Tuesday, August 13, 2024

భోజనం చెయ్యడం… ఒక శాస్త్రం !

 *భోజనం చెయ్యడం… ఒక శాస్త్రం !*
                   
గత పదిహేనేళ్లుగా జరుగుతున్న పెళ్లిళ్లు చూడండి...

పేరుకు పెళ్లే కానీ వేదిక మీద ఏమి జరుగుతుందో మనకు కనిపించదు ! 

వారికి నలువైపులా ఫొటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు చుట్టుముట్టి ఉంటారు.  

మంగళ వాయిద్యాలను బట్టి తాళికట్టే శుభవేళ అయిందని అర్ధం చేసుకోవడమే !

ఆ తరువాత వీలయితే స్టేజ్ ఎక్కి  వధూవరుల మీద నాలుగు అక్షింతలు విసిరివెయ్యడం... తదుపరి పెళ్లిపెద్దలు చెప్పినా చెప్పకపోయినా  భోజనశాలలోకి దూరడం, బరువైన పింగాణీ ప్లేటును పట్టుకుని యాచకుల్లా వరుసలో నిలబడటం, కావలసిన పదార్ధాలు వడ్డించుకోవడం,   చెమటలు కక్కుకుంటూ నిలబడి తినడం, ఎక్కడో దూరాన ఉన్న మంచినీళ్ళకోసం పరుగెత్తడం సర్వసాధారణం.  

అతిధులు ఎవరు వస్తున్నారో, ఎవరు తింటున్నారో ఎవ్వరూ గమనించరు.  

తోసుకుంటూ వెళ్లడం, ఒక్కోసారి బట్టల మీద ఆహారపదార్ధాలు ఒలకడం కూడా చాలామందికి అనుభవమే.  

మనల్ని పెళ్ళికి పిలిచిన కుటుంబం వారు అక్కడ ఒక్కరు కూడా ఉండరు.  

అతిధుల్లో తొంభైతొమ్మిది శాతం మంది మనకు పరిచయం ఉండరు.   

కొంతమంది విలువైన ఆహార పదార్ధాలను ఎంత తిన్నారో అంతకు రెట్టింపు పారేస్తారు.  

ఎవరు ప్లేటును చెత్తబుట్టలో వేస్తున్నప్పుడైనా చూడండి... దానిలో మరో మనిషికి సరిపోయే పదార్ధాలు ఉంటాయి. 

మా చిన్నతనంలో.. అనగా సుమారు ముప్ఫయి అయిదు - నలభై ఏళ్ళక్రితం ఇలా ఉండేది కాదు!

పెళ్లిళ్లకు వెళ్తే భోజనాలు  నేలమీదనే.    కూర్చోడానికి  పంక్తిచాపలు ఏర్పాటు చేసేవారు.  అందరూ వరుసలో చిరుచాపల మీద కూర్చున్న తరువాత అరిటాకులు లేదా మద్ది ఆకులతో కుట్టిన విస్తర్లు  వేసేవారు.  ఆ తరువాత ముందుగా పచ్చడి, పప్పు, కూరలు, లడ్డు లేదా బాదుషా, అరటికాయ బజ్జీలు, కమ్మని పొడి, వడియాలు, అప్పడాలు, ఊరమిరపకాయలు వడ్డించేవారు.  ఆ తరువాత పులుసు, సగ్గుబియ్యం పాయసాన్ని అభికరించేవారు.  అభికరించడం అంటే గరిటెతో పులుసు, పాయసాన్ని విస్తరిలో ఒక చుక్క పడేట్లుగా అంటించేవారు.  అనగా ఆ విందులో ఆ రెండు పదార్ధాలు కూడా ఉన్నాయని అర్ధం!  ఆ తరువాత నెయ్యి కొమ్ముచెంబులతో పోసేవారు.  (వేసేవారు కాదు).

అప్పుడు అక్కడున్న ఒక పెద్దాయన ఔపోసన పట్టి "ఇక కానివ్వండి"  అనగానే అందరూ భోజనాలకు ఉపక్రమించేవారు.  

ముద్ద నోటిలో పెట్టుకునే ముందు చాలామంది కళ్ళకు అద్దుకునేవారు. 

ఇక వడ్డించే వారు (యువతీయువకులు)  యమా హుషారుగా పోటీలు పడి పదార్ధాలను మళ్ళీ మళ్ళీ తెస్తూ "ఇంకొంచెం వేసుకో మామా... ఈ కూర కాస్తేసుకో బాబాయి.. బావా...ఈ గుత్తి వంకాయ వేసుకుంటే ఇక ఇక్కడినుంచి కదలవు"  అని చిన్నా పెద్దా తేడా లేకుండా సరదాగా ఆటలు పట్టిస్తూ  వడ్డనలు చేసేవారు.  

వీరు వడ్డనలు చేస్తుంటే పెళ్లి పెద్ద.. అతిధులమధ్య తిరుగుతూ... ఎలా ఉన్నాయి వంటలు ?  అని ప్రశ్నిస్తూ కుశలప్రశ్నలు వేస్తూ "వడియాలు కాసిని తెండ్రా... అదిగో పెదనాన్నకు రెండు అప్పడాలు వేయి.. తాతకు నెయ్యి ఇంకొంచెం పొయ్యారా"  అంటూ ఆప్యాయతను వడ్డించేవాడు కుటుంబ పెద్ద.  

అక్కడ మనతో భోజనం చేసేవారంతా మన బంధువర్గంలోనివారే అయ్యుంటారు.  
  
90 శాతం మంది భోజనాలు ముగించాక....ఇంకా ఎవరైనా భోజనం చేస్తూ కనిపిస్తే...అతిధులు కొందరు పాండవోద్యోగ విజయాలు, కురుక్షేత్రం, చింతామణి  నాటకాలలోని పద్యాలను రాగయుక్తంగా, శ్రావ్యంగా ఆలపించేవారు.  అయిదారు పద్యాలు అయ్యాక అంతలో ఒకాయన "భోజనకాలే హరినామస్మరణ... గోవిందా గోవిందా"  అనేవాడు.  అప్పుడు మాత్రమే  అందరూ లేచేవారు.   

మనం కూర్చున్న వరుసలో ఇంకా ఎవరైనా పెరుగన్నంలోనే ఉంటే వారు పూర్తిగా భుజించాకే లేచేవారు.  

భోజనాలు చేసిన తరువాత వారు తిన్న విస్తళ్ళన్నీ  కడిగారా అన్నట్లుగా శుభ్రంగా ఉండేవి.  ఒక్క మెతుకు కూడా కనిపించేది కాదు.  

చేతులు కడుక్కోగానే అక్కడే ఏర్పాటు చేసిన నులకమంచాల మీద కూర్చుని పళ్ళాలలో సిద్ధంగా ఉంచిన తమలపాకులు, వక్కపొడి, సున్నం ఎవరికి కావలసిన మోతాదులో వారు తీసుకుని మళ్ళీ పెళ్లిపనులలో మునిగిపోయేవారు.  

ఈ భోజనం చెయ్యడం అనే మహత్తర కళ అతి కొద్దిమందికే తెలుసు. కొందరు తింటుంటే చూడముచ్చటగా ఉంటుంది.  సున్నితంగా మునివేళ్లతో కలిపి తింటారు.  కొందరు చపాతీ పిండిని పిసికినట్లు చెయ్యి మొత్తం ముంచి కసకసా అన్నం మీద కక్ష కట్టినట్లుగా పిసుకుతారు.  చేతివేళ్ళమధ్యలోని అన్నం బయటకి వస్తుంది.  చూస్తుంటే కంపరం కలుగుతుంది.  కొంతమంది తిన్న తరువాత విస్తరి ఎలా ఉంటుందంటే... అది కొత్త విస్తరి అంటే నమ్మాలి.  ఒక్క మెతుకు కనిపించదు.  పదార్ధాల తాలూకు అవశేషం కూడా కనిపించదు.  అలా ఎలా తింటారో నాకు ఆశ్చర్యం కలుగుతుంది.  

మరికొందరు తిన్న తరువాత విస్తరి చూస్తే ఆ అన్నాన్ని మనుషులు తిన్నారా లేక ఎలుకలు తిన్నాయా అన్నట్లు చిందరవందరగా, విస్తరిని ఎత్తేసేవారికి కూడా అసహ్యం కలుగుతుంది.  

కొందరు భోజనం చేస్తున్నప్పుడు గ్లాసులు గ్లాసులు నీళ్లు తాగుతుంటారు.  

కొంతమంది పెరుగన్నం తిన్నదాకా గ్లాస్ ముట్టుకోరు.  నిజానికి భోజనం చేసే మధ్యలో మంచినీరు తాగకూడదు.  కొందరు వడ్డించిన పదార్ధాలన్నీ  భుజిస్తారు.  

కొందరు అన్నీ వేయించుకుంటారు.
సగం కూడా తినకుండా వ్యర్ధంగా వదిలేస్తారు.  

భోజనం చేసే పద్ధతిని బట్టి కూడా వ్యక్తుల మనస్తత్వాన్ని అంచనా వెయ్యవచ్చు.  

కావలసిన పదార్ధాలను మాత్రమే వడ్డించుకుని, శుభ్రంగా తినేవారు జీవితంలో పొదుపరులు అని, అవసరం లేనివాటిని కూడా వడ్డించుకుని మొత్తం అవతలపారేసేవారు అతిపెద్ద దుబారా మనుషులుగా అంచనా వెయ్యవచ్చు అంటారు పెద్దలు.  

భోజనం చేయడము ఒక పెద్ద శాస్త్రం. ఎప్పుడైతే…  బఫె సిస్టం వచ్చిందో... అప్పటినుంచి పెళ్ళిభోజనం అనే మాటకు విలువ లేకుండా పోయింది.  అలనాటి మధుర దృశ్యాలు మాయమై పోయాయి.  

ఒకప్పటి పెళ్ళిభోజనం అంటే షడ్రసోపేతమైన విందు.    పదార్ధాలు నాలుగైదే ఉన్నా అది కడుపుకు మహాపసందు. కడుపారా తిని త్రేన్చుతాము.  

ఇప్పటి పెళ్ళిభోజనం అంటే మొక్కుబడి.  వందల రకాల పదార్ధాలు కనిపిస్తుంటాయి.  నాలుగు రకాలు కూడా తినలేము.  మనల్ని తినమని అడిగేవారే ఉండరు. భోజనం చేశారా అని అడిగే దిక్కు ఉండదు...

సంఖ్య ఎక్కువ అయింది..   నిజమే. కూచోబెట్టి పెట్టే అవకాశం లేదు. వచ్చిన వాళ్లకు అంత టైమూ లేదు.. 

కానీ ఏదో ఒకటి చేయాలి. పెళ్లి మన పద్ధతుల్లో కేవలం బంధువులతో... 

ఆపై అందరికీ ఇదుగో ఈ పైన చెప్పుకున్నట్లుగా బావుంటుందేమో.

****👁 అంతర్నేత్రం 👁 *చూపు మారితే…* *సర్వస్వమూ మారుతుంది!*

 🕉️ఓం శ్రీ గురుభ్యోనమః
🚩🚩నమః శుభోదయం 🚩🚩
విమలానంద బొడ్ల మల్లికార్జున్

       👁 అంతర్నేత్రం 👁

              *చూపు మారితే…*
       *సర్వస్వమూ మారుతుంది!*
              
`అన్ని పనులూ అయిపోయాక, కొన్ని క్షణాలు కళ్లు మూసుకుని ప్రశాంతంగా కూర్చోవటం సాధారణంగా మనలో చాలామందికి అలవాటు ఉండదు. చక్కగా కళ్లు మూసుకుని కూర్చోవడం ఒక కళ. ఆ కళను అభ్యసించాలి.
ఈ గందరగోళ జీవితంలో ప్రశాంతంగా కూర్చోవడం సాధ్యపడటంలేదు. నిర్మలమైన ఆకాశాన్ని చూడటం మరిచిపోయాం. నిశ్చలమైన మనసును అనుభూతి చెందటం మనకు తెలియటం లేదు.

కళ్లు మూసుకున్నంత మాత్రాన ప్రపంచం మనల్ని వదలిపోదు. బాహ్య ప్రపంచాన్ని విడిచిపెట్టి అంతరంగ ప్రపంచంలోకి ప్రవేశిస్తాం. లోపల ఎన్నో అద్భుతాలు.             ఓ చిన్న కనురెప్ప రెండు ప్రపంచాలను వేరుచేస్తూ, కలుపుతూ ఉంటుంది.

కళ్లు మూసుకుని లోపలికి వెళుతున్న కొలది, కళ్లు తెరుచుకుని చూస్తున్నప్పుడు కనిపించేదంతా ఓ కలగా, మాయగా చివరికి శూన్యంగా మారిపోతుంది. అక్కడ గొప్ప ప్రశాంతత ఉంటుంది.

ఒక గురువు కళ్లు మూసుకుని కూర్చుని ఉన్నాడు. అతణ్ని ఓ వ్యక్తి సమీపించి 'మీరు చేస్తున్నది ఏమిటి?'అని అడిగాడు.

'లోపల చూస్తున్నాను' అని ఆ గురువు చెప్పాడు. 

ఆ వ్యక్తి గందరగోళంలో పడిపోయాడు.
'కళ్లు మూసుకుని చూస్తున్నారా?' ఆశ్చర్యపోతూ అడిగాడు.

'అవును... అదే నిజమైన చూపు'

కళ్లు తెరుచుకున్నప్పుడు అవి అనంతంలోకి చేరుకోగలవు. కాని అవే కళ్లు మూసుకుని లోపలికి చూసినప్పుడు అనంతత్వపు ద్వారాలు తెరుచుకుంటాయి. అక్కడ మన స్వస్వరూపం కనిపిస్తుంది. అప్పుడే విశ్వరూపం బయటపడుతుంది.

కనిపిస్తున్న దృశ్యాన్ని ప్రతి ఒక్కరూ చూడాలని అనుకుంటారు. 
ఆ దృశ్యాన్ని ప్రదర్శిస్తున్నవాణ్ని (భగవంతుని)’చూడాలని అనుకోరు. ఈ అందాలకు, ఆనందాలకు, అనుభూతులకు కారణం... లోపల ఉంది.

రబియా అనే ఒక యోగిని ఉండేది. ఓ సుందరమైన ప్రభాతవేళలో ఎవరో 'రబియా! కుటీరంలో ఏం చేస్తున్నావు? బయటికి రా, ఇక్కడికొచ్చి చూడు. ఎంత అందమైన ఉదయాన్ని సృష్టించాడో దేవుడు!' అన్నారు.

కుటీరం లోపలి నుంచి రబియా ఇలా అంది. 'నీకు బయట కనిపిస్తున్న ఆ సుందర ఉదయాన్ని సృష్టించిన వాణ్ని నేను ఇక్కడినుంచే చూస్తున్నాను. ఓ మిత్రుడా! నువ్వే లోపలికొస్తే మంచిది. బయట ఉన్న ఏ అందమూ అందం అనిపించుకోదు- ఇక్కడున్న అందం ముందు!'

దర్శింపజేస్తున్నవాణ్ని దర్శించాలి!

కాని, కళ్లు మూసుకునే ఉంటాం. లోపల ఉండం. ఎప్పుడూ బయటే ఉంటాం. మూసుకున్నంత మాత్రాన కళ్లు మూతపడతాయా? కళ్లు మూసుకున్నా బయట దృశ్యాలు వేదిక మీద ప్రదర్శించే దృశ్యాల్లా అలా వెంటాడుతూనే ఉంటాయి...

కనురెప్పలు మూతపడటం- కళ్లు మూసుకోవడం కాదు. కళ్లు మూసుకోవడం అంటే లోపలికి దిగి వస్తున్న కలల నుంచి, ఆలోచనల నుంచి స్వేచ్ఛను పొందడం.

కళ్లు మూసుకోవడం అంటే- దృశ్యాలన్నీ మాయమైపోయి అంతరంగంలో నిశ్చలంగా ఉండిపోవడం. కళ్లు మూసుకోవడం అంటే, నిశ్చలానందాన్ని అనుభవించడం. కళ్లు మూసుకోవడం అంటే, దివ్య చైతన్యాన్ని నీ ముందర సాక్షాత్కరింపజేసుకోవడం. అదే సత్యం. అదే బ్రహ్మానంద పారవశ్యం. అదే జగత్తును ఆడిస్తున్న క్రీడ. అదే శివం. అదే సుందరం.```

చూపు మారితే సర్వస్వమూ మారుతుంది!

జై గురుదేవ్ 👏

****అష్ట పుష్పాలు

 *🙏🌴 శ్రీకృష్ణుని నేటి హారతి, ద్వారక-గుజరాత్🌴🙏*


🌹 *అష్ట పుష్పాలు* 🌹



శ్రీకృష్ణ భగవానుడు గీతలో తొమ్మిదవ అధ్యాయములో 26 వ శ్లోకములో ఇలా చెప్పారు....

*పత్రo పుష్పo ఫలo తోయo*
*యో మే భక్త్యా ప్రయచ్చతి*
*తదహo భక్తుపహృతమ్ అశ్నామి ప్రయతాత్మన:*

     భక్తుడు తనకు భక్తితో ఇలా ఏదిచ్చినా స్వీకరిస్తాను అని చెప్పినాడు. 

      ముఖ్యంగా పూలతో పూజిస్తాము నిత్య తిరువారాధనలో. 
ప్రకృతిలో ఎన్నో రకాల పూలున్నాయి ~ మల్లెలు ~ మందారాలు ~ సంపెంగలు ~ గులాబీలు ~ పారిజాతాలు ~ వీటితో పూజిస్తాము దానితో మనమందరము తృప్తి పొందుతాము.

      *ఉపాసన రెండు విధాలు:*
సగుణోపాసన
నిర్గుణోపాసన
అను రెండు ఉపాసనలు.
మొదటటిది దైవాన్ని ఒక విగ్రహములోనో 
పటములోనో
శిలలోనో 
చూచుకుంటూ ధూపదీప నైవేద్య తాంబూలాదులతో అర్చించడము *సగుణోపాసన.*

     పేరు, రూపము,  ఏవీ లేవని
స్వామి నిర్గుణ పరబ్రహ్మ స్వరూపుడనే ధ్యాసతో ఉపాసించడమనేది *నిర్గుణోపాసన.*

      ఇలాంటి పూలన్నీ వాడి వాసన కోల్పోయి మరుసటి రోజున నిర్మాల్యంగా పారేస్తాము.

      నిజంగా పరమాత్మకు అందించాల్సిన పుష్పాలు వేరే వున్నాయి. అందులో మొదటిది
*అహింసా పుష్పము.* అహింసాధర్మాన్ని  పాటిస్తూ
పూజిస్తే లోకములో దీన్ని మించిన
ధర్మము లేదు కనుక దీన్ని *పరమధర్మo* అని అన్నారు‌.
శారీరకంగా సాటివారిని హింసించడము
  *శారీరిక హింస.*
మానసికంగా హింసించడము 
*మానసిక హింస.* ఈ రెండూ కూడనివి.

      ఇక రెండవది కుసుమo;
దీన్ని  *ఇంద్రియ సమ్యమనము* అని అంటారు.  సమాజములో ఎన్నో దోపిళ్ళు దొంగతనాలు హత్యలు అత్యాచారాలు పగలూ
ప్రతీకారాలు పెచ్చరిల్లి పోతున్నాయి. మనోనిగ్రహముంటే 
ఇటువంటి అల్లకల్లోలాలు చాలావరకూ తగ్గుతాయి.

    ఇక మూడవది *దయాపుష్పము*
ఈ సృష్టిలో ప్రతిప్రాణికీ జీవించే హక్కు ఉంది. 
*బ్రతుకు బ్రతకనివ్వు* అని పెద్దల మాట! ఈ నాటి సమాజములో ఎందరో
వృద్దులు
అనాధలు
దివ్యాంగులు
పీడితులు
క్షుధ్భాదతో
అలమటిస్తున్నారు.
అటువంటి వారిపట్ల దయ చూపడమే కాక వారిని ఆదుకుని
చేయిని అందించడము మన కనీస ధర్మము.‌ 
ఈ దయాపుష్ఫాన్ని భగవంతుడు స్వీకరిస్తాడు.

  ఇంకొక పుష్పము ~ 
*క్షమా పుష్ఫము*
క్షమ అనగా ఓర్పు ~ సహనము.
ఇది మానవునికి మరో అపురూప
ప్రసూనము.

     మరొకటి *తఫ:పుష్పము*
నిరంతరమూ త్రికరణ శుద్దిగా భగవన్నామ స్మరణ
చేస్తూ తన కర్తవ్య నిర్వహణలో
నిమగ్నము కావడమూ తపస్సే!
అరిషడ్వర్గాలను  దూరంగా ఉంచి
తమ విధులనే నిధులుగా భావించే వారిని భగవంతుడు ఇష్టపడుతాడు.

     ఇంకొక పుష్పము 
*ధ్యాన పుష్ఫము* శ్వాసపైన ధ్యాస ఉంచి *అహo బ్రహ్మస్మి*
అని పరిణతి పొందడమే
*ధ్యాన పుష్పము*

    చివరి పుష్పము *సత్యము*
ఈ విశ్వమంతా సత్యo మీదనే 
ఆధారపడి ఉంది. 
సత్యo 
నిత్యమయినది 
శాశ్వతమైనది.
సత్యమే దైవము.

     ఈ అష్టగుణ కుసుమాలతో చేసే ఆరాధనే తనకిష్టమన్నాడు
ఆపధ్భాంధవుడు!

*🙏🌴 ఆత్మీయులకు  శుభోదయం🌴🙏*
 *20 లో పెళ్లి చేసుకుంటే*
*30* వరకు *మన పిల్లలతో ఆటలు*
*40* లో *మన పిల్లల పెళ్లిళ్లు*
*50* వరకు *మనవళ్ల తో ఆటలు* 
*60* లో *మనవళ్ల పెళ్లిళ్లు*
*80 90* వరకు బ్రతికుంటే *ముని మనవళ్ల పెళ్లిళ్లు కూడా చూసే అవకాశం...!!*

కానీ
*30* లో పెళ్లి చేసుకోని
*60* లో పిల్లల పెళ్లిళ్లు చేసి
*మనవళ్ళ పెళ్లి చూడకుండానే శుభం కార్డు..!!*

ఇక 40 50 లో పెళ్లి చేసుకుంటే..
*పిల్లలు పుట్టటం కష్టమే పెళ్లిళ్లు చేసేది కూడా కష్టమే..*
ఒక వేళ పుడితే
పిల్లల పెండ్లి పత్రికల్లో తండ్రి పేరు ముందు 
*లేట్ అని ఒక బోర్డ్ పెట్టుకోవాలి ..*

అందుకే చిన్నతనం లో
పెండ్లి చేసుకోవటం ఎంత ముఖ్యమో *నాటి తరం ఎప్పుడో గమనించింది..*
నేటి తరం 
*దాన్ని విస్మరిస్తుంది..!!* జై శ్రీరాం 💐🌹🙏

తరం వెళ్ళి పోతున్నది....!

 తరం వెళ్ళి పోతున్నది....!

 ఆ ప్రేమ... కనుమరుగైపోతున్నది....!!

తరం వెళ్ళిపోతుంది.
 ప్రేమగల పెద్దరికం కనుమరుగైపోతుంది.

బహుదూరపు బాటసారై పయనం ముగిస్తున్నది.

 జ్ఞాపకాల మూట వదిలి బాటపట్టి పోతుంది.

తెల్లని వస్త్రధారణతో...

స్వచ్ఛమైన మనసుతో...

 మధురమైన ప్రేమతో...

అందరి పట్ల అనురాగంతో

 విలువలతో కూడిన బ్రతుకును సాగించిన ....

మన ముందు తరం తిన్నగా చేజారిపోతున్నది.

వయోభారంతో మనల్ని వదిలిపోతుంది.

హుందాతనపు మీసకట్టు...

రాజహాసపు పంచ కట్టు....

పూటకో తీరు మార్చని మాట కట్టు....

శ్రమనే నమ్ముకుని ఎక్కిన బ్రతుకు మెట్టు....

తల తెగిన తప్పని నీతి ఒట్టు....

ఇబ్బందులు ఎన్ని ఎదురైనా విప్పని గుట్టు....

ఇలా నిజాయితీకి మారుపేరుగా నిలిచిన....

 ఒక నాటి మన పెద్దతరం క్రమంగా కనుమరుగవుతుంటే.....

 హృదయం బరువెక్కుతుంది .

మనసు మూగబోతుంది.

 కంటనీరు కారిపోతుంది.

ఆర్థిక ఇబ్బందులు,
ఉన్నా....

 కష్టాలు ఎన్ని 
 చుట్టుముట్టినా.....

 సమస్యలు ఎన్నో ఎదురైనా.....

 అందరూ సామరస్యంగా..

 కలిసిమెలిసి ...., 

ఒకరి కష్టాన్ని ఒకరు పంచుకునేవారు.

 ఒకరికొకరు సహకరించుకునేవారు.
అందరి కోసం ఒకరు, ఒకరికోసం అందరూ 
 ఆ తరం కనుమరుగవుతున్నది.

****ఎక్కడ ఉన్న, స్వీయ ఎరుక కోల్పోకుండా అలాగే ఉంటే

 

Home
Shorts
Library

divine planet - Designing lives with divinity.
@divineplanet-designinglive1681
14.8K subscribers
•
2K videos
Unity in diversity is divinity.  What we are seeing in this universe is all nature.Visible shape of god is nature. Invisible energy of nature is god.Trying to understand this is  called sadhana.  Understanding this is called knowledge. Living like  this is called bhakti.One who behaves like this is called gnani or saint.When saint loves whole nature equally without any differentiation he becomes god in his inner consciousness.When He understands the unity in diversity of nature, he realises that nature is god. God is not one particular aspect or thing.The whole is god and all is God. It is not a miraculous understanding,it is just common truth of life and universe . Just live in this truth. This is  called adyatmika  means divine path . Adyatmika says the path how to think,how to understand, how to act, how to react ,totally how to live.  Adyatmika is designing our lives with divinity.  Divine plannet is for this only purpose. Design your lives with divinity. Design your  own destiny. 
...more

Subscribe
Home
Videos
Shorts
Playlists
Community
Search

divine planet - Designing lives with divinity.
30 minutes ago
🌹గుడ్ మార్నింగ్ 🌹మీకు వీలున్నప్పుడు సమయం దొరికినప్పుడు - ఒక్కరే ప్రశాంతముగా కాసేపు ఏ పని చేయకుండా - నిశ్చలముగా కూర్చోండి. మీకు ఎలా వీలయితే అలా కూర్చోండి. ఎటువంటి శరీర ఇబ్బంది ఉండకుండా ప్రశాంతముగా కూర్చోండి. అసలు ఏమి చేయవద్దు. ఏ ఆలోచనలు కావాలని చేయవద్దు. వాటంతట అవి ఆలోచనలు సాగుతుంటే సాగనివ్వండి. వీలయితే ఆలోచనలు పట్టించుకోకుండా వుండండి. లేదా వాటిని సాగనివ్వండి. కాసేపు మీతో మీరు - మీలో మీరు మాత్రమే వుండండి. బయటి శబ్దాలు వినపడినా మనసును అటు పోనివ్వకుండా వుండండి. ఒకవేళ వెళ్లినా ప్రస్తుతం ఏమి అక్కర్లేదు అని మరలా మీలోకి మీరు వచ్చేయండి. జస్ట్ కాసేపు మీతో మీరు గడపటం అలవాటు చేసుకోండి. శరీర నిర్మాణములో ఇంద్రియాలు బయటకు ఉండటం వలన - అవసరాలకు నిరంతరం బయటకు వెళ్ళటం అలవాటయిపొయి - పని లేనప్పుడు, అవసరం లేనప్పుడు కూడా తోచక బయటకు వెళ్లి అనవసరాలు అనేకం తగిలించుకొని - వాటితో సతమతమవుతూ కాలాన్ని గడుపుతున్నాము. తనతో తాను ఉండగలిగిన వ్యక్తికి చాలా సమయము మిగులుతుంది. అనవసరాలు గుర్తించి తీసివేయగలగితే - శరీర శాంతి, మనసుకు శాంతి, డబ్బు కూడా ఎంతో కలిసి వస్తుంది. అలా తనతో తాను సంతోషముగా ఉండగలిగిన వారికి ఆధారత తగ్గి మనో ధైర్యం పెరిగి అనవసర భయాలు కూడా వుండవు. నాలో నేను - నాతో నేను సంపూర్ణముగా ఉండగలిగితే తపస్సు.దానికి ముందు స్థితి ధ్యానము. ప్రయత్నిస్తుంటే సాధన. ఏమి చేస్తున్నా, ఎక్కడ ఉన్న, స్వీయ ఎరుక కోల్పోకుండా అలాగే ఉంటే జీవనముక్తి. ఈ కూర్చోవటం  జస్ట్ కాసేపు మాత్రమే........
శరీరము ఉన్నంత వరకు మనిషికి అవసరాలు ఉంటాయి. అవన్నీ సాటి మనుషులనుండే పొందాలి. ఇది సత్యము- మేలు చేసి మేలు పొందటమే జీవితం - కనుక మనుషులతో ఎప్పుడూ మంచిగా వుండండి. 🌹god bless you🌹

Monday, August 12, 2024

సప్త ఋషులు"* ??

 🌴🤘🕉️ మాతృదేవోభవ 🙏🏽
🍇  *"సప్త ఋషులు"*  ??

ఈరోజుల్లో  *"సప్త ఋషులు"*  మనకు కనపడతారా? అంటే ఖచ్చితంగా కనబడతారు అని చెప్పవచ్చును. ఇంకా గట్టిగా చెప్పాలంటే .. అందరికీ కనపడతారు, చూడగలిగితే ప్రతీరోజూ కనపడతారు. ఇంకా చెప్పాలంటే ప్రతీ దంపతులూ సాయంత్రంపూట సప్త ఋషులకు, అరుంధతీ వశిష్ఠులకు నమస్కరించుకోవాలికూడా.*

👉 *ఎక్కడ ఉంటారు?* *ఎలా ఉంటారు?* *అనేది మన పెళ్ళిళ్ళలో 'అరుంధతీ దర్శనం' చేయిస్తూ పురోహితులు తెలియజేస్తారు.*
*సాయంత్రం పూట ఆకాశంలో ఉత్తరం దిక్కున ప్రతీరోజూ వారిని మనం దర్శించుకోవచ్చు.*

👉 *ఇంతకీ సప్త ఋషులు ఎవరు? వారి వివరాలు ఏమిటి? అంటే..*

*కశ్యప అత్రి భరద్వాజ*
*విశ్వామిత్రోథ గౌతమః!*
*వశిష్టో జమదగ్నిశ్చ*
*సప్తైతే ఋషయః స్మృతాః!!*

*భారతీయ పురాణ కథనాల ప్రకారం - ప్రతివారి వంశానికి ఓ ఋషి మూలపురుషుడిగా ఉంటారు. ప్రాచీన ఋషుల వంశానుక్రమమే నేటి భారతీయ సంతతి. కొందరికి గోత్రరూపంలో వారి పూర్వ ఋషులు ప్రతిరోజూ స్మరణీయులే. మరికొందరికీ వారి పూర్వ ఋషులు తెలియకపోయినప్పటికీ వారి వంశాలకు ఋషులున్నారు.*
*ఎంతోమంది ఋషుల ప్రతినిధులుగా సప్తర్షులను పూజించటం ఆనవాయితీగా వస్తున్నది.*

1. *కశ్యపుడు,*
2. *అత్రి,*
3. *భరద్వాజుడు,*
4. *విశ్వామిత్రుడు,*
5. *గౌతముడు,*
6. *జమదగ్ని,*
7. *వసిష్ఠుడు... వీరు ఏడుగురు పూజనీయులే.*

*రాక్షసులు హరించిన భగవద్దత్తమైన వేదాలను మహావిష్ణువు  "వ్యాసుని"  రూపంలో అవతరించి ఉపనిషత్తులు, పురాణాల రూపేణా మనకందించాడు.*

👉🏻 *'వ్యాసుడు'  నాలుగు తలలు లేని బ్రహ్మ,  రెండు బాహువులు గల విష్ణువు,  మూడో కన్ను లేని శివుడని అంటారు.*

⭐ 1. *కశ్యప మహర్షి:- సప్తర్షుల్లో కశ్యపుడు ఒక ప్రజాపతి. మరీచి, కళల పుత్రుడు. దక్షప్రజాపతి పుత్రికల్లో 13 మందిని, వైశ్వానరుని పుత్రికల్లో ఇద్దరిని పెళ్ళాడాడు. వారి ద్వారా దైత్యులు, ఆదిత్యులు, దానవులు, సిద్ధులు, గంధర్వులు, అప్సరసలు, మానేయులు, యక్షులు, రాక్షసులు, వృక్ష లతాత్పణ జాతులు, సింహ, మృగ,  పక్షులను, గోగణాలను, అనూరుడు, గరుడుడు, నాగులు, కాలకేయులను, పౌలోములను, పర్వతుడు అనే దేవర్షిని, విభండకుడు అనే బ్రహ్మర్షిని పుత్రులుగా పొందాడు.*

⭐ 2. *అత్రి మహర్షి:-*
 *సప్తర్షుల్లో రెండోవాడైన అత్రి మహర్షి బ్రహ్మ మానస పుత్రుల్లో ఒకడు. అతని భార్య అనసూయ. అత్రి తన తపోబలంతో త్రిమూర్తులను పోలిన సోమ, దూర్వాస, దత్తాత్రేయులను కుమారులుగా పొందాడు. అత్రి భార్య అనసూయ పతివ్రతా శిరోమణి.*

⭐ 3. *భరద్వాజ మహర్షి:-*
*భరద్వాజుడు ఉతథ్యుని పుత్రుడు. తల్లి పేరు మమత. బృహస్పతి కృప వలన జన్మించి, ఘృతాచీ పట్ల చిత్తచాంచల్యం పొంది, ఘటంలో ద్రోణ జన్మకు కారకుడవుతాడు.*

⭐ 4. *విశ్వామిత్ర మహర్షి*:- 
*విశ్వామిత్రుడు రాజర్షి. త్రిశంకుని స్వర్గానికి పంపడానికి కొంత తపోఫలాన్ని, హరిశ్చంద్రునిచే అసత్యమాడించ కొంత ఫలాన్ని, మేనక వల్ల తపోవిఘ్నం పొంది శకుంతలా జననానికి మూలపురుషుడయ్యాడు. దుష్యంతుడు, శకుంతలల పుత్రుడే భారతదేశ నామకరణానికి ఆదిగా నిలిచాడు.*

⭐ 5. *గౌతమ మహర్షి:-*
*తీవ్ర క్షామం ఏర్పడినప్పుడు ఋషులు, మునులందరికీ గౌతముడు తన తపోబలంతో భోజన వసతి కల్పించాడు. ఇతర ఋషుల ఈర్ష్య వలన మాయా గోవును దర్భతో అదిలించి, బ్రహ్మహత్యా పాతకం అంటగట్టుకొన్నాడు. ఆ దోష పరిహారం కొరకు గోదావరిని భూమిపైకి తెచ్చిన మహర్షి, తన భార్య అహల్యను శిలగా మారేటట్లు శాపమిచ్చిందీ ఆయనే.*

⭐ 6. *వశిష్ఠ మహర్షి:-*
*ఇతని భార్య అరుంధతి.* *వసిష్ఠుడు బ్రహ్మమానస* *పుత్రుల్లో ఒకడు. వైవస్వత* *మన్వంతరాన సప్తర్షుల్లో* *ఒకడు. శక్తి మొదలైన వందమంది పుత్రులు* *గలవాడు. దక్ష ప్రజాపతి పుత్రిక ఊర్జ ద్వారా రజుడు,* *గోత్రుడు, ఊర్ధ్వబాహుడు, సువనుడు, అనఘుడు, సుతవుడు, శుక్రుడు అనే ఏడుగురు పుత్రులను పొందాడు.*

⭐ 7. *జమదగ్ని మహర్షి:-*
*జమదగ్ని ఋషి- రుచికముని, సత్యవతుల కుమారుడు. జమదగ్ని కుమారుడే పరశురాముడు. జమదగ్ని భార్య రేణుక మనసులో కలిగిన అన్యపురుష వ్యామోహం వలన, ఆమెను తన కొడుకైన పరశురామునిచే నరికించాడు. ఆ తరవాత పరశురాముడి ప్రార్థన మేరకు ఆమెను పునర్జీవితురాలిని చేశాడు.*

👉 *మరణం ఆసన్నమైన వారికి అరుంధతీ దర్శనం, సప్తర్షి మండల దర్శనం కాదట.*

👉🏻 *సప్తర్షులు తేజస్సు గలవారు కనుక వారిని పూజిస్తే సకల దోషాలు తొలగిపోతాయంటారు.*

👉 *మీరంతా  వీలున్న సాయంత్రపు వేళ  "సప్తర్షి మండల దర్శనం"  చేసుకుంటారు కదూ...*

🍇 *సప్తర్షి మండల దర్శన ఫల ప్రాప్తిరస్తు*   🌻🌻

శుభమస్తు 💐

చలాచల బోధ:-- శ్రద్ధ:

 [8/12, 11:46] +91 73963 92086: చలాచల బోధ:--
శ్రద్ధ: ఏదైనా ఒక పని మీద ఆసక్తి కలిగి ఆ పనిని, లక్ష్యాన్ని ప్రేమిస్తూ ఆ పని తప్ప వేరే యే పని మీద ఆలోచించకుండా అనుకున్న పనిని మధ్యలో ఆపకుండా, పట్టుదలతో సంపూర్ణం చేయడము.సత్సంకల్పంతో చేపట్టిన పనిని నిర్విఘ్నంగా పూర్తి చేయడాన్ని శ్రద్ధ అని అంటారు.అలాగే జ్ఞాన సముపార్జన కోసం ఆసక్తి కలిగి, పట్టుదలతో, నిర్విఘ్నంగా పూర్తి చేయడాన్ని శ్రద్ధ అని అంటారు."శ్రద్ధవాన్ లభతే జ్ఞానం"అని శాస్త్రం చెబుతోంది.
పితరులకు పిండ ప్రధానం చేయడంలో ఆ పితరులపై ప్రేమ, శ్రద్ధ ఉండాలి.అప్పుడే ఆ క్రతువును శ్రాద్ధం అని అంటారు.
జ్ఞానం కోసం ఇటువంటి శ్రద్ధ ఉండాలంటే మనకు బ్రహ్మ విద్య నేర్పే గురువు పట్ల ఆ గురువు అనుభవజ్ఞులు అనియు,శిష్యుడైన తనను తప్పక ఉద్ధరిస్తారని అచంచలమైన విశ్వాసం ఉండాలి.అటువంటి గురువునకు భక్తితో సమర్పణ కావాలి.అప్పుడే శ్రద్ధ కుదురుతుంది.
[8/12, 11:46] +91 73963 92086: అటువంటి గురువు ఎక్కడ దొరుకుతాడు? ఆతడు సమర్ధుడైన గురువేనని సాధకుడు ఏ విధంగా కనుగొంటాడు?ఒక అజ్ఞాని జ్ఞాన వృద్ధుడైన గురువును పరీక్షించ గలడా? లేకపోతే కపట గురువు దొరికితే,ఆ గురువును భక్తి విశ్వాసాలతో సేవిస్తే ఏమవుతుంది?ఈ ప్రమాదాన్ని తప్పించుకోవడం ఎలా? దీనికి సమాధానమేమనగా ఎప్పుడైతే ఒక గురువు వద్దకు పోగానే మన మనసులో అలజడి పోయి ప్రశాంతత లభిస్తుందో మరియు గురువును ప్రశ్నించకుండానే మనకు సమాధానం దొరుకుతుందో, అటువంటి గురువే నిజమైన గురువు అని సాధకుడు నిశ్చయించుకోవాలి.ఆ తరువాత ఆ గురువును విశ్వసించి గురుభక్తితో సమీపించి తన మోక్షేచ్ఛను వ్యక్తం చేయాలి.తనకు విద్య నేర్పి,తరింపజేయాలని ప్రార్థించాలి.
ఏ సాధకుడైతే తనను తాను గురువునకు అర్పణ చేసుకొని, తగిన విధంగా శిక్షణ గరపి,అవసరమైతే శిక్షింపబడటానికి అంగీకరించి ఉంటాడో అతనినే శిష్యుడు అని అంటారు.ఇది శిష్యుడు అనే పదమునకు నిర్వచనము.
తరువాత షట్క సంపత్తిలో ఆరవది, చివరిది 'సమాధానము'.
సశేషం.

చలాచల బోధ:-- సమాదానము:--

 చలాచల బోధ:--
సమాదానము:--
సమాదానము (సమాధానము కాదు) అనగా సమ+ఆదానము.దానము అంటే ఇచ్చుట,ఆదానము అంటే స్వీకరించుట లేక గ్రహించుట అని అర్థం.కావున సమ ఆదానము అంటే గురువు చెప్పినది చెప్పినట్లు గ్రహించుట.తామసిక శ్రద్ధ గలవారికి అసలు గ్రహించే సామర్ధ్యం ఉండదు.బాహ్య విషయాలను గ్రహించగలడు గాని ఆధ్యాత్మిక విషయాలను గ్రహించలేడు.రాజసిక శ్రద్ధ గలవాడు ఒకటి చేప్తే మరొకలాగా అర్థం చేసుకుంటాడు మరియు అపార్థం చేసుకుంటాడు.ఆధ్యాత్మిక విషయమును లౌకిక విషయం వలె గ్రహిస్తాడు.సాత్విక శ్రద్ధ గలవాడు మాత్రమే చెప్పినది చెప్పినట్లు గ్రహిస్తాడు.ఈ విధంగా ఎందుకు జరుగుతుంది అని అంటే వేదాలలోని పదాలకు మూడు విధాలైన అర్థాలు ఉంటాయి.అవి యేమనగా ఆధి భౌతిక,ఆధి దైవిక, ఆధ్యాత్మిక అర్థాలు.ఉదాహరణకు ఆదిత్యోపాసనను (సూర్యోపాసన)తీసుకుందాము.భౌతకమైన అర్థములో సూర్యుని ఆరోగ్య ప్రదాతగా ఆరాధించడము.దైవిక పద్ధతిలో సూర్యభగవానునిగా ఉపాసించడము.ఆధ్యాత్మికముగా అంతర్యామి అయిన సూర్యనారాయణుని ఉపాసన చేసి అంతర్యామిత్వమును పొందడము.ఈ మూడవది బ్రహ్మోపాసనతో సమానము.సాధకుడు ఈ ఉపాసన వలన ఉపాస్య రూపమైన బ్రహ్మమే అవుతాడు.
భగవద్గీతలో చెప్పినట్లు సాత్విక శ్రద్ధ గలవాడు మాత్రమే గురు బోధలోని ప్రతి పదమును,ప్రతి వాక్యమును ఆధ్యాత్మిక అర్థంలో గ్రహిస్తాడు.భగవద్గీతలో గుణత్రయ విభాగ యోగంలో తమోగుణము, రజోగుణము, సత్త్వగుణముల గురించి వివరంగా చెప్పబడింది.కావున శిష్యుని స్వభావము తమోరజోగుణములను విడచినదై శుద్ధ సత్వగుణంతో ఉండాలి.అప్పుడు మాత్రమే సమాదానము కలిగిన శిష్యుడు గురు బోధను యథాతథముగా గ్రహించగలుగుతాడు.
సశేషం!
 🪷🙏🏻🪷🙏🏻🪷
              
*శ్రీ గురుభ్యోనమః*
                      
*బాధ  -  నీతి*

*ప్రశ్న :  మనమంతా  విముక్తులమే,  మనకే  బంధమూ  లేదు,  మనం  భగవంతుని  నుండి  నిప్పు  కణాల  వలె  వచ్చాం.  తిరిగి  ఆయననే  చేరుతామంటారు  శ్రీ శంకరాచార్యులు.  అట్లా  అయితే,  అన్ని  రకాల  పాపాలనూ  ఎందుకు  చేయకూడదు ?*

*జవాబు :*  మనకి,  ఆత్మకీ  బంధంలేని  మాట  నిజమే !  చివరికి,  నీ  మూలంలో  నీవు  చేరుతావన్నదీ  నిజమే !  ఈ లోగా  నీవనే  పాపకార్యాలు  చేస్తే  వాటి  ఫలితాన్ని  అనుభవించాల్సిందే,  దానిని  తప్ఫించుకోలేవు.  ఎవరైనా  వచ్చి  నిన్ను  బాదుతూంటే ..  "నేను  విముక్తుడ్ని,  ఈ దెబ్బల  వల్ల  నాకే  బంధమూ  లేదు,  నాకే  బాధా  లేదు,  వాడు  కొట్టితే  కొట్టనీ"  అనగలవా ?  అట్లా  నిజంగానే  నీకనిపిస్తే  నీ ఇష్టం  వచ్చినట్టు  నీవు  చేయవచ్చు.  "నేను  విముక్తుడ్ని"  అని  పెదవులతో  అనటంలో  అర్థమేమిటి ?

*ప్రశ్న :  ప్రపంచమంతా  ఈశ్వరుని  లీల  అని,  అంతా  బ్రహ్మమయమనీ  అంటారు.  అటువంటప్పుడు  దురభ్యాసాలని  విడనాడాలని  ఎందుకంటారు ?*

*జవాబు :*  మనిషి  శరీరంలో  ఒక  పుండుందనుకో,  శరీరంలో  కొంచెం  భాగమే  నంటూ  నిర్లక్ష్యం  చేస్తే  అది  శరీరానికంతా  నొప్పిని  కలిగిస్తుంది.  మామూలు  వైద్యంతో  నయం  కాకపోతే,  డాక్టరు  వచ్చి  కత్తితో  దానిని  కోసివేసి  ఆ మాలిన్యాన్ని  తీసివేయ  వలసి  వస్తుంది.  ఆ భాగాన్ని  తీసివేయకపోతే  కుళ్ళుతుంది.  తీసివేసిన  తరువాత  సరిగ్గా  కట్టు  కట్టకపోతే,  చీము  పడుతుంది.  ప్రవర్తన  విషయమూ  అంతే !  దురభ్యాసాలు,  దురలవాట్లూ  దేహంలో  కురుపువంటివే !  ప్రతి  రోగానికీ  తగిన  వైద్యాన్నివ్వాలి.

             *"నీ సహజస్థితిలో  ఉండు"*
      *భగవాన్ శ్రీ రమణమహర్షి బోధనలు*
                       
🪷🙏🏻🪷🙏🏻🪷

విచార సంగ్రహం ( భగవాన్ రమణ మహర్షులు 🙏🏻)

 విచార సంగ్రహం 
( భగవాన్ రమణ మహర్షులు 🙏🏻)
ఈ చిన్నగ్రంధము ఎంతో విలువైనది. ఎందువలన అంటే, 1901 -02 లో భగవాన్ రమణమహర్షి మౌనవ్రతంలో వుంటున్నప్పుడు, వారి పాదాలను ఆశ్రయించుకుని వున్న బ్రాహ్మణ పరమ భక్తాగ్రేసరుడు అయిన గంభీరం శేషయ్య గారికి ఆకాలంలో, వారు అడిగిన సందేహాలకు రమణులు వ్రాతపూర్వకంగా అనుగ్రహించిన వేదాంతసారం, యిందులో పొందుపరచ పడినది. ఇందులో ముముక్షువులైన సర్వాధికారులకు అధికఫలం ఇచ్చే ఉపదేశములు వుండడడం వలన ఇది ' విచార సంగ్రహము ' అనే పేరుతో పిలువబడినది.
దైవపూజ.
' అహం బ్రహ్మాస్మి ' అనే భావనను విడువక వుండడమే నిర్గుణపూజ యొక్క తాత్పర్యము. అదే యజ్ఞము, దానము, తపస్సు, జపము, యోగ సాధనాల ఫలం అవడం వలన, తన నిష్ఠకు ప్రతిబంధకంగా ఏ రూపములు స్ఫురణకు వచ్చినా, మనస్సును ఆ దారిలో పోనీయకూడదు.
మనస్సును ఆత్మ స్వరూపమైన తనయందే నిలిపి, తన ఎదుట ఏమిజరుగుతున్నా, ' జరిగేది జరగనీ, నేను సాక్షీ మాత్రుడను. ' అనే భావానికి అలవాటు పడితే, యే ప్రతిబంధకమూ దరిజేరదు. అంతకంటే వేరు ఉపాయము లేదు. ఎన్నిఅలజడులు వచ్చినా, ' నేను బ్రహ్మమును. ' అను భావమును వీడకూడదు.
ఈ విధంగా అహం అనే స్వరూపమునందు మనస్సును నిలపడం యోగము, ధ్యానము, జపము, జ్ఞానము, భక్తి, మంత్రము. అహం స్వరూపం అయిన ఆత్మాకారమునే దైవంగా తెలిస్తే, మనస్సును నిరంతరం అక్కడే లగ్నం చేస్తే, అదే భగవంతునికి సమర్పించే సర్వోపచారఫలము అని చెప్పబడింది. మనస్సును ఒక్కదానిని నియంత్రిస్తే, సర్వమూ మన వశం అయినట్లే. మనస్సే కుండలిని. షడ్చక్ర దర్శనము మొదలైనవన్నీ మనో కల్పనలే. యోగశాస్త్రం ఆరంభించిన సాధకులకు మాత్రమే ఈ కుండలిని మొదలైన పరిభాష వర్తిస్తుంది.
అంత : పూజ తెలియక పోవడం వలననే, మన శక్తినే విగ్రహాలలో ఆవాహన చేసుకుని, పూజచేయడానికి అలవాటు పడినాము. కాబట్టి, అన్నివిషయాలు తెలుసుకున్న మనము, ఆత్మజ్ఞానమును తెలుసుకు౦టే అన్నింటినీ తెలుసుకున్నట్లే. అనేక విపరీత భావనలతో కూడుకుని వుండే మనము, దైవము అనే ఆత్మను తెలుసుకోవడం అనే ఏక భావనతో, విపరీత భవనాలు తొలగిపోతాయి. అసలు దైవ స్వరూపము అంటే ఏమిటో తెలుస్తుంది.
ఎల్లప్పుడూ, సర్వ పరిపూర్ణమైన స్వ స్వరూప ఆత్మ భావనను మరువకుండా వుండడమే పూర్ణమైన యోగము, జ్ఞానము మొదలైనవి. ఒకవేళ ఎప్పుడైనా, తన అసలు స్థితిని వదిలి, బహిర్ముఖ వ్యవహారములు మనస్సులో ప్రవేశిస్తే, ' ఓహో ! ఈ దేహాదులు మనము కామే ! మనము ఎవరమూ ? ' అనే విచారణతో, దానిని తిరిగి మన అసలుస్థితిలో నిలుపవలెను.
మనం అనేకసార్లు చెప్పుకున్నట్లు, ' నేనెవరను ? ' అనే విచారణ సర్వ అనర్ధ నివృత్తికి, ఆనందప్రాప్తికి ముఖ్య హేతువు. ఎన్ని మాటలు తిప్పి తిప్పి చెప్పినా, విషయము మాత్రము ఇంతే.
ముక్తి గురించి రేపు తెలుసుకుందాం. -
*అమృతం గమయ - సత్ చిత్*

మన హృదయాన్ని నిష్కల్మషంగా అణకువగా ఉంచితే అప్పుడు భగవంతుడు ప్రకాశిస్తాడు.

సేవ, అణకువ, హృదయ పవిత్రత అనేవి శీలసంపదకు పునాదులుగా నిలుస్తాయి. అవి లేకుండా ఆధ్యాత్మిక పురోభివృద్ధి సాధ్యపడదు. ఈ గుణాలను పెంపొందించుకునేందుకు చిత్తశుద్ధిగా ప్రయత్నం చేయాలి, అంతట తప్పక భగవత్సాక్షాత్కారం కలుగుతుంది.

భగవంతుడిని తల్లిగా, తండ్రిగా, మన సర్వస్వంగా భావించగలిగితే భయము, గర్వము, అహంకారం వంటి దుర్గుణాల అలజడి తగ్గి హృదయం శాంతిస్తుంది. హృదయం ఆ విధంగా నిష్కళంకంగా రూపొందితే మనలో దివ్యత్వపు ఉనికి స్పష్టమౌతుంది.

ఆ ఉనికి బాహ్యజీవనంలోనూ వ్యక్తమవుతుంది. దివ్యత్వానికి స్వార్థం ఉండదు కనుక అది ప్రతీమాటలోనూ, ఆచరణలోనూ, ఆలోచనలోనూ బహిర్గతం అవుతూ ప్రపంచానికి అందుతుంది.
 *కఠోపనిషత్తు* 

జీవుని ముందు రెండు మార్గాలుంటాయి. ఒకటి శ్రేయస్సు, రెండవది ప్రేయస్సు. శ్రేయస్సు అంటే మోక్షము లేక శాశ్వతానందము. ప్రేయస్సు అంటే బంధము లేక అనిత్యమైన ఇంద్రియానందము. వీటినే విద్య, అవిద్య మార్గాలనికూడా అంటారు. జ్ఞానులు శ్రేయస్సును అవలంబించి శాశ్వతసుఖాన్ని పొందుతారు. అజ్ఞానులు ప్రేయస్సును కోరుకొని క్షణికమైన సుఖాలను అనుభవిస్తూ మొహలాలసులై జననమరణ చట్రంలో ఇరుక్కుంటారు.
ధీరుడైన నచికేతుడు శ్రేయమార్గాన్ని ఎన్నుకున్నందుకు యముడు ముగ్ధుడై, నచికేతా! నేను చెప్పేది చాల శ్రద్ధగా విను. విద్యతో(జ్ఞానంతో) విషయాన్ని గ్రహించు అని చెప్పసాగెడు.
అవిద్యలో పడి కొంతమంది తామే ధీరులమని, పండితులమని ప్రకటించుకుంటారు. వారు పరలోక విషయాన్ని లేక ఆత్మవస్తువుని ఏ మాత్రము గ్రహించక పలుమార్లు ఇచ్చటికే (మృత్యులోకం) వచ్చి పోతుంటారు. వారిని అనుసరిస్తున్న వారిది కూడా ఇదే పరిస్థితి.
ఆత్మవస్తువు గురించి వినడమే ఆశ్చర్యము, విన్నవారు దానిని తెలుసుకొనుట కష్టం, దానిగురించి చెప్పే గురువు దొరకటం ఇంకా కష్టం, ఒకవేళ దొరికిన అతడు చెప్పింది అర్ధం చేసుకోవడం బహుకష్టం. ఆత్మజ్ఞానం తర్కంద్వారా అర్ధంకాదు. అనుభూతి పొందిన గురుని ఉపదేశం వల్లనే అది సిద్ధిస్తుంది. కానీ శిష్యుడు సత్యశోధకుడై వుండాలి.
కర్మలను నిష్కామంతో ఆచరించి, తద్వారా చిత్తశుద్ధిపొంది, జ్ఞానంతో సత్యశోధన చేసి ఆత్మజ్ఞానాన్ని పొందుట సులువైన మార్గము. ఆ పరమాత్మ వస్తువు కంటికి కనబడదు. ప్రతి జీవిలో నిఘాడంగా అది నెలకొనివుంది. దానిని జ్ఞాననేత్రం(ఆత్మనిష్ఠ)తో గ్రహించవచ్చు.
నచికేతా! అన్ని వేదములలో చెప్పబడినది, అన్ని తపస్సులకు లక్ష్యమైనది, కఠోర బ్రహ్మచర్యసాధనతో పొందగోరేది అయిన ఒక అక్షరాన్ని నీకు ఉపదేశిస్తాను. అదే బ్రహ్మము, అదే పరమాత్మ, అన్నింటికీ మూలాధారం అదే, అనిచెప్పి "ఓంకారాన్ని" ఉపదేశిస్తాడు.
నచికేతా! ఓంకారమే సృష్టి, స్థితి, లయములకు సంకేతము. ఈ "ఓంకార" సాధనతో చావుపుట్టుకలు లేని, సత్యమైన, సనాతనమైన, నిత్యమైన, శాశ్వతమైన, సర్వవ్యాపకమైన, పురాణమైన "ఆత్మను" గ్రహించవచ్చు. ఆత్మ, అణువుకన్నా అణువైనది మరియు మహత్తుకన్నా మహీయమైనది, ఎటువంటి శరీరంలేకుండా అది ప్రతిజీవి శరీరంలో నెలకొనివుటుంది. అక్కడే వుంటూ అన్నిచోట్లకు వెళ్లగలదు. జీవుని సుఖదుఃఖములతో ఆత్మకు ఎటువంటి సంబంధము లేదు. జీవి శరీరము నశిస్తుంది గాని ఆత్మ ఎల్లప్పుడూ చిదాభాసమై వుంటుంది.

- శాస్త్రి ఆత్రేయ(ఆకుండి శ్రీనివాస శాస్త్రిగారు)

****ఆత్మజ్ఞానానికి ఏ సాధన అవసరం లేదని రమణమహర్షి ఎందుకు అన్నారు?

 ఆత్మజ్ఞానానికి ఏ సాధన అవసరం లేదని రమణమహర్షి ఎందుకు అన్నారు?
సాధనలన్ని వదిలేసి ఖాళీగా కూర్చోమని భగవాన్ ఎప్పుడు చెప్పలేదు. వారి వద్దకొచ్చిన అనేక మంది సాధకులకి, వారి వారి పరిణతకి తగ్గ జప, ధ్యానాది సాధనలు సూచించి ప్రోత్సహించేవారు. మనవంటి సామాన్యులు భక్తి, ధ్యానాది సాధనలు వదలరాదు. మహాత్ముల బోధలు సమగ్రంగా పరిశీలించకపోవటం వలన ఇటువంటి సందేహాలు వస్తాయి.

భగవాన్ రమణులన్న ఆ మాటకు తాత్పర్యం వేరు..

తన రూపు ఎలా ఉంటుందో మర్చిపోయిన ఒక వ్యక్తి ఒక సరస్సు ఒడ్డున తన ప్రతిబింబాన్ని చూద్దామనుకుని ఆ సరస్సులోకి తొంగిచూసాడు. కానీ, ఆ సరస్సు బాగా మురికిగా ఉండి, తరంగాది చలనం బాగా ఎక్కువగా ఉండటం వలన, అతనికి తన ప్రతిబింబం స్పష్టంగా కనపడలేదు. తన ప్రతిబింబం చూడగలగాలంటే సరస్సు ఎలా ఉండాలి? మురికి లేకుండా ఉండాలి, చలనం సద్దుమణిగి ఉండాలి. అలా ఉంటే ప్రతిబింబం చూడటానికి పెద్ద కష్టపడక్కరలేదు. నిజానికి ఎటువంటి మాలిన్యం లేని, చలనరహితమైన సరస్సు నీటికి తన ఎదురుగానున్న వస్తువును ప్రతిబింబించటమనేది సహజలక్షణం.

కొలనులో తన రూపు చూసుకున్న వ్యక్తికి తన ముఖము, రూపు కొత్తగా లభించినది కాదు, అది నిత్యలభ్యము. అలాగే, ఆత్మజ్ఞానము పొందుట అంటే ఏదో కొత్తగా అవటం కాదు. ఉన్నదాన్ని ఇప్పుడు ఇక్కడ అనుభవపూర్వకంగా గుర్తించటం. ఆత్మనేది ఎక్కడో కూర్చున్న బండరాయి కాదు. ఆత్మజ్ఞానమనేది కాలము, దేశములో చేసే ప్రయాణము కాదు. ఆత్మంటే మనమే. దుఃఖము, చావు స్పర్శలేని సచ్చిదానంద ఘనుడవై నీవు ఇప్పుడు ఇక్కడ అయి ఉన్నావు, కానీ అది మన అనుభవములో లేదు. దాన్ని గుర్తించటం, మనము మన నిజ స్వరూపమునందు ఉండుటయే ఆత్మజ్ఞానం.ఆదిత్యయోగీ.

మరి ఈ విషయాన్ని గుర్తెరిగి, మన స్వరూపమునందు స్థిరమై ఎందుకు ఉండలేకపోతున్నాము? మనసు వలన. అతి చంచలమై, రాగద్వేషాది మలినములు కలిగిన మనసే అసలు అడ్డు. అటువంటి మనసు ఆ మురికి కొలను వంటిది. మన స్వరూపము స్పష్టంగా తెలిసికొననివ్వదు. శుద్ధమై, ఏకాగ్రమైన, ప్రశాంతమైన మనసు , కొలనులోని మంచినీటివలె ఆత్మచైతన్యాన్ని స్పష్టంగా ప్రతిఫలిస్తుంది. అటువంటి చిత్తములో పరమాత్మ సమాహితుడై ఉంటాడు. అటువంటి మనసు తన మూలమైన ఆత్మచైతన్యమునందు సహజంగా విలీనమౌతుంది.

జితాత్మనః ప్రశాంతస్య పరమాత్మా సమాహితః (భగవద్గీత 6.7)

ఆత్మసంస్థం మనః కృత్వా న కించిదపి చింతయేత్ (భగవద్గీత 6.25)

భక్తి చేసినా, నిష్కామ కర్మానుష్ఠానము చేసినా, యమనియమాది సహిత ధ్యానాదులవలింబించినా, నేతి నేతి అని బౌద్ధికంగా వెదికినా, ఏ సాధనైనా వాటన్నిటి లక్ష్యం ఏకాగ్ర చిత్తశుద్ధి, ఆత్మనిష్ఠ. ఆత్మజ్ఞానము కొత్తగా లభించే వస్తువు గాదు. అది నిత్యలభ్యము. దానిని గుర్తెరుఁగుటకు అడ్డువచ్చే భావనలను తొలగించే ప్రయత్నము సమస్త సాధనలు...
.
శ్రీరామకృష్ణులు:....
 ‌‌                       "సామాన్యంగా సమాధిస్థితి పొందిన తరువాత దేహంలో జీవం నిలిచి ఉండదు. కాని నారదాది ఋషులకు ఈ నియమం వర్తించదు: లోకుల ఉపదేశార్థం వీరు సజీవులై ఉంటారు. భగవదవతారమూర్తులైన చైతన్య మహాప్రభువు వంటివారి విషయంలో కూడా ఇది వర్తిస్తుంది. 

బావి త్రవ్వటం పూర్తికాగానే పార, పలుగు, బుట్ట పారవేయటం జరుగుతుంది. కాని కొందరు ఈ పనిముట్లను ఇరుగుపొరుగుల ఉపయోగార్ధం పదిలపరుచుకొంటారు.ఆదిత్యయోగీ.

సమాధి అనంతరం తమ దేహాలను నిలుపుకొనివుండే మహాపురుషులు దుఃఖితులైన జీవులపట్ల కనికరం చెందుతారు.. తమకు కలిగిన జ్ఞానంతోనే తృప్తిచెందే స్వార్ధపరులు కారు వీరు..
.

పతంజలి మహర్షి రచించిన యోగ సూత్రాలు,  చాలా పురాతన బోధనలు, అవి మౌలిక యోగ సూత్రాలను విశదీకరిస్తాయి, చాలామంది యోగా అంటే శారీరక వ్యాయామాలే అనుకుంటారు, కానీ అవి అందులో ఒక శాఖ మాత్రమే, యోగా అంటే ధ్యాన మార్గం కూడా, వ్యక్తిని విశ్వ మూలంతో ఐక్యమయ్యే లా చేయడమే దాని లక్ష్యం, యోగ సూత్రాలు ఈ అంశానికి సంబంధించినవి, పతాంజలి వీటిని అష్టాంగయోగంగా పిలవబడే 8 సోఫానాలుగా మనకు అందించారు, ఆ ఎనిమిది మెట్లు ఇవీ.
1. యమ
2. నిమమ
3. ఆసన
4. ప్రాణాయామ
5. ప్రత్యాహార
6. ధారణ
7. ధ్యాన
8. సమాధి

'అష్టాంగ యోగం లోని ఈ ఎనిమిది అంశాలు ముఖ్యమైనవే, అన్నారు.

పరిపూర్ణుడు, ప్రాణాహుతి ప్రసారం చేయగల సమర్ధుడు అయిన గురువర్యుని మార్గదర్శకత్వంలో హృదయం పై ధ్యానించడమే మనం అనుసరించే ప్రక్రియ, ప్రాధాన్యాన్ని చూపించే విషయం. అటువంటి గురువు మన ఆధ్యాత్మిక ప్రగతికి అవరోధంగా నిలిచే వాటిని దూరంగా ఉంచుతాడు, గురువర్యునుండి ఆధ్యాత్మిక తరంగాలు మన హృదయంలోకి ప్రవహించడం కొనసాగుతూ, రోజు రోజుకి మనల్ని ప్రశాంతంగా, మరింత ప్రశాంతంగా చేస్తాయి. మనం ధ్యానంలో లోతుగా లీనమైతే, మనం అభిలాషిస్తున్న అంతరంగం లోలోపల ఉన్నదానితో మన సంబంధాన్ని అనుసంధానిస్తాం.ఆదిత్యయోగీ.భక్తి మన సామర్థ్యాన్ని పెంచి మార్గం సుగమం చేస్తుంది. మన హృదయాన్ని గురు శక్తికి గురి చేసినట్లయితే, మనం అంతర్ముఖంగా విస్తరించ      నారంభిస్తాం. దాని ఫలితంగా దీర్ఘకాలంలోనే మనం దైవ సామ్రాజ్యమంతా వ్యాపించి ఉండడాన్ని గమనిస్తాం.

దైవిక రహస్యం బయట పోక్క రాదు"
అనుభూతిని చెందండి.

*ఓం తత్సత్*

****మౌనవ్రతం మంచిదే

 

Meditation for students in U S

 


****కామం, క్రోధం, దురాశ, మాయ, మత్తు, అసూయ, గర్వం మరియు అహంకారం.

 కామం, క్రోధం, దురాశ, మాయ, మత్తు, అసూయ, గర్వం మరియు అహంకారం.

పాయింట్ బై పాయింట్ చూద్దాం:

1. కామం :
సమస్య : కామం అనేది వ్యతిరేక లింగం పట్ల ఆకర్షణ యొక్క ప్రలోభం. ఇప్పుడు, వాస్తవానికి, మీరు దీని నుండి సులభంగా విముక్తి పొందవచ్చు, కానీ మీరు చేయకూడదు. మితిమీరిన కామం సమస్య కావచ్చు, కానీ మీరు కామాన్ని అరికట్టడానికి ప్రయత్నించకూడదు. మీ రక్తసంబంధాన్ని సజీవంగా ఉంచుకోవడానికి మీరు కొంత కోరికను కలిగి ఉండాలి. మితిమీరిన కామం ఇతర లింగంతో కొంత నాణ్యమైన సమయాన్ని గడపడానికి మిమ్మల్ని ఏదైనా చేయగలదు మరియు వ్యక్తులు మీలోని ఈ లక్షణాన్ని దుర్వినియోగం చేయవచ్చు.

పరిష్కారం : మీ కామాన్ని ఆపడానికి ప్రయత్నించే బదులు, మీరు మీ జీవిత భాగస్వామికి విధేయంగా ఉండటానికి ప్రయత్నించాలి. యవ్వనంలో జాగ్రత్తగా ఉండండి, కామంలో చిక్కుకోకండి. దానికి బదులుగా అభిరుచిని ఎంచుకుని అనుసరించండి.

2. కోపం :
సమస్య : కోపం అనేది మీ అంచనాలకు తగినట్లుగా జరగనప్పుడు, లేదా మీరు మోసం చేయబడినప్పుడు, లేదా అవమానించబడినప్పుడు, మొదలైనవాటికి మీరు ప్రతీకారం తీర్చుకోవడానికి, లేదా ఎవరికైనా, లేదా మీకే హాని కలిగించడానికి మీకు ఆసక్తిని కలిగించవచ్చు. మీరు కోపంగా ఉన్నప్పుడు మీ స్పందన మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది.

పరిష్కారం : క్షమాపణ సాధన. కోపాన్ని అరికట్టడానికి బదులుగా, మీ ఫిర్యాదులన్నింటినీ కాగితంపై వ్రాసి కాల్చండి లేదా మట్టిలో పాతిపెట్టండి లేదా మీకు కావలసిన చోట విసిరేయండి. వారి ముఖం మీద లేదా వారి వెనుక కూడా ఎవరినీ విమర్శించవద్దు. దానిని కాగితంపై వ్రాసి పారవేయండి. ఈ విధంగా, మీ కోపం తగ్గుతుంది మరియు మీరు ఇతరులకు లేదా మీకు కూడా ఎటువంటి హాని చేయరు.

3. దురాశ :
సమస్య : తక్కువ శ్రమతో తక్కువ సమయంలో ఎక్కువ సంపాదించాలని మీరు ఆసక్తిగా ఉన్నారు. ఫలితంగా, మీరు ప్రజలకు ద్రోహం చేయవచ్చు, నేరాలు, పాపాలు చేయవచ్చు మరియు మీ లాభం కోసం ఇతరులను ఉపయోగించవచ్చు. ఈ విధంగా, మీరు చాలా మంది వ్యక్తులు మిమ్మల్ని ద్వేషిస్తారు మరియు మీకు హాని కలిగించడానికి ప్రయత్నిస్తారు.

పరిష్కారం: మీరు ఎల్లప్పుడూ మీ ధర్మాలను అనుసరించాలి. మీ జీవితాంతం మీరు అనుసరించే సద్గుణాల జాబితాను వ్రాయాలని నేను సూచిస్తున్నాను. ఈ విధంగా, మీరు విలువైన విజయం సాధిస్తారు. ఎవరైనా మీకు ద్రోహం చేస్తే లేదా హాని చేస్తే మీరు ఎలా భావిస్తారో మీరు ఆలోచించాలి. పరిణామాల గురించి ఆలోచించండి. దాని ప్రకారం నడుచుకోండి.

4. మాయ :
సమస్య : మీరు తప్పుదారి పట్టించారు. మీరు చేయకూడని విషయాలలో మీరు ఆనందాన్ని పొందుతారు. ఉదాహరణకు, మీరు ఇతర వ్యక్తులచే సులభంగా ఉపయోగించబడతారు, మీరు లాభం పొందుతున్నారని మీరు అనుకుంటారు, కానీ వాస్తవానికి మీరు స్కామ్ చేయబడుతున్నారు. ఇది చాలా నిరుత్సాహకరంగా ఉంటుంది మరియు మీరు తర్వాత మోసపోయినట్లు భావిస్తారు.

పరిష్కారం : ప్రతిసారీ హేతుబద్ధంగా ఉండటానికి ప్రయత్నించండి. ఇతరుల తప్పులలో పాలుపంచుకోకుండా మిమ్మల్ని మీరు దూరంగా ఉంచండి. మీ ఇష్టానుసారం ఎవరి వల్లా మీరు ఎలాంటి నష్టాన్ని ఎదుర్కోకుండా చూసుకోండి.

5. మత్తు :
సమస్య : మీరు బానిస. కాబట్టి మీరు సామాజికంగా ఒంటరిగా ఉన్నారు, అసహ్యించుకుంటారు, నిరుద్యోగులు, అపస్మారక స్థితిలో ఉన్నారు మరియు అందరూ. కాబట్టి, మంచివారు మీకు దూరంగా ఉంటారు మరియు మీరు నెమ్మదిగా మీ జీవితాన్ని మరియు మనస్సును మరియు ఆత్మను నాశనం చేస్తున్నారు.

పరిష్కారం : అన్నింటిలో మొదటిది, ఏ వయస్సులోనైనా డ్రగ్స్, మద్యం, సిగరెట్లు మొదలైనవాటిని తీసుకోకుండా ఉండండి. మీ స్నేహితుల గురించి మరచిపోయి, మీరు వీటిని ప్రయత్నించేలా చేయాలనుకుంటే వారిని కొట్టండి. మీరు వ్యసనపరులైతే, వ్యసనాన్ని అరికట్టడానికి మీ వంతు ప్రయత్నం చేయండి. పునరావాస కేంద్రానికి వెళ్లండి.

6. అసూయ :
సమస్య : మీరు ఇతరుల వస్తువులను చూసి అసూయపడతారు. మీరు వాటిని పొందాలనుకుంటున్నారు, లేదా వాటిని నాశనం చేయాలి, తద్వారా మీరు వాటిని పొందకపోతే, మరెవరూ కూడా పొందకూడదు. ఇది అంతిమంగా మీకు కోపం తెప్పిస్తుంది మరియు అత్యాశ కలిగిస్తుంది. పైన వారి సమస్యలు మరియు పరిష్కారాలను చూడండి.

పరిష్కారం : మీరు అసూయతో ఉండాలి, కానీ అసభ్యంగా ఉండకూడదు. మీరు మీ కోరికల కోసం కష్టపడి మరియు ధర్మబద్ధంగా పని చేయాలి, కానీ తప్పు మలుపులు తీసుకోకండి.

7. గర్వం మరియు అహంకారం :
సమస్య : అవి ఎక్కువ లేదా తక్కువ అర్థం. మీరు మీ విజయాల గురించి గర్వపడుతున్నారు మరియు మీరు మీ జూనియర్లు లేదా రన్నరప్‌లను గౌరవించరు. ఇది ప్రతి ఒక్కరూ మిమ్మల్ని ద్వేషించేలా చేస్తుంది, మీపై అసూయపడుతుంది మరియు మీకు హాని కలిగించడానికి ప్రయత్నిస్తుంది.

పరిష్కారం : మీరు విజయం సాధించడానికి నైతిక మార్గాలను అనుసరిస్తే, ఇతరులు ఏమి అనుభవిస్తారో మీకు తెలిసినట్లుగా మీకు గర్వం ఉండదు. కానీ ఇప్పటికీ మీరు గర్వంగా భావిస్తే, మీరు మీ విజయగాథను వ్రాయవచ్చు లేదా ప్రసంగాలు, కథనాలు మొదలైన వాటి ద్వారా ఇతరులకు తెలియజేయవచ్చు.

అందరికీ ఒక సంక్లిష్ట పరిష్కారం :

ఎల్లప్పుడూ హేతుబద్ధంగా ఆలోచించండి.

అందరికీ ఒక సాధారణ పరిష్కారం :

భక్తుడిగా మారండి . ఎల్లప్పుడూ భగవంతుని గురించి ఆలోచించండి. ఎవరిని పూజించినా సరే. దేవుడిని కలవాలని లేదా మాట్లాడాలని కోరిక కలిగి ఉండండి. మీ ప్రేమను దేవునికి తెలియజేయండి. మీరు సమస్యలను ఎదుర్కొంటున్న వ్యక్తిని చూసినప్పుడు మీ కోపాన్ని దేవునికి తెలియజేయండి. ఆయనను కలవాలనే అత్యాశతో ఉండండి. భగవంతుడు మీ పక్కన కూర్చున్నట్లు భావించండి. అతనికి బానిస అవ్వండి. ఇతర భక్తుల పట్ల అసూయపడండి. భగవంతుని పట్ల గర్వం కలిగి ఉండండి. మీరు సంపాదించినదంతా దేవుని కోసం ఇవ్వండి. సర్వస్వం ఆయనకు అప్పగించండి.

ధన్యవాదాలు!

Sunday, August 11, 2024

*****ఇవి మీకు తెలుస్తుంటే మాత్రం మీరు కచ్చితముగా కొంత వరకు అదృష్టవంతులే.

 🌹గుడ్ మార్నింగ్ 🌹జీవితము చేసే మాయ చూసారా.... కొంతమందికి నిరంతరం జీవించటమే పోరాటం - ఆరాటముగా ఉంటుంది. కనీస జీవన వనరులు ఎప్పుడు వుండవు.వారికి అసలు ఆధ్యాత్మికము, దేముడు ఏమి ఆలోచించే తీరికే ఉండదు.
మరి కొంతమందికి వనరులు సరిపోయి - సరిపోనట్లుగా ఉంటాయి. వీరు సరిపోవేమో అన్న భయముతో నిరంతరం ప్రయత్నించుకుంటూనే వుంటారు. వీరికి దేముడు, ఆధ్యాత్మికము గూర్చి ఆలోచించే తీరిక ఉండదు. మరి కొంతమందికి వనరులు చాలా ఎక్కువగా ఉంటాయి - వాటిని అనుభవించటం,రక్షించుకోవటం, ఇంకా పెంచుకోవటం మీదే ధ్యాస ఉంటుంది.వీరికి దేముడు, ఆధ్యాత్మికత గురించి ఆలోచించే తీరిక ఉండదు. వీరందరికి దేముడు తెలుసు రక్షకుడుగా... ఏదో ఒకటి కావాలని అడుగుతూ దైవాన్ని తలుస్తూ, భావనలో కలుస్తూ వుంటారు. అన్ని రకాల వారికి, అనారోగ్యాలు, ఇతర అనేక సమస్యలు వీటితో కాలం పరిగెడుతూ మరణములో దింపేస్తుంది. ఆట అయిపొయింది. అన్ని స్థితులలో ఎక్కడ, ఎలా వున్నా కొంతమందికి జ్ఞానం అర్ధమవుతుంది. దేముడు దైవత్వమవుతుంది. శరీర అవసరాలతో పాటు అంతరంగ జ్ఞానం కూడా అర్ధమవుతూ ఉంటుంది.తమను తాము గమనించుకోవటము తెలుస్తుంది. అయినా ఆ జ్ఞానములో నిలబడటం చాలా కష్టము. శరీర - అంతరంగ జ్ఞాన సమన్వయం కుదరదు. మీకు జ్ఞానం అర్ధమవుతుంటే మాత్రం వదలకండి. లక్షమందిలో 10 మందికి మాత్రమే అర్ధమవుతుంది. మిగిలిన వారందరికి దేముడు - దేవత తెలుసు. దైవత్వము - ఆత్మ తత్త్వము - అనంతత్వము - అంతరంగ తత్త్వము తెలియవు. ఇవి మీకు తెలుస్తుంటే మాత్రం మీరు కచ్చితముగా కొంత వరకు అదృష్టవంతులే. కాబట్టి ఆధ్యాత్మిక, ఆత్మ జ్ఞాన చదువు అర్ధమవుతున్న వాళ్ళు వదలకండి. ఎందుకంటే లక్షమందిలో 10 మంది మీరు. 🌹god bless you 🌹

****మన దృష్టి కోణమే మన జీవితం -

 మన దృష్టి కోణమే మన జీవితం - 

నీవు 

దేహ దృష్టి, 
మనో దృష్టి, 
ఆత్మ దృష్టిలలో 
దేనిని కలిగి ఉన్నావు?

ఒక్కో మనిషి దృష్టి కోణం, వ్యక్త పరచిన భావాల వల్ల ఆవ్యక్తి ఏ స్థాయిలో ఉన్న వాడనేది పెద్దలు పసిగడుతుంటారు.

ముఖ్యంగా గురువులు/ఆచార్యులు తమ శిష్యులను తమ దగ్గర ఉంచుకొని విద్య బోధించేటప్పుడు ఈ విషయాన్ని వారి శిష్యులకి తెలీకుండా పరీక్ష చేసి తగు విధంగా వారికి శిక్షణని ఇచ్చేవారు.

ఇది దేహ దృష్టి, మనో దృష్టి, ఆత్మ దృష్టి అని మూడు రకాలు. ఇందులో ముందు నుంచీ చూసినప్పుడు ఆత్మ దృష్టి అత్యుత్తమమైనదీ, దేహ దృష్టి అథమము / కనిష్టమైనది.

ఒక వ్యక్తి అలా మన ముందు నుంచి వెళ్తుంటే అబ్బా భలే ఉన్నాడురా ఒడ్డూ, పొడుగూ, ఆ వంటి రంగూ, వేసుకున్న చక్కని బట్టలూ అని ఆనందించే వారుంటారు. వారికి ఆ దృష్టి ద్వారా, కట్టు బొట్టు, జుట్టు, బట్ట, కులం, రంగు, సౌందర్యం, ఇవి మాత్రమే వారి దృష్టికి అందుతాయి. 

ఉదాహరణకి 
ప్రవచనాలు వినడానికి వచ్చి ప్రవచనకర్త భౌతికాకారాన్ని చూసి పొగిడేవారు కొందరు. ఆయన ఏం చెప్పారు అన్నదాంతో సంబంధం ఉండదు. ఏం విన్నారో ప్రవచనం అయ్యాక గుర్తు ఉంటుందా అంటే అక్కడక్కడా వేంకటేశ్వర స్వామి పంచె లాగా అన్న మాట. వీరిది స్థూల/భౌతిక/దేహ దృష్టి. వీరి దృష్టి ఉన్నదాన్ని ఆస్వాదిస్తూనే ఏది లేదా అని వెతుకుతూ ఉంటారు.

ఇంకొకరు ఒక వ్యక్తిని చూస్తూనే ఈయన పండితుడిలాగా ఉన్నాడు అని తలచి ఆ వేపున కాస్త పరిశీలించి అబ్బా గొప్ప పండితుడు అని సర్టిఫికేట్లిస్తారు. చూసావా ఆ పంచె కట్టు ఆ వీబూధి బొట్టు, ఆ గడ్డం అదీనూ బహుశా ఈయన కవేమో, లేదా ఉపాసకుడేమో అని వారికి వారే పరి పరివిధాలా పరిశీలించుకొని ఆ వ్యక్తిని ఏదో ఒక పాండిత్యానికి అంటగడతారు.

ఇలా చెప్పే వారు బోలెడు మంది. అబ్బా ఏం గుర్తు పెట్టుకుంటారండీ అనో, భలే చెప్తారండీ అనో, అబ్బా పద్యాలు ఏం చెప్పారండీ అనో, అన్ని పురాణేతిహాసాలు అన్నీ ఆయనకి కంఠతా అనో, అలా ఏదో ఒక సర్టిఫికేట్లిచ్చేవారుంటారు. వారు రెండవ కోవకి చెందినవారు. అలానే వీరూ అంతే అన్నీ బాగున్నాయంటూనే అదిగో చూసారా అక్కడ సరిగ్గా చెప్పలేదు అదీ ఇదీ అని లెక్కలు కడతారు.

ఇక అతి కొద్ది మంది ఉంటారు, ఆపక్కనుంచో ఆ వ్యక్తికి దగ్గరనుంచి అలా వెళుతుంటేనే అవతల వ్యక్తిలోని పరబ్రహ్మాన్ని చూసి నమస్కరిస్తారు. ఆ వ్యక్తిని చూడగానే అసంకల్పితంగా వారి రెండు చేతులూ ముకుళించుకుంటాయి. ముందు ఏదో ప్రణాళిక వేసుకుని వారిని కలిసి ఇలా నమస్కారం చేయాలి అవీ ఇవీ అని ప్రణాళిక చేయకపోయినా, వారిని చూడగానే వారిని తలచుకోగానే అప్రయత్నంగా రెండు చేతులూ ముకుళించుకుపోతాయి. మరో మాట ఉండదు, ప్రశ్నా ఉండదు, అక్కడ ఉండేది ఆనందం ఆత్మానందం. ఆ ఆత్మ దృష్టి అలవడాలనే ప్రతి ఒక్కరూ సాధన చేసేది.

విద్యార్ధుల బ్యాగుల్లో గంజాయి,*

 .

*విద్యార్ధుల బ్యాగుల్లో గంజాయి,*

 లక్షల్లో డబ్బులు
విజయవాడ స్కూల్స్ లో షాకింగ్ విషయాలు

తెలుగు రాష్ట్రాల్లో గత కొంత కాలంగా డ్రగ్స్ సరఫరా కలకలం రేపుతోంది.

 అందులోను ఆంధ్రప్రదేశ్ లో మాదక ద్రవ్యాల వినియోగంపై సర్వత్రా ఆందోళన నెలకొంది. 

మరీ ముఖ్యంగా పాఠశాల విద్యార్ధుల బ్యాగ్లలో డ్రగ్స్ తో పాటు లక్షల రూపాయల నగదు పట్టుబడిన ఘటన ఆసక్తికరంగా మారింది. 

గత వారం విజయవాడలో ప్రముఖ పాఠశాలలో ప్రిన్సిపల్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించగా కొంతమంది స్టూడెంట్స్ టాయిలెట్స్లో డ్రగ్స్ తీసుకుంటూ కనిపించేసరికి అంతా షాక్ కు తిన్నారు.

అనుమానం వచ్చి 9,10వ తరగతి విద్యార్ధుల స్కూల్ బ్యాగ్ లను తనిఖీ చేయడంతో కొంతమంది బ్యాగుల్లో ఎలక్ట్రానిక్ సిగార్స్, గంజాయి వంటి మత్తు పదార్ధాలు దొరికాయి. 

సదరు విద్యార్ధుల పేరేంట్స్ ను పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చింది స్కూల్ యాజమాన్యం. మత్తు పదార్ధాలు సేవిస్తున్న విద్యార్థులపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. 

ఈ క్రమంలో విధ్యార్ధులకు సంబందించి ఎన్నో ఆందోళనకరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి.

ఇదే స్కూల్ కు చెందిన ఓ స్టూడెంట్ ఆన్ లైన్ గేమ్స్ లో పది లక్షల రుపాయలు గెలిచాడట. 

ఆ డబ్బును తన దగ్గర ఉంచుకుంటే ఇబ్బంది కలుగుతుందని, సుమారు ఆరేడు లక్షలు స్నేహితులకు ఇచ్చాడు. 

అంత డబ్బు ఇళ్లకు తీసుకువెళ్లిన విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నించగా ఫ్రెండ్ ఇచ్చాడని చెప్పడంతో వారు స్కూల్ మేనేజ్మెంట్ కు కంప్లైంట్ చేశారు. 

దీనిపై స్కూల్లో విచారణ చేయగా సదరు స్టూడెంట్ మొబైల్ ఫోన్ లో ఆన్లైన్లో పలురకాల బెట్టింగ్ గేమ్స్ ఆడుతున్నట్టు గుర్తించారు.

ఇలా ఆన్ లైన్ లో సంపాదించిన డబ్బులను ఫ్రెండ్స్ కు ఇవ్వడంతో ఈ వ్యవహారం వెలుగుచూసింది. 

సదరు విద్యార్ధిపై సైతం స్కూల్ మేనేజ్మెంట్ క్రమశిక్షణా చర్యలు తీసుకుంది. ఇక 9వ తరగతి చదివే కొంతమంది స్టూడెంట్స్ ఈ మధ్య విజయవాడలోని ఓ స్టార్ హోటల్లో బర్త్ డే పార్టీ జరుపుకున్నారు. 

14ఏళ్లలోపు విధ్యార్ధులు మాత్రమే ఉన్న వారికి చెన్నై కోల్కత్తా నేషనల్ హైవేపై ఉన్న ఓ స్టార్ హోటల్లో పార్టీ చేసుకోడానికి అనుమతించారు. ఈ పార్టీలో కొంతమంది స్టూడెంట్స్ మధ్యం సేవించినట్టు తెలుస్తోంది.

హోటల్ లో పుట్టిన రోజు పార్టీ విషయం ఆలస్యంగా తెలిసిన పేరెంట్స్ స్కూల్ మేనేజ్మెంట్ కు కంప్లైంట్ చేశారు. 

పాఠశాలలో టాయిలెట్ ప్రదేశాలు మినహా, ప్రతి ప్రాంతం కవర్ అయ్యేలా సీసీ కెమెరాల ఏర్పాటు చేసినా విద్యార్ధులు గాడి తప్పుతున్నారని స్కూల్ యాజమాన్యం ఆందోళన వ్యక్తం చేస్తోంది. 

ఇంటి దగ్గర పేరెంట్స్ పర్యవేక్షణా లోపంతోనే ఈ సమస్య వస్తోందని అంటున్నారు. పిల్లలు ఏంచేస్తున్నారో, ఎక్కడికి వెళ్తున్నారో, ఎవరితో తిరుగుతున్నారో తల్లిదండ్రులు గమనించాలని సూచిస్తున్నారు.

Saturday, August 10, 2024

****జ్ఞాన నేత్రము అంటే

 🌹good మార్నింగ్ 🌹మనసుకు మంచి చెడులు తెలియవు. మనము ఏ విధముగానైనా గ్రహించిన ప్రతి విషయము మనసుగా అంటే జ్ఞాపకముగా మారిపోతుంది. మనసుకు సత్యము తనకు తెలిసినదే. మనసు శరీరాన్ని నడుపుతుంది. కనుక మనసుకు సంబంధించిన సత్యాలే శరీర సత్యాలు.కనుక విషయాలు తెలుసుకునేటప్పుడే - పంచెంద్రియముల ద్వారా గ్రహించే టప్పుడే జాగ్రత్తగా తెలుసుకోవాలి. అవసరంలేనివి ఊరికినే, సరదాకి, తోచక కాలక్షేపానికి తెలుసుకున్నా అవి లోపల మనసై - మనసుకు శరీరానికి సత్యాలై కూర్చుంటాయి. కనుక జాగ్రత్త లోపలకు స్వీకరించండి.
మనలో ఉన్న బుద్ది - విచక్షణ అనే జ్ఞానము మంచి చెడుల వివరము చెబుతూ ఉంటుంది. అది బలముగా వుండాలంటే జ్ఞాన సంభంధ మంచి విషయాలు, శరీర, మనో ధర్మాలకు సంబంధించిన మంచి విషయాలు, మనకు, సృష్టికి లేక విశ్వానికి సంబంధించిన దైవశక్తి లేక ఆత్మ శక్తికి సంబంధించిన ఆత్మ జ్ఞాన సత్యాలు తెలుసుకుంటే బుద్ధి బలపడి - మనసును శరీరాన్ని అసత్యము, అజ్ఞానము, అధర్మము, చెడులోకి వెళ్లకుండా ఆపి - కేవలం మంచిలోనే ఉంచగలుగుతుంది. జ్ఞానము బుద్ధికి బలము - విషయాలు, కోరికలు, ఆశలు, ఇలాంటివి అన్నీ మనసుకు బలము. బుద్ది బలము - మనసును,శరీరాన్ని మంచిలో నడిపిస్తుంది. మనోబలము గ్రహించిన అన్నీ సత్యమని భావించటం చేత - మంచితో పాటు చెడును కూడా చేయిస్తుంది... మనసుకు విచక్షణ అనే జ్ఞానము లేదు. శరీరము పనిముట్టు మాత్రమే - అది మనసు లేకుండా పని చేయలేదు. బుద్ధి మనసును అదుపుచేయగలిగితేనే - మనసు, శరీరము మంచిలో నడుస్తాయి. లేకపోతే గుడ్డివాడు వాహనము నడుపుతున్నట్లే. కళ్ళు నిజమైన చూపు కాదు - జ్ఞానమే నిజమైన చూపు. అందుకే జ్ఞాన నేత్రము అనే పదము ఆధ్యాత్మికతలో మహాత్ములు వాడారు. జ్ఞాన నేత్రము అంటే బుద్ది యొక్క పరిపూర్ణ, సంపూర్ణ అవగాహనతో గ్రహించటం, పనిచేయటం, జీవించటం. సృష్టి మనిషికి మాత్రమే ఇచ్చిన జ్ఞానాన్ని వాడండి. జ్ఞాన జీవనమే ఆధ్యాత్మికత. 🌹god bless you 🌹

ఆధ్యాత్మికతను తప్పించుకోవటము కుదరదు. ఎందుకంటే అదే ఆధారము కనుక.

 🌹గుడ్ మార్నింగ్ 🌹ప్రతి మెలుకువను, ప్రతి ఉదయాన్ని మంచి అనే సాధనతో ప్రారంభిస్తూ - రాత్రి నిద్ర వరకు ఆ సాధన కొనసాగిస్తూ, మన అవసరాలు తీర్చుకొవటమే ఆధ్యాత్మిక జీవితం.జీవితం మన అవసరాల కొరకు, కోరికలు తీర్చుకుంటూ జీవిస్తున్నట్లు కనపడుతున్నా, గమనించేవారికి ప్రతి విషయములోనూ ఏదో ఒక రూపములో జ్ఞానము అవగాహన అవుతూనే ఉంటుంది. మంచి, చెడు, సుఖ,దుఃఖ అనుభవాలన్నీ - అవగాహనగా అర్ధమవుతూనే ఉంటాయి. అందులోనుండి జ్ఞాన గ్రహింపు ప్రతి వారికి జరుగుతూనే ఉంటుంది.మన శరీర నిర్మాణమే సృష్టి అలా కూర్చింది. అందుకే మామూలుగా సాధారణ జీవితములో అంటే భౌతికములో సాగిపోయేవారిలో కూడా జ్ఞాన అనుభవాలు కనపడుతూ ఉంటాయి.అసలు ఆధ్యాత్మికత అనేది కూడా మనిషి తనలోనే తెలుసుకున్న జ్ఞానానుభవం. ప్రయత్నించే వారికి కొంచెం ముందుగా ఎక్కువ అనుభవాలు లేకుండానే అర్ధమవుతుంది. ప్రయత్నించక పోయిన జీవితం అన్నీ నేర్పుతుంది. ఆధ్యాత్మికతను తప్పించుకోవటము కుదరదు. ఎందుకంటే అదే ఆధారము కనుక. 🌹god bless you 🌹

Friday, August 9, 2024

****నవ్వు నాలుగువిధాలా చేటు!*

 *నవ్వు నాలుగువిధాలా చేటు!*
నవ్వు అన్ని సమయాలలో ముఖానికి అందమూ మనసుకు ఆహ్లాదము కలిగించవు. నవ్వుల వల్ల కలిగిన ఎన్నో అనర్ధాల గురించి మన పురాణాలలో ఇతిహాసాలలో చెప్పబడ్డాయి. అలాటి కొన్ని సంఘటనలు చూద్దాము…

సీతాకళ్యాణ సమయంలో సీతారాములను ఆశీర్వదించడానికి శివపార్వతులు కూడా విచ్చేసారు.  సీతాదేవిని తనకు పెళ్ళికానుకగా ఏమి కావాలో కోరుకోమన్నాడు పరమేశ్వరుడు.

సీత దీర్ఘదృష్టితో తనకు భవిష్యత్తులో ఏది ప్రయోజనకరమో త్రికాలజ్ఞుడైన త్రినేత్రునికే బాగా తెలుసని అటువంటిదానినే తనకు కానుకగా ఇవ్వమని కోరింది.

పరమశివుడు ఆలోచించాడు. గతంలో త్రిపురాసురులను తన క్రోధపూరితమైన నవ్వుతోనే భస్మంచేశాడు. అటువంటి నవ్వును సమయానుకూలంగా ఉపయోగించుకోమని సీతాదేవికి కానుకగా ఇచ్చాడు.

ఆ నవ్వును సీతాదేవి తన మనసులో భద్రంగా పదిలపరుచుకున్నది.

రావణాసురునిచే లంకలోని అశోకవనంలో చెఱపట్టబడి వున్నప్పుడు సీతాదేవిని చూడడానికి హనుమంతుడు వచ్ఛాడు. మాటల సందర్భంలో రావణునిపట్ల గల కసిని క్రోధపూరితమైన నవ్వుగా వ్రెళ్ళగక్కింది. అది చూసిన హనుమంతుడు ఆవేశం చెందాడు. లంకా దహనం చేశాడు. నిజానికి ఆనాటి లంకా దహనం జరిగింది హనుమంతుని వలన కాదు. పరమేశ్వరుడు కానుకగా ఇచ్చిన నవ్వును సీతాదేవి ఈసందర్భంలో ఉపయోగించు కున్నది. మహాసాధ్వియైన సీతాదేవి రౌద్రం వలన కలిగిన నవ్వువలనే లంక దహించబడిందని ఒక  రామాయణ గ్రంధ వివరణ.

అలాగే రామాయణంలో జరిగిన మరో సంఘటన…

రావణ సంహారం అనంతరం అయోధ్యలో శ్రీరామ పట్టాభిషేకం మహావైభవంగా సాగింది. శ్రీరాముడు తనకు సహాయం చేసిన వానర ప్రముఖులతో సహా అందరినీ సత్కరించి సంతోషపరుస్తున్నాడు.
ఆ సమయంలో పక్కనే వున్న లక్ష్మణుడు ఉన్నట్టుండి ఫకాలున నవ్వాడు. లక్ష్మణస్వామి ఎందుకు నవ్వాడో ఎవరికీ అర్ధంకాలేదు. శ్రీరాముడు , సీత , భరతుడు , సుగ్రీవుడు , హనుమంతుడు అందరూ ఎవరికివారే తమలోని ఏదో లోపాన్ని చూసే లక్ష్మణుడు నవ్వాడాని అతనిపై ఆగ్రహించారు.

వారిని శాంతింపజేయడానికి వారికి క్షమాపణలు చెపుతూ తన నవ్వుకు గల కారణం గురించి లక్ష్మణుడు ఇలా చెప్పాడు…
సీతారాములతో పధ్నాలుగేళ్ళపాటు వనవాసంలో గడిపిన తను ఏ ఒక్కరాత్రి పగలు కూడా  ఒక్క క్షణమైనా నిద్రపోకుండా సీతారాముల కాపలాలో గడిపానని ఆ సమయంలో ఒక్క రెప్పపాటు సమయంలో కూడా నిద్రాదేవి ఆవహించలేదు. కానీ ఈ సంతోష సమయంలో యింతమంది ప్రముఖుల సమక్షంలో వున్న నన్ను నిద్రాదేవి ఆవహించిందని  తన ఈ దురవస్థకు ఆపుకోలేని నవ్వు వచ్చిందని లక్ష్మణుడు సంజాయిషి చెప్పుకున్నాక కానీ ఆ సభలోని వారి అనుమానం , కోపం తగ్గలేదు.

అందరికీ తెలిసిన మరో నవ్వు …పాంచాలి నవ్వు..!

మహాభారతంలో మయసభ ఘట్టంలో దుర్యోధనుని చూసి ద్రౌపది  నవ్విన నవ్వువలన ఎన్ని అనర్ధాలు , ఎన్ని దుష్పరిణామాలు, ఎన్ని ఘాతుకాలు , ఎంతటి మహా సంగ్రామం జరిగి కుఱువంశం నాశనమైపోయిందో అందరికీ తెలిసిందే!

అందువలన పదిమందిలో వున్నప్పుడు అకారణంగా నవ్వి నవ్వులపాలు కాకూడదు.
*సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

 లోకా సమస్తా సుఖినోభవన్తు!
 *అంతా మా మంచికే గదా* (అద్భుత జానపద నీతి కథ) - డా.ఎం.హరికిషన్-కర్నూలు-9441032212
*****************************
       ఒకూర్లో ఒక రైతున్నాడు. ఆయన బాగా డబ్బున్నోడు. ఆయనకి ముగ్గురు కూతుళ్ళు. ఆ ముగ్గురిదీ చూడచక్కని అందం. చందమామల్లెక్క మెరిసిపోతా వుండేటోళ్ళు. నవ్వితే మల్లెపూలు కురిసినట్టుండేది. అది చూసి అందరూ “అబ్బ... ఎంత ముచ్చటగా వున్నారయ్యా నీ కూతుళ్ళు. చిదిమి దీపం పెట్టుకోవచ్చు. పెండ్లి చేయాలనుకుంటే మాకోసారి చెప్పండి. పైసా డబ్బులు తీసుకోకుండా మా పిల్లోళ్ళకు చేసుకుంటాం" అనేటోళ్ళు. ఆ పిల్లలు గూడా చానాచానా మంచోళ్ళు. అందరికీ సాయం చేస్తా... పక్షులకూ, జంతువులకు అన్నం పెడ్తా, ఎంత వున్నా ఏమీ లేనోళ్ళ లెక్క అణిగిమణిగి వుండేటోళ్ళు. ఎవ్వరినీ పళ్ళెత్తు మాట గూడా అనేటోళ్ళు గాదు. ఎంతందంగా వున్నా కొంచం గూడా పొగరుగా మాట్లాడేటోళ్ళు కాదు. ఆ రైతు ఆ పిల్లలకి ఏది కావాలంటే అది కొనిస్తా అల్లారుముద్దుగా చూసుకునేటోడు. అట్లా కొద్ది రోజులు గడిచిపోయినాయి. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా వుండదు గదా...
ఒకరోజు ఏమయిందంటే ఆయన పెండ్లానికి పెద్ద రోగమొచ్చి అనుకోకుండా చచ్చిపోయింది. దాంతో పిల్లల్ని చూసుకునేటోళ్ళు లేక, వాళ్ళకు వండి పెట్టేలోళ్ళు లేక చానా బాధ పడసాగినాడు. దాంతో చుట్టుపక్కల వున్నోళ్ళు, బంధువులు అందరూ ఒక్కటై “ఎన్నాళ్ళిలా ఒక్కనివే బాధపడతా వుంటావు. దేవుని దగ్గర దీపం పెట్టేటోళ్ళు, బైట ముగ్గులేసేటోళ్ళు, వంటింట్లో పొయ్యి వెలిగించేటోళ్ళు లేని ఇల్లు వున్నా ఒకటే లేకున్నా ఒకటే. ఇంకో పెండ్లి చేసుకో... నీకూ నీ పిల్లలకు అందరికీ మేలు" అని ఒకటే పోరు పెట్టినారు. దాంతో ఆయన సరేనని ఇంగో పెండ్లి చేసుకున్నాడు.
ఆ వచ్చినామె మొదట్లో ముగ్గురు పిల్లల్ని బాగానే చూసుకోనింది గానీ ఆమెకు ఒక కూతురు పుట్టినాక ప్రేమ తగ్గిపోయింది. ఆ అమ్మాయిలతో ఎప్పుడూ పనులు చేయిస్తా, చీటికీ మాటికీ నోటికొచ్చినట్టల్లా తిడతా .... అన్నం గూడా సరిగా పెట్టేది కాదు. ఎట్లాగయినా సరే ఆ అమ్మాయిల్ని ఇండ్లు వదిలి పారిపోయేలా చేయాలని చానా కష్టమైన పనులన్నీ చెబుతా వుండేది. ఒకరోజు ఆమె ముగ్గురినీ పిలిచి "పోండి... పోయి అడవిలో కట్టెలు తీసుకోని రాపోండి.
కానీ దాండ్లను కట్టడానికి తాడూ వుండగూడదు. మీ నెత్తి మీద గుడ్డా వుండగూడదు. జాగ్రత్త" అని హెచ్చరించింది. ఆ పిల్లలు అట్లా ఎట్లా తేవాల్నో అర్థం గాక అడవిలోనికి పోయి ఏడుస్తా కూచున్నారు.
అంతలో ఒక పాము వాళ్ళ దగ్గరికి వచ్చింది. “ఏం అమ్మాయిలూ... ఏమిట్లా అడవిలో కూచోని అట్లా ఏడుస్తా వున్నారు. ఏమి మీ బాధ" అనడిగింది. దానికా ముగ్గురు పిల్లలు కళ్ళల్లో నీళ్ళు కారిపోతా వుంటే వెక్కివెక్కి ఏడుస్తా "ఏం చెప్పమంటావు నాగరాజా మా బాధ... మా రెండో అమ్మ కట్టడానికి తాడు లేకుండా
మోసుకురావడానికి గుడ్డ లేకుండా కట్టెలు తీసుకోని రమ్మనింది. అట్లా ఎట్లా తేవాల్నో అర్థంగాక ఏడుస్తా వున్నాం" అని చెప్పినారు.
దానికా పాము చిరునవ్వుతో “మీరేం బాధపడకండి. మీరు కట్టెలన్నీ కొట్టుకోండి. నేను పోయి మా స్నేహితులను ఐదుమందిని పిలుచుకొని వస్తాను. ముగ్గురమేమో
మోపుకు తాడులాగా వుంటాం. మరో ముగ్గురమేమో చుట్టచుట్టుకోని మీ నెత్తి మీద గుడ్డలాగా వుంటాము" అని చెప్పి వెళ్ళిపోయింది. దాంతో ఆ ముగ్గురు అమ్మాయిలు సంబరంగా కట్టెలన్నీ విరగొట్టి కుప్పలు చేసుకున్నారు. అంతలో ఆ పాము ఇంకో అయిదు పొడవాటి పాములతో అక్కడకు చేరుకోనింది. మూడేమో మోపులకు తాడులాగా తయారయితే, మరో మూడేమో నెత్తి మీద గుడ్డలాగా చుట్ట చుట్టుకున్నాయి. ఆ అమ్మాయిలు ఆ పాములతో మోపు కట్టుకొని ఇంటికి చేరినారు. ఇంట్లో కట్టెల మోపులు దించగానే పాములు ఎక్కడివక్కడ సరసరసర వెళ్ళిపోయినాయి. సవతి తల్లి వచ్చి చూస్తే ఇంగేముంది కట్టెలన్నీ కుప్పలుగా కనిపించినాయిగానీ తాడుగానీ, బట్టగానీ ఏమీ కన్పించలేదు. దాంతో ఏమీ అనలేక వాళ్ళను లోపలికి రానిచ్చింది.
అట్లా కొంత కాలం గడిచినాక ఒకరోజు ఆ సవతితల్లి మూడు కుండలు తెచ్చి వాళ్ళకిచ్చింది. వాటి కింద పెద్ద పెద్ద కన్నాలున్నాయి. "పొండి... పోయి ఈ కుండలతో చెరువు దగ్గరనుంచి నీళ్ళు తెచ్చి ఇంట్లో గచ్చులన్నీ నింపండి. వేరే కుండలు తెచ్చినా, కన్నాలకు ఏమన్నా అతికిచ్చినా మళ్ళా ఈ ఇంట్లోకి అడుగు పెట్టనీయను జాగ్రత్త" అని హెచ్చరించింది. దాంతో ఆ అమ్మాయిలు చెరువు దగ్గరికి పోయి నీళ్ళు అట్లా ఎట్లా తావాల్నో అర్ధంగాక ఏడుస్తా కూచున్నారు. ఆ
అంతలో ఒక కప్ప ఎగురుకుంటా వాళ్ళ దగ్గరికి వచ్చింది. “ఏం అమ్మాయిలూ... ఏమిట్లా చెరువుకాడ కూచోని ఏడుస్తా వున్నారు. ఏమి మీ బాధ" అనడిగింది. దానికా ముగ్గురు పిల్లలు కళ్ళమ్మట నీళ్ళు కారిపోతా వుంటే వెక్కి వెక్కి ఏడుస్తా "ఏం చెప్పమంటావు కప్పరాజా మా బాధ... మా రెండో అమ్మ ఈ కన్నం పడిన కడవలనిచ్చి వేరే కడవలు తీసుకురాకుండా, వీటికి ఏమీ అతికియ్యకుండా నీళ్ళు తెచ్చి గచ్చు నింపమనింది. అట్లా ఎట్లా తేవాల్నో అర్ధం గాక ఏడుస్తా వున్నాం" అన్నారు.
దానికా కప్ప "మీరేమీ బాధ పడకండి. నేను పోయి మా స్నేహితుల్ని మరో ఇద్దరిని పిలుచుకోనొస్తా... మేం కడవల్లోకి పోయి రంధ్రానికి అడ్డంగా, నీళ్ళు బైటకి పోకుండా కూచుంటాం. మీరు హాయిగా కడవలతో నీళ్ళు ముంచుకోని గచ్చునంతా నింపెయ్యండి" అనింది. ఆ అమ్మాయిలు సంబరంగా సరే అన్నారు. వెంటనే ఆ కప్ప చెరువులోనికి పోయి మరో రెండు కప్పల్ని పిలుచుకోనొచ్చింది. ఆ మూడూ మూడు కడవల్లో దూరి కన్నాల కడ్డంగా కూచున్నాయి. దాంతో పిల్లలు నీళ్ళు తీసుకోనొచ్చి గచ్చునంతా నింపేసినారు. వెంటనే ఆ మూడు కప్పులూ ఎక్కడివక్కడ ఎగురుకుంటా వెళ్ళిపోయినాయి. సవతితల్లి వచ్చి చూస్తే ఇంగేముంది... గచ్చు నిండా నీళ్ళు కనిపించినాయిగానీ ఆ కడవలకడ్డంగా ఏమీ కనిపించలేదు. దాంతో ఏమీ అనలేక వాళ్ళను లోపలికి రానిచ్చింది.
అట్లా కొంతకాలం గడిచినాక ఒక రోజు ఆ సవతి తల్లి ముగ్గురినీ పొలానికి తీసుకొని పోయి మూడు బస్తాల వడ్లు ఇచ్చి వీటిని తీసుకోని పోయి ఒక్కగింజ గూడా విరగకుండా సాయంకాలానికంతా బియ్యం చేసుకోని రాండి... లేకపోతే ఈ ఇంటి గడప తొక్కకండి" అనింది. ముగ్గురూ ఆ మూడు మూటలు ముందు పెట్టుకోని అన్ని గింజలను ముక్క విరగకుండా పొట్టు ఎట్లా తీయాల్నో అర్ధంగాక ఏడుస్తా కూచున్నారు.
అంతలో ఒక పిచుక ఎగురుకుంటా వాళ్ళ దగ్గరికి వచ్చింది. "ఏం అమ్మాయిలూ... ఏమిట్లా పొలంలో కూచోని ఏడుస్తా వున్నారు. ఏమి మీ బాధ" అనడిగింది. దానికా ముగ్గురు అమ్మాయిలు కళ్ళమ్మట నీళ్ళు కారిపోతా వుంటే వెక్కి వెక్కి ఏడుస్తా "ఏం చెప్పమంటావు  పిచుక రాజా మా బాధ...  మా రెండో అమ్మ ఈ మూడు బస్తాల వడ్లు ఇచ్చి ముక్క విరగకుండా వీటన్నిటినీ సాయకాలానికంతా బియ్యంగా చేసుకోని రమ్మనింది. అట్లా ఎట్లా చేయాల్నో అర్ధం గాక ఏడుస్తా వున్నాం" అన్నారు.
దానికా పిచుక “మీరేమీ బాధ పడకండి. నేను పోయి మా స్నేహితులందర్నీ పిలుచుకోనొస్తా... ఎంతసేపు. కండ్లు మూసి తెరిచేలోగా ఒక్క వడ్లగింజ కూడా మిగలకుండా అన్నిటినీ పొట్టు తీసేస్తాం" అనింది. దాంతో ఆ అమ్మాయిలు సంబరంగా సరేనంటూ శుభ్రంగా కసువుకొట్టి వడ్లన్నీ కింద పరిచినారు. అంతలో యాడి నుంచి వచ్చినాయోగానీ ఒకటిగాదు, రెండుగాదు వందలవందల పిచుకలు కిచకిచకిచమంటా అట్లా వాలినాయి. కండ్లు మూసి తెరిచేలోగా చకచకచక ముక్క విరగకుండా పొట్టంతా వలిచి మూటల్లో వేసి వెళ్ళిపోయినాయి. దాంతో ఆ ముగ్గురు అమ్మాయిలూ మూడు మూటలు తీసుకోని ఇంటికి పోయినారు. సవతి తల్లి దాంట్లో చూస్తే ఒక వలవని గింజగానీ, విరిగిన బియ్యం ముక్కగానీ కనబడలేదు. దాంతో ఏమీ అనలేక వాళ్ళను లోపలికి రానిచ్చింది.
ఆ సవతి తల్లికి వాళ్ళను ఇంట్లోంచి ఎట్లా బైటకు తరమాల్నో అర్థం గాక ఒకరోజు ఎవరూ లేని సమయంలో మొగునితో కొట్లాట పెట్టుకోనింది. "నీవు వాళ్ళని అడవిలో వదిలిపెట్టి వస్తావా లేక నేనూ నా పిల్ల విషం తాగి చావమంటావా అని పట్టుపట్టింది. దాంతో ఆమె మొగుడు ఏమీ చేయలేక తర్వాత రోజు ముగ్గురు పిల్లలతో “అమ్మా... పక్కవూరిలో పెద్ద తిరుణాల జరుగుతావుంది. మీ చిన్నమ్మ, చిన్న చెల్లి రేపొస్తారంట. మనము ఈ రోజే పోదాం. తయారుకాండి" అని చెప్పినాడు. పాపం... ఆ ముగ్గురు అమ్మాయిలూ తిరుణాలనగానే సంబరంగా
మంచి బట్టలు కట్టుకోని, మొగానికి బొట్టు పెట్టుకోని, తల్లో పూలు తురుముకోని, కళ్ళకు కాటుక దిద్దుకోని మల్లెపూలలెక్క మెరిసిపోతా బైలుదేరినారు. వాళ్ళనాన్న ఒక పెద్ద అడవిలోనికి వాళ్ళను తీసుకోని పోయి ఒకచోట కూచోబెట్టి “మీరు ఇంటికాన్నుంచి తెచ్చుకున్న సద్ది తింటా వుండండి. ఈ పక్కనొక మంచి మాగిన మామిడికాయల చెట్టొకటి వుంది. పోయి పండ్లు పట్టుకోనాస్తా" అని పోయినాడు. అట్లా పోయినోడు మరలా వెనక్కి గూడా తిరిగి చూడకుండా "అయ్యో... పాపం... ఆడపిల్లలని" గూడా అనుకోకుండా అదే సందని ఇంటికి వెళ్ళిపోయినాడు.
పాపం... ఆ ముగ్గురు అమ్మాయిలు ఆ అడవిలో నాన్నా... నాన్నా... అంటూ ప్రతి కొమ్మా రెమ్మా వెదికినారు. భయంతో కేకలు వేసినారు. ముగ్గురూ కలసి కిందామీదా పడి ఏడ్చినారు. చీకటి పడతా వుంటే ఎప్పుడు ఏ జంతువులు వచ్చి మీద పడతాయోనని గజగజా వణికిపోసాగినారు.
అదే సమయంలో ఆ పక్కవూరికి చెందిన ముగ్గురు రాకుమారులు అడవి జంతువులను వేటాడి ఇంటికి తిరిగిపోతా వున్నారు. వాళ్ళు ఏడుస్తా వున్న ఆ ముగ్గురు అమ్మాయిల్ని చూసినారు. వాళ్ళ కథంతా విన్నారు. “అబ్బ... ఎంతందంగా వున్నారు ముగ్గురూ ముత్యాల్లెక్క... చేసుకుంటే ఇట్లాంటి చక్కని చుక్కల్నే చేసుకోవాల" అనుకోని ఆ ముగ్గురినీ వాళ్ళింటికి పిలుచుకోని పోయి పెండ్లి చేసుకున్నారు. దాంతో వాళ్ళ దశ తిరిగి హాయిగా కాలు మీద కాలేసుకోని కులాసాగా బతకసాగినారు.
ఇక్కడ వాళ్ళ నాన్న, చిన్నమ్మ వున్నారు గదా... ఆ వూళ్ళో పెద్ద కరువొచ్చింది. ఒక్క వాన చుక్కగూడా భూమి మీదకు రాలలేదు. దానికితోడు ఒకరోజు రాత్రి కొందరు దొంగలు వాళ్ళింటి మీద పడి వున్నదంతా నున్నగా పూడ్చుకోని పోయినారు. ఒకవైపు డబ్బుల్లేక, మరొక వైపు పంటల్లేక వాళ్ళు వీధిన పడినారు. ఆ వూరిలో బతకలేక వేరే వూర్లలో తినడానికి తిండి లేక ఆడుక్కోసాగినారు.
అట్లా ఒకొక్క వూళ్ళో అడుక్కుంటా అడుక్కుంటా ఒకరోజు ఈ ముగ్గురూ వున్న వూరొచ్చినారు. వాళ్ళు అట్లా అడుక్కుంటా వుంటే మిద్దె మీది నుంచి ముగ్గురూ చూసి "అయ్యో.... మన నాన్నా, చిన్నమ్మా, చిన్న చెల్లెలే గదా" అని వురుక్కుంటా వచ్చి కళ్ళనీళ్ళు బెట్టుకున్నారు. వాళ్ళని చూసిన చిన్నమ్మ "మిమ్మల్ని బాధ పెట్టినందుకేనమ్మా మాకీ కష్టాలు. మంచి వాళ్ళని బాధపెట్టి బాగుపన్నవాళ్ళు ఈ లోకంలో ఎవరూ వుండరు" అంటూ భోరున ఏడ్చింది. "అయ్యయ్యో... అంతమాట అనకమ్మా... మీరు ఆ రోజు అట్లా చేయబట్టేగదా... మాకీరోజు ఇన్ని భోగభాగ్యాలు, అంతా మా మంచికే జరిగింది" అంటూ అందర్నీ ఇంటికి పిలుచుకోనొచ్చినారు. వాళ్ళ మొగుళ్ళకు చెప్పి మోయలేనంత బంగారమిచ్చి పసుపూకుంకుమలతో పంపిచ్చినారు.
*****************************
డా.ఎం.హరికిషన్-కర్నూలు-9441032212
*****************************
కథ నచ్చితే *SHARE* చేయండి. రచయిత పేరు మార్చకండి. తీసేయకండి.
 *🌻పరివర్తన🌻*

🥀పూర్వం ఒకప్పుడు సత్యధర్మి అనే రాజు పాలిస్తూండేవాడు. పేరుకు తగినట్టుగా ఆ రాజు మిక్కిలి ఔదార్యవంతుడు. న్యాయశీలుడు. మంచి దైర్యశాలి. ఎప్పుడూ తన రాజ్యంలో ప్రజల అవసరాలను తీర్చి వారి సుఖసౌఖ్యాలను పాటుపడుతూండేవాడు. 

🥀ప్రజలకు ఎటువంటి అపాయం రాకుండా రక్షిస్తూండేవాడు. వారివారి తాహతులకు తగినట్లుగా సహాయం చేస్తూ ప్రజలకు ఉత్సాహం కలిగించేవాడు. రాజ్యం శాంతి భద్రతలతో, సకల సౌభాగ్యాలతో తులతూగుతూండేది ప్రజలు ఎప్పుడూ రాజు మంచితనాన్ని పొగుడుతుండేవారు.

🥀ఒకరోజు సాయంకాలం ఆ రాజు ఉద్యానవనంలో విహరిస్తూ దగ్గరగా ఉన్న అడవిలోకి ప్రవేశించాడు. ఆ అడవి రకరకాల చెట్లతో దట్టమై అతి సుందరంగా ఉంది. ప్రకృతి సౌందర్యానికి రాజు ముగ్దుడై ఆనందిస్తున్నాడు. 

🥀కొంతసేపటికి ఆ రాజుకి ఆకలివేసింది. దగ్గరగా ఉన్న ఒక ఆశ్రమం చేరాడు. అక్కడ ఒక సాధువు నివసిస్తున్నాడు. ఆ సాధువును సమీపించిన రాజు "ఓ సాధువుంగవా ! ఇక్కడ ఇన్ని వృక్షాలు ఫలాలతో క్రుంగిపోతున్నాయి. ఏ చెట్టు పళ్ళు మధురంగా, రసవంతంగా ఉంటాయి? ఏ చెట్టు పళ్ళు చేదుగా విషమయమై ఉంటాయి? ఏ పళ్ళు తినాలి? ఏవి తినకూడదు?" అని అడిగాడు.

🥀సాధువు "ఓ స్నేహితుడా ఇక్కడ నీకిష్టమైన పళ్ళు నీవు తినవచ్చు. సత్యధర్మి ధర్మరాజు వంటివాడు. అతడి మంచితనం వల్ల ఈ రాజ్యంలో చేదుపళ్ళు అనేవి లేనేలేవు. రాజు చిరంజీవి అగుగాక ఆ వేప చిగుళ్ళు మధురాతి మధురమైన ద్రాక్షపళ్ళులా ఉంటాయి. పుల్లటి చింతపండు పండిన మామిడి పండులాగా తియ్యగా ఉంటుంది. ధర్మాన్ని రక్షించే వారిని ధర్మం రక్షిస్తుంది" అన్నాడు.

🥀వెంటనే సత్యధర్మి కొన్ని వేప చిగుళ్ళు కోసి తిన్నాడు. ఆశ్చర్యం అని మధుర రసం ఉట్టిపడే ద్రాక్షపళ్ళులా ఉన్నాయి. చింతపండు తిని చూశాడు. అతి తియ్యని మామిడి పండులా ఉంది. రాజు ఎంతో సంతోషపడ్డాడు. ఆనందంతో ఊరివైపు బయలుదేరి వచ్చాడు.మనస్సులో అహంకార బీజం మొలకెత్తింది. నేనెంతో గొప్ప రాజును. ప్రపంచంలో నాతో సమానమైన రాజు ఎవ్వరు? ఆహా నా కీర్తి నాలుగు దిక్కులా వ్యాపించింది" అనుకున్నాడు.

🥀రాజు అహంకార గర్వంతో రాజ్యపాలనను అశ్రద్ధ చేయడం ప్రారంభించాడు. ప్రజల కష్ట సుఖాలను గుర్తించడం లేదు. సదా త్రాగుతూ, తింటూ, నిద్రపోతూ కాలం గడపడం ప్రారంభించాడు. ప్రజలకు ఆశ్చర్యం కలిగింది. ఎక్కడ చూసినా రాజ్యంలో అల్లరులు, దోపిడీలు, దొంగతనాలు, కొట్లాటలు. పంటలు పండడం లేదు. అనావృష్టి ప్రబలిపోయింది అయినా రాజు ప్రవర్తనలో మార్పు రాలేదు. తుచ్చ సుఖాలతో ఆనందపడి పోతున్నాడు.

🥀ఒకరోజు తిరిగి రాజు విహారానికి బయలు దేరాడు. పూర్వం వెళ్ళిన వనంలోకే వెళ్లాడు. పూర్వం చూసిన ఆశ్రమానికే వచ్చాడు. అప్పుడు చూసిన ఆశ్రమానికే వచ్చాడు. అప్పుడు చూచిన సాధువునే చూచాడు. తన గొప్పతనాన్ని వినడానికి కుతూహలపడుతున్నాడు. 

🥀సాధువు వీపుపై తట్టి "ఓ మానవా వనంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి? నన్ను ఏ పళ్ళు తినమంటావు. వేపాకు తినమంటావా? చింతపండు తినమంటావా??"అని అడిగాడు.

🥀సాధుపుంగవుడూ నిర్లక్ష్యంగా "రాజ్యమంతా చెడిపోయింది. రాజు ప్రజల మంచి చెడ్డలను గ్రహించడం లేదు. రాజ్యంలో కరువు ఏర్పడింది. వానలు లేవు. తిండి గింజలు లేవు. పాపం పెరిగిపోయింది. ఏ పండు చూచిన పుచ్చు, పురుగు మధురమైన మామిడిపండు మట్టిముద్దలా ఉంటూంది. ప్రజలు ఈ రాజ్యాన్ని వదులుకుని ఎక్కడికైనా పోదామని తహతహలాడిపోతున్నారు" అన్నాడు. 

🥀రాజు విమర్శకు ఉలిక్కిపడ్డాడు. నిట్టూర్పు విడిచాడు. అణకువతో నమ్రతతో సాధువు కాళ్