Tuesday, August 6, 2024

****అమావాస్య అంటే ఏమిటి? అమావాస్య ప్రాముఖ్యత ఏమిటి?

 అమావాస్య అంటే ఏమిటి? అమావాస్య ప్రాముఖ్యత ఏమిటి? రేపు అమావాస్య కావున దీని గురించి వివరంగా తెలుసుకుందాం.

అమావాస్య అంటే చందమామ కనపడని రోజు. ఎవరైనా లేదా ఏదైనా లేనప్పుడు, అలా లేకపోవడం వల్ల, వారి ఉనికి శక్తివంతమవుతుంది. మీ స్నేహితుడో లేక ప్రియమైనవారు ఎవరైనా మీతో ఉన్నప్పుడు, వారున్నట్లు అంతగా అనుభూతి చెందరు. కానీ వారు లేని మరుక్షణం, వారి ఉనికి బలంగా అనుభూతి చెందుతారు. కాదంటారా? భావపరంగా కూడా ఇది నిజమే. నిజంగా, వారు ఉన్నప్పుడు వారి ఉనికిని మీరు అనుభూతి చెందరు. వారు లేనప్పుడే, వారు ఏర్పర్చిన ఖాళీ, వారి ఉనికి కంటే గాఢంగా ఉంటుంది. అలాగే చందమామ - తన గైర్హాజరు, తన ఉనికిని మునుపెన్నడూ లేనంతగా కలుగజేస్తుంది. వేరే రోజుల్లో, పౌర్ణమి రోజు కూడా, తాను ఉంటుంది; కానీ అమావాస్య రోజు మాత్రం తన ఉనికి, ఆ గుణం మరింతగా తెలుస్తుంది. 

భూమి, అమావాస్య రోజు విశ్రాంతి తీసుకుంటుంది; భూమిపై జీవ ప్రక్రియ నెమ్మదిస్తుంది. ఇది ఒక మంచి అవకాశం, ఎందుకంటే జీవం ఏకీకరణం ఈ రోజున బాగా జరుగుతుంది. ఎప్పుడైతే కొంత వేగం తగ్గుతుందో, అప్పుడే మీరు మీ శరీరాన్ని గమనిస్తారు. అంతా సవ్యంగా జరుగుతున్నప్పుడు, మీరు తీరిక లేకుండా ఉన్నప్పుడు, మీ శరీరానికి ఏమి జరుగుతుందో మీకు తెలీదు. కానీ, చిన్న వ్యాధి ఏదైనా వచ్చిందంటే, అకస్మాత్తుగా శరీరం ఒక సమస్యగా మారి, మీరు దాని పట్ల శ్రద్ధ వహించాల్సి వస్తుంది. అది సరిగ్గా లేనప్పుడే– “ఇది నేను కాదు. నాకు సమస్యలు ఇస్తున్న ఇది నా శరీరం మాత్రమే”. అని చాలా స్పష్టంగా ఒక దూరం కనిపిస్తుంది.
ఇదే అమావాస్య ప్రాముఖ్యత. ఆ రోజున, ఒక రకమైన పంచభూతాల ఏకీకరణం జరుగుతుంది. కావున అన్నీ కాస్త నెమ్మదిస్తాయి. 

మీరు శ్రేయస్సు కావాలనుకుంటే, పౌర్ణమి పవిత్రమైనది. మీరు మోక్షం కావాలనుకుంటే, అమావాస్య పవిత్రమైనది. అందుకు తగినట్లుగానే, ఈ రెండు పార్శ్వాలకు, వివిధ రకాల అభ్యాసాలు, సాధనలు, ఉన్నాయి. “ఏది నేను? ఏది నేను కాదు?” అనేది సులభంగా తెలుసుకోగలిగే రోజు ఇది. ఇక అక్కడ నుంచి, అసత్యం నుండి సత్యం వైపుకి ప్రయాణం మొదలవుతుంది. అమావాస్య నుండి పౌర్ణమి వరకు ప్రతి నెల సహజంగానే ఒక అవకాశం కల్పించబడింది. పూర్తిగా ఎరుకలో లేని వారికి కూడా, ప్రతి అమావాస్య మొదలుకొని, సహజంగానే ఒక అవకాశం ఉంటుంది. 

పౌర్ణమి గుణం ఇడ నాడి లేదా స్త్రీత్వానికి సంబంధిచింది. అమావాస్య చాలా మోటుగా ఉంటుంది. అమావాస్య ముందు రోజుని శివరాత్రి అంటాము – ఎందుకంటే అది శివుని రాత్రి. అది ఆదిమమైనది. ఎప్పుడైతే మొత్తం చిమ్మ చీకటిగా ఉంటుందో, అప్పుడు సృష్టి మొత్తం నిర్వీర్యం అయిపోయినట్టు ఉంటుంది. అమావాస్యలో కొంత లయకారుడి ఛాయ ఉంటుంది. మామూలుగా, అమావాస్య రోజున స్త్రీ శక్తి, ఒక రకమైన భయం వల్ల గందరగోళం చెందడమో లేక పురుషుడి లాగా కఠోరంగా మార్పు చెందడమో జరుగుతుంది. స్త్రీ శక్తికి పౌర్ణమి అనుకూలమైనది. కావున, మహిళలు పౌర్ణమిని ఉపయోగించుకుంటారు. కానీ, మోక్షం కోరుకునే ఒక పురుషుడికి, పౌర్ణమి అంత మంచిది కాదు. అతడు ఒకవేళ శ్రేయస్సు కోరుకుంటే, పౌర్ణమిని ఉపయోగించుకోవచ్చు. కానీ, మోక్షం కోరుకుంటే మాత్రం అమావాస్య మంచిది. పూర్తిగా విముక్తి కోరుకునే వారందరికీ అమావాస్య అద్భుతమైంది. 
మానసికంగా నిలకడలేని వారు, అమావాస్య లేదా పౌర్ణమి రోజున మరింతగా సమతుల్యం కోల్పోతారన్న సంగతి మీరు వినే ఉంటారు. చంద్రుని గురుత్వాకర్షణ శక్తి ద్వారా ఇలా జరుగుతుంది. కావున, ఈ శక్తి అన్నింటినీ పైకి లాగుతుంది. 

సముద్రాలన్నీ ఎగిసే ప్రయత్నం చేస్తున్నాయి. అదే విధంగా, మీలో ఉన్న రక్తం కూడా చంద్రుని ఆకర్షణకి ఎగిసేందుకు ప్రయత్నిస్తుంది. దీనివల్ల, మానసికంగా మీరు కొంచెం నిలకడగా లేకపోతే, ఆ రోజున మీ మెదడులో అతిగా ప్రవహిస్తున్న రక్తం కారణంగా, మీరు మరింతగా సమతుల్యాన్ని కోల్పోతారు. మీరు సంతోషంగా ఉంటే, మరింత సంతోషంగా మారతారు; బాధగా ఉంటే, మరింత బాధపడతారు. ఆ రోజుల్లో, రక్తం పైకి ప్రవహించడం వల్ల, మీ గుణం ఏదైతే అది మరింత మెరుగుపడుతుంది. అంటే, ఎదో రకంగా పూర్తి శక్తి పైకి లాగబడుతుంది. తన శక్తుల్ని పైకి కదిలించాలి అని ఎప్పుడూ అనుకునే ఆధ్యాత్మిక సాధకుడికి, ఈ రెండు రోజులు ప్రకృతి ప్రసాదించిన వరం లాంటివి.

మన ఆంధ్రులకు అతి చెడ్డదినం అమావాస్య. అమావాస్య రోజు ఏదీ ప్రారంభించ కూడదంటారు . నా దృష్టిలో ఈ సృష్టిలో ఏ చెడు లేదు, ప్రతి క్షణము మంచిదే. ఒకవేళ చెడు ఏదైనా ఉందంటే అది మనుషుల మాటలలో మనసులలో భావాలలో చెడు ఉంటుందే కానీ కాలంలో ఏ చెడు లేదు. దీనిని గురించి నిర్ధారణ చేసుకోవటానికి ఎన్నో కార్యక్రమాలను అమావాస్య రోజే ప్రారంభించి ఎన్నో అద్భుతాలు పొందడం జరిగింది. మానస సరోవర ధ్యాన ఆశ్రమం కూడా అమావాస్య రోజే భూమి పూజ జరగటం అమావాస్య రోజే ప్రారంభించటం జరిగింది. అందుకే అమావాస్య అంటే నాకెంతో ప్రీతి. 

సేకరణ మీ రామిరెడ్డి మానస సరోవరం👏

****భారతీయ సంస్కృతిలో కుంకుమ ధారణ (లలితా సహస్ర నామ స్తోత్ర భాష్యాం తర్గతం)

 భారతీయ సంస్కృతిలో కుంకుమ ధారణ

(లలితా సహస్ర నామ స్తోత్ర భాష్యాం తర్గతం)

భారతీయ సంస్కృతిలో పసుపు, కుంకుమ దేవతా శక్తి కలిగిన పదార్థములుగా భావిస్తాం. ఇవి మానవులు తయారుచేసుకొని వాటియందు దేవత్వాన్ని ఆరోపించుకున్న వస్తువులు కాదు. మహర్షులు దర్శించి వాటిలో దేవతాశక్తి ఆవిష్కరింపబడుతుంది అని తెలియజేసి వాటిని మన ఆచారంలో భాగంగా పెట్టారు. అందుకే కుంకుమను అలంకరించుకోవడం అనేది మన సంప్రదాయం. పసుపు మిళితమైనదే కుంకుమ. దీనిని సంప్రదాయ బద్ధమైన పదార్థంగా చేయాలి. అంతేకానీ వర్ణం ప్రధానం కాదు. రంగు ప్రధానం చేసుకొని ఎర్రగా కనబడిన ఏదో ఒకటి కుంకుమ అని సరిపెట్టుకోవడం సరికాదు. పసుపులో కొన్ని దివ్య ద్రవ్యాలు కలిపి కుంకుమ చేస్తారు. 

ఈకుంకుమ తయారు చేసేటప్పుడు సూర్యరశ్మి సోకి ఒక సూక్ష్మమైన ధ్వని వినబడుతుంది. ఆ ధ్వని 'కుం' అనే శబ్దంతో వస్తుంది. 'కుం ఇతి కూజతేతి కుంకుమా' - అని వ్యాఖ్యాతలు చెప్పారు. ఆ ధ్వనితో వస్తుంది గనుక దానికి ఆ పేరు పెట్టారు. ఈ పద్ధతిలో తయారుచేసే దానిలో దేవతాశక్తి జాగృతం చేసేటటువంటి మహిమ ఉంటుంది. సృష్టి అంతా కూడా భగవత్ శక్తితో నిండి ఉన్నప్పటికీ కూడా కొన్ని మాత్రం ఆ శక్తిని ప్రకటిస్తాయి, ప్రసరింపజేస్తాయి. సూర్యకాంతి విశ్వమంతా పరచుకున్నప్పటికీ అద్దం ఆ కాంతిని ప్రతిఫలింపజేయ గలుగుతున్నది.అదేవిధంగా కొన్ని వస్తువులు భగవత్ శక్తిని ప్రకటించ గలుగుతాయి. అటువంటి వాటిలో కుంకుమ ఒకటి. అందుకే మనం నుదుట కుంకుమ ధరిస్తాం.  భృకుటీ మధ్య స్థానాన్ని ఆజ్ఞాచక్రస్థానం అని చెప్పబడుతున్నది. ఈ ఆజ్ఞాచక్ర స్థానానికి ఉన్న శక్తి ఏమిటంటే - విశ్వ చైతన్యంలో ఉన్న దేవతా శక్తిని గ్రహించ గలగడం, తనలో ఉన్న శక్తిని బయట ప్రసరింప జేయగలగడం - ఈ రెండూ చేయడానికి ఇది కేంద్రం అవుతుంది. అంతేకాకుండా ముఖ్యమైన నాడులకు ఇది కేంద్ర స్థానం. అందువల్ల ఆ స్థానంలో కుంకుమ పెట్టడం వల్ల దేవతా శక్తిని పొంది ఆ శక్తిని అణువణువూ వ్యాపింపజేసుకోగలం. అందుకు మహాత్ములు కుంకుమ ధారణ పెట్టారు. ఈ కుంకుమ కూడా గుండ్రంగా పెట్టుకోవడంలో ఆద్యంత రహితమైన బిందువును సూచించేవిధంగా పెట్టుకుంటాం. ఇది సత్సంప్రదాయం.

దీనిని కాదని మనవి కానివి, అసంప్రదాయమైనవి, నాగరికత పేరుతో తీసుకొని మనం ఈ దివ్య సంస్కృతి నుంచి దూరం అయిపోతున్నాం. కుంకుమ బదులుగా ఎర్రగా కనిపించే ఏదో అంటించుకుని తిరగడం కూడా మొదలైంది. ఇవి మన పెద్దలు పెట్టిన ఉద్దేశ్యానికి విరుద్ధమైనవి.కుంకుమ పెట్టడంలో ఉన్న పవిత్రత ఆ ఎర్ర రంగు అంటింపులలో ఉండదు. పైగా అది ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. ఉండవలసినది కుంకుమ.

ఇలా బొట్టు, కాటుక ఇత్యాదులన్నీ కూడా ఎంతో దివ్యమైనటువంటి అవగాహనతో సూక్ష్మ ప్రపంచంలో ఉన్న దేవతా శక్తులను దర్శించిన మహర్షులు పెట్టినటువంటి ఆచారములు అని తెలుసుకోవాలి. మనకు ఆ దర్శన శక్తి లేదు. మహర్షులు, మహాత్ములు చెప్పిన వాటిని ఆప్త వాక్యంగా అనుసరిస్తూ వస్తూ ఉన్నాం.

మహర్షికి ధ్యానంలో, తపస్సులో గోచరించిన దేవతా మూర్తిలో ఏ లక్షణాలు కనబడుతున్నాయో ఆ లక్షణాలను సంప్రదాయాలుగా మనకి చెప్పారు. అంతేకానీ మన అలవాట్లను దేవతకి ఊహించుకోవడం కాదు. దేవతలో ఉన్నటువంటి ఆకార విశేషాలను మన ఆచార విషయాలుగా చెప్పి దేవతాశక్తికి దగ్గరవడానికి మార్గాలు వేశారు మహర్షులు.

ఇంకొక అర్థంలో 'కుం' అనే శబ్దంలో కకారము, ఉకారము,  మకారము, ఉన్నాయి. కకారము బ్రహ్మవాచి, ఉకారము ఉపేంద్రుడైన నారాయణుని తెలియజేస్తుంది.  మకారము రుద్రుని తెలియజేస్తుంది.

****ఈరోజు ఒక మంచిమాట

 *_🌹'ఈరోజు ఒక మంచిమాట '🌹_*

*_అయ్యో.. నేను ఒంటరిని అయ్యానే.. అనే బాధతో క్షణక్షణం  కుమిలిపోతున్నావా...?_*

*_నా వారు అనేవారు నాతో లేరని బాధపడుతున్నావా...?_*

*_ఈ సమాజం నన్ను వదిలేసిందే...అనే దిగులుతో మూలకు కూర్చున్నావా...?_*

*_ఓ..దేవుడా నాకెందుకు ఈ శిక్ష అని రోదిస్తున్నావా...?_*

*_మిత్రమా.. అంతా నాటకం ఇదొక బూటకం..._*

*_ఒంటరిగా ఉన్నావంటే, నీవంత అదృష్టం ఎవరికి లేదని అర్థం..._*

*_ఎందుకంటే,ఎవరికి రాని ఒంటరితనం నీకే లభించింది సంతోషించు...ఒంటరిగా ఉండడం అంటే... "ఏకాంతంగా" ఉండడం అని అర్థం._*

*_గొప్ప గొప్ప వారు ఏకాంతాన్ని కోరుకుంటారు. కానీ వారికి ఆ ఏకాంతం లభించడం చాలా కష్టం. వారు ఎన్నో వ్యవహారల్లొ తలమూనాకలై ఉంటారు కదా!_*

*_జీవితంలో కొన్నిసార్లు ఒంటరిగా నడవడం కష్టంగా ఉండొచ్చు.!
నిజానికి ఆ ఒంటరితనం నీకు
జీవితం అంటే ఏంటో నేర్పిస్తుంది....!
ఒంటరితనం మరియు అవాంఛనీయ భావన చాలా భయంకరమైన పేదరికం._*

*_"జీవితంలో కొన్నిసార్లు ఒంటరిగా నడవడం
కష్టంగా ఉండొచ్చు. కానీ, నిజానికి ఆ ఒంటరితనం నీకు జీవితం అంటే ఏమిటో నేర్పిస్తుంది.”_*

*_ఓటమి, ఒంటరితనం ఈరెండు జీవితం లో చాల నేర్పిస్తాయి ఒకటి ఎలా గెలవాలి నేర్పిస్తే
 ఇంకోటి ఎవరిని నమ్మాలో
ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది._*

*_నిజం చెప్పాలంటే ఒంటరితనాన్ని పోగొట్టుకోవడం అనేది, ఒంటరిగా ఉండడం ద్వారానే  సాధ్యమవుతుంది. అయినా నీతో నీవు ఉండడానికే నీకు బోర్ కొడితే,నీ ప్రక్కన ఉన్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది..?_*

*_అదే నువ్వు ఆత్మ సాన్నిధ్యంలో ఒంటరిగా ఉండగలిగితే,రోజు నీతో నువ్వు గడపడం ఇష్టపడితే, నీ సొంత ఆలోచనలను, భావాలను గమనిస్తూ గడిపినప్పుడు నిశ్శబ్దం అంటే ఏంటో నీకు తెలుస్తుంది._*

*_నీ మనసు ప్రాపాంచికమైన ఆలోచనలతో చిక్కుకొని ఉంటుంది కాబట్టి,రోజు ఏదో ఒక సమయంలో కొద్ది నిమిషాల పాటు ఒక్కడివే కూర్చుని హృదయపు లోతుల్లోకి వెళ్ళిపో అప్పుడిక ఒంటరిగా ఉండాల్సిన ఒంటరితనాన్ని అనుభవించవు._*

*_ఎవరు చెప్పారు నీవు ఒంటరివి అని..? అది నువ్వు సృష్టించుకున్న ఒక వలయం. నిన్ను ఎవరు ప్రేమించడం లేదని ఆలోచన నీకు వస్తే, నువ్వు కచ్చితంగా ప్రేమను పొందుతున్నావని అర్థం._*

