Tuesday, November 7, 2023

సెల్ ఫోన్, సెల్ ఫోన్ వికరణాల ప్రభావం , Cell phone radiation effects

 0311.     1-9.      190223-8.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀91.
*మన ఆరోగ్యం…!

                      *సెల్ ఫోన్*
                     ➖➖➖✍️

#BecarefulChildren.....

*పిల్లలు సెల్ ఫోన్ తో ఆదుకోవడం గొప్పగా భావించకండి.. తరువాత బాధపడేది మనమే... పిల్లల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే...అవగాహనా కోసం*

*Naveen Nadiminti సలహాలు* 

సెల్ ఫోన్ వికరణాల ప్రభావం , Cell phone radiation effects

సెల్ ఫోన్ వికరణాల ప్రభావం

Cell phone radiation effects

మనిషి ఆరోగ్యం మీద సెల్ ఫోన్ వికరణాల ప్రభావం

మొబైల్ ఫోన్ వాడకం ద్వారా ప్రమాదకరమైన రేడియో ధార్మిక దుష్ప్రభావాలకు గురయ్యే అవకాశం ఉంది . ప్రజల దైనందిన జీవితాలలో సెల్ ఫోన్లు ముఖ్యమైన ఉపకరణము గా ఈరోజు మారాయి. సెల్ ఫోన్లు మానవ శరీరానికి రోగాలని కలగచేసే లేదా మన ఆరోగ్యానికి హాని కలగచేసే సూక్ష్మ తరంగాలని ప్రసరిస్తాయి .

పిల్లలో సెల్-ఫోన్‌ ప్రభావము :

మన దేశంలో సెల్ ఫోన్ ల వినియోగం రోజురోజుకీ పెరుగుతోంది. రింగ్ టోన్లు, కాలర్ ట్యూన్లు, ఎస్ ఎం ఎస్ లు అంటూ ఎన్నో రకాలుగా సెల్ ఫోన్ ల వాడకం పెరిగిపోతుంది. ఇది బాగానే ఉందిగాని, ఈ సెల్ ఫోన్ల వల్ల వచ్చే అనార్థల గురించి ఎవరూ పట్టించుకోక పోవడం విచారకరమని అంతర్జాతీయ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. ముఖ్యంగా ఈ సెల్ ఫోన్ల పిల్లలు ఎక్కువగా అనారోగ్యం పాలు అవుతున్నారని వారు పేర్కొంటున్నారు. గేమ్స్ ఆడడం, పాటలు వినడం , సినిమాలు చూడడంలో పిల్లలు సెల్ ఫోన్స్ ని ఎక్కువగా వాడుతున్నారు. మూడు సంవత్సరాల వయసు కన్నా తక్కువ వయసు ఉన్న పిల్లలకి సెల్ ఫోన్స్ ని దూరంగా ఉంచడం చాలా మంచిదని నిపుణులు, డాక్టర్లు చెబుతున్నారు. సెల్ ఫోన్ లు రిసీవ్ చేసుకునే సిగ్నల్స్ కారణంగా రేడియో ధార్మికత వల్ల చిన్న పిల్లల్లో మెదడుకి సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాలు ఎక్కువగా ఉన్నాయి. వారి ఆలోచనా శక్తి క్రమేపీ మోద్దుబారే ప్రమాదం ఏర్పడుతోందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ఓ బ్రిటీష్ శాస్త్రవేత్త ఈ సెల్ ఫోన్ల్ వల్ల వస్తున్న అనర్థాల గురించి కొన్ని హెచ్చరికలు చేసారు. ముఖ్యంగా వైర లెస్, సెల్ ఫోన్ లు, విల్ ఫోన్ లు నుంచి విడుదలయ్యే రేడియో ధార్మిక కిరణాలు సున్నితమైన మెదడు కణజాలాన్ని నాశనం చేస్తున్నాయని, చిన్న పిల్లల్లో ఇది బాగా ఎక్కువగా ఉందని ఆందోళన వ్యక్తం చేసారు. బ్రిటన్ హెల్త్ ప్రొడక్షన్ ఏజన్సీకి చెందినా సర్ విలియం స్టీవార్డ్ ఫిన్క్ష్లన్ద్లొ జరిపిన పరిశోధనలో పాలు విభ్రాంతికరమైన సంగతులు వెలుగు చూశాయి.

సెల్ ఫోన్ లు బాగా వాడే యువకుల రోజువారీ ప్రవర్తనను పరిశీలించిన బృందం వారు తీవ్రమైన మానసిక వత్తిడికి, చిరాకుకీ గురవుతున్నారని తెల్సింది. సెల్ ఫోన్ ల ప్రభావం వల్ల చిన్న పిల్లలు వత్తిడికి గురవ్వడంతో పాటు సరిగా చదవలేక పోతున్నారని, తలనొప్పికి గురవుతున్నట్లుగా కూడా వెల్లడైంది. సెల్ ఫోన్ లతో పాటు మ్యూజిక్ సిస్టమ్స్ వల్ల కూడా ఇలాంటి ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఆయన వెల్లడించారు. ముభావంగా ఉండడం, ఆకలి మందగించడం, ఎక్కువసేపు మెలకువగా ఉండడం, సరిగా చదవలేకపోవడం, చదివింది గుర్తుంచుకోకపోవడం వంటి లక్షణాలు చిన్నారుల్లో కనిపించినట్లు స్టీవార్డ్ తన పరిశోధన ఫలితాలు వివరించారు. అందుకే ఆస్ట్రేలియా మెడికల్ అసోసియేషన్, పాఠశాలల్లో మ్యూజిక్ సిస్టమ్స్, సెల్ ఫోన్ వాడకాన్ని నిషేదించాలని సూచించింది. ఆస్ట్రేలియా, చైనా అమెరికాలోనూ చిన్నారుల్లో ఇలాంటి లక్షణాలు అధికంగా నమోదవుతున్నాయి. భారత్ లో ఈ అనారోగ్య లక్షణాలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మన దేశంలో వివిధ సెల్ ఫోన్ కంపెనీలు అందిస్తున్న ఆఫర్ల వలలో మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా చిక్కుకుంటున్నారు. క్రమేపీ మనదేశంలో కూడా చిన్నారుల ఆరోగ్యాన్ని ఈ సెల్ ఫోన్ రేడియో ధార్మికత కబళించే ప్రమాదం ఉందని స్వచ్చంద సంస్థలు హెచ్చరిస్తున్నాయి. అందుకే సెల్ ఫోన్ లు మీ చిన్నారులకు అందుబాటులో లేకుండా చూసుకుంటే వారి ఆరోగ్యానికి ఎంతో మంచిది.

పెద్దవారిలో-- మొబైల్ ఫోన్ వికరణాలు వల్ల కలిగే అనారోగ్యాలు : ->

హై బ్లడ్ ప్రెజర్,

తలనొప్పులు,

మెదడు వాపు వ్యాధి,

ఆల్జీమెర్,

క్యాన్సర్

మరియు అంతకన్నా ఎక్కువ ఆరోగ్య సమస్యల్ని కలగచేస్తాయని అధ్యయనాలు తెలుపుతున్నాయి. అయినా, సెల్ ఫోన్ ఉపయోగం , కలిగే హాని గురించి పూర్తిగా ఏ ఒక్కరికీ తెలియదు

ఇక్కడ ఇచ్చిన కొన్ని చిట్కాల్ని చూడండి:

1. వీలైనంత వరకు చాలా తక్కువగా వికరణాలకి మాత్రమే గురికావాలి. దీని అర్థం ఏమిటంటే తెలివిగా వీలైనంత తక్కువ ఫోన్ లో మాట్లాడడము, అతి దీర్ఘమైన సంభాషణల్ని జరగకుండా మీరు ప్రయత్నించడం. రెండు నిమిషాల కాల్ తరువాత, మెదడు యొక్క ఎలక్ట్రికల్ ఏక్టివిటీస్/పనితీరు ఒక గంటవరకు మార్పుచేస్తుందని కనుగొన్నారు.

2. సెల్ ఫోన్ ని అత్యవసర పరిస్థితులలో మాత్రమే పిల్లలు ఉపయోగించడాన్ని అనుమతించాలి.

3. మీ మొబైల్ ఫోన్ని ఉపయోగించనప్పుడు, వీలైనంతవరకు మీ శరీరానికి దూరంగా ఉంచాలి. కొంతమంది సెల్ ఫోన్ ఉన్నవారు సెల్ ఫోన్ పనిచేస్తూ ఉండగా తమ పేంటు జేబులో పెడతారు. మానవ శరీరము యొక్క క్రింది భాగము, పై భాగము కన్నా చాలా త్వరగా వికరణాలని లీనం చేసుకుంటుంది.

4. హెడ్ ఫోన్లని ఉపయోగించాలని అనుకున్నట్లైతే, వైర్డు హెడ్ సెట్ల కన్నా వైర్ లెస్ హెడ్ సెట్లని వాడండి. వైరు వికరణాన్ని ప్రసరించడమే కాకుండా ఏంటీనాలా కూడా పనిచేసి చుట్టుప్రక్కల ఉన్న ఎలక్ట్రోమేగ్నెటిక్ ఫీల్డులను (EMFs) ఆకర్షిస్తుంది. హెడ్ సెట్ లేకుండా మీరు సెల్ ఫోన్ ఉపయోగించినప్పుడు, మీ చెవి దగ్గరికి తీసుకునే ముందు కాల్ వచ్చే వరకు వేచి చూడాలి.

5. మీరు సెల్ ఫోన్, హోల్ సేల్ లేదా ఒకొక్కరిగా అమ్మే వారి దగ్గర కొనేటప్పుడు తక్కువ ఎస్ ఎ ఆర్ (నిర్దుష్టమైన విలీన రేటు) ఉన్నది చూసుకుని ఎంచుకోవాలి.ఇన్సట్రక్షన్ మేన్యువల్ లో ఇచ్చిన ఎస్ ఎ ఆర్ నంబరుని చూడండి ఎంత తక్కువ ఎస్ ఎ ఆర్ విలువ ఉంటే అంత మంచిది.

6. ఎలివేటర్లు/ లిఫ్టులు లేదా వాహనాలు వంటి, మూసివేసిన మెటల్ స్పేసులలో వికరణం ఉధృతంగా ఉంటుంది కాబట్టి కాల్స్ ని తీయకుండా ఉండండి.

మీ సెల్‌ఫోన్‌ హాని చేయనిదేనా..తెలుసుకోండిలా ..!

బ్రాండెడ్‌ సెల్‌ఫోన్లతో ఎక్కువసేపు మాట్లాడినా ఇబ్బందేమీ ఉండదు. అదే అన్‌బ్రాండెడ్‌ మొబైల్‌తో 5 నిమిషాలు మాట్లాడినా.. చెవి దగ్గర వేడెక్కుతుంది. ఫోన్‌ నుంచి అధిక రేడియేషన్‌ వెలువడటమే ఇందుకు కారణం. అందుకే సెల్‌ఫోన్‌ కొనేటప్పుడు కెమేరా, వీడియో ప్లేయర్‌, ఎంపీ 3, ఇంటర్నెట్‌ వంటి ఫీచర్లతో పాటు రేడియేషన్‌ ఎంత వెలువరిస్తుందో కూడా తెలుసుకోవడమూ అవసరమే.

మొబైల్‌ ఫోన్‌ రేడియో తరంగాలను ప్రసారం చేయడంతో పాటు గ్రహిస్తుంది కూడా. అందుకే ఫోన్‌ నిర్దిష్ట శోషణ సూచి (ఎస్‌ఏఆర్‌) అంటే రేడియో తరంగాల నుంచి ఎంత శక్తిని మన శరీరం గ్రహిస్తుందో కూడా తెలుసుకోవాలి.

* 'కిలోగ్రాముకు 2 వాట్ల కంటే తక్కువ రేడియేషన్‌ వెలువరించేవి మంచి ఫోన్లు' అని స్వతంత్ర సాంకేతిక సంస్థ ఇంటర్నేషనల్‌ కమిషన్‌ ఆన్‌ నాన్‌ అయొనైజింగ్‌ రేడియేషన్‌ ప్రొటెక్షన్‌ (ఐసీఎన్‌ఐఆర్‌పీ) తేల్చింది. 10 గ్రాముల కణజాలాన్ని సగటుగా తీసుకుని లెక్కించారు. దీనినే అంతర్జాతీయంగా అనుసరిస్తున్నారు. అయితే చెవి దగ్గర ఫోన్‌ ఉంచి మాట్లాడేందుకు ఎస్‌ఎఆర్‌ 1.29 వాట్లు/కిలోగ్రామ్‌ ఉండాలని ఐసీఎన్‌ఐఆర్‌పీ నిర్దేశించింది.

* ఎస్‌ఏఆర్‌ పరిమాణం నిర్ధరించిన అత్యధిక విలువ కంటే తక్కువే ఉండాలి. ఎందుకంటే నెట్‌వర్క్‌ను చేరేందుకు మాత్రమే సెల్‌ఫోన్‌ తన బ్యాటరీ నుంచి శక్తిని వినియోగించాల్సి ఉంటుంది. నెట్‌వర్క్‌ బేస్‌ స్టేషన్‌ నుంచి మనం ఎంత దూరాన ఉన్నాం అనే అంశంపై సెల్‌ఫోన్‌ శక్తి వినియోగం ఆధారపడుతుంది.

ఎస్‌ఏఆర్‌ ప్రమాణాలు ఆయా దేశాల్లో

అమెరికాలో 1.6 వాట్స్‌/కిలోగ్రామ్‌

కెనడాలో 1.6 వాట్స్‌/కిలోగ్రామ్‌

ఐరోపాలో 2 వాట్స్‌ / కిలోగ్రామ్‌

ఆస్ట్రేలియాలో 2 వాట్స్‌ / కిలోగ్రామ్‌

కంపెనీల ప్రత్యేక వెబ్‌సైట్లు

కంపెనీలు తాము తయారుచేసిన సెల్‌ఫోన్లు విక్రయించే ముందు రేడియేషన్‌ పరీక్షను అమలు చేస్తాయి. అందులో అర్హత పొందిన వాటినే మార్కెట్లోకి విడుదల చేస్తాయి. ఈ సమాచారం ఫోన్‌తో పాటు ఇచ్చే యూజర్‌ గైడ్‌లో ఉంటుంది. దీంతోపాటు బ్రాండెడ్‌ కంపెనీలన్నీ ప్రత్యేక వెబ్‌సైట్లు కూడా నిర్వహిస్తున్నాయి. కంపెనీ, ఫోన్‌ మోడల్‌, దేశాన్ని ఆయా సైట్లలో నమోదు చేస్తే, ఎంత రేడియేషన్‌ వెలువరిస్తుందో తెలుస్తుంది. కొన్ని వెబ్‌సైట్లు ఇవీ..

సెల్‌ఫోన్లకు రేడియేషన్‌ షీల్డులు విక్రయించే ఎస్‌ఎఆర్‌ షీల్డ్‌ వెబ్‌సైట్‌ www.sarshield.comలో కూడా పూర్తి సమాచారం లభిస్తుంది

ఈ జాగ్రత్తలు పాటిస్తే

* ఎస్‌ఏఆర్‌ తక్కువగా ఉండే సెల్‌ఫోన్లు కొనాలి.

* సాధ్యమైన చోట్ల ఫోన్‌ చెవి దగ్గరకు చేర్చకుండా, స్పీకర్‌ ఆన్‌ చేసి మాట్లాడాలి

* హెడ్‌సెట్‌ (ఇయర్‌ఫోన్లు) వినియోగించినా సెల్‌ఫోన్‌ రేడియేషన్‌ ప్రభావం పూర్తిగా పోదు

* అవసరమైన కాల్స్‌ మాత్రమే మాట్లాడి, మిగిలిన వాటికి టెక్ట్స్‌ మెసేజ్‌ (ఎస్‌ఎంఎస్‌) వినియోగించాలి

* సెల్‌ఫోన్‌ తీసుకెళ్లేటప్పుడు మన శరీరానికి కనీసం అంగుళం దూరాన ఉండేలా చూసుకోవాలి

* నెట్‌వర్క్‌ బలహీనంగా ఉన్నచోట, సిగ్నల్‌ కోసం ఫోన్లు అత్యధిక రేడియేషన్‌ను వెలువరించే అవకాశముంది. అలాంటి ప్రదేశాల్లో ఫోన్‌ వినియోగం తగ్గించాలి

* నిద్రించేటప్పుడు తలగడ వద్ద ఫోన్‌ ఆన్‌చేసి ఉంచవద్దు.


సెల్‌తో ఎముకలకు ముప్పు

ఈమధ్య కాలంలో సెల్‌ఫోన్‌ వాడనివారు పాపాత్ములు. టెక్నాలజీని మేం మాత్రం వాడుకోకూడదా అనే పంథాలో. కానీ దేన్నైనా అవసరాన్ని మితిమీరి వాడితే ముప్పులు తప్పవ్ఞ. కొంతమంది హోదాకోసమో, హుందా కోసమో ఎప్పుడూ సెల్‌ఫోన్‌ను బెల్టుకో, జేబులోనో ధరిస్తుంటే వాటి నుంచి వెలువడే విద్యుదయస్కాంత కిరణాలు కటి ప్రాంతంలోని ఎముక సాంద్రతను దెబ్బతీస్తున్నాయని టర్కీ పరిశోధకులు చెబుతున్నారు.

ఆరేళ్లుగా రోజుకి 15 గంటల పాటు ఇలా బెల్టుకి సెల్‌ఫోన్‌ ధరిస్తున్న వారి ఎముకల సాంద్రతను పరీక్షించినపుడు తుంటి ఎముక పైభాగంలోని వంపు (ఇలియాక్‌ వింగ్స్‌) దగ్గర అవతలి వైపు ఎముక కన్నా బలహీనంగా ఉంటున్నట్టు గుర్తించారు. కాబట్టి సెల్‌ఫోన్‌ ప్రియులూ తస్మాత్‌ జాగ్రత్త!

సెల్‌ఫోన్లతో బ్రెయిన్‌ క్యాన్సర్‌

        యూత్‌లో సెల్‌ ఫోన్ల వాడ కం పెరగడంపై ఆమె హెచ్చరికలు చేస్తున్నారు. మొబైల్‌ ఫోన్ల వాడకంతో రాబోయే మూడు సంవత్సరాల్లో యువతలో పలు ఆరోగ్య సమస్యలు ఎదుర య్యే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. వీటి ఉపయోగంతో మగ వారిలో వ్యంధత్వం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని అన్నారు. ఆమె యుఎస్‌, చైనా, ఆస్ట్రేలియా తదితర ఏడు దేశాల్లో పరిశోధనలు నిర్వహించారు. యువ కులు స్విచాన్‌ చేసిన మొబైల్‌ ఫోన్స్‌ను ప్యాంట్‌ జేబుల్లో పెట్టుకొనే వారిలో స్పెర్మ్‌ కౌంట్‌ తగ్గే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించారు. కొత్తగా తండ్రులు కావాలనుకునే యువకులు ప్రతిరోజు కనీసం నాలుగు గంటల పాటు సెల్‌ ఫోన్‌ వాడితే అంతే సంగతులు. ఈవిధంగా మొబైల్‌ను వాడితే ఇతరులతో పోల్చుకుంటే వారిలో స్పెర్మ్‌ కౌంట్‌ సగానికి సగం తగ్గుతుందని పరిశోధనల్లో దేవ్‌రా డేవిస్‌ చెప్పడం గమనార్హం.

మొబైల్‌ రేడియేషన్‌ మధ్య స్పెర్మ్‌లను ఉంచితే అవి బలహీనపడడమే కాకుండా సన్నబడి వేగంగా ఈదలేకపోతున్న విషయం తమ పరిశోధనలో తేలిందని ఆమె పేర్కొన్నారు. తక్కువ శక్తితో కూడిన రేడియో ఫ్రీక్వెన్సీ ట్రాన్స్‌మిట్టర్‌లైన మొబైల్‌ ఫోన్లు మైక్రోవేవ్‌ రేడియే షన్‌ను సృష్టిస్తాయి. సెల్‌ ఫోన్‌ రేడియేషన్‌ పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందనీ ఈ విషయంలో సెల్‌ఫోన్‌ కంపెనీలు ఏం చేస్తా యో చూడాల్సిందేనని ఆమె పేర్కొన్నారు. మొబైల్‌ ఫోన్లను ఎక్కువగా వాడ డం వల్ల తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఏర్పడే అవకాశాలున్నాయనీ ఇవి ఆరోగ్యవంతమైన పిల్లలు కలిగే అవకాశాలను నీరుకారుస్తాయని ఆమె హెచ్చరిస్తున్నారు. ఇవి మనకు దీర్ఘకాల సమస్యలను సృష్టిస్తూ మనుషుల మెదడు, శరీరాన్ని పూర్తిగా దెబ్బతీస్తాయని దేవ్‌రా డేవిస్‌ పేర్కొన్నారు.

