Tuesday, November 7, 2023

జీవక్రియ(METABOLISM)

 .                    120223-8.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*మన ఆరోగ్యం…


          జీవక్రియ(METABOLISM)
               ➖➖➖✍️

జీవక్రియ(METABOLISM).... అనేది శరీరం మన తినే మరియు త్రాగే వాటిని శక్తిగా మార్చే ప్రక్రియ. ... మనం విశ్రాంతిగా ఉన్నప్పుడు కూడా, మన శరీరానికి శ్వాస తీసుకోవడం, రక్త ప్రసరణ, హార్మోన్ స్థాయిలను సర్దుబాటు చేయడం , కణాల పెరుగుదల మరియు మరమ్మత్తు వంటి అన్ని విధులకు శక్తి అవసరం..... దీనిని METABOLISMఅంటారు.
అధిక జీవక్రియ అంటే ఏమిటి?
మీ జీవక్రియ "అధికoగా" (లేదా వేగంగా) ఉంటే, మీరు విశ్రాంతి మరియు కార్యాచరణ సమయంలో ఎక్కువ కేలరీలు ఖర్చు చేస్తారు. అధిక జీవక్రియ అంటే మీ బరువును నిర్వహించడానికి మీరు ఎక్కువ కేలరీలు తీసుకోవలసి ఉంటుంది. కొంతమంది బరువు పెరగకుండా ఇతరులకన్నా ఎక్కువగా తినడానికి ఇది ఒక కారణం.

అందువల్ల జీవక్రియ (metabolisam)జీవుల మొత్తం పెరుగుదలలో గణనీయమైన పాత్ర పోషిస్తుంది, మరియు జీర్ణక్రియ నుండి విసర్జన వరకు, జీవరసాయన చర్య కారణంగా జీవులలో అన్ని ప్రక్రియలు జరుగుతాయి, దీనిని జీవక్రియ అని అంటారు. 
SLOW METABOLISAM యొక్క సంకేతాలు ఏమిటి?
ఊహించని బరువు మార్పులు (బరువు పెరగడం లేదా బరువు తగ్గడం)తేలికగా అలసిపోవడం లేదా నిదానంగా అనిపించడం.
జుట్టు రాలిపోవుట.

మనం రోజుకు ఎన్ని కేలరీలు బర్న్ చేయాలి?
ఒక పౌండ్ కోల్పోవాలంటే,  సగటున రోజుకు ఎన్ని కేలరీలు బర్న్ చేయాలి ,అనే దాని గురించి::- సగటు వయోజన స్త్రీ రోజుకు దాదాపు 1,600 నుండి 2,400 కేలరీలు ఖర్చు చేయాలి మరియు సగటు వయోజన పురుషుడు రోజుకు 2,000 నుండి 3,000 కేలరీలు ఖర్చు చేయాలి.
వ్యాయామం జీవక్రియను పెంచుతుందా?
రన్నింగ్, స్విమ్మింగ్, ఏరోబిక్స్, వాకింగ్, మీ జీవక్రియను ప్రేరేపిస్తుంది, కేలరీలను బర్న్ చేయడంలో మీకు సహాయపడుతుంది. 
ఏ వయస్సులో జీవక్రియ మందగిస్తుంది?
 60 సంవత్సరాల వయస్సులో, మీ అవయవాలు మరియు కణాలు తక్కువ చురుకుగా మారడంతో మీ జీవక్రియ క్షీణించడం ప్రారంభమవుతుంది. మందగమనం క్రమంగా ఉంటుంది, సంవత్సరానికి 0.7% మాత్రమే,. "మీరు మీ 90లలో వచ్చే సమయానికి మీ శరీర పరిమాణం కోసం మీ శక్తి వ్యయం 25% తక్కువగా ఉంటుంది." కానీ మనం సాధారణ జీవితంలో క్రమబద్ధీకరించబడిన మాట్‌బాలిక్ కార్యకలాపాల ద్వారా మళ్ళీ
జోడించవచ్చు.
..అందుకే ఎల్లప్పుడూ.. మనం యాక్టివ్ కండిషన్‌లో ఉండటం మంచిది.
జీవక్రియను నిర్వహించడానికి ఏ విటమిన్ సహాయపడుతుంది?
విటమిన్ బి, కాల్షియం, విటమిన్ B5, విటమిన్ B6, విటమిన్ B12, విటమిన్ B కాంప్లెక్స్ మరియు విటమిన్ C: ఇవి మెరుగ్గా పని చేయడంలో సహాయపడే పోషకాలను అందిస్తాయి. ఇవి  బరువు తగ్గడానికి, జీవక్రియకు సహాయపడుతుంది.
                      … సేకరణ.
ఈ గ్రూప్ లో వచ్చే ఆరోగ్య విషయాలన్నీ సభ్యుల అవగాహనకోసమే. 
మీ అన్నిరకాల ఆరోగ్య సమస్యలకు మీ మీ డాక్టర్‌ను సంప్రదించండి.✍️
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

A. S. రావు నగర్ పేరు వెనుక… *తెలుగు తేజం, ఆ గొప్ప వ్యక్తి మన గోదావరి ప్రాంతానికి చేసిన వారు కావడం ఎంతో గర్వకారణం.:

 110223j1513.    120223-6.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀


    A. S. రావు నగర్ పేరు వెనుక…
               *తెలుగు తేజం:
                 ➖➖➖✍️

*పుట్టిన ఊరిలో ఒక వీధికి కూడా ఆయన పేరు లేదు. కానీ హైదరాబాద్ లాంటి ఒక మహా నగరంలో ఒక ఏరియా కి ఆయన పేరుని నామకరణం చేశారు. చరిత్రలో, ప్రజల మనసులో సుస్థిర స్థానం సంపాదించుకున్న ఓ గొప్ప వ్యక్తి కథ ఇది !! 

ఆ గొప్ప వ్యక్తి మన గోదావరి ప్రాంతానికి చేసిన వారు కావడం ఎంతో గర్వకారణం.

*"కాలం మనిషిని పుట్టిస్తుంది , అదే కాలం మనిషిని తనలో ఐక్యం చేసుకుంటుంది.”
        
*ఆ మనిషి పేదవాడైనా ధనవంతుడైనా సామాన్యుడైనా - అసమాన్యుడైనా అదే కాల ధర్మం.  ఆ వ్యక్తి చేసిన పనులను బట్టి కొందరు చరిత్ర పుటల్లో మిగిలిపోతారు - మరి కొందరు ప్రజల హృదయాల్లో!

*అలా చరిత్రలో మరియు ప్రజల హృదయాలలో సుస్థిర స్థానం సంపాదించుకున్న అతి కొద్ది మంది వ్యక్తులలో,  ఈయన కూడా ఒకరు. ఆయన మరెవరో కాదు మన గోదావరి తల్లి ముద్దుబిడ్డ… భారతదేశాన్ని_ఎలక్ట్రానిక్ రంగంలో అగ్రదేశాలతో సరిసమానంగా నిలిపిన మహోన్నతుడు, అంతకుమించి మానవతావాది, కర్మయోగి. ఆయన పేరుని ఆయన పుట్టిన ఊరికి కాక, వేరే ఒక ప్రాంతంలో, అది కూడా ఒక ప్రముఖ మెట్రో నగరంలో ఒక ఏరియా కి ఆయన పేరు పెట్టారంటే ఆయన ఏమి సాధిస్తే అలా పెడతారు? ఆ పేరు పలికితే రెండే పదాలు, కానీ ఆయన పేరు కన్నా ముందుగా ఆయన ఏం సాధించారో చెప్తే ఆ పేరుకున్న వెయిట్ అర్థం అవుతుంది, ఆ పేరు గల మనిషి బలం అర్ధం అవుతుంది.

*"ఈ ప్రపంచంలో కనుగొనబడిన ప్రతిదీ కూడా ఈ భూమి ప్రసాదమే, అది మనం తినే అన్నమైనా ఒక సూపర్ కంప్యూటర్ అయినా. అలాగే తాను కనిపెట్టగలిగే వస్తువు ముడి సరుకు ఆ భూమిలోనే ఉంది అనే మేధస్సు కలిగిన  వ్యక్తుల ఆలోచనల ఫలితమే ఈరోజు మనం ప్రపంచంలో అనుభవించే ప్రతి సుఖానికి, బద్ధకానికి నాంది."

*అది 1914 వ సంవత్సరం సెప్టెంబర్ 20వ తారీకు విక్రమ నామ సంవత్సరం, భాద్రపద బహుళ దశమి, సోమవారం  మేష లగ్నం , భీమవరానికి పది కిలోమీటర్ల దూరంలో మోగల్లు అనే చిన్న పల్లెటూరు, సమయం సరిగ్గా రాత్రి తొమ్మిది కావస్తోంది అప్పుడే అయ్యగారి వారింట ఒక నిండు గర్భిణీ ఐన సుందరమ్మకు పురిటి నొప్పులు ప్రారంభమయ్యయి, హాస్పిటల్ కి వెళ్ళాలన్నా పది కిలోమీటర్ల పోవాలా, ఊళ్లో పురుడు పోసే ఒక ముసలమ్మను వెంటనే తీసుకొచ్చారు, లోపలికి వెళ్లి తలుపులు మూసింది, మళ్లీ అదే ముసలమ్మ తలుపులు తెరిచి ఆ రాములోరి నక్షత్రంలో నీకు  మగ బిడ్డ జన్మించాడు వెంకటాచలం అంటూ శుభవార్తను తెలియజేసింది.

*ఆ బిడ్డ పెరిగి పెద్దవాడు అవుతున్నాడు, చిన్నప్పటి నుంచి చదువు అంటే ఎంతో ప్రేమ, అలాంటి ఇలాంటి ప్రేమ కాదు, ప్రతి పరీక్షలోనూ అతడే అగ్రగణ్యుడు.   ఆ మొగల్లులోనే ఐదవ తరగతి వరకు చదువుకున్నాడు. అంతకుమించి అతనికి చదవాలని ఆశ ఉన్నా, స్కూలు అయితే లేదు. అప్పట్లో ఐదవ తరగతి దాటి చదవాలంటే వేరే ఊరు వెళ్లాలి , తన కుటుంబాన్ని ఎంతగానో బ్రతిమాలాడు, ఎందుకంటే  వాళ్ళ  ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే , చివరికి తణుకు కు చెందిన వంగూరి వారు అతనికి  చదువు మీద ఉన్న ప్రేమను చూసి వసతి, మరియు  వారం లో ఒక రోజు భోజనం పెట్టడానికి ఒప్పుకున్నారు, మొత్తం మీద తణుకు హైస్కూల్లో తన యొక్క సెకండరీ విద్యను ప్రారంభించి ప్రతిరోజు భోజనానికి వారాలబ్బాయిగా మారాడు, ఒకరోజు భోజనం అంటే ఏదోలా కష్టపడొచ్చు కానీ ఎస్.ఎస్.ఎల్.సి పూర్తయ్యేంతవరకు భోజనం అంటే మాటలా, కొంతమంది నువ్వు మా వాడివి కాదని   మరి కొంతమంది మీ శాఖ వేరని అలా చాలామంది భోజనం పెట్టేవారు కాదు, ఒక్కోసారి కొన్ని వారాల పాటు కూడా భోజనం చేసే అవకాశం ఉండేది కాదు, చివరికి ఒక్కోసారి తన ఆకలిని తీర్చుకోవడానికి మినుములను నానబెట్టి వాటిని తింటూ ఉండేవాడు. మొత్తానికి కష్టపడి దాతల సహకారంతో #తణుకులోనే ఎస్.ఎస్.ఎల్.సి ని విజయవంతంగా పూర్తి చేశారు, చదువుకోవాలి అనే తృష్ణ ఆయనలో రోజురోజుకీ పెరిగిందే తప్ప ఎన్నడూ తగ్గలేదు.

   *"నీ సంకల్పం గొప్పదైతే ప్రపంచంలో ప్రతి అణువణువు కూడా నీకు సహకరిస్తుంది"

*ఎలాగో అలా ఎస్.ఎస్.ఎల్.సి అయితే పూర్తి చేశాడు కానీ తర్వాత ఇంటర్మీడియట్ కూడా చదవాలి అనే తన ఆశని తన అన్నలకి వ్యక్తం చేయడంతో వారు కూడా సరే అని విజయనగరం మహారాజా కాలేజీలో జాయిన్ చేశారు. జాయిన్ అయితే అయ్యాడు కానీ మళ్ళీ అదే ఆర్థిక సమస్యలు, చివరికి ప్రతిరోజు ఆ విజయనగరంలో దేవాలయాల వద్ద వచ్చే భక్తులకు తనకు సాయం చేయమని కూడా అడిగేవాడు. "కడుపు కోసం చెయ్యి చాచేవాడిని చూసి ఉంటాము, కానీ చదువు కోసం చేయి చాచిన వ్యక్తులు చాలా అరుదు కదా!" అలా కష్టపడి చదువును నెట్టుకొస్తున్న సమయంలో ఇతని ప్రతిభను గుర్తించినటువంటి ఆ విజయనగరం మహారాజా వారు కొంతవరకు సాయం చేయడంతో  మొత్తానికి విజయవంతంగా తన ఇంటర్మీడియట్ పూర్తి చేశారు.

*కొడుకుకి చదువు మీద ఉన్న ప్రేమను చూసి ముగ్దు రాలైన ఆయన తల్లి గారు, తన పట్టు చీరలు అమ్మేసి తన కొడుకుని బీఎస్సీలో చేర్చడానికి సహకరించారు. వారణాసిలోని   బెనారస్ హిందూ యూనివర్సిటీలో బ్యాచిలర్ గా తన జీవితాన్ని ప్రారంభించిన ఆయన జాయిన్ అయిన మొదటి రోజు నుంచే ఎంతో కష్టపడి చదివేవారు.

*అప్పట్లో పండిత మదన్ మోహన్ మాలవ్య  అ కాలేజీ యొక్క ప్రిన్సిపాల్ గా ఉండేవారు. జాయిన్ అయితే అయ్యాడు కానీ మొదటి సంవత్సరం ఫీజు కూడా కట్టలేని పరిస్థితి . అతని పరిస్థితి చూసి పండిత్ మదన్మోహన్ మాలవ్య గారు కనీసం రెండో సంవత్సరం అయినా ఫీజు కట్టమని చెప్పారు, మళ్లీ రెండో సంవత్సరం కూడా అదే పరిస్థితి. కానీ అతనికి చదువు మీద ఉన్న ప్రేమకు ఆనంద భరితుడైన ఆ ప్రిన్సిపాల్ గారు కనీసం మూడో సంవత్సరం అయినా పరీక్ష ఫీజు కట్టమని  చెప్పి ఆ సంవత్సరం కూడా పరీక్షలు రాయనిచ్చారు. కనీసం కొనుక్కోవడానికి పుస్తకాలు కూడా లేని పరిస్థితి, పరీక్ష సమయంలో పుస్తకాలు కూడా ఎవర్నో ఒకరిని అప్పు అడిగి తెచ్చుకొని చదివేవారు, చివరికి మూడో సంవత్సరం రానే వచ్చింది, కానీ ఈసారి ప్రిన్సిపాల్ గారు కూడా ఏమీ చేయలేని పరిస్థితి. చివరికి చేసేది ఏమీ లేక ఇంటికి టెలిగ్రామ్ పంపారు,"మీరు కనుక డబ్బు పంపగలిగితే రెండు రోజుల్లో నేను ఫీజు కట్టగలను లేదంటే రెండు రోజులలో ఇంటికి తిరిగి వచ్చేస్తున్నాను" అని దాని సందేశం. 
ఆరోజు మొగల్లులో డ్యూటీలో ఉన్న #పోస్టుమాస్టర్ పైడిమర్రి వెంకట రామయ్య గారు ఈ యొక్క విషయాన్ని చదివి చలించిపోయి, వాళ్ల కుటుంబ సభ్యులతో మాట్లాడి వారి భార్య 120 తులాల బంగారు గొలుసును అమ్మేసి ఆ డబ్బులు అతనికి మనీ ఆర్డర్ చేశారు. "నిజంగా అటువంటి దాతృత్వం కలిగిన వెంకటరామయ్య గారు ఆ రోజు డ్యూటీలో లేకపోయి ఉంటే ఈరోజు భారతీయ ఎలక్ట్రానిక్ పరిస్థితి వేరే రకంగా ఉండేదేమో.

*మొత్తానికి మనీ ఆర్డర్ తో   ఫీజు కట్టి మూడో సంవత్సరం పరీక్ష కూడా మొట్టమొదటి స్థాయిలో ఉత్తీర్ణతను సాధించాడు ఆ యువకుడు.  తర్వాత 1938లో అన్నపూర్ణమ్మ గారిని వివాహం చేసుకున్నారు భౌతిక శాస్త్రంలో తన యొక్క మాస్టర్స్ కూడా కంప్లీట్ చేశారు. ఆ తర్వాత టాటా సంస్థ వారి యొక్క సహకారంతో స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ఎలక్ట్రానిక్స్ విభాగంలో తన యొక్క మాస్టర్స్ పట్టా కూడా పొందారు, అక్కడ ఎలక్ట్రానిక్ రంగంలో నిష్ణాతులైన డేవిడ్ ప్యాక్యార్డ్ వంటి వారి నుండి అద్భుతమైన జ్ఞానాన్ని పొందారు. అక్కడే వారికి ఉద్యోగాన్ని ఆశ చూపినా,    తన జ్ఞానాన్ని భారతదేశ కోసం మాత్రమే ఉపయోగించాలని నిశ్చయించుకుని తిరిగి తనకి సహకారం చేసిన టాటా  సంస్థలోనే జాయిన్ అయ్యారు. హోమో జహంగీర్_బాబా, సివిరామన్, విక్రమ్_సారాభాయ్ వంటి ఎంతోమంది ప్రముఖులతో కలిసి పని చేశారు.

*అప్పటివరకు భారతదేశం  కనీ వినీ ఎరుగని ఎన్నో ఎలక్ట్రానిక్ పరికరాలను తయారు చేయడం ప్రారంభించారు, 1956 లో దేశీయంగా తయారుచేసిన #అప్సర అనే పరమాణు రియాక్టర్ నిర్మాణంలో కూడా విశేషమైన కృషి చేశారు. ఆయన యొక్క ప్రతిభ తెలియడానికి భారతదేశానికి ఎంతో సమయం పట్టలేదు 1960 వ సంవత్సరంలోనే భారత ప్రభుత్వం ఆయనకి పద్మశ్రీని,   1972వ సంవత్సరంలో పద్మ భూషణ్ తో సత్కరించింది.

*అది 1962 సంవత్సరం భారతదేశం చైనా యుద్ధం లో మన దేశానికి కొంత ప్రతికూలమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆ సమయంలోనే స్వీయ ఆయుధాల తయారీ అనేటువంటిది భారతదేశానికి అత్యవసరంగమని బాబా గారు గుర్తించారు. దానికోసం ఒక ప్రత్యేక సంస్థను నెలకొల్పాలి అని నిశ్చయించుకున్నారు అదే ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. కానీ దాన్ని ఎలాగైనా తెలుగు రాష్ట్రాల్లోనే నెలకొల్పాలి అనేటువంటిది మన హీరో గారి బలమైన సంకల్పం. 
చివరికి ప్రభుత్వాన్ని, ఆ సంస్థలో వారిని ఏదో విధంగా ఒప్పించి ఆ సంస్థని 1967లో హైదరాబాదులో స్థాపించడం జరిగింది. దానికి చైర్మన్ గా డాక్టర్ విక్రంసారాభాయ్ గారిని అలాగే MD గా మన కథలోని నాయకున్ని  నియమించడం జరిగింది.

*ఈ యొక్క ఈ ECIL లో భారత దేశంలో మొట్టమొదటి కంప్యూటర్ సిస్టమ్స్ , అలాగే వాటికి కావాల్సిన సాఫ్ట్ వేర్స్ ని కూడా అక్కడే తయారు చేయడం జరిగింది. అంతేకాకుండా ఎంతోమంది సైంటిస్టులకు ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఆ యొక్క కంప్యూటర్ల మీద మరియు సాఫ్ట్ వేర్ తయారీలో ప్రత్యేక ట్రైనింగ్ కూడా నిర్వహించేవారు. భారత దేశంలో మొట్టమొదటిగా రిజర్వేషన్ సిస్టమ్స్, షేర్ మార్కెట్స్ , బ్యాంకింగ్ సాఫ్ట్ వేర్, మొదటి ఈవీఎం మిషన్, కాక్ పీట్ వాయిస్ రికార్డర్, ఎయిర్ పోర్ట్ స్కానింగ్ సిస్టమ్స్ , అలాగే ఆర్మీకి సంబంధించి ఎన్నో ఎలక్ట్రానిక్ పరికరాలను మరియు సాఫ్ట్ వేర్లను  అన్ని కూడా ఈసీఐఎల్ లో తయారయ్యాయి. ఒకరకంగా ఈరోజు హైదరాబాద్ సాఫ్ట్ వేర్ హబ్ గా తయారయ్యింది అంటే దానికి కారణం కూడా #ఈసీఐఎల్ సంస్థ. సంస్థలో పనిచేసిన ఇద్దరు వ్యక్తులు కలిసి హైదరాబాదులో మొట్టమొదటి సాఫ్ట్ వేర్ కంపెనీని కూడా ప్రారంభించడం జరిగింది.

*ఈయన సాధించిన విజయ పరంపర అనిర్వచనీయం, ఒక ఉద్యోగిగా తాను గొప్ప వ్యక్తే అలాగే ఒక మనిషిగా కూడా ఆయన అంతే మహనీయుడు, మానవత్వానికి, సింప్లిసిటీకి ఆయన ఒక ఎగ్జాంపుల్. 1978 సంవత్సరంలో తనకు తానుగానే    సెల్ఫ్ రిటైర్మెంట్ తీసుకున్నారు.  ఆయన అంత సాధించినా కూడా ఎప్పుడూ కూడా సాధారణ వ్యక్తిలా ఆర్టిసి బస్సుల్లో ఆటోల్లో తిరిగేవారు. చివరికి తన దగ్గర పనిచేసిన ఒక వ్యక్తికి ఆటో కొనిచ్చారు, తాను ఎక్కడికి వెళ్లాలన్నా కూడా అదే ఆటోలో వెళ్లేవారు. అది సన్మానాలైనా మీటింగ్ లైనా. అది కూడా డబ్బులు తీసుకుంటేనే ఎక్కేవారుట.