*_భూమి నిన్ను ప్రేమిస్తుంది కాబట్టే,నిన్ను స్థిరంగా నిలిపి ఉంచుతుంది. భూమి అంటే గురుత్వాకర్షణ శక్తి దాని ప్రేమా..._*

*_గాలి నిన్ను ప్రేమిస్తుంది కనుక నీవు నిద్ర పోతున్న సరే నీ ఊపిరితిత్తులలోకి వస్తూ పోతుంది._*

*_దైవం నిన్ను అత్యధికంగా ప్రగాఢంగా ప్రేమిస్తుంది. ఈ చిన్న విషయాన్ని నువ్వు గుర్తిస్తే నువ్వు ఎప్పటికీ ఒంటరి వాడవు కావు అనే భావనస్పూర్తిస్తుంది._*

*_ఒంటరితనం అనేది ఒక రకమైన అనుభూతి. అది మీ చుట్టూ ఉన్న వారు మీకు క్రియేట్ చేసిన ఓ భావోద్వేగం. అది మిమ్ములను కృంగదీస్తుంది._*

*_మనం ఒంటరిగా ఫీల్ అవుతున్నప్పుడు ప్రతికూల  ఆలోచనలు వెంటాడుతూ.. కొన్ని సమయాల్లో అవి ప్రమాదకరంగా కూడామారుతాయి. మనకు తెలియకుండా ఇవి మన జీవితంపై అనేక ప్రభావాలను చూపిస్తుంది, అంతేకాకుండా మీకు మనుషుల మీద విరక్తి కలిగిస్తాయి కాబట్టి,.._*

*_మీ సంతోషాన్ని మీరే వెతుక్కోండి, ఎవరో వచ్చి ఏదో చేస్తారని ఎప్పుడు ఆలోచించకండి. పరిస్థితుల పట్ల సానుకూల దృక్పత్వాన్ని కలిగి ఉండేందుకు ప్రయత్నించండి అప్పుడు మీరు రోజంతా ఉల్లాసంగా ఉంటారు.☝🏾_*
 నీ చరణములే 
మాకు శరణు
🙏🏼🙏🏼🙏🏼🙏🏼

భగవానుడొక్కడే పాదపూజకు అర్హుడు. ఆయన సృష్టికర్త, అనంతుడు. ఆయన చరణాలు శ్రీచరణాలు. అహంకారాన్ని, ఆభిజాత్యాన్ని వదిలిపెట్టి చేసే పాదసేవ సంపూర్ణ శరణాగతికి నిదర్శనం. మనసులోని సకల కల్మష భావాలను ఆవల పెట్టి చేసే సేవే పాదసేవనం.
అనంతుడి పాదపీఠమే భూమి. హరిపాదం సోకని తావుండదు. ఆయన సర్వవ్యాపకుడు. విశ్వం మొత్తాన్ని ప్రకాశింపజేసే చైతన్యరూపం ఆయనది. బ్రహ్మాండ గోళాలన్నింటినీ కొలిచిన పాదం. ఒక పాదంతో భూమిని, మరొకపాదంతో ఆకాశాన్ని ఆక్రమించి తన విరాట్‌ స్వరూపాన్ని ప్రదర్శించాడు. అహంకారంతో తుళ్ళిపడే జీవులను సంస్కరించిన పాదమది. పావనగంగ ఆ పాదాలనుంచే ఉద్భవించింది. అందుకే భక్తి జగత్తులో, మనసును పుష్పంలా మలచి ఆ పాదాలకు సమర్పించాలి. మనోవాక్కాయ కర్మలు ఏకీకృతమై, శుద్ధత్వంతో ఆ పాదాలను ఆశ్రయించాలి. భగవానుడికి సమర్పించే అధాంగపూజలో ప్రథమంగా పాదౌ పూజయామి అంటారు.
హిరణ్యకశిపుణ్ని తన నరసింహాకృతితో వధించిన పిదప, ఉగ్రరూపంలో సింహాసనాన్ని అధిష్ఠించిన శ్రీహరిని ప్రహ్లాదుడు నీ పాదాశ్రయుడిగా చేయమంటూ ప్రార్థిస్తాడు. అంతకన్నా సామ్రాజ్య వైభవాలు వద్దంటాడు.
శ్రీరామచంద్రుడి పాదుకలను తలపై ధరిస్తాడు భరతుడు. తల ఉన్నతమైన స్థానం. అది బ్రహ్మరంధ్రం ఉండే చోటు. సహస్రారకమలం నెలవై ఉండే చోటు. శ్రీరామచంద్రుడి పాదుకలను సింహాసనంపై ఉంచి శ్రీరామచంద్రుడి పేరిట రాజ్యపాలన చేస్తాడు. ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు కాళియుడి పడగలపై నాట్యం చేస్తాడు. ఆయన పాదముద్రలే నాగజాతికి అలంకారాలయ్యాయి.
శ్రీకృష్ణుడు గోవులతో గోపబాలురతో యమునాతీరంలో బృందావనంలో విహరిస్తుండగా గోవులను, గోప బాలురను మాయం చేస్తాడా విధాత. సృష్టికి ప్రతిసృష్టి చేస్తాడు శ్రీకృష్ణుడు. మనసును కమ్మిన మాయ, అహంకారం తొలగుతాయి విధాతకు. శ్రీకృష్ణుడి అవతార వైభవానికి తన్మయుడైన విధాత ‘స్వామీ! ఆ బ్రహ్మపథం ఎందుకు! నీతో కలిసి ఆడిపాడే గోపబాలుర పాదరేణువు నా తలపై ధరించినా నాకది చాలు’నంటాడు. మధురానగరంలో మాలాకారుడైన సుదాముణ్ని అనుగ్రహించి వరం కోరుకొమ్మని అంటాడు శ్రీకృష్ణుడు. నీ పాదకమల సేవ నీ పాదార్చకులతోడి స్నేహం అనుగ్రహించమని అడుగుతాడు సుదాముడు.
ఆదిశంకరుల అద్భుత రచనల్లో దేవీదేవతల పాదాల వైభవాన్ని వర్ణించారు.
సర్వ భయాలను పోగొట్టి సుఖాలనిచ్చే సదాశివుడి పాదపద్మాలను ఆశ్రయించాలని శివానందలహరిలో ప్రబోధిస్తారు. అరిషడ్వర్గాలను తొలగించి ముక్తిపథాన్ని చూపేది ఒక్క గురుపాదాలేనని, తన గురుపాదుకాస్తోత్రం ద్వారా తెలియజేశారు.
వివాహ వేడుకలో వరపూజ ముఖ్యమైన ఘట్టం. కన్యాదాత వరుణ్ని లక్ష్మీనారాయణ స్వరూపుడిగా భావించి, సుగంధ పూజాద్రవ్యాలతో కూడిన జలంతో పాదప్రక్షాళన చేస్తారు. అలాగే తల్లిదండ్రులను దైవస్వరూపులుగా భావించి, పాదపూజ జరుపుతుంది సంతానం. పాదప్రక్షాళన చేసిన జలాన్ని తమ శిరస్సులపై చిలకరించుకొని ధన్యత చెందినట్లుగా భావిస్తారు.
వినమ్రతకు, మనసులో మెదిలే భక్తి భావనకు నిదర్శనాలు ఇవన్నీ. ఆధ్యాత్మిక సాధనాజగత్తులో పాదసేవ గొప్ప సంస్కారవంతమైనది. భగవానుడి అవతారమూర్తుల చరణాలపైన నిలిచే దృష్టి, ఆ రూప వైభవాన్ని, తత్వాన్ని కాలగమనంలో గ్రహించగలుగుతుంది.
ఆ పాదాలకు-మనసుకు బంధం ఏర్పడాలి. ఆ బంధం మానవుణ్ని మాధవత్వం వైపు నడుపుతుంది.
💥💥💥🙏🏼🙏🏼💥💥💥💥
 *రాకాసి జంతువులు* (సంయుక్త అక్షరాలు లేని కథ)డా.ఎం.హరికిషన్-కర్నూలు-9441032212
*************************
రవి అదిరిపడి లేచి కళ్ళు తెరిచాడు. పడుకున్న మంచం అటూ ఇటూ ఉయ్యాలలాగా ఊగిపోతోంది. బయటనుంచి పెద్దగా అరుపులు కేకలు వినబడుతున్నాయి. ఇంటిలోంచి కంగారుగా బయటకు వచ్చి చుట్టూ చూశాడు. జనాలంతా తలా ఒక వైపుకు పారిపోతున్నారు. ఎవరూ ఎవరినీ పట్టించుకోవడం లేదు. అందరి మొహాల్లోనూ ఏదో భయం. నగరమంతా గందరగోళంగా అల్లకల్లోలంగా వుంది.
ఏమైంది.. ఎందుకలా పారిపోతున్నారు అని ఒకతన్ని గట్టిగా పట్టుకొని అడిగాడు.
అతను ఆయాసపడతా ఏందీ... నీకింకా ఏమీ తెలీదా... పిచ్చోని లెక్క ఉన్నావే. మన నగరం మీదికి వింత జంతువులు దాడి చేశాయి. దొరికిన వారిని దొరికినట్టు చంపుతా ఉన్నాయి. వాటి చేతికి చిక్కితే అంతే. పద పద తొందరగా పారిపోయి ఎక్కడన్నా దాక్కో అంటూ వెనక్కి తిరిగి చూడకుండా పారిపోయాడు.
రవికి అంతా గందరగోళంగా ఉంది. దూరంగా పెద్ద పెద్ద ఆకారాలు కనపడ్డాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క పెద్ద కొండంత ఉన్నాయి. కొన్ని చీమ తల కాయలతో... మరికొన్ని పక్షుల తలలతో... ఇంకొన్ని జంతువుల తలలతో... భయంకరంగా ఉన్నాయి.
వాటి అడుగుల కింద పడి పెద్ద పెద్ద భవనాలు నేలమట్టం అవుతున్నాయి. మనుషులు నుజ్జు నుజ్జు అవుతున్నారు. రవి అది చూసి వణికిపోయాడు. ఇంకా అక్కడే నిలబడి వుంటే తనకు గూడా అదే గతి పడుతుంది అనుకోని వెనక్కి తిరిగి వురక సాగాడు. అవి భయంకరంగా కేకలు పెడుతా, పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటా విమానాల్లా వేగంగా దూసుకు రాసాగాయి.
రవి అలా కొంత దూరం పారిపోయాడో లేదో ఒక పెద్ద చీమ తల వున్న రాకాసి వానికి అడ్డం వచ్చింది. రవి దాన్ని చూసి వణికిపోతా పారిపోవడానికి వెనక్కి తిరిగాడు. అంతలో రాకాసి చీమ చటుక్కున రవి జుట్టు పట్టుకొని పైకి లేపింది. ఏరా నా నుంచే తప్పించుకొని పారిపోదాం అనుకుంటా ఉన్నావా ... వుండు నీ పని చెబుతా అంటూ రవి కాలు పట్టుకొని చటుక్కుమని విరిచేసింది. అంతే రవి ఆ దెబ్బకు బాధతో గట్టిగా అరిచాడు. నొప్పితో విలవిలాడసాగాడు.
వద్దు... వద్దు... నన్నేమీ చెయ్యొద్దు. నేను చిన్న పిల్లవాన్ని. చానా మంచివాన్ని. ఎవరికీ ఎప్పుడూ ఎటువంటి ఆపదా తలపెట్టలేదు. నన్నొదులు నీకు దండం పెడతా అంటూ కళ్లనీళ్లతో వేడుకుంటా గింజుకోసాగాడు.
అలాగా... నువ్వు అమాయకునివా... ఎవరికీ ఏ ఆపదా తన పెట్టలేదా. ఆహా ఏం అబద్ధాలు ఆడుతా వున్నావురా... మా జాతికి చెందిన చిన్న చిన్న చీమలు ఎక్కడ కనపడినా ఊరికే వాటిని తొక్కి తొక్కి చంపుతా వుంటావు. నీ గురించి నాకు తెలియదనుకుంటున్నావా. వాటికి ఎవరూ లేరనే కదా... ఇప్పుడు చూడు నీవు వాటినెలా చంపుతావో అలాగే నిన్ను కూడా కాలికింద వేసి నలిపి చంపుతా... ఎవడు అడ్డం పడతాడో చూద్దాం అంటూ కిందపడేసి కాలు పైకెత్తింది.
వద్దొద్దు. ఇంకెప్పుడూ చిన్న చీమలను చంపను. నన్నేమీ చెయ్యొద్దు అంటూ గట్టిగా అరిచాడు రవి.
కానీ ఆ రాకాసి చీమ రవి మాటలను కొంచెం కూడా పట్టించుకోలేదు.
కాలు అలాగే రవి మీద పెట్టి గట్టిగా నొక్కసాగింది. రవికి ఎముకలన్నీ ఎక్కడివక్కడ ఫటఫటమని విరిగి పోసాగాయి. నొప్పితో విలవిలలాడిపోతా  కాపాడండి... కాపాడండి... నన్ను ఎవరైనా కాపాడండి అంటూ గట్టిగా అరవసాగాడు.

అప్పుడే రవి వాళ్ళ అమ్మ అక్కడికి  వచ్చింది.

బాధతో కేకలు పెడతా వున్న రవిని చూసింది.

వెంటనే ఉరుక్కుంటా దగ్గరికి వచ్చి రేయ్ రవీ.. లెయ్ లెయ్... నిదురలో ఏమలా కేకలు పెడతా వున్నావు. ఏమైంది. అనింది గట్టిగా కుదుపుతా.
రవి అదిరిపడి నిదుర లేచాడు.
చుట్టూ చూశాడు. ఎదురుగా అమ్మ. 
భయంకరమైన జంతువులు ఏవీ లేవు.
తను తన మంచం మీదనే ఉన్నాడు. ఒళ్లంతా భయంతో చమట పట్టి తడిసిపోయింది.

అమ్మో... ఎంత భయంకరమైన కల అనుకున్నాడు.

