Monday, August 5, 2024

 .   🙏శుభాభినందనలు 🙏
.           ఈ జగత్తు సత్యానికి నీడ వంటిది.సత్యమే మన *గమ్యం*.త్యాగమే దానికి మార్గం.మన జీవితాలకు ఆ *సత్యమే* మూలాధారం.స్వార్ధ భావం లేని సమయంలోనే మనం మనలోని సత్యమైన , ఆనందప్రదమైన దివ్యత్వాన్ని రుచి చూస్తున్నాము.
           సత్య దర్శనం కలగాలంటే “అహం” అంతరించాలి.మనం సత్యంలో పాదుకొని ఉన్నామనీ,ఆ సత్యమే దైవమనీ అదే మన యధార్థ తత్వమనీ ,  అది ఎప్పుడూ మనలోనే,. మనతోనే వున్నదనీ మనకు అర్ధం ఐన మరుక్షణం నుండి మనం దానిలోనే జీవిస్తాం....దానియందు సుప్రతిష్టులమౌతాము .అదే ఆనంద స్థితి....ఆత్మ్మానంద స్థితి.......
.
 . 🙏  శుభాభినందనలు 🙏
       ఈ ఆత్మ శక్తి,  విశ్వచేతన శక్తి,....వాక్చక్తి వలన కానీ వేదాధ్యయనం వల్ల కానీ లభించదు. 
.       *ఆ విశ్వచేతన శక్తి * ఆ ఆత్మ శక్తి ఎవనిపట్ల సంప్రీతం అవుతుందో ఆ మానవునికి తనను తానుగా సాక్షాత్కరించుకుంటుంది.  ఇంద్రియ నిగ్రహము, త్రికరణశుద్ధి,  సత్య సందీప్త హృదయము కలవానికి,  నిరంతర సాధన ద్వారా తనను తాను పరిశుద్ధం చేసుకునే వానికి , ఎలాంటి ఆత్మవంచనకు తావులేకుండా తనను తాను వున్నత మానవునిగా తీర్చిదిద్దుకోగలిగిన వానికి మాత్రమే ఈ ఆత్మ సాక్షాత్కరిస్తుంది.
         సర్వ భూతములలో నిగూఢమై ఉండే ఈ ఆత్మ ఇంద్రియ దృష్టికి ప్రకాశింపదు. శబ్ద, స్పర్శ,రూప,రసగంధాలకతీతమై, అవ్యయమై,నిత్యమై,అనాదియై, అనంతమై, ప్రకృతికి కూడా అతీతమై ఉండే ఆత్మను ఎవడు సాక్షాత్కరించుకుంటాడో వాడు మృత్యుంజయుడౌతాడు.కానీ ఇది ఎంత కష్టమైనదో అంత తేలికైనది  కూడా.రెండు వైపులా పదునుగల కత్తి అంచు మీద నడక అంత కష్టమైనది.సూర్యోదయాన్ని చూడాలంటే పడమరవైపు చూడకూడదు. అసమయానికి తూర్పువైపు తిరగాలి.తూర్పువైపు తిరగడం ఎంత తెలీకో అంత తేలికైనది. కనుక నడుంకట్టి ముందుకు అడుగులు వేయండి.వివేకానంద మాటలలో.......లెండి....మేల్కొనండి.....జిజ్ఞాసులు కండి.....జ్ఞానులు కండి.....గమ్యం లభించేవరకు అలుపెరగక సాగండి.ఆత్మ సామ్రాజ్య సింహాసనాభిషిక్తులు కండి.
. 🙏    శుభాకాంక్షలతో 🙏
.

****చలాచల బోధ:

 చలాచల బోధ:--
మనలో ఒక్క 'నేను' తప్ప అన్నీ మార్పు చెందేవే.అనగా శరీర ప్రాణేంద్రియాలు, మనసు, బుద్ధి అన్నీ అనిత్యం.నేను మాత్రం మారకుండా, సాక్షీభూతంగా పుట్టిన దగ్గర నుంచి మరణించేదాకా మారకుండా ఉంటున్నది.కావున ఈ 'నేను'గురించి విచారణ చేయాలి.శ్రీ రమణ మహర్షి వారు ప్రబోధించినట్లు 'నేను'ఎవరు?అని విచారణ చేసి.ఈ 'నేను' నిత్యమో..అనిత్యమో తరువాత తెలుసుకుందాము.ఇప్నటికైతే స్థూల శరీరం, ఇంద్రియాలు, మనసు, బుద్ధి అన్నీ అనిత్యము అనగా జడము లేక అనాత్మ.కాని అజ్ఞానంలో నేను అనాత్మయైన మనసుతో కూడి అసత్య నేనుగా వ్యవహారం చేస్తున్నది.ఏ విధంగా ఈ నేను వేరు,మన‌సు వేరు అని విచారణ చేసి, నిశ్చయించుకుంటారో,దానిని ఆత్మానాత్మ వివేకము అని అంటారు.ఇట్టి విచారణ ద్వారా 'నేను'ను మనసు నుండి వేరు పరచుకొనిన వాడు సకల మనోవ్యాపాలములకు సాక్షీభూతం అవుతాడు.అనగా స్థూల,సూక్ష్మ, కారణ శరీరాలకు విలక్షణమవుతాడు.జాగ్రత్స్వప్నసుషుప్తులకు సాక్షి అవుతాడు.అయితే ఈ నేనే ఆత్మ అవునో కాదో విచారణ చేయవల‌సి యున్నది.

****జీవితం-మరణం

 *🕉️🙏జీవితం-మరణం* 🕉️🙏

*🕉️🙏ఈ సృష్టిలో ప్రతీ ఒక్కరూ మరణ ద్వారం దగ్గర నిలబడి ఉన్నారన్నది కాదనలేని చేదు నిజం.🕉️🙏*

*🕉️🙏మనిషికి తానెప్పుడు చనిపోతానో తెలియనప్పుడు ప్రతీ ఘడియనూ మరణ సమయంగానే భావించాలి. 🕉️🙏*

*🕉️🙏 మనిషి వేసే ప్రతీ అడుగూ మరణానికి దగ్గర చేసేదే !*                                                                                                         *నేడు జీవితం, రేపు మరణం అన్న భావనతోనే జీవన ప్రయాణాన్ని కొనసాగించాలి.🕉️🙏*

*🕉️🙏తెలిసిన ప్రపంచం నుంచి తెలియని లోకానికి ప్రయాణమే మరణం. 🕉️🙏*          
                                                                    *🕉️🙏కానీ, మనిషి దీన్ని గుర్తించడు,* 
*మరణమనే మాటనే జీర్ణించుకోలేడు. 🕉️🙏*

*🕉️🙏ఇప్పట్లో చావు తన దరికి రాదనుకుంటాడు.*🕉️🙏

*🕉️🙏ఈ భావనే అతణ్ని మోసానికి గురిచేస్తుంటుంది. 🕉️🙏*

*🕉️🙏కానీ, నిత్యం మరణాన్ని గుర్తుంచుకున్న వారే వివేకవంతులు.🕉️🙏* 

*🕉️🙏‘చివరకు ప్రతి మనిషీ మరణిస్తాడు.*
*ఎవరికైనా మరణ సమయం ఆసన్నమైనప్పుడు వ్యవధి ఉండదు.🕉️🙏*

*🕉️🙏‘ఎవరికైనా మరణ సమయం సమీపించినప్పుడు..*
*ఆ వ్యక్తి ...*
*‘భగవాన్  నీవు నాకు మరికొంత వ్యవధి ఎందుకివ్వలేదు. 🕉️🙏*

*🕉️🙏నేను దానధర్మాలు చేసి సజ్జనులలో కలిసిపోయేవాణ్ని కదా?’*
*అని వాపోయే పరిస్థితి రాకముందే మంచిని ఆచరించండి. 🕉️🙏*

*🕉️🙏ఎవరి ఆచరణ వ్యవధి అయినా ముగిసిపోయే సమయం ఆసన్నమైనప్పుడు, దైవం అతనికి ఎంతమాత్రం అదనపు వ్యవధి ఇవ్వడు’. 🕉️🙏*

*🕉️🙏‘ఆయన అందరికీ ఒక నిర్ణీత కాలం వరకు గడువు ఇస్తాడు. 🕉️🙏*

*🕉️🙏అంత్యకాలం సమీపించినప్పుడు, ఒక్క ఘడియ కూడా వెనుకా ముందూ కాజాలదు’*
*శరీరమున్నప్పుడే చేతనైనంత మంచిని ఆచరించు,*
*సత్కర్మలలో పాల్గొను,*
*ఆర్థిక శక్తి చాలకపోతే,*
*చెవుల ద్వారా మంచిని విను,*
*కళ్ళ ద్వారా మంచిని చూడు,*
*నోటి ద్వారా మంచి పలుకు,*
*కాళ్ళను మంచి వైపుకి నడిపించు,*
*చేతులతో మంచి పనుల్లో సహకారం అందజేయు...🕉️🙏*

*🕉️🙏అందుకే !!...🕉️🙏*

*🕉️🙏శరీరం ఆద్యం ఖలు ధర్మసాధనం’’*
 *అన్నాడు*
*మహాకవి కాళిదాసు.*🕉️🙏

🕉️🙏🕉️

Sunday, August 4, 2024

****భారత దేశం పుణ్య భూమి అంటారు .!! మరి అటువంటి భారత దేశాన్ని పుణ్య భూమి గానే ఉంచుదా ము.

 కంప్లిట్ గా చదవండి ♥️

భారత దేశం పుణ్య భూమి అంటారు .!!
మరి అటువంటి భారత దేశాన్ని
పుణ్య భూమి గానే ఉంచుదా ము.

ఇది ఖచ్చితం గా చదవండి.

 మాంసాహారం మృతాహారం

జార్జి బెర్నర్డ్ షా అన్నారు,
నీ పొట్ట శ్మశానం కాదు అని.

వివరణ చూద్దాం.

శాఖాహారం  అమృతాహారం.

(1)  జంతువులు,పక్షులు,జల చరాలు, అన్ని కూడా మనలాగే నొప్పి ఉన్న ప్రాణులే.
మనకి ఎలా అయితే పెన్సెలు చెక్కి నప్పుడు వ్రేలు కోసుకుంటే వారం పది  రోజులు,(అలాగే ఇతరత్రా)
వరకు కట్టు వేస్తామూ.
అదే జంతువులని పీక           కోస్తున్నప్పుడు అది భూమిపై గిల గిల కొట్టు కుంటున్నప్పు డు అది ఎంత బాదపడు తుంది,,  
 మైడియర్  ఫ్రెండ్స్   ఒక్కసారి ఆలోచిద్దాం . మరి ఆబాద ఎవరికి చెందుతుంది.

పెంచిన వారికి,అమ్మే వారికి,కొన్న వారికి,వండే వారికి,తిన్న వారికి . చేరి ఇంట్లో,వొంట్లో కస్టాలు.

2  ఈ మాంసము తినడం ఎక్క డ నుండి మానవుడి కి             వచ్చింది అంటే,
ఆది మానవుడు నుండివచ్చింది.                        ఆది  మానవుడు ఎలా ఉండేవాడో అందరికి తెలుసు,జంతువు లాగే ఉండేవాడు.
మరి ఈనాడు  అన్నీ అలవాట్లు మార్చుకుని జీవిస్తున్నాడు.
మరి జంతువుల తిండి ఎందుకు మారలేదు.

3   మన పురాణాలు లో ప్రతి భగవంతుడి వెనుక ఒక జంతువు లేక పక్షి ఉంటుంది.
అంటే భగవంతుడు జంతువు లో కుడా ఉన్నాడు ,మమ్మల్ని పూజించి నట్లే వాటిని కుడా పూజించండి అని.

మరి మన వాళ్లు దేవుడి తో పాటు వాటిని పూజిస్తారు,మళ్లి
వాటిని చంపి తింటారు.
ఎందుకు.   !!  
                  
అలాగే
దశావతారం లో భగ వంతుడు నేనే  ఆ అవతారాల్లో ఉన్నాను అని చూపించేడు.

4  మాంసం తిన్న  జంతువు క్రూరత్వం తో ఉంటుంది. వాటి  దగ్గరకు మచ్చిక అయితేనే వెళ్ల గలం.
ఉదా; పిల్లి,కుక్క,నక్క,పులి,సింహం.

అదే ఆవు,మేక,గొర్రె,ఏ నుగు,ఇంకా ఎన్నో వీటి దగ్గరకు మనం వెళ్లగలము.

  ఇంకా అంటారు మాంసం బలమని
మరి పై జంతువులన్నిటి కి బలము ఎలా వచ్చింది.!!

అలాగే మాంసం తిన్న జంతువుల కి కోరలు , గోళ్ళూఉంటాయి.

ఆవులు  మిగతా వాటికి దంతాలు ,గిట్టలు ఉంటాయి.
మరి మన పళ్ళు,గోళ్ళూ  ఎలా ఉన్నాయి.

అలాగే
మనిషి బ్రతకడం కోసం ఆహారం కావాలి కాని మాంసం అవసరం లేదు,

నాలుక మీద ఒక్క క్షణం ఉండే రుచి కోసం ప్రాణం తీయడం అవసరమా.

ఈ రోజు ఎన్నో రకాలయిన veg లు దొరుకు తున్నాయి.
పన్నీరు,మష్రూమ్,మీల్ మేకర్
బేబీ కార్న్, ఇతరత్రా. 

అలాగే ఇంకో ఆసక్తి కరవిషయం
ఒక kg మాంసం తయారీ కి 10 or  15 వేల లీటర్ల నీరు అవసరం పడుతుంది.ఎందుకంటే ఆ జంతువుని పెంచడానికి.
అదే కాయగూరల కి 500 లీటర్ల   
         నీరు పడుతుంది.

ప్రాణం విలువ, ప్రాణం ఉన్న వాళ్ళకే తెలుసు..

జై హింద్.

S.లక్ష్మీ. వైజాగ్.


Saturday, August 3, 2024




 ట్రైన్ ఎక్కి ఒక అమ్మాయి తన బెర్త్ లో ఈ కుండ ముందు పెట్టి కాళ్ళకి ఉన్న చెప్పులు తీసేసి కుండకి దణ్ణం పెట్టుకుంటుంది.. 

పక్కనే ఉన్న అంకులు కాశీ కి వెళ్తున్నారా అమ్మా? 

ఆ అమ్మాయి లేదు అంకుల్ రాజమండ్రి వరకే అన్నది.. 

దానికి అంకులు ఓహ్ గోదాట్లో కలపడానీకా?? అన్నారు.. 

అమ్మాయి లేదు అంకుల్ ఇక్కడే తినేసి బయట పడేస్తాను అనగానే అంకుల్ బిత్తరపోయి.. ఆస్థికలు తింటావా అన్నాడు..

 ఆ అమ్మాయి అంతకన్నా బిగుసుకుపోయి..

 ఛీఛీ ఇవి ఆస్థికలు కాదు అండి.. నాయుడు గారి కుండ బిర్యాని అన్నది.. అంకుల్ షాక్స్.

****సెవన్టీ ప్లస్ (70+) నాటౌట్

 *సెవన్టీ ప్లస్  (70+) నాటౌట్*

నాకు ఆకుకూరలలో తేడా తెలియదు. ఆ విషయం అమ్మేవాడికి తెలియకూడదని గంభీరంగా మొహం పెట్టి అడుగుతా! “చుక్కకూర ఉందటోయ్?" అంటూ అటు ఇటు చూస్తూ.
అలా అడగ్గానే "మీముందే ఉంది కదండీ,  మీక్కావాల్సినన్ని తీసుకోండి అంటాడు."

అన్నీ ముందే ఉంటాయి కానీ క్యారంబోర్డుకి అటు ఇటు ఉన్నట్టు అమ్మేఅతను ఆ చివర నేను ఈచివర.  
తీసివ్వడానికి అతను ఇవతలకి రాడు, నేనేమో ఆ ఆకుకూరల గుట్టలో చుక్కకూర కనిపెట్టలేని అసమర్థుడిని.

పోనీ ధైర్యం చేసి ఏదో ఒకటి తీయగానే  "మీరు చుక్కకూర అడిగారుగా, తోటకూర తీస్తారే?" అంటాడు. 
"అబ్బె..తాజాగా అనిపిస్తేనూ... చూస్తున్నా! అని తడబడి తప్పించుకుంటా. 

సర్లే, ఈసారికి ఇది తోటకూర అని తెలిసిందిగా, తీసుకెళ్తే సరి , వచ్చేసారి చుక్కకూర సంగతి చూద్దాం! అనుకుని ఇంటికివెళ్తే 
"అదేమిటీ ! చుక్కకూర తెమ్మంటే తోటకూర తెచ్చారు?"

"తినాలనిపించి తెచ్చాలే!" అని నా సమర్థింపు.

అలాగే ఏ కూర ని ఎలా ఎన్నిక చేయాలో అన్న అంశం లో కూడా నేను అంతoత మాత్రమే!

ఉదాహరణకు బెండకాయలు చివర విరవాలిట! దానికి వాడు ఒప్పుకోడు.
సొరకాయ గుచ్చాలిట ... లేతదనం తెలియడం కోసం! నాకు గోళ్లు ఎప్పుడూ ఉండవు. ఒక రవ్వ పెరగ్గానే తీసేస్తూంటా! 

దొండ తెస్తే సగం పండిపోయుంటాయి అంటారు. దోస తెస్తే అబ్బా ... సగం చేదు లే! అన్ని తిట్లు.  ములక్కాడలు ముదుర్లని, మామిడికాయలు పుల్లగా లేవని విమర్శలకు గురవుతుంటా!

ధర్మా మీటర్! అదొక పితలాటకం!
ఎలా చూడాలో ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా ఆ పాదరసం ఎక్కడుంటుందో నా ఈ సుదీర్ఘ జీవిత ప్రస్థానంలో ఇప్పటికీ తెలియదు. పైగా అందరూ నన్నే చూడమంటారు ... నా బుర్ర పాదరసం లా పనిచేస్తుందని వాళ్ళ అభిప్రాయంకాబోలు!

హోటల్స్ ,హాస్పిటల్స్ ఇలా చాలా చోట్ల డోర్స్ మీద పుష్, పుల్ ఈ రెండూ రాస్తారు కదా!
ఇక్కడే నేను Confuse అవుతా! ఖచ్చితంగా Pull  అన్న చోట తోస్తా, Push ఉన్నది లాగుతా! సరిగ్గా అప్పుడే ఎవరో రావడం, ఆ డోర్ తగలడం, వాళ్లు చూపుల్తోనే నన్ను అసహ్యించుకోవడం సర్వసాధారణం!

