Monday, November 6, 2023

భగవద్గీత చదవటానికి ఒక పద్ధతి ఉంది ....ఇంట్లో భగవద్గీత ఉండీ దాన్ని తాకని ప్రతి వాళ్లూ ఇది ఆలోచించాలి....

 *సత్సంగం*

భగవద్గీత చదివిన వాళ్ళకి తప్పకుండా వైరాగ్యం వస్తుంది

వైరాగ్యం అంటే
 లేని దానికోసం పరుగులు తీయకపోవడం,
ఉన్నదానితో సంతృప్తి చెందటం,
ఉంది కదా అని అనవసరమైనవి అనుభవించాలి అనే బుద్ధిని కలిగి ఉండకపోవటం,
ఇంకా కావాలి అనే ఆశని కలిగి ఉండకపోవటం

భగవద్గీత చదవటానికి ఒక పద్ధతి ఉంది 
తోటలోకి వెళ్లి మామిడి పళ్ళని తెచ్చుకోవటంతో దీన్ని పోల్చవచ్చు
 ముందు మామిడి చెట్టు బోదెను పట్టుకుని ఊపితే పండిన పళ్ళన్నీ నేల మీదకు రాలుతాయి
 తర్వాత ఒక్కో పెద్ద కొమ్మనీ పట్టుకుని ఊపితే
 పండిన మరికొన్ని పళ్ళు రాలుతాయి 
ఆ తర్వాత పెద్ద కొమ్మలకి ఉన్న చిన్న కొమ్మలని 
ఒక్కోదాన్నీ ఊపితే 
ఇంకొన్ని మామిడిపళ్ళు రాలుతాయి 
చివరిగా ఆకుల చాటున దాగి ఉన్న పళ్ళను వెతికితే ఇంకొన్ని పళ్ళు లభిస్తాయి

ఇలాగే భగవద్గీత ని మామిడి చెట్టు బోదెను ఊపినట్టుగా మొత్తం 18 అధ్యాయాలు చదవాలి
 తర్వాత ప్రతి పెద్ద కొమ్మనీ ఊపినట్టుగా ప్రతి అధ్యాయాన్నీ పరిశీలనగా చదవాలి 
ఆ తర్వాత చిన్న కొమ్మలన్నిటినీ ఊపినట్టుగా ప్రతి శ్లోకాన్నీ దీక్షగా చదవాలి
 చివరగా ఆకుల చాటున దాగిన పళ్ళను కోసినట్టుగా 
ప్రతి శ్లోకంలోని ప్రతి పదానికి అర్థం వెతుకుతూ చదవాలి
 అప్పుడు భగవద్గీత బాగా బోధపడుతుంది

ఒక గమ్యం చేరటానికి
ఒక బస్సుకి టికెట్ కొన్నాం
 అప్పుడు ఆ బస్సుని ఎక్కుతామా లేక దాన్ని వదిలేస్తామా
అలాగే *మన పుస్తకాల అలమారలో భగవద్గీత ఉన్నప్పుడు దాన్ని అలాగే ఉంచాలా*
 *లేక పారాయణ చేసి అనుసరించాలా* 
ఇంట్లో భగవద్గీత ఉండీ దాన్ని తాకని ప్రతి వాళ్లూ ఇది ఆలోచించాలి

భగవద్గీత బుక్ షెల్ఫ్ లోనో, పూజా గదిలోనో ఉంటే లాభం లేదు అది మనకు మేలు చేయాలంటే శ్రద్ధగా చదివి అందులో చెప్పింది ఆచరిస్తే అప్పుడది మనకి సత్ఫలితాలను ఇస్తుంది

 *సత్సంగం*

ప్రతిదేశానికీ ఓ జెండా ఎలా ఉంటుందో 
అలాగే ప్రతి మతానికీ ఓ ప్రధాన పవిత్ర గ్రంథం ఉంటుంది

 హిందూ సనాతన ధర్మానికి భవద్గీత అలాంటిది

 భగవంతుడు మన మీద ప్రేమతో రాసిన ప్రేమలేఖ భగవద్గీత 
అందులో 18 ప్రేమలేఖలు ఉన్నాయి 

మన జీవితంలో మనం దేనికీ కృంగిపోకుండా ధైర్యంగా ఉండేందుకు ఇవి ఉపయోగిస్తాయి

 ఇంకా చాలా గీతలు ఉన్నాయి 
గోపికా గీత, భ్రమర గీత, వేణు గీత, యుగళగీత ,శ్రుతి గీత, కపిల గీత ,ఉధ్ధవ గీత, అష్టావక్ర గీత ,శివ గీత, శ్రీదేవి గీత,
అను గీత, హంస గీత,దేవీ గీత, గణేశ గీత ఇలా అనేక పురాణాల్లో ఉన్నాయి 

  గీతలన్నిటి పరమార్థం ఒక్కటే
 మనిషికి భక్తి జ్ఞాన వైరాగ్యాన్ని బోధించటమే

 వేదాంత గ్రంథాలు రెండు రకాలుగా ఉన్నాయి 
పతంజలి యోగ సూత్రాల లాంటి పాఠ్య గ్రంధాలు ఒకరకం
 రెండో రకం పారాయణ గ్రంథాలు

భగవద్గీత 18 వ అధ్యాయంలో 69 ,70 వ శ్లోకాలలో గీతా పఠనం ,గీతాశ్రవణం ,
గీతా బోధన పుణ్య కార్యాలని భగవానుడు ప్రత్యేకంగా చెప్పాడు 
భగవద్గీతలో మొత్తం 700 శ్లోకాలు ఉన్నాయి
  భవద్గీతను నిత్యం స్మరించడం చక్కటి సుకర్మ అవుతుంది

ప్రయాణాలలో, ఇంటి పనులు చేసుకునేటప్పుడు, వేచి ఉన్నప్పుడు, పెళ్లిళ్ల లాంటి వాటికి హాజరైనప్పుడు
 ఇలా ఎన్నో సందర్భాలలో గీతని మననం చేసుకోవచ్చు

 బాగవుదాం అనుకునేవారు భాగవతం చదువుతారని ప్రతీతి
ఇది భగవద్గీతకు కూడా వర్తిస్తుంది. 

విత్తనం పాతి ,మొలకెత్తి, పెరిగితేనే విత్తనాలకు జీవం ఉందని మనకు తెలుస్తుంది
 అలాగే భగవద్గీత కూడా జీవం ఉన్న విత్తనం 
దీనిని మెదడులో పాతితే ఈ మొక్క పెరిగి జ్ఞానం అనే ఫలాన్ని ఇస్తుంది

 భగవద్గీత బుక్ షెల్ఫ్ లోనో, పూజా గదిలోనో ఉంటే లాభం లేదు 
అది మనకు మేలు చేయాలంటే శ్రద్ధగా చదివి అందులో చెప్పింది ఆచరిస్తే 
అప్పుడది మనకి సత్ఫలితాలను ఇస్తుంది

వివేకమైన ఆలోచన వల్ల వచ్చే వైరాగ్యమే మెరుగైన వైరాగ్యం...వైరాగ్యం కలగడానికి మూడు కారణాలు ఉన్నాయి....

 *సత్సంగం*

ఆనందం అనేది నీకు ఎన్ని వస్తువులు ఉన్నాయి అన్నదానిమీద కాక 
వాటిలో ఎన్ని ఉపయోగించకుండా నువ్వు ఆనందంగా ఉన్నావు అన్నదానిమీద ఆధారపడి ఉంటుందని వేదాంతలు చెప్తారు 

అయితే  వస్తువులు త్యాగం చేయటం ద్వారా అవలంబించే వైరాగ్యం కన్నా 
వివేకమైన ఆలోచన వల్ల వచ్చే వైరాగ్యమే మెరుగైన వైరాగ్యం

మనసు భగవంతునిలో లీనమైనప్పుడే వైరాగ్యం వస్తుంది

జీవితంలో కొంతమంది వ్యక్తుల  సాంగత్యం వలన ఏర్పడిన కొన్ని అనుభవాల వల్ల కూడా వైరాగ్యం వస్తుంది 
అప్పుడు ఆ వైరాగ్యం 
  మళ్ళీ పడిపోకుండా ఎరుక తో ఉంటూ
ఆ వ్యక్తులతో ఆచితూచి మెలగాలి

స్వధర్మాన్ని వదిలేయటం వైరాగ్యం కాదు

కొన్ని ఇతర కారణాల వల్ల కలిగే వైరాగ్యం వల్ల శాశ్వత లాభం ఉండదు. 
వైరాగ్యం కలగడానికి మూడు కారణాలు ఉన్నాయి

ఒకటవది దుఃఖం వలన కలిగే వైరాగ్యం.. 
ధన నష్టం, గృహ నష్టం, భార్యా పుత్రుల వియోగం వలన కలిగే వైరాగ్యం ఇది 
కానీ ఈ దుఃఖానికి కారణమైన పరిస్థితులు మారిపోతే వైరాగ్యం కూడా పడిపోతుంది

 రెండవది భయము చేత కలిగే వైరాగ్యం 
ఆరోగ్య భయం, రాజదండన భయం ,సమాజ భయం ,గౌరవ భయం ,ప్రతిష్ట భయం ,జనన మరణాల భయం ,నరక భయం మొదలైన వాటి వల్ల వైరాగ్యం కలుగుతుంది
 ఈ వైరాగ్యం వల్ల కొన్ని కర్మలు చేయకపోవచ్చు 

మూడవది వివేకం వల్ల కలిగే వైరాగ్యం
 దుఃఖం వల్ల కలిగే వైరాగ్యం, భయం వల్ల కలిగే వైరాగ్యం కన్నా వివేకం వలన కలిగే వైరాగ్యం శ్రేష్టమైనది 

ఏది సత్యం, ఏది అసత్యం, ఏది నిత్యం, ఏది అనిత్యం అనే ఆలోచన ద్వారా ఈ లోకంలోని సుఖాలన్నీ తాత్కాలికమైనవని గ్రహించి 
వాటి మీద అనురాగం పోయి భగవదనుభూతితో ఉంటూ వైరాగ్యంతో మెలగడం వివేక వైరాగ్యం

ప్రాపంచిక విషయాల మీద ఆసక్తి పోయే ఈ వైరాగ్యం ఆధ్యాత్మికంగా మేలు చేసే మంచి వైరాగ్యం.

ఓ దంపతులకు వైరాగ్యం కలిగి  సన్యాసం స్వీకరించడానికి ఇద్దరూ ఓ ఆశ్రమానికి వెడుతున్నారు
 కొంత దూరం వెళ్ళాకా
 దారిలో భర్తకు ఒక సంచీ కనబడింది
 అందులో బంగారు ఆభరణాలు ఉన్నాయి
 వీటిని చూస్తే భార్య మనసు సన్యాసం నుంచి మళ్ళుతుందేమో అనుకుని భార్యకి కనపడకుండా దాచబోయాడు 
ఇంతలో భార్య చూడనే చూసింది 
అదేమిటి ,అందులో ఏమున్నాయి? అని అడిగింది
 అప్పుడు భర్త తన మనసులోని సంగతి బయటపెట్టాడు 
నా సంగతి సరే *మీకు ఇంకా మట్టికీ, బంగారానికీ తేడా తెలుస్తోందా? అయితే మీకు ఇంకా సన్యసించే అర్హత రాలేదు. లేదంటే ఆ సంచీని చూడగానే అక్కడే వదిలేసేవారు నేను వెళ్తున్నా* అంటూ భర్త కంటే ముందే వెళ్ళిపోయింది సన్యాస స్వీకారానికి.

వైరాగ్యం అనేది తాత్కాలిక వైరాగ్యం కాకుండా
 అసలైన వైరాగ్యాన్ని పొందగలగటం కూడా
 ఒక భాగ్యమే

మీ మనస్సుపై మీరు మాస్టర్ అవాలంటే మీ మనస్సుని జయించాలి.

*మీ మనస్సుపై మీరు మాస్టర్ అవాలంటే మీ మనస్సుని జయించాలి.*

*+ సాధకుడు మాయ భౌతిక జగత్తులో ఉంటూనే అచ్చటి విషయాలందు అనాసక్తితో ఉండవలెను.*

*+ సాధకుడు ద్వంద్వముల యందు సమస్థితిని సాధించాలి అంటే అన్ని స్థితిలయందు మధ్యే మార్గాన్ని పాఠించాలి.*

*+ ఎప్పుడైతే సాధకుడు ఈ విధంగా ఉండగలుగుతాడో అప్పుడు మాయా భౌతిక జగత్తు యందు లభించే సుఃఖము మరియు దుఃఖము వంటి ద్వంద్వాలు తనని ఏమీ చేయజాలవు.*

*Control Your Mind to Attain Self-Mastery.*

*+ Divine Dispassion (vairagya) of Detachment from Worldly Objects and Desires*

*+ Develop Even minded Calmness*

*+ Possessing the even minded blessedness of Spirit, a practitioner is unruffled by material sufferings and pleasures.*


ఆధ్యాత్మిక చింతన ఎప్పుడు కలుగుతుంది? ఆధ్యాత్మికత మనల్ని పరస్పర వైరుధ్యాలలోనూ జీవించటానికి సహకరిస్తుంది అంటే ఏమిటో?

🔺 *పత్రీజీ సమాధానాలు* 🔺
🌹 *చాప్టర్ -- 5 :--- ఆధ్యాత్మిక శాస్త్రం* 🌹
🌷 *Part --2*🌷

 🍁 *ప్రశ్న :--- ఆధ్యాత్మిక చింతన ఎప్పుడు కలుగుతుంది?* 

 🌿 *పత్రీజీ :---* మనమంతా ఆత్మ పదార్థాలం అనే సత్యాన్ని మరిచిపోయినప్పుడు ఆధ్యాత్మికత నుంచి వైదొలగిపోతాం. మనల్ని భౌతిక శరీరంగా గుర్తిస్తూ *“నేను పురుషుడిని” , “నేను మహిళను”... 'నాకు నలభై సంవత్సరాలు'... 'నాకు యాభై సంవత్సరాలు’ ‘నా వెంట్రుకలు నెరిసాయి'... 'నేను చనిపోతున్నాను'...* ఈవిధమైన దేహపరమైన మూర్ఖపు మాటలు ఆధ్యాత్మికత కాదు. ఎప్పుడైతే ఆత్మ గురించి... ఆధ్యాత్మికతకు మూల కేంద్రమైన ఆత్మ గురించి ఆలోచించటం, మాట్లాడటం చేస్తామో అదే ఆధ్యాత్మిక చింతన.

🍁 *ప్రశ్న:---  ఆధ్యాత్మికత మనల్ని పరస్పర వైరుధ్యాలలోనూ జీవించటానికి సహకరిస్తుంది అంటే ఏమిటో దయచేసి వివరంగా చెప్పండి.*

🌴 *పత్రీజీ :---* అవును. గొప్ప వైరుధ్యాల మధ్య జీవిస్తాం. అయితే విరుద్ధమైనవన్నీ కూడా సత్యాలే, ఏక కాలంలో. మరణం ఉంది... మరణం అనేదే లేదు. ఎదుగుదల ఉంది... ఎదుగుదల అనేదే లేదు. దుఃఖం ఉంది... దుఃఖం అనేదే లేదు. అందరికీ మేలు చెయ్యాలి... ఎవ్వరికీ ఏ మేలూ చెయ్యలేం. ఎవ్వరికైనా మంచిని బోధించ వచ్చు... ఎవ్వరికీ ఏ మంచినీ బోధించలేం. ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ పరస్పర విరుద్ధమైనవే. ఈ వైరుధ్యాలను అర్థం చేసుకున్నప్పుడే నిజమైన ఆధ్యాత్మికతను అర్థం చేసుకున్నట్లు లెక్క. ఈ వైరుధ్యాలు ఇంకా అర్థం కావటం లేదంటే మీరు ఇంకా ఆధ్యాత్మికతను సరిగ్గా అర్థం చేసుకోనట్లే !


పిచ్చుక తెలివి

 *పిచ్చుక తెలివి*

🐦🐦🐦

ఒక రోజు ఒక వేటగాడి చేతికి ఒక చిన్న పక్షి (పిచ్చుక) దొరికింది. అతడు దానిని చంపబోతుంటే ఆ పక్షి అతనితో ఇలా అంది:

”అయ్యా! నీవెన్నెన్నో పెద్ద పెద్ద మృగాల్నీ, జంతువుల్నీ వేటాడి ఉంటావు. నా లాంటి అల్ప ప్రాణిని చంపటం వల్ల నీకేం లాభం? పిడికిల్లో పట్టేంత కూడా లేని నన్ను చంపి తింటే నీ ఆకలి ఎలాగూ తీరదు. దయ చేసి నాకు ప్రాణభిక్ష పెట్టి నన్ను వదిలెయ్. అందుకు ప్రతిఫలంగా నేను నీకు అమూల్యమైన మూడు నీతి సూక్తులు చెప్తాను, అవి నీ జీవితాన్ని ఉద్ధరించుకోవడా నికి, నీవు సంతోషంగా సుఖంగా జీవించడా నికి ఎంతగానో ఉపయోగపడతాయి." అంది.

ఆ వేటగాడు ఒక్కక్షణం అలోచించి ‘నిజమే ఈ పిచ్చుకని చంపటం వల్ల ఉపయోగంలేదు’ అనుకుని “సరే వదిలివేస్తాను ఆ నీతి సూక్తులు చెప్పు" అన్నాడు.

ఆ పిచ్చుక ఆ వెంటనే “అయ్యా! కానీ నాదొక షరతు. నేను మొదటి సూక్తిని నీ చేతిలో చెప్తాను. రెండవది నీ ఇంటి పైకప్పు పై కూర్చుని చెప్తాను. ఇక మూడవది చెట్టు కొమ్మ మీద కూచుని చెప్తాను”అంది. వేటగాడు సరేనన్నాడు.

ఆ పిచ్చుక వేటగాడి చేతిలో కూర్చుని మొదటి నీతి సూక్తినిలా చెప్పింది:

”ఎదుటి వ్యక్తి ఎవరైనాసరే, ఎంత గొప్ప మాటలు చెప్పినా సరే, నీ అనుభవానికి (తర్కానికి) రానంత వరకు ఆ వ్యక్తినీ, ఆ మాటలను నమ్మకూడదు.” అని చెప్పి వేటగాడి చేతిలో నుండి ఎగిరి వెళ్లి ఇంటి పైకప్పు పైన కూర్చున్నది.

ఇంటి పైకప్పు మీది నుండి ఫక్కున నవ్వి ఇలా అంది..

“ఓరీ…మూర్ఖుడా నువ్వు నన్ను ఎవరనుకు న్నావు? నా కడుపులో అత్యంత విలువైన, బరువైన వజ్రం ఉంది. అది తెలుసుకోకుండా నువ్వు వదిలేశావు నన్ను.”

ఈ మాటలు విన్న వేటగాడు హతాశుడై తన దురదృష్టాన్ని తలచుకుని “అయ్యో! అంత విలువైన, బరువైన వజ్రాన్ని కోల్పోయానే, ఎంతటి మూర్ఖుడిని నేను” అని ఏడవటం మొదలుపెట్టాడు.

పిచ్చుక అంది “ఓరీ నీవు నిజంగానే మూర్ఖుడివి. ఇందాకే నీకు చెప్పాను కదా! ‘ఎదుటి వ్యక్తి ఎవరయినా సరే…ఎంత గొప్ప మాటలు చెప్పినా సరే… నీ అనుభవానికి (తర్కానికి) రానంతవరకు ఆ వ్యక్తినీ, ఆ మాటల్నీ నమ్మకూడదు అనీ..”

“నీ పిడికిలంత కూడా లేని నేను, నా కడుపు లో బరువైన వజ్రం ఉందని చెప్తే ఎలా నమ్మేశావు? మూర్ఖుడా! సరే ఇక రెండో నీతి సూక్తి చెబుతా విను..”