ఏమైందిరా అడిగింది అమ్మ.
రవి తనకు వచ్చిన కలంతా వివరించాడు.
రవి వాళ్ళ అమ్మ కాసేపు ఆలోచించి మన కలలో అప్పుడప్పుడూ  మనం చేసే వెధవ పనులే కనపడుతుంటాయి. నిజం చెప్పు... నువ్వు జంతువులను, పక్షులను ఏమైనా బాధ పెడతా వున్నావా అనడిగింది.
అప్పుడే అక్కడికి రవి చెల్లెలు రమ వచ్చింది.
అమ్మా... నువ్వు చెప్పింది నిజమే. అన్నయ్య బడికి పోయేటప్పుడు, వచ్చేటప్పుడు దారిలో చీమల పుట్టలు కనపడితే చాలు ఎగిరి వాటిమీద దూకుతాడు. ఏదైనా చెట్టు మీద పక్షుల గూళ్ళు కనపడితే చాలు కట్టెతో చిందరవందర చేసి పగల కొడతాడు. రాళ్లతో పిట్టలను పావురాలను చిలకలను గురిచూసి బలంగా కొడతాడు. కుక్కలు పందులు కనపడితే చాలు రాళ్లు విసురుతాడు. అవి బాధతో మూలుగుతావుంటే ఎగురుతా సంబరపడతాడు. మా తరగతి పిల్లలందరూ మీ అన్న చానా చెడ్డ పిల్లోడు అంటూ తిడతారు.  ఆ మాటలకు వాళ్ల ముందు తలెత్తుకొని తిరగ లేకుండా ఉన్నాను అని చెప్పింది.
ఆ మాటలకు అమ్మ చానా బాధపడింది.
రవిని దగ్గరికి తీసుకుని... చూడు రవీ... మన చెయ్యో కాలో విరిగితే మనం ఎంత బాధ పడతామో, వాటి చెయ్యో కాలో విరిగితే అవీ అంతే బాధ పడతాయి. చీమయినా , కుక్కయినా, పందయినా ,  మనిషయినా  అన్నింటికీ నొప్పి ఒకటే కదా. అవి మూగ జీవులు కాబట్టి ఆ బాధను బయటకు చెప్పుకోలేవు. చిన్నచిన్న జంతువులకు చేతనైతే సాయం చేయాలి... అంతేగాని బాధ పెట్టకూడదు. నీవు వాటినలా బాధపెడతా ఉన్నందుకే నీకు ఈ రోజు ఇలాంటి కల వచ్చింది అనింది.
రవికి మరలా కల కళ్ళముందు మెదిలింది.
చీమ కాలు విరగ్గొడతా వుంటే బాధతో కేకలు పెట్టడం, గిలగిలా కొట్టుకోవడం అంతా మతికి వచ్చింది. నుదిటి మీద చిన్నగా చెమటలు పట్టాయి. సిగ్గుతో తల వంచుకున్నాడు. కళ్ళలోంచి నీళ్ళు కారాయి.
నిజమే అమ్మా... నువ్వు చెప్పింది. ఇంకెప్పుడూ ఏ చిన్న జంతువుకూ ఎటువంటి ఆపదా తల పెట్టను. కలతో నా కళ్ళు తెరుచుకున్నాయి అన్నాడు.
అమ్మ ఆనందంతో రవి నుదిటి మీద చిన్నగా ముద్దుపెట్టుకొంది.
*****************************
డా.ఎం.హరికిషన్-కర్నూలు-9441032212
*****************************
కథ నచ్చితే *SHARE* చేయండి. రచయిత పేరు మార్చకండి. తీసేయకండి.
 *అత్తా నలుగురు కోడళ్ళు (సరదా జానపద నీతి కథ)* - డా.ఎం.హరికిషన్ - కర్నూలు -9441032212
*****************************
      ఒకూర్లో ఒక ముసలామె వుండేది. ఆమె చానా మంచిది. ఆ ముసలామెకి నలుగురు కోడళ్ళున్నారు. కోడళ్ళకేమో అత్తంటే అస్సలు పడదు. ఇంట్లో ఏమన్నా పిండివంటలు చేసుకుంటే అత్తకు కూడా పెట్టాల గదా.... అందుకని ఆమె వున్నప్పుడు ఎవరూ ఏమీ చేసుకునేటోళ్ళు కాదు. ఐతే అత్త ఎప్పుడన్నా ఏదన్నా పనిబడి ఏదైనా వూరికి పోయిందంటే చాలు... ఎవరికిష్టమైనవి వాళ్ళు కొనుకొక్కొచ్చుకునేటోళ్ళు. రకరకాల పిండివంటలు చేసుకునేటోళ్ళు. అత్త వచ్చేలోపల అన్నీ నున్నగా తినేసి, శుభ్రంగా గిన్నెలు కడిగేసి ఎమీ ఎరుగని నంగనాచుల్లెక్క గమ్మున ఉండేటోళ్ళు. అత్తకు మాత్రం కొంచంగూడా అస్సలు పెట్టేటోళ్ళు కాదు. నెమ్మదిగా అత్తకు విషయం అర్థమైంది. ఎట్లాగయినా సరే కోడళ్ళకు బుద్ధి చెప్పాలని ఒక ఉపాయం ఆలోచించింది.
ఒకరోజు పొద్దున్నే అత్త పెట్టె తీసుకోని కోడళ్ళందరినీ పిలిచి "నాక్కొంచెం పనుంది. మా అన్నోళ్ళు వూరికి పోతా వున్నా... మళ్ళీ రేపు పొద్దునొస్తా" అని చెప్పి పెట్టె తీసుకోని బైలుదేరింది. అట్లా కొంచం దూరం పోయినట్లే పోయి ఎవరూ చూడకుండా మళ్ళీ వెనక్కు తిరిగొచ్చి ఇంటి వెనుకవైపు నుండి లోపలికి దూరింది. ఎవరి కంటా వడకుండా జాగ్రత్తగా మచ్చు ఎక్కి పైన కూచోని ఇంట్లో ఏం జరుగుతుందో అంతా చూడసాగింది.
ఇదంతా కోడళ్లకు తెలీదు గదా... దాంతో వాళ్ళకు పట్టపగ్గాలు లేకుండా పోయినాయి. మొదటి కోడలేమో కొత్తకోక కట్టుకోని సంతకు పోయి పెద్ద పెద్ద బెల్లం చెరుకులు కొనుక్కొచ్చుకుంది. రెండో కోడలేమో బాగా బెల్లమేసి తియ్యతియ్యని బచ్చాలు చేట నిండా చేసుకోనింది. మూడో కోడలేమో బాగా ఘుమఘుమలాడేటట్లు నెయ్యేసి గోధుమ పాయసం గిన్నె నిండా వండుకోనింది. నాలుగో కోడలేమో వూర్లో నేరేడు పండ్లు అమ్ముతా వుంటే పోయి లావులావువి బాగా మాగినేవి కొనుక్కొచ్చుకోనింది.
అత్త మచ్చు పైనుంది గదా.... ఎవరెవరు ఏమేమి కొంటా వున్నారు... ఏమేమి చేసుకుంటా వున్నారు... ఎక్కడెక్కడ పెడతా వున్నారు... అన్నీ బాగా చూసింది. నెమ్మదిగా ఎవరి కంటా పడకుండా మచ్చు దిగి వెనుక తలుపు తెరుచుకోని బైటకి వెళ్ళి పోయింది. కాసేపటికి పెట్టె చేత్తో పట్టుకోని ముందువైపు నుంచి ఇంట్లోకొచ్చింది. అత్తను చూస్తానే అందరూ అదిరిపడ్డారు. "అదేందబ్బా... రేపటి వరకూ రానని అప్పుడే వచ్చేసిందీ దొంగ సచ్చినేది" అని లోపల్లోపల తిట్టుకుంటా.... "ఏమత్తా... ఇప్పుడే గదా పోయింది... మళ్ళీ అప్పుడే తిరిగొచ్చేసినావు.... ఏమైంది. ఏమైనా మర్చిపోయినావా" అనడిగినారు. అత్త అందరి వంకా చూస్తా "ఏం చెయ్యమంటారు చెప్పండి. నేను పోతా వుంటే దారిలో ఒక పెద్ద నాగుబాము పడగ విప్పుకోని ఎదురొచ్చింది. దాంతో భయపడి తిరిగొస్తి" అనింది.
పెద్ద పాము కనబడిందని చెప్పగానే అందరికీ ఆసక్తి మొదలయింది. మొదటి కోడలు పామెంతుందో కనుక్కుందామని “అత్తా... అత్తా... ఎంత పెద్దగుందత్తా పాము" అనడిగింది. వెంటనే ముసల్ది “నువ్వు సంతలో బెల్లం చెరుకు కొనలా.... దానంత పొడవుంది" అనింది. అంతే కోడలు అదిరిపడి గమ్మున నోర్మూసుకొనింది. అంతలో రెండో కోడలు "అత్తా.... అత్తా... దాని పడగ ఎంతుందత్తా" అనడిగింది. ముసల్ది నవ్వుతా "సువ్వు చేటలో బచ్చాలు చేసి గూట్లో దాచి పెట్టినావు గదా... అచ్చం ఆ బచ్చమంత ఉంది" అనింది. అంతే రెండో కోడలు మారు మాట్లాడకుండా నోరు మూసుకోనింది.
అంతలో మూడో కోడలు "అత్తా... అత్తా... దాని ఒల్లు ఏ రంగులో వుందత్తా" అనడిగింది. వెంటనే ఆ ముసల్ది నువ్వు గోధుమ పాయసం వండు కొన్నావు గదా... అచ్చం అ పాయసం రంగుంది" అనింది. "నేను పాయసం చేసుకున్నది ఈ అత్తకెట్లా తెలిసిందబ్బా" అని ఆశ్చర్యపోతా మూడో కోడలు గమ్మున నోరు మూసుకొంది. అంతలో నాలుగో కోడలు "అత్తా... అత్తా... దాని కనుగుడ్లు, ఎంత లావున్నాయత్త" అనడిగింది. వెంటనే ఆ ముసల్ది "నువ్వు గూట్లో దాచి పెట్టినావు చూడు... ఆ నేరేడు పండ్లంత లావున్నాయి" అనింది.
దాంతో ఆ నలుగురు కోడళ్ళకు తాము ఏమేం కొనుక్కున్నది... ఏమేం చేసుకున్నది... ఎక్కడెక్కడ దాచిపెట్టింది... అన్నీ అత్తకు తెలిసిపోయాయని అర్ధమయింది. "అత్తేదో అమాయకురాలు అనుకుంటిమి గానీ పెద్ద అసాధ్యురాలు" అనుకోని అందరూ ఆమె కాళ్ళ మీద క్షమించమని పడ్డారు. అప్పటి నుంచీ తాము ఏమి చేసుకున్నా అత్తకు ముందు పెట్టి తాము తినేటోళ్లు.
*****************************
డా.ఎం.హరికిషన్-కర్నూలు-9441032212
*****************************
కథ నచ్చితే *SHARE* చేయండి. రచయిత పేరు మార్చకండి. తీసేయకండి.

*✍🏽 నేటి కథ ✍* *తెలివితక్కువ నక్క*

 *✍🏽 నేటి కథ ✍*

*తెలివితక్కువ నక్క*

అనగనగా ఒక అడవి. ఆ అడవిలో ఒక నక్క. నక్క అంటే "జిత్తులమారిది" అని అందరికీ తెలుసు. కానీ ఈ అడవిలోని నక్క జిత్తులమారిదే కాక, మహా బద్దకపు నక్క కూడానూ. కూర్చున్న చోటికే తిండి రావాలి, దగ్గరగా వచ్చిన జంతువులనే చంపి తింటుంది. ఒకసారి నాలుగైదు రోజులుగా దానికి తిండి దొరకలేదు. ఏ జంతువూ దొరక్క, ఆకలితో నీరసం వచ్చింది దానికి. ఇక నడవలేకపోయింది. ’ఇలాగే ఇంకో రెండు రోజులు తిండి దొరక్కపోతే నా పని అంతే’ అనుకుంది నక్క.

ఇంతలో బలిసిన గాడిద ఒకటి అటుగా వచ్చింది. హాయిగా తన మానాన తను మేయసాగింది. నక్కకు గాడిదను చూడగానే నోరూరింది. నేనిక ఆకలితో చావనవసరం లేదు. దేవుడు నాకోసమే ఈ గాడిదను పంపించాడు అనుకుంది నక్క. పాపం గాడిద మాత్రం నక్కను ముందుగా చూడలేదు. తీరా దగ్గరికి వచ్చాక చూసింది. భయంతో వణికిపోయింది. ’ఇక నాకు చావు ఖాయం’ అనుకుంది గాడిద.

కానీ గాడిద చాలా తెలివైనది. భయపడుతూనే ఒక ఉపాయం ఆలోచించింది. ఆ మరుక్షణం నుంచీ వెనక కాలుతో కుంటుతూ నడవసాగింది. బాధపడుతూ ఒకసారి మూలిగింది కూడా. ఇదంతా గమనించిన నక్కకు చాలా చాలా సంతోషమయింది. కుంటి గాడిద పారిపోలేదని నక్కకు మహా ఆశ కలిగింది. ’ఇక ఈ గాడిద నాచేతిలో చావడమూ, నాకడుపు నిండడమూ ఖాయం’ అనుకుంటూ నిదానంగా నక్కుతూ గాడిదను సమీపించింది.

’ఏమిటి సంగతి, కుంటుతున్నావు?’ అని అడిగింది. ’కాలిలో ఒక పెద్ద ఈతముల్లు గుచ్చుకుంది నక్క బావా! అబ్బా! ఒకటే బాధ’ అని చెప్పింది గాడిద. ’అయితే ఎవరితోనయినా తీయించుకోలేక పోయావా?’ అంది నక్క. ’చాలా మంది చూశారు, కానీ ఎవ్వరూ ముల్లును బయటికి తీయలేకపోతున్నారు నక్కబావా!’ అన్నది గాడిద.

రానురానూ నక్కకు మహదానందమవ్వసాగింది. ’అయ్యో! అవునా! అయితే నీ బాధను నేను పోగొడతాను’ అన్నది నక్క. ’ఎలా? ఎలా పోగొడతావు?’ అని గాడిద అడిగింది. ’నేను ఇప్పుడే నిన్ను చంపి తింటాను . ఇక నీకు ముల్లుబాధ ఉండనే ఉండదు!’ అన్నది నక్క ఉత్సాహంగా. ’అవునా! అయితే త్వరగా నన్ను చంపెయ్యి నక్కబావా! నాకీ ముల్లు బాధను త్వరగా తప్పించు’ అన్నది గాడిద.

అనుమానంగానే నక్క గాడిద మీదకు రాబోయింది. అంతలో ’ఆగాగు నక్క బావా! ఒక్క క్షణం ఆగు- నా కాలిలో ఉన్న ముల్లు చాలా పెద్దది. నువ్వు నన్ను తినటంలో ఆ ముల్లు సంగతి మరిచిపోయినట్లున్నావు. ఆ ముల్లు నీ గొంతులో ఇరుక్కుందంటే ఇక నీ పని సరి! ముందు ముల్లును తీసేసి, ఆ తరువాత నన్ను హాయిగా ఆరగించు’ అన్నది గాడిద. ఆ మాటతో నక్క కళ్ళు తెరుచుకున్నట్లైంది. ’అవును , ఆ ముల్లు నా గొంతులోకి పోతే నాకు చాలా ఇబ్బంది అయ్యేది. నాకా ఆలోచనే రాలేదు. చావబోయే గాడిద నాకు చాలా మేలు చేసింది’ అనుకుంది. అయినా పైకి ఏమీ అనలేదు. నక్క ఇతరులను ఎప్పుడూ మెచ్చుకోదు కదా!.

’సరే, సరే. ఏదీ, ఆ ముల్లున్న కాలినిలా ఇవ్వు! ఆ ముల్లు సంగతి నేను చూస్తాను’ అన్నదది. ’ఎందరో చూశారు, సరే నువ్వూ చూడు’ అంటూ గాడిద కాలిని నక్కకు చూపింది. నక్కకు ఏమీ కనిపించలేదు. కళ్ళు నులుముకొని మరీ చూసింది. మరింత దగ్గరగా తన ముఖాన్ని పెట్టి చూడసాగింది. ’చాలా లోపలికి దిగింది నక్క బావా!’ అన్నది గాడిద. నక్క ఆనందమే ఆనందం. ఎప్పుడెప్పుడు ముల్లును తీద్దామా, గాడిదను తిందామా అనే ఆలోచన తప్ప దానికి మరో ఆలోచనే లేదు. ముల్లును చూడటంలోనే లీనమైపోయింది. అదనుకోసం వేచి చూసిన గాడిద సమయం రాగానే తన కాలిని సత్తువకొద్దీ జాడించింది. అంతే! నక్క బంతిలా గాలిలోకి ఎగిరిపోయింది. అంత ఎత్తు నుండీ నేలపై దభీమని పడ్డది. చుక్కలు కనిపించాయి దానికి. ఎక్కడి ఎముకలు అక్కడే పటపటా విరిగిపోయాయి. గాడిదేకదా అని తక్కువగా అంచనా వేసిన నక్కకు మంచి గుణపాఠమే లభించింది.
*సేకరణ: 🅂🄾🄽🅃🄴🄻🄰 🄳🄷🄰🄽🅄🄽🄹🄰🅈🄰*

శ్రీ కృష్ణుడిని ఆంజ‌నేయ స్వామి ఎన్ని సార్లు క‌లిశాడు.

 శ్రీ కృష్ణుడిని ఆంజ‌నేయ స్వామి ఎన్ని సార్లు క‌లిశాడు.

మహాభారతం మొత్తం మీద ఎక్కడ కూడా హనుమ, శ్రీకృష్ణుడు ఇద్దరు నేరుగా కలిసిన సందర్బాలు లేవు. భాగవతాది పురాణాలలో కూడా ఎక్కడా లేవు.

శ్రీకృష్ణాంజనేయ యుద్ధం సినిమాలో చూపించినట్టు, గరుత్మంతుని గర్వం తగ్గించటానికి శ్రీకృష్ణుడు గంధమాదన పర్వతం మీదనున్న హనుమను తీసుకురమ్మని పంపగా, గరుత్మంతుడు హనుమ చేతిలో భంగపడ్డారని, ద్వారకకు వచ్చిన తర్వాత హనుమకు శ్రీకృష్ణుడు, రుక్మిణి సీతారాములుగా దర్శనమిచ్చారన్న కథ, మైత్రేయ-పరాశర సంవాద రూపముగానున్న శ్రీ పరాశర సంహితా (శ్రీ హనుమచ్చరితము) అనే గ్రంథంలో 48 వ అధ్యాయంలో ప్రస్తావించబడింది.[1] శ్రీకృష్ణుడు హనుమ కలిసిన సందర్భం ఇదొక్కటే కనపడుతుంది.

అర్జునుడు అమ్ములతో సేతువు నిర్మిస్తే అది హనుమ కూల్చటం, తర్వాత మళ్ళీ నిర్మించిన సేతువు కృష్ణుడు కాపు కాసి కూలకుండా చేస్తాడు. తదుపరి హనుమకు రాముడిగా శ్రీకృష్ణుడు దర్శనమిచ్చాడని, అప్పుడు అర్జునుడి రథ పతాకం పై తానుంటానని హనుమ మాటిచ్చినట్టు చెప్పే కథ కల్పితమే. దానికి ఏ గ్రంథములలోనూ ఆధారం కనపడదు. ఒకవేళ ఈ కథ నిజమైతే, ద్వారకకు వెళ్ళిన కథలో హనుమకు శ్రీకృష్ణుడు తెలియకపోవటం జరిగుండకూడదు.

వ్యాసభారతంలో భీముడికి హనుమకి జరిగిన సంభాషణ చదివితే, జరగబోయే ఘటనలలో దైవసంకల్పం, తన ప్రమేయం, శ్రీకృష్ణుని కలవకపోయినా అతని దివ్యత్వం అప్పటికి హనుమకు విదితమేనని మనకు అర్థమవుతుంది……

*****మానవునికి - దుఃఖ విముక్తి ఎలా కలుగుతుంది?? - ఎలా కలిగించుకోవాలి??*

 *మానవునికి - దుఃఖ విముక్తి ఎలా కలుగుతుంది?? - ఎలా కలిగించుకోవాలి??*
ఒకనాడు ధర్మరాజు భీష్ముడి వద్దకు వెళ్లి, " పితామహా ! మానవుడు దేనిని ఆచరించిన సమస్త దుఃఖములనుండి విముక్తి పొందగలడు ??" అని అడిగాడు. 

అప్పుడు భీష్ముడు ... " ధర్మనందనా ! నేను నీకు అజగర కథచెప్తాను విను, అని చెప్పాడు!!!...

     పూర్వము ప్రహ్లాదుడు ఒక బ్రాహ్మణుడిని చూసి తనకు శమము గురించి చెప్పమని అడిగాడు. 

      అందుకు ఆ బ్రాహ్మణుడు " మహారాజా ! ఈ చరాచర జగత్తులో అనుదినము ఏ నిమిత్తము లేకుండా ఎన్నో ప్రాణులు పుడుతున్నాయి, చనిపోతున్నాయి. 
       అందులో మానవులూ ఉన్నారు, ఏ ప్రాణి శాశ్వతం కాదు, ప్రాణం శాశ్వతం కాదని తెలిసీ, మానవులు మరణానికి కలత చెందుతారు. 

       నదులకు వరదలు వచ్చినప్పుడు ఎన్నో దుంగలు కొట్టుకు వస్తాయి. 
        అవి ఒక్కక్కసారి కలుస్తూ తిరిగి కొంతదూరం పోయి విడిపోతాయి. 
         ఈ సృష్టిలో భార్యాభర్తలు బంధుమిత్రులు అలాగే కలుస్తూ విడిపోతుంటారు. 

          ఈ సత్యం తెలిసిన వాడు సుఖదుఃఖాలకు అతీతుడు అయి శాశ్వత ఆనందం పొందగలడు. 
           నేను సుఖదుఃఖాలకు అతీతుడను కనుక నన్ను అడిగి నీ సందేహాలు తీర్చుకుంటున్నావు.
            నేను, నాకు మేలు జరగాలని ఎన్నడూ కోరను, దుఃఖం వచ్చిన కలత పడక దానిని పోగొట్టడానికి ప్రయత్నిస్తుంటాను. 
      
      నేను ఆహారంలో రుచికి ప్రాధాన్యత ఇవ్వక ఏది దొరికినా తింటాను. 
      మృదువైన శయ్యమీద కటిక నేలమీద సమభావంతో నిద్రించగలను. 
       పట్టువస్త్రాలు, నారచీరలు ఏవైనా ధరించగలను. 
        ఎదీ నాకుగాకోరను, లభించినది ఏదైనా తృప్తి చెందగలను. 
      
      *అజగరవ్రతం స్వీకరించి నన్ను వెదుకుతూ వచ్చినది మాత్రం స్వీకరించి ప్రశాంత చిత్తతతో ఉంటాను*. 

