𝐚𝐲𝐚𝐧𝐚 𝐌𝐮𝐫𝐭𝐡𝐲_*

అపరాపరాక్రమశాలి అయిన భీష్ముడు ఇఛ్ఛా మరణాన్ని వరంగా పొందాడు. భీష్ముణ్ణి గెలవడం అంటే అంత సామాన్యమైన విషయం కాదు . కానీ ఒక స్త్రీ ఆపనిని సాధించింది.

 *ॐశ్రీవేంకటేశాయ నమః*
💝💝 *అపరాపరాక్రమశాలి అయిన భీష్ముడు ఇఛ్ఛా మరణాన్ని వరంగా పొందాడు. భీష్ముణ్ణి గెలవడం అంటే అంత సామాన్యమైన విషయం కాదు . కానీ ఒక స్త్రీ ఆపనిని సాధించింది.*
💝*ఈ కథకి మూలం కాశీరాజు ప్రకటించిన స్వయంవరం. కాశీరాజుకి ముగ్గురు కుమార్తెలు. అంబ, అంబిక, అంబాలిక . ముగ్గురూ చక్కని చుక్కలే. వీరికి స్వయంవరం ప్రకటించాడు కాశీరాజు.*
❤️ *తన తమ్ముళ్ళయిన చిత్రాంగదుడు,  విచిత్రవీర్యులకి ఇచ్చి పెళ్లి చెయ్యడం కోసం  భీష్ముడా స్వయంవరానికొచ్చిన రాజులందరినీ ఎదిరించి ఆ రాచకన్యలని హస్తినకు తీసుకొచ్చాడు. కానీ ఆయన ఆ పడుచుల మనసుని అడిగి ఆపని చేసుంటే ఎంతో బాగుండేది!*
💞 *అంబ అప్పటికే సాళ్వరాజుని వరించింది. చిన్ననాటినుండీ అతడే తన విభుడని కలలు కన్నది. భీష్ముడికి ఆవిషయాన్ని ధైర్యంగా చెప్పింది. భీష్ముడు సరేనని సాళ్వుని  దగ్గరకి ఆమెని  పంపించేశాడు. కానీ సాళ్వుడు “ఇంతకాలమూ ఆ హస్తినాపురంలో విచిత్రవీర్యునికి కాగల సాటిగా ఉన్న నిన్ను నేను ఏలుకోను పొమ్మ”న్నాడు.*
💓 *ఎంతగా అంబ నచ్చజెప్పినా, వేడుకున్నా ఆమె వేదన అరణ్యరోదనగానే మిగిలిపోయింది. తిరిగి భీష్ముని ఆశ్రయించింది అంబ. ‘నీ మనసులో పరపురుషుడు ఉండగా, నిన్ను నా తమ్మునికి కట్టబెట్టలే’నన్నాడు భీష్ముడు.*
💕 *అంబ అతని  కరుకు హృదయానికి తల్లడిల్లిపోయింది. దిక్కుతోచని స్థితిలో  పడింది . తన ఈ పరిస్థితికి కారణమైన భీష్మునిపై అంతులేని క్రోధంతో రగిలిపోయింది. ఎలాగైనా భీష్మునిపై పగ సాధించాలనే పంతానికి వచ్చింది.*
💖 *హొత్రవాహనుడనే రాజర్షి సాయంతో పరశురాముణ్ణి ఆశ్రయించింది. పరశురాముడు భీష్మునికి విలువిద్యనేర్పిన గురువు. కానీ భీష్ముడు గురువుని మించిన శిష్యుడనిపించుకున్నాడు.* 
💓*యుద్ధానికి దిగినా  పరశురామునిపైన విజయం భీష్మునిదే అయ్యింది . దానితో అంబ తన పంతం నెరవేర్చుకునే నిశ్చయంతో యమునాతీరంలో కుటీరాన్ని ఏర్పరచుకొని తీవ్రంగా తపస్సు చేయనారంభించింది.*

💖 *గంగాదేవి ప్రత్యక్షమై ఆమెకి దర్శనమిచ్చింది. తన కుమారుడైన భీష్ముని చంపాలనే ఆమె ఆకాంక్షనివిని కోపగించింది. “నువ్వు కుటిల సంచారిణివి ! కనుక ఈ శరీరం విడిచి ఏరై ప్రవహించు. అంతకన్నా నువ్వు భీష్ముణ్ణి ఏమీ చేయలేవు” అంది. కానీ అంబ తన తపఃఫలములో సగం ధారపోసి అంబానదిగా మారింది . మిగిలిన సగభాగంతో తన శరీరాన్ని నిలబెట్టుకొని పరమేశ్వరునికోసం తన తపస్సు కొనసాగించింది .*
💞 *ఆమె తపస్సుకి మెచ్చి శివుడు ప్రత్యక్షం అయ్యాడు . “మరుజన్మలో నువ్వు భీష్ముణ్ణి చంపగలవు“ అని వరం అనుగ్రహించాడు . మొదట నువ్వు ఈ శరీరాన్ని విడిచి ద్రుపదమహారాజుకి కూతురువై పుడతావు. ఆతర్వాత కొడుకుగామారి శిఖండి అనే పేరుతొ ప్రసిద్ధికెక్కి , గాంగేయుని వధిస్తావు అని వివరించి అంతర్థానమయ్యాడు.*
💓 *అంబ గాంగేయుణ్ణి చంపాలన్న ఒకే ఒక్క కోరికని మనస్సులో గట్టిగా నింపుకొని, చితిపేర్చుకొని అగ్నిప్రవేశం చేశింది . ఆ తర్వాత ద్రుపదమహారాజుకి సంతానముగా జన్మించి కురుక్షేత్ర సంగ్రామంలో శిఖండిగా మారి భీష్ముణ్ణి సంహరించింది.*
💖 *ఆవిధంగా అంబ తన పంతం నెగ్గించుకున్నది.  అందుకేనేమో “స్త్రీ పగపడితే అంతం చూస్తుంది” అన్నారు.*
Ⓒ❤️ *ॐశ్రీవేంకటేశాయ నమః*
💕*~సకల జనుల శ్రేయోభిలాషి,*
*శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి*
 *ॐశ్రీవేంకటేశాయ నమః*
💝💝𝑰 𝒏𝒆𝒗𝒆𝒓 𝒌𝒏𝒆𝒘 𝒘𝒉𝒂𝒕 𝒊𝒕 𝒇𝒆𝒍𝒕 𝒍𝒊𝒌𝒆 𝒘𝒉𝒆𝒏 𝒔𝒐𝒎𝒆𝒐𝒏𝒆 𝒈𝒐𝒕 𝒐𝒗𝒆𝒓 𝒕𝒉𝒆𝒊𝒓 𝒑𝒓𝒊𝒅𝒆 𝒂𝒏𝒅 𝒓𝒆𝒂𝒄𝒉𝒆𝒅 𝒐𝒖𝒕 𝒕𝒐 𝒔𝒉𝒐𝒘 𝒎𝒆 𝒕𝒉𝒂𝒕 𝒕𝒉𝒆𝒚 𝒘𝒂𝒏𝒕𝒆𝒅 𝒎𝒆 𝒃𝒂𝒄𝒌. 
💖~𝑰 𝒘𝒂𝒔 𝒂𝒍𝒘𝒂𝒚𝒔 𝒕𝒉𝒆 𝒐𝒏𝒆 𝒑𝒆𝒓𝒔𝒐𝒏 𝒕𝒐 𝒕𝒉𝒊𝒏𝒌 𝒐𝒇 𝒈𝒓𝒆𝒂𝒕 𝒈𝒆𝒔𝒕𝒖𝒓𝒆𝒔 𝒂𝒏𝒅 𝒍𝒐𝒏𝒈 𝒍𝒆𝒕𝒕𝒆𝒓𝒔 𝒕𝒐 𝒇𝒊𝒈𝒉𝒕 𝒇𝒐𝒓 𝒔𝒐𝒎𝒆𝒐𝒏𝒆. 
💖~𝑰 𝒄𝒂𝒏 𝒐𝒏𝒍𝒚 𝒆𝒗𝒆𝒓 𝒊𝒎𝒂𝒈𝒊𝒏𝒆 𝒘𝒉𝒂𝒕 𝒊𝒕 𝒇𝒆𝒆𝒍𝒔 𝒍𝒊𝒌𝒆 𝒕𝒐 𝒉𝒂𝒗𝒆 𝒔𝒐𝒎𝒆𝒐𝒏𝒆 𝒇𝒊𝒈𝒉𝒕 𝒇𝒐𝒓 𝒎𝒆.
💝💝𝑼𝒑𝒈𝒓𝒂𝒅𝒊𝒏𝒈 𝒚𝒐𝒖𝒓𝒔𝒆𝒍𝒇 𝒘𝒐𝒏'𝒕 𝒄𝒉𝒂𝒏𝒈𝒆 𝒕𝒉𝒆 𝒘𝒐𝒓𝒍𝒅 𝒂𝒓𝒐𝒖𝒏𝒅 𝒚𝒐𝒖. 
💕~𝒀𝒐𝒖 𝒘𝒊𝒍𝒍 𝒔𝒕𝒊𝒍𝒍 𝒄𝒐𝒎𝒆 𝒂𝒄𝒓𝒐𝒔𝒔 𝒑𝒆𝒐𝒑𝒍𝒆 𝒘𝒉𝒐 𝒘𝒊𝒍𝒍 𝒄𝒉𝒂𝒍𝒍𝒆𝒏𝒈𝒆 𝒂𝒏𝒅 𝒕𝒆𝒔𝒕 𝒚𝒐𝒖 𝒕𝒐 𝒕𝒓𝒊𝒈𝒈𝒆𝒓 𝒕𝒉𝒆 𝒐𝒍𝒅 𝒗𝒆𝒓𝒔𝒊𝒐𝒏 𝒐𝒇 𝒚𝒐𝒖 𝒕𝒐 𝒓𝒆𝒔𝒖𝒓𝒇𝒂𝒄𝒆; 𝒚𝒐𝒖 𝒎𝒖𝒔𝒕 𝒔𝒕𝒂𝒏𝒅 𝒔𝒕𝒓𝒐𝒏𝒈 𝒂𝒏𝒅 𝒓𝒆𝒎𝒆𝒎𝒃𝒆𝒓 𝒂𝒍𝒍 𝒕𝒉𝒆 𝒉𝒂𝒓𝒅 𝒘𝒐𝒓𝒌 𝒊𝒕 𝒕𝒐𝒐𝒌 𝒕𝒐 𝒓𝒆𝒃𝒖𝒊𝒍𝒅 𝒚𝒐𝒖𝒓𝒔𝒆𝒍𝒇 𝒊𝒏𝒕𝒐 𝒃𝒆𝒄𝒐𝒎𝒊𝒏𝒈 𝒕𝒉𝒆 𝒑𝒆𝒓𝒔𝒐𝒏 𝒚𝒐𝒖 𝒂𝒓𝒆 𝒕𝒐𝒅𝒂𝒚.
💝💝𝒀𝒐𝒖𝒓 𝒔𝒆𝒍𝒇-𝒆𝒔𝒕𝒆𝒆𝒎𝒆𝒅 𝒘𝒊𝒍𝒍 𝒊𝒎𝒑𝒓𝒐𝒗𝒆 𝒂𝒏𝒅 𝒚𝒐𝒖𝒓 𝒍𝒊𝒇𝒆 𝒘𝒊𝒍𝒍 𝒃𝒍𝒐𝒔𝒔𝒐𝒎 𝒘𝒉𝒆𝒏 𝒚𝒐𝒖 𝒔𝒖𝒓𝒓𝒐𝒖𝒏𝒅 𝒚𝒐𝒖𝒓𝒔𝒆𝒍𝒇 𝒘𝒊𝒕𝒉 𝒑𝒆𝒐𝒑𝒍𝒆 𝒘𝒉𝒐 𝒂𝒓𝒆 𝒈𝒐𝒐𝒅 𝒕𝒐 𝒚𝒐𝒖 𝒂𝒏𝒅 𝒇𝒐𝒓 𝒚𝒐𝒖. 💓~𝑵𝒆𝒈𝒂𝒕𝒊𝒗𝒊𝒕𝒚 𝒄𝒂𝒏𝒏𝒐𝒕 𝒂𝒇𝒇𝒆𝒄𝒕 𝒚𝒐𝒖 𝒊𝒇 𝒚𝒐𝒖 𝒄𝒉𝒐𝒐𝒔𝒆 𝒕𝒐 𝒏𝒐𝒕 𝒆𝒙𝒑𝒐𝒔𝒆 𝒚𝒐𝒖𝒓𝒔𝒆𝒍𝒇 𝒕𝒐 𝒊𝒕
💝💝𝑾𝒆 𝒄𝒂𝒏 𝒉𝒊𝒅𝒆 𝒇𝒓𝒐𝒎 𝒑𝒆𝒐𝒑𝒍𝒆, 𝒘𝒆 𝒄𝒂𝒏 𝒉𝒊𝒅𝒆 𝒇𝒓𝒐𝒎 𝒐𝒖𝒓 𝒑𝒂𝒊𝒏 𝒃𝒖𝒕 𝒘𝒆 𝒄𝒂𝒏'𝒕 𝒆𝒗𝒆𝒓 𝒉𝒊𝒅𝒆 𝒇𝒓𝒐𝒎 𝒐𝒖𝒓𝒔𝒆𝒍𝒗𝒆𝒔 𝒂𝒏𝒅 𝒘𝒉𝒂𝒕 𝒘𝒆 𝒇𝒆𝒆𝒍. 
💞𝑻𝒉𝒆 𝒃𝒊𝒈𝒈𝒆𝒔𝒕 𝒄𝒂𝒖𝒔𝒆 𝒐𝒇 𝒔𝒖𝒇𝒇𝒆𝒓𝒊𝒏𝒈 𝒂𝒏𝒅 𝒍𝒐𝒏𝒆𝒍𝒊𝒏𝒆𝒔𝒔 𝒊𝒔 𝒄𝒉𝒐𝒐𝒔𝒊𝒏𝒈 𝒕𝒐 𝒔𝒖𝒑𝒑𝒓𝒆𝒔𝒔, 𝒉𝒊𝒅𝒆 𝒐𝒓 𝒓𝒖𝒏 𝒇𝒓𝒐𝒎 𝒐𝒖𝒓 𝒇𝒆𝒆𝒍𝒊𝒏𝒈𝒔. 
💞~𝑷𝒆𝒐𝒑𝒍𝒆 𝒂𝒓𝒆𝒏'𝒕 𝒂𝒇𝒓𝒂𝒊𝒅 𝒐𝒇 𝒍𝒐𝒗𝒆, 𝒕𝒉𝒆𝒚'𝒓𝒆 𝒂𝒇𝒓𝒂𝒊𝒅 𝒐𝒇 𝒈𝒆𝒕𝒕𝒊𝒏𝒈 𝒉𝒖𝒓𝒕.
💞𝑩𝒖𝒕 𝒘𝒆 𝒘𝒆𝒓𝒆 𝒎𝒂𝒅𝒆 𝒕𝒐 𝒍𝒐𝒗𝒆: 𝒆𝒗𝒆𝒓𝒚𝒐𝒏𝒆 𝒘𝒂𝒏𝒕𝒔 𝒕𝒐 𝒃𝒆 𝒍𝒐𝒗𝒆𝒅. 𝑨𝒏𝒅 𝒂𝒔 𝒍𝒐𝒏𝒈 𝒂𝒔 𝒘𝒆 𝒉𝒂𝒗𝒆 𝒇𝒆𝒆𝒍𝒊𝒏𝒈𝒔 𝒐𝒇 𝒍𝒐𝒗𝒆 𝒇𝒐𝒓 𝒑𝒆𝒐𝒑𝒍𝒆, 𝒕𝒉𝒆𝒏 𝒘𝒆 𝒂𝒓𝒆 𝒂𝒍𝒊𝒗𝒆. 𝑾𝒉𝒆𝒏 𝒘𝒆 𝒃𝒆𝒄𝒐𝒎𝒆 𝒏𝒖𝒎𝒃 𝒕𝒐 𝒍𝒐𝒗𝒆, 𝒘𝒆 𝒂𝒓𝒆 𝒂𝒔 𝒈𝒐𝒐𝒅 𝒂𝒔 𝒅𝒆𝒂𝒅.

💝💝𝑴𝒂𝒌𝒆 𝒚𝒐𝒖𝒓𝒔𝒆𝒍𝒇 𝒖𝒏𝒂𝒗𝒂𝒊𝒍𝒂𝒃𝒍𝒆 𝒕𝒐 𝒑𝒆𝒐𝒑𝒍𝒆 𝒘𝒉𝒐 𝒕𝒉𝒊𝒏𝒌 𝒚𝒐𝒖 𝒘𝒊𝒍𝒍 𝒂𝒍𝒘𝒂𝒚𝒔 𝒃𝒆 𝒂𝒓𝒐𝒖𝒏𝒅 𝒕𝒉𝒆𝒎, 𝒏𝒐 𝒎𝒂𝒕𝒕𝒆𝒓 𝒘𝒉𝒂𝒕 𝒕𝒉𝒆𝒚 𝒅𝒐 𝒐𝒓 𝒉𝒐𝒘 𝒕𝒉𝒆𝒚 𝒕𝒓𝒆𝒂𝒕 𝒚𝒐𝒖.
💖~𝑾𝒉𝒆𝒏 𝒚𝒐𝒖 𝒈𝒊𝒗𝒆 𝒆𝒗𝒆𝒓𝒚𝒐𝒏𝒆 𝒂𝒄𝒄𝒆𝒔𝒔 𝒕𝒐 𝒚𝒐𝒖 𝒂𝒍𝒍 𝒕𝒉𝒆 𝒕𝒊𝒎𝒆, 𝒕𝒉𝒆𝒚 𝒘𝒐𝒏'𝒕 𝒗𝒂𝒍𝒖𝒆 𝒚𝒐𝒖. 𝑮𝒐𝒅 𝒊𝒔 𝒗𝒂𝒍𝒖𝒆𝒅 𝒃𝒆𝒄𝒂𝒖𝒔𝒆 𝒊𝒕𝒔 𝒓𝒂𝒓𝒆. 𝒀𝒐𝒖 𝒂𝒓𝒆 𝒈𝒐𝒍𝒅, 𝑩𝒆 𝑮𝒐𝒍𝒅.
💖~𝑮𝒆𝒕 𝒃𝒖𝒔𝒚 𝒘𝒊𝒕𝒉 𝒚𝒐𝒖𝒓 𝒐𝒘𝒏 𝒍𝒊𝒇𝒆 𝒂𝒏𝒅 𝒈𝒊𝒗𝒆 𝒚𝒐𝒖𝒓𝒔𝒆𝒍𝒇 𝒂𝒏𝒅 𝒑𝒆𝒐𝒑𝒍𝒆 𝒂𝒓𝒐𝒖𝒏𝒅 𝒚𝒐𝒖 𝒔𝒐𝒎𝒆 𝒔𝒑𝒂𝒄𝒆.
💖~𝑻𝒉𝒂𝒕'𝒔 𝒉𝒐𝒘 𝒚𝒐𝒖 𝒘𝒊𝒍𝒍 𝒈𝒂𝒊𝒏 𝒓𝒆𝒔𝒑𝒆𝒄𝒕; 𝒃𝒚 𝒑𝒖𝒍𝒍𝒊𝒏𝒈 𝒚𝒐𝒖𝒓 𝒆𝒏𝒆𝒓𝒈𝒚 𝒃𝒂𝒄𝒌 𝒂𝒏𝒅 𝒎𝒂𝒌𝒊𝒏𝒈 𝒚𝒐𝒖𝒓𝒔𝒆𝒍𝒇 𝒊𝒏𝒂𝒄𝒄𝒆𝒔𝒔𝒊𝒃𝒍𝒆 𝒕𝒐 𝒑𝒆𝒐𝒑𝒍𝒆 𝒘𝒉𝒐 𝒂𝒓𝒆 𝒖𝒔𝒆𝒅 𝒕𝒐 𝒉𝒂𝒗𝒊𝒏𝒈 𝒚𝒐𝒖 𝒂𝒓𝒐𝒖𝒏𝒅 𝒂𝒍𝒍 𝒕𝒉𝒆 𝒕𝒊𝒎𝒆. 𝑭𝒂𝒎𝒊𝒍𝒊𝒂𝒓𝒊𝒕𝒚 𝒐𝒑𝒆𝒏𝒔 𝒅𝒐𝒐𝒓𝒔 𝒕𝒐 𝒅𝒊𝒔𝒓𝒆𝒔𝒑𝒆𝒄𝒕, 𝒘𝒉𝒊𝒍𝒆 𝒚𝒐𝒖𝒓 𝒂𝒃𝒔𝒆𝒏𝒄𝒆 𝒘𝒊𝒍𝒍 𝒓𝒂𝒊𝒔𝒆 𝒚𝒐𝒖𝒓 𝒗𝒂𝒍𝒖𝒆.
💝💝𝑾𝒐𝒓𝒓𝒚𝒊𝒏𝒈 𝒊𝒔 𝒂 𝒘𝒂𝒔𝒕𝒆 𝒐𝒇 𝒕𝒊𝒎𝒆. 
💕~𝑰𝒕 𝒅𝒐𝒆𝒔𝒏'𝒕 𝒄𝒉𝒂𝒏𝒈𝒆 𝒂𝒏𝒚𝒕𝒉𝒊𝒏𝒈. 
💕~𝑰𝒕 𝒎𝒆𝒔𝒔𝒆𝒔 𝒘𝒊𝒕𝒉 𝒚𝒐𝒖𝒓 𝒎𝒊𝒏𝒅 𝒂𝒏𝒅 𝒔𝒕𝒆𝒂𝒍𝒔 𝒚𝒐𝒖𝒓 𝒉𝒂𝒑𝒑𝒊𝒏𝒆𝒔𝒔.
Ⓒ ❤️ *ॐ श्री वेंकटेश्वराय नम:*
💕 *_~𝑺𝒓𝒆𝒆𝒓𝒂𝒎 𝑳𝒂𝒙𝒎𝒊𝒏𝒂𝒓𝒂𝒚𝒂𝒏𝒂 𝑴𝒖𝒓𝒕𝒉𝒚_*

మన సద్గతికైనా, దుర్గతికైనా కారణం మన మనస్సే.