“ వెనక్కి తిరిగి చూసుకుని గతంలో జరిగిపోయిన వాటిని గురించి ఎప్పుడు కూడా అలోచించి బాధ పడకూడదు.” అని చెప్పి ఎగిరి వెళ్లి చెట్టు కొమ్మ పైన కూర్చుంది.

ఆ వెంటనే ఆ వేటగాడు ఏడుస్తూ "నేను నిన్ను వదిలేసి వజ్రాన్ని పోగొట్టుకున్నాను, నువ్వు నన్ను మోసం చేసావు." అని అరుస్తున్నాడు.

ఆ పిచ్చుక వేటగాడిని చూస్తూ కూచుని ఉంది.

వేటగాడు కాసేపటికి తేరుకుని “ఎప్పుడూ వెనక్కి తిరిగి చూసుకుని జరిగిపోయిన వాటి గురించి అలోచించి బాధ పడవద్దు” అని గుర్తు చేసుకుని..

“సరే! ఇప్పుడా మూడో సూక్తి ఏమిటో చెప్పు”అన్నాడు.

ఆ పిచ్చుక “ఎలాగూ నేను చెప్పిన మొదటి రెండు సూక్తులు నీ బుర్రకెక్కలేదు కదా? మూడోది చెప్పటం వల్ల ప్రయోజనం ఏంటీ?” అంటూనే...

“నీ మాటలు వినని, అర్థం చేసుకోని వారిపై ఎన్నడూ నీ శక్తినీ, విజ్ఞానాన్నీ, సమయాన్నీ వృథా చేసుకోవద్దు”అని చెప్పి ఎగిరి వెళ్ళిపోయింది.
🐦🐦🐦

కుందేలు తాబేలు కథ అందరికీ తెలిసిందే. అయితే, అది సగ భాగం మాత్రమే; తర్వాత ఏం జరిగిందో ఎవరూ చెప్పలేదు, మనమూ తెలుసుకునే ప్రయత్నం చేయలేదు.

 కుందేలు తాబేలు కథ అందరికీ తెలిసిందే. 
అయితే, అది సగ భాగం మాత్రమే; తర్వాత ఏం జరిగిందో ఎవరూ చెప్పలేదు, మనమూ తెలుసుకునే ప్రయత్నం చేయలేదు.

 ఒక అడవిలో చెంగు చెంగున ఎగరగలను అనుకునే కుందేలు, తాబేలుని చూసి నీలా నెమ్మదిగా నడిచే జీవిని నేను ఎప్పుడూ చూడలేదు అంటే...అప్పుడు తాబేలు కుందేలుతో నాతో పరుగుపందెం పెట్టుకొని చూడు అంటుంది. 
 
పరుగు పందెం ప్రారంభమవుతుంది. కుందేలు చెంగు చెంగునా చాలా దూరం వెళ్ళి వెనక్కు తిరిగి చూస్తే తాబేలు కనుచూపుమేరలో కూడా లేదు. అప్పుడు కుందేలు తాబేలు వచ్చేసరికి చాలా సమయం పడుతుందిలే అని చెట్టు క్రింద పడుకుంటుంది.. తాబేలు మాత్రం అడుగులో అడుగు వేసుకుంటుంటూ 2 రోజులు ఎక్కడా ఆగకుండా నడిచి గమ్యస్థానానికి చేరుతుంది. పరుగు పందెం లో తాబేలు గెలిచింది, కుందేలు ఓడిపోయింది. గర్వం ఉండకూడదు అనేది నీతి అని అందరూ వినే ఉంటారు.  

నిజానికి ఇది ఫస్ట్ హాఫ్ మాత్రమే. సెకండ్ హాఫ్ లో నేను వెళ్ళి కుందేలు ని అడిగా..నీకు అంత సోమరితనం, బలుపు ఎందుకు అని..అయ్యో, అందరిలానే నీవూ పొరపాటు పడ్డావా, అసలు ఏమి జరిగిందో తెలుసా అని కుందేలు చెప్పటం ప్రారంభించింది.

మా పోటీ ఒక మైదానం నుంచి ప్రారంభం అయ్యింది. నేను వేగం గా పరిగెత్తుతూ ఉంటే మైదానం పక్కన ఒక కొండ కనిపించింది, దాని పక్కన ఒక పెద్ద మర్రి చెట్టు కనిపించింది. వెనక్కి తిరిగి చూస్తే తాబేలు కనుచూపు మేరలో లేదు. మా పోటీ 2 రోజులు ఉంటుంది, ఆరోగ్యంగా ఉండాలి అంటే నాకు చాలినంత నిద్ర కావాలి కాబట్టి మర్రి చెట్టి క్రింద కొద్దిసేపు నిద్రించా. 
కొద్దిసేపటికి తాబేలు వచ్చి నా సామర్ధ్యం ఎక్కువ, విశ్రాంతి తీసుకోకుండా నేను ఎన్ని రోజులు అయినా నడవగలను అని ప్రగల్భాలు పలికింది. నాకు ఏమో మర్రి చెట్టు నీడ ఒక గొడుగులా అనిపించింది.
నేను లేచి కొంచెం ముందుకు పరిగెత్తితే ఒక సరస్సు కనిపించింది, సరస్సులో ఒక పెద్ద దుంగ తేలుతూ ఉంటే దాని మీద నించొని అవతలి ఒడ్డుకు చేరాను. ఒక పెద్దాయన కనిపించాడు. ఎవరు నీవు అని అడిగితే నేను ఒక పరుగు కుందేలుని, ఒక తాబేలు నన్ను ఛాలెంజ్ చేస్తే దానితో పరుగుపందెంలో ఉన్నాను అని చెప్పాను. 
'గెలిస్తే నీకు ఏమొస్తది' అని అడిగాడు. మెడల్ వస్తుంది అని చెప్పాను. ఆ మెడల్ తో ఏమి చేసుకుంటావ్ అని అడిగితే అమ్మి ఆహారం కొంటాను చెప్పాను. ఈ అడవిలో ఇంత ఆహారం ఉంటే ఆ మెడల్ తోనే సంపాదించాలా అని చెప్పాడు పెద్దాయన.

మరి, నాకు వేగంగా పరిగెత్తగలిగే కుందేలు అన్న బిరుదు, గౌరవం కూడా వస్తుంది కదా అని చెప్పాను. 
100 సంవత్సరాల క్రితం ఈ అడవిలో వేగం గా పరిగెత్తిన జింక పేరు నీకు తెలుసా..? అతి పెద్ద ఏనుగు పేరు నీకు తెలుసా..? బలమైన సింహం పేరు నీకు గుర్తు ఉందా..? అని పెద్దాయన అడిగాడు. లేదు నాకు తెలియదు అని చెప్పాను. 

ఈ రోజు తాబేలుతో గెలిచాక రేపు ఒక పాము ఛాలెంజ్ చేస్తుంది, ఎల్లుండి ఒక జీబ్రా తనతో పోటీ పడమని అడుగుతుంది. జీవితాంతం నిన్ను నీవు ప్రూవ్ చేసుకోటానికి, వేగం గా పరిగెత్తగలను అని చూపించుకోటానికే నీ జీవితం కేటాయించుకుంటావా, ఈ పనులు వ్యర్ధమైనవి అని చెప్పి వెళ్ళిపోయాడు. 

నాకు జ్ఞానోదయం అయ్యి సరస్సు ఒడ్డున ఉన్న చెట్టు క్రింద కూర్చొని సరస్సులోని బాతులని, చెట్టు మీద పక్షుల రాగాలని వింటున్నాను. అప్పుడు ఒక బాతు వచ్చి.. అవును, తాబేలుతో పోటీ లో ఉండాలి కదా, ఇక్కడ ఏమి చేస్తున్నారు అని అడిగింది. జీవితం రన్నింగ్ రేస్ కాదు, నేను ఎవరితో ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నా బలం నాకు తెలుసు, బలహీనత నాకు తెలుసు అని చెప్పాను. 
సాయంత్రం ఒక నక్క వచ్చి..తాబేలు గమ్యస్థానానికి చేరి గెలిచింది, ఎక్కడా ఆగకుండా 2 రోజులు నడిచేసరికి గమ్యస్థానానికి చేరిన 10 నిమిషాలకే మరణించింది అని చెప్పింది.  
ఇది అసలు జరిగింది అని కుందేలు నాతో క్లియర్ గా చెప్పింది. 

జీవితం పరుగుపందెం కాదు. ఏ ఒక్క విషయం లో అయినా ఎవ్వరితో అయినా ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, పోల్చుకోవాల్సిన అవసరం లేదు. 
ఎవరి జీవితం వాళ్ళది, జీవితం లో జీవితాన్ని మించిన విలువైనదీ, గొప్పదీ ఏమీ ఉండదు. 🙏


👌👌👌👌👌👌👌 హాఫ్ కథ అని చెప్పి కథ పొడగించిన... *ఈ కథ పుట్టి 40 సంవత్సారాల క్రితం అప్పటి కాలం ప్రకారం నిర్లక్ష్యం కూడదు* అని పిల్లలకు చెప్పే ఉద్దేశ్యం.
ఇప్పుడు
 *అంతా ఊరుకులు పరుగులు*
 మార్కులు, ర్యాంకు లు
*ఒక  రోజు కూడా గ్రౌండ్ లో పరిగెత్తి ఆడే కోకో, ఫుడ్బాల్, లాంటి ఆటలు లేవు*
శారీరక శ్రమ లేదు.
*అసలు పిల్లలకు ఒళ్ళంతా చెమటలు పట్టిన రోజు ఒక్కరోజు అయినా గుర్తు ఉండి ఉండదు*
కుందేలు తనకు ఇష్టం అయిన విధంగా ఆనందం గా గడిపినట్టు పిల్లలు అన్ని చవి చూడాలి. 
కాబట్టి ఈ కాలానికి తగినట్టు కొనసాగింపు కథ చాలా బాగుంది.

హార్ట్ ఫుల్ నెస్🌍కథతో, మరుపును కలిగించే మందు

 *365 రోజులు✈️హార్ట్ ఫుల్ నెస్🌍కథతో* 

♥️ *కథ - 65* ♥️

 *చదివే ముందు... చాలా సున్నితంగా కళ్ళు మూసుకోండి... మీ దృష్టిని మీ హృదయం మీదకి* *తీసుకురండి... మీ హృదయంలో తల్లి ప్రేమను అనుభూతి చెందండి.... మెల్లగా కళ్లు తెరిచి చదవడం ప్రారంభించండి...* 

 *మరుపును కలిగించే మందు*
 
నాకు ఒక మందుల దుకాణం ఉంది, ఆ రోజు దుకాణం చాలా రద్దీగా ఉంది. నేను కస్టమర్లకు మందులు ఇస్తూండగా, దుకాణానికి కొంచెం దూరంలో చెట్టు కింద ఒక వృద్ధురాలు నిలబడి ఉంది. నేను రెండు మూడు సార్లు ఆమెను చూసినప్పుడు, ఆమె నా దుకాణం వైపే చూస్తూండటం నేను గమనించాను.
నేను కస్టమర్లకు మందులు ఇస్తూనే ఉన్నాను, కానీ ఆ వృద్ధురాలి గురించి, ఆమె అక్కడ ఎందుకు నిలబడి ఉంది, ఇటువైపే ఎందుకు చూస్తోంది అన్న ఆసక్తి కలిగింది.
కస్టమర్లు తక్కువగా ఉన్నప్పుడు, నేను నా షాప్‌లో పనిచేసే అబ్బాయికి షాప్ కౌంటర్ అప్పగించి, ఆమె వద్దకు వెళ్లాను. ఆమెను ఇలా అడిగాను, "ఏమైంది అమ్మా, మీకు ఏదైనా కావాలా? చాలాసేపటి నుండి మీరు ఇక్కడ నిలబడి చూస్తున్నారు.  బయట చాలా ఎండగా ఉంది, అందుకని మీకు అవసరమైనది ఏమైనా కావాలేమోనని అడుగుతున్నాను."
వృద్ధురాలు మాట్లాడటానికి కొంచెం సంకోచించింది.
కాస్త ధైర్యం తెచ్చుకుని ఆమె మాట్లాడటం ప్రారంభించింది, “నాయనా, నాకు ఇద్దరు కొడుకులు. ఇద్దరూ వేరే నగరంలో ఉంటున్నారు. ప్రతి వేసవి సెలవుల్లో, వారు మమ్మల్ని కలవడానికి తమ పిల్లలతో వస్తారు.
అయితే ఈసారి మాత్రం వాళ్ళు ఎక్కడో పర్వతప్రదేశాల్లో సెలవలు గడపాలని నిర్ణయించుకున్నారు.  కాబట్టి ఈసారి వారు మమ్మల్ని కలవడానికి రారు నాయనా.  నాకు ఈ విషయం నిన్న సాయంత్రమే తెలిసింది. నిన్న రాత్రి దీని గురించి ఆలోచిస్తూ చాలా అశాంతికి గురయ్యాను.... ఒక్క నిమిషం కూడా నిద్ర పట్టలేదు.
ఈరోజు మీ షాపులో మందులు కొందామని అనుకున్నాను. కానీ షాపులో జనాన్ని చూసి, ఇక్కడే వేచి ఉండి, షాపులో ఎవరూ లేనప్పుడు మందు గురించి అడగాలని అనుకుంటున్నాను.”
"అర్ధమయిందమ్మా ... చెప్పు తల్లీ.. నీకు ఏ మందు కావాలి? నేను తెచ్చిస్తాను!" అని అన్నాను.
‘‘పిల్లల్ని మరిచిపోవడానికి మందు ఏమైనా ఉందా ...?
ఉంటే తీసుకురా నాయనా..... భగవంతుడు నిన్ను ఆశీర్వదిస్తాడు..." అని అంది.
ఆపై మాటలు వినడానికి నాకు ధైర్యం చాలలేదు. నా చెవులు మొద్దుబారిపోయాయి. నేను ఏమీ మాట్లాడకుండా నిశ్శబ్దంగా దుకాణానికి వైపుకి తిరిగాను.
ఎందుకంటే వృద్ధురాలికి కావాల్సిన మందు ఆమె కుమారుల వద్ద మాత్రమే దొరుకుతుంది, నావద్ద దొరకదు.       ఇది ప్రపంచంలో ఏ మందుల దుకాణంలోనూ దొరకదు..
ఇప్పుడు నేను కౌంటర్ వెనుక నిలబడి ఉన్నాను.
నా మనసులో ఆలోచనల తుఫాను, ఆ చెట్టుకింద నిలబడి ఉన్న తల్లిని కళ్ళెత్తి చూడడానికి కూడా ధైర్యం చేయలేకపోయాను. నా దుకాణం మొత్తం ఆ అమ్మకి పనికిరాకుండా పోయింది..                                                  ఎంత నిస్సహాయతను అనుభవించానో ఆ భగవంతుడికే తెలుసు!
ఈ వేసవి సెలవుల్లో ఎవరైనా తమ సొంతూరికి వెళ్లకుండా వేరే ప్రదేశానికి వెళుతున్నారని నేను విన్నప్పుడల్లా ఆ వృద్ధురాలి తపన నన్ను ఇప్పటికీ బాధిస్తుంది.

♾️

 *అనుబంధం లేకుండా ప్రేమించడం నేర్చుకోండి, ఎందుకంటే అనుబంధం మనల్ని బాధపెడుతుంది, ప్రేమ కాదు. 🌼* 

 *చారీజీ* 


హార్ట్ ఫుల్ నెస్ ధ్యానం  💌

HFN Story team

నిజాయితి - దురాశ

 3001C3k1437.   1202C. 3-5.
061123-4.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀దేవునివైపు అడుగులు…
           *నిజాయితి - దురాశ* 
                 ➖➖➖✍️

*విశ్వనాథ్ ఎవరికో డబ్బు ఇవ్వాల్సి ఉంది. కాబట్టి బ్యాంక్ నుండి క్యాష్  విత్ డ్రా చేయడానికి వెళ్ళాడు. విత్ డ్రా స్లిప్ లో 1,00,000 అని వ్రాసి రెండు వైపులా సంతకం చేసి ఇచ్చాడు. ఇతడే విశ్వనాథ్ అనేది ఖచ్చిత పరచుకున్న క్యాషియర్ డబ్బు ఇచ్చేశాడు.*

*క్యాషియర్ ఇచ్చిన డబ్బును అక్కడే పక్కన నిలబడి లెక్కిస్తే అందులో 1,00,000 రూపాయలకు బదులు 1,20,000 ఉన్నాయి.*

*విశ్వనాథ్ క్యాషియర్ ముఖాన్ని ఒకసారి చూశాడు. ఇదేమీ తెలియనట్లుగా అతడు మరొక వ్యవహారం లో నిమగ్నమై ఉన్నాడు. విశ్వనాథ్ మెల్లిగా డబ్బును బ్యాగ్ లో పెట్టి అక్కడినుండి వెళ్ళిపోయాడు.*

*తను ఈ రకంగా చేసింది సరా, తప్పా అనే ప్రశ్న ఆయన మనసును కొరకడం ప్రారంభమైంది. ఒకసారి ‘ఈ డబ్బును తిరిగి ఇచ్చేయాలి’ అని మనసు చెబితే, మరొక సారి ‘వేరే ఎవరికైనా నేను ఈ రకంగా ఎక్కువ డబ్బు ఇస్తే వాళ్ళువెనక్కు ఇచ్చేవారా?’ అనే ప్రశ్న   ఎదురైంది. ఎవరు ఇస్తారు ? ఎవరూ ఇవ్వరు అని మనసు చెప్పింది. కాబట్టి ఇవ్వాల్సిన అవసరం లేదు అని విశ్వనాథ్ తీర్మానించుకున్నాడు.*

*కాసేపటికే మళ్ళీ డబ్బు గురించే ఆలోచన. క్యాషియర్ ఇపుడు ఈ డబ్బును తన చేతినుండి కట్టాల్సివస్తుంది. అతడి ఆర్థిక పరిస్థితి ఎలా ఉందోననే ఆలోచన వచ్చింది. మరో క్షణంలో , బ్యాంక్ వారికి మంచి జీతం వస్తుంది, ఉండనీలే, అదృష్టంకొద్దీ లభించిన డబ్బును ఎందుకు ఇవ్వాలి అన్నది మనసు.*

*బ్యాంకులో పెద్ద మొత్తంలో డబ్బు డ్రా చేసేవారు తక్కువమంది. కాబట్టి నాకు ఎక్కువ మొత్తం డబ్బు ఇచ్చామనేదు వారికి తెలిసిపోతే, నన్నే అడిగితే ఎలా అన్న ఆందోళన మొదలైంది. అయితే, ఒకసారి నా చేతికి డబ్బు వస్తే అది నాదేగదా అని మనసు మరొక దిశలో ఆలోచించింది. ఇలా అనేక సార్లు జరిగి సాయంత్రం నాలుగు గంటలు దాటింది.*

*అపుడు మరొకసారి ఆలోచించాడు విశ్వనాథ్. అపుడు మనసు, ఇతరుల తప్పు కారణంగా లాభం పొందడం సరికాదు. ఈ 20,000 రూపాయలు నా నిజాయితీకి ఎదురైన ఒక పరీక్ష అంతే . ఇందులో గెలవాలా, ఓడాలస అన్నదే ముఖ్యం అన్నది. దాంతో ఒక క్షణమూ ఆలోచించకుండా విశ్వానాథ్ బ్యాంక్ కు పోయాడు.*

*అక్కడ క్యాషియర్ తలమీద చేతులు పెట్టుకుని కూర్చొని ఉన్నాడు. చెమటలు పట్టి ఉన్నాయి. డబ్బును కౌంటర్ లో పెట్టి విషయం చెప్పాడు విశ్వనాథ్. క్యాషియర్ ఆ డబ్బును గుండెలకుహత్తుకుని, కళ్ళలో నీరు నింపు కున్నాడు.*

   *మీరు ఈ డబ్బు తెచ్చి ఇవ్వకపోతే నేను చాలా ఇబ్బందిపడేవాడిని. ఈరోజు పెద్ద మొత్తాలకు సంబంధించిన డ్రా లు జరిగాయి. కాబట్టి ఎవరికి ఎక్కువ మొత్తం వెళ్ళిందనేది తెలియడం లేదు. మీరు తెచ్చి ఇవ్వకపోయుంటే నా జీతంలోనుండి దాన్ని వసూలు చేసేవారు. ఇప్పటికే పిల్లల స్కూలు ఫీజులకు అప్పు చేశాను. ఇపుడు ఈ మొత్తమూ కట్టాల్సివచ్చి ఉంటే చాలా ఇబ్బంది అయ్యేది. థ్యాంక్స్ సర్. పది నిమిషాలలో పని ముగించి వస్తాను. కలసి కాఫీ త్రాగుదాం అన్నాడా క్యాషియర్.*

*అపుడు విశ్వనాథ్ ' అదేమీ వద్దు. నేనే మీకు పార్టీ ఇస్తాను.అవసరమైతే మనమిద్దరమూ మన భార్యలనూ పిలుద్దాం' అన్నాడు.*

     *క్యాషియర్ కు ఆశ్చర్యం. మీరెందుకు పార్టీ ఇవ్వాలి, నేనుకదా ఇవ్వాల్సింది అన్నాడు.*

     *అపుడు విశ్వనాథ్ , మీరు 20,000 ఎక్కువగా ఇచ్చినందున ఈ రోజు నేనెంత దురాశాపరుడిని అనేది నాకు తెలిసొచ్చింది. చివరకు నేను ఈ దురాశను వదలివేయగలను అన్నది కూడా ప్రూవ్ అయింది. అటా ఇటా అనే గందరగోళంనుండి నేను గెలిచాను. ఇలాంటి అవకాశం ఇచ్చింది మీరు. అందుకు కృతజ్ఞతగా ఈ పార్టీ అన్నాడు.*

*’ఇలా కూడా ఆలోచించ వచ్చా’ అనిఅవాక్కయ్యాడు క్యాషియర్.*
          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు!*
                       🌷🙏🌷

 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
                     ➖▪️➖

Sunday, November 5, 2023

Walking Experiment on Diabetes ఫలితాలు..

