Friday, August 9, 2024

 *🌹    తలపులకు… తలుపులు వేయాలి!    🌹*

           *తాబేలు తనను తాను రక్షించుకోడానికి దాని మీద ఒక ధృఢమైన కవచం లాంటి డిప్ప ఒకటి సహజంగా అమర్చబడి ఉంటుది. తాబేలు తనకు బయట నుండి ఏదైనా ఆపద సంభవిస్తుంది అని అనిపించిపుడు… తన తలను, మిగిలిన అంగములను ఆ డిప్పలోకి లాక్కుంటుంది. అప్పుడు దానికి రక్షణ కలుగుతుంది. అలాగే స్థిత ప్రజ్ఞుడు బయట ప్రపంచంలో ఉన్న విషయవాంఛల నుండి తనను తాను రక్షించుకోడానికి తన ఇంద్రియములను వెనక్కు లాక్కుంటాడు. ఇది అర్థం కావాలంటే మనము ఆచరించవలసిన సాధనల గురించి ముందు తెలుసుకోవాలి!*

           *ఇంద్రియ నిగ్రహము అంటే ఇంద్రియములను అదుపులో ఉంచుకోవడం. నిగ్రహము అంటే ఇంద్రియములను అణగతొక్కడం అని అర్థం తీసుకోకూడదు. విపరీతంగా ఇంద్రియములతో స్పందించకూడదు. దేహమును అంటే ఇంద్రియములను నియంత్రించాలి. సాధకుడికి ఇదిముఖ్యం. దీనినే "దమము" అని అంటారు. ఆదిత్యయోగీ ఎందుకంటే ప్రాపంచిక విషయములకు ఇంద్రియములు విపరీతంగా స్పందిస్తుంటే నిరంతరం వాటి ప్రభావానికి లోనవుతాడు కానీ అతడికి ఉన్నతస్థితి లభించే అవకాశమే లేదు. ఇంద్రియములనే ఎందుకు నియంత్రించాలి ముందు మనసును నియంత్రించవచ్చు కదా.*

            *అంటే ముందు బయటకు కనపడే ఇంద్రియములను నియంత్రించగలిగితే మనసును నియంత్రించడం సులభం అవుతుంది. అందుకే ముందు ఇంద్రియ నిగ్రహముతో మొదలు పెట్టాలి. సాధారణంగా ఇళ్లకు తలుపులు పెట్టుకుంటాము.     ఎందుకు.? అనవసరమైన వాళ్లు ఇంట్లోకి రాకుండా ముందు జాగ్రత్త. ఇంకా కొంత మంది అనుమతి లేనిదే లోపలకు రాకూడదు అని బోర్డుకూడా పెడతారు. మన ఇంటికే ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాము కదా.*

           *మన శరీరంలోకి ఇంద్రియముల ద్వారా ఎన్ని అనవసర విషయాలు ప్రవేశిస్తాయో తెలుసుకోవద్దా! వాటిని నిరోధించడానికి తలుపులు పెట్టుకోవాలి కదా! లేకపోతే మన శరీరం ఒక పబ్లిక్ టాయిలెట్ అయిపోతుంది. పబ్లిక్ టాయిలెట్ కు తలుపులు ఉండవు. ఎవరైనా వచ్చి పని కానిచ్చి పోవచ్చు. కాని వాళ్లు వదిలిన తాలూకు వాసనలు అక్కడే ఉంటాయి. అలాగే మన శరీరం తలుపులు తెరిచిపెడితే, బయట ప్రపంచంలో ఉన్న శబ్ద, స్పర్శ, రస, రూప, గంధములు అన్నీ యధేచ్ఛగా లోపలకు ప్రవేశిస్తాయి. వెళ్లిపోతాయి. కాని వాటి వాసనలు మాత్రం మనలను వదలవు. కాబట్టి ఇంద్రియ నిగ్రహము అనే తలుపులు మనం అమర్చుకోవాలి.*

                *ఇక్కడ కర్మ ఋణం, యొక్క సూక్ష్మం. అర్ధమైతే. కర్మ సిద్ధాంతంను అనుసరిస్తారు ఎవ్వరైనా.*

             *స్వీయ-సాక్షాత్కార స్థితిలో, జీవ పరిమితుల నుండి విముక్తి పొందినప్పటికీ, నాడుల యొక్క ప్రకాశం కారణంగా ప్రాణంతో సంబంధం సహజంగా మరియు సున్నితంగా ప్రవహిస్తుంది.*

           *ఊపిరి పీల్చుకుంటున్నప్పుడు కూడా, యోగి పరమాత్మ చైతన్యానికి అనుసంధానమై ఉంటాడు. అటువంటి యంత్రాంగాలు శివుని యొక్క సంపూర్ణ స్వయంప్రతిపత్తి యొక్క శక్తి కేంద్రమైన శక్తిచే నియంత్రించ బడతాయి. ప్రాణం యొక్క స్వయంచాలక ప్రవాహం కొనసాగుతున్నంత కాలం యోగి తన భౌతిక శరీరంలో ఉనికిలో ఉంటాడు. తన శరీరానికి మరియు ప్రాణానికి మధ్య సంబంధం ఉన్నంత వరకు, తన శరీరాన్ని పరిపూర్ణ స్థితిలో ఉంచుకోవడం యోగి యొక్క విధి. అతని శరీరానికి ప్రాణం ఆగిపోవడం ముందుగా నిర్ణయించిన సమయంలోనే జరుగుతుంది. ఆ తదుపరి అతని ఆత్మ శాశ్వతత్వంలో కరిగిపోతుంది, మళ్లీ పుట్టదు. ఎల్లవేళలా భగవంతునితో అనుసంధానమై నిలబడాలనే సందేశం ఈ సూత్రం ద్వారా అందించబడిన సందేశం. ఇక్కడ అన్ని సమయాలలో  అనేది ప్రపంచ ప్రాణశక్తి అనే పదం ద్వారా సూచించబడుతుంది.*

           *ప్రస్తుతం ఏం జరుగుతుంది? ఎలా జరుగుతుంది?..*

         *అవును జీవులన్నింటిలో ఉత్కృష్టమైనవాడు మానవుడే! జ్ఞాననేత్రాలతో సర్వమును గ్రహించే శక్తి మానవునికి వుంది! తానే పరమాత్మ స్వరూపుడైనప్పుడు తనకు వేరే నియామకుడు ఎలా వుంటాడు! ఆత్మరూపుడైన తాను శాశ్వతుడు! తనకు నాశనం లేదు! తన దేహానికి తానే ఆభరణం! ఈ భూమిపై జన్మించిన తాను ఈ భూమికే అలంకారం! సచ్చిదానందములే తన ఐశ్వర్యాలు! ఆత్మానుభూతి పొందిననాడే శోకములన్ని నా నుండి దూరమైనవి! బ్రహ్మమే నేనైన నాకు ఇక శోకమెక్కడిది! ఆదిత్యయోగీ.*

          *ఈ భావనే జ్ఞానోదయమునకు పునాది! జ్ఞానంతో జీవుడు తానే పరమాత్మ అన్న సత్యాన్ని అనుభూతి పొందగలడు! అదే జీవుని నిజస్వరూపము!*

*చిదానందరూపః శివోహమ్! శివోహమ్!*

            *అన్న ఆదిశంకరుల ఆత్మబోధకు అర్ధమిదే!..*

       *బ్రహ్మము అనే పదానికి అర్థం ఇది*

             *భారతదేశంలో మనకు బ్రహ్మము అనే ఒక భావన ఉంది, సాంప్రదాయపరంగా, బ్రహ్మము అంటే భగవంతునితో సమానం, అదే అంతిమ సత్య తత్వంగా, పరమాత్మగా భావిస్తారు. లేదా మీకు నచ్చిన పేరుతో పిలవవచ్చు. అయినప్పటికీ మనం ఆ పదం ఎక్కడినుండి వచ్చింది అనే శబ్ద మూలాలను పరిశీలిస్తే. మనకు పూర్తిగా భిన్నమైన కథనం బయటపడుతుంది. ''బ్రహ్మన్'' అనేది బృహ అంటే ''విస్తరణ''. మాన్ అంటే ''ధ్యానం'' అని రెండు సంస్కృత మూలాల కలయిక వల్ల ఏర్పడింది. అందుకని.   "బ్రహ్మము అంటే విస్తరించి. ధ్యానించేది" అని అర్థం...*

*🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹*

ఇదీ పరిస్థితిబంగ్లాదేశ్ హిందువుల హత్యపై:

 బంగ్లాదేశ్,భారత్ సరిహద్దు వద్ద 
ఇదీ పరిస్థితిబంగ్లాదేశ్ హిందువుల హత్యపై: 
TMC - 0 ట్వీట్లు 
DMK - 0 ట్వీట్లు 
AAP - 0 ట్వీట్లు
 BSP - 0 ట్వీట్లు 
RJD - ​​0 ట్వీట్లు 
MIM - 0 ట్వీట్లు 
CPI - 0 ట్వీట్ 
కాంగ్రెస్ పార్టీ - 0 ట్వీట్లు 
NCP -శరద్ పవార్ - 0 ట్వీట్లు
 శివసేన (ఉద్ధవ్) – 0 ట్వీట్లు
 సమాజ్ వాదీ పార్టీ - 0 ట్వీట్లు 
రాహుల్ గాంధీ - 0 ట్వీట్లు
 అసద్ ఒవైసీ - 0 ట్వీట్లు 
ప్రియాంక గాంధీ - 0 ట్వీట్లు
 సంజయ్ సింగ్ - 0 ట్వీట్లు 
ఉద్ధవ్ థాకరే - 0 ట్వీట్లు 
సంజయ్ రౌత్ - 0 ట్వీట్లు
 తేజస్వి యాదవ్ - 0 ట్వీట్లు 
మమతా బెనర్జీ - 0 ట్వీట్లు
 అఖిలేష్ యాదవ్ - 0 ట్వీట్లు 
మల్లికార్జున్ ఖర్గే - 0 ట్వీట్లు కాగా,

 వీరంతా గాజాలో ఉగ్రవాదుల మృతిపై పలు ట్వీట్లు చేశారు. 

ఇప్పుడు అర్థం చేసుకోండి ..

శ్రీ రమణీయం - 40🌹 👌 సాధనకు సహనం తొలి సద్గుణం 👌

[8/8, 16:47] +91 73963 92086: 🌹 శ్రీ రమణీయం - 40🌹
👌 సాధనకు సహనం తొలి సద్గుణం 👌
 ✍️ శ్రీ గెంటేల వెంకటరమణ
నమో వేంకట రమణాయ, అద్వైత నిధయే నమః
✳️🌹🌹🌹🌹✳️🌻🌻🌻🌻✳️

40. సాధనకు సహనం తొలి సద్గుణం

✳️ మనసు శరీర భావనతో ఉన్నప్పుడు శరీరం తాలూకూ కష్టసుఖాలను అనుభవిస్తుంది. మండుటెండలో తిరిగినప్పుడు కష్టంగా అనిపించడం, ఎ.సి. గదిలో కూర్చుంటే హాయిగా అనిపించడం వంటివి మనసు పొందే దేహానుభవాలు. మనసు ఆలోచనలో ఉన్నప్పుడు శరీరంతో నిమిత్తం లేని సంతోష దుఃఖాలను అనుభవిస్తుంది. ఏదైనా శుభవార్త గుర్తుకురాగానే సంతోషం కలగటం, అవమానకరమైన విషయం గుర్తుకు రాగానే దుఃఖం కలగటం మన అనుభవం లోనివే. *మనసు శరీర భావనతోనూ, ఆలోచనల తోనూ కాకుండా తన సహజ స్థితిలో ఉంటే ఆత్మశాంతితో ఉంటుంది.* అంటే, ఆత్మలక్షణమైన పరిపూర్ణ శాంతిని మనసు అనుభవిస్తుంది. 

✳️ శరీరానికి కష్ట సుఖాలు క్రియలోనూ, మనసుకి సంతోష దుఃఖాలు భావనతోనూ కలుగుతున్నాయి. కాబట్టే నీళ్ళల్లో పడినట్లు కలవస్తే మనసుకు మాత్రం ఆందోళన ఉన్నా నిజంగా శరీరానికి ఏ తడి అంటదు. మనసు ఈ భావనాస్థితిని దాటితే మనోమూలంలోనే ఉన్న ఆత్మశాంతి అనుభవంలోకి వస్తుంది. ఆత్మ గుణమైన పరిపూర్ణశాంతి మనసుకు కలగటమే ఆత్మానుభవం. అదే దైవ దర్శనం.

✳️ మనం శాంతిని, తృప్తిని సుఖసంతోషాల ద్వారా పొందాలని అనుకుంటున్నాం. అందుకే జీవితంలో శాంతికోసం వెతుక్కోవాల్సి వస్తుంది. అనుకున్న పనులను చేయటం ద్వారా, శరీరాన్ని సుఖంగా ఉంచడం ద్వారా మాత్రమే మనసుకి శాంతి కలుగుతుందని మన భావన. శరీరంతో అనుకున్నవి చేయగలిగినప్పుడు, మనసుతో ఇష్టమైన విషయాలు భావన చేయగలిగినప్పుడు కలిగే అనుభూతిని శాంతి అనుకుంటున్నాము. నిజానికి శాంతి, తృప్తి మనలోని ఆత్మ సుగుణాలు. శరీర క్రియలతో, మనోభావనలతో పని లేకుండానే అవి మన సొంతం. పగలంతా అనేక శరీరక్రియలతో కష్టసుఖాలను అనుభవిస్తున్నాము. స్వప్నంలో దేహంతో పని లేని అనేక మానసిక భావనలతో కూడిన సంతోష దుఃఖాలను పొందుతున్నాము. కానీ గాఢనిద్రలో వేటితోనూ పని లేకుండానే శాంతిని ఆస్వాదించగలగడం మనలోని ఆత్మతత్వానికి నిదర్శనం.

✳️ జీవితంలో మనం కోరుకునే తృప్తి, శాంతి, మనలోనే సిద్ధంగా ఉన్నప్పుడు మరి ఈ వెంపర్లాట ఎందుకంటే... అజ్ఞానం చేత. జ్ఞానం అంటే ఏది సత్యమో, ఏది అసత్యమో తెలియడం. మెలకువలో నిజమనిపిస్తున్న వరకూ అనేక భావనలతో ఉండే మనసుకి సుషుప్తిలో ఉనికే ఉండటం లేదు. మనకు ఇప్పుడు అనుభవంలో లేని ఆత్మను గురించి విచారణ చేయలేము. కనుక మనకి అనుభవంలో ఉన్న దేహం గురించి, ఆ అనుభవాలను పొందే మనసును గురించి విచారించి సత్యాన్ని అర్థం చేసుకోవాలి.

✳️ ఈ దేహం ఒకటి ఉంది కనుక దానికి అవసరాలు తీర్చక తప్పదు. అన్నం, నీరు, బట్టలు వంటి ప్రాథమిక అవసరాలు విధిగా సమకూర్చి తీర్చాల్సిందే. ఆకలి తీరితే శరీరం శాంతిస్తుంది. కానీ రుచులు కోరే మనసు మాత్రం శాంతించడం లేదు. ఆకలి, శరీర రుచులు కోరే మనసు మాత్రం శాంతించడం లేదు. ఆకలి శరీర అవసరమైతే, రుచి మనసుకు కలిగే కోరిక. ప్రకృతి ధర్మాలైన శరీర అవసరాలను తీర్చడం సముచితమైనా మితం లేని మానసిక కోర్కెలను తీర్చాలనుకోవడం శాంతిని దూరం చేసే విషయం. ఎంతటి జ్ఞానికైనా అన్నం తింటేనే కడుపు నిండుతుంది. కనుక శరీర పోషణ, రక్షణలు మనకు అత్యావశ్యకం. అశాంతి కారకాలైన కోర్కెల ఉధృతి తగ్గాలంటే మనసుకి సహనం చాలా అవసరం. సుఖ సంతోషాల ద్వారా మనం పొందాలని వెంపర్లాడుతున్న శాంతి మనలోనిదేనన్న సత్యం తెలిస్తే వెతుకులాటలేని పవిత్ర జీవనం ఏర్పడుతుంది. 

✳️ అలానే పవిత్రమైన జీవనవిధానం అలవర్చుకుంటే మనసు సత్యాన్ని గ్రహించి ఆత్మానందాన్ని పొందగలుగుతుంది. ఈ పవిత్ర జీవనం కోసమే మన పెద్దలు ధర్మం ఆచరించమన్నారు. ఆధ్యాత్మిక సాధన ఏదీ శాంతిని తృప్తిని ఇవ్వదు. పురాణాలు, శాస్త్రాలు, అవతార పురుషుల జీవితాలు మనకు సహనాన్నే బోధిస్తున్నాయి. భారతీయ హృదయానికి ఆయువు పట్టులాంటి సహనాన్ని వదిలి ధ్యానం చేయాలని అనుకోవడం అత్యాశే అవుతుంది. 

✳️ శ్రీకృష్ణ భగవానుడు, సాక్షాత్తు విష్ణువు. 12వ ఏటనే గోవర్ధన పర్వతం ఎత్తాడు. బ్రహ్మకు సైతం అంతు చిక్కని శక్తిని ప్రదర్శించాడు. అయినప్పటికీ ఆయన వచ్చిన పనులన్నీ పూర్తి చేయడానికి 120 సంవత్సరాల కాలం జీవించాల్సి వచ్చింది. మన జీవన పరమార్థమేమిటో, వచ్చిన పనిఏమిటో మనకు తెలియక పోవచ్చు. కానీ అవతరించిన దైవానికి అవన్నీ తెలుసు. సహనం నేర్పటం కూడ అవతార రహస్యంలో భాగం కనుక వారుకూడా కాలానుగుణంగానే వ్యవహరించారు. శ్రీరాముడు, శ్రీకృష్ణుడి మనసులు వేరైనా అనుసరించిన ధర్మం, ఆచరించి చూపిన సచ్ఛీలం ఒక్కటే. శ్రీరాముడ్ని పూజించటం అంటే రాముడి సద్గుణాలను అలవర్చుకోవడమే అందులోని అంతర్యం. మనలోని దుర్గుణాలను ముందుగా జయిస్తేనే సమాజంలో దేన్నైనా జయించడానికి అర్హత లభిస్తుంది. అదే ఇంట గెలిచి రచ్చగెలవడం అనే నానుడిలోని అర్థం. లౌకిక జీవనంలో శుభకరంగా భావించే వివాహాన్ని కూడా పారమార్ధిక జీవనంలో పాపంగా పేర్కొన్నారు. ఇది మన పారమార్ధిక జీవన ఆవశ్యకతను, ప్రాముఖ్యతను తెల్పుతుంది. జీవితంలో ధర్మాచరణ ద్వారానే మనం ఈ దోషాలన్నింటిని పరిహరించగలం.
[8/8, 16:47] +91 73963 92086: ✳️ భౌతిక జీవనానికి తక్కువ ప్రాధాన్యతనిచ్చి అంతర్గత జీవనాన్ని అత్యుత్తమ జీవనంగా చాటిచెప్పిన దేశం మనది. ఏ విషయంలోనైనా ఫలం కోసం కాలం వచ్చేవరకూ వేచిఉండటం సహనం. మనం ఋషుల్లాగా సమాజాన్ని, లౌకిక జీవనాన్ని వదిలివెళ్లి సాధన చేయలేము. కనుక బాల్యం నుండి వృద్ధాప్యం వరకు అన్ని దశల్లోనూ ధర్మజీవనం గడపడం ద్వారా మాత్రమే ఆధ్యాత్మిక ఉన్నతికి చేరగలుగుతాము. కానీ నేటి మన పోకడలు అందుకు పూర్తి విరుద్ధంగా ఉంటున్నాయి. ఒకప్పటి మన సమాజంలోని ప్రేమాభిమానాలు ఇప్పుడు వ్యామోహాలుగా మారుతున్నాయి. పాశ్చాత్య విధానాల అనుకరణ మనకు లౌకిక, ఆధ్యాత్మిక జీవితాల్లో శాంతిలేకుండా చేస్తుంది. బాల్యంలో మొదలైన ఫ్యాషన్ల మోజు యవ్వనప్రాయానికి విచ్చలవిడితనంగా మారుతుంది. మన సంస్కృతిలో ఎంతో ఉన్నతమైన వైవాహిక వ్యవస్థలో కూడా దుష్పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. శాంతిని దూరం చేసే విధానాలవైపు పరుగులు పెడుతూ... ధాన్యం - దైవం వంటి ఆధ్యాత్మిక సాధనలకు పూనుకోవడం వృథా ప్రయాసే అవుతుంది.