 *ॐశ్రీవేంకటేశాయ నమః*
💝💝 *మన సద్గతికైనా, దుర్గతికైనా కారణం మన మనస్సే.*
💕*దేహమే సమస్త బ్రహ్మాండాలకు ప్రతిరూపం. దీని లోపల ఉన్న ఆత్మయే దైవం.*
❤️ *మనస్సుకు పరిమితమైనవాడు జీవుడు. మనో మూలంలోనికి వెళ్ళినవాడు దేవుడు.*
💖*మనో మూలంలోనికి వెళ్ళినవారి దేహమే దేవాలయమౌతుంది.*
💕 *”భగవంతుణ్ణి చిత్రాలలో వెతకొద్దు,చిత్తములో వెతకండి”అని భగవాన్ శ్రీరమణమహర్షి అన్నారు.*
💓 *దీన్నిబట్టి ‘మనకి భగవంతుడు మన హృదయంలోనే ఉన్నాడు’ అని తెలుస్తున్నది కదా!_*
💓 *కానీ మనకి కానరావడం లేదు. ఎందుకూ? మన మనస్సులో ఉన్న మాలిన్యాల వల్ల.*
❤️ *మనలో ఉన్న దేవుడు మనకు కనబడపోవడానికి ప్రధాన కారణాలు రెండే రెండు తలంపులు ! మొదటిది ‘నేను’ అనే తలంపు. ఇక రెండవది ‘నాది’ అన్న తలంపు. మొదటిది అహంకారం, రెండవది మమకారం ! ఈ రెండు మాలిన్యాలు వదిలించుకుంటేనే జీవుడు దేవుడౌతాడు.*
💕 *మన హృదయములో ఉన్న పరబ్రహ్మం పరమ పవిత్రుడు. ఆ పరమపవిత్రుణ్ణి పరికించాలంటే మనమూ పవిత్రం కావాలి… ఎలా ?*
❤️ *ప్రతిరోజూ పూజగదిలో పూజకు ముందు మనం మొదట చేసే పనీ, ప్రతిరోజు దేవాలయంలో అర్చకుడు మొదట చేసే పనీ ఒకటే. అది ముందురోజు నిర్మాల్యములను తీసేసి పుజాసామగ్రిని పూజగదిని శుభ్రపరిచి అన్నీ శుద్ధి చేసిన తర్వాతే పూజ ప్రారంభించడం. ఈ రీతిలోనే హృదయమునందున్న భగవంతుడిని మనం అవలోకించాలంటే ముందుగా మనో మాలిన్యాలను తొలగించాలి.*
💖 *అజ్ఞానమనే నిర్మాల్యమును తీసేయాలి. ముందురోజు శేషాలను ఎలా తొలగిస్తామో అలాగునే అంతరంగమున కర్మఫల శేషాలను తొలగించాలి. (కర్తృత్వ భావనను తొలగించుకోవాలి).*
💞 *మనలో ఉన్న అజ్ఞాన నిర్మాల్యాలను తొలగించడానికి కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములనెడి ఆరు అడ్డంకులు ఉన్నాయి, వాటిని తొలగించాలి.*
💕 *సత్కర్మాచరణ, సత్సంగీయుల సాంగత్యం, సర్వేశ్వరుని స్మరణ, సదావగాహన, సత్వగుణ సాధన, సేవాతత్పరత, శుద్ధాహారములతో ఈ నిర్మాల్యములను తొలగించవచ్చు.*
💖 *శుద్ధ ఆహారమంటే నోటితో తీసుకున్న ఆహారం మాత్రమే కాదు, పంచేంద్రియాల ద్వారా అంటే నోరు, కన్ను, ముక్కు, చెవి, చర్మముల ద్వారా గ్రహించేది కూడా ఆహారమే అవుతుంది.*
💕*మనస్సునూ బుద్ధినీ సంస్కరించుకుంటూ ఇంద్రియాలను నిగ్రహించుకుంటూ మన ఆలోచనల్లో మాటల్లో చేతల్లో పవిత్రతను పెంచుకోవాలి.*

💞 *మన సద్గతికీ, దుర్గతికీ కారణం మన మనస్సే. మన మనోచాపల్యమే మన అశాంతులకు కారణం. మన కర్మలే మన సుఖదుఃఖాలకు కారణం.*
💕*మనలో అనేకానేక బలహీనతలుంటాయి. అలాగే లోకంలో అనేక ఆకర్షణలూ ఉంటాయి. ఇలాంటప్పుడే బుద్ధిని వినియోగించాలి.*
💕*హృదయంలో భగవంతుడు ఉన్నాడని తెలిసినా ఆయన గురించి ఆలోచించం…ఇదే కదా మాయ.*

❤️ *శారీరకంగా, మానసికంగా దేహాన్ని శుద్ధపరుచుకోవాలి. దేహధర్మం ప్రకారం కుటుంబ, సమాజ, ఋషి రుణాలు తీర్చుకుంటూ.. ఈ దేహం శిధిలమవ్వకముందే హృదయమందున్న దేవుడిని పట్టుకోవాలి.*
💖 *మానవుడు ఆనందం అనుభవించాలంటే అతనికి రెండు విషయాలు కావాలి. అవి ప్రేమ, జ్ఞానం ఈ రెండు ఉన్నప్పుడే ఏకత్వస్థితి వస్తుంది !Ⓒ❤️ *ॐశ్రీవేంకటేశాయ నమః*
💕*~సకల జనుల శ్రేయోభిలాషి,*
*శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి*
 *ॐశ్రీవేంకటేశాయ నమః*
💝💝*𝐀𝐜𝐜𝐨𝐫𝐝𝐢𝐧𝐠 𝐭𝐨 𝐚𝐧 𝐨𝐥𝐝 𝐥𝐞𝐠𝐞𝐧𝐝, 𝐚 𝐤𝐢𝐧𝐠 𝐰𝐞𝐧𝐭 𝐭𝐨 𝐯𝐢𝐬𝐢𝐭 𝐡𝐢𝐬 𝐧𝐞𝐢𝐠𝐡𝐛𝐨𝐫𝐢𝐧𝐠 𝐤𝐢𝐧𝐠𝐝𝐨𝐦 𝐡𝐞𝐫𝐞.  𝐓𝐡𝐞 𝐧𝐞𝐢𝐠𝐡𝐛𝐨𝐫𝐢𝐧𝐠 𝐤𝐢𝐧𝐠 𝐡𝐨𝐬𝐭𝐞𝐝 𝐭𝐡𝐞 𝐠𝐮𝐞𝐬𝐭 𝐤𝐢𝐧𝐠 𝐯𝐞𝐫𝐲 𝐰𝐞𝐥𝐥.  𝐀𝐟𝐭𝐞𝐫 𝐬𝐭𝐚𝐲𝐢𝐧𝐠 𝐭𝐡𝐞𝐫𝐞 𝐟𝐨𝐫 𝐚 𝐟𝐞𝐰 𝐝𝐚𝐲𝐬 𝐰𝐡𝐞𝐧 𝐭𝐡𝐞 𝐤𝐢𝐧𝐠 𝐫𝐞𝐭𝐮𝐫𝐧𝐞𝐝 𝐭𝐨 𝐡𝐢𝐬 𝐤𝐢𝐧𝐠𝐝𝐨𝐦, 𝐭𝐡𝐞 𝐧𝐞𝐢𝐠𝐡𝐛𝐨𝐫𝐢𝐧𝐠 𝐤𝐢𝐧𝐠 𝐠𝐢𝐟𝐭𝐞𝐝 𝐡𝐢𝐦 𝐭𝐰𝐨 𝐛𝐞𝐚𝐮𝐭𝐢𝐟𝐮𝐥 𝐩𝐢𝐠𝐞𝐨𝐧𝐬.*
💖*𝐓𝐡𝐞 𝐤𝐢𝐧𝐠 𝐭𝐨𝐨𝐤 𝐭𝐡𝐞 𝐭𝐰𝐨 𝐩𝐢𝐠𝐞𝐨𝐧𝐬 𝐭𝐨 𝐡𝐢𝐬 𝐩𝐚𝐥𝐚𝐜𝐞.  𝐓𝐡𝐞𝐫𝐞 𝐚 𝐬𝐞𝐫𝐯𝐚𝐧𝐭 𝐰𝐚𝐬 𝐚𝐩𝐩𝐨𝐢𝐧𝐭𝐞𝐝 𝐭𝐨 𝐥𝐨𝐨𝐤 𝐚𝐟𝐭𝐞𝐫 𝐭𝐡𝐞 𝐩𝐢𝐠𝐞𝐨𝐧𝐬.  𝐓𝐡𝐞 𝐬𝐞𝐫𝐯𝐚𝐧𝐭 𝐰𝐨𝐮𝐥𝐝 𝐚𝐫𝐫𝐚𝐧𝐠𝐞 𝐟𝐨𝐨𝐝 𝐚𝐧𝐝 𝐰𝐚𝐭𝐞𝐫 𝐟𝐨𝐫 𝐭𝐡𝐞 𝐩𝐢𝐠𝐞𝐨𝐧𝐬 𝐢𝐧 𝐭𝐡𝐞 𝐦𝐨𝐫𝐧𝐢𝐧𝐠.  𝐀 𝐟𝐞𝐰 𝐝𝐚𝐲𝐬 𝐥𝐚𝐭𝐞𝐫, 𝐰𝐡𝐞𝐧 𝐭𝐡𝐞 𝐤𝐢𝐧𝐠 𝐚𝐫𝐫𝐢𝐯𝐞𝐝 𝐭𝐨 𝐤𝐧𝐨𝐰 𝐭𝐡𝐞 𝐜𝐨𝐧𝐝𝐢𝐭𝐢𝐨𝐧 𝐨𝐟 𝐭𝐡𝐨𝐬𝐞 𝐩𝐢𝐠𝐞𝐨𝐧𝐬.*

💞*𝐓𝐡𝐞 𝐬𝐞𝐫𝐯𝐚𝐧𝐭 𝐬𝐚𝐢𝐝 𝐭𝐡𝐚𝐭 𝐨𝐧𝐞 𝐩𝐢𝐠𝐞𝐨𝐧 𝐟𝐥𝐢𝐞𝐬 𝐭𝐨 𝐚 𝐯𝐞𝐫𝐲 𝐡𝐢𝐠𝐡 𝐡𝐞𝐢𝐠𝐡𝐭, 𝐛𝐮𝐭 𝐭𝐡𝐞 𝐨𝐭𝐡𝐞𝐫 𝐨𝐧𝐞 𝐢𝐬 𝐬𝐢𝐭𝐭𝐢𝐧𝐠 𝐨𝐧 𝐚 𝐛𝐫𝐚𝐧𝐜𝐡 𝐨𝐟 𝐭𝐡𝐞 𝐭𝐫𝐞𝐞.  𝐓𝐡𝐞 𝐤𝐢𝐧𝐠 𝐰𝐚𝐬 𝐯𝐞𝐫𝐲 𝐬𝐚𝐝 𝐭𝐨 𝐤𝐧𝐨𝐰 𝐰𝐡𝐲 𝐭𝐡𝐞 𝐨𝐭𝐡𝐞𝐫 𝐩𝐢𝐠𝐞𝐨𝐧 𝐢𝐬 𝐧𝐨𝐭 𝐟𝐥𝐲𝐢𝐧𝐠.*
💓*𝐓𝐡𝐞 𝐤𝐢𝐧𝐠 𝐢𝐦𝐦𝐞𝐝𝐢𝐚𝐭𝐞𝐥𝐲 𝐬𝐮𝐦𝐦𝐨𝐧𝐞𝐝 𝐡𝐢𝐬 𝐦𝐢𝐧𝐢𝐬𝐭𝐞𝐫𝐬, 𝐛𝐮𝐭 𝐧𝐨 𝐨𝐧𝐞 𝐜𝐨𝐮𝐥𝐝 𝐮𝐧𝐝𝐞𝐫𝐬𝐭𝐚𝐧𝐝 𝐰𝐡𝐚𝐭 𝐡𝐚𝐝 𝐡𝐚𝐩𝐩𝐞𝐧𝐞𝐝 𝐭𝐨 𝐭𝐡𝐞 𝐨𝐭𝐡𝐞𝐫 𝐩𝐢𝐠𝐞𝐨𝐧.  𝐓𝐡𝐞𝐧 𝐬𝐨𝐦𝐞𝐨𝐧𝐞 𝐚𝐝𝐯𝐢𝐬𝐞𝐝 𝐭𝐡𝐞 𝐤𝐢𝐧𝐠 𝐭𝐡𝐚𝐭 𝐭𝐡𝐞 𝐛𝐢𝐫𝐝𝐬 𝐬𝐡𝐨𝐮𝐥𝐝 𝐛𝐞 𝐜𝐚𝐥𝐥𝐞𝐝.  𝐓𝐡𝐞 𝐦𝐢𝐧𝐢𝐬𝐭𝐞𝐫𝐬 𝐢𝐦𝐦𝐞𝐝𝐢𝐚𝐭𝐞𝐥𝐲 𝐜𝐚𝐥𝐥𝐞𝐝 𝐚 𝐩𝐨𝐨𝐫 𝐟𝐚𝐫𝐦𝐞𝐫.*
💖*𝐓𝐡𝐞 𝐟𝐚𝐫𝐦𝐞𝐫 𝐰𝐚𝐬 𝐟𝐚𝐦𝐢𝐥𝐢𝐚𝐫 𝐰𝐢𝐭𝐡 𝐛𝐢𝐫𝐝𝐬, 𝐬𝐚𝐰 𝐭𝐡𝐞 𝐚𝐫𝐞𝐚 𝐚𝐫𝐨𝐮𝐧𝐝 𝐭𝐡𝐞 𝐩𝐢𝐠𝐞𝐨𝐧 𝐚𝐧𝐝 𝐜𝐮𝐭 𝐭𝐡𝐞 𝐛𝐫𝐚𝐧𝐜𝐡 𝐨𝐟 𝐭𝐡𝐞 𝐭𝐫𝐞𝐞 𝐨𝐧 𝐰𝐡𝐢𝐜𝐡 𝐡𝐞 𝐬𝐚𝐭.*
❤️ *𝐀𝐟𝐭𝐞𝐫 𝐭𝐡𝐢𝐬, 𝐭𝐡𝐞 𝐬𝐞𝐜𝐨𝐧𝐝 𝐩𝐢𝐠𝐞𝐨𝐧 𝐚𝐥𝐬𝐨 𝐬𝐭𝐚𝐫𝐭𝐞𝐝 𝐟𝐥𝐲𝐢𝐧𝐠 𝐡𝐢𝐠𝐡 𝐢𝐧 𝐭𝐡𝐞 𝐬𝐤𝐲. 𝐓𝐡𝐞 𝐟𝐚𝐫𝐦𝐞𝐫 𝐭𝐨𝐥𝐝 𝐭𝐡𝐞 𝐤𝐢𝐧𝐠 𝐭𝐡𝐚𝐭 𝐭𝐡𝐢𝐬 𝐩𝐢𝐠𝐞𝐨𝐧 𝐰𝐚𝐬 𝐭𝐫𝐚𝐩𝐩𝐞𝐝 𝐢𝐧 𝐭𝐡𝐞 𝐟𝐚𝐬𝐜𝐢𝐧𝐚𝐭𝐢𝐨𝐧 𝐨𝐟 𝐭𝐡𝐢𝐬 𝐛𝐫𝐚𝐧𝐜𝐡, 𝐚𝐟𝐫𝐚𝐢𝐝 𝐨𝐟 𝐭𝐚𝐤𝐢𝐧𝐠 𝐭𝐡𝐞 𝐫𝐢𝐬𝐤 𝐨𝐟 𝐟𝐥𝐲𝐢𝐧𝐠, 𝐰𝐡𝐞𝐧 𝐭𝐡𝐢𝐬 𝐛𝐫𝐚𝐧𝐜𝐡 𝐰𝐚𝐬 𝐜𝐮𝐭, 𝐢𝐭 𝐡𝐚𝐝 𝐧𝐨 𝐨𝐭𝐡𝐞𝐫 𝐨𝐩𝐭𝐢𝐨𝐧 𝐛𝐮𝐭 𝐭𝐨 𝐟𝐥𝐲.*
💞 *𝐃𝐮𝐞 𝐭𝐨 𝐭𝐡𝐢𝐬, 𝐡𝐞 𝐡𝐚𝐬 𝐬𝐭𝐚𝐫𝐭𝐞𝐝 𝐟𝐥𝐲𝐢𝐧𝐠 𝐭𝐨 𝐡𝐢𝐠𝐡 𝐚𝐥𝐭𝐢𝐭𝐮𝐝𝐞.  𝐓𝐡𝐞 𝐤𝐢𝐧𝐠 𝐰𝐚𝐬 𝐩𝐥𝐞𝐚𝐬𝐞𝐝 𝐭𝐨 𝐬𝐞𝐞 𝐭𝐡𝐢𝐬 𝐚𝐧𝐝 𝐡𝐨𝐧𝐨𝐫𝐞𝐝 𝐭𝐡𝐞 𝐟𝐚𝐫𝐦𝐞𝐫 𝐰𝐢𝐭𝐡 𝐠𝐨𝐥𝐝 𝐜𝐨𝐢𝐧𝐬.*

💖 *𝐋𝐞𝐚𝐫𝐧𝐢𝐧𝐠 𝐨𝐟 𝐚 𝐬𝐭𝐨𝐫𝐲…𝐓𝐡𝐞 𝐛𝐚𝐬𝐢𝐜 𝐦𝐞𝐬𝐬𝐚𝐠𝐞 𝐨𝐟 𝐭𝐡𝐢𝐬 𝐥𝐞𝐠𝐞𝐧𝐝 𝐢𝐬 𝐭𝐡𝐚𝐭 𝐭𝐡𝐨𝐬𝐞 𝐰𝐡𝐨 𝐚𝐫𝐞 𝐚𝐟𝐫𝐚𝐢𝐝 𝐭𝐨 𝐭𝐚𝐤𝐞 𝐫𝐢𝐬𝐤𝐬, 𝐝𝐨 𝐧𝐨𝐭 𝐰𝐚𝐧𝐭 𝐭𝐨 𝐠𝐢𝐯𝐞 𝐮𝐩 𝐭𝐡𝐞𝐢𝐫 𝐥𝐞𝐢𝐬𝐮𝐫𝐞 𝐰𝐨𝐫𝐤, 𝐭𝐡𝐞𝐲 𝐜𝐚𝐧𝐧𝐨𝐭 𝐟𝐥𝐲 𝐭𝐨 𝐭𝐡𝐞 𝐡𝐞𝐢𝐠𝐡𝐭 𝐢.𝐞. 𝐝𝐨 𝐧𝐨𝐭 𝐚𝐜𝐡𝐢𝐞𝐯𝐞 𝐚𝐧𝐲 𝐬𝐮𝐜𝐜𝐞𝐬𝐬. 𝐈𝐟 𝐲𝐨𝐮 𝐚𝐥𝐬𝐨 𝐰𝐚𝐧𝐭 𝐭𝐨 𝐝𝐨 𝐬𝐨𝐦𝐞𝐭𝐡𝐢𝐧𝐠 𝐛𝐢𝐠, 𝐭𝐡𝐞𝐧 𝐲𝐨𝐮 𝐡𝐚𝐯𝐞 𝐭𝐨 𝐭𝐚𝐤𝐞 𝐫𝐢𝐬𝐤.*
 Ⓒ ❤️ *ॐ श्री वेंकटेश्वराय नम:*
💕 *_~𝐒𝐫𝐞𝐞𝐫𝐚𝐦 𝐋𝐚𝐱𝐦𝐢𝐧𝐚𝐫𝐚𝐲𝐚𝐧𝐚 𝐌𝐮𝐫𝐭𝐡𝐲_*

’భగవద్గీత’లో శ్రీకృష్ణుడు చెప్పినట్లు...