 _*Diabetes / sugar / చక్కెర వ్యాధి ఉన్నా.. లేకపోయినా.. అందరికీ పంపించండి.*_  

_*మీకు తెలిసున్న Diabetes వారికి పంపండి.. వారికి చాలా చాలా ఉపయోగం.*_ 

_*ఇంగ్లాండు లో ఒక పరిశోధన నిర్వహించారు.*_

_*ప్రతి ఒక్కరూ తప్పని సరిగా ఇది చదవండి... చదివించండి.*_

_*Walking Experiment on Diabetes ఫలితాలు..*_

*రోజుకు ఒక అర గంట, లేక 45 నిముషాలు వాకింగ్ ( పొద్దున్న కానీ, సాయంత్రం కానీ, వారి వారి వీలును బట్టి ) *ఏకబిగిన* *నడిచే వారికంటే, పొద్దున్న టిఫిన్ చేసిన తరువాత ఒక 5 నుంచి 10 నిముషాలూ, మధ్యాన్నం లంచ్ తరువాత 10 నిముషాలూ, రాత్రి డిన్నర్ తరువాత ఒక 10 నిముషాలూ, అలా మొత్తం రోజులో మొత్తం మీద అరగంట వాకింగ్ చేయడం వల్ల రక్తం లో సుగర్ నిల్వలు బాగా తగ్గుతాయి అని తేలింది...!!!*
 
అలా *తిన్న  5 నిముషాల లోపు* *లేచి, 5-10 నిముషాలు వాకింగ్ చేసిన వారి రక్తం లో Sugar నిలవలు 11% నుంచి 44% శాతం వరకు తగ్గినట్లు వారు నిర్వహించిన Blood Test లలో తేలింది ...!!!*

*కాబట్టి, Diabetics వరకు, ఎంత సేపు వాకింగ్ చేశారు, ఎంత దూరం నడిచారు ? అనే దానికంటే, *టైమింగ్, అనగా ఎప్పుడు నడిచారు* ? *అనే దానికి ప్రాధాన్యత ఉన్నట్లు తేలింది..!!!*

*ఈ పరిశోధన ,  ఇంగ్లాండ్ లో 23 దఫాలు గా నిర్వహించారు.*

 *ఇందులో పెద్ద సంఖ్య లో, అనగా *12 లక్షల మంది డయాబెటిస్ ఉన్నవారు  వాలంటీర్స్ గా* *సహకరించారు.*

*ఈ పరిశోధన 40 రోజుల పాటు సాగింది. వారు వాడే Medicines Dosage లలో ఏమీ మార్పు లేదు.*

*ఇందులో సగం మందిని, రోజుకు ఏకబిగిన 45 నిముషాలు నడవమన్నారు. మిగతా సగం మందిని 3 పూటలా, తిన్న వెంటనే ( *తిన్న 5 నిముషాల లోపే,.. లేచి..*  *10 నిముషాలు నడవమన్నారు.)* 

*40 రోజుల తరువాత 2 గ్రూపులకీ Blood Test లు చేసారు.*

*దానిలో ఈ సత్ఫలితాలు వెల్లడి అయ్యాయి. ముఖ్యంగా, రాత్రి Dinner తరువాత 10 నిముషాలు నడిచిన వారి లో Sugar శాతం 22% తగ్గిందని వెల్లడి అయ్యింది.*

*Sugar complaint ఉన్నవారు, స్త్రీలైనా, పురుషులైనా, మొత్తం మీద వారానికి 150 నిముషాలు యావరేజి న వాకింగ్ చెయ్యవలసిందే అని ఏకగ్రీవంగా వెల్లడి అయింది.*

_*Action point*_ :-

_*తిన్న వెంటనే TV చూస్తూ కూర్చోకండి.*_  

లేచి,.. *మీ ఇంటి గదుల్లోన్నయినా సరే, గడియారం చూసుకుని 10 నిముషాలు నడవండి.* 

*3 పూటలా నడవండి.*
*40 రోజుల తరువాత  Blood Test చేయించుకోండి.*

గుడాకేశ నిద్రనుజయించినవాడు telugu pdf ebook

మనుషులు చేజారుతారు

 *అవసరాల కోసం మాత్రమే మనుషులు.... మానవ సంబంధాలు... ప్రేమలు... అభిమానాలు... ఆప్యాయతలు... అన్నీ నాన్సెన్స్.... నేనే తెలివైన వాడిని అవతలి వారికి ఏమీ తెలియదు... వారిని నా అవసరానికి వాడేసుకోవచ్చు.... వారికి అవసరమైనప్పుడు వారివైపు కూడా చూడనక్కర లేదు ఎందుకంటే మన దృష్టిలో వాళ్ళు చాలా తింగరివాళ్ళు.... ఇదే ఈనాటి తరం తెలివి తేటలు.... కానీ, వీళ్లకు తెలియని విషయం ఏమిటంటే... వాళ్ళు తెలివిలేని తింగరివాళ్ళు కాదు ""మంచివాళ్ళు"'.... మనం చేసే స్వార్ధపు పనుల వాళ్ళ ఆ మంచి మనుషుల మనసునుండి "'శాశ్వతంగా"' తొలగి పోతాము... ఈ విషయాన్ని చక్కని ఉదాహరణలతో వివరించిన వ్యాసం... మనస్సుతో చదవండి... మంచి మనుస్యులను చేజారనివ్వకండి.... సర్వే జనా సుఖినోభావంతు....*

 *మనుషులు చేజారుతారు*

‘హమ్‌ తుమ్‌ ఏక్‌ కమరే మే బంద్‌ హో’.... భారత సినీ ప్రేక్షకుల్ని ఉర్రూతలూపిన ‘బాబీ’ మొన్నటి సెప్టెంబర్‌ 28కి యాభై ఏళ్లు పూర్తి చేసుకుంది. ఇవాళ్టికీ దేశంలోని అన్ని భాషల్లో ఏదైనా టీనేజ్‌ ప్రేమకథ తీస్తూంటే గనక అది ఏదో ఒక మేరకు ‘బాబీ’కి కాపీ. ఆ సినిమా ఇచ్చిన ఫార్ములాతో వందలాది కథలు వచ్చాయి. వస్తాయి. ‘మేరా నామ్‌ జోకర్‌’ తీసి నిండా మునిగిన రాజ్‌కపూర్‌ను కుబేరుణ్ణి చేసిన సినిమా అది. ఆ సంపద వచ్చిన సందర్భంలోనే రాజ్‌కపూర్‌ ఒక మనిషిని చేజార్చుకున్నాడు. తెలిశా.. తెలియకనా?

‘బాబీ’ని కనీస ఖర్చుతో తీద్దామనుకున్నాడు రాజ్‌కపూర్‌. హీరో తన కొడుకే రిషికపూర్‌. హీరోయిన్‌ కొత్తమ్మాయి డింపుల్‌ కపాడియా. ముఖ్య పాత్రలు ప్రేమ్‌నాథ్, ప్రేమ్‌చోప్రా భార్య తరఫు బంధువులు. లక్ష్మీకాంత్‌– ప్యారేలాల్‌ ఇంకా కెరీర్‌ ప్రారంభంలో ఉండి రాజ్‌కపూర్‌తో మొదటి సినిమా చేయడమే వరం అనుకునే రకం. ఖర్చేముంది? ఒక్కటి ఉంది... ప్రాణ్‌ రెమ్యూనరేషన్‌. ఆ రోజుల్లో ప్రాణ్‌ సినిమాకు రెండు, మూడు లక్షలు తీసుకుంటున్నాడు. రాజ్‌కపూర్‌తో అప్పటికి నలభై ఏళ్లుగా ప్రాణస్నేహం. ‘ఒక్కరూపాయి తీసుకొని చేస్తా. సినిమా ఆడితే ఇవ్వు. ఆడకపోతే మర్చిపో’ అన్నాడు ప్రాణ్‌. అన్నమాట ప్రకారం ఒక్క రూపాయికే చేశాడు. సినిమా రిలీజ్‌ అయ్యింది. ఇరవై పాతిక లక్షలు పెట్టి తీస్తే దేశంలో, బయట కలిపి 30 కోట్లు వచ్చాయి. నేటి లెక్కల ప్రకారం 1200 కోట్లు! రాజ్‌కపూర్‌ ప్రాణ్‌ని పిలిచి మంచి పార్టీ ఇస్తే బాగుండేది. థ్యాంక్స్‌ చెప్పి అడిగినంత ఇచ్చి ఉంటే బాగుండేది. ఇవ్వకపోయినా బాగుండేది. కాని రాజ్‌కపూర్‌ లక్ష రూపాయల చెక్‌ పంపాడు. లక్ష? తను అడగలేదే? పోనీ తాను అందరి దగ్గరా తీసుకునేంత కూడా కాదే. ప్రాణ్‌ ఆ చెక్‌ వెనక్కు పంపాడు. మళ్లీ జీవితంలో రాజ్‌కపూర్‌ని కలవలేదు. జారిపోయాడు.

‘షోలే’ రిలీజ్‌ అయితే మొదటి రెండు వారాలు ఫ్లాప్‌టాక్‌. రాసిన సలీమ్‌–జావేద్‌ ఆందోళన చెందారు. ఫ్లాప్‌ కావడానికి స్క్రిప్ట్‌ కారణమనే చెడ్డపేరు ఎక్కడ వస్తుందోనని బెంబేలెత్తారు. మాటల్లో మాటగా దర్శకుడు రమేష్‌ సిప్పీతో ‘గబ్బర్‌సింగ్‌ వేషం వేసిన అంజాద్‌ఖాన్‌ వల్లే సినిమా పోయింది. అతడు ఆనలేదు’ అన్నారు. అప్పటికే తన తొలి సినిమాకు ఇలాంటి టాక్‌ రావడం ఏమిటా అని చాలా వర్రీగా ఉన్న అంజాద్‌ఖాన్‌ బ్లేమ్‌ గేమ్‌లో తనను బలి చేయబోతున్నారని తెలిసి హతాశుడయ్యాడు. తీవ్రంగా కలత చెందాడు. కాని సినిమా కోలుకుంది. ఎలా? అలాంటి కలెక్షన్లు ఇప్పటికీ లేవు. అతి గొప్ప విలన్‌గా అంజాద్‌ఖాన్‌ ఎన్నో సినిమాలు చేశారు. కాని ఒకనాటి మిత్రులైన సలీమ్‌–జావేద్‌ రాసిన ఏ స్క్రిప్ట్‌లోనూ మళ్లీ యాక్ట్‌ చేయలేదు. చేజారిపోయాడు.

దాసరి నారాయణరావు తొలి రోజుల్లో నటుడు నాగభూషణాన్ని ఎంతో నమ్ముకున్నాడు. అభిమానించాడు. నాగభూషణం దాసరికి దర్శకుణ్ణి చేస్తానని చెప్పి చాలా పని చేయించుకున్నాడు. చివరి నిమిషంలో వేరొకరిని పెట్టుకున్నాడు. దాసరి ఆ తర్వాత పెద్ద దర్శకుడయ్యి 150 సినిమాలు చేశాడు. వందల పాత్రలు రాశాడు. కాని దాసరి కలం నుంచి ఒక్క పాత్ర కూడా నాగభూషణం కోసం సృజించబడలేదు. దాసరి సినిమాల్లో నాగభూషణం ఎప్పుడూ లేడు. 

రామానాయుడు అవకాశం ఇస్తే ఎంతో కష్టం మీద ‘ప్రేమఖైదీ’ సినిమాకు దర్శకత్వం వహించాడు ఇ.వి.వి.సత్యనారాయణ. అప్పటికి అతని మొదటి సినిమా ఫ్లాప్‌. ఈ సినిమా కూడా పోతే భవిష్యత్తు లేదు. ఫస్ట్‌ కాపీ చూసిన పరుచూరి బ్రదర్స్‌ ఏ మూడ్‌లో ఉన్నారో ‘మా స్క్రిప్ట్‌ను చెడగొట్టినట్టున్నాడే’ అనే అర్థంలో రామానాయుడు దగ్గర హడావిడి చేశారు. వారు స్టార్‌రైటర్స్‌. వారి మాట మీద రామానాయుడుకు గురి.  ఇ.వి.వి హడలిపోయాడు. స్క్రిప్ట్‌ను తన బుర్రతో ఆలోచించి మెరుగుపెట్టి తీస్తే ఇలా అంటారేమిటి అని సిగరెట్లు తెగ కాల్చాడు. సినిమాను మూలపడేస్తే ఇంతే సంగతులే అని కుంగిపోయాడు. కాని  సినిమా రిలీజయ్యి సూపర్‌ హిట్‌ అయ్యింది. ఆ తర్వాత 51 సినిమాలు తీశాడు ఇ.వి.వి. ఒక్కదానికీ గురు సమానులైన పరుచూరి సోదరుల స్క్రిప్ట్‌ వాడాలనుకోలేదు. 

బాగా చనువుగా, ఆత్మీయంగా ఉండే మనుషుల పట్ల కొందరికి హటాత్తుగా చిన్నచూపు వస్తుంది. ఆ.. ఏముందిలే అనుకోబుద్ధవుతుంది. వారితో మనం ఎలా వ్యవహరించినా చెల్లుబాటవుతుందిలే అనిపిస్తుంది. వారితో చెప్పకుండా ఫలానా పని చేద్దాం... శుభలేఖ ఆఖరున పంపుదాం... కష్టంలో ఉన్నారని తెలిసినా చూసీ చూడనట్టు ఉందాం... ఇచ్చిన మాటను తేలిగ్గా తీసుకుందాం... వారి వీపు మీద విస్తరి పరిచి భోం చేద్దాం... అనుకుంటే ఆ క్షణంలో ఆ సదరు వారు మనం చెప్పింది విన్నట్టుగా కనపడతారు. నవ్వుతున్నట్టే ఉంటారు. కాని వారి లోపల మనసు చిట్లుతున్న చప్పుడు మన చెవిన పడకుండా జాగ్రత్త పడతారు. ఆ తర్వాత వారు మనకు కనిపించరు. జారిపోతారు. చేజారిపోతారు.

మనుషులు చేజారితే ఏమవుతుంది? వారితో మాత్రమే సాధ్యమయ్యే జీవన సందర్భాలన్నీ నాశనమవుతాయి. వారితో నిర్మించుకున్న గతం తుడిచిపెట్టుకుపోతుంది. వారితో వీలైన భవిష్యత్తు నష్టమవుతుంది. ఉంటే బాగుండు అనుకునే క్షణాల్లో వారు ఉండరు. డబ్బు, దస్కం, పలుకుబడి, క్షమాపణ ఏదీ వారిని మళ్లీ వెనక్కు తీసుకురాదు.

హాయ్, హలో బాపతు సవాలక్ష దొరుకుతారు. ఈ నిజమైన ఆత్మీయులను కాపాడుకుంటున్నారా? అసలు మీరెంత మందిని చేజార్చుకున్నారో ఎప్పుడైనా లెక్క చూసుకున్నారా?

గతంలోకి వెళ్లి ఒకసారి సింహావలోకనం చెయ్యండి మీకే అర్థమవుతుంది 🙏
Source: 2nd oct. సాక్షి ఎడిటోరియల్...

Saturday, November 4, 2023

ఆత్మ అంటే ఏమిటి? హృదయం మరి ఆత్మకు మధ్య గల వ్యత్యాసం ఏంటి?

🔺 *పత్రీజీ సమాధానాలు* 🔺
🌹 *చాప్టర్ -- 5 :--- ఆధ్యాత్మిక శాస్త్రం* 🌹
🌷 *Part --1*🌷

🍁 *ప్రశ్న :--- ఆత్మ అంటే ఏమిటి?* 

🍀 *పత్రీజీ :---* ఆత్మ అంటే శక్తి, చైతన్యం మరి జ్ఞానం అనే మూడింటి కలయిక యొక్క ఒకానొక అంశ.

🔸 *ECW :---* E అంటే Energy, శక్తి; C అంటే Consciousness చైతన్యం, W అంటే Wisdom జ్ఞానం.

🌳 ఆత్మ అంటే శక్తి, చైతన్యం మరి జ్ఞాన సముదాయంలోని ఒకానొక శకలం అని చెప్ప వచ్చు. ఆధ్యాత్మికత గురించి... మాట్లాడుతున్నాం అంటే మరి మనం ఆ మూలం గురించి... హృదయం గురించి అదే ఆత్మ గురించి మాట్లాడుతున్నాం అన్నమాట ! 

🍁 *ప్రశ్న :--- హృదయం మరి ఆత్మకు మధ్య గల వ్యత్యాసం ఏంటి?* 

🌸 *పత్రీజీ :---* హృదయం అని మాట్లాడుతున్నాం అంటే అదేదో ఊపిరితిత్తులు లేదా మూత్ర పిండాల్లాగా భౌతికమైన అవయవం అని కాదు. ఇక్కడ హృదయం అంటే కేంద్రం అని అర్థం. పదార్థం యొక్క కేంద్రాన్ని హృదయం అంటాం. హృదయ పూర్వకమైన ప్రసంగం అంటే మీ అంతర కేంద్రం నుంచి సాదరంగా మాట్లాడటం అన్నమాట. ఆత్మ అన్నది ఆధ్యాత్మికత యొక్క హృదయం... ఆధ్యాత్మికత యొక్క మూల కేంద్రం. అన్నింటి యొక్క మూలం ఆత్మే. ఆత్మ లేదంటే ఆధ్యాత్మికత అన్నదే ఉండదు. ఆత్మ లేకుండా ఆధ్యాత్మికత లేదు. ఆధ్యాత్మికత గురించి మాట్లాడుతున్నప్పుడు ఆత్మ గురించి కూడా మాట్లాడతాం. ఎందుకంటే ఆధ్యాత్మికత యొక్క హృదయమే ఆత్మ. 