      కొంతకాలానికి వాటిలో ట్యూమర్లు ఏర్పడిన విషయం బయటపడి అందరూ నిర్ఘాంతపోయారు. కనుక సెల్‌ ఫోన్లతో జాగ్రత్త పడక తప్పదు.

15నిమిషాలు సెల్‌ఫోన్‌ మాట్లాడితే బ్రెయిన్‌ కేన్సర్‌

    : మొబైల్‌ ఫోన్‌లలో ఎక్కువ సమయం సంభాసించే వారికి బ్రెయిన్‌ కాన్సర్‌ వచ్చే అవకాశముందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వినియోగదారులకు ఓ హెచ్చరిక చేసింది. 15 నిమిషాల పాటు ఏకధాటిగా మొబైల్‌ ఫోన్‌లో మాట్లాడితే తప్పనిసరిగా బ్రెయిన్‌ కాన్సర్‌ వస్తుందని, తాజా అధ్యయనంలో వెల్లడైనట్లు డబ్ల్యుహెచ్‌ఓ పేర్కొంది. దాదాపు 13 దేశాలలో మొబైల్‌ ఫోన్‌ వినియోగదారులపై పరిశోధనలు నిర్వహించగా, ఈ ఆందోళనకర విషయం వెలుగుచూసిందని తెలిపింది. ఓ రోజులో 15 నిమిషాలు మొబైల్‌ ఫోన్‌లో సంభాషణలు జరిపినా బ్రెయిన్‌ ట్యూమర్‌ వచ్చే అవకాశా లున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది.

మొబైల్ తో మతిమరుపు :

ఏ వయస్సులో ఉన్నా , ఎవ్వరి చేతిలో చూసినా సెల్ ఫోన్‌ కనిపించాల్సిందే . క్షణాల్లో విషయాలు తెల్సుకోగల ఈ సంకేతికవిప్లవం మంచిదే అయినా .. అతి అనర్ధదాయకం అన్న సూత్రం ఇక్కడా పనిచేస్తుంది . ఎక్కువగా మొబైల్ ఫోన్లు వాడేవారిలో జ్ఞాపకశక్తి తగ్గిపోతుంది . అంతేకాదు -రియక్షన్‌ సమయమూ నెమ్మదించి తప్పుల్ని ఎక్కువగా చేస్తుంటారు . 12 , 14 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల మద్య గల విద్యార్ధులపై " మొనష్ యూనివర్సిటీ " పరిశోధనలు నిర్వహించగా ... ఎన్నో విషయాలు వెళ్ళడైనాయి. ఎక్కువగా మొబైల్ ఫోన్లు వాడేవారిలో శీఘ్రగతి తగ్గిపోయినట్లు , జ్ఞాపకశక్తి తగ్గిపోతున్నట్లు , శీఘ్రగతి తగ్గిపోతున్నట్లు , తప్పులు ఎక్కువగా చేస్తున్నట్లు గుర్తించారు .

సెల్ ఫోన్‌ తో తంటా ? :

సెల్ పోన్‌ అవసరమే కాని అతిగా ఉప్యోగించడము అనర్ధము అంటున్నది ప్రపంచ ఆరోగ్యసంస్థ . భారతదేశము లోని కొన్ని పరిశోధన సంస్థలు సెల్ పోన్‌ తో వచ్చే అనారోగ్యము మీద అధ్యయనము చేసాయి. 20 నిముషాలు పాటు విడవకుండా సెల్ ఫ్ఫ్న్‌ మాట్లాడితే చెవి లోపలి ఉష్ణోగ్రత ఒక డిగ్రీ మేరకు పెరుగుతుంది . సె ఫ్ఫ్న్‌ వాడకం పెరిగిన కొద్దీ మెదడు మీద దాని ప్రభావము పడుతుంది . మెదడులో కణితలు (Tumours) ఏర్పడడానికి కారణము సల్ ఫోన్‌ వాడకము అని నిర్ధారించారు . 9 నిముషాలు సెల్ ఫోన్‌ లో మాట్లాడడము అంటే మక్రోవేవ్ ఒవెన్‌ లో ఒక సెకను పాటు తలపెట్టినటే అని నిర్ధారించారు మన శాస్త్రజ్ఞులు . మానసిక సమస్యలు పెరుగుదలకు, పురుషులలో పెరుగుతున్న వంధ్యత్వానికి కూడా సెల్ ఫోన్‌ కారణము అంటున్నారు .

సిగ్నల్స్ సరిగా లేనిచోట సెల్ ఫోన్‌ వాడవద్దు . సెల్ ఫోన్‌ జేబులో పెట్టకంది ... జేబులో పోన్‌ పెట్టుకునే పురుషులు దానిని స్విచ్ ఆఫ్ చేయండి . గర్భిణీ స్త్రీలు సెల్ ఫోన్‌ వాడకాన్ని ఎంత తగ్గిస్తే అంతమంచిది. సెల్ కాల్స్ 6 నిముషాలకు మించి వాడడము ఆరోగ్యానికి హానికరము .

సెల్ ఫోన్‌ తో చెవులకు చిక్కు : 

ఎక్కువసేపు సెల్ ఫోన్‌ లో మాట్లాడే వారికి మిగిలిన శబ్దాలు వినబడడము మానేస్తాయి. సెల్ ఫోన్‌ లో మాట్లాడుతూ డ్రైవ్ చేస్తే రోడ్డు ప్రమాదాలు జరగడం అందరికీ తెలినదే ... దీనికి కారణము మెదడు రెండుపనులు మీద ఒకేసారి దృష్టి పెట్టలేక పోవడమే . రెండవ కారణము సెల్ ఫోన్‌ లో వచ్చే ధ్వనుల స్థాయి..ధ్వని తప్పించి మిగిలిన స్థాయి ధ్వనులను వినడం , విన్నా గ్రహించడం చెవులు చెయ్యలేకపోవడం . ఎక్కువగా చెవిలో గుసగుసలు చెప్పుకునే అలవాటు ఉన్నవారికి ఇటువంటి వినికిడి సమస్యే వస్తుంది్స్

సెల్‌ఫోన్లతో మరో ప్రమాదం జన్యుమార్పులు కలిగే ప్రమాదము

సెల్‌ఫోన్లు వచ్చినప్పటి నుండీ వాటిని వాడటం వల్ల వచ్చే అనేక ప్రమాదాల గురించి తెగవార్తలు వస్తూనే ఉన్నాయి. వాటిలో కొన్ని ఊహాత్మకమైనవి. కొన్ని నిజమైనవే. ఆ క్రమంలో ఇప్పుడు పరిశోధకులు సెల్‌ఫోన్ల వల్ల వచ్చే మరో ప్రమాదాన్ని కనుగొన్నారు. అధికంగా సెల్‌ఫోన్లు వాడటం వల్ల శరీర కణాలలో ఆక్సిడేషన్‌ ఒత్తిడి పెరిగి, జన్యుమార్పులు కలిగే ప్రమాదముందని తేలింది. ఆక్సిడేషన్‌ ఒత్తిడివల్ల విషపూరిత పైరోక్సైడ్‌లు, ఫ్రీరాడికల్స్‌ కలిసి కణాల కేంద్రకంలో ఉండే డి.ఎన్‌.ఎ.తో సహా ఉన్న అన్ని భాగాలనూ తీవ్రంగా ప్రభావితం చేస్తారు. ఈ కారణంగా క్యాన్సర్‌ కణితి వంటివి ఏర్పడే అవకాశం ఉందని పరిశోధకులు అంటున్నారు.  

గర్భిణులూ సెల్‌ మాట్టాడవద్దు 

                              -గర్భంతో భర్తకు దూరంగా ...పుట్టింట ఉండటం కాస్త కష్టమే. కానీ అంతా అయినవారు ఉన్నా మనసెరిగిన మారాజు చెంతనలేడన్న లోటు తీర్చుకునేందుకు పూర్వకాలంలో ఉత్తరాలు రాసుకుంటే ...ఇప్పుడు ఆ జంటల మధ్య దూరాన్ని తగ్గించే బాధ్యత సెల్‌ఫోన్లే తీసుకున్నాయని చెప్పాలి. దీంతో అదే పనిగా అవసరం ఉన్నా లేకున్నా సెల్‌ఫోన్లతో గర్భంతో ఉన్నవారు ఎక్కువగా తన భర్తతో మాట్లాడేస్తున్నారు.గర్భంతో ఉండే మహిళలు సెల్‌ ఫోన్‌తో ఎక్కువగా మాట్లాడితేj పుట్టబోయే బిడ్డకు ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు పరిశో ధకులు. ఈ విషయమై కాలిఫోర్నియా, దక్షిణ కాలిఫోర్నియా లకు చెందిన శాస్త్రజ్ఞుల బృందం జరిపిన తాజా అధ్యయనంలో ఈ నిజం వెలుగు చూసినట్లు వెల్లడించారు. కాలిఫోర్నియాలో దాదాపు 30 వేల మంది చిన్నారులపెై వివిధ రకాల పరీక్షలు జరిపి, శోధించగా వారిలో 50శాతం మందికి పెైగా రేడియేషన్‌ ప్రభావానికి గురెైనట్లు తేలిందని తేల్చి చెప్పారు.అందుకు కారణం ఆ బిడ్డల తల్లులు గర్భంతో ఉన్నప్పుడు ఎక్కువగా సెల్‌ఫోన్‌ వాడటమే ప్రధానంశంగా తేల్చి చెప్పారు. పుట్టగానే ఆ రేడియేషన్‌ ప్రభావం పెైకి కనిపించదని, బిడ్డ ఆరోగ్యంగా ఉన్నట్లు కనిపించినా వయసు పెరుగుతున్న కొలది అవలక్షణాలు బెైటకు వస్తున్నట్లు తాము గుర్తించినట్లు శాస్త్రవేత్తల బృందం స్పష్టం చేసింది. తల్లి గర్భంతో ఉన్నప్పుడు రేడియేషన్‌ ప్రభావానికి గురయ్యే చిన్నారులు 30 శాతంగా నమోదు కాగా... చిన్నారుల ముద్దు మాటలకు ముచ్చటపడి సెల్‌ ఫోన్లలో మాట్లాడించడం వల్ల 20 శాతం మంది రేడియేషన్‌ ప్రభావానికి 

గురవుతున్నారని, దీని వల్ల ఈ చిన్నారు లు ఏడేళ్ల వయసుకు వచ్చేసరికి వారి ప్రవర్తనలో అసాధారణ మార్పులు కల్గడమే కాకుండా ఆరోగ్యపరమైన సమస్యలు కూడా ఎదుర్కొంటున్నట్లు గమనించామని పరిశోధకులు చెబుతున్నారు.

గర్భిణులు నిరిష్టకాల పరిమితిలో అవసరానికి అనుగుణంగా మొబెైల్‌ వినియోగిస్తే తప్పుకాదని, రోజులో కావా ల్సిన వారితో మూడు, నాలుగుసార్లు సంభాషించుకో వచ్చని... అయితే అది కూడా నాలుగు నిమిషాలకు మించకుండా ఉండాలని, అంతకన్నా ఎక్కువ సేపు మాట్లాడితే పుట్టే బిడ్డపెై రేడియేషన్‌ ప్రభావం అధికంగా ఉండటం తధ్యమని హెచ్చరిస్తున్నారు. మరి పుట్టే పిల్లల భవిష్యత్‌ని తామే అంధ కారంగా మార్చకుండా...కొన్నాళెైనా సెల్‌ ఫోన్లకి దూరంగా ఉంటే మంచిదేమో? మీ సమాచారం కన్నా మీ బిడ్డ క్షేమం కూడా ముఖ్యమే కదా.✍️

.                      🌷🙏🌷

   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

స్నేహితుడంటే…?

 0910.  1-5.     190223-5.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀


             *స్నేహితుడంటే…?*
                 ➖➖➖✍️

*అమ్మ అనే పదం తర్వాత ఆత్మీయతను ధ్వనింపజేసే ఏకైక పదం స్నేహం.* 

*స్నేహం అనేది  ఆ దేవుడిచ్చిన గొప్ప వరం. అమ్మా, నాన్న, అక్క, తమ్ముడు, చెల్లెలు, అన్న మొదలైన బంధాలను ఆ దేవుడే సృష్టించి ఇచ్చినా స్నేహితులను మాత్రం మనల్నే ఎంచుకోమన్నాడు.* 

*అందుకే మంచి స్నేహాన్ని సంపాదించుకుని భద్రంగా కాపాడుకుంటే అది మన జీవితాన్ని సంతోషంగా ఉంచుతుంది.* 

*తెలుగు కవి ఇంద్రగంటి హనుమచ్చాస్త్రి "సృష్టిలో తీయనిది స్నేహమేనోయీ" అన్నారు.* 

*మంచి స్నేహాన్ని సంపాదించుకోవడం అంత సులభం కాదు.*
 
*స్నేహం అనేది ఇలా ఉండాలి, అలా ఉండాలి అంటూ దానికి ఒక నిర్ధిష్టమైన లెక్కలు, అంచనాలు ఉండవు.* 

*మనలా ఆలోచించే, మనకు గురువులా బోధించి, దారి చూపి, తప్పు చేసినప్పుడు మందలించే వ్యక్తి నిజమైన స్నేహితుడు.* 

*మంచి స్నేహితుల మధ్య ఎటువంటి మొహమాటాలు, రహస్యాలు ఉండవు. అవసరమైనప్పుడు నిస్సంకోచంగా తమ కష్టసుఖాలు ఒకరికొకరు పంచుకుంటారు.* 

*కష్ట సమయంలో కలత చెందిన మనసుకి వెన్నలా చల్లదనాన్ని, ప్రశాంతతను కలిగించే దివ్య ఔషధం స్నేహం.*
 
*స్నేహం ఓ మధురమైన అనుభూతి. దీనికి వయస్సుతో నిమిత్తం లేదు. ఆటపాటలాడే బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు అందరిలోను స్నేహ భావం ఉంటుంది. స్నేహానుభూతిని అనుభవిస్తేనే తెలుస్తుంది. ఒక్కోసారి కుటుంబసభ్యులతో కూడా చెప్పుకోలేని సమస్యలను ఈ ఆత్మీయ స్నేహితులతో నిర్మొహమాటంగా చర్చించవచ్చు.* 

*స్నేహంగా ఉన్నప్పుడు అనుమానం, కోపం, ద్వేషం కూడా దరిదాపులకు రావడానికి జంకుతాయి. స్నేహం అద్భుతమైంది. స్నేహానికి ఎల్లలు లేవు. నిజమైన మిత్రులకు మించిన ఆస్తి లేదు.*
 
*మంచి స్నేహం… వ్యక్తి వికాసానికి బాటలు వేస్తుంది. మిత్రుడు తోడుంటే ఆయుధం ధరించినంత ధైర్యంగా ఉంటుంది. ప్రతి వ్యక్తి జీవితంలోను విలువైన స్నేహాన్ని జీవితాంతం నిలుపుకునే ప్రయత్నం చేయాలి.* 

*’స్నేహానికన్న మిన్నా లోకాన లేదురా...’ అన్నట్లు ఆ విలువైన బంధాన్ని అపురూపంగా కాపాడుకోవాలి.*✍️

.                      🌷🙏🌷

   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

పర్వతాలలో పోస్ట్ మాన్..!* ➖➖➖✍️ (చైనీస్ సినిమా.)

 0101.  2-7.   190223-6.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*PostMen In The Mountains*       

         *పర్వతాలలో పోస్ట్ మాన్..!*
                  ➖➖➖✍️
                  (చైనీస్ సినిమా.)
            
          
హూ వో జియాంకి దర్శకత్వం వహించిన ఈ సినిమా 1999 లో నిర్మింపబడి,గోల్డెన్ రూస్టర్ అవార్డ్ పొందింది.

పర్వత ప్రాంతాలలో తపాలా అందించే పోస్ట్ మన్ (టెంగ్ రుజుస్) వృద్దుడై పోయి నందున, ఆ పర్వత ప్రాంతాలలో మోకాళ్ళ నొప్పులతో నడవలేక పోతాడు. అతడు ఉద్యోగ విరమణ చేస్తాడు. ప్రభుత్వం అతని ఉద్యోగాన్ని అతని కొడుకు(లియు యే)కి ఇస్తుంది.

 వాళ్ళు ఎంతో ప్రేమగా పెంచుకునే బడ్డీ అనే జర్మన్ షెపర్డ్ కుక్క ప్రయాణ మార్గంలో, తండ్రికి తోడుగా వుంటుంది. 

ఈ సినిమా చైనా లోని దక్షిణ హునాన్ ప్రాంతంలోని దట్టమైన అడవులు, కొండలలో, ఆ కొండల్లో వుండే పల్లెల్లో చిత్రీకరించారు.

తండ్రి పోస్ట్ లో వచ్చిన ఉత్తరాలు, పార్శిల్స్, పత్రికలు అన్నీ వీపున మోసే ఒక పెద్ద బాగ్ లో సర్డుతాడు. ఆ పర్వతాలలో వెళ్లాల్సిన 112 కి. మీ. దారిని మాప్ లో కొడుకుకు చూపిస్తూ వివరిస్తాడు.

ఇన్నేళ్ల తన ప్రయాణంలో కుక్క తోడుగా వుందని, దానికి అన్ని మార్గాలు తెలుసునని దాన్ని తోడుగా తీసుకుని ఇక బయలు దేరమని చెప్తాడు.

తండ్రితో వెళ్ళటం అలవాటైన కుక్క, కొడుకుతో వెళ్ళటానికి మొరాయిస్తుంది. తండ్రి ఎంత బుజ్జగించే ప్రయత్నం చేసినా వినదు. ఇక తండ్రి తనే చివరి సారిగా కొడుకు వెంట వెళ్ళి, ఆ మార్గం, ఆ పల్లెలు, అక్కడి ప్రజల్ని పరిచయం చేయాలని బయలు దేరుతాడు.
       
దట్టమైన అడవిలో తండ్రి,  వీపున బరువైన బాగ్ తో కొడుకు, కుక్క బడ్డీ బయలుదేరుతారు.

ఈ ప్రయాణానికి మూడు రోజులు పడుతుంది. పోస్ట్ మాన్ ఉద్యోగం చేస్తూ, ఎప్పుడూ కుటుంబానికి దూరంగా ఈ పర్వత ప్రాంతాలలోనే గడిపిన తండ్రి, బాల్యంలో తన కొడుకు ముద్దు ముచ్చట్లను, అతని పెరుగుదలను చూసే అవకాశం కోల్పోతాడు.

కొడుకు ఇప్పటి వరకూ తండ్రి పట్ల కొంత ఉదాసీనంగానే వుంటాడు. ఈ ప్రయాణంలో తండ్రి, తన కొడుక్కి తన గురించి, కుటుంబం గురించి, తన మనో భావాల గురించి చెప్పే వీలు దొరుకుతుంది. 
కొడుక్కి కూడా తండ్రిని గురించి తెలుసుకునే అవకాశం దొరుకుతుంది.

ఎంతో కష్టపడి, అడవుల్లో ప్రయాణిస్తూ, కొండలెక్కి దిగితూ, తమ కోసం పోస్ట్ మోసుకుని వచ్చే ‘టేంగ్ రుజుస్’ పట్ల ఆ కొండ ప్రజలు ఎంతో ప్రేమను కనబరుస్తారు. తమ కష్టసుఖాలను అతనితో ముచ్చటిస్తూ వుంటారు. తమ ఇంట్లో మనిషి లాగా, ఒక స్నేహితుడు లాగా అతన్ని ఆదరిస్తారు. అక్కడి ప్రజలు పోస్ట్ మాన్ కోసం ఆహారం, ఆశ్రయం కల్పిస్తారు.

ఒక పల్లెలో గుడ్డిదైన ఒక ముసలమ్మ వీళ్ళ రాక కోసం ఎదురు చూస్తూ వుంటుంది. కొడుకు,కోడలు చనిపోతే ఆ అవ్వ మనవడిని ఎంతో కష్ట పడి పెంచి వున్నతోద్యోగిని చేస్తుంది. 

ఆ మనవడు ప్రతినెలా 20డాలర్స్ మనియార్దర్ పంపు తాడే గానీ, అవ్వ యోగ క్షేమాలు ఏమీ కనుక్కో డు. అవ్వ డబ్బు కన్నా, మనవడి వుత్తరం కోసం ఎక్కువ ఎదురు చూస్తుంది. 

పోస్ట్ మాన్ తెంగ్   ఆమె మనవడు రాసినట్లుగా చెబుతూ, తానే  రాసిన 
ఉత్తరం  చదువుతాడు. మనవడే స్వయంగా తనతో మాట్లాడినంత సంతోష పడుతుంది అవ్వ.

కొడుక్కి  ‘నువ్వు  గూడా ఇలానే చదివి ఆమెను సంతోషపెట్టు!’ అని చెప్తాడు.
         