 *ॐశ్రీవేంకటేశాయ నమః*
💝💝 *’భగవద్గీత’లో శ్రీకృష్ణుడు చెప్పినట్లు ఆత్మ కు ఏవిధంగానూ నాశనం ఉండదు. మనిషి చేసిన పుణ్య /పాప కర్మలు వాసన రూపంలో ఒకదానిమీద ఇంకొకటి పేర్చబడి, సూక్ష్మరూపంలో మరుసటి జన్మలో ఈ ఆత్మ ధరించిన దేహాన్ని చేరుతాయి.*
💖 *”కర్మఫలం” పూర్తిగా ‘అనుభవించడం’ పూర్తి అయ్యే వరకూ ఏదో ప్రాణిగా జన్మలు ఎత్తక తప్పదు. ప్రస్తుత జన్మలో అనుభవించగా మిగిలిన కర్మలు తదుపరి జన్మకు Carry forward ఔతాయన్నమాట.*
❤️ *కర్మననుభవించాలంటే ఖచ్చితంగా శరీరం కావాలి. శరీరం కావాలంటే జన్మ ఎత్తక తప్పదు. ఇలా పలుజన్మలనుండి అనుభవించకుండా Pending లో ఉన్న కర్మలనే “సంచిత కర్మలు” అంటారు. ప్రస్తుతం అనుభవంలోకి ప్రవేశించిన కర్మలను “ప్రారబ్ధ కర్మలు” అనీ, భవిష్యత్తులో చేయబోయే కర్మలను “ఆగామి కర్మలు” అనీ అంటాం.*
💕 *మనమిప్పుడే అనుభవించేస్తున్నాం కనుక, “ప్రారబ్ధ కర్మల” వలన ఇబ్బంది లేదు. భవిష్యత్తులో చెడ్డ పనులు చేయడం మానేస్తే “ఆగామి కర్మల” సమస్యా ఉండదు. కాగా ఇక మిగిలినవి “Recurring Deposit” “సంచిత కర్మలు" మాత్రమే.*
💞 *ఈ సంచిత కర్మలు ( Old stock) అనుభవించకుండా మాఫీ చేసుకోవడానిక్కూడా, “భగవద్గీత”లో మార్గం సూచించబడింది. “నేను ఈ శరీరాన్ని కాదు. భగవంతుని అంశతో ఈ శరీరంలో శ్వాస/ ఆత్మ రూపంలో ఉన్నాను. ఈ శరీరం చేసే కర్మల మంచితో కానీ, చెడుతో కానీ నాకు సంబంధమే లేదు. నాకేవిధమైన కోరికలు లేవు. ‘పరమాత్మ’లో నేను లీనమవ్వడమే ఏకైక లక్ష్యంగా దైవచింతన చేస్తున్నాను.” అని భావించి, ఐహిక /భౌతిక బంధాలకు దూరంగా చిత్తశుద్ధితో భగవంతుణ్ణి శరణాగతి కోరితే ఆభగవంతుడు ప్రసాదించే "జ్ఞానాగ్ని"లో ఈ సంచిత కర్మలు దగ్ధం చేయబడి ఇక జన్మలెత్తే అవసరం ఉండదు. మనకీ విషయాన్నే గీతాచార్యుడిగా కృష్ణపరమాత్ముడూ, ఆదిశంకరాచార్యుల రూపంలో పరమశివుడూ చెప్పారు.*
💓 *మరణానంతరం యమభటులు సూక్ష్మశరీరాన్ని మూడుశరీరాలుగా విభజిస్తారు. ఒకటి యమలోకానికి (యాతనా) వేరొకటి స్వర్గలోగానికి (భోగపు) ఇంకొకటి పితృలోకం (భోక్తము) లోనూ ఉంటుంది. తరువాత జన్మకు ముందే యమలోకం, స్వర్గలోకంలో ఉన్న శరీరాలొచ్చి పితృలోకంలో ఉన్న శరీరంతో కలసి ఎంచుకోబడిన తల్లి గర్భంలో జన్మ తీసుకుంటుంది.*
💞 *దేన్నైనా మనం నమ్మితేనే అది మనకు ‘యదార్థం’గా కనిపిస్తుంది. లేకపోతే గాలిలో పేకముక్కలతో ఇల్లు కట్టుకొన్నట్లే ఉంటుంది. కానీ నిప్పుని నిప్పు అని నమ్మక, చెప్పినా వినక అందులో వేలు పెడితే కాలక మిన్నకుండదు కదా…! ఇది మన సనాతనధర్మం మన మేలు కోరి చెప్పిన నిజం. కనుక నేనైతే నమ్మి సత్కర్మలనే చేయటానికి ప్రయత్నిస్తున్నా. అలా నన్ను ధర్మ మార్గంలోనే నడిపించమని మాత్రమే నేను భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నా.* 
💖 *”సర్వే జనాః సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని భవంతు. లోకాస్సమస్తా స్సుఖినోభవంతు." అనేదే సనాతన ధర్మం యొక్క ప్రధానోద్దేశ్యం.*
💞 *’ఆత్మ’ శరీరంలో దాగి ఉన్నంతసేపూ శరీరంపడే కష్టాల ప్రభావం దాన్ని ప్రభావితం చేస్తూంటుంది. సుఖదుఃఖాలూ, ఆకలిదప్పికలూ లాంటివి కూడా శరీరానికి కలిగేవే అయినా దాని ఫలితం కర్మలమీద పడుతుంది. ఈ “సంచిత కర్మలు” అనేవి ఆత్మతోబాటు అది ఆక్రమించిన శరీరంతోనే ఒక కనబడని సంచీలో ఆ జీవితోబాటే అంటిపెట్టుకుని తిరుగుతూనే ఉంటాయి. మనంకొత్తగా చేసే కర్మల ఫలితాలు కూడా ఆ సంచీలో పడుతూనే ఉంటాయి.*

💖 *ఒక పెద్దమనిషి చెప్పిన ఒకసారి చెప్పిన విచిత్రమైన విషయం గుర్తుకు వస్తోంది. “మనం చేసే చెడుపనులు ఇనుప సంకెళ్లులాంటివి” ఐతే “మనం మితిమీరి చేసే మంచిపనులు బంగారు సంకెళ్ల లాంటివి” అంటూనే “ఇనుప సంకెళ్లు అంతులేని కష్టాలైతే బంగారు సంకెళ్లు అపరిమిత సంపదలనూ, అంతులేని సుఖాలనూ ఇచ్చేవి. ఐతే వాటి్వలన వచ్చే చిక్కులూ, ద్వేషాలూ, ప్రాణాపాయాల సంఘటనలూ కూడా” అని చెప్పారాయన…!*
💓 *”కనుక మనసాయంకోరి వచ్చేవాడి నుండి ఏ ప్రతిఫలాన్నీ తిరిగి ఆశించకుండా సహాయం చెయ్యడమే సర్వ శ్రేష్ఠమైన పధ్ధతి అవుతుంది. కానీ మనమే ముక్కూముఖం తెలియని వాళ్లని వెతికి పట్టుకుని, పూసుకుని మరీ త్యాగభావంతో సేవ చేస్తే మనకు మనమే కోరుకుని బంగారు సంకెళ్లను తగిలించుకోవడమే ఔతుంది కదా…!” అని కూడా చెప్పాడా పెద్దమనిషి.*
💖 *నిజంగా జ్ఞానోదయమైంది నాకాయన మాటలతో. ప్రతీదానికి ఒక రీజనబుల్ లిమిట్ ఉండాల్సిందే. “పిలిచి పిల్లితల కొరిగే”చందంగా “గాలికిపోయే కంపను మనకు మనమే తగిలించుకునే” విధంగా “అపాత్రులకు” సహాయం చేస్తూవస్తున్న మనస్తత్వాన్ని దూరం చేసుకునే ప్రయత్నాలను ఆరంభించాను.*
Ⓒ❤️ *ॐశ్రీవేంకటేశాయ నమః*
💕*~సకల జనుల శ్రేయోభిలాషి,*
*శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి*

రాజుల కాలంలో వాడిన ఫిరంగులు ఎలా పనిచేసేవి? అందులో నుంచి లోహపు గుండ్లు ఎలా వదిలేవారు?*

 *✅ తెలుసుకుందాం ✅*


*🔴రాజుల కాలంలో వాడిన ఫిరంగులు ఎలా పనిచేసేవి? అందులో నుంచి లోహపు గుండ్లు ఎలా వదిలేవారు?*

✳నాటి ఫిరంగులైనా, నేటివైనా, తుపాకులైనా, రివాల్వరులైనా సూత్రం ఒకటే. పేలుడు పదార్థం, గుండు లేదా బుల్లెట్‌సైజు, గుండు బయటకొచ్చే ద్వారం అడ్డుకోత వైశాల్యం, పేల్చే విధానం మొదలైన విషయాల్లోనే తేడా.

ఫిరంగి ఓ వైపు మూసుకొని మరోవైపు తెరచుకొని ఉండే దళసరి లోహపు గోడలున్న ఓ గొట్టం. మూసుకుని ఉన్న చివర అంటిస్తే ఉన్నఫళాన పేలే రసాయనిక పేలుడు పదార్థం ఉంటుంది. మనం దీపావళి సమయంలో అంటిస్తే పేలినట్టే ఇది కూడా పేలుతుంది. ఈ పేలుడు పదార్థాన్ని తెరచి ఉన్న చివరి నుంచే బాగా లోపలికి దట్టిస్తారు. ఆ తర్వాత గుండును ఆ రంధ్రంలోకి జొప్పుతారు. గొట్టం మూసి ఉన్న చివర వత్తి మాత్రమే లోపలికి వెళ్లేలా సన్నని రంధ్రం ఉంటుంది. దాన్ని వెలిగిస్తే కాలుతూ లోపలికి వెళ్లి పేలుడు పదార్థాన్ని పేలుస్తుంది. ఒక్క ఉదుటున పేలుడు వాయువులు విడుదలవుతాయి. అవి అటూ ఇటూ పోవడానికి దారిలేకపోవడం వల్ల గుండును అతివేగంగా నెడుతూ బయటికి రావడానికి ప్రయత్నిస్తాయి. ఆ క్రమంలో గుండు విపరీతమైన శక్తితో బయటకు దూసుకు వస్తుంది. పొడవైన గొట్టం సరళమార్గంలో ఉండడం వల్ల గుండు కూడా బయటకు నేరుగా వేగంగా వస్తుంది. గుండు గమ్యాన్ని బట్టి అది ఉన్న దూరాన్ని బట్టి ఫిరంగి గొట్టపు వాలు కోణాన్ని మార్చేలా ఫిరంగిలో యంత్రాంగం ఉంటుంది.

హార్ట్ ఫుల్ నెస్* 🌍 *కథతో. బుస కొట్టు, కానీ కాటువేయకు

 *365 రోజులు✈️హార్ట్ ఫుల్ నెస్* 🌍 *కథతో* 

♥️ *కథ - 64 ♥️* 

 *చదివే ముందు... సున్నితంగా  కళ్ళు మూసుకోండి... ఒకసారి మన జీవితాలలో* *వెనక్కివెళదాం ... పొరపాట్లు చేసిన ఆ క్షణాలను మనస్ఫూర్తిగా గుర్తుచేసుకుందాం...* 
 *మీ హృదయంతో అనుసంధానం అవ్వండి... అవే తప్పులు మళ్ళీ జరగకూడదన్న ఆలోచన* *చేయండి...... మన హృదయాన్ని అనుసరించడం, వీటన్నిటినీ సరిదిద్దడంలో* *సహాయపడుతుంది, ఎందుకంటే మన హృదయం ఎప్పుడూ మనల్ని తప్పుదారి పట్టించదు... ఇప్పుడు చదవడం* *ప్రారంభించండి....* 

‘ *బుస కొట్టు, కానీ కాటువేయకు’* 

శ్రీరామకృష్ణ పరమహంస తన "శ్రీరామకృష్ణ కథలు - ఉపమానాలు" అనే పుస్తకంలో పంచుకున్న ఒక కథను ఇక్కడ అందిస్తున్నాము.
ఒకానొకప్పుడు, ఒక గడ్డిభూమిలో ఒక ప్రమాదకరమైన పాము నివసించేది, అక్కడ నివసించే కౌబాయ్ లు ఆ పచ్చికబయలులో తమ ఆవులను మేపుకునేవారు. పాము భయంతో అందరూ అప్రమత్తంగా ఉండేవారు. ఒకరోజు ఒక సాధువు ఆ గడ్డిభూమి గుండా వెళుతున్నాడు. కొంతమంది కౌబాయ్‌లు అతని వద్దకు పరిగెత్తుకుంటూ వచ్చి, "స్వామి, దయచేసి ఆ దారిలో వెళ్లకండి. అక్కడ ఒక విషపూరితమైన పాము నివసిస్తోంది" అని చెప్పారు.
దానికి సాధువు,"అయితే ఏమిటి, నాయనలారా? నాకు పాము అంటే భయం లేదు. నాకు కొన్ని మంత్రాలు తెలుసు!" అని చెబుతూ చిరునవ్వుతో ఆ పచ్చిక బయలులో ప్రయాణం కొనసాగించాడు. కౌబాయ్ లు, భయపడి, అతనితో పాటు వెళ్ళలేదు.
కొద్దిసేపటికే, ఎత్తిన పడగతో తన వైపు వేగంగా పాకుతూ వస్తున్న ఆ పామును సాధువు చూసాడు. తన దగ్గరికి రాగానే ఒక మంత్రం పఠించాడు, కొద్దిసేపటికే ఆ విషసర్పం అతని పాదాల దగ్గర వానపాములా పడిఉంది!
సాధువు పాముని ఎదుర్కొని, "చూడు, ఇతరులకు హాని ఎందుకు చేస్తున్నావ్? నేను నీకు పవిత్రమైన మంత్రాన్ని ఇస్తాను. దానిని పునరావృతం చేయడం ద్వారా, భగవంతుడిని ప్రేమించడం నేర్చుకుంటావు. చివరికి, నీవు అతనిని తెలుసుకుంటావు, ఆయనను పొందుతావు కూడా. నీ హింసాత్మక స్వభావాన్ని వదిలించుకో" అని అన్నాడు.
సన్యాసి పాముకి ఒక పవిత్రమైన మంత్రాన్ని బోధించి, ఆధ్యాత్మికతను ఉపదేశించాడు. పాము తన కొత్త గురువు ముందు వంగి, "స్వామి, నేను ఆధ్యాత్మిక క్రమశిక్షణను ఎలా అభ్యసించాలి?", అని అడిగింది.
" ఆ పవిత్రమైన మంత్రాన్ని పునరావృతం చేస్తూ ఉండు, ఎవరికీ హాని చేయవద్దు" అని గురువు బదులిచ్చారు. బయలుదేరబోతూ, సాధువు చిరునవ్వుతో పాము వైపు తిరిగి "నేను త్వరలో నిన్ను మళ్ళీ కలుస్తాను!" అని వెళ్ళిపోయాడు.
కొద్దిరోజులు గడిచేసరికి పాము కాటేయట్లేదని ఆ కౌబాయ్ లు గమనించారు. ఇప్పుడు వాళ్ళు దానిపై రాళ్లు రువ్వడం మొదలుపెట్టారు. కానీ పాము కోపగించుకోకుండా ఒక వానపాములా స్తబ్ధుగా ప్రవర్తించింది.
ఒకరోజు, ఒక అబ్బాయి దాని దగ్గరికి వచ్చి, దాని తోక పట్టుకుని, గుండ్రంగా తిప్పుతూ, నేలమీద పదే పదే కొట్టి, విసిరేశాడు. ఆ పాము స్పృహతప్పి పడిపోయి, కదలలేదు.  చనిపోయిందని భావించిన అబ్బాయిలు దాన్ని వదిలేయాలని నిర్ణయించుకుని తమ దారిన తాము వెళ్లిపోయారు.
రాత్రికి పాము స్పృహలోకి వచ్చింది. నెమ్మదిగా, అతికష్టంమీద ,  తన పుట్టరంధ్రంలోకి వెళ్ళింది. దాని ఎముకలు విరిగిపోయి, కదలలేకపోయింది.
రోజులు గడిచాయి. చర్మంతో కప్పబడిన అస్థిపంజరంలా పాము మారిపోయింది. అప్పుడప్పుడూ ఆహారం వెతుక్కుంటూ రాత్రిపూట బయటకు వచ్చేది. కౌబాయ్ లు కనబడతారేమోనన్న భయంతో, పగటిపూట దాని పుట్ట వదలట్లేదు. తన గురువు నుండి పవిత్రమైన మంత్రాన్ని స్వీకరించినప్పటి నుండి, అది ఇతరులకు హాని చేయడం మానేసింది. ఆకులు, చెట్ల నుండి పడిపోయిన పండ్లు తిని జీవించడం మొదలుపెట్టింది.
ఒక సంవత్సరం తరువాత, సాధువు మళ్ళీ ఆ గడ్డిభూమి ద్వారా ప్రయాణం చేసాడు. దారిలో కౌబాయ్ లను కలుసుకుని పాము గురించి అడిగాడు. చాలా కాలం క్రితమే అది చనిపోయిందని కౌబాయ్‌లు చెప్పారు. కానీ అతను వారిని నమ్మలేకపోయాడు. పాము ఆధ్యాత్మికతలోకి ఉపదేశింపబడిన పవిత్ర మంత్ర ఫలాన్ని పొందకముందే చనిపోదని అతనికి తెలుసు. పాము ఉన్న ప్రదేశానికి మార్గాన్ని కనుక్కుని, దాని కోసం అక్కడ, ఇక్కడ వెతకడం ప్రారంభించాడు. దానికి తను ఇచ్చిన పేరు పెట్టి పిలిచాడు.
చాలా సేపటి తర్వాత గురువుగారి గొంతు విని, పాము ఒక్కసారిగా తన పుట్టలో నుండి బయటకు వచ్చి ఎంతో భక్తితో ఆయన ముందు నమస్కరించింది.
"ఎలా ఉన్నావు , నాయనా ?" అని చాలా ఆందోళనతో అడిగాడు సాధువు.
" బాగానే ఉన్నాను స్వామి", అని పాము బదులిచ్చింది.
"అయితే, మరి నీవు ఎలా ఇంతగా బక్కచిక్కిపోయావు?",అని గురువు అడిగాడు.

పాము ఇలా సమాధానమిచ్చింది: “పూజ్యమైన గురుదేవా, ఎవరికీ హాని చేయవద్దని మీరు నన్ను ఆదేశించారు. అందుకే చెట్ల నుంచి రాలిపోయిన ఆకులు, పండ్లపైనే బతుకుతున్నాను. బహుశా, అది నన్ను సన్నగా చేసిఉంటుంది."
స్పష్టంగా, పాము సాత్వికగుణాన్ని అభివృద్ధి చేసుకుంది; అది ఎవరితోనూ కోపంగా ఉండట్లేదు. కౌబాయ్‌లు దాన్ని ఏమి చేశారో అది పూర్తిగా మరచిపోయింది.
ఆ సన్యాసి "తిండి లేకపోవడమే నిన్ను ఈ స్థితికి దిగజార్చి ఉండుండదు, ఇంకేదో కారణం ఉండాలి. కొంచెం ఆలోచించు" అన్నాడు.
 పిల్లలు దానిని నేలపై కొట్టారని అప్పుడు పాము గుర్తుచేసుకుంది. అది ఇలా ఉంది, "అవును, స్వామి, ఇప్పుడు నాకు గుర్తుకొచ్చింది. అబ్బాయిలు ఒకసారి నన్ను నేలకేసి దౌర్జన్యంగా కొట్టారు. వారు తెలివితక్కువ వారు, నా మనస్సులో ఎంత గొప్ప మార్పు వచ్చిందో వారు గ్రహించలేదు. నేను ఇంక ఎవరినీ కాటేయననీ లేదా ఎవరికీ హాని తలపెట్టనని వారు తెలుసుకోలేరు కదా ?"
సన్యాసి గట్టిగా, " అయ్యో ఎంత అవమానం! నిన్ను నీవు ఎలా రక్షించుకోవాలో నీకు తెలియదా? నిన్ను కాటేయద్దని, హింస చేయవద్దని చెప్పాను కానీ, బుసకొట్టవద్దని చెప్పలేదు కదా. నీవు వారిని ఎందుకు భయపెట్టలేదు? మనల్ని మనం రక్షించుకోవడం మన మొదటి కర్తవ్యం, నిన్ను నీవు రక్షించుకునే సామర్థ్యాన్నిభగవంతుడు నీకు ఇచ్చాడు.
నీకు హాని చేయాలనుకునే వారిని నీవు భయపెట్టాలి. కానీ ఎప్పుడూ నీ విషాన్ని వారిలోకి ఎక్కించకూడదు. గుర్తుంచుకో, 'ఇతరులను గాయపరచకూడదు, కానీ మనలని మనం  రక్షించుకోవడానికి చేయగలిగినదంతా చేయాలి!' అది మన బాధ్యత.
               ♾️
 *ధ్యానం ద్వారా మనల్ని మనం కేంద్రీకరించుకుని, ఎరుకను కలిగిఉన్నప్పుడు, వాస్తవంగా* *మనం ఎవరు, మనం ఎలా నడుచుకోవాలి, ఎలా ప్రవర్తించాలి అనే జ్ఞానాన్ని తీసుకువస్తుంది.* 🌼
 *దాజి* 

హార్ట్ ఫుల్ నెస్ ధ్యానం  💌
HFN Story team
💜🔺💜🔺💜🔺💜🔺💜

అన్ని_జన్మలలోను_ఏది_ఉత్తమమైనది*?

 🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸

*అన్ని_జన్మలలోను_ఏది_ఉత్తమమైనది*?
🪷🪷🪷🪷🪷🪷🪷🪷

*అన్ని జన్మలలోను మానవజన్మ మాత్రమే ఉత్తమమైనది, దుర్లభమైనది.*

*అసలు జన్మలు మూడు రకాలు.*

*1) దేవజన్మ 2) మానవజన్మ 3) జంతుజన్మ.*

*జన్మలు ఎలా వస్తాయి? వాటి ప్రత్యేకతలేమిటి?*

*మానవుడు తన జీవిత కాలంలో అనేక కర్మలను చేస్తుంటాడు. ఆ కర్మలకు ఫలితాలను అనుభవించాలి. వాటినే కర్మఫలాలు అంటారు.*

*అనేక జన్మలలో చేసిన కర్మఫలాలు ఆ జీవుడితో పాటుగాప్రయాణిస్తుంటాయి. అందులో అన్నీ పుణ్యకర్మల ఫలాలు మాత్రమే పక్వానికి వచ్చినప్పుడు ఆ జీవుడు దేవలోకాలలో దేవజన్మ నెత్తుతాడు. అక్కడ ఆ కర్మఫలాల కారణంగా అనేక భోగాలను అనుభవిస్తాడు. అది భోగభూమి. కనుక అక్కడ అతడికి ఏ కర్మలూ చేసే అధికారం లేదు. అందువల్ల పరమాత్మను అందుకోవటానికి తగిన కర్మలాచరించే అవకాశం అక్కడ లేదు. తన కర్మ ఫలాలను అనుసరించి భోగాలనుభవించి, ఆ కర్మ ఫలాలు క్షయంకాగానే “క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి” అన్నట్లు ఈ మర్త్యలోకాన్ని మానవ లోకాన్ని చేరుకోవలసిందే!*

*మరల మరల మానవ జన్మనో, జంతు జన్మనో ఎత్తవలసిందే!*

*ఈ దేవజన్మలో కేవలం మనోబుద్ధులుంటాయి గాని కర్మజేయుటకు సాధనమైన స్థూలశరీరం ఉండదు. కనుక భగవత్సాక్షాత్కారానికి ఉపయోగపడే జన్మకాదు దేవజన్మ.*

*ఇక అన్నీ పాపకర్మల ఫలాలు మాత్రమే పక్వానికి వచ్చినప్పుడు ఆ జీవుడు జంతువులు, పశువులు, పక్షులు, క్రిములు, కీటకాలు మొదలైన జంతువులుగా నీచయోనులందు జన్మిస్తాడు. ఆ జన్మలలో ఆ కర్మ ఫలాల కారణంగా అనేక బాధలు, దుఃఖాలు అనుభవిస్తాడు, హింసించబడతాడు. జంతు జన్మలలో కర్మలు చేస్తున్నట్లు కన్పించినా, ఆ కర్మలన్నీ బుద్ధిపరంగా ఆలోచించి, స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకొని చేసేవి కావు. కేవలం ప్రకృతి ప్రేరణలతో పరతంత్రంగా చేస్తాయి. కారణం ఈ జంతు జన్మలలో శరీరం మనస్సు ఉన్నాయి గాని బుద్ధి మాత్రం లేదు. కనుక ఈ జన్మలలో కూడా కేవలం కర్మ ఫలాలు అనుభవించుటయే గాని పరమాత్మనందుకొనుటకు తగిన జ్ఞానాన్ని పొందే అవకాశం లేదు. కనుక భగవత్సాక్షాత్కారానికి ఈ జంతు జన్మ కూడా ఉపయోగపడదు!*

*ఇక పుణ్య పాప కర్మల ఫలాలు మిశ్రమంగా పక్వానికి వచ్చినప్పుడు ఆ జీవుడు మానవ జన్మనెత్తటం జరుగుతుంది. ఈ జన్మలలో పుణ్య కర్మఫలాల కారణంగా సుఖాలు, భోగాలు, ఆనందం అనుభవిస్తాడు. పాప కర్మ ఫలాల కారణంగా దుఃఖాలు, బాధలు అనుభవిస్తాడు. అయితే ఇలా కర్మ ఫలాలనుభవించటం మాత్రమే గాక, కొత్తగా కర్మలు చేసే అధికారం కూడా ఈ మానవ జన్మలోనే ఉన్నది. ఎందుకంటే స్వతంత్రంగా బుద్ధితో ఆలోచించి శరీరంతో కర్మలు చేయటానికి వీలుగా శరీరం, మనస్సు, బుద్ధి అనే మూడు సాధనాలు ఉన్న జన్మ ఇది. కనుక పరమాత్మను అందుకోవటానికి తగిన కర్మలు చేసే అధికారం, జ్ఞానాన్ని పొందే అవకాశం ఉన్న ఈ మానవ జన్మను ఉత్తమోత్తమమైనది, దుర్లభమైనది అన్నారు.*

*84 లక్షల జీవరాసులలో పుట్టి గిట్టిన తర్వాత లభించే అపురూప జన్మ గనుకనే ఈ మానవజన్మను “జంతూనాం నరజన్మ దుర్లభం” అని ఆచార్య శంకరులు “వివేక చూడామణి” గ్రంధంలో తెలియజేయటం జరిగింది.*

ఇట్టి ఈ అపురూపమైన, దుర్లభమైన, ఉత్తమోత్తమమైన మానవజన్మను పొందిన ప్రతి ఒక్కరు దీనిని సార్ధకం చేసుకోవాలి.