✳️ కలుపు మొక్కలను తీసివేయకుండా సేద్యం ఎలా సాధ్యం కాదో మనలోని దుర్గుణాలను తొలగించకుండా శాంతిని, తృప్తిని పొందటం సాధ్యం కాదు. ఆధ్యాత్మిక జీవితమైనా, లౌకిక జీవనమైనా సాఫీగా సాగాలంటే సహనం అనే తొలి సద్గుణం అవసరం. మనసు ఉధృతికి కళ్లెం వేసే సహనం లేకుండా ధ్యానంగానీ, జపం గానీ సిద్ధించవు. అందుకే మనం నిత్య జీవితంలోనే సహనాన్ని అలవర్చుకుంటే ఆధ్యాత్మిక సాధనకు అవసరమైన మార్గాన్ని సుగమం చేసుకోగలుగుతాము.

🙏 సర్వే జనాః సుఖినోభవంతు
🚩 హిందువునని గర్వించు
🚩 హిందువుగా జీవించు

సేకరణ:
✳️🌹🌹🌹🌹✳️🌻🌻🌻🌻✳️
 ఆత్మానాత్మ వివేకము ( ఆదిశంకరుల విరచితం -- శ్లోకం 6.)

రాగాదయ:   కస్మాత్  …    భవన్తీతి  చేత్  / 

రాగం మొదలయినవి దేనివల్ల పుడతాయి అనే ప్రశ్నకి, అభిమానం వల్ల పుడతాయి అని సమాధానం.

రాగం మొదలయినవి  అంటే ఏమిటో తెలిసినతర్వాత,  ఈ ప్రవ్రుత్తులన్నీ,  అభిమానం వల్ల పుడుతున్నాయి అని తెలుసుకోవాలి .   ఏ వస్తువైనా ముందుగా మన ఇంద్రియాలకు గోచరిస్తుంది.  ఆతర్వాత మనస్సులో ఆలోచన  మొదలవుతుంది.  ఇది నాది, దీని మీద అధికారం నాది. ఇది నా కోసమే !  అంతా నా కోసమే ! . అనేది అభిమానం.  ఈ అభిమానం ప్రాణులన్నిటికీ సహజమే.   ఈ అభిమానం అనేదే అసాధారణ ధర్మంగా పరిణమిస్తే అహంకారమౌతుంది .

దీనిని అనుసరించే బుద్ధి అనేది ఏ పనిచేయాలో నిర్ణయిస్తుంది.  అహంకారమనేది చాలా జటిలమయినది.  దీనినుండి విముక్తి  అనేది కష్టసాధ్యం. పూర్తిగా అసాధ్యం కాదు .

నిష్కాపట్యాన్ని, సరళ స్వభావాన్ని  ( డంబాచారం, మిధ్యాభిమానం లేకుండా వుండటం ) అలవాటు చేసుకుంటే, అహంకారాన్ని చాలావరకు అదుపులో పెట్టవచ్చు .  అహంకారం అంటే  తాను ఏదో పొందాలనీ.   ఆ పదవికీ, ఆ భోగభాగ్యాలకీ తాను మాత్రమే అర్హుడననే భావం .

ఈ అహంకారం తగ్గినకొద్దీ రాగాదిభావాలు వాటంత అవే తగ్గుముఖం పడతాయి .  రాగమనేది సాధనకు భంగకారి.   లోపల అహంకారమున్నప్పుడే బయట రాగమనేది కనిపిస్తుంది.  లోపల అహంకారం లేకపోతె బయట రాగమనేది వుండదు.

అహంకారమే రాగానికి మూలకారణం . అంతేగానీ, రాగం వల్ల అహంకారం పుడుతుందని అనుకోకూడదు.  వీటి మధ్యనుండే అంతరం చాలా సూక్ష్మమైనది .  కాబట్టి అటువంటి భ్రమకు అవకాశం వుంది .  

స్వస్తి .
 *‘ఆత్మజ్ఞానం’*

(కేన మరియు కఠోపనిషత్తుల అంతరార్ధము) 
జీవుని విషయానికొస్తే, దేని దగ్గరకు మనస్సు పదేపదే పరిగెడుతుందో, మనస్సు ద్వారా ఏదయితే పదేపదే స్మరించబడుతుందో అదియే "ఆత్మ". సంకల్ప, వికల్పాలను చేసేది జీవుని మనస్సే. అలాగే ఉపాసించేది కూడా మనస్సే. కాబట్టీ ముందుగా మనస్సును శుద్ధి చేసుకొని పరబ్రహ్మమును ఉపాసించాలని ఇక్కడ భావము.  "తద్వనం" (అది ఆనందకరమైనది) అనే నామంతో "బ్రహ్మము" ఉపాసింపబడుతుంది. ఆనందమే పరబ్రహ్మమని అర్ధము. ఏ జీవుడు బ్రహ్మమును ఇలా సాధనచేస్తాడో అతనిని సర్వభూతములు కీర్తిస్తాయి. ఈ విధంగా బ్రహ్మజ్ఞానమునకు సంబంధించిన ఈ ఉపనిషత్తు గురువు ద్వారా శిష్యునికి బోధింపబడింది.  ఈ ఉపనిషత్తునకు తపస్సు, దమము, కర్మ పునాదులవంటివి. వేదములే దాని యొక్క అంగములు. సత్యమే దాని నివాసస్థానము. ఈ ఉపనిషత్తు సారాంశమును గ్రహించినవాడు "బ్రహ్మము" నందు ప్రతిష్ఠితుడగుతాడు. ఇందులో సంశయం లేదు. జీవుని ముందు రెండు మార్గాలుంటాయి. ఒకటి శ్రేయస్సు, రెండవది ప్రేయస్సు. శ్రేయస్సు అంటే మోక్షము లేక శాశ్యతానందము. ప్రేయస్సు అంటే బంధము లేక అనిత్యమైన ఇంద్రియానందము. వీటినే విద్య, అవిద్య మార్గాలనికూడా అంటారు. జ్ఞానులు శ్రేయస్సును అవలంబించి శాశ్వతసుఖాన్ని పొందుతారు. అజ్ఞానులు ప్రేయస్సును కోరుకొని క్షణికమైన సుఖాలను అనుభవిస్తూ మొహలాలసులై జననమరణ చట్రంలో ఇరుక్కుంటారు. అవిద్యలో పడి కొంతమంది తామే ధీరులమని, పండితులమని ప్రకటించుకుంటారు. వారు పరలోక విషయాన్ని లేక ఆత్మవస్తువుని ఏ మాత్రము గ్రహించక పలుమార్లు ఇచ్చటికే (మృత్యులోకం) వచ్చి పోతుంటారు. వారిని అనుసరిస్తున్న వారిది కూడా ఇదే పరిస్థితి. 
ఆత్మవస్తువు గురించి వినడమే ఆశ్చర్యము, విన్నవారు దానిని తెలుసుకొనుట కష్టం, దానిగురించి చెప్పే గురువు దొరకటం ఇంకా కష్టం, ఒకవేళ దొరికిన అతడు చెప్పింది అర్ధం చేసుకోవడం బహుకష్టం. ఆత్మజ్ఞానం తర్కంద్వారా అర్ధంకాదు. అనుభూతి పొందిన గురుని ఉపదేశం వల్లనే అది సిద్ధిస్తుంది. కానీ శిష్యుడు సత్యశోధకుడై వుండాలి.  కర్మలను నిష్కామంతో ఆచరించి, తద్వారా చిత్తశుద్ధిపొంది, జ్ఞానంతో సత్యశోధన చేసి ఆత్మజ్ఞానాన్ని పొందుట సులువైన మార్గము. ఆ పరమాత్మ వస్తువు కంటికి కనబడదు. ప్రతి జీవిలో నిఘాడంగా అది నెలకొనివుంది. దానిని జ్ఞాననేత్రం(ఆత్మనిష్ఠ)తో గ్రహించవచ్చు. 
ఆత్మ, అణువుకన్నా అణువైనది మరియు మహత్తుకన్నా మహీయమైనది, ఎటువంటి శరీరంలేకుండా అది ప్రతిజీవి శరీరంలో నెలకొనివుటుంది. అక్కడే వుంటూ అన్నిచోట్లకు వెళ్లగలదు. జీవుని సుఖదుఃఖములతో ఆత్మకు ఎటువంటి సంబంధము లేదు. జీవి శరీరము నశిస్తుంది గాని ఆత్మ ఎల్లప్పుడూ చిదాభాసమై వుంటుంది.

Thursday, August 8, 2024

****ఐశ్వర్యము అంటే ఏమిటి

 *🙏🌹 ఐశ్వర్యము అంటే ఏమిటి 🌹🙏* 

*🪷\|/ఐశ్వర్యం అంటే అందరూ ఏమనుకుంటారంటే*

*🪷\|/ధనము, సంపదలు, ఆస్తులు, అంతస్తులు అని అనుకుంటారు. కాని  నిజమయిన ఐశ్వర్యము అంటే ...*

*🪷\|/ఏ మనిషైతే శరీరము విడిచేనాటికి సంపూర్ణమైన ఆరోగ్యముతో జీవిస్తూ ఉంటాడో ఏ మనిషైతే శరీరము విడిచేనాటికి సంపూర్ణమైన ఆనందముతో జీవిస్తూ ఉంటాడో ,*

*🪷\|/ఏ మనిషైతే శరీరము విడిచేనాటికి సంపూర్ణమైన ఆధ్యాత్మిక జ్ఞానం కలిగి ఉంటాడో అతడే ఐశ్వర్య వంతుడు. దీనినే సంపూర్ణ ఐశ్వర్యం అంటారు. అంతే గాని చనిపోయేంతవరకు సంపాదిస్తూ పోతూ, సంపాదించిందంతా వైద్యాలయానికి పోయడం కాదు ఐశ్వర్యమంటే!*

*🪷\|/చనిపోయేంతవరకు ఇంటిలో గాని , వీధిలోగాని ఘర్షణలతో జీవించడం కాదు ఐశ్వర్యమంటే,*

*🪷\|/చనిపోయేంతవరకు సంపాదించిన ధనము వల్ల శత్రువులను , ఈర్ష్యాపరులను, ఏర్పరచుకుని ఎవరు నాకు హాని తలపెడతారో అని భయముతో జీవించడము కాదు ఐశ్వర్యమంటే ,*

*🪷\|/చనిపోయేంతవరకు నీ నిజస్వరూపాన్ని తెలుసుకోకుండా భగవంతునికోసం గుడి గోపురం తిరగడం , తీర్ధయాత్రలు చేయడం కాదు ఐశ్వర్యమంటే ,*

*🪷\|/వీటినన్న్నిటిని జయించినవాడే ఐశ్వర్య వంతుడు.శరీరము ఎవరైనా విడిచిపెట్టవలసినదే ఎవరైనా సరే*

*🪷\|/పుట్టినవాడు మరణించక తప్పదు , మరణించినవారు మరలా పుట్టక మానరు .*

*🪷\|/ఆత్మ అవినాశి. ఆత్మకు చావులేదు , పుట్టుకాలేదు .కాని వున్నదంతా ఈ శరీరానికే .*

*🪷\|/అది తెలియక నేను-నేను అంటూ వ్యామోహానికి గురై బాధపడుతున్నారు అందరూ.*
*ఈ జీవితంలో ఏవిధంగా ఆరోగ్యవంతునిగా జీవించాలో , ఏ విధంగా ఆనందంగా జీవించాలో , ఏవిధంగా ఐశ్వర్యవంతునిగా జీవించాలో , ఏవిధంగా ఆధ్యాత్మికంగా జ్ఞానంతో జీవించాలో తెలియజేసేదే యోగ సాధన.*

*🪷\|/ఎవరు శరీరంతో వున్నంతవరకు ఏవిధంగానూ లోటుతో శరీరాన్ని వదలరాదు.*
🕉️🚩🕉️

హనుమంతునికి మనం భోజనం పెట్టగలమా!!!

 *_"హనుమంతునికి మనం భోజనం పెట్టగలమా!!!"_*

🌹🙏🌹🙏🌹🙏🌹🙏

*"హనుమ రోజూ సరిగ్గా తిండైనా తింటున్నాడో లేదో.. ఈ రోజు హనుమని భోజనానికి పిలుస్తున్నాను, నేనే స్వయంగా  వంటచేసి దగ్గర కూర్చుని తినిపిస్తాను" అంది సీతమ్మతల్లి...* 

*పిలువు పిలువు...*
*నీకే అర్థం అవుతుంది*
*అన్నాడు శ్రీరామచంద్రుడు నవ్వుతూ.*  
*అన్నట్టుగానే సీతమ్మతల్లి స్వయంగా వంటచేసి...* 
*హనుమను భోజనానికి పిలిచింది...*
*తానే పక్కన కూర్చుని స్వయంగా వడ్డిస్తూ...*

*"కడుపునిండా తిను నాయనా...,* 
*మొహమాటపడకు"*  
*అని చెప్పింది...* 

*"సరేనమ్మా"* 
*అని చెప్పి హనుమ*
*తలవంచుకుని భోజనం చేయసాగాడు...*
*సీతమ్మతల్లి కొసరి కొసరి వడ్డిస్తోంది...* 
*హనుమ వద్దు అనకుండా...* 
*వంచిన తల ఎత్తకుండా* *పెట్టినదంతా తింటున్నాడు.*

*కాసేపట్లో సీతమ్మతల్లి*
*స్వయంగాచేసిన వంటంతా*
*అయిపోయింది...*
 *సీతమ్మతల్లి కంగారు పడి*
*అంఃతపురవాసుల కోసం*
*వండిన వంటంతా తెప్పించింది...* 
*అదీ అయిపోయింది....*
*తలవంచుకునే*  
*ఆహరం కోసం నిరీక్షిస్తూన్నాడు...*
*హనుమ* 
*ఆవురావురమంటూ....*

*సీతమ్మతల్లికి* 
*కంగారు పుట్టి....* 

*"రోజూ ఏం తింటున్నావు నాయనా?"...*
*అని అడిగింది*
*హనుమ ఎంతో వినయంగా...*

*"శ్రీరామ నామం తల్లీ"...*
*వంచిన తలెత్తకుండా*
*జవాబిచ్చాడు  హనుమ...* 

*సీతమ్మతల్లి త్రుళ్లిపడింది...* 
*నిరంతరం  శ్రీరామనామం*
*భుజించేవాడు...,*
*భజించేవాడు...*
*పరమశివుడొక్కడే గదా!...*

*సీతమ్మతల్లి తేరిపార జూసింది...* 
*అప్పుడు కనిపించాడు సీతమ్మతల్లికి....*
*హనుమలో శంకరుడు...*

*శ్రీ శంకరుడే హనుమంతుడు....*

*నిత్యం శ్రీరామనామం ఆహారంగా స్వీకరించే వాడికి...*
*ఇంక తాను ఏమి పెట్టగలదు!🤔* 

*బాగా ఆలోచించిన సీతమ్మతల్లి* 
*ఒక అన్నపు ముద్దను పట్టుకుని...* 
*_"శ్రీరామార్పణం"_* 
*అని ప్రార్థించి వడ్డించింది...*
*ఆ ముద్దని భక్తితో* 
*కళ్లకు అద్దుకొని స్వీకరించిన హనుమ....* 

*_"అన్నదాతా సుఖీభవ!"_* 
*అన్నాడు హనుమ తృప్తిగా  ...*
*హనుమలోని పరమేశ్వరుడికి* 
*భక్తితో నమస్కరించింది సీతమ్మతల్లి...🙏* 
🍓🍓🍓🍓🍓🍓🍓🍓

వెస్ట్ లండన్‌లోని హౌన్స్‌లోలోని స్ప్రింగ్‌వెల్ స్కూల్‌లో తన ఏడేళ్ల కుమారుడిని ముస్లిం క్లాస్‌మేట్స్ మతమార్పిడి చేస్తున్నారని ఆశ్చర్యపోయిన హిందూ తండ్రి.

 వెస్ట్ లండన్‌లోని హౌన్స్‌లోలోని స్ప్రింగ్‌వెల్ స్కూల్‌లో తన ఏడేళ్ల కుమారుడిని ముస్లిం క్లాస్‌మేట్స్ మతమార్పిడి చేస్తున్నారని ఆశ్చర్యపోయిన హిందూ తండ్రి.

సహవిద్యార్థులు హిందూ బాలుడి పేరును మహ్మద్‌గా మార్చుకోవడానికి ప్రేరేపించి కత్తెరతో అతని కలవా (హిందూవులు మణికట్టు కు కట్టుకునే పవిత్ర దారం)  కోసేశారు. హిందూ విద్యార్థి పూర్తిగా శాకాహారి అని తెలిసినా, ముస్లిం అబ్బాయిలు ఆ హిందూ అబ్బాయికి "మాంసం తింటే నీకు బలం వస్తుంది" మరియు "హలాల్ మాంసం  తింటే నీకు ఇంకా ఎక్కువ బలం వస్తుంది" అని చెప్పారని ఆ పిల్లాడి తండ్రి చెప్పాడు.

 ఆ ముస్లిం అబ్బాయిలను సస్పెండ్ చేసి, వారి తల్లిదండ్రులకు ఆ సమాచారం చేరవేసి,ఈ సమస్య ను పాఠశాల యాజమాన్యం పరిష్కరించింది.  అయితే, తన కుమారుడి సహవిద్యార్థులు తన బిడ్డను ఎలా మతం మార్చేందుకు ప్రయత్నించారనే దానిపై ఆ హిందూ తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. 

ఆ విద్యార్థి తండ్రి మాట్లాడుతూ "మేము ఇంట్లో ఏ ఇతర మతం గురించి మాట్లాడుకోము, మా స్వంత మతం గురించి కూడా మేము మాట్లాకోము, కానీ, తన కొడుకు  ఒక రోజు స్కూల్ నుండి ఇంటికి వచ్చినప్పుడు ప్రవర్తనలో తేడా కనిపించి వాడిని అడగబట్టి ఈ సంఘటనలన్నీ తెలిసాయి. లేక పోతే తెలిసి ఉండేవి కావు" అని చెప్పాడు.

తన కొడుకు పరిస్థితి గురించి తెలుసుకున్న తండ్రి క్లాస్ టీచర్‌కు ఈ సమాచారం ఇస్తే,  ఇది ఏం కాదు కేవలం పిల్లలు కొత్త విషయాలను అన్వేషిస్తున్నారని చెప్పింది.

అయితే, హిందూ విద్యార్థి పేరు మార్చుకోక పోతే  వాడితో స్నేహం మానుకుంటామని క్లాస్‌మేట్స్ బెదిరించడం గురించి ఆ తరువాత తెలుసుకున్న టీచర్ ఆ ముగ్గురు విద్యార్థులను సస్పెండ్ చేశారు. 

ఇది ఇతర పాఠశాలల్లో కూడా జరుగుతుందనే  ఆందోళనతో తల్లిదండ్రులు తమ ఈ అనుభవాల గురించి ఇతర కుటుంబాలు మరియు పొరుగువారితో చర్చించడం మొదలుపెట్టారు.

నా మాట:

ఈ సంఘటన లో నేను ముస్లిం పిల్లలను ఏ విధంగానూ తప్పు పట్టను. వారికి వారి మత విశ్వాసాలపై అంతటి గురి కుదిర్చిన తల్లిదండ్రులకు, వారి గురువులకు శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను. ఎందుకంటే
వారి మత విశ్వాసాలు, వాటి గొప్పతనం, తమ మతం మాత్రమే నిజమైన మతం అని మిగతా దేవుళ్లను ముఖ్యంగా విగ్రహారాధన చేసే వాళ్ళు ఎలా పాపం మూట గట్టుకుంటున్నారో, వారిని మన మతం లోకి తీసుకు వచ్చి వారికి ఎలా సహాయపడవచ్చో, రక్షించవచ్చో వారి పిల్లలకు చిన్నప్పటి నుండి నూరి పోస్తారు.

మరి మన హిందువులో....?

ఈ విధ్వంసకర ఆబ్రాహామిక్ మతాలు ఈ భూమి మీదకు రాక ముందు చెప్పిన "ఏకం సత్ విప్రా బహుదా వదంతి" వంటి వేద వాక్కులను వల్లె వేస్తూ, తరుము కుంటూ వస్తూన్న నేటి కాలపు తోడేళ్ళ మత మార్పిడి గుంపులకు వాటిని అన్వయం చేయడానికి ప్రయత్నిస్తూ వుంటారు.