    తృప్తి, శుభ్రత, ఓర్పు, అంతటా సమభావం, అంతర్దృష్టి ఇదే అజగరవ్రతం, ఇది యజ్ఞయాగాదుల వలన లభించదు. 
     ఆత్మజ్ఞానం వలననే ఇది లభించ గలదు. 
      అజగరవ్రతం ఆచరించే వారికి పాపము అంటదు, భయము ఉండదు, శోకముచేరదు, మోక్షము అతడికి దగ్గరగా ఉంటుంది " అని ప్రహ్లాదుడికి బ్రాహ్మణుడు చెప్పాడు.

ఇది ఆచరించిన మానవులకు కూడా ఎలాంటి దుఃఖం , పాపం, అంట కుండా ఉండగలుగుతారు.

****ప్రకృతి నియమం ఏమిటంటే, మనిషి ఏ వస్తువుతో అత్యంత అనుబంధంగా ఉంటాడో. అదే అతనికి మోక్ష ప్రతిబంధకం అవుతుంది

 *ఒకసారి నారదుడు విష్ణువును అడిగాడు " మీ భక్తులు ఎందుకు పేదవారుగా ఉంటారు ?" అప్పుడు విష్ణువు చెప్పాడు - "నారదా, నా కృపను అర్థం చేసుకోవడం చాలా కష్టం."*

*ఇలా చెబుతూ, విష్ణువు నారదునితో పాటు సాధువు వేషంలో భూమిపైకి వచ్చి భిక్ష అడగడానికి ఒక ధనికుడి ఇంటి తలుపు తట్టారు. ధనికుడు కోపంగా తలుపు వైపు వచ్చి, అక్కడ నిలబడి ఉన్న ఇద్దరు సాధువులను చూశాడు. సాధు వేషంలో ఉన్న విష్ణువు అన్నాడు - "స్వామి నాకు చాలా ఆకలిగా ఉంది. మాకు భోజనం పెట్టించండి "*

*ధనికుడు కోపంగా, "ఎద్దుల్లాగున్నారు, పని చేసుకుని తినండి" అని వాకిలి వేసేశాడు. నారదుడు అన్నాడు - "చూడండి ప్రభూ! ఇతను నీ భక్తులను మరియు నిన్ను అగౌరవపరిచే వ్యక్తి. ఇప్పుడే అతన్ని శపించండి."*

*నారదుని మాటలు విన్న దేవుడు ఆ వ్యాపారవేత్తకు మరింత సంపదను ప్రసాదించాడు.*

*దీని తర్వాత, విష్ణువు నారదున్ని ఒక వృద్ధురాలి ఇంటికి తీసుకెళ్లాడు. ఆమెకు ఒక చిన్న గుడిసె ఉంది, అందులో ఆవు తప్ప మరేమీ లేదు. భగవంతుడు భిక్ష అడగగానే ఆ వృద్ధురాలు ఎంతో సంతోషంతో బయటకు వచ్చింది. సాధువులిద్దరినీ ఒక ఆసనంలో కూర్చోబెట్టి, వారికి తాగడానికి పాలు తెచ్చి - "ప్రభూ! నా దగ్గర ఇంకేమీ లేదు, దయచేసి దీనిని సేవించండి." అన్నది.*

*విష్ణువు ఎంతో ప్రేమతో దానిని అంగీకరించాడు. అప్పుడు నారదుడు భగవంతునితో ఇలా అన్నాడు - "ప్రభూ! ఈ లోకంలో నీ భక్తుల కష్టాలు చూడు, ఈ పేద వృద్ధురాలు నీ భజనలు పాడుతుంది మరియు అతిథులను కూడా ఆదరిస్తుంది. దయచేసి ఆమెకు మంచి సంపదను ఇవ్వండి."*

*కాసేపు ఆలోచించిన తరువాత, విష్ణువు ఆమె ఆవును చనిపోవాలని శపించాడు.*

*అది విన్న నారదుడు కోపంతో ఇలా అన్నాడు - "ప్రభూ మీరు ఏమి చేసారు?"*

*విష్ణువు అన్నాడు - "ఈ వృద్ధురాలు మహా భక్తురాలు. కానీ ఆమెకు ఆమె ఆవు మీద మోహం ఉన్నది. ఆమె కొన్ని రోజుల్లో చనిపోతుంది. చనిపోతుండగా, ఆమె తన ఆవు గురించి ఆందోళన చెందుతుంది. దీనివలన ఆమె మరుజన్మలో ఆ అవుకు దూడ అయి జన్మిస్తుంది. కానీ ఆ ఆవు చనిపోతే ఆమెకు ఉన్న ఏకైక బంధం వీడి నన్ను మాత్రమే తలచి మోక్షాన్ని పొందుతుంది. కానీ ఆ ధనికుడు అజ్ఞాని. ఆతను తన దనం మీద ఉన్న అపరిమిత మొహం వల్ల మరు జన్మలో తన ధనాన్ని కాపాడే పాముగా పుడతాడు. ప్రకృతి నియమం ఏమిటంటే, మనిషి ఏ వస్తువుతో అత్యంత అనుబంధంగా ఉంటాడో. అదే అతనికి మోక్ష ప్రతిబంధకం అవుతుంది"*

*కాబట్టి మీ ఆలోచనలను భగవంతునిపై ఎక్కువగా ఉంచండి...* 

*హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ్ హరే రామ్ రామ్ రామ్ హరే హరే.*
🙏🕉️🙏 🙏🙇‍♂️🙏 🙏🕉️🙏

****మన దేశం గురించి 35 'మైండ్ బ్లోయింగ్' నిజాలివి.

 మన దేశం గురించి 35 'మైండ్ బ్లోయింగ్' నిజాలివి. 


1. ప్రపంచంలో ఇంగ్లీష్ అత్యధికంగా మాట్లాడే రెండో దేశం భారత్. తొలి దేశం అమెరికా.
2. ప్రపంచంలోని రాజ్యాంగాల్లో ఇండియాదే అతి పెద్దది. 448 ఆర్టికల్స్, 25 భాగాలు, 12 షెడ్యూళ్లతో ఉంటుంది.
3. ఆసియా సింహాలను పరిరక్షిస్తున్న ఏకైక దేశం ఇండియానే.
4. ప్రపంచంలో అత్యధిక శాఖాహారులున్న దేశం కూడా మనదే. దాదాపు 40 శాతం భారతీయులు మాంసాహారం ముట్టరు.
5. ఇండియాలోని రోడ్లతో భూమి అంతటినీ 117 సార్లు చుట్టేయొచ్చు.
6. భారత సాఫ్ట్ వేర్ కంపెనీలు 90 దేశాలకు తమ ప్రొడక్టులను ఎగుమతి చేస్తాయి. అమెరికా సహా మరే దేశానికీ ఈ ఘనత దక్కలేదు.
7. మార్స్ పరిశీలనకు ఉపగ్రహాలను పంపేందుకు ఇతర దేశాలు వెచ్చించిన మొత్తంలో 75 శాతం తక్కువకే ఇస్రో విజయం సాధించింది.
8. యూఎస్, జపాన్ ల తరువాత సూపర్ కంప్యూటర్లను తయారు చేసిన, చేస్తున్న ఏకైక దేశం ఇండియానే.
9. 2014లో జరిగిన ఎన్నికల్లో ఇండియాలో ఓట్లు వేసిన వారి సంఖ్య 54 కోట్లు. అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, జపాన్ దేశాల మొత్తం జనాభా కన్నా ఇదే అధికం.
10. మరో ఏడాది నాటికి ప్రపంచంలోని కార్మిక శక్తిలో 25 శాతం ఇండియా నుంచే వెళుతుందని అంచనా.
11. జాతీయ క్రీడ అంటూలేని దేశాల్లో ఇండియా ఒకటి
12. ఇండియాలో సుమారు 1000 భాషలున్నాయి. జాతీయ భాష కూడా లేదు. హిందీ, ఇంగ్లీష్ లు అధికార భాషలుగా గుర్తింపు పొందాయి.
13. అన్ని యూరోపియల్ భాషలకూ మూలమైన సంస్కృతం ఇండియాలో పుట్టిందే.
14. ప్రపంచ తొలి యూనివర్శిటీ క్రీస్తు పూర్వం 700 సంవత్సరాలకు ముందే ఇండియాలో మొదలైంది. అదే తక్షశిల. ఇక్కడ ప్రపంచ నలుమూలల నుంచి
10,500 మంది విద్యార్థులకు 60 సబ్జెక్టుల్లో బోధనలు సాగాయనడానికి ఆధారాలున్నాయి.
15. గతంలో భారత రూపాయి ఎన్నో దేశాల్లో అధికారిక కరెన్సీగా చలామణి అయింది. ఒమన్, దుబాయ్, కువైట్, బహ్రయిన్, ఖతార్, కెన్యా, ఉగాండా, సీషల్స్, మారిషస్ దేశాలు అధికారిక కరెన్సీగా రూపాయిని వాడాయి.
16. ఇప్పటివరకూ జరిగిన ప్రపంచ స్థాయి పోటీల్లో ఓటమెరుగని జట్టుగా భారత కబడ్డీ జట్టు నిలిచింది. భారత కబడ్డీ ఆటగాళ్లు తామాడిన అన్ని వరల్డ్ కప్ పోటీల్లో విజేతలుగా నిలిచారు.
17. వరల్డ్ రికార్డులను క్రియేట్ చేయడంలో ప్రపంచంలో మూడో స్థానం మనది. తొలి రెండు స్థానాల్లో అమెరికా, బ్రిటన్ ఉన్నాయి.
18. ప్రపంచంలో బంగారాన్ని అత్యధికంగా వినియోగిస్తున్న దేశాల్లో ఇండియా రెండవది.
19. ప్రపంచంలోనే సుగంధ ద్రవ్యాలను అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్న దేశం ఇండియానే.
20. 1990లో జరిగిన గల్ఫ్ వార్ సమయంలో అతిపెద్ద ప్రజల తరలింపును భారత్ చేపట్టింది. ఆ దేశాల్లో ఉన్న సుమారు 1.7 లక్షల మందిని 488 ఎయిర్ ఇండియా విమానాలు 59 రోజులు శ్రమించి దేశం దాటించాయి.
21. ఐక్యరాజ్యసమితి నిర్వహించే శాంతి దళాల్లో అత్యధికులు భారతీయులే.
22. గడచిన 1000 సంవత్సరాల్లో భారత్ స్వయంగా ఏ దేశంపైనా దాడి చేయలేదు.
23. 1896 వరకూ ప్రపంచానికి వజ్రాలను అందించిన ఏకైక దేశం ఇండియా మాత్రమే. కృష్ణా నది డెల్టా, ముఖ్యంగా ఇప్పటి హైద్రాబాద్,తెలంగాణ,కృష్ణా, గుంటూరు జిల్లాల్లోనే ప్రపంచ ప్రఖ్యాత వజ్రాలెన్నో లభించాయి.
24. చైనా, అమెరికాల తరువాత అతిపెద్ద సైనిక శక్తి మనదే.
25. ప్రపంచంలోని అతిపెద్ద రైల్వే ప్లాట్ ఫాం ఖరగ్ పూర్ లో ఉంది. దీని పొడవు 2.773 కిలోమీటర్లు.
26. ప్రపంచంలో తొలిసారిగా పర్సనలైజ్డ్ స్టాంపులను అందించిన దేశం ఇండియానే.
27. ఇండియాలో రోజుకు 14,300 రైళ్లు తిరుగుతుండగా, అవి ప్రయాణించే దూరం చంద్రడికి, భూమికి మధ్య ఉన్న దూరానికి మూడున్నర రెట్లు అధికం.
28. ప్రపంచంలో అత్యధికంగా సినిమాలు తీసే దేశం కూడా ఇండియానే.
29. ప్రపంచంలో అత్యంత పురాతన నగరం మనదేశంలోనే ఉంది. అదే వారణాసి.
30. ఇసియాలోనే అత్యంత పరిశుభ్ర గ్రామం మేఘాలయాలో ఉంది. దాని పేరు మౌలినాంగ్. ప్రపంచంలోనే అత్యధికంగా వర్షం పడే ప్రాంతమూ మేఘాలయాలో ఉంది. అదే చిరపుంజి. ఇక్కడ ప్రతియేటా సరాసరిన 467 అంగుళాల వర్షపాతం నమోదవుతుంది.
31. అత్యధిక విద్యార్థులు ఉన్న స్కూలు కూడా మనదే. లక్నోలోని సిటీ మాంటిస్సోరి పాఠశాలలో ఏటా 45 వేల మంది విద్యను అభ్యసిస్తుంటారు.
32. పన్నెండేళ్లకు ఓసారి జరిగే గంగానది కుంభమేళాకు వచ్చే ప్రజల సంఖ్య అంతరిక్షం నుంచి కూడా కనిపించేంత ఎక్కువగా ఉంటుంది.
33. సంఖ్యాశాస్రాన్ని ఆర్యభట్ట కనుగొంటే, బ్రహ్మగుప్త సున్నా విలువ ప్రపంచానికి తెలిపారు.
34. ఆల్ జీబ్రా, త్రికోణమితిలను ప్రపంచానికి అందించింది ఇండియానే.
35. మానవ చరిత్రలో తొలి వైద్య విధానం 'ఆయుర్వేద'ను అందించింది ఇండియానే.
ఇవే కాదు, ఇంకెన్నో ఘనతలను ఇండియా సాధించింది, సాధిస్తూ ఉంది
 *ఒక పల్లెటూరు లో శివాలయానికి వెళ్ళాను, గర్భగుడి ద్వారం దగ్గర ట్యూబెలైట్ ఉంది, కానీ కాంతి సరిగా లేదు, ఎందుకంటే దాని మీద నల్ల అక్షరాలతో విష్ణునాథన్ అని రాసి ఉంది, శివుడు పేరు విష్ణు కదా అనుకోని అక్కడవాళ్ళని అడిగితె ఆ ట్యూబెలైట్ ఇచ్చిన అతని పేరు అది అన్నారు, మీరు కలలో ఇల్లు కట్టుకొని రంగులు వేసి చక్కగా అలంకరిస్తారు, మీరు నిద్ర లేవగానే ఆ ఇల్లు ఉండదు, ఏమి ఉపయోగం ఉండదు, ఇలాగె మీరు పుణ్యం అనే మాయ మాటలతో మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారు, భగవంతుణ్ణి వ్యాపారంలోకి లాగేస్తున్నారు, మీ పుణ్యకార్యాలు వెనుక అసలు భావం ఏమిటి అన్నది మీకంటే మీ అమ్మానాన్నల కంటే భగవంతునికి (సృష్టి) ఇంకా బాగా తెలుసు. - స్వామిజి నిత్యానంద*

చిల్లర నాణేలు -- ఇప్పుడు..

 కాఫీ కబుర్లు సంఖ్య 669 ((ఆగస్టు 06 - 2024)  చిల్లర నాణేలు -- ఇప్పుడు.. ఈరోజుల్లో చిల్లర అంటే  10 20   50 రూపాయల నోట్లు.  ఆరోజుల్లో ఐదు దశాబ్దాల ముందు.. చిల్లర అంటే  2 3 5 10 25 50 నయాపైసాల కాయిన్స్ (నాణాలు).  మన ఉద్యోగస్తుల ఇళ్ళల్లో నోట్లు కంటే నాణేలే ఎక్కువగా వాడకంలో ఉండేవి.  ఒకటో తారీఖు జీతం రాగానే చేబదుళ్ళు తీర్చడం, అద్దెలు కరెంట్ బిల్లు కట్టడం, పిల్లల స్కూలు కాలేజీ ఫీజులు చెల్లించడం, నెలకు సరిపడా కిరాణా తెచ్చుకోవడం  వంటివి అయ్యేసరికి మిగిలినవి ఎక్కువగా ఈ నాణేలే.  జీతం 500 దాటితే మంచి జీతగాడు, 1000 దాటితే గొప్ప జీతగాడు అనుకునేవారు.  రాష్ట్ర కేంద్ర ప్రభుత్వోద్యోగుల జీతాలు ఐదారు వందల లోపే ఉండేవి.  నేను మొదటిసారి వంద రూపాయల నోటు చూసింది బ్యాంకు ఉద్యోగంలో చేరిన తర్వాతే.  మా నాన్నగారి ఉద్యోగం పోస్టాఫీసులో గనుక జీతం వచ్చాక వంద రూపాయల అన్ని నయాపైసా ల కాయిన్స్ అందుబాటులో ఉంచి నోట్లు మాత్రం బీరువాలో భద్రంగా దాచేవారు మిగతావారికి తీయడానికి అవకాశం లేకుండా.  చాలా మధ్యతరగతి ఇళ్ళల్లో ధోరణి ఇలాగే ఉండేది.  చిన్న చిన్న ఖర్చులకి నోట్లు అవసరం ఉండేవికావు.. ఒక రూపాయి లోపు నయాపైసాలతోనే.  అరకప్పు టీ 15 పైసలు, ఒక కప్పు టీ పావలా (25 నయా పైసలు), పాన్ సిగరెట్ ఐదు పది పైసలే.  అయ్యర్ హోటల్ లో  ఇడ్లీ పూరీ ఉప్మా రవ్వదోసె.. ఏదైనా అర్ధ రూపాయే (50 పైసలు).  టిఫిన్ కాఫీ కి అయ్యే ఖర్చు 75 నయాపైసలు మాత్రమే..  ఒక రూపాయి లోపే.  సినిమా, ఇంటర్వెల్ లో టీ ఖర్చు 90 పైసలే.  ఆంధ్ర సచిత్ర వారపత్రిక, ఆంధ్రప్రభ వీక్లీ 25 నయాపైసలు మాత్రమే.  వీక్లీ ముఖచిత్రం పై 25 న.పై. అని ముద్రించే వారు.  యువ జ్యోతి జయశ్రీ వంటి మాసపత్రికల వెల ఒక రూపాయి ఉండేది.  మా స్కూల్ గోయింగ్ డేస్ లో అప్పుడప్పుడు పది ఇరవై నయాపైసాలు ఇచ్చేవారు.  ఇంటర్వెల్ లో పిప్పరమెంట్లు, జంతిక(లు) వంటివి ఆ పది పైసలుతో కొనుక్కుని తినేవారం.. దాహం వేస్తే ఐదు పైసలిచ్చి గోళీ సోడా తాగేవాళ్ళం.  అప్పట్లో పెద్ద పెద్ద వీధులు, పెద్ద పెద్ద ఇళ్ళు.  బెగ్గర్స్ తాకిడి ఎక్కువే.  ఒక్కో బెగ్గర్ ఒక్కో వారం వచ్చేవాడు. వాళ్ళకి రెండు లేదా మూడు నయాపైసల నాణాలు వేసేవారం.  కాయగూరలు పండ్లు కూడా కేజీ 50 పైసలు అలా ఉండేవి.  ఈవిధంగా ఆ రోజుల్లో చిన్నా చితకా చిల్లర ఖర్చులు అన్నీ నయాపైసల లోనే.. అంటే ఒక రూపాయి లోపే.  ఇప్పుడు..  పైసల నాణేలు పోయి చాలాకాలం అయింది.  బయట మామూలు కాఫీ ఇరవై రూపాయలు.  సింగిల్ థియేటర్ లో సినిమా టికెట్ ధర 150 రూపాయలు.  ఆరోజుల్లో ఐతే నెలకి నాలుగు సినిమాలు చొప్పున చూస్తే మూడు సంవత్సరాలకి 150 సినిమాలకి అయ్యే ఖర్చు ఇది.  అర్ధ దశాబ్ద కాలంలో ఎంత తేడా.. ఎంత మార్పు.. ఇంతకీ ఈరోజు కాఫీ కబుర్లు లో పైసలు చేర్చడానికి ఒక (బలమైన) కారణం ఉంది.  రాత్రి ఓ విచిత్రమైన కలొచ్చింది.  నేను హిమాలయాల్లో చేసిన నా తపస్సుకి మెచ్చి ఎవరో ప్రత్యక్షమై..  తపస్సుకి మెచ్చాను  ఏం కావాలో కోరుకో అంటే.. తెలివితక్కువగా నేను అన్నిరకాల చిల్లర నాణేలు గల  ఒక బ్యాగ్ కావాలని కోరేనుట.. వెంటనే బ్యాగ్ నుంచి.. రెయిన్ రూపంలో కాయిన్ లు నాముందు వర్షించాయిట.. అలారం లేపేసింది ఉదయం నిద్ర నుంచి లేచే సమయం కావడంతో..  ----- గాదె లక్ష్మీ నరసింహ స్వామి (నాని) విజయనగరం ఫోన్ 99855 61852....