క్వాంటం ఫిజిక్స్ కోణం నుండి మీ వైబ్రేషన్ ఫ్రీక్వెన్సీని ప్రభావితం చేసే 7 విషయాలు

 *క్వాంటం ఫిజిక్స్ కోణం నుండి మీ వైబ్రేషన్ ఫ్రీక్వెన్సీని ప్రభావితం చేసే 7 విషయాలు : క్వాంటం ఫిజిక్స్‌లో వైబ్రేషన్ అంటే అంతా శక్తి. మనము కొన్ని పౌనఃపున్యాలు గలిగిన శక్తివంతమైన జీవులము. ప్రతి వైబ్రేషన్ ఒక అనుభూతికి సమానం మరియు ప్రపంచంలో "వైబ్రేషనల్", అనేవి రెండురకముల కంపనాలు మాత్రమే ఉన్నాయి, సానుకూలత మరియు ప్రతికూలత. ఏదైనా అనుభూతి మిమ్మల్ని సానుకూలంగా లేదా ప్రతికూలంగా ఉండే వైబ్రేషన్‌ని ప్రసారం చేస్తుంది.*

*7 things that affect your vibration frequency from the point of view of quantum physics : Vibration in quantum physics means everything is energy. We are vibrant beings on certain frequencies. Every vibration is equivalent to a feeling and in the world "Vibrational", there are only two species of vibrations, positive and negative. Any feeling makes you broadcast a vibration that can be positive or negative.*


*క్వాంటం ఫిజిక్స్ కోణం నుండి మీ వైబ్రేషన్ ఫ్రీక్వెన్సీని ప్రభావితం చేసే 7 విషయాలు :*
*1 - ఆలోచనలు*
*ప్రతి ఆలోచన విశ్వానికి ఒక ఫ్రీక్వెన్సీని విడుదల చేస్తుంది మరియు ఈ ఫ్రీక్వెన్సీ ఎక్కడి నుంచి వచ్చిందో అదే మూలానికి తిరిగి వెళుతుంది. అంటే, ఫ్రీక్వెన్సీ విడుదల చేసిన వారివద్దకే మళ్ళీ వచ్చి చేరుతుంది. అందువలన, మీరు ప్రతికూల ఆలోచనలు, నిరుత్సాహం, విచారం, కోపం, భయం ఫ్రీక్వెన్సీ విడుదల చేస్తే , ఇవన్నీ మీకు తిరిగి మీ వద్దకే వస్తాయి. అందుకే మీరు మీ ఆలోచనల నాణ్యతను జాగ్రత్తగా చూసుకోవడం మరియు మరింత సానుకూల ఆలోచనలను ఎలా పెంపొందించుకోవాలో నేర్చుకోవడం చాలా ముఖ్యం.*


*7 things that affect your vibration frequency from the point of view of quantum physics :*
*1 - Thoughts*
*Every thought emits a frequency to the universe and this frequency goes back to origin, so in the case, if you have negative thoughts, discouragement, sadness, anger, fear, all this comes back to you. This is why it is so important that you take care of the quality of your thoughts and learn how to cultivate more positive thoughts.*

*2. మీ పర్యావరణం*
*మీ చుట్టూ ఉన్న వ్యక్తులు మీ వైబ్రేషన్ ఫ్రీక్వెన్సీని నేరుగా ప్రభావితం చేస్తారు. మీరు సంతోషంగా, సానుకూలంగా మరియు స్థిరమైన వ్యక్తులతో మిమ్మల్ని చుట్టుముట్టినట్లయితే, మీరు కూడా ఈ కంపనంలోకి ప్రవేశిస్తారు. ఇప్పుడు, మీరు ఫిర్యాదు చేసే, గాసిప్ చేసే మరియు నిరాశావాదులతో మిమ్మల్ని చుట్టుముట్టినట్లయితే, జాగ్రత్తగా ఉండండి! నిజానికి, అవి మీ ఫ్రీక్వెన్సీని తగ్గించగలవు మరియు అందువల్ల ఆకర్షణ నియమాన్ని మీకు అనుకూలంగా ఉపయోగించకుండా నిరోధించగలవు.*


*2. The Companies*
*The people around you directly influence your vibration frequency. If you surround yourself with happy, positive and determined people, you will also enter this vibration. Now, if you surround yourself with people complaining, gossiping and pessimist, be careful! Indeed, they can reduce your frequency and therefore prevent you from using the law of attraction in your favor.*


*3 - సంగీతం*
*సంగీతం చాలా శక్తివంతమైనది. మీరు మరణం, ద్రోహం, విచారం, విడాకులు గురించి మాట్లాడే సంగీతాన్ని వింటూ ఉంటే, ఇవన్నీ మీ అనుభూతులపై ప్రభావాన్ని కలిగిస్తాయి. మీ వైబ్రేషన్ ఫ్రీక్వెన్సీని తగ్గిస్తుంది. అందువలన, మీరు వినే సంగీతం యొక్క సాహిత్యంపై శ్రద్ధ వహించండి,  మరియు గుర్తుంచుకోండి: మీరు మీ జీవితంలో ఎలాంటి భావాలు ఫీల్ అవుతున్నారో అవే ఖచ్చితంగా ఆకర్షిస్తారు.*


*3 - The Music*
*Music is very powerful. If you only listen to music that talks about death, betrayal, sadness, abandonment, all this will interfere with what you are feeling. Pay attention to the lyrics of the music you listen to, it could reduce your vibration frequency. And Remember: you attract exactly what you feel in your life.*

*4. మీరు చూసే విషయాలు*
*మీరు దురదృష్టాలు, మరణించినవి, ద్రోహాలు మొదలైన వాటితో వ్యవహరించే ప్రోగ్రామ్‌లను చూసినప్పుడు, మీ మెదడు దీనిని వాస్తవికతగా అంగీకరిస్తుంది మరియు ఆ వాస్తవికతకు సంబంధించిన కెమికల్స్ ని మీ శరీరంలోకి విడుదల చేస్తుంది, ఇది మీ వైబ్రేషన్ ఫ్రీక్వెన్సీని ప్రభావితం చేస్తుంది. మీకు మంచి అనుభూతిని కలిగించే మరియు అధిక ఫ్రీక్వెన్సీలో వైబ్రేట్ చేయడంలో మీకు సహాయపడే అంశాలను చూడండి.*


*4. The Things You Look At*
*When you look at programs that deal with misfortunes, dead, betrayals, etc. Your brain accepts this as a reality and releases a whole chemistry into your body, which affects your vibration frequency. Look at things that do you feel good and helps you vibrate at a higher frequency.*


*5 - వాతావరణం*
*ఇంట్లో లేదా పనిలో ఉన్నా, మీరు గజిబిజిగా మరియు మురికిగా ఉన్న వాతావరణంలో ఎక్కువ సమయం గడిపినట్లయితే, అది మీ వైబ్రేషన్ ఫ్రీక్వెన్సీని కూడా ప్రభావితం చేస్తుంది. మీ చుట్టూ ఉన్న వాటిని మెరుగుపరచండి, మీ వాతావరణాన్ని నిర్వహించండి మరియు శుభ్రం చేయండి. మీరు మరిన్నింటిని స్వీకరించడానికి సరిపోతారని విశ్వానికి చూపించండి. మీకు ఇప్పటికే ఉన్నవాటిని జాగ్రత్తగా చూసుకోండి!*


*5 - The Atmosphere*
*Whether it's at home or at work, if you spend a lot of time in a messy and dirty environment, it will also affect your vibration frequency. Improve what surrounds you, organize and clean your environment. Show the universe that you are fit to receive much more. Take care of what you already have!*

*6 - వాక్కు*
*మీరు అనవసరంగా గానీ, తప్పుగా గానీ ఇతరుల గురించి, విషయాల గురించి, జడ్జ్ చేసినా, కంప్లైట్లు చేసినా, కామెంట్లు చేసినా, అది మీ వైబ్రేషన్ ఫ్రీక్వెన్సీని ప్రభావితం చేస్తుంది. మీ ఫ్రీక్వెన్సీ ఎక్కువగా పెరగాలంటే, ఇతరుల గురించి ఫిర్యాదు చేయడం మరియు చెడుగా మాట్లాడే అలవాటును తొలగించడం చాలా అవసరం. కాబట్టి కథలు అల్లడం మరియు బెదిరింపులకు దూరంగా ఉండండి. మీ జీవితంలోని ఎంపికలకు మీరే బాధ్యతను స్వీకరించండి!*

*6 - THE WORD*
*If you claim or speak wrong about things and people, it affects your vibration frequency. To keep your frequency high, it is essential to eliminate the habit of complaining and bad talking about others. So avoid drama and bullying. Assume your responsibility for the choices of your life!*


*7 - కృతజ్ఞత*
*కృతజ్ఞతలు తెలుపుకోవడం అనేది, మీ వైబ్రేషన్ ఫ్రీక్వెన్సీని సానుకూలంగా ప్రభావితం చేస్తుంది. కృతజ్ఞతలు తెలుపడం అనే అలవాటు మీ జీవితంలో చేర్చుకోవాల్సిన అతి ముఖ్యమైన అలవాటు. ప్రతిదానికి ధన్యవాదాలు చెప్పడం ప్రారంభించండి, మంచి విషయాలకు మరియు మీరు చెడుగా భావించే వాటికి కూడా, మీరు అనుభవించిన అన్ని అనుభవాలకు ధన్యవాదాలు చెప్పండి. కృతజ్ఞతలు తెలుపడం అనేది మీ జీవితంలో మంచి విషయాలు సానుకూలంగా జరగడానికి ద్వారాలు తెరుస్తుంది*

*7 - GRATITUDE*
*Gratitude positively affects your vibration frequency. This is a habit you should integrate now into your life. Start to thank for everything, for the good things and what you consider to be bad, thank you for all the experiences you've experienced. Gratitude opens the door for good things to happen positively in your life*

x

ఎక్కడ ఆనందం ఉంటుందో అక్కడ ఆరోగ్యం ఉంటుందన్న విషయం మనం మరువకూడదు.

 ప్రతిరోజు ఓ పండుగే.. --  ప్రతీరోజూ ఓ పండుగలా భావించి ఆనందంగా గడపగలిగిన వ్యక్తులు అదృష్టవంతులు ఆరోగ్యవంతులు కూడా.  మనకి బాధలు ఉన్నా పరిష్కారంలో సంతోషం సంతృప్తి పొందగలిగిన వారు ముక్తి మార్గాన్ని పొందుతారు.  మనిషి అన్నాక సమస్య తప్పదు..  ఎవరికైనా ఎంతటి మహామహులకైనా రోజులెప్పడూ ఒక్కలా ఉండవు.  చీకటి వెలుగులు సహజమే.  సమస్యలు చుట్టుముట్టినప్పుడు బెంబేలెత్తి పోకుండా సరియైన ఆలోచనతో ముందుకు వెళితే పరిష్కారం లభిస్తుంది.  పరిష్కారం లేని షమస్య ఉండదు.  చాలామంది ఇబ్బందులు వస్తే నెగెటివ్ ధోరణిలోనే ఆలోచిస్తారు మాట్లాడుతారు.  ఇది కరెక్ట్ కాదు.  మనిషి ఆలోచనల్లో పాజిటివ్ signs ఉండాలి.  ముఖ్యంగా నేటి యువతరం ఆలోచనలు అనాలోచితంగా ఉంటున్నాయి.  పెద్దల మాటలను పట్టించుకోకుండా తప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ తమ జీవితాలను అల్లకల్లోలం చేసుకుంటున్నారు.  భవిష్యత్తుపై అవగాహన ఉండటంలేదు..  బాంధవ్యాలకు విలువలివ్వడం లేదు.  నేరో ఆలోచనలతో జీవితంలో ఆనందాలు (ఎక్కువ కాలం అనుభవించలేక పోతున్నారు.  చుట్టుపక్కల సంఘటలనల్ని, సామాజిక పరిస్థితులను అంచనా వేసుకుంటూ తదనుగుణంగా ముందుకు సాగిపోవాలి.  మన తల్లిదండ్రుల పట్ల బాధ్యతలను విస్మరించకూడదు.  పాఠశాల కళాశాల  లలో జీవితం అంటే ఏమిటో క్షుణ్ణంగా తెలిపే కోర్సులను ప్రవేశపెట్టాలి.  పండుగ అంటే సాంప్రదాయ పండుగలే కాదు.  మనం ఆనందంగా ఉండగలిగితే ప్రతిరోజూ ఓ పండుగే..  మన పేరెంట్స్ తో, పిల్లలతో ఉల్లాసంగా గడపగలిగిన ప్రతీ క్షణం ఓ పండుగే.  పండుగ అంటే ఆనందమే కదా.  బాధ్యతాయుతమైన మంచి మాట, మంచి ఆలోచన, మంచి దృక్పథం మనకి ఉంటే జీవితం రంగుల హరివిల్లే.  ఎక్కడ ఆనందం ఉంటుందో అక్కడ ఆరోగ్యం ఉంటుందన్న విషయం మనం మరువకూడదు.  సో..  ప్రతీరోజూ మనం ఓ పండుగ లాగే సెలిబ్రేట్ చేసుకుందాం.    ----- గాదె లక్ష్మీ నరసింహ స్వామి (నాని)

విజయం..*_ _*అంటే ఏమిటి !?

 _*🫵 విజయం..*_
           _*అంటే ఏమిటి !?  🎊*_
 ➖➖➖➖➖➖✍️
             🌼🌼🌼
*_మన దేశం 🇮🇳 నుండి ఒక ప్రొఫెసర్ అమెరికా వెళ్ళారు. అక్కడ ఒక కాలేజీలో విద్యార్థులతో మాట్లాడుతూ...    “విజయం అంటే ఏమిటి ?” అని అడిగితే ఒక యువతి “విజయం అంటే దండిగా డబ్బు సంపాదించడం !” అన్నది._*
              🪷🪷🪷
*_అపుడు ఆ ప్రొఫెసర్ “అయితే ఇరవై ఏళ్ళ క్రితం ప్రపంచంలో అత్యంత ధనవంతుడు ఎవరో చెప్పండి ?” అంటే ఎవరూ చెప్పలేదు._*
*_ఎందుకంటే ప్రతి ఏడాదికీ అది మారి పోతూవుంటుంది కాబట్టి.._*
            👉👉👉
*_బ్రతకడానికి కొంత డబ్బు కావాలి, కానీ డబ్బే బ్రతుకు కాదు ! అంటే విజయమంటే డబ్బు సంపాదన కాదు అన్నమాట._* 
              🦜🦜🦜
*_మరో యువకుడు లేచి “విజయం అంటే బలం/శక్తి”  అన్నాడు._* 
*_అలా అయితే అలెగ్జాండర్, నెపోలియన్, ముస్సొలిని, హిట్లర్, స్టాలిన్, బిన్ లాడెన్ ... వీళ్ళంతా బలవంతులు. ప్రపంచాన్ని గెలవాలని అనుకొన్నవారే కదా ! వీళ్ళు జీవితంలో సంతోషంగా వుండగలిగారా ? వీళ్ళ జీవితాలు ఎలా గడిచి, ముగిశాయో చరిత్ర చెపుతున్నది కదా ! తన బలంతో, తన ముష్టిఘాతాలతో మహా బలవంతులను మట్టికరిపించిన మహమ్మద్ అలీ అనే ప్రపంచ ఛాంపియన్ బాక్సర్, తరువాత కొన్నేళ్ళకు పార్కిన్ సన్ వ్యాధి వల్ల  కాఫీకప్పును కూడా పట్టుకోలేక పోయాడు. అయితే విజయమంటే బలం/శక్తి సంపాదన కాదు అన్నమాట._* 

*_మరో యువతి “విజయమంటే ప్రఖ్యాతి, అందం !” అంది. అయితే కేట్ మోస్, జీన్ ష్రింప్టన్, సోఫియాలారెన్, మార్లిన్ మన్రో ..లాంటి అతిలోక సౌందర్యవతుల జీవితాలు ఎంత బాధాకరంగా వుండేవో చాలామందికి తెలియదు._*

*_భారత్ విషయానికొస్తే, పర్విన్ బాబీ అనే ఒక హిందీ హీరోయిన్ వుండేది. ఆమె ఎంత అందగత్తే అంటే, అమితాబ్ బచ్చన్ తో సహా, ఆమెను పెళ్ళి చేసుకోవాలి అని అనుకొనని నాటి హిందీ సినిమా హీరోనే లేడు. డానీ, కబీర్ బేడీ, మహేష్ భట్ లతో ఆమె ప్రేమ, పెళ్ళి నడిచి అవన్నీ విఫమయ్యాయి. ధర్మేంద్ర, రాజేష్ ఖన్నా, అమితాబ్ బచ్చన్.. ఇలా అందరూ ఆమె వెంట పడ్డవారే. కొద్ది రోజులకు ఆమెకు జీవితం అంటే శూన్యం అని తెలిసిపోయి, నమ్మిన వాళ్ళు మోసం చేస్తే, తాగుడుకు బానిస అయ్యింది. ఒక దశలో కాలికి కురుపు లేచి, అది ఒళ్ళంతా ప్రాకి, ఏ శరీరం కోసం అయితే అంతమంది మగ వాళ్ళు పిచ్చిక్కెపోయారో, అదే శరీరమే కంపు వాసన కొడుతూవుంటే, ఆమెకు ఏదో వింత వ్యాధి వచ్చిందని, జనం ఆమెను తాళ్ళతో కట్టి, ముంబాయి వీధుల్లో లాగుకొంటూ తీసుకెళ్ళి ఆమె ఇంట్లో పడేస్తే ఆఖరుకు పక్కింటి వాళ్ళు ఆమె ఇంట్లోనుండి భరించలేనంత కంపు వస్తోందని కంప్లైంట్ చేస్తే, కార్పొరేషన్ వాళ్ళు వచ్చి 3 రోజుల క్రితమే చనిపోయిన ఆమెను చూసి తీసుకెళ్ళి పూడ్చేశారు. అయితే అందం, ప్రఖ్యాతి అనేవి విజయం కావన్నమాట !_*
              🔥🔥🔥
*_మరోసారి మరొకరు “విజయమంటే అధికారం” అని అన్నారు.. ”అయితే కాగితం మీద ఈ దేశాన్ని పాలించిన ప్రధానమంత్రుల పేర్లు అన్నీ వ్రాయండి !” అని అంటే వున్న 50 మందిలో 39 మంది అందరు ప్రధానుల పేర్లూ వ్రాయలేకపోయారు.!_* 
             🪷🪷🪷
*_అనంతపురంలో  ఒకప్పుడు రాష్ట్రపతిగా వెలిగిన సంజీవరెడ్డి గారి ఇంటిదగ్గర ఇపుడు పిచ్చిమొక్కలు పెరుగుతున్నాయి, పందులు దొర్లుతున్నాయి. విజయం అంటే అధికారం కాదు అన్న మాట._*
              🩸🩸🩸
*_చివరగా ఆదే ప్రొఫెసర్ భారత్ లో మరో యూనివర్సిటీలో యువతీ, యువకులను ఇదే ప్రశ్న వేశారు - “విజయం అంటే ఏమిటి ?” అందరూ మౌనంగా వుంటే అపుడు ఆయన అన్నారు, “మీ అవ్వ తాతల పేర్లు మీకు తెలుసా ?” అందరూ 'తెలుసు’ అన్నారు. “వాళ్ళ అవ్వ, తాతల పేర్లు తెలుసా ?” అని అడిగితే అయిదారు మంది “తెలుసు” అన్నారు. “వాళ్ళ అవ్వ తాతల పేర్లు తెలుసా ?”_*
*_‘తెలియదు’ అన్నారు._*
             ♨️♨️♨️
*_అపుడు ప్రొఫెసర్ గారు “శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, బుద్ధుడు, ఆదిశంకరుడు అందరూ… ”ఓ, తెలుసు !” అని ముక్తకంఠంతో బదులిచ్చారు._* 
              🌻🌻🌻
*_”మీకు మీ స్వంత అవ్వ తాతలు గుర్తులేరు కానీ మీరు ఎన్నడూ చూడని వీళ్ళంతా ఎలా గుర్తుకున్నారు ?” అని అడిగినపుడు పద్మిని అనే ఒక యువతి, ప్రొఫెసర్ గారు అంతదాకా చేసిన గొప్ప ఉపన్యాసానికి చాలా ఎమోషనల్ అయ్యి కళ్ళలో నీరు తిరుగుతుండగా ఇలా అంది : “సార్, మీ ప్రశ్నకు నేను జవాబు చెపుతాను._*