మార్గ మధ్యంలో సేద తీరుతున్నపుడు వచ్చిన పెద్ద గాలికి, అప్పుడే విప్పిన సంచిలోని ఉ త్తరాలు ఎగిరి పోతుంటాయి. వాళ్ళు ఎంతో కష్టం మీద వాటిని ఎగిరి పోకుండా కాపాడుతారు. ఒకటి రెండు ఉ త్తరాలను కుక్క గాల్లోకి ఎగిరి పట్టుకుంటుంది.

ఇంకోసారి దారిలో వున్న పెద్ద ఏరును దాటుతున్నపుడు గూడ తపాలా సంచిని నెత్తి మీద పెట్టుకుని, భుజాల లోతు వున్న నీటిని జాగ్రత్తగా దాటుతారు. అప్పుడు తండ్రి, కొడుకుతో “మన ప్రాణాలు పోయినా సరే, తపాలా ను చాలా జాగ్రత్తగా కాపాడాలి. ఇది ఉద్యోగ ధర్మం!” అని చెబుతాడు.

నడక శ్రమ తెలియకుండా తండ్రి, కొడుకులు పాటలు పాడుకుంటూ, వెళ్తారు. తండ్రి ఆ పల్లెల ఆచారాలు, పండుగలు, సంప్రదాయాల గురించి వివరిస్తాడు.

ఈ పల్లెల్లో తనకు తారసపడిన ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్ళి చేసుకున్నానని, ఆమె తన నమ్మకాన్ని వమ్ము చేయలేదని, తనని ఎంతగానో ప్రేమించినదని, కుటుంబాన్ని చక్కగా నిర్వహించినదని, ఉద్యోగ రీత్యా తాను దూరంగా వున్నా, కొడుకైన నిన్ను చక్కని పౌరునిగా తీర్చి దిద్దిందని చెబుతాడు.

కొడుకుతో నువ్వు గూడ   ఈ కొండ ప్రాంతం అమ్మాయినే పెళ్లి చేసుకోవాలని తన కోరిక అని చెప్తాడు. 

ఇక్కడి అమ్మాయిలు అందగత్తెలు, నిజాయితీ పరులు, కష్టించి పని చేస్తారు అని వివరిస్తాడు..

దారిలోని   ఒక పల్లెలో   జరుగుతున్న జాతరలో పాల్గొంటారు. చైనీయుల లుషెంగ్ డాన్స్ ఇక్కడ మనం చూడొచ్చు.

మార్గమధ్యంలో అనేక విషయాలతో పాటు, చైనా తపాలా వ్యవస్థ తీరు, అధికారుల వైనం విడమరుస్తాడు. చేసే ఉద్యోగాన్ని ఇష్టంగా చేయాలని, ఉద్యోగాన్ని ప్రేమిస్తే   ఏదీ కష్టం అనిపించదు’ అని చెప్తాడు. దానికి నేనే ఉదాహరణ, ఈ ప్రజల ప్రేమే ఉదాహరణ అనిచెబుతాడు.

ఈ మూడు రోజుల ప్రయాణం ముగిసే లోపు కొడుకు, తండ్రిని గురించి అర్ధం చేసుకుంటాడు. పల్లె ప్రజలు తన తండ్రి పట్ల చూపించిన ప్రేమ, ఆదరణకు పొంగి పోతాడు.

మోకాళ్ళ నొప్పులతో బాధ పడుతూ, కూర్చున్న ప్రతి సారి కుక్క బడ్డీ వచ్చి, తేంగ్   మోకాళ్ళ కింద  దూరి నిలబడుతుంది. తేంగ్ దాన్ని నిమురుతూ, తన మోకాళ్ళను కాస్త రుద్దుకుంటూ  ఉపశమనం పొందుతాడు.

 మూడు రోజుల తర్వాత ముగ్గురూ ఇంటికి తిరిగి వస్తారు. ఆ పల్లెల్లో పోస్ట్ బాక్స్ లలో వేసిన వుత్త రాలతో సహా! 

ఉద్యోగ నిర్వహణలో భాగంగా తిరిగి పోస్ట్ తో బయలు దేరుతున్న కొడుకు వెంట, ఒకసారి చెప్పగానే సంతోషంగా కుక్క బడ్డీ అనుసరిస్తుంది.

ఈ సినిమాలో మూడు ప్రధాన పాత్ర లైన తండ్రి, కొడుకు, కుక్క అద్భుతంగా నటించారు.

ఒక్క ముక్కలో చెప్పాలంటే అందమైన హునాన్ అటవీ ప్రాంతంలో   తండ్రి, కొడుకు, కుక్క ఎలా ప్రయాణించారన్నదే ఈ సినిమా.

అద్భుతమైన ప్రకృతిని చూడాలనుకునే వారికి ఈ సినిమా ఒక వరం అని చెప్పొచ్చు.

యూ ట్యూబ్ లో ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో వుంది..సినిమా. 

చైనా దేశపు మాండరిన్ భాషలో నడుస్తుంది. సినిమా వ్యవధి  గంటన్నర!✍️
                …సేక :వల్లూరి సూర్యప్రకాష్.
.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
                       🌷🙏🌷

   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
                     ➖▪️➖

ఆదర్శ జీవనం

 2501.    2-6.   140223-7.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀


                *ఆదర్శ జీవనం*
                  ➖➖➖✍️

*ఆదర్శం అంటే, అద్దం అనే అర్థంతో పాటు మేలుబంతి, దృష్టాంతము, అనుకరింపదగినది, ప్రామాణ్యము అనే అర్థాలుకూడా ఉన్నాయి.*

 *అలంకరించుకొన్న  ముఖం  ఎలా ఉందో చూసుకోవాలంటే, అద్దాన్ని ఆశ్రయించక తప్పదు.*

*అలంకరణలో లోటుపాట్లను చూపించి, వాటిని సరి చేసు కోవటానికి అద్దం ఒక అవకాశం ఇస్తుంది. ఇది బాహ్య సౌందర్య  ప్రసాధన విషయం.* 

*దీనికి అతీతమైనది , అత్యవసరమైనది శీల సౌందర్యం. ఇది మానవులను ఉన్నతులను చేస్తుంది. అజరామరమైన కీర్తి ప్రతిష్ఠలను సమకూర్చుతుంది.*

*దీనికి మరింత శోభ కలగాలంటే,  మహర్షుల ప్రవచనాలు, గాథలు, వారి ప్రవర్తనలు మార్గదర్శకాలుగా నిలుస్తాయి.*

*ఒక తరం మరొక తరానికి అందించిన ఆదర్శాలు - దీపం నుంచి మరో దీపం వెలిగినట్లుగా (“దీప ప్రదీపాదివ”) క్రమంగా ఒక సంస్కృతిగా రూపుదిద్దుకుంటాయి.*

*“యద్యదాచరతి శ్రేష్ఠః తత్తదేవేతరో జనః*
*స యత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే ” * 
– అటుంది భగవద్గీత. 

*శ్రేష్ఠుడు దేనిని ఆచరిస్తాడో దానినే ఇతరులు ఆచరిస్తారు. అతడు ఒక ప్రమాణాన్ని ప్రతిష్ఠిస్తే  లోకం దానిని అనుసరిస్తుంది. ఈ కారణంవల్ల ప్రతి వ్యక్తీ   శ్రేష్ఠత్వాన్ని నిలుపుకోవటానికి,  తన జీవితాన్ని ఆదర్శవంతంగా మలచుకోవటానికి కృషిచేయటంలో జీవనసార్థక్యం ఉంది.*

*ఉపాధ్యాయుడు తన శిష్యులకు, తల్లిదండ్రులు తమ సంతానానికి,                 ఒక అధికారి తన తోటి ఉద్యోగులకు,               ఒక పీఠాధిపతి తన అనుయాయులకు, ఒక రాజకీయ నాయకుడు తన సిద్ధాంత ప్రచారకులకు లోకం మెచ్చే వ్యక్తిత్వాన్ని అలవడజేయాలంటే ముందుగా వారు ఆదర్శ జీవనులై ఉండాలి. ఆ జీవనం సమాజానికి ప్రయోజనకరంగా ఉంటుంది.*

*తైత్తిరీయోపనిషత్తులో ఆచార్యుడు, విద్యాభ్యాసం ముగించుకొన్న తన శిష్యులకు….*

*“యాన్యనవద్యాని కర్మాణి తాని సేవితవ్యాని. నో ఇతరాణి.యాన్యస్మాకగ్ం సుచరితాని తాని త్వయోపాస్యాని . నో ఇతరాణి*

*”(నాయనా ! ఏవి దోషరహితాలైన కార్యాలో వాటినే నువ్వు ఉపాసించాలి. ఇతర కార్యాలు చేయవద్దు. మాలో ఏ సత్ప్రవర్తనాంశాలు ఉన్నాయో వాటినే నువ్వు స్వీకరించాలి. ఇతరములను కాదు)  అని మహోన్నతమైన సందేశం ఇస్తాడు.*

*రామాయణ సందేశం - *
*"రామాదివ వర్తితవ్యం. న తు రావణాదివత్"*

*(రాముని వలె ప్రవర్తించాలి. రావణాదులవలె కాదు) అని.*

*రాముని సద్గుణాలు సర్వశ్రేష్ఠాలు కనుకనే ఆయన లోకంలో ఆదర్శ మానవునిగా ఆరాధింప బడుతున్నాడు.*

*“తీర్థానికితీర్థం, ప్రసాదానికి ప్రసాదం” అన్నట్టు చదివిన ఉత్తమగ్రంథాలలోని విషయాలను అధ్యయనానికే పరిమితం చేయకుండా, ఆచరించినప్పుడే ఆదర్శం సుప్రతిష్ఠితమౌతుంది. అలాగే, ఆదర్శ ప్రబోధకులు కూడా  ఆచరణ శీలురు కావాలి. లేకపోతే వారికి విలువ ఉండదు. ప్రబోధించే అధికారమూ ఉండదు.*

*మానవత్వపు విలువలు, నైతికత, ఆధ్యాత్మిక చింతన, సమాజం పట్ల బాధ్యత ఉన్న వ్యక్తి ఆదర్శజీవనుడు అనిపించుకుంటాడు.*

*తన తరువాత తరాలకు సమాదరణీయమైన ఒరవడిని చూపిన ఆ వ్యక్తికి మరణమే ఉండదు. అతడే దైవం అవుతాడు.*✍️
.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
                       🌷🙏🌷

   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
                     ➖▪️➖

కోరికల చిట్టా

 3101.    2-6.    140223-6.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*నేటి జీవిత సత్యం…*
                 *కోరికల చిట్టా* 
                 ➖➖➖✍️ 
 *ఈ పుడమిపై పుట్టిన ప్రతి మనిషికీ అనుక్షణం అవసరాలెన్నో ఉంటాయి. బతుకు గడవాలంటే తిండి కావాలి. కట్టుకునేందుకు బట్టలు కావాలి. నివసించడానికి ఇల్లు కావాలి. ధన సంపాదనకు వృత్తులు, ఉద్యోగాలు కావాలి. ఆనందంగా ఉండటానికి ఇంకెన్నో కావాలి.* 

 *మనిషికి కోరికలు బలాలే కాదు, బలహీనతలు కూడా. మనిషి అవసరాలు ప్రాధాన్యాన్నిబట్టి మారుతుంటాయి. ఏది అత్యవసరమో దానికోసం మనిషి తహతహలాడు తుంటాడు. పరితపిస్తుంటాడు.* 

*మానవ ప్రయత్నంతో సాధ్యం కానప్పుడు దైవాన్ని ఆశ్రయించడం మానవ స్వభావం. ఇంటిలో ఉన్న దేవతలను ఆరాధించడమే కాకుండా పుణ్యక్షేత్రాలకు వెళ్ళి దర్శించుకోవడం, పుణ్యతీర్థాల్లో స్నానాలు చేయడం, దానాలు చేయడం పరిపాటి. మనిషి దైవదర్శనం చేసుకొనే సమయంలో తన కోరికల చిట్టాను భగవంతుడికి నివేదించుకుంటాడు. అవన్నీ సమకూరిస్తే మళ్ళీ వచ్చి మొక్కులు తీర్చుకుంటానని, కానుకలు సమర్పించుకుంటానని మొక్కుకుంటాడు.* 

*కోరికలు న్యాయమైనవే కావాలన్న నిబంధన ఏమీ లేదు కనుక అన్యాయార్జితాలకోసం మొక్కుకునేవారూ కనిపిస్తారు. ఉదాహరణకు ఒక దొంగ తనకు దొంగతనంలో అపారంగా ధనం లభిస్తే, అందులో కొంత హుండీలో వేస్తానని వాగ్దానం చేస్తాడు. అక్రమార్జనలో పుష్కలంగా ధనం లభిస్తే భూరి విరాళం ఇస్తానని మరొక వ్యక్తి కోరుకుంటాడు. ఎవరి బాధలు వారివి. ఎవరి కోరికలు వారివి. ఏ కోరికనూ కోరని భక్తులూ ఉండవచ్చు. అలాంటి వారిది నిష్కామ భక్తి.*  

 *కోరికలు ఉండటం, లేకపోవడం వ్యక్తిగతాంశం. కోట్లకు పడగలెత్తిన కుబేరులకూ అపారంగా కోరికలు పుడుతూనే ఉండవచ్చు. పూటకు గతిలేని నిరుపేదకు ఏ కోరికలూ లేకపోవచ్చు. కోరికలు మనిషిని బంధిస్తాయని మహర్షుల వాక్కు. ఒక కోరిక మరో కోరికను పుట్టిస్తుంది. కోరికలు కడలి కెరటాల్లాంటివి. ఒక కెరటం తీరాన్ని తాకి నశించగానే, మరో కెరటం వస్తూనే ఉంటుంది. కెరటాలకు అంతం లేనట్లే కోరికలకూ అంతం లేదు.* 

 *మనిషిని సృష్టించిన భగవంతుడికి మనిషి మనసులో ఏముందో తెలియదా అని ప్రశ్నించేవాళ్లూ ఉంటారు. మనిషి స్వభావం దేవుణ్ని అడిగేట్టుగా చేస్తుంది. ప్రాథమికావసరాల కోసం కొందరు దేవుణ్ని ప్రార్థిస్తారు. అవి తీరగానే విలాసాలు కోరుకుంటారు. వాటికి అంతులేదు. ఎన్ని ఉన్నా, ఇంకా ఏవో కావాలనిపిస్తుంది. కోరికలను ఏదో ఒక దశలో నియంత్రించకపోతే అశాంతి మిగులుతుందనడంలో సందేహం లేదు.*

*పూర్వం యయాతి వంటి చక్రవర్తులు సైతం కోరికల అగ్నిజ్వాలలకు ప్రభావితులై, చివరిదశలో వాటిని వదిలేసిన కథలు పురాణేతిహాసాల్లో కనిపిస్తాయి.* 

*ఎడతెగని కోరికలు జీవితాన్ని దుర్భరంగా మారుస్తాయి. సుఖంగా బతుకు గడవడానికి సరిపోయేంతటి కోరికలు అభిలషణీయాలేకానీ, గగనకుసుమాల వంటి అసాధ్యమైన కోరికలు వాంఛనీయాలు కావు.* 

 *కోరికల చిట్టాను దేవుడికి సమర్పించే ముందు వాటిని తీర్చుకోవడానికి మనిషి తన ప్రయత్నాన్ని ఎంత చిత్తశుద్ధితో ఆచరించాడో తెలుసుకోవాలి. ప్రయత్నించే మనిషికే దేవుడి సహాయం లభిస్తుందని నీతికారులంటారు. కనుక మనిషి భగవంతుడి ముందు కోరికల జాబితాను సమర్పించిన తరవాత, తాను ఆ కోరికల సాధనకు తగిన కృషి చేయాలనే విషయాన్ని మరువరాదు.*
✍️
.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
                       🌷🙏🌷

   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
                     ➖▪️➖

క్షమ - పగ

 0402.  2-9.      050223-6.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

                  *క్షమ - పగ*
                ➖➖➖✍️

*మన మనసులో రెండు వైరుధ్య భావా లుంటాయి. ఒకటి క్షమించడం, రెండోది పగ తీర్చు కోవడం. ఈ రెంటికీ సదా సమరం జరుగుతూ ఉంటుంది. క్షమ గెలిస్తే హృదయం ఆనంద మయం అవుతుంది. మనసులో అంతు లేని సంతోషం కలుగుతుంది. మనలో ఉండే ప్రేమ ఎప్పుడూ 'క్షమించు క్షమించు' అని చెబుతూనే ఉంటుంది.  ప్రేమిస్తే ప్రేమను పొందుతాం. ద్వేషిస్తే ద్వేషాన్నే తిరిగి పొందుతాం.*

*”గుండె లో పగ దాచుకోవడం అంటే 'పామున్న ఇంటి లో ఉండటమే!' అంటుంది భారతం. పగ వల్ల పగ పోదనీ.. ఏ విధంగా చూసినా పగని అణచడం లెస్స అనీ..భారత మహేతి హాస ఉద్బోధ...!!!*

*'నా కన్ను నువ్వు పొడిస్తే..నీ కన్ను నేను పొడుస్తా' అని 'కన్ను'కు కన్ను... పన్నుకు పన్ను' సిద్ధాంతం తో అందరూ ముందుకు దూకితే- లోకం అంతా..గుడ్డి వాళ్ల తో..బోసి నోటి వాళ్ల తో నిండి పోతుంది.*

*ప్రతీకారం అనే  విష చక్రం  నుంచి బయట పడాలంటే "క్షమించడం" ఒక్కటే ఉపాయం. ఇందు వల్ల రెండు లాభాలున్నాయి.*
*ఒకటి- క్షమించే వారు, ఆదర్శ వ్యక్తులుగా గౌరవం పొందుతారు. రెండోది- క్షమ పొందేవారు, తమ జీవితాలను సరిదిద్దు కుంటారు.*

*క్షమాగుణం శత్రువును సైతం మిత్రుడి గా... మార్చేస్తుంది.*

*'పొరపాటు' అనేది మానవ సహజ గుణం. క్షమ దైవ విశిష్ట గుణం' అని ఆంగ్ల సామెత.*

*మహా భక్తుల జీవితాలన్నీ...ప్రేమ మయాలు.*

*’ఏక నాథుడు’ పాండు రంగడి భక్తుడు. ప్రశాంత చిత్తుడు. సదా స్వామి సేవలో, భజనలో    కాలం గడిపే వాడు. ప్రజలందరూ ఆయన్ని ప్రశంసించడం చూసి కొందరు ఈర్ష్య పడ్డారు. ఎలాగైనా ఏక నాథుడికి కోపం తెప్పించాలని ప్రయత్నించ సాగారు. ఒక దుష్టుడికి డబ్బు ఆశచూపి, ఆ పనికి నియోగించారు.*

*ఏక నాథుడు రోజూ తెల్లవారు జామునే నది లో స్నానం చేసి వచ్చేవాడు. ఆ సమయంలో ఆ దుష్టుడు ఏక నాథుడిపై ఉమ్మి వేశాడు. ఏక నాథుడు ప్రశాంత చిత్తంతో చిరునవ్వు చెరగనీయకుండా మళ్ళీ... వెనక్కి వెళ్లి నదీ స్నానం ఆచరించాడు..*

*ఇలా మొత్తం నూట ఏడు సార్లు జరిగింది.*

*ఏక నాథుడు ఏమాత్రం నిగ్రహం వీడకుండా మందస్మిత వదనంతో అన్ని సార్లూ మరల మరల స్నానం చేసి వస్తున్నాడు.*

*దీంతో ఆ కుటిలుడి హృదయం చలించి పోయింది!*

*ఆయన ఏక నాథుడి కాళ్లపై పడ్డాడు. 'స్వామీ, మీరు నిజంగా దైవస్వరూపులు. మీ నిగ్రహం చెడగొట్టి, ఎలా గైనా మీకు కోపం తెప్పించాలని కొందరు నన్ను పురమాయించారు.   మీకు ఆగ్రహం తెప్పించగలిగితే నాకు ధనం ఇస్తామని ఆశ చూపారు.   "మీ క్షమాగుణం" తెలియక నేను ఈ నీచ కృత్యానికి అంగీకరించాను!' అన్నాడు ఆ వ్యక్తి పశ్చాత్తాపంతో.*

*ఏక నాథుడు అతడికి నమస్కరిస్తూ ఇలా అన్నాడు. 'నాయనా, నీవు     నా కెంతో మేలు చేశావు. నా చేత నూట ఎనిమిది సార్లు పవిత్ర నదీ స్నానం చేయించిన మహానుభావుడివి నువ్వు! నేను నీ మేలు ఎన్నటికీ మరచి పోను!'*

*ఏక నాథుడి పలుకులు విని అవతలి వ్యక్తి నిర్విణ్ను డయ్యాడు.*

*ఆ భక్తా గ్రేసరుడి ‘క్షమాగుణం' ఆ ఉమ్మి వేసిన వ్యక్తి హృదయాన్ని ప్రక్షాళనం గావించింది. పశ్చాత్తాపంతో అతడు కన్నీరు కార్చాడు.*

*క్షమ అంటే భూమి. భూమి ఓర్పు గల తల్లి కనుకనే మనం ఎంత బాధ పెట్టినా భూ మాత మనపై పగ తీర్చు కోవాలనుకోదు. క్షమించే గుణం ఉన్నది కదా అని మనం భూమాతను అదే పనిగా హింసించ కూడదు.*

*క్షమా గుణానికీ హద్దులుంటాయని గుర్తుంచు కోవాలి!*

*క్షమాగుణం పురాణాలకు, ప్రాచీన ఇతి హాసాలకే పరిమితం కాదు.*

*ఇటీవలి చరిత్రలో క్షమాగుణంతో చరితార్థు లైన మహాపురుషు లెందరో ఉన్నారు.*

*ఆర్య సమాజ స్థాపకులైన మహర్షి దయానంద నిష్కాపట్యం, నిర్భయత్వం సమాజంలో అనేకులకు కంటగింపైంది.*

*ఆయన వద్ద వంట వాడికి లంచం ఇచ్చి, ఆహారంలో విషం పెట్టించారు.*

*దయానందులు మృత్యుశయ్యపై ఉన్నారు.*

*తన వంట వాడిని దగ్గరకు పిలిచారు. కొంత డబ్బు అతడి చేతిలో పెట్టి ఇలా అన్నారు. 'వెంటనే నువ్వు నేపాల్‌కి వెళ్లిపో! నా శిష్యులకు నువ్వు చేసిన పని తెలిస్తే నిన్ను బతక నీయరు!'*

*తనకు ప్రాణ హాని కలిగించిన వ్యక్తిని సైతం క్షమించి, అతడికి ప్రాణ దానం చేసిన మహర్షి దయానంద చరితార్థులయ్యారు.*

*క్షమాగుణం మానసిక రుగ్మతలకు మంచి మందు.*

*పగ తీర్చు కుంటే ప్రశాంతత చిక్కుతుందను కోవడం కేవలం భ్రాంతి మాత్రమే!*

*నిజానికి అభద్రత మిగులు తుంది. చిత్త వికారం ఏర్పడుతుంది. చివరకు జీవితం విషాదాంతం అవుతుంది.*

*ఒక అరబ్బీ సామెత ఇలా చెబుతుంది-*

*ఇతరులు మనకు చేసిన అప కారాలను ఇసుక పై రాయాలి. ఇతరులు మనకు చేసిన ఉప కారాలను చలువ రాయి పై చెక్కు కోవాలి!'*✍️
.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
                       🌷🙏🌷

   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
                     ➖▪️➖

మన ఆరోగ్యం కోసం కొన్ని సలహాలు.