*ఇంతకీ ఆయన పేరు మీకు చెప్పలేదు కదా! ఆయన ఒక రోజు ఎక్కడికో  పని మీద వెళ్లి తిరిగి వస్తూ ఆర్టీసీ బస్సులో ‘ASరావు నగర్ వచ్చాక ఆపండి’ అని కండక్టర్ కి చెప్పారట, మళ్లీ పది నిమిషాలు పోయాక ‘బాబూ ఏఎస్ రావు నగర్ వచ్చేసిందా’ అని అడిగారట, అప్పుడు ఆ కండక్టర్ చిరాకుపడుతూ ఎదర వచ్చే స్టాపే ఏఎస్ రావు నగర్ అని చెప్పాడు, ఆ స్టాప్ రాగానే ఆయన దిగి వెళ్ళిపోయారు, ఆ తర్వాత బస్సులో ఉన్న వాళ్ళందరూ ఆ కండక్టర్ కి చెప్పారు ఆయనే "పద్మశ్రీ గ్రహీత, శాంతి స్వరూప్ బట్నాకర్ గ్రహీత డాక్టర్. అయ్యగారి సాంబశివరావు" అని!(A S Rao)

*ఆరోజు ఆయన నాటిన ఈసీఐఎల్ అనే వట వృక్షం నేడు కొన్ని లక్షల మందికి ఉపాధి. అందుకోసమే ఈసీఐఎల్ ప్రాంతాన్ని మొత్తం ఆయన గుర్తుగా "ఏఎస్ రావు నగర్" గా నామకరణం చేశారు. ఎప్పుడైనా మన గోదారి ప్రాంతాల నుంచి ఎవరైనా వెళ్తే చాలా ఆప్యాయంగా వారందరికీ కూడా భోజనాలు పెట్టి పంపించేవారు. అంతేకాకుండా భోజనానికి ఇబ్బంది పడే వారికి ఆయన ఇంటి దగ్గరే చేసే విధంగా కూడా ఏర్పాట్లు చేసేవారు. ఎందుకంటే వారాలబ్బాయి గా  చేసిన ఆయనకి తిండి , ఆకలి విలువ బాగా తెలుసు కాబట్టి. ఈయన గురించి చెప్పుకుంటూ పోతే రాయాల్సింది చాలానే ఉంది కానీ ఎక్కడో చోట ఆగాలి కాబట్టి ఇక్కడే ఆగుతూ....

*ఒక సాధారణ మధ్యతరగతి విద్యార్థిగా తన జీవన ప్రయాణాన్ని ప్రారంభించి చదువుకు డబ్బు లేక, కడుపుకు తిండి లేక  ఎంతో ఇబ్బంది పడుతూ, కొన్ని వందల మందికి విద్యా దానాలు, కొన్ని వేల మందికి ఆకలి తీర్చే చేసే స్థాయికి ఎదిగి, భారత దేశాన్ని ఎలక్ట్రానిక్ విభాగంలో ప్రపంచ స్థాయి సంస్థలతో సమానంగా నిలిపి, కర్మను మాత్రమే చేసి వాటి ఫలితాన్ని విడిచిపెట్టిన అసలు సిసలైన కర్మయోగి మన ఆంధ్ర ముద్దుబిడ్డ శ్రీ అయ్యగారి సాంబశివరావు (A S Rao) గారికిశతకోటి వందనములు🙏
.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
                       🌷🙏🌷

   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
                     ➖▪️➖

Monday, November 6, 2023

మహామ్మద్ ఘోరీని వణికించిన… * *వీరనారి నాయకీ దేవి...!

 110223f1147.    120223-4.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*మహామ్మద్ ఘోరీని వణికించిన… *

             *వీరనారి నాయకీ దేవి...!*
                    ➖➖➖✍️

*చుట్టూ పరికించి చూశాడు మహమ్మద్ ఘోరి !*
*ఒక స్త్రీ, ఆమెతోపాటు ఒక‌సైనిక పటాలం అజాగ్రత్తగా ఉన్న తన సైనికులను ఊచకోత కొయ్యటం కనిపించింది ! ఎటుచూసినా ఆ వీరవనితచేతిలోని కత్తి తళత్తళలే కనిపించాయి !*

*మహమ్మద్ ఘోరీ   తేరుకుని   తన సైనికులను సన్నద్ధం చేసేలోపులోనే ఆ వనిత అక్కడ లేదు ఆమెతో వచ్చిన సైనిక పటాలము కూడా లేదు అంతా ఆరావళి కొండలలో మటుమాయమయ్యారు. ఎంత గాలించినా ఎవరూ కనపడలేదు వారికి ! సైనికుల ప్రాణనష్టం భారీగా జరిగింది ఘోరీ వైపు !*

*ఆవిడ !! ఆ ధీరమూర్తి!! పేరు నాయికిదేవి! చాళుక్యరాజవంశాన్ని మెట్టిన వనిత ! గోవాకు చెందిన ఒక మహామండలేశ్వరుడైన పరమార్ది కూతురు.*

*నాయికిదేవి సోలంకి వశస్తుడైన అజయపాలడి సతీమణి !* *అనహిలవాడను రాజధానిగా చేసుకొని నేటి రాజస్థాన్, గుజరాత్ లోని కొన్నిప్రాంతాలకు అజయపాలుడు రాజు !*
*అజయపాలుడి హఠాన్మరణంతో పసివాడైన కొడుకును గద్దెనెక్కించి ప్రతినిధిగా తాను రాజ్యం పరిపాలించింది నాయికిదేవి !*

*నాయికిదేవి చిన్నతనంలోనే గుర్రపుస్వారీ , ఖడ్గచాలనం ఇత్యాది యుద్ధవిద్యలలో శిక్షణ పొందింది ! రాజనీతి చతరురాలు యుద్ధవ్యూహాలలో మేటి !*

*ఆ రాజ్యాన్ని దాని వైభవాన్ని గురించివిన్నాడు మహమ్మద్ ఘోరి !*

*ఒక ఆడుది, ఒక పసివాడు పరిపాలించే రాజ్యాన్ని సునాయాసంగా కొల్లగొట్టవచ్చు అనుకున్నాడు !*

*అనుకున్నదే తడవుగా ఆఫ్ఘనిస్తాన్ నుండి లక్ష సైన్యంతో బయలు దేరాడు !*

*వేగులద్వారా మహమ్మద్ ఘోరీ కదలికలు వాడి ఆలోచనలు పసిగట్టింది నాయికిదేవి !*

*కానీ వాడి సైన్యం చాలా పెద్దది. తన వద్ద అంత సైనిక సంపత్తి లేదు ఎలా?*

*తల వంచటంకంటే ఎదిరించి నిలబడటంలోని ఔన్నత్యం తెలిసిన వనిత కనుక తన చుట్టుపక్కల ఉన్న తోటి రాజుల సహాయాన్ని అర్ధించింది!*

*రాజులైన.....*
*కీర్తిపాలుడు సరేనన్నాడు*
*ధరావర్షుడు నేను సిద్ధం అన్నాడు.*
*కల్హణదేవుడు ఘోరీతో కలహానికి నాదే ముందడుగు అని కబురంపాడు !*

*అనుకున్నట్లుగా సైన్యం సమకూరింది! అయినా వాడి సైన్యం ముందు చాలా చాలా తక్కువ !*

*ఆలోచించింది రాణి- ఏమి చేయాలా అని !*

*ఒకరోజు ఒకరాయబారి ఘోరీవద్దనుండి కబురు తెచ్చాడు !*

*దాని సారాంశమిది…  "నీవు నీకొడుకుతోసహా నావద్దకు వచ్చి…               నీ రాజ్యంలోని స్త్రీలను, సంపదను నాకు సమర్పించి లొంగిపోతే    ఏవిధమైన ప్రాణనష్టముండదు" అని ..!*

*కాస్త ఆలోచించింది రాణి.  “సరే! నీవు చెప్పినట్లే చేస్తాను! నీవు ఆరావళి పర్వత శ్రేణి వద్దగల ప్రాంతానికి వచ్చినవెంటనే నా అంతట నేనే వచ్చి లొంగిపోతాను.” అని కబురుపెట్టింది !*

*ఆరావళి పర్వతశ్రేణులలో ప్రతి కొండ,కోన, లోయ మలుపులు గుహలు చాటుమాటుప్రదేశాలు తన వద్ద ఉన్న అన్ని రాజ్యాల సైనికులకు తెలుసు ! నిజానికి ఆ దారులు కొట్టిన పిండి వారికి !*

*అప్పటికప్పుడు ఆమె యుద్ధవ్యూహం నిర్ణయించుకున్నది ! అది గెరిల్లా వ్యూహం !*

*అక్కడ !!  విడిదిలో రాణి వచ్చి లొంగిపోతుంది అన్న ధ్యాసలో ఉండి కాస్త యుద్ధ సన్నద్ధత తగ్గి గానాబజానాలో మునిగిపోయారు ఘోరిసైనికులు !*

*ఎక్కడనుండి   ఏ కొండ   ఈనిందో తెలియదు వచ్చారు మిడతలదండులాగ మీదపడ్డారు. అదనుచూసి పదునైన కోలుకోలేని దెబ్బతీసి గుట్టలలోకి‌ పారిపోయారు!     వారి వెంటపడ్డారు కొందరు ఘోరీ సైనికులు !*
*సైన్యం అలా   చీలి పోగానే గుట్టలలో ఇంకొక వైపునుండి మరొక‌బృందం మిగిలిన సైన్యాన్ని ఇదే తరహాలో చావుదెబ్బకొట్టింది!   ఇలా బృందాలు బృందాలుగా వారు వస్తూనే ఉన్నారు!*

*ఈ విధమైన యుద్ధంలో గుట్టలలో కెళ్ళిన ఘోరీసైనికులు గుట్టలలోనే మట్టుబెట్టబడ్డారు  !*

*లక్ష ఉన్న సైన్యం కాస్త ఘోరి, అతని అంగరక్షకదళం మాత్రమే మిగిలారు! ఒక్కసారిగా వెన్నులో చలి పుట్టింది వాడికి !*

*బ్రతుకు జీవుడా అంటూ మృత్యుభయంతో ప్రాణాలరచేతబట్టుకొని గాంధారం వైపు పరుగులుతీసి ఇల్లు చేరుకున్నాడు !!*

*మరి జీవితంలో బ్రతికి ఉండగా గుజరాత్ వైపు కన్నెత్తి చూడలేదు!* 

*ఇదీ వీరనారి ‘నాయికిదేవి’ సాహసోపేతమైన వీరగాధ !.*✍️
.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
                       🌷🙏🌷

   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
                     ➖▪️➖

శ్రీ మహాభారతంలో చిన్ని కథలు: #స్త్రీ పర్వము ద్వితీయాశ్వాసము

 110223c0959.    120323-3.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀


                 శ్రీ మహాభారతం 
                  ➖➖➖✍️
                  268 వ భాగం
    శ్రీ మహాభారతంలో చిన్ని కథలు:

#స్త్రీ పర్వము ద్వితీయాశ్వాసము

వైశంపాయన మహర్షి జనమేజయునకు చెప్పిన మహా భారతకథను సూతుడు నైమిశారణ్యంలో శౌనకాది మహామునులకు చెప్పసాగాడు…

“ఆ ప్రకారంగా ద్రౌపదిని ఓదార్చిన తరువాత గాంధారి యుద్ధభూమికి వెళ్ళింది. వ్యాసమహాముని కరుణ వలన ఆమెకు కళ్ళకు గంతలు ఉన్నా యుద్ధ భూమి సవిస్తరంగా కనిపించసాగింది. సుదూరంలో ఉన్న దృశ్యాలు దగ్గరగా కనిపించసాగాయి. గాంధారి యుద్ధభూమి అంతా పరికిస్తూ ముందుకు నడుస్తోంది. ఆమె కళ్ళు సుయోధనుడి శవం కొరకు గాలిస్తున్నాయి. విరిగిన రథాలు, ముక్కలైన ధ్వజాలు, చచ్చిన ఏనుగులు, గుర్రాలకళేబరాలు గుట్టలుగా పడి ఉన్నాయి. చనిపోయిన సారధులు, సైనికుల శవాలు చెల్లా చెదురుగా పడి ఉన్నాయి. తల ఒక చోట ఉంటే మొండెం మరొక్క చోట ఉంది. అది చూసి గాంధారి మనసు కలత చెందింది. మహా మహా సామ్రాజ్యాలు ఏలిన మహారాజులు నోళ్ళు తెరచుకొని శవాలై పడి ఉన్నారు. వారి శరీరాల నుండి కారిన రక్తం కాలువలై ప్రవహించింది. వారు ధరించిన విల్లులు, అంబులు, కత్తులు మొదలైన ఆయుధములు గుట్టలుగా పడి ఉన్నాయి. కొంత మంది శరీరాలు గుర్తించ వీలు లేని విధంగా ఉన్నాయి. వాటి కొరకు వచ్చిన రాబందులు, గద్దలు, అక్కడక్కడా ఎగురుతూ దొరికిన శవాన్ని దొరికినట్లు పీక్కు తింటూ తిరుగుతున్నాయి. తోడేళ్ళు స్వైర విహారం చేస్తూ శవాలని చీల్చి కండలు ఊడబెరికి తింటున్నాయి.


#గాంధారి బాధ:

ఇదంతా చూసిన గాంధారి మనసు బాధతో విలవిల్లాడింది. తన కుమారుడి మూర్ఖత్వం ఇంతటి మారణహోమానికి దారి తీసిందని బాధపడింది. వ్యాసుడు ధృతరాష్ట్రుడితో శవాలన్నింటికీ సామూహిక దహనకాండలు జరిపించమని చెప్పి వెళ్ళి పోయాడు. 

పాండవులు, శ్రీకృష్ణుడు, ధృతరాష్ట్రుడిని నడిపించుకుంటూ తీసుకు యుద్ధభూమికి తీసుకు వచ్చారు. గాంధారి కోడళ్ళు అందరూ తమ తమ భర్తల శవాల కొరకు యుద్ధ భూమి అంతా కలియ తిరుగుతున్నారు. ఇతర హస్థినాపుర స్త్రీలు కూడా తమ భర్తల కళేబరాల కొరకు తిరుగుతున్నారు. అందరూ బిగ్గరగా ఏడుస్తూ, కుమారులనూ, భర్తలను పిలుస్తూ తూలుతూ నడుస్తున్నారు. కొంత మంది తమ సోదరులు, భర్తలు, కుమారులు, బంధువులు శవాలుగా పడి ఉండటం చూసి సహించ లేక హాహాకారాలు చేస్తూ మూర్ఛ పోయారు. మరి కొంత మంది చని పోయిన వారి గురించి తలచుకుంటూ వారి గురించి చెప్పుకుంటూ తలలు బాదుకుంటున్నారు.


#గాంధారి కృష్ణుడితో చెప్పి విలపించుట:

ఇది చూసిన గాంధారి మనసు కకావికలు కాగా దూరంగా ఉన్న కృష్ణుడిని దగ్గరకు పిలిచి "కృష్ణా ! చూడవయ్యా ధృతరాష్ట్ర మహారాజు కోడళ్ళు ఎలా ఏడుస్తున్నారో చూడు. వారి భర్తల శవాల కొరకు ఎలా వెదుకుతున్నారో చూడు. ఒకరి భర్తల శరీరాలను ఒకరు వెతుకుతూ ఏడుస్తూ వారి వారి భార్యలను ఏడుస్తూ ఎలా పిలుస్తున్నారో చూడవయ్యా ! నా కుమారుల మీద కసి ద్వేషం పెంచుకున్న వారి కళ్ళు ఈ దృశ్యాలు చూసి చల్లబడ్డాయా! వీరంతా ఏమి పాపం చేసారని వీరికి ఈ శిక్షవేసారయ్యా మీరు. అడుగో ద్రోణుడు, కర్ణుడు, శల్యుడు, ద్రుపదుడు వీరంతా చనిపోయినా ముఖంలోని కళ తగ్గకుండా ఎలా వెలిగిపోతున్నారో చూడవయ్యా ! అత్యంత భోగాలను అనుభవించిన ఆ మహానుభావులు ఎలా పడి ఉన్నారో చూడవయ్యా ! వంది మాగధులు కైవారముతోగాని నిద్ర లేవని ఈ మహా మహులు ఈ రోజు నక్కల ఊళల మధ్య అచేతనంగా పడి ఉన్నారయ్యా ! హంస తూలికా తల్పమున గాని శయనించని రాజాధిరాజులు కటిక నేలన పడి ఉన్నారయ్యా ! నానా విధ సుగంధ లేపనాలతో శరీరాలను అలంకరించుకునే రాజాధిరాజులు ధూళి దూసరిత రక్తమయ భూమిలో దొర్లుతున్నారు చూడవయ్యా!   కృష్ణా! ఇవన్నీ చూసి ఎలా ఊరుకున్నావయ్యా! ఇదంతా నీవు సాధించిన ఘనకార్యం కాదా !  అటు చూడవయ్యా ! కొంత మంది కౌరవ కాంతలకు తమ భర్తల తలలు కానక ఎలా విలపిస్తూ వెతుకుతున్నారో చూడవయ్యా ! మరి కొందరు తలలు చేత పట్టి మొండెములు కానక అల్లాడుతున్నారయ్యా ! మరి కొందరు ముక్కలై పోయిన తమ భర్తల శరీరభాగాలను ఒకటిగా చేర్చి కుమిలి కుమిలి ఏడు స్తున్నారయ్యా ! మరి కొందరు నక్కలు తోడేళ్ళు చిందర వందర చేయడంతో శరీరాలను కానక క్షోభిస్తున్నారయ్యా ! ఇటువంటి దురవస్థలను చూడడానికి నేను ఈ జన్మలో ఏపాపపం చేసానో కృష్ణా ! నా కొడుకులను, కోడళ్ళను, తమ్ముళ్ళను, బంధువులను ఇలాంటి దుస్థితిలో చూస్తున్నాను"అంది.  కాని కృష్ణుడు మాటాడక నిశ్శబధంగా గాంధారి వెంట నడుస్తున్నాడు.


#గాంధారి సుయోధనుడిని చూసి విలపించుట:

ఇంతలో దూరంగా సుయోధనుడి శవం పడి ఉండటం చూసింది. దిక్కు లేకుండా పడి ఉన్న అభిమానధనుడైన సుయోధనుడి శవం చూసి గాంధారి కుప్పకూలి పోయింది. తన కుమారుడి శవం మీద పడి రోదిస్తూ "నాయనా సుయోధనా ! ఏమిటిది సుయోధనా! 
నీ శరీరం దుమ్ము ధూళిలో పడి దొర్లడం ఏమిటయ్యా ! నీ తల్లి గాంధారిని వచ్చాను నన్ను చూసి కూడా లేచి నిలబడవా నాయనా !   కృష్ణా ! చూడవయ్యా నా కుమారుని చూడు. వీడు యుద్ధముకు వెళుతూ నా ఆశీర్వాదం కొరకు వచ్చాడయ్యా! 
నాకు పాదాభివందనం చేసాడయ్యా! అప్పుడు నేను ధర్మం జయిస్తుందని ఆశీర్వదించాను.    అలా ఎందుకు ఆశీర్వదించానో తెలుసా కృష్ణా! నాడు కుఱు సభలో   జూదక్రియ తరువాత పాండవులకు జరిగిన అవమానము ద్రౌపదికి జరిగిన ఘోర పరాభవం కళ్ళారా చూసిన వారు "ఎప్పటికైనా ధర్మం జయిస్తుంది. కౌరవులకు నాశనం తప్పదు" అనుకోవడం నా మనసులో ఇంకా ప్రతిధ్వనిస్తుంది. అందుకే నా కుమారుడని ఉపేక్షించక అలా దీవించాను. కృష్ణా! నేను ఇంకా ఇలా అన్నాను… యుద్ధంలో వెనుతిరిగి పోవడం కంటే వీరమరణం పొందడమే మేలు అన్నాను. అప్పుడే వీరస్వర్గం లభిస్తుంది. వస్తే విజయలక్ష్మితో తిరిగి రా! లేకున్న వీరమరణాన్ని వరించి వీరస్వర్గం అనుభవించు అన్నానయ్యా ! నా కుమారుడు రెండవది నిజంచేసాడు. ఇప్పుడు నేను కడుపు తీపితో ఏడుస్తున్నానే కాని వేరు కాదు. వాడి మరణానికి నేను ఏడవడం లేదు. వీరోచితంగా పోరాడి వీర మరణం పొంది వీరస్వర్గం చేరిన నాకుమారుడి గురించి ఎందుకు దుఃఖిస్తాను. ఈ ముదిమివయసులో నాకూ నా భర్తకు కొడుకుల ఆసరా లేక పోయిందేనన్నదే నా బాధ.   కృష్ణా! నా కుమారుడు అభిమానధనుడు. అష్టైశ్వర్య సంపన్నుడు అలాంటి వాడికి ఇలాంటి మరణమా అన్నదే నా బాధ. ఏమి చేస్తాం విదురుడు ఎంతో చెప్పాడు. నా భర్తకు నా కుమారుడికి ఎన్నో విధముల చెప్పాడు. మదించిన గర్వంతో వారా మాటలను పెడచెవిన పెట్టారు. విదురుడి మాట ఒక్కటి విన్నా దుర్మరణాలు తప్పేవి కదా! పదకొండు అక్షౌహినుల సైన్యమున్న నా కుమారుడు ఇలా ఒంటరి చావు చచ్చాడయ్యా ! నా భర్త, కుమారుడు ఏకచ్ఛత్రాధిపత్యం వహించిన కుఱు సామ్రాజ్యం పరుల హస్తగతం అయిందయ్యా! అది చూసే దౌర్భాగ్యం నాకు పట్టింది" అని…


#గాంధారి వైరాగ్యంతో కోడళ్ళను చూసి దుఃఖించుట:

“కృష్ణా ! పోయిన కొడుకులు ఏటూ పోయారు. బతికి ఉన్న   నా కోడళ్ళ దుఃఖమును చూడ లేక పోతున్నానయ్యా! ఇలాంటి మనో వేదన అనుభవించడానికి వారు చేసిన పాపమేమిటి ! రాజకీయాలేమిటో యుద్ధం ఎందుకు సంభవించిందో ఎరుగని వారికీ ఘోర శిక్ష ఏమిటి. అలా చూడు నా పెద్ద కోడలు భానుమతి భర్త శవాన్ని చూసి ఎలా ఏడుస్తూ తల బాదుకుంటుందో చూడవయ్యా ! కడుపున పుట్టిన కుమారుడి ముఖాన్ని చూసి గుండెలు పగిలేలా రోదిస్తుందయ్యా ! నా కుమారుడు, ఆమె కుమారుడి శవాలు ఆమె కన్నీటితో తడుస్తున్నాయి చూడవయ్యా ! కురులు విరబోసుకుని పిచ్చి వారిలా తిరుగుతున్న నా కోడళ్ళను చూడవయ్యా ! వాళ్ళేమి చేసారని వారికి ఈ చిత్తక్షోభ. నా కుమారుడు సుయోధనుడి సరసన విరాజిల్లిన భానుమతి ముఖాన్ని ఇలా శోకతప్త ముఖంతో నేను ఎలా చూడగలను. నా కుమారులకేమి చచ్చి హాయిగా స్వర్గాన ఉన్నారు. నా కోడళ్ళు గుండెలు అవిసేలా రోదిస్తున్నారు చూడవయ్యా ! వీరి దుఃఖముకు అంతు లేదా ! భీముని చేతిలో హతులైన నాకుమారుల శవాలు చూసి నాకోడళ్ళు భోరు భోరున రోదిస్తున్నారయ్యా ! పాలరాతి భవనాల్లో చందన చర్చిత ముఖాలతో కళ కళ లాడే వారి ముఖాలు ఈ రోజు మరణించిన భర్తల కొరకు కటిక నేల మీద పడి పొర్లి రోదిస్తున్నారయ్యా ! ఇంకా ముద్దు ముచ్చటలు తీరని లేత వయస్కులైన నా కోడళ్ళకు పట్టిన దుర్గతి చూసావా ! ఇదంతా నేను, నా భర్తా చేసిన పాప ఫలితం కాక పోతే ధర్మరాజు నా కుమారులను సంహరిస్తాడా ! అని గాంధారి పలు విధముల విలపిస్తుంది. కృష్ణుడు ఆమె పక్కన నిలబడి మౌనంగా చూస్తున్నాడు. ఆమె మనసులో ఉన్న బాధ, దుఃఖం బహిర్గతమైతే కాని దుఃఖోపశమనం కలుగదని అనుకున్నాడు.