నేను బి.యస్. సి మాథ్స్. కాని కొన్ని లెక్కలు అయితే బొత్తిగా సున్నా!
మీ టీవీ ఎన్ని అంగుళాలు అంటాడు ఒకడు, ఫ్రిడ్జ్ ఎన్ని లీటర్లు అడుగుతాడు మరొకడు! ఎన్నో తెలిసి ఏడిస్తేగా! కాస్త టెక్నికల్  నాలెడ్జ్ ఉన్న మా క్రిష్ణా రావు లాంటి వాళ్లని తీసుకెళ్లి కొనుక్కున్నవి అవన్నీ! వాడుకోవడం తప్ప వివరాలేమీ నా బుర్రకెక్కవు!

ఇక సిలిండర్  లో గేస్ అయిందంటే భయం.
కొత్త సిలిండర్ సీల్  తీసే టెక్నిక్ ఏదో ఉంటుందట! మా ఆవిడకి ఏది రాకపోయినా ఇది మాత్రం మహాబాగా వచ్చు. ఠక్కున తీసేస్తుంది. నాకా కిటుకు చెప్పనేలేదు. పైగా బలవంతంగా తీస్తుంటే పేలిపోతుందేమోనని భయం, చెమటలు. 
నాదృష్టిలో సిలిండర్ నాకో గుదిబండ!

అలాగే సామెతలలో నా మటుకు నాకు కొన్ని మహా తికమకగాఉంటాయి.

ఉదాహరణకు 'అంత్య నిష్టూరం కన్నా ఆది నిష్టూరమా' లేక  'ఆది నిష్టూరం  కంటే   అంత్యనిష్టూరమా' ఏది మేలు?

అలాగే 'కొండ నాలిక్కి మందేస్తే ఉన్న నాలుక పోయిందా?' 'ఉన్న నాలుకకి వేస్తే కొండ నాలుక పోయిందా??'

'ముందొచ్చిన చెవులు కంటే వెనకొచ్చిన కొమ్ములా లేక రివర్సా' .. ఇలా సామెతల విషయంలో కూడా ముందు వెనకలవుతూ తప్పుచెప్పి అభాసుపాలయ్యా చాలాసార్లు !

కొత్తగా ఈ మధ్య  కట్టిన బాత్రూమ్ముల్లో స్టీల్ పంపులుంటాయి.
అవి ఏదో ఒకవైపు తిప్పాలి వేడి, చన్నీళ్లకు. నేనెప్పుడూ అటో ఇటో తిప్పగానే పైన ఉన్న  షవర్ లోంచి గబుక్కున వచ్చి బట్టలు తడిసిపోతాయి! తడిసిన బట్టలతో బయటకు వచ్చిన నన్ను చూసి మా ఎనిమిదేళ్ళ మనవడు అదేపనిగా నవ్వుతాడు!

ఒక్కోసారి సడెన్ గా వేడినీళ్లు పడి ఒళ్ళు మండిన సందర్భాలూ లేకపోలేదు. వెధవ టెక్నాలజి!

ఇక ఈప్రపంచంలో “ఆద్యంతాలు“ కనిపెట్టలేనిది ఒకటి ఉంది.

 అదే సెలో టేప్. మొదలు ఎక్కడుందో చివరెక్కడుందో తెలియదు!  కష్టపడి “మొదలు" అనుకుని పట్టుకుని కట్ చేసి అతికించి చూద్దును కదా! తర్వాత భాగం అప్పటికే అతుక్కుపోయి మళ్లీ మొదలు కనపడదు. మళ్లీ కుస్తీ!

చెప్పాలే గాని..ఇలా ఇంకా ఎన్నెన్నో....

నేనొక్కడినే రైతుబజార్ కి వెళితే ఆవిడ తీసుకు రావద్దు అన్న కూరలు, పండ్లు తెచ్చేస్తాను. తెమ్మని చెప్పినవి మరిచి పోతాను.

ఇలా కాదని లిస్ట్ రాసిస్తుంది. అది భద్రంగా జేబులోనే ఉంటుంది. అది ఉందనే విషయం గుర్తు ఉండదు!

స్కూటర్ మీద వెళ్ళి ఎన్నిసార్లు హెల్మెట్ మరిచి పోయానో?

ఇలా రాసుకుంటూ పోతే మరీ నా అప్రయోజకత్వాన్ని బహిరంగం చేసుకోవడమే అవుతుందేమో!!

*అయినా పైకి గొప్పగా "సెవెన్టీ + నాటౌట్! అని చెప్పుకుంటామే గానీ ... మన బాధలెన్నో?*😞

నానా పటేకర్ పేల్చిన రాజకీయ తూటాలు* *బోల్ ఇండియా బోల్ - చేదు నిజాలు*

 *నానా పటేకర్ పేల్చిన రాజకీయ తూటాలు*

*బోల్ ఇండియా బోల్ - చేదు నిజాలు*

రైతులు పొలంలో - రైతుల కొడుకులు సైన్యంలో మరణిస్తారు,
కానీ
నాయకులు దేశంలో, వారి సంతానం విదేశాల్లో, సౌఖ్యాలు పొందుతారు.

*చేదు నిజం ఏమంటే*, ఈ దేశ వాసులమైన మనం ఇక్కడ  పి.హెచ్.డి, గ్రాడ్యుయేషన్,  మెడిసిన్, ఇంజనీరింగ్ చదివిన వాళ్లం,
టెన్త్ ఫెయిల్ అయిన వాళ్ళకు ఓటు వేసి, నేతలుగా ఎన్నుకొని, వారి నుండి మన బంగారు భవిష్యత్తు కోసం కలలు కంటుంటాం. *ఆలోచించండి*.

రాజకీయ నేతలు కావాలనుకొనే వాళ్ళు ఐదు సంవత్సరాలు సైన్యంలో ఖచ్చితంగా పనిచేసి  తీరాలన్న నిబంధన పెడితే,
దేశంలో 80 శాతం ఉత్పాతాలు (దరిద్రాలు) వాటంతట అవే సర్దుకుంటాయి.

*25 - 30 సంవత్సరాల పాటు ఉద్యోగాలు  చేసిన వాళ్లకు పెన్షన్ఉండదు*.
కానీ,
ఐదేళ్లు రాజకీయ నేతగా పదవి వెలగబెడితే మాత్రం *జీవితాంతం పెన్షన్, ఇతర సదుపాయాలు* ఇస్తున్నారు.
ఇలా ఎందుకు ఇవ్వాలి? 

నాయకులపైకి చెప్పులో, కోడి గుడ్లో, నల్ల సిరానో, విసిరితే ఆ వ్యక్తిని వెంటనే అరెస్ట్ చేస్తారు.
కానీ,
భారతీయ సైన్యం పై రాళ్ల దాడి చేసే వాళ్లకు మాత్రం మినహాయింపు ఇస్తారు. ఎందుకు?

రైతుల సరుకుల వాహనాలపై తోలు వలిచి టోల్ వసూలు చేస్తున్నారు.
కాని,
మంత్రి మహాశయుల వాహనాలకు అదేమీ ఉండదు.
*రైతు తినేది దొంగ సొమ్మా?*
 *నేతలు తినేది కష్టార్జితమా?* ఇదేమి న్యాయం.

*విద్యలో రాజకీయం 100%*
*రాజకీయంలో విద్య 00%*
ఆహా ఎంత గొప్ప విధానం మన ఈ దేశంలో.
ఇందుకేనేమో *రాజకీయం అంతా చెత్త తో నిండిపోయింది*.

దేశంలోని ప్రతిభావంతులేమో
వలస పక్షులు అవుతున్నారు.

దేశంలోని ప్రభుత్వ పాఠశాలల్లో, ధర్మాసుపత్రుల్లో పరిస్థితులు మారాలంటే, నేతల పిల్లలు కూడా ప్రభుత్వ పాఠశాలల్లో చదవాలి -
వారి రోగాలకు చికిత్సలు కూడా ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే జరగాలి.
అప్పుడే పరిస్థితులలో మార్పు చూస్తాం.

*₹399 కి అపరిమిత కాల్స్* డేటా దొరుకుతుంటే ప్రజాప్రతినిధులకు నెలసరి *₹15000 టెలిఫోన్ బత్తా ఎందుకు?*

*ప్రజల చర్మం వలిచి పన్నులు వసూలు చేసే కోట్ల రూపాయలను ఇలా వృధాగా ఖర్చుచేయడం అవసరమా?*
అందరూ ఆలోచించాలి.

దయచేసి మన దేశంలోని ఇలాంటి *దరిద్ర వ్యవస్థ* గురించి అందరికీ తెలిసేలా షేర్ చేయండి.

***కోరికలను తగ్గించుకో!!*

 *కోరికలను తగ్గించుకో!!*

*కోరికలు మితంగా ఉంటే బాధలు మితంగానే ఉంటాయి.... రమణ మహర్షి.*🙏🙏🙏

*కోర్కెలు ఉన్నంత దాకా పుట్టుకలకు అంతం లేదు. పదేపదే శరీర ధారణలు చేయించేది కోర్కెలే! కాస్త పటికబెల్లం తినాలనే కోర్కె ఉన్నా కూడా మళ్లీ పుట్టవలసిందే!".... శారదా మాత*🙏🙏🙏

*మానవుడు తన కోరికలన్నీ తీరితే సంతోషముగా , సుఖముగా ఉండవచ్చును అనుకుంటాడు.*
 
*కానీ నిజానికి కోరికలు తీరితే కాదు, కోరికలు ఆరితేనే సుఖముగా, సంతోషముగా ఉండగలడు.*🙏🙏🙏

*కోరికలకు అంతం ఉండదు. ఒకటి తీరితే మరొకటి , అది తీరితే  మరొకటి.... ఇలా ఒకదాని తర్వాత మరొకటి పుడుతూనే ఉంటుంది.*
 
*ఇంకా... కోరిక తీరితే ఆనందం,    తీరకపోతే దుఃఖం.    దుఃఖం వలన కోపం.      కోపం వలన విచక్షణ కోల్పోవడం.... తద్వారా అన్యాయం, అధర్మం, హింసకు పాల్పడడం.... తుదకు జీవనం నాశనం అవ్వడం జరుగుతుంది.* 

*కనుక కోరికలను అదుపులో పెట్టుకోవడం చాలా ముఖ్యం.*

 *కోరికలు మితంగా, ధర్మ బద్ధంగా జీవనమునకు అవసరమగు విధముగా ఉండాలి తప్ప అత్యాశకు పోకూడదు.*🙏🙏🙏

*భగవంతుని యందు ప్రేమను పెంచుకుంటే అసలు మనం ఏ కోరికా కోరనవసరం లేదు. ఎప్పుడు మనకి ఏది అవసరమో ఆయనే చూసుకుంటాడు.*🙏🙏🙏

🕉 *సర్వేజన సుఖినోభవంతు* 🕉

****దేవుడు అంటే ఏంటి🤔❓*

 *దేవుడు అంటే ఏంటి🤔❓*  
    🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🙏

 *పూజ చేయకపోతే ఏమవుతుంది"  అని చిన్నపిల్లలే కాదు నేడు చదువుకున్న పెద్దవాళ్ళు కూడా అడిగే ప్రశ్న ఇది.* 
       🙏🙏🙏
*పూజ అనేది కూడా ఒక "యోగ ప్రక్రియ". మనసుతో చేసే వ్యాయామం*.
    
*మన తెలివితేటలు, జ్ఞానం పెరగడానికి మన మెదడుని మనమే "ట్యూన్‌"  చేసుకునే ప్రక్రియ*.

🙏🏽* ‌,దీప ప్రజ్వలనం అనేది..... త్రాటకం అనే యోగ ప్రక్రియ*.
      🔥🔥🔥
*రోజూ ఓ మూడు నిమిషాలు నూనె దీపాన్ని తదేకంగా చూస్తే.... కంటి జబ్బులను అరికట్టవచ్చు , అని పెద్దలు చెప్పిన మాట.*

*ఏదైనా కష్టమైన మంత్రాన్ని ఓ 11 సార్లు జపిస్తే.. నాలిక మొద్దుబారదు.   అది నాలికకు ఎక్సర్‌సైజ్‌*. 

అందువల్ల ఎటువంటి కష్టమైన పదాలనైనా పలకగలిగే శక్తి వస్తుంది.  "శ్రీహరి వాయు స్తుతి"
" శ్రీ రాఘవేంద్ర స్వామి రచించిన గ్రంథములు, 
శ్రీ సూక్తం, పురుష సూక్తం, "విష్ణు సహస్రనామం" పఠించి చూడండి.  

*" ధారణ శక్తి పెరుగుతుంది "భాష" మీద పట్టు పెరిగితే..."స్టేజ్‌ ఫియర్"  కూడా‌ పోతుంది *
        🙏🙏🙏
*పూజ అంటే" చాదస్తం" కాదు .   మన ఆరోగ్యం, మన జ్ఞానానికి సంబంధించిన విషయమని చెప్పండి.*
      🌹🌹🌹
*మన సనాతన  ధర్మాన్ని , విశిష్టత, గురించి తెలిపి, వారిలో బీజం వేసి, పునరుద్దింపచేయండి, ప్రోత్స హించండి*.

🙏"అదే సమయంలొ మూడ విశ్వాసాలకు దూరంగా ఉండే విధంగా మీ పిల్లలను తయారు చేయాల్సిన భాద్యత కూడా పెద్దవారిపై ఉంది. అని తెలుసుకోండి!....

*1. మూలవిరాట్*  భూమిలో ఎక్కడైయితే "ఎలక్ట్రానిక్ " అండ్ "మ్యాగ్నెటిక్"  తరంగాలు కలుస్తాయో!   అక్కడ "మూల విరాట్" అనేక మంత్రాలతో, శ్రీ చక్రం, లాంటి అనేకమైనవి, ఉంచి మంత్ర ద్రష్టలు, ఏర్పాటు చేయుట చూస్తాము.   ప్రతిష్ఠించే ముందు రాగి రేకులను కాల్చి ఉంచుతారు. అవి ఈ తరంగాలకు "క్యాటలిస్ట్" గా పని చేస్తాయి.

*2. ప్రదక్షిణ* మనం గుడి చుట్టు క్లాక్ వైస్ డైరెక్షన్ లో తిరిగినపుడు ఆ తరంగాల శక్తి మన దేహానికి వస్తుంది. గుడిలోనే దేవుడు వుంటాడా?  అనేది ఒక వాదన.. ఎక్కడైన వుంటాడు, 84 లక్షల జీవరాశులలో ఉన్న భగవంతుడు,  ఈ "దేవాలయ దర్శనం" ఏకాగ్రత కొరకు,  పెట్టారు. పుణ్యక్షేత్రాలు "వేదిక్ ఆర్కిటెక్చర్".  మీద ఆధారపడి వుంటాయి. యివి మన శరీరం లోని "షఠ్ చక్రాల" ను ప్రభావితం చేస్తాయి.

*3. ఆభరణాలతో దర్శనం* ఆడవారిని, మగవారిని నగలు వేసుకుని గుడికి వెళ్ళమనేది మన సంపదను చూపించడానికి కాదు.. బంగారం వంటివి ఈ తరంగాలను బాగా గ్రహిస్తాయని.  తెలుసుకోండి!

*4. కొబ్బరి కాయ*  
ఇది స్వచ్ఛతకు గుర్తు.  పై టెంక మన అహంకారాన్ని.. దాన్ని పగలగొడితే వచ్చే కొబ్బరి మన "కల్మషం " లేని మనసును.. అవతలి వారి "ప్రేమ".  కొబ్బరినీళ్ళు అంత తియ్యగా ఉంటాయి. అనడానికి సంకేతం.

*5.మంత్రాలు* ఉదాహరణకు మనం ఒక ఫోన్ నెంబర్ గుర్తుంచుకోవాలి?  అంటే 9346576946 అలా ఒక పధ్ధతిలో అమరుస్తాం.. అంటే మనకి తెలియకుండానే "న్యూరాన్స్ "ని "ఆక్టివేట్" చేసి" డేటా ".  ని దాస్తున్నాం..  అదే విధంగా "మంత్రోచ్ఛారణ" లు అక్షర  నియమంతో ఒక లయను కల్గి న్యూరాన్ లను ఉత్తేజ పరుస్తాయి.
    🇮🇳🇮🇳🇮🇳
*6. గర్భగుడి* "గర్భగుడి" ద్వారం ఒక వైపుకు ఉండటం వల్ల ఆ శక్తిని మన శరీరం గ్రహిస్తుంది. అందుకే మరీ ఎదురుగా కాక ఒక వైపుకు  ఉండమంటారు.

*7. అభిషేకం* 
"🙏"విగ్రహాలు" పంచ లోహాలతో ఉంటాయి.. వాటికి పాలు ,తేనె వంటి వాటితో అభిషేకించినపుడు కింద ఉన్న తరంగాల శక్తితో ఔషధ గుణాన్ని సంతరించుకుంటాయి. అంతేగాని "సినీ కటౌట్" లకు పాలాభిషేకాలు మూర్ఖత్వం. వెర్రితనం. అని ఇకనైనా తెలుసుకోండి!

*8. హారతి*               🙏"పచ్చ కర్పూరానికి" ఎన్నో ఔషధ గుణాలు.. హారతి తీసుకునేటపుడు ఆ వెచ్చదనాన్ని మన కంటికి తగిలేలా చేయాలి..   దీనికి ఆయుర్వేద పరిభాష లో "స్వేదకర్మ"  అని పేరు. ఊరికే గాల్లో హారతి తీసుకుంటే చాలదు.  కుడి చేత్తో.  మాత్రమే అడ్డుకోవాలి.