*_మాకు మా పూర్వీకుల పేర్లు తెలియకపోవడం, రాముడు, కృష్ణుడు, బుద్ధుడి పేర్లు ఇంకా గుర్తువుండటానికి కారణం ఇదే.. "తమ కోసం కాకుండా సమాజ హితం కోసం తపించిన ఋషులు, మునులు చిరంజీవులు అయ్యారు.!"_*
              🌷🌷🌷
*_తమ కోసం, తమ కుటుంబం కోసం మాత్రమే జీవించేవారిని ఈ లోకం మరచిపోతుంది. ఇతరులకోసం జీవించేవారిని ఈ లోకం ఎప్పటికీ గుర్తుకుపెట్టుకొనేవుంటుంది. ఇదే విజయం అంటే !”_*
               🦚🦚🦚
*_”నా గురించి నేను దు:ఖించక పోవడమే నా ఆనందానికి కారణం !” అని 2600 ఏళ్ళ క్రితం గౌతమ బుద్ధుడు చెప్పిన మాట. “ఇతరులకోసం జీవించేవారే నిజంగా జీవించినట్టు., అలా చేయని ఇతరులు జీవించివున్నా మరణించినట్టే లెక్క. '' Only they live who live for others, the others are more dead than alive" అని స్వామి వివేకానంద 1896 లో అన్న మాట ఇదే !!_*       
              🔥🔥🔥
*_🪷 రేపటి తరానికి బతుకు, భద్రతలతోపాటు భారతీయత కూడా నేర్పండి ప్లీజ్..._*
🙏🇮🇳🎊🪴🦚🐍🔱⚜️

Story జీవిత సత్యం

 *꧁꧂𒈞★

           *_👵🏼జీవిత సత్యం👦🏻_*

█▓▓▓▓▓▓▓▓▓▓▓▓▓▓▓▓▓▓▓▓█

*_ఒక చిన్న గ్రామంలో ఒక ముసలి అవ్వ, ఆమె మనవడు కలిసి ఒక చిన్న గుడిసెలో జీవించేవారు. ఒక రోజు ఆమె వంట చేస్తుండగా, మనవడు ఆమె దగ్గరికొచ్చాడు. "నానమ్మ! ఈ మధ్య నాకు ఒంట్లో అస్సలు బావుండట్లేదు, తలనొప్పి, కడుపు నొప్పి, జ్వరం అన్నీ ముకుమ్మడిగా బాధిస్తున్నాయి. స్కూల్‌లో కుడా నాకు మార్కులు తక్కువుగా వస్తున్నాయి, ఉపాధ్యాయులు తిడుతున్నారు, స్నేహితులు నాతో సరిగా మాట్లాడట్లేదు" అని తన బాధలన్నింటినీ ఏకరువు పెట్టసాగాడు_.*

*_అవ్వ తన మనవడికి ఎలాగైనా జీవిత సత్యాన్ని వివరించాలని, "చూడు నాన్నా! నువ్వు ఈ ఉడకని, వండని బియ్యాన్ని అలాగే తినగలవా?" అని అడిగింది. "ఛీ. అస్సలు తినలేను" అన్నాడు మనవడు. "మరి కేవలం నీళ్ళు త్రాగి జీవించగలవా?" అని నానమ్మ అడగ్గా "లేదు" అని జవాబిచ్చాడు మనవడు. "కూరలో వేసే కారం ఒక్కదాన్నే తిని కడుపు నింపుకోగలవా? మళ్ళీ అడిగింది నానమ్మ. "అమ్మో! నావల్ల కాదు" చెప్పాడు మనవడు. "మరి ఉప్పు" అని అడిగిన నానమ్మను "లేదు నానమ్మ. కాని ఇవన్నీ ఎందుకడుగుతున్నావు?" అని ఎదురు ప్రశ్నించాడు మనవడు._*

*_"బాబూ! బియ్యం, నీరు అన్నీ కలిస్తే అన్నం. ఉప్పు, కారం, కూరగాయలు కలిస్తే కూర అవుతాయి కదా! అదే విధంగా బాధ, సంతోషం, కోపం, శాంతం.... ఇలా అన్నీ కలిస్తేనే అది జీవితమవుతుంది. ఇదే జీవిత సత్యం. దేవుడికి ఎవరికి, ఏమి, ఎప్పుడు ఇవ్వాలో అన్నీ తెలుసు._*

*_మనం మన జీవిత స్ధితి గతులను మెరుగుపరుచుకునేందుకు ప్రయత్నించాలి. ప్రతిఫలం మాత్రం దేవుడికే వదిలేయాలి. ఆయన ఏది ఇస్తే దానికి తలవంచి స్వాగతించాలి. నీకూ ఇలాగే మంచి రోజులూ ఉంటాయి, చెడు రోజులూ ఉంటాయి" అని జీవిత సత్యాన్ని మనవడికి వివరించింది నానమ్మ_.*
         


*░▒▓█

ఇంటికి_పెద్దదిక్కు_వుండాలి, అలాగే పెద్ద వారు చెప్పింది వినాలి* *అలా కాదు అంటే, మహాభారతం లో ఏం జరిగింది?

 *ఇంటికి_పెద్దదిక్కు_వుండాలి, అలాగే పెద్ద వారు చెప్పింది వినాలి*
*అలా కాదు అంటే, మహాభారతం లో ఏం జరిగింది?* 
ఇంటికి  - పెద్దదిక్కు  వుండాలి అంటారు...... ఎందుకంటే నాలుగు మంచి మాటలు చెప్పడానికి మరియు ఎవరైనా తప్పు చేస్తే ఖండించడానికి........ మాకు పెద్ద దిక్కే వద్దు, మంచి చెప్పే వాళ్లు వద్దు అని అంటే ఆ కుటుంబం ఎటుపోతుంది ?........
కళ్లు గానక ఊబిలోనికి కూరుకుపోతారు.........

ఇదే దుర్యోధనుని విషయంలో జరిగింది. దుర్యోధనునికి  -  తల్లిదండ్రులు ప్రేమ వలన చెప్పలేకపోయారు, విదురుడు మంత్రిత్వం వలన చెప్పలేక పోయాడు, భీష్ముడు పాపం తాత గారు, చనువు ఎక్కువ అయినా ఎన్నో సార్లు చెప్పి చూశాడు కానీ ఆయన్నీ లెక్క చేయలేదు.. చివరికి సర్వం రాజ్యమే కూలిపోయింది..

పెద్దలు లేని సంసారం, కుటుంబం ఏమవుతుందో తెలుసుకోవాలి..
నూరుగురు కౌరవులు ఏమయినారో మనం గుర్తుంచుకోవాలి, ధర్మాన్ని చెప్పేవాడు ఒక్కడైనా వుండాలి, 
అదే ధృతరాష్ట్రుని గొప్పతనం...
ధృతరాష్ట్రుడు విదురుడ్ని ప్రక్కన బెట్టుకొన్నాడు, అందుకనే ఆయనకు శ్రీకృష్ణ విశ్వరూప దర్శనం లభించింది.
అదే శకుడ్ని దగ్గర పెట్టుకొన్న దుర్యోధనడు యొక్క స్థితి మనకు తెలుసు..

దుర్మార్గుడైనా సరే ఓ మహాత్ముడ్ని, మంచి వాడ్ని చెంత పెట్టుకోవాలి.. దీనిని మనం బాగా పట్టుకోవాలి.
అదే ధర్మరాజు విషయంలో చూడండి.. అందరి మాట విన్నాడు, ఆయన మాట ఆయన తమ్ముళ్లు విన్నారు, ధర్మ ప్రవర్తనతో బ్రతికారు, 
దుర్యోధనుడు ఎవ్వరి మాట వినలేదు, తల్లిదండ్రుల మాట వినలేదు, గురువుల మాట వినలేదు, పెద్దల మాట వినలేదు, శ్రేయోభిలాషుల మాట వినలేదు, భగవంతుడి మాట కూడా వినలేదు చివరికి ఏమైయాడు?

మంచి చెప్పే వాళ్లను బ్రతిమలాడి కోనైనా తెచ్చుకోవాలి."అయ్యా మీరు మార్గ నిర్ధేశకులుగా ఉండండి, అధ్యక్షులుగా వుండండి, పెద్దలుగా వుండండి మాకు!" అని ప్రాధేయపడి వుంచుకోవాలి. పెద్దవాళ్లను వుంచుకున్నందు వలన కుటుంబాలకు, సంస్థలకు, సభలకు గౌరవం లభిస్తుంది,చెడ్డవాళ్లను డబ్బులు ఇచ్చి అయినా వదిలించుకోవాలి అంటారు.. రాజు చెడ్డవాడు అయినా మహా మంత్రి మంచివాడుగా, ధర్మం చెప్పేవాడుగా వుండాలి.. అప్పుడే ఆ రాజు, ప్రజలు పది కాలాలు పాటు చల్లగా వుంటారు.. ధర్మం చెప్పే పెద్దలు లేనందువలన లేదా చెప్పినా వినకపోవడం వలన సమాజం దెబ్బతింటుంది.

ఎవడికి వాడు నేనే పెద్ద అంటే ఎలాగా? 
అలాంటి జ్ఞానవంతులు వుంటేనే ఒక్కోసారి పొరబాట్లు, తప్పులు జరిగిపోతూ వుంటాయి..

అయ్యా శ్రీకృష్ణా! నేను ఏమి తప్పుజేసానని? అని భీష్ముడు శ్రీకృష్ణుల వారిని అడుగుతాడు...
"ఓ తప్పు జరిగేచోట పెద్దలు వుండటమే తప్పు" అని అంటాడు. ఓ తప్పును చూస్తూ ఖండించకుండా, అక్కడ నుంచి వెళ్లిపోకుండా మౌనం వహించి చూస్తూ వుండటమే భీష్ముడు చేసిన తప్పు. ద్రౌపది వస్త్రాపహరణం సమయంలో భీష్ముడు ఏమీ చేయలేక అక్కడే వుండిపోయాడు..
అదే విదురుడు చూడకుండా వెళ్లిపోయినాడు....
కావున పెద్దలు ఓ తప్పు జరిగిన చోట వుంటే ఆ పాపం వారి ఖాతాలో కూడా వేస్తారు. అందువలన చెప్పిన మాట విననప్పుడు పెద్దలు ఆ స్థలం నుంచి వెళ్లిపోతారు.

🚩సర్వేజనాః సుఖినోభవంతు🚩

🌼🕉🕉🌼
Forwarding Good Msg
 Recd.from Other Group 
🙏🇮🇳🇮🇳🙏

100 రోజుల bhagavadgeetha life coaching వీడియోలు 14 పార్ట్స్

 https://youtube.com/playlist?list=PLBGjn7v7GaBvcaNTHN50xzIHXjaKMjTD8&si=0Z4fucRlJlIzEMzC


100 రోజుల bhagavadgeetha life coaching వీడియోలు 14 పార్ట్స్


Class-10 day*

 *Class-10 day*

 రెండవ అధ్యాయం 14వ శ్లోకంలో  అనిత్యములైన సుఖ, దుఃఖాల సహింపుము.

నువ్వు ఎందుకు మరణించిన మరణించబోయే వారి గురించి దుఃఖ్ఖిస్తావు.  దేహము పడిపోయిన జీవాత్మ చనిపోదు కేవలం చనిపోయేది, పడిపోయేది శరీరం మాత్రమే. కానీ శరీరము ఏమీ చేయలేదు. జీవాత్మ శరీరంలో లేకుండా ఆ శరీరం ఒక్కటే ఏమి చేయలేదు.

ఎవరైనా చనిపోతే గనుక  దుఃఖం ఎందుకు కలుగుతుందంటే వారు ఎన్నాళ్ళో మనతోనే కలిసి జీవించి ఉంటారు. మనతో సరదాగా జీవితాన్ని గడిపి ఉంటారు. మనల్ని నవ్వించుంటారు, ఏడిపించి ఉంటారు, నాతో సరదాగా ఉండిండిరి అన్నటువంటిది తలుచుకుని మరీ ఏడుస్తూ ఉంటారు. ప్రాణం లేని ఆ శరీరము ఇంతకుముందు లాగే లేచి నిలబడి నవ్వించడం, ఏడిపించడమో, సరదాగా ఉండటం చేయలేదు.  ఎందుకని ఆ శరీరంలో అవన్నీటిని ఇన్నాళ్లు నిన్ను నవ్వించిన వాళ్ళు, ఏడిపించిన వాళ్ళు, సరదాగా గడిపిన వాళ్ళు, నీతో కలిసి జీవించిన వాళ్ళు ఆ శరీరంలో ఈ ప్రస్తుతానికి లేరు. ఆ శరీరంలో ఆ యొక్క జీవాత్మ ఉన్నప్పుడే ఆ శరీరమును ఉపయోగించుకొని ఆ జీవాత్మ ధరించినటువంటి దేహానికి మాత్రమే పతనం ఉంటుంది. 
ధర్మాలు అన్నీ కూడా అంటే ఎదగడం, మార్పు చెందడం,  నశించడం. ఇక్కడ శరీరంలో ఉన్నంతవరకే ఆ దేహానికి దాని వలన చలనం వస్తుంది అది పనిచేస్తుంది.


 అదేవిధంగా జీవాత్మ దేహం నుండి విడిపోయిన తర్వాత ఇంకొక దేహాన్ని తీసుకుంటూ ఇంకొక దేహాలు తీసుకొని తర్వాత యవ్వనాన్ని ఒక పొందుతుంది. అదేవిధంగా వృద్ధాప్యాన్ని పొందుతుంది, మరణానికి చేరుపోయి మళ్లీ పునః ప్రారంభం చేస్తుంది. మరణించడం కూడా అంటే దేహం నుంచి విడిపోయి ఇంకొక దేహాన్ని తీసుకోవడం కూడా ఇంకొక స్టేజ్ మాత్రమే.  అది ఈ జన్మలో సంపాదించుకున్న సంస్కారాలు చేత అనువైనటువంటి దేహాన్ని, ఏ దేహంలో అయితే పాప పుణ్యం ఇప్పుడు చేసుకున్న అనుభవించడానికి వీలుగా ఉంటుందో అటువంటి దేహాన్ని వెతుక్కుంటుంది. కనుక ఈ యొక్క నువ్వు ఎవరి గురించి ఏడుస్తున్నావో వారుకి చావు లేదు. ఎందుకంటే వాళ్ళ శరీరం మాత్రమే పతనం అయిపోతుంది.

 ఎందుకు మనం ఏడవకూడదు అంటే చూడండి.. శరీరం అనేది ఇరవై నాలుగు సంఖ్యతో కూడినటువంటి 24 తత్వములు మరియు దానికి సాక్షి అయినటువంటి ఆత్మ గురించి బోధించినటువంటి అధ్యాయం. అంటే 24 ప్రకృతి తత్వముల చేత ఈ భౌతిక వస్తువులు ఏర్పడ్డాయి. మన శరీరం కూడా ఈ యొక్క భౌతిక వస్తువుల యొక్క ధర్మం ఏంటంటే మార్పు చెందడం, పెరగడం, కృషించిపోవడం, నశించి పోవడం. ఇక్కడ ఈ శరీరము మీ జ్ఞానేంద్రియాలు ఏ విషయంలో అయితే అందుతాయో నువ్వు ఈ లోకంలో జ్ఞానేంద్రియాలుతో ఏ విషయాలనైనా చూడండి ఆ విషయాలు ఇంద్రియ విషయాలు మనస్సుకు సుఖాన్ని దుఃఖాన్ని కలిగిస్తూ ఉంటాయి. 

మన కళ్ళతో ఒక అద్భుతమైనటువంటి దృశ్యాన్ని చూస్తే కనుక మనకు సంతోషం కలుగుతుంది. మన మనసుకు సుఖం కలుగుతుంది. అదే ఒక భయంకరమైనటువంటి దృశ్యాన్ని చూస్తే అదే మన శరీరానికి మన చర్మానికి నొప్పి కలిగించే స్పర్శ తగిలితే మనసుకు దుఃఖం కలుగుతుంది. విషయాల వల్ల మనసులో సుఖము దుఃఖము కలుగుతుంది. 

 విషయ వస్తువులు, ప్రపంచక విషయాలన్నీ కూడా మన మనసులో సుఖదుఃఖాలను కలిగిస్తాయి. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందేమిటంటే ఇవన్నీ కూడా అంటే ఇంద్రయాలకు అందే ఏ విషయమైనా సరే ఉత్పత్తి వినాశనములు కాబట్టి వస్తువులు కూడా అవి వస్తూ ఉంటాయి. పోతూ ఉంటాయి. ఏ వస్తువులు కూడా అవి మీ జీవితంలో ఏదో ఒకటి కలిగించేవే. 

ఈ పాయింట్ జాగ్రత్తగా వినండి ఈ భౌతిక వస్తువులు కలిగించే సుఖముగానీ దుఃఖముగానీ చాలా పరిమితంగా ఉంటుంది. చాలా అశాశ్వతంగా ఉంటుంది. చాలా కొద్దికాలం మాత్రమే ఉంటుంది. ఇవి అలా వచ్చి అలా వెళ్ళిపోతాయి. ఎలాగంటే మీరు బాగా వేడినీళ్లు తీసుకోండి కొంతసేపట్లోనే ఉష్ణము తగ్గిపోయి శీతలంగా మారుతుంది. అదే ఒక మంచి ఐస్ వాటర్ ను తీసుకొని బాగా ఎండలో ఉంచితే కనుక కొంచెం సేపు లోనే ఆ సీతలత్వం కరిగిపోయి ఉష్ణానికి అంటే  తన అస్థితిని మార్చుకుంటుంది. అంటే ఏ విధంగా చల్లదనం గాని వేడి గాని వాటి ప్రభావం కొంతసేపు మాత్రమే ఉంటుంది. ఎందుకంటే భౌతిక వస్తువు యొక్క ధర్మమే అలాంటిది. అదే విధంగా మనకు గనుక బాహ్య విషయాలను బాధ వస్తువులతో కానీ మనుషులతో గాని ఏ వస్తువుతో గాని వాటి వల్ల కలిగే సుఖదుఃఖాలు ఎంతసేపు ఉంటాయి అంటే ఏ విధంగా వేడి కొంత సేపట్లో చల్లారిపోతుందో ఏ విధంగా చల్లదనం కొంతసేపట్లోనే వేడెక్కిపోతుందో అంతసేపు మాత్రమే ఉంటాయి. దీన్ని మనము ఏమి చేయలేము. నివారించలేము. అది భౌతిక వస్తువు లేక ధర్మం అలాంటిది కాబట్టి వీటిని తగ్గించవలసింది అంటారు. అంటే ఏంటి అంటే ఎవరో చనిపోయారని విపరీతమైనటువంటి దుఃఖంతో ఏడుస్తున్నావు. ఈ దుఃఖాన్ని సహించు అని భగవంతుడు అంటున్నాడు.