తొందరపాటు

 *తొందరపాటు* 
           
 *మనిషి తన దైనందిన కృత్యాల్లోను, వివిధ కార్యక్రమ ప్రణాళికా రచనలోను రెండు సూత్రాలను ప్రధానంగా గుర్తుకు తెచ్చుకుంటాడు.*

*‘ఆలస్యం అమృతం విషం’ అని, ‘నిదానమే ప్రధానం’ అని..!*

*నిజానికి ఈ రెండు సూత్రాలూ కార్యసాఫల్యానికి అవసరమైనవే. ఆయా సందర్భాలు, సన్నివేశాలు, పరిస్థితులను బట్టి ఈ సూత్రాలను ఆచరణలోకి తేవాల్సి ఉంటుంది.* 

 *ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు తన బుద్ధితోనే గాక, తన హితం కోరేవారు, ఆత్మీయుల బుద్ధిని కూడా ఉపయోగించుకోవడం పురోగతి కోరుకునేవాడి  లక్షణం.* 

*తనకు తోచిందే సరైనదని వెనకా ముందూ ఆలోచించకుండా అనుకున్న వెంటనే పని మొదలెట్టడం వైఫల్యానికి, అవమానానికి కారణభూతమవుతుంది. విపరీత ఫలితాలు ఎదుర్కొన్నాక పశ్చాత్తాపం చెందడం చేతులు కాలాక ఆకులు పట్టుకోవడమే అవుతుంది.*

*ఈ తొందరపాటు ప్రతి మనిషి జీవితంలోనూ కనిపిస్తుంది. అదే శోక కారణమవుతుంది. అనుభవజ్ఞుల సలహాలు, సూచనలను విని విశ్లేషించుకుని అహంకరించక, వివేకంతో ముందడుగేసేవాడు కచ్చితంగా కార్యసాధకుడు కాగలడు.* 

 *తొందరపాటు వల్ల జీవితంలో దిద్దుకోలేని అగచాట్లు ఎదురవుతాయి. నిరంతరం దుఃఖం అనుభవించే సంఘటనలూ జరుగుతుంటాయి.* 
 
 *ప్రధానంగా కామక్రోధ లోభమోహాది అరిషడ్వర్గాల వల్ల, మానసిక ఒత్తిళ్ల వల్ల, భావోద్వేగాలకు బానిస కావడం వల్ల తొందరపాటుతో తప్పులు దొర్లుతుంటాయి. ఈ బలహీనతలను అధిగమించి, వివేకంతో సంయమనంతో సమయజ్ఞతతో వ్యవహరించే వాడెప్పుడూ విజేతే అవుతాడు.*                           కైక తొందరపడి అనాలోచితంగా, అసందర్భంగా దశరథుణ్ని కోరిన రెండు వరాల వల్ల ఎంత అపఖ్యాతి పొందిందో తెలిసిందే.* 

*శకుని పన్నాగాలకు ప్రభావితుడై దుర్యోధనుడు అనేక తొందరపాటు చర్యల వల్ల ఎంతగా ఎన్నిసార్లు భంగపడ్డాడో తెలియనిదెవరికి?* 

 *ధర్మరాజు రాజసూయ యాగం ప్రారంభించిన సందర్భంలో అగ్రపూజకు వాసుదేవుణ్ని ఆహ్వానించినప్పుడు శిశుపాలుడు ఆవేశంతో, అహంకారంతో, పరమాత్మను దుర్భాషలాడి చావును కొనితెచ్చుకున్నాడు.* 

*తార చెప్పిన హిత వాక్యాలను పెడచెవిన పెట్టి వాలి అహంకారంతో సుగ్రీవుడితో యుద్ధానికి తలపడి ధర్మమూర్తి శ్రీరామచంద్రుడి చేతిలో హతుడయ్యాడు.* 

*అనాలోచితంగా, భవిష్యత్తును గురించి ఆలోచించకుండా వేసే ఏ అడుగైనా తొందరపాటు చర్యే అవుతుంది.* 

 *చిన్న చిన్న కారణాలకే దంపతులు విడాకులు తీసుకోవడం, యువత ఆత్మహత్యలకు పాల్పడటం తొందరపాటు వల్లనే.     కొన్ని క్షణాలు ఆలోచించి ‘ఇలా చేయడం అవసరమా?’ అని మనసులో నిదానంగా విశ్లేషించుకుంటే ఇటువంటి అనర్థాలే జరగవు.* 

*ప్రతిదానికీ విపరీతమైన స్పందన, అసందర్భమైన ఉద్రేకం మనిషిని వివేకహీనుణ్ని చేసి దుశ్చర్యలకు ప్రేరేపిస్తాయి.* 

*ఆలోచన లేని ఆచరణ జీను లేని గుర్రంలాంటిది. ప్రణాళిక లేని కార్యం మొదలుపెట్టడమంటే లోతు తెలియని నీళ్లలో దూకడం లాంటిది.* 

*కొద్దిపాటి తొందరపాటే కొండంత సమస్యకు దారితీస్తుంది. మనిషి వినడంలో తొందరపడవచ్చు. అవగాహన చేసుకోవడంలో తొందరపడకూడదు. తొందరపాటు శత్రువుకంటే ప్రమాదకరం!*

ఖర్చులేని స్వర్గం!

 *ఖర్చులేని స్వర్గం!*
              

 *వాకింగ్ కి నడుచుకుంటూ వెళ్లినప్పుడు, అలసిపోయి కూర్చున్నప్పుడు, నా పక్కన ఉన్న వ్యక్తి, ‘ఈరోజు ఏదైనా మంచి విషయాలు చెప్పండి!’ అన్నాడు.*

*కాసేపు ఆలోచించి…“స్వర్గానికి ప్రవేశం ఉచితం, నరకానికి వెళ్లాలంటే బోలెడు డబ్బు ఖర్చుపెట్టాలి,” అన్నాను.*

*ఆశ్చర్యంగా అతను నా వంకచూసి “అదెలా?” అన్నాడు.*

*నేను చిన్నగా నవ్వి, ఇలా అన్నాను.. “జూదం ఆడటానికి డబ్బు కావాలి, మత్తు పానీయాలు త్రాగడానికి డబ్బు కావాలి, సిగరెట్ త్రాగడానికి డబ్బు కావాలి, పాపాలతో పయనించడానికి డబ్బుకావాలి, ఇలా ఇంకా, ఇంకా ..* 

కానీ, *ప్రేమను పంచడానికి డబ్బు అవసరం లేదు, దేవుణ్ణి ప్రార్థించడానికి డబ్బు అవసరం లేదు, సేవచేయడానికి డబ్బు అవసరం లేదు, అప్పుడప్పుడు ఉపవాసం (ఆరోగ్యంపై శ్రద్ధ చూపడం కోసం) ఉండడానికి డబ్బు అవసరం లేదు, క్షమించమని అడగడానికి డబ్బు అవసరం లేదు, మన చూపులో కరుణ, సానుభూతి, మానవత్వం చూపడానికి పెద్దగా డబ్బు అవసరంలేదు!*
 
 *దేవుడిపై నమ్మకం ఉండాలి, మనపై మనకు ప్రేమ, విశ్వాసం ఉండాలి, ఇప్పుడు చెప్పండి ..* 

*డబ్బు ఖర్చు చేసి నరకానికి వెళ్ళడానికి ఇష్టపడతారా ? ఉచితంగా లభించే స్వర్గం సుఖభోగాలకు ఇష్టపడతారా ? ఆలోచించండి ..*

 *సత్సంగత్వే నిస్సంగత్వం !* 
 *నిస్సంగత్వే నిర్మోహత్వం !!* 
 *నిర్మోహత్వే నిశ్చలతత్వం !* 
 *నిశ్చలతత్వే జీవన్ముక్తి: !!* 

*సత్పురుషులు ..*  *మార్గదర్శనం* 
*సత్సంగత్యం ..* *సహవాసం* 
*సత్ప్రవర్తన ..* *జీవించడం* 
*మించి, ఈ  భౌతిక  ప్రపంచంలో  ఇంకొకటి,  మరొకటి  లేదు ..*✍️

ఇది కథ కాదు.! జరిగిన కథ.! స్ఫూర్తిని గుండెల నిండా నింపే కథ.!హృదయలోతుల్లోంచి ఆర్ధ్రత పొంగుకు వచ్చే కథ.!

 *ఒక మాంచి స్ఫూర్తి నింపు కథ*

దట్టమైన అడవిలో… చిక్కని చీకట్లో ఆ కుర్ర డాక్టర్… తొలి డెలివరీ కేసు…

1943… డాక్టర్ కులకర్ణి వయస్సులో చిన్నవాడే… హుబ్లీలో ఉంటాడు… తను వయస్సులో ఉన్నప్పుడు చందగఢ్ అనే ఊళ్లోని చిన్న హాస్పిటల్‌లో పోస్టింగ్ వచ్చింది. అది మహారాష్ట్ర- కర్నాటక బోర్డర్. ఆ ఊరి చుట్టూ దట్టంగా అడవి.
జూలై… తుఫాను రాత్రి… ఏదో పుస్తకం చదువుకుంటున్నాడు… హఠాత్తుగా డోర్ కొడుతున్న చప్పుడు. ఇంత రాత్రి ఎవరబ్బా అని ఆశ్చర్యంతో కూడిన భయంతో తలుపు తీశాడు. ఉన్ని బట్టలు కప్పుకుని, చేతుల్లో కర్రలు పట్టుకుని ఉన్న నలుగురు వ్యక్తులు మరాఠీలో చెప్పారు. ‘‘త్వరగా నీ బ్యాగ్ తీసుకుని మాతో నడువ్…’’
ఆయన నిశ్శబ్దంగా తన మెడికల్ కిట్ తీసుకుని వాళ్లతో కలిశాడు… గంటన్నర తరువాత ఎడ్లబండి ఆగింది. దట్టమైన చీకటి, గడ్డితో పైకప్పు వేయబడిన ఓ చిన్న ఇల్లు అది. లోపలకెళ్తే సన్నగా లాంతరు వెలుతు, మంచంపై ఓ మహిళ, పక్కన ఓ ముసలామె.
అయోమయంగా చూశాడు డాక్టర్.
ఆమె ఎవరు..? నన్నెందుకు తీసుకొచ్చారు..? వైద్యం కోసమేనా..? అదే నిజమైతే అక్కడే చెప్పొచ్చు కదా… ఈ నిర్బంధ ధోరణి దేనికి..? మర్యాదగా అడిగినా వచ్చేవాడు కదా… 
‘ప్రసవం చేయాలి డాక్టర్’ అన్నాడు ఓ వ్యక్తి… 
ఆమె నొప్పితో గిలగిలలాడుతోంది… ఏం చేయాలో డాక్టర్‌కు బోధపడటం లేదు… తనలోని డాక్టర్ స్థిమితంగా లేడు… ఎందుకంటే..? తను అంతకుముందు ఎప్పుడూ డెలివరీ చేయలేదు… కానీ ఆమెకు ఎలాగైనా సాయపడాలని అనుకున్నాడు… డాక్టర్ కదా… ఊరుకోలేకపోయాడు…
నొప్పి డైవర్ట్ చేయడానికి మాటల్లో దింపాడు… ఆమెను అడిగాడు… ‘అసలు ఎవరు నువ్వు..? ఇక్కడికి ఎలా వచ్చావు..?’
‘డాక్టర్ సార్, నాకు బతకాలని లేదు… నేనొక భూస్వామి కూతురిని’ ఆమె గొంతులో ధ్వనిస్తున్న బాధ… ‘‘మా ఊళ్లో హైస్కూల్ కూడా లేదు… అందుకని నన్ను చదువు కోసం కాస్త దూరంగా ఉన్న పట్టణానికి పంపించారు… అక్కడ ఓ క్లాస్‌మేట్‌ను ప్రేమించాను… ఈ కడుపు ఆ ప్రేమ వల్లే… కడుపు విషయం తెలియగానే ఆ అబ్బాయి జంప్… నా తల్లిదండ్రులు విషయం తెలుసుకున్నారు… కానీ అప్పటికే ఆలస్యమైంది… ఇంకేమీ చేయడానికి లేదు, అందుకని ఇక్కడ ఉంచారు… ఇటువైపు ఎవరూ రారు… నా కడుపు, నా బాధ ఎవరికీ తెలియదు, తెలియవద్దనే ఈ ఏర్పాటు…’’ అంటూ రోదించసాగింది…
డాక్టర్‌కు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు… మెల్లిమెల్లిగా తన సాయంతో ఆమె ఓ ఆడబిడ్డను ప్రసవించింది… కానీ ఆ బిడ్డ ఏడవడం లేదు… పుట్టింది ఆడబిడ్డ అని తెలిసి ఆమె మళ్లీ ఏడుపు అందుకుంది… డాక్టర్ సార్, దాన్ని ఇక్కడే చంపేయండి… నా బతుకులాగే దానిది కూడా ఏడుపు బతుకు కావొద్దు ప్లీజ్…’
కులకర్ణి ఎలాగోలా తంటాలు పడ్డాడు కాసేపు… పిల్ల ఏడ్చింది… ఆ గదిని వదిలిపెట్టి బయటికి వచ్చాక ఆయనకు 100 రూపాయలు ఇవ్వబడ్డాయి… అప్పట్లో అది చాలా పెద్ద మొత్తమే… తన జీతమే 75 రూపాయలు… ఫీజు తీసుకున్నాడు, లెక్కపెట్టుకునేటప్పుడు తన మెడికల్ బ్యాగ్ గదిలోనే మరిచిపోయినట్టు గుర్తొచ్చింది… ఆ బ్యాగ్ తెచ్చుకుంటానని చెప్పి, గదిలోకి వెళ్లాడు… ఆ వంద రూపాయలు ఆ కొత్త తల్లి చేతుల్లో పెట్టాడు…
‘‘సంతోషమో, దుఖమో.. మన చేతుల్లో ఏమీ లేవు… జరిగిందేదో జరిగిపోయింది… అన్నీ మరిచిపో… నీ జీవితం నీది… ప్లాన్ చేసుకో… ప్రయాణానికి తగినంత ఓపిక వచ్చాక పూణె వెళ్లు, అక్కడ నర్సింగ్ కాలేజీ ఉంటుంది… అందులో నా దోస్త్ ఆప్టే ఉంటాడు… వెళ్లి కలువు, కులకర్ణి పంపించాడని చెప్పు… తను తప్పక సాయం చేస్తాడు… ఇది ఓ సోదరుడి సూచన అనుకో, సాయం అనుకో, ఇప్పుడైతే నేన్నీకు వేరే సాయం ఏమీ చేయలేను’’ అని ఆమె తలపై ఓదార్పుగా ఓసారి చేయి వేసి, అక్కడి నుంచి వెళ్లిపోయాడు…
ఏళ్లు గడిచాయి… కులకర్ణి ఇప్పుడు పలు రంగాల్లో నైపుణ్యం సంపాదించాడు… ఓసారి అనుకోకుండా ఓ మెడికల్ కాన్ఫరెన్స్ కోసం ఔరంగాబాద్ వెళ్లాడు… అక్కడ డాక్టర్ చంద్ర అనే లేడీ డాక్టర్ ఇచ్చిన ప్రజెంటేషన్ చూసి బాగా అబ్బురపడ్డాడు… ప్రోగ్రాంలో అనుకోకుండా తన పేరు కులకర్ణిగా ప్రస్తావనకు వచ్చేసరికి డాక్టర్ చంద్ర చకచకా నేరుగా తన దగ్గరకు వెళ్లింది… ‘సర్, మీరు ఎప్పుడైనా చందగఢ్ వెళ్లారా..?’ అనడిగింది…
‘అవును, చాలా ఏళ్ల క్రితం.,. నాకు ఆ ఊరితో బంధముంది… అక్కడ కొన్నాళ్లు పనిచేశాను’
‘అయితే మీరు ఓసారి మా ఇంటికి వస్తారా ప్లీజ్…’
‘డాక్టర్ చంద్రా, మిమ్మల్ని తొలిసారి కలిశాను, మీ ప్రజెంటేషన్ సింప్లీ సూపర్బ్… నాకు బాగా నచ్చింది… కానీ ప్రస్తుతం మీ ఇంటికి రాలేను… మళ్లీ ఎప్పుడైనా తప్పకుండా మీ ఇంటికి వస్తాను, ఏమీ అనుకోవద్దు ప్లీజ్…’
‘సర్, దయచేసి ఒక్కసారి రండి, కాసేపు… మీ టైం ఎక్కువగా తీసుకోను, మీరొక్కసారి మా ఇంటికి వస్తే జీవితాంతం మిమ్మల్ని మరిచిపోను’.. కులకర్ణి ఇక మాట్లాడలేకపోయాడు… ఆమె అంత ఇదిగా పిలుస్తుంటే ఎలా కాదనగలడు? పైగా ఆమె పరిజ్ఞానం తనను ముగ్దుడిని చేసింది… ఆమె వాళ్ల ఇంటికి తీసుకెళ్లింది… లోపలకు అడుగు పెట్టకముందే… ‘అమ్మా, మనింటికి ఎవరొచ్చారో ఓసారి చూడు…’ అని గట్టిగా పిలిచింది.
డాక్టర్ చంద్ర తల్లి బయటికి వచ్చింది… కులకర్ణిని చూడగానే కాసేపు తన కళ్లను తనే నమ్మలేకపోయింది… జలజలా కన్నీళ్లు కారిపోతున్నాయి అసంకల్పితంగా… ఆయన పాదాలపై పడింది… ఆమె కన్నీళ్లు కులకర్ణి పాదాలను తడిపేస్తున్నయ్… ఆయన గందరగోళంలో పడిపోయాడు… తరువాత ఆమె చెప్పింది…
‘ఆ రాత్రిపూట మీరు చందగఢ్ అడవిలో నాకు డెలివరీ చేశారు… ఆరోజు పుట్టింది ఈ బిడ్డే… మీరు చెప్పినట్టే పూణె వెళ్లాను, మీ మిత్రుడి సాయంతో చదువుకున్నాను… స్టాఫ్ నర్స్ అయ్యాను… నా బిడ్డను ఓ మంచి గైనకలాజిస్టును చేయాలనేది నా జీవిత లక్ష్యంగా పెట్టుకున్నాను… మీరే స్పూర్తి… ఆశీర్వదించండి సార్…’ అంది చేతులు జోడిస్తూ…
ఆనందం, ఆశ్చర్యం ఆయన్ని కమ్మేశాయి… తన తొలి డెలివరీ కేసు ఆమె… అదీ ఓ గడ్డు స్థితిలో… డాక్టర్ చంద్రను అడిగాడు… ‘ఇంతకీ నన్నెలా గుర్తించావు..?’
అనుకోకుండా మీ పేరు కులకర్ణి అని వినిపించేసరికి ఆశ్చర్యపోయాను… అమ్మ మీ పేరును రోజూ ఓ మంత్రంలా పఠిస్తూనే ఉంటుంది… 
సార్, మీ పూర్తి పేరు రామచంద్ర కులకర్ణి అని మీ మిత్రుడు చెప్పాడు… అందులో నుంచే నా బిడ్డకు చంద్ర అని పేరు పెట్టుకున్నాను… ఆమెకు జీవితం ప్రసాదించింది మీరే… మీరే ఆదర్శంగా పేద మహిళలకు ఫ్రీ డెలివరీ, ఫ్రీ వైద్యం నా బిడ్డ అలవాటు చేసుకుంది… ఎన్నో కేసులు, ఎందరికో ప్రాణం పోసింది… సార్, ఈమె స్పూర్తి రీత్యా మీ బిడ్డే…’ ఆమె చెబుతూనే ఉంది…
ఇప్పుడు ఆయన కళ్లల్లో ఎందుకో నీళ్లు… ఆగడం లేదు… జారుతున్న తడిని తుడుచుకోవాలని కూడా లేదు… కొన్నిసార్లు కన్నీళ్లు అలా మత్తడి దూకాల్సిందే… 

చెప్పనేలేదు కదూ… ఈ డాక్టర్ కులకర్ణి ఎవరో తెలుసా..? ప్రముఖ రచయిత్రి, సామాజిక కార్యకర్త, ఇన్ఫోసిస్ చైర్‌పర్సన్ సుధామూర్తికి స్వయానా తండ్రి.
ఆహా...ఎంత గొప్ప మనసులు...
ఇటువంటి చరిత్రను నేటి తరం పిల్లలకు పాఠ్యాంశాలుగా బోధిస్తేనే మన భావితరం ఆదర్శంగా జీవిస్తారనటంలో అతిశయోక్తి లేదేమో.!!