*9. తీర్థం*                   🙏"ఇందులో పచ్చ కర్పూరం.. తులసి.. లవంగాలు, జాజికాయ, యాలకులు, వేసి తీర్థం. మరియు ఆవు పాలు, పెరుగు, నెయ్యి,తేనె, పంచదార, ఇలా ఎన్నో.. పంచామృతంతో అభిషేకం చేసినవి" తీర్థం" గా ఇస్తారు._

*10. మడి*                🙏"తడిబట్టలకి "ఆక్సిజన్"  ని ఎక్కువగా తీసుకునే గుణం ఉంటుంది.. అందుకే మడి..! బట్టలు తల నిండా స్నానము చేసి మడి బట్ట ఎవరు తాకకుండా ఆరవేయుట, పట్టు బట్టలు, ఉన్ని బట్టలు, అంగోస్త్రము, లోపల ఎలాంటి డ్రాయరు వేసుకున్న రాదు.  స్త్రీలు అయినచో గోచి పెట్టుకుని, చీర కట్టుకుంటారు.  సనాతన ధర్మం ప్రకారమే కేరళ తమిళనాడు గుళ్ళల్లో, ఇటీవల తిరుపతి యందు, ముఖ్యంగా ఉడిపి, మంత్రాలయము, దివ్య క్షేత్రములందు పాటించుట మీరు చూసే ఉంటారు.   కొందరు తడి బట్టలనే ఏడుసార్లు, విదిలించి కట్టుకోవటం కూడా చూస్తాం!  మడి తోనే, "సాలిగ్రామ తీర్థము" తీసుకుని కానీ భోజనం చేయరాదు.
సేకరణ: "మజుందార్"
" హరి సర్వోత్తమ"
" వాయు జీవోత్తమ"
🙏🙏🙏🙏🙏🙏
🪷🪷🪷🪷🪷🔥

ఆలోచించి చూడండి. నిజమనిపిస్తే ఆచరించండి.

 🌹గుడ్ మార్నింగ్ 🌹మనది ఏ మతమైనా కావచ్చు - మనము ఏ దేముడినైనా నమ్మవచ్చు - మనము ఏ గురువునైనా అనుసరించవచ్చు - ఏ విధానాలు, ఆచారాలు సాంప్రదాయాలు పాటించవచ్చు - ఇవన్నీ ఎందుకు అనేది మనలో మనమే సూటిగా ప్రశ్నించుకోవాలి.
1) ఏదో చిన్నతనము నుండి ఇంట్లో వారు చేసేవి, చేయించినవి అలవాటుగా చేస్తున్నాను - ఉపయోగము లేదు.. 2) దేముడు రక్షిస్తాడు కనుక ఆ రక్షణ కొరకు నాకు వీలైనవి అన్నీ చేస్తున్నాను - ఉపయోగములేదు సృష్టి దైవ విధానము కర్మ సిద్దాంతము ప్రకారము నడుస్తున్నది. ఇది దేముడు పెట్టినదే. ఎవరు చేసిన పనుల ఫలితాలు వారు అనుభవించక తప్పదు. 3) గురువులు, మహాత్ములు, మతాల, మార్గాల పెద్దలందరూ - మత దైవ ప్రచారాలు చేస్తూ - ఎన్నో దైవ మహిమలు, రక్షణలు చెబుతున్నారు కనుక అవి నమ్మి - నా మతము, నా దేముడు అన్న అభిమానముతో - మహిమల, రక్షణల నమ్మకముతో వారు చెప్పినవి, నేను నమ్మినవి చేస్తున్నాను - ఉపయోగములేదు. ఇక్కడ కూడా కర్మ సిద్ధాంతమే పనిచేస్తుంది. దేముడు మనుషుల వలె పక్షపాతిగా వుండే అవకాశము లేదు. మరల ఒక్కసారి మనలో మనమే సూటిగా దైవాన్ని గుర్తు ఉంచుకొని స్వార్ధన్ని వదలి vunnadi ఉన్నట్లుగా ప్రశ్నించుకోగలిగితే - సమాధానము సూటిగా తెచ్చుకోగలిగితే - మనకు, సృష్టికి కారణమైన శక్తి దైవము. మొత్తము సృష్టి - అందులో అన్నీ దైవానివే. కనుక జీవనములో మంచిగా జీవించటానికి అవసరమైన - నాలో చెడు పోవటానికి అవసరమైన గుణ మార్పు కొరకు - మతాన్ని, దైవాన్ని, గురువును, విధానాలను అనుసరిస్తున్నాను. నిరంతరం మంచిగా జీవించే ప్రయత్నం చేస్తున్నాను... నాకు సృష్టికి మూలమైన శక్తి దైవమే కనుక ఆ దివ్య దైవ శక్తిని తెలుసుకునే ప్రయత్నం - సాధించ గలిగితే ఆ శక్తిలో లయించిపోయే ప్రయతం చేస్తున్నాను - మీరు ఎక్కడ ఎవరితో, ఏ విధముగా దైవ మార్గములో సాగుతున్నా - ఈ భావాలతో సాగుతుంటే - మొత్తము ఉపయోగమే.ఆలోచించి చూడండి. నిజమనిపిస్తే ఆచరించండి. 🌹god bless you.

Friday, August 2, 2024

 మనకు ఉన్నవి మూడు కాలాలు, మనస్సు వర్తమానంలో నిలవకుండా నిరంతరం గతంలో గాని, భవిష్యత్తులో గాని చిక్కుకొని అనేకానేక భయాలకు, బాధలకు, అనుమానాలకు లోనవుతూ ఉంటుంది. శ్వాసక్రియ వర్తమానంలో జరుగుతుంది. శ్వాస మీద ధ్యాస పెట్టడం ద్వారా మనం వర్తమానంలోనికి వచ్చినప్పుడు జీవితమనే అద్భుతాన్ని మన అనుభవంలోనికి తెచ్చుకోగలం.
                       ---   ధ్యాణద్భుతం పుస్తకం నుండి సేకరణ ----
 రామాయణమ్.12
.
తెలతెలవారుతున్నది తూర్పుదిక్కు అప్పుడే విచ్చుకుంటుంన్నది .
గడ్డిపక్కపైన పట్టుపరుపులమీద పడుకున్నంత హాయిగా రామలక్ష్ష్మణులు నిదురిస్తూఉన్నారు.
వారి ముఖాలను కనురెప్పవాల్చకుండా తనివితీరా చూస్తూ ఉన్నారు మహర్షి! 
రామునిముఖపద్మంలోని సౌందర్యము అనే మధువును గ్రోలే తుమ్మెదలా ఉన్నారాయన! .
ఆయన రాముడికి మేలుకొలుపు పాడుతున్నారు రామా నిద్దురలే అని!
.
కౌసల్యా సుప్రజా రామ పూర్వా సన్ధ్యా  ప్రవర్తతే
ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యమ్ దైవమాహ్నికమ్!
.
కౌసల్యా సుప్రజా ...కౌసల్యయొక్క ఉత్తమ సంతానమైన
రామా.... ఓ రామా
పూర్వా సంధ్యా ప్రవర్తతే...తూరుపు దిక్కున తెలవారబోతున్నది
ఉత్తిష్ఠ.....లెమ్ము
నరశార్దూలా.. మానవులలో శ్రేష్టమైన వాడా!
కర్తవ్యమ్ దైవ మాహ్నికమ్...ప్రతిదినము చేయవలసిన పనులు చేయాల్సిఉన్నది.
.
రామలక్ష్మణులు సంధ్యావందనాది పనులన్నియు చక్కగా ఆచరించి మరల మునివెంట బయలుదేరినారు.
.
అలా నడచినడచి సరయూ,గంగానదుల సంగమప్రదేశం చేరినారు!.
.
అక్కడ వేల సంవత్సరాల నుండి తపస్సుచేస్తున్న ఎంతోమంది ఋషీశ్వరులగుపించారు. ఆప్రదేశాన్ని అంతటిని ఆసక్తిగా చూశారు రామలక్ష్మణులు .
అక్కడ ఒక ఆశ్రమము చూశారు ,అది చూడగనే వారి మనస్సులో ఏదో తెలియని ఆనందం ప్రవేశించింది. కుతూహలంతో మహర్షిని ప్రశ్నించారు!
"మహర్షీ ఈ ఆశ్రమము ఎవ్వరిది?".
.
ఇక్కడ పూర్వము పరమశివుడు తపమాచరించేవాడు!
ఆయనకు అప్పుడే వివాహం జరిగింది. శివుడంతటివాడు వివాహం చేసుకోవటంతో, అది నావల్లనే జరిగింది అని అహంకరించాడు మన్మధుడు ( అప్పుడు మన్మధుడికి శరీరముండేది).
శివుడు ఆతడి అహంకారాన్ని చూసి హుంకరించాడు!
మూడోకన్నుతెరచి మన్మధుని చూశాడు .అప్పుడు మన్మధుడి శరీరంలోని ఒక్కక్క అంగము కాల్చివేయబడింది!
మన్మధుడు దేహము విడిచిన ప్రదేశము కాబట్డి అంగదేశము అని పేరు వచ్చింది! 
.
పరమపావనమైన ఈ ప్రదేశంలో ఈ రాత్రికి ఇక్కడే విశ్రమిద్దాం .
రేపు తెల్లవారగనే గంగను దాటుదాం అని గంగాస్నానం చేసి శుచిగా ఆశ్రమంలో ప్రవేశించారు!
.
శ్రీ రాముని వెంటపెట్టుకొని విశ్వామిత్రుడు వచ్చాడని తెలిసి ఆశ్రమంలోని మునులందరూ సంతోషంతో పులకరించిపోయారు!.
.
వారికి తగువిధముగా సత్కారాలు చేసి అక్కడ వారు విశ్రమించటానికి కావలసిన ఏర్పాట్లు చేసినారు.
.
ఆ రాత్రి అంతా రాజకుమారులకు మనోహరమైన కధలుచెపుతూ ఆనందింపచేశారు మహర్షి!.
.
తెలవారగనే స్నానసంధ్యాదులు పూర్తిచేసుకొని ఆశ్రమవాసులు ఏర్పాటు చేసిన నావమీద గంగానది దాటుతున్నారు,గంగ మధ్యలోనికి రావడంతోనే నీరు బద్దలవుతున్నట్లుగా గొప్పశబ్దం వినిపించింది ! అదేమిటి? అని ప్రశ్నించాడు రామచంద్రుడు కుతూహలంతో!
.
అప్పుడు మహర్షి ఇలా చెప్పారు ! పూర్వం తన మనస్సులో జనించిన సంకల్పంతో బ్రహ్మదేవుడు కైలాస పర్వతప్రాంతములోఒక సరస్సు నిర్మించాడు ఆయన మనస్సంకల్పంనుండి పుట్టినది కాబట్టి దానికి మానస సరోవరమనిపేరు.
అక్కడ నుండి సరయూనది జన్మించింది! సరస్సునుండి ప్రవహిస్తున్నది కావున" సరయూ" అని పేరు వచ్చింది!
.
ఆ సరయూనది గొప్ప తరంగాల తొ గంగాప్రవేశం చేస్తున్నది అప్పుడు పుట్టే జలఘోషనే నీవు వింటున్నది అని చెప్పారు మహర్షి..
.
గంగదాటగనే ఏ మాత్రము మానవ సంచారంలేని భయంకరమైన ఒక అడవిలో ప్రవేశించారు వారు!
.
ఆ భయంకరమైన ,దుర్గమమైన అడవిని చూసి రాముడు విస్మయంతో మహర్షిని ప్రశ్నించాడు!
.

జానకిరామారావు వూటుకూరు గారి 
సౌజన్యం తో ....

*ధర్మధ్వజం*
హిందు చైతన్య వేదిక
 రామాయణమ్. 11
.
ఈ లోకములో ఏ ఏ అస్త్రములు అయితే వున్నవో అవి అన్నియు విశ్వామిత్రుని వద్ద ఉన్నవి .
.
అస్త్రములు అన్నీ కూడా భృశాస్వుని పుత్రులు .
భృశాస్వుడు ఒక ప్రజాపతి ,ఆయన దక్షప్రజాపతి కూతుళ్ళు జయ,సుప్రభలను వివాహమాడి కన్న సంతానమే అస్త్రములు!
వీటిని విశ్వామిత్రుడు పొందుతాడు!
.
అంతేకాదు విశ్వామిత్ర మహర్షికి గల అస్త్ర పరిజ్ఞానము అపారము (guided missiles). 
ఈయన క్రొత్త అస్త్రములు ఎన్నింటినో పుట్టించగలడుకూడా  ! .
.
(శస్త్రము అంటే మామూలుగా గాయం చేసేది!
 అస్త్రము అంటే మంత్రపూర్వకముగా ప్రయోగించేది! .
bullet కు intercontinental ballistic missile కు ఉన్నంత తేడా అన్నమాట).
.
ఓ దశరధమహారాజా, విశ్వామిత్ర మహర్షి అమిత మేధోసంపన్నుడు! అతులిత పరాక్రమవంతుడు! ,ఆయన తన యాగసంరక్షణము తానే చేసుకోగల సర్వసమర్ధుడు! .
.
ఆయన అడుగుతున్నాడు నీ రాముడి ని పంపమని! 
ఆయనవెంట వెళితే రామునకు మేలుకలుగుతుంది! మహర్షి ఉద్దేశ్యము అదే ! రాముడెవరో సంపూర్ణముగా తెలిసిన మహాజ్ఞాని ఆయన!
.
నీవు మనసులోని భయసందేహాలన్నింటినీ తొలగించుకొని రామచంద్రుని ఆయనవెంట పంపు సకల శుభాలు ఒనగూరుతవి!.
.
కులగురువు మాటలు విని దశరధుడి శరీరం ఉప్పొంగింది!
రాముని మహర్షివెంట పంపటానికి సంతోషంగాఒప్పుకొన్నాడు!.
.
స్వయముగా వెళ్ళి రామలక్ష్మణులను తీసుకొని వచ్చి ఒక్కసారి తన ప్రియపుత్రుని శిరస్సుముద్దిడుకొని ,మహర్షి చేతిలో పెట్టాడు !  .
.
మూపున విల్లమ్ములు ధరించి రాముడు,లక్ష్మణుడు మహర్షిని అనుసరించారు .
.
బ్రహ్మదేవుడు ముందువెడుతుండగా వెనుక ఇద్దరు అశ్వనీదేవతలనుసరించినట్లుగా కనపడుతున్నారు వారివురూ చూపరులకు!.
.
బాటలు నడిచారు,పేటలు గడిచారు నడుస్తూనే ఉన్నారు మహర్షి వెనుదిరిగి చూడలేదు.
ఆ విధంగా మొదటిసారి నగరువిడచి దుర్గమారణ్యాలలో కాలుమోపాడు కోదండపాణి సోదరసమేతుడై!.
.
అలా చాలా దూరం నడచిన తరువాత తనలోని ప్రేమంతా మాటరూపంలో బయలుపడేటట్లుగా "రామా" అని అత్యంత మధురంగా పిలిచాడు మహర్షి! .
.
అప్పటిదాకా ఆయన వెనుదిరిగిచూడలేదు, చూస్తే రాముని మధురమోహనరూపం కట్టిపడేస్తుంది, ముందుకు సాగనీయదు అనే భయం వల్లనేమో బహుశా!
.
సరయూనదీ దక్షిణతీరం చేరారు ! ఆ నది ఒడ్డున కాసేపు ఆగి నాయనలారా ఆచమనం చేయండి ! మీకు కొన్ని మంత్రములను ,"బల,""అతిబల "అను విద్యలను ఉపదేశిస్తాను! స్వీకరించండి!
.
ఈ విద్యలెటువంటివి అంటే! ఇవి తెలుసుకొన్న తరువాత నీకు శ్రమగానీ,జ్వరముగానీ,రూపములో మార్పుగానీ సంభవించదు!
నీవు నిద్రపోయినప్పుడుగానీ ,ఏమరపాటుగా ఉన్నప్పటికీ కూడా రాక్షసులు నిన్నేమీ చేయజాలరు!
.
రామా !బాహుబలములో నీతో సమానుడు 
మూడులోకములలో ఎవడునూ లేడు ఇకముందు ఉండడు!
రామా! సౌందర్యము,సామర్ధ్యము, జ్ఞానము బుద్ధినైశిత్యములలో నీతో సరిసమానుడు ఈ లోకములో ఉండడు!.
.
ఈ విద్యలు బ్రహ్మదేవుని పుత్రికలు!
.
అంత శ్రీరాముడు శుచియై,శుద్ధాంతరంగుడై,ఆ మహర్షి నుండి విద్యలను ఆనందంగా స్వీకరించాడు!
.

జానకిరామారావు వూటుకూరు గారి 
సౌజన్యం తో ....

*ధర్మధ్వజం*
హిందు చైతన్య వేదిక

.

****అంశం: భయమే నీ శత్రువు శీర్షిక: "" భయానికి అభయమిస్తూ....""

 అంశం:  భయమే నీ శత్రువు
శీర్షిక:
    "" భయానికి అభయమిస్తూ....""

 చిన్నప్పుడు పిల్లలు అన్నం తినక పోతే
భుచోడికి  పట్టిస్తామని
లేని భూచోడిని సృష్టించి
లేని పోని భయాల్ని.కల్పిస్తూ
భయానికి  అభయమిస్తూ
భయాన్ని నిర్భయంగా పెంచి పోషిస్తున్నాం
బాల్యం నుంచే భయానికి బంధీలను గావిస్తున్నాం!
ఆ భయం ఇంతై వటుడింతై అన్నట్లుగా
వయస్సుతో పాటు పెరిగి
మనస్సుల్లో వెళ్లునుకుంటుంది
భయం భయంగానే జీవితాన్ని గడిపేలా చేస్తుంది
పరోక్షంగా పిల్లలకు శత్రువుని తయారు చేస్తుంది!
నిప్పు జోలికెళ్తే కాలుతుందం ని
నీటి జోలికెళ్లకు మునుగుతావని
చీకట్లోకి వెళ్లకు దెయ్యంఉంటుందని
ఒంటరిగా వెళ్లకు దొంగలుంటారని
ఇలా నీరు, నిప్పు, చీకటి, దెయ్యం లాంటి
కృత్రిమ భయాలను కల్పించి
పసివారి స్వచ్ఛ హృదయఫలకాలపై
భయాన్నినభయాంకరంగా ముద్రించి
భయానక శత్రు వాతావరణంలో పెరిగేలా చేస్తూ
పిరికితనాన్ని నూరిపోస్తున్నాం!
జీవితాన్ని ధైర్యంగా ఎదుర్కోలేక
విజయాలను సాదించలేక
అపజయులై మిగుల్తున్నారు
పిరికిపందలుగా నే మిగుల్తున్నారు!
కృత్రిమ భయాన్ని కల్పించక
భయనక పరిస్థితుల్ని  సైతం ఎదుర్కునేలా
ధైర్యాన్ని నూరిపోద్దాం
నిజ జీవితంలో విజేతలయ్యేలా  
తీర్చిదిద్దుదాం!
...........................................
ఆళ్ల   నాగేశ్వరరావు
తెనాలి
గుంటూరు...జిల్లా
ఆంధ్రప్రదేశ్...రాష్ట్రం
 చరవాని సంఖ్య: 7416638823
........................................
పై వచనకవిత నా స్వీయారచనేనని హామీఇస్తున్నాను.