****🤔🤫పద్దెనిమిది మంది సాక్షులుంటారు మనం చేసే ప్రతీ పనికీ. బహుపరాక్.*🤔

 *🤔🤫పద్దెనిమిది మంది సాక్షులుంటారు మనం చేసే ప్రతీ పనికీ. బహుపరాక్.*🤔🤫


❤️ *చుట్టూ ఎవరూ లేనప్పుడు తప్పుడు పనులకు తెగించడం మానవ బలహీనత .*
💕 *కానీ .....*
💓 *’నేను ఒక్కడినే కదా ఉన్నాను,*
*నన్ను ఎవరూ గమనించడం లేదు’ అని మనిషి అనుకోవటం చాలా పొరపాటు .*
💝 *మనిషి ఏ పని చేస్తున్నా నిశితంగా గమనించేవి ముగాసాక్షులు పద్దెనిమిది ఉన్నాయి .*
💖 *అవి:~నాలుగు వేదాలు, పంచభూతాలు, అంతరాత్మ, ధర్మం, యముడు, ఉభయ సంధ్యలు, సూర్య చంద్రులు, పగలు, రాత్రి.*
💞 *వీటినే అష్టాదశ మహా పదార్థాలు అంటారు . ఈ మూగసాక్షులు మనిషిని అనుక్షణం నీడలా పర్యవేక్షిస్తుంటాయి.*
💓 *ఇవి మనలోకంలోని న్యాయస్థానాల్లో సాక్ష్యం చెప్పపోవచ్చును. కానీ వీటి గమనిక నుండి మనిషి తప్పించుకోవడం సాధ్యపడదు .*
❤️ *దీన్ని గుర్తించలేని కారణంగానే ఇవన్నీ జడ పదార్థాలేనని, సాక్ష్యం చెప్పడానికి నోరులేనివని మానవుడు భ్రమపడుతుంటాడు .*
🛑 *ఈ మహాపదార్థాలు రహస్యయంత్రాల వంటివి .*
💞 *అవి మనిషి ప్రతి చర్యనూ నమోదు చేస్తాయి .*
💕 *ఆ నివేదికల్ని విధికి చేరవేస్తాయి . అది వాటిని కర్మలుగా మలుస్తుంది . మనిషి చేసే పనులు మంచి అయితే సత్కర్మలుగా, చెడ్డవి అయితే దుష్కర్మలుగా విధి నిర్ణయిస్తుంది . సత్కర్మలకు సత్కారాలు, దుష్కర్మలకు జరిమానాలు అమలవుతాయి .*
💝 *అవి ఏవో మరుజన్మకో ఆ తరువాతో ఫలిస్తాయని అనుకోకూడదు, ఈ జన్మలోనే అమలు చేయబడవచ్చు .*
💖 *ఇది నిరంతరాయంగా సాగిపోయే సృష్టిపరిణామక్రమం.*
 💞 *అంతరాత్మ అనేది ఒకటుందని ప్రతి మనిషికీ తెలుసు.*
❤️ *అది మనం చేసే పని మంచిదా ? చెడ్డదా ? అనే విషయాన్ని ఎప్పటికప్పుడే చెప్పేస్తుంది .*
💖 *కానీ ఆవేశం, కోపం,క్షణికావేశం తో విచక్షణ కోల్పోయిన వ్యక్తి అంతరాత్మ సలహాను కాలరాస్తాడు అది అనర్థాలకు దారితీయటం మనందరికి అనుభవమే .*
💓 *ఒక్కోసారి అంతరాత్మ నిలదీస్తున్నప్పుడు పశ్చాత్తాపంతో సిగ్గుతో తలదించుకుంటాం.*
💞 *కానీ దీన్ని మనమెవరితోనూ పంచుకోము . అందువల్ల అంతరాత్మ అనుభవపూర్వకంగా నిజమైనప్పుడు మిగతా పదిహేడు కూడా నిజమేనని గ్రహించగలగడమే వివేకం*
 💖 *నలుగురికీ తెలిసేలా దానధర్మాలు, క్రతువులు, పూజలు నిర్వహించాలన్న కుతూహలం అవివేకం.*
💞 *అష్టాదశ సాక్షులు ఎల్లవేళలా గమనిస్తున్నాయంటే…ఎవరు చూడాలో వాళ్ళు చూస్తున్నట్లేగా అర్థం.*
💝 *ఈ ఎరుక కలిగినప్పుడు ఏ మనిషీ చెడ్డ పనులు చేయటానికి తెగించడు .*
❤️ *ఎవరు చూసినా చూడకపోయినా మంచితనంతో, తోటివారికి సాధ్యమయినంత సహాయం చేయాలనే సత్‌సంకల్పంతో జీవితాన్ని గడపడం ఉత్తమం . ఈ జ్ఞానం వల్ల మనిషి సాధ్యమైనన్ని మంచిపనులు చేయడానికి పయ్రత్నిస్తూ సుఖశాంతులకు దగ్గరవుతాడు.*🪷

🔱 అంతర్యామి 🔱 # వేదాంత గురువులు #

 🔱 అంతర్యామి 🔱

# వేదాంత గురువులు #

🍁ప్రతి మతంలోనూ ప్రత్యేక ఆచార వ్యవహారాలు ఉంటాయి. అలాగే హైందవ ధర్మంలో గర్భస్థ శిశువు మొదలు మరణం వరకూ జరిపే సంస్కారాలను షోడశ సంస్కారాలు అంటారు. వీటిల్లో మనిషి ఉన్నతికి దోహదపడే 'అక్షర 'సంస్కారం' లేదా 'విద్యాభ్యాస సంస్కారం' ఎంతో విశిష్టమైనది. ఇది మనిషిని పాశవికం ప్రవృత్తి నుంచి మానవత్వానికి, అనాగరికత నుంచి నాగరికతకు, చీకటి నుంచి వెలుగులోకి, అజ్ఞానం నుంచి జ్ఞానానికి, మానవత్వం నుంచి దివ్యత్వానికి చేర్చగలదు. ఇంతటి విశిష్ట ప్రయోజనాలను సమకూర్చే ఈ సంస్కారం సద్గురుసేవ, వారి కటాక్ష వీక్షణంతోనే లభ్యమవుతుంది.

🍁సద్గురువు గురించి తెలుసుకునేముందు శిష్యగణంలో ఉండే వర్గాల గురించీ తెలుసుకోవాలి. ప్రాథమికంగా శిష్యజాతిని కుశాగ్రబుద్ధి సంపన్నులు, ముసలాగ్ర బుద్ధులు, మృత్పిండ బుద్ధులు అనే మూడు రకాలుగా వర్గీకరించారు.

🍁దర్భ పోచ కొస(అగ్రం) చాలా వాడిగా ఉంటుంది. అందుకే సూక్ష్మగ్రహణ బుద్ధి కలవారిని కుశాగ్రబుద్ధిమంతులు అంటారు. వీరు తమ బుద్ధిబలంతో గురూపదేశానికి మెరుగులు దిద్దుకోగలరు. రోకటి పొన్నులా ‣ మందబుద్ధి గల ముసలాగ్ర బుద్ధిజులు గురువులు ఎంత బోధించిన గ్రహించలేరు. బోధించిన దాన్ని విపరీత అర్ధంలో తీసుకునే ప్రమాదమూ ఉంది. మట్టిముద్దకు నీరు తగలగానే మెత్తబడి, తడి ఆరిపోగానే మళ్లీ గట్టిపడుతుంది. అలాగే మృత్పిండ బుద్ధి కలవారు కూడా గురూపదేశం ఉన్నంత వరకూ పండితులుగా చెలామణి అయి, వారి ఉపదేశాలు ఆగిపోగానే మూర్ఖుల జాబితాలం చేరతారు.

🍁పైన పేర్కొన్న శిష్యుల్లో రెండు వర్గాలవారు సరైన గురువు లభిస్తే మేధావులుగా మారతారు. ఇలాంటి సందర్భాల్లోనే గురు కటాక్ష బలం అర్థం అవుతుంది. ఆదిశంకరుల శిష్యరికం చేసినవారిలో పద్మపాదుడు గురు కటాక్షానికి పాత్రుడైనట్టుగా శంకర జీవితచరితం చెబుతోంది.

🍁ఈ త్రివర్గ శిష్యగణమే కాకుండా మేష, మహిష జాతి శిష్యులు కూడా ఉన్నారు. మహిషం నీటిగుంటలో దిగితే అడ్డదిడ్డంగా తొక్కి మొత్తం నీటిని బురదమయం చేస్తుంది. ఆ నీరు ఇతరులకు ఉపయోగ పడకుండా చేస్తుంది. అదేవిధంగా మహిష జాతి శిష్యుడు. తాను చదువుకోకపోగా క్రమశిక్షణను ఉల్లంఘించి తోటి విద్యార్థులను కూడా చెడగొడతాడు.

🍁మేషం(మేక) చాలా చురుకైన జంతువు. 
నీటిని కెలక్కుండా ఒడ్డున నిలబడి
తాగుతుంది. అలాంటి శిష్యులు వినయంగా విద్యాబుద్ధులు నేర్చుకుని పేరు ప్రతిష్ఠలు సంపాదించుకుంటారు. శంకర భగవత్పాదులవారు తమ వివేక చూడామణి గ్రంథంలో బ్రహ్మవిద్యకు మేధావి, విద్వాంసుడు, మంచి ఊహకలవాడు, విచక్షణా జ్ఞానసంపన్నుడుగా ఉన్నవారే అధికారిగా ఉండాలని తెలియజేశారు. ఇలాంటి ఉత్తమ  లక్షణ సంపన్నులే ఆ విద్యను పొందేందుకు అర్హులు అవుతారు.

🍁గురువుల్లో సాధారణ గురువులు, సద్గురువులు, అని రెండు రకాలు. సాధారణ గురువులు అక్షరదాతలు మాత్రమే. సద్గురువులు ముసలాగ్రబుద్ధులు, మృత్పిండ బుద్ధులు అయిన శిష్యులను కూడా అనుగ్రహించి విద్యాబుద్ధులు నేర్పి ప్రయోజకుల్ని చేస్తారు. ఇలాంటివారు మనకు చాలా తక్కువగా కనిపిస్తారు. శంకర భగవత్పాదులు, గౌడయతీంద్రులు, వేదవ్యాసమహర్షి, శ్రీరామకృష్ణ పరమహంస ఈ కోవకు చెందిన గురుదేవులుగా కీర్తిని అందుకున్నారు. వీరిని వేదాంత గురువులని సంబోధించారు. విద్యాదానం కన్నా వేదాంత విద్యోపదేశం చేయడం పవిత్రమైనది.

🍁గురువులుగా గుర్తింపుపొందిన వారిలో డాంబికులు ఎవరో సద్గురువులు ఎవరో తెలుసుకున్నాకే గురుస్వీకారం చేసుకోవాలి. సద్గురువుల కటాక్షం అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ అనే స్థితిని కల్పిస్తుంది.🙏

- ✍️యం.సి. శివశంకరశాస్త్రి

⚜️⚜️🌷🌷🌷⚜️⚜️⚜️
శ్రీ రామ జయ రామ జయజయ రామ
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

****ప్రపంచం ఉన్నది నీకు జ్ఞానాన్ని పెంచడానికే కానీ భౌతిక సుఖాల కోసం కాదు అని తెలుసుకో..!

 రమణ మహర్షి అరుణాచలంలో ఉన్నప్పుడు అప్పుడప్పుడు ఒక యువకుడు వస్తూ ఉండేవాడు, ఎప్పుడొచ్చినా ఏదో ఒక కోరిక కోరేవాడు. రమణ మహర్షిని ఎవరైనా ఏదైనా అడిగితే అత్యంత అరుదుగా ఒక చిన్న చేష్ట చేసేవాడు.. తన చేయిని గాలిలో అట్లా గుండ్రంగా తిప్పేవాడు, దాని అర్థం "అయిపోతుంది" అని..!

భగవాన్ మాత్రం ఎప్పుడూ ఏమీ చేయక "ఊరక" అట్లా ఉండేవాడు. అదొక సంకేతం.

ఒకనాడు యువకుడు వచ్చి మహర్షిని "నేను బాగా చదువుకోవాలి" నన్ను ఆశీర్వదించండి అని అడిగాడు. భగవాన్ చేయి గాలిలో తిప్పాడు.

మళ్ళీ కొద్ది రోజులకు ఆ యువకుడు నాకు ఉద్యోగం రావాలి "నన్ను ఆశీర్వదించండి" అని అడిగాడు. భగవాన్ చేయి గాలిలో తిప్పాడు.. ఉద్యోగం వచ్చేసింది.

ఇంకొంత కాలానికి మళ్ళీ వచ్చాడు..నాకు పెళ్లి కావాలి, చేయి గాలిలో తిప్పాడు.. పెళ్లి అయిపొయింది.

మరికొంత కాలానికి వచ్చాడు.. నాకు పిల్లలు కావాలి, చేయి గాలిలో తిప్పాడు.. సంతానం కలిగింది.

అలా కొంతకాలం గడిచింది...

ఆ కొంత కాలం తర్వాత బాధలో వచ్చాడా యువకుడు.. నా సంతానానికి ఏదో సమస్య.. నాకు మీరే దారి చూపాలి భగవాన్ అని, ఎప్పటిలాగే భగవాన్ చేయి గాలిలో తిప్పాడు.. తన సంతానంలో ఒకరు మరణించారు.

మళ్లీ తన భార్యకు ఏదో సమస్య అంటూ వచ్చాడు, రమణుడు చేయి గాలిలో తిప్పాడు.. భార్య మరణించింది.

మళ్లీ వచ్చాడు ఇంకేదో సమస్య, చేయి గాలిలో తిప్పాడు.. ఉద్యోగం పోయింది.

మళ్లీ వచ్చాడు.. తన సంతానం అంతా పోయింది, భార్య పోయింది, ఆస్తి పోయింది, ఉద్యోగం పోయింది.. ఈసారి వచ్చి అడగడానికి ఏమీ లేదు "ఊరకనే" వచ్చి కూర్చున్నాడు.

అప్పుడు భగవాన్ రమణులు ఇట్లా చెప్పాడంట..

"మొదట ఏది ఉందో ఇప్పుడు అదే ఉంది, మధ్యలో వచ్చింది మధ్యలోనే పోయింది" అని అన్నాడట.

కాబట్టి..
నువ్వు ఇక్కడ ఏమి కూడబెట్టుకుంటున్నావ్ కూడబెట్టుకుని ఏం సాధిస్తావ్? ఈ ప్రపంచానికి అసలు ఏం చూపించాలనుకుంటున్నావ్. అసలు నీ పని ఏమిటి?

ఒక్కసారి ఎవరికి వాళ్లు కళ్ళు మూసుకుని ఆలోచించండి, దేనికొరకు నువ్వు పడే ఈ కష్టమంతా?

నువ్వు హాయిగా, ఊరికే తిని అట్లా పడుకోవడానికి, సాదాసీదా జీవితం, ఆనందమయ జీవితం గడపడానికి కావలసిన లగ్జరీస్ నీ దగ్గర లేవా? అనుభవించే సామర్థ్యం నీ దగ్గర లేదా? ఇంత డబ్బు, ఇన్ని కార్లు, ఒక పెద్ద ఇల్లు ఉండి చాలా పెద్ద గది ఉంటేనే నీకు నిద్రపడుతుందా? దేనికీ ఈ హంగామా? కంఫర్ట్ నిచ్చే ఒక బట్ట ఉంటే సరిపోదా? ఒక లక్ష రూపాయల కోటు వేసుకుంటేనే నీకు గౌరవమా?

వస్తువులు వద్దు అనట్లే, ఆ వస్తువుల్లో చిక్కుకుపోకూడదు.. ఏది ఎంతవరకో తెలుసుకోవడమే జ్ఞానం. ప్రపంచం ఉన్నది నీకు జ్ఞానాన్ని పెంచడానికే కానీ భౌతిక సుఖాల కోసం కాదు అని తెలుసుకో..!