 ఎందుకు సహించాలి ఎందుకంటే నీవు జీవితాంతం ఏడుస్తూ  ఎంతటి వారినినైనా ఎంత ప్రేమించినా వ్యక్తులైన ప్రాక్టికల్గా మనం ప్రశ్నించుకుంటే వారు చనిపోయిన తరువాత ఎంత సేపు ఏడుస్తారు? మ్యాగ్జిమం ఒకరోజు చాలా ఘోరంగా ఏడుస్తారు. రెండో రోజు అంతే తీవ్రతతో దుఃఖం ఉండదు. మూడో రోజు ఇంకా తగ్గిపోతుంది. అలా 10, 15 రోజులు తర్వాత పూర్తిగా దుఃఖము తగ్గిపోయి యధావిధిగా వారి జీవితంలో కొనసాగుతూ ఉంటారు. అప్పుడప్పుడు గుర్తుకు తెచ్చుకొని కొంతసేపు దుక్కిస్తారు. అంటే ఇక్కడ చూడండి ఎంత చావు ఉన్నటువంటి భయంకరమైన విషయం జరిగిన కూడా అది ఎంత సేపు దుఃఖాన్ని కలిగిస్తుంది అంటే కేవలం దాని గురించి మనము దుఃఖిస్తున్నంత సేపు కేవలం కొంతసేపు మాత్రమే. కొంతకాలం మాత్రమే ఎందుకంటే భౌతిక వస్తువుల వల్ల శరీరంలో కావచ్చు శరీరం వల్ల కలిగే అనుభవాల వలన కావచ్చు ఈ యొక్క అనుభవాలు సుఖదుఃఖాలు అనేటివి టెంపరరీగా ఉంటాయి. చాలా లిమిటెడ్ టైం గా ఉంటాయి. అవి నిరంతరం సుఖాన్ని గాని నిరంతరం శాశ్వత దుఃఖాన్ని కలిగించవు. ఎంతటి వారైనా చనిపోతే మూడు రోజులు మాత్రమే ఆ దుఃఖము తగ్గిపోయి తర్వాత దుఃఖము ఉండదు.


నీ లోపల కలిగినటువంటి  దుఃఖముగాని,భయము గాని ఇవన్నీ చాలా చెడ్డవి. ఇవి ఏం చేస్తాయి అంటే నిన్ను అనాలోచితంగా నిర్ణయాలు తీసుకునేటట్టు చేస్తాయి. ఒక ప్రాణానికి ప్రాణంగా ప్రేమించినటువంటి ప్రియుడు చనిపోయినాడు అని ఆ ప్రియురాలు ఆ దుఃఖాన్ని కొంచెం కూడా భరించలేక నా జీవితమే వ్యర్థం అని చెప్పేసి తాను కూడా ఆత్మహత్య చేసుకుంటూ ఉంటారు. ఆ దుఃఖం ఆలోచించకుండా చేసి ఆ యొక్క విపరీతమైనటువంటి దుఃఖం వలన ఆమె తన యొక్క జీవితాన్ని అంతం చేసుకోవడానికి నిర్ణయం తీసుకుంది. ఎప్పుడైతే మన హృదయంలో భావోద్వేగం ఉంటుందో ఇమ్బ్యాలెన్స్ ఉంటుందో అప్పుడు కచ్చితంగా మనము చాలా విచిత్రమైన, ఘోరమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుంటూ ఉంటాము.

ఇక్కడ అర్జునుడు తన యొక్క కర్తవ్యం అయినటువంటి యుద్ధాన్ని చేయను అని డిసైడ్ చేసుకున్నాడు. దేని వలన ఆ యొక్క మా వాళ్లు చనిపోతారు అన్నటువంటి భయం చేత, ఆ దుఃఖము చేత..  ఇక్కడ భగవంతుడు దుఃఖించకూడదు అంటే ఇక్కడ దుఃఖించుకు అని చెప్పలేదు. సహించు అంటున్నాడు అంటే దాన్ని తట్టుకో..  తట్టుకోమని చెబుతున్నాడు.  ఎందుకంటే  ఒకవేళ నువ్వు తట్టుకోలేక పోతే ఆ దుఃఖము నిన్ను విపరీతమైన దుఃఖానికి గురిచేసి, నీవు తప్పుడు నిర్ణయాలు తీసుకునేటట్టు చేస్తుంది. నీ జీవితంలో నీ కర్తవ్యం మరుగున పడేటట్లు చేస్తుంది. ఎంతో మంది తమ  ప్రియమైన వాళ్ళు చనిపోయారని జీవితాన్ని నాశనం చేసుకుని జీవిస్తూ ఉంటారు. ఇటువంటివి జరగకుండా నీ ధర్మాన్ని కొనసాగించడానికి నీవు కచ్చితంగా భౌతిక వస్తువుల వలన సుఖంగానీ దుఃఖం కానీ కలిగితే దాన్ని నువ్వు తట్టుకోవాల్సి ఉంటుంది.  కొంతమంది ఉద్యోగం పోయింది అనుకోండి..  ఉద్యోగం పోయిన వెంటనే జీవితమే పోయిందని చెప్పేసి సూసైడ్ చేసుకుంటూ ఉంటారు. అలా సూసైడ్ చేసుకున్నటువంటి వారిని మనం చూస్తూ ఉంటాం.  కారణం ఏమిటంటే అది శాశ్వతం అనుకుంటారు. ఏదో జరగరాని అవమానం జరిగితే అది శాశ్వతంగా ఉంటుంది ఆ దుఃఖము లేదా అవమానములు అని చెప్పేసి ప్రాణాలు తీసుకుంటూ ఉంటారు. ఈ ప్రపంచంలో ఏది శాశ్వతము కాదు ఎందుకు అంటే ప్రపంచంలో మొత్తం 24 తత్వాలు అనేటువంటి భౌతిక పదార్థాలతో తయారయింది కాబట్టి ప్రపంచంలో ఏదీ కూడా శాశ్వతంగా దుఃఖాన్ని కానీ, శాశ్వతమైన సుఖాన్ని  ఇవ్వలేదు.  

భగవంతుడు ఏమి చెబుతున్నాడు అంటే భౌతిక విషయసంయోగాల వలన ఏదైనా సుఖం కానీ దుఃఖం కానీ  కలిగినప్పుడు దాన్ని తట్టుకో అని చెప్తున్నాడు.



మహాత్ములను కించపరిస్తుంటారు .వారిని వక్రీకరిస్తూ మనం మాట్లాడుకుంటే జాతికి నష్టమే కానీ మంచి జరగదు.  మహనీయులును అవమానిస్తే ఈ ప్రకృతి మనకు శాపం ఇస్తుంది. కాబట్టి ఎప్పుడూ కూడా వారిని ఆదర్శంగా తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ స్థిత ప్రజ్ఞతతో జీవించే వారి జీవితంలోకి ఏదైనా ఒక వస్తువు వచ్చిన వారి జీవితంలో ఒక వస్తువు పోయిన వారి వ్యక్తిత్వం స్థిరంగా ఉంటుంది. సత్య హరిచంద్రుడు ఉన్నాడు సత్యమే వరంగా తపస్సుగా జీవించాడు మరి సత్య హరిశ్చంద్రుడు తన భార్య పిల్లలు ఎవరికో అమ్మేశాడు అని నీచుడు అని అనగలుగుతామా మరి అంత విపత్కర పరిస్థితి వచ్చిన మహా చక్రవర్తి ఆయన మొత్తం సామ్రాజ్యం పోయిన చివరికి కాటికాపరి అయినా కూడా అతను ఆశయం వదలలేదు. ఎందుకంటే వారి వ్యక్తిత్వం చెదరినిది. ఎందుకంటే వారు ఆత్మతో జీవించారు.  సత్యము ఎరిగి జీవించారు. 


 మనం కూడా మామూలు కుటుంబాల్లో భార్యాభర్తలు నిరంతరం పెళ్లి చేసుకున్న మొదట్లో ఉన్నటువంటి సఖ్యత ఒక సంవత్సరం తర్వాత ఉండదు.  ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకుంటారు. పెళ్లయిన సంవత్సరానికి దెబ్బలాడుకుంటూ ఉంటారు.  కారణం ఏమిటి అంటే తాము ప్రేమించినప్పుడు వారి వ్యక్తిత్వం నచ్చి పెళ్లి చేసుకుంటారు. కానీ ఒక వ్యక్తి యొక్క  జీవితంలోకి ఒక విషయం రావడం వలన జీవితంలో ఒక దాన్ని కోల్పోవడం వలన మారిపోతూ ఉంటుంది. కొంతమందికి డబ్బు వచ్చిపోయింది అనుకోండి వెంటనే వారి యొక్క పర్సనాలిటీ చేంజ్ అయిపోతుంది. వ్యక్తిత్మే మారిపోతుంది.  చిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటారు. కొంతమందికి ఉన్న ఉద్యోగం గానీ, ఉన్న డబ్బు గాని పోయింది అనుకోండి వాళ్ళు కృంగిపోయి వింత వింతగా ప్రవర్తిస్తుంటారు. అంటే ఏంటంటే ఒక వస్తువు యాడ్ అయినప్పుడు ఒక వస్తువు జీవితంలో నుంచి పోయినప్పుడు మన పర్సనల్ వ్యక్తిత్వం చేంజ్ అయిపోతూ ఉంటుంది. అంటే మన వ్యక్తిత్వం ఎప్పుడు కూడా భౌతిక సంయోగాలకు సుఖదుఖాలకు లోనై ఉంటుంది. శుభాలు వచ్చినప్పుడు ఒక విధంగా ఉండటం, దుఃఖాలు వచ్చినప్పుడు మరొక విధంగా ఉండడం. ఇలా ఉన్నప్పుడు మన పర్సనాలిటీ మన వ్యక్తిత్వాలు ఎప్పుడు మారిపోతూ ఉంటాయి. ఎప్పుడైతే ఒక వ్యక్తి నచ్చి నీ జీవితంలోకి వస్తుందో ఆ వ్యక్తికి కొన్నాళ్ల తర్వాత నీ వ్యక్తిత్వం మారిపోతుంది అప్పుడే అభిప్రాయభేదాలు ఏర్పడుతాయి. నమ్మకం  కోల్పోవడానికి కారణం ఇదే అందుకే మీ జీవితములో ఏది కలిసిన, ఏది కోల్పోయినా నీ వ్యక్తిత్వాన్ని స్థిరంగా ఉంచుకో.. నీ పర్సనాలిటీని స్థిరంగా ఉంచుకోవడం దీన్ని స్వధర్మం అంటారు. సత్యహరిశ్చంద్రుడు ఏ విధంగా అయితే నా జీవితంలోకి ఏదైనా రాని నా జీవితంలో ఏదైనా కోల్పోయిన నేను ఏ విధంగా జీవించాలి అనుకుంటున్నాను ఒక ఆదర్శంగా అటువంటి జీవితాన్ని అటువంటి విధంగానే జీవిస్తాడు. 


నాకు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని దుఃఖాలు లొచ్చినా నీ వ్యక్తిత్వం స్థిరంగా ఉందో లేదో చూడు.  మన జీవితం బాగా ప్రాక్టికల్ గా గమనిస్తే ఉద్యోగం పోగానే మన పర్సనాలిటీ మారిపోతుంది. ఏదైనా ఒక చెడు సంఘటన జరగగానే మనం మారిపోతూ ఉంటాం. 


అందుకే భగవంతుడు చెబుతున్నాడు. ఏది లభించినా, ఏది కోల్పోయినా నీవు స్థిరత్వాన్ని కలిగి ఉండు. సుఖదుఃఖాలను సమానంగా కలిగి ఉండు.  ఆ స్వభావాన్ని మార్చకుండా సంయోగ వివేకం వల్ల మారిపోకుండా స్థిరత్వంగా ఉండగలిగితే అదే మోక్షస్థితి. అదే మోక్షానికి మార్గం.

Class-9 day* *ముఖ్యాంశాలు

 *Class-9 day*

*ముఖ్యాంశాలు*


**ఈరోజు మనం చెప్పుకోబోయే విషయం యావత్తు మానవాళికి కూడా కనివిప్పును కలిగించే అంశం. దేనిపైన అయితే ఆధారపడి మానవ జీవితం నడుస్తూ ఉంటుందో.. దేని గురించి తెలుసుకుంటే మన జీవితం ఉన్నఫలంగా పరివర్తనం చెందుతుందో.. అటువంటి అద్భుతమైనటువంటి విషయం గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. 

అన్ని భయాలకు మూలం ఏది? అది మనల్ని ఎలా నడిపిస్తుంది? దాని గురించి మన తెలుసుకుంటే ఏం జరుగుతుంది? మనం భగవద్గీత రెండవ అధ్యాయంలో ఉంటున్నాం.

 ఈరోజు మనం మూడు శ్లోకాలు గురించి మాట్లాడుకోబోతున్నాం. 

ఈ మూడు శ్లోకాల్లోని జీవితాన్ని మలుపు తిప్పివేసే అంశం దాగి ఉంది, రహస్యం దాగి ఉంది.

ఎప్పుడైతే అర్జునుడు కళ్ళ నీళ్లు పెట్టుకుని నేను ఇక యుద్ధము చేయలేను, నాకు ధర్మం ఏదో, అధర్మం ఏదో తెలియడం లేదు. నేను నిన్ను శరణాగతి పొందుతున్నాను దయచేసి నాకు బోధింపుము అని అర్జునుడు ప్రాధేయపడినప్పుడు భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్మ ఆయన యొక్క శరణాగతిని చూసి, ఇప్పుడే ఇతనికి జ్ఞానం బోధించగలిగినటువంటి సమయం ఆసన్నమైనది. ఎప్పుడైతే వ్యాకులతతో ధర్మసమూడత్వంతో కర్తవ్యమేంటో తెలియక, తనకు తాను సహాయం చేసుకోలేక ఎవరైతే ఉంటారో ఎవరైతే ఆ సమయంలో జ్ఞానం కోసం, మార్గం కోసం పరితపించుపోతూ  భగవంతుని శరణాగతి పొందుతారో అది జ్ఞానబీజం నాటడానికి అవసరమైనటువంటి పనికి వచ్చే సారవంతమైన భూమి అతని యొక్క హృదయం.
ఒక పంట బాగా పండాలంటే నేల సారవంతంగా విత్తనం  నాటడానికి చాలా సంసిద్ధంగా ఉండాలి. 

 జ్ఞానము అన్నటువంటి మహా వృక్షము మొలవాలంటే మనిషి యొక్క హృదయం శరణాగతి తోనూ, అర్థవంతమైనటువంటి వైరాగ్యంతోను ఉన్నప్పుడు మాత్రమే వాడికి జ్ఞానం బోధిస్తే అది చాలా బాగా పనిచేస్తుంది.

 సరిగ్గా అర్జునుడు అదే సిచువేషన్ లో ఉన్నాడు. ఇప్పుడు భగవంతుడు తన యొక్క జ్ఞాన బోధనను ప్రారంభం చేస్తూ ఉన్నాడు.

 భగవద్గీత *అశోచ్యా నన్వశోచ స్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే|*
*గతాసూ నగతాసూంశ్చ నానుశోచంతి పండితాః||*
రెండవ అధ్యాయంలో 11వ శ్లోకంలో ప్రారంభమవుతుంది.

సమస్థ ధర్మాలను, ధర్మాధర్మాలు అన్నిటినీ కూడా వదిలేసి ఎప్పుడైతే నన్ను మాత్రమే శరణు పొంది వేడుకుంటావో నీ యొక్క సమస్త పాపములను నేను ప్రక్షాళన చేసి, నీకు దుఃఖాన్ని దూరం చేసి, మోక్షాన్ని కలిగిస్తాను దుఃఖింప వలదు.

 చూడండి అర్జునుని యొక్క వైరాగ్యము, అర్జునుని యొక్క విషాదము లోనుంచి, ఏడుపు లోనుంచి భగవద్గీత ప్రారంభమైయెందుకు గాను భూమికాగా ఏర్పడింది.

చెడ్డ జన్మలొద్దు,చెడ్డ జీవితం వద్దు అని ఎవరైతే అనుకుంటారో వారికి ఒకటే ఒక ఛాయస్ ఉంది.
 వారిలో ఏదైనా చెడ్డ ప్రవర్తన దాగి ఉంటే, ఆ చెడ్డ ప్రవర్తన తెలుసుకొని, ఆ స్వార్థం గురించి తెలుసుకొని వారిలో ఉన్నటువంటి అన్యాయాన్ని, దుర్మార్గం గురించి తెలుసుకోవాలి... మంచిగా దాన్ని పరివర్తనం చేసుకోవడమే.  దీనికి మనకు కావలసింది భగవద్గీత.
 అందుకే మనకు భగవంతుడు భగవద్గీత అందిస్తున్నాడు. కాబట్టి ఒక దేహి దేహాన్ని కౌమారాన్ని యవ్వనాన్ని వృద్ధాప్యాన్ని పొందుతుందో దేహాన్ని వదిలేయడం.. ఇంకా దేహం పెరుగుతూ బాల్యం,  కౌమారం, వృద్ధాప్యం రావడం తర్వాత మళ్లీ ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ సైకిల్ కంటిన్యూగా జరిగిపోతుంది. ఇది అనివార్యము కాబట్టి అర్జున నువ్వు దేహాన్ని మాత్రమే చంపగలవు గాని అందులో ఉన్నటువంటి ఆత్మను కాదు. కాబట్టి ఇక్కడ ఎవరూ చచ్చిపోయే వాళ్ళు లేరు.

 దేహాన్ని పొందాల్సిన అవసరం లేకుండా మనం మోక్షజ్ఞానాన్ని పొందాలి. భగవద్గీత జ్ఞానం తెలుసుకోవాలి. ముక్తిని మనం పొందవలసి ఉంటుంది. 

 ఎప్పుడైతే మనము మనకు జన్మ వద్దు అని.. ఆనంద స్థితిని పొందాలి అనుకుంటే ఈ క్షణం నుంచి ఆలోచించాల్సి ఉంటుంది. నేను ఒక గంటలో చనిపోతే నేను ఏం చేస్తాను..  నేను దేనికి ప్రయారిటీ ఇస్తాను.. నేను దేన్నీ చేయడానికి ఇష్టపడుతున్నాను.. ఏం చేయాలనుకుంటున్నాను.. అని ఎప్పుడైతే ఆత్మ శోధన చేసుకుంటామో అప్పుడు కచ్చితంగా మీరు ఏం చేయాలో మీకు అర్థమవుతుంది. 

ఈ భగవద్గీత నీవు ఎలా జీవించాలో ఎలా జీవించకూడదో నీ లోపల  నుండి ఎలా డెవలప్ చేసుకోవాలని చెప్పాడు.  ధర్మసంస్థాపన పూర్తి చేయడం కోసం, దుర్మార్గులందర్నీ సంహరించడం కోసం తర్వాత ఆ దుర్మార్గం కాకుండా, అద్భుతమైన జ్ఞానాన్ని ప్రవర్తనను కలిగించడం ద్వారా ధర్మసంస్థాపన చేశాడు.