****మనం గుడ్ ఇండియన్స్ కాదు. ఎందుకంటే..!?

 మనం గుడ్ ఇండియన్స్ కాదు. ఎందుకంటే..!?

1) మాతృదేవోభవ , పితృదేవోభవ అని చెప్పిన దేశం భారత దేశం.      కానీ దానిని ఆచరించేది  ఆస్ట్రేలియా.

( పిల్లలు తల్లిదండ్రులను గౌరవించడంలో మొదటి స్థానం అస్ట్రేలియాది)

2) గురుదేవోభవ అని చెప్పినదేశం భారతదేశం..కానీ దానిని ఆచరించేది చైనా. ( గురువులను గౌరవించడంలో చైనా మొదటి స్థానంలో ఉంది.)

3) యత్ర నార్యంతు పూజ్యతే .... అని చెప్పిన దేశం భారతదేశం. కానీ ఆచరించేది నార్వే. ( మహిళలకు భద్రత మరియు గౌరవం ఇవ్వడంలో నార్వేది మొదటిస్థానం)

4) పెద్దలను , వృద్ధులను గౌరవించమని చెప్పిన దేశం భారత దేశం. కానీ ఆచరించేది ఐస్ ల్యాండ్. (మొదటి స్థానం ఐస్ ల్యాండ్ దే.)

5) సత్యమేవజయతే అని చెప్పిన దేశం భారత్ దేశం. కానీ దానిని ఆచరిస్తున్నది యూకే. (నిజాయితీ మొదటి స్థానం యునైటెడ్ కింగ్ డం దే.)

6) కష్టేఫలి , కృషితో నాస్తి దుర్భిక్షం.. అని చెప్పిన దేశం భారత దేశం. కానీ ఆచరిస్తున్నది దక్షిణ కొరియా. ( హార్డ్ వర్క్ లో మొదటి స్థానం సౌత్ కొరియా దే)

7) ప్రపంచానికి శాంతి సందేశం అందించిన దేశం భారతదేశం. కానీ ఆచరిస్తున్నది నార్వే.( ప్రశాంతత లో మొదటి స్థానం నార్వే దే.)

😎 భగవద్గీత బోధించిన దేశం భారత దేశం. కానీ ఆచరిస్తున్నది జపాన్ .( కర్తవ్య నిర్వహణలో అంకితభావంలో  మొదటి స్థానం జపాన్ దే)

9) ఎన్నో నీతి నియమాలను నిర్దేశించిన దేశం భారత దేశం. కానీ ఆచరిస్తున్నది సింగపూర్.( క్రమ శిక్షణ లో మొదటి స్థానం సింగపూర్ దే)

10) విద్య ను, జ్ఞానాన్ని ప్రవచించిన దేశం భారత దేశం. కానీ నిలబెట్టుకున్నది ఫిన్లాండ్. ( విద్య , విలువలు  లో మొదటి స్థానం ఫిన్ ల్యాండ్ దే)

పై విషయాలలో స్వల్ప తేడాలతో టాప్ ట్వంటీ లో ఉన్న  దేశాలు ఇవి.. నార్వే, ఐస్ ల్యాండ్, డెన్మార్క్, స్వీడన్, ఫిన్ ల్యాండ్, జపాన్, యూకే, చైనా, స్విట్జర్లాండ్,  న్యూజిలాండ్, సింగపూర్ , దక్షిణ కొరియా, నెదర్లాండ్స్, యూఏఈ, ఆస్ట్రేలియా . చెప్పడం కాదు. చేసి చూపిస్తేనే విలువుంటుంది. లేకపోతె చెప్పేవి శ్రీరంగనీతులు అవుతాయి. పై విషయాలన్నింటిలో భారతదేశం యొక్క స్థానం అట్టడుగున ఉంది.
చెప్పేటందుకే నీతులు ఉన్నాయ్ అనే విధానం లో భారతదేశం మొదటి స్థానం లో ఉంది..

*చెప్పటం మాని ఆచరించే రోజు* వస్తుందని ఆశిద్దాం...

🙏🙏🙏

****చాలామందికి ఉన్న సమస్య ఏంటంటే

 *చాలామందికి ఉన్న సమస్య ఏంటంటే పుణ్యం కోసం చావుకు తెగించి మరీ నదుల్లో మునిగి బయటకి రాగానే మూగజంతువులను చంపి కోసుకొని తింటూ మళ్ళి పాపాలను మూటగట్టుకోవటం షరా మాములే, అష్టకష్టాలు పడి తిరుమల కొండకు వెళ్లి మొక్కు తీర్చుకొని కొండ దిగుతూనే మాంసాహార సేవనం మొదలుపెట్టడం అన్నది మూర్ఖత్వం, అయ్యప్ప మాల వేసుకొని నలభైఒక్క రోజులు గడిపి దీక్ష అయిపోగానే మాల తీసేయగానే మాంసాహారం భుజించటం మళ్ళి షరా మాములు అయిపోవటం అజ్ఞానపు చర్య, ఆధ్యాత్మికత యొక్క మౌలిక సూత్రం అహింసా పరమో ధర్మః అన్న ధర్మాన్ని ఆచరించినప్పుడే  ఆ సంపాదించుకున్న పుణ్యం మొత్తం మన అత్మ అకౌంట్ లోకి చేరుతుంది. - బ్రహ్మర్షి సుభాష్ పత్రీజీ*

****యోగి- సాధువు

 ✳️✳️✳️✳️🕉️🕉️🕉️✳️✳️✳️✳️

*యోగి- సాధువు*

పూర్వం ఒక యోగి అకుంఠితమైన తపస్సు చేసి, కొన్ని గొప్ప శక్తులను సంపాదించాడు. అతను స్వతహాగా మంచివాడు. కానీ తన శక్తులంటే అతనికి గర్వం ఉండేది. వాటిని ప్రదర్శించాలనే కొరిక ఉండేది. ఆ గర్వాన్ని తగ్గించాలని దేవుడు అనుకున్నాడు. ఒక రోజు... సాధువు రూపంలో ఆ యోగి దగ్గరకు వచ్చాడు. ‘‘స్వామీ! మీకు అద్భుతమైన శక్తులు ఉన్నాయని విన్నాను. మిమ్మల్ని దర్శించుకోవాలని వచ్చాను’’ అని అన్నాడు. మాటలు విన్న యోగి ఉప్పొంగిపోయాడు. మునిని సాదరంగా ఆహ్వానించి, ఆతిథ్యం ఇచ్చాడు.

ఈలోగా అటువైపు ఒక ఏనుగు వెళుతోంది. సాధువు దాన్ని చూపిస్తూ ‘‘స్వామీ! మీరు కోరుకుంటే ఆ ఏనుగును చంపగలరా?’’ అని అడిగాడు.

.‘‘ఎందుకు చంపలేనూ? ఇదిగో చూడండి’’ అంటూ నేల మీద పిడికెడు మట్టి తీసుకున్నాడు యోగి. దాన్ని మంత్రించి ఏనుగు మీదకు విసిరాడు. ఆ ఏనుగు నొప్పితో విలవిలలాడుతూ నేల మీద పడి మరణించింది.

‘చూశావా!’ అన్నట్టు గర్వంగా తలాడించాడు యోగి.

‘‘మీ శక్తులు అమోఘం స్వామీ! మీరు ఏనుగును చంపేశారు. మరి దాన్ని మళ్ళీ బతికించగలరా?’’ అని అడిగాడు సాధువు.

‘‘తప్పకుండా’’ అంటూ మరికాస్త మట్టి తీసుకొని, మంత్రించి, మరణించిన ఏనుగు మీద చల్లాడు యోగి. ఆ ఏనుగు లేచి నిలబడింది. శరీరానికి అంటుకున్న దుమ్మును విదిలించుకుంటూ అడవిలోకి నడిచింది.

‘‘స్వామీ! మీకు అపారమైన శక్తులు ఉన్నాయి. కానీ నాకొక సందేహం ఉంది తీరుస్తారా?’’ అన్నాడు సాధువు.

‘‘దానికేం? అడగండి’’ అన్నాడు యోగి.

‘‘మీరు ఏనుగును చంపారు. దాన్ని మళ్ళీ బతికించారు. కానీ అందువల్ల మీకు కలిగిన ప్రయోజనం ఏమిటి? ఆధ్యాత్మికమైన ఉన్నతి కలిగిందా? మోక్షాన్ని, భగవంతుణ్ణి చేరే మార్గం దొరికిందా?’’ అని ప్రశ్నించాడు సాధువు.

ఆ మాటలకు యోగి దిగ్ర్భాంతి చెందాడు. సాధువు రూపంలో ఉన్న దేవుడు చిరునవ్వు నవ్వుతూ మాయమైపోయాడు. ఇంతసేపూ తన ముందు ఉన్నది సాక్షాత్తూ భగవంతుడేనని యోగికి అర్థమయింది.

ఆ క్షణం నుంచి అతనిలో గర్వం, కోరికలు పూర్తిగా సమసిపోయాయి.

శ్రీ రామకృష్ణ పరమహంస తన శిష్యులకు ఈ కథ చెబుతూ ‘‘సూది బెజ్జానికి అడ్డుగా కంటికి కనిపించని చిన్న నలుసు ఉన్నా సరే... దానిలోంచీ దారం వెళ్ళడం కష్టమవుతుంది. అదే విధంగా సాధకుల్లో ఇసుకరేణువంత కోరిక, గర్వం మిగిలి ఉన్నా... పరమాత్మ తత్త్వాన్ని గ్రహించలేరు. మోక్షపథాన్ని అందుకోలేరు’’ అని స్పష్టం చేశారు.

సేకరణ

✳️✳️✳️✳️🕉️🕉️🕉️✳️✳️✳️✳️

****వ్యాపారి గర్వభంగం

 *వ్యాపారి గర్వభంగం* 

ఒకసారి స్వామి వివేకానంద ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఒక రైల్వేస్టేషన్‌లో ఉండగా ఒక సంఘటన చోటుచేసుకుంది. 

వివేకానందుడికి ఒకరోజు తినటానికి ఏమీ దొరకలేదు. ఆయన వద్ద చిల్లిగవ్వ కూడా లేదు. ఆకలి బడలికలతో నేలపై కూర్చొని ఉన్న స్వామీజీని గమనించి ఒక వడ్డీ వ్యాపారి చులకనగా మాట్లాడనారంభించా డు. అతని ఆలోచన ప్రకారం ఎవరూ సన్యాసులు అవకూడదు అతడిలా అని స్వామీజీతో అన్నాడు.

“ఓ స్వామీ... చూడు... చూడు.. నేనెంత మంచి భోజనం చేస్తున్నానో.. నా వద్ద త్రాగటానికి చల్లని నీళ్లు ఉన్నాయి కూడా. నేను డబ్బులు సంపాదిస్తాను. కాబట్టి నాకు మంచి మంచి వంటకాలు, వగైరాలు అన్నీ సమకూరాయి. మరి నువ్వో ... ఏ సంపాదనా లేకుండా దేవుడు.. దేవుడూ.. అంటూ తిరిగేవాడివి. అందుకే నీకు ఈ బాధలు. అయినా నువ్వు నమ్ముకున్న నీ దేవుడు నీకు ఏమి ఇచ్చాడయ్యా... ఆకలి బడలిక.. తప్ప..” అని దెప్పి పొడవటం మెుదలు పెట్టాడు. 

స్వామీజీ ముఖంలోని ఒక్క కండరం కూడా కదలలేదు. విగ్రహంలా కూర్చొని భగవంతుని పాద పద్మాలనే తలచుకుంటున్నారు.

అప్పుడు ఒక అద్బుతం జరిగింది. మిఠాయి కొట్టు యజమాని ఒకడు వెతుక్కుంటూ వచ్చి స్వామీజీ పాదాలపై వాలి వెంట తెచ్చిన భోజనం పొట్లాం చూపిస్తూ స్వీకరించమని ప్రాధేయపడ్డాడు. స్వామీజీ ఎవరు నాయనా నీవు.. నేను నిన్ను ఎరుగనే... పొరబడుతున్న ట్లున్నావు. నీవు వెతుకుతున్న వ్యక్తిని నేను కాదు అని అంటూ ఉంటే ఆ వ్యక్తి స్వామీజీ ముందు చిన్న పీట వేసి భోజనం ఒక ఆకు మీదకు మారుస్తూ... లేదు స్వామీ నేను కలలో చూసింది మిమ్మల్నే. శ్రీరామచంద్ర మూర్తి స్వయంగా నా కలలో కనిపించి మిమ్మల్ని చూపించి నా బిడ్డ ఆకలితో ఉంటే నీవు హాయిగా తిని నిద్రిస్తున్నావా.. లే.. లేచి అతనికి భోజనంపెట్టు అని ఆజ్ఞాపించారండి. ఆహా.. ఏమి నా భాగ్యం మీ వలన నాకు రామ దర్శనం కలిగింది. తండ్రీబిడ్డలు ఇరువురుది ఏమి గాంభీర్యం, ఏమి సౌందర్యం ఒక్కసారి చూస్తే చాలు ఎవరూ మరచిపోలేరు. నేను పొరబడటం లేదు స్వామీ.. దయచేసి వేడి చల్లారక ముందే ఆరగించండి. చల్లటి నీరు కూడా తెచ్చాను” అన్నాడు. 

స్వామీజీ కనుల వెంబడి జలజల నీరు కారింది. ఏ అభయహస్తమైతే తన జీవితమంతా ఆయనను కాపాడుతూ వస్తుందో... అదే అభయ హస్తమిది. ఎదురుగా నోరు వెళ్లబెట్టి ఇదంతా చూస్తున్న వడ్డీ వ్యాపారికి సన్యాస జీవితమంటే భగవంతుని వడిలో నివసించటం అని అర్థమయింది. అశ్రునయనాలతో లేచి వచ్చి స్వామికి సాగిలపడి నమస్కరించాడు. నిజమైన సన్యాసిని దూషించటం అంటే భగవంతుని దూషించినట్లే... కాబట్టి ఎవరిని చులకన చేసి మాట్లాడకూడదు.!

Thursday, August 1, 2024

జీవించడం ఒక కళ.*

 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*జీవించడం ఒక కళ.*

➖➖➖✍️

చెట్టుమీద పాకే గొంగళి పురుగు జీవించడం అంటే ఏమిటో చెబుతుంది.

అది మనిషి ముందే సీతాకోకచిలుకై ఎగిరి వెళ్తుంది. మనిషి మనసు మాత్రం గొంగళి పురుగులా ఉండిపోతోంది.

‘ఎప్పటికైనా ఎదగాలి, ఎగరాలి’

అని ప్రణాళిక సిద్ధం చేసు కోవడంతోనే మానవుడి సమయమంతా గడచిపోతోంది.

జీవించడంలో ఎంత ఉదాత్తత, ఔన్నత్యం ఉంటాయో తెలుసుకోవాలని ప్రకృతి పలు విధాలుగా బోధిస్తోంది.

అంతటా ఒకే రకమైన ప్రేమతత్వం పంచుతున్నా- ఈ జీవితం ఎందుకో, ఎలా జీవించాలో మనిషికి ఇంకా అవగాహన కావడం లేదు.

ఏదో విధంగా బతకడమన్నది నిజమైన జీవనం అనిపించుకోదు. ఏ ఎండకు ఆ గొడుగు పట్టడమూ జీవనం కాదు.

బతుకు బండిని ఎలాగోలా లాగించడమన్నదే మానవుడి అంతిమ లక్ష్యం కాకూడదు.

మనము ఎక్కడి నుండి వచ్చినాము? ఎందుకు వచ్చినాము? ఏమి

చేస్తున్నాం? ఏమి చేయాలి? మనము ఎక్కడికి వెళతాము? అనే ప్రశ్నలు మీలో తలెత్తి ,వాటి గురించి వివరంగా తెలియ జేసే జ్ఞానాన్ని తెలుసుకునే ప్రయత్నం

చేయడ మే నిజమైన జీవితం.

కాళీమాత ఆలయంలో ఓరోజు ప్రసాదంగా ఇవ్వడానికి లడ్డూ తయారు చేస్తున్నారు.

అయితే ఎక్కడి నుంచి వచ్చాయో తెలీదు..

లడ్డూకి చీమలు పట్టడం మొదలైంది.

లడ్డూ తయారు చేస్తున్న వారికి ఏం చేయాలో తెలీలేదు.

చీమలను చంపకుండా ఎలా?’ అని ఆలోచనలో పడ్డారు.

వాటిని చంపకుండా ఉండడానికి ఏం చేయాలో చెప్పమని రామకృష్ణ పరమహంసను సలహా అడిగారు.

అప్పుడాయన చీమలు వస్తున్న దారిలో చక్కెర పొడి చల్లండి. వాటిని తీసుకుని చీమలు వెళ్ళిపోతాయి,

ఇక ఇటు రావు అని సూచించారు.

పరమహంస చెప్పినట్లే చీమలొచ్చే దారిలో చక్కెర పొడి చల్లారు.

ఆ పొడిని చూడటంతోనే వాటిని నోట కరుచుకుని చీమలు కాస్సేపటికల్లా అక్కడి నుంచి వెళ్ళిపోవడం మొదలుపెట్టాయి....

సమస్య కొలిక్కి వచ్చింది....

ఈ దృశ్యాన్ని చూసిన పరమహంస గారు ఇలా అన్నారు.... "మనుషులూ ఈ చీమల్లాంటివారే. తాము కోరుకున్న వాటిని పొందాలనుకుంటూనే

తమకు తెలియకుండానే దానిని మధ్యలోనే విడిచిపెట్టి మరొకటేదైనా దారిలో కనిపిస్తే దానితో సరిపెట్టుకుంటారు తప్ప ముందనుకున్న లక్ష్యాన్ని విడిచిపెడతారు..”

అని చెప్పారు.

తమకు కావలసింది చక్కెర కాదు లడ్డూ పొడేనని ఒక్క చీమా ముందుకు రాలేదు.