ఈ విదేశీ సెక్యులరిజం మత్తులో పడి బాగా ఉదార వ్యాధి లక్షణాలు ఒంటబట్టించుకున్న హిందూ తల్లి తండ్రులు "సర్వ ధర్మ సమభావన" అంటే 'సమోసా-వడా-పావ్' తిన్నంత సులభం లాగా అది  తమ పిల్లలకు నూరి పోశారు తప్ప,  తమ దైన సంస్కృతి, సంప్రదాయాలు, తమ ధర్మం, దానిలో విశ్వాసాలు చెప్పడం నామోషి గా భావించి పిల్లలను ఆధునిక ఉదార విశాల భావజాలం తో పెంచాలి అని భావించడం వల్లే ఈ సమస్య.

ఈ మత మార్పిడి కి ప్రయత్నించిన పిల్లల వయసు జస్ట్ 7 సం. లు. అదీ వారు ఉంటున్న దేశం ఏమీ ఇస్లామిక్ దేశం కాదు. పూర్తిగా ఉదారవాద దేశం. అటువంటి వాతావరణం లో పెరిగిన పిల్లలే అలా వుంటున్నారు అంటే,  మన దేశంలో అందరూ వాళ్లే వుండే చిన్న చిన్న కాలనీలలో పెరుగుతూ మదరసాలలో చదివిన పిల్లల ఆలోచనలు ఎలా ఉంటాయో?  ఇలా చిన్న పిల్లలే కాదు, కాలేజీల్లోనూ, ఉద్యోగస్తుల లోనూ, ఆఖరుకు ఆటగాళ్లలో కూడా  మత మార్పిడి చేయాలి అనే ఇటువంటి ఛాందస వాదం కనిపిస్తుంది.

గత వారం భారత్ లో ఉత్తరప్రదేశ్ లో మొరాదాబాద్ లో లాక్మే బ్యూటీ మరియు మేక్ అప్ సెంటర్ లో జరిగిన ఇటువంటి సంఘటన గురించి వేరే పోస్ట్ పెడతాను.

లండన్ వార్త లింక్ :
ealing.nub.news/news/local-new…

....చాడా శాస్త్రి.....
 లక్ష్మీలలితా వాస్తు జ్యోతిషాలయం
శ్రీనివాససిద్ధాంతి9494550355

*ప్రమాదల నుంచి రక్షించే మహామంత్రం* 

మానవుడి ఆయురారోగ్యాన్ని, సౌభాగ్యాన్ని, దీర్ఘాయువును, శాంతిని, తృప్తిని ఇచ్చేది మహా మృత్యుంజయ మంత్రం. ఇది శుక్లయజుర్వేద మంత్రం. శైవులు దీనిని రుద్రాభిషేకంలో, వైష్ణవులు పాచరాత్ర దీక్షలో హోమ భస్మధారణ మంత్రంగా చెప్పుకుంటారు. ఈ మంత్రం పరమ పవిత్రమైనది, అతి ప్రాచుర్యమైనది. క్షీర సాగర మథనంలో జనించిన హాలాహలాన్ని పరమ శివుడు దిగమింగి మృత్యుంజయుడు అయ్యాడు. 

ఈ మంత్రం జపించిన వారు కూడా ఆ రుద్రుని ఆశీస్సులు పొంది మృత్యుంజయులగుదురు అని విశ్వాసం. ఇది ఒక విధమైన సంజీవని మంత్రం అని చెప్పుకోవచ్చు. ఆపదలు కలిగినపుడు, అనూహ్య సమస్యలు ఎదురైనప్పుడు కూడా దీనిని చదువుకోవచ్చును. ఈ మంత్రానికి సర్వ రోగాలను తగ్గించే శక్తి ఉంది. ఈ మృత్యుంజయ మంత్రాన్ని శ్రద్ధతో పఠిస్తే, అకాలమృత్యువులు, ప్రమాదాల నుంచి రక్షణ లభిస్తుంది. 

ఓం త్రయంబకం యజామహే 
సుగంధిం పుష్టి వర్ధనం 
ఉర్వారుక మివ బంధనాత్ 
మృత్యోర్ ముక్షీయ మామృతాత్ 

ఈ మంత్రాన్ని సాధారణంగా ముమ్మారు గాని, 9 మార్లు గాని, లేదా త్రిగుణమైన సంఖ్య లెక్కన దీనిని పారాయణం చేస్తారు.  ఈ మహా మృత్యుంజయ మంత్రాన్ని జపించడం వల్ల, దైవ ప్రకంపనలు మొదలై, మనలను ఆవరించి ఉన్న దుష్ట శక్తులను తరిమికొడతాయి. దాంతో మంత్రాన్ని పఠించినవారికి ఓ శక్తివంతమైన రక్షణ కవచం ఏర్పడుతుంది. ప్రమాదాల బారిన పడకుండా ఉండేందుకు, దురదృష్టాల నుంచి బయటపడేందుకు, ఈ మహా మృత్యుంజయ మంత్రాన్ని పఠిస్తుంటారు. 

ఈ మంత్రాన్ని త్ర్యంబక మంత్రమనడంలో కూడా ఎంతో గూఢార్థం ఉంది. శివతత్వంలో 3 కు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఆ స్వామి త్రినేత్రుడు, త్రిగుణాకారుడు, త్రి ఆయుధుడు, త్రిదళాలతో కూడిన బిల్వాలను 3 మూడు అడ్డురేఖలను నామంగా కలిగినవాడు, త్రిజన్మ పాప సంహారుడు, త్రిశూలధారుడు, త్రికాలధిపతి, త్రిలోకరక్షకుడు, మరి ఆస్వామి మంత్రాన్ని జపించితే మనకు రక్షణ లభిస్తుంది.ఈమహామృత్యుంజయ మంత్రాన్ని ప్రాత: కాలన్నే 108 సార్లు, ప్రదోషకాలంలో 108 సార్లు పఠిస్తే ఎటువంటి రోగాలు దరిచేరవు. ఈ మంత్రం గూఢార్థాన్ని తెలుసుకున్నప్పుడు మనకు అపరిమితానందం కలుగుతుంది.

ఓంకారంతో శ్రీకారం..
ఓం.. భగవంతుడు ప్రప్రథమంగా సూక్ష్మ జ్యోతిగా వెలుగొంది, అనంతరం చెవులకు వినబడేట్లుగా ఓ నాదం వినబడిందనీ, ఆ నాదమే ప్రణవ నాదమని, అదే ఓంకారమని చెప్పబడింది. ఇదొక శక్తి స్వరూప ధ్వని. అ-ఉ-మల సంగమమమే ఓంకారం. ఋగ్వేదం నుంచి ‘అ‘ కారం. యజుర్వేదం నుంచి ‘ఉ‘ కారం, సామవేదం నుంచి ‘మ‘ కారాలు జన్మించి, ఆ మూడింటి సంగమంతో ‘ ఓంకారం ‘ ఉద్భవించింది. ఓంకారానికి మూలం నాదం. ఆ నాదం భగవద్రూపం. ఓంకారం ప్రార్థనగా మనకు ఉపకరిస్తుంటుంది. అందుకే ప్రతి మంత్రం ఓంకారంతో ప్రారంభమై ఓంకారంతోనే ముగుస్తుంటుంది. నామం శబ్ద ప్రతీక. సర్వ శబ్దాలను తనలో నిమగ్నం చేసుకునే శబ్దాక్షరం ఓంకారం. కాబట్టి ప్రతి మంత్రానికి ఓంకారం ముందుండి, ఆ మంత్రానికి శుభాన్ని, మంగళాన్ని చేకూర్చుతుంది. అందుకే దేహద్వారాలైన ఇంద్రియాలన్నిటినీ నిగ్రహించి, మనస్సును స్థిరపరచుకుని, యోగధారణ బలంతో ప్రాణశక్తిని సహస్రారంలో నిలిపి, పరబ్రహ్మ స్వరూపమైన ప్రణవాన్ని ఉచ్ఛరిస్తూ పరమాత్మను స్మరించాలి.

త్ర్యంబకం
భూత, భవిష్యత్, వర్తమానాలకు శివుని 3వ నేత్రం ప్రతిరూపం. ఇంద్ర, అగ్ని, సామతత్వాలను కలిగి ఉన్నందున శివుడు త్రినేత్రుడనబడుతున్నాడు. త్ర్యంబక మంటే 3 నేత్రాలని అర్థం. శివుని భ్రూమధ్యంలో నున్న సూక్ష్మరూప నేత్రం మూడవ నేత్రం. ఇది అతీంద్రియ శక్తికి మహాపీఠం. దీనినే జ్యోతిర్మఠం అని అంటారు. శివుని మూడవ నేత్రానికి దాహకశక్తి, సంజీవన శక్తి రెండూ ఉన్నాయి. ఆ స్వామి తన ప్రసన్నవదనంతో, చల్లని చూపులతో మనలను సదా రక్షిస్తున్నాడు. అందుకే ఆ స్వామిని త్యంబకం అని కీర్తిస్తున్నాం.

యజామహే
యజామహే అంటే.. ద్యానిస్తున్నానని అర్థం. అంతేగా మరి. సర్వవేళలా మనకు రక్షగా ఉన్న స్వామిని మనస్ఫూర్తిగా ధ్యానించాలి. ఒకప్పుడు సముద్ర మథనం జరిగింది. అకస్మాత్తుగా సెగలు కక్కుతూ హాలాహలం పైకి వచ్చింది. ఆ విష్పు ప్రచండ జ్వాలలకు సమస్తలోకాలు తల్లడిల్లిపోయాయి. సర్వత్రా ఆర్తనాదాలు…హాహాకారాలు. సమస్తలోకజనం ఆ స్వామిని ధ్యానించగా, ఆ దృశ్యాన్ని చూసి క్రిగిపోయిన స్వాఇ, హాలాహలన్ని తన కంఠంలో నిలుపుకుని నీలకంఠుడై సమస్తలోకాలను కాపాడాడు. ఆ స్వామిని ప్రార్థిద్దాం.

సుగంధిం
సు-మంచిదైన, గంధ – సువాసన ద్రవ్యం. ఆ స్వామి మనపై మంచి సువాసనలతో కూడుకున్న గంధం నలు దిశలా పరిమళాలను వెదజల్లినట్టుగా మనల్ని తన భక్త జన వాత్సల్యమనే సుగంధాన్ని ఇచ్చి పెంచుతున్నాడు. ఆయనకు తన పిల్లలమైన మన పట్ల అలవికానంత ప్రేమ, వాత్సల్యం, ఆయన ఎంత భక్తజన ప్రియుడంటే, ఆ స్వామిని పూజించడానికి మందిరం కావాలని ఆడగడు. చెట్టుకింద, గట్టుమీద ఎక్కడైనా ఆయన లింగరూపాన్ని పెట్టుకుని పూజించవచ్చు. ఆయనకు నైవేద్యం కూడా అవసరం లేదు. ఒక బిల్వపత్రం, ఒక కొబ్బరికాయ, జలాభిషేకం చేసినా స్వామి సంతోషించి అనుగ్రహిస్తాడు.

పుష్టి వర్థనం
మనము పుష్టిగా ఉండేట్లు సాకుతున ఆ స్వామి అంతటా నెలకొని ఉన్

నాడు. సకలచరాచరా సృష్టి అంతా ఆయన ఆధీనంలోనే ఉంది. ఆయన మనల్ని కచ్చితంగా కాపాడుతాడు. ఇందుకు ఓ ఉదాహరణ గుహుని కథ. గుహుడనే వేటగాడు ఒక రోజున ఏదైనా జంతువును వేటాడాలని వెదికి వెదికి విసిగి పోయాడు. చీకటి పడుతున్నా అతని కంట ఒక జంతువు కూడ కనబడలేదు. ఈ లోపు ఎక్కడి నుంచో ఒక పులి వచ్చి అతడిని వెంబడించసాగింది. దాని బారి నుంచి తప్పుకోవడానికై వేటగాడు పరుగులు పెడుతూ ఒక చెట్టుపైకి ఎక్కాడు. అయినా ఆ పులి అతడిని వదల్లేదు. చెట్టుకిందే ఉన్న పులి గుహుడు ఎప్పుడు దిగి వస్తాడా అని కాపుకాయసాగింది. గుహుడు ఎక్కిన చెట్టు ఒక మారేడు చెట్టు. ఏమీ తోచక ఒక్కొక్క మారేడు దళాన్ని కిందికి తుంపి విసిరేయసాగాడు. ఆ దళాలు చెట్టు మొదట్లో నున్న శివలింగంపై పడసాగాయి. ఆరోజు శివరాత్రి కూడా. పులిభయంతో వేటగాడు, వేటగానిని తినాలన్న కాంక్షతో పులి, జాగరణ చేయడంతో, శంకరుడు రెండు జీవాలకు మోక్షాన్ని ప్రసాదించాడు. అందుకే సర్వ వ్యాపకుడైన ఆ స్వామి మనలను కంటికి రెప్పలా కాపాడుతుంటాడు.

ఉర్వారుక మివ బంధనాత్ 
దోసకాయ పక్వానికి వచ్చిన సమయంలో.. దానికి తొడిమ నుంచి విముక్తి లభించినట్లుగానే ఆ భగవానుడు మనలను అన్ని సమస్యల నుంచి గట్టెక్కిస్తాడు.

మృతోర్ముక్షీయ
సమస్యల నుంచి గట్టెక్కించే స్వామిని, మనలను మృత్యువు నుంచి కూడా కాపాడమని కోరుకుంటున్నాం. మృత్యువు అంటే భౌతికపరమైన మరణం మాత్రమేకాదు. ఆధ్యాత్మికపరంగా చేతనం లేకుండా ఉండటం కూడా మృత్యు సమానమే. భక్తి ప్రవత్తులు లేని జీవనం కూడా నిర్జీవమే. ప్రకృతిలో అందాన్ని ఆస్వాదించలేక అంతా వికారంగా ఉందనుకునేవారికి, అంతా వికారంగానే కనబడుతుంది. ప్రతి విషయానికి సందేహపడే సదేహప్రాణికి అంతా అనుమానమయంగానే ఉంటుంది. ఇటువంటి వన్నీ చావువంటివే. ఇలా మనలను అన్నిరకాల మరణాల నుంచి విముక్తులను చేసి, మన జీవితాలను సంతోషమయం చేయమని మనం భగవంతుడిని ప్రార్థిస్తున్నాం.

అమృతాత్ 
స్వామి అల్ప సంతోషి, సులభప్రసన్నుడు. అందుకే శ్రీనాథమహాకవి ఆయనను స్తుతించిన విధానం ఇలా ఉంది..
శివుని శిరమున కాసిన్ని నీళ్ళు జల్లి
పత్తిరిసుమంత నెవ్వడు పార వైచు
కామధేను వతడింట గాడి పసర
మల్ల సురశాఖి వానింట మల్లె చెట్టు
శివలింగంపై కాసిని నీళ్ళు చల్లి, మారేడు పత్రిని లింగంపై విసిరేసినప్పటికీ, ఆ భక్తుని ఇంట కామధేనువు ఇంటి పశువుగా మారుతుంది. కల్ప తరువు ఆ భక్తుని ఇంట మల్లెచెట్టుగా ఉంటుంది. అంతటి దయామయుడు పరమ శివుడు. మనకున్న చిరంజీవులలో ఆంజనేయస్వామి ఒకరని మనకు తెలుసు. అయితే ఆ ఆంజనేయునికి చిరంజీవత్వాన్ని ప్రసాదించింది శివుడే. 

మహిమాన్వితమైన మహామృత్యుంజయ మంత్రాన్ని జపించడం వల్ల, దైవిక ప్రకంపనలు మన చుట్టూ ఆవరించి, సమస్త దుష్ట శక్తులు మన దరికి చేరకుండా రక్షణ పొందుతాము. మృత్యుర్యస్వాప సేచనం అని శ్రుతులు చెబుతున్నాయి. అంటే మృత్యువు శివునికి ఊరగాయ వంటిదని అర్థం. మృత్యువును జయించాలనుకునే వ్యక్తులు పరమశివుని రక్షణకోరితే సరిపోతుందని ఋగ్వేదం అంటున్నది. తనను ఆశ్రయించేవారి యొక్క మృత్యువును నివారించేవాడు కాబట్టి శివుడు మృత్యుంజయుడు అని కూడా పిలువబడుతున్నాడు. ఎవరైతే పుణ్యభీతితో శివుని ఉపాసిస్తారో, వారికి ఆ జన్మలోనే కర్మసంచయాన్ని (ఆగామితో సహా) పటాపంచలు చేసే శక్తిని శివుడు ప్రసాదిస్తాడు.
జాతక,ముహూర్త విషయాలకు phone ద్వారా  సంప్రదించవచ్చును.  
*ద్విస్వర్ణ కంకణ సన్మానిత.*
*జ్యోతిషరత్న, member in international astrology federation. ..శ్రీనివాస సిద్ధాంతి*
*9494550355*

PlZ Forward the message
 *🌹శివానందలహరి - శ్రీ శంకర భగవత్పాద     విరచితము -63 🌹*

*మార్గావర్తితపాదుకా పశుపతేరంగస్య కూర్చాయతే*
*గండూషాంబునిషేచనం పురరిపోర్దివ్యాభిషేకాయతే ।*
*కించిద్భక్షితమాంసశేషకబలం నవ్యోపహారాయతే*
*భక్తిః కిం న కరోత్యహో వనచరో భక్తావతంసాయతే ॥63॥*

శంకరులు భక్తి ఎంత గొప్పదో‌ ఉపదేశిస్తున్నారు. ఈ‌ శ్లోకం భక్తకన్నప్ప యొక్క శివభక్తి విశిష్ఠతకు తార్కాణం.

దారులుతిరిగి అరిగిపోయిన చెప్పు పశుపతి శరీరం (శివలింగం) తుడుచు చీపురు అయినది. పుక్కిలినీటితో‌ తడపుట, త్రిపురాసురసంహారికి దివ్యాభిషేకం అయినది. కొంచెం తిని ఎంగిలిచేసిన మాంసపుముక్క, నైవేద్యము అయినది. ఆటవికుడు భక్తశ్రేష్ఠుడయినాడు. ఓహో! భక్తి చేయలేనిది ఏమున్నది ?