Class-8 day* *ముఖ్యంశాలు*

 *Class-8 day*

*ముఖ్యంశాలు*


1.నిన్నటి క్లాస్ లో మనం అర్జునుడు యుద్ధ విముఖుడు అవ్వడానికి కొన్ని బలమైనటువంటి కారణాలు చెప్పాడు. ఈ రోజు  సాంఖ్యయోగము గురుంచి గురువు గారు వివరించారు. సాంఖ్యయోగం అంటే సాంఖ్యం అంటే జ్ఞానం. సాంఖ్యం  అంటే సంఖ్య. మానవుడు శాశ్వతమైనటువంటి జ్ఞానాన్ని, సత్యాన్ని, ఆత్మను తెలుసుకోవడానికి ఎన్ని అనాత్మ పదార్థాలను తొలగించుకోవలసి ఉంటుందో ఆ అణాత్మ పదార్థాలను అంటే ఆత్మ కాకుండా ఉన్నటువంటి భౌతిక ప్రపంచంలోని ఎన్ని పదార్థాలను తొలగిస్తే సృష్టికి సాక్షిభూతమైనటువంటి ఆత్మజ్ఞానం పొందగలడ అని, ఇలా తొలగించాల్సినటువంటి పదార్థాలను కూడా లెక్కవేసి 24 పదార్థాలుగా నిర్ణయించడం జరిగింది. ఈ 24 పదార్థాలను, 24 తత్వాలను మనము వదిలేస్తే కనుక ఈ 24 తత్వాలకు సాక్షి భూతమైనటువంటి ఆత్మను మనం తెలుసుకోవచ్చు.
2. ఒక సంఖ్యతో ముడిపడి ఉంది ఈ జ్ఞానం. ఈ యొక్క ఆత్మను తెలుసుకునే జ్ఞానము తొలగించాల్సిన పదార్థాల సంఖ్యతో ముడిపడి ఉంది కాబట్టి ఈ 24 తత్వాలు, పంచభూతములు ఐదు, అదేవిధంగా పంచ జ్ఞానేంద్రియాలు, పంచకర్యాలు 15, పంచప్రాణాలు 20, మనస్సు, బుద్ధి,చిత్తం, అహంకారం మొత్తం 24 తత్వాలు ప్రపంచంలో ప్రతిదీ కూడా ఈ 24 ఇంటితోనే ఏర్పడుతుంది. కాబట్టి 24 ని మనం తొలగించుకుంటూ, వీటన్నిటిని కూడా నడిపిస్తున్నటువంటి ఆత్మను తెలుసుకోవడానికి ఒక జ్ఞానము చెప్పబడింది. ఆ యొక్క జ్ఞానం పేరే సాంఖ్య యోగము.
3. ఈ అధ్యాయం మొత్తం కూడా నిజానికి సంక్షిప్త భగవద్గీత అంటే భగవద్గీత మొత్తం సారాంశము. ఈ అధ్యాయంలో భగవద్గీతలో ఇదే చాలా పెద్దది 72 శ్లోకాలు వరకు ఉంటాయి. సాధన చేసుకోవడానికి ఈ అధ్యాయం ఒకటి చాలు చాలా అద్భుతమైనటువంటి విషయాలు, కర్మకు సంబంధించినటువంటి విషయాలు అన్ని రకాల యోగాలు కలగాల్సినటువంటి అధ్యాయం చాలా ముఖ్యమైనటువంటి అధ్యాయం.
4.భగవంతుని యొక్క గీతా జ్ఞానం అనేది ఈ అధ్యాయంలో రెండవ అధ్యాయంలో 11వ శ్లోకం నుంచి ప్రారంభమవుతుంది. ఈ శ్లోకము నుంచి భగవద్గీత బోధన ప్రారంభమవుతుంది.
5.అందరిని చూసేసరికి తన యొక్క బంధువులను, గురువులను, పుత్రులను, మేనమామలను, అందరిని చూసేసరికి అతనిలో కారుణ్యము కలిగి,మమకారం కలిగి, అదే విధంగా యుద్ధము వలన సంభవించు అనేక అనేక కులనాశనము, కుల ధర్మముల వినాశనము, వర్ణసంఖ్యము ఈ విషయాలన్నీ గుర్తొచ్చి ఇంత పాపము నామీద పడుతుంది, ఇక్కడ బాగా మనం గమనిస్తే కనుక ఇప్పుడు మనం ఈరోజు మాత్రం చెప్పు ప్రపంచంలోనే ప్రతి మనిషికి అవసరమైనటువంటి జ్ఞానం ఇక్కడ దాగి ఉంది. ఒక జీవన్మరణ స్థితి ఏర్పడినప్పుడు మనం సరైన విధంగా జీవితం తరించబోయే విధంగా శ్రేయోదాయకంగా ఏ విధంగా నిర్ణయాలు తీసుకుంటే మన జీవితం అత్యున్నత స్థాయికి చేరుతుందో చూడండి.. మనిషి యొక్క జీవితము ఇప్పుడు బాగోలేదు అంటే ఇప్పుడు ఘోరంగా ఉంది అంటే కచ్చితంగా ఎప్పుడో అతను తీసుకున్నటువంటి ఒక తప్పుడు నిర్ణయం కారణమై ఉంటుంది.  జీవితం మారింది ఎక్కడ నేను తప్పు చేశాను..  ఎక్కడ నిర్ణయం తీసుకోవడంలో నేను పొరపాటు పడ్డాను..  అని మీకు అర్థం అవుతుంది. మనం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.
6. మనకు కూడా అర్జునుని లాంటి దైన్యం వచ్చినప్పుడు జీవన్మరణ సమస్య వచ్చినప్పుడు కర్తవ్యం ఏంటో, ధర్మాధర్మాలు ఏంటో తెలియనప్పుడు మరి ఎలా ధర్మాన్ని ఎంచుకోవాలో, ఎలా సరైన నిర్ణయం తీసుకోవాలో మనకు కూడా తెలుస్తుంది. 7.మొట్టమొదట ఎంతో ఉత్సాహంగా రెండు సెనల మధ్యలో కూడా యుద్ధం చేయాలనే ఉత్సాహంతోనే కౌరవుల పైన పగా ప్రతీకారాలతోనే తన మనసును గట్టిగా చేసుకుని యుద్దానికి వచ్చాడు. యుద్ధంలో ఎవరెవరితో యుద్ధం చేయాల్సి ఉంటుందో కూడా బాగా తెలుసు. మరి అన్ని సంవత్సరాల నుంచి యుద్ధానికి బాగా ప్రిపేర్ అయ్యి.. తీర యుద్ధం చేసే సమయంలో అతనికి నేను యుద్ధం చేయబోయేది నా బంధువులతో నా, అన్నదమ్ములతో నా, గురువులతో నా, పినతండ్రులతో పెద్దలతో అని గుర్తు వచ్చి మనసు వికలమై ధనస్సు కూడా చేజారిపోతుంది. నాకు చాలా భయంకరమైన స్థితిగలుగుతుంది అని చెప్తూ ఉన్నాడు.  

8.అర్జునిలో ఎనలేని కృప కలిగి , ఈ యుద్దం చేసి నా అన్న వారందరినీ చంపుకుని పాపం చేయలేను. దీని కంటే పాపం మరొకటి ఉండదు. నాలో కలిగిన ఈ దుర్భలత్వన్ని పోగొట్టు మార్గం నువ్వే బయట పడవేయి నిన్నే శరణు కోరుతున్నాను అని భగవంతునికి శరణాగతి అయిపోయాడు. 
9. ఈశ్వరునికి గానీ, గురువుకు గానీ, తనలో ఉన్న ఆత్మకు గానీ శరణాగతి అయినపుడు తప్పక తన సమస్యకు పరిష్కారం దొరికి శాంతి చేకూరుతుంది. 
10. ఎడారిలో ఒక బాటసారి అనే ఒక కథ ద్వారా పరోపకార బుద్దిని  కలిగి ఉండాలి అనే సందేశం ఇవ్వడం చాలా గొప్ప అనుభూతిగా ఉంది.

సమయాభావం వల్ల పూర్తి నోట్ రాయలేక పోతున్నాను. మనిషి జీవితంలో ఎమోషనల్ గా ఉన్నపుడు మనసును న్యూట్రల్ స్థితిలోకి తెచ్చుకొని అంటే శాంతి స్థితిలోకి తెచ్చుకొని డిసిజన్ తీసుకుంటే వారి జీవితం గొప్పగా ఉంటుంది.

భగవద్గీత - జీవన్మరణ స్థితి లో సరైన నిర్ణయాలు ఎలా తీసుకోవాలి

 *****************************************
భగవద్గీత - జీవన్మరణ స్థితి లో సరైన నిర్ణయాలు
                  ఎలా తీసుకోవాలి 
                  Day 8 - శ్లోకాలు
*****************************************

-----------------------------------------------------
👉    భగవద్గీత అధ్యాయం 2 - శ్లోకం 11
-----------------------------------------------------
అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే ।
గతాసూనగతాసూంశ్చ నానుశోచంతి పండితాః ।।

తాత్పర్యం:
----------
భగవంతుడు ఇలా అన్నాడు : నీవు ప్రాజ్ఞతతో కూడిన మాటలు మాట్లాడుతున్నావు కానీ శోకింపకూడని దాని కోసం శోకిస్తున్నావు. ప్రాణములు పోయిన వారి గురించి గానీ బ్రతికున్న వారి గురించి గానీ, పండితులైనవారు శోకింపరు.

-----------------------------------------------------
👉    భగవద్గీత అధ్యాయం 1 - శ్లోకం 24
-----------------------------------------------------
ఏవముక్తో హృషీకేశో గుడాకేశేన భారత ।
సేనయోరుభయోర్మధ్యే స్థాపయిత్వా రథోత్తమమ్ ।।

తాత్పర్యం:
----------
సంజయుడు ఇలా అన్నాడు: ఓ ధృతరాష్ట్రా, ఈ విధంగా, నిద్రని జయించినవాడైన, అర్జునుడు కోరిన విధంగా, శ్రీ కృష్ణుడు ఆ వైభవోపేతమైన రథమును రెండు సైన్యముల మధ్యకు నడిపించి నిలిపెను.

-----------------------------------------------------
👉    భగవద్గీత అధ్యాయం 2 - శ్లోకం 1
-----------------------------------------------------
తం తథా కృపయావిష్టమశ్రుపూర్ణాకులేక్షణమ్ ।
విషీదంతమిదం వాక్యమువాచ మధుసూదనః ।। 

తాత్పర్యం:
----------
సంజయుడు పలికెను: జాలి నిండినవాడై, శోకతప్త హృదయంతో, కంటినిండా నీరు నిండిపోయున్న అర్జునుడిని చూసిన, శ్రీ కృష్ణుడు, ఈ విధంగా పలికెను.

-----------------------------------------------------
👉    భగవద్గీత అధ్యాయం 2 - శ్లోకం 2
-----------------------------------------------------
కుతస్త్వాకశ్మలమిదం విషమే సముపస్థితమ్ ।
అనార్యజుష్టమస్వర్గ్యమ్ అకీర్తికరమర్జున ।। 

తాత్పర్యం:
----------
శ్రీ భగవానుడు ఇట్లనెను: ప్రియమైన అర్జునా, ఇలాంటి క్లిష్ట సమయంలో ఈ చిత్త భ్రాంతి ఎట్లా దాపురించింది? ఇది గౌరవనీయ వ్యక్తికి తగదు. ఇది ఉత్తమ లోకాలకు దారి తీసేది కాకపోగా, అపకీర్తి పాలుజేస్తుంది.

-----------------------------------------------------
👉    భగవద్గీత అధ్యాయం 2 - శ్లోకం 3
-----------------------------------------------------
క్లైబ్యం మా స్మ గమః పార్థ నైతత్త్వయ్యుపపద్యతే ।
క్షుద్రం హృదయదౌర్బల్యం త్యక్త్వోత్తిష్ఠ పరంతప ।। 

తాత్పర్యం:
----------
ఓ పార్థా, ఈ యొక్క పౌరుషహీనత్వానికి లోనుకావటం నీకు తగదు. ఓ శత్రువులను జయించేవాడా, ఈ నీచమైన హృదయ దౌర్బల్యం విడిచిపెట్టి, యుద్ధానికి లెమ్ము.

-----------------------------------------------------
👉    భగవద్గీత అధ్యాయం 2 - శ్లోకం 7
-----------------------------------------------------
కార్పణ్యదోషోపహతస్వభావః 
పృచ్ఛామి త్వాం ధర్మసమ్మూఢచేతాః ।
యచ్ఛ్రేయః స్యాన్నిశ్చితం బ్రూహి తన్మే 
శిష్యస్తేఽహం శాధి మాం త్వాం ప్రపన్నమ్ ।।

తాత్పర్యం:
----------
నా కర్తవ్యం ఏమిటో నాకు తెలియటంలేదు మరియు ఆందోళన, పిరికితనము నన్ను ఆవహించాయి. నేను నీ శిష్యుడను, నీకు శరణాగతుడను. నాకు నిజముగా ఏది శ్రేయస్కరమో దానిని ఉపదేశించుము.

-----------------------------------------------------
👉    భగవద్గీత అధ్యాయం 2 - శ్లోకం 8
-----------------------------------------------------
న హి ప్రపశ్యామి మమాపనుద్యాద్
యచ్ఛోకముచ్ఛోషణమింద్రియాణామ్ ।
అవాప్య భూమావసపత్నమృద్ధం
రాజ్యం సురాణామపి చాధిపత్యమ్ ।।

తాత్పర్యం:
----------
నా ఇంద్రియములను శుష్కింప చేస్తున్న ఈ శోకమును పోగొట్టే ఉపాయమేదీ తోచటం లేదు. నేను ఈ భూమిపై సుసంపన్నమైన, ఎదురులేని రాజ్యాన్ని గెలిచినా, లేదా దేవతల వంటి ఆధిపత్యము పొందినా, ఈ శోకమును తొలగించుకోలేను.

-----------------------------------------------------
👉    భగవద్గీత అధ్యాయం 4 - శ్లోకం 39
-----------------------------------------------------

శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరః సంయతేంద్రియః ।
జ్ఞానం లబ్ధ్వా పరామ్ శాంతిమచిరేణాధిగచ్ఛతి ।। 

తాత్పర్యం:
----------

గాఢమైన శ్రద్ధావిశ్వాసాలు కలవారు మరియు తమ మనో-ఇంద్రియములను నియంత్రణ చేసే అభ్యాసము చేసినవారు దివ్య ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందుతారు. ఇటువంటి శ్రేష్ఠమైన అలౌకిక జ్ఞానంతో వారు అతిత్వరగా శాశ్వతమైన పరమ శాంతిని పొందుతారు.

భగవద్గీత - నీతో నువ్వు చేయాల్సిన యుద్ధం

 *****************************************
    భగవద్గీత - నీతో నువ్వు చేయాల్సిన యుద్ధం
                        Day 6 - శ్లోకాలు
*****************************************

-----------------------------------------------------
👉    భగవద్గీత అధ్యాయం 1 - శ్లోకం 8
-----------------------------------------------------
భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయః | 
అశ్వత్థామా వికర్ణశ్చ సౌమదత్తిస్తదైవ చ ||

తాత్పర్యం:
----------
మీరును, భీష్ముడు, కర్ణుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ, వికర్ణుడు మరియు భూరిశ్రవుడు - వీరందరూ ఎప్పటికీ యుద్ధములో విజయులే.

-----------------------------------------------------
👉    భగవద్గీత అధ్యాయం 1 - శ్లోకం 11
-----------------------------------------------------
ఆయనేషు చ సర్వేషు యథాభాగమవస్థితాః |
భీష్మమేవాభిరక్షంతు భవంత స్సర్వ ఏవ హి ||

తాత్పర్యం:
----------
కావున, కౌరవ సేనానాయకులందరికీ, మీమీ వ్యూహాత్మక స్థానాలను పరిరక్షిస్తూ భీష్మ పితామహుడికి పూర్తి సహకారం అందించమని పిలుపునిస్తున్నాను.

భగవద్గీత - దుర్యోధనుడి జీవిత పాఠాలు

 *****************************************
     భగవద్గీత - దుర్యోధనుడి జీవిత పాఠాలు
                        Day 5 - శ్లోకాలు
*****************************************

-----------------------------------------------------
👉    భగవద్గీత అధ్యాయం 1 - శ్లోకం 1
-----------------------------------------------------
ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతా యుయుత్సవః |
మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ ||

తాత్పర్యం:
----------
ధృతరాష్ట్రుడు పలికెను: ఓ సంజయా, ధర్మభూమి అయిన కురుక్షేత్రంలో కూడియుండి, మరియు యుద్ధ కాంక్షతో ఉన్న నా పుత్రులు మరియు పాండు పుత్రులు ఏమి చేసిరి?

-----------------------------------------------------
👉    భగవద్గీత అధ్యాయం 1 - శ్లోకం 2
-----------------------------------------------------
దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా । ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్ ||

తాత్పర్యం:
----------
సంజయుడు పలికెను: సైనిక వ్యూహాత్మకంగా నిలిపి ఉన్న పాండవ సైన్యాన్ని చూచిన దుర్యోధనుడు తన గురువు ద్రోణాచార్యుడిని సమీపించి, ఈ విధంగా పలికెను.

-----------------------------------------------------
👉    భగవద్గీత అధ్యాయం 1 - శ్లోకం 3
-----------------------------------------------------
పశ్యైతాం పాండుపుత్రాణామ్ ఆచార్య మహతీం చమూమ్ ।
వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమతా ।। 

తాత్పర్యం:
----------
దుర్యోధనుడు అన్నాడు: గౌరవనీయులైన గురువర్యా! ద్రుపదుని పుత్రుడైన, ప్రతిభావంతుడైన మీ శిష్యుడిచే అత్యంత వ్యూహాత్మకంగా నిలుపబడిన ఈ పాండవుల మహా సైన్యాన్ని చూడుము.

-----------------------------------------------------
👉    భగవద్గీత అధ్యాయం 2 - శ్లోకం 62
-----------------------------------------------------
ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే |
సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే ||

తాత్పర్యం:
----------
ఎల్లప్పుడూ విషయాలను గురించే ఆలోచన చేసే వాడికి వాటిమీదే ఆసక్తి కలుగుతుంది. ఆసక్తి వలన కోరిక పుడుతుంది, కోరిక వలన కోపం కలుగుతుంది. 

-----------------------------------------------------
👉    భగవద్గీత అధ్యాయం 16 - శ్లోకం 4
-----------------------------------------------------
దంభో దర్పోఽభిమానశ్చ క్రోధః పారుష్యమేవ చ ।
అజ్ఞానం చాభిజాతస్య పార్థ సంపదమాసురీమ్ ।। 

తాత్పర్యం:
----------
ఓ పార్థా, దంభము, దురహంకారము, గర్వము, క్రోధము, మొరటుతనము, మరియు అజ్ఞానము అనేవి ఆసురీ స్వభావముకల వారి గుణములు.

మన జీవితాన్ని అద్భుతంగా జీవించాలి అంటే మనం జీవించే పద్ధతిని మార్చుకోవాలి.

 ఓం శ్రీ గురుభ్యోనమః. మన జీవితాన్ని అద్భుతంగా జీవించాలి అంటే మనం జీవించే పద్ధతిని మార్చుకోవాలి. మనసును,వాక్కును కర్మలను శుద్ధి చేసుకోవాలి. ఎవరిని వారే ఉద్దరించుకోవాలి.
      మనసును శుద్ధి చేసుకోవడానికి ఆలోచనలలో ప్రశాంతత, మృదుత్వం, మౌనం, ఆత్మ నిగ్రహం, ఉద్దేశ పవిత్రత ను అలవాటు చేసుకోవాలి.
      వాక్కుని శుద్ధి చేసుకోవడానికి ఉద్వేగం కలిగించనివి, కోపం పుట్టించనివి, ప్రయోజకరమైనవి, ఉదాహరణకు వేద శాస్త్ర పఠనం, సత్యం మాట్లాడటం, భగవద్గీతను చదవటం.
      శరీరంతో భగవంతుని గురువుని పెద్దవాళ్ళను సేవించడం, మానవసేవే మాధవ సేవ అనుకోవటం, మన కర్మలను శుద్ధి చేసుకోవాల్సి ఉంటుంది. స్వామి వివేకానంద గారు చెప్పినట్ల నిష్కామ కర్మలను చేస్తూ, జ్ఞానం సంపాదించుకోవాలి.
      రమణ మహర్షి గారు చెప్పినట్లు ప్రతి కర్మను భగవంతునికి అర్పించాలి.
      రవీంద్ర ఠాగూర్ గారు గీతాంజలి బుక్కులో భగవంతుడు ఒక కష్టపడి పని చేసే శ్రామికుడి చెమట చుక్కలో ఉన్నారు అని తెలియజేశారు.
    ఎవరైతే సహజంగా స్వభావాను గుణంగా పవిత్రీకరించుకొనటు వంటి కర్మల చేత నన్ను అర్ధిస్తాడో వాడు నా శ్రేష్ట భక్తుడు అని, నాకు పూజలు, యజ్ఞాలు, తపస్సులు  ఏవి అవసరం లేదు అని భగవద్గీతలో  తెలియజేశారు. మనం చేసే పనులు త్రికరణ శుద్ధితో చేస్తే మనం భగవంతునికి అత్యంత ప్రీతిపాత్రులము అవుతాము. మన జీవితం దివ్యంగా ఉంటుంది.
     🙏🙏🙏🙇‍♀️

పుత్రుడు లేని వారు చనిపోతే వారికి ఎవరు పిండ ప్రదానం చేయాలి..