మనం కూడా అలానే ‘భగవంతుడు సర్వస్వము’ అనుకొనే ధ్యాన సాధన మొదలు పెడతాము,

మధ్యలో ఎవరో ఎదో చెపితే దాని వద్దకు వెళ్లి మన సాధన అంతా వృధా చేసుకొంటాము..

తీయగా ఉందన్న చక్కెరతో సరిపెట్టుకుని వెళ్ళిపోయాయి చీమలు.

రవ్వంత చక్కెర సంతోషం చాలనుకున్నాయవి.

లడ్డూ అంత పరిపూర్ణమైన సంతోషం పొందాలనుకునే వారు చాలా తక్కువ మందే అని పరమహంస చెప్పారు.✍️

🙏 *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

🙏 *లోకా సమస్తా సుఖినోభవన్తు!*

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

**** *పెళ్ళంటే మాటలు కాదు గురూ...* (ఆటా వారి అమెరికా భారతి లో వచ్చిన కథ) - డా.ఎం.హరికిషన్-కర్నూలు-9441032212

 *పెళ్ళంటే మాటలు కాదు గురూ...* (ఆటా వారి అమెరికా భారతి లో వచ్చిన కథ) - డా.ఎం.హరికిషన్-కర్నూలు-9441032212
**************************
ఒక ఊరిలో ఒక యువకుడు ఉండేటోడు. వాడు కొంచెం అమాయకుడు. ఇల్లు, పొలము తప్ప వేరే లోకం సంగతి ఏమీ తెలియదు. ఎవరినీ కలవడు. మాట్లాడడు. కొంతకాలానికి వానికి పెళ్లి వయసు వచ్చింది. చుట్టుపక్కల వున్న వాని ఈడు పిల్లలందరికీ ఒక్కొక్కరికే పెళ్లిళ్లు కాసాగాయి. కానీ వీళ్ళ నాయన వీని గురించి ఏమీ పట్టించుకోవడం లేదు. వానికి పెళ్లి చేసుకోవాలని వున్నా 'మా నాయనకు తెలీదా నాకు ఎప్పుడు చేయాల్నో' అనుకుంటా ఎదురు చూడసాగినాడు. నెమ్మదిగా వానికంటే చిన్నోళ్ళు కూడా పెళ్లి చేసుకుని పిల్లల్ని సంకనేసుకొని వాని ముందే తిరగడం మొదలుపెట్టినారు. దాంతో ఇంక లాభం లేదనుకొని ఒకరోజు వాళ్ళ నాయనతో "నాయనా... ఇంట్లో పెళ్లీడుకొచ్చిన కొడుకు ఒకడున్నాడు అనే విషయం గుర్తుందా లేదా నీకు. అసలు నాకు పెళ్లి చేసే ఆలోచన వుందా లేదా" అని నిలదీసినాడు.
దానికి వాళ్ళ నాయన "రేయ్... పెళ్లంటే మాటలు కాదురా... సంసారం సముద్రం లాంటిది. దానిని ఈదడం నీలాంటి అమాయకులకు అంత సులభం కాదు. ఎంతో ఓర్పు, నేర్పు, పట్టుదల వుండాల, అడుగడుగునా కష్టాలు, అనేకమైన ఒడిదుడుకులు వస్తా పోతా వుంటాయి. వాటిని ఎదుర్కొనే సత్తా నీలో వుందో లేదో తెలియక పెళ్లి చేయడానికి వెనుకడుతా వున్నా" అన్నాడు.
దానికి ఆ అమాయకుడు "నాయనా... మరి అవన్నీ నాలో పెరగాలంటే, నేను కూడా అందరిలాగా తయారు కావాలంటే ఏం చేయాల" అని అడిగినాడు. వాళ్ళ నాయన కాసేపాలోచించి "రేయ్...ఒక పని చెయ్. ఈ లోకంలో ఎవనికైనా సరే అమాయకత్వం పోయి రాటుదేలలంటే దేశసంచారం చేయాల. ఒక ఏడాది పాటు ఇల్లు వదిలి దొరికిన చోట పని చేసుకుంటూ, ఆకలేసిన చోట తినుకుంటూ, నిద్ర వచ్చిన చోట పడుకుంటూ, కనబడిన వాళ్ళందరితోనూ మాట కలుపుతూ, చూసిన ఊరు చూడకుండా, విశేషాలు వింతలు తెలుసుకుంటూ, దేశం అంతా తిరిగిరా. అలా వచ్చేటప్పుడు కప్ప లగువు, చీమ బిగువు, మనిషి మాటకారితనం... ఈ మూడింటికి అర్థం తెలుసుకొని రా. అప్పుడు నీకు తప్పెట్లు మేళాలతో... ఊరు ఊరంతా ఊరేగిస్తూ... నింగికి నేలకు పందిరేసి, ఎక్కడెక్కడి బంధువులందరినీ పిలిపించి బ్రహ్మాండంగా పెళ్లి చేస్తా" అని చెప్పినాడు.
దాంతో వాడు సరేనని తర్వాత రోజు పొద్దున్నే తలస్నానం చేసి, సద్దిమూట కట్టుకొని, అమ్మానాన్నల కాళ్లు మొక్కి దేశాటనకు బయలుదేరినాడు. ఎండకు ఎండుతా, వానకు తడుస్తా, చలికి వణుకుతా, దొరికినప్పుడు తింటా, దొరకనప్పుడు వుత్త నీళ్లు తాగుతా, ఒక్కొక్క ఊరే తిరుగుతా, అందరితో మాట కలుపుతా, నెమ్మదిగా రాటుదేలసాగినాడు.
అట్లా మూడునెలలు గడిచినాయి.
ఒకరోజు ఒక గుడి ముందు ప్రసాదం పంచి పెడతా వుంటే తాను కూడా తెచ్చుకొని ఒక బండమీద కూర్చుని తినసాగినాడు. అట్లా తింటావుంటే వాని చూపు అక్కడ ఒక చీమ మీద పడింది. ఆ చీమ చిన్నగా వున్నా దానికి పదింతల బరువున్న బియ్యపు గింజను పట్టుకొని లాక్కొని పోతావుంది. మధ్యలో చిన్న చిన్న రాళ్లు వచ్చినా, ఆకులు వచ్చినా, భూమి ఎగుడుదిగుడు వున్నా, పట్టినపట్టు వదలడం లేదు. అంత పెద్దదాన్ని అలాగే కిందా మీదా పడతా వదలకుండా లాక్కొని పోతావుంది. అది చూస్తావుంటే వానికి వాళ్ళ నాయన చెప్పిన 'చీమ బిగువు' అనే మాట మతికివచ్చింది.
'ఈరోజు నేను ఒక్కడినే. కానీ ఆ తరువాత పెళ్ళాం పిల్లలు, కుటుంబం... చూస్తుండగానే పెద్దగా మారిపోతుంది. ఖర్చులు అవసరాలు పెరిగిపోతాయి. కానీ ఏమాత్రం తొణక్కుండా చిన్న చీమ కదా ఒక్కటే తనకన్నా పదింతల బరువు వున్న బియ్యపుగింజను లాక్కొని పోతావున్నట్లు ఇంతపెద్ద కుటుంబాన్ని లాక్కొని పోవాలి' అని వానికి వాళ్ల నాన్న చెప్పిన మాటకు అర్థం బోధపడింది. పెదవులపై చిరునవ్వు మెరిసింది. హమ్మయ్య ఒకదానికి అర్థం తెలుసుకున్నాను అనుకున్నాడు.
మరలా దేశాటన మొదలైంది. మరో నాలుగు నెలలు గడిచినాయి. అట్లా పోతావుంటే దారిలో ఒక కాలువ అడ్డం వచ్చింది. దాదాపు పది అడుగుల వెడల్పు వుంది. దాంతో పంచె పైకి ఎగ్గట్టి నెమ్మదిగా కాలువలోకి దిగినాడు. ఆ ఒడ్డున ఒక కప్ప వుంది. వీడు నీళ్లలోకి దిగగానే ఆ చప్పుడుకి అదిరిపడి ఒక్కసారిగా ఎగిరి అవతలి ఒడ్డుకు దూకింది. అది చూసి ఆ అమాయకుడు ఇంత చిన్న కప్ప పది అడుగుల దూరాన్ని అంత అవలీలగా ఒక్క లగువుతో ఎట్లా దాటిందబ్బా అని ఆశ్చర్య పోయినాడు. అంతలో వానికి వాళ్ల నాయన చెప్పిన 'కప్పలగువు' అనే మాట మతికి వచ్చింది. 'సంసారంలో ఎప్పుడు ఎటువైపు నుంచి హఠాత్తుగా ఏ సమస్య వచ్చి మీద పడుతుందో ఎవరికీ తెలియదు. కానీ నెత్తిమీదికి ఎంత ఆపద ముంచుకొచ్చినా సరే ఏమాత్రం తొణక్కుండా కప్ప గదా అంత పెద్ద కాలువను అవలీలగా ఒక్క లగువుతో దాటినట్లు సమస్యను దాటగలగాల అని నాన్న చెప్పిన మాటకు వెనుక వున్న అర్థం బోధపడింది. చేతులు ఎత్తి నాన్నకు మనసులోనే దండం పెట్టుకున్నాడు.
మరలా ముందుకు సాగినాడు. అట్లా అనేక దేశాలు తిరుగుతా వున్నాడు. ఏడాది పూర్తవుతా వుంది గానీ 'మనిషి మాటకారితనం' అనే మాటకు మాత్రం అర్థం మాత్రం దొరకలేదు. దానిని తెలుసుకోకుండా ఎట్లా ఇంటికి పోవాల, ఏ మొగం పెట్టుకొని పెళ్లి చేయమని అడగాల అనుకుంటూ దిగులుగా ఒక ఊరి ముందున్న మంచినీటి చెరువు కాడ కూర్చుని ఆలోచనలో పడినాడు. చానామంది ఆడోళ్ళు, మొగోళ్ళు నీళ్లకోసం వస్తా వున్నారు, పోతా వున్నారు కానీ ఎవరూ వాని గురించి పట్టించుకోవడం లేదు.
ఆ ఊరిలో ఒక అమ్మాయి వుంది. చానా తెలివైనది. మాటకారి. ఆ అమ్మాయికి కొత్తగా ఆరు నెలల కిందనే పెళ్లయింది. నీళ్లకోసం బావి దగ్గరికి వచ్చింది. నీళ్లు మంచుకుంటా ఈ అమాయకున్ని చూసింది. 'ఎవరబ్బా ఇతను. ఈ ఊర్లో ఇంతకుముందు ఎప్పుడూ చూడలేదే' అనుకుంది. బిందె తీసుకొని వెళ్ళిపోయింది. మళ్ళా కాసేపటికి నీళ్లకోసం వచ్చింది. ఇంకా అతను అక్కడే కూర్చొని కనబడినాడు. 'పాపం... ఎవరికోసమో ఎదురు చూస్తా ఉన్నట్టున్నాడు చానాసేపటి నుంచి' అనుకుంటూ బిందె తీసుకొని వెళ్ళిపోయింది. మరో గంటకు మళ్ళా నీళ్లకోసం వచ్చింది. ఆ అమాయకుడు ఇంకా అక్కడే కనబన్నాడు. 'ఎవరబ్బా ఇతను పొద్దున్నుంచి ఇక్కడే ఉన్నాడు. ఏంది సంగతి?' కనుక్కుందామని వాని దగ్గరికి వచ్చి "ఎవరు నువ్వు? ఎక్కడినుంచి వచ్చినావు? ఎవరికోసం పొద్దున్నుంచీ ఎదురు చూస్తా వున్నావు? ఏమి నీ సమస్య?" అని ప్రశ్నల మీద ప్రశ్నలు వేసింది.
దానికి వాడు జరిగిందంతా చెప్పి "ఈరోజుతో నేను దేశాటనకి బయలుదేరి ఏడాది పూర్తవుతా వుంది. ఇంక రేపు మా ఊరికి పోవాల. కానీ చీమ బిగువు, కప్ప లగువుల గురించి తెలుసుకున్నా కానీ మనిషి మాటకారితనం గురించి మాత్రం తెలుసుకోలేకపోయినా. మా నాయనకు నా ముఖం ఎట్లా చూపించాల" అన్నాడు బాధగా.
ఆమె చిరునవ్వు నవ్వి "సరే... నా వెంట రా. అక్కడ నోరు తెరిచి ఒక్క మాటా మాట్లాడొద్దు. మనిషి మాటకారితనం ఎట్లా వుంటుందో నీకు అర్థం అయ్యేలా చేస్తా. ఒక మనిషి పెళ్ళికి సాయం చేస్తే వంద బావులు తవ్వించినంత పుణ్యం వస్తాదంట" అనింది. వాడు 'సరే' అని గమ్మున మూగోని లెక్క ఆమె వెంట బయలుదేరినాడు.
నీళ్లకని పోయిన పెళ్ళాం ఎవరో కొత్తవ్యక్తిని వెంటబెట్టుకొని రావడం చూసి ఆమె మొగుడు ఆశ్చర్యంగా "ఎవరే ఈయన... ఇట్లా ఇంటికి పిలుచుకోని వచ్చినావు" అని అడిగినాడు. దానికామె చిరునవ్వు నవ్వి "ఈయన నాకు వరుసకు బావ అవుతాడు. పుట్టు మూగ. మన మాటలు వినబడతాయి గానీ నోరు తెరిచి ఒక్క మాటా మాట్లాడలేడు. మన పెళ్లి జరిగే సమయంలో దేశాటనకు పోయినాడు. అందుకే అప్పుడు కనపడలేదు. ఊరూర్లు తిరుగుతా... తిరుగుతా... ఈరోజు మన ఊరికి వచ్చినాడు. అనుకోకుండా చెరువు కాడ కనపడితే గుర్తుపట్టి ఇంటికి పిలుచుకొని వచ్చినా. మధ్యాన్నం అన్నం తిని వెళ్ళిపోతాడు" అని చెప్పింది. ఆ మాటలు విని అత్తామామలు, బావమరదులు సంబరంగా "అట్లాగా... అయితే వెంటనే మధ్యాన్నం బాగా మసాలా యేసి కమ్మని కోడి కూర, పలావు చెయ్. తిని పోతాడు. మళ్ళా ఎప్పుడు చూస్తామో ఏమో" అంటూ కాసేపు విశ్రాంతి తీసుకోమని గది చూపించినారు. వాడు ఉడుకుడు నీళ్లతో స్నానం చేసి హాయిగా మంచం మీద నిద్రపోయినాడు.
మధ్యాన్నం గుమగుమలాడేలా కోడికూర చేసినారు. గురకలు బెడతా నిద్రపోతా వుండడంతో లేపడం ఎందుకని అందరూ భోజనం చేసి ఇంటి బయట కూర్చుని మాటల్లో పడినారు. కాసేపటికి గదిలో ఆ అమాయకుడు నిద్ర లేవడంతో ఆ అమ్మాయి కోడికూర, జొన్నరొట్టె, పలావు, నీళ్లు తీసుకొని గదిలోనికి పోయింది. ఆ అమాయకుడు అన్నీ తిని నీళ్లు తాగుతా వుంటే ఉన్నట్టుండి గట్టిగా "పట్టుకుండే పట్టుకుండే... రండి కాపాడండి... కాపాడండి" అంటూ కప్పెగిరి పోయేటట్లు గట్టిగా అరిచింది. ఆ అరుపులు వినగానే బయట కూర్చున్న అత్తామామలు, ఆమె మొగుడు అదిరిపడినారు. లోపల వాడు అమ్మాయి చేయి పట్టుకున్నాడేమో అని భయపడి దొరికిన కత్తులు, కట్టెలు తీసుకొని వేగంగా లోపలికి బుసలు కొట్టుకుంటా దూసుకొచ్చినారు. వాళ్ల చేతుల్లోని ఆయుధాలు చూడగానే ఆ అమాయకుని పైప్రాణాలు పైన్నే పోయినాయి. భయంతో వణికిపోయినాడు.
వాళ్లు చూస్తే ఇంకేముంది వాళ్ళ కోడలు ఆ అమాయకుని గొంతు నెమ్మదిగా పట్టుకొని కిందికి మీదికి నిమురుతా కనబడింది. వాళ్ళు అర్థంకాక "ఏమ్మా ఏమైంది. అట్లా అరిచినావు" అని అడిగినారు. దానికి ఆమె "మా బావ ముక్క మింగుతా వుంటే గొంతుకు అడ్డంపడి పట్టేసింది. ఊపిరాడక గిలగిలా కొట్టుకుంటా వుంటే బెదపడి అరుస్తి" అనింది. ఆ మాటలకు వాళ్ళు "అంతేనా... తినేటప్పుడు కొంచెం జాగ్రత్త నాయనా. నెమ్మదిగా మధ్యమధ్యలో నీళ్లు తాగుతా తిను. లేకుంటే గొంతు ఎండిపోయి మద్ద దిగక పట్టుకుంటాది" అని చెప్పి నీళ్లు తాపి పోయినారు. అప్పటికే భయంతో ఆ అమాయకుని ఒళ్లంతా చెమటతో తడిసి ముద్దయింది.
అప్పుడు ఆమె "ఇప్పుడు అర్థమైందా... మనిషి మాటకారితనం అంటే ఏమిటో. మాట రెండు వైపులా పదునైన కత్తి లాంటిది. ఒక్క నిమిషంలో చంపించనూ గలదు. మరుక్షణమే బతికించనూ గలదు. ఇంక పోయి మీ నాయనకు అన్నీ చెప్పి హాయిగా పెళ్లి చేసుకో. ఈ చెల్లిని మరిచిపోక గుర్తు పెట్టుకో" అనింది నవ్వుతూ. ఆ అమాయకుడు ఆమెకు దండం పెడతా "అమ్మా... ఏమో అనుకుంటి గానీ నీవు చానా గొప్పదానివి. మనిషి తన మాటకారితనంతో ఎప్పుడు ఎట్లా ఆపదలు సృష్టిస్తాడో, ఎట్లా బయట పడేస్తాడో కళ్ళకు కట్టినట్టు చూపించినావు. చావు చివరి అంచు దాకా పోయి వచ్చినట్లు అనిపించింది. జీవితంలో మనచుట్టూ ఉండే మనుషులతో ఎంత జాగ్రత్తగా మసులుకోవాలో అర్థమైంది" అంటూ అందరికీ మౌనంగా దండం పెట్టి సంబరంగా ఊరికి బయలుదేరినాడు.
**************************
డా.ఎం.హరికిషన్-కర్నూల్ -9441032212
**************************
కథ నచ్చితే *SHARE* చేయండి. రచయిత పేరు మార్చకండి. తీసేయకండి.