 +++

*మన ఆరోగ్యం కోసం కొన్ని సలహాలు.*

*1. మీకు స్థానికంగా దొరికే పండ్లను తినండి:*
🍇🍌🍊🍉🍎🍐🍒🍑
అరటిపళ్ళు, ద్రాక్ష, సపోటా, మామిడి, ఏదైనా సరే! పళ్ళు అన్నిటిలోనూ ఫ్రక్టోజు ఉంటుంది. ఫ్రక్టోజు మీ గ్లూకోజును నియంత్రణలో ఉంచుతుంది. కనుక మీరు పళ్ళను నిరభ్యంతరంగా తినండి.

*2. మీరు గింజలనుండి వచ్చిన నూనెలను వాడండి:* 🥜🥥
ప్యాకెట్లలో వచ్చే Olive, Rice bran, Refined నూనెలకన్నా మీరు మిల్లువద్ద ఆడించుకున్న వేరుశెనగ, నువ్వుల, కొబ్బరి, ఆవనూనెలు మంచివి. 

*3. ప్రతిరోజూ నెయ్యి ఎక్కువగా తినండి:*
ఏ ఆహారపదార్ధంలో నెయ్యి ఎక్కువగా తినవచ్చో దానిలో ఎక్కువగానూ, దేనిలో తక్కువ తినాలో దానిలో తక్కువగానూ తినాలి. నెయ్యి వాడడం వలన కొలెస్టరాల్ తగ్గుతుంది. 

*4. మీ ఆహారంలో కొబ్బరి ఎక్కువగా వాడండి:*
🥥🥥🥥🥥🥥🥥🥥🥥
కొబ్బరిలో కొలెస్టరాల్ అస్సలు ఉండదు. మీ నడుము సన్నబడేలా చేస్తుంది.

*5. ఓట్స్ గానీ, ధాన్యాలుగానీ టిఫిన్ గా తినవద్దు:*
Breakfast గా పోహా (అటుకుల పులిహోర), ఉప్మా, ఇడ్లీ, దోసె తినండి. పీచుకోసం ఓట్స్ తినక్కరలేదు.

6. మీ నోట్లో పళ్ళు ఉన్నంత కాలం *జ్యూసులు త్రాగకండి.* మీకు పళ్ళు ఉన్నది కూరలు, పళ్లు తినడానికే.
🍑🍐🍉🍊🍎🍌🍇

*7. చెరుకు రసం మిమ్మల్ని డీటాక్సిఫై చేస్తుంది.* అది ఫ్రెష్ జ్యూస్ రూపంలో తాగినా చెరుకు ముక్కలు తిన్నా సరే.

8. PCOD, Thyroid problem ఉన్నవారు శక్తికారకాలూ, బరువు తగ్గేవీ అయిన వ్యాయామాలు చెయ్యాలి.
ప్యాకేజీ ఆహారం వదిలిపెట్టాలి
*9. మామూలు తెల్లని అన్నం తినండి:* బ్రౌన్ రైస్ తినవలసిన అవసరం లేదు. అది ఉడికేటపుడు మీ కుక్కర్ కీ, ఉడికాక మీ పొట్టకీ శ్రమను కలిగిస్తుంది. రైస్ యొక్క GI Index చాలా తక్కువ. అది పప్పు, పులుసు, పెరుగువంటి వాటితో కలిస్తే దాని GI Index మరింత తగ్గుతుంది. వీటికి తోడు నెయ్యిని కూడా చేరిస్తే అది మరింత తగ్గుతుంది. రైస్ లో మినరల్స్ ఉన్నాయి. కాబట్టి రోజుకు మూడుసార్లు కూడా తినచ్చు.

*10.ఎంత తినాలి? :*
ఆకలిగా ఉంటె ఎక్కువ తినండి. మీ పొట్ట ఏమి చెప్తుందో దాన్నిబట్టి తినండి.

11. మీరు రైస్, చపాతీ రెండూ తినచ్చు. లేదా రైస్ మాత్రమే తినచ్చు. మూడుపూటలా మీ ఇష్టం వచ్చినట్టు ఏమీ భయపడకుండా తినండి. మీ ఆకలినిబట్టి తినండి
*12. మీరు తినే ఆహారం మిమ్మల్ని భయపెట్టకూడదు:*
నెయ్యి, రైస్ తినకూడదు అంటూ భయం వద్దు. మీరు తినే ఆహారం మీరు మంచిగా ఫీల్ అయ్యేలా ఉండాలి.

13. అయ్యబాబోయ్! ఎన్ని కేలరీలు తిన్నానో అని భయపడకండి. ఎంత పోషకాహారం తీసుకున్నాను అనేది చూడండి.
*Never look at CALORIES. Look at NUTRIENTS.*

*14. పిజ్జా, బర్గర్, పాస్తా, బ్రెడ్, బిస్కట్, కేకులు, ఐస్ క్రీమ్స్, చాక్లెట్స్ అస్సలు తినద్దు:*
🥘🍔🍞🍪🍘🍰🍦🍫🍬

*15. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి:* 
ఈ Food మా అమ్మమ్మ తినేదా? మీ జవాబు ఎస్ అయితే భయం లేకుండా తినండి.

*16. రుతువునుబట్టి తినండి:*
వర్షాకాలంలో పకోడీలు, జిలేబీలులాంటివి తినండి. ఎందుకంటే ఆకలి రుతువునుబట్టి ఉంటుంది. ఒక్కొక్క సీజన్ లో వేపుళ్ళు తినాలి. తినండి.

*17. ఉదయాన్నే టీ మీ మొదటి ఆహారంగా తీసుకోకండి:* 
అలాగే బాగా ఆకలిగా ఉన్నప్పుడు కూడా టీ త్రాగకండి. రోజులో రెండు, మూడుసార్లు పంచదార వేసుకుని టీ త్రాగచ్చు.

*18. గ్రీన్ టీ త్రాగకండి.* ఎల్లో టీ, గులాబీ టీ, నీలం టీ ఏమీ వద్దు.

*19. నిలువచేసిన ప్యాకేజీ ఫుడ్ / కూల్ డ్రింక్స్ ఏమీ వద్దు.*

*20. అరగడానికీ, ఆరోగ్యంగా ఉండడానికి వ్యాయామం చెయ్యండి. వాకింగ్ చెయ్యండి.*

+++

**** ఆధ్యాత్మిక హృదయం

 1611.   1-7.    190223-4.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀


        *ఆధ్యాత్మిక హృదయం* 
                ➖➖➖✍️

*ఆధ్యాత్మికత మానవ జీవన వికాసానికి, ఉన్నత విలువల సముపార్జనకు సాధనం.* 

*దైవాన్ని అందరూ చూడలేరు.*

*ఆయన భౌతిక నేత్రాలతో దర్శించేందుకు అతీతుడు. శిల్పి మనోభావనకు అనుగుణంగా రూపుదిద్దుకొన్న విగ్రహం భక్తులకు కనువిందు చేస్తుంది. నాస్తికుడు తనదిగా చెప్పుకొనే ఆధ్యాత్మిక స్పర్శ లేనివాడు. అది పుష్కలంగా ఉన్న ధన్యజీవి ఆస్తికుడు.*

*ఆస్తికత్వం అంటే దైవభావనను విశ్వసించి ఆ ఉనికిని హృదయంలో ప్రతిష్ఠించుకొని శాంతిని, ఆనందాన్ని అనుభవించడం! ఎలాంటి దైవభావనకు, ఆధ్యాత్మిక చింతనకు తావివ్వక తనపై, తన స్వశక్తిపై అపార విశ్వాసం ప్రదర్శించి జీవనగమనాన్ని సాగిస్తాడు నాస్తికుడు.*

*మనిషి బాల్య కౌమార దశల్లో పెద్దలు చెప్పే కథలను ఆసక్తిగా వింటాడు. పౌరాణిక, జానపద కథల్లో లీనమై ఏదో తెలియని ఆనందాన్ని అనుభవిస్తాడు. శ్రీకృష్ణుడి బాల్య క్రీడలు, లీలావినోదాలు పిల్లలను ఆకర్షిస్తాయి. అక్కున చేర్చుకుంటాయి. *

*ఊహాలోకాల్లో విహరింపజేస్తాయి. అమ్మమ్మ, నానమ్మ, తాతయ్యలు చెప్పే కథలు పిల్లల్లో కథనాసక్తిని పెంచుతాయి. రంజిల్లజేస్తాయి. ఊహావినోదాల వినువీధిలో బాలలు విహరించి శాంతికి ఆనందానికి చిరునామాగా మారతారు.*

*ఓ బాలకుడిగా శ్రీకృష్ణుడు ఎందరో రాక్షసులను చంపడం, తోటి బాలలతో చల్దులారగించడం, పొన్నమాను ఎక్కి కోతికొమ్మచ్చు లాడటం, నదీనదాల తీరాల్లో జలకాలాడటం, గోమాతలను కడుపారా మేపి గోధూళి వేళ గృహోన్ముఖులు కావడం, మలిసంధ్య వెలుగుల్లో స్నేహితులతో ఇల్లు చేరుకొని తల్లిదండ్రులను మురిపించడం... పుస్తకాల్లో కథలుగా చదివిన పిల్లల ఆనందానుభూతులు వర్ణింపనలవి కానివి. అలా చిన్నారి దశనుంచి ప్రవర్ధిల్లేదే ఆధ్యాత్మిక హృదయం! ఆధ్యాత్మిక హృదయం ఎల్లలు లేని ఆనందాలకు వేదిక.*

*స్వశక్తిని నమ్ముకొని ముందుకు సాగుతుంది నాస్తికత్వం. నాస్తికభావంతో మమేకమై జీవితాన్ని ఉత్పాదకంగా మలచుకొని విజయతీరాలవైపు ప్రస్థానం సాగించినవారు ప్రాచ్య, పశ్చిమదేశాల్లో ఉన్నారు.*

 *పరమాత్మ శక్తిని తనలో నింపుకొని ప్రస్థానిస్తుంది ఆస్తికత్వం. ప్రపంచంలో కొన్ని దేశాలు కేవలం మానవ శక్తిపై ఆధారపడి ఎంతో పురోగమించడం చూస్తాం. దైవం కానిది ఈ దృశ్యప్రపంచంలో ఏదీలేదని నమ్మే దేశాలు భౌతికసంపదతో సంబంధం లేకుండా శాంతి, ఆనందాలతో అలరారుతున్నాయి.*

*మనిషి తన శ్రేయస్సును మాత్రమే తాను నమ్మినప్పుడు ఎదుటివాడిని మానవత్వంతో చూడగల సహృదయం కొరవడుతుంది. పోటీని అధిగమించే ప్రయత్నంలో విలువలకు తిలోదకాలు ఇవ్వడం వాంఛనీయం కాదు. దైవాన్ని హృదయగతంగా విశ్వసించినప్పుడు మనిషిలో నేరభావన నశిస్తుంది. పాపచింతన అంతర్థానమవుతుంది.*

*ఈ జీవితంలో చేసే పాపాలు ప్రారబ్ధఫలంగా మరోజన్మలో అనుభవించాలని నమ్మే సాధకులు నైతిక విలువలకు పట్టంకడతారు. కల్మషాలు పోగుపడకుండా హృదయాన్ని రక్షించుకొనే ప్రక్రియ ఆధ్యాత్మిక సాధన. ఆధ్యాత్మిక హృదయం నిర్మల, నిశ్చలమైన మనసుతోపాటు శాంతిని ఆనందాన్ని ప్రసాదించే గొప్ప సాధనమని తెలుసుకున్న నాడు సాధకుడి ఆనందాతిరేకాలకు లోటుండదు. ఆనందంగా జీవించడం ఓ కళ.*

*ఆ అనుభూతిని పొందడానికి ధనంతో పని లేదు. అరణ్యాల్లో ఆధ్యాత్మిక సాధనచేస్తూ కుటీరాల్లో నివసించి, దైవానురక్తితో బతుకులను సాఫల్యం చేసుకున్న మహర్షుల ఆధ్యాత్మిక హృదయం మనకు ఆదర్శనీయం.*✍️
.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
                       🌷🙏🌷

   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
                     ➖▪️➖

కర్మ అనేది గోడకు కొట్టిన బంతి లాంటిది.

 180223a1757.    190223-1.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀774.
నేటి…

              *ఆచార్య సద్బోధన:*
                   ➖➖➖✍️


*కర్మ అనేది గోడకు కొట్టిన బంతి లాంటిది.* 

*ఎంత గట్టిగా కొడితే తిరిగి అంతే గట్టిగా మన వైపు వస్తుంది.*

*బంతి దెబ్బ నుండి తప్పించుకోవచ్చునేమో కానీ కర్మ దెబ్బ నుండి మాత్రం తప్పించుకోలేం!*

*పామరుడు అయినా పండితుడు అయినా సరే తాను చేసిన ప్రతీ కర్మకు ఇప్పుడో మరెప్పుడో ఫలం అనుభవించాలి.*

*కనుక  కర్మ  చేసినపుడు…                                మంచిదా? చెడ్డదా? అని ఆలోచించి చేయాలి.* 

*మనకు లాభం వస్తుంది కదా అని ఏది పడితే అది చేసేస్తే కర్మ కూడా తన పని తాను చక్కగా చేసుకుపోతుంది.*

*కనుక విచక్షణతో కర్మలను ఆచరించాలి.*

*దేవుణ్ణి మనసు నిండుగా నింపుకోవాలి. ఎందుకంటే దేవుణ్ణి నిజముగా ప్రేమించినవాడే   కర్మకు భయపడి ఉంటాడు.* 

ఎందుకంటే వారు చేసిన పనికి దేవుడు క్షమించినా కర్మ వదిలిపెట్టదు అని వారికి బాగుగా తెలుసు కనుక.. అయితే దేవుడంటే లెక్క చేయని వారికి అది అంత సులువైన పని కాదు!. వాళ్ళు తమ బుద్ధులను మార్చుకుని దేవునివైపు తిరిగితే తప్ప వాళ్ళను రక్షించడం సృష్టి కర్త వలన కూడా కాదు!.*✍️
.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
                       🌷🙏🌷

   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
                     ➖▪️➖

ఈ కలియుగంలో ఇంద్రియములను, మనసును అదుపులో పెట్టుకోవడం చాలా కష్టము!

 170223a1829.    180223-1.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀773.
నేటి… 

              *ఆచార్య సద్బోధన:*
                  ➖➖➖✍️

 *ఈ కలియుగంలో ఇంద్రియములను, మనసును అదుపులో పెట్టుకోవడం చాలా కష్టము!*

*అర్జునుడంతటి వాడే  'చంచలం హి మనః కృష్ణా!' అన్నాడు.  ఎలా అంటే ప్రాపంచిక విషయములు, కామవాంఛలు ఇంద్రియములను తమ వంకకు లాగుతాయి. మనసు ఇంద్రియముల వెంట వెళుతుంది. బుద్ధి నిస్సహాయంగా మిగిలిపోతుంది.* 

*దీనిని కట్టడి చేయాలంటే ఒకటే మార్గము. ధ్యానంలో కూర్చుంటే ఇంద్రియములను, మనసును నిగ్రహించవచ్చును. అప్పుడు బుద్ధి భగవంతుని యందు స్థిరంగా ఉంటుంది.*

*సాధారణంగా బయట ప్రపంచములో తిరుగుతున్నపుడు ఎన్నో వస్తువులను, విషయాలను, మనుషులను చూస్తుంటాము. మనసు వాటి మీద లగ్నం అవుతుంది. వాటిపై ఆసక్తి కలుగుతుంది. ఆ ఆసక్తి కోరికగా మారుతుంది. ఆ కోరికలు తీరకపోతే కోపం వస్తుంది. కోపంలో ఏమి చేస్తున్నామో తెలియని మోహం ఆవరిస్తుంది. అప్పుడు విచక్షణా జ్ఞానం కోల్పోతాం. బుద్ధి పనిచెయ్యడం మాని వేస్తుంది. జీవితం సర్వనాశనం అవుతుంది.* 

*అదే మనసును మన వశంలో ఉంచుకుంటే ఈ విపరీత పరిణామములు సంభవించవు.*

*ధ్యానము వలన మనస్సు ప్రసన్నంగా ఉంటుంది. మనస్సు ప్రసన్నంగా ఉంటే దుఃఖములు నశిస్తాయి. అప్పుడు బుద్ధి పరమాత్మయందు లగ్నం అవుతుంది. తద్వారా ఆత్మ సాక్షాత్కారం లభిస్తుంది.*✍️
.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
                       🌷🙏🌷

   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
                     ➖▪️➖

ఆచంటీశ్వరాలయం

 160223j1947.    170223-7.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀


           #ఆచంటీశ్వరాలయం
                  ➖➖➖✍️

*👉వేశ్య వల్ల కాశీకి వెళ్ళలేదు..                         ఆమె వక్షోజాలనే శివలింగంగా భావించి పూజించాడు..! *

*ఆ పరమేశ్వరుడు భక్త సులభుడు. చేతులారా నమస్కారం పెట్టి.. చెంబుడు నీళ్లు పోసి అభిషేకం చేస్తే పరమ సంతుష్టుడౌతాడు. భక్తులను ఎల్లవేళలా కాపాడుతాడు. మనం చేసిన పొరపాట్లను కూడా క్షమిస్తాడు అనడానికి ఈ కధే ఉదాహరణ…*

*ఇప్పుడు మనం చెప్పుకునేది ఎ పి లో వెస్ట్ గోదావరి జిల్లాలోని ఆచంట వద్దనున్న రామేశ్వర దేవాలయం గురించి. ఆ స్థలం ప్రత్యేకతను, ఆ దేవాలయానికి ఆ పేరు ఎందుకు వచ్చిందో కూడా తెలుసుకుందాం…*

*తారకాసుర సంహారం జరిగిన తరువాత.. ఓ రోజు శివపార్వతులిద్దరు రతిక్రీడలో మునిగి తేలుతుంటారు. అదే సమయం లో.. వారిద్దరిని దర్శించుకోవడానికి పుష్పసుందరుడు, పుష్పసుందరి అనే ముని దంపతులు వస్తారు. శివ పార్వతుల శృంగారాన్ని వారు చూడడంతో   కోపించిన పరమశివుడు వారిద్దరిని తిరిగి బ్రహ్మ చర్యను పాటించి   ఆ తరువాత శివసాయుజ్యాన్ని పొందాలని శపిస్తాడు. శివుని   శాప ఫలితంగా    వారిద్దరూ భువిపై జన్మిస్తారు.*