☘️ఇది కథ కాదు.! జరిగిన కథ.! స్ఫూర్తిని గుండెల నిండా నింపే కథ.!హృదయలోతుల్లోంచి ఆర్ధ్రత పొంగుకు వచ్చే కథ.! నేను చదువుతుంటే నా కళ్క్ష వెంట ఆనందబాష్పాలు రాల్చిన కథ.! ఇది మన కథ.!!
*జయశ్రీరామ*ధర్మపథం*
 🙏🙏🙏🙏🙏

మహనీయులు

 మహనీయులు 🙏

చాలామంది మహనీయులు ఈనాటికి ఎందరో ఉన్నారు. విద్యార్థన పదములు తమకు దారి దీపాలుగా నిలిచిన గురువులను ఆజన్మాంతము ఆరాధించుకుంటున్నారు. ఉదాహరణకు మన మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఓసారి భారతరత్న విశిష్ట అతిథిగా తమిళనాడులో జరిగిన ఓ సభకు హాజరయ్యారు. అనుకోకుండా వచ్చిన పౌరుల్లో 90 ఏళ్లు పైబడిన వృద్ధుడు కనిపించారు. ఆయన తనకు రామనాథపురం ఉన్నత పాఠశాలలో పాఠాలు చెప్పిన ప్రధాన ఉపాధ్యాయుడని గుర్తుపట్టారు. వెంటనే తన గురువును వేదికపైకి పిలిపించారు. స్వయంగా ఆయనను తోడుకొని వచ్చి తన ఉన్నతాసనంలో కూర్చోబెట్టి పాదాభివందనం చేశారు. నేను 
నాలాంటివాళ్లు ఇంతటి ఉన్నత స్థానానికి చేరుకున్నారంటే దానికి కారణము కేవలం ప్రాథమిక ఉన్నత పాఠశాల అధ్యాపకులే. వారు వేసిన విద్య అనే బీజం ఈస్థాయికి తీసుకొని వస్తుంది అన్నారు. మాజీ ప్రధాన ఉపాధ్యాయులవారు మాట్లాడుతూ మాజీ రాష్ట్రపతిగారు వచ్చారంటే చూడటానికి మాటలు వినటానికి వచ్చాను నాకు తెలియదు, నా విద్యార్థి అని. ఇప్పుడు నేను తెలుసుకున్నాను నాకు చాలా గర్వంగా ఉంది, నాదగ్గర చదువుకున్న విద్యార్థి ఈ స్థాయికి ఎదిగాడని కన్నీరు పెట్టారు

ఓ బాటసారీ ! ఈ మాటల్ని మరువకోయీ !!! 🙏

 శుభోదయం 💐🙏

బరాక్ ఒబామా 44 ఏళ్లకే అమెరికా అధ్యక్షుడయ్యాడు . 
55 ఏళ్లకు రిటైర్ అయ్యాడు .
డోనాల్డ్ ట్రంప్ 70 ఏళ్లకు అమెరికా అధ్యక్షుడయ్యాడు .

జగపతి బాబు వయస్సు 61 . గత ఐదారేళ్ళనుంచి హీరో పాత్రలకు స్వస్తి చెప్పి విలన్ పాత్రలను పోషిస్తున్నాడు .

హీరోగా చిరంజీవికే పోటీనిచ్చిన రాజశేఖర్ 61  ఏళ్లకు అనారోగ్య సమస్యల తో బాధ పడుతున్నాడు .
 
సినిమా ఫీల్డ్ లో ఉండే కులవివక్షతను ఛేదించి రచ్చ గెలిచి ఇంట గెలిచిన హీరో సుధాకర్. ఇప్పుడు  వయస్సు 64 . అనేక ఏళ్లుగా తీవ్ర  అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నాడు .

మహేష్ బాబు వయస్సు 48 . ఇరవై అయిదేళ్ల హీరో లాగా కనిపిస్తున్నాడు .

బాలకృష్ణ వయస్సు 63 . 
తన నట జీవితం లో ఎప్పుడూ లేనంత పీక్ లో ఉన్నాడు.
హాట్రిక్ విజయాల్ని సాధించాడు . 

చిరంజీవి  వయస్సు 68 . 
కసితో మరో హిట్ కొట్టాలని ఎదురుచూస్తున్నాడు .

రజనీకాంత్ వయస్సు 74 . 
ఈ వయస్సులో చాలా మంది అన్ని వ్యాపకాలను మానుకొని ఇంటిపట్టున ఉండిపోతారు . ఈయన 600  కోట్ల బ్లాక్ బస్టర్ కొట్టి అభిమానుల గుండెల్లో మరో సారి జైలర్ అయ్యాడు .

తాత సూపర్ స్టార్. తండ్రి సూపర్ స్టార్. తనకు 29  ఏళ్ళ వయసు వచ్చినా ఇంకా హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు అక్కినేని అఖిల్ . 

రవి తేజ 1992 సంవత్సరంలోనే నటించడం మొదలుపెట్టాడు. పదేళ్ల తరువాత,  35  ఏళ్ళ వయస్సు లో మొదటి హిట్ కొట్టాడు .  

జీవితం ఒక సుదూర పరుగుపందెం . 
అంటే మారథాన్ రేస్ .

పదవ తరగతి , ఇంటర్ , ఎంసెట్ , క్లాట్, నీట్ , ఐఐటీ జేఈఈ,  సివిల్స్,  గ్రూప్ 1 , 2 , పెళ్లి , వ్యాపారం , జాబ్ .. ఇలాంటివన్నీ  వంద మీటర్ ల పరుగుపందేలు .
 గెలిస్తే బాగుంటుంది .
 గెలవడం కోసం ఇష్టపడి కష్టపడాలి . 
కానీ .. వాటిలో గెలిస్తేనే జీవితం సెటిల్ అయిపోయినట్టు కాదు.

ఐఏఎస్,  ఐపీఎస్ లాంటి ఉన్నత సర్వీస్ లు సాధించి అరవై ఏళ్ళ వయసులో ట్రోలింగ్ కు గురవుతున్నవారిని చూస్తున్నాము. 

పాట ఆగకూడదు .....  
ఆట ఆగకూడదు.

బహుదూరపు బాటసారీ ....
పరుగెత్తాలి ప్రతీ రోజూ....
ప్రతీ గంటా.....
మారథాన్ రేస్ లో గెలుపొందాలి అంటే వంద మీటర్ల పరుగుపందెంలో పరుగెత్తినట్టు ఊపిరి బిగబట్టి పరుగెత్తడం  కాదు. అలా పరుగెడితే అలసిపోతావు  . 
నింపాదిగా ప్రతీ నిముషాన్ని...  ప్రతీ గంటని...  ఎంజాయ్ చేస్తూ పరుగెత్తాలి .

 రేస్ లో ఉన్నామని గుర్తుంచుకోవాలి .
 చాలా మంది ఒక సక్సస్ సాధించిన వెంటనే  " ఇంకేంటి లైఫ్ లో గెలుపొందాము "  అనుకొని పరుగును ఆపేస్తారు .
 
ఆత్మ హత్య చేసుకొన్న ఐఏఎస్ లను చూసాము. 
ఐఐటీ విద్యార్థుల ఆత్మ హత్యలు చూస్తున్నాము .
 
జీవితం అనే సినిమాలో  ఒక స్ప్రింట్ రేస్ అంటే వంద మీటర్ల పరుగుపందెం లాంటి ఐఏఎస్, ఐఐటీ లాంటివి సాధించడం తోటే శుభం కార్డు పడదు .

ఊహ తెలిసినప్పటినుంచి తుది శ్వాస దాకా మారథాన్ ను సాగించాలి.
" రిటైర్ అయ్యాను!  నాకేంటి ?పెన్షన్ వస్తుంది " అని ఇంటిపట్టునే కూర్చుంటే మానసికారోగ్య సమస్యలు వచ్చే అవకాశం వుంది.

చేస్తున్న పనిని ఎంజాయ్ చేస్తూ జీవనం సాగించాలి .

ఒక పరీక్షలో లేదా వరుసగా పది పరీక్షల్లో ఫెయిల్ అయినంత మాత్రాన జీవితం ముగిసినట్టు  కాదు. 
బాలకృష్ణ కు ఒక దశలో ఎన్నో ప్లాప్ లు వచ్చాయి.

ఎవరూ విజేతలు కారు ....
పరాజితులూ కారు.

 ఎన్నో సాధించి అరవై - డెబ్భై ఏళ్ళ వయసులో అనారోగ్యం లేదా పిల్లల ప్రవర్తన వల్ల బాధల్ని,  అవమానాల్ని భరించేవారు ఎంత మందో !!ఎన్నో ఫెయిల్యూర్స్ ను ఎదుర్కొన్నా,  తట్టుకొని నిలబడి జీవితం లో విజయాన్ని చవిచూసి  ఆనందించేవారు ఎందరో !!!

చదువు ... కెరీర్ ... కుటుంబం .. భార్య / భర్త , పిల్లలు , తల్లితండ్రులు , ఆరోగ్యం....
ఇవన్నీ మైలు రాళ్లు. 
ఒకటి రెండింటి లో ఎంత విజయం సాధించినా, 
 మరొక దానిలో ఫెయిల్ అయితే జీవితం నరకం .

జీవితం ఒక విస్తరి. 
రుచి బాగుంటుందని  కేవలం లడ్డూనే విస్తర్లో పెట్టుకొని తింటామా ?

అన్నింటిలో... అన్ని దశల్లో..  పోరాటం ద్వారా,  ప్లానింగ్ ద్వారా విజయం సాధించాలి . కష్టాల్ని  గ్లూకోస్ లాగా తీసుకొంటూ  ...  అవమానాల్ని షూస్ లాగా  వేసుకొని పరుగు   సాగించాలి .
 అపజయానికి మించిన గురువు లేడని గ్రహించాలి.

నిన్నటి కంటే నేడు బాగుండాలి. నేటి కంటే రేపు,
రేపటి కంటే ఎల్లుండి బాగుండాలి. 

ఇరవై  ఏళ్ళ వయసులో విశ్వసుందరి లాంటి పోటీల్లో గెలుపొంది,  ఉన్నత శిఖరాల్ని చేరుకొని కూడా అటుపై జీవితాన్ని సరిగా ప్లాన్ చేసుకోలేక కుంగుబాటుకు గురయ్యే వారెందరో !!!

మీ జీవితానికి మీరే  హీరో / హీరోయిన్. 
వేరొకరితో పోలికెందుకు ???

ఇహలోక కుబేరుడు అంబానీ కూడా నేడు బ్లాక్ మెయిలర్స్ థ్రెట్ ను ఎదుర్కొంటున్నాడు .
మంత్రులు, VIP లు తుపాకి నీడలో బతుకుతున్నారు.

హీరోలు, హీరోయిన్ లు సెలబ్రిటీ లు ..... మీలా రైల్వే స్టేషన్ కు, బస్టాండ్ కు, పార్క్ కు, టూర్ కు వెళ్ళగలరా ???
వారు పంజరం లో పక్షులు.

అదృష్టం మీదా?  వారిదా ?

మన ఆలోచనే మన జీవితం.
ఎందుకు పుట్టామో,
ఎందుకు మరణిస్తామో తెలియదు. 
అది మీ చేతిలో లేదు. 
కానీ..... జనన మరణాల మధ్య వున్న  సుదూర పయనం   మీ చేతిలో. 

 ప్రతీ  రోజూ..... 
భలే మంచి రోజు... 
పసందైన రోజు ...
వసంతాలు పూచే రోజు కావాలి .
 అది మీ చేతిలోనే ఉంది.
 
ఈ  లోకం  మీ ముందు నిలిచిన అద్దం.

ఓ బాటసారీ ! 
ఈ మాటల్ని మరువకోయీ !!! 🙏

సత్యం యొక్క శక్తితో మీరు తరిమివేయబడతారు మరియు క్రిందకు నెట్టివేయబడతారు

 🌺 Amritham Gamaya 🌺

When you expend through your ego in a way which breaches the eternal principles of Cosmos,  you will be hit back by the laws of eternal Truth, the Sath, with double force pushing you down - SathChith.

అమృతం గమయ

విశ్వం యొక్క శాశ్వతమైన సూత్రాలను ఉల్లంఘించే విధంగా మీరు మీ అహాన్ని ప్రదర్శించినప్పుడు, సత్యం యొక్క శక్తితో మీరు తరిమివేయబడతారు మరియు క్రిందకు నెట్టివేయబడతారు - సత్ చిత్.

अमृतम् गमय

जब आप अपने अहंकार को एक तरह से प्रदर्शित करते हैं जो ब्रह्मांड के शाश्वत सिद्धांतों को तोड़ता है, तो आप सत्य की ऊर्जा से प्रभावित होंगे, आपको नीचे धकेलने के साथ - सतचित

మీ భౌతిక గుర్తింపును నిరూపించడానికి.....

 🌸 Amritham Gamaya 🌸

You are going away from your SELF by engaging in thoughts and actions to establish your material identity to externality. When you realize your SELF, you will know that all your cravings for external identity are senseless and you will know that most precious time has been lost in living for everything and everyone else. Be conscious - SathChith.

అమృతం గమయ

మీ భౌతిక గుర్తింపును బాహ్యత్వానికి నిరూపించడానికి మరియు స్థాపించడానికి మీ ఆలోచనలు మరియు చర్యల ద్వారా మీరు మీ ఆత్మ నుండి దూరంగా వెళుతున్నారు. మీరు మీ ఆత్మను గ్రహించినప్పుడు, బాహ్య గుర్తింపు కోసం మీ కోరికలన్నీ తెలివిలేనివని మీకు తెలుస్తుంది మరియు ప్రతిదానికీ మరియు ప్రతిఒక్కరికీ జీవించడంలో చాలా విలువైన సమయం పోయిందని మీకు తెలుస్తుంది. స్పృహతో ఉండండి - సత్ చిత్.

अमृतम् गमय

आप अपनी भौतिक पहचान को बाहरीता को साबित करने और स्थापित करने के लिए अपने विचारों और कार्यों के माध्यम से अपनी आत्मा से दूर जा रहे हैं। जब आप अपनी आत्मा का एहसास करते हैं, तो आपको पता चलेगा कि बाहरी पहचान के लिए आपकी सभी लालसाएं व्यर्थ हैं और आपको पता चल जाएगा कि सबसे कीमती समय अन्य सब कुछ और सभी के लिए जीने में खो गया है। सचेत रहें - सत् चित्।

శ్రీకృష్ణ భగవానుడు నిర్దేశించిన విధంగా మూడు అంశాలను మనం అనునిత్యం గుర్తు చేసుకోవాలి.

 *ॐశ్రీవేంకటేశాయ నమః*
💝💝 *శ్రీకృష్ణ భగవానుడు నిర్దేశించిన విధంగా మూడు అంశాలను మనం అనునిత్యం గుర్తు చేసుకోవాలి.*
💖 *మొదటిది భౌతికమైన శరీరం. ఇది పంచ భూతాత్మకం. కర్మ పాట్లు దీనికి తప్పవు.*
💖*రెండవది శరీరం కంటే భిన్నమైంది, శరీరం పడేటంతవరకు ఆ శరీరాన్ని ఆసరా గా చేసుకుని "లోన" ఉండేది. అది ఆత్మ. అగోచరము, అవ్యక్తము, అచలము, నిప్పుతో కాలనిది, నీటి తో తడవనిది ఇత్యాది లక్షణాలతో కర్మ పాట్లకి అతీతం గా విలసిల్లేది. దీన్నే జీవుడు అని కూడా అంటుంటారు.*
💖*మూడవది ఈ రెంటికీ అతీతమైంది పరమాత్మ. వీటి యజమాని. ఎప్పుడూ నా వాడైన జీవుడు నా దగ్గరే ఉండాలి అనుకునేవాడు. లెక్కకు అందని జీవన యాత్రల నుండి జీవుడికి విముక్తి కలిగించి నిత్యం తన దగ్గరే పెట్టుకోవాలి అనుకునేవాడు. తల్లి వలె, తండ్రి వలె! కానీ శారీరక కర్మ ల ద్వారా ఎప్పటి కప్పుడు కొత్త బంధాలను, అగచాట్లను ప్రోది చేసుకుంటూ ఎప్పటికీ పరమాత్మను చేరలేక సంసారమనే బంధం లో కొనసాగుతూనే ఉంటాడు జీవుడు.*
❤️ *ఒక శరీర యాత్ర ముగిశాక కర్మ బంధాలకు లోబడిన కొత్త శరీరం వెతుకుతూ వెళ్లిపోతుంది ఆత్మ. అలా వెళ్ళడం గురించి దానికి ఎలాంటి చింత లేదు. శరీరం ముగిసి పోవడం చావు కాదని కదా పరమాత్మ అభిమతం. ఎందుకంటే ఆత్మకు చావు లేదు. శరీరం ముగియడం గురించి చింత పడే అర్జునుడి కి ఉపదేశమే గీత.*

💓 *జీవుడు పరమాత్మ కు సమకాలీనుడు. ఆత్మ పరమాత్మ లకు ఒకటే తేడా … తాను అంతకు ముందు "ఉన్నట్లు" పరమాత్మకు సంపూర్ణ జ్ఞానం ఉంటుంది. అది లేని వాడు జీవుడు. వాడు బద్దుడు. కర్మకు లోబడిన వాడు.*
💕*అస్థిత్వంకోల్పోయిన శరీరంలో ఆత్మ పరమాత్మలకు తావు లేదు. అంటే శరీరం నుండి ఆత్మ తప్పని సరిగా విడుదల అవుతుంది. (Soul exits the body).*
💞 *ఆత్మ శరీరం నుండి విడుదల అవ్వడానికి మూడు మార్గాలను నిర్దేశించారు పెద్దలు ఆయా గుణాలను బట్టి. సత్వం అధికమై ఉంటే ఊర్థ్వమైన శిరస్సు నుండి, రజస్సు అధికమైతే ముఖ భాగాలనుండి (కళ్ళు ఇత్యాది), తమో గుణం ప్రస్ఫుటంగా ఉంటే నీచ స్థానమైన గుద భాగం నుండి ఆత్మ నిష్క్రమణ జరుగుతుంది. కొన్ని శరీరాలు ప్రశాంతంగా ఉన్నట్లు, కొన్ని అలజడిగా ఉన్నట్లు మనం చూస్తాం.*
💖*సనాతన ధర్మాన్ని సంపూర్ణంగా విశ్వసిస్తే ఆత్మ శరీరం నుండి బయటకు రావడమూ, ఆ తరువాత ఆత్మ ప్రయాణమూ కూడా సత్యమని అర్థమవుతుంది మనకు.*

💖 *శరీరపు ఉనికి ఉన్నప్పుడే (బ్రతికి ఉన్నప్పుడే) వివిధ ప్రక్రియల ద్వారా ఆత్మ బయటకు రాగలగడం, లోనికి వెళ్ళగలగడం వంటివి సాధ్యం కాదనిపిస్తుంది.*
💓*ఆత్మ, పరమాత్మ, ప్రకృతి (శరీరం) ల కలయికే జీవుడి ప్రయాణం. ఆత్మ (జీవుడు), ప్రకృతులకు ఆలంబనగా నిలిచే వాడు పరమాత్మ. పరమాత్మ కలిసి ఉంటేనే మిగతా రెంటికీ అస్థిత్వం. మరి అత్యంత సూక్ష్మమైన ఆత్మ, పరమాత్మతో కలిసి శరీరంలో ఉండడం వల్లనే మనమీ శరీరంలో చైతన్యాన్ని గమనిస్తున్నాం.*
Ⓒ❤️ *ॐశ్రీవేంకటేశాయ నమః*
💕*~సకల జనుల శ్రేయోభిలాషి,*
*శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి*

పూజల్లో దోషాలు

 *🌻పూజల్లో దోషాలు🌻*
                        
🥀ఒక ముసలి భిక్షువు శివాలయం దగ్గర బిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తూండేది.

🥀ఒక రోజు ఓ యోగిపుంగవుడు శివదర్శనం చేసుకుని వెడుతూంటే, ఆ వృద్ధురాలు ఆయన పాదల మీద పడి "అయ్యా ! నా జీవితం అంతా ఇలానే సాగిపోతోంది.

🥀నాకేదైనా మంత్రమో, పద్యమో చెప్పండి. ఇక బతికి ఉన్న నాలుగు రోజులు మీరు చెప్పినదే మనస్సులోనే అనుకుంటూ బతుకుతాను" అని ప్రాధేయపడింది.

🥀ఆ యోగి అప్పుడామెకు ఇలా చెప్పాడు...

"తవ పాదే మమ శిర: ధారయతాం ! దేహిమే ముక్తి శివా!" అని ముమ్మారు చెప్పి వెళ్ళాడు.

🥀ఆమె అది విని ఆనంద పడి అదే ధ్యానం చేసుకుంటూ తృప్తిగా గడుపుతోంది.

🥀అలా కొన్ని ఏళ్ళు గడిచాయి. ఈమె పండు వృద్ధురాలయింది. అలాగే ఆ శివాలయం దగ్గర బిక్షాటన చేస్తూ గడుపుతోంది.

🥀తిరిగి ఆ యోగి పుంగవుడు శివ దర్శనం చేసుకుని, ఈమెను గుర్తుపట్టి, "ఏమి అవ్వా! నేను చెప్పినది జ్ఞాపకం ఉన్నదా " అనడిగాడు.

🥀ఆమె ఆయనకు నమస్కరించి "అయ్యా! అదీ మరువలేదు. తమరిని మరువలేదు " అన్నది.

🥀"ఏదీ చెప్పిన పాఠం అప్పజెప్పు " అని నవ్వుతూ అడిగాడు.

🥀ఆమె తడబడుతూ తను ధ్యానిస్తున్న ఆ యోగి చెప్పినది అప్పజెప్పింది.

🥀"అవ్వా! తప్పు చదువుతున్నావు! నేను స్వామి పాదాల మీద నీ శిరసు పెట్టమంటే, నువ్వు స్వామి శిరసు మీద నీ పాదాలు పెట్టావు! నీ ఇన్నేళ్ళ ధ్యానం వ్యర్ధం అయ్యింది" అని కోపంతో వెళ్ళిపోయాడు.

🥀ఆ వృద్ధురాలు చేసిన పొరపాటు ఈ "తవ, మమ" అనే పదాలు అటూ ఇటూ చేసి చదువుతోంది.

🥀ఆమె కంటిమింటికి ఏకధారగా ఏడుస్తూ, అన్నాహారాలు మాని తన ఇన్నేళ్ళ శ్రమ వ్యర్ధం అయ్యింది అని రోజుల తరబడి బాధపడసాగింది.