*వివరణ*
ఇది భక్త కన్నప్ప సూటి భక్తిని తెలిపే శ్లోకం. సామాన్యoగా పూజలు , పునస్కారాలు , అర్చనలూ , ఆరాధనలూ , ఉన్న చోట--మడి ఆచారాల వంటి నియమ నిబంధనలు చాలా వుంటాయి. ఏం చేసినా, ఎలా చేసినా తప్పు పట్టే వారు వుంటారు. కొందరు ఆ తప్పులకు విపరీతమైన ప్రాయశ్చిత్తాలను కూడా సూచించి పాటింపచేస్తారు. నిజమైన భక్తికి ఇటువంటి మడి ఆచారాలతోనూ, నియమనిబంధనలతోనూ ఏమీ సంబంధం లేదు. భక్తి కలిగినపుడు మనస్సు హృదయము ద్రవించి ఏం చేయిస్తే వాటిని సూటిగా చేసి సంతృప్తిని ఆనందాన్ని అనుభవించడమే దైవానుగ్రహం పొందటానికి, తరించడానికి మార్గం. ఈ విషయం ఎన్నిసార్లు చెప్పినా మనం పెట్టుకున్న నియమ నిబంధనలను మనం సాధారణంగా వదులుకోలేక 
భగవంతునికి దూరమౌతాము. కన్నప్ప కథ తెలిస్తే కానీ సందేహం 
తీరదని ఈ ఒక శ్లోకం ఆదిశంకరులు ఈ శివానంద లహరి లో కేటాయించారు.
పుణ్య క్షేత్రమైన కాళహస్తికి దగ్గరలో ఒక బోయల గూడెం వుండేది. ఆ గూడెం పేరు 'ఉడుమూరు'. శివభక్తి పరులైన దంపతికి ఒక కొడుకు పుట్టాడు. అతనికి వాళ్ళు పెట్టుకున్న పేరు 'తిన్నడు' అనే పేరు కూడా సార్ధకమే అయింది. తల్లిదండ్రుల నుండి శివభక్తి తిన్ననికి వారసత్వంగా వచ్చింది.
ఒకనాడు అడవికి వేటకు వెళ్ళినపుడు ఒక అడవి పంది అరుస్తూ ఒక పొదలో దూరి కనబడకుండా అంతర్ధానమైంది. తిన్నడు దానికోసం వెళ్ళి వెదుకుతూ వుంటే ఆ పొదల మధ్య శివలింగం ఒకటి కనబడింది.    ఆ శివలింగంలో సాక్షాత్తు శివుణ్ణే చూసాడు తిన్నడు. ఇద్దరుంటే ఎలా మనం మాట్లాడుకుంటామో అలాగే ముఖాముఖీగా ఆ శివలింగం తో ఏవేవో మాట్లాడుతూ కబుర్లు చెప్పేవాడు.పూజ చేసేవాడు.శివునికి ఆకలి వేస్తోందని ఆకులను పొట్లం లాగా చుట్టి రుచి చూసిన మాంసపు ముక్కలను దాంట్లో వుంచి - ఒక చేత్తో పట్టుకుని , రెండో చేతిలో అడవి పూలు , బిల్వ దళాలు పట్టుకుని , నోటి నిండా నీళ్ళు పుక్కిటపట్టి తిన్నగా శివలింగం దగ్గరకు వచ్చి చేతుల్లోని ద్రవ్యాలు క్రింద పెట్టి , తన కాలి చెప్పుతో లింగంపై పడిన ఎండుటాకులు, 
పండుటాకులను చీపురుతో ఊడ్చినట్లు తుడిచేవాడు. తన పుక్కిట్లో వున్న నీటిని లింగంపై ఉమ్మి కడిగేవాడు. దళాలను పూలను పైన వేసి పూజించేవాడు. దొప్పలోని 
రుచి చూసిన మాంసాన్ని నైవేద్యం పెట్టేవాడు.
మనం కనక ఈ పూజ చూస్తే రెండు చేతివ్రేళ్ళుతో చెక్కిళ్ళు
నొక్కుకునేవాళ్ళం. శివుడు మాత్రం ఇవేమీ పట్టించుకోలేదు. ఒక రోజు శివుడు తిన్నడిని పరీక్షిద్దామని తన ఒక కుడి కంటినుండి నీరు కార్చాడు. తిన్నడు ఆ కన్ను ఆ విధంగా ఉండడం చూడలేక వెంటనే అడవిలోని కొన్ని చెట్ల ఆకుల రసాలు తెచ్చి వైద్యం చేసాడు. అయినా నీరు రావటం తగ్గలేదు. పైగా ఈసారి రక్తం కూడా రావడం ప్రారంభించింది.ఆ రక్తాన్ని ఆపటానికి ఎన్నో ప్రయత్నాలు చేసాడు.అయినా రక్తం కారటం ఆగలేదు. అప్పుడు శివుని ఆ కంటిని ఊడపేరికి తన కన్నునొకదానిని అక్కడ పెట్టాడు.
ఇంతలో రెండవ కంటినుండి నీరు కారడం రక్తం కారడం ప్రారంభమైనది.ఈసారి కూడా ఇదివరకులానే శివుని రెండవ కంటిని ఊడబెరికాడు. తన రెండవ కంటిని బాణంతో తీయబోతూ ఈ కన్ను కూడా తనకు లేకపోతే గుడ్డివాడై శివుడు ఎక్కడ ఉన్నాడో ఆశివునికి కళ్ళు ఎక్కడ ఉన్నాయో తెలియక తికమక పడాల్సివస్తుందని రక్తంకారే శివుని రెండవ కంటివద్ద తన కాలి బొటనవేలిని గుర్తుగా ఉంచి తన రెండవకంటిని తీసి శివునకు పెట్టడానికి ఉద్యుక్తుడైనాడు. అప్పుడు శివుడు వెనువెంటనే ప్రత్యక్షమై నాకు కన్ను నీ కన్నును అప్పగించి రక్షించిన తిన్నడివి .. ఈ రోజునుండి నీవు కన్నప్పగా ఖ్యాతి వహిస్తావు. నీవు తినకుండా నాకు నైవేద్యం పెడితే నేను తింటానా అని చెప్పి నైవేద్యం ఆరగించకుండానే అంతర్ధానమైనాడు. ఆ శివుడే కాళహస్తీశ్వరుడు.అప్పటినుండి ముందు కన్నప్పకు నైవేద్యం పెట్టి తరువాతనే కాళహస్తీశ్వరునకు నైవేద్యం పెట్టే ఆచారం ఇప్పటికీ కొనసాగుతుంది.
   ముక్కంటినే ముగ్ధుడను చేసిన ఆ మూఢభక్తి ఎంతటిదో ఆలోచించండి.ఒకరి భక్తిని పూజను మరొకరు విమర్శించుకోకండి.ఎవరికి తోచిన రీతిన వారిని అర్చించుకోనివ్వండి.భక్తి ప్రధానం కాని తంతు, తతంగం , మంత్రం, తంత్రం కాదు ముఖ్యం అని ఈ శ్లోకం తెలియచేస్తుంది.

*🕉️ ఓం నమఃశివాయ 🕉️*

****కొందరికి తెలియని కొన్ని ముఖ్యమైన విషయాలు.

 🙏☘️🙏☘️🙏
కొందరికి తెలియని కొన్ని ముఖ్యమైన విషయాలు.
🌹☘️🌼🌷🌻
పూజ :-పూర్వజన్మవాసనలను నశింపచేసేది. జన్మ మృత్యువులను లేకుండా చేసేది. సంపూర్ణ ఫలాన్నిచ్చేది.

అర్చన:- అభీష్ట ఫలాన్నిచ్చేది. చతుర్విధ పురుషార్థ ఫలానికి ఆశ్రయ మైనది, దేవతలను సంతోషపెట్టేది.

జపం:- అనేక జన్మలలో చేసిన పాపాన్ని పోగొట్టేది, పరదేవతను సాక్షాత్కరింప చేసేది జపం. ఇది జివుణ్ణి , దేవుణ్ణి చేస్తుంది.

స్తోత్రం:- నెమ్మది నెమ్మదిగా మనస్సుకి ఆనందాన్ని కలిగించేది, సాధకుని తరింపజేసేది స్తోత్రం.

ధ్యానం:- ఇంద్రియ సంతాపాన్ని మనస్సుతో నియమింప చేసేది.

దీక్ష:- దివ్యభావాలను కల్గించేది. పాపాలను కడిగివేసేది.సంసార బంధాల నుండి విముక్తిని కల్గించేది దీక్ష.

అభిషేకం :- అభిషేకం చేస్తే , చేయిస్తే సకల శుభాలు కలుగు తాయి. అభిషేకం అహంకారాన్ని పోగొట్టి పరా తత్వాన్ని అందిస్తుంది.

మంత్రం:- తత్త్వం పై మననం చేయడం వల్ల భయాల నుండి రక్షించేది మంత్రం. అఖండ శక్తి ని ఇస్తుంది.

ఆసనం:- ఆత్మసిద్ధి కల్గించేది, రోగాలను పోగొట్టేది, క్రొత్తసిద్ధిని, లేదా నవసిద్ధులను కల్గించేది ఆసనం.

తర్పణం:- పరివారంతో కూడిన పరతత్త్వానికి క్రొత్త ఆనందాన్ని కల్గించేది.

గంధం:- గంధంలో  సర్వ దేవత కొలువై ఉన్నారు. మేము కూడా మీ పూజలో ఉండేలా వరం ఇవ్వు తల్లీ అని దేవతలంతో అమ్మవారిని కోరారు. 

అప్పుడు అమ్మవారు మీరు గంధంలో కొలువై ఉందురుగాక అని వరం ఇచ్చారు. అప్పటినుండి గంధానికి పూజలో ఉన్నత స్థానం లభించింది.

అక్షతలు:- కల్మషాలను పోగొట్టడం వల్ల తత్ పదార్ధంతో తదాత్మ్యాన్ని కల్గించేవి. పసుపు, కుంకుమ,నూకలు (విరిగిన బియ్యం) లేని మంచి బియ్యం కలిపి చేయాలి.

పుష్పం:.పుణ్యాన్ని వృద్ధిచేసి, పాపాన్ని పోగొట్టేది. మంచి బుద్ధిని ఇచ్చేది.అలాగే ముండ్లు కలిగిన పువ్వులు వాడితే కష్టాలు వస్తాయి.
మంచి సువాసన కలిగిన పువ్వులు వాడితే శుభం కలుగుతుంది.

(ఈమధ్య పుష్పాలను చించి రేకలను విడదీసి వాడుతున్నారు. అలా చేయవద్దు. కాగాతొడిమలను తప్పకుండా తుంచివేశాకే పుష్పాలను పూజలో వినియోగించాలి.

ధూపం: చెడువాసనలవల్ల వచ్చు అనేక దోషాలను పోగొట్టేది. పరమానందాన్ని ప్రసాదించేది. ధూపం ద్వారా చాలా మంచి జరుగుతుంది. ప్రేత , పిశాచాలు పారిపోతాయి.

దీపం:- సుదీర్ఘమైన అఙ్ఞానాన్ని పొగొట్టేది. అహంకారం లేకుండా చేసేది. పరతత్త్వాన్ని ప్రకాశింప చేసేది. ఈ దీపం జ్ఞానానికి సంకేతం. 
పూజగది.
🙏🙏🙏🙏🙏

****అసలు ధర్మం అంటే ఏమిటి? అధర్మం అంటే ఏమిటి?

 *అసలు ధర్మం అంటే ఏమిటి?*
********
*"ధారణా ధ్ధర్మ ఇత్యాహుః ధర్మో ధారయతే ప్రజాః!!"*

 *భావం:-*   
*"ఏది ఒక వ్యవస్థని విచ్ఛిన్నం కానీయకుండా ధరించి ఉంటుందో అదే ధర్మం. ధర్మమే ప్రజలని ఛిన్నాభిన్నం కానీయకుండా ధరించి కాపాడుతుంది. ఏది ధర్మమో, ఏది కాదో మనందరికీ చాలా స్పష్టంగా తెలుసు. తెలిసీ అధర్మం చేస్తూంటాం. ఎందుకు? దుర్యోధనుడు మనందరిలోనూ ఉన్నాడు కాబట్టి".*

*"జానామి ధర్మం న చ మే ప్రవృత్తిః!* 
*జానామి అధర్మం న చ మే నివృత్తిః!!"*

 *భావం:-* 
*"ధర్మమని తెలిసీ ఆచరించలేను. అధర్మమని తెలిసీ వదలలేను. అని దుర్యోధనుడు చెప్పాడు."*

 *"వ్యాసుడు ధర్మాన్ని ఇలా నిర్వచించాడు. ఈ ధర్మాన్ని అతిక్రమించడం దుష్కర్మే అవుతుంది."*

*"యదన్యైద్విహితం నేచ్చేతో ఆత్మనః కర్మ పురుషః!* 
*న తత్పరేషు కుర్వత ఏష ధర్మ స్సనాతనః!!"*

 *"భావం:-*  
*"ఇతరులు ఏది చేస్తే నీకు ఇష్టం కాదో అలాంటి పనిని ఇతరుల విషయంలో నువ్వు చేయద్దు. ఇదే సనాతన ధర్మం.*

*"మహాత్ములు,  ఏది పాపం? ఏది పుణ్యం? అన్నది ఎవరికి వారు నిర్ణయించుకోడానికి ఒకే 'లిట్మస్ టెస్ట్' ఇచ్చారు".*

*"అధర్మం అంటే ఏమిటి?"* 
*****
*"ధర్మానికి విరుద్ధమైనదంతా అధర్మమే. మనం చేసే అనేక దుష్కర్మలన్నీ అధర్మాలే.
 *"కర్మ బంధం"*


  *'మనిషిగా పుట్టిన ప్రతీవాడికీ అనేక ఋణాలున్నాయి. వాటి నించి స్వచ్ఛందంగా ఋణ విముక్తుడు అవడం ఎలా?” అన్న అంశం మీద మన సనాతన సాంప్రదాయం ఇలా చెపుతుంది."*

*దేవ ఋణం:-* 
*******
 *"ఈ జీవితాన్ని ప్రసాదించిన పరమేశ్వరుడిని నిరంతరం స్మరించడం ద్వారా, పూజ ద్వారా దేవ ఋణాన్ని తీర్చుకోవచ్చును".*

*ఋషి ఋణం:-* 
*******
*"మనకు ఋషులు సంస్కృతిని, విజ్ఞానాన్ని ప్రసాదించారు. వారి స్మరణతో ఆ ఋణ విముక్తి కలుగుతుంది."*

*పితృ ఋణం:-* 
*******
 *"ఈ శరీరానికి జన్మనిచ్చిన తల్లి తండ్రులు వంశ కర్తలు, వారి పేరు ప్రఖ్యాతులు ఇనుమడించేట్లుగా ప్రవర్తించడం ద్వారా, అలాగే వారికి పితృ తర్పణాలు వదలడం ద్వారా వారి ఋణం తీర్చుకోవచ్చును".*

*భూత ఋణం:-* 
****
 *"మన జీవన యాత్రలో కనబడే పశు, పక్షి, వృక్ష, క్రిమి కీటకాదుల పట్ల దయ కలిగి ఉండటం, వాటికి ఆహారాది వితరణ చేయడం ద్వారా భూతఋణం తీర్చుకోవచ్చును."*

*మనుష్య ఋణం:-* 
*******
 *"సమాజ సంక్షేమ కార్యక్రమాల్లో పాలు పంచుకుని దీనులకి తగిన సహాయం చేసి వారి దుఃఖాన్ని తొలగించడం ద్వారా మనుష్య ఋణాన్ని తీర్చుకోవచ్చును".*

 *"మనం ధర్మమైన కర్మాచరణ చేస్తే, అది కర్మ బంధం కాకపోగా, పాత కర్మలు తొలగి కర్మ బంధంలో చిక్కుకోం. పైగా ఆ చిక్కుల్లోంచి బయటపడతాము."*


****భగవంతుడు...!!!

 *భగవంతుడు...!!!*

*మన వేదాలు చెబుతున్నదేమిటంటే - భగవంతుని సాక్షాత్కారం కలిగి,  ఆత్మానుభూతిని పొందినవాడు సామాన్య జీవుడైనా దేవుడే అవుతాడు అని చెబుతున్నాయి!!... అది ఎలా???*

అసలు...!!...
భగవంతుడు ఉన్నాడా..
ఉంటే కనబడడే..
ఎప్పుడు కనబడతాడు..
ఏం చేస్తే కనబడతాడు..
ఇటువంటి ప్రశ్నల పరంపర మానవ జాతి పుట్టిన నాటి నుంచి కొనసాగుతూ వస్తోంది...

ఈ ప్రశ్నలకు సమాధానాలను వేదాలు సుందరంగా చెప్పాయి, వేద మంత్రద్రష్టలైన మహర్షులు వ్యాఖ్యానించి ఎన్నో గ్రంథాలు రాశారు. 
ప్రవక్తలు ఎన్నో ప్రవచించారు, అయినా మానవుల్లో కరడుగట్టిన అజ్ఞానం ఆ విషయాలను మరచిపోయేట్లు చేస్తోంది. 
ఏమీ తెలియని అసమర్థుల్లా మార్చివేస్తోంది...!!

పాలతో కడిగితే బొగ్గు తెల్లబడుతుందా...!!
అలాగే ఎంత ప్రక్షాళన చేసినా కరిగిపోకుండా ఘనీభవించిన అజ్ఞానానికి దాసుడైన మనిషికి జ్ఞానప్రబోధాలు అనుక్షణం అవసరమనే మాట యథార్థం.
భగవంతుణ్ని చూడటం అంటే తన గురించి తాను తెలుసుకోవడమే. 
దీనికి కొన్ని ప్రయత్నాలు అవసరమని మహర్షులు ప్రవచించారు. 
ఉన్నత విద్యల్లో ఆరితేరాలంటే ప్రాథమిక విద్యల్లో ముందుగా నిష్ణాతులు కావాలి...

అక్షరాలు రానివారికి అంతరిక్ష విజ్ఞానాన్ని బోధపరచగలమా... అలాంటిదే బ్రహ్మవిద్య కూడా. ‘బ్రహ్మం’ అంటే భగవంతుడు.

కనుక బ్రహ్మవిద్య అంటే భగవంతుణ్ని తెలిపే విద్య , ఈ విద్యను తెలుసుకోవడానికి నాలుగు దారులున్నాయని పెద్దలు చెప్పారు. అంటే...

ఒక ఇంటి చిరునామాను కనుక్కోవడానికి ముందు ఆ ఇంటికి చేరే దారులను కనుక్కోవడం అన్నమాట...

*మొదటి దారిలో వెళ్లడం అంటే...!!*
 భగవంతుడు ఒక్కడే నిత్యుడు, శాశ్వతంగా ఉండేవాడు అని తెలుసుకోవడం. 
అంతేకాదు… భగవంతుడికి భిన్నమైనదంతా అనిత్యం, అంటే అశాశ్వతం అనీ గ్రహించడం, నిత్యం అంటే ఎంత కాలం గడచినా చెక్కు చెదరకుండా ఉండటమే. 
భగవంతుడు చేసిన సృష్టి ఎప్పటికో ఒకప్పటికి ప్రళయంలోకి జారుకొని అంతరిస్తుంది...
కనుక సృష్టి అంతా అనిత్యమే, ఏది పుడుతుందో అది నశిస్తుంది, ఏది పుట్టదో అది నశించదు, అందుకే జీవకోటి నశిస్తుంది... భగవంతుడు నిత్యమై ఉంటాడు...

*రెండవ దారిలో వెళ్లడం అంటే...!!*
మనిషి అనుభవిస్తున్న భౌతిక సుఖాలకు సంబంధించిన సామగ్రి అంతా ఎప్పటికైనా నశించిపోయేదే అని తెలుసుకోవడం... యజ్ఞయాగాలు, తపస్సులు, దానాలు చేసి సంపాదించుకొన్న పుణ్యంతో స్వర్గానికి వెళ్లి పరలౌకిక సుఖాలను పొందినా అవీ ఒకనాటికి నశించిపోయేవే అని తెలుసుకోవడం. 
ఒక్క మాటలో చెప్పాలంటే.. ఇహలోకంలోనూ, పరలోకంలోనూ మనిషి పొందే సుఖాలు అశాశ్వతమైనవి అనే జ్ఞానం కలగడం...

*మూడవ దారిలో వెళ్లడం అంటే..!!* 
ఆకలి వేసినప్పుడు అన్నం కోసం, దాహం వేసినప్పుడు నీళ్ల కోసం ఎలా మనసు పరుగులు తీస్తుందో, అలాగే పరమార్థజ్ఞానాన్ని సంపాదించడం కోసం సద్బోధనలు వినడం, విన్నవాటిని మళ్లీ మళ్లీ గుర్తు చేసుకోవడం, అలాంటి విషయాలపై మనసును నిలపడం. పనికిరాని దృశ్యాలను చూడకుండా కళ్లను.. 
వ్యర్థ ప్రసంగాలు వినకుండా చెవులను.. అసభ్య సంభాషణలు పలుకకుండా నోటినీ నియంత్రించుకోవడం. 
చలికీ గాలికీ ఎండకూ తట్టుకోగలగడం, దూషణ భూషణలకు ఏ మాత్రం చలించకుండా స్థిరంగా నిలవడం. వికారాలన్నీ శరీర ధర్మాలేగానీ ఆత్మకు వాటితో సంబంధంలేదని తెలుసుకోవడం. 
గురువులనూ, పూజ్యులనూ సేవించి, వారి నుంచి జ్ఞానాన్ని పొందడం.*నాలుగవ దారిలో ప్రయాణించడం అంటే..!!*
అజ్ఞానం వలన కలిగే సాంసారిక బాధలను జ్ఞాన సాధన ద్వారా అధిగమించడం. 
అంటే.. మనిషికి అతని జీవితంలో కలిగే కష్టసుఖాలు క్షణికాలనవి అవి నిరంతరం వస్తూ పోతూ ఉంటాయే గానీ, స్థిరంగా ఉండవనీ చక్కగా గ్రహించగలగడం.

ఈ విధమైన జ్ఞానాన్ని కలిగి ఉన్నప్పుడు మనసు చలించకుండా ఉంటుంది...
అప్పుడు అన్నింటికీ అతీతమైన స్థితి లభిస్తుంది. 
అన్ని బంధాల నుంచి మనిషి విముక్తుడు అవుతాడు. 
అదే భగవంతుని సాక్షాత్కారం, అలాంటి అనుభూతిని పొందినవాడు సామాన్య జీవుడైనా దేవుడే అవుతాడు...

                 *_🍂శుభమస్తు🍂_*
        🙏సమస్త లోకా సుఖినోభవంతు🙏

" ఓం " ... తో అలసట మాయం. శాస్త్రీయంగా నిరూపించిన బాలిక.

 

Wednesday, August 7, 2024

ఆత్మ.. సర్వాంతర్యామి.