విదురుడు మహాభారత యుద్ధంలో ఎందుకు పాల్గొన లేదు?

 విదురుడు మహాభారత యుద్ధంలో ఎందుకు పాల్గొన లేదు?

విదురుడు యుద్ధ విద్యలు నేర్చిన వాడే. పాండురాజు తన బిడ్డల బాధ్యత తన సోదరులిద్దరి మీద పెట్టి పోయాడు. పెద్ద వాడు పుత్ర మోహాంధుడై తన కర్తవ్యం విస్మరించాడు. చిన్న వాడు విదురుడు బాధ్యతతో మెలగాడు.

మాయాజూదంలో పాండవులను పద భ్రష్టులను చేసిన ఆనందం లో ఇపుడు మన పాలన ఎట్లా ఉంది? అని పట్టరాని ఆనందంలో అడిగాడు ధృతరాష్ట్రుడు విదురుణ్ణి.

నిజంగా నీ శ్రేయస్సు కోరే వాళ్లు పాండు పుత్రులు. వాళ్లను పిలిపించి , ఆదేశించినపుడు నీకు కీర్తి, గౌరవం అని మంచి చెప్పాడు విదురుడు.

"నీకు వాళ్లే కనిపిస్తారు. నా బిడ్డలు ఎంత గొప్ప వాళ్లైనా నీ కంటికి ఆనరు . నీ (పాడు) మొగం చూపించక దూరంగా వెళ్లి పో —నీ కిష్టమైన చోట ఉండు"— అని బహిష్కరించాడు .

ఆయన వెళ్లి పోయాడు. మళ్ళీ ఏమనుకొన్నాడో! తనకు అప్రతిష్ఠ ఔతుంది-' అని భయపడ్డాడో ఏమో! దొంగ ఏడుపులు ఏడుస్తూ "నా తమ్ముడు నన్ను వదలి పోయాడు. పిలుచుకురా" అని సంజయుణ్ణి పాండవుల దగ్గరకు పంపాడు.

తర్వాత విదురుడు అంతంత లోనే ఉండి తన విధులు నిర్వర్తిస్తూ వచ్చాడు. రాజ్య తంత్ర నిర్వహణ ఈయన, ఆవాపం (అంటే పరరాజ్య చింత—  భీష్ముడు… నిర్వహించే శాఖలు.

తర్వాత పాండవుల పాలు వాళ్లకు ఇచ్చి వేయవలసిన రోజు వచ్చింది. [సంపద దక్కి యుండగ అశక్తులనం జను మమ్ము పిల్చి పూజింపగ అంత బేలె పతి? అంటాడు ధర్మ రాజు. అది ఆ నాటి పరిస్థితి. ] రాయబారం చేయమని పంపవలసినది విదురుణ్ణి. కానీ ఇలాంటి అయోగ్యపు పని చేయమని అడగడానికి ధృతరాష్ట్రుడికే మొగం చెల్లలేదు. తన ఆంతరంగిక మిత్రుడు సంజయుణ్ణి పంపించుకొన్నాడు.

రాయబారం వచ్చిన కృష్ణుడు స్పష్టంగా "మీ ఎల్లర అన్నంబులు అశుచులు. * విదురాన్నంబొక్కటి భోక్తవ్యంబని* నిశ్చయించితి అని చెప్పాడు. విదురుడి ఇంట ఆ 13 సంవత్సరాలు తల్లి కుంతి తలదాచుకొన్నది. విదురుడు ఇతరుల కంటే భిన్నంగా ఉంటూ ఉండిన పరిస్థితి అది. దుర్యోధనుడు విదురుణ్ణి లెక్క పెట్టడు.

ఆ పక్షంలో ఉన్నాడు గాబట్టి ఆ అధర్మం నిలపడానికే తానూ యుద్ధం లో పాల్గొనాలి. తనకు ఇష్టం లేదు. వాళ్లూ తనను నమ్ముకోలేదు. సహాయం కోరలేదు. కృష్ణుణ్ణి ఇంటికి పోయి కోరబట్టి పాల్గొన్నాడు. భీష్మ ద్రోణులనూ ప్రార్థించాడు దుర్యోధనుడు. తనకట్టి విపత్కర పరిస్థితి భగవంతుడు కలిగించలేదు. ఈ ఘోరకలి తప్పదు. నివారించవలసిన బాధ్యత గల రాజు ఉదాసీనత వహించాడు—అని

అక్కడ ఉండి ఆ విషాద వార్తలు వినలేక తీర్థయాత్రలు చేసి కాలం గడిపేశాడు విదురుడు.

తొడలు విరిగి చస్తూ * ఆ నాడే మా పినతండ్రి చెప్పాడు:— జూదపు ఆసపడం గాదు— అని. వినక పోతిని *—అని ఆ కులపాంసనుడు విదురుణ్ణి మహామతిని స్మరించుకొన్నాడు.

బలరాముడూ ఈ పనే చేశాడు. తనకు దుర్యోధనుడు అంటే ప్రీతి. పాండవులవైపు ధర్మం ఉంది. పోరాడితే కృష్ణుడికి ఎదురు నిలబడాలి… దిగితే తాడో పేడో తేల్చుకోవాలి— ఎటూ పాలుబోక ఆయనా తీర్థ యాత్ర చేశాడు. ఐనా ఉండబట్టలేక భీమ దుర్యోధనుల గదాయుద్ధం చూడడానికి హడావిడిగా పరుగులు దీస్తూ వచ్చాడు. 

విదురుడికి బంధు నాశం జరుగుతున్నదే!! అనే విషాదమే. తన అశక్తత తలపోస్తూ , పరదేశాలలో కాలం వెళ్లదీయవలసిన కష్టకాలం. అదెట్లో భరించి,, గతి లేని తన సోదరుణ్ణి అనునయించే బాధ్యత మళ్ళీ స్వీకరించి అతడికి మనశ్శాంతి కలిగించాడు.

పాశుపతాస్త్రం గొప్ప ధనం ఏమిటీ. ధీనిని అర్జునుడు కురుక్షేత్రంలో ఎందుకు వాడలేదు

 పాశుపతాస్త్రం గొప్ప ధనం ఏమిటీ. ధీనిని అర్జునుడు కురుక్షేత్రంలో ఎందుకు వాడలేదు

పశుపతి ఇచ్చే అస్త్రం పాశుపతాస్త్రం.. బ్రహ్మాస్త్రం, నారాయణాస్త్రం పాశుపతాస్త్రం —ఇవి మూడూ మహాశక్తివంతాలు.

వ్యాసమహర్షి ఆదేశం మీద ధర్మ రాజు అర్జునుడికి *ప్రతిస్మృతి* అనే మంత్రాన్ని ఉపదేశించాడు. హిమాలయాలకు వెళ్లి అక్కడ తపస్సాధన చేయమన్నాడు.

అక్కడ నాలుగు నెలల పాటు ఘోర వీరతపం చేశాడు అర్జునుడు. పరమేశ్వరుడు అతని శక్తినీ , నిగ్రహాన్నీ పరీక్షించ దలచాడు . 'మూకుడు' అనే ఒక రక్కసుణ్ణి పంది రూపంలో ప్రవేశ పెట్టి, తాను కిరాతరూపంలో ప్రవేశించాడు.

"శక్తి ఉన్నది గదా "—అని అనవసరమైన చోట్ల వినియోగం చేసేవాడు కాదని , అస్త్రం శస్త్రం ఏది ఎపుడు వాడుకోవాలో తెలిసిన నిగ్రహశాలి అనీ , పాశుపతాస్త్రం ఇవ్వడానికి అర్హత ఉన్న వాడనీ నిర్ధారణ చేశాడు. పంతం వీడని , ధర్మ పథం తప్పని వీరుడని పాశుపతాస్త్రం ఇచ్చాడు. దీని బలంతో భీష్మ ద్రోణులను జయిస్తావు, కర్ణుణ్ణి వధిస్తావు అని చెప్పి ప్రయోగ ఉపసంహారాలతో సంపూర్ణంగా ఉపదేశించాడు.

అంత పెద్ద అస్త్రం తనకుండడం విశేషమనీ, ఒక్క రోజులోనే కురుక్షేత్ర యుద్ధం అంతం చేయగలననీ అర్జునుడికి అపారధైర్యం కలగడం ఈ మంత్రలాభం వల్లనే. అంతటి మేటి భీష్ముడూ అర్జునుణ్ణి జయించడం తన వల్ల కాదు అని చెప్పడం ఈ అస్త్రబలం కలిగి ఉన్నాడనే.

పాశుపతాస్త్ర ప్రదాన ఘట్టం గమనించి చూడవలసిన అంశం. "కేవల ఆటవికుడు- ఈ వచ్చిన వాడు " —అని అనుకొన్నప్పుడు వేటకు వాడే బాణాలు వేశాడు. అవి విఫలం కాగా" ఇది దివ్యభూమి. ఈ రూపంలో ఉన్న ఏ దేవతో ?" అనుకొని అస్తాలు ప్రయోగించాడు. అవీ పర్వతం మీద పడిన తొలకరి వాన లాగా అతడి లోపలే ఇమిడిపోయాయి. మంత్రాలూ స్మరణకు రాలేదు. ఐనా, వింటితోనే కిరాతుడితో పోరాడాడు. ఇంత పంతం ఎందుకు?? అంటే *మృగయాధర్మ విరోధం * చేసిన కిరాతుణ్ణి , తప్పు ఒప్పుకొనని అతణ్ణి శిక్షించటం క్షత్రియుడి విధి — అని అతడు విశ్వసించడమే.

ప్రశాంత తపోవనంలో అడవిపంది ప్రవేశించింది. దాని పీడ తొలగడానికి అర్జునుడు బాణం వేశాడు. ఇతడు వేసిన తర్వాత ఎదుటి వైపు నుంచి ఒక కేక.. "ఏయకు ఏయకు" అంటూ ఒక బాణం దానిమీదనే వేశాడు కిరాతుడు. అది కాస్తా చచ్చి అదృశ్యమైపోయింది.

నేను వేసిన జంతువుమీద నీవెందుకు బాణం వేశావు? తప్పు చేశావు —అని నరుడు.
అది నాది..ఎంతో దూరం నుంచి తరుముకొంటూ ఒక పంతంగా ఎట్లైనా దీన్ని ఈ రోజు కొట్టాలి అని ఉత్సాహంగా దాని వెంట వస్తూ ఉంటే నీవు నా ఎరపై బాణం వేశావు. నీదే తప్పు అని హరుడు.

హరుడు అసత్యం చెప్పలేదు . ఆయనే సజీవాస్త్రం మూకుణ్ణి అర్జునుడిపై ప్రయోగించాడు . తన బాణంతోనే అది చచ్చి అదృశ్యమయింది . మధ్యలో ఒక తుస్సు బాణం వేశాడు అర్జునుడు. దానితో గాయపడవచ్చు గానీ చచ్చి అదృశ్యమౌతుందా?

అర్జునుడు : నేను ముందు బాణం వేసిన దాని మీద నీవు బాణం వేయగూడదు. ఒకరు వేటాడే దాని మీద ఇంకొకరు వేయవచ్చా? తప్పు ఒప్పుకోని వెళ్లి పో—అని.

చిలికి చిలికి గాలివాన ఐంది.

చివరికి ఏ ఆయుధమూ లేకపోయినా భుజశక్తితో కిరాతుణ్ణి శిక్షించి ఒప్పుకొనేట్టు చేయ తలపడ్డాడు అర్జునుడు.

ఇది ఉత్తమ క్షత్రియ లక్షణం అని పరమేశ్వరుడు ప్రహర్షమందాడు.

హరుడి గాత్ర స్పర్శ మంత్ర స్వీకరణార్హత కలిగించడమే కాక , అనంత దివ్యశక్తినీ తనువులో నింపింది. హరి అనుగ్రహం హరుడి కటాక్షానికి కారణమయి నరుణ్ణి ఉత్తమోత్తమ ధానుష్కుణ్ణి చేసింది.

శక్తి ఉంది. సంయమనం ఉంది.

అందుచేతనే సంక్లిష్టమైన సైంధవ వధ సందర్భంలో మాత్రమే అర్జునుడా అస్త్రం ప్రయోగించాడు.

వృద్ధక్షత్రుడు కొడుకు మీద ప్రేమతో తన కొడుకు తలను నేలగూల్చిన వాడు వెంటనే తలిపగిలి చచ్చేట్టు వరం పొందాడు. సూర్యుడు అస్తమించే వేళలో ఎక్కడో నదీతీరంలో ఉన్న ఈ వృద్ధక్షత్రుని ఒడిలో సైంధవుడి తల కచ్చితంగా పడేట్టు బాణం వేయాలి. ఆ పెద్ద కష్టం వచ్చినపుడు మాత్రమే పాశుపతాస్త్రం ప్రయోగించాడు అర్జునుడు .

బ్రహ్మాస్త్రం గూడా కృష్ణుడు చెప్పగా అశ్వత్థామ అస్త్రానికి విరుగుడుగా మాత్రమే ప్రయోగించాడు.

తపస్సు ఏ విధంగా సంరక్ష్యమో, విద్యలు గూడా ఆ విధంగా ఉపాస్యములే. సర్వత్ర ప్రయోగించడం వాటిని అవమానించడమే ఔతుంది.

పాశుపతం పశుపతి స్వరూపము. అది పూజ్యము, పవిత్రము. [ఈ మహా మంత్రం లభించిన తర్వాత మిగిలిన దేవతలున్నూ అనుగ్రహించి దివ్యాస్త్రాలిస్తారు].

అంతర్యామి: సందేహాలకు సమాధానం

 సందేహాలకు సమాధానం

భగవంతుణ్ని తలచుకోగానే కొందరు సంశయాత్ములకు ఎన్నో సందేహాలు మనసును పట్టిపీడిస్తుంటాయి. అసలు భగవంతుడు ఉన్నాడా లేడా అనే సందేహం తరచుగా కలుగుతుంది.

కలడు కలండనెడువాడు కలడో లేడో అని మొసలి నోట చిక్కిన గజేంద్రుడూ సందేహించాడు. మళ్లీ అంతలోనే భగవంతుడి ఉనికిని సందేహించడమెందుకు, ఆయన అందరికీ అండగా ఉంటాడని శరణు వేడాడు. చివరికి శ్రీహరి మొసలిని సంహరించి గజరాజును కాపాడాడు.

కష్టాలను అనుభవిస్తున్నవారు భగవంతుడే ఉంటే ఆదుకోడేమని నిరాశలో కూరుకుపోతారు. మనసు అటూ ఇటూ ఊగిసలాడుతూ ఉంటుంది. తమ కర్మఫలాన్ని అనుభవించేదాకా భగవంతుడు కరుణించడని అర్థం చేసుకోలేరు. కష్టాలు తొలగిపోయినప్పుడే భగవంతుడున్నాడన్న నమ్మకం కలుగుతుంది.

భగవంతుడున్నాడన్న నమ్మకం కలిగాక ఎక్కడున్నాడన్న సందేహం పుడుతుంది. భగవంతుడు ఒకచోట ఉన్నాడని, మరొకచోట లేడనీ సందేహించ వద్దు. భగవంతుడు లేని చోటు ఈ విశ్వంలో లేదు. సముద్రంలో ఉన్నాడు. ఆకాశంలో ఉన్నాడు. సూర్యుడిలో, చంద్రుడిలో ఉన్నాడు. వ్యక్తుల్లో ఉన్నాడు. సర్వేశ్వరుడు అంతటా నిండి ఉన్నాడు. ఎక్కడెక్కడ వెతికితే అక్కడక్కడ కనిపిస్తాడనన్న ప్రహ్లాదుడి బోధను అర్థం చేసుకుంటే భగవంతుడు సర్వాంతర్యామి అని గ్రహించగలుగుతాం.

భగవంతుడుంటే ఆయన రూపం ఎలా ఉంటుందో తెలుసుకోవాలనిపిస్తే భగవద్గీత అందుకు దారి చూపుతుంది.

మహాభారత యుద్ధం ప్రారంభించబోతున్న సమయంలో అర్జునుడి మనోళ్లేశాన్ని తొలగించేందుకు భగవంతుడు అతడికి దివ్యదృష్టిని ప్రసాదించి తన పరమ దివ్య స్వరూపాన్ని చూపాడు. అర్జునుడు చూసిన ఆ విరాట్ రూపంలోని ముఖాలు అనంతాలు. నేత్రాలు ఆసంఖ్యాలు. ఆ రూపం దివ్యాభరణ శోభితం. భగవంతుడు అనేక దివ్యాస్త్రాలు ధరించాడు. ఆ దివ్య శరీరం నుంచి దివ్య చందన పరిమళాలు దశదిశలా గుబాళిస్తున్నాయి. ఆ రూపం సర్వాశ్చర్యకరం, అనంతం, ఆకాశంలోని వేలకొలది సూర్యులు ఒక్కసారి ఉదయిస్తే వచ్చే కాంతిపుంజాలు ఆ విరాట్ రూప తేజస్సునకు సాటిరావు.

అద్భుతమైన ఆ విశ్వరూపాన్ని దర్శించి అర్జునుడు ఆశ్చర్యచకితుడై భక్తి శ్రద్ధలతో సాష్టాంగ ప్రణామం చేశాడని భగవద్గీత వర్ణించింది. సామాన్య నేత్రాలతో చూడలేని ఆ విశ్వరూపాన్ని మనసులోనే ప్రతిష్ఠించుకోగల భక్తులు తమ మనోనేత్రాలతో భగవంతుణ్ని దర్శించుకోగలుగుతారు. మరి భగవంతుడి అనుగ్రహం సంపాదించడానికి మార్గమేమిటన్న ప్రశ్న ఉదయిస్తుంది.

భక్తి ఒక్కటే ఆ స్వామిని పొందే సాధనం. ఆ భగవానుడు భక్తికి చిక్కినట్లుగా మరి దేనికీ చిక్కడు. దానవులు, సురులు, నరులు... ఎవరైనా లక్ష్మీపతి అయిన శ్రీమహావిష్ణువు పాదపద్మాలను సేవిస్తే పుణ్యాత్ములు అవుతారని భాగవతం చెబుతోంది.