ఓం నమో భగవతే శ్రీరమణాయ...
🪷🙏🪷
 ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి ప్రకృతి మనకు ఒక. Hint. ( హెచ్చరికను )
ఇస్తూ ఉంటుంది 

గత వందల సంవత్సరాల నుండి 

తుఫానుల వలన 
వర్షాల వలన 
ప్రకృతి విలయాలు 
వచ్చినప్పుడు 

నీటి ప్రవాహం ఎంతో ప్రళయంగా ఉంటుంది 

దానికి అనుగుణంగా మన పూర్వీకులు 

వాగులని 
కాలవల్ని 
నీటి పరివాహ ప్రాంతాలను 

పెద్ద పెద్దగా ఏర్పాటు చేసి 

ఉప్పెన ,   ప్రళయంగా ,   వచ్చే నీటిని సజావుగా సాగనంపేందుకు 

కాలవకు ఇరువైపులా ఎంతో భూమిని ఏర్పాటు చేశారు

కానీ ఈ ఆధునిక ప్రపంచంలో 

భారతదేశం మొత్తం లో

మానవుడు 
కాలవల్ని 
వంకలని 
వాగు పరంబోకులని 
నీతి పరివాహ ప్రాంతాల భూమిని 
ఆక్రమించుకొని 

గృహ నిర్మాణాలు చేపడుతున్నారు చేపట్టేసారు కూడా 

ఇంకొకసారి ప్రళయం వస్తే 

పై వాట్ మీద నిర్మించుకున్న గృహాలన్నీ నీటి పాలు అవ్వక తప్పదు 

అధిక ప్రాణ నష్టం కూడా తప్పదు

 అదే మనం చూస్తున్నాం 

కాబట్టి నీటి ప్రవాహాన్ని అది ప్రవహించే ప్రాంతాలను ప్రశాంతంగా వదిలేయాలి 
వాటిని ఆక్రమించరాదు


మనం రక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది

ఎప్పటికైనా నీటి ప్రళయం వస్తుంది అనడంలో సందేహం లేదు.

****చార్లీ చాప్లిన్ 88 వయస్సులో మరణించాడు. అతను మనకు 4 స్టేట్ మెంట్ లు ఇచ్చాడు.

 **చార్లీ చాప్లిన్ 88 వయస్సులో మరణించాడు. అతను మనకు 4 స్టేట్ మెంట్ లు ఇచ్చాడు.*

*(1) ఈ ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదు, మన సమస్యలు కూడా కాదు.*

*(2) నేను వర్షంలో నడవడానికి ఇష్టపడతాను, ఎందుకంటే ఎవరూ నా కన్నీళ్లను చూడలేరు.*

*(3) జీవితంలో అత్యంత వృధా అయిన రోజు మనం నవ్వని రోజు.*

*(4) ప్రపంచంలోని ఆరుగురు ఉత్తమ వైద్యులు...*
*1. సూర్యకాంతి,*
*2. విశ్రాంతి,*
*3. వ్యాయామం,*
*4. డైట్,*
*5. ఆత్మ గౌరవం*
*6. ఫ్రెండ్స్.*
*వాటిని మీ జీవితంలో అన్ని దశల్లో ఉంచుకోండి మరియు ఆరోగ్యవంతమైన జీవితాన్ని ఆస్వాదించండి...*

*చంద్రుడిని చూస్తే దేవుడి అందం కనిపిస్తుంది... సూర్యుడిని చూస్తే దేవుని శక్తి కనిపిస్తుంది... అద్దంలో చూస్తే దేవుని అత్యుత్తమ సృష్టి కనిపిస్తుంది అప్పుడు నమ్మండి. మనమంతా టూరిస్టులమని. ఇప్పటివరకు మన యాత్రలు, బుకింగ్ లు, గమ్యస్థానాలను తయారు చేసిన మన ట్రావెల్ ఏజెంట్ దేవుడు మాత్రమే. అతడిని నమ్మండి మరియు జీవితాన్ని ఆనందించండి.*
*జీవితం ఒక ప్రయాణం మాత్రమే!
  *

****హిందువులలో కులగణన జరగాలి

 *హిందువులలో కులగణన జరగాలి*
 అని గత కొన్ని సం.లుగా రాహుల్ గోలగోల చేస్తోంది ఏదో ఆషామాషీగా అనుకునే వ్యవహారం కాదు... 
దాని వెనకాల పెద్ద కుట్ర ఉంది. 
బిజెపిని ఓడించాలి అంటే తమకు 20% మైనార్టీ సాలిడ్ ఓటు బాంక్ ఎలాగా ఉంది.
 దానిని సుస్థిర పరుచుకుంటూ, 
 రెండో వైపు ఉన్న 70-80% హిందూఓటు బ్యాంకును ఒక్కటిగా కాకుండా ఈ 70-80%మంది మధ్య చిచ్చు రేపి దాన్లో ఒక 20% ఓట్లు తమవైపు తిప్పుకుంటే చాలు అనే ప్రణాళిక దీని వెనుక ఉంది...

అసలు జరిగింది ఏమిటంటే...

2014 ఎన్నికల్లో  యుపిఎ వ్యతిరేక ఓటువల్ల మోదీ అధికారంలోకి లక్కీ గా వచ్చాడు, 
అయితే, 2019 ఎన్నికల నాటికి నోట్ల రద్దు, GST, పెట్రోల్ ధరలు పెరగడం వంటి కారణాలు వల్ల సామాన్య జనాలలో కేంద్ర ప్రభుత్వం పై వ్యతిరేకత బాగా ఉంది, 
బిజెపి పార్టీకి ఒక్క దానికే పూర్తి మెజార్టీ వచ్చి మళ్ళీ మోదీ ప్రధాని గా వచ్చే చాన్స్ లేదు, అందువల్ల బిజెపికి ఎక్కువ సీట్లు వచ్చినా మిగతా పార్టీల సహకారాన్ని తీసుకుని మోదీ కాకుండా యే గడ్కరీ వంటి వారి నేతృత్వంలో సంకీర్ణ  ప్రభుత్వం ఏర్పడుతుంది అని రాహుల్ ముఠా అంచనా వేశారు. 

ఈ ముఠాలో,
 అమెరికా డీప్ స్టేట్ అంటే సోరోస్,
 ఫోర్డ్ ఫౌండషన్, 
రాక్ ఫెల్లర్ ఫౌండేషన్, 
అమెరికాలో బలంగా ఉన్న కొన్ని ఇస్లామిక్ గ్రూపులు, 
అలాగే అమెరికా ప్రభుత్వం లో వ్యాపించిన కొందరు చైనా గ్రూప్ సభ్యులు, 
భారత్ లో అయితే వామపక్ష భావజాల మీడియా హౌస్ లు,
 విలేకరులు, ప్రాంతీయ పార్టీలు, 
వాటి మీడియా హౌస్ లు ఇంకా పైన చెప్పుకున్న విదేశీ NGO లు ఆర్ధిక సహాయం చేస్తున్న పలు ఆన్ లైన్ వార్తా సంస్థలు, వెబ్ సైట్లు ఇలా పలు రకాల సభ్యులు వున్నారు...

అయితే, ఈ ముఠా అంచనాలను తలక్రిందులు చేస్తూ  2014 కంటే ఎక్కువ సీట్లు గెలుచుకుని 2019లో మోదీ మళ్ళీ ప్రధాని అయ్యారు. 

దీంతో ఖంగు తిన్న రాహుల్ ముఠా లో కొందరు ఈ దేశ వ్యతిరేక మేధావులు బీజేపీని ఓడించాలి అంటే మైనారిటీ లను ఏమాత్రం సిగ్గు పడకుండా వీలయినంత గా బుజ్జగిస్తూ,  
మెజార్టీ హిందువులను కులాల వారిగా విడగొట్టి వారిలో ఒకరిపై ఒకరికి ద్వేషం పెంచి,
 బలహీన పరిచి వారందరూ హిందూత్వ గొడుగు క్రింద చేరకుండా చూడాలి. 
అంటే ఒక్క మాటలో చెప్పాలి అంటే హిందువులను ముక్కలుగా బలహీన పరచి వారిలో కొన్ని గ్రూపుల ఓట్లను మైనారిటీ ఓట్లతో కలపి బిజెపి ని ఓడించాలి అని ప్రణాళికలు రచించారు.

2014- 2019 మధ్యలో ఒక్క సారి కూడా  కులాల ఊసు ఎత్తని రాహుల్, 2019లో ఓడిన దగ్గర నుండి అంటే రెండో సారి మోడీ ప్రభుత్వం 2019లో ఏర్పడిన దగ్గరనుండే పైన చెప్పుకునే మేధావుల సూచన మేరకు ఈ కులాల గోల మొదలుపెట్టాడు. 

ఈ కులగణన పైన చెప్పుకున్న రాహుల్ ముఠా సభ్యులు అయిన దేశ విదేశీ మీడియా సంస్థలు, వెబ్ సైట్స్, వెబ్ పోర్టల్స్ NGO లు భారత్ లో ఉంటున్న వామపక్ష మేధావులు ఇలా ఈ ముఠా సభ్యులు అంతా తమ తమ పరిధిలో గల మీడియా ద్వారా హిందూ ధర్మం లో గల ఈ కుల వ్యవస్థ పై వ్యాసాలు, అభిప్రాయాలు, వార్తలు అంటూ గత 5 సం. లుగా ప్రచారం ప్రారంభించారు.

ముఖ్యంగా విదేశీ వెబ్ పోర్టల్స్ అయితే గత 5 సం. లలో భారత్ లో గల కుల విషయాలపై దృష్టి పెట్టి చాలా ఆర్టికల్స్ ప్రచురించాయి.
 ఏమిటి ఈ విదేశీ వెబ్ పోర్టల్స్ మన దేశ విషయాలు మీద  అంత ఇంట్రస్ట్? ఎందుకంటే చాలా విచిత్రంగా ఈ వెబ్ పోర్టల్స్ లో చాలా వాటికి ధన సహాయం చేస్తున్నవి రాహుల్ ముఠా సభ్యులు అయిన 
అమెరికా డీప్ స్టేట్ పవర్స్ అయిన ఫోర్డ్ ఫౌండేషన్, 
రాక్ ఫెల్లర్ ఫౌండేషన్, 
జార్జి సోరోస్ ORF, 
హేన్రి లూస్ ఫౌండేషన్ మొదలగు సంస్ధలు.

  నేను చెప్పిన విషయాలు మీద నమ్మకం లేకపోతే ఆ వెబ్ పోర్టల్స్ కి ఫండ్స్ అందిస్తున్నది ఎవరో నెట్ లో చెక్ చేసుకోండి.

ఇంకో సంగతి తెలుసా? 
 *యూరోప్ కి చెందిన ఇద్దరు రీసెర్చర్స్ క్రిస్టఫ్ జెఫర్లాట్ మరియు గిల్స్ వేరనిర్స్*
 భారత రాజకీయాలు మీద రీసెర్చ్ చేస్తూ భారత్ లో కుల గణన అవసరం గురించి ముందుగా మాట్లాడారు. 
వీరి రీసెర్చ్ కోసం ఫండింగ్ చేస్తున్నది హేన్రి లూస్ ఫౌండేషన్. 
ఈ హేన్రి లూస్ ఎవరో కాదు,  టైం మేగజైన్ సహా వ్యవస్థాపకుడు మరియు దాని ఎడిటర్ ఇన్ చీఫ్.

ఈ రిసెర్చర్స్ లో ఒకడైన జెఫర్లాట్  మోడీ ముఖ్యమంత్రి గా గుజరాత్ ని ఒక ప్రయోగశాల గా ఎలా చేసారో అని ఒక పుస్తకం కూడా రాసాడు. 
అలాగే మొన్న ఎన్నికల ముందు రాహుల్ చేపట్టిన భారత్ జోడో యాత్ర వల్ల "కొత్త రాహుల్ తయారయ్యాడు అని, అతని ఇమేజ్ పెరిగింది" అని రాహుల్ ని పొగుడుతూ ఇండియన్ ఎక్స్ప్రెస్ లో ఆర్టికల్ రాసాడు.

ఈ మొత్తం టూల్ కిట్ లో ముఖ్య పాత్రధారి రాహుల్. 
రాహుల్ ప్రతీ సారి విదేశాల్లో చేస్తున్న రహస్య పర్యటనల్లో ఈ ముఠా సభ్యులను కలుస్తూ సూచనలు తీసుకున్నాడేమో అని అనుమానం కలుగుతోంది.

 *వీళ్ళందరి దన్ను చూసుకుని రాహుల్ ఎంతగా దిగజారాడు అంటే...* 

*మిలిటరీ వాళ్ళ దగ్గరకు వెళ్లి వాళ్ళలో కులాల వివరాలు అడిగాడు
*సుప్రీంకోర్టు హై కోర్ట్ జడ్జీలు లో ఏ కులం వాళ్ళు ఎంత మంది ఉన్నారో అడిగాడు
*IAS ఆఫీసర్లు లో ఏ కులం ఎంత మంది అని అడిగాడు
*ఎన్నికల సభలో అసలు మోడీ కులం ఏంటో సరిగ్గా తెలియదు. మోదీ అసలు ఓబీసీ కాదు అంటూ వాగాడు.
*తనని ప్రశ్నించిన జర్నలిస్టుల కులం అడిగాడు.
*ఆఖరుకు మొన్న బడ్జెట్ హల్వా ఫంక్షన్ లో ఏ కులం వాళ్ళు ఎంత మంది అని అడిగాడు.

మొన్న 2024 ఎన్నికల సమయంలో *"హిందూ ఓట్లు విభజించు, మైనార్టీ ఓట్లు గంపగుత్తగా కొట్టు"*
 అన్న సూత్రం తోనే ఎన్నికలకు వెళ్లారు. యుపి,బెంగాల్, మహారాష్ట్రలో వీళ్ళ స్ట్రాటజీ కొంతవరకూ పని చేసినా దేశం ఎప్పుడో చేసుకున్న పుణ్యం వల్ల కేంద్ర ప్రభుత్వం ఈ ముఠా చేతిలోకి పోలేదు. అయినా, ఈ ఫలితాలు ఇచ్చిన ఉత్సాహం తో ఆ ముఠా రాహుల్ నేతృత్వంలో ఇంకా రెచ్చిపోవడం మొదలు పెట్టింది.

పైకి ఎలా చెప్పినా *అమెరికాకు, చైనాకు, ఈరోపియన్ దేశాలకు భారత్ ఒక బలహీన దేశంగా, వినియోగదారుల మార్కెట్ గా మాత్రమే కావాలి.*
 కానీ గత 10 సం. లలో మోదీ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా ఏదో ఒక పెద్ద దేశ ఒత్తిడికి భయపడో లేక లాబీయింగ్ కి లొంగకుండా  భారత్ దేశానికి ఏది ఉపయోగపడుతుంది అంటే అటువంటి నిర్ణయాలు మాత్రమే నిర్ణయాలు తీసుకుంటూ అంతర్జాతీయంగా భారత్ ని బలమైన దేశంగా తీర్చి దిద్దుతోంది మోదీ ప్రభుత్వం. 
వాటిల్లో పెద్ద ఉదాహరణ గా రష్యా ఉక్రెయిన్ యుద్ధ సమయంలో అమెరికా వద్దు అని చెప్పినా రష్యా నుండి భారీగా క్రూడ్ దిగుమతి చేసుకుని ఎగుమతులు చేసారు. అలాగే అమెరికా వ్యతిరేకించినా రష్యా నుండి S400మిసైల్ సిస్టం కొన్నారు. అందుకే బలమైన మోదీ నాయకత్వంలో భారతదేశం ఉండటం ఆ శక్తులకు నచ్చడం లేదు, తమ చేతిలో ఆడే రాహుల్ వంటి పప్పెట్ ని ప్రధాని గా చేయాలి అని ఆ శక్తులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి.

అందుకే, పైన చెప్పుకున్న శక్తులు అన్ని తెరవెనుక ఉండి,  రాహుల్ ని ముందు పెట్టి ఈ దేశాన్ని బలహీన పరచడానికి గట్టిగా ప్రయత్నిస్తున్నాయి.

రాబోయే రోజుల్లో దేశంలో అలజడులు, అశాంతి సృష్టించడానికి ఈ ముఠా ఏ అవకాశం వదులుకోదు.  అందుకే అప్రమత్తంగా ఉందాం.

....చాడా శాస్త్రి

Monday, August 5, 2024

 *శాస్త్రవేత్తలంతా covid ను అంతం చేయటానికి vaccines కోసం పరిశోధనలు చేసారు, కానీ ఆధ్యాత్మిక వేత్తలంతా పాపాలు తగ్గించుకుంటూనే covid అంతం అవుతుందని బోధించారు, పాపాలు అంతం అయితేనే భూమి మీద viras లు అంతం అయ్యేది, చేసే తప్పులను సరిదిద్దుకోకుండా కేవలం vaccines కోసం పరిశోధన చేయటం అన్నది ఎలా ఉంటుందంటే గుడ్డివాడు ఇంకో గుడ్డివాడికి దారి చూపినట్లు ఉంటుంది, ఒకానొక శ్రీకృష్ణుడు శ్రీరాముడు గౌతమబుద్ధుడు వీరంతా సత్యదర్శనం కోసం ప్రయోగాలు చేస్తూనే ఉంటారు మరి ధర్మసంస్థాపన కోసం పాటు పడుతూనే ఉంటారు, అందరు హింస నుంచి అహింసలోకి అసత్యం నుంచి సత్యం లోకి అధర్మం నుంచి ధర్మం లోకి రావాలి, సత్యం వద ధర్మం చర. - బ్రహ్మర్షి సుభాష్ పత్రీజీ*

****ఇతరులు ఎవరో నీ స్వేచ్ఛని హరించి వేస్తున్నారని భ్రమ పడుతుంటావు....

🌺 అమృతం గమయ 🌺

మీ జీవితం యొక్క నిరాశలు, బాహ్య మరియు వ్యక్తిగతీకరించిన రూపాల పట్ల మీ లోతైన ప్రమేయం కారణంగా ఉన్నాయి. ఈ రూపాల యొక్క సార్వత్రిక మరియు దైవిక స్వభావాన్ని మీరు చూసినప్పుడు, మీరు విముక్తిని అనుభవిస్తారు - సత్ చిత్.