 🕉️🙏🕉️

*🕉️🙏ఆత్మ.. సర్వాంతర్యామి.🕉️🙏*

*🕉️🙏దాన్ని కేవలం జ్ఞాన చక్షువుతో చూడగలగడం తప్ప, ఇతరత్రాకాదు. ఆత్మ అంతరాలయం. అందులోని జీవుడు పరమాత్మను ఆహ్వానించి ప్రతిష్ఠించి, నిత్య సేవలతో ప్రేమ పూజారిగా ఆయనను ఆరాధించాలి.*🕉️🙏

 *🕉️🙏జ్ఞానమనే జ్యోతి వెలుగులో ఆయనను మనసారా వీక్షించాలి. ఉపాసించాలి. అభిషేకించాలి. ఆత్మ లేకపోతే ఇంద్రియాలు పని చేయడం మానేస్తాయి. మనసు ఆలోచించలేదు. అన్నింటికీ ఆధారం ఆత్మ. ఆత్మతత్వం బోధపడినవారు సర్వ దుఃఖాల నుండి విముక్తి పొంది ఆనందానుభవం పొందుతారు. అలాంటివారికి అలౌకికానందం కరతలామలకం అవుతుంది.*🕉️🙏

 *🕉️🙏ఆత్మ సనాతనం. అది శాశ్వతమైనది, సత్యమైనది, నిత్యమైనది.*🕉️🙏

 *🕉️🙏ఆత్మజ్ఞానమంటే.. ప్రజ్ఞ, ప్రకర్ష, అతిశయాలకు ఆలవాలమైన విజ్ఞానం కాదు. ఆత్మజ్ఞానం పొందడానికి ఆ భగవంతుడినే ఆలంబనగా చేసుకోవాలి.🕉️🙏*

 *🕉️🙏అవ్యక్తమైన పరమాత్మ మన ఆరాధన నిమిత్తం తనను తాను ఐదు విధాలుగా మార్చుకున్నాడని ఆగమ శాస్ర్తాలు చెబుతున్నాయి. అవి పరం, వ్యూహం, విభవం, అంతర్యామి, అర్చామూర్తులు.🕉️🙏*

 *🕉️🙏వీటిలో యోగసాధనతో, తపస్సుతో, భక్తితో సాధించగలిగేది అంతర్యామి రూపం.🕉️🙏*

 *🕉️🙏ప్రతీజీవి హృదయంలో పరమాత్మ కొలువై ఉన్నందువల్లనే దేహమే దేవాలయమని ఉపనిషత్తులు ఘోషిస్తున్నాయి.*🕉️🙏

 *🕉️🙏ఆత్మజ్ఞానం పొందడానికి, మోక్షప్రాప్తికి గృహస్థాశ్రమం ఆటంకం కాదు. సంసారంలో ఉంటూనే ధర్మబద్ధమైన కామ ప్రవృత్తితో జీవించేవాడు ఆత్మజ్ఞానిగా గుర్తింపు పొందుతాడని, ఏది ధర్మ విరుద్ధమో ఏది ధర్మ బద్ధమో గ్రహిస్తే, ధర్మ బద్ధమైన కామం మూడో పురుషార్థంగా గౌరవం పొందుతుందని, ధర్మ విరుద్ధమైన కామం అరిషడ్వర్గంలో చేరుతుందని బోధపడుతుంది.*🕉️🙏
 
 *🕉️🙏హృదయ శుద్ధి లేకుండా, విషయ లోలత్వం విడనాకుండా, ఐహిక వాంఛలపట్ల ఆపేక్ష చంపుకోకుండా, ఇంద్రియ నిగ్రహాన్ని పాటించకుండా, ఆత్మజ్ఞానం లేకుండా దైవాన్ని ధ్యానించడం వల్ల ఒనగూడే ప్రయోజనం శూన్యం.*🕉️🙏

 *🕉️🙏పరమాత్మనామాన్ని జపించే సాధకులకు మనోనైర్మల్యం లేకపోతే ఎలాంటి ఫలితమూ ఉండదు. అలాంటి వారికి బ్రహ్మానూభూతికలగడం అసాధ్యం. వారి ఆత్మోపాసన.. భాండ శుద్ధిలేని పాత్రలో వండిన పదార్థం వలె వ్యర్థం.*🕉️🙏
 
 *🕉️🙏యజుర్వేదంలోని బృహదారణ్యక ఉపనిషత్తులో ‘‘అహం బ్రహ్మస్మి’’ అనే వాక్యం ఉంది. అనగా, నేనే పరబ్రహ్మను’’ అని దాని అర్థం. బ్రహ్మమనేది ఎక్కడో కానరాని లోకాల్లో లేదని.. అది ఎంత దూరమో అంత దగ్గర అని, మనలోనే ఉన్నదని తెలిపే వేదసారమీ ఒక్క వాక్యం.*🕉️🙏

 *🕉️🙏నేను నేను కాను. సర్వాత్ముడను. నిత్యముక్తుడను. పురుషార్థాలు నావి కావు. నేను చిదానంద స్వరూపుడైన పరబ్రహ్మననే అమృత తుల్యమైన భావన అది. ఆ భావనతో పరమాత్మనర్చిస్తే ప్రతి మనిషీ పరబహ్మమే ఔతాడు.*🕉️🙏

🕉️🙏🕉️

శ్రీ రమణీయం - 39🌹 👌మనసుకు సద్గుణాలు అలవర్చటమే సాధన 👌

 [8/7, 05:11] +91 73963 92086: 🌹 శ్రీ రమణీయం - 39🌹

👌మనసుకు సద్గుణాలు అలవర్చటమే సాధన 👌
✍️ శ్రీ గెంటేల వెంకటరమణ
నమో వేంకట రమణాయ, అద్వైత నిధయే నమః
✳️🌹🌹🌹🌹✳️🌻🌻🌻🌻✳️

39. మనసుకు సద్గుణాలు అలవర్చటమే సాధన

✳️ భగవంతుడు ప్రతిఒక్కరికీ తెల్ల వస్త్రంలాంటి స్వచ్ఛమైన మనసును ఇచ్చి పంపాడు. దానికి ఏరంగు అయినా అద్దుకోవచ్చు. మన మనసుకు దేన్నైనా అలవాటు చేయవచ్చు. చిన్న పిల్లలు నోట్లో వేలేసుకోవడం దగ్గర నుండి ప్రతీది వచ్చిన అలవాటేగానీ మనసు సహజ లక్షణం కాదు. సుఖ శాంతులతో జీవించాలంటే మనసుకు మంచి విషయాలలో శిక్షణ ఇవ్వాలి. విద్యార్థికి ఏ సబ్జెక్టు కష్టంగా ఉందో దాన్నే ఎక్కువసేపు చదివిస్తారు. అలాగే మనకు ఏ మంచి గుణాలు పాటించడం కష్టంగా ఉంటే దానిపై ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. రాత్రంతా స్నేహితులతో ముచ్చట్లు చెప్తే రాని విసుగు, నిద్ర - భజనలో కూర్చుంటే వస్తాయి. మనసుకు ఉన్న గుణాలేమిటో మనకు తెలిస్తే వాటిని మార్చుకోవడం సాధ్యమౌతుంది. అందుకే ముందుగా మనసును అర్థం చేసుకోకుండా ఆధ్యాత్మిక సాధన సాధ్యంకాదు♪.

✳️ *మనసును ఆవహించిన అవలక్షణాలను వదిలించటానికి భక్తి సులువైన మార్గం. మన అమ్మాయి మనకు వద్దన్నా గుర్తుకు వస్తుంది, కానీ దైవాన్ని ప్రత్యేకించి గుర్తుకు తెచ్చుకోవాల్సి వస్తుంది. నిరంతరం దైవాన్ని గుర్తుకు తెచ్చే తరుణోపాయం మంత్రం. ఆలోచనలు ముసురుకున్న మనసుకు మంత్రం ఒక దివ్యఔషధంగా పనిచేస్తుంది. అందరిదీ ఒకే మనసు. కానీ అనుభవాలే మార్పుగా ఉంటాయి. భూమి ఒక్కటే అయినా అందులో రకరకాల చెట్లు ఎలా పెరుగుతున్నాయో ఇదీ అంతే. మనం కోరుకున్న అనుభవాన్ని ఎప్పుడైనా మనసుపైకి తెచ్చుకోగలగటమే యోగం. అంటే మన ధ్యాస మన ఆధీనంలో ఉండటమే మనం సాధించాల్సిన విషయం. తిరుపతి పుణ్యక్షేత్రానికి వెళ్ళినా మనకి ఇష్టమైన వాళ్ళు వస్తున్నారని తెలిస్తే ధ్యాస వారిపైనే ఉంటుంది. ఊళ్ళో దొంగలు తిరుగుతున్నారని తెలిస్తే వద్దనుకున్నా భయం ఆవహిస్తూనే ఉంటుంది. ఇదేవిధంగా మనసు భగవత్ చింతనతో నిండి ఉండటాన్ని భక్తి అంటారు. భక్తి ప్రయత్నంతో వచ్చేదికాదు, శ్రద్ధతో అలవడుతుంది. భక్తికీ, లౌకిక విషయాలకు తేడా ఉంది. లౌకిక విషయాలపై ఇష్టం పెరిగేకొద్దీ దుఃఖం పెరుగుతుంది. భక్తి ఎంత పెరిగితే అంతగా శాంతి లభిస్తుంది♪.*

✳️ ఇరవై ఏళ్ళుగా పూజలు చేస్తున్నా ఫలం లేదని కొందరంటారు. అంటే 20 ఏళ్ళ అశ్రద్ధ అతనిలో ఉందని అర్థం. భగవంతుని అనుగ్రహానికి క్షణకాలం స్మరణ చాలు. పిల్లవాడికి జబ్బుచేస్తే ఏడుకొండల వాడికి ఒక్క క్షణకాలంపాటు మొక్కుకుంటాం. అక్కడ దేవుని రూపంతోగానీ, స్మరించే కాలంతోకానీ పని లేకుండానే కోర్కె నెరవేరుతుంది. పిల్లాడికి జబ్బుతగ్గిన తర్వాత మన కృతజ్ఞత కోసం తిరుపతి వెళ్తున్నాము కానీ ముందు తిరుపతి వచ్చి మొక్కుకుంటేనే కోర్కె తీరుస్తానని దేవుడు చెప్పటం లేదు. క్షణంలో అనుగ్రహించే దైవానికి గంటలకొద్దీ పూజ ఎందుకు అని అనుమానం వస్తుంది. ఒక రూపంపై మనసును నిలిపే శిక్షణకోసం విగ్రహం ఎలాఅవసరమైందో, మనకి ఓర్పు, సహనం, ఏకాగ్రత నేర్పేందుకు పూజ అవసరమైంది. అంటే క్షణకాలం వచ్చి పోతున్న భగవత్ స్మరణను ఎక్కువసేపు నిలిపేందుకే పూజ అవసరం. అంటే పూజ మన మనసును బాగు చేసుకునే సాధనమేగానీ దైవాన్ని ఆకట్టుకునే ప్రయత్నంకాదు♪.

✳️ మనసుకు బాగా అలవాటైన పనికి జ్ఞాపకంతోకూడా పనిలేదు. మన ఆచార వ్యవహారాలన్నీ మనసుకు మంచి విషయాలను అలవాటుగా మార్చటంకోసం ఏర్పడినవే. మనసుకు తెల్లవారుజామున లేవడం నేర్పితే అదే అలవాటుగా మారుతుంది. ప్రతిరోజు ఆలస్యంగా నిద్రమేల్కొంటే మనసు అలాగే అలవాటు పడుతుంది. విద్యార్థులను తెల్లవారుజామున లేస్తే మంచిదంటారు. అలా లేవమని చెప్పే మన ఆచారాలు మాత్రం వద్దని అంటారు. దైవం అంటే భక్తి ఉందని చెప్తూనే పూజలు, భజనలు ఎందుకని ఆక్షేపించేవారు పని దొంగలతో సమానం. తనముందుకు వచ్చిన పనిని శ్రద్ధగా చేయటంలో సంపూర్ణత ఉందికానీ తనకు ఇష్టమైనవే చేస్తాననటంలో అసంపూర్ణతే ఉంది♪.

✳️ ప్రతిపనిలో శ్రద్ధగా ఉండగలగటం మాత్రమే కాదు, అవసరమైతే ఆ పని నుండి అంత సులభంగా తప్పుకోగలగటమే నిజమైన యోగం. టి.వి. చూస్తున్నప్పుడు కరెంటు పోయినా, తెలిసినవారు వచ్చినా విసుగుపడతాం. మనకి ఇష్టమైన విషయాల్లో మాత్రమేకాదు, మనకి ఇష్టం లేకున్నా అవసరాన్ని బట్టి శ్రద్ధ పెట్టడం మనసుకు అలవాటుచేయాలి. మన మనసుకు ఏకాగ్రత అనే లక్షణం సహజంగానే ఉంది. కాకపోతే అది మనం కోరుకున్న విషయంలో నిలవక తనకి ఇష్టం ఏర్పడిన విషయంలో ఉంటుంది. విద్యార్థికి ఫలాన్ని ఇచ్చేది చదువు. కానీవాడి ఇష్టం సినిమాపై ఉండటంచేత ఏకాగ్రత చదువు కన్నా సినిమాపైనే ఎక్కువగా నిలుస్తుంది. మనకి ప్రయోజనం చేకూర్చే విషయంలో శ్రద్ధ నిలిపేందుకే పూజలు, ఆరాధనలు అవసరమౌతున్నాయి.

✳️ భగవంతుడు మనకు తెలియాలంటే ముందు మన మనసు అర్థం కావాలి. మనసుకున్న అవలక్షణాలను వదిలించి మంచి విషయాల్లో శిక్షణనివ్వాలి. భక్తి, భజన, యోగం ఏదైనా మనసుకు మంచి శిక్షణ కోసమే. భక్తిలో, పూజలో మనం ఆ విషయాన్ని మరచిపోకూడదు. మనసుకు శాంతినిచ్చే ఏకాంతాన్ని ఇప్పటినుండే అలవాటు చేసుకోవాలి. లేకపోతే అది వృద్ధాప్యంలో శాపంలాగా పరిణమిస్తుంది.
[8/7, 05:11] +91 73963 92086: మనకు ఇష్టమైన విషయాలనుండి మనసును దేవుని రూపం వైపుకు మళ్ళించాలి. ఆ తర్వాత ఆ రూపాన్ని కూడా వదిలి తనలో తాను ఉండటం మనసుకు అలవాటు చేయాలి. పిల్లల్ని పెంచినంత శ్రద్ధగా మనసును చూసుకోవాలి. మిలటరీలో చేరిన వారితో రోజు శరీర వ్యాయామం చేయిస్తారు. ఎందుకంటే ఏ సమయంలోనైనా శత్రువుల దాడిని ఎదుర్కొనేందుకు అది శిక్షణ. మనసు కూడా అంతే. మనం ఎలా శిక్షణనిస్తే అలా ఉంటుంది. ఎవరితోనైనా ఉండగలగడం, ఎవరినైనా వదిలి ఉండగలగడమే రాగద్వేషాలకు అతీతమైన స్థితి. ఆచరణలోకి తెచ్చుకోలేని మంచిమాటలు ఎంతకాలం విన్నా ఉపయోగంలేదు. కనుక మంచి విషయాలను శ్రద్ధగా వినటం, విన్న విషయాలను సదా మననం చేసుకోవడం, మననంలో ఉన్న విషయాలను తదేక భావన ద్వారా ఆచరణలోకి తెచ్చుకున్నప్పుడే మనం అనుసరించే భక్తి, భజన, పూజ, ధ్యానం, యోగం ఏదైనా మనని భగవంతుణ్ణి తెలుసుకునేలా చేస్తాయి. అందువలన సాధకులు ఆ దిశగా పయనించడం ద్వారా పరమ సత్యాన్ని చేరుకోవాలి♪.

🌈 సమాధి: 💐

✳️ శరీరాన్ని దాటి వెళ్ళటం సమాధి కాదు. శరీర భావనను దాటటం సమాధి. ప్రాణ స్వరూపులమైన మనకు నిజానికి ఏదీ అవసరంలేదని, అవసరాలన్నీ దేహానివేనని అర్థం కావటమే దేహభావనను దాటటం అంటే. ఆ ప్రాణ భావనలో కర్మలు ఆవిరైపోతాయి. స్పిరిట్ సీసా మూతతీస్తే ఎలా ఆవిరై పోతుందో అలా మనకర్మలు ఆత్మభావనలో ఆవిరైపోతాయి. అందుకే ఆత్మను స్పిరిట్ అంటారు. ఆధ్యాత్మికత అంటే స్పిరిట్ లోని రిచ్యుయల్ కనుకనే అది స్పిరిచ్యుయల్ అయింది. మనసు నామజపంలో లీనమైనప్పుడు ఆ మంత్రం మనం చదవడం లేదని, కేవలం అది మనకు వినపడుతుందని తెలుస్తుంది. ఆ తర్వాత అది వినపడటం కూడా కేవలం కలలోలాగా భావనేకానీ సత్యంకాదని తెలుస్తుంది. మనలో శబ్దంలేని వినికిడి, రూపమేలేని దృశ్యం జరుగుతున్నాయని సాధనలో దశలవారీగా అనుభవంలోకి వస్తుంది. సత్యావలంబనమే సమాధి. అంటే ఎల్లప్పుడూ లోపలి చైతన్యంతో మనసు కలిసి ఉండటమే సమాధి. మనసును భక్తి ఆవహించటమే సమాధి. పరిపరి విధాలుగా వెళ్ళే మనసును దైవంపైకి ప్రయత్నపూర్వకంగా లగ్నంచేసే ప్రయత్నం సవికల్ప సమాధి. మనసులోని ఆలోచనలను తగ్గించేందుకు మనం చేసే నామజపం సవికల్ప సమాధి అవుతుంది. దైవచింతనలో దేహాన్ని, ప్రపంచాన్ని మరిచి ఉండటం నిర్వికల్ప సమాధి. ఏ చింతనా లేకుండా దేహాన్ని, ప్రపంచాన్ని మరిచిపోవడమే నిద్ర. నిరంతరం చైతన్య భావనతో ఉంటూనే ఈ ప్రపంచంలో జీవనం సాగించడం సహజ సమాధి. భక్తిలో మనసు పొందే తాదాత్మ్యతనే యోగంలో ఉర్ధ్వముఖమైన కుండలినిగా చెప్తారు. కుండలిని శక్తిని చుట్టుకొని ఉన్న పాముతో పోలుస్తారు. పాముతోకను కదిలించినా, తలను కదిలించినా అది బుసకొడుతుంది. అలాగే మనలోని చైతన్య స్రవంతి శరీరమంతా ఒకే విధంగా వ్యాపించి ఉంది. మన శరీరమంతా వ్యాపించి ఉన్న మనసునే యోగంలో కుండలిని అన్నారు. మనసుని తెలుసుకోవడమే సాధనలోని ప్రధాన అంశం.

🙏 సర్వే జనాః సుఖినోభవంతు
🚩 హిందువునని గర్వించు
🚩 హిందువుగా జీవించు

సేకరణ:
✳️🌹🌹🌹🌹✳️🌻🌻🌻🌻✳️
 *శ్రీ గురుభ్యోనమః*

      భగవాన్ తో  ఒక  భక్తుడు ..  నేను  ఏదో  సాధన  చేసుకుంటున్నాను,  మీ దయ  కూడా  నాకు  కావాలి  అని  అడిగాడు.  దానికి  భగవాన్ ..  దయ  నువ్వు  అడిగితే  ఇచ్చినట్టు,  నువ్వు  అడగకపోతే  ఇవ్వనట్టా  అన్నారు.  *ఏ జ్ఞాని  దయ  లేకుండా  ఉండడు.  మీరు  అడగలేదని  జ్ఞాని  దయ  ఇవ్వకుండా  ఉండడు. 

మీ పిల్లలు  ఆడుకుంటున్నారనుకోండి ..  వాళ్ళు  మరిచిపోయినా,  టైమ్ కి  మీరు  ఆటలు  మానిపించి  అన్నం  పెడతారు.  అలాగే  భగవంతుడు  మన  తల్లి !  ఆయన  స్వరూపమే  దయ !  ఆయన  ఇవ్వకుండా  ఎలా  ఉంటాడు ? 

కృష్ణా ..  కృష్ణా ..
రామా .. రామా ..
శివా ..  శివా ..
రమణా .. రమణా ..

ఇలా  ఏదైనా  నామం  చేసుకుంటున్నారు  అనుకోండి ..  మీకు  భక్తి  లేకపోయినా,  కాలక్షేపం  కోసం  చేసుకున్నా,  తెలియక  చేసుకున్నా  మీ లోపల  ఉన్న  అజ్ఞానానికి  నిప్పు  అంటుకుంటుంది.  భగవంతుడు  మీ అహంకారానికి  కోత  కోస్తాడు.  మీరు  నిప్పుమీద  తెలియక  చెయ్యి  వేసినా  అది  అంటుకుంటుంది.  అలాగే  మీరు  సరదాకోసం  అనుకున్నా  *భగవంతుని  నామం  మీ అజ్ఞానాన్ని  కాల్చేస్తుంది.  అట్టిది  నామం !*

      *గురువు  ఎప్పుడూ  శాంతిగానే  ఉంటాడు.*  అశాంతిగా  ఉండడు.  గురువు  అశాంతిగా  ఉంటే  నీకు  శాంతిని  ఏం పంచిపెడతాడు ?  పాపం  రెండు  రకాలుగా  వస్తుంది.  శరీరానికి  రోగం,  మనసుకి  బెంగ,  మనసుకి  అశాంతి.  అశాంతి  పాప  ఫలం !  రోగం  కూడా  పాప  ఫలం !  కొంతమందికి  అన్నీ  ఉంటాయి,  కానీ  అశాంతిగానే  ఉంటారు.  పూర్వ  జన్మలో  చేసిన  పాపం  అశాంతి  రూపంలో  వస్తుంది.  