*పుష్ప సుందరుడు ‘ఒడయనంబి’ అనే బ్రాహ్మణుడిగా జన్మిస్తారు. అతని భార్య అయిన పుష్పాసుందరి మాత్రం మార్తాండాపురం లోని కళావతుల ఇంట ‘పరమనాచీ’ గా పుడుతుంది. ఆ తరువాత వేశ్య గా మారుతుంది. ఇది ఇలా ఉంటె.. ఓ సారి ‘ఒడయనంబి’ మహాశివరాత్రి కి జాగరణ, పూజలు చేసి శివుడ్ని దర్శించుకోవడం కోసం కాశీ కి బయలుదేరుతాడు. మార్గం మధ్యలో విశ్రాంతి తీసుకుంటూ వెళ్తూ ఉండేవాడు. అలా మార్తాండపురానికి చేరుకుంటాడు. అక్కడ అతనికి వేశ్య అయిన పుష్ప సుందరి ఇంట వసతి లభిస్తుంది.*

*అక్కడకు వెళ్ళగానే ఆ వేశ్య అందాన్ని చూసి ఒడయనంబి మైమరిచిపోతాడు. తానెందుకు వచ్చాడో కూడా మరిచిపోతాడు. ఒడయనంబి కి                     ఆ వేశ్య గత జన్మ లో తన భార్యేనన్న విషయం తెలియదు. తన్మయత్వంతో అక్కడే కొన్ని రోజులు గడిపేస్తాడు. ఓ రోజు ఆ ఊళ్ళోనే ఉన్న శివాలయం నుంచి పంచాక్షరీ మంత్రం వినిపిస్తుంది. వెంటనే అతనికి తానెందుకు వచ్చాడో గుర్తుకు వస్తుంది. ఆరోజు మహా శివరాత్రి. తాను కర్తవ్యం మరిచిపోయినందుకు ఒడయనంబి చింతిస్తాడు. అయితే.. అక్కడ ఏమైనా శివలింగ రూపాలు ఏమైనా ఉన్నాయేమో వెతుకుతాడు.*

*అతనికి ఏమి కనిపించవు.   కళ్ళ ఎదురుకుండా ఆ వేశ్య నగ్నం గా పడుకుని ఉంటుంది. ఆమె వక్షోజాలను శివలింగంగా భావిస్తూ..  ఒడయనంబి శివుడిని తలుచుకుని పూజిస్తాడు. ఆ రాత్రంతా జాగారం చేస్తూ పూజలు చేస్తూనే ఉంటాడు. ఆ తరువాత అలసటతో  ఒడయనంబి  పడిపోతాడు. అతడి భక్తికి మెచ్చి ఆ పరమశివుడు ప్రత్యక్షం అయ్యి ఏమి కావాలో కోరుకోమంటాడు. తనకు మోక్షం కావాలని ఒడయనంబి కోరతాడు. అతనితో పాటు ఆ వేశ్యకు కూడా పరమశివుడు మోక్షాన్ని ప్రసాదిస్తాడు.*

*ఆ తరువాత కాలం లో.. ఆ ప్రాంతం లోనే దేవాలయాన్ని నిర్మిస్తారు. ఈ దేవాలయంలో  లింగం స్త్రీల వక్షోజాలను పోలి ఉంటుంది. శ్రీ రాముడు కూడా రావణాసురుడిని చంపిన తరువాత బ్రహ్మ హత్యా పాతకాన్ని పోగొట్టుకోవడం కోసం ఇక్కడ పూజలు చేసాడట.               ఆ రామునికి  కూడా  హత్య పాతకం పోతుంది. అందుకే ఈ ఈశ్వరాలయానికి రామేశ్వరాలయం అని పేరు వచ్చిందని చెబుతారు. ఇక్కడ లింగానికి స్త్రీలు పూజ చేస్తే..     వారి అనారోగ్య సమస్యలు, దాంపత్య సమస్యలు,   సంతాన సమస్యలు తీరతాయని.. ఆ పరమేశ్వరుడు స్త్రీలపై ఎక్కువ కరుణ చూపించి కాపాడతాడని చెబుతుంటారు.* 

*మహా శివరాత్రి సమయం లో కూడా ఐదు రోజుల పాటు ఇక్కడ విశేష పూజలను నిర్వహిస్తూ ఉంటారు.*✍️
.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
                       🌷🙏🌷

   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
                     ➖▪️➖

నేటి సమాజంలో ప్రతి జీవి పతనమవ్వడానికి కారణం కేవలం ‘జిహ్వచాపల్యం‘ మాత్రమే ...!* *అది ఎలా...!!!*

 160223g1627.    170223-1.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀772.
నేటి…

              *ఆచార్య సద్బోధన:*
                 ➖➖➖✍️

     
*నేటి సమాజంలో ప్రతి జీవి పతనమవ్వడానికి కారణం కేవలం ‘జిహ్వచాపల్యం‘ మాత్రమే ...!*
*అది ఎలా...!!!*
*చేపలను పట్టాలనుకునే జాలరి ఒక కర్రకు తీగ కట్టి దాని క్రింద 'U' ఆకారంలో ఉండే ఇనుప కొక్కాన్ని  కట్టి అది కనిపించకుండా దానికి ఓక వానపామును చుట్టి నీటిలోనికి వదులుతాడు.*

*అక్కడుండే చేప తన ఆహారమైన వానపామును చూసి తన జిహ్వచాపల్యాన్ని నిరోధించలేక దానిని తినే ప్రయత్నం చేస్తుంది.*

*వెంటనే ఆ ఇనుప కొక్కెం దాని నోట్లోకి చొచ్చుకునిపోయి అది ఎటూ కదల్లేక కొట్టుకుంటుంది.*

*అది గమనించిన జాలరి దాన్ని నీటి నుంచి పైకి లాగి, తన పడవలో వేసుకుంటాడు.*
*జిహ్వచాపల్యం కారణంగా తన నోటి మీద నిగ్రహం లేని కారణంగా చేప తన ప్రాణాన్ని కోల్పోతుంది.*

*అందువలన రసేంద్రియము (అనగా నాలుక) మీద నిగ్రహం కలిగి ఉండాలని మనము ఈరోజు చేప ద్వారా నేర్చుకోవాలి...!!!*

*మనకు కూడా మన నోటి మీద అదుపు వుండదు, కేవలం ఆహారం విషయంలోనే కాదు, మాట్లాడే విషయంలో కూడా...! నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతాము, ఎలా పడితే అలా మాట్లాడుతాము, ఏది పడితే అది, ఎలా పడితే అలా తింటాము...!!అందుకే మనము కూడా మన జిహ్వ మీద అదుపు ఉంచాలి.*

*తినకూడనివి తినరాదు, మాట్లాడకూడనివి మాట్లాడరాదు, త్రాగకూడనివి త్రాగరాదు. లేదంటే చేప వలె మనము కూడా పతనం అవుతాము.*✍️
.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
                       🌷🙏🌷

   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
                     ➖▪️➖

జడభరతుడు

 0510.   1-8.3️⃣.   160223-6.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

               *జడభరతుడు*
              ➖➖➖✍️

*ఎంతటి బ్రహ్మజ్ఞానులకైనా, విషయ వాంఛలు ఉండటం వల్ల వారు ఆ రుణాన్ని,        ఆ కర్మానుబంధాన్ని తీర్చుకోవడం కోసం ఎన్నో జన్మలు ఎత్తవలసి వస్తుందనడానికి ఉదాహరణ జడభరతుని వృత్తాంతం.*

*జడభరతుడు రుషభుడనే రాజుకు కుమారుడు. రాజపుత్రుడుగా పుట్టినా, బాల్యం నుంచి    విషయ వాంఛలకు అతీతంగా, దైవభక్తి కలిగి ఉండేవాడు. అందువల్ల అతనిని జడభరతుడని పిలిచేవారు. (జఢత్వం అంటే దేనికీ చలించకపోవడం అనే అర్థం ఉంది. అంతేకానీ, జడలు కలిగి ఉండటం వల్ల కాదు).* 

*రుషభుని అనంతరం జడభరతుడు తనకు ఇష్టం లేకపోయినా, రాజ్యపాలన చేపట్టవలసి వచ్చింది.*

*ఎన్నో సంవత్సరాలపాటు ప్రజాను రంకజమైన పాలన అందించాడు. ఆయన పాలనలో ప్రజలు ఏ లోటూ లేకుండా హాయిగా ఉన్నారు. పాలన చేస్తూనే,  జపధ్యానాలలో మునిగి తేలేవాడు. దేనినీ నిర్లక్ష్యం చేసేవాడు కాదు.* 

*చివరకు వృద్ధాప్యం మీదపడడంతో ఆయన పాలన బాధ్యతలను తన కుమారులకు అప్పగించి, ప్రజాజీవనానికి దూరంగా ఒక నదీతీరానికి వెళ్లి, అక్కడ ఒక పర్ణశాల నిర్మించుకుని, ప్రశాంతంగా తపస్సు చేసుకుంటూ ఉండేవాడు.    నిశ్చలమైన, నిర్మలమైన మనస్సుతో ‘జన్మరాహిత్యాన్ని’ కోరి చేసే ఆయన తపస్సు శ్రీహరిని మెప్పించింది.*

*శ్రీహరి ఇక మోక్షం అనుగ్రహించాలను కున్నాడు. ఇంతలో జరిగిన ఒక చిత్రమైన సంఘటన భరతుడి జీవితాన్ని మలుపు తిప్పింది.* 

*జడభరతుడికి ప్రతిరోజూ నదిలో స్నానం చేసిన తర్వాత, ఒడ్డునే కూర్చుని ధ్యానం చేసుకోవడం అలవాటు. ఒకరోజు ఆయన అలా ధ్యానానికి కూర్చున్నాడు. అదే సమయంలో నిండు చూలింత అయిన  లేడి ఒకటి అక్కడ నీళ్లు తాగడానికి వచ్చింది.*

*దానికి దగ్గరలో నుంచి ఒక పులిగాండ్రింపు వినపడింది. సరిగ్గా అప్పుడే పెద్దపెట్టున పిడుగు పడింది.   ఈ రెండు సంఘటనలకు తీవ్రంగా బెంబేలెత్తిపోయింది ఆ లేడి. భయంతో వణికిపోతూ, ఒక్క గంతు వేసింది. ఆ గంతుకు లేడికి అప్పటికప్పుడు ప్రసవం జరిగిపోయింది. లేడి మాత్రం నీటిలో మునిగి చచ్చిపోయింది.*

*దూరాన కూర్చుని ఇది గమనిస్తున్న జడభరతుడు అక్కడికి చేరుకునేలోపు అప్పుడే పుట్టిన లేడిపిల్ల కూడా నదిలో మునిగిపోతూ కనిపించింది.* 

*దాంతో ఆయన ఒక్క అంగలో దాన్ని అందుకుని, చేతుల్లోకి తీసుకున్నాడు. కళ్లు కూడా తెరవని ఆ పసిదాన్ని చూసేసరికి ఆయనలో వాత్సల్యం కలిగింది. దిక్కులేని ఆ పసికూనను కొన్నాళ్లు పెంచి, అది కాస్త పెద్దయ్యాక తిరిగి అడవిలో వదిలేద్దామనుకున్నాడు.*

*తన పర్ణశాలకు తీసుకుని వెళ్లి, దానికి సపర్యలు చేశాడు. లేత గడ్డిపరకలు తినిపించాడు. అది కోలుకోవాలని కోరుకున్నాడు. అప్పటినుంచి తల్లి లేని దానికి అన్నీ తానే అయ్యాడు.* 

 *బంగారు రంగులో మెరిసి పోతూ, అది ఆశ్రమ ప్రాంగణంలో చెంగనాలు వేస్తూ ఉంటే చూసి మురిసిపోయాడు. దాని ధ్యాసలో పడి తన తపోదీక్షను కూడా పక్కన పెట్టాడు.*

*సర్వసంగ పరిత్యాగి అయిన ఆ రాజర్షికి అనుక్షణం దాని ఊహే! దానితో ఆటలే! కాసేపు ఆ లేడి ఎక్కడికైనా వెళ్తే, అది తిరిగి వచ్చేవరకు ఆయన ప్రాణం విలవిలలాడేది క్రూరమృగ మేదైనా దానిని పొట్టన పెట్టుకుందేమోనని.* 

*ఆటల్లో, అది యజ్ఞానికని తెచ్చుకున్న సమిధలను అపరిశుభ్రం చేస్తున్నా, దర్భగడ్డిని తొక్కిపాడుచేస్తున్నా, అదిలించేవాడు కాదు. అది కూడా భరతుడంటే ప్రాణాలు పెట్టేది. ఆయన తినిపిస్తే తప్ప పచ్చగడ్డి కూడా కొరికేది కాదు. ఓసారి ఆ లేడి ఎక్కడికో వెళ్లింది. నాలుగురోజులపాటు తిరిగి రాలేదు. ఎంత వెదికినా కనిపించలేదు. దానికి ఏమైనా అయిందేమోనని బెంగపెట్టుకుని, ఆయన జబ్బుపడ్డాడు. తనకు అంత్యసమయం వచ్చిందని గ్రహించాడు.*

*సరిగ్గా అదే సమయంలో ఆ లేడి వచ్చి, ఆయన కాళ్లు నాకుతూ ఉండిపోయింది. దానినే చూస్తూ, తన తర్వాత దాని బాగోగులు ఎవరు చూస్తారా అనే బెంగతో ఆయన ప్రాణాలు విడిచాడు.* 

*జీవుడు చనిపోయే సమయంలో దేని గురించి ఆలోచిస్తే, ఆత్మ తిరిగి ఆ రూపం తీసుకుంటుందంటారు. జన్మరాహిత్యం కోరిన భరతుడు చివరి దశలో ఆ లేడిపిల్లను చేరదీసి, దాని ధ్యాసలో పడి మరణించడం వల్ల ఆయన అంతవరకు చేసిన తపస్సంతా వ్యర్థమై, మరుజన్మలో ఆయన లేడిగా పుట్టవలసి వచ్చింది.* 

*ఆ తర్వాత ఆయన మరో జన్మ కూడా ఎత్తవలసి వచ్చింది. అందుకే అంత్యసమయంలో భగవన్నామ స్మరణ చేయాలంటారు.”*✍️

.                      🌷🙏🌷

   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

కతికితే అతకదు!

 150223f1416.      160223-5.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀


             *కతికితే అతకదు!*
                ➖➖➖✍️

*మనలో ఎవరైనా పెండ్లిసంబంధాల నిమిత్త౦ అమ్మాయిని చూసుకోడానికి వెళ్ళినప్పుడు వారు భోజనం చెయ్యమని ఎంత బ్రతిమాలినా చెయ్యరు. కతికితే అతకదని చెప్పి తప్పి౦చుకుంటారు.* 

*దీనికి కారణ౦ ఏమిటా  అని ఆలోచిస్తే మనకు ఒక విషయం తెలుస్తుంది . అదేమిటంటే….  మనం వారు పెట్టిన భోజనం చేస్తే మనకు వారి పట్ల ఒక soft  corner ఏర్పడుతుంది.*

* అది ఒక్కొక్కప్పుడు వ్యవహారానికి ఆటంకం కలుగజేయవచ్చు.*

*ఉదాహరణకి మనం బట్టలుగాని మరేవైనా వస్తువులు గాని కొనుక్కోడానికి వెళ్ళినప్పుడు ఆ షాపు  యజమాని మనకు tea గాని కూల్ డ్రింక్స్ గాని ఇస్తారు. మనం తీసుకో కూడదు.*

*ఒకవేళ మనం అవి తీసుకుంటే….           ఆ వ్యక్తితో మనకు ఒక బంధం ఏర్పడుతుంది. బట్టలు లేదా ఏదైనా వస్తువు మనకు నచ్చినా నచ్చక పోయినా తప్పనిసరిగా కొనవలసిన అగత్యం ఏర్పడుతుంది ఎందుకంటే వాళ్లు మనకందించిన cool drinks సీసాలు అప్పటికే డజనో అరడజనో త్రాగేసు౦టాం కాబట్టి.*

*అందుకని ఏదో ఒకటి కొనకుండా రాలేం.*

*ఇక వస్తువో బట్టలో ఐతే అవి  ఎలాఉన్నా కొనుక్కోవచ్చు. కొంతకాలం వాడుకుని బయట పడెయ్యొచ్చు. కాని వధువు అటువంటిది కాదు, కాకూడదు. ఆమె జీవితాంతం మన వెంట ఉండేది ఉండవలసినదిన్నీ. అందువల్ల అటువంటి వ్యక్తిని ఎన్నుకోవడంలో ఎటువంటి మొహమాటాలకు తావుండకూడదు. మనం ఒకవేళ వాళ్ళు పెట్టినవన్నీ కాదనలేక ఆరగించి మన ఇంటికెళ్ళాక    అమ్మాయి నచ్చలేదని చెబితే ‘పిండి వంటలు దొబ్బితిని పిల్లనచ్చలేదన్నారు వెధవలు’ అని తిట్టుకోవచ్చు.* 

*అటువంటి అవకాశం మనం వాళ్ళకు ఇవ్వకూడదు.   ఇక కొంచెం  మొహమాటపడి పిల్ల నచ్చక పోయినా ఏదోవిధంగా నచ్చిందని చేసుకుంటే జీవితం దుర్భరం.* 

*కాబట్టి వివాహవిషయంలో ఇటువంటి మొహమాటాలను సమూలంగా త్రుంచి వేయడానికే ‘కతికితే అతకదు’ అనే నియమాన్ని మన ప్రాచీనులు ఏర్పరిచారు.*

*ఆహా ! ఎంత గొప్ప వారు మన పూర్వులు. అందువల్ల  మనమెప్పుడైనా ఏదైనా కొనడానికి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వాళ్ళు మనకిచ్చే తినుబండారాలు తీసుకోకూడదు. వస్తువు కొన్నాక తీసుకోవచ్చు. ఎవరికీ ఇబ్బంది లేదు.  మొత్తం మీద చెప్పేదేమిటంటే….                “ఆహారవ్యవహారేషు త్యక్తలజ్జః సుఖీ భవేత్!”* ✍️
.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
                       🌷🙏🌷

   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
                     ➖▪️➖

ఖరీదైన వాడకంతో ప్రదర్శించే బదులు....

 1901.    2-8.    160223-1.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀771.
నేటి…

              *ఆచార్య సద్బోధన:*
                 ➖➖➖✍️

                 *సౌత్ ఆఫ్రికాకు చెందిన ప్రసిద్ధ ఫుట్ బాల్ క్రీడాకారుడు ఇతను, పేరు: ‘ఎస్ ఎం సెనెగల్,’ వయసు 27ఏళ్ళు.* 

*భారతీయ కరెన్సీలో    ఇతగాడి సంపాదన వారానికి కోటి నలభై లక్షల రూపాయలు ఉంటుంది.*

*కానీ ఎన్నోసార్లు ఇతను స్క్రీన్ విరిగిన ఫోన్ చేత్తో పట్టుకుని కనిపించాడు.*

*ఒక ఇంటర్వ్యూలో ఆ ఫోన్ విషయమై అడిగితే దానికి అతను ఇచ్చిన జవాబు: ‘రిపేర్ చేయిస్తాను.’*

*కొత్త ఫోన్ తీసుకోవచ్చుగా అంటే : ‘ఇటువంటి ఫోన్లు పదివేలు కొనగలను, 10 ఫెరారి కార్లు కొనగలను, 2జెట్ విమానాలు కొనగలను,  వజ్రాలు పొదిగిన గడియరాలు కొనగలను, కానీ అవసరం ఏముంది?’*

*’బీదరికాన్ని చూసి,   బీదరికంలో పెరిగాను.    దాంతో   చదువుకో లేక పోయాను,    అందుకే పిల్లలు చదువుకునేందుకు స్కూళ్లు కట్టించాను, నాదగ్గర వేసుకునేందుకు బూట్లు కూడా ఉండేవికావు. అలాగే ఆడేవాడిని, మంచి బట్టలు ఉండేవికావు. తినడానికి తిండి ఉండేది కాదు. ఇవాళ  నాదగ్గర ఇంతఉంది  అంటే దానిని ఖరీదైన వాడకంతో ప్రదర్శించే బదులు నావాళ్లకు పంచగలిగితే ఉపయోగకరం కదా!’*✍️
.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
                       🌷🙏🌷

   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
                     ➖▪️➖

ఆరోగ్యమే మహా భాగ్యం* ➖➖➖✍️ (9అంశాలు)

 1504.     2-10.    150223-8.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀129.
*మన ఆరోగ్యం…!