🥀ఓ  రాత్రి మన స్వామి ఆ యోగిపుంగవుని కలలో కనబడి " ఏం పని చేశావయ్యా ! నా భక్తురాలు అన్నాహారాలు లేక బాధపడుతోంది. నేను శ్రద్ధాభక్తులకు వశుడను కానీ, భాషకు కాదయ్యా ! ముందు ఆమె బాధపోగొట్టి, ఆమె అహారం తీసుకునేలా చెయ్యి" అని ఆయనను హెచ్చరిక చేశాడు.

🥀ఆ యోగి పుంగవుడు ఉలిక్కిపడి లేచి, శివాలయం దగ్గరకు పరుగుపరుగున వెళ్ళి, ఆ వృద్ధురాలి పాదముల మీద పడి..."అమ్మా ! నువ్వు చేసే పూజే స్వామికి నచ్చింది. నన్ను క్షమించి ఆహారం స్వీకరించు" అని ఆమెను తృప్తిపరచి తన ఆశ్రమానికి తిరిగి వెళ్ళాడు.

🥀కాబట్టి మనం తెలుసుకోవలసింది, స్వామి మన శ్రద్ధాభక్తులకు ప్రాధాన్యం ఇస్తాడు కానీ, భాషకు కాదని తెలుసుకోవాలి.

🥀మనం ఎన్నో సహస్రాలు చదువుతూ ఉంటాము. పొరపాట్లు దొర్లుతూ ఉంటాయి. పూజల్లో దోషాలు వస్తుంటాయి. కావాలని చేయరు ఎవరూ! పొరపాటులు జరగవచ్చు అవ్వన్నీ స్వామి పట్టించుకోడు. కావలసింది శ్రద్ధా, భక్తి మాత్రమే.

జ్ఞానం

🔺 *పత్రీజీ సమాధానాలు* 🔺
🌹 *చాప్టర్ -- 4 :--- జ్ఞానం* 🌹
🌷 *Part --9*🌷

🍁 *ప్రశ్న :---* నా పెళ్ళి అయిన తర్వాత వేరే దేశానికి మకాం మార్చటంతో గత కొద్ది నెలలుగా నేనెన్నో మార్పులను ఎదుర్కొంటూ వస్తున్నాను. ఇది సుదూర తీరాలకు నన్ను నెట్టి వేసినట్లుగా అన్పించింది. నేను జీవితంలో ఎలాంటి అనుభవాలు, పరిస్థితులు మరి సంబంధ బాంధవ్యాల్లో అయినా నెగ్గుకురాగలను అని ఎంతో ఆత్మ విశ్వాసం వచ్చింది. 

నేను నేర్చుకున్నదంతా ముఖ్యంగా జీవితంలో ప్రతి క్షణాన్నీ ఆస్వాదిస్తూ, దైనందిన జీవితంలోని ప్రతి పరిస్థితి, ప్రతి అనుభవం... అన్నింటినీ ఆనందంగా స్వీకరించే వాళ్ళతో కలిసి ఉండటమే అని నేను తెలుసుకుంటున్నాను.

 దేన్నీ విశ్లేషించరు. తార్కికంగా ఉండరు. ఇది నాకు ఎంతో  ప్రత్యేకమైన పాఠం. కనువిప్పు కలిగించేలా ఉందని చెప్పాలి. ఇదంతా మానసిక ఆరోగ్యం పట్ల ఎలాంటి అవగాహన లేని వ్యక్తులను కలుసుకోవటం ద్వారా తెలిసింది. వాళ్ళలో కొందరు ధ్యానం చేసినప్పటికీ అదంతా కూడా ప్రార్థనల రూపంలోనే ఉంటుంది.

 ప్రార్థనలతో ధ్యానాన్ని కలపటం వల్ల అనుకుంటా నాకు అంతా ఒక్కటిగానే అన్పిస్తుంది. మనం ఎలా తీసుకుంటున్నాం అన్నదే ముఖ్యం కదా ! అన్నింటినీ మించి ధ్యానం నాకు క్రమ శిక్షణను నేర్పింది. ఎంతటి జ్ఞానం ఉన్నా సరే మన జీవితాల్లో ఇది లేకపోతే కనుక ఎంతో లోటుగానే ఉంటుంది కదా ! 

ఒక వేళ మన జీవితాల్లో క్రమ శిక్షణ లేనట్లయితే మరి ఆ జీవితాన్ని నిజంగా ఊహించుకోలేం. నేను ఏ విధమైన క్రమ శిక్షణ గురించి మాట్లాడుతున్నానంటే, ఒక చోట హాయిగా కూర్చుని, శక్తి ప్రవాహాన్నీ, నన్నూ ఒకే అంశం పైన కేంద్రీకరించటం గురించి చెప్తున్నాను. మరి ఇది నాకు ఒక వ్యాయామం వంటిది. ఇది నా అస్తిత్వం అంతా కలిసి చేసేలా నేను వ్యాయామం అన్నమాట. ఇది మానసికమైనది కాదు. ఆత్మ పరమైన వ్యాయామం అని చెప్ప వచ్చు. మరి ఇది అస్తిత్వం అంతటినీ గొప్ప సమర్థవంతంగా చేయటంలో ఎంతగానో దోహదపడుతుంది. నేనిప్పుడు ఆనందంగా ఉన్నానని చెప్పటం లేదు. నేను అనుభవించిన వేదనా భరితమైన క్షణాలు కూడా ఎన్నో ఉన్నాయి. కనుక నేను అలానే ఉన్నాను. ప్రతి మానవుడికి సహజంగా ఉండే భావోద్వేగాలన్నీ నాలోనూ ఉన్నాయి.

 విచారం, బాధ, కోపం వంటి సాధారణ మానవుల భావోద్వేగాలను నేను ఏ మాత్రం ప్రతికూల భావోద్వేగాలు అని చెప్పను. 

ఇటువంటి భావాలు అన్నింటినీ దాటి (వాటిని కలిగి ఉన్నప్పటికీ) వాటిని అధిగమించి చూడగలిగేలా ధ్యానం నాకు తోడ్పడింది. ఇంతకు ముందు నాకు ఏదైనా బాధ, దుఃఖం అన్పిస్తే తట్టుకోలేను కనుక అటువంటివేవీ నా జీవితంలో ఉండకూడదు అనే భయంతో ఉండేదాన్ని. 

ఈ బాధ నుంచి తప్పించుకుని పారిపోవటానికీ మరి దీన్ని పరిష్కరించటానికీ ఎన్నెన్నో చేసేదాన్ని. వృత్తి పరంగా రాణించాను. 

అయితే బాధ అనివార్యమైనది అని నేను కనుక్కున్నాను. ఈ ప్రపంచంలో ఉన్నంత వరకూ ఏదో ఒక రూపంలో అది తప్పక ఉంటూనే ఉంటుంది. ఈ జీవితంలో మనకి ఇవ్వబడిన పని ఏమిటంటే బాధతో స్నేహం చెయ్యటం ఎలా అనే మార్గాన్ని కనుక్కోవాలి. అదే మనందరి ప్రయాణం. ఎందుకంటే బాధ మనకు గొప్ప పాఠం నేర్పుతుంది. మరి బాధతో స్నేహం చెయ్యాలంటే ఉన్న ఒకే ఒక్క మార్గం క్రమ శిక్షణతో ఉండటం అని నేను అనుకుంటున్నాను. మరి ఇదే నా ధ్యాన ప్రయాణం.

బాధను అధిగమించటానికీ, మైత్రి చెయ్యటానికీ, అవగాహన చేసుకోవటానికీ, మౌలికంగా బాధను నాలోకి అనుమతించటానికీ ధ్యానం నాకు ఇతోధికంగా తోడ్పడింది. ఇది నన్ను వికసింప చేసింది. కనుక ఇప్పుడు, ఈ క్షణంలో నేనెంతో శక్తివంతంగా ఉన్నాను. దూసుకుపోతాను అన్పిస్తోంది. నేను నిజంగా సంతోషాల కోసం ఎదురు చూడటం లేదు. ఎందుకంటే నా జీవిత లక్ష్యం అంతర శక్తిని పెంపొందించుకోవటమే అని నాకనిపిస్తోంది. నా గమ్యం అదే. ఒక వేళ అంతర శక్తి ఉందంటే దాని వెన్నంటే ఆనందాలూ వెల్లువలా వస్తాయి. నేను అది పొందాననే అనుకుంటున్నాను. ధ్యానం చెయ్యటం ద్వారా ఆ శక్తిని కలిగి ఉండటానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఇప్పుడు చెయ్యవలసింది ఏమిటంటే ఆత్మ బలాన్ని కాపాడుకుంటూ సాగటం. దయచేసి నేనెక్కడైనా సరిగ్గా లేకపోతే నన్ను సరిదిద్దండి?

🍀 *పత్రీజీ :---* అవును. ధ్యానం మనం అంతర శక్తిని పెంపొందిస్తుంది. దేహ బలం కండరాలపై ఆధారపడితే, ఆత్మ బలం ధ్యానం పై ఆధారపడుతుంది. కండరాలు పెంచుకోవటానికి మీరు శారీరక వ్యాయామం చెయ్యాలి. ఆత్మ బలం పెంపొందించుకోవటానికి ధ్యానం చెయ్యాలి.

🌳 ధ్యానం అంటే మనస్సుకు క్రమ శిక్షణను ఇవ్వటం. మనస్సుకు క్రమ శిక్షణను ఇవ్వవలసిందే. మనస్సుకు శిక్షణను ఎలా ఇస్తారు మీరు? ధ్యానం ద్వారా, ఆలోచనలు చేయకుండా ఉండటం ద్వారా, కేవలం శ్వాస ధారను గమనించటం ద్వారా మీ మనస్సును శూన్యం చేస్తున్నారు. మనస్సుకు శిక్షణను ఇస్తున్నారు. ధ్యానం అంటేనే మనస్సుకు శిక్షణను ఇవ్వటం. మనస్సును క్రమ శిక్షణలో ఉంచాలి. లేదంటే అటూ ఇటూ పరుగులు పెడుతూ ఉంటుంది. ఎక్కడెక్కడికో వెళ్తుంది. అన్నింటిలో మునిగిపోతుంది. 

🌿 మరి మనస్సు శిక్షణ పొందాలి. అది ధ్యానమే ఇస్తుంది. నేను నలబై సంవత్సరాలుగా ప్రతి ఒక్కళ్ళకీ మానసిక శిక్షణ గురించి బోధిస్తూ ఉన్నాను. సహజమైన, సాధారణమైన శ్వాసను గమనిస్తూన్నప్పుడు మీరు మీ మనస్సుకు శిక్షణను ఇస్తారు. కనుక మీ కళ్ళు మూసుకోండి. సహజమైన శ్వాసతో ఏకంకండి. 

🌳 మనస్సు గురించి విశ్లేషణ వద్దు. కేవలం మనస్సును క్రమ శిక్షణలో ఉంచాలి. చిత్త శుద్ధి లేని మనస్సు గురించి ఎన్ని విశ్లేషణలు చేసినా ఏమీ ప్రయోజనం ఉండదు. మనస్సును సరియైన ధ్యాన సాధన ద్వారా నియంత్రణలోకి తేవాలి. ఆనాపానసతి ధ్యాన సాధన ద్వారా మనస్సు శూన్యం అయిపోతుంది. కనుక దయచేసి అందరికీ ఆనాపానసతి ధ్యానాన్ని నేర్పించండి. మీ దగ్గరకు వచ్చే మీ బంధువులు, మిత్రులు, ఇరుగు పొరుగు వాళ్ళు అందరికీ ఈ విధంగా ధ్యానం నేర్పి సహాయ పడండి. వాళ్ళ మనస్సులను విశ్లేషించకండి. ఏ జంతువూ మరో జంతువును విశ్లేషించదు. మరి మనుష్యులు ఎందుకు వేరే మనుష్యులను విశ్లేషిస్తూ ఉంటారు? మనుష్యులందరూ పిచ్చి వాళ్ళు అనుకుంటాయి జంతువులన్నీ, వాస్తవానికి పిచ్చి వాళ్ళే మరి. ఒక పిచ్చి కుక్క అనేది ఉండదు. *“పిచ్చి పిల్లి”* అనేది ఉండదు. అయితే పిచ్చి వాళ్ళు మాత్రం ఎప్పుడూ ఉంటారు. 

🌸 ఎందుకంటే వాళ్ళు ఎప్పుడూ ఏదో ఒకదాన్ని విశ్లేషించుకుంటూ ఉంటారు. ఏ జంతువూ అలా చెయ్యదు. ఏ పక్షి అలా చెయ్యదు. ఏ చేపా అలా చెయ్యదు. కేవలం మనుష్యులు మాత్రమే అలా చేస్తారు. మరి ఆ విశ్లేషణతో తమకు తామే నరకాన్ని సృష్టించుకుంటారు. 

🏵️ ధ్యానం అంటే ఎలాంటి విశ్లేషణలూ చెయ్యకపోవటం. నేను నేనే. మీరు మీరే. నేను మిమ్మల్ని మీరుగా అంగీకరిస్తాను. నేను మిమ్మల్ని విశ్లేషించను. నన్ను నేనుగా అంగీకరించుకుంటాను. నన్ను నేను విశ్లేషించను. నేను ఒక మూర్ఖుడిని. అయితేనేం? నేను ఒక వెధవని. అయితే ఏంటిట? 

🌻 ఒక జంతువులా... ఒక కుక్కలా... ఒక పిల్లిలా నేను ఆనందంగా ఉంటాను. ఒక కుక్క ఎంత ఆనందంగా ఉంటుందో నేనూ అంత ఆనందంగా ఉంటాను. ఒక పిల్లి ఎంత ఆనందంగా ఉంటుందో నేనూ అంత ఆనందంగా ఉంటాను. ఒక చేప ఎంత ఆనందంగా ఉంటుందో నేనూ అంత ఆనందంగా ఉంటాను. ఒక పక్షి ఎంత ఆనందంగా ఉంటుందో నేనూ అంత ఆనందంగా ఉంటాను. 

🌿 మీరంతా కూడా పక్షిలా ఆనందంగా ఉండాలి అనుకుంటున్నాను.  మీరంతా కూడా పిల్లిలా ఆనందంగా ఉండాలి. అనుకుంటున్నాను. మీరంతా కూడా చేపలా ఆనందంగా ఉండాలి అనుకుంటున్నాను. మీరంతా కూడా కుక్కలా ఆనందంగా ఉండాలి. అనుకుంటున్నాను. ఒక మనిషిలా బాధ పడకూడదు. మీకు నమస్కారములు.

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

మనశ్శాంతికి మంచి మార్గాలు telugu pdf ebook

 మనశ్శాంతికి మంచి మార్గాలు telugu pdf download link

అన్ని జీవుల మీదా ప్రేమను చూపించగలవాళ్ళు కాషాయం ధరించని సన్యాసులే

 *సత్సంగం*

ఒక మనిషి ఒక కొండ శిఖరం మీదకి
 తేలికగా హాయిగా ఎక్కగలగాలంటే
 బరువు ఉంటే ఎక్కడం కష్టం

 తిరుపతి కొండని కాలినడకన ఎక్కేవారికి ఇది అనుభవమే
 కొంత దూరం వెళ్ళాక వెంటనే నీళ్ల సీసా కూడా బరువుగానే అనిపిస్తుంది 

అలాగే ఆధ్యాత్మిక శిఖరం ఎక్కాలనుకునే వారికి
 *తీరని కోరికలూ, తీరాల్సిన ఆశలూ* 
వాళ్ళు మోసుకెళ్ళే బరువులు అవుతాయి 
వీటిని వదిలించుకుంటేనే ఆధ్యాత్మిక ప్రయాణం సులువుగా సాగుతుంది 

అలాగే ఇతరుల నుంచి ఉచితంగా తీసుకునేవి కూడా బరువే అవుతాయి
 అది డబ్బు కావచ్చు ,సేవ కావచ్చు, వస్తువులు కావచ్చు, మరేదైనా కావచ్చు
 తగిన సొమ్ము చెల్లించకుండా ఏం తీసుకున్నా రుణానుబంధమే అవుతుంది ఈ రుణానుబంధం  ఆధ్యాత్మిక శిఖరం చేరుకోవటానికి ఆటంకం అవుతుంది.
 దీని బరువు దింపాలంటే అనుభవించడమే దారి 

అందుకే అనుభవానికి రాకమునుపే 
ఆధ్యాత్మిక మార్గంలో కర్మలని భస్మం చేసుకోవాలి 

రుణానుబంధ కర్మలలో చిక్కుకోకుండా జాగ్రత్త పడాలి
 చిక్కుకుంటే మాత్రం చాలా జన్మలూ, చాలా కాలమూ వృధా చేయవలసి వస్తుంది

మనిషి జీవన యాత్ర సాగటానికి ముఖ్యమైనది ఇంత నీడ 
అందుకే
సన్యాసులు చెట్ల కిందా, దేవాలయాల్లోనూ బస చేయాలని శాస్త్రం చెప్తుంది


సన్యాసులు సన్యాసాశ్రమం స్వీకరించాక గురుపరంపరను బట్టి ఆహార్యం నిర్ణయించబడుతుంది

 జుట్టును ముడి వేసుకోవటం
 లేదా 
జడలు కట్టేలాగా అలాగే వదిలేయటం
 లేదా 
ప్రతి పౌర్ణమికీ, అమావాస్యకీ గుండు చేయించుకోవటం
 కాషాయం ధరించటం
 సన్యాసి  లక్షణాలు.

 కాషాయాన్ని కట్టడంలో కూడా రకరకాల పద్ధతులు ఉన్నాయి

 కొందరు ఒకే బట్టని మెడ నుంచి మలుపు తిప్పి ముడి వేసుకొని శరీరం అంతా ధరిస్తారు తప్ప కుట్టిన దుస్తులను ధరించరు

పరంపర ని బట్టీ పద్ధతులు మారుతాయి

ఇవన్నీ
 ప్రపంచాన్ని భగవంతుడి  కోసం త్యజించిన  గుర్తుగా హిందూ సాంప్రదాయం ఏర్పాటు చేసింది

వీరిని పోషించవలసిన బాధ్యతను కూడా
 హిందూ సాంప్రదాయం గృహస్థుల మీద ఉంచింది

ఈ సంస్కృతిని అర్థం చేసుకోని దక్షిణ భారతదేశంలో
 సరైన సన్యాసిని కూడా
 బిచ్చగాడు లానే చూస్తారు

కానీ ఉత్తర భారత దేశంలో సన్యాసిని మహాత్మా అనీ మహారాజ్ అనీ సంబోధిస్తూ ఎంతో గౌరవంగా చూస్తారు

చిన్న టీ షాపు అతను కూడా సన్యాసికి టీ ఇచ్చి డబ్బు తీసుకోడు
ఉత్తర భారత దేశంలో వేలకొలది ఆశ్రమాలు వేలకొలది సన్యాసులను పోషిస్తున్నాయి

వేషానికి సన్యాసి గా
 వేషాలకు సంసారి గా ఉండే వారి అకృత్యాలు తరచూ మనకు టీవీల్లో కనపడుతూ ఉంటాయి

కోపిష్టి ఎక్కడైనా ఎలా కోపిష్టిగానే ప్రవర్తించి దొరికిపోతాడో
 దొంగ సన్యాసి కూడా అలాగే
 ఏ సందర్భంలోనైనా తన తప్పుడు ప్రవర్తనతో దొరికిపోతూ ఉంటాడు

అన్ని జీవుల మీదా ప్రేమను చూపించగలవాళ్ళు
కాషాయం ధరించని సన్యాసులే

సజ్జనులతో స్నేహం

 *సత్సంగం* 

సమయాన్ని సంపాదనకే కేటాయించక 
మంచి వారితో సాంగత్యం అనే నౌక ద్వారా
 సంసార సముద్రాన్ని దాటమని శంకర భగవత్పాదులు శిష్యులకు చెప్పినట్టుగా నిన్న చదివాం

350 సంవత్సరాలు క్రితం నిజంగా జరిగిన ఈ సంఘటన ఈ అంశాన్ని వివరిస్తుంది

 ఆరావళీ పర్వత లోయల్లో
 ఓ భిల్ల జాతికి చెందిన ఖైమాలుడు అనే అతను
 నిత్యం వేటాడి కుటుంబానికి ఆహారాన్ని సమకూర్చేవాడు

 ఓసారి అతను వేటకు వెళ్ళినప్పుడు
 హరి కీర్తన వినిపించింది

 అతను ఆ దిక్కుకు వెళితే
 ఓ శిథిలమైన శివాలయంలో రామకీర్తన పాడే ఇద్దరు సాధువులు కనిపించారు

 అతను తన్మయత్వంతో వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చోగా 
వాళ్ళు అతనిని చూసి చిరునవ్వు నవ్వి 
అతని మూటలోంచి 
కారుతున్న రక్తాన్ని చూసి 
దాని గురించి ప్రశ్నిస్తే 

ఖైమాలుడు మూటను విప్పి వేటలో కొట్టిన పావురాలు, కౌజు పిట్టలు, కుందేళ్ళ దేహాలని చూపించాడు

 నువ్వు ఈ అమాయక ప్రాణాలును దేనికి చంపావు

 అని బాధగా సాధువులు అడిగారు

 నేను ప్రతిరోజూ చేసే పని ఇదేగా
 వేటాడకపోతే నేను
 నా భార్యా పిల్లలకు ఏం పెట్టాలి 

అన్నాడు ఖైమాలుడు

 ఇలా అమాయక ప్రాణాలను చంపి తినటం పాపం అని నీకు తెలియదా

 పాపం అంటే ఏమిటి అన్నాడు ఖైమాలుడు 

  ఆ బిల్లుని సరళ స్వభావాన్నీ, నిష్కపట హృదయాన్నీ
 అర్థం చేసుకున్న సాధువులు వెంటనే 
అతని అంబులపొది లోంచి
 ఓ బాణాన్ని తీసుకుని ఖైమాలుడి తొడ మీద గీశాడు

 వెంటనే ఖైమాలుడు బాధగా అరిచాడు
 ఆ గాయం నుంచి స్వల్పంగా రక్తం కారింది

 ఇప్పుడు నీకు కలిగిన బాధ
 నీ బాణం ఇంకా లోతుగా గుచ్చుకోవడం వల్ల
 ఆ మూగ ప్రాణులకు కూడా కలుగుతుంది
 అవునా అన్నారు సాధువులు

అవును 
అది నేనెప్పుడూ ఆలోచించలేదు అన్నాడు ఖైమాలుడు 

ఆ సాధువు సంచిలోంచి ఒక మూలిక తీసి 
అతని గాయానికి రాయగానే రక్తం కారడం ఆగింది 

ఇప్పుడు ఎలా ఉంది 

హాయిగా ఉంది అన్నాడు ఖైమాలుడు 

 ఇక మీదట నువ్వు ప్రాణులకు ఇలా హాయిని కలిగించే పనులు మాత్రమే చెయ్యి. బాధను కలిగించే పనులను మానేయ్.