      మీరు  బజార్లో  డబ్బు  పెట్టి  శాంతిని  కొనుక్కోలేరు,  డబ్బు  పెట్టి  మీరు  జ్ఞానాన్ని  కొనుక్కోలేరు,  డబ్బు  పెట్టి  మీరు  ధర్మాన్ని  కొనుక్కోలేరు,  డబ్బు  పెట్టి  మోక్షాన్ని  కొనుక్కోలేరు,  డబ్బు  పెట్టి  వస్తువులు  కొనుక్కోగలరు.  డబ్బు  పెట్టి  మీరు  బోగాన్ని  కొనుక్కోగలరు.  కానీ,  జ్ఞానాన్ని  కొనుక్కోలేరు.  

*శ్రీ నాన్నగారి  అనుగ్రహ  భాషణం -*
*మురమళ్ళ :*  2005 / 02 / 09 
                      
🪷🙏🏻🪷🙏🏻🪷
 *ఎదుటి వారిలో తప్పు ఒప్పులు ఎంచద్దు.*

*వాళ్ళు కూడా ఎంచడం మొదలుపెడితే నువ్వు తట్టుకోలేవు*.

*తప్పు చేయడం సహజం,దిద్దుకోవడం మార్పునకు నాంది.*

*వారి తప్పు దిద్దుకునే అవకాశం వార్కి ఇవ్వాలి*

*నువ్వు ఎంచడం మొదలుపెడితే,వాళ్ళు దిద్దుకోవడం మాని,నీ తప్పులు ఎంచుట ఆరంభిస్తారు.*

*ఎవరి తప్పు వాళ్ళానే దిద్దుకొనే  అవకాశం కల్పిద్దాం.*

*తప్పు చేయని వారు ఎవరు వుండరు అని గ్రహించు*

*మనుషులే తప్పులు చేస్తారు,మాను,మాకు తప్పు చేయవు.*

*పెద్ద తప్పు అయిన,చిన్న తప్పు అయిన పెద్ద మనస్సు చేస్కొని క్షమించడం అలవర్చుకో.*

✍✍మూర్తి's కలం...…..🚩
 తెల్లారే  తరలివచ్చి
కళ్ళారా తనను చూసి
ముదమారా తాకి చూచు
తెలి వెలుగుకై ఎదురు చూచు 
పువ్వు

గతమేమో ఎరుగదు
కలతంటే తెలియదు
కలలేవీ కనదు...కానీ
కళ కళగా విరియు పువ్వు.

చిన్ని పూలకెంత వరం
నిరంతరం నవ్వమని
ఉన్న నాలుగు క్షణాలు
నిర్మలంగా బ్రతికే పువ్వు.

తన అందం తానెరగదు
తన రూపు చూసుకోదు
తన కున్న సమయమంతా
తనివి తీరా మురియు పువ్వు.

రకరకాల రంగులతో
చుట్టూ ఉన్న పూలన్నీ
జట్టుగానే  ఉంటాయి
కొట్టుకునే గుణం లేని పువ్వు.

ఆహ్లాదం పంచడం
ఆనందం పొందడం
అందంగా బ్రతకడం
అంతమాత్రమే తెలిసిన పువ్వు.

స్వార్థమన్నదే లేక
ఈసు అసూయలు లేక
బ్రతకమని మనకు 
తెలియ చెప్పే చిన్ని పువ్వు

నవ్వుల పువ్వులు తెచ్చే
నవ్యమైన వేకువకు

🌸🌸సుప్రభాతం🌸🌸

సినిమాల్లో చూపిస్తున్నట్టు టైమ్ ట్రావెల్‌లో ఓసారి కాస్త వెనక్కి వెళ్తే ఎంత బాగుండు... ఎంత మంచి కాలం...

 సినిమాల్లో చూపిస్తున్నట్టు టైమ్ ట్రావెల్‌లో ఓసారి కాస్త వెనక్కి వెళ్తే ఎంత బాగుండు... ఎంత మంచి కాలం... 

బస్సుల్లేవు, ఆటోల్లేవు, లంచ్‌కు సపరేట్ బాక్సుల్లేవు... తల్లోతండ్రో దిగబెట్టడాలు, పికప్ చేయడాలు తెలియనే తెలియవు... అసలు యూనిఫారాలే తెలియవు... 

అసలు టెన్త్‌కు వచ్చేదాకా ఫీజు కట్టింది లేదు... అడిగినోళ్లే లేరు... తలుచుకుంటే నవ్వొస్తుంది... టెన్త్ వచ్చాక కదా మొదటిసారి పాయింట్ తొడిగింది.. అప్పటి దాక రెండుమూడు సేమ్ కలర్ మాషికలు, టాకాలు, వేసిన నిక్కర్లే కదా తొడిగింది ... మొదటిసారి సొంత చెప్పులు తొడిగినరోజు ఎంత ఆనందమో... 

దసరా వస్తే రెండు కొత్త అంగీలు... కుంటి సత్యం కుడితే దాదాపు అందరికీ ఒకే కొలతలు... అందరమూ ఒకే తరీఖ పోరగాళ్లం కదా... అందరికీ సూటయ్యేవి... 

అసలు పాస్ అయ్యావా..? ఫెయిల్ అయ్యావా అనే రంది లేదు... అసలు మార్కుల శాతాలు లెక్కలు తీసినవాళ్లే లేరు... ఫస్ట్ బెల్, ఒంటేలు బెల్ ( ఇంటర్వెల్), చుట్టీ బెల్... ఎక్కడ ఆడుతున్నమో, ఎటు తిరుగుతున్నమో అడిగినోళ్లే ఉండరు... ఆకలైతే ఇంటికి భద్రంగా వస్తమని తెలుసు కదా అమ్మకు... 

ట్యూషన్ వెళ్తే అదో అవమానం అప్పట్లో... నెమలీకల్ని పుస్తకాల నడుమ పెట్టుకుని రోజూ చూసుకోవాలి, కొద్దిగా పెరిగినట్టే ఉందిరోయ్ అని అందరికీ చూపించుకుని సంబరపడిపోవడం... 

లొట్టపీసు కట్టెలు, ఆనపకాయ బుర్రలు... కాదంటే దోస్తులే వెనుక నుంచి బావిలోకి నూకి మరీ ఈత నేర్పించారు... మునుగుతూ, తేలుతూ, నీళ్లు మింగుతుంటే వాళ్లే జుత్తు పట్టుకుని లాక్కొచ్చేవాళ్లు... ఒక్కసారి నీళ్లంటే భయం పోయాక ఈత ఎంత సుఖం..? 

సైకిల్ కూడా అంతే... కాంచీట్... బొంగు... సీటు... తరువాత ముగ్గురం చొప్పున ఎక్కాలె... గంటకు 1 రూపాయి చొప్పున ఇచ్చి ఆవుల సత్యనారాయణ దగ్గర కిరాయి సైకల్ తీసుకొని తొక్కిన రోజులు...

కొత్త ఏడాది వచ్చిందంటే... ఆటోమేటిక్ క్లాస్ జంప్... అదే లిస్టు... ఎవరైనా వాళ్ల పాత పుస్తకాల సెట్టు ఇస్తానంటే, అమ్మను అడిగి అయిదారు రూపాయలు ఇచ్చేది... మన సెట్టు అమ్మితే కొంత డబ్బు ఎలాగూ వస్తదిగా... 

కొత్త అట్టపుట్టలు వేసుకోవడం ఒక్క రోజు కష్టం... పేర్లు రాసుకునే స్టిక్కర్లు కొనుక్కోవాలె... సరిగ్గా అతికేవి కాదు, తుమ్మబంక పూయాల్సిందే... బట్ట బ్యాగు ఓసారి ఉతుక్కున్నమంటే రెండుమూడు నెలలు బేఫికర్... 

హెడ్ మాస్టర్ ఆనందం సర్,
PT  సర్  క్లాసులోకి వస్తున్నడంటే కారిపోయేది... క్లాస్ టీచర్ రోజుకోసారి కొట్టినా పెద్ద ఫరక్ అనిపించేది కాదు... చెవులు మెలితిప్పి, గోడకుర్చీ వేయించకపోతే లెక్కలు ఓ పట్టాన ఎక్కేవి కాదు... 

అసలు ఖర్చేముందని..? పాకెట్ మనీ అనే పేరైనా వింటే కదా... దీపావళికి అయ్య తెచ్చిన పటాకుల్లో పొట్లం జాగ్రత్తగా విప్పి, ఒక్కో తాటాకు బాంబ్ ఆగీ ఆగీ కాల్చినోళ్లమే కదా అందరమూ... 

బడి బయట పల్లీలు, గొట్టాలు, కారా పొట్లాలు అమ్మే ముసలామె ఎటుపోయింది..? మధ్యాహ్నం ఐదు పైసలకు సాదా ఐస్‌  పదిహేను పైసలకు సేమ్యా ఐస్ అమ్మిన బీక్య ఏమైపోయాడు..? 

జ్వరమొచ్చినా రామలింగయ్య గారి దగ్గర సూది వేపించిన సంబురమే ఎందుకంటే అమ్మ గిలాస నిండా చాయ్ పోసి, డబల్ రొట్టె కొనిచ్చేది... ఉన్నయ్, ఏడ్చిన దినాలూ ఉన్నయ్... 

ఒక్కసారి టైమ్ ట్రావెల్ చేయగలిగితే బాగుండు...

(ఇది ఫేస్‌బుక్‌లో కనిపించిన ఓ హిందీ పోస్టుకు తెలుగీకరణ, స్థానికీకరణ... ఇంకా మన జ్ఞాపకాలు కూడా కలిపి రాస్తే ఒడవదు, తెగదు...)

*ధర్మాచరణ:*

 *ధర్మాచరణ:*
                 

*సృష్టిలో కనిపించే లక్షల జీవరాశుల్లో మానవ జన్మ అత్యంత శ్రేష్టమైనదని శాస్త్రాలు చెబుతున్నాయి. ఆకలి, నిద్ర, సంతానోత్పత్తి ఇతర ప్రాణుల్లోనూ ఉన్నాయి. మరి మనిషి ప్రత్యేకత ఏమిటి?*

*ధర్మాన్ని ఆచరించే యోగ్యత మనిషికే ఉంది. ఏ ఇతర ప్రాణుల్లో ధర్మాన్ని ఆచ రించే అవకాశం లేనందువల్ల, అది మనిషికి దక్కిందని జ్ఞానులు చెబుతారు. ఆ స్థానాన్ని పొందిన మనిషి సరైన మార్గంలో ధర్మాన్ని ఆచరించకపోతే, మిగిలిన ప్రాణులకూ మనిషికి తేడా ఉండదు.* 

*మనిషికి మాట్లాడేందుకు నోరు, పూజించడానికి చేతులు, ఆలకించేందుకు చెవులు, ఆలయానికి వెళ్ళడానికి కాళ్లు భగవద్వాసనలు ఆఘ్రాణించే నాసిక, దైవ తీర్ధం-సేవించే జిహ్వ ఉన్నాయి.* 

*మిగిలిన ప్రాణులకు చెవులు ఉన్నాయి. కానీ... భగవంతుడి స్తుతులను ఆలకించాలని తెలియదు. కాళ్లు ఉన్నాయి కానీ గుడికి వెళ్ళాలని తెలియదు. పూజ చేసే చేతులు లేవు. నోరు ఉంది. కానీ భగవన్నామం చెయ్యా లని తెలియదు. అందుకే వాటిలో లేని ఆ  యోగ్యత మనిషిలో ఉంది. కాబట్టే-మానవ జన్మ అత్యున్నతమైనది.* 

*శాస్త్రోకమైన ధర్మాచరణ చేసేవారిని మహాత్ములు అంటారని శంకరులు తమ భాష్యంలో తెలిపారు.* 

*ధర్మం ఈ చరాచర జగత్తును అంతటినీ నడిపిస్తున్న దివ్యశక్తి, దానివల్లనే ఈ బ్రహ్మాండమంతా నిలబడుతోంది. ప్రకృతి ఎలా ప్రవర్తించాలి. ప్రాణికోటి ఎలా ప్రవర్తించాలో తెలియజేసేదే  ధర్మం.* 

*అది కాలానుగుణమైన మార్పులకు మారేది కాదు. దానికి కాల దోషం లేదు. దేని కారణంగా మనిషికి ఆధ్యాతికోన్నతి లభిస్తుందో అదే ధర్మం.* 

*"మనిషి కచ్చితంగా దాటాల్సిన భౌతిక దశలన్నీ క్షణభంగురాలే. ఈ లోకంలో అచంచలమైనది, స్థిరమైనది ధర్మం ఒక్కటే అన్నారు వివేకానంద.* 

*సత్కర్మల్లో ముఖ్యంగా దానం, ధ్యానం ప్రతినిత్యం శ్రద్ధగా చేసేవారికి మనో చైతన్యం కలిగించేది ధర్మం మాత్రమే. ప్రతివారూ తమ పనులు ధర్మబద్ధంగా ఉన్నాయా లేవా అని తరచి చూసుకోవాలి.*

*’ధర్మం సారమే ఈ జగత్తు!’ అన్నాడు గౌతను బుద్ధుడు. మనిషిని జీవింపజేసే..ధర్మాల్లో ముఖ్యమైనవి- నిగ్రహం, ప్రేమ, సంతృప్తి, త్యాగం, దహింపచేసేవి- అత్యాశ, ద్వేషం, పరదూషణ, పగ.*

*వ్యక్తిగత ధర్మాలు సమష్టి ధర్మాలకు విరుద్ధంగా ఉన్నప్పుడు అలాంటివాటిని త్యజించడమే అసలైన ధర్మం.*

*రామాయణంలో ధర్మం మూర్తీభవించిన శ్రీరాముడు, మహాభారతంలో ధర్మానికి ప్రతినిధి అయిన ధర్మరాజు, లోక ధర్మానికి కట్టుబడి భార్యను, కుమారుణ్ని, రాజ్యాన్ని వదిలి వెళ్ళిన గౌతమ బుద్ధుడు ధర్మ స్వరూపుల య్యారు. అనంతర కాలంలో రామకృష్ణ పరమహంస, వివేకానందుడు. అరవిందులు... ధర్మాచరణలో సఫలీకృతులైన సత్పురుషులు.*

*ధర్మరాజు యుద్ధంలో ‘అశ్వత్థామ హతః' అని చెప్పడం, యుద్ధంలో నియమ విరుద్ధంగా దుర్యోధనుని గదతో తొడలపై మోదడం, కర్ణుడు నేలపై ఉండగా సంహరించడం.. ధర్మ విరుద్ధాలు కావా అనే సందేహం కలుగుతుంది. ధర్మాన్ని ధర్మంతో, అధర్మాన్ని అధర్మంతో ఎదుర్కోవాలని భగవద్గీతలో శ్రీకృష్ణుడు తెలియజెప్పాడు.*

*మనిషి ఆధ్యాత్మిక కర్మలను ధర్మబద్ధంగా ఆచరించినప్పుడే తనను, సమాజాన్ని, ఇతర ప్రాణుల్ని, ప్రకృతిని, ప్రపంచాన్ని రక్షించగలుగుతాడు. ధర్మం అనేది లేకపోతే పై వాటికి రక్షణ లేదు.*

*ధర్మం అంటే పరస్పర రక్షణ. దాన్ని ఆచరించి, రక్షించే ఉత్తమ యోగ్యతను మనిషికి ప్రసాదించాడు భగవంతుడు, ధర్మాన్ని ఎవరు రక్షిస్తారో వారిని ధర్మం రక్షిస్తుంది. ధర్మో రక్షతి రక్షితః*

🙏హర హర మహాదేవ శంభో శంకర 🙏🧘‍♀️🧘‍♀️🧘‍♂️🧘‍♂️🔺🔺🔺

*****ఇంత అద్భుతమైన మాటలు విని గట్టుమీద పడండి | essence of life | Kanth’Risa

 ఇంత అద్భుతమైన మాటలు విని గట్టుమీద పడండి | essence of life | Kanth’Risa


YouTube link - https://youtu.be/MlALFknYcnc?si=7zEE1yNZtL1RRggd

****చెత్త ఏరివేసి మంచిని మాత్రమే ఉంచుకునే నిత్య సాధన. అంతరంగ శుభ్రత.తప్పక మీపై మీరు అదుపు సాధించగలరు.

 🌹గుడ్ మార్నింగ్ 🌹కదిలే ఆలోచనలను గమనిస్తూ - వాటితో మనం కదలకుండా - భావాలను కూడా ఆలోచనలతో మిళితమై కలయిసిపోయి ముందుకు పోనీయకుండా ఆపుతూ - జస్ట్ లోపల మనను మనం గమనించుకుంటూ ఉంటే - ఒకటి --- మనం అనవసరపు ఆలోచనలు - ఊహలు ఎన్ని చేస్తున్నామో తెలుస్తుంది. ఇవి అనవసరాలు అన్నప్పుడు - ఇవి ఇప్పుడు ఆలోచించ నక్కర్లేదు అని మనకు మనమే చెప్పుకుంటూ - అప్పుడు అవసరంకాని వాటిని ముందుకు సాగనివ్వకుండా ఆపవచ్చు. ఆలోచనలు - భావాలు మొత్తముగా మనసు కంట్రోల్ అనేది......... గమనించుకుంటూ - మనతో మనం ఇవి నాకు వద్దు అని అనవసరాలను చెప్పుకుంటూ -  ఇది ఒక సాధనలా చేస్తూ ఉంటే వస్తుంది.
దుఃఖము, సుఖము అన్ని భావ రూపాలే. సుఖాలు, మంచి ఇష్టాలు కావాలని కోరుకుంటూ - ప్రయత్నిస్తూ, మనకు మనం చెప్పుకుంటున్నాము.
ఇదే విధానములో కష్టాలు, బాధలు వ్యతిరేక ఆలోచనలు, భావాలు - లోపల పుట్టగానే వద్దని చెప్పుకుంటే - కొంత కాలానికి మనసు అదే నేర్చుకుంటుంది. ఇక్కడ అద్భుతాలు, మహిమలు ఏమి లేవు జరగవు. మనను మనమే తయారుచేసుకుంటున్నాము. కోరుకునేవి కొన్ని - వద్దనుకునేవి కొన్ని -  చెడులు కొన్ని - వీటిని సరైన విధముగా సరిచేసుకొని మొత్తము మంచిగా జీవించవచ్చు అని చెప్పేదే ఆధ్యాత్మిక, ఆత్మజ్ఞాన చదువు.ప్రయత్నించండి. ఇది చాలా తేలిక. నన్ను గమనించుకోవటము - అనవసరాలు, చెడులు గుర్తించి - నాతో నేను వద్దని చెప్పుకోవటమే. చెత్త ఏరివేసి మంచిని మాత్రమే ఉంచుకునే నిత్య సాధన. అంతరంగ శుభ్రత.తప్పక మీపై మీరు అదుపు సాధించగలరు.🌹god bless you.🌹

Tuesday, August 6, 2024

 *ఉడుపి హోటల్ ఎందుకంత పేరుగాంచాయో తెలుసా....*

ఇంట్లో మనం నలుగురికి లేదా 5గురికి వంట చేయగలం.అంతకంటే ఎక్కువ మందికి చేయటం కొంచెము కష్టమైన పని.మరి 50 లక్షల మందికి వంట చేయడం అంటే మామూలు విషయం కాదు. మహాభారతం లో కురుక్షేత్ర యుద్ధ సమయంలో50 లక్షల మంది పాల్గొన్నారు. వారికి వంట వండినవారు ఎవరు? ఆసక్తికరమైన ఈ విషయం తెలుసుకోండి.

మహాభారత యుద్ధంలో కౌరవుల పక్షాన కొందరు పాండవుల పక్షాన కొందరు ఇలా అందరూ కలిసి 50లక్షలకు పైగా కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొన్నారు. కానీ ఇంత జరుగుతున్నా ఇద్దరు రాజులు పాల్గొన లేదు.అందులో ఒకరు విదర్భ రాజైన రుక్మి,,రెండవది బలరాముడు.ఆ ఇద్దరు తప్ప అన్ని రాజ్యాలు పాల్గొన్నాయి.
 