*అమృతం గమయ*

*సత్ చిత్*

శ్రద్ధగా విను. నీకు తెలిసిన విషయం మాత్రమే నీవు ఆచరించగలవు. అంటే నీ జ్ఞానాన్ని మాత్రమే అనుభవంగా మార్చుకోగలవు. దీని అర్థం ఏంటి అంటే నీ వాస్తవాలకు వాస్తవ రూపం ఇవ్వ గలిగిన వాస్తవం కేవలం జ్ఞానం మాత్రమే. అంటే నీ ఆధ్యాత్మిక అనుభవాలు కేవలం జ్ఞానం వలన మాత్రమే సాధ్యం. అంటే నిజానికి నీకు ఇప్పటిదాకా సత్యమును విపులంగా చెప్పిన వాళ్ళు ఎవరూ లేరు. ఒకవేళ ఎవరైనా మీకు చెప్పడానికి ప్రయత్నం చేసినా వాళ్లని అవహేళన చేయటమో, పట్టించుకోకపోవడమో, విసుగు ప్రదర్శించటమో చేస్తావు. జ్ఞానాన్ని తెలుసుకొని నీ సంకల్పానుసారంగా జీవితాన్ని స్వేచ్ఛగా మార్చుకోవటమే నిజమైన స్వేచ్ఛ. అంతే తప్ప జ్ఞానం తెలియని స్థితిలో నీవు చేసేటటువంటి ఆలోచనలే స్వేచ్ఛ అని, అంతేకాకుండా ఇతరులు ఎవరో నీ స్వేచ్ఛని హరించి వేస్తున్నారని భ్రమ పడుతుంటావు. అదే స్వేచ్ఛనుకుని ఎల్లప్పుడూ  విరామం లేని ఆలోచనలతో విసుగుతో నిస్పృహతో బంది అయి ఉంటావు. అలాంటి జీవితంలో నిత్యం విసుగు మాత్రం నిండి ఉంటుంది. ఆ విసుగును ఈర్ష్య అసూయ ద్వేషాలను ఓర్వలేనితనాన్ని ఇప్పటిదాకా జీవిస్తూనే ఉన్నావు. నిన్ను నీవే ఓడించుకుంటున్నావు. దానికి ఇతరుల పేరు పెట్టుకుంటున్నావు. ఈ స్థితిలో అసత్య ప్రసంగాలు అనురక్తిని కలిగిస్తూ ఉంటాయి. సత్య జ్ఞానం అంగీకరించేటువంటి మనస్థితి కలిగి ఉండలేవు. పూర్తిగా అవివేకివి అయిపోతావు.

శంకరభగవత్పాదులు వివేకచూడామణిలో పరబ్రహ్మ తత్వం గురించి విపులంగా చెప్పారు. వివేకి అయిన సాధకుడు బాహ్యవస్తు స్మరణ మాని ప్రత్యగాత్మను స్మరించాలి. బాహ్య ప్రపంచం గురించి ఆలోచనలను తిరస్కరించడం ద్వారా మనసు ప్రసన్నతను పొందుతుంది.ఈ ప్రసన్నత పరమాత్మ దర్శనానికి దారి చూపుతుంది.పరమాత్మ సాక్షాత్కారం జనన మరణ శ్రేణిని ఛేదిస్తుంది. ఎవరైతే అఖండ పరిపూర్ణ పరబ్రహ్మం లో లీనమై ఉంటాడో, అతడే ముక్తుడు అని అంటారు. పరమాత్మ తత్వం అతి సూక్ష్మమైనది. స్థూల దృష్టితో, తర్కం, వాదోపవాదాలతో దాన్ని గ్రహించలేం. మహనీయులు చిత్తవృత్తులను నిరోధించి మిక్కిలి నిర్మలం, సూక్ష్మం అయిన స్థితిని పొంది పరమాత్మ తత్వానికి చేరువవుతారు. భ్రాంతివల్ల తాడును పాము అనుకొంటాం అదే రజ్జు సర్ప భ్రాంతి. వివేకం అనే దీపం వెలుగులో ఆ భ్రాంతి తొలగినప్పుడు రజ్జు నిజరూపం గోచరిస్తుంది. అదేవిధంగా ఈ జగత్తు నిజస్వరూపం పరబ్రహ్మమేనని, వివేకజ్ఞానం వల్ల తెలుసుకుంటాం. మనకు కనిపించేది అద్వితీయ పరబ్రహ్మ తప్ప మరేదీ కాదు.

సత్ (సత్యం) చిత్‌ (జ్ఞానం) ఆనందం. వీటికి సార భూతమైన పరమాత్మ ఒక్కటే. సర్వాంతర్యామి సర్వతోముఖం, అంటే సర్వత్రా సమంగా వ్యాపించినది. అది అనంతం. అన్ని విధాలా సమగ్రమైన పరబ్రహ్మమొక్కటే. అంటే ఈశ్వరతత్త్వమే.

ఆనంద మకరందంతో నిండిన ఈశ్వరతత్వాన్ని మాటల్లో చెప్పలేం. మనసుకు కూడా అందదు. సముద్రంలో కలిసిన వడగళ్లు సముద్రంలోనే కరిగిపోతాయి. ఈశ్వర అంశ అయిన మనసు ఈశ్వరునిలోనే లీనమై పోవాలి. ఈశ్వరునిగా మారిపోవాలి. శివోహం. అదే జీవన లక్ష్యం. అది సాధించేవరకు జీవనంలో సత్యమైనటువంటి శాంతి లభించదు. అశాంతి విసుగుల నుంచి విరమణ లభించదు. సత్యమైన స్వేచ్ఛ కలుగదు.

*అసతోమా సద్గమయ*
*తమసోమా జ్యోతిర్గమయ*
*మృత్యోర్మా అమృతంగమయ*

ఓం శాంతిః శాంతిః శాంతిః

****ఈ భూమిపై ఏం చేయాలి?

 ఈ భూమిపై ఏం చేయాలి? ***

బాబు: ఆ ప్రశ్నకు సమాధానం దొరికేవరకు ఏమీ చేయకుండా మీరు కూర్చోలేదు కదా! ఏదో ఒకటి చేస్తూనే ఉన్నారుగా... అంతే....ఏ సమయానికి ఏం చేయాలో అది చేస్తూ వెళ్లిపోవడమే చేయవలసింది. జీవితలక్ష్యం అనేది మనం పెట్టుకున్నాం. మిగతా ఏ జీవులూ జీవితలక్ష్యం పెట్టుకోలేదు. వాటికి జీవించడమే జీవితలక్ష్యం.

అలానే మనిషి కూడా జీవితలక్ష్యాన్ని పెట్టుకున్నా, పెట్టుకోకున్నా జీవితం దానికదే సఫలం అవుతుంది అనే విషయం గ్రహిస్తే చాలు. హెచ్చుతగ్గులు అనేవి మనిషి మనసులో నుంచి తొలిగిపోతాయి. మనసుకు అటువంటి సమతుల్యత కలిగే దిశగా ప్రయాణించడమే నాగరికత అభివృద్ధి అంటే. అంతేగాని మిద్దెలు మేడలు పెరగడమో, ఊపిరి సలపని మూర్ఖపుజీవితాన్ని గడపడమో నాగరికత అభివృద్ధి కానేకాదు. జీవనసాఫల్యం అనేది మన ప్రయత్న అప్రయత్నాలతో ముడిపడి ఉండదు.

ఇదొక అడవి...

అడవిలో ప్రతి మొక్కకూ ఓ ప్రత్యేకత ఉన్నట్లే, ప్రతిజీవికీ తనకంటూ ఓ ప్రత్యేకత ఉండనే ఉంటుంది.

మనకు లాభం ఉండడం, ఉండకపోవడం అనే కోణం నుంచిఎదుటవాని గొప్పతనాన్ని నిర్ధారించకూడదు. మనకు పనికిరాకపోతే “పిచ్చిమొక్క” అంటున్నాం. ఇది సరికాదు.

****ఒకరు: అసలు ఆలోచనలు లేని స్థితి జ్ఞానేతరులకు కలుగతుందా? దానిని ఎట్లా సాధించాలి? నేను-నేను అంటూ ఆత్మనిష్ఠలో ఉంటే కలుగుతుందా?

ఒకరు: అసలు ఆలోచనలు లేని స్థితి జ్ఞానేతరులకు కలుగతుందా? దానిని ఎట్లా సాధించాలి? నేను-నేను అంటూ ఆత్మనిష్ఠలో ఉంటే కలుగుతుందా? ***

బాబు: పిల్లవాడి అల్లరిని మాపడానికి పిల్లవాణ్ణి అంతం చేయడంసరియైన మార్గం కాదు కదా!

పిల్లవాణ్ణి బుజ్జగించి తండ్రి యొక్క గొప్పతనం చెప్పి మంచి చేసుకోవాలి. అలాగే ఆత్మ అనే తండ్రిలోంచే మనస్సనే పిల్లవాడు వచ్చాడు. అది తుంటరే అయినప్పటికీ నీ యధార్థస్వరూపం ఆత్మయే అని విషయాన్ని దానికి గుర్తుచేస్తూ ఉండడమే సత్సంగం. 'ఆలోచలనలు లేకపోవడం జ్ఞానస్థితి' అనే తప్పుడు అభిప్రాయం ముందు వదలాలి. నిద్రలో, మూర్ఛలో తలపులు ఉండవు. అంతమాత్రానికే అవి జ్ఞానస్థితులా? నిద్ర, మూర్ఛ అనేవి జడస్థితులు కదా! 'ఆలోచనలే నీవు’

ఆలోచనలే లేకుంటే నీవే ఉండవు. ఆలోచనలు
లేకుండా చేసుకోవాలనేది కూడా ఓ ఆలోచనే.
మనస్సును అంతం చేయాలనుకోవడం, తన
నీడను గుంట తీసి పాతి పెట్టి పూడ్చేయాలనుకోవడమే.
అది సదా నీ వెంటే ఉంటుంది.

దేవునిమనస్సు పేరు - మాయ.
జీవుని మాయ పేరు - మనస్సు.
మనస్సును లేకుండా చేయడం అంటే
'ఆత్మకు విడిగా దానికి ఉనికి లేదు'
అని గ్రహించడమే. ఆత్మప్రకాశంలోని కిరణాలు ఆలోచనలు...
 * *‘ఆత్మజ్ఞానం’* 

ఈశావాస్యోపనిషత్తులో ప్రస్తావించిన ఇంకొన్ని విషయాలను తెలుసుకుందాం! ఎవరైతే అన్ని జీవులను ఆత్మలోనూ, ఆత్మను అన్ని జీవులలోనూ చూస్తారో వారికి యెవ్వరియందు ద్వేషభావం వుండదు. ఆత్మే అన్ని జీవరాసులుగా వున్నదని గ్రహించిన వ్యక్తికి మోహం, శోకం ఎలా వుంటాయి? ఆత్మానుభూతి పొందిన వ్యక్తి, విశ్వమంతటిని ఆత్మస్వరూపంగా చూస్తాడు. అతనికి ఆత్మ తప్ప ప్రపంచములో వేరేది కనిపించదు. ఏదైనా రెండవ వస్తువు ఉన్నప్పుడు మాత్రమే కదా మనకు దానిపైన మనసుపోయేది. అంతా ఒకటే అయినప్పుడు మనసు ఎక్కడకు పోగలదు. ఒక్కచోటే వుంటుంది. అందువలన బాధ గాని, మోహం కాని, ద్వేషం కాని కలగవు.
ఆత్మానుభూతి, ఆత్మసాక్షాత్కారం మొదలగునవి ఆంతరంగిక అనుభవాలు. బయటి ప్రపంచం ఎప్పటిలానే ఉంటుంది. చూసేవాడి మనసును బట్టీ, వ్యక్తివ్యక్తికీ ప్రపంచస్వభావం వేరేలా ఉంటుంది. ఒక యువకుడికి ఏదైనా సాధించగలననే విశ్వాసం ఉంటుంది. అదే ఒక ముసలివ్యక్తికి అంతా అయిపోయిందనే భావన ఉంటుంది. ప్రపంచం ఏమీ మారలేదు. మార్పంతా చూసేవాడిని బట్టే వుంటుంది. అందుకే ఆత్మసాక్షాత్కారం పొందిన వ్యక్తియొక్క మనసు విశాలమై విశ్వమంతటితోనూ ఏకం అవుతుంది.
అతడు అన్నింటి అంతరార్థాన్నీ గ్రహిస్తాడు. అందున్న జ్ఞానాన్ని తెలుసుకుంటాడు. అతడు మాత్రమే నిజమైన మనీషి. మనీషి అంటే మనసును వశం చేసుకొన్నవాడు అని అర్థం. మనసు చెప్పినట్లు అతడు ఆడడు, అతడు చెప్పినట్లు మనసు ఆడుతుంది. ఆత్మానుభూతి పొందినవాడికి తెలుసుకోవలసింది ఏమీ లేకపోవడం వలన అతడు నిత్యతృప్తుడై ఉంటాడు. దేనిని తెలుసుకొంటే ఇక తెలుసుకోవలసింది ఏమీ ఉండదో అదే ఆత్మ. అతడు కేవలం ఆత్మ లేక భగవంతుడిపైనే ఆధారపడివుంటాడు. వస్తువుల నిజమైన తత్వాన్ని తెలుసుకొన్నవాడు కాబట్టి దేనికీ లొంగడు. ఒక లక్ష్యం అంటూ లేకుండా ఎవరైతే ఊరికే పనులు చేసుకుంటూ పోతారో వారు బాధలకు గురి అవుతారు. అలాగే లోకం దృష్టిలో పడటంకోసం, లోకులు తనను పొగడడం కోసం ఎవరైతే ధ్యానము, భక్తి మొదలగు వాటిని ప్రదర్శిస్తారో వారు ఇంకా ఎక్కువ బాధలు పడతారు. జ్ఞానం ద్వారా ఒక ఫలితం, కర్మల ద్వారా మరొకరకమైన ఫలితం లభిస్తాయి. అయితే జ్ఞానం, కర్మలు రెండింటినీ కలిపి తెలుసుకొన్నవాడు కర్మల ద్వారా మరణాన్ని దాటి, జ్ఞానం ద్వారా అమర్త్వాన్ని పొందుతాడు.
జీవుడు బ్రతకాలంటే పనులు చేయక తప్పదు. పనులు మాత్రమే చేసుకుంటూ పొతే భగవంతుని గురించి తెలుసుకోలేము. కాబట్టి పనులు భగవదర్పితం అయ్యుండాలి, మనస్పూర్థిగా ఉండాలి. జ్ఞానం, పని రెండింటినీ సమన్వయంతో సాధించినవాడికే ఆత్మానుభూతి అందుకే "యోగః కర్మ శుకౌసలం" అని గీతలో చెప్పబడింది.

 ✍️శాస్త్రి ఆత్రేయ
                                                         🪷⚛️✡️🕉️🪷

ఆధ్యాత్మికత ప్రకృతి తత్వం.

 .   🙏శుభాభినందనలు 🙏
.         ఆధ్యాత్మికత ప్రకృతి తత్వం.
       బెలూన్ ని ఎంత ఆనందంగా గాలిలోకి వదులుతామో అంత ఆనందంగా మనం చేయవలసిన పని చేసి ఫలితాన్ని ప్రకృతికి వదలాలి.అప్పుడు ఫలితాలు అద్భుతంగా ఉంటాయి.గాలివాటుకి సైకిల్ తొక్కితే శ్రమలేకుండా ఎలా వేగంగా వెళ్ళిపోతుందో, విషయాలను ప్రకృతికి వదిలినా అంతే.
          గాలి మనకు అనుకూలమైన వైపుకు వీస్తూ అద్భుతమైన వేగంతో అనాయాసంగా గమ్యాన్ని చేరుస్తుంది.అది ప్రకృతి యొక్క శక్తి.విశ్వశక్తి చలన సూత్రం.....ఒకరకంగా ఇది కర్మసన్యాసయోగం లా అనిపిస్తోంది కదా....
         అవును .....పనిచేయాలి....ఫలితాన్ని ప్రకృతికి వదలాలి....ఎంత అందమైన భావన??భావనే కలియుగంలో ప్రయత్నానికి కారణం....భావనే కార్యం....భావనామాత్రం చేత విశ్వ చలన సూత్రాలన్నీ తమను తాము విపులంగా విశదీకరించుకుంటాయి. .....మన ముందు.
          ఇలా మంచి భావనలు చేయండి....చేస్తూ....చేస్తూ.... వుండండి....నిరంతరం చేస్తూనే వుండండి....శరీరం ఏ పని చేస్తున్నా మన భావన విశ్వశక్తికి చిక్కుకుని ఉండాలి.అప్పుడు మనం విశ్వశక్తికి అనుసంధానం కాగలుగుతాము.మనలోని చిన్న చిన్న భావనలే విశ్వాసత్యాలుగా ఆవిష్కృతం అవుతాయి....
.     శుభాకాంక్షలతో 
.       -🙏------🙏
 చలాచల బోధ:--
వివేక వైరాగ్యాలు:-
వివేకము అంటే నిత్యమైనదేదో అనిత్యమైనదేదో విచారణ చేసి నిశ్చయించుకొని నప్పుడు మన బుద్ధిలో కలిగే వివేకము.నిత్యమైనది ఆత్మ,అనిత్యమైనది అనాత్మ గనుక ఈ రెండు వివేకాలు ఒక్కటే.నిరంతరం మార్పు చెందేది, రూపాంతరం చెందేది, ఒకప్పుడు ఉండి మరొకప్పుడు లేకుండా పోయేదానిని అసత్తు అని అంటారు.తద్వ్యతిరేక లక్షణాలు గలది శాశ్వత ఉనికి గలది యేదో అది సత్తు.కనుక సత్తు అనినా ఆత్మ అనినా ఒక్కటే.ఇక అసత్తు అంటే అనాత్మ లేక జడము లేక అనిత్యమైనది.ఆత్మ అనినా బ్రహ్మ అనినా చిద్రూపమనినా సద్రూపమనినా ఒక్కటే.కావున ఈ విచారణ వలన సదసద్వివేకము కూడా కలుగుతుంది.చిదచిత్ లేక చిజ్జడ వివేకము కూడా కలుగుతుంది.
 చలాచల బోధ:--
ప్రజ్ఞానం బ్రహ్మ,అహం బ్రహ్మ అనే వాక్యాలను మహా వాక్యాలు అని వేదాలలో చెప్పబడింది.ఆ మహా వాక్యాలను సాధన సంపత్తి కలిగిన వారే అవగాహన చేసుకొన గలరు.అందువలన ముందుగా మనము ఈ సాధనా చతుష్టయ సంపత్తి గురించి పూర్తిగా వివరించు కుందాము.
నిత్యానిత్య వస్తు వివేకము తరువాత రెండవ సాధన "ఇహాముత్ర ఫల భోగ విరాగము.
ఇహ  లేక ఇహము అంటే మనము నివసించే లోకము.ఆముత్ర అంటే ఈ కర్మ భూమిలో మనము ఇష్టపడి చేసే కర్మలు.ఫల అంటే ఆ కర్మ ఫలాలు.భోగ అంటే అనుభవాలు.విరాగము అంటే ఆ ఫలాల పట్ల రాగమును విడచినటువంటి స్థితి.
కావున"ఇహాముత్ర ఫల భోగ విరాగము "అంటే ఈ కర్మ భూమిలో మనము ఇష్టపడి చేసే కర్మల ఫలితాల వలన పొందే సుఖానుభవాల పట్ల వైరాగ్యం కలిగి యుండుట.కర్మ ఫలాల పట్ల వైరాగ్యం లేకపోతే మళ్ళీ మళ్ళీ అవే భోగాల కోసం మళ్ళీ మళ్ళీ కర్మ చేస్తూ పోతే జన్మ కర్మ, మళ్ళీ జన్మ కర్మ,ఈ విధంగా జనన మరణ చక్రంలో బంధించబడి ముక్తికి దూరమవుతాము.కావున ముముక్షువునకు ఇటువంటి వివేక వైరాగ్యాలు ఉండాలి.దానికి తగిన సాధనలు అవసరమవుతాయి.
సశేషం.