#గాంధారి దుశ్శాసనుడి కొరకు దుఃఖించుట:

ఇంతలో గాంధారి దుశ్శాసనుడి శవాన్ని చూసి మహోద్వేగంతో "కృషా ! వీడేనయ్యా నా కుమారుడు దుశ్శాసనుడు. మహాబలసంపన్నుడు. భీముడి గదా ఘాతానికి బలి అయి ఇలా దిక్కు లేకుండా నేల పడి ఉన్నాడు. భీముడు వీడి గుండెలుచీల్చి రక్తంత్రాగిన తరువాత నిర్జీవుడయ్యాడు. వీడు నా కోడలు జుట్టు పట్టి సభకు ఈడ్చినందుకు ఫలితం అనుభవించాడయ్యా ! భీముడి గుండెలు మండేలా ద్రౌపది ఏడుస్తుంటే … 
వీడు నా కుమారుడు సుయోధనుడికి, అంగరాజు కర్ణుడికి ప్రీతి కలిగించడానికి ద్రౌపది వలువలు ఊడదీయ ఉద్యుక్తుడైన వీడి పాపం ఊరికేపోతుందా! అందుకే దిక్కు లేని చావు చచ్చాడు. వీడి విషయం విని నేను సుయోధనుడితో "కుమారా! ఈ ద్రౌపది తన అన్న కృష్ణుడి సంరక్షణలో ఉన్న విషయం నీకు తెలుసా! ఆమెను ఇంత నీచంగా అవమానించడం మీకు మంచిది కాదు. ఇందుకు పర్యవసానం తెలిసే మీరు ఈ పనికి ఒడిగట్టారా ! భీముడి బలపరాక్రమాలు తెలిసే అతడి భార్య ద్రౌపదిని అవమానించారా ! తక్షణమే ఆమెను విడిచి పెట్టండి. కౌరవకులకాంత ద్రౌపదిని గౌరవించండి. నా తమ్ముడైన శకుని అత్యంత నీచుడు, క్రూరుడు, దౌర్భాగ్యుడు వాడి మాట వినకు,    వాడి స్నేహం వదులు కౌరవవంశాన్ని రక్షించు" అని ఎన్నో విధముల సుయోధనుడికి చెప్పాను. అయినా నా మాటను ఎవరు వినక ఇలా చచ్చారయ్యా కృష్ణా! విధిరాతను తప్పించ ఎవరి తరం కృష్ణా !✍️
.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
                       🌷🙏🌷

   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
                     ➖▪️➖

చూడడం అనేది నిరంతరం ప్రాక్టీస్ చేయాలి.

 110223a1130.     120223-1.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀767.
నేటి…

             *ఆచార్య సద్బోధన:*
                 ➖➖➖✍️

*కత్తిని ఉంచటానికి ఒరను ఉపయోగిస్తాం. అవసరమైనప్పుడు ఒర నుంచి కత్తిని  బయటకుతీస్తాం.*

*పని పూర్తయ్యాక మరలా ఒరలో కత్తిని ఉంచుతాం. *

*ఇక్కడ కత్తి వేరు, ఒర వేరు. ఒరలో ఉన్నంత మాత్రాన కత్తి, కత్తి కాకుండా పోదు.  ఒరని కత్తి ఉపయోగించుకుంటుంది. *

*అలాగే ఆత్మ ఈ శరీరమనే కోశాన్ని ఉపయోగించుకుంటుంది. ఇక్కడ  ఒర  అంటే శరీరము. అలాగే  కత్తి అంటే ఆత్మ అని తీసుకోండి.* 

*పంచకోశాలతో తయారైంది ఈ శరీరము. శరీరంతో  ఉన్నంతమాత్రాన మనిషి ఆత్మ కాకుండా పోడు.*

*చైతన్య స్వరూపమైన ఆత్మ  పంచకోశాలను కలిగిన శరీరంలో ఉంది.  అలాగని ఆత్మ పంచకోశాలు కాదు. దేహమూ కాదు.  ఆత్మ మాత్రమే.*

*పంచకోశాల కన్నా వేరుగా ఉన్న ఈ ఆత్మ గురించి తెలుసుకోవాలి. పంచకోశాలతో కప్పి ఉన్న జీవుడు తాను పరిమితుడనని భావిస్తుంటాడు. వాటి వికారాలన్నీ తనవిగా భ్రమపడతాడు. వాటి గుణాలు తనవే అనుకుంటాడు. తన నిజస్వరూపాన్ని మరచిపోతాడు.*

*విచారణ చేసి చూస్తే, తాను ఈ పంచకోశాలు కాదని, వాటికన్న తాను వేరుగా, విలక్షణంగా, వాటిని గమనిస్తూ, కేవలం సాక్షిగా చూస్తూ ఉన్న ఆత్మ చైతన్యాన్ని అని గ్రహిస్తాడు.*

*చూడడం  అనేది నిరంతరం ప్రాక్టీస్ చేయాలి.*✍️
.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
                       🌷🙏🌷

   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
                     ➖▪️➖

నిజమైన ఆరోగ్యం కోసం…

 1711.  1-9.2️⃣.   110223-8.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀103.
*మన ఆరోగ్యం…

           నిజమైన ఆరోగ్యం కోసం…
                  ➖➖➖✍️

 *ప్రస్తుతం ప్రతి ఒక్కరు తాము అనారోగ్యం బారిన పడిన తర్వాత కానీ ఆరోగ్యం గురించి ఆలోచించడం లేదు.

ముందు జాగ్రత్త చర్యల గురించి అస్సలు పట్టించుకోవడం లేదు. మరి అందరి ఆరోగ్యం బాగుండాలంటే ఏం చేయాలి. మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఒకసారి పరిశీలిద్దాం.‌..

ప్రస్తుతం ప్రతిఒక్కరూ డబ్బు సంపాదన కోసం ఇచ్చే ప్రాముఖ్యత మంచి ఆరోగ్యాన్ని ఎలా సంపాదించు కోవాలి అనే దానికి ప్రాముఖ్యతను ఇవ్వడం లేదు. 

ప్రస్తుతం అందరూ తాము జీవించే తమ జీవనవిధానం వల్ల అనేక అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. అంటే తినే ఆహారాన్ని ఏది తినాలి, ఎంత తినాలి, ఏ సమయంలో తినాలి అనేది, తాగే నీటిని ఎలా తాగాలి, ఎంత తాగాలి, ఎప్పుడెప్పుడు తాగాలి అనేది, నిద్రపోయే సమయం ఎలా ఉండాలి అనేది, శారీరక వ్యాయామం, యోగ చేయడం గురించి సరియైన అవగాహన లేకపోవడం అనేది ప్రధాన కారణంగా చెప్పవచ్చు.

మీరు గమనిస్తే అనారోగ్యాలు ఎలా ఏర్పడతాయి అనేదానికి కారణాలను పరిశీలిస్తే మనకు….  120/80 గా ఉండవలసిన రక్తపోటు 130/85 కన్నా ఎక్కువగా ఉండడం, పొట్ట భాగంలో కొవ్వు అధికంగా చేరడం, వ్యాయామం కొరవడడం, నిద్ర సరిగ్గా లేకపోవడం, ఫాస్టింగ్ షుగర్ 100 ఎంజీ కన్నా ఎక్కువగా ఉండడం, లిపిడ్ ప్రొఫైల్లో HDL అంటే మంచి కొలెస్ట్రాల్ 40ఎంజి కన్నా తక్కువగా ఉండడం, అలాగే ట్రైగ్లిజరైడ్స్ 150 కన్నా ఎక్కువగా ఉండడం.  ఇవన్నీ అనారోగ్యం రావడానికి సహకరిస్తాయి. వీటిలో ఏ మూడు లక్షణాలు మీలో ఉన్నా మీ భావి జీవితంలో రిస్క్ ఎక్కువ ఉన్నట్లే లెక్క. 

అందుకే ప్రతి ఒక్కరు ఆరోగ్యం కోసం పాటించాల్సిన జాగ్రత్తలు, అనుసరించ వలసిన సూత్రాలను తప్పని సరిగా పాటించాలి. ఇవి ప్రివెంటివ్ గా పనిచేస్తాయి.

ముఖ్యంగా మనం తీసుకునే ఆహారంలో పంచదార అతి తక్కువగా ఉండేటట్లు చూసుకోవాలి. లేదా అసలు మానేయడం మరీ మంచిదే. దానికి బదులుగా బెల్లాన్ని వాడుకోవచ్చు. కాఫీలు, టీలలోనే కాకుండా, స్వీట్స్, కేకులు, ఇతర పదార్థాలలో చక్కెర బాగా ఎక్కువగా ఉంటుంది. చెక్కెరను రోజుకు 10 గ్రాములకు మించి తీసుకోకూడదు. అలాగే ఉప్పు అతిగా తీసుకోవడం తగ్గించాలి. నిల్వ ఉన్న పచ్చళ్ళు , ఊరగాయలు వంటి ఆహారపదార్థాల్లో ఉప్పు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వాటిని తగ్గించాలి. 

ఫ్రిజ్ లలో కానీ, వండిన తర్వాత ఎక్కువ సమయం నిల్వచేసిన ఆహార పదార్థాలను కాకుండా తాజా ఆహారాన్ని మాత్రమే తినాలి. 

ఇక రోజుకు 4-5 గ్రాములకు మించి ఉప్పు తీసుకో కూడదు. నూనెల్లో రోజుకు 30 గ్రాముల కొవ్వు పదార్థాలు మించకుండా  ఉండాలి.

కనిపించని కొవ్వు పదార్థాలు బయట తయారు కాబడిన ఆహార పదార్థాలలో, బేకరీ ఫుడ్స్ లో అధికంగా ఉంటుంది. ముఖ్యంగా ట్రాన్స్ ఫ్యాట్స్ ఆరోగ్యానికి హాని చేస్తాయి. ఈ హైడ్రోజినేటెడ్ ఫ్యాట్స్ అనేవి ఎక్కువగా బేకరీ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్ లో, పలుమార్లు కాచబడిన నూనెలలో దేవేసిన బజ్జీలు, వడలు, బోండాలు, బుగ్యాలలో ట్రాన్స్ ఫ్యాట్స్ అధికంగా ఉంటాయి.

ఇక రోడ్డు పక్కన బండ్లలో అమ్మే పానీ పూరి, బేల్ పూరి, గోబీ మంచూరియా వంటివి, ఫ్యాషన్ పేరుతో హామ్ డెలివరీ చేస్తున్న పిజ్జా, బర్గర్ వంటివి కూడా రోగాల బారిన పడవేస్తాయి. 

అందుకే అలాంటి వాటిని తినడం మానేసి, ఆహారంలో చిన్న చిన్నమార్పులు చేసుకోవడం ద్వారా అనారోగ్యాలను దరిచేరకుండా చూసుకోవచ్చు. రుచిగా ఉంది కదా అని ఏ ఆహార పదార్థాలను కూడా అతిగా తినకూడదు. సమతుల ఆహారం తీసుకోవాలి.

పండ్లు, కాయలు, ఆకుకూరలు, కూరగాయల్లో పీచు పదార్థం అధికంగా ఉంటుంది.  కాబట్టి వీటిని ప్రతిరోజు ఆహారంలో తీసుకోవాలి. వీటితో పాటు తృణధాన్యాలు, సీడ్స్, నట్స్… మెనూలో ఉండేలా చూసుకోవాలి. 

దీంతో పాటు సమయానికి ఆహారం తీసుకోవడం, తగినంత వ్యాయామం చేయడం తప్పనిసరి. 

ఏ సమయానికి ఎంత నీరు తాగాలి అనేది కూడా తెలుసుకోవాలి. మనం ఉదయం తాగిన 1-2 లీటర్ల నీరు 11 గంటల వరకూ మన శరీర అవసరాలను తీర్చడానికి సరిపోతుంది. వీలైతే ఆ నీరు గోరు వెచ్చనిదై తేనె కలిపినదైతే మరీ మంచిది. 

ఆ సమయం నుంచి శరీరానికి నీటి అవసరం మళ్లీమళ్లీ ఉంటుంది. పగలు తాగిన నీరు శరీరాన్ని శుభ్రపర్చడానికి, శరీరాన్ని ఎండ నుంచి కాపాడు కోవటానికి, పని చేసినపుడు కండరాల్లో పుట్టే వేడిని చల్లార్చడానికి, జీర్ణాది రసాల ఉత్పత్తికి సహకరిస్తుంది.

పగటిపూట మనం రెండున్నర లీటర్లకు తక్కువ కాకుండా నీరు తాగితే మంచిది. ఈ నీటిని ఎప్పుడు పడితే అప్పుడు, ఆహారం తినేటప్పుడు తాగడం కాకుండా ఒక పద్ధతి ప్రకారం తాగితే మంచిది. 

నీటిని తాగిన తర్వాత 25-30 నిమిషాలు గ్యాప్ ఇచ్చి ఏదన్నా టిఫిన్ తినొచ్చు. టిఫిన్ తినేటప్పుడు  నీరు తాగొద్దు. అలాగని టిఫిన్ తిన్న రెండు గంటల తర్వాత నీటిని ఒకేసారి ఎక్కువ మోతాదులో కూడా తాగకూడదు. అలా తాగితే బరువుగా, ఆయాసంగా ఉంటుంది. ఈ నీటిని రెండు, మూడు దఫాలుగా అప్పుడొక గ్లాసు, అప్పుడొక గ్లాసు చొప్పున నీటిని తాగాలి. 

మధ్యాహ్నం భోజనానికి అరగంట ముందు వరకూ నీరు తాగి ఆపి వేయాలి. ఇక భోజన సమయంలో మంచినీరు తాగొద్దు. అంటే గొంతు పట్టినపుడు గానీ, మాత్రలు మింగడానికి గానీ ఒక గుక్కెడు నీరు తాగవచ్చు.
ఎందుకంటే తినే ఆహారంతో పాటు నీటిని అధికంగా తాగితే జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుంది. అలాగే బొజ్జ కూడా పెరుగుతుంది. 

ఇక మధ్యాహ్నం భోజనం అయిన రెండు గంటల తర్వాత నుంచి 2-3 గ్లాసులు గానీ, లీటరు నుంచి లీటరుంపావు వరకూ నీటిని తాగవచ్చు. ఇలా తాగడం వల్ల ఆ నీరు జీర్ణమైన ఆహారాన్ని పేగులు పీల్చుకోవటానికి సహకరిస్తుంది. 

55-60 సంవత్సరాలు పైబడిన వారు సాయంకాలం 4-5 గంటలు దాటిన తర్వాత నీరు తాగడం తగ్గిస్తే, రాత్రి వేళల్లో పలుమార్లు మూత్రానికి వెళ్లాల్సిన సమస్య ఉండదు. 

ఎవరికన్నా రాత్రి 9-10 గంటలకు దాహం అనిపిస్తే అరగ్లాసు లేదా గ్లాసు నీరు తాగి పడుకోవచ్చు. 

ఈ సూచనలు శరీరానికి కావాల్సిన కనీస నీటి అవసరాన్ని తెలిపేవి మాత్రమే.

శరీరానికి పోషక ఆహారం, మంచి నీరు ఎంత అవసరమో, సరైన నిద్ర కూడా అంతే అవసరం. సరైన సమయంలో నిద్ర పోవాలి. 

కనీసం రాత్రి 9-10 గంటలకు తప్పని సరిగా పడుకోవాలి. ఇక ఉదయం కనీసం 5 గంటలకు లేచి వ్యాయామం, యోగ లేదా వాకింగ్, ఆటలు వంటి వాటిని తప్పకుండా ఆచరించాలి. 

నిద్ర 6 గంటలకు తక్కువ కాకుండా 8 గంటలకు ఎక్కువ కాకుండా చూసుకోవాలి. 

నిద్ర ఎక్కువ తక్కువలు కావడం వల్ల బిపి, షుగర్, గుండె పోటు వంటి జబ్బులకు లోనయ్యే అవకాశం ఉంటుంది. 

ఇక పోషకాహారం, సరైన నీరు, సరైన నిద్రలతో పాటుగా తగినంత వ్యాయామం తప్పనిసరిగా చేయాలి. ఇలాంటి జీవన విధానాన్ని అనుసరించే వారు ఆరోగ్య వంతులుగా జీవిస్తారని హామీ ఇస్తున్నాను.

ప్రస్తుతం కరోనా కారణంగా వర్క్ ఫ్రం హోం అంటూ ఇంటివద్దనే పని చేసేవారు సరైన ఆహారాన్ని సరైన సమయంలో తీసుకోవడం లేదు. సరైన సమయంలో సరైన నిద్ర నియమాలను పాటించడం లేదు. అందువల్ల కూడా అనేక రకాల జబ్బుల బారిన పడే అవకాశాలు ఉన్నాయి. వీరైతే అర్థరాత్రి దాటిన తర్వాత కూడా కంప్యూటర్ల ముందు పోరాడి ఎప్పుడో పడుకొని ఉదయం పది గంటల వరకు నిద్రపోతున్నారు. ఇలా సరైన సమయంలో ఆహారం తీసుకోవడం లేదు. సరైన సమయాలలో నిద్రించడం లేదు. ఇక తినే ఆహారాన్ని బయట ఆర్డర్ ఇచ్చి తెప్పించు కొంటున్నారు. అవి ఎప్పుడు తయారయ్యాయో, ఎన్ని రోజులు నిల్వ చేయబడ్డాయో ఆ దేవుడికే తెలియాలి. దీని ప్రభావం ఇప్పుడు కనిపించక పోయినా భవిష్యత్తులో అనేక రకాల జబ్బులను కొని తెచ్చుకున్నట్లే అవుతుంది. జాగ్రత్త సుమా..! 

కాబట్టి మిత్రులారా ! అందరూ కూడా ఆరోగ్యాన్ని కాపాడుకునే విషయంలో సరైన పద్ధతులను పాటిస్తూ ఆనందంగా, ఆరోగ్యంగా, మానసిక ప్రశాంతతో, దీర్ఘాయుష్షుతో జీవిస్తారని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ…✍️

          _**Rama Bhaktha Guruji.**_
            _**MD in Acupuncture.**_
               _**Cell-8328170075**_

.                      🌷🙏🌷

   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

భక్తి తొమ్మిది విధాలని భాగవతం చెబుతున్నది.

 0402.     2-7.    110223-7.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*హృదయం కరుగుతుంది….*

                    *రామభక్తి*
                  ➖➖➖✍️

*భక్తి తొమ్మిది విధాలని భాగవతం చెబుతున్నది. భక్తిలోనిది మొదట శ్రవణం, సంకీర్తనం.* 

*రామనామం నిత్య పారాయణం చేసుకునేవానికి సాధు సత్సంగాలు దర్శించుకునేవారికి రామదర్శనం, రామానుగ్రహం కల్గుతుందని రామాయణంలోని సుందరాకాండ తెల్పుతున్నది.* 

*పాప పుణ్యాలు మనసులోనికి రాకుండా మనసును దైవమునందే నిల్పిన వానికి రామ మహిమ తెలుస్తుంది.*

*‘సర్వ ధర్మాన్ పరిత్యజే మమేకం శరణం’ అని గీతలో భగవంతుడు ధృవపరిచినట్లు, రాముడు మన కష్టాలలో తోడు ఉంటానని భగవద్గీతలో తెలియజేస్తాడు. నామ సంకీర్తనం ఒంటరిగా చేసినప్పటికీ సంకీర్తనంలో తన్మయత్వం చెందటమే భక్తికి పరాకాష్ఠ. రామనామంలో ఆయనను దర్శించిన ఆనందబాష్పాలు కంటినుండి ధారాళంగా కారినపుడే అసలైన భక్తి, రామానుగ్రహం కలుగుతుంది.*

*హృదయంలో కరుణారసము, చేతలో పరోపకారము, నోటితో మంచి మాటలు, రామనామ స్మరణ, నిత్యం జరుగుతున్నపుడే రామభక్తి కలుగుతుంది.* 

*ఒకనాడు ఒకతను కబీరుదాసు గారి వద్దకు వచ్చి అతని భక్తి చిట్టా చెప్పుకున్నాడు. “అయ్యా, నేను ఇన్ని యాత్రలు చేసాను, ఇన్ని పూజలు చేశాను, ఇన్ని గుళ్లు తిరిగాను, ఇన్ని నదులలో స్నానం చేసినాను, ఇన్నిసార్లు రామనామము చేసినాను.” అని తెలియజేశాడు.* 

*దానికి ఆయన “నాయనా, ఇన్ని యాత్రలు, ఇన్ని నదులలో స్నానం చేశానని చెప్పావు. నేను ఒక చేదు దోసకాయ ఒకటి ఇస్తాను. దానిని నీ వెంబడి తీసికెళ్లి నీతోపాటు స్నానం చేయించుకొని తీసుకొని రమ్మని ఒక చేదు దోసకాయ అతనికిచ్చి పంపాడు.* 

*అతడు అలాగే అతనితోపాటు యాత్రలు తిప్పుకుంటూ అతనితోపాటు స్నానం చేయించుకొని వచ్చి కబీర్‌దాసుకు ఇచ్చాడు.*

*అపుడు ఆ దోసకాయను ముక్కలు చేసి తినమని చెప్పాడు.ఎలా ఉందంటే, చేదుగా ఉందన్నాడు.* 

*“చూశావా, ఇన్ని నదులలో తిరిగినా దాని చేదుతనము పోలేదు. మనలో అహంకారం ఉన్నంతవరకు ఎన్ని తీర్థయాత్రలు చేసినా అది వ్యర్థమే అవుతుంద”ని చెప్పాడు.*

*కబీరుదాసు రామభక్తుడు. నిత్య రామనామ పారాయణుడు. రామభక్తులన్నా, సాధువులన్నా సత్పురుషులన్నా, సత్సంగాలన్నా ఎంతో ప్రీతి.* 

*కబీరుదాసు కడు పేదవాడు. అతని ఇల్లాలు కూడా మహాసాధ్వి. అతను ఏమి చెప్పినా కాదనదు. అతనికి తగ్గ ఇల్లాలు. వచ్చినవారికి కాదనక భోజనము పెట్టి పంపిస్తుంది. అతడు మాత్రం ఇంటిలో ఏమున్నది, ఏది లేదు అన్నది పట్టించుకోడు. ఆ ఇల్లాలు కూడా ఇది లేదు, అది లేదు అని అతనితో ఎన్నడూ చెప్పకపోయేది.*

*ఒకనాడు కబీరింటికి రామభక్తులు వచ్చారు. కబీరు వారిని ఆతిథ్యము తీసుకోమని బలవంతం చేశాడు. దానికి వారు అంగీకరించారు. తనభార్యను పిలిచి వారికి భోజనసదుపాయం చేయమని చెప్పి     వారితో కలసి రామనామసంకీర్తనలో మునిగిపోయాడు. కాని ఆ ఇల్లాలు ఇంటిలో సరుకులు నిండిఉన్నాయికదా ఎలా భోజన సదుపాయం చేయవలెనా అని ఆలోచించి దగ్గరగా ఉన్న షావుకారు దగ్గరకువెళ్లి విషయం చెప్పి సాయం చేయమని కోరింది. ఆ షావుకారు కోరరాని కోర్కెతీరిస్తే వెచ్చాలు ఇస్తానని అన్నాడు. ఆరాత్రికి వాని కోరిక తీరుస్తానని చెప్పి ఆమె వెచ్చాలు తీసుకొని వచ్చి వంటపూర్తిచేసి రామభక్తులకు భోజనసదుపాయం చేసింది.*

*వారు కబీరు దంపదులను దీవించి వెళ్లారు. చివరకు షావుకారు సంగతి కబీరుతో చెప్తూ కంటనీరు నింపుకుంది. కబీరు “అయ్యో దీనికి చింతించవలదు. రామభక్తులకు చేసిన సేవ ఎంతో పుణ్యాన్నిస్తుంది. ఆరాముడే అన్నీ చూసుకొంటాడు. పద షావుకారు నీకోసం చూస్తుంటాడు. నేను నీకు తోడువస్తాను!”  అని ఆమెను తీసుకొని వెళ్లాడు.* 

*ఆసంగతి తెలుసుకొన్న షావుకారు వారిద్దరిని పిలిచిఅతిథి మర్యాద చేసి వారికాళ్లు కడిగి క్షమించమని కోరాడు. షావుకారుకు వారిలో సీతారాములు కన్పించారు. అంతటి మహానుభావుడు కబీరు.*

*పాపులనుఉద్ధరించడానికి ఇలాంటి కర్మయోగులు జన్మిస్తారు.*

*రామభక్తులంటే శ్రీరామచంద్ర స్వరూపులే.*✍️
.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
                       🌷🙏🌷

   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
                     ➖▪️➖

మహావిష్ణువుని నారాయణుడు అని పిలవడం వెనుక కారణాలు ఏంటి*?