            *ఆరోగ్యమే మహా భాగ్యం*
                     ➖➖➖✍️
                     (9అంశాలు)

*1) మంచి ఆరోగ్యానికి చక్కని చిట్కాలు*

#రోజుకి 3 నుండి 5 లీటర్ల నీరు - రోగాలు దరిచేరవు.
➤రోజుకి ఓ యాపిల్ - డాక్టర్ అవసరం లేదు
➤రోజుకి ఓ తులసి ఆకు - క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది
➤రోజుకి ఓ నిమ్మకాయ(రసం) - శరీరంలో కొవ్వుని తీసేస్తుంది
➤రోజుకి ఒక కప్పు పాలు - ఎముకలను ధృడంగా ఉంచుతుంది
<><><><><><><><><>


*2) ఆరోగ్యం: కొబ్బరిపాలతో ప్రయోజనాలు*

☞ శ‌రీరానికి శక్తిని అందించి యాక్టివ్‌గా ఉండేలా చేస్తాయి
☞ ఆవు పాలకు సమానమైన పోషకాలను కలిగి ఉంటాయి
☞ యాంటీ వైరల్ గుణాలు సమృద్ధిగా ఉండటంతో రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తాయి
☞ శరీరంలో ఏర్పడే ఒత్తిడి తగ్గించడంతో పాటు కీళ్ల నొప్పులకు మందులా పనిచేస్తాయి
☞ పాస్ఫరస్, కాల్షియం వంటి పోషకాలు ఉండడంతో దంతాలు, ఎముక‌లు బలంగా మారతాయి
<><><><><><><><><>


*3) ఆరోగ్యానికి జీడిపప్పు*

_జీడి పప్పుతో అనేక ఆరోగ్య ప్రయోజనాలని పొందవచ్చు._
☞ మెగ్నీషియం అధికంగా ఉండడం వల్ల ఎముకలు, కండరాలు, నరాలను బలోపేతం చేస్తుంది.
☞ జీడిపప్పులో యాంటీఆక్సిడెంట్స్ క్యాన్సర్ రిస్క్‌ను అరికట్టి వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది.
☞ ఇందులో ఉండే న్యూక్లియర్ యాసిడ్ జీర్ణక్రియని మెరుగపరుస్తుంది.
☞ రెగ్యులర్‌గా జీడిపప్పులని తీసుకుంటే కిడ్నీలో రాళ్లు 25% తగ్గుతాయి.
<><><><><><><><><>


*4) కాకరకాయ ఎందుకు తినాలంటే?*

☞ డయాబెటిస్ రోగుల్లో చక్కెర స్థాయిని అదుపు చేస్తుంది
☞ దేహంలో చెడు టాక్సిన్స్‌ను నియంత్రిస్తుంది
☞ రక్తాన్ని శుద్ధి చేస్తుంది
☞ నులిపురుగుల్ని నివారిస్తుంది
☞ ఒబేసిటీతో బాధపడేవారిలో బరువు తగ్గిస్తుంది
☞ ర‌క్తస‌ర‌ఫ‌రా మెరుగుపరుస్తుంది
☞ లివర్‌ను శుభ్రం చేస్తుంది
☞ శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతుంది
<><><><><><><><><>


*5) బాదంపప్పు ఎందుకు తినాలంటే*

☞ చెడు కొలెస్ట్రాల్‌ను నివారిస్తుంది
☞ జీవక్రియ రేటును పెంచుతుంది
☞ కంటిచూపు మెరుగుపరుస్తుంది
☞ మెదడు ఏకాగ్రతను పెంచుతుంది
☞ ఒత్తిడిని అదుపులో ఉంచుతుంది
☞ చర్మం నిగారించేలా చేస్తుంది
☞ గుండెనొప్పి వచ్చే అవకాశాల్ని నియంత్రిస్తుంది
☞ ఎముకలు, కండరాల్ని బలంగా చేస్తుంది
<><><><><><><><><>


*6) అల్లం మురబ్బాతో ప్రయోజనాలెన్నో*
☞ పెయిన్ కిల్లర్‌గా పనిచేస్తుంది
☞ దగ్గు, జలుబును నివారిస్తుంది
☞ రక్తంలో కొవ్వును తగ్గిస్తుంది
☞ జీర్ణవ్యవస్థకు మేలు చేస్తుంది
☞ రోగనిరోధక శక్తిని పెంచుతుంది
☞ పైత్యాన్ని నివారిస్తుంది
☞ విరేచనాల నుండి ఉపశమనం కలిగిస్తుంది
☞ కఫాన్ని నివారిస్తుంది
<><><><><><><><><>


*7) అలసందలు/బొబ్బర్లతో ఉపయోగాలెన్నో*

☞ రక్తంలో కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి
☞ మధుమేహాన్ని అదుపులో ఉంచుతాయి
☞ వైరల్ జ్వరాలు, ఇన్ఫెక్షన్లను దరి చేరనివ్వవు
☞ మలబద్దకాన్ని నివారిస్తాయి
☞ ఒత్తిడిని తగ్గిస్తాయి
☞ కంటిచూపు సమస్యలు తొలగిస్తాయి
☞ కిడ్నీ సమస్యలు రాకుండా చేస్తాయి
<><><><><><><><><>


*8) చిలగడ దుంపలు తినడం వల్ల కలిగే లాభాలు*

☞ చిలగడ దుంపల్లో పొటాషియం, ఐరన్, బీటా కెరోటిన్ ఎక్కువగా ఉంటాయి. వీటివల్ల శరీరం ధృఢంగా ఉంటుంది.
☞ వీటిని తినడం వల్ల జలుబు రాకుండా ఉంటుంది.
☞ మధుమేహ వ్యాధిగ్రస్థులు దుంపలు తినడం వల్ల షుగర్ లెవెల్స్ కంట్రోల్‌లో ఉంటాయి.
☞ ఇవి క్యాన్సర్ కారక కణాలకు వ్యతిరేకంగా పని చేస్తాయి.
☞ దుంపలు రోజూ తినడం వల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది. దీని వల్ల జుట్టు సమస్యలు దూరం అవుతాయి.
<><><><><><><><><>


*9) రాగి జావతో ఉపయోగాలెన్నో*

☞ ఎముకల బలహీనతను అరికట్టడంలో సహకరిస్తుంది
☞ కాలేయంలో కొవ్వును నిర్మూలిస్తుంది
☞ దంతాలను గట్టిగా ఉండేలా చేస్తుంది
☞ రక్తహీనతను తగ్గిస్తుంది
☞ రోగనిరోధకశక్తి పెంచుతుంది
☞ పార్శ్వనొప్పులను తగ్గిస్తుంది
☞ నిద్రలేమిని నివారిస్తుంది
☞ రక్తం ఉత్పత్తికి దోహదం చేస్తుంది. ✍️
.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
                       🌷🙏🌷

   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
                     ➖▪️➖

అ,ఆ లతోనే చదువు

 0510.     1-4.    150223-7.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

          *అ,ఆ లతోనే చదువు*
                ➖➖➖✍️


 *ఎంతటి పాండిత్యమైనా ‘అ, ఆ’లతోనే ప్రారంభమవుతుంది.   ఇది అందరూ ఎరిగిన సత్యమే.*

*అ, ఆలతో ప్రారంభమైన చదువు మనిషిని విద్యావేత్తగా మారుస్తుంది. పండితుడిగా తీర్చిదిద్దుతుంది. ఆ వ్యక్తికి కీర్తిని తెచ్చిపెడుతుంది. భవిష్యత్‌ తరాలకు స్ఫూర్తిప్రదాతగా నిలబెడుతుంది.* 

*మరి ఆధ్యాత్మికంలో ‘అ, ఆ’ ఏమిటి? పాండిత్యానికి అ, ఆ ఎలాగైతే ప్రాథమికమో.. ఆధ్యాత్మిక యానానికీ         ఈ రెండు అక్షరాలే ప్రామాణికాలు.* 

*నిజానికి ఆధ్యాత్మికమనేది నాగరికులైన మానవులకే తప్ప ఇంకొక జీవజాలానికి కానేకాదు. అది మూలతత్త్వంతో మన సంబంధాన్ని తెలుసుకోవడానికి నిర్దేశించింది. ఆ కార్యంలో ‘అ’ అనేది అనాత్మను, ‘ఆ’ ఆత్మను సూచిస్తాయి.* 

*ఆధ్యాత్మికతలో ప్రవేశించేవారు నిశ్చయంగా తెలుసుకోవలసిన మూల విషయాలు అనాత్మ, ఆత్మ.* 

*మన కండ్లకు కనిపించే మన శరీరాన్నే ‘అనాత్మ’ అని భావిస్తారు. అంటే అది ఆత్మకు అన్యమైనది. ఇక మన కండ్లకు కనిపించనిది ‘ఆత్మ’. ఇది లేనిదే అనాత్మ (శరీరం) నిలిచి ఉండే అవకాశమే లేదు. అందుకే ఈ ఆత్మ, అనాత్మ గురించి తెలుసుకోవడంతోనే ఆధ్యాత్మిక విద్య ప్రారంభమవుతుంది.* 

*సాధారణంగా అందరూ చేసే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పురాణ శ్రవణం, మందిర దర్శనం, గ్రంథ పఠనం, భగవత్‌ పూజ, తీర్థయాత్రలు, దానం, పండుగలు వంటివి కనిపిస్తుంటాయి. నోములు, వ్రతాలు, దీక్షలు కూడా అందులోకే వస్తాయి. అయితే, వీటన్నిటి లక్ష్యం దాదాపుగా అనాత్మయైన శరీరానికి సుఖం, భోగం కలిగించడమే అవుతుంది. ఏ కొద్దిమందో అనాత్మకు ఆధారమైన ఆత్మ గురించి తెలుసుకునేందుకు వీటిని వారధిగా ఉపయోగించుకుంటారు.* 

*ఆధ్యాత్మిక కలాపాలతో దేహాన్ని ఎంత సుఖపెట్టాలని ప్రయత్నించినా అది శాశ్వతంగా నిలిచి ఉండదు. అందుకే, కర్తవ్యబోధ చేయడానికై శ్రీకృష్ణ భగవానుడు ఆత్మ విషయాన్ని భగవద్గీత ప్రారంభంలోనే అర్జునునికి తెలియజేశాడు.* 

*శరీరానికి ఉండే తాత్కాలిక స్వభావాన్ని ఆ దేవదేవుడు స్పష్టంగా తెలియజేశాడు. అలా గీతాజ్ఞానం కూడా ‘అ, ఆ’తోనే మొదలైంది.*

 *భరత మహారాజు మహాభక్తుడు. రాజ్యపాలనలో గొప్ప విజయాన్ని సాధించి ఈ భూమిని తనపేరుతో పిలిచేంత గొప్ప పనులు చేశాడు. ఆయన పాలించిన మేర ప్రాంతం భారత వర్షంగా ప్రసిద్ధి చెందింది.* 

*అయితే చివరలో ‘అనాత్మ’ (జింకపిల్ల) పట్ల ఆకర్షణ కారణంగా పతనం చెంది, జింక శరీరాన్ని పొందాడు. అంటే ‘రాజ శరీరం’ (అనాత్మ) పోయి జింక శరీరం వచ్చింది.   కానీ, జ్ఞానం మాత్రం నశించలేదు. దాని కారణంగానే మరుసటి జన్మలో ఉన్నతమైన మరో ఉపాధి పొందాడు. ఈ విధంగా అనాత్మ (శరీరం) మారుతూ వచ్చింది. కానీ, లోపల ఉండే ఆత్మ మారలేదు. ‘అనాత్మ’కు మారే స్వభావం ఉంటుంది. ‘ఆత్మ’ ఎన్నటికీ మారదు. అందుకే భరతుడు మరుసటి జన్మలో జడభరతుని రూపంలో అత్యంత సావధానంగా ప్రవర్తించి మోక్షసాధన చేశాడు, ముక్తిని పొందాడు.* 

 *అనాత్మతో తాదాత్మ్యం ఉన్నంతవరకు ఆత్మ కనిపించదు, ఇక ఆత్మ దర్శనం కాగానే అనాత్మతో పని ఉండదు. అంటే శరీరాలను ధరించవలసిన అవసరం కలగదు. కనుక ఆధ్యాత్మిక కలాపాలను ఆత్మదర్శియైన గురువు నిర్దేశంలో ‘అ,ఆ’లను నేర్చుకోవడానికి, అనుభూతం చేసుకోవడానికి నిర్వహించాలి. తద్వారా సాధకుడు ఇహపర సౌఖ్యాలను సాధిస్తాడు.* 

*ఇదే గీతా సందేశం! గీతలో ఆత్మ, అనాత్మ గురించిన సంపూర్ణమైన వివరణ మనకు లభిస్తుంది. ఆ దివ్యజ్ఞానంతో అందరూ మానవజన్మను సఫలం చేసుకోవాలి.* ✍️


.                      🌷🙏🌷

   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

కాలం కాంచన తుల్యం…!’* *కాలం విలువ

 1212.      1-4.  150223-6.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
 *‘కాలం కాంచన తుల్యం…!’*

                 *కాలం విలువ*
                ➖➖➖✍️

కాలం చాలా విలువైనది. *‘కాలం కాంచన తుల్యం!’* అన్నారు. అంటే కాలం బంగారంతో సమానం. ఇంతకంటే మంచి పోలిక ఏముంది? 

వ్యక్తి తన జీవిత కాలంలో సమయ పాలన పాటించడం బట్టి, అతని జీవితం ఆధారపడి ఉంటుంది. ఒక వ్యక్తి వృత్తిలో చేసే పనిని తగు సమయానికి పూర్తి చేయగలగడం వలన అతని చేతి వృత్తికి విలువ ఎక్కువ ఉంటుంది. అదే వ్యక్తి తగు సమయానికి పనిని పూర్తి చేయలేకపోతే,  ఆ వ్యక్తి చేతివృత్తికి విలువ ఉండదు. ఎంత ప్రతిభ ఉన్నా, అవసరానికి ఉపయోగపడే విధంగా ప్రతిభ ప్రదర్శించలేకపోతే, ఆ ప్రతిభా పాటవాలు నిరర్ధకమే అంటారు. అంటే కాలంలో ఒక వ్యక్తి ప్రతిభ, మరొక వ్యక్తి అవసరం   లేక  ఒక వ్యవస్థాగత అవసరంపైన ఆధారపడి ఉంటుంది. అలా కాలంలో వ్యక్తి ప్రతిభకు గుర్తింపు, ఆ వ్యక్తి అవసరానికి తగ్గట్టుగా తన పనిని తాను పూర్తి చేయడంపైన ఆధారపడి ఉంటుంది. వ్యక్తి కానీ వ్యవస్థ కానీ సమాజంలో అవసరాలు తీర్చడానికి సేవలు అందించే ప్రక్రియను పాటిస్తూ, ఆ సేవలకు తగినంత రుసుమును వసూలు చేస్తూ ఉంటే, సేవలు సమయానికి ఉపయోగపడితే, సదరు వ్యవస్థపైన కానీ సదరు వ్యక్తి పైన కానీ సమాజంలో నమ్మకం ఏర్పడుతుంది. సదభిప్రాయం ఏర్పడితే, సదరు వ్యక్తి కానీ వ్యవస్థ కానీ ఆర్ధికంగా లాభాలు గడించగలరు. అంటే ఆర్ధిక పురోగతిని కాలం శాసించగలదు.

ఒక మోటారు సైకిల్ మెకానిక్, ఒక వ్యక్తి యొక్క మోటారు సైకిల్ రిపైరు చేయడానికి రెండురోజులు గడువు కోరితే, అతను ఖచ్చితంగా తను కోరిన గడువులోపులో మోటారు సైకిల్ రిపైరు చేయగలిగితే, సదరు మోటారు సైకిల్ యజమాని యొక్క మన్ననకు పాత్రుడు కాగలడు. 

కాలంలో ఒక వ్యక్తి ఇచ్చే కమిట్ మెంట్, మరొక వ్యక్తి మరొకరికి ఇచ్చే కమిట్ మెంట్ కు కారణం కాగలదు. రెండురోజుల గడువులో మోటారు సైకిల్ రిపైర్ చేయగలిగితే, అతని మాట నిలబడుతుంది. ఇంకా మోటారు సైకిల్ యజమాని మాట నిలబడుతుంది. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం అంటే, కాలమును బంగారంగా మార్చుకోవడమే…. భవిష్యత్తులో మాటకు విలువ పెరగడమే అవుతుంది.

వ్యక్తి జీవితములో కాలం కన్నా విలువైనది ఉండదు.

బాల్యం అంటే చిన్నప్పుడు 
యవ్వనం అంటే యుక్త వయసుకు వచ్చినవారు
వృద్దాప్యం అంటే ముసలివారు….
పై ఈ మూడు కాలాలు మనిషిపై చాలా ప్రభావంతమైనవి.

బాల్యంలో ఆటలు ఆడుకోవడం, క్రమశిక్షణతో చదువుకోవడం చాలా చాలా ప్రధాన విషయం. 
బాల్యంలో ఒక బాలుడు స్కూల్ కు వెళ్తూ చదువుకుంటూ, రోజూ కొంత సమయం ఆటలు ఆడుకోవడం… ఆరోగ్యవంతమైన బాల్యంగా చెబుతారు. ఆటల వలన శరీరానికి అలుపు ఉంటుంది. సమయానికి తినడం వలన, తిన్న తిండి శక్తిగా మారుతుంది. చదువుకోవడం వలన విషయ పరిజ్ఞానం పెరుగుతుంది. ఏదో ఒక విషయంపై పరిశోధనాత్మక చదువు సమాజంలో మంచి గుర్తింపును తీసుకువస్తుంది.
సామాన్యమైన చదువు ఒక ఉద్యోగిగా మారడానికి ఉపయోగపడుతుంది. అంటే బాల్యంలో ఆడే ఆటలు శరీర ఆరోగ్యంగా ఉండేలా, బాల్యంలో చదివే చదువులు వ్యక్తి వృత్తికి సాయపడేలా ఉంటాయి… 

ఇక్కడ ఎంత శ్రద్దపెట్టి చదువు చదివితే, అంత గుర్తింపు… ఎంత చక్కగా తిండి తిని, సరైన వ్యాయామం కానీ    ఆటలు కానీ అడితే, అంతటి ఆరోగ్యం అంటారు. 

కష్టపడి బాల్య కాలంలో చేసే సాధన యవ్వన కాలమును ప్రభావితం చేస్తుంది. 

అలాగే యవ్వనంలో కష్టపడి చేసే పని, వృద్దాప్యంపై ప్రభావం చూపుతుంది. ఇలా ఒక కాలంలో పడిన కష్టం యొక్క ఫలితం మరొక కాలంలో పడుతుంది. 

అందుకే ఏ సమయానికి ఏం చేయాలో తెలిసి ఉండాలి… అందుకు శ్రమించాలి అని అంటారు. కాలంలో కలిగే మార్పులు వ్యక్తి జీవితంపై పడుతూ ఉంటాయి… అయితే అంతకు ముందు ఆ వ్యక్తి చేసిన సాధన ఫలితం కాలంలో కలిగే కష్ట నష్టాలను ఎదుర్కోవడంలో ఉపయోగ పడుతుంది. 

ఒక వ్యక్తి వ్యాయామంతో కాయమును పెంచితే, ఆ కాయము కాలంలో వచ్చే అంటువ్యాధులతో పోరాడగలిగే శక్తిని కలిగి ఉంటుందని అంటారు. 

అలాగే ఒక వ్యక్తి బాగా కష్టపడి సంపాదిస్తే, కాలంలో కలిగే ఆర్ధిక మార్పులను ఎదుర్కోవడంలో ఆ ధనం ఉపయోగపడుతుంది. 

ఒక వ్యక్తి తనతోటివారికి సాయపడుతూ ఉంటే, కాలంలో ఎదురయ్యే కష్టాలలో తన తోటివారే తనకు అండగా నిలబడతారు అంటే ఒక వ్యక్తి చేసే సాధన ఏవిధంగా ఉంటే, అదే విధంగా కాలంలో సమాజం నుండి పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంటారు.