****అసలు ఆ భగవంతుడు మనల్ని ఎందుకు సృష్టించినట్టు, ఇలా ఎందుకు రకరకాలైన కష్టాలు పెడుతూ మనల్ని ఎందుకు బాధిస్తున్నట్టు ?

 అసలు ఆ భగవంతుడు మనల్ని ఎందుకు సృష్టించినట్టు, ఇలా ఎందుకు రకరకాలైన కష్టాలు పెడుతూ మనల్ని ఎందుకు బాధిస్తున్నట్టు ?
సృష్టించాడు సరే, పోనీ మానవు లందరినీ అన్నీ విషయాలలో అన్నీ సమంగా ఇచ్చి సృష్టించకుండా మానవుల్లో ఈ హెచ్చుతగ్గులు ఎందుకు చేసినట్టు ?
మనుషు లందరినీ ఇలా రకరకాలుగా సృష్టి చేసి వాళ్ళని ఇలా అనేక రకాలుగా కష్టాలకి గురిచేయడం ఎందుకు ? అసలు సృష్టించకుండానే ఉండచ్చు కదా ?

👉 భగవంతుడికి ఈ వినోదం ఎందుకు అని సందేహం వస్తుంది. ఇది ఆధ్యాత్మిక చింతన గల ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తగా అర్ధం చేసుకోవలసిన విషయం.

👉 మనల్ని పుట్టించింది ఆ భగవంతుడే అన్నది నిజం. అయితే మానవులని గానీ మరే ఇతర జీవులని పుట్టించడంలో గానీ అనేక రకాలైన తేడాలున్నాయి అన్నది కూడా నిజం. అయితే ప్రతి మనిషికి మనిషికి ఉన్న అన్నీ రకాలైన వ్యత్యాసాలకూ భగవంతుడికి ఏమీ సంబంధం లేదు, ఉండదు. అది ఎలా ఆంటే..

👉 దాన్ని ఒక చిన్న ఉదాహరణ రూపంలో చూద్దాం :
మీరు స్వయంగా మీ చేతులతోనే, అన్నీ ఒకే రకంగా ఉన్న ఒక దోసెడు విత్తనాలని తీసుకుని, ఒకే రకమైన మట్టిలో జల్లి, గాలీ, వెలుతురు, లేదా ఎండ సమంగా తగిలేలా, అన్నిటికీ ఒకే రకంగా నీరు పెట్టారు అనుకుందాం. కానీ అవన్నీ ఒకే సారి మొలకలు రావు. అన్నీ ఒకేలా మొలవ్వు. కొన్ని అసలు మొలకే ఎత్తవు. కొన్ని మొలక లోనే చనిపోతాయి. కొన్ని చిన్నగా మొలకెత్తుతాయి. మరి కొన్ని కొంచం పెద్దగా లేస్తాయి. రోజులు గడిచినా ఆ మొలకెత్తిన వాటిల్లో కొన్ని చిన్న మొక్కలుగానే ఉంటే కొన్ని చాలా పెద్ద మొక్కలు అవుతుంటాయి. కొన్నిటికి చీడ లాంటివి పట్టి అందవిహీనంగా అయితే, కొన్నిటికి ఏ చీడ లేకుండా పచ్చగా కళకళ లాడుతూ ఉంటాయి, కొన్ని ప్రకృతి వైపరీత్యాలకి గురై నాశనమైతే కొన్ని తట్టుకుని నిలబడతాయి, కొన్ని పూలు పళ్ళు ఇస్తే, కొన్ని అవేమీ ఇవ్వని ఫలపుష్పరహితమవుతాయి.

👉 అలా ఎన్నో రకాలుగా అవి కూడా సుఖ దుఃఖాలకి హెచ్చుతగ్గులకి లోనవుతున్నాయి. అలా ఎందుకు అవి అయ్యాయి అంటే మీరు ఏం సమాధానం చెప్తారు ?
ఆలోచించండి అలా కావడానికి కారణం ఎక్కడ ఉంది ?
మీ చేత్తో మీరు స్వయంగా విత్తనాలు చల్లే ముందు అన్నీ ఒకేలా ఉన్నాయి, మీరు వాటిని చల్లిన మట్టి కూడా ఒకటే, నీళ్ళు కూడా అన్నిటికీ సమంగానే పెట్టారు, వాటికి అందాల్సిన గాలీ వెల్తురు కూడా అన్నీ సమంగానే అందించారు, అయినా అలా ఒక్కోటి ఒక్కో విధంగా ఎందుకు అయినట్టు ?
మీరు చల్లిన విత్తనాలలో కొన్నిటి మీద మీరు ఎందుకు పక్షపాతం చూపించారు ?
వాటిల్లో కొన్నిటిని ఎందుకు మొలకెత్తకుండా చేశారు ?
కొన్నిటిని ఎందుకు పొట్టిగానే ఉండేలా చేశారు ? కొన్నిటినే కాయలు, పూలు పూసేలా ఎందుకు వాటిల్లో అలా ఎక్కువ తక్కువలు చేశారు ?
అని మిమ్మల్ని అడిగితే మీరు ఏం సమాధానం చెప్తారు ?

👉 ఏమో నాకేం తెలుసు నేను మాత్రం ఒకే రకమైన విత్తనాలని ఒకే రకమైన మట్టిలో జల్లాను అన్నిటికీ సమంగానే నీళ్ళు పెట్టాను కానీ అవి ఎందుకని అలా అయ్యాయో నాకు తెలియదు అని వెంటనే చెప్తారు.
ఇంకా ఆ గింజల్లో ఎంతుందో అందులోంచి అంతే వస్తుంది గానీ లేనిది ఎక్కడి నుంచి వస్తుంది అంటారు అవునా ?

👉 కాబట్టి మొదట్లో పైన మనకి వచ్చిన సందేహాలకి దేవుడిని అడిగినా ఇదే సమాధానం చెప్తాడు అని అర్ధం చేసుకోవాలి !

👉 మానవులంతా పలురకాలైన హెచ్చుతగ్గుల్లో ఉండటానికి కారణం ఎక్కడ ఉన్నట్టు అంటే దానికి సమాధానం ఇలా ఉంటుంది.
ఈ సమస్తమైన మానవులంతా ఆ గింజల్లాంటి వాళ్ళు. ఎవరి కర్మలని వాళ్ళు మంచి చెడు ఏదైనా వాళ్ళతోనే పుచ్చుకుని తిరుగుతూ ఉంటారు. భగవంతుడి ఎవరికీ ఏదీ కొత్తగా పట్టుకొచ్చి ఇవ్వడూ, ఉన్నదాన్ని తీసెయ్యడు. బ్యాంక్ లో మన ఖాతాలో ఉన్న డబ్బుని జాగ్రత్తగా మనకే అట్టిపెట్టినట్టు భగవంతుడు ఎవరి ఖాతాలో ఉన్న పాపపుణ్యాలని వాళ్ళకే జాగ్రత్తగా అప్పజెపుతాడు.

👉 దీన్ని బట్టి మనం అర్ధం చేసుకోవలసిన సృష్టి రహస్యం ఒకటి ఉంది. ఎలా అంటే విత్తనాలలో జీవశక్తి ఉన్నా అవి పడాల్సిన చోటు, ఉండాల్సిన వాతావరణం, తగలాల్సిన తేమ తగిలితేనే అవి మొలకెత్తుతాయి.
అలా కాకుండా ఏ సంచి లోనో, ఏ డబ్బా లోనో పెట్టి మూత పెడితే అవి మొలకెత్తవు. ఎందుకంటే పైన చెప్పిన మూడు పరిస్థితులు లేకుండా ఆ విత్తనానికి మొలకెత్తడం చేతకాదు. అది మొలకెత్తటానికి ఎవరో ఒకరు దానికి అది మొలకెత్త టానికి తగిన పరిస్థితులని కలిగించాలి. అప్పుడు మాత్రమే అది దానిలో ఉన్న దాని జీవశక్తిని బట్టి మొలకెత్తి అది ఏంటో ఎలా పెరుగుతుందో, ఏమేమి ఫలపుష్పాలు ఇస్తుందో మనకి ఇచ్చి చూపించగలదు.

👉 అదే విధంగా మానవులతో సహా సమస్త జీవరాసులు ఏ మహా ప్రళయంలోనో యుగాంతంలోనో పూర్తిగా నశించి కొంత కాలం పాటు ఏవిధమైన శరీరాలు లేకుండా పడి ఉన్నప్పుడు, ఆ మహా ప్రళయం సంభవించిన సమయానికి ఆయా మానవుల వెనక ఏ విధమైన కర్మలు, సంస్కారాలైతే ఉన్నాయో అవన్నీ తరిగించుకొని ఉద్దరించబడటానికి మళ్ళీ ఏదైనా తగిన శరీరం ఉంటే తప్ప వాళ్ళ వెనకన ఉన్నకర్మలని తరిగించుకోలేరు. అందుకని ఎవరి చేసుకున్న కర్మ ప్రకారం ఎవరికి తగ్గట్టు వారికి ఒక్కొక్క శరీరాన్ని ఆ భగవంతుడు తయారుచేసి ఇస్తాడు.

అలా శరీరాన్ని నీకు ఇస్తూ, దాంతో పాటు మానవుల నడవడికి సంబంధించిన కొన్ని నియమాలని కూడా ఆయా దేహాలకి వర్తింపజేస్తూ వాటి ప్రకారం నడుచుకోమని చెప్పి పంపుతాడు. తాను చెప్పినట్టు నడుచుకుంటే మానవుల పాపాల పుట్టని అంతా తాను పరిహారం చేస్తాను అని కూడా చెప్పి పంపుతాడు.

👉 ప్రతి మానవుడికి తాను చేసిన కర్మకి తగ్గట్టుగా అతనికి కావలసిన శరీరాన్ని మానవుడు తెచ్చుకోలేడు కాబట్టి దాన్ని భగవంతుడు సృష్టించి ఇస్తాడు తప్ప అలా చేయడంలో ఆయనకి ఏవిధమైన పక్షపాతము ఉండదు.

👉 ఒక్క మాటలో చెప్పాలి అంటే ఇదంతా భగవంతుడి ఆధీనంలో ఉన్న “ప్రకృతి” లో ఒక ఆటోమేటిక్ సిస్టమ్ లాగా ఎవరు ఏ శరీరంతో, ఎక్కడ, ఎలా పుట్టాలో, ఏ విధమైన జీవితం గడపాలో, దానివలన మావవులలో ఎలాంటి పరివర్తన రావాలో అన్నది నిర్విరామంగా జరిగిపోతూనే ఉంటుంది.
అందువలన ఒకళ్లని అన్నీ విధాలా బాగా సృష్టించి, కొందరిని అన్నీ విధాలా హీనంగా, లేదా తక్కువగా సృష్టించడం అనేది ఉండదు.

💠 ఎవరి కర్మకు తగ్గట్టుగా వారి వారి శరీరాలు ఆయా కర్మలని అనుభవించే విధంగా ఈ ప్రకృతి లోంచి తయారు అవుతాయి.
భగవంతుడు “నన్ను పరిపూర్ణంగా ఆశ్రయించు నీ యోగ క్షేమాలు నేను చూస్తాను” అన్నాడు అంటే.. తాను చెప్పినట్టుగా మానవుడు ప్రవర్తించగలిగితేనే చూస్తాను అన్నాడు తప్ప మానవుడు తన ఇష్టం వచ్చినట్టు చేస్తే తను చూస్తాను అని అనలేదు.

👉 కాబట్టి మానవుల్లో హెచ్చుతగ్గులు తేడాలు అన్నీఎవరికి వారు తెచ్చిపెట్టుకున్నవే తప్ప వాటితో భగవంతుడికి ఏ మాత్రం సంబంధం లేదు. అయితే మానవులు గతంలో చేసిన తప్పులని తిరిగి చేయకుండా ఉండేలా చేసే ప్రయత్నంలో భగవంతుడి సహాయం అందరిమీద ఒక్కలానే ఉంటుంది. ఎక్కడా తేడా ఉండదు.

👉 “ఈ ప్రాపంచిక విషయాల మీద విరక్తి భావంతో” తనని “అన్యధా శరణం నాస్తి” అని వచ్చిన వాళ్ళని తప్పక రక్షించి తీరుతాను అని భగవంతుడు సమస్త మానవాళికి ఇచ్చిన మాట 🙏
 *శ్రీ గురుభ్యోనమః*

      నీ హృదయంలో  ఒక  నిజం  ఉంది !  నీ హృదయంలో  ఒక  సత్యం  ఉంది !  చావులేని  ఆ పదార్థం  గురించి  తెలుసుకుంటేనే  గాని,  చావులోంచి  నువ్వు  బయట  పడలేవు.  పుట్టినవాడు  చనిపోతూ  ఉంటాడు,  చనిపోయినవాడు  పుడుతూ  ఉంటాడు.  ఇది  సంసారం.  కోరికలతోనే  నువ్వు  పనులు  చేస్తావు,  కోరికతో  పని  చేయటం  మానవు,  కోరిక  వల్లే  సంసారం  కూడా  వస్తుంది. 

*భగవద్గీతలో  చెప్తాడు ..  కామ్యకర్మలు  చేసినంతకాలం ..  మనిషివెంట  నీడ  ఏవిధంగా అయితే  వెంటాడుతుందో,  అదేవిధంగా  కోరికలు  కోసం  పనిచేసేవాడికి,  సంసారం  ప్రతీజన్మలో  నీడలా  వెంటాడుతుంది.*  
కొంతమంది  ఉంటారు ..  మీరు  మాకేమీ  ఉపకారం  చెయ్యద్దు,  మా ముఖంవంక  చూసి  కొంచెం  నవ్వుండి  చాలు  అంటే  నవ్వరు.  నవ్వితే  మాకేం  కలిసి  వస్తుందని !  వాళ్ళకి  నవ్వటం  వల్ల  కూడా  కలిసి  రావాలి.  మా ఇంటికి  వస్తే  మీరేం  తెస్తారు ?  మీ ఇంటికి  వస్తే  మాకేం  ఇస్తారు ?  ఇదీ ..  ఇప్పుడు  సిద్ధాంతం !  వీళ్ళకి  సంసారం  ఏం  విడిచిపెడుతుందన్నాడు  భగవవద్గీతలో  భగవంతుడు !  కృష్ణుడంటే ..  ఊరికే  వసుదేవుడు  గారి  అబ్బాయి  అయి  చెప్పలేదు.  ఆయన  పరబ్రహ్మమై  చెప్పాడు,  పరిపూర్ణుడై  చెప్పాడు,  ఈశ్వరుడై  చెప్పాడు,  సర్వజ్ఞుడై  చెప్పాడు,  నారాయణుడై  చెప్పాడు అది  *భగవద్గీత !!*

*శంకరాచార్యులవారు  అన్నారు ..*  ఎన్ని  పుస్తకాలకైనా  వ్యాఖ్యానం  వ్రాయచ్చు  కానీ,  *భగవద్గీత* కు  వ్యాఖ్యానం  రాయటం  కష్టం.  భగవంతుడు  చెప్పిన  మాటకు  లోతు  ఎంతుందో  నాకు  తెలియటం  లేదు  అన్నారు  ఆచార్యస్వాములవారు

*శ్రీ నాన్నగారి  అనుగ్రహ  భాషణం -*
*మురమళ్ళ :*  2005 / 02 / 09
                     
🪷🙏🏻🪷🙏🏻🪷
 🙏 *రమణోదయం* 🙏

*ఇహ పరాల్లో పొందే అల్ప సుఖానుభవాలపై ఆశలు పెంచుకొని దుఃఖిస్తున్న ఓ మనసా! నీవు ఎటువంటి తలపులు లేకుండా నీ సహజ స్థితిలో ఉంటే ఇహపరాలని దాటిన బ్రహ్మానంద ముక్తిని నిశ్చయంగా పొందుతావు.*

*భగవాన్ శ్రీరమణ మహర్షి*
(భగవాన్ ఉపదేశాలు *"శ్రీ మురుగనార్"* వచనములలో - సం.379)
సేకరణ: *"గురూపదేశ రత్నమాల"* నుండి 
🪷🪷🦚🦚🪷🪷
 *స్మరణ మాత్రముననె పరముక్తి ఫలద* |
 *కరుణామృత జలధి యరుణాచలమిది*|| 
            
🌹🌹🙏🙏 🌹🌹

మనస్సు హృదయంలో లీనం కాకపోవడానికి
పూర్వ సంస్కారాలే కారణం..వాస్తవానికి      
మనసేప్పుడూ హృదయంలోనే ఉన్నది..
కానీ, నీ పూర్వసంస్కారాల మూలంగా అది చలిస్తూ
ఉంటుంది.. పూర్వసంస్కారాల బలం లేకుండా
చేయబడినప్పుడది చలనముడిగి శాంతిని 
పొందుతుంది..ప్రాణాయామం, సజ్జన సాంగత్యం,
ఈ సంస్కారాలను తొలగించడానికి తోడ్పడతాయి..
అయితే, ప్రాణాయామంవల్ల తాత్కాలికంగా    
మాత్రమే మనస్సు నిశ్చలమౌతుంది..దానికి కారణం
సంస్కారాలింకా మిగిలి ఉండడమే.
మనస్సు ఆత్మగా మారినప్పుడే చిక్కూ ఉండదు.
అది ధ్యానం వల్లనే సాధ్యం!

💐 ఓమ్ నమో భగవతే శ్రీ రమణాయ 💐