  దక్షిణ భారతంలోని ఉడిపి రాజ్యం కురుక్షేత్ర యుద్ధానికి వచ్చింది.ఉడిపిరాజైన నరేషుడు
  సైన్యాన్ని తీసుకొని యుద్ధ ప్రాంతానికి వెళ్లినప్పుడు కౌరవులు తమ వైపు నిలబడాలని మరో వైపు పాండవులు తమవైపు నిలబడాలని కోరుతారు. 

అప్పుడు ఉడిపి రాజు తన తెలివితో ఎటూ వెళ్ళకుండా సలహా కోసం శ్రీకృష్ణ దగ్గరికి వెళ్తాడు.అందరూ యుద్ధం గురించే ఆలోచిస్తున్నారు మరి ఇన్ని లక్షల మందికి భోజనాలు గురించి ఏమైనా ఆలోచించారా?ఎవరు వండి పెడతారు? అని శ్రీకృష్ణుడిని అడుగుతాడు.
మీరన్నది నిజమే మరి మీ దగ్గర ఏదైనా ఆలోచన ఉందా అని నరేషుడుని శ్రీకృష్ణుడు అడుగుతాడు.

అప్పుడు నరేషుడు ఇప్పుడు జరుగుతున్న ఈ మహాయుద్ధం అన్నదమ్ముల మధ్య నడుస్తున్నది,
నాకు ఈ యుద్ధంలో పాల్గొనడం ఇష్టం లేదు.
 అందువల్ల నేను,నా సైన్యం ఇరువర్గాల యుద్ధంలో పాల్గొనము.వారందరికి భోజనం చేసి పెడతాము అని ఉడిపిరాజు  చెపుతాడు.
అప్పుడు శ్రీకృష్ణుడు రాజా మీ ఆలోచన చాలా అద్భుతమైనది,50 లక్షల మందికి భోజనం వండటం
 అంటే మామూలు మాటలు కాదు. ఇది మీ వల్లే సాధ్యమవుతుంది,అందరికీ భోజనాలు తయారుచేయమని చెపుతాడు.

50 లక్షల మందికి భోజనాలు వండాలంటే  
 భీముడు మరియు అతని సైన్యానికి మాత్రమే వీలవుతుంది కానీ ఈ సమయంలో పోరాడటం
 భీముడు కు ముఖ్యం.అందువల్ల భీముని యుద్ధక్షేత్రం వదిలి రాలేడు.అందువల్ల నువ్వొక్కడివే ఇంతమంది సైన్యానికి వంట చేయగల సమర్ధుడు అని వంట వండమని కోరతాడు శ్రీ కృష్ణుడు.

నరేషుడు తన సైన్యంతో కలిసి అక్కడ ఉన్న  సైన్యాలకు భోజనం తయారు చేస్తాడు నరేష్ ఎలా 
వండేవాడు అంటే.. సాయంత్రం వరకు తాను వండిన భోజనం ఒక్క మెతుకు కూడా మిగలకుండా,వృధాకాకుండా వండేవాడు.

రోజులు గడుస్తున్న కొద్దీ సైన్యం కూడా తగ్గిపోయ్యేది.
అయినా సరే వంట మాత్రం అందరికీ సరిపోయేలా 
వండేవాడు నరేశుడు.
ఇది చూసి అందరూ ఆశ్చర్యపోయోవారు.
 ఇది ఎలా సాధ్యం?అంత మంది చనిపోతున్నా చివరికి మిగిలిన వారికి మాత్రమే సరిపోయేలా ఎలా వంట చేస్తున్నారు,అది కూడా ఒక్క మెతుకు కూడా
 మిగలకుండా ఎలా వండుతున్నారు అని అందరూ ఆశ్చర్యానికి గురయ్యేవారు.
 అసలు నరేశునికి ఎలా తెలుస్తుంది?
 ఈ రోజు  ఇంతమంది మాత్రమే చనిపోతారని,మిగిలిన వారికి మాత్రమే భోజనం వండాలి అని?..

ఇలా18 రోజులు గడిచిపోయాయి.పాండవులు గెలిచారు.పట్టాభిషేకం జరుగుతుంది.అప్పుడు ధర్మరాజు ఉడిపి నరేషుడుని అడుగుతాడు.. మమ్మల్ని అందరూ తక్కువ సైన్యం ఉన్నా గెలిచామని పొగుడుతున్నారు.కానీ నేను మాత్రం నిన్ను మెచ్చుకోకుండా ఉండలేక పోతున్నాను అని అంటాడు. ఎందుకంటే 50 లక్షల మందికి సైన్యమునకు వంట చేయడం అంటే మాటలు కాదు అది కూడా ఒక మెతుకు కూడా మిగలకుండా వృధాకాకుండా వండడం అంటే మాటలు కాదు.ఇది మహా అద్భుతం ఇలా ఎలా చేశావు? అని అంటాడు.

అప్పుడు నరేషుడు నవ్వుతూ మీరు గెలిచారు కదా దాని యొక్క గొప్పతనం ఎవరికి ఇస్తారు అని అడిగాడు.
అప్పుడు యుధిష్టరుడు శ్రీకృష్ణుడే దీనికి మూలమని మా విజయం యొక్క గొప్పతనం మొత్తం శ్రీకృష్ణునికి చెందుతుంది అని చెప్తాడు.
 అప్పుడు నరేష్ మీరు గెలవడానికే కాదు, నేను ఇంతమందికి సరిపడా వంట వండడానికి కూడా శ్రీకృష్ణుడే కారణం.కాబట్టి ఈ గొప్పతనమంతా శ్రీకృష్ణుని కే చెందుతుంది అని చెప్తాడు.
  ఇది విని సభలో ఉన్నవారంతా ఆశ్చర్యానికి గురి అవుతారు.
  ఇది ఎలా సాధ్యం? శ్రీకృష్ణుడు ఎలా
  కారణం అని నరేషుడుని అడుగుతారు. 
అప్పుడునరేషుడు అసలు రహస్యాన్ని అందరి ముందు ఇలా చెప్తాడు...

శ్రీకృష్ణుడు ప్రతి రోజు రాత్రి పెసరకాయలు తినేవాడు.నేను లెక్క పెట్టి పెట్టే వాడిని.
శ్రీకృష్ణుడు తిన్న తర్వాత మళ్లీ పెసరకాయలను లెక్కపెట్టే వాడిని...
 శ్రీ కృష్ణుడు ఎన్ని కాయలుఅయితే తింటాడో దానికి వెయ్యిరెట్లు సైన్యం చనిపోయేవారు.. ఆంటే
 శ్రీకృష్ణుడు 50 పెసరకాయలు తింటే దానికి వెయ్యి రెట్లు అంటే 50 వేల మంది సైనికులు మరుసటి రోజు యుద్ధంలో చనిపోయేవారు.
  దీనిని బట్టి నేను మిగతా వారికి భోజనం వండే వాడిని అని చెప్పాడు.
  ఈ కారణం వల్ల ఏ రోజు కూడా భోజనం వృధా కాకుండా వండే వాడిని అని చెప్పాడు.
  ఇది విని ఆ సభలోని వారందరూ కృష్ణలీలకు ముగ్ధులు అవుతారు.
ఈ కథ మహాభారత కథలలో ఒక అరుదైన కథ. కర్ణాటకలోని ఉడిపి జిల్లాలోని కృష్ణ మందిరంలో ఈ కథ ఇప్పటికీ వినిపిస్తూ ఉంటారు.
"హరిసర్వోత్తమ"
"వాయు ఉత్తమ*"
🕉️🕉️🕉️🕉️🕉️🕉️
 తిరుపతి తిరుమల ఆలయ *ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు వేంకటేశ్వరుని  విగ్రహం అసలు రహస్యాన్ని వెల్లడించారు*  రోజూ దేవతను తాకి పూజించే వ్యక్తిగా, అసలు విగ్రహాన్ని వీడియో లేదా ఫోటో తీయడానికి ఇప్పటివరకు ఎవరికీ అనుమతి లేదని ఆయన పేర్కొన్నారు.  అతని ప్రకారం, ఈ రోజు వరకు ఎక్కడా విగ్రహం యొక్క నిజమైన ఫోటో లేదా వీడియో అందుబాటులో లేదు.  సోషల్ మీడియాలో (ఫేస్‌బుక్, యూట్యూబ్, వాట్సాప్ వీడియోలు) మనం చూసేవన్నీ నకిలీవేనని ఆయన పేర్కొన్నారు.  విగ్రహాన్ని పోలిన వైరల్ వీడియోలు మరియు ఫోటోలు కేవలం సినిమా సెట్లు మరియు తప్పుడు సమాచారం అని అతను వివరించాడు.

 రమణ దీక్షితులు ప్రకారం, విగ్రహానికి జుట్టు ఉంది, మానవుడిలా చెమటలు, మృదువైన పాదాలు ఉన్నాయి, మరియు సముద్రపు అలల శబ్దం హృదయ ప్రాంతంలో వినిపిస్తుంది.  దేవతకు అర్పించే పువ్వులు ఆ ప్రాంతంలోని ఒక నిర్దిష్ట తోట నుండి ప్రత్యేకంగా ఉంటాయి.

 ఆలయ ఆచారాలు, ఆచారాల ప్రకారం రమణ దీక్షితులు తన 19వ ఏట తొలిసారిగా విగ్రహాన్ని తాకినప్పుడు భయపడ్డారు.  ఆయన పాదాలను తాకి ముఖం చూసేసరికి ఆయనకు పార్వతిలాగా వేంకటేశ్వర స్వామి దర్శనమిచ్చారు.  ఈ విగ్రహం సరిగ్గా 9.5 అడుగుల ఎత్తు, నిత్య సౌమ్యమైన చిరునవ్వుతో, పెద్ద కళ్లతో ఉంటుందని చెప్పారు.  ఆయనతో సహా కొంతమంది అర్చకులకు మాత్రమే విగ్రహం వెనుక వెళ్లడం విశేషం.  అతని ప్రకారం, విగ్రహం వెనుక నుండి మరింత అద్భుతంగా కనిపిస్తుంది, భుజాల వరకు వెంట్రుకలు మరియు రాతిలో చెక్కబడిన క్లిష్టమైన కర్ల్స్.  లక్ష్మీదేవి అలంకరించిన విశాలమైన ఛాతీతో నడుము దాదాపు 26 అంగుళాలు ఉంటుందని అంచనా.  విగ్రహానికి మనుషుల మాదిరిగానే గోర్లు మరియు అరచేతి గీతలు ఉన్నాయి.  ఈ స్పష్టత ఏమిటంటే, విగ్రహం చెక్కబడలేదు, కానీ రాతి బొమ్మగా నిలబడి ఉన్న దేవత అని నమ్ముతారు.  ఆగమ శాస్త్రం ప్రకారం, ఈ రాయిని సాలిగ్రామ శిల అని పిలుస్తారు.  బాహ్య ఉష్ణోగ్రతతో సంబంధం లేకుండా, విగ్రహం 40-45 డిగ్రీల సెల్సియస్ వద్ద ఉంటుంది.  వస్త్రాలు మరియు నగలు, తీసివేసినప్పుడు, కొద్దిగా వెచ్చగా ఉంటాయి.

 అందువల్ల, ప్రతి శుక్రవారం, రోజువారీ ఆచారాలతో పాటు, ఆవు పాలతో కూడిన ప్రత్యేక ఆచారాలను దేవతపై నిర్వహిస్తారు.  విగ్రహానికి ప్రత్యేక సహజ సువాసనలు వర్తింపజేస్తారు మరియు తిలకం సివెట్ పిల్లుల నుండి పొందిన కస్తూరిని ఉపయోగించి తయారు చేస్తారు.  16 తులాల బరువైన స్వచ్ఛమైన కర్పూరాన్ని రుబ్బి తిలకం తయారు చేసి, కళ్లకు పూసి, మధ్యలో ఎర్రటి గుర్తును ఉంచుతారు.  ఆ తర్వాత విగ్రహాన్ని వస్త్రాలు, ఆభరణాలతో అలంకరిస్తారు.  మరొక ప్రత్యేకత ఏమిటంటే, మనం దేవత యొక్క సంగ్రహావలోకనం పొందినప్పటికీ, కొన్ని సెకన్ల తర్వాత ఆ చిత్రం మన జ్ఞాపకశక్తి నుండి మాయమైపోతుంది.  ఇది దేవత యొక్క విష్ణు మాయగా సూచించబడుతుంది.  ఎంత సేపు చూసినా ప్రతి భక్తుని హృదయంలో ఇంకా చూడాలనే కోరిక ఉంటుంది.

 భక్తులకు ఆనంద నిలయం నుండి మాత్రమే దర్శనం లభిస్తుంది మరియు గంటల తరబడి చూసినా వారి మనసులో ఆ రూపం నిలిచి ఉండదు.  గొప్ప ఋషులు మాత్రమే ఈ రూపాన్ని తమ హృదయాలలో నిలుపుకోగలరు;  అది సామాన్యులకు అసాధ్యం.  విష్ణువు యొక్క ఈ రూపాన్ని ఒక్క క్షణం కూడా చూడటం గొప్ప అదృష్టంగా పరిగణించబడుతుంది.  నాస్తికులు కూడా వేంకటేశ్వర స్వామిని చూసి మైమరచిపోతారు.  వేడుకలు మరియు రాష్ట్రపతి మరియు ప్రధాన మంత్రితో సహా ఉన్నతాధికారులు ఉన్నప్పటికీ, ప్రతి ఒక్కరూ రెండవ ప్రవేశ ద్వారం నుండి 2-3 నిమిషాలు మాత్రమే దర్శనం పొందుతారు.  వీడియోలు లేదా ఫోటోలు ప్రశ్నలో లేవు.  ప్రతిరోజూ, నైవేద్యం మరియు ఇతర సేవలకు 5-10 నిమిషాల విరామంతో, వందల వేల మంది భక్తులు ఉదయం 4 నుండి అర్ధరాత్రి వరకు దర్శనం పొందుతారు.  అలసట లేకుండా దర్శనం కొనసాగుతుంది.

 కొంతమంది భక్తులు 2-3 రోజులు బస చేసినప్పటికీ, దర్శనం స్థిరంగా ఉంటుంది.  లోపలి గర్భగుడి ఒక రహస్యమైన గది కాదు, నిత్య ఉత్సవాలు మరియు వేంకటేశ్వరుడు, శ్రీదేవి మరియు భూదేవి యొక్క ప్రత్యేక విగ్రహాల ప్రదేశం.  సంవత్సరంలో 365 రోజులలో, 450 పండుగలు దేవతకు జరుపుకుంటారు.  ప్రతి రోజు పండుగ, ప్రతి రోజు శుభప్రదమైన, మరియు ప్రతి రోజు ఒక వివాహ వేడుక నిర్వహిస్తారు.  కలియుగంలో కనిపించే దైవం వేంకటేశ్వరుడు.  *ఓం నమో వేంకటేశాయ!* 🙏🙏
 *సల సల కాగే సూరీడు... సల్లా సల్లని చందమామ (జానపద సరదా కథ)* - డా.ఎం.హరికిషన్-కర్నూలు-9441032212
*****************************
         ఒకూర్లో ఒకామె వుండేది. ఆమెకు ఇద్దరు పిల్లలు. పెద్దోని పేరేమో సూర్యుడు. చిన్నోని పేరేమో చంద్రుడు. వాళ్ళు చానా బీదోళ్ళు. ఆమె ఆ ఇంట్లో, ఈ ఇంట్లో వనులు చేసి వచ్చిన డబ్బులతో పిల్లలకు మంచి తిండి పెట్టేది. ఒక రోజు ఆమెకు పెద్ద జ్వరమొచ్చి మంచంలో పడిపోయింది. నెలైనా జ్వరం కొంచెం కూడా తగ్గలేదు. ఇంట్లో వున్న దబ్బులన్నీ అయిపోయినాయి. ఆమె పిల్లలిద్దరికీ ఏదో ఒకటి పెట్టి తాను మాత్రం ఏమీ తినకుండా పుత్త మంచినీళ్ళు తాగి కడుపు నింపుకొనేది. పిల్లల కోసం జ్వరంలోనూ ఆకలితో పస్తులుండేది. అంతలో ఒకరోజు ఆ వూరిలో ఒక పెద్ద పెళ్ళి జరుగుతా వుంటే వీళ్ళను భోజనానికి పిల్చినారు. పెళ్ళి భోజనమంటే ఉత్త అన్నం, పప్పు పెట్టరు కదా. మంచి మంచి రుచికరమైన వంటకాలు వడ్డిస్తారు. ఆమె చానా రోజుల నుండి వస్తులుంది కదా. దాంతో నోరూరింది. పిల్లలతో సహా తానూ పోయి బాగా కడుపునిండా తిని రావాలనుకోనింది. కానీ చానా రోజుల నుండి తిండి లేదు కదా. అదీకాక జ్వరం ఇంకా తగ్గలా. దాంతో నీరసమొచ్చి మంచం మీద నుండి కొంచగూడా లేవలేకపోయింది. అడుగు తీసి అడుగు వేయలేక పోయింది. దాంతో సూర్యున్ని, చంద్రున్ని పిలిచి "రేయ్... మీరిద్దరూ పెళ్ళికి పోయి బాగా తిని రండి. అట్లాగే వచ్చేటప్పుడు నాక్కూడా ఏమైనా పట్టుకోని రండి. చానా ఆకలిగా వుంది. ప్రాణం పోయేటట్లు ఉంది" అని చెప్పింది. సరేనని ఇద్దరూ పెళ్ళికి పోయినారు.
సూర్యుడు భోజనానికి కూర్చోగానే అమ్మ చెప్పిన మాట మరిచిపోయినాడు. బచ్చాలు, లడ్లు, కర్జకాయలు, పాయసం అన్నీ బాగా మెక్కి ఉత్త చేతులు పూపుకుంటా ఇంటికొచ్చినాడు. వాళ్ళమ్మ సూర్యున్ని చూడగానే తన కోసం అన్నీ తెచ్చింటాడు అనుకోని ఆశతో "ఏరా! నా కోసం ఏమి తెచ్చినావు" అనడిగింది. దానికి సూర్యుడు "అరెరే! నీ సంగతే మర్చిపోయినా. నాకసలు గుర్తే లేదు" అన్నాడు. తాను రోజూ ఏమీ తినకుండా కడుపు కాల్చుకోని అన్నీ వీళ్ళకే పెడతా వున్నా కనీసం ఒక్కపూట కూడా తనకు తేలేదు కదా అని ఆమె చానా బాధ పడింది.
చంద్రుడు మాత్రం అన్నానికి కూర్చోగానే పెట్టినేవి పెట్టినట్లు సూర్యుని మాదిరి బెరబెరా తినకుండా “పాపం అమ్మ రోజూ తానేమీ తినకుండా అన్నీ మాకే పెడతా వుంది. కనీసం ఈ ఒక్కరోజైనా ఇవన్నీ తీస్కోనిపోయి అమ్మకు పెట్టాలి" ఆనుకొని ఎవరూ చూడకుండా విస్తరాకులో పెట్టినేవి పెట్టినట్టు అంగీలో దాచి పెట్టుకోని ఇంటికి తీసుకొచ్చినాడు.
అమ్మ చంద్రుని చూస్తానే “ఏరా! నువ్వన్నా ఏమన్నా తెచ్చినావా, లేక మీ అన్న మాదిరే అన్నీ బాగా మెక్కి ఉత్త చేతులు వూపుకుంటా వచ్చినావా" అనడిగింది. ఆ మాటలకు చంద్రుడు నవ్వుతా “అమ్మా... ముందు నువ్వు కాళ్ళూ చేతులు కడుక్కొని రాపో... తిందువుగానీ" అంటూ విస్తరి వేసి తెచ్చినవన్నీ ప్రేమగా అమ్మకు కొసరి కొసరి తినిపించినాడు. అవన్నీ తిని ఆమె చానా సంబరపడింది.
ఆ తరువాత సూర్యున్ని పిలిచి "చూడు... వీడు నీకన్నా చిన్నోడే అయినా అమ్మ కోసం ఏమీ తినకుండా అన్నీ తెచ్చినాడు. నువ్వు పెద్దోనివై మాత్రం ఏం లాభం?" అంటూ "నేను ఎట్లాగైతే ఆకలితో మలమల మాడిపోయినానో, అట్లాగే నువ్వు కూడా ఇప్పన్నించీ సలసలసల మండిపోవాల" అని శపించింది.
చంద్రున్ని పిల్చి "మలమల మాడిపోతా వున్న నా కడుపు నిండా అన్నం పెట్టి దాన్ని చల్లగా చేసినావు. అందుకని ఇప్పన్నించీ నువ్వు చల్లగా బతకాల" అని దీవించింది. అందుకే ఆరోజు నుండి ఆకాశంలో సూర్యుడు సలసలసల కాగిపోతా సెగలు కక్కుతా వుంటే, చంద్రుడేమో వెన్నెల కురిపిస్తా హాయిగా వున్నాడు.
*****************************
డా.ఎం.హరికిషన్-కర్నూలు-9441032212
****************************
కథ నచ్చితే *SHARE* చేయండి. రచయిత పేరు మార్చకండి. తీసేయకండి.
 *ఆవు మెచ్చిన పులి* (సంయుక్త అక్షరాలు లేని కథ) డా.ఎం.హరికిషన్-కర్నూలు-94410322122.
*****************************
ఒక అడవిలో ఒక పులి వుండేది. అది చానా మంచిది. ఆకలేసినప్పుడే జంతువులను చంపేది. కానీ చిన్న చిన్న జంతువులను అస్సలు ఏమనేది కాదు. పెద్ద పెద్ద జంతువులను, చెడ్డవాటినే వేటాడేది. మిగతా సమయాల్లో అన్నింటితో మంచిగా మాటలాడేది. పలకరించేది. బాధల్లో వున్నప్పుడు ఆదుకునేది. దాంతో అడవిలోనున్న చిన్న చిన్న జంతువులంతా సంబరంగా పులి చుట్టూ తిరుగుతా, మాటలు కలుపుతా, తమను ఏవయినా చంపాలనుకుంటే ఆ విషయం చెబుతా వుండేవి.