ఈ విధంగా కాలం వ్యక్తి జీవితముపై అనేక విధాలుగా ప్రభావం చూపగలదు… కాబట్టి *‘కాలం కాంచన తుల్యం’* అన్నారు. అంటే కాలం బంగారంతో సమానం… అందుకే కాలం చాలా విలువైనది… ఇది ఒక మాటగా ఉండవచ్చు. ఒక సేవగా ఉండవచ్చు. ఒక సాయంగా ఉండవచ్చు. డబ్బురూపంలో ఉండవచ్చు… ఎలాగైనా ఉండవచ్చు కానీ కాలం చాలా విలువైనది…✍️
.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
                       🌷🙏🌷

   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
                     ➖▪️➖

నేటి జీవిత సత్యం…* *కోరికల చిట్టా

 3101.    2-6.    140223-6.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*నేటి జీవిత సత్యం…*

                 *కోరికల చిట్టా* 
                 ➖➖➖✍️
  

 *ఈ పుడమిపై పుట్టిన ప్రతి మనిషికీ అనుక్షణం అవసరాలెన్నో ఉంటాయి. బతుకు గడవాలంటే తిండి కావాలి. కట్టుకునేందుకు బట్టలు కావాలి. నివసించడానికి ఇల్లు కావాలి. ధన సంపాదనకు వృత్తులు, ఉద్యోగాలు కావాలి. ఆనందంగా ఉండటానికి ఇంకెన్నో కావాలి.* 

 *మనిషికి కోరికలు బలాలే కాదు, బలహీనతలు కూడా. మనిషి అవసరాలు ప్రాధాన్యాన్నిబట్టి మారుతుంటాయి. ఏది అత్యవసరమో దానికోసం మనిషి తహతహలాడు తుంటాడు. పరితపిస్తుంటాడు.* 

*మానవ ప్రయత్నంతో సాధ్యం కానప్పుడు దైవాన్ని ఆశ్రయించడం మానవ స్వభావం. ఇంటిలో ఉన్న దేవతలను ఆరాధించడమే కాకుండా పుణ్యక్షేత్రాలకు వెళ్ళి దర్శించుకోవడం, పుణ్యతీర్థాల్లో స్నానాలు చేయడం, దానాలు చేయడం పరిపాటి. మనిషి దైవదర్శనం చేసుకొనే సమయంలో తన కోరికల చిట్టాను భగవంతుడికి నివేదించుకుంటాడు. అవన్నీ సమకూరిస్తే మళ్ళీ వచ్చి మొక్కులు తీర్చుకుంటానని, కానుకలు సమర్పించుకుంటానని మొక్కుకుంటాడు.* 

*కోరికలు న్యాయమైనవే కావాలన్న నిబంధన ఏమీ లేదు కనుక అన్యాయార్జితాలకోసం మొక్కుకునేవారూ కనిపిస్తారు. ఉదాహరణకు ఒక దొంగ తనకు దొంగతనంలో అపారంగా ధనం లభిస్తే, అందులో కొంత హుండీలో వేస్తానని వాగ్దానం చేస్తాడు. అక్రమార్జనలో పుష్కలంగా ధనం లభిస్తే భూరి విరాళం ఇస్తానని మరొక వ్యక్తి కోరుకుంటాడు. ఎవరి బాధలు వారివి. ఎవరి కోరికలు వారివి. ఏ కోరికనూ కోరని భక్తులూ ఉండవచ్చు. అలాంటి వారిది నిష్కామ భక్తి.*  

 *కోరికలు ఉండటం, లేకపోవడం వ్యక్తిగతాంశం. కోట్లకు పడగలెత్తిన కుబేరులకూ అపారంగా కోరికలు పుడుతూనే ఉండవచ్చు. పూటకు గతిలేని నిరుపేదకు ఏ కోరికలూ లేకపోవచ్చు. కోరికలు మనిషిని బంధిస్తాయని మహర్షుల వాక్కు. ఒక కోరిక మరో కోరికను పుట్టిస్తుంది. కోరికలు కడలి కెరటాల్లాంటివి. ఒక కెరటం తీరాన్ని తాకి నశించగానే, మరో కెరటం వస్తూనే ఉంటుంది. కెరటాలకు అంతం లేనట్లే కోరికలకూ అంతం లేదు.* 

 *మనిషిని సృష్టించిన భగవంతుడికి మనిషి మనసులో ఏముందో తెలియదా అని ప్రశ్నించేవాళ్లూ ఉంటారు. మనిషి స్వభావం దేవుణ్ని అడిగేట్టుగా చేస్తుంది. ప్రాథమికావసరాల కోసం కొందరు దేవుణ్ని ప్రార్థిస్తారు. అవి తీరగానే విలాసాలు కోరుకుంటారు. వాటికి అంతులేదు. ఎన్ని ఉన్నా, ఇంకా ఏవో కావాలనిపిస్తుంది. కోరికలను ఏదో ఒక దశలో నియంత్రించకపోతే అశాంతి మిగులుతుందనడంలో సందేహం లేదు.*

*పూర్వం యయాతి వంటి చక్రవర్తులు సైతం కోరికల అగ్నిజ్వాలలకు ప్రభావితులై, చివరిదశలో వాటిని వదిలేసిన కథలు పురాణేతిహాసాల్లో కనిపిస్తాయి.* 

*ఎడతెగని కోరికలు జీవితాన్ని దుర్భరంగా మారుస్తాయి. సుఖంగా బతుకు గడవడానికి సరిపోయేంతటి కోరికలు అభిలషణీయాలేకానీ, గగనకుసుమాల వంటి అసాధ్యమైన కోరికలు వాంఛనీయాలు కావు.* 

 *కోరికల చిట్టాను దేవుడికి సమర్పించే ముందు వాటిని తీర్చుకోవడానికి మనిషి తన ప్రయత్నాన్ని ఎంత చిత్తశుద్ధితో ఆచరించాడో తెలుసుకోవాలి. ప్రయత్నించే మనిషికే దేవుడి సహాయం లభిస్తుందని నీతికారులంటారు. కనుక మనిషి భగవంతుడి ముందు కోరికల జాబితాను సమర్పించిన తరవాత, తాను ఆ కోరికల సాధనకు తగిన కృషి చేయాలనే విషయాన్ని మరువరాదు.*
✍️
.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
                       🌷🙏🌷

   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
                     ➖▪️➖
ఇలాటి మంచి విషయాలకోసం…
*“భగవంతుని విషయాలు గ్రూప్“* లోచేర్చమని ఈక్రింది నెంబరుకి వాట్సప్ మెసేజ్ పెట్టండి...944065 2774.
లింక్ పంపుతాము.🙏

నేటి అమెరికా…?

 0602.     2-5. 140223-4.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*నాటి…పాతాళమే…*

               *నేటి అమెరికా…?*
                 ➖➖➖✍️


*కపిల మహర్షి పేరు మీదే కపిలారణ్యం ! అదే నేటి కాలిఫోర్నియా!*   

*పాతాళం అంటే నేటి అమెరికా అని దయానంద సరస్వతీ వంటి అనేక మంది పండితుల అభిప్రాయం.* 

*భూగోళంలో భారతదేశానికి సరిగ్గా అవతల వైపున అమెరికా ఖండం ఉంది. భారత దేశంలో నిల్చున్నవారి పాదాల క్రింద ఉన్నది కావున దానికి పాతాళంగా వ్యవహరించారు.*

*సగర చక్రవర్తి పుత్రులు 60,000 మంది అశ్వమేధ యాగం కోసం విడువబడిన అశ్వం కోసం భూమిని వజ్రం వంటి తమ గోర్లతో చీల్చి పాతాళానికి చేరుకుంటారు. అక్కడ ధ్యానంలో ఉన్న కపిల మహర్షిని చూసి, ఆయనే దొంగిలించాడని ఆయన మీద దాడి చేయడానికి వెళ్ళగా, ఆయన వారిని భస్మం చేస్తారు.*

*ఆ కపిల మహర్షి తపస్సు చేసుకున్న ఆ ప్రదేశం ఆయన పేరున కపిలారణ్యంగా ప్రసిద్ధికెక్కిందని, అదే ఈనాటి కాలిఫోర్నియా (శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ మహాస్వామి వారు 1935 లో ఒక ఉప న్యాసంలో చెప్పారు.)
కాలిఫోర్నియకు దగ్గరలో ఉన్న ఆష్‌ల్యాండ్ (Ashland)
(సగర పుత్రులు బూడిద కుప్పలు గా
మారిన ప్రదేశం) మరియు హార్స్‌ల్యాండ్ (Horse land) (యాగాశ్వం కట్టిన ప్రదేశం) అనే ప్రదేశాలకు సరిగ్గా వ్యతిరేక దిశలో గంగా నది ఉద్భవించిన గంగోత్రి హిమానీ నదం (Gangotri Glacier) ఉంది, ఈ రెండు ప్రదేశాలు కూడా సరళ రేఖలో 30 డిగ్రీల అక్షాంశం (Latitude) మీద ఉన్నాయి.* 

*వామనుడు బలిచక్రవర్తిని పాతాళానికి తోలి, ఆయన నివాసం కోసం ఇచ్చిన ప్రదేశం కూడా కాలిఫోర్నియనే దీని పురాతన నామం మహాబలి భూమి, ఇప్పుడది మలిపు (Malipu) అనే పేరుగా రూపాంతరం చెందింది. ఈ మలిపునగరానికి దగ్గరలోనే శాంటా మోనికా పర్వతం ఉంది. దీనికి లాస్ ఏంజిల్స్ చాలా దగ్గరి ప్రదేశం.*

*బలిచక్రవర్తిని శ్రీ మహా విష్ణువు పాతాళానికి అధిపతి గా నియమించాడు. తన రాజ్యంలో సుఖసంపదలు ఉండాలని బలి వరం కోరుకున్నాడు. అందుకే ఈనాడు అమెరికా అంత సంపదతో తులతూగుతోంది.*

*పాతాళ లోకం భారతదేశ పాదాల క్రింద ఉంది, అక్కడికి వెళ్ళాలంటే 70,000 యోజనాలు లోతుగా భూమిలోకి వెళ్ళాలి.*
*భారతదేశం నుంచి భూమిలోకి నిలువు (Vertical) గా సొరంగం త్రవ్వితే మనం మళ్ళీ అమెరికా ఖండానికే చేరుకుంటాము.* 

రాముడి ఆజ్ఞ మీద హనుమంతులవారి పుత్రుడైన మకరధ్వజుని పాతాళానికి అధిపతిని చేస్తాడు. ఇప్పటికీ మకరధ్వజుల వారిని మధ్య అమెరికా, దక్షిణ అమెరికాల్లో పూజిస్తారు. మధ్య అమెరికా, హోండురస్‌ (Honduras)లో ఉన్న La Ciudad Blanca [la sjuˈðad ˈblɑnkɑ] నగరాన్ని Lost City of the Monkey God‘ గా వ్యవహరిస్తారు.*

*అక్కడి స్థానికులు కోతి ఆకారం కలిగిన భారీ మూర్తులను ఆరాధించేవారు. దాని ముందు స్థానిక జాతులు బలులు కూడా అర్పించేవారు (Theodore Morde అనే అమెరికెన్ సాహసికుడు 1939 లో వెళ్ళడించారు.)*

*“సురాసురాణం అన్యోన్యం దివా రాత్రా విపర్యాయ"*
*అనగా సూర్య సిద్ధాంతం ప్రకారం సురాసురులకు ఒకరికి రాత్రయితే మరొకరికి పగలు.*

*భూమినుండి 50,000 యోజనాల దూరంలో పాతాళం ఉన్నది. ఇప్పటికీ అమెరికాలో సంకల్పం చెప్పుకున్నప్పుడు కపిలారణ్యే అని చదువుకుంటాం.* 

*మన భూగోళ అడ్డకొలత (diameter) ఇప్పుడు మనం లెక్క వేస్తే సరిగ్గా లెక్క సరిపోతుంది. అమెరికాలో వెలుగు చూసిన ఎన్నో పురాతన శివాలయాలు, నారసింహ చిత్తరువులు, Oregonలో ఒక పెద్ద సరస్సులో ప్రపంచంలో అతి పెద్ద శ్రీయంత్రం బయలు పడడం ఇవన్నీకూడా మన వాంగ్మయంలో చెబుతున్న చరిత్రకు ఆధారాలు చూపుతున్నవే.*

*మూల అమెరికాయులు (రెడ్ ఇండియన్లు) విగ్రహారాధన చేస్తారు. ఇప్పటికీ హిస్టారికల్ మాన్యుమెంట్స్ అని వారు పూజించిన విగ్రహాలు చూపుతారు.*

*మహాభారత యుద్ధానంతరం ధర్మరాజు మునిమనవడు అయిన జనమేజయ మహారాజు సర్పయాగం చేస్తే దాన్ని ఆపడానికి ఆస్తీక మహర్షి వస్తాడు. అతడి అభ్యర్ధన మేరకు ఆ యాగం ఆపబడు తుంది. అక్కడ మిగిలిన నాగులను వారి వంశస్థులను తీసుకుని ఆస్తీక మహర్షి పాతాళానికి వెళ్ళిపోతాడు. ఇది ఎంత సత్యమో నేడు మెక్షికన్లను అజ్తెక్స్ (ఆస్తీకులు) అని పిలవడాన్ని బట్టి తెలుస్తుంది.*

*Azteks నేటికి కూడా మనలాగే విగ్రహారాధన చేస్తారు. మన ధర్మంలో ఒకప్పుడు విలసిల్లిన వామాచార ఛాయలు ఎన్నో కనబడతాయి. వారు కూడా కొన్ని పూజలు చేస్తారు. ఒక్టావియా పాజ్ అనే నోబెల్ గ్రహీత, ఒకప్పటి భారతదేశంలో మెక్సికన్ రాయబారి తన పుస్తకం The light of India లో విపులంగా చర్చించాడు. aztec మరియు మాయ సంస్కృతులు వాటికి హిందూ సంస్కృతికి ఎంత దగ్గర సంబంధం ఉన్నదో చెబుతాడు.*

*వారు మరింత వామాచార పద్ధతులలో జంతుబలులు కూడా చేసేవారు. వారి పుస్తకాలలో మన ఆస్తీక మహర్షి వృత్తాంతం ఉన్నది. వారి మాయన్ క్యాలెండర్ కూడా 3114BC నుండి మొదలు అవుతుంది. ఇంచుమించు మనం మహాభారత యుద్ధానంతరం సమయం సరిగ్గా సరి పోతుంది.*

*వారి సృష్టి సిద్ధాంతం కూడా మన సిద్ధాంతంతో పూర్తిగా ఏకీభవిస్తుంది. వారి వేదాన్ని పూపుల్ వుహ్ అంటారు. వారి పండగలు కూడా మన దసరా, దీపావళి, ఉగాది, చక్రపూజ మన సంస్కృతిలాగే అనిపిస్తాయి. వారుకూడా అగ్ని సాక్షిగా పెళ్లి చేసుకుంటారు. వారికి కూడా చాతుర్వర్ణ వ్యవస్థ వున్నది. వీటి అన్నింటి ఆధారంగా మరిన్ని పరిశోధన జరిగి మన వాంగ్మయ సత్యాలను ప్రపంచానికి తెలియ చెయ్య వలసిన అవసరం ఉన్నది.*✍️
.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
                       🌷🙏🌷

   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
                     ➖▪️➖

దాన మహిమ: బలి చక్రవర్తి గతజన్మ వృత్తాంతం:

 1210.  1-4.     130223-5.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀


                 *దాన మహిమ:*
                 ➖➖➖✍️

*దానం చెయ్యాలని మనలో ఏ కొద్ది మందికో ఉంటుంది. చాలా మందికి దానం చెయ్యడం వల్ల వచ్చే ఫలితం తెలియక దానధర్మాలు చేయకుండా జీవితం సాగిస్తుంటారు.* 

*మన వాంగ్మయ సర్వస్వం….               చేసిన ధర్మం వల్లే మనకు కామితార్ధాలు అన్నీ సమకూరతాయని తెలియజేస్తోంది.* 

*ఈ విషయాన్ని తెలుసుకొన్న ఒక వ్యక్తి జీవితం ఎంతగా మారిపోయిందో తెలిపే కధే ఇది….*

*బలి చక్రవర్తి గతజన్మ వృత్తాంతం:*

*బలి చక్రవర్తి గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ఆయన సాక్షాత్ శ్రీమహావిష్ణువుకే మూడు అడుగుల భూమిని దానం చేసిన మహనీయుడిగా, గొప్ప దాతగా చరిత్రలో నిలిచిపోయాడు.* 

*అతనికి అంతటి గొప్ప అవకాశం రావటానికి కారణం తను గతజన్మలో చేసుకొన్న పుణ్యమే.*

*బలి గతజన్మలో ఒక దరిదృడు. అతను నాస్తికంగా ఉంటూ వేదపండితులనూ దేవతలనూ నిత్యం దూషిస్తూ తిరుగుతుండేవాడు.* 

*అతను దరిదృడే ఐనా వేశ్య లోలుడు. ఒక సారి వేశ్యా సంగమానికి సిద్ధమై ఎలాగో తను సంపాదించిన తాంబూలం, సుగంధ ద్రవ్యాలూ,                     శ్రీ చందనం, కర్పూరం, మల్లె పూలూ ఇత్యాది  భోగవస్తువులను ఒక సంచీలో పెట్టుకొని వేశ్యావాటిక కి బయల్దేరాడు. *

*మార్గమధ్యంలో కాలుజారి నేలమీద పడ్డాడు. అలా పడేటప్పుడు తన తలకి బలంగా గాయమయ్యి మూర్చపోయాడు.* 

*ఆ సమయంలో తనకి విచిత్రమైన ఒక ఊహ కలిగింది. తన దగ్గరున్న ఈ పరిమళద్రవ్యాలన్నీ శివుడికి నివేదనచేస్తున్నట్టు. ఆ ఊహలో ఉండగానే తను ప్రాణాలు విడిచాడు.* 

*తన దగరున్న సర్వస్వాన్నీ భగవంతుడికి నివేదించినందుకు గానూ ఆ పరమేశ్వరుడి దయవల్ల అతనికి గొప్ప పుణ్యఫలం లభించింది.*

*మరణించిన తనను యమభటులు నరకానికి తీసుకుపోయారు. అక్కడ యముడు అతని పాపపుణ్యాలని విచారించగా అతనికి చేసిన పాపాలకి గానూ ఘోరమైన నరక శిక్షలు విధించాల్సి ఉందని చిత్రగుప్తుడు చెప్పాడు.*

*కానీ అతను చివరలో తనయావత్తూ…                ఆ పరమేశ్వరుడికి నివేదిస్తున్నట్టు భావించినందుకు మూడు ఘడియలపాటూ ఇంద్ర పదవిని చేపట్టాల్సి ఉందంది అలా మూడు ఘడియలూ పూర్తయ్యాకా అతనిని నరకంలో శిక్షించవచ్చని చెప్పాడు.* 

*ఇదంతా విన్న ఆ పాపికి తను ఇన్నాళ్ళూ చేసినపనులెంత ఘోరమైనవో తెలిసింది.* 

*జన్మ చివరలో దేవుడికే అన్నీ దానం చేస్తున్నా అని అనుకోగానే ఇంత ఫలితం వచ్చింది, అలాంటిది తను నిజంగానే దానం చేస్తే ఎంత బాగుంటుందీ ? అనిపించింది. * 

*ఇంతలో ఇంద్రుడు, ఇంద్రగణాలు, అప్సరాగణాలూ మొత్తం అక్కడికి వచ్చి ఆ వేశ్యాలోలుడిని ఐరావతం మీద ఎక్కించుకొని సకల లాంచనాలతో సాదరంగా స్వర్గానికి తోడ్కొని వెళ్ళారు.* 

*తను ఇంద్ర సింహాసనమ్మీద కూర్చొన్న వెంఠనే అగస్త్యుడికి ఐరావతాన్నీ, విశ్వామిత్రుడికి ఉచ్చైశ్రవాన్నీ, వశిష్టుడికి కామధేనువునూ, గాలవుడికి చింతామణినీ, కౌండిణ్యుడికి కల్పతరువునూ ఇలా ఇంద్రలోకంలోని గొప్ప గొప్ప మహర్షులకి విలువైన సంపదనంతా దానం చేసేసాడు.* 

*వారంతా ఎంతగానో సంతోషించి అతన్ని ఆశీర్వదించారు.*

*మూడు ఘడియల కాలం ఐపోయిన వెంఠనే ఇంద్రుడు అక్కడకి వచ్చాడు. ఐరావతం మొదలు పారిజాత వృక్షం వరకూ అన్నిటినీ ఆ వేశ్యాలోలుడు దానం చెయ్యడం తెలుసుకొని కోపగించుకొన్నాడు. ఇంతలో యముడూ అక్కడికి వచ్చాడు ఆ పాపిని మళ్ళీ నరకానికి వెళ్ళడానికి సిద్ధంకమ్మన్నాడు.* 

*ఐతే మరలా చిత్రగుప్తుడు అడ్డుచెప్పి అతను ఈ మూడు ఘడియలకాలంలో చేసిన పుణ్య ఫలితంవల్ల తను ఇక మీదట నరకానికి రానవసరం లేదనీ, మరు జన్మలో మహా చక్రవర్తిగా భూమి మీద జన్మిస్తాడనీ చెప్పాడు.* 

*తను మునుపు చేసిన చెడ్డ పనులకి గానూ అసుర వంశానికి రాజౌతాడని చెప్పాడు.*

*ఆ దాన ఫలితంగనే బలి చక్రవర్తిగా అవతరించి సాక్షాత్ శ్రీ మహా విష్ణువుకే మూడు అడుగుల రూపేణా మూడు లోకాలను దానం చేసిన పుణ్యాన్ని పొందాడు. చిరంజీవిగా పాతాళానికి రాజై నిలిచిపోయాడు...*✍️

.                      🌷🙏🌷

   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

శ్రీ మహాభారతంలో చిన్ని కథలు: #గాంధారి భీముని నిందించుట:

 120223c.          130223-3.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀269.