 0902.  2-6.   110223-5.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀


               *నారాయణుడు*
                 ➖➖➖✍️

*మహావిష్ణువుని నారాయణుడు అని పిలవడం వెనుక కారణాలు ఏంటి*?

*శ్రీ మహావిష్ణువు లోక కళ్యాణం కోసం దశావతారాలు ధరించాడు॥*

*ఇందులో ఒక్కో అవతారానికి ఒక్కో విశిష్టత అనేది ఉన్నది.*

*అయితే త్రిమూర్తులలో ఒకడైన                           శ్రీ మహావిష్ణుని అనేక పేర్లతో కొలుస్తుంటారు.*

*అందులో ఒకటి నారాయణుడు. మరి ఈ స్వామిని నారాయణుడు అని పిలవడం వెనుక కారణాలు ఏంటి? నారాయణుడు అంటే అర్ధం ఏంటనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం…*

*ప్రాణికోటి మ‌నుగ‌డ‌కు నీరు అత్యంత ఆవ‌శ్య‌కం. నీరు లేక‌పోతే మ‌నం లేము. అయితే నారాయ‌ణుడు అన్న పేరులో ‘నారము’ అంటే ‘నీరు’ అనే అర్థం వ‌స్తుంది. అదేవిధంగా ‘ఆయ‌ణుడు’ అంటే దారి చూపే వాడు అని అర్థం వస్తుంది. అంటే స‌మ‌స్త ప్రాణికోటికి నీటిని అందించే వాడు క‌నుక‌నే విష్ణువుకు ‘నారాయ‌ణుడ‌’నే పేరు వ‌చ్చింది.*

*అంతేకాదు, విష్ణువు నీటి నుంచి ఉద్భ‌వించిన‌ట్టుగా పురాణాలు చెబుతున్నాయి. అందుకు కూడా ఆయ‌న్ను నారాయ‌ణుడ‌ని పిలుస్తారు.*

*ఇవే కాకుండా విష్ణువును నారాయ‌ణుడ‌ని పిల‌వ‌డానికి ఇంకొన్ని కార‌ణాలు కూడా ఉన్నాయి.*

*అవేమిటంటే నారదుడు ఎల్ల‌ప్పుడూ నారాయ‌ణ‌, నారాయ‌ణ‌ అంటూ స్మ‌ర‌ణ చేసుకుంటూ ఉంటాడు. ఈ క్రమంలో విష్ణువును నారాయ‌ణుడని పిల‌వ‌డం మొద‌లుపెట్టార‌ట‌*

*అదేవిధంగా గంగాన‌ది విష్ణువు పాదాల నుంచి ఉద్భ‌వించ‌డం వ‌ల్ల ‘విష్ణు పాదోదకం’ అని పేరు వ‌చ్చింద‌ట‌. దీంతోపాటు విష్ణువు ఎల్ల‌ప్పుడూ నీటిలో నివ‌సిస్తాడు కాబ‌ట్టి ఆయ‌న‌కు నారాయ‌ణుడ‌నే పేరు వచ్చిందని చెబుతారు.*

*ఇంకా నారాయణుడు అంటే పరమాత్మా స్వరూపుడు.*

*భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునకు,              “ఓ అర్జునా నీకు నాకు ఇద్దరికీ శరీరాలు వున్నవి ఇద్దరం కర్మలను చేస్తున్నాము కానీ నేను వీటికి బందీకాను ఎందుకంటే నేను జ్ఞానాన్ని కలిగివున్నాను   కాని నువ్వు అజ్ఞానంలో వున్నావు  ఆ అజ్ఞానంతో నువ్వు చేసే కర్మలకు నేను చేస్తున్నాను  అనే అహంకారంతో నీ పైన వేసుకొని బందీ అవుతున్నావు. కావున నీవు జ్ఞానివై యోగివై, నీవు చేసే కర్మలు నిష్కల్మషంగా, లోక కల్యాణార్ధంగా, ఫలాసక్తిరహితుడవై, నీవు చేసే ప్రతి పని నాకు సమర్పించి నీ కర్తవ్యాన్ని మాత్రమే నిర్వర్తించు అర్జునా!”  అని చెప్పాడు.*

*అంటే ఇద్దరూ శరీరాలను కలిగి వున్నారు, ఇద్దరి శరీరాలను వుత్తేజపరిచే ఆత్మ కూడ ఒకటే.*

*కానీ శ్రీకృష్ణుడు మాత్రం పరమాత్ముడు అయ్యాడు అదే అర్జునుడు నరుడయ్యాడు. ఎందుకంటే అర్జునుడు అజ్ఞానంలో ఉన్నాడు కానీ శ్రీ కృష్ణుడు జ్ఞానాన్ని కలిగి ఉన్నాడు అదియే భేదం.*

*అందుకే వీరిని నర నారాయణులు అని కూడ అంటారు.*✍️
.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
                       🌷🙏🌷

   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!

శ్రీ మహాభారతంలో చిన్ని కథలు: #ధృతరాష్ట్రుడికి వ్యాసుడు దేవరహస్యం చెప్పుట:

 100223c1857.    110223-3.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀267.

                   శ్రీ మహాభారతం 
                   ➖➖➖✍️
                    267 వ భాగం
       శ్రీ మహాభారతంలో చిన్ని కథలు:

#ధృతరాష్ట్రుడికి వ్యాసుడు దేవరహస్యం చెప్పుట:

ఒకసారి నేను దేవసభకు వెళ్ళాను. అక్కడ ఇంద్రాది దేవతలు నారదాది మహా మునులు ఉండగా భూదేవి అక్కడకు వచ్చి దేవతలను చూసి ఇలా అన్నది… "దేవతలారా ! ఇదివరకు మీరు నాకు పెరిగిన భూభారం తగ్గించడానికి ఉత్సుకత చూపారు. ఎందుకనో ఆ మాట మరిచారు. నాకు రోజు రోజుకు భారం పెరిగి పోతోంది. దీనిని తగ్గించే ఉపాయం ఆలోచించండి" అని అడిగింది. 

అప్పుడు శ్రీమహావిష్ణువు చిరునవ్వుతో…       
“భూదేవీ ! నీవడిగిన దానికి తగు సమయం ఆసన్నమైంది. ధృతరాష్ట్రుడు అనే మహారాజుకు నూరుగురు కుమారులు కలుగుతారు. అందులోని జ్యేష్టుడైన దుర్యోధనుడు నీ కోరికను తీరుస్తాడు. ఇది త్వరలో సంభవించగలదు. అతడి కారణంగా కుఱుక్షేత్ర సంగ్రామం జరుగుతుంది. అతడికి ఈ భూమిలోని రాజులంతా సాయానికి వచ్చి నశించి పోతారు. సోదరసమేతంగా దుర్యోధనుడు మరణిస్తాడు. నీ భారం తగ్గ గలదు" అని పలికాడు. 

ఆ మాటలకు భూదేవి సంతసించి అక్కడ నుండి వెళ్ళి పోయింది. విష్ణువు ఆదేశానుసారం కలి పురుషుడు దుర్యోధనుడిగా జన్మించాడు. అతడు మహా బలిష్టుడు, కోపిష్టి, పరుల ఉన్నతిని సహించ లేడు. అతడు ఎవరినీ లక్ష్యపెట్టక అందరితో వైరము పెట్టుకుని అతడికి తోడుగా అతడి మేన మామ శకుని, తమ్ముడు దుశ్శాసనుడు, అంగరాజు కర్ణుడు అనుచరులుగా ఉంటారు. అనేక దుష్కర్మలు ఆచరించి వాటి కారణంగా సోదర, బంధు మిత్ర సమేతంగా నశిస్తాడు. ఇది దేవతల అభీష్టం కనుక నీవు దుఃఖించ పని లేదు.”


#వ్యాసుడు ధృతరాష్ట్రుడికి ధైర్యంచెప్పుట:

కానీ నీమనసులో ఒక సందేహం ఉంది. పాండుసుతులు నిన్ను ఆదరిస్తారో లేదో అని శంకిస్తున్నావు. పాండవుల వలన నీకు కీడు జరుగదు. నీ కుమారుడికి భూమిని అంతా పాలించాలని దుర్భుద్ధి పుట్టి పాండవుల రాజ్యమును అన్యాయంగా అపహరించి వారి రాజ్యాన్ని వారికి ఇవ్వక   వారికి కీడు తలపెట్టినా వారు నీ ఎడల ఇంచుక అపకారబుద్ధిని ప్రదర్శించ లేదు. సంధి కొరకు ప్రయత్నించారు. నేను కూడా అనేక విధముల సంధి చేసుకొనుట మంచిదని నీకుమారునకు చెప్పాను. నీ కుమారుడు ఎవరి మాటలు లక్ష్య పెట్టక ఇప్పుడు ఫలితం అనుభవించాడు. ఇదంతా దైవనిర్ణయం. ఎవరూ తప్పించ లేరుకనుక కనుక నీ కుమారుల కొరకు నీవు చింతించపని లేదు. నీ తమ్ముని కుమారుడు ధర్మరాజు అజాతశత్రువు. అతడు సాటి మనుష్యులయందే కాదు పశుపక్షులందు జాలి కలిగి ఉంటాడు. ఈ విషయము నీకూ తెలుసు. ధర్మరాజుకు నీయందు విముఖత లేదు. కనుక పాడవులను నీ కుమారుల వలె ఆదరించు. మహాజ్ఞానివైన నీవు నీ శోకాన్ని జ్ఞానాగ్నిలో దగ్ధంచెయ్యి. ప్రశాంతిని పొందు" అని పలికాడు వ్యాసుడు. 

ధృతరాష్ట్రుడు వ్యాసుడితో…  “మహానుభావా ! అమృతతుల్యమైన 
నీ మాటలవల్ల నాకు దుఃఖోపశమనం కలిగింది. నేను పాండవులను 
నా కుమారుల వలె ఆదరిస్తాను" అని పలికాడు. 

ఆమాటలు విని వ్యాసుడు ధృతరాష్ట్రుడిని ఆశీర్వదించి వెళ్ళాడు 

ధృతరాష్ట్రుడు సంజయుడిని చూసి.. 
"సంజయా ! మనం యుద్ధ భూమికి వెళదాము, అందుకు కావలసిన సన్నాహములు కావించండి. గాంధారిని అంతఃపుర స్త్రీలను ప్రయాణముకు సిద్ధం కమ్మని చెప్పు" అన్నాడు. 

సంజయుడు ధృతరాష్ట్రాదులు యుద్ధ భూమికి పోవడానికి సన్నాహాలు పూర్తి చేసాడు.


#ధృతరాష్ట్రుడు గాంధారి యుద్ధ భూమికి వెళ్ళుట:

పుత్రశోకంతో గాంధారికి అడుగులు తడబడుతున్నాయి. గాంధారి కోడళ్ళు కంటికిమంటికి ఏకథారగా ఏడుస్తున్నారు. దుఃఖ భారంతో నడుస్తున్న వారు పైట తొలగినా జుట్టు విడివడినా పట్టించుకునే స్థితిలో లేరు. కుంతీదేవి వారిని ఓదారుస్తోంది. అందరూ ఓదారుస్తున్నారు. హస్థినాపురంలో ఉన్న సాధారణ స్త్రీలపనీ అలాగే ఉంది. వారిని ఓదార్చే వారే కరువైయ్యారు. పురుషులంతా యుద్ధ భూమిలో మరణించగా భార్యాబిడ్డలు అనాధలవలె మిగిలారు. వాళ్ళలో వాళ్ళు   ఒకరిని ఒకరు ఓదార్చుకుంటున్నారు. అందరి ఇళ్ళు ఆర్తనాదాలతో నిండి పోయాయి. ఇదంతా చూసి విదురుడికి మనసు కలత చెందింది. యుద్ధపరిణామం ఇంత భయంకరంగా ఉంటుందా ! ఎంత మందిని అని ఓదార్చగలడు. కొంత దూరం నడిచేసరికి రధికత్రయం ధృతరాష్ట్రుడి వద్దకు వెళ్ళి… 
"మహారాజా ! నీ కుమారుడు సుయోధనుడు దేవతలు మెచ్చేలా యుద్ధం చేసి వీరమరణం చెందాడు. మేము ముగ్గురం తప్ప మిగిలిన కుఱు సైన్యమంతా మరణించింది" అన్నారు.


#కృపాచార్యుడు భీమసుయోధన యుద్ధం వర్ణించుట:

గాంధారిని చూసిన కృపాచార్యుడు దుఃఖం ఆగక "అమ్మా గాంధారీ ! నీ కుమారులు యుద్ధ భూమిలో వీరోచితంగా పోరాడి తమ ప్రాణాలు సమర్పించి వీరస్వర్గం అలంకరించారు. కనుక నీవు దుఃఖించకమ్మా ! 
నీ కొడుకుల్లో ఒక్కడూ యుద్ధ భూమిలో వెన్నిచ్చి పారి పోలేదు. యుద్ధముకు జంక లేదు. అమ్మా ! పాండవులకు జయించినా సంతోషం లేదు. భీముడు సుయోధనుడిని అధర్మంగా నాభి కిందభాగాన కొట్టి పడగొట్టింది చాలక తలను కాలితో తన్నాడు. అది విని మాకు కోపం ఆగలేదు. మేము ముగ్గురం పాండవ శిబిరంలో ప్రవేశించి వారి కుమారులను, బంధువులను పాంచాల రాకుమారులను, వారి సైన్యమును గజములను హయములను దారుణంగా చంపాము. కనుక పాండవులవిజయం వ్యర్ధమైంది. ఆ సమయంలో పాండవులు, శ్రీకృష్ణుడు, సాత్యకి అక్కడ లేరు కనుక బ్రతికి పోయారు.
లేకున్న అపాండవమై సుయోధనుడి ఆఖరి కోరిక నెరవేరేది. మేము అర్ధరాత్రి పాడవుల కుమారులను, బంధువులను ససైన్యంతో చంపిన విషయం తెలుసుకున్న పాండవులు క్రోధంతో మమ్ము వెతుకుతుంటారు. కనుక మాకు శలవిప్పించండి వెళతాము" అని శలవు తీసుకుని తమ తమ రధముల మీద వెళ్ళారు. కొంత దూరం పోయిన కృపాచార్యుడు వెనక్కు తిరిగి హస్థినకు వెళ్ళాడు. కృతవర్మ ద్వారకకు వెళ్ళాడు. అశ్వత్థామ గంగా తీరమున ఉన్న వ్యాసాశ్రమానికి వెళ్ళాడు. ఓ జనమేజయ మహారాజా ! వ్యాశ్రమంలో జరిగిన విషయం నీకు ముందే చెప్పాను కదా ! తరువాత ధృతరాష్ట్రుడు అంతః పుర స్త్రీలతో సహా యుద్ధభూమికి వెళ్ళాడు.


#ధర్మరాజు ధృతరాష్ట్రుడికి ఎదురేగుట:

ధృతరాష్ట్రుడు యుద్ధభూమికి వస్తున్నాడు అని తెలిసి ధర్మరాజు తన తమ్ములతోనూ కృష్ణుడితోనూ ధృతరాష్ట్రుడికి ఎదురేగాడు. కాని తన కుమారులను అంరదినీ పోగొట్టుకుని మనసంతా దహించుకు పోతున్న మనసుతో వస్తున్న ధృతరాష్ట్రుడిని చూడడానికి ధర్మరాజు మనసులో కలవర పడ్డాడు. ధర్మరాజు వడివడిగా ధృతరాష్ట్రుడికి ఎదురు వెళ్ళాడు. అతడి వెంట సాత్యకి, భీముడు, అర్జునుడు, నకులసహదేవులు, ద్రౌపది వెళ్ళారు.

#కుఱుసామ్రాజ్య ప్రజలు ధర్మరాజును నిందించుట:

ధర్మరాజును చూసి కౌరవ వనితలు హాహాకారాలు చేసారు. మరి కొంత మంది ధర్మరాజును తిట్ట సాగారు 
"ఇతడు ధర్మరాజట ! ఇతడికి ధర్మం తెలుసా ! ఇతడికి జాలి, దయా ఉన్నాయా ! ఉంటే తాతలను, తమ్ములను, బంధువులను, మిత్రులను, గురువులను, కుమారులనూ చంపాడు. వీడికి కనికరమేమిటి ?" అని ఈసడించుకొనగా ! మరి కొంత మంది ధర్మరాజుకు వెళ్ళి …. "ఓ ధర్మరాజా ! చదువులు చెప్పిన గురువునే చంపడానికి నీకు మనసెలా ఒప్పింది?" అని అడిగారు. మరికొంత మంది…
 "ఓయీ ధర్మరాజా ! చెల్లెలి భర్త అని చూడక జయధ్రధుడిని చంపించావే ! స్మశానం లాగా మారిన ఈ రాజ్యం అంతా కట్టకట్టుకుని ఊరేగు" అన్నారు. 

ఎవరేమన్నా  పాండవులు ఒక్క మాట కూడా మాట్లాడ లేదు. 

అయినా వారు తిట్టడం ఆపలేదు. ఇంకొంత మంది పాండవులకు అడ్డంగా వచ్చి "ఓయీ ! ధర్మరాజా ! నీ వలన కాదా ! అభిమన్యుడు మరణించింది, ద్రౌపది కొడుకులంతా వధించబడింది. నీ మరుదులందరినీ వధించినా నీ రక్త దాహం తీరలేదా !" అన్నారు. 

అందరి తిట్లను భరిస్తూ ధర్మరాజు ధృతరాష్ట్రుడి వద్దకు వెళ్ళాడు. పక్కన ఉన్న వారు ధర్మరాజు వచ్చాడని చెప్పగానే ధృతరాష్ట్రుడిలో కోపం ముంచుకు వచ్చి భోరున ఏడుస్తూ ధర్మరాజును కౌగలించుకున్నాడు.


#ధృతరాష్ట్ర హృదయం:

తరువాత ధృతరాష్ట్రుడికి పక్కన ఉన్న వారి వలన భీమార్జున, నకుల సహదేవులు కూడా వచ్చారని వినగానే భీముడు అన్న మాట ధృతరాష్ట్రుడిలో కోపాగ్నిని రగిల్చింది. అతడి ముఖం వికృతంగా మారింది దహించుకు పోతున్న హృదయంతో అతడిని కౌగలించుకోబోయాడు. ఏదో ప్రమాదం జరుగుతుందని ముందుగా ఊహించిన కృష్ణుడు తాను ముందే సిద్ధంగా ఉంచిన భీముని విగ్రహాన్ని అతడి ముందుకు తోసాడు. లోహవిగ్రహమే భీముడు అనుకుని ధృతరాష్ట్రుడు ఘాఢకౌగిలిలో బంధించి దానిని ముక్కలు చేసాడు. ఆ ముక్కలు గుచ్చుకుని ధృతరాష్ట్రుడి శరీరానికి గాయాలు అయ్యాయి. ముఖం నుండి రక్తం స్రవించగా… అతడు మూర్చిల్లాడు. తరువాత… "నా కుమారులను చంపిన వాడిని చంపి నా పగ తీర్చుకున్నాను" అంటూ లేచాడు. అతడి ముఖంలో సంతోషం వెల్లి విరిసినా పక్కన ఉన్న వారు ఏదైనా అనుకుంటారన్న జంకుతో దుఃఖాన్ని అభినయిస్తూ భీముడి మరణానికి ఏడవసాగాడు. పక్కన ఉన్న శ్రీకృష్ణుడు ధృతరాష్ట్రుడి భుజం తట్టి.. “ధృతరాష్ట్ర మహారాజా ! భీముడు జీవించే ఉన్నాడు. నీవు దుఃఖించవలసిన అవసరం లేదు. భీముని మీద నీకు ఉన్న క్రోధం ముందుగా ఊహించి అతడికి బదులుగా భీముని వంటి విగ్రహాన్ని 
నీ ముందుంచాను.  నీవు నలిపింది భీముని విగ్రహాన్నే కాని భీముడిని కాదు. ధృతరాష్ట్ర మహారాజా ! నీ బలం ముందు ఈ భీముడెంత ! ఈ మూడు లోకాలలో   నీకు సాటి రాగల బలాఢ్యుడెవ్వడు !    కొడుకులు పోయారన్న దుఃఖంతో భీముని చంపాలనుకున్నా భీముడికి నీ చేతిలో చావు లేదు కదా ! అయినా మహారాజా ! భీముడే కాదు పాండవులు అందరిని చంపినా నీ కుమారులు తిరిగి వస్తారా? అనవసరంగా అపవాదు మూట కట్టుకోవడం తప్ప" అన్నాడు.


#శ్రీకృష్ణుడు ధృతరాష్ట్రుడి దోషం ఎత్తి చూపుట:

ధృతరాష్ట్రుడు సిగ్గుతో తలవంచుకున్నాడు. తనవంటికి అంటుకున్న రక్తం గాయాల నుండి స్రవిస్తున్న రక్తం కడుక్కున్నాడు. తిరిగి కృష్ణుడు "ధృతరాష్ట్ర మహారాజా! వేద వేదాంగ పారంగతుడవు ఎన్నో శాస్త్రములను పురాణములను విని వాటి సారం గ్రహించిన నీవు నీ తప్పు తెలుసుకోకుండా ఇతరులను నిందిస్తూ నీలో నీవే దుఃఖిస్తున్నావు. నాడు నేను, భీష్ముడు, ద్రోణుడు, విదురుడు, మహామునులు నీకు పరిపరి విధముల చెప్పినా లక్ష్యపెట్టక కోరి యుద్ధం కొని తెచ్చుకుని ఇప్పుడు ఫలితం అనుభవిస్తున్నావు. స్వయంకృతాపరాధముకు చింతించిన ఫలమేమి ! భీమార్జునులను ఎదుర్కొని గెలువగల వీరులు ఈ ఉర్విలో ఉన్నారా! అది నీవు ఎరుగవా ! నీ మనస్సును నీవు నియంత్రించ లేక పోయావు. నీకుమారుడి చెడునడతను అదుపులో పెట్టడం నీకు చేతకాలేదు.
జూదంలో గెలిచామన్న నెపంతో నీవు పాండవ పత్ని, నీ కోడలు అయిన ద్రౌపదిని కొప్పు పట్టి సభకు ఈడ్చి దుర్భాషలు ఆడి వలువలు ఊడదీస్తున్నప్పుడు వారిని మందలించి అదుపులో పెట్ట లేని అసమర్ధుడవయ్యావు. కాని భీముడు నాడు చేసిన ప్రతిజ్ఞ నెరవేర్చుకుంటూ నీకుమారులను చంపినందుకు అతడిని నిందిస్తున్నావు. ఇది న్యాయమా? ధర్మమా ! నీ కుమారుల అవినీతిని దుష్ప్రవర్తనను తలచుకొని నీ కోపాన్ని విడిచి పెట్టు" అని హితవు పలికాడు. 