ఒకరోజు పులికి ఆకలి అయితా వుంటే వేటకు బైలుదేరింది. పొద్దున్నుంచీ ఏవీ ఎదురుపడలేదు. ఏమబ్బా... ఈ రోజు ఒక్కటీ కనబడ్డం లేదు. అడవిలోని నక్కలూ, తోడేళ్ళు ఏమైపోయినాయి అనుకుంటా పోతా వుంటే దానికి ఎదురుగా ఒక ఆవు కనబడింది. పులి అంతవరకు ఎప్పుడూ ఆవును చూడలేదు. అసలు ఆ అడవిలో ఆవులు ఎక్కడా లేవు. దాంతో ''ఇది చూడడానికి పెద్దగా బలంగా వుంది. రెండు కొమ్ములు వున్నాయి. కానీ మొగం చాలా అమాయకంగా వుంది. ఇది మంచిదా, చెడ్డదా... దీనిని చంపాలా వద్దా'' అని ఆలోచించసాగింది.

అంతలో ఆవు పులిని చూసింది. చారలు చారలుతో, కోరపళ్ళతో, చాలా పెద్దగా, గంభీరంగా వుంది. ఇదేం జంతువబ్బా అనుకుంటా చిరునవ్వుతో దగ్గరికి పోయి ''నా పేరు ఆవు. అడవి నాకు కొత్త. మనుషులతో కలసి వుంటాను. శాకాహార జంతువును. గడ్డి, ఆకులు, పళ్ళు తింటా వుంటాను. నువ్వు ఎవరు'' అనింది. పులికి ఆవు అమాయకురాలని తెలిసిపోయింది. దాంతో ''నా పేరు పులి. అడవి జంతువును. నేనంటే అడవిలో అందరికీ భయం. మాంసాహారం తిని బతుకుతాను'' అనింది. ఆ మాటలకు ఆవు బెదిరిపోయింది. పోయి పోయి దీని నోటికి చిక్కినట్టున్నానే అనుకోని పారిపోవడానికి వెనక్కి తిరిగింది. అంతలో పులి ''ఆగు తల్లీ... నేను మిగతా పులుల లెక్క కాదు. చెడ్డ జంతువులనే వేటాడతాను కానీ నీలాంటి అమాయకులను కాదు. ఏమీ భయపడవద్దు. ఇంతకూ నువ్వెందుకు ఇలా మా అడవిలోనికి వచ్చినావు'' అనింది.

ఆవు బాధతో తల వంచుకోని ''ఈ అడవికి ఉత్తరం వైపున వున్నదే మా వూరు. మా యజమాని రోజూ మా ఆవులనంతా అడవి బైట వున్న పెద్ద పచ్చని మైదానానికి మేత మేయడానికి తోలుకోని పోతాడు. రోజూ అక్కడ మేం కడుపు నిండా తిని సాయంకాలం తిరిగి వెళ్ళిపోతాము. పొరపాటున గూడా ఎవరమూ అడవిలోకి అడుగు పెట్టము. నాకు ఒక చిన్న దూడ వుంది. ఆరునెలల అమాయకురాలు. ముచ్చటగా ముద్దుపెట్టుకునేలా వుంటాది. అది ఆడుకుంటా ఆడుకుంటా పొరపాటున అడవిలోనికి వెళ్ళిపోయింది. నేను అది గమనించలేదు. సాయంకాలం అన్ని ఆవులూ, వాటి దూడలు వచ్చేసినాయి గానీ నాది రాలేదు. దాంతో నా దూడను వెదుక్కుంటా ఇక్కడికి వచ్చినాను'' అనింది. దాని కళ్ళలోంచి నీళ్ళ చుక్కలు కారి టపటపా కింద వున్న గడ్డి మీద పడినాయి.

ఆ మాటలకు పులి ''వింటా వుంటే నాకే ఇంత బాధగా వుంటే కన్నతల్లివి నీకెంత బాధగా వుంటాదో గదా... అమ్మా... పరవాలేదు ఇంకా నీ దూడ బతికే వుంటే నేను తప్పక కాపాడతాను. ఈ అడవిలో ఎక్కడ ఏ పొద వుందో, ఏ పొదలో ఏ జంతువు వుందో, ఏ జంతువు గుణం ఎలాంటిదో, ఎప్పుడు ఎక్కడ తిరుగుతాదో అన్నీ నాకు తెలుసు. ముందు నీ దూడ ఎక్కడ తప్పిపోయిందో చూపించు. నేను వాసన పసిగట్టి అది అడవిలో ఎటువైపు ఎక్కడికి పోయిందో కనుక్కోని తెచ్చి నీ చేతిలో పెడతా'' అనింది.

రెండు వేగంగా ఆవులు మేత మేసే మైదానానికి చేరుకున్నాయి. పులి అక్కడంతా వాసన చూసుకుంటా ముందుకు పోతా అడవిలోనికి వచ్చింది. దానికి ఒకవైపు దూడ వాసన వచ్చింది. 'నేను తిరిగి వచ్చేవరకు నీవు ఇక్కడే వుండు. బతికుంటే ఖచ్చితంగా మీ ఇద్దరినీ కలుపుతా' అంటా వెంటనే ఆ వాసన వెంబడి వేగంగా పరుగులు తీసింది. ఆ దారి అడవి నక్కలు బాగా తిరిగేచోటు. 'ఏ నక్క నోటికో అది చిక్కలేదు గదా అని భయపడసాగింది.

అంతలో దానికి దూరంగా ''అంబా'' అన్న అరుపు చిన్నగా, దీనంగా వినబడింది. పులి అదిరిపడి అది ఏదో ఆపదలో వుందనుకుంటా విల్లు నుంచి వెలువడిన బాణంలా మెరుపు వేగంతో అటువైపు దూసుకొని పోయింది. అక్కడ ఒక పెద్ద తోడేలు ఎదుట బిక్కు బిక్కుమంటా బెదురు చూపులతో వణికిపోతా వున్న దూడ కనిపించింది. ఆ తోడేలు చానా చెడ్డది. కనబడిన జంతువునల్లా చంపి సంబరపడేది. చిన్న చిన్న జంతువులన్నీ దాని పేరు చెబితే చాలు భయంతో వణికిపోయేవి. పులి దాని కోసం చానా రోజుల నుంచి వెదుకులాడతా వుంది. ఇప్పుడు కనబడింది. అంతే... పులి సంబరంగా ''ఈ దెబ్బతో నా ఆకలీ తీరుతుంది. అడవికి పట్టిన శనీ వదులుతుంది. చిన్నదూడ తల్లి వద్దకు చేరుతుంది'' అనుకుంటా ఎగిరి పంజాతో దాన్ని ఒకే ఒక్క పెరుకు పెరికింది. అంతే... ఆ దెబ్బకు అది ఎగిరిపడింది.

పులి ఆ చిన్నదూడను తీసుకొని దాని అమ్మ దగ్గరికి చేరింది. ఆవు సంతోషంగా దూడను కౌగిలించుకొనింది. పులి దగ్గరికి పోయి కళ్ళనీళ్ళతో ''నీ మేలు ఎప్పటికీ మరిచిపోలేను. నీవు కనబడకపోతే నా పిల్ల ఎప్పటికీ నా దగ్గరికి చేరేది కాదు. నువ్వే నాకు దేవునివి'' అనింది. పులి చిరునవ్వుతో దూడవైపు తిరిగి ''పాపా... ఇంగెప్పుడూ ఇలా అడవిలోకి రాకు. అమ్మ మాట వింటా అమ్మ వెంబడే తిరుగు. సరేనా'' అంటూ సంతోషంగా తిరిగి అడవిలోనికి వెళ్ళిపోయింది.
*****************************
డా.ఎం.హరికిషన్-కర్నూల్-9441032212
*****************************
కథ నచ్చితే *SHARE* చేయండి. రచయిత పేరు మార్చకండి. తీసేయకండి.
 స్నేహం కోసం ప్రాణమివ్వడం కష్టమేమీ కాదు, అంతటి త్యాగం చేసే స్నేహితుణ్ని పొందడమే కష్టం. రక్తం పంచుకున్న తోబుట్టువులు.. జీవితాంతం తోడు ఉంటారో లేదోగానీ.. స్నేహితులు మాత్రం మన నీడలా మనవెంటే ఉంటారు. చిన్న ఆపద వచ్చినా ఆదుకుంటారు. నేనున్నానని ధైర్యం నింపుతారు. అందుకే.. వారిని ఏడాదిలో ఒక్కసారైనా స్మరించుకోవడం మన ధర్మం. అందుకే, ఏటా ఆగస్టు మొదటి ఆదివారాన్ని ‘ఫ్రెండ్‌షిప్ డే’గా నిర్వహిస్తున్నారు. అయితే, ఈ రోజునే స్నేహితుల దినోత్సవంగా ఎంపిక చేయడానికి.. అమెరికాలో జరిగిన ఓ విషాద ఘటనే కారణమని చెబుతారు.
1935 సంవత్సరంలో అమెరికాకు చెందిన ఓ వ్యక్తి పోలీసుల కాల్పుల్లో చనిపోయాడు. తన స్నేహితుడి మరణాన్ని తట్టుకోలేని అతడి స్నేహితుడు.. ఆగస్టు మొదటి ఆదివారం రోజున ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. వారి స్నేహానికి గుర్తుగా అమెరికన్ కాంగ్రెస్ ఆగస్టు తొలి ఆదివారాన్ని ‘ఫ్రెండ్ షిప్ డే’గా ప్రకటించిందని చెబుతారు. అయితే, ఈ ఘటనకు ముందు నుంచే ‘ఫ్రెండ్‌షిప్ డే’ ఉండేదని పలువురు వాదిస్తున్నారు. 1930లో ‘హాల్‌మార్క్‌’ సంస్థ తమ గ్రీటింగ్‌ కార్డులను విక్రయించాలనే ఉద్దేశంతో ఆగస్టు మొదటి ఆదివారాన్ని ‘ఫ్రెండ్‌షిప్ డే’గా సెలబ్రేట్ చేసుకోవాలని ప్రతిపాదించారని, అప్పటి నుంచి ఈ ట్రెండ్ నడుస్తోందని చెబుతున్నారు. అయితే, ఐక్యరాజ్య సమితి మాత్రం.. జులై 30వ తేదీని ‘అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం’గా ప్రకటించింది. కానీ, మన దేశంలో మాత్రం ఆగస్టు మొదటి ఆదివారాన్నేస్నేహితులదినోత్సవంగాజరుపుకుంటున్నారు. అందరికీపేరుపేరునా 
*స్నేహితుల దినోత్సవ* శుభాకాంక్షలు
🤝🌷🤝🌷🤝🌷🤝🌷🤝🌷🤝🌷🤝🌷🤝
       మీ ద్వారపూడి అప్పారావు 💐💐🍫🍫🚩🚩💪🏻💪🏻

****అమావాస్య అంటే ఏమిటి? అమావాస్య ప్రాముఖ్యత ఏమిటి?

 అమావాస్య అంటే ఏమిటి? అమావాస్య ప్రాముఖ్యత ఏమిటి? రేపు అమావాస్య కావున దీని గురించి వివరంగా తెలుసుకుందాం.

అమావాస్య అంటే చందమామ కనపడని రోజు. ఎవరైనా లేదా ఏదైనా లేనప్పుడు, అలా లేకపోవడం వల్ల, వారి ఉనికి శక్తివంతమవుతుంది. మీ స్నేహితుడో లేక ప్రియమైనవారు ఎవరైనా మీతో ఉన్నప్పుడు, వారున్నట్లు అంతగా అనుభూతి చెందరు. కానీ వారు లేని మరుక్షణం, వారి ఉనికి బలంగా అనుభూతి చెందుతారు. కాదంటారా? భావపరంగా కూడా ఇది నిజమే. నిజంగా, వారు ఉన్నప్పుడు వారి ఉనికిని మీరు అనుభూతి చెందరు. వారు లేనప్పుడే, వారు ఏర్పర్చిన ఖాళీ, వారి ఉనికి కంటే గాఢంగా ఉంటుంది. అలాగే చందమామ - తన గైర్హాజరు, తన ఉనికిని మునుపెన్నడూ లేనంతగా కలుగజేస్తుంది. వేరే రోజుల్లో, పౌర్ణమి రోజు కూడా, తాను ఉంటుంది; కానీ అమావాస్య రోజు మాత్రం తన ఉనికి, ఆ గుణం మరింతగా తెలుస్తుంది. 

భూమి, అమావాస్య రోజు విశ్రాంతి తీసుకుంటుంది; భూమిపై జీవ ప్రక్రియ నెమ్మదిస్తుంది. ఇది ఒక మంచి అవకాశం, ఎందుకంటే జీవం ఏకీకరణం ఈ రోజున బాగా జరుగుతుంది. ఎప్పుడైతే కొంత వేగం తగ్గుతుందో, అప్పుడే మీరు మీ శరీరాన్ని గమనిస్తారు. అంతా సవ్యంగా జరుగుతున్నప్పుడు, మీరు తీరిక లేకుండా ఉన్నప్పుడు, మీ శరీరానికి ఏమి జరుగుతుందో మీకు తెలీదు. కానీ, చిన్న వ్యాధి ఏదైనా వచ్చిందంటే, అకస్మాత్తుగా శరీరం ఒక సమస్యగా మారి, మీరు దాని పట్ల శ్రద్ధ వహించాల్సి వస్తుంది. అది సరిగ్గా లేనప్పుడే– “ఇది నేను కాదు. నాకు సమస్యలు ఇస్తున్న ఇది నా శరీరం మాత్రమే”. అని చాలా స్పష్టంగా ఒక దూరం కనిపిస్తుంది.
ఇదే అమావాస్య ప్రాముఖ్యత. ఆ రోజున, ఒక రకమైన పంచభూతాల ఏకీకరణం జరుగుతుంది. కావున అన్నీ కాస్త నెమ్మదిస్తాయి. 

మీరు శ్రేయస్సు కావాలనుకుంటే, పౌర్ణమి పవిత్రమైనది. మీరు మోక్షం కావాలనుకుంటే, అమావాస్య పవిత్రమైనది. అందుకు తగినట్లుగానే, ఈ రెండు పార్శ్వాలకు, వివిధ రకాల అభ్యాసాలు, సాధనలు, ఉన్నాయి. “ఏది నేను? ఏది నేను కాదు?” అనేది సులభంగా తెలుసుకోగలిగే రోజు ఇది. ఇక అక్కడ నుంచి, అసత్యం నుండి సత్యం వైపుకి ప్రయాణం మొదలవుతుంది. అమావాస్య నుండి పౌర్ణమి వరకు ప్రతి నెల సహజంగానే ఒక అవకాశం కల్పించబడింది. పూర్తిగా ఎరుకలో లేని వారికి కూడా, ప్రతి అమావాస్య మొదలుకొని, సహజంగానే ఒక అవకాశం ఉంటుంది. 

పౌర్ణమి గుణం ఇడ నాడి లేదా స్త్రీత్వానికి సంబంధిచింది. అమావాస్య చాలా మోటుగా ఉంటుంది. అమావాస్య ముందు రోజుని శివరాత్రి అంటాము – ఎందుకంటే అది శివుని రాత్రి. అది ఆదిమమైనది. ఎప్పుడైతే మొత్తం చిమ్మ చీకటిగా ఉంటుందో, అప్పుడు సృష్టి మొత్తం నిర్వీర్యం అయిపోయినట్టు ఉంటుంది. అమావాస్యలో కొంత లయకారుడి ఛాయ ఉంటుంది. మామూలుగా, అమావాస్య రోజున స్త్రీ శక్తి, ఒక రకమైన భయం వల్ల గందరగోళం చెందడమో లేక పురుషుడి లాగా కఠోరంగా మార్పు చెందడమో జరుగుతుంది. స్త్రీ శక్తికి పౌర్ణమి అనుకూలమైనది. కావున, మహిళలు పౌర్ణమిని ఉపయోగించుకుంటారు. కానీ, మోక్షం కోరుకునే ఒక పురుషుడికి, పౌర్ణమి అంత మంచిది కాదు. అతడు ఒకవేళ శ్రేయస్సు కోరుకుంటే, పౌర్ణమిని ఉపయోగించుకోవచ్చు. కానీ, మోక్షం కోరుకుంటే మాత్రం అమావాస్య మంచిది. పూర్తిగా విముక్తి కోరుకునే వారందరికీ అమావాస్య అద్భుతమైంది. 
మానసికంగా నిలకడలేని వారు, అమావాస్య లేదా పౌర్ణమి రోజున మరింతగా సమతుల్యం కోల్పోతారన్న సంగతి మీరు వినే ఉంటారు. చంద్రుని గురుత్వాకర్షణ శక్తి ద్వారా ఇలా జరుగుతుంది. కావున, ఈ శక్తి అన్నింటినీ పైకి లాగుతుంది. 

సముద్రాలన్నీ ఎగిసే ప్రయత్నం చేస్తున్నాయి. అదే విధంగా, మీలో ఉన్న రక్తం కూడా చంద్రుని ఆకర్షణకి ఎగిసేందుకు ప్రయత్నిస్తుంది. దీనివల్ల, మానసికంగా మీరు కొంచెం నిలకడగా లేకపోతే, ఆ రోజున మీ మెదడులో అతిగా ప్రవహిస్తున్న రక్తం కారణంగా, మీరు మరింతగా సమతుల్యాన్ని కోల్పోతారు. మీరు సంతోషంగా ఉంటే, మరింత సంతోషంగా మారతారు; బాధగా ఉంటే, మరింత బాధపడతారు. ఆ రోజుల్లో, రక్తం పైకి ప్రవహించడం వల్ల, మీ గుణం ఏదైతే అది మరింత మెరుగుపడుతుంది. అంటే, ఎదో రకంగా పూర్తి శక్తి పైకి లాగబడుతుంది. తన శక్తుల్ని పైకి కదిలించాలి అని ఎప్పుడూ అనుకునే ఆధ్యాత్మిక సాధకుడికి, ఈ రెండు రోజులు ప్రకృతి ప్రసాదించిన వరం లాంటివి.

మన ఆంధ్రులకు అతి చెడ్డదినం అమావాస్య. అమావాస్య రోజు ఏదీ ప్రారంభించ కూడదంటారు . నా దృష్టిలో ఈ సృష్టిలో ఏ చెడు లేదు, ప్రతి క్షణము మంచిదే. ఒకవేళ చెడు ఏదైనా ఉందంటే అది మనుషుల మాటలలో మనసులలో భావాలలో చెడు ఉంటుందే కానీ కాలంలో ఏ చెడు లేదు. దీనిని గురించి నిర్ధారణ చేసుకోవటానికి ఎన్నో కార్యక్రమాలను అమావాస్య రోజే ప్రారంభించి ఎన్నో అద్భుతాలు పొందడం జరిగింది. మానస సరోవర ధ్యాన ఆశ్రమం కూడా అమావాస్య రోజే భూమి పూజ జరగటం అమావాస్య రోజే ప్రారంభించటం జరిగింది. అందుకే అమావాస్య అంటే నాకెంతో ప్రీతి. 

సేకరణ మీ రామిరెడ్డి మానస సరోవరం👏