                శ్రీ మహాభారతం 
                 ➖➖➖✍️
                   269 వ భాగం
    శ్రీ మహాభారతంలో చిన్ని కథలు:

 #గాంధారి భీముని నిందించుట:

“కృష్ణా! ఆ భీముడు నాడు కుఱుసభలో ఎన్ని మాటలన్నా ఎంత అవమానించినా సహించాడు భరించాడు.   సమయం కొరకు పగబట్టిన త్రాచు పాములా కాచుకుని ఉన్నాడు.  యుద్ధంలో అవకాశం రాగానే నా కుమారులందరినీ తన గధతో మోది చంపాడు. పగతీర్చుకోవడం న్యాయమే,  ఇలా గుండెలు చీల్చడం న్యాయమా! మహా వీరుడైన భీముడికి ఇది తగునా! ఇందు వలన భీముడికి కీర్తి కలుగుతుందా? చూడవయ్యా కృష్ణా !  నా కొడుకు దుశ్శాసనుడు ఎలా ఉన్నాడో చూడు. చెల్లాచెదురైన అవయవములను చూడు. సింహం గోళ్ళతో చీల్చినట్లు   ఆ భీముడు నా కుమారుడి గుండెలు ఎలా చీల్చాడో చూడు. కనిపెంచిన కొడుకు శరీరం ఇలాంటి స్థితిలో చూసిన తల్లి మనస్సు కుమిలి పోకుండా ఎలా ఉంటుంది కృష్ణా !”


#గాంధారి వికర్ణుడి కొరకు దుఃఖించుట:

“అయ్యో ! వికర్ణుడు ఇక్కడున్నాడు చూడవయ్యా ! ఆ ఏనుగుల కళేబరాల మధ్య వికర్ణుడి భార్య నా కోడలు గుండెలు అవిసేలా ఎలా రోదిస్తుందో చూసావా కృష్ణా ! వికర్ణుడి శరీరం మీద పొడుచుకు తినడానికి వాలు తున్న గద్దలను రాబందులను తోలుతూ భర్త శరీరం మీద పడి రోదిస్తోంది చూడవయ్యా ! కృష్ణా ! ఇలాంటి స్థితిలో కొడుకులను, కోడళ్ళను చూసే ధౌర్భాగ్యురాలిని ఎక్కడైనా చూసావా ! ఎలాంటి వీరుడినైనా అవలీలగా ఎదుర్కునే దుర్ముఖుడు. అలాంటి వీరుడు భీముడి గధాఘాతానికి ఎలా బలి అయ్యాడో చూసావా ! నా కొడుకు శూరసేనుడిని చూసావా ! అతడి భార్యలను చూడు భర్త శవం చుట్టూ చేరి ఎలా రోదిస్తున్నారో చూడయ్యా! కాకులూ గద్దలూ పొడుచుకు తిన్న అతడి శరీరం గుర్తించ వీలు కావడం లేదయ్యా ! కృష్ణా ! నా కుమారుడిని వివిశంతిని చూసావా ! వీడికి సంగీతం అంటే ప్రాణం. ఎప్పుడూ సంగీత విద్వాంశులైన స్త్రీలు సంసేవిస్తుండగా గానామృతంలో తేలియాడే వివిశంతి ఇప్పుడు నక్కల ఊళలు వింటున్నాడు.” అని పరిపరి విధముల కుమారుల మరణానికి గాంధారి విలపిస్తోంది.


#గాంధారి అభిమన్యుని కొరకు విలపించుట:

కుమారుల కొరకు విలపిస్తున్న గాంధారి అభిమన్యుడి మృతదేహాన్ని చూడగానే భావోద్వేగానికి లోనయ్యింది. ఆమె మనసు బాధతో "కృష్ణా ! వాడేనయ్యా అభిమన్యుడు శత్రు దుర్భేద్యమైన పద్మవ్యూహమును ఛేదించి అరి వీర భయంకరుడైన సుయోధనుడిని ఎదిరించిన మహావీరుడు అభిమన్యుడు. చివరకు ద్రోణ, కర్ణ, అశ్వత్థామ, శల్య, కృపాది యోధాను యోధులందరూ అతడిని చుట్టు ముట్టి కడతేర్చారయ్యా ! చావు కళ ఇసుమంతైనా లేక నిద్రిపోతున్నట్లున్న సుభద్రాపుత్రుడి ముఖం చూడవయ్యా ! అందుకే ఉత్తర అతడి ముఖం మీద ముఖం పెట్టి నిద్రలేవమని భర్తను ప్రార్థిస్తుందయ్యా ! అభిమన్యుడిని అల్లంత దూరంలో చూడగానే పారి పోయే ఆ సుకుమారి… ఇప్పుడు పది మంది ముందు భర్త శరీరాన్ని కౌగలించుకుని నెత్తీ నోరూ బాదుకుంటూ రోదిస్తుందయ్యా ! ఉత్తర ఏమని ఏడుస్తుందో వినవయ్యా ! "ఓ అభిమన్య కుమారా ! మీ అమ్మ సుభద్ర, మీ నాన్న అర్జునుడు ఎదురు చూస్తున్నారు వారిని వదిలి ఎక్కడకు వెళ్ళావు? నీ మేనమామ కృష్ణుడు వచ్చాడు లేవవయ్యా! ఇన్ని మాట్లాడుతున్నా ఒక్క మాటైనా మారు పలుకవేమి ఆర్యపుత్రా ! అయ్యో దైవమా! గురువుగారు ద్రోణుడు, కృపాచార్యుడు, అంగరాజు కర్ణుడు, గురుపుత్రుడు అశ్వత్థామ న్యాయం ధర్మం తెలిసిన ధర్మాత్ములు ఒంటరి వాడివైన నిన్ను ఒక్కసారిగా దాడి చేసి చుట్టిముట్టి తుద ముట్టించడం న్యాయమా ! ధర్మమా ! వారిదీ మగతనమేనా ! ఇంతటి నీచ కార్యానికి పాల్పడుటకు వారికి మనసెలా ఒప్పిందో ! తాను లేని సమయాన ఆ దుర్మార్గులు నిన్నిలా అధర్మమంగా వధించినందుకు నీ తండ్రి అర్జునుడి మనసెంత రగిలి పోయిందో ! నీ మరణం కలిగించిన దుఃఖం శత్రురాజులను జయించి రాజ్యలక్ష్మిని కైవంశం చేసుకున్నా ఉపశమించ లేదు కదా ! నన్ను విడిచి స్వర్గానికి వెళ్ళి అక్కడి అప్సరసలతో సుఖించడానికి నీకు మసెలా ఒప్పింది" అంటన్న ఉత్తరను చూడు కృష్ణా ! ఇంత చిన్న వయసులో భర్తృవియోగం ఉత్తర ఎలా సహించగలదు. మహావీరుడైన ఉత్తర తండ్రి విరాటుడు ఆయన పక్కన చేరి సుధేష్ణ ఎలా రోదిస్తుందో చూడవయ్యా ! ఆ పక్కన ఆమె కుమారుడు ఉత్తర కుమారుడు పడి ఉన్నాడు. ఆ అభాగ్యురాలు మరణించిన భర్త కోసం ఏడుస్తుందా చచ్చిన కుమారుడి కొరకు విలపింస్తుందా ! చెప్పవయ్యా కృష్ణయ్యా !”


#గాంధారి కర్ణుడి కొరకు దుఃఖించుట:

“కృష్ణా! అదుగో చూడు కర్ణుడి కళేబరం వద్ద అతడి భార్యలు ఎలా రోదిస్తున్నారో చూడవయ్యా ! ఈ కర్ణుడిని నమ్ముకునే నా కుమారుడు ఈ ఘోర యుద్ధానికి శ్రీకారం చుట్టి తుదకు దుర్మరణం పాలైంది. అటు చూడవయ్యా ! కర్ణుడి ధర్మపత్ని వృషసేనుడి తల్లి అటు భర్త మరణానికి ఇటు కుమారుడి మరణానికి ఎలా విలపిస్తుందో చూడవయ్యా ! ఆమె రోదన వినవయ్యా ! ‘నాధా ! పరశురాముని శాపం, బ్రాహ్మణుడి శాపం, అర్జునుడి బాణాలు నిన్ను బలిగొన్నాయా !’ అంటూ విలపిస్తుందయ్యా ! అడుగో మహావీరుడు బాహ్లికుడు, చచ్చినట్లు ఉన్నాడా ! గాఢ నిద్రలో ఉన్నట్లు ఉన్నాడయ్యా ! కృష్ణా !”


#గాంధారి సైంధవుడి కొరకు దుఃఖించుట:

“కృష్ణా ! అటు చూడు నా అల్లుడు దుస్సల భర్త జయద్రధుడు. అర్జునుడు చేసిన ప్రతిజ్ఞకు బలి అయిన అభాగ్యుడు. నాడు అరణ్యమున ద్రౌపదిని కామించిన నాడే సగం చచ్చాడు. కాని ఆ నాడు పాండవులు చెల్లెలి భర్త అని వదిలారు. ఈ నాడు చెల్లెలి భర్త అన్న కనికరం మాని చంపారు కదయ్యా ! పాపం దుస్సల 
భర్త శిరస్సు కొరకు వెదుక్కుంటోందయ్యా ! కుమార్తెను ఇలాంటి దుస్థితిలో చూడడం కంటే దురదృష్టం తల్లికి మరేమి కలదో చెప్పవయ్యా ! కృష్ణా ! నీకు తెలుసో లేదో అర్జునుడు ప్రతిజ్ఞ గురించి విన్న దుస్సల భర్తకు ఎంతగా నచ్చచెప్పిందో" అర్జునుడికి ఈ ముల్లోకాలలో తిరుగు లేదు. నా మాట విని ధర్మరాజును శరణు వేడిన అతడు నిన్ను తప్పక కాపాడగలడు" అని పరి పరి విధముల వేడుకున్నా! సైంధవుడు వినక తన మరణమును తానే కొని తెచ్చుకున్నాడు. "ఏ శుభకార్యానికి వెళ్ళ లేకుండా చేసారని దుస్సల ఎంతగా పాండవులను నిందిస్తుందో వినవయ్యా ! కృష్ణా ! అయినా సైంధవుడు చేసిన అపరాధం ఏమిటి ? యుద్ధధర్మం ప్రకారం భీమ, నకుల, సహదేవ, ధర్మరాజు లను అభిమన్యుడికి సహకరించకుండా ఆపాడు. అయినా, బాలుడైన అభిమన్యుడు యోధానుయోధులైన భీష్మ, ద్రోణ, కర్ణ, అశ్వత్థామ, శల్యులను ఒంటరిగా ఎదుర్కోవడం అతడి దసుస్సాహసం కాదా! అతడి తొందరపాటే అతడి మరణానికి కారణమైంది. చంపిన వారిని వదిలి అడ్డగించిన సైంధవుడిని చంపుట న్యాయమా! ధర్మమా? అర్జునుడికే అది తెలియాలి. కృష్ణా ! మహావీరుడైన శల్యుడు ధర్మనిరతిలో ధర్మరాజుతో సమానుడు. అటువంటి వాడు దుర్యోధన పక్షం చేరి కర్ణుడికి సారథ్యం వహించి అతడిని సూటి పోటీ మాటలతో వేధించి అతడి ధైర్యాన్ని నీరుకార్చి అతడి మరణానికి ఒక కారణమయ్యాడే ! అలాంటి శల్యుడూ మరణించక మానలేదు. శల్యుని చుట్టూ చేరి అతడి బంధువులు ఎలా విలపిస్తున్నారో చూడవయ్యా ! కృష్ణా ! మహేంద్రుడిని కూడా గెలువగలిగిన భగదత్తుడిని చూడు. అర్జునుడి మీద ప్రేమతో ఇతడిని దారుణంగా చంపింది నువ్వే కదా!


#గాంధారి భీష్మ ద్రోణుల కొరకు రోదించుట:

“అడుగో కోరి మరణం కొని తెచ్చుకున్న భీష్ముడు శరతల్పం మీద ఎలా పడుకుని ఉన్నాడో చూసావా ! అతడు అలా మరణాన్ని కోరి ఉండక ఉన్న   అతడిని జయించడం మానవమాతృల తరమా ! కృష్ణా ! అతడికి నిజమైన శిష్యుడు అర్జునుడు. అతడిని శరతల్పం మీద పరండజేసి అతడికి పాతాళ గంగ తీసుకు వచ్చి దాహార్తి తీర్చిన మహా వీరుడు అర్జునుడే కదా!   సూర్యుడే భూమి మీదకు దిగి వచ్చి శరతల్పం మీద విశ్రమించినట్లు ఉంది. అలాంటి భీష్ముడు మరణిస్తే కుఱు కుమారులకు దిశా నిర్ధేశం చేయగల సమర్ధుడెవ్వడు. ఇంద్రుడితో సమానమైన ద్రోణుడు వేదవేదాంగపారతుడు. ధనుర్వేదం ఔపాశన పట్టాడు. ఎందరో రాకుమారులకు విద్యనేర్పిన వాడు. నేడు దిక్కులేకుండా పడి ఉన్నాడు. విధి ఎంత క్రూరమైంది కృష్ణా ! భీష్మ, ద్రోణులను నమ్ముకునే నా కుమారుడు యుద్ధానికి సిద్ధమయ్యాడు. అయినా అతడి తలను ద్రుపదపుత్రుడు దృష్టద్యుమ్నుడు దారుణంగా నరికాడు. ఇది ఎలా సంభవించింది. ద్రోణుడి భార్య భర్తశవం పక్కన కూర్చుని ఎలా రోదిస్తుందో చూడు. ద్రోణుడి శిష్యులు అతడిని దహించడానికి కట్టెలు దొరకక అమ్ములు విల్లులు పోగు చేసి చితి పేరుస్తున్నారు చూడు. కృపి మొదలైన వారు ద్రోణుడికి అపసవ్యంగా ప్రదక్షిణ చేసి స్నానం చెయ్యడానికి వెళుతున్నారయ్యా !


#గాంధారి అర్జున సాత్యకులను నిందించుట:

“కృష్ణా ! సాత్యకి అమానుషంగా తల నరికిన భూరిశ్రవసుడిని చూడు. అతడి శరీరాన్ని నక్కలు గద్దలు ఎలా పీక్కు తింటున్నాయో చూడు. ఆ భూరిశ్రవసుడి పక్కన అతడి తల్లి, కుమారులు, భార్య ఎలా రోదిస్తున్నారో చూడు. కృష్ణా ! అర్జునుడు భూరిశ్రవసుడి భుజము నరికాడు. సాత్యకి తల నరికాడు. అయినా ! కృష్ణా ! మహావీరులైన అర్జునుడు, సాత్యకి మీద ప్రేమతో ఇలా చేసి ఉంటాడంటావా ! సాధువు మంచి వాడు అయిన భూరిశ్రవసువును చంపినందువలన అర్జునుడికి ఏమి ఒరిగింది కృష్ణా ! సాత్యకి సాధించినది ఏమిటి అపకీర్తి మూటకట్టుకోవడం తప్ప. కృష్ణా ! ఇదంతా నీ కళ్ళ ముందే జరిగింది. భూరిశ్రవసుడు సాత్యకితో యుద్ధం చేస్తున్నప్పుడు అర్జునుడు సిగ్గుమాలి అతడి చేయి నరకవచ్చునా ! అర్జునుడు చేసిన పని నీవు హర్షిస్తావా ! కృష్ణా !" అని పరిపరి విధముల విలపించసాగింది గాంధారి.


#గాంధారి శకునిని నిందించుట:

కృష్ణుడు ఒక్క మాట కూడా మాటాడ కుండా గాంధారి ని అనుసరిస్తున్నాడు. ఇంతలో గాంధారికి శకుని కళేబరం కనిపించింది. అది చూడగానే ఆమె ముఖం కోపంతో జేవురించింది. గాంధారి "కృష్ణా ! తన మేనల్లుడు నకులుని చేతిలో చచ్చిన నా తమ్ముడు శకునిని చూసావా ! వీడొక మాయావి.  వీడి మాయలు నీ ముందు పని చేయలేదు. నాడు మాయా జూదంలో ధర్మరాజును అడవులకు పంపాడు. ఇప్పుడు యుద్ధమనే జూదంలో తన ప్రాణాలు ఒడ్డి ఓడిపోయాడు. కుఱు పాండవులకు మధ్య శత్రుత్వానికి ముఖ్య కారకుడు ఇతడే కృష్ణా ! మేలు చేస్తున్నానని నమ్మించి నాకుమారుని నట్టేట ముంచాడు. వీడు మాత్రం బాగుపడింది ఏముంది. పుత్ర పౌత్రులతో నాశనం అయ్యాడు. అసలు నాకొడుకులకు బుద్ధి అనేది ఉంటే మాయావి అయిన వీడి మాటలు నమ్ముతారా ! అందుకు తగిన ఫలితం అనుభవించారు.


#గాంధారి మిగిలిన వారి కొరకు రోదించుట:

“కృష్ణా ! అదుగో కళింగ దేశాధిపతి, ఇదుగో మగధ దేశాధిపతి, ఇతడు కోసల దేశాధిపతి బృహద్బలుడు. తమ తమ రాజ్యాలలో సకల భోగములను అనుభవించిన వారు నేడు దిక్కులేకుండా పడి ఉన్నారు. వారి చుట్టూ చేరి వారి భార్యా బిడ్డలు ఎలా రోదిస్తున్నారో చూడవయ్యా ! ఇలాంటి రోదనలు ఎక్కడైనా విన్నామా కృష్ణా ! ఇరుగో కేకయ రాజులు. ద్రోణాచార్యుని చేతిలో హతులైనట్లున్నారు. అడుగో పాంచాల రాజు ద్రుపదుడు.  తన సహాద్యాయి ద్రోణుడి చేతిలో హతుడైనాడు. చిత్రం చూసావా! అతడి శ్వేత చ్ఛత్రం ఇంకా అతడి మీద ఎండ పడకుండా నిలిచి ఉంది. అటు చూడవయ్యా ! కృష్ణా ! ఆ మహారాజుల భార్యలు, కొడుకులూ వారికి దహనక్రియలు గావించి మైల స్నానాలు చేయడానికి వెళుతున్నారు. ఇంకా కొంత మంది మమకారం వీడక వారి తలలను ఒడిలో పెట్టుకుని రోదిస్తున్నారు. కృష్ణా ! ఇతడిని గుర్తు పట్టావా ! వీడే నీ మేనత్త కొడుకు శిశుపాలుని కుమారుడు దుష్టకేతువు'. అతడి కుమారుడు సుకేతుడు. తండ్రి కొడుకులిద్దరూ మరణించారయ్యా ! తండ్రి కొడుకుల మరణానికి వారి భార్యలు తల్లులు బంధువులు ఎలా రోదిస్తున్నారో చూడవయ్యా ! కృష్ణా ! అవంతీ పాలకులు విందానువిందులను చూడు. పెను గాలికి కూలిన వృక్షములవలె ఎలా కూలి పోయారో చూడు. ఇదంతా చూస్తుంటే నాకు ఒక సందేహం కలుగుతుంది కృష్ణా !✍️
.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
                       🌷🙏🌷

   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
                     ➖▪️➖

ఒక్క నిముషం కోపంతో రగిలి పోతున్నారా?

 2503.      2-1.   130223-1.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀541.
నేటి…

                *ఆచార్య సద్బోధన:*
                    ➖➖➖✍️

*ఒక్క నిముషం   కోపంతో         రగిలి పోతున్నారా?*

*అయ్యో అరవై సెకండ్ల ఆనందాన్ని పోగొట్టుకుంటున్నారండీ, మీరు.*

 *ఈ ప్రపంచంలో దివాలా తీసిన ఏకైక వ్యక్తి ఎవరంటే రోజు మొత్తం లో ఒక్క సారైనా కడుపుబ్బ నవ్వని వ్యక్తే.*

                                                                                      *మనలో నున్న మంచి భావాలు, మంచి సాంగత్యాన్నిస్తాయి.*

*మంచి సాంగత్యం మంచి పనులకు దారి తీస్తుంది.*

*సూది వెళ్ళిన వెంటే కదా దారం వెళ్ళేది. మనం  ధరించిన  వస్త్రానికి వన్నెను, విలువను తెచ్చేది.*
                                                  
*ప్రజలు నన్ను ఇష్టపడనీ, పడకపోనీ, అయినా ప్రజాభిమాన పోటీలో పాల్గొనమనికాదు కదా! దైవం నన్ను ఈ భువి పైకి పంపింది.* 

*ఒక ఉత్తమ మానవునిగా ఆయన ఇచ్చిన కర్తవ్యాలను పూర్తి చేసుకుని రమ్మని!* 
                                               
*ఈ ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదు. ఇది ముమ్మాటికీ నిజం. అందులో మనకొచ్చిన కష్టాలు కూడా వున్నాయి.*✍️
.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
                       🌷🙏🌷

   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
                     ➖▪️➖