ధృతరాష్ట్రుడు…  "కృష్ణా ! నీవు పలికినదంతా నిజమే. కాని కొడుకులను పోగొట్టుకున్న దుఃఖం భరించలేక అనుచితంగా ప్రవర్తించినందుకు సిగ్గుపడుతున్నాను. నీ మాటలతో నాకు జ్ఞానోదయం అయింది. ఇక మీదట పాండుకుమారులను నా కుమారులుగా భావిస్తాను" అని పలికి    తరువాత భీమార్జున నకుల సహదేవులను కౌగలించుకున్నాడు.    తరువాత యుయుత్సుడు వచ్చాడని విని కనీసం ఒక్క కొడుకైనా మిగిలాడని అనుకుని సంతోషంగా యుయుత్సుడిని కౌగలించుకున్నాడు.


#వ్యాసుడు గాంధారి శాపం నుండి రక్షించుట:

ధృతరాష్ట్రుడు పాండవులతో…  
"పాండుకుమారులారా ! మీ తల్లి గాంధారి వద్దకు వెళ్ళి ఆమెను ఓదార్చండి" అన్నాడు. ధర్మరాజాదులు తమ పెదతల్లి గాంధారి వద్దకు వెళ్ళారు. ఆమెకు నమస్కరించారు. కుమారుల మరణానికి రగిలిపోతున్న మనసుతో గాంధారి ధర్మరాజును శపించడానికి ఉద్యుక్తురాలైంది. అంతలో అక్కడకు వచ్చిన వ్యాసుడికి పాండవులు నమస్కరించారు. గాంధారి మనస్సు తెలుసుకున్న వ్యాసుడు ఆమెను వారిస్తూ "అమ్మా గాంధారీ ! ధర్మరాజును శపించడం ధర్మం కాదు. ధర్మజుడి మీద కోపం మాని శాంతించు. నీకింత రజోగుణం ఎందుకు. సాత్వికంగా ఉండు. నీ కుమారుడు సుయోధనుడు యుద్ధానికి పోతూ నీ ఆశీర్వాదం కోరినప్పుడు నీవు ఏమని ఆశీర్వదించావో తెలుసా !" ధర్మం ఎక్కడ ఉంటుందో విజయం అక్కడ ఉంటుంది" అన్నావు. అదేనిజమైంది. ఈ మహా సంగ్రామంలో ధర్మమూర్తులైన పాండవులకు విజయం లభించింది. నీ మాట ప్రకారం ధర్మం జయించినట్లే కదా! అసూయను వదిలి పాండవులలో ఉన్న ధర్మనిరతిని చూడు. నిదానించి యోచించిన నీకే అర్ధం ఔతుంది. అమ్మా ! గాంధారి ! జరిగి పోయిన విషయం తలచి బాధపడిన ఫలితమేమి ! కనుక పాండవుల మీద కోపం మాను " అన్నాడు. 


#గాంధారి శాంతించుట:

ఆ మాటలకు శాంతించిన గాంధారి… 
"మహర్షీ ! నాకు పాండవుల మీద కోపము, అసూయ ఎన్నటికీ లేదు. వారికి ఎన్నడూ కీడు తలపెట్ట లేదు. కుమారులను పోగొట్టుకున్న దుఃఖంతో అలా అనుకున్నానే కాని పాండవులు కుంతికి ఎంతో నాకూ అంతే! 
 నా కుమారుడి దుర్బుద్ధి, దుర్మార్గులైన శకుని, కర్ణ, దుశ్శాసనుల దుర్బోధలు కుఱువంశ నాశనానికి కారణమయ్యాయి కాని వేరు లేదు. కాని భీముడు నా కుమారుడిని కృష్ణుడి సమక్షంలో నాభి కింద కొట్టి పడగొట్టాడు. అది తల్లినైన నాకు క్షోభ కలిగించదా ! యుద్ధంలో చంపడం చావడం న్యాయమేకాని యుద్ధ నీతిని తప్పి చంపడం అధర్మం కాదా ! ద్రోహం కాదా !" అని పలికింది. 

ఆ మాటలు విన్న భీముడు… గడగడలాడుతూ గాంధారి వద్దకు వచ్చి ఇలా అన్నాడు "అమ్మా గంధారీ దేవీ! నేను చేసింది ధర్మమో అధర్మమో ప్రాణభయంతో అలా చేసానో జరిగి పోయింది. దయచేసి నన్ను క్షమించమ్మా! నా కంటే బలవంతుడు యుద్ధంలో నేర్పరి అతడిని ఓడించడం నాకు వీలైనది కానందున అలా చేసాను. అయినా నీకు తెలియనిది ఏమున్నది. 
నీ కుమారుడు ధర్మరాజుకు చేసినదంతా ధర్మమా ! ఏక వస్త్రగా ఉన్న ద్రౌపదిని సభకు ఈడ్పించి వలువలు ఊడదీయమని చెప్పడం ధర్మమా ! తల్లితో సమానమైన వదినకు తొడలు చూపి కూర్చోమని సైగ చేయడం ధర్మమా ! ఆ సమయంలో ఆగ్రహించిన నేను చేసిన ప్రతిజ్ఞ నెరవేర్చుకోవడానికి 
నీ కుమారుని తొడలు విరిచాను. చేసిన ప్రతిజ్ఞ నెరవేర్చుకొనుట క్షత్రియ ధర్మం కాదా ! నేను క్షత్రుయుడను కనుక నేను చేసిన ప్రతిజ్ఞ నెరవేర్చి    నా ధర్మం నెరవేర్చుకున్నాను. నాడు కుఱుసభలోనే ఆ పని చేసి ఉంటే బాగుండేది. కాని ధర్మరాజు నన్ను ఆపాడు కనుక ఊరక ఉన్నాను. అన్నగారి మాట మీర లేక అడవులకు వెళ్ళి అష్టకష్టాలు పడ్డాము. మా అన్నయ్య ధర్మరాజు శ్రీకృష్ణుడిని కుఱు సభకు రాయబారానికి పంపే సమయాన నా పలుకులు విని ఉంటే నువ్వు నన్ను తప్పు పట్టి ఉండే దానివి కాదు. నేను "సుయోధనా ! అన్నదమ్ములమైన మనకు వైరము తగదు. నలుగురు వేలెత్తి చూపేలా నడుచుకోవడం తగదు మా రాజ్యభాగం మాకిచ్చిన అందరం సుఖంగా ఉంటాము" అన్నాను. నీ కుమారుడు ఆ మాట విని ఉంటే ఇలా జరిగి ఉండేదా ! ఎవరి మాటను లక్ష్యపెట్టక   మాతో యుద్ధం కొని తెచ్చుకున్నాడు. పోగొట్టుకున్న రాజ్యం కొరకు ధర్మరాజు, చేసిన ప్రతిజ్ఞ నెరవేర్చుకొనుటకు నేను యుద్ధం చేసాము. మా కర్తవ్యం మేము నిర్వహించాము. సర్వం తెలిసిన నీవే ఏది ధర్మమో నిర్ణయించు" అన్నాడు.


#గాంధారి దుశ్శాసనుడి మరణం గురించి భీముని ప్రశ్నించుట:

గాంధారి కొంత సేపు ఆలోచించింది. 
"భీమసేనా ! నీవు చెప్పినది నిజమే అయినా నా కుమారుని తొడలు విరుచుట ధర్మమా ! నీ ప్రతిజ్ఞ నీవు నెరవేర్చుకున్నావులే ! కాని భీమసేనా ! యుద్ధంలో శత్రువులను చంపవచ్చు కాని సాటి మానవుని గుండెలు చీల్చి రక్తం తాగే క్రూరులు ఎక్కడైనా ఉంటారా ! రాక్షసులు మాత్రమే చేయగలిగిన ఆపని నువ్వు చేసి వృకోదరుడనే నీ పేరు సార్ధకం చేసుకున్నావా! ఇది ధర్మమా!"
అని అడిగింది. 

భీముడు "సాటి మానవుడి నెత్తురు తాగడానికి నేను అంతటి క్రూరుడనా! నాడు ద్రౌపది కొప్పు పట్టి ఈడ్చినప్పుడు నేను చేసిన ప్రతిజ్ఞ నెరవేర్చుకోవడానికి నేను అలా చేసాను. కాని నెత్తురు నోటికి తాగించానే కాని తాగలేదమ్మా ! అలా చేయడానికి నేను రాక్షసుడనా ! అమ్మా ! ఇంకొక విషయం నేను దుశ్శాసనుడిని చంపినప్పుడు కుఱు వీరులు నన్ను చుట్టుముట్టి ఉన్నారు. స్వీయరక్షణ కొరకు అలా భీకరాకారందాల్చాను కాని నేను అంతటి క్రూరుడను కాదమ్మా ! ఆ సమయంలో నేను అలా చేయకుంటే కుఱు వీరులు నన్ను ముక్కలు చేసి ఉండే వాళ్ళు. సాటి మనుషుల రక్తంతాగి వెర్రివాడిలా కరుణ లేకుండా తాగేపాతకం చేసేంత దుర్మార్గుడినా ! నేను అంత పాపాత్ముడను కాను నన్ను నమ్ము అమ్మా నేను రక్తం తాగ లేదు" అన్నాడు.


#గాంధారి ఆగ్రహం:

గాంధారి అంతటితో ఊరుకోలేదు… 
"భీమసేనా ! నాకు నూరుగురు కొడుకులు ఈ గుడ్డి వాళ్ళను కడతేర్చడానికి ఒక్క కొడుకునైనా మిగల్చకుండా అందరినీ దయాదాక్షిణ్యం లేకుండా చంపావే! ఇది ధర్మమా! నూరుగురు కుమారులలో నీకు అపకారం చెయ్యని వాడు ఒక్కడైనా నీకు కనిపించ లేదా! ఒక్క కుమారుడిని మిగిల్చిన నీ ప్రతిజ్ఞ నెరవేరదా! నీ అన్న ధర్మరాజు రాజ్యం చేయడానికి నా కుమారుడు అడ్డు వస్తాడని అలాచేసావా !" అని పక్కకు తిరిగి…  "ఎక్కడ ఆ మహారాజు ధర్మరాజు" అని కోపంగా అరిచింది. 

ఆ అరుపుకు ధర్మరాజు గడగడ లాడుతూ…  "అమ్మా ! ఇక్కడ ఉన్నానమ్మా ! నేనమ్మా ! పాండవాగ్రజుడను ధర్మరాజును. 
నీ నూరుగురు కుమారులను చంపిన క్రూరుడను, పాపాత్ముడను నన్ను క్షమించకమ్మా !  నీ ఇష్టం వచ్చినట్లు దూషించి నీ శాపాగ్నిలో నన్ను ధగ్ధం చెయ్యి. అమ్మా నీ నూరుగురు కుమారులనే కాదు ఈ భూమండలం లోని రాజులందరిని యుద్ధ భూమికి బలి ఇచ్చిన పాపాత్ముడికి నీవు ఏ శిక్ష విధించినా భరిస్తాను, అనుభవిస్తాను. బంధు మిత్రులను అందరినీ పోగొట్టుకున్న నాకు ఈ రాజ్యమేల    ఈ శరీరంలో ప్రాణం ఎందుకు ! నా లాంటి ద్రోహికి స్వర్గ సుఖాలు ఎందుకు?" అని భోరున ఏడ్చాడు. 

ధర్మరాజు మాటలకు గాంధారికి నోట మాట రాలేదు. ఒక్క నిట్టూర్పు విడిచి కిందకు చూసింది. ఆమె కంటికి కట్టుకున్న బట్ట కిందకు జరిగి ఆమె చూపు ధర్మరాజు కాలి మీద పడి అతడి కాలి గోళ్ళు ఎర్రగా అయ్యాయి. అది చూసి భీమార్జునులు పక్కకు తప్పుకున్నారు. అంతలో గాంధారి శాంతించి ధర్మరాజు తల నిమిరి "నాయనలారా! మీ అమ్మ కుంతీ దేవిని కలిసి ఆమె దీవెనలు పొందండి" అన్నది. 

హమ్మయ్య అని పాండవులు నిట్టూర్చి తల్లి కుంతీ దేవి దగ్గరకు వెళ్ళారు.


#పాండవులు కుంతీ దేవిని చూచుట:

చాలా కాలం తరువాత పాండవులను చూసి కుంతీ దేవికి దుఃఖము ఆనందమూ కలగలుపుగా స్పందించింది. 

పాండవులు తాము అరణ్యవాసంలో పడిన బాధలు కుంతీదేవికి చెప్పుకున్నారు. అది విని కుంతీదేవి తల్లడిల్లింది. జరిగిన యుద్ధంలో తన మనుమలు మరణించినందుకు చాలా దుఃఖించింది. తనకు నమస్కరిస్తున్న పాడవులను చూసి వారి తలలు నిమిరి భోరుమంది. "పాండు కుమారులారా ఇన్ని రోజులకు మీకు అమ్మ గుర్తుకు వచ్చిందా!” అని వారి శరీరాలు తడిమి కుమిలి పోయింది. పక్కనే శోక మూర్తిలా ఉన్న ద్రౌపదిని చూసి "అమ్మా ! ఏరమ్మా నా మనుమలు ! అభిమన్యుడు ఎక్కడమ్మా ! ఎక్కడికి వెళ్ళారమ్మా! నన్ను చూడడానికి ఎందుకు రాలేదు " అని అడిగుతూ పేరుపేరు వరుసనా పిలిచింది.


#గాంధారి ద్రౌపదిని ఓదార్చుట:

ఆ మాటలకు ద్రౌపది దుఃఖభారం తాళ లేక మొదలు నరికిన చెట్టులా కుప్ప కూలింది. కుంతీదేవి కోడలిని పొదివి పట్టుకుని భోరుమంది. కొంత సేపటికి తేరుకుని ద్రౌపదిని ఓదార్చి గాంధారి వద్దకు తీసుకు వెళ్ళింది. గాంధారి ద్రౌపదిని ఓదారుస్తూ "అమ్మా ! ద్రౌపదీ ! ఊరుకోమ్మా. పాండవులకు మాత్రం కొడుకులను పోగొట్టుకున్న బాధ లేదా ! మీ అత్త కుంతీదేవికి మాత్రం మనుమలను పోగొట్టుకున్న దుఃఖం లేదా! అమ్మా ద్రౌపదీ ! నీవు నేను ఒకే మాదిరి శోకం అనుభవిస్తున్నాము. నీకూ కొడుకులు పోయారు. నాకూ కొడుకులు పోయారు. ఇలా జరుగుతుందనే విదురుడు కుఱు సభలో ఎంతగానో చెప్పి చూసాడు. నేను ఏమాత్రం నా కుమారుల దుశ్చర్యలు ఆప లేక పోయాను. కనుకనే ఫలితం అనుభవిస్తూ ఉన్నాను. అయినా అంతా విధివిలాసం కాల మహిమ ఊరుకోమ్మా!" అని ద్రౌపది ఓదార్చింది.✍️
.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
                       🌷🙏🌷

   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
                     ➖▪️➖

త్రికరణములు

 1411.     1-5.    100223-7.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

               *త్రికరణములు:*
                 ➖➖➖✍️

*త్రికరణములు అనగా మనస్సు, వాక్కు, కర్మ అనేవి. ఈ మూడింటిలో ఎవరికైతే ‘శుద్ధి’ ఉంటుందో అదే ‘త్రికరణశుద్ధి!’ మనస్సులో ఏది ఉంటుందో,   మన వాక్కులో అదే ఉండాలి. మన వాక్కులో ఏది చెప్పబడుతుందో మన కర్మలో అదే చెయ్యబడాలి. ఇదీ ‘త్రికరణ శుద్ధి!’*

*మనకు అశ్లీల సినిమాలు, పనికిరాని టీ.వి. కార్యక్రమాలు వచ్చినప్పటి నుండి ఈ త్రికరణ శుద్ధి లోపించింది.     మన మనోవాక్కాయ కర్మలను బలహీనపరిచే కుట్ర జరిగిపోయింది.   తాత్త్విక దృష్టి, వైరాగ్య మనస్తత్వం, నిరాడంబరత, మన మనస్సు నిండా ఉండాల్సింది పోయి బలహీన మనస్తత్వం, దుర్బలత్వం, విషయలోలత్వం   మనల్ని కలుషితం చేస్తున్నాయి.*

*ఎంతసేపూ ‘అవతలి వాడి జేబులో ఉన్న రూపాయి మన జేబులోకి ఎలా వస్తుంది?’  అన్న ఆలోచన కొందరిది. ఇది ధనవ్యామోహం. వెర్రి సినిమాలు చూసి అందులోని నటీ నటుల్లా జీవించాలనుకోవడం ఇంకొందరిది. ఇది భోగ వ్యామోహం.    ఎప్పుడూ ఎదుటివాడ్ని తన కన్నా తక్కువ చేయడం కోసం ఎలాంటి కుట్రలు చేయాలో ఆలోచించడం ఇంకొద్దిమంది వంతు.* 

*ద్వేషభావన, ఈర్ష్య, అసూయ, ఇతరుల్ని ఏవగించుకోవడం - అనే మానసిక వ్యాధి రోజురోజుకు పెరుగుతోంది. తద్వారా సమాజం అశాంతిమయం అయిపోయింది.*

*సమాజానికి మనం చీడపురుగుల్లా మారిపోయి వికృతమైన ఆలోచలు అందించడం సబబేనా?*

*”మృత్యోర్మా అమృతంగమయా” అన్న అమృత వాక్కును వదిలిపెట్టి మృత్యుకూపంలోకి   జారుకోవడం మంచిదేనా?*

*‘అమృత పుత్రోహం’ అన్న వేదవాక్కును వదిలి ‘నీవు పాపివి’ అన్న భేద వాక్కును ఆశ్రయించడం ఎంతవరకు విజ్ఞత?* 

*మనిషి మనిషిపైనే యుద్ధం చేసే అధార్మికుల ఆటలకు తాళం వేసే బానిస మనస్తత్వం ఇంకెప్పుడు వదిలిపెడదాం? ఎన్నాళ్లీ అరణ్యరోదన?* 

*వీటిన్నిటికీ ఒకే పరిష్కారం.  వైదిక ధర్మాన్ని పునరుద్ధరించడం. ‘మళ్ళా వేదమార్గం బాట పట్టాలి’, వేదఋషుల విద్యల్ని, విజ్ఞానాన్ని, సర్వోతృష్ట జ్ఞానాన్ని ప్రపంచానికి అందిద్దాం!   అదే మన కర్తవ్యం.*

*ఒకడు డబ్బు సంపాదిస్తున్నాడని ‘పులిని చూసి నక్క వాతపెట్టుకోవడం’ సరైంది కాదు! మన పరిథిలో మనకు ఏది చేతనైతే అది చెయ్యడమే విజ్ఞత.* 

*త్రాగడం , తినడం అనే దుర్వ్యసనాలను సమాజంలో ఉన్నత గౌరవాలుగా ప్రకటిస్తున్న వారిని                            ఏ పేరుతో పిలవాలో, వారిలోని రాక్షసత్వానికి ఎలాంటి బ్రాండ్ వెయ్యాలో ‘పదాలు’ దొరకడం లేదు. మనిషిలోని                  ఈ రాక్షసప్రవృత్తికి  కారణం                                   ‘ఆధ్యాత్మిక లోపం!’*    

*ఆధ్యాత్మికత, ధార్మికత లోపించడం వల్లనే మన సత్యసంధత, ధార్మికబుద్ధికి లోపం జరిగింది. ఎంతసేపూ సాంకేతిక, విజ్ఞాన ప్రగతి పేరుతో చెప్పబడుతున్న చదువులు విలువలు నేర్పని విద్య, సాంస్కృతిక కళాదృక్పథం లేని మనస్తత్వం ప్రధాన కారణం.*

*భారత దేశం మరిచిపోయిన వైదిక ధర్మాన్ని తాత్విక దృక్పథాన్ని మళ్లీ స్వీకరించినప్పుడే మనం పునర్వైభవాన్ని పొందగల్గుతాం.* 

*అలాగే మనిషిని రాక్షస ప్రవృత్తి వైపు తీసుకెళ్తున్న మద్యమాంసాల జోరు తగ్గాల్సిన అవసరం ఉంది. వాటివల్ల కలిగే ప్రవృత్తి మన ఆలోచనలను ప్రభావితం చేస్తున్నది. అలాంటి ఆలోచనల నుండి దూరం ఉండాలంటే ఏం చేయాలో చూద్దాం…*

*వైదిక ధర్మం: *

*ధార్మిక బుద్ధిపై అవగాహన
మనస్సును మాలిన్యపరిచేవారినుంచి వైదొలగాలి!*
*మనవంతు పాత్రగా ధార్మిక బీజాలను వ్యాప్తి చేయాలి!*
*ఉత్తమగుణాలు గల వ్యక్తులను పెంచాలి.*
*పరమాత్మను ఆధారం చేసుకోవాలి. దేశాన్ని, దైవాన్ని రెండు కళ్లల్లా భావించాలి.*

*సన్మార్గమే మన మార్గం కావాలి!*✍️
.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
                       🌷🙏🌷

   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
                     ➖▪️➖

ధృతరాష్ట్రుడు దుఃఖం నివృత్తి గురించి తెలుసుకొనుట:

 090223c1855.   100223-3.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀266.

                శ్రీ మహాభారతం 
                 ➖➖➖✍️
                  266 వ భాగం
    శ్రీ మహాభారతంలో చిన్ని కథలు:


#ధృతరాష్ట్రుడు దుఃఖం నివృత్తి గురించి తెలుసుకొనుట:

విదురుడి మాటలకు ధృతరాష్ట్రుడు మరికొంత శాంతించిన మనసుతో…         "విదురా! అసలు సంసారంలో దుఃఖం ఎందుకు ఉంటుంది. దానిని మనం ఎలా నివృత్తి చేసుకోవాలి?" అని అడిగాడు. 