 పున్నామ నరక త్రాయతే ఇతి పుత్రః


పున్నామ నరకం నుండి తప్పించు వాడే పుత్రుడు.

తండ్రి బీజమే భార్యగర్భం లో పుత్రుడిగా జన్మ పొందితుంది. అంటే తండ్రి ఆత్మ తేజస్సే, తండ్రి ప్రతి రూపమే పుత్రుడు. తండ్రి ఆస్తికి, గుణాలకు, కీర్తికి..... వారసుడు పుత్రుడే.

అందుకే శ్రద్ధ కర్మలు చెయ్యడానికి పుత్రుడే అర్హుడు.

కూతురు కాదు.

ఒకవేళ కొడుకులు లేకపోతే.... శాస్త్రం చెప్పిన ప్రత్యామ్నాయ్యం...

శాస్త్రం ప్రకారం దత్తత తీసుకున్న కొడుకు చేయవచ్చు , అదీ లేకపోతే చివరి అవకాశంగా కూతురు కొడుకు, లేదా కొడుకు యొక్క కొడుకు.... పిండ ప్రధానం చేయవచ్చు.


లేదా అన్నదమ్ముల కొడుకులు శాస్త్రం ప్రకారం ప్రత్యేక విధానం లో చేయవచ్చు.

పరిశుద్ధ హృదయంతో.... మానవతా ధర్మంతో అనాధ శవాలకు ఎవ్వరైనా పిండ ప్రధానం చేయవచ్చు అని శాస్త్రం చెబుతుంది.


ఇంకా వివరంగా కావాలంటే.... ఎవరైనా శాస్త్రం చదువుకున్న బ్రాహ్మణులను అడిగి తెలుసుకోగలరు.
 మీరు ధనము ఎందుకు సంపాదించాలి అన్నది ఒకసారి మరల గుర్తుకు తెచ్చుకొండి .
ఎవరైన ధనము సంపాదించాలి ,అంటే తన భార్య కొరకు ,పిల్లలకొరకు ,లేదా కుటుంబం కొరకు సంపాదించాలి అంటారు .అది నిజమే ..కాని నీకొరకు సంపాదించాలి అంటే కొంతవరకు మాత్రమే వస్తుంది .అది ప్రకృతి సహజం .అదే ధనము కుటుంబం కోసం సంపాదించాలి అంటే మరికొంత ఎక్కువ వస్తుంది .అదే ధనము ప్రపంచ శ్రేయస్సుకోసం సంపాదించాలి అని అనుకుంటే అనంతమైన సంపదవస్తుంది .

నీ ఆలోచన ఎప్పుడు క్రిందస్థాయిలో ఆలోచించకు ,పై స్థాయిలో ఆలోచించు ,నీ స్టితి మారుతుంది .ఎంతసేపు నీగురించి మాత్రమే ఆలోచిస్తూ ఉంటే ,నిస్తితి మారదు .ఎదుటివారికి సహాయం చేయలని ఆలోచన పెట్టుకో ,నిస్థితి మారుతుంది .ఎందుకు చెపుతున్నాను అంటే ...

నీవు పూర్వ జన్మలో ధనికుడివై ఉండి దానిని వినియోగించడం రాక పాడుచేసి ఉన్నావు .అందుకని నీవు ఈ జన్మలో ధనవంతుడిగా పుట్టలెదు .పూర్వ జన్మలో నీవు ధనముని సద్వినియోగం చేసివుంటే నీకు ఈ విధమైన బాధలు వచ్చివుండేవికాదు .మరి నీవు ఈ జన్మలో ధనవంతుడిగా మరలి అంటే ఏ గుడి ,గోపురం తిరిగితే ధనవంతుడిగా మారవు .ఏ భగవంతుడు నిన్ను మార్చడు .ఎందుకంటే ఈ జన్మలో నీవు ధనములేకుండగా పుడతానికి కారణం ....నీవే .నీకర్మకు బాద్యుడవు నీవే ,అదేవిదంగా నీకర్మను మార్పు చేసుకోవలసినది,నీవే ...🤘

*నీతలరాతను నీవే మార్చుకోవాలి*

*U are the creater of u r own destiny*👍

చనిపోయిన తరువాత జీవుడు ఏమవుతాడు?

 పిండ ప్రదానం ఎందుకు చెయ్యాలి?

చనిపోయిన తరువాత జీవుడు ఏమవుతాడు? మనం పెట్టే పిండాలు వారికి ఎలా చేరతాయి? ప్రేత దేవతగా ఎలా మారుతుంది? పిండాల వల్ల ప్రయోజనం ఏమిటి? వీటికి సమాధానం కావాలంటే పిండోపనిషత్తును చదవాల్సిందే. ఇది అథర్వణ వేద శాఖకు చెందినది. ఈ వేదం ఎక్కువగా కర్మ యోగానికి చెందినది. ఇందులో నిత్యనైమిత్తికకామ్య యజ్ఞాలు ఎలా చేయాలో వివరించారు. 

చనిపోయిన తరువాత జీవుడు ఏమవుతాడు?

ఒకసారి బ్రహ్మదేవుడిని దేవతలు, మహర్షులు ''మృతులకు సమర్పించిన పిండాలను వారు ఏవిధంగా స్వీకరిస్తారు?'' అని ప్రశ్నించగా, దానికి బ్రహ్మ "దేహం, దేహి" గురించి వివరాలు చెప్పారు. 

మరణించిన తరువాత ఈ పాంచభౌతికమైన శరీరం నుండి పంచభూతాలూ విడిపోతాయి. ఈ శరీరం భూమి, నిప్పు, నీరు, గాలి, ఆకాశం అనే మహాభూతాలతో ఏర్పడింది. ఎప్పుడైతే దేహి శరీరం నుండి వెళ్లి పోతాడో, పంచభూతాలు కూడా ఎలా వచ్చినవి అలానే వెళ్ళి పోతాయి. 

ముందుగా గాలి వెళ్లి పోతుంది (ఊపిరి ఆగిపోతుంది). దాని వలన పంచప్రాణాలు పోతాయి. 

గాలి తరువాత అగ్ని వెళ్లి పోతుంది. శరీరం చల్లబడుతుంది. తరువాత వైశ్వానరాగ్ని వెళ్లి పోతుంది. 

తరువాత శరీరంలో ఉన్న నీరు తోలుతిత్తిలోని తొమ్మిది రంధ్రాల నుండి కారిపోతుంది. 

ఎప్పుడైతే గాలి, నిప్పు, నీరు శరీరం నుండి తప్పుకున్నాయో అప్పుడు భూతత్త్వం అయిన ధాతువులు ఎముకలు, వెంట్రుకలు, గోళ్ళు వంటి రూపంలో మాత్రమే మిగులుతాయి. కొన్ని రోజులకు ఇవి కూడా భూమిలో కలిసిపోతాయి. 

ఈ శరీరాకాశం మహాకాశంలో కలిసిపోతుంది. 

ఇదే పంచభూతాలు వెళ్లిపోయే విధానం. నిజానికి మనకు కనిపించే స్థూలమైన బాహ్య శరీరంతో పాటుగా ప్రతీ ఒక్కరికీ కారణ శరీరం, యాతనా శరీరం అని మరో రెండు శరీరాలు ఉంటాయి. 

కారణ శరీరం: మరో జన్మకు మనం చేసుకున్న పాపపుణ్యాల సంచులు మోసే శరీరం. ఇది తన సంచుల్లో ఉన్న పాపపుణ్యాల ప్రకారం మరో శరీరం వెతుక్కుంటూ వెళ్లి పోతుంది. ఇదే నూతన శరీరం పొందుతుంది. 

యాతనా శరీరం: ఇది స్వర్గానికో లేక నరకానికో  వెళ్తుంది. 

ఇలా వివిధ శరీరాలు ఎవరి దోవన అవి వెళ్లిపోతే మృతుని ప్రేత మిగిలి ఉంటుంది. ప్రేత పదిరోజుల పాటు తన ఇల్లూ, తన పరివారం, తన ఆస్తులు చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఆ సమయంలో వేసే నిత్యపిండం కాకి రూపంలో వచ్చి తీసుకుంటుంది. దీని తరువాత పదవ రోజున సపిండులు, సగోత్రీకులు, బంధువులు, స్నేహితులు వచ్చి వదిలే ఉదకాలు దాని దాహాన్ని తీరుస్తాయి. వీటికి తృప్తి పడి అది పది రోజుల తరువాత తన వారిని, నా అనుకునే వారిని వదిలి వెళ్తుంది. 

మనం పెట్టే పిండాలు వారికి ఎలా చేరతాయి?

ప్రేతకు కావలసిన క్రొత్త శరీరం మాసికాల ద్వారా చేసే ఏకోద్దిష్ట శ్రాద్ధాల రూపంలో అందుతుంది. నిన్నటి బాహ్య శరీరాన్ని విడిచి, కారణశరీరం, యాతనా శరీరం కోల్పోయి, ప్రేతగా ఏ శరీరం లేకుండా ఉన్న మృతుడు మాసికాలలో కేవలం తనకు మాత్రమే ఉద్దేశించి వదిలే పిండాల ద్వారా క్రొత్త శరీరం సంతరించుకుంటాడు. 

మొదటి పిండం ద్వారా క్రొత్త శరీరానికి బీజం పడుతుంది. దీనినే కలనం అంటారు. 

రెండో పిండం వలన చర్మం, మాంసం ఏర్పడతాయి. 

మూడో పిండం వలన బుద్ధి కలుగుతుంది. 

నాలుగో పిండం వలన ఎముకలు, ఎముకల్లోని గుజ్జు ఏర్పడతాయి. 

ఐదో పిండం వలన శిరస్సు, ముఖం, వేళ్ళు ఏర్పడతాయి. 

ఆరో పిండం వలన హృదయం, మెడ, నోటిలోని భాగాలు ఏర్పడతాయి. 

ఏడో పిండం వలన ఆయుః ప్రమాణం  కలుగుతుంది. 

ఎనిమిదో పిండం వలన మాటకు చెందిన వ్యవస్థలు కలుగుతాయి. 

తొమ్మిదో పిండం వలన అన్ని అవయవాలకు పరిపుష్టి చేకూరి దృఢపడతాయి. 

పదో పిండం వలన క్రొత్త జీవితానికి అవసరమైన శారీరక పరిపూర్ణత చేకూరుతుంది. 

మాసికాలలోని పిండదానం వలన పిండ శరీరం నుండి సంపూర్తి శరీరం ఏర్పడుతుంది. ఈ ప్రపంచంలో భోగాలు అనుభవించడానికి మనకు శరీరం ఇచ్చిన తల్లి తండ్రులకు మాసికాలు నిర్వహించి, వారికి శరీరం ఏర్పడడానికి అవసరమైన పిండాలు సమర్పించి, వారి ఋణం తీర్చుకోవాలి. 

మొత్తంగా ఒక సంవత్సర కాలంలో 16 పిండాలు ఇస్తారు. వీటిలో మొదటి 10 పిండాల నుండి మృతుడు క్రొత్త శరీరాలు పొందుతాడని పిండోపనిషత్తు ద్వారా తెలుస్తుంది. మిగిలిన పిండాల గురించి గరుడపురాణంతో పాటు అనేక పురాణాలు చెబుతున్నాయి.

మృతుని శరీరం నుండి పంచభూతాలు ఏవిధంగా దూరం అవుతాయో అదే విధంగా తిరిగి వారికి భౌతిక శరీరం ఏర్పడడానికి పంచభూతాలూ కలుస్తాయి. ముందుగా జీవికి ఆస్తిక్యం ఇవ్వడానికి కారణం అయిన ఆకాశం అతనికి స్థలం ఇస్తుంది. ఆ తరువాత అగ్ని, జలం, వాయువు, భూమి తత్త్త్వాలు అతనికి శరీరం కల్పిస్తాయని పిండోపనిషత్తు చెబుతోంది. 

మాసికాలు ఇవ్వకపోతే ఏమవుతుంది?

మృతులకు మాసికాలు అన్నీ పెట్టవలసిందే. మాసికాలకు ప్రత్యామ్నాయం లేదు. ఏదైనా పిండాన్ని ఇవ్వకపోతే, అది ఎన్నో పిండమైతే ఆ దశలో ఏర్పడాల్సినవి ఏర్పడక మృతునికి వైలక్యం కలుగుతుంది. మాసికాలు మానేస్తే ఇటువంటి వైకల్యం కలుగుతుంది. 

సపిండీకరణం చేయకపోతే పితృదేవతా రూపం రాదు. తండ్రికి ప్రేతత్త్వం విడుదల చేయకపోతే తరువాత తరాలు అన్నీ ప్రేతత్త్త్వంలోనే ఉండిపోతాయి. కనుక మధ్యమ క్రియలైన మాసికాదులు చేయడం వలన చనిపోయిన వారికి మాత్రమే కాదు, కర్తకు కూడా లాభం చేకూర్చేదే. తనకు దుర్గతి రాకుండా మంచి మార్గం వేసుకోవడం వంటిది. ఇవి మన పురాణాలు, ఉపనిషత్తులు చెబుతున్న పితృయజ్ఞరహస్యాలు. 

ప్రేత పితృదేవతా స్థానం ఎలా పొందుతుంది?

పూర్వక్రియలు (దహన సంస్కారాది 12 రోజుల క్రియలు), మధ్యమ క్రియలు (మాసికాలు), సపిండీకరణం జరిగే వరకూ దేహాన్ని విడిచిన ఆత్మ ఈ ప్రేత రూపంలోనే ఉంటుంది. సపిండీకరణం తరువాత తన ముందున్న వర్గత్రయంలో తన తండ్రి తాత ముత్తాతల్లో ముత్తాతను ముందుకు జరిపి, ఆయన ఖాళీలో తాతను, తాత స్థానంలో తండ్రిని జరిపి, తండ్రి స్థానంలో తాను చేరుకుంటుంది. ఈ విధంగా పితృదేవతా స్థానం పొందుతుంది.

పుణ్య క్షేత్రాల్లో, పుణ్య తీర్ధాల్లో పిండ ప్రదానం చేస్తే ఏమవుతుంది?

కురుక్షేత్రం, ప్రయాగ, కాశీ, గయ వంటి పుణ్య క్షేత్రాల్లో పిండప్రదానం చేస్తే వారికి విశేషమైన శరీరాలు కలుగుతాయి. దాని వల్ల మనకే ప్రయోజం ఉంటుంది. వారికి కలిగే ఉత్తమ శరీరాల వల్ల పరమానందం పొంది మరింతగా సకల సంపదలు మనకు ఇస్తారు. 

ఇలా పుణ్య క్షేత్రాలలో చేయలేని వారు కనీసం తాను ఉన్న చోటునైనా పిండ ప్రదానం చేయాలి. వెళ్ళగలిగిన వారు ప్రయాగ కుంభమేళాల వంటి వాటికి వెళ్ళి చేయడం వలన దివ్యమైన ఫలితాలు పితృదేవతానందం వలన కలుగుతాయి. వెళ్ళలేని వారు మానసికంగా అయినా వాటిని కీర్తించడం వలన పుణ్యం పొందుతారు.

పిండాలు ప్రేతాలకు వెళతాయా? 

దీనికి సమాధానమే ఈ పిండోపనిషత్తు. నిజానికి ఉపనిషత్తులు అన్నీ రహస్యాల సమూహాలు. అవి పైకి ఒక అర్ధంలో కనిపించే సామాన్య పదాలుగా కనిపించినా వాటి వెనుక కేవలం మహాసాధకులకు మాత్రమే తెలిసిన అనేక రహస్యాలు ఉంటాయి. అవి కేవలం సాధకులు, పరిశ్రమ చేసిన విజ్ఞులు మాత్రమే అందుకోగలుగుతారు. వీటిని వారు అందరికీ చెప్పరు. కేవలం ఫలానా పిండదానాలు ఫలానా చోట చేయండి అని మాత్రమే చెబుతారు.  

పితృ పూజకు దివ్యమైన కాలం ఏది?

మాఘమాసం పితృదేవతా అర్చనలకు మహాదివ్యమైన కాలం. మాఘపౌర్ణమి/మహామాఘి రోజున పితరులకు ప్రయాగలో పిండ ప్రదానం చేస్తే దివ్యమైన ఫలాలు, సంపదలు కలుగుతాయి. ఆ సమయానికి వెళ్ళలేని వారు మానసికంగా అయినా తమ పెద్దలకు నమస్కరించుకొని, స్వధా నామ పారాయణం చేసి, స్వధా స్తోత్రం, పితృస్తోత్రం పఠించుకొని, ఆవుకు ఒక రోజు గ్రాసం వేయడం వలన కూడా ఉత్తమ పుణ్యసంపదలు ఉన్న చోటు నుండే పొందవచ్చు. ఇవే మాసికాల, పిండప్రదానాల రహస్యాలు

నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటే 'బాధ' ఒక.....

 🌸 Amritham Gamaya 🌸

Suffering is a divine guide if you are swift and prepared to learn from it. But it becomes a cruel and oppressive ruler if you hold out against it and agitate. Endeavour persistently; do not be impatient. When the ultimate is accomplished, iterations of suffering will be vanished in a fraction of second,  as in when light permeates into a chamber which is closed for many years, the darkness evaporates immediately - SathChith.

అమృతం గమయ

మీరు వేగంగా నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటే 'బాధ' ఒక దైవిక మార్గదర్శి. మీరు దానికి వ్యతిరేకంగా ఉండి ఆందోళన చేస్తే అది క్రూరమైన మరియు అణచివేత పాలకుడు అవుతుంది. సహనంతో ప్రయత్నించండి; అసహనానికి గురికావద్దు. అంతిమ విజయం సాధించినప్పుడు, చాలా సంవత్సరాలు మూసివేయబడిన గదిలోకి కాంతి విస్తరించినప్పుడు  చీకటి వెంటనే ఎలా ఆవిరైపోతుందో అలా బాధ యొక్క పునరావృత్తులు ఒక క్షణంలో అదృశ్యమవుతాయి  - సత్ చిత్.

अमृतम् गमय

दर्द एक दिव्य मार्गदर्शक है यदि आप तेजी से इससे सीखने के लिए तैयार हो। लेकिन यह एक क्रूर और दमनकारी शासक बन जाता है अगर आप इसके खिलाफ रहते हैं और आंदोलन करते हैं। धैर्य के साथ प्रयास करें; अधीर मत बनो। जब नियति को पूरा किया जाता है, तो दुख के पुनरावृत्तियों को एक क्षण में गायब हो जाते है, जैसे जब प्रकाश एक कक्ष में पहुंचता है जो कई वर्षों से बंद रहता है, तो अंधेरा तुरंत गायब हो जाता है - सतचित।