 మరి నా కుటుంబ పోషణ ని ఎవరు చేస్తారు?  అన్నాడు ఖైమాలుడు 

ఈ అడవిలోని అన్ని ప్రాణులకూ
 ఎవరు పోషణ చేస్తున్నారో వారే
 ఈ ప్రపంచంలోని అన్ని జీవులకీ పోషణ చేసేది అన్నారు సాధువులు

 అతనికి రామతారక మంత్రం ఉపదేశించారు

 ఈ మంత్రాన్ని జపించు 
అన్నీ భగవంతుడే చూసుకుంటాడు 
ఎప్పుడో ఒకరోజు నీకు రాముడు కనిపిస్తాడు ఆయనని చావు పుట్టుకలు లేని ముక్తిని కోరుకో
 అని చెప్పారు సాధువులు 

నేను చాలా జీవాల్ని చంపి పాపం చేశాను కదా
 మరి నాకు రాముడు నిజంగా దర్శనం ఇస్తాడా అన్నాడు ఖైమాలుడు 

 పాపులందరిలోకి పాపి అయినా సరే 
తన భక్తులైతే చాలు 
రాముడు తప్పకుండా దర్శనం ఇస్తాడు

సంచార సాధువులు  ఖైమాలుడి  దగ్గర సెలవు తీసుకుంటూ

 వెళ్ళొస్తాం  మేము ఒకే చోట ఎక్కువ రోజులు ఉండకూడదు అన్నారు

 మీ దర్శనం లభించి ,
మీ మాటలు వినకపోతే,
 నేను ఇంకా ఎన్నో జీవుల్ని చంపుతూ, పాపాలు చేస్తూ ఉండేవాడిని 
నేను కూడా మీతో వస్తాను అన్నాడు   ఖైమాలుడు 

 గృహస్థువైన నువ్వు
 నీ కుటుంబాన్ని వదిలి రావడం కూడా పాపమే
 రాముడి మీద విశ్వాసంతో రామనామం  జపించు
 నీకు మంచి జరుగుతుంది 

అని సాధువులు వెళ్లి పోయారు

12 సంవత్సరాలు గడిచేయి 

ఖైమాలుడు జపించేది శివాలయంలో కనుక 
ఓ రోజు అతనికి శివుడు ప్రత్యక్షమయ్యాడు 

నేను కోరేది రాముడి దర్శనం తప్ప నీ దర్శనం కాదు అన్నాడు ఖైమాలుడు 

మా ఇద్దరికీ భేదం లేదు అన్నాడు శంకరుడు 

 నన్ను నువ్వు మోసం చేయలేవు 
మీకు భేదం లేకపోతే 
నాకు రాముడి దర్శనమే జరిగేదిగా అన్నాడు ఖైమాలుడు 

శంకరుడు నవ్వాడు 
చిన్న మెరుపు మెరిసింది
 శివుడి స్థానంలో 
చేతిలో ధనుర్బాణాలతో రాముడు దర్శనమిచ్చి 
ఏం కావాలి 
అని కోరాడు 

మా గురువు నిన్ను అడగమన్నది అడుగుతున్నా
 
నాకు చావు పుట్టుకలు లేని ముక్తినివ్వు 
అన్నాడు ఖైమాలుడు 

తదాస్తు అన్నాడు శ్రీరాముడు 

తర్వాత మళ్లీ 
సంచార సాధువులు అక్కడికి వచ్చారు 
ఆ సాధువుల కాళ్ళ మీద పడి వారిద్దరి పాదాలకి నమస్కరించి కృతజ్ఞతలు తెలియజేశాడు ఖైమాలుడు

ఆ క్షణమే ఖైమాలుడి 
ప్రాణాలు పోయాయి

 ఆ సాధువులు
 ఆ శివాలయంలో 
అతని పార్థివదేహాన్ని 
సమాధి చేశారు

నర్మదా నది ఒడ్డున గల ఖైమాలుడి సమాధిని 
నేటికీ చూడొచ్చు 

సజ్జనులతో స్నేహం యొక్క మహత్యం అది

కుటుంబ వ్యవస్థ ఇక నిలబడదు. అతి తొందరలోనే కుటుంబ వ్యవస్థ పూర్తిగా కూలిపోతుంది. ఈ రోజుల్లో ఎవ్వరూ ఫ్యామిలీ అంటే ఇష్ట పడటం లేదు.

 *మిత్రులారా!*
 *కుటుంబ వ్యవస్థ ఇక నిలబడదు. అతి తొందరలోనే కుటుంబ వ్యవస్థ పూర్తిగా కూలిపోతుంది. ఈ రోజుల్లో ఎవ్వరూ ఫ్యామిలీ అంటే ఇష్ట పడటం లేదు. దౌర్భాగ్యకరమైన పరిస్థితి. ఫ్యామిలీ అంటే ఇష్టం లేకున్నా ఏదో తూ తూ మంత్రంగా ఇష్టం అన్నట్టు నటిస్తున్నారు. నిజానికి మనుష్యులు అంటేనే జనాలకు అలెర్జీ పుడుతుంది దగ్గరి వారు అంటే నచ్చడమే లేదు. కుటుంబ వ్యవస్థ కూలిపోవడానికి  కొన్ని ప్రధానమైన కారణాలు :-*

*1) అతి తెలివి*

*2) చిన్న తప్పును కూడా భరించే శక్తి, సహనం లేవు.*

*3) అందరూ సమానమే అనే వింత భావన పెరగటం.*

*4) పెద్దలూ, పిల్లలూ అందరూ కూర్చొని మాట్లాడుకొనక  పోవడం.*

*5) ఎంతసేపూ ఎంటర్ టైన్ మెంట్ ప్రోగ్రాంలలో మునిగి పోవడం. ఎక్కడో ఉన్న సినిమా నటులు ఈరోజు ఉదయం ఏమి చేశారో చెప్ప గలుగుతున్నారు. కానీ, ఇంట్లోని వారు ఎప్పుడు ఏమి చేస్తున్నారో చెప్పలేని దుస్థితి వచ్చేసింది.*

*6) చిన్నదానికీ అలిగి దగ్గరి వారికి కూడా దూరం జరుగుతున్నారు.*

*7) ఎవరో ఒకరి నోటి దురుసుతనం కుటుంబం మొత్తం చిన్నాభిన్నం కావడానికి కారణం అవుతుంది.*

*8) ఆర్థిక సమస్యల వల్ల ఇంటి పెద్దలు సరిగ్గా, దృఢంగా, బలంగా మేనేజ్ చేయలేక పోవడం కూడా ఒక కారణం.*

*9) ఇంట్లో భార్యా భర్తలు, తల్లి దండ్రులు చీటికి మాటికి తగాదా పడుతూ ఉంటే ఇంటిల్లి పాది ఏదో దిగులుతో ఉంటున్నారు. అన్ని ఫ్యామిలీలల్లో గొడవలు, కొట్లాటలు చూసి ఫ్యామిలీ అంటే జడుసు కుంటున్నారు. అన్యోన్యంగా, ప్రేమతో, అవగాహనతో ఉన్న ఫ్యామిలీస్ కనబడక పోవడంతో ఆ వ్యవస్థపై నమ్మకం పోయింది. అందుకే యువత పెళ్ళిళ్ళు చేసుకోవడం లేదు. 31దాటినా పెళ్లి ముచ్చట ఎత్తడమే లేదు. గత 30, 40 ఏళ్ళల్లో మనస్ఫర్థలు, గొడవలతో విసిగి వేసారిన జనం అలాంటి వ్యవస్థ వద్దు బాబోయ్ అని తమ పిల్లలకు నేరుగానే చెబుతున్నారు.*

*10) ఆర్థిక అవసరాలు, వ్యత్యాసాలు,పోల్చుకోవడం తదితర కారణాల  వల్ల కూడా కుటుంబ వ్యవస్థ నిలబడ లేకుండాపోతుంది.*

*11) మనుష్యులు అంటేనే విలువ లేదు. మనిషికి మరో మనిషి అంటే బోర్ వచ్చేసింది. అధిక జనాభా, సుఖ లాలస, సుఖాలకు అడ్డు వచ్చిన వారిని అంతమొందించే తెంపరితనం కూడా వచ్చింది.*

*12) మధ్య వర్తిత్వం వహించే పెద్దలు లేకుండా అయ్యారు. దీంతో ఎవ్వరిష్టం వారిదే అయ్యింది.*

*13) కుటుంబ నిర్వహణ ఒక కళ. ఆ కళ అందరికీ లేకపోవడం వల్ల కూడా వ్యవస్థ అతలాకుతలం కావడానికి కారణం అవుతుంది.*

*14) మానవ ప్రవర్తనపై కనీస అవగాహన లేని దుస్థితి వచ్చింది. మొరటుగా ప్రవర్తిస్తున్నారు. నేను నాభార్య/భర్త అనే సిద్దాంతం పోయి "నేనే నేను" "నేను నేనే"పాలసీ వచ్చింది. పిల్లలకు పెళ్లి కాగానే వేరుపడేయటం ఆచారమైనది. ఇంట్లో ఉంచుకోవాలంటే భయ పడుతున్నారు. అంత్య నిష్టూరం కన్నా ఆది నిష్టూరం మేలు అంటున్నారు. కుటుంబ విలువలు, కట్టు బాట్లు ఇక ఉండవు. ఎవ్వడిష్టం వాడిదే అయ్యే రోజులు అప్పుడే వచ్చినవి. అన్నాదమ్ములు, అన్నా చెల్లెళ్ల, అక్కా తమ్ముళ్ళ, భార్యాభర్తల మధ్య  బలమైన బంధాలు ఇప్పుడు లేనేలేవు. సమస్త మానవ సంబంధాల కథ ఫినిష్ అయ్యింది. ప్రస్తుతం నడుస్తుందంతా ఒక షో. ఒక నాటకం. ఈ షో కూడా ఇంకొన్నాళ్ళకి పూర్తిగా ఉండకుండా పోతుంది. ఇంకా పచ్చిగా అవుతారు.* 

*15) డిజిటల్ ప్లాట్ఫాం పైన ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలే తమకి నిజమైనవి అని అపోహలో బతుకుతున్న జనం. ఎవరైనా చనిపోతే  ఒక ఆకర్షణీయమైన మెసేజ్ లేదా RIP  అని పెట్టి అంతటితో వదిలేస్తున్నారు. మోయడానికి కూడా నలుగురు వచ్చే పరిస్థితి ఉండదు. దీనికి అందరూ, అన్నీ కారణములే. ఇక్కడ ఎవ్వరూ శ్రీరామచంద్రులు లేరు. ఎక్కడా సీతమ్మలు లేరు. ఉన్నవారంతా అటుఇటుగానీ వింతజాతి. ఇదిఇంతే. అదిఅంతే. ఎవ్వరూ ఏమీ చేయలేరు. ఇదంతా ఊరకే అనుకోవడం తప్ప ఏమీ చేయలేము. అరణ్య రోదన మాత్రమే.*

నిగ్రహం లేనివాడు నిలకడ లేనివాడు ఒకటేనని సామెత. నిగ్రహం వల్లనే నిలకడ సాధ్యమవుతుంది కనుక ఆ సామెత పుట్టింది.

 నిగ్రహం లేనివాడు నిలకడ లేనివాడు ఒకటేనని సామెత. 
నిగ్రహం వల్లనే నిలకడ సాధ్యమవుతుంది కనుక ఆ సామెత పుట్టింది. 

దీని గురించి మరింత వివరంగా ……………….

నిగ్రహం అంటే మనసును, ఇంద్రియా లను అదుపులో పెట్టుకోవడమే. 

మనసును అదుపులో పెట్టుకుంటే శమమని, ఇంద్రి యాలను అదుపులో పెట్టుకుంటే దమమని పిలుస్తారు. 

ఈ శమదమాలు యోగాన్ని -అభ్యసించే వారికే కాదు, విద్యాభ్యాసం చేసేవారికీ అవసరమే. తరగతి గదిలో పాఠం  విన్నప్పుడుగాని, ఆ పాఠం ఇంట్లో చదువుతున్నప్పుడు గాని, పరీక్షలు రాస్తున్నప్పుడు గాని విద్యార్థికి నిగ్రహం తప్పనిసరి. 

విద్యార్థికే కాదు, ఏ వ్యక్తి ఏ పని చేసినా దాని మీద ఉంచాలి కదా! ఆ శ్రద్దకే నిగ్రహం అని పేరు. 

ఆవకాయ పచ్చడి మొదలు కొని, అణు బాంబులు తయారు చేసేవరకు... నిగ్రహం ఉండాల్సిందే.

నిగ్రహం అంటే ఏకాగ్రత. 

ఏ పని చేస్తున్నామో. దానిమీద మనసు నిలపడం. వస్తు ప్రదర్శన శాలకు వెళ్ళినా, విహార యాత్రకు వెళ్ళినా మనకున్న ఏకాగ్రతను బట్టి ఆనందం కలుగుతుంది. 

అంతెందుకు ఉదాహరణ కి  బ్యాంకు లావాదేవీలు జరిపే టప్పుడు ఏకాగ్రచిత్తులు కావల సిందే.
 లేకపోతే చిత్తైపోతాం. 

ఏకా గ్రతకే జాగరూకత అని మరొక అర్ధం. 

ఏకాగ్రత వల్ల వస్తు రూపం. మనసులో నిలబడుతుంది. దాని స్వరూపం బోధపడుతుంది. దాన్ని ఉపయోగించుకునే విధానం అవ గతమవుతుంది.


సాధారణంగా మనంచేసే పను లకే ఏకాగ్రత అవసరమైనప్పుడు, యోగమార్గంలో నడిచేవారికి దాని అవసరం మరింత ఉంటుంది. 

ఉదాహరణకు, భగవంతుణ్ని ధ్యానం చేయాలి అనుకున్నప్పుడు ఆయన నామాన్ని గుర్తుచేసుకోవాలి. 

నామస్మరణతో పాటు అర్థభావన చేయాలి. ఏకాగ్రతలేని మని షికి ఏదీ సాధ్యం కానప్పుడు యోగవిద్య సాధ్యమవుతుందని ఎలా చెప్పగలం?

యోగమంటే ఏకాగ్రత. 

చిత్తవృత్తులను నిరోధించుకొని కేవలం భగవంతుణ్ని మాత్రమే. 

అనుభవంలోకి తెచ్చుకోవడమే యోగం. అయితే భగవంతుడు సాకారుడా, నిరాకారుడా తెలుసుకోవలసి ఉంది. 

సాకార రూపంలో భగవంతుణ్ని అర్చించాలన్నా ఏకాగ్రత అవసరమే. 

మరి నిరాకారుడైన భగవంతుణ్ని మనసులో ధ్యానించాలని అనుకున్నప్పుడు మరింత ఏకాగ్రత అవసరమవుతుంది. 

మనం తోటలోకి వెళ్ళినప్పుడు ఎక్కడో ఒకచోట ఆగిపోయి, తదేక దృష్టితో ఒక పూలమొక్క దగ్గర నిలిచిపోతాం. 

అదే ఏకాగ్రత అంటే. 

మన కళ్లముందు ఎన్ని వస్తువులున్నా, ప్రత్యేకంగా ఒక వస్తువు మీదనే దృష్టి పెట్టడమే ఏకాగ్రత. 

ఏకాగ్రతను ఎలా సాధించాలని చాలామంది అడుగుతుంటారు. 

చంచలమైన మనసును మనకు కావలసిన వస్తువుమీదకానీ, విషయం మీదకాని కదలకుండా నిలపడమే ఏకాగ్రత. 

మనకు శ్రద్ధతోపాటు లక్ష్యశుద్ధి ఉన్నప్పుడు ఏకాగ్రత సిద్ధిస్తుంది.

నా మనసు చలిస్తోంది... దీన్ని కట్టడి చేయడం ఎట్లా? అని అర్జునుడు యుద్ధ రంగంలో అడిగినప్పుడు, కృష్ణుడు అతణ్ని 'యోగివి కమ్ము' అంటాడు. 

మనసుతో పాటు ఇంద్రియాలను అదుపులో పెట్టుకొమ్మని కృష్ణుడిచ్చిన సందేశం యుద్ధం చేసి విజయాన్ని సంపాదించడానికి అర్జునుడికెంతో ఉపయోగపడింది. 

మనం కూడా ఏ పని చేసినా మనసును, ఇంద్రియాలను నిగ్రహించుకున్నట్లైతే, అనుకున్నది సాధించగలుగుతాం. 

జీవితంలో విజేతలమై నిలుస్తాం.. మిత్రులారా

Thursday, November 2, 2023

భార్య ఇంటికి ఆభరణం

 *భార్య ఇంటికి ఆభరణం* 

*భరించేది భార్య, బ్రతుకు నిచ్చేది భార్య, చెలిమి నిచ్చేది భార్య, చేరదీసేది భార్య, ఆకాశాన సూర్యుడు లేకపోయినా, ఇంట్లో భార్య లేకపోయినా, అక్కడ జగతికి వెలుగుండదు. ఇక్కడ ఇంటికి వెలుగుండదు. భర్త వంశానికి సృష్టికర్త, మొగుడి అంశానికి మూలకర్త, కొంగు తీసి ముందుకేగినా, చెంగు తీసి మూతి తుడిచినా, ముడిచినా, తనకు లేరు ఎవరు సాటి. ఇలలో తను లేని ఇల్లు, కలలో ఊహకందని భావన, బిడ్డల నాదరించి, పెద్దల సేవలో తరించి, భర్తని మురిపించి, మైమరపించి, బ్రతుకు మీద ఆశలు పెంచి,చెడు ఆలోచనలు త్రుంచి, భ్రమరంలా ఎగురుతూ, భర్తను భ్రమల నుండి క్రిందకు దించుతూ, కళ్ళు కాయలు కాచేలా, భర్త జీవితాన పువ్వులు పూచేలా చేసిన, జీతం లేని పని మనిషి, జీవితాన్ని అందించే మన మనిషి ఏమిచ్చి తీర్చుకోగలం భార్య రుణం. ఆమెకు భారం కాకుండా ఉండడం తప్ప. అదే భార్యకు మనమిచ్చే విలువైన గొప్ప ఆభరణం.*

Wednesday, November 1, 2023

మన మంచితనం…* *మనల్ని కాపాడుతుంది.

 🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*మన మంచితనం…*
             *మనల్ని కాపాడుతుంది.*
                 ➖➖➖✍️

*ఒక వ్యక్తి ప్రతిరోజు అడవిలోకి వెళ్లి కూరాకులు కోసుకొచ్చి అమ్ముకుంటూ జీవనం గడుపుతున్నాడు.   అలా అతను రోజూ అడవికి వెళ్లే దారిలో ఒక గుడిసె ముందు ఒక ముసలాయన ఏడుకొండల స్వామి విగ్రహం చిన్నది పెట్టుకుని తులసి ఆకులతో అర్చన చేసేవారు.*

*అది చూసి చాలా ముచ్చటపడేవాడు. ‘మనం కూడా ఇలా చేయాలి’ అని అనుకున్నాడు కాని చేయలేకపోయేవాడు.*

*అతను అడవిలో  కూరాకులు కోస్తుంటే  తులసి చెట్టు కనిపించింది. వెంటనే ఆ వ్యక్తి ‘మనం ఎలాగూ పూజ చేయలేము,  ఇవి కోసుకెళ్లి ఆ బ్రాహ్మణుడికి ఇద్దాం’ అని అనుకున్నాడు.*

*కోసిన కూరాకులతో పాటు తులసి దళాలను కట్ట కట్టి నెత్తిన పెట్టుకుని వచ్చాడు.*
*అతడికి తెలియని విషయం ఏంటంటే నల్ల నాగు ఒకటి అందులో ఉన్నది.*

*ఇతను వెళ్లి గుడిసె ముందు నిలబడగానే, ఎవరో వచ్చి నిలబడ్డారని తల తిప్పి చూసిన బ్రాహ్మణుడితో… “అయ్యా తులసి దళాలు తెచ్చాను పూజకు. నేను చేయలేను అందుకే మీకు ఇస్తున్నాను” అని అన్నాడు.*

*ఒక్క నిమిషం కళ్ళు మూసుకున్న                   ఆ బ్రాహ్మణుడికి తన దివ్యదృష్టితో తులసి దళాలను తెచ్చిన వ్యక్తి  వెనుక రాహువు నిలబడిఉండడం  గమనించాడు.*

*అతడితో … “నాయనా  నేను చెప్పేవరకు ఈ కట్టను  నీ తలపై నుండి దించకు!” అని చెప్పి గుడిసె వెనకకు వెళ్ళి ఒక మంత్రం జపించగానే రాహువు వచ్చాడు.*

*రాహువుకు నమస్కరించి ఎందుకు అతడి వెనుక వచ్చావువని అడగగా రాహువు ఆ బ్రాహ్మణుడికి నమస్కరించి “నేను ఈరోజు అతడికి హాని చేయాల్సి ఉంది అదే విధి రాత కాని అతను తన తలపైన తులసి దళాలను మోస్తున్నాడు అందుకే నా పని చేయలేకపోయాను అతను అది దించగానే నేను కాటేసి వెళ్ళిపోతాను.” అని అన్నాడు.*

*ఈ విషయం వినగానే బ్రాహ్మణుడికి చాలా జాలేసింది. ఎప్పుడూ రానివాడు ఈరోజు పూజకు తులసి దళాన్ని తీసుకురావడంతో ‘ఇతడిని ఈ గండం నుండి తప్పించాలంటే ఏదైనా పరిష్కారం ఉందా?’ అని అడిగినప్పుడు రాహువు…*

*”అయ్యా మీరు ఇన్నిరోజులు పూజ చేసిన పుణ్యాఫలాన్ని అతడికి దానం ఇచ్చినట్టయితే ఈ గండం నుండి తప్పించవచ్చు” అని రాహువు చెప్పగానే …*

*బ్రాహ్మణుల వారు ఏమీ ఆలోచించకుండా “అతడికి దానం ఇస్తున్నాను” అని చెప్పడంతో రాహువు ఆశ్చర్యపోయి సంతోషంతో వెళ్ళిపోయాడు.*
*ఆ పాము మాయమైంది*

*ఒక్క తులసి దళం చేత ఇంత అద్భుతమా?*
*ఒక దానం  ఇవ్వడం వల్ల ఒక ప్రాణం నిలబడడమా?*
*మనం సంపాదించుకున్న పుణ్య ఫలం ఇంత శక్తి గలదా ?*
*దేవతా గ్రహాలని బ్రహ్మ రాతను మార్చేంత శక్తి గలదా?*

*బ్రాహ్మణుడు ఆ వ్యక్తి దగ్గరకు వచ్చి “ఇక నుండి రోజూ నాకు తులసి దళాలను తెచ్చి ఇవ్వాలి!” అని చెప్పాడు.*

*సంతోషించిన ఆ వ్యక్తి అలాగే అని ఒప్పుకున్నాడు.*
*************

*ఆస్తులే కూడబెట్టక్కరలేదు ఆపదను తప్పించుకోవడానికి కొంచం మంచి పనులు చేయండి.*✍️
.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

ఒకానొక సమయంలో హనుమంతునికి కూడా శని కాలం దాపురించింది.