చంచలమైన మనసును కట్టడి చేయలేకపోతే అనేక సందేహాలు పీడిస్తూనే ఉంటాయి. భగవంతుడు ఉన్నాడని దృఢంగా విశ్వసించినప్పుడు మనసు నిర్మలమై సందేహాలు తొలగిపోతాయి.

ఆంజనేయుడు శ్రీరాముణ్ని తన హృదయంలో నిలుపుకొన్నట్లు మన గుండెల్లో భగవంతుణ్ని ప్రతిష్ఠించుకోవాలి. సర్వకాల సర్వావస్థలయందు నిరంతరం భగవంతుణ్ని స్మరించాలి. భగవద్భక్తి అనే అమృత సాగరంలో మునిగినవారికి మరణభయం ఉండదన్నారు శ్రీరామకృష్ణ పరమహంస.

****కోరికలు - ఆత్మ సాధన

కోరికలు - ఆత్మ సాధన

మనస్సు నుండి అనేక కోరికలు జనిస్తూ ఉంటాయి. అటువంటివాటిలో కొన్ని మనం ఏ ప్రయత్నం చేయకుం డానే పూర్తి అవుతాయి. అందువలన మనం సంతోషాన్ని పొందుతాం. మరికొన్ని కోరికలు మనం ఎంతగా ప్రయత్నం చేసినా పూర్తి కావు, కోరికలు ఫలించని పరి స్థితిలో రెండు రకాల ప్రశ్నలు మనముందు ఉంటాయి. అవి: ఒకటి 'నా కోరికలు ఏ విధంగా నెరవేరతాయి?' రెండు 'ఏ కోరికలు నెరవేరతాయో అటువంటి కోరికలనే నేను కోరుకోవాలా? అయితే ఈ రెండూ మన చేతిలో లేవు. మనస్సు వస్తువులతో అంటిపెట్టుకొని ఉండడం వలన కోరికలు జనిస్తాయి. ఇటువంటి కోరికల వల్ల మనకు వస్తువులతో సంబంధం ఉన్నట్లు ఆలోచనలు కలుగుతాయి. ఏదో ఒక కోరిక నెరవేరితే... దానివలన కొంత అనుభవం వస్తుంది. ఒకవేళ కోరిక నెరవేరకపోతే అది ఒత్తిడికి లేక కలవరపాటుకు దారితీ స్తుంది. అందువలన వేరొక రక మైన అనుభవం వస్తుంది.  కోరికలు నెరవేరినా లేక నెరవేర  కున్నా, వాటిని గూర్చి మన స్సులో ఎక్కువ ఆలోచనలు కలుగుతాయి. ఎవరైతే ఇటువంటి పరిస్థితిలో చిక్కుకొంటారో అటువంటివారి విధిని ఊబిలో చిక్కిన మనిషితో పోల్చవచ్చు. ఈ విధంగా చిక్కుకొని ఉన్నప్పుడు పరిష్కారం ఎక్కడ లభిస్తుంది?

మనస్సును నెమ్మదిగా, క్రమంగా, ఆలోచనారహిత స్థితికి తీసుకొని రావాలి. మనస్సులో ఆలోచనలు పుట్టక పోతే, అసలు ఆలోచనలనేవి ఉండనే ఉండవు. అలాగే కోరికలు కూడా ఉండవు. ఎవరైనా తన మనస్సును విచారించకుండా ఆపగలరా? ఎందుకంటే... ఎల్లప్పుడూ ఆలోచించడం మనస్సు సహజ లక్షణం. కాబట్టి (ఆత్మ) సాధకుడు తన సాధనల ద్వారా... ఆలోచనల వలన కలిగే ఒత్తిడిని దూరం చేసుకోవాలి. ఇందుకోసమై సాధకుడు తన దృష్టిని మళ్ళించకుండా, ఆధ్యాత్మిక లక్ష్యంపైనే మనస్సును కేంద్రీకరింప జేయాలి. దేవుని అనుగ్రహం వలన సాధకుడు కాస్త ముందుగానో లేక ఆలస్యంగానో తన సాధన ఫలితాలను పొందగలుగుతాడు.

దత్తబోధ 
శ్రీ గణపతి సచ్చిదానందస్వామి


గురువంటే .. ఈశ్వరుడే మనకి బోధించటానికి గురు రూపంలో వస్తాడు.* The highest service is teaching.



 *శ్రీ గురుభ్యోనమః*

        *గురువంటే ..  ఈశ్వరుడే  మనకి  బోధించటానికి  గురు  రూపంలో  వస్తాడు.*  The  highest  service  is  teaching.  బోధించటం  కంటే  మించిన  సేవ  ప్రపంచంలో  లేదు.  మీరు  వంద  కోట్లు  ఖర్చుపెట్టి  ఒక  గుడి  కట్టించటం  కంటే,  వందకోట్లు  ఖర్చుపెట్టి  ఒక  ప్రోజెక్ట్  కట్టించటం  కంటే,  ఇవన్నీ  మంచి  పనులే ..  కానీ  teachng  తోటి  సమానం  కాదు.  పరమాత్మ  గురించి  బోధించటం  కంటే  మించిన  సేవ  మరొకటి  లేదు.  *Teaching  వల్లే  అజ్ఞానం  అటూ  ఇటూ  షేక్  అవుతుంది,  అది  బయటికి  కక్కబడుతుంది.*

        ఓ అర్జునా ..  ఓ ధనంజయా ..  ఈ లోకంలో  ఎవరు  నాకు  బాగా  ఇష్టులు  అంటే,  ఈ లోకంలో  చాలామంది  ప్రాణికోటి   ఉన్నా ..  భూతకోటి  ఉన్నా ..  ఎవరు  నాకు  బాగా  ఇష్టులు  అంటే  అర్జునా ..  అని  అడిగి  ఆయనే  సమాదానం  చెప్పాడు.  ఓ అర్జునా ..  నీకూ  నాకూ  మధ్యన  జరిగిన  ఈ సంవాదాన్ని ..  ఈ భగవద్గీతను  ఎవరైతే  అధ్యయనం  చేసి,  అర్థం  చేసుకుని,  అనుభవించి,  ఇతరులకి  అర్థమయ్యేలా  ఎవరైతే  బోధిస్తున్నారో ..  అటువంటి  మనిషికంటే  ప్రీతిపాత్రుడు  నాకు  ఈ సృష్టి లో  లేడు  అని  వాసుదేవుని  వాక్కు !  

*Teaching is highest service.*  మీరు  సబ్జక్ట్   వినాలి,  వినకపోతే  మీకు  తెలియదు.  ఉపనిషత్తులలోని  ఏదైనా  వాక్యాన్ని  మనం  మననం  చేయాలి.  వింటేనే  మనకు  అర్థం  కాకపోతే ..  అసలు  వినకుండా  ఎలా  తెలుస్తుంది ?  మాష్టారు  చెప్పిన  లెక్కలు  మనకు  అర్ఠం  కాకపోతే ..  మనం  సొంతంగా  ఎలా  చేసుకోగలం ? 

*ఈశ్వరుని  స్వరూపమే  ఆనందం !  ఈశ్వరుని  యొక్క  స్వరూపం  ఏమిటంటే ..  సత్ చిత్ ఆనందం.  ఆ ఆనందమే  ఒక  రూపం  ధరించి  వస్తుంది.*            

*శ్రీ నాన్నగారి  అనుగ్రహ  భాషణం -*
*మురమళ్ళ :*  2005 / 02 / 09 
                    
🪷🙏🏻🪷🙏🏻🪷

above rules..below రూల్స్ అన్ని మనవే...

 ఎవ్వరో రాశారు...ఇది డైజెస్ట్ కానీ నిజం....above rules..below రూల్స్ అన్ని మనవే...

ఒకడి నాన్నతో కూర్చుని మందు కోడతాం .. 
మన నాన్న తాగొస్తే ఇంట్లో గొడవపెడతాం ... 
ఒకడి చెల్లితో మనం డే అండ్ నైట్ లవ్ ట్రాక్ చేస్తాం
మన చెల్లిని ఎవడన్నా చూస్తే నీతులు చెప్తాం
ఒకడి చెల్లిని మన ఫ్రెండ్ లేపుకొస్తే పెళ్ళిచేస్తాం .. 
మన చెల్లినెవడైనా లేపుకెళ్తే చచ్చిందని తలుపు మూస్తాం .. 
ఒకడి కూతురు జీన్స్ వేస్తే బరితెగించిందని మాట్లాడుకుంటాం ... 
మన కూతురు మారాం చేస్తే అలిగిందని వెంటనే వెళ్ళి కొంటాం .. 
మన ఇంట్లో అమ్మాయి రాత్రి మొబైల్ వాడితే బుద్దిలేదంటాం .. 
ప్రేమించిన అమ్మాయి రాత్రి చాట్ చేయకుంటే ప్రేమ లేదంటాం .. ! 
అల్లుడు కూతురి మాటవింటే మంచోడంటాం ... 
కొడుకు కోడలి మాటవింటే మారాడంటాం .. 
సోషల్ మీడియా అమ్మాయిల గురించి.  తప్పుగా మాట్లాడం
అదే అమ్మాయి ఛాన్స్ ఇస్తే. అన్ని మూసుకొని  వెళ్ళిపోతాం
ఇంట్లో ఉన్న వైఫ్ లేదా ఫ్యామిలీ గురించి పక్కన పెట్టేస్తారు
కొత్త పరిచయాలు ఉంటే మాత్రం ప్రాణం ఇస్తాం అని చెప్తాం
మనకో న్యాయం... పక్క వాడికి ఇంకో న్యాయం
ఏంటో మా మనస్తత్వం ... 
ఎక్కడుందో మాలో మనిషితత్వం . !!  కామాక్షి
ఏద్భవం తద్భవతి.....
చిన్న చిన్న తప్పులుంటే. క్షమించండి
#సిద్దార్థ్

భగవత్ సంబంధము*

 భగవత్ సంబంధము*
                 ➖➖➖

భగవత్ సంబంధమైన జ్ఞానం లౌకిక లంపటాలను నశింపజేస్తుంది. సందేహాలను నిర్మూలిస్తుంది. బలహీనలను తొలగిస్తుంది.

మనం అధిక భద్రతను ఎక్కడ పొందుతాం? ధనంలోగానీ, బాహ్యంగా లభించే విషయాలలో గానీ లేదు. అది సర్వజగత్తుకు ఆధారంగా నిలిచిన భగవంతునితో మనకు ఉన్న సంబంధంలో ఉంది.

మనకు భద్రత కల్పించేవాడు భగవంతుడు. ఎవరైతే ఆధ్యాత్మిక సాధనలు చేయడం అలవాటుగా చేసుకుంటారో వారే భగవంతునితో సంబంధాన్ని ఏర్పరచుకోగలరు.

ఇలాంటి ఉన్నతమైన, ఉత్కృష్టమైన భావన కలిగి ఉన్నప్పుడు మన జీవితం, కరచరణాలు, మనోబుద్ధులు అన్నీ పరివర్తనం చెందుతాయి.

భగవత్ సంబంధాన్ని కలిగి ఉన్నప్పుడు అన్ని చోట్లా ఆ అనంతుడినే దర్శించగలం.`
          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
                        🌷🙏🌷

****మనలోనే సమస్తము వున్నది.

 🌹గుడ్ మార్నింగ్ 🌹మనలోనే సమస్తము వున్నది. అందులో కొంత శరీరముతో గ్రహించి అనుభవించ గలుగుతున్నాము. అంతకంటే ఎక్కువ మనసుతో గ్రహించి - ఊహించి అనుభవించగలుగుతున్నాము.
నేను అని మనము అనుభవించేది అంతా సృష్టినే. అనుభవము కూడా సృష్టిలోనే తయారైన - సృష్టితోనే తయారైన - నేను అన్న వేరు భావనలో ఉన్న మన శరీరముతోనే. మనసు ఈ సృష్టి శక్తే. దాని పని తీరు, శరీర పని తీరు - సృష్టి చేసిన సృష్టి. శరీరము, మనసు, నిత్య అనుభవాలు. ఈ రెండిటికి ఆధారమైన ప్రాణ శక్తి మనలో వున్నదని తెలుసుగాని దాని గ్రహింపు , అనుభవము లేవు. ఆ ప్రాణ శక్తినే మన పూర్వికులైన పెద్దలు కొందరు అంతరముఖులై సాధనతో గ్రహించి అనుభవము పొంది - అదే సమస్తము అన్న సత్యాన్ని - ఆత్మజ్ఞానము పేరుతో మనకు అందించారు. సమస్త ఏకత్వానుభవము పొందాలనుకున్నవారు తమలోనే దానిని దర్శించవచ్చని - అనుభవం పొందవచ్చని చెప్పారు. ఇదే ఆధ్యాత్మికత. అంతరంగ సాధన. 🌹god bless you 🌹

Wednesday, July 31, 2024

లిపి_విజ్ఞాన_శాస్త్రం

 పోస్ట్ పెద్దదే కానీ మంచి సమాచారం అందరూ చదవండి.. 👍🚩

#లిపి_విజ్ఞాన_శాస్త్రం

🍁18 మరియు 19 వ శాతాబ్దికి చెందిన కొందరు పాశ్చాత్య పరిశోధకులు ఒక భ్రమను వ్యాపింపచేసారు. ప్రాచీనకాలంలో భారతీయ ఋషులకు వ్రాత పరిజ్ఞానం లేదు. 300-400 BCE సంవత్సరాల పూర్వం భారతదేశంలో వాడు కలోనున్న #బ్రాహ్మీ_లిపి మరియు ఇతర లిపులు భారతదేశం బయట పుట్టినవే. 

🔹డా.ఓర్ ఫ్రీడు మరియు మ్యుయెలర్ అనువారు మరో ప్రతిపాదన ప్రచారం చేసారు. భారతదేశానికి లేఖన విద్య గ్రీకుల నుండి లభించినది. 
🔸సర్ విలియం జోన్స్ అనునతడు భారతీయుల బ్రాహ్మీలిపి సెమెటిక్ లిపి నుండి ఉత్పన్నమైనదనే మరో భ్రమను ప్రచారం చేసాడు. 
🔹ప్రొ. బేన్ ఫ్రే మరియు బేవర్ అనువారు బ్రాహ్మీలిపి మూలం ఫోనీషియన్ లిపి అని ప్రచారం చేసారు. 
🔸డా.డేవిడ్ డిరింజర్ అనునతడు అరేమిక్ లిపి నుండి బ్రాహ్మీ లిపి ఉత్పన్నమైనదనే ఊహను ప్రచరం చేసాడు .
🔹సంస్కృత సాహిత్య చరిత్ర వ్రాసిన మాక్స్ ముల్లర్ భారతదేశంలో లేఖన కళ 400 BCE సంవత్సరాల పూర్వం నుండి మాత్రమే వాడుకలోనున్నదని మరో భ్రమను ప్రచారం చేసాడు. మన దౌర్భాగ్యం కారణంగా తర్వాత కాలంలో పరిశోధనలు చేసిన భారతీయులు కూడా పాశ్చాత్యులనే ఆదర్శంగా తీసుకొని వారితో గొంతు కలిపారు. వారి భ్రమాత్మక సిధ్దాంతాలనే వీరు సత్యాలని ప్రతిపాదించారు. ఈ పరిశోధన, ప్రతిపాదన ప్రక్రియలో ఎవ్వరు కూడా మన దేశ పరంపరను, గ్రంధలిపి వికాసగాధలను పరిశోధించే ప్రయత్నం ఏ మాత్రము చేయలేదు.

ఈ పరిస్థితిలో వాస్తవాన్ని పరిశీలిద్దాం!
---------------------------------------------------
 
🍁ప్రసిధ్ధ పురాతత్వవేత్త మరియు లిపి పరిశోధకుడు అ.బ.వాలావల్కర్ మరియు ప్రఖ్యాత లిపికారుడు పద్మశ్రీ వాకణకర్ – అనువారు తమ పరిశోధనలో భారతీయ లిపి జన్మస్థానం భారతదేశమే అని నిరూపించారు. ధ్వన్యాత్మకత ఆధారంగా లేఖన పరంపర భారతదేశంలో వేదకాలము నుండి బాగా వాడుకలో ఉండి ప్రసిధ్ధి చెందింది. దీనికి అనేక పురాతత్వ సాక్ష్యాలున్నాయని వారు నిరూపించారు. 
రోమను లిపికి చెందిన ‘గిల్ సాంస్’ అనే రకమైన అక్షరాల నిర్మాత ఎరిక్ గిల్ అనునతడు ఇలా చెప్పాడు : ఒకానొక అక్షరము ఒకానొక సమయంలో ఒకానొక ధ్వనికి పర్యాయవాచకంగా ఉంది ఉంటుంది. కాని రోమను లిపి అధ్యయనం చేస్తే ఒకానొక అక్షరం, ఒకానొక ధ్వనికి పర్యాయపదంగా ఉంటుందని చెప్పలేము. ఉదా: Ough – ఈ నాలుగు అక్షరాలు 7 రకాలుగా ఉచ్చరించబడతాయు (ఓహ్, అఫ్,ఆఫ్,ఆఊ,ఔ,ఊ,ఆ) ఇవి వ్రాసిన తర్వాత గిల్ తన సిధ్ధాంతంగా ఒక సత్యాన్ని ఇలా చెప్పారు  : “మా రోమను అక్షరాలు ధ్వనియొక్క లేఖనము, ముద్రణము సరిగ్గా చేస్తాయని చెప్పడం మూర్ఖత్వమే అవుతుంది.”

రెండవ వైపు భారతదేశంలో ధన్యాత్మక లేకహంపరంపర యుగ యుగాలుగా వస్తున్నది. దీనికి అనేక ఋజువులు మన ప్రాచీన వాజ్మయములో లభిస్తున్నాయి.

🍁1.యజుతైత్తరీయ సంహితలో ఒక కధ ఉన్నది. దేవతలకు ఒక సమస్య వచ్చిపడినది. మాట(వాణి) అనేది మాట్లాడిన తర్వాత అదృశ్యమైపోతుంది. ఈ నిరాకారమైన మాటను సాకారం చేయడమెలా? దేవతలు ఇంద్రుని వద్దకు వెళ్లి ఇలా అడిగినారు : “ వాచంవ్యా కుర్వీత’ అనగా వాక్కుకు ఆకారమును ఇవ్వండి. అప్పుడు ఇంద్రుడన్నాడు. దీనికోసం నేను వాయువును సాయం తీసికోవాలి. అనగానే దేవతలు అందుకు సమ్మతించారు. అపుడు ఇంద్రుడు వాక్కుకు ఆకారమునిక్చినాడు. వాక్కుకు ఆకారమును ఇవ్వడమే లేఖనవిద్య. ఇది ‘ *ఇంద్రవాచన్య వ్యాకరణమ్*’ అనే పేరున ప్రసిధ్ధమైనది.