విదురుడు "మహారాజా ! పురుషుడి తేజస్సు స్త్రీ అండంతో కలిసిన పిండోత్పత్తి జరుగుతుంది అని నీకు ముందే చెప్పాను. క్రమక్రమంగా అవయవ నిర్మాణం జరిగి శిశువుగా రూపుదిద్దుకుంటుంది. ఆశిశువులోనికి ప్రాణవాయువు ప్రవేశించి ఆ శిశువు గిరగిరా తిరుగుతూ బాధను అనుభ విస్తుంది. ఆ శిశువు వేదనను భరించ లేక గర్భముఖద్వారం చేరుకున్న సమయంలో ఆ శిశువును గ్రహములు భూతములు ఆవహిస్తాయి. ఆ తరువాత శిశువు జన్మించడానికి సిద్ధమై గర్భము నుండి బయటకు వస్తుంది. ఆశిశువు బాలుడిగా ఉన్నప్పుడు శుచి, అశుచి తెలియదు. వివేకము తెలియదు. ఆట పాటలతో తెలియక పొరబాటుగా అనేక దుష్టకార్యాలు చేస్తాడు. బాల్య చేష్టలతో బాల్యావస్థ దాటగానే యవ్వనంలోకి ప్రవేశించగానే కామపరమైన ఆసక్తి జనిస్తుంది. స్త్రీ సౌఖ్యం కొరకు పాకులాడుతాడు. ఆ సమయంలో అధికంగా.  ఇంద్రియ లోలత్వం వలన సుఖము, దుఃఖము అనుభవిస్తాడు. కోరికలతో వేగిపోతూ అనేక దుష్కార్యములు చేస్తాడు. బాల్యంలాగే యవ్వనమూ గడిచి పోతుంది. వృద్ధాప్యంలోకి ప్రవేశిస్తాడు. అప్పుడు శరీరంలోని బలము శక్తి ఉడిగి పోయి వ్యాధి పీడితుడు ఔతాడు. అయినా ఉచితానుచితాలు తెలియక అనుచిత కార్యములను చేస్తాడు. వ్యాధిప్రాబల్యంతో వయోభారంతో కృంగి కృశించి పోతాడు. అప్పుడు యముడు వచ్చి తన పాశముతో ప్రాణములను హరిస్తాడు. ఈ జీవుడు పోలేక పోలేక యాతన అనుభవిస్తాడు. అంతటితో ఈ జన్మ ముగుస్తుంది. కనుక ఈ లోకం నిరంతర దుఃఖ భూయిష్టమైంది అన్నది స్పష్టము. ఈ మానవులు కామ, క్రోధ, మదోన్మత్తులై  లోభంతో అనేక దుష్కృత్యములు ఆచరిస్తారు. కాస్తంత సుఖం ఆశించి ఒకరి జీవితం ఒకరు నాశనం చేసుకుంటూ ఒకరిని ఒకరు చంపుకుంటూ అధర్మపరులౌతారు. చివరకు యమలోక ప్రాప్తిని పొందుతారు. వివేకం కలిగిన వారు పెద్దలను ఆశ్రయించి సన్మార్గమున పయనిస్తారు.


#సంసారమును అధిగమించుట:

విదురుడు తన మాటలను కొన సాగిస్తూ “ధృతరాష్ట్రమహారాజా ! నేను ఈ సంసారమును ఎలా అధిగమించాలో పెద్దలవలన విని యున్నాను అది నీకు వివరిస్తాను. శ్రద్ధగా విను. దుర్గమైన అడవిలో ఒక బ్రాహ్మణుడు వెళుతున్నాడు. అప్పుడు పులులు, సింహాలు, ఏనుగులు మొదలైన అడవి జంతువులు అతడిని వెన్నంటాయి. ఆ బ్రాహ్మణుడు ప్రాణ భయంతో అడ్డదారిలో పరుగెడగా    ఆ కౄర జంతువులు అతడిని వదిలి వెళ్ళి పోయాయి. ఇంతలో ఒక దొంగల గుంపు అతడిని అడ్డగించింది. ఆ బ్రాహ్మహ్మణుడు ప్రాణ భయంతో కాళ్ళు గజగజ వణుకుతుండగా చలన రహితంగా నిలబడ్డాడు. చుట్టూ పరికించి చూసి తనను రక్షించడానికి ఎవరూ లేనందున వెనక్కి తిరిగి పారి పోసాగాడు. వెనుక నుండి దొంగలు ముందు నుండి కౄరజంతువులు ఎంత పరుగిడినా అడవికి అంతు దొరకడం లేదు. ఇంతలో భయంకరాకారంతో ఉన్న ఒకస్త్రీ అతడిని కౌగలించుకుంది. అతడిలో భయం ఇనుమడించింది. అయిదు తలలు కలిగిన ఏనుగులను చూసాడు. ఆస్త్రీని విడిపించుకుని పరుగెడుతూ    లతలతో నిండి    పైకి కనిపించని బావిలో పడ్డాడు. పడుతూ పడుతూ బలమైన తీగను ఒక దానిని పట్టుకుని తల కిందులుగా వేలాడ సాగాడు. కిందికి చూడగా ఒక పెద్ద పాము నాలుకలు భయంరంగా చాస్తూ అతడి వైపు రాసాగింది. పైకి చూడగా 6 తలలు 12 కాళ్ళతో ఒక ఏనుగు బావి చెంత ఉన్న ఒక చెట్టు వద్దకు వచ్చింది. ఆ చెట్టు చిత్ర విచిత్ర రంగులతో వెలిగి పోతుంది. తుమ్మెదలు ఆ చెట్టులోని మకరందం తాగుతున్నాయి. కాని నల్లని తెల్లని ఎలుకలు ఆ చెట్టు మొదలును కొరుకుతున్నాయి. ఆ చెట్ల పూల నుండి బొట్టు బొట్టుగా మధువు ఆ బ్రాహ్మణుడి నోట్లో పడుతుంటే అతడు దానిని త్రాగి ఆనందిస్తున్నాడు. ఆ మధువు ఎంత త్రాగినా తృప్తి తీరక తాను ఉన్న దుస్థితిని మరచి ఆనందిస్తున్నాడు. ఈ విధంగా ఆ బ్రాహ్మణుడికి కింద ఉన్న పాము, పైన ఉన్న భయంకరాకార స్త్రీ, క్రూర మృగములు, ఎలుకలు కొరకడంతో ఏనిముషమైనా పడడానికి సిద్ధంగా ఉన్న చెట్టు, వేచి ఉన్న దొంగలు, ఝూంకారం చేస్తున్న తుమ్మెదలు వీటితో మనసు కకావికలు ఔతున్నా అతడికి జీవితం మీద వ్యామోహం పోలేదు. ప్రాణముల మీద తీపి చావ లేదు" అన్నాడు విదురుడు. 

ధృతరాష్ట్రుడు "విదురా ! ఈ కథ నాకు అర్ధం కాలేదు. వివరంగా చెప్పు" అన్నాడు.


#సన్మార్గ బోధన:

విదురుడు "మహారాజా! ఈ ప్రపంచంలో పెద్దలు మనుషులకు సన్మార్గ బోధన చేయడానికి ఈ కథ చెప్తారు. ఈ కథ మన జీవితంలాంటిది. ఈ కథని వివరిస్తే కాని అర్ధంకాదు. ఆ బ్రాహ్మణుడు పయనిస్తున్న అడవి సంసారం. అందు ఉన్న క్రూరమృగములు, దొంగలు, మృగముల కొరకు పన్ని ఉచ్చులు రోగములు, భయంకరాకారంతో పయనిస్తున్న స్త్రీ ముసలి తనము, అయిదు తలల ఏనుగు పంచేంద్రియాలు, బావిలో ఉన్న పాము యమధర్మరాజు, ఆ బ్రాహ్మణుడు పట్టుకున్న తీగ బ్రతకాలన్న ఆశ, ఆ ఒడ్డున ఉన్న చెట్టు ఆయుషు, దాని వైపు వచ్చిన ఏనుగు ఒక సంవత్సర కాలం దాని ఆరు తలలు ఆరు ఋతువులు, పన్నెండు కాళ్ళు పన్నెండు నెలలు.

ఆచెట్టును కొరుకుతున్న నల్లని తెల్లని ఎలుకలు రాత్రి పగలు, ఆ బ్రాహ్మణుడి చుట్టూ ఝోంకారం చేస్తున్న తుమ్మెదలు కోరికలు. పూలనుండి స్రవిస్తున్న మకరందం సుఖసంతోషాలు. తన చుట్టూ ఇన్ని బాధలు ఉన్నా జీవుడు ఆ సుఖసంతోషాల కొరకు పాకులాడుతుంటాడు. కలకాలం బ్రతకాలని అనుకుంటాడు. బ్రాహ్మణుడే జీవుడు. ఇదే సంసార చక్రం. వివేకవంతులైన వారు ఈ సంసారచక్రంలో బంధించ బడక వెలుపలి నుండి చూస్తూ శాశ్వితమైన ఆనందాన్ని పొందుతారు. 


#విదురుని జ్ఞానబోధ:

ఓ ధృతరాష్ట్ర మహారాజా ! నిరంతరం ప్రాపంచిక సుఖాల కొరకు పరితపిస్తూ ఈ బురద గుంటలో మునుగుతూ తేలుతూ తననుతాను మరచి పోతాడు మానవుడు. శరీరబలం తగ్గగానే రోగాలు ఆవహిస్తాయి. ముసలితనం మీద పడి అందం అంతరించి దైన్యం ఆవహిస్తుంది. సుఖాలు అనుభవించడానికి పనికిరాక దిక్కులేని చావు చస్తాడు. మహారాజా ! ఈ దేహమే ఒక రథము. బుద్ధి రథ సారథి. పంచేంద్రియములే గుర్రములు. మన ఆలోచనలే పగ్గాలు. పంచేంద్రియాలు అనే గుర్రాలు అదుపు తప్పి ప్రవర్తించినప్పుడు బుద్ధి అనే పగ్గాలు పఠిష్టంగా లేని ఎడల గుర్రాలు ఇచ్ఛవచ్చిన రీతిలో ప్రవర్తిస్తాయి. కనుక బుద్ధిని ఉపయోగించి ఆలోచనలు అనే పగ్గాలతో వాటిని నియంత్రించిన మానవుడు దుఃఖభాజనుడు కాడు. పుట్టినప్పటి నుండి ఈ జీవితం యమధర్మరాజు ఆధీనంలో ఉంటుంది. ఈ జీవితం అనేక దుఃఖాలకు మూలము. వివేకవంతులు వివేకము అనే మందును ఉపయోగించి తమ దుఃఖాలను తొలగించుకుంటారు. వివేక వంతులు తమ బుద్ధిని ఉపయోగించి గుర్రములను అదుపులో పెట్టి రథమును సక్రమ మార్గమున నడిపించి ముక్తిని పొందుతారు. కనుక ధృతరాష్ట్ర మహారాజా ! నీ కుమారుల మరణానికి దుఃఖించుట మాని నీ కుమారులు, బంధుమిత్రులకు దహనసంస్కారం జరిపించు " అని అన్నాడు విదురుడు.


#వ్యాసుడి రాక:

విదురుడి మాటలతో తిరిగి కుమారులు గుర్తుకు రాగా ధృతరాష్ట్రుడు ఏడుస్తూ మూర్చిల్లాడు. పరిచారికలు అతడి ముఖము మీద చల్లని నీళ్ళు చిలకరించి సేద తీర్చారు. ఇంతలో వ్యాసుడు అక్కడకు వచ్చాడు. అనుకోకుండా వచ్చిన వ్యాసుడికి విదురుడు, సంజయుడు నమస్కరించారు. మూర్ఛనుండి తేరుకున్న ధృతరాష్ట్రుడికి వ్యాసుడి రాక ఎరిగించారు. ధృతరాష్ట్రుడు చేతులు వణుకుతుండగా వ్యాసుడికి నమస్కరించి " మహామునీ ! చూసితివా ! నా దుర్గతి. నేను ఇంకా ఎందుకు బ్రతికి ఉన్నానో తెలియడం లేదు. ఈ జన్మ ఎంత దుర్బరమో ఇప్పుడు తెలిసింది. నా దుస్థితి చూసారా ! కుమారులంతా మరణించారు బంధుమిత్రులు నశించారు. సంపదలంతా ఊడ్చుకు పోయాయి. అయినా నా ప్రాణములు నన్ను అంటి పెట్టుకునే ఉన్నాయి. ఇది నా దౌర్భాగ్యం కాక మరేమిటి " అని దుఃఖించాడు. ధృతరాష్ట్రుడి దుఃఖం చూసి వ్యాసుడు " కుమారా ! నీ దుఃఖం పోగొట్టడానికే నేను వచ్చాను. సకల శాస్త్రములను తెలిసిన వాడివి, నీతి శాస్త్ర కోవిదుడివి చనిపోయిన కుమారుల కొరకు దుఃఖించుట సమంజసం కాదు. పుట్టిన వాడు మరణించక తప్పదు. ఈ జీవితం ఎవరికి శాశ్వతం కాదన్న జ్ఞానం ఎరిగి దుఃఖం పోగొట్టుకుని నీ తరువాతి కర్తవ్యం నెరవేర్చు. కుమారా ! అసలు నీకుమారులకూ పాండుసుతులకు నీకు తెలియకనే వైరం సంభవించిందా ! కురువంశనాశన కారకుడు నీ కుమారుడు కాదా ! ఇక నీవు దుఃఖించడం తగునా ! జూద క్రీడా సమయమున విదురుడు నీకు అనేక విధముల చెప్పినా నీవు వినక ఫలితం అనుభవిస్తున్నావు. ఇదంతా ఈశ్వర సంకల్పమే పోనీలే బాధపడకు దుఃఖం పోగొట్టుకో బాధపడకు. నీకు మేలు కోరి నీకు ఒక దేవరహస్యం చెప్తాను విను…✍️
.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
                       🌷🙏🌷

   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
                     ➖▪️➖
ఇలాటి మంచి విషయాలకోసం…
*“భగవంతుని విషయాలు గ్రూప్“* లోచేర్చమని ఈక్రింది నెంబరుకి వాట్సప్ మెసేజ్ పెట్టండి...944065 2774.
లింక్ పంపుతాము.🙏

ముత్తయిదువ లక్షణాలు:* *మరియు* *ఉపయోగాలు*

 2912.      1-5. 090223-6.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀


        *ముత్తయిదువ లక్షణాలు:* 
                      *మరియు*
                  *ఉపయోగాలు*
                  ➖➖➖✍️

*మొత్తం అయిదు అలంకారాలు ఉన్న స్త్రీని ముత్తైదువ అంటారు. అవి..*

*1). కాళ్ళకి పట్టీలు, మెట్టెలు*
*2). చేతులకి గాజులు*
*3). మెడలో మంగళసూత్రం*
*4). తలలో పువ్వులు*
*5). నొసటన అంటే కనుబొమ్మల మధ్య* 
       *సింధూరం కానీ కుంకుమ కానీ..*

*1). మొదటగా కాళ్ళకు పట్టిలు మెట్టెలు ఎందుకో చూద్దాం:*

*కాళ్ళలో ఉండే సయాటికా నెర్వ్ మోకాళ్ళ దగ్గర నుంచి కింది వైపుకి టిబియా లేదా టైబియా అని పిలవబడుతుంది ..*

*ఇది తిరిగి పాదపు గుత్తి వరకు వచ్చిన తర్వాత రెండు రకాలైనటువంటి బ్రాంచెస్ గా విడిపోతుంది..*

*ఒక శాఖ వేళ్ళ చివరి వరకు వెళ్లి అక్కడ చిన్న చిన్న శాఖలుగా అంతమైతే మరొక శాఖ వెనకాల మడమ వరకు వెళ్లి అక్కడ అంతమవుతుంది.*

*అంటే వేళ్ళ చివరలో ఇంకా మడమల చివర్లో టిబియా శాఖ తాలూకు నాడీ అంత్యాలు ఉంటాయి. ఈనాడి నేరుగా కటివలయం దగ్గర ఉన్న గర్భాశయ మరియు మూత్రాశయ నాడులతో సంబంధాన్ని కలిగి ఉంది.*

*అంటే స్త్రీలలో వారు ధరించేటువంటి పట్టీలు ఇంకా కాలి మెట్టెలు ఇవన్నీ కూడా ఈ టిబియా నాడిని రాపిడి లేదా ఒత్తిడి ద్వారా ప్రేరేపించి తద్వారా మూత్రాశయ నాడులను గర్భాశయ నాడులను కూడా ప్రేరేపిస్తాయి.*

*ఫలితంగా వారిలో గర్భాశయ మరియు మూత్రాశయ పనితీరు అనేది చురుగ్గా ఉంటుంది.*

*గర్భాశయం పనితీరు బాగుండటం వల్ల బిడ్డను మోయడానికి, సుఖప్రసవానికి కూడా సులువుగా ఉంటుంది.*

*అలాగే మూత్రాశయ పనితీరు బాగుండటం వల్ల ఎప్పటికప్పుడు దేహంలో నిల్వ ఉండకుండా మూత్రం మొత్తం బయటికి వెళ్లిపోతుంది. దీని గురించి పూర్తి సమాచారం కావాలంటే tibia nerve అని గూగుల్లో వెతికితే మనకు పూర్తి సమాచారం దొరుకుతుంది.*

*2). ఇంకా రెండవ అలంకార లక్షణం గాజులు..*

*గాజులు అంటే కేవలం మట్టి లేదా గాజు లేదా బంగారం గాజులు మాత్రమే. ఈరోజుల్లో వేసుకునే ప్లాస్టిక్ గాజులు ఎంతమాత్రం కాదు..!*

*మన చేతి మణికట్టు దగ్గర ‘రేడియల్ నెర్వ్’ అనే నరం నేరుగా గుండె యొక్క నరాల తోటి అంటే గుండె స్పందన కి సంబంధించిన నరాల తోటి సంబంధాన్ని కలిగి ఉంటుంది. వైద్యులు నాడీ స్పందన కూడా దీని తోటే గమనిస్తూ ఉంటారు.*

*ఈ నరం మన శరీరంలో పెరిగే లేదా తగ్గేటటువంటి బ్లడ్ ప్రెజర్ అంటే రక్త పోటుని అదుపులో ఉంచుతుంది. అంటే దీనికి మసాజ్ చేయడం ద్వారా రక్తపోటును కూడా అదుపులో ఉంచుకోవచ్చు.  అందుకనే స్త్రీలలో గాజులను వేసుకోవడం అనేది ఆనవాయితీగా ఉంటూ వొచ్చింది.*

*అయితే ఇక్కడ మీకు ఒక అనుమానం కలగాలి, గాజులు అనేవి మరి పురుషులు వేసుకోరు కదా వారికి రక్తపోటు అవి రావా అని! పూర్వకాలం నుంచి కూడా వారు పొలం పనులు లేదా శారీరక శ్రమ అనేది ఎక్కువగా చేయడం వల్ల ఒకరకంగా చెప్పాలంటే తిండికి సరిపడా పని ఉండడంవల్ల వారిలో కొవ్వుశాతం చాలా తక్కువగా ఉండేది. దానివల్ల బ్లడ్ ప్రెషర్ కూడా తక్కువగా ఉండేది. అందువల్ల వారికి గాజులు అవసరం అనేది లేకుండా పోయింది.*

*అయితే వారిలో కూడా కొంతమందికి రక్తపోటు సమస్యలు ఉన్నవారికి వెండి లేదా బంగారం లేదా రాగితో చేసినటువంటి కడియం ధరించమని చెప్పడం జరిగింది. ఈ లోహాలతో చేసినవి  శరీరానికి వేడిని గ్రహించి చల్లగా ఉంచుతాయి.*

*అందునా పొలం పనులు , కాయకష్టం చేసే వాళ్ళు కాబట్టి గాజులు వేసుకుంటే పగిలిపోతాయి అనే ఉద్దేశంతో వీళ్ళకి కేవలం కడియాలలా ధృఢంగా ఉన్నవాటిని మాత్రమే సిఫార్సు చేయడం జరిగింది.*

*ఈనరం దాని యొక్క పనితీరు గురించి తెలియాలి అంటే గూగుల్లో Radial nerve అని వెతికితే మనకు పూర్తి సమాచారం దొరుకుతుంది.*

*3). మూడవది మెడలో మంగళసూత్రం..!*

*దీని చివరున్న  బంగారంతో చేసిన లాకెట్స్ రాపిడివల్ల ఆడవాళ్లలో రొమ్ము క్యాన్సర్ అనేది రాకుండా ఉంటుంది.*

*అయితే మళ్ళా మీకు ఒక అనుమానం రావచ్చు… మరి మగవాళ్ళ సంగతి ఏమిటి అని!  మగవాళ్ళు రొమ్ము క్యాన్సర్ కి సహజంగానే నిరోధక వ్యవస్థను కలిగి ఉంటారు కాబట్టి మగవారిలో రొమ్ము సంబంధిత క్యాన్సర్ అనేది చాలా తక్కువ. ఒకరకంగా చెప్పాలంటే అసలు ఉండనే ఉండదు.*

*ఈ రొమ్ము క్యాన్సర్ రాకుండా బంగారంతో చేసినటువంటి లాకెట్ల తాలూకు రాపిడి అనేదిఉపయోగపడుతుంది.*

*ఇంకా చెప్పాలంటే స్నానం చేసే సమయంలో దీనిపై నుంచి వచ్చేటటువంటి వేడి నీరు ప్రవహించడం వల్ల చర్మ వ్యాధులు కూడా రాకుండా ఉంటాయి. క్యాన్సర్ కి ట్రీట్మెంట్ గా బంగారం ఉపయోగపడుతుందని ఈమధ్యనే తెలిపిన పరిశోధన కూడా గమనించవచ్చు.*

*4). ఇక నాల్గవది తలలో పూవులు..*

*వీటి నుంచి వచ్చే సువాసనల వలన మనసు ప్రశాంతంగా ఉండడమే కాకుండా ఒక రకమైన పాజిటివ్ ఎనర్జీ కూడా వస్తుంది. కలయికసమయంలో కూడా ఇవి ఇద్దరి మధ్య ఆకర్షణకు తోడ్పడుతాయి.*

*5). ఇక అయిదవది..చివరిది.. నొసటన సింధూరం..*

*పూర్వపు రోజుల్లో దీనిని సొంతంగా కుంకుమ రాయి నూరుకొని దానికి రేడియం పౌడర్ కలిపి రెండు కనుబొమ్మల మధ్యలో అలంకరించుకునే వారు.*

*ఆయుర్వేదం ప్రకారం మనిషి శరీరంలో ఉండే ఏడు చక్రాలలో మొదటి చక్రమైన ఆజ్ఞాచక్రం పై ఒత్తిడి కలుగచేయడం ద్వారా మనస్సును అదుపుచేయడం, ప్రశాంతంగా ఉండడం జరిగేది.*

*ఇవే కాకుండా సైనస్ కు రాకుండా ముక్కుపుల్లను, చెవిపోట్లు దరికి చేరకుండా చెవి పోగులనూ ధరించేవారు!*✍️
.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
                       🌷🙏🌷

   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
                     ➖▪️➖

ఓర్పుకి ప్రతీక సాలెపురుగు.....

 విషయం పాతదే అవ్వనీ, అడుగడుగునా హెచ్చరించే ఉదాహరణ. 
Yandamoori Veerendranath గారి రచనలో...
ఎవరేమోగానీ, నన్ను నేను మాత్రం ఎన్నోసార్లు చూసుకున్నాను. 

"ఓర్పుకి ప్రతీక సాలెపురుగు. గదిలో ఒకమూల నిశ్శబ్దంగా ఓర్పుగా అది గూడు కట్టుకుంటుంది. ఎవర్నీ సాయమడగకుండా తననుంచి తాను విడువడుతూ...తనని తాను త్యాగం చేసుకుంటూ పోగు తరవాత పోగు గొప్ప ఏకాగ్రతతో ఒక శిల్పి చెక్కినట్టు, ఒక డాక్టరు నరాలతో గొప్ప నైపుణ్యంతో ముళ్ళు వేసినట్టు తన సామ్రాజ్యాన్ని నిర్మించుకుంటుంది.
ఒక హడావిడి ఉదయాన్నో, నిశ్శబ్ద సాయంత్రసమయానో గోడమీంచి పెద్దశబ్ధంతో వచ్చిన చీపిరికట్ట ఒక్కవేటుతో దాని శ్రమనంతా సమూలంగా తుడిచి పెట్టేస్తుంది. 
సర్వనాశనమైపోయిన సామ్రాజ్యంలోంచి సాలెపురుగు అనాధలా నేలమీద పడుతుంది. ఎవర్నీ కుట్టదు. ఎవరి మీదా కోపం ప్రదర్శించదు. 
మళ్ళీ తన మనుగడకోసం కొత్త వంతెన నిర్మించుకోవటానికి సహనం పోగుల్ని నమ్మకం గోడమీద తిరిగి స్రవిస్తుంది.
ఎలా బతకాలో మనిషికి పాఠం చెబుతుంది."

- విజయానికి అయిదు మెట్లు
*ॐశ్రీవేంకటేశాయ నమః*
💝💝𝑫𝒐𝒏'𝒕 𝒋𝒖𝒅𝒈𝒆 𝒆𝒂𝒄𝒉 𝒅𝒂𝒚 𝒃𝒚 𝒕𝒉𝒆 𝒉𝒂𝒓𝒗𝒆𝒔𝒕 𝒚𝒐𝒖 𝒓𝒆𝒂𝒑 𝒃𝒖𝒕 𝒃𝒚 𝒕𝒉𝒆 𝒔𝒆𝒆𝒅𝒔 𝒕𝒉𝒂𝒕 𝒚𝒐𝒖 𝒑𝒍𝒂𝒏𝒕.
💝𝑫𝒐𝒏’𝒕 𝒆𝒗𝒆𝒓 𝒄𝒐𝒏𝒇𝒖𝒔𝒆 𝒕𝒉𝒆 𝒕𝒘𝒐, 𝒚𝒐𝒖𝒓 𝒍𝒊𝒇𝒆 𝒂𝒏𝒅 𝒚𝒐𝒖𝒓 𝒘𝒐𝒓𝒌. 𝑻𝒉𝒆 𝒔𝒆𝒄𝒐𝒏𝒅 𝒊𝒔 𝒐𝒏𝒍𝒚 𝒑𝒂𝒓𝒕 𝒐𝒇 𝒕𝒉𝒆 𝒇𝒊𝒓𝒔𝒕 
💝𝑵𝒐𝒕𝒉𝒊𝒏𝒈 𝒄𝒐𝒎𝒆𝒔 𝒆𝒂𝒔𝒚. 𝑺𝒖𝒄𝒄𝒆𝒔𝒔 𝒅𝒐𝒆𝒔𝒏'𝒕 𝒋𝒖𝒔𝒕 𝒅𝒓𝒐𝒑 𝒐𝒏 𝒚𝒐𝒖𝒓 𝒍𝒂𝒑. 𝒀𝒐𝒖 𝒉𝒂𝒗𝒆 𝒕𝒐 𝒈𝒐 𝒐𝒖𝒕 𝒂𝒏𝒅 𝒇𝒊𝒈𝒉𝒕 𝒇𝒐𝒓 𝒊𝒕 𝒆𝒗𝒆𝒓𝒚 𝒅𝒂𝒚.
💝𝑻𝒉𝒆𝒓𝒆 𝒂𝒓𝒆 𝒕𝒘𝒐 𝒘𝒂𝒚𝒔 𝒐𝒇 𝒔𝒑𝒓𝒆𝒂𝒅𝒊𝒏𝒈 𝒍𝒊𝒈𝒉𝒕: 𝒕𝒐 𝒃𝒆 𝒕𝒉𝒆 𝒄𝒂𝒏𝒅𝒍𝒆 𝒐𝒓 𝒕𝒉𝒆 𝒎𝒊𝒓𝒓𝒐𝒓 𝒕𝒉𝒂𝒕 𝒓𝒆𝒇𝒍𝒆𝒄𝒕𝒔 𝒊𝒕.
💝𝑳𝒊𝒇𝒆 𝒉𝒂𝒔 𝒈𝒐𝒕 𝒂𝒍𝒍 𝒕𝒉𝒐𝒔𝒆 𝒕𝒘𝒊𝒔𝒕𝒔 𝒂𝒏𝒅 𝒕𝒖𝒓𝒏𝒔. 𝒀𝒐𝒖'𝒗𝒆 𝒈𝒐𝒕 𝒕𝒐 𝒉𝒐𝒍𝒅 𝒐𝒏 𝒕𝒊𝒈𝒉𝒕 𝒂𝒏𝒅 𝒐𝒇𝒇 𝒚𝒐𝒖 𝒈𝒐.
💝𝑻𝒂𝒍𝒆𝒏𝒕 𝒊𝒔 𝒄𝒉𝒆𝒂𝒑𝒆𝒓 𝒕𝒉𝒂𝒏 𝒕𝒂𝒃𝒍𝒆 𝒔𝒂𝒍𝒕. 𝑾𝒉𝒂𝒕 𝒔𝒆𝒑𝒂𝒓𝒂𝒕𝒆𝒔 𝒕𝒉𝒆 𝒕𝒂𝒍𝒆𝒏𝒕𝒆𝒅 𝒊𝒏𝒅𝒊𝒗𝒊𝒅𝒖𝒂𝒍 𝒇𝒓𝒐𝒎 𝒕𝒉𝒆 𝒔𝒖𝒄𝒄𝒆𝒔𝒔𝒇𝒖𝒍 𝒐𝒏𝒆 𝒊𝒔 𝒂 𝒍𝒐𝒕 𝒐𝒇 𝒉𝒂𝒓𝒅 𝒘𝒐𝒓𝒌.

💝💝*𝑶𝒖𝒓 𝑩𝒐𝒅𝒚 𝒓𝒆𝒇𝒆𝒓𝒔 𝒕𝒐 𝒂𝒍𝒍 𝒕𝒉𝒆 𝒕𝒉𝒓𝒆𝒆 𝒕𝒚𝒑𝒆𝒔 𝒐𝒇 𝒃𝒐𝒅𝒊𝒆𝒔. 𝑮𝒓𝒐𝒔𝒔 𝒃𝒐𝒅𝒚 𝒊𝒔 𝒕𝒉𝒆 𝒑𝒉𝒚𝒔𝒊𝒄𝒂𝒍 𝒃𝒐𝒅𝒚 𝒘𝒉𝒆𝒓𝒆 𝒂𝒍𝒍 𝒕𝒉𝒆 𝒇𝒊𝒗𝒆 𝒈𝒓𝒆𝒂𝒕 𝒆𝒍𝒆𝒎𝒆𝒏𝒕𝒔 𝒂𝒓𝒆 𝒆𝒎𝒃𝒆𝒅𝒅𝒆𝒅. 𝑺𝒖𝒃𝒕𝒍𝒆 𝒃𝒐𝒅𝒚 𝒄𝒐𝒏𝒔𝒊𝒔𝒕𝒔 𝒐𝒇 𝒇𝒊𝒗𝒆 𝒕𝒂𝒏𝒎ā𝒕𝒓𝒂-𝒔 (ś𝒂𝒃𝒅𝒂, 𝒔𝒑𝒂𝒓ś𝒂, 𝒓ū𝒑𝒂, 𝒓𝒂𝒔𝒂 𝒂𝒏𝒅 𝒈𝒂𝒏𝒅𝒉𝒂 𝒐𝒓 𝒔𝒐𝒖𝒏𝒅, 𝒕𝒐𝒖𝒄𝒉, 𝒇𝒐𝒓𝒎, 𝒕𝒂𝒔𝒕𝒆 𝒂𝒏𝒅 𝒔𝒎𝒆𝒍𝒍) 𝒊𝒏 𝒄𝒐𝒏𝒋𝒖𝒏𝒄𝒕𝒊𝒐𝒏 𝒘𝒊𝒕𝒉 𝒂𝒏𝒕𝒂ḥ𝒌𝒂𝒓𝒂ṇ𝒂. 𝑨𝒏𝒕𝒂ḥ𝒌𝒂𝒓𝒂ṇ𝒂 𝒊𝒔 𝒗𝒆𝒓𝒚 𝒔𝒖𝒃𝒕𝒍𝒆 𝒊𝒏 𝒏𝒂𝒕𝒖𝒓𝒆 𝒂𝒏𝒅 𝒄𝒐𝒏𝒔𝒊𝒔𝒕𝒔 𝒐𝒇 𝒎𝒊𝒏𝒅, 𝒊𝒏𝒕𝒆𝒍𝒍𝒆𝒄𝒕 𝒂𝒏𝒅 𝒆𝒈𝒐. 𝑻𝒉𝒆 𝒔𝒖𝒃𝒕𝒍𝒆𝒔𝒕 𝒂𝒎𝒐𝒏𝒈𝒔𝒕 𝒕𝒉𝒆 𝒕𝒉𝒓𝒆𝒆 𝒕𝒚𝒑𝒆𝒔 𝒐𝒇 𝒃𝒐𝒅𝒊𝒆𝒔 𝒊𝒔 𝒕𝒉𝒆 𝒄𝒂𝒖𝒔𝒂𝒍 𝒃𝒐𝒅𝒚 𝒂𝒏𝒅 𝒄𝒐𝒏𝒔𝒊𝒔𝒕𝒔 𝒐𝒇 𝒑𝒓āṇ𝒂, 𝒕𝒉𝒆 𝒔𝒖𝒃𝒕𝒍𝒆𝒔𝒕 𝒂𝒏𝒅 𝒊𝒎𝒑𝒐𝒓𝒕𝒂𝒏𝒕 𝒐𝒇 𝒂𝒍𝒍. 𝑻𝒉𝒆 𝒎𝒊𝒏𝒅 𝒉𝒂𝒔 𝒕𝒐 𝒕𝒓𝒂𝒏𝒔𝒄𝒆𝒏𝒅 𝒂𝒍𝒍 𝒕𝒉𝒆 𝒕𝒉𝒓𝒆𝒆 𝒕𝒚𝒑𝒆𝒔 𝒐𝒇 𝒃𝒐𝒅𝒚 𝒕𝒐 𝒓𝒆𝒂𝒍𝒊𝒔𝒆 Ś𝒊𝒗𝒂.*
Ⓒ ❤️ *ॐ श्री वेंकटेश्वराय नम:*
💕 *_~𝑺𝒓𝒆𝒆𝒓𝒂𝒎 𝑳𝒂𝒙𝒎𝒊𝒏𝒂𝒓𝒂𝒚𝒂𝒏𝒂 𝑴𝒖𝒓𝒕𝒉𝒚_*

𝐑𝐞𝐟𝐥𝐞𝐜𝐭𝐢𝐧𝐠 𝐨𝐧 𝐭𝐡𝐞 𝐩𝐚𝐬𝐬𝐚𝐠𝐞 𝐨𝐟 𝐭𝐢𝐦𝐞:

 *ॐశ్రీవేంకటేశాయ నమః*
💝💝𝐑𝐞𝐟𝐥𝐞𝐜𝐭𝐢𝐧𝐠 𝐨𝐧 𝐭𝐡𝐞 𝐩𝐚𝐬𝐬𝐚𝐠𝐞 𝐨𝐟 𝐭𝐢𝐦𝐞:~
💖𝟒𝟎 𝐲𝐞𝐚𝐫𝐬 𝐚𝐠𝐨, 𝐞𝐯𝐞𝐫𝐲𝐨𝐧𝐞 𝐚𝐬𝐩𝐢𝐫𝐞𝐝 𝐭𝐨 𝐡𝐚𝐯𝐞 𝐜𝐡𝐢𝐥𝐝𝐫𝐞𝐧. 𝐓𝐨𝐝𝐚𝐲, 𝐦𝐚𝐧𝐲 𝐚𝐫𝐞 𝐡𝐞𝐬𝐢𝐭𝐚𝐧𝐭 𝐝𝐮𝐞 𝐭𝐨 𝐯𝐚𝐫𝐢𝐨𝐮𝐬 𝐜𝐨𝐧𝐜𝐞𝐫𝐧𝐬.
❤️𝟒𝟎 𝐲𝐞𝐚𝐫𝐬 𝐚𝐠𝐨, 𝐜𝐡𝐢𝐥𝐝𝐫𝐞𝐧 𝐫𝐞𝐬𝐩𝐞𝐜𝐭𝐞𝐝 𝐭𝐡𝐞𝐢𝐫 𝐩𝐚𝐫𝐞𝐧𝐭𝐬. 𝐍𝐨𝐰𝐚𝐝𝐚𝐲𝐬, 𝐢𝐭'𝐬 𝐜𝐫𝐮𝐜𝐢𝐚𝐥 𝐟𝐨𝐫 𝐩𝐚𝐫𝐞𝐧𝐭𝐬 𝐭𝐨 𝐫𝐞𝐬𝐩𝐞𝐜𝐭 𝐭𝐡𝐞𝐢𝐫 𝐜𝐡𝐢𝐥𝐝𝐫𝐞𝐧.
💕𝟒𝟎 𝐲𝐞𝐚𝐫𝐬 𝐚𝐠𝐨, 𝐦𝐚𝐫𝐫𝐢𝐚𝐠𝐞 𝐰𝐚𝐬 𝐞𝐚𝐬𝐲, 𝐛𝐮𝐭 𝐝𝐢𝐯𝐨𝐫𝐜𝐞 𝐰𝐚𝐬 𝐜𝐡𝐚𝐥𝐥𝐞𝐧𝐠𝐢𝐧𝐠. 𝐍𝐨𝐰, 𝐢𝐭'𝐬 𝐭𝐡𝐞 𝐨𝐩𝐩𝐨𝐬𝐢𝐭𝐞.
💞𝟒𝟎 𝐲𝐞𝐚𝐫𝐬 𝐚𝐠𝐨, 𝐰𝐞 𝐤𝐧𝐞𝐰 𝐨𝐮𝐫 𝐧𝐞𝐢𝐠𝐡𝐛𝐨𝐫𝐬. 𝐓𝐨𝐝𝐚𝐲, 𝐭𝐡𝐞𝐲'𝐫𝐞 𝐨𝐟𝐭𝐞𝐧 𝐬𝐭𝐫𝐚𝐧𝐠𝐞𝐫𝐬.
💓𝟒𝟎 𝐲𝐞𝐚𝐫𝐬 𝐚𝐠𝐨, 𝐯𝐢𝐥𝐥𝐚𝐠𝐞𝐫𝐬 𝐦𝐨𝐯𝐞𝐝 𝐭𝐨 𝐜𝐢𝐭𝐢𝐞𝐬 𝐟𝐨𝐫 𝐣𝐨𝐛𝐬. 𝐍𝐨𝐰, 𝐜𝐢𝐭𝐲 𝐟𝐨𝐥𝐤𝐬 𝐬𝐞𝐞𝐤 𝐩𝐞𝐚𝐜𝐞 𝐢𝐧 𝐪𝐮𝐢𝐞𝐭𝐞𝐫 𝐩𝐥𝐚𝐜𝐞𝐬.
❤️𝟒𝟎 𝐲𝐞𝐚𝐫𝐬 𝐚𝐠𝐨, 𝐛𝐞𝐢𝐧𝐠 "𝐟𝐚𝐭" 𝐞𝐪𝐮𝐚𝐥𝐞𝐝 𝐡𝐚𝐩𝐩𝐢𝐧𝐞𝐬𝐬. 𝐓𝐨𝐝𝐚𝐲, 𝐰𝐞 𝐬𝐭𝐫𝐢𝐯𝐞 𝐭𝐨 𝐛𝐞 𝐡𝐞𝐚𝐥𝐭𝐡𝐲.
💕𝟒𝟎 𝐲𝐞𝐚𝐫𝐬 𝐚𝐠𝐨, 𝐭𝐡𝐞 𝐫𝐢𝐜𝐡 𝐩𝐫𝐞𝐭𝐞𝐧𝐝𝐞𝐝 𝐭𝐨 𝐛𝐞 𝐩𝐨𝐨𝐫. 𝐍𝐨𝐰, 𝐬𝐨𝐦𝐞 𝐩𝐫𝐞𝐭𝐞𝐧𝐝 𝐭𝐨 𝐛𝐞 𝐫𝐢𝐜𝐡.
💓𝟒𝟎 𝐲𝐞𝐚𝐫𝐬 𝐚𝐠𝐨, 𝐨𝐧𝐞 𝐩𝐞𝐫𝐬𝐨𝐧 𝐬𝐮𝐩𝐩𝐨𝐫𝐭𝐞𝐝 𝐭𝐡𝐞 𝐟𝐚𝐦𝐢𝐥𝐲. 𝐓𝐨𝐝𝐚𝐲, 𝐚𝐥𝐥 𝐰𝐨𝐫𝐤 𝐭𝐨 𝐬𝐮𝐩𝐩𝐨𝐫𝐭 𝐨𝐧𝐞 𝐜𝐡𝐢𝐥𝐝.
💞𝟒𝟎 𝐲𝐞𝐚𝐫𝐬 𝐚𝐠𝐨, 𝐩𝐞𝐨𝐩𝐥𝐞 𝐥𝐨𝐯𝐞𝐝 𝐬𝐭𝐮𝐝𝐲𝐢𝐧𝐠 𝐚𝐧𝐝 𝐫𝐞𝐚𝐝𝐢𝐧𝐠 𝐛𝐨𝐨𝐤𝐬. 𝐓𝐨𝐝𝐚𝐲, 𝐭𝐡𝐞𝐲'𝐫𝐞 𝐡𝐨𝐨𝐤𝐞𝐝 𝐨𝐧 𝐬𝐨𝐜𝐢𝐚𝐥 𝐦𝐞𝐝𝐢𝐚 𝐚𝐧𝐝 𝐖𝐡𝐚𝐭𝐬𝐀𝐩𝐩 𝐦𝐞𝐬𝐬𝐚𝐠𝐞𝐬.
💖~𝐓𝐢𝐦𝐞 𝐟𝐥𝐢𝐞𝐬, 𝐛𝐮𝐭 𝐜𝐡𝐚𝐧𝐠𝐞 𝐢𝐬 𝐜𝐨𝐧𝐬𝐭𝐚𝐧𝐭. 𝐋𝐞𝐭'𝐬 𝐜𝐡𝐞𝐫𝐢𝐬𝐡 𝐭𝐡𝐞 𝐦𝐞𝐦𝐨𝐫𝐢𝐞𝐬 𝐚𝐧𝐝 𝐞𝐦𝐛𝐫𝐚𝐜𝐞 𝐭𝐡𝐞 𝐩𝐫𝐞𝐬𝐞𝐧𝐭.
💖~𝟒𝟎 𝐲𝐞𝐚𝐫𝐬 𝐭𝐢𝐦𝐞 𝐢𝐬 𝐥𝐨𝐨𝐤𝐢𝐧𝐠 𝐥𝐢𝐤𝐞 .. 𝐉𝐮𝐬𝐭 𝐡𝐚𝐩𝐩𝐞𝐧𝐞𝐝 𝟏𝟗𝟖𝟑 𝐭𝐨 𝟐𝟎𝟐𝟑


𝐓𝐡𝐞𝐬𝐞 𝐚𝐫𝐞 𝟔 𝐔𝐧𝐢𝐪𝐮𝐞 𝐚𝐛𝐢𝐥𝐢𝐭𝐢𝐞𝐬 𝐨𝐟 𝐚 𝐓𝐄𝐀𝐂𝐇𝐄𝐑, 𝐭𝐡𝐞 𝐰𝐨𝐫𝐝 𝐰𝐞 𝐮𝐬𝐞 𝐢𝐧 𝐠𝐞𝐧𝐞𝐫𝐚𝐥 𝐭𝐞𝐫𝐦

 💝💝𝐒𝐚𝐧𝐬𝐤𝐫𝐢𝐭 𝐰𝐨𝐫𝐝𝐬 𝐟𝐨𝐫 "𝐭𝐞𝐚𝐜𝐡𝐞𝐫" 𝐢𝐬 𝐛𝐚𝐬𝐞𝐝 𝐨𝐧 𝐭𝐡𝐞𝐢𝐫 𝐮𝐧𝐢𝐪𝐮𝐞 𝐚𝐛𝐢𝐥𝐢𝐭𝐢𝐞𝐬 & 𝐭𝐡𝐞𝐬𝐞 𝐚𝐫𝐞 𝟔 𝐩𝐡𝐚𝐬𝐞𝐬 𝐨𝐫 𝐜𝐚𝐥𝐥𝐞𝐝 𝐢𝐭 𝐚𝐧 𝐞𝐯𝐨𝐥𝐮𝐭𝐢𝐨𝐧 𝐨𝐟 𝐚 𝐓𝐞𝐚𝐜𝐡𝐞𝐫
❤️~𝐓𝐡𝐞 𝐭𝐞𝐚𝐜𝐡𝐞𝐫 𝐰𝐡𝐨 𝐠𝐢𝐯𝐞𝐬 𝐲𝐨𝐮 𝐈𝐧𝐟𝐨𝐫𝐦𝐚𝐭𝐢𝐨𝐧 𝐢𝐬 𝐜𝐚𝐥𝐥𝐞𝐝 𝐀𝐃𝐇𝐘𝐀𝐏𝐀𝐊
💓~𝐓𝐡𝐞 𝐨𝐧𝐞 𝐰𝐡𝐨 𝐢𝐦𝐩𝐚𝐫𝐭𝐬 𝐤𝐧𝐨𝐰𝐥𝐞𝐝𝐠𝐞 𝐚𝐥𝐨𝐧𝐠 𝐰𝐢𝐭𝐡 𝐈𝐧𝐟𝐨𝐫𝐦𝐚𝐭𝐢𝐨𝐧 𝐢𝐬 𝐜𝐚𝐥𝐥𝐞𝐝 𝐔𝐏𝐀𝐃𝐇𝐘𝐀𝐘𝐀
💕~𝐓𝐡𝐞 𝐨𝐧𝐞 𝐰𝐡𝐨 𝐈𝐦𝐩𝐚𝐫𝐭𝐬 𝐬𝐤𝐢𝐥𝐥 𝐢𝐬 𝐜𝐚𝐥𝐥𝐞𝐝 𝐀𝐂𝐇𝐀𝐑𝐘𝐀
💞~𝐓𝐡𝐞 𝐨𝐧𝐞 𝐰𝐡𝐨 𝐢𝐬 𝐚𝐛𝐥𝐞 𝐭𝐨 𝐠𝐢𝐯𝐞 𝐝𝐞𝐞𝐩 𝐢𝐧𝐬𝐢𝐠𝐡𝐭 𝐢𝐧𝐭𝐨 𝐚 𝐬𝐮𝐛𝐣𝐞𝐜𝐭 𝐢𝐬 𝐜𝐚𝐥𝐥𝐞𝐝 𝐏𝐀𝐍𝐃𝐈𝐓
💓~𝐓𝐡𝐞 𝐨𝐧𝐞 𝐰𝐡𝐨 𝐡𝐚𝐬 𝐚 𝐯𝐢𝐬𝐢𝐨𝐧𝐚𝐫𝐲 𝐯𝐢𝐞𝐰 𝐨𝐧 𝐚 𝐬𝐮𝐛𝐣𝐞𝐜𝐭 𝐚𝐧𝐝 𝐭𝐞𝐚𝐜𝐡𝐞𝐬 𝐲𝐨𝐮 𝐭𝐨 𝐭𝐡𝐢𝐧𝐤 𝐢𝐧 𝐭𝐡𝐚𝐭 𝐦𝐚𝐧𝐧𝐞𝐫 𝐢𝐬 𝐜𝐚𝐥𝐥𝐞𝐝 𝐃𝐇𝐑𝐈𝐒𝐇𝐓𝐀
💕~𝐓𝐡𝐞 𝐨𝐧𝐞 𝐰𝐡𝐨 𝐢𝐬 𝐚𝐛𝐥𝐞 𝐭𝐨 𝐚𝐰𝐚𝐤𝐞𝐧 𝐭𝐡𝐞 𝐰𝐢𝐬𝐝𝐨𝐦 𝐢𝐧 𝐲𝐨𝐮, 𝐥𝐞𝐚𝐝𝐢𝐧𝐠 𝐲𝐨𝐮 𝐟𝐫𝐨𝐦 𝐝𝐚𝐫𝐤𝐧𝐞𝐬𝐬 𝐭𝐨 𝐥𝐢𝐠𝐡𝐭 𝐢𝐬 𝐜𝐚𝐥𝐥𝐞𝐝 𝐆𝐔𝐑𝐔
💖💖~𝐓𝐡𝐞𝐬𝐞 𝐚𝐫𝐞 𝟔 𝐔𝐧𝐢𝐪𝐮𝐞 𝐚𝐛𝐢𝐥𝐢𝐭𝐢𝐞𝐬 𝐨𝐟 𝐚 𝐓𝐄𝐀𝐂𝐇𝐄𝐑, 𝐭𝐡𝐞 𝐰𝐨𝐫𝐝 𝐰𝐞 𝐮𝐬𝐞 𝐢𝐧 𝐠𝐞𝐧𝐞𝐫𝐚𝐥 𝐭𝐞𝐫𝐦
Ⓒ ❤️ *ॐ श्री वेंकटेश्वराय नम:*
💕 *_~𝐒𝐫𝐞𝐞𝐫𝐚𝐦 𝐋𝐚𝐱𝐦𝐢𝐧𝐚𝐫𝐚𝐲𝐚𝐧𝐚 𝐌𝐮𝐫𝐭𝐡𝐲_*

***** ఇలా మనం చేసే అన్ని పనులూ ఇంద్రియ కార్యకలాపాలే. ప్రతి ఇంద్రియానికీ దైవ ప్రవృత్తి, రాక్షస ప్రవృత్తి అనే రెండు స్వభావాలుంటాయి.

 *ॐశ్రీవేంకటేశాయ నమః*
💝💝 *ఎందరెందరో చక్రవర్తులు ఈ భూమిని పరిపాలించారు. సుదీర్ఘకాలం పాలన చేశారు. ఎన్నెన్నో విజయాలు సాధించారు. ఎన్నో సుఖాలు అనుభవించారు. ఎన్నో అద్భుత నిర్మాణాలు చేశారు. కానీ ఏ ఒక్క మహారాజు కూడా ‘కావాలనుకున్నదాన్ని అంతా పొందాను, మొత్తంగా అనుభవించాను’ అనే తృప్తితో గతించలేదు.*
💖 *పలువిధాలైన దివ్యాస్త్రాలను దేవతలనుండి పొందిన మహావీరుల గురించి మన ఇతిహాసాలు చెబుతున్నాయి. వీళ్ళెంతటి గొప్పవారైనా బాహ్య శత్రువులను జయించారే తప్ప, అంతశ్శత్రువులను గెలవలేకపోయారు. కాగా ఈ మహావీరులెవ్వరూ మానసిక ఉన్నతికోసం దైవశక్తులను కోరలేదు. వారి తపస్సులో కేవలం విజయకాంక్ష తప్ప మరొకటి కనిపించదు. దివ్యాస్త్రాలు సైతం నిష్ఫలమైన సందర్భాలున్నాయి. గొప్పగొప్ప అస్త్రాలే హనుమను ఏమీ చేయలేకపోయాయని రామాయణం చెబుతోంది.*
💓 *అర్జునుడు ఏ వరాల కోసమూ శ్రీకృష్ణుణ్ని ఆశ్రయించలేదు. అందువల్లనే దివ్యజ్ఞానామృతాన్ని (భగవద్గీత) పొందగలిగాడు. కోరికల చిట్టాతో దైవాన్ని ప్రార్థిస్తే, ఆ చిట్టా పెరుగుతుందే కానీ దైవబలం పెరగదని మనం గ్రహించాలి.*
💖 *ఆనందాన్నీ, శాంతినీ, సంతృప్తినీ దేనివలన పొందగలమో తెలియక మనిషి ఇంద్రియాల చేతిలో  పలుమార్లు మోసపోతున్నాడు. వేటగాడు జింకను వేటాడినట్లే, వాంఛలు మనిషిని వేటాడుతున్నాయి. కల్పవృక్షం ప్రసాదించే భోగాలూ క్షణికానందాన్నే ఇస్తాయి. మనిషి ఎన్ని తీర్థాలను, దేవతలను సేవించినా, విషయవాంఛల నుంచి బయటపడకపోతే చేసిన, చేస్తున్న పుణ్యకార్యాలన్నీ “ఏటిలో పిసికిన చింతపండు” వలె వృథాయే కదా…!*
💞 *”విషయవాంఛలు” అనబడే శత్రుసేన ఈ శరీరాన్ని ఆక్రమించింది. ఇంద్రియాలతో పొందే అనుభూతులే వాటి గజబలగం. కామ క్రోధాదులే వాటి ఆయుధాలు. అహంకారం వాటికి సేనాపతి. ఇంద్రియాలు వాటి పతాకం. దేహమనే రాజ్యంలో అంతరంగమనే రాజప్రాకారాన్ని ఇవి చుట్టుముట్టాయి. బుద్ధి అనే మంత్రిని చీకటి గదిలో బంధించాయి. మనసు అనే రాజును బానిసను చేశాయి.*
💕 *ఎంతటి పరాక్రమశాలి అయినా బాహ్యంగా కనపడే శత్రువులతో తలపడగలడు కాని, కంటికి కనపడకుండా తనలోనే తిష్ఠవేసిన ప్రత్యర్థులతో పోరాడలేడు. ఇంద్రియ నిగ్రహం, బుద్ధి వికాసంతోనే ఇది సాధ్యమవుతుంది.*

💖 *ఇంద్రియాలను అరణ్యంతో పోల్చారు మేధావులు. అడవిని సులభంగా దాటాలంటే దాని గురించి తెలియాలి. అలాగే ఇంద్రియాల కిటుకు తెలిస్తే, ఇంద్రియారణ్యాన్ని సులభంగా దాటగలం. ఇంద్రియాలు మనసునెలా మాయచేస్తాయో, మనిషి సూక్ష్మదృష్టితో గమనించాలి. చర్మ సౌందర్యంతో మనసును మోహింపజేసే కళ్లు, వాటి వెనకాలే ఉన్న రక్తమాంసాల్ని కప్పి పుచ్చుతాయి. సుగంధాలను అందించే ముక్కు, ఈ దుర్గంధ భరితమైన దేహంలోనే తాను కూడా ఉన్నాననే స్ఫురణను మరపిస్తుంది. రుచులను మనసుకు అలవరచే నాలుక, వాటి చాటున దాగిఉన్న రోగాలను దాచిపెడుతుంది. ఇక శ్రవణేంద్రియమైతే (చెవులు) మనిషిని సత్కార తిరస్కార మాటలతో మభ్యపెడుతుంది. ఇలా అన్ని ఇంద్రియాలూ మనిషిని తప్పుదోవ పట్టిస్తాయి.*
💞 *మనిషిలోనే ఉంటూ, మనిషిని నడిపించే ఈ ఇంద్రియాలను మనసు స్వాధీనపరచుకోవాలి. వినటం, చూడటం, స్పృశించటం, గ్రహించటం… ఇలా మనం చేసే అన్ని పనులూ ఇంద్రియ కార్యకలాపాలే. ప్రతి ఇంద్రియానికీ దైవ ప్రవృత్తి, రాక్షస ప్రవృత్తి అనే రెండు స్వభావాలుంటాయి. సత్కర్మలు, సత్ప్రవర్తన, సత్‌ సాంగత్యం- ఇంద్రియాల్లో దైవప్రవృత్తిని నింపుతాయి. ఇంద్రియారణ్యం నుంచి బయటపడే మార్గాన్నవి చూపిస్తాయి. బుద్ధి వికాసానికి తోడ్పడతాయి.*
❤️ *ఇంద్రియాలకు మనసును దూరంపెట్టి బుద్ధికి చేరువ చేయాలి. అప్పుడే అంతరంగంలో తిష్ఠవేసిన విషయవాంఛలనే శత్రువులను జయించగలం. ఇంద్రుడు అనే ఇంద్రియాధిపతి (మనసు)కి, బృహస్పతి అనే బుద్ధి హితబోధ చేస్తే… “ఆనందమూ, శాంతీ, సంతృప్తీ ఎక్కడ లభిస్తాయో” మనిషి గ్రహించగలగడం అసాధ్యం కానేకాదు.*
Ⓒ❤️ *ॐశ్రీవేంకటేశాయ నమః*
💕*~సకల జనుల శ్రేయోభిలాషి,*
*శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి*

ఆధ్యాత్మికతలో ఉండి కూడా నా కుటుంబ అవసరాలకూ, ఆధ్యాత్మిక అవసరాలకు మధ్య సరియైన సంతులనo కోసం..... ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టటం వలన శక్తిని పొందుతామా?

🔺 *పత్రీజీ సమాధానాలు* 🔺
🌹 *చాప్టర్ -- 5 :--- ఆధ్యాత్మిక శాస్త్రం* 🌹
🌷 *Part --3*🌷

🍁 *ప్రశ్న :---  మాకు ఆధ్యాత్మికత అన్నది ఎంత అద్భుతంగా ఉందంటే, మా సమయం అంతా ఇందులోనే గడపాలి అన్పిస్తోంది. పుస్తకాలు చదువుకోవటానికీ, ధ్యానం చేసుకోవటానికీ, ఇంకా మా కుటుంబం, బంధు మిత్రులు, ఇరుగు పొరుగు వాళ్ళకు ధ్యానాన్ని నేర్పించటానికి ఒక రోజులో 24 గంటలూ సరిపోవటమే లేదు. ఆధ్యాత్మికతలో ఉండి కూడా నా కుటుంబ అవసరాలకూ, ఆధ్యాత్మిక అవసరాలకు మధ్య సరియైన సంతులనాన్ని తీసుకురాలేకపోతున్నాను. దయచేసి సమతుల్యత సాధించటం ఎలానో చెప్పరూ?* 

🌷 *పత్రీజీ :---*  మీ సమయంలో సగభాగం మీ భౌతిక జీవిత ధర్మాన్ని నిర్వర్తించటానికి, మిగతా సగభాగం అంతా కూడా ఆధ్యాత్మిక ధర్మాన్ని అవలంబించటానికి విభజించుకోవాలి. భౌతిక జీవితంలోని బాధ్యతలు అన్నింటినీ చక్కగా నిర్వహిస్తూనే మీ ఆధ్యాత్మిక ఎదుగుదల కోసం కూడా సాధన చెయ్యాలి. ఈ రెండింటి మధ్య ఖచ్చితమైన సమతుల్యత సాధించాలి. 

🌲 ఏ విషయంలో కూడా ఎలాంటి ఆరాటం, ఆతృత పనికి రాదు. అది ఆధ్యాత్మిక ఎదుగుదల కోసం అయినా సరే. అయితే భౌతికత్వంలో మునిగిపోకుండా ఎరుకతో ఉండాలి. మీ దేహ పరమైన కర్తవ్యాలను తప్పకుండా చెయ్యాలి, అయితే వాటి ఆకర్షణలో పడిపోకూడదు. 
ఆధ్యాత్మిక సాధన కోసం ప్రతి రోజూ 12 గంటలు కేటాయించుకోవాలి. మిగతా 12 గంటల సమయం అంతా భౌతిక జీవితానికి కేటాయిస్తే ఆ రోజంతా చక్కని సమతుల్యతలో ఉంటుంది. 50 శాతం ప్రాపంచిక జీవితం, 50 శాతం ఆధ్యాత్మిక జీవితం, సమతుల్యతతో జీవించటమే PSSM అంటే ! అదీ సంగతి. 

🍁 *ప్రశ్న :--- ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టటం వలన శక్తిని పొందుతామా?* 

🏵️ *పత్రీజీ :---* ఆధ్యాత్మికతలో ఉన్న మనకు ఆధ్యాత్మిక కార్యక్రమం అంటే ఒక లీల. ఒక కేళి. ఆధ్యాత్మిక కార్యం అంటే విశ్రాంతిగా ఉండటం... ఆధ్యాత్మిక కార్యం అంటే మానసిక ప్రశాంతత... ఆధ్యాత్మిక కార్యం అంటే ఉప్పొంగే శక్తి... కనుక ఆధ్యాత్మిక కార్యాలు ఏవి చేస్తున్నా ఎంతగానో పునరుత్తేజితం అవుతూ ఉంటాం. 


ఆకలిమందు -- చందమామ కథలు

 🌈🌈🌈🌈🌈🦋🦋🦋🦋🦋🌹🌹🌹🌹🌹
*ఆకలిమందు -- చందమామ కథలు*

*ఒక దేశంలో ఒక ఏడు కరువు ఏర్పడింది. ఆ దేశపురాజు మంత్రులనూ, తదితర ప్రభుత్వోద్యోగులనూ సమావేశపరచి, ‘‘మన దేశంలో ఆకలి చావులు రోజురోజుకూ ఎక్కువై పోతున్నాయి. ఆకలిని శాశ్వతంగా నివారించేటందుకు వైద్యుల చేత ఆకలి కలగకుండా మందు తయరుచేయిస్తాను," అన్నాడు.*

*ఏమంటే ఏమి ముంచుకొస్తుందో నని సభికులు ఏమీ అనకుండా ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. వృద్ధమంత్రి సుబుద్ధి మాత్రం, ‘‘మహారాజా, మన దేశానికి కరువు కొత్తది కాదు. దాన్ని నివారించాలంటే, నీటి పారుదల సౌకర్యాలు పెంచి దేశాన్ని సస్యశ్యామలం చెయ్యాలి. అంతేగాని, ఆకలిమందుతో కాటకాన్ని అరికట్టటం జరిగేపని కాదు," అన్నాడు.*

*‘‘ఎందుకు జరగదో నేనూ చూస్తాను," అంటూ రాజు ముసలి మంత్రి మీద విరుచుకుపడ్డాడు. ఆయన మంత్రిని శకునపక్ష అనీ, తాను అనుకున్న ప్రతి ఆలోచనకూ అభ్యంతరం చెబుతాడనీ అన్నమీదట, మిగిలిన వాళ్ళంతా రాజుగారి ఆలోచన దివ్యంగా ఉందన్నారు. రాజు దేశంలోని వైద్యులందరనీ పిలిపించి, ‘‘మీకు ఒక నెలరోజులు గడువిచ్చాను, ఆకలికి మందు తయారుచెయ్యండి," అన్నాడు.*

*వైద్యులు నిర్ఘాంతపోయారు. వారిలో ఒకరు, ‘‘ప్రభువులు క్షమించాలి, ఆకలి కలగకుండా చెయ్యటానికి ఔషధం ఏ వైద్యగ్రంథంలోనూ చెప్పబడలేదు," అన్నాడు. ‘‘అయితే మీరు తయారు చేయలేరన్న మాట... ఈ నకిలీ వైద్యులందరినీ కారాగారంలో బంధించండి. నిష్ప్రయోజకులు," అన్నాడు రాజు రౌద్రంగా తన సేనానితో. ఒక ముసలివాడు, ‘‘మహారాజా,ఈ వైద్యులను విడుదల చేయించండి. ఒక వారం రోజులలో నేను మీరు కోరిన ఔషధం తయారు చేసి ఇయ్యగలను," అన్నాడు.*

*‘‘వైద్యుడంటే అలా ఉండాలి,* అని రాజు వైద్యులందరినీ విడుదల చేయించాడు. తరవాత కొన్ని రోజులకు ఆ ముసలివాడే రాజు వద్దకు వచ్చి, తాటికాయ ప్రమాణమంత మందు తెచ్చి ఇచ్చి, మనిషికి ఒక గురిగింజ ఎత్తు ఆ మందు తినిపించినట్టయితే జన్మలో మళ్ళీ ఆకలి ఉండదన్నాడు. రాజు ఆ లేహ్యాన్ని అందుకుని, ముసలి వాణ్ణి సన్మానించి, ఆ లేహ్యాన్ని నగర వాసులకు పంచాడు.*

*రాజప్రాంగణంలో ఎవరూ మందు తినలేదు గనక వారికి ఆకలి మామూలుగానే ఉండిపోయింది. కాని నగరంలో అందరికీ ఆకలి పోయినట్టు వార్త వచ్చింది. వృద్ధ మంత్రి రాజు వద్దకు వచ్చి, ‘‘మహారాజా, ప్రజలు పనిపాటలు మానేశారు. వారి కిప్పుడు ఆకలి బాధలేదు గనక, ఎంతసేపూ వినోదాలలోనూ, వేడుకలోలనూ, నిద్రలోనూ కాలం గడుపుతున్నారు. చిన్నా, పెద్దా తారతమ్యం పోయింది," అన్నాడు.*

*‘‘అన్నిటికన్న పెద్దది, ఆకలి సమస్య పోయింది గదా!" అన్నాడు రాజు. మరిరెండు రోజులకు మంత్రి రాజుతో, ‘‘మహారాజా, అందరూ కులవృత్తులు మానేశారు. నేతగాళ్ళు బట్టలు నెయ్యటం లేదు.*

*క్షురకులు క్షురకర్మ చెయ్యటం లేదు. ప్రజలు గడ్డాలూ మీసాలూ పెరిగి అరణ్య మృగాలలాగా ఉన్నారు. అన్ని వస్తువులకూ కరువు ఏర్పడింది. వెనక తిండి గింజలు మాత్రమే లేవు. ఇప్పుడు ఏ వస్తువూ దొరకటం లేదు. దొరికితే ఎత్తు కెత్తు బంగారం పోసి కొనవలిసి వస్తున్నది," అన్నాడు. రాజు ఈ మాటలు విని, ఏమీ అనకుండా ఊరుకున్నాడు.*

*మరో రోజు మంత్రి రాజుతో, ‘‘మహారాజా, ప్రజలు శాసనధిక్కారం చేసి, తిరగబడుతున్నారు. అరాజకం ఏర్పడుతున్నది," అన్నాడు. రాజుకు కోపం వచ్చింది , ‘‘ప్రజలు ఇంత కృతఘ్నులా? సైన్యాన్ని సిద్ధంగా ఉంచమని సేనాపతికి చెప్పండి," అన్నాడు ఆయన. ‘‘ఇంకా మనకు సేన ఎక్కడున్నది, మహారాజా? సైనికులలో చాలా మంది కొలువు చాలించుకుని వెళ్ళిపోయారు," అన్నాడు మంత్రి.*

*ఇంతలో సేనాపతి కంగారుపడుతూ వచ్చి, ‘‘మహారాజా, మన విరోధి చండ ప్రచండుడు తన సేనలతో వచ్చి, మన రాజధానిని చుట్టుముట్టాడు," అని చెప్పాడు. ‘‘ఇప్పుడు ఏం చేసేటట్టు?" అన్నాడు రాజు ఆదుర్దాగా. ‘‘శత్రువుకు లొంగిపోవటం తప్ప గత్యంతరం లేదు, మహారాజా," అన్నాడు సేనాపతి. అతను ఇలా అంటూండగానే శత్రు సైనికులు వచ్చారు. వాళ్ళనాయకుడు రాజును సమీపించి, ‘‘మీ రాజ్యం మాకు హస్తగతమయింది.*

*అనవసరంగా ప్రతిఘటించి ప్రాణాలకు ముప్పు తెచ్చుకోవద్దు," అన్నాడు. ‘‘ఇంకెక్కడి ప్రతిఘటన? ఈ ఆకలి మందు నన్నీ గతికి తెచ్చింది. నే నిప్పుడు మీకు బందీని," అంటూ రాజు కదిలాడు. అంతలో ఊతకర్ర పొడుచుకుంటూ ముసలి వైద్యుడు వచ్చి, ‘‘ఆకలి మందు అన్ని అనర్థాలకూ మూలమని నేను చెబితే విన్నారా, మహారాజా?" అన్నాడు.*

*‘‘అందుకే అనుభవిస్తున్నాను," అన్నాడు రాజు. ‘‘ఇప్పటికైనా అసలు విషయాన్ని గ్రహించారు. సంతోషం!" అంటూ వైద్యుడు తన వేషాన్ని తీసేశాడు. ఆయన మంత్రి సుబుద్ధే! ‘‘ప్రభువులు క్షమించాలి. మంత్రాలకు చింతకాయలు రాలవు. మందు మాకులతో ఆకలి సమస్య తీరదు.*

*మీచేత సరిఅయిన ప్రణాళికలు అమలు జరిపించాలని ఈ నాటకం ఆడాం. శత్రు సైనికులందరూ మన సైనికులే. దేశసంపదను సద్వినిెూగం చెయ్యటానికి ప్రణాళికలు తయారు చేయించి, దేశాన్ని సస్యశ్యామలం చేసి, కాటకాన్ని రూపు మాపండి," అన్నాడు మంత్రి సుబుద్ధి.*

ఏమొస్తుందా పుస్తకాలు చదివితే

 @ కళా సాధన @


"నా పై దయతో ఈ వంట గది ఒక్కటీ వదిలేసారు అన్నయ్యా! మిగిలిన గదులు నిండా పుస్తకాలే"
సముద్రం అనే కథలో పాపినేని శివశంకర్ ఒక పాత్ర నోట పలికించిన మాటలివి

దాదాపుగా పుస్తక ప్రేమికులు ఉన్న ప్రతి ఇంటిలో  ఎవరో ఒకరి నోటి వచ్చే మాటలే ఇవే..... 

మర్చిపోయాను....  ఇంకో మాట కూడా చాలా తరుచుగా వినిపిస్తుంది ఆ ఇళ్ళలో
 "అసలు అలా పుస్తకాలు చదివడం వల్ల ఏమొస్తుంది!" అని

గాలి పీలిస్తే ఏమొస్తుంది
ప్రాణం నిలుస్తుంది

నీరు తాగితే ఏమొస్తుంది
జీవం వస్తుంది

ఆహారం తీసుకుంటే ఏమొస్తుంది
బలం వస్తుంది

కదా.....! 
పుస్తకాలు చదివినా అంతే.... 
మనస్సు తెప్పరిల్లుతుంది 
హృదయపు ఆర్తి చల్లారుతుంది 
మెదడు వికశిస్తుంది వివేకంతో.... 
జవజీవాలతో తొణికిసలాడుతుంది చిత్తం

రుచి చూసిన వాడికే తెలుస్తుంది 
సాహిత్య పఠనంలోని రసానందం
 కాదు కాదు చితానందం

"మందార మకరంద మాధుర్యమున దేలు
  మధుపంబు వోవునే మదనములకు

  నిర్మల మందాకినీవీచికల దూగు
  రాయంచ చనునే తరంగిణులకు

  లలిత రసాల పల్లవ ఖాదియై సొక్కు
   కోయిల జేరునే కుటజములకు

  పూర్ణేందు చంద్రికాస్ఫురిత చకోరక
    మరుగునే సాంద్ర నీహారములకు

అంబుజోదర దివ్య పాదారవింద
చింతనామృత పాన విశేష మత్త
చిత్త మేరీతి నితరంబు జేర నేర్తు!
వినుత గుణశీల, మాటలు వేయునేల?

అంటాడు పోతన తన భాగవతంలో భగవద్ సాన్నిధ్యం లోని పరమానందపు అంతిమ అవస్థ గురించి. 

నేనూ అదే అంటాను పుస్తక పఠనం లోని
రసానందపు అంతిమ స్థితి గురించి

ఏమొస్తుందా పుస్తకాలు చదివితే

అర్థం లేనివనిపిస్తుంది అహం స్వార్థం.
పెల్లుబుకుతుంది విశ్వ మానవాళి పై ప్రేమ

హంగులు ఆర్భాటాలు ఆడంబరాలు వ్యర్థం అనిపిస్తుంది. మానవత్వం మనిషితత్వం చిగురు తొడుగుతుంది నీలో నాలో మనలో

జీవించడం ఒక కళ... ఆ కళా సాధనే పుస్తక పఠనం

సేకరణ.
....వినయశ్రీ.