 ఒకానొక సమయంలో హనుమంతునికి కూడా శని కాలం దాపురించింది. వానరవీరులంతా రాముడికోసం సేతువు నిర్మిస్తున్న సమయం.
శనీశ్వరుడు రామేశ్వర సముద్ర తీరానికి వచ్చాడు.

అక్కడ వానరులందరూ
సేతువు నిర్మాణానికి పెద్ద పెద్ద రాతి బండలను తీసుకుని వచ్చి సముద్రంలో పడవేస్తున్నారు. హనుమంతుడు పెద్ద బండలను ఏరి పెడుతున్నాడు. శ్రీ రాముడు
ఒక బండ మీద ఆశీనుడై
పర్యవేక్షిస్తున్నాడు.
అప్పుడు శనీశ్వరుడు రామునివద్దకు వచ్చి
" నేను హనుమంతుని పట్టుకొనే
కాలం వచ్చింది." అని
శ్రీ రాముని అనుమతి అడిగాడు.
" నన్నెందుకు అనుమతి అడగడం.. నీ విధిని నీవు చెయ్యి " అని
అన్నాడు శ్రీ రాముడు.

హనుమంతుని వద్దకు వెళ్ళి శని " నేను నీ వద్ద ఏడున్నర సంవత్సరాలు ఉండబోతున్నాను." అన్నాడు శనీశ్వరుడు.

"నేను రామ కార్యంలో నిమగ్నమైయున్నాను ఇపుడంత కాలం కుదరదన్నాడు హనుమంతుడు .
" సరి , ప్రస్తుతానికి ఏడున్నరమాసాలు వుంటాను ,సరేనా " అన్నాడు. అందుకు హనుమ ఒప్పుకోలేదు.
...ఏడున్నర వారాలు .. అంటూ
కాల ప్రమాణం తగ్గించుకుంటూ వచ్చాడు
శనీశ్వరుడు .
హనుమంతుడు , రామనామం ఆపకుండా
జపిస్తూనే చివరకు ఒక ఏడు క్షణాల కాలం తనను పట్టుకోవాలసిందిగా కోరాడు.
అప్పుడు శనీశ్వరుడు "నీ కాళ్ళలో ప్రవేశించనా"
అని అడిగాడు.
హనుమంతుడు "వద్దు ...
సేతువు కట్టడానికి రాళ్ళను తేవాలి .. పరిగెత్తాలన్నా, నడవాలన్నా కాళ్ళు అవసరం"
అన్నాడు.
" సరి, నీ చేతులు పట్టుకోనా"
అన్నాడు శనీశ్వరుడు .
ఆ రాళ్ళని చేతులతోనే కదా మోసిబి
తెస్తున్నాను. చేతులు పట్టుకోవద్దు. అన్నాడు
హనుమంతుడు.
"అయితే, నన్ను ఏం చెయ్యమంటావు?
నీ భుజాల పైన ఎక్కమంటావా" అన్నాడు
శనీశ్వరుడు.

"రామలక్ష్మణులను నా భుజాల మీద ఎక్కించుకుని వెడుతున్నాను. అందువలన
భుజాలు ఎక్కడానికి వీలులేదు " అన్నాడు హనుమంతుడు.

" పోనీ, నీ హృదయం లో వుండవచ్చునా?"
అని అడిగాడు శనీశ్వరుడు.

"ఈ హృదయంలో, మహాలక్ష్మీరూపిణి అయిన సీతాదేవి,
నా దేవుడైన
శ్రీరాముడు
నిరంతరంగా నివసిస్తూ వున్నారు ...అక్కడ నీకు
చోటు లేదు. " అన్నాడు
హనుమ.

" సరే , చివరకు నీ శిరస్సు ఒక్కటే
ఖాళీగా వున్నది. అక్కడే వుంటాను "అని
శనీశ్వరుడు , హనుమంతుని శిరస్సు
పైన ఎక్కి కూర్చున్నాడు.

హనుమంతుడు ఒక పెద్ద బండరాయిని తన శిరస్సు పై( అంటే శనీశ్వరుని
మీద) పెట్టుకుని ఒక్కొక్క బండను సముద్రంలో వేయడం మొదలెట్టాడు.
ఆ బండరాళ్ళ బరువును మోయలేక
శనీశ్వరుని కళ్ళుతేలేసాడు. మరో పెద్ద బండరాయిని హనుమ తన శిరస్సుపై పెట్టుకోగానే,
శనీశ్వరునికి ఊపిరి సలపక
గిలగిలలాడాడు. హనుమంతుడు ఆ రాయిని
సముద్రంలో వేసిన మరుక్షణమే
శనీశ్వరుడు హనుమ శిరస్సుపైనుండి కిందకి దూకేశాడు.

" మారుతీ, నీ వల్ల నాకు శ్రీ రాముని సేవించుకునే
భాగ్యం కలిగినది . నీవు సకల శక్తులకు అతీతుడవైన రామభక్తుడవు. నీముందు నా శక్తిచాలదు. నిన్ను నేను పట్టలేను, నన్ను వదిలిపెట్టు మహానుభావా"
అంటూ చేతులెత్తేసి ఒకే పరుగుపెట్టాడు శనీశ్వరుడు.
హనుమంతుని ముందా కుప్పిగంతులు!

నిర్మల భక్తితో , నిశ్చల మనస్సుతో శ్రీ రాముని సేవలో నిమగ్నమైయున్న ఎవరిని కూడా శనీశ్వరుడు
రెండు క్షణాలు కూడా
పట్టుకొనలేడు.
పరిపూర్ణమైన నమ్మకంతో నిరంతరం
శ్రీరామనామం జపిస్తే కష్టాల నుండి
విముక్తి కలిగి తీరుతుంది.

*జై శ్రీరామ్ 🚩*

*జై హనుమాన్ 🚩

మనిషిని మనిషే కాపాడుకోవాలి

 మనిషిని మనిషే కాపాడుకోవాలి

దేవుడి ఉనికే శూన్యమైనప్పుడు దాన్ని ఎన్ని ఆర్భాటాలతో హెచ్చవేస్తే మాత్రం ఏం లాభం? సున్నా సున్నాయే కదా? దైవ భావన చుట్టూ ఎన్ని శాస్త్రాలు రాసుకున్నా, ఎన్ని కీర్తనలు పాడుకున్నా, ఎన్ని సంప్రదాయ నత్యాలు చేసినా, ఎన్ని ఆచార వ్యవహారాలకు రూపకల్పన చేసినా ఏం లాభం? పునాదిలేని భవనం కూలిపోవాల్సిందే! పుచ్చిన కర్ర విరిగిపోవాల్సిందే!! మనిషే, మనిషిని కాపాడుకోవాల్సి ఉంది.
ఎలక్ట్రిక్‌ బల్బు ఎంత అందంగా ఉన్నా, లోన ఫిలమెంట్‌ పోతే బల్బు పనికిరాదు. ఫిలమెంట్‌ సైన్స్‌ ప్రిన్సిపల్‌ మీద తయారయ్యింది. గాజు బల్బూ సైన్సువల్ల వచ్చిందే. మన వాళ్ళు గుళ్ళూ, గోపురాలు చూసి ఆనాటి ఇంజనీరింగ్‌ ప్రతిభ గుర్తించరు. అందులో కల్పించుకున్న ఒక దేవుణ్ణి, శక్తిని...వారి మహత్యాల్ని ప్రవచిస్తుంటారు. వారికి వారే పరవశించిపోతుంటారు. రామాయణ, భారత, భాగవతాలు, పురాణాలు ఎంత చెప్పినా ఎన్నిసార్లు చెప్పినా అవే పాత కథలు. మనిషి ఔన్నత్యం ఎక్కడైనా కనిపిస్తుందా? మనిషి, దైవత్వానికి దాసోహం అయిన గాథలు మహోన్నతంగా చెప్పడమే గానీ మరొకటుందా? దైనందిన జీవితంలో దేవుడి ప్రసక్తి, సంభాషణల్లో దైవం, హితబోధలో దైవం, సంగీతంలో దైవం, సాహిత్యంలో దైవం, నాట్యంలో దైవం...మనిషి ఆత్మవిశ్వాసం దెబ్బ తీసే కళారూపాలు శతాబ్దాలుగా కొనసాగుతున్నప్పుడు, తరతరాలకు ఆ జాఢ్యం వ్యాపించక ఏమవుతుందీ? ఇవన్నీ చాలవన్నట్టు ప్రవచనాల పేరుతో కొందరు తమ తుప్పుపట్టిన భావజాలం ప్రచారం చేస్తుంటారు. మనుస్మృతి లోని విషయాలే గొప్పగా చేసి వర్ణిస్తూ ఉంటారు. ఇవన్నీ ఆధునిక ఆలోచనా ధోరణికి ఏమాత్రం సరిపడని విషయాలు కదా?
మన రోజువారీ సంభాషణల్లో 'అంతా దేవుడి దయ' - 'అంతా పైవాడు చూసుకుంటాడు' - 'ఈశ్వరాజ్ఞ లేనిది చీమైనా కదలదు' - లాంటి మాటలు వింటూ ఉంటాం. ఏమీ తెలియని పసిపాపలకు 'జేజ కొడతాడు దండం పెట్టు' - 'జేజ తీసుకు పోయాడు' - 'దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది' లాంటి మాటలు ఆ పసితనంలోనే నూరిపోస్తుంటారు. సామాన్యుడు చస్తాడు / కన్ను మూస్తాడు / మరణిస్తాడు. కానీ ఆధ్యాత్మిక గురువులు ఈశ్వరుడిలో ఐక్యమైపోతారు. చచ్చాడని గౌరవంగా చెప్పడం.. అంతే - జీవశాస్త్ర పరంగా ఏ చావైనా ఒకటే! ఇంతెందుకూ నాస్తిక, హేతువాద సంఘాల్లో పనిచేస్తున్న వారందరివీ దేవుడి పేర్లే. అవన్నీ వాళ్ళు పెట్టుకున్నవి కావు. ఆనవాయితీ ప్రకారం పెద్దలు పెడుతూ, పెడుతూ ఉండగా వచ్చినవి. నా ఇంటిపేరులో కూడా దేవ శబ్దం ఉంది. అది నేను పెట్టుకున్నది కాదు. అంటే నిస్సహాయంగా మనం మనువాదుల కుట్రలో కూరుకుపోయాం. బయటపడే మార్గాలు వెతకాలి! ఇవన్నీ మన చుట్టూ ఉన్న సమాజంలో మనం చూస్తున్న విషయాలు. మనకు అనుభవంలోకి వస్తున్న విషయాలు. మరి ప్రపంచమంతా ఇలాగే ఉందా-అంటే లేదు. కొంచెం స్థాయి పెంచుకుని, విశాల హృదయంతో ప్రపంచ దేశాల్లోని పరిస్థితిని గమనిస్తే మనం ఎక్కడ ఉన్నామన్నది అర్థం చేసుకోవచ్చు.
ఉదాహరణకు ఒక విషయం చూద్దాం. ఒక ఊళ్ళో ఒక చిన్న బళ్ళో ఒకటో తరగతిలో ఇరవై మంది పిల్లలున్నా రనుకుందాం. అందులో కొందరు పదో తరగతి వరకైనా రాకుండానే మానేస్తారు. మరికొందరు పదో తరగతి పబ్లిక్‌ పరీక్ష పాస్‌ కాకుండా ఆగిపోతారు. ఇంకొందరు జూనియర్‌ కాలేజిలో, కొందరు డిగ్రీలో ఆగిపోతారు. అవన్నీ దాటి శాస్త్రవేత్తో, ఇంజనీరో, కంప్యూటర్‌ నిపుణుడో, డాక్టరో, ప్రొఫెసరో అయ్యేది అందులో ఏ ఇద్దరు ముగ్గురో ఉంటారు. ఇందులో పదో తరగతిలో కూడా ఉత్తీర్ణులు కానివారు ఆచారాల చాటున, పంచాంగాల చాటున, గుళ్ళ చాటున, దేవుళ్ళ చాటున దాక్కుని పొట్ట పోసుకుంటున్నారనుకుందాం. వీళ్ళు సంప్రదాయం పేరుతో, విద్యావంతుల్ని, జ్ఞానవంతుల్ని, సంస్కారుల్ని అందరినీ తమ ఆధీనంలో ఉంచుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. ఆత్మ, పరమాత్మ, పునర్జన్మ లాంటి మాటలు చెప్పి భయపెడుతుంటారు. నిరూపణ లేని అనుభవాలు, అనుభూతులు, సెంటిమెంట్లు, దేవుడితో సెటిల్‌మెంట్లు చెపుతూ, పిట్టకథలతో జనాన్ని రంజింపజేస్తుంటారు. ఇవాళ కాకపోయినా రేపు... జనం నిజం గ్రహిస్తారు. కారణాన్ని అన్వేషిస్తారు. తప్పదు - కొందరు తమ ఇంగిత జ్ఞానాన్ని వదిలేసి అజ్ఞానుల మాటలకు విలువనిస్తుంటారు. తమ కన్నా ఆ పంతుళ్ళకు, ముల్లాలకు, పోప్‌లకు, మతాధిపతులకు ఏదో ఎక్కువ తెలుసుననుకుని వారిని అనుసరిస్తుంటారు. వారు చెప్పేవన్నీ మనిషి ఎప్పుడో ప్రాథమిక దశలో ఏర్పరుచుకున్న ఆచారాలు! మరి ఈ ఇరవై ఒకటో శతాబ్దంలో అవి ఎంత వరకు అనుసరణీయం? అన్న ప్రశ్న వేసుకోరు. ఏదో గుడ్డిగా, తాతలు చేశారు, తండ్రుల చేశారు, మనమూ చేసేస్తే పోదా? అని అనుకుంటూ ఉంటారు. భయస్తులు, పిరికివాళ్ళు, తమ శక్తిని తాము తెలుసుకోలేని వాళ్ళు-తమ మెదడును తాము ఉపయోగించని వాళ్ళ పరిస్థితి అలా ఉంటుంది.
మనిషికి రాయిని కూడా దేవుణ్ణి చేసే శక్తి ఉంది. మరి ఆ దేవుడు గనక ఉంటే, మనిషినైనా మనిషిగా చేస్తాడా? చేయలేడు. ఎందుకు చేయలేడూ అంటే... అలాంటి వాడు ఎవడూ లేడు గనక చేయలేడు. మనిషి, మనిషిగా కావాలంటే మనిషి మాత్రమే ప్రయత్నించాలి. దైవ విశ్వాసంతో సమాజంలో రోజూ ఎన్ని ఘోరాలు జరుగు తున్నాయో తెలుసుకోవాలి. విశ్లేషించుకోవాలి. దైవ విశ్వాస రహిత, మానవ నైతిక సమాజానికి రూపకల్పన చేసుకోవాలి. పునర్జన్మ ఉంటుందన్న విశ్వాసంలో జనం ఎంత మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారో చూడండి. తమిళనాడు తిరుచ్చి జిల్లా చొక్కంపట్టికి చెందిన రిటైర్డ్‌ టీచర్‌ మేరి (75) 2021 అక్టోబర్‌ మొదటివారంలో మరణించారు. కూతుళ్ళు జెసితా (43), జయంతి (40) ఆమె మృతదేహాన్ని ఇంట్లోనే ఉంచి ఏడు రోజులు ప్రత్యేక ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. అప్పుడే అనుకోకుండా వాళ్ళింటికి బంధువులు వచ్చారు. వారికి రిటైర్డ్‌ టీచర్‌ మరణించిన సమాచారం లేదు. తమ తల్లి పునర్జన్మ కోసం బైబిల్‌తో తాము ప్రార్థనలు చేసుకుంటూ ఉంటే, బంధువులు వచ్చి అంతరాయం కలిగించారంటూ ఆ కూతుళ్ళు బంధువుల్ని తరిమికొట్టారు. మృతదేహం పక్కన ప్రార్థనలు చేస్తున్నారని వాళ్ళు ఊళ్ళో వాళ్ళకు, పోలీసులకు తెలిపారు. పోలీసులు రంగప్రవేశం చేసి, మృతదేహం స్వాధీనపరుచుకుని, కూతుళ్ళను వైద్య పరీక్షలకు పంపించారు. ఇలాంటి సంచలన సంఘటనలు మనం తరచూ టెలివిజన్‌ తెర మీద చూస్తూనే ఉన్నాం.
ఉత్తరాఖండ్‌ బాగేశ్వర్‌ జిల్లా కదిరియా గ్రామంలో 2021 అక్టోబర్‌ మొదటి వారంలో జరిగిన సంఘటన! కుల వివక్షతో ప్రాణాలు తీయడం ఈ రోజుల్లో ఎంతో సులభమైపోయింది. సోహాన్‌ రామ్‌ (31) పిండిమరలో గోధుమలు ఆడించి పిండి తీసుకుపోతుండగా లలిత్‌ కర్నాటక్‌ అనే అగ్రకులస్థుడు చూసి అడ్డగించాడు. అతను వృత్తి రీత్యా ఉపాధ్యాయుడు. పిండిమర మలినమైందని ఆక్రోశిస్తూ, దళితుడైన సోహాన్‌ ని అతని కులాన్ని తీవ్రంగా దూషించాడు. అనవసరంగా ఎందుకు దూషిస్తున్నారని సోహాన్‌ అడిగినందుకు - పిండిమర అందరూ ఉపయోగించేదేనని గుర్తుచేసినందుకు ఉక్రోషం పట్టలేని అగ్రకుల ఉపాధ్యాయుడు, కొడవలితో నరికి సోహాన్‌ను హత్య చేశాడు. హంతకుణ్ణి పోలీసులు జైలుకు పంపించారు. పిండిమర మలినం కావడం ఏమిటో? వృత్తిరీత్యా ఉపాధ్యాయుడైన వాడికే సరైన ఆలోచన లేకపోవడం ఏమిటో? మన పవిత్ర భారతావనిలో ఏదైనా సాధ్యమే! దేవుడనేవాడు ఉంటే ఇలాంటివి ఎందుకు ఎలా జరిపిస్తున్నాడూ?
ప్రపంచానికి ఆధ్యాత్మిక వెలుగులు పంచిన మన భారతదేశంలో అదేమిటో ఇలాంటి సంఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. అయితే ఇతర సమాజాలు ఇలాంటివి లేకుండా ఏమీ లేవు. ప్రఖ్యాత రచయిత్రి తస్లీమా నస్రీన్‌ ఏమన్నారో చూడండి...! ''మసీదులో ప్రార్థన చేస్తుండగా ఆఫ్ఘనిస్తాన్‌లో షియాలను సున్నీలు చంపుతారు. హజారా సమాజాన్ని తాలిబన్‌ చంపుతుంది. పాకిస్తాన్‌లో షియాల్ని, అహ్మదీయుల్ని, క్రైస్తవుల్ని సున్నీలు చంపుతారు. ఏ దేశంలో మైనార్టీలకు రక్షణ లేదో.. ఆ సమాజాలు కచ్చితంగా నాగరికం కాదు'' అని!
''నాకు ఈ రోజు అల్లాఉద్దీన్‌ అద్భుత దీపం దొరికింది'' అన్నాడు భర్త భార్యను ఉడికిస్తూ... ''ఓ డియర్‌ ఎంత మంచి మాట? మరి ఏమడిగావ్‌?'' అంది భార్య. ''ఏముందీ? నీ తెలివితేటలు పదింతలు పెంచుమని అడిగా!'' అన్నాడు భర్త. ''ఓ ధ్యాంక్యూ! డాళ్లింగ్‌!! నా గురించి నీకెంత శ్రద్ధా?'' అంది భార్య. ''కాని యేం లాభం? సున్నాను ఎన్నింతలు చేస్తే మాత్రం ఏం ఫలితం? సున్నా-సున్నాయే కదా?'' అని చల్లాగా చెప్పాడు భర్త లోలోన తన తెలివికి తానే మురుస్తూ! ఇది జోకే అయినా, ఇందులో ఒక విషయం ఉంది. భార్యా భార్తల మధ్య సరదా మాటలు పక్కనపెట్టి, మనం మతాలు-దేవుడు విషయం ఆలోచిస్తే.. అదీ దాదాపు ఇలాగే ఉంటుంది. దేవుడి ఉనికే శూన్యమైనప్పుడు దాన్ని ఎన్ని ఆర్భాటాలతో హెచ్చవేస్తే మాత్రం ఏం లాభం? సున్నా సున్నాయే కదా? దైవ భావన చుట్టూ ఎన్ని శాస్త్రాలు రాసుకున్నా, ఎన్ని కీర్తనలు పాడుకున్నా, ఎన్ని సంప్రదాయ నృత్యాలు చేసినా, ఎన్ని ఆచార వ్యవహారాలకు రూపకల్పన చేసినా ఏం లాభం? పునాదిలేని భవనం కూలిపోవాల్సిందే! పుచ్చిన కర్ర విరిగిపోవాల్సిందే!! మనిషే, మనిషిని కాపాడుకోవాల్సి ఉంది.

వ్యాసకర్త:  డా.దేవరాజు మహారాజు
కేంద్ర సాహిత్య అకాడమి అవార్డు గ్రహీత,జీవశాస్త్రవేత్త