🍁2.అధర్వవేదములో గణక ఋషికృతసూక్తం ‘ *గణపతి_అథర్వశీర్షం*’ పేరుతో ఉన్నది. దీనిలో లేకహన్ విద్య యొక్క ఉత్పత్తికి సంబంధించిన ప్రమాణములున్నవి. క్రింది వాక్యాలలో ఇది స్పష్టంగా కనిపిస్తున్నది. 

గణాదిం పూర్వముచ్చార్యవర్ణాదిం తదనన్తరమ్ | అనుస్వారః పరతరః |
అర్ధేందులసితమ్ | తారేణరుధ్ధం | ఏతత్ తవ మనుస్వరూపమ్ | గకారః
పూర్వరూపమ్ | అకారో మధ్మమరూపమ్ అనుస్వారశ్చాస్త్య రూపమ్ |
బిందురుత్తర రూపమ్ | నాదః సంధానమ్ | సంహితా సంధిః | సైషా గణేశ విద్యా | 

దీని అర్ధము : మొదట ధ్వనియొక్క గణమును ఉచ్చారణ చేయాలి . తర్వాత అదే క్రమములో వర్ణములను రంగుల సాయంతో వ్రాయాలి. తదనంతరం అక్షరము పైన అనుస్వారము అర్ధచంద్రాకారంలో వ్రాయాలి. ఈ విధంగా హే గణేశ్ ! మీ చిత్ర స్వరూపము ఈ విధంగా గ్ అనే హల్లు మరియు మధ్యస్వర భాగము అనగా అకార రూపదండము మరియు అంతముక్త అనుస్వారము అవుతుంది . దీనినాదము లేదా సంధి రూప ఉచ్చారణ చేయుట – ఇదియే గణేశ విద్య. దీనిని గణపతి తెలిసికొనియున్నాడు.

🍁3.ధ్వని సూత్రములనిచ్చే దేవుడు శంకరుడు. భిన్న భిన్నమైన వేదశాఖలు చెప్పేఆరు మృత్యువాత పడిన కారణంగా ఆ శాఖలు లుప్తమంపోవుచున్నవి. అందువలన వానిని కాపాడే దృష్టితో సనకాది సిధ్ధులు దక్షిణాదినున్న చిదంబరంలో నున్న శివుని వద్దకు వెళ్లి ప్రార్ధించినారు. ఆ ప్రార్ధన నాలకించి పరమశివుడు అలౌకికమైన శివతాండవ నృత్యము చేస్తూ మధ్యలో తన డమరుకమును తొమ్మిది మరియు ఐదు అనగా పదునాలుగుసార్లు మ్రోగించినాడు. దాని నుండిఉ 14 ధ్వని సూత్రాలు వెలువడినవి. దీనినే మాహేశ్వర సూత్రములన్నారు. దీన్ని వర్ణిస్తూ ఇలా చెప్పబడినది

నృత్యావసానే నటరాజ రాజౌ సనాద ఢక్కాం నవ పంచవారమ్ |
ఉధ్ధర్తు కామః సనకాది సిద్ధాన్ ఏతద్విమర్శే శివసూత్ర జాలమ్ || 
                                      - కౌశిక సూత్ర –I

పదునాల్గు మాహేశ్వర సూత్రములు : అ, ఆ, ఇ,ఈ,ఌ,ౡ,ఋ,ౠ ,ఏ,ఐ,ఓ,ఔ – ఈ సూత్రముల ఉపదేశము పాణిని మహర్షికి లభించింది. దాని ఆధారంగా ఆ మహర్షి తన వ్యాకరణ గ్రంధము ‘అష్టాధ్యాయి’ రచించినారు.ఆ గ్రంధమే ధ్వన్యాత్మక భాషను,దాని వికాసాన్ని శాస్త్రీయంగా ఉంచుతుంది. 

🍁4.వేదముల స్మరణ మరియు శుధ్ధత చిరస్థాయిగా నుండుట కొరకు అనేకమంది మహర్షులు అనేక జటిల పథన పధ్ధతులు వికసింపచేసినారు. అవి జటా,మాలా,శిఖా,రేఖా,దండ,రధ,ధ్వజ మరియు ఘనపాఠ – ఈ వేదపఠన పధ్ధతులు వ్రాత లేకుండా సురక్షితంగా ఉంచుట సాధ్యంకాదు.

🍁5.మహాభారత కర్త వ్యాసమహర్షి మహాభారత రచనకు ఉపక్రమించునపుడు ఏర్పడిన సమస్య. దీనిని ఎవరు వ్రాస్తారు? దాని కొరకు గణేశుణ్ణి స్మరించారు. ‘కావ్యస్యలేఖ నార్ధాయ గణేశం స్మర్యతామ్ మునే’ – అప్పుడు గణేశుడు ప్రత్యక్షమైనాడు. అప్పుడు వ్యాసుడన్నాడు ‘లేఖకో భారతస్యాస్య భవ గణనాయకః’ –మీరు మహాభారత గ్రంధ లేఖకులు కావాలన్నాడు. దీని నుండి తెలియు విషయం మన గణేశుడు ఆనాటి మూర్ధన్యలిపికారుడు అని అర్థమగుచున్నది.

🍁పాణిని మహర్షి ‘ *ఋగ్వేదవిద్య*’ లో ఇలా వివేచించి చెప్పినాడు – వాక్కు తన నాలుగు పదములలోని చివరి పదమైన ‘వైఖరి’ లో బయలు వెడలుతుంది. మనుష్యుని శరీరంలోని ఐదు అవయవాల సాయంతో ధ్వని ఉత్పన్నము అవుతుంది. దీని ఆధారంగా అచ్చులు, హల్లులు ఏ అవయవ సాయంతో ఉచ్చరిస్తామో ఆ అవయవాన్ననుసరించి వర్గీకరించుట క్రింది విధంగా జరిగింది. 

🔸1. *కంఠ్యములు* : శ్వాస కంఠము నుండి వెలువడుతుంది. అప్పుడు ఏ ధ్వనులు వెలువడుతాయో అవి ఈ వర్గము క్రిందకు వస్తాయి. అ, ఆ, క, ఖ,గ,ఘ,ఙ ,హ మరియు విసర్గ (ః) 
🔹2. *తాలవ్యములు* : కంఠము నుండి కొద్దిపైన దంతములు దగ్గర కఠిన తాల భాగముపై నుండి శ్వాస బయలు వెడలినప్పుడు ఆ ధ్వని, ఇ, ఈ, చ, ఛ,జ,ఝ,ఞ, య మరియు శ – అను అక్షరములు ద్వారా అభివ్యక్తీకరించబడును.
🔸3. *మూర్ధన్యములు* : నాలుక కొనను కొంచెం వెనుకకు తీసికొని కోమల తాల భాగముపై తాకి ధ్వని వెడలినప్పుడు ఈ అక్షరాలు పలుకుతాయి. ఋ, ౠ, ట,ఠ,డ,ఢ,ణ,ష
🔹4. *దంత్యములు* : నాలుక దంతములకు తాకునప్పుడు ఈ అక్షరముల్ పలుకుతాము. త,థ,ద,ధ,న,ల,స – 
🔸5. *ఓష్ఠ్యములు*: రెండు పెదవులు సాయంతో ఈ అక్షరములు పలుకుతాము – ఉ,ఊ,ప,ఫ,బ,భ,మ మరియు వ – 
మిశ్రిత అక్షరములు : పై అక్షరములు కాకుండా మిగిలినవి. ఏ,ఐ,ఓ,ఔ,అం,ఆః

పైన తెలుపబడిన ధ్వని శాస్త్రముననుసరించి లిపి వికసించబడింది. మరియు కాలక్రమమలో లిపులు మార్పులు చెందుచుండినవి. దీని ఆధారంగానే ధ్వనిశాస్త్రం యొక్క మూల సిధ్ధాంతము ఏర్పడినది. ప్రఖ్యాత పురాతత్వవేత్త వాలావాల్కర్ గారు ప్రాచీన ముద్రలతో లభించిన లిపులను అధ్యయనం చేసారు. ఈ అధ్యయనము ద్వారా వారు మూలరూపంలో మహేశ్వరి లిపి అనబడే వైదిక లిపి ఏర్పడినట్లు వారు ఋజువు చేసారు. కొద్దికాలం తర్వాత అదే బ్రాహ్మీలిపిగా, నాగరలిపిగా అభివృధ్ధి చెందినది. ప్రఖ్యాత లిపి శాస్త్రవేత్త శ్రీ వాకణకర్ ద్వారా తయారు చేయబడిన క్రింది చార్టులో మనం ఇదంతా గమనించవచ్చు. 

🍁 *పురాతత్వ ఋజువులు* : లిపి యొక్క అభివృధ్ధి క్రమము, పురాతత్వ ఋజువులపై శ్రీ వాలావాల్కర్ మరియు శ్రీవాకణకర్ విస్తృతంగా పరిశోధనలు గావించారు. అనేక ప్రతిపాదనలు చేసారు. వారి ప్రతిపాదనలను గూర్చి డా|| మురళీమనోహర జోషి తన ప్రసిధ్ధ వ్యాస పరంపర ‘లిపి’ విధాత గణేశ్’ లో అనేక అంశాలను ప్రస్తావించారు. అనేక ఋజువులు చూపించినారు. అతి ప్రాచీనకాలము నుండియే భారతదేశంలో లిపి విద్య, లేఖన కళ ప్రచారమందున్నది. అది పూర్తిగా ధ్వనిశాస్త్రముపై ఆధారపడి తయారైంది. ఈ శాస్త్రీయ దృష్టి ప్రపంచంలోని ఏ ఇతర లిపులలోను లేదు.
‘ఇప్పుడు పురాతత్వ శాస్త్రంలోని ఋజువుల గురించి చర్చిద్దాం! బ్రిటిష్ మ్యూజియంలో ఒక ముద్ర (సీల్) ఉన్నది. దాని క్రమసంఖ్య : 31-11-366/1067-47367-1881. 6 BCE శతాబ్దానికి చెందిన ఈ ముద్రలో బాబిలోనియాకు చెందిన కీలాక్షరలిపి మరియు మన బ్రాహ్మి లిపి రెండూ కలిసియున్నవి. కీలాక్షరలిపి 1936 లో మాత్రమే చదవగలిగినారు. మధ్యలో నున్న పంక్తిని తెలియని అజ్ఞాతలిపిగా వదిలివేసారు. పురాతత్వ లేఖనవేత్త వాలావాల్కర్ మాత్రమే ఈ అజ్ఞాతలిపిని చదివి చూపినారు. యూరపు పండితుల వాదనలను బూటకమని ఋజువు చేసారు. భారతీయ లిపికి మూలాధారము ఇతర దేశములయందున్నదే వాదనలను పటాపంచలు చేసారు. ఈ ముద్ర ఆశోకునికి పూర్వము మహేశ్వరీ లిపిలో వ్రాయబడిన సంస్కృత భాషకు సాక్శీభూతముగా న్నన్నది. ఈ పంక్తి పాఠము ఇలా ఉన్నది. ‘అవఖేజ్ఞరాఖను ఔహర్మమభ్యః దదదు’ – ఇది గ్రీకు కీలాక్షర లిపిలో వ్రాయబడిన అనుబంధమునకు సంస్కృతభాషలో వ్రాయబడిన అనువాదము. ఈ ఋజువుతో పాశ్చాత్య లిపి పరిశోధకులైన మెక్డోనల్ మరియు బ్యూహలర్ లు ప్రతిపాదించిన లిపి సిధ్ధాంతాలు బూటకములని తేలిపోయినవి. భారతీయులు 5 BCE  శతాబ్దిలో లిపిని విదేశాల నుండి అరువు తెచ్చుకొన్నారనే సిధ్ధాంతం పచ్చి అబద్ధమని వారి పరిశోధనలు భారతదేశానికి సంబంధించినవి అన్నీ బూటకములని తెలియుచున్నది. పాశ్చాత్య లిపి పరిశోధనలు నిస్సారములని తేలిపోయినవి – ఇదే విధంగా మరో మహత్యపూర్ణమైన పురాతత్వ సాక్ష్యం లభించింది. ఇది ప్యారిస్ మ్యూజియంలో ఉన్నది. (లూన్రే మ్యూజియం) ఇది 3000-2400 BCE నకు చెందినది. పాలస్తీనాలో త్రవ్వకాలు జరిపినప్పుడు లభించిన నాణెము . ఇది సార్గన్ అను రాజు కాలానికి చెందినది. ఈ నానేపు ముద్రను చూసి జాన్ మార్షల్ ఆశ్చర్యం వ్యక్తం చేసాడు. దీని యొక్క పురాతత్వ ఫలితాలు అత్యంత సంభ్రమాన్ని కల్గిస్తున్నాయి. సింధులోయ నాగరికత నాటి ముద్రతో దీనికి పోలిక ఉన్నది. దీనితో భారతీయ లిపి పుట్టుక విదేశీయమైనదనే పాశ్చాత్య వాదనకు కాలదోషం పట్టినది. ఇప్పుడు కనీసం మన దేశీయపండితులు భారతీయ లిపి బయట నుండి అరువు తెచ్చుకొన్నదనే వాదనన్ కట్టిపెట్టినారు. అయినప్పటికీ భారతీయ లిపి ప్రాచీనతను సంబంధించిన ప్రశ్నలపి ఆంగ్ల మానస పుత్రులైన మన దేశీయ పండితులు మౌనమే పాటిస్తున్నారు. మనువాదాన్ని సరిగా వినిపించడంలేదు.

🍁 *వైదిక ఓంకారము* :
------------------------
ఇదే క్రమములో మనం 6 BCE శతాబ్దానికి చెందిన సోహగరా తామ్రశాసనమును పరిశీలించాము. ఈ శాసనము మొదటి పంక్తిలోనే ఓంకార చిత్రము చెక్కబడియున్నది . ఈ ఓంకారము వాలావాల్కర్ ప్రదర్శించిన చార్టులో ముద్రింపబడినదే – ప్రక్కనున్న ఇతర చిత్రాలను పరిశీలించినప్పుడు కూడా వానిలోను వైదిక ఓంకారము,స్వస్తిక్ వంటి హిందూ ఆధ్యాత్మిక చిహ్నాలు ముద్రింపబడినవి. ఇవి అన్నీ నాణెములకు సంబంధించిన చిత్రములే. వైదిక ఓంకారము ఈ ఆకృతిలో ఎందుకు ఉందనే ప్రశ్నకు సమాధానం ‘జ్ఞానేశ్వరి’ లో వివరించబడినది. 
అ-కార చరనయుగళ | ఉ- కార ఉదర విశాల |
మ-కార మహామండల | మస్తకా – కారే || 19
హేతీన్హీ ఏకవటలే | తేవ శబ్ద బ్రహ్మ కవళల | 
తే మియాం గురుకృపా నమిలే | ఆదిబీజ || 20 
- ‘జ్ఞానేశ్వరి’ 

🍁(ఎ) జ్ఞానేశ్వరి మరియు వాలావాల్కర్ చెప్పిన వైదిక ఓంకారముల సామ్యము
శబ్ద బ్రహ్మ లేదా ఏకాక్షర బ్రహ్మ, ప్రణవము యొక్క ఆకృతిని గూర్చి ‘జ్ఞానేశ్వరి’ లోని వర్ణన చాలా మహత్వపూర్ణమైనది. ఆధునిక దేవనాగరి లిపిలో వ్రాయబడుచున్న ॐ తో ఈ వర్ణన పూర్తి సామ్యము లేకున్నా వాలావాల్కర్ గారు చూపించిన వైదిక ఓంకారముతో పూర్తి సామ్యమును కలిగియున్నది. మహేశ్వరి సూత్రములలోణి ‘అర్ధేందు సిధ్ధాంతమును’ గూర్చి లోతుగా ఆలోచన చేసినచో ఈ చిక్కు సమస్యకు సమాధానం లభిస్తుంది. వైదిక ఓంకార చిత్రమును పరిశీలిద్దాం. మొదట క్రింద రెండు అర్ధచంద్రాకారములున్నవి. ఇవి ‘అ’ కారము  ప్రతీకలు. వీనిపైన ఒక అర్ధచంద్రాకరమున్నది. ఇది ‘ఉ’ కారమునకు ప్రతీక. అన్నింటి పైన ఒక వృత్తము మరియు అర్ధచంద్రబిందు సహితము ఉన్నది. ఇది ‘మ’ కారమునకు ప్రతీక – ఈ విధంగా జ్ఞానేశ్వరిలో వర్ణించిన ఓంకారము, గీత మరియు ఉపనిషత్తులలో వర్ణించిన ఏకాక్షర బ్రహ్మ లేదా ప్రణవము – మరే పేరుతో చెప్పినా , అది మహేశ్వరి సూత్రములలోని ‘ *అర్దేందు_సిధ్ధాంతము* ‘ ననుసరించి చెప్పిన ఓంకారము – అది నిర్ణయింపబడిన నాదముల యొక్క ప్రతీకయే ! ఈ నాదముల ప్రతీకలను క్రమపధ్ధతిలో జోడించినప్పుడు ఏర్పడిన ఒక నిశ్చిత ఆకృతియో! దేవనాగరి ॐ లో కూడా ఇదే సూత్రము వర్తించుచున్నది. వైదిక ఓంకార చిత్రమును 90 డిగ్రీల నుండి గడియారపు ముల్లు దిశలో త్రిప్పినచో దేవనాగరి *ఓంకారముతో* చక్కగా సరిపోవును. – వైదిక ఓంకారము ప్రస్తుత దేవనాగరి ఓంకారమునకు రూపాంతరము చెందిన యాత్రయే భారతీయ లిపి యొక్క వికాసగాధ! దీనిని మనము *ఋగ్వేదము* నుండి *పద్మపురాణము* వరకు పరిశోధించి చూడవచ్చు. 
*** Source from : భారతీయ ఉజ్వల వైజ్ఞానిక పరంపర page : 181-190

మీ 

*ధర్మవీర్ ఆధ్యాత్మిక చైతన్య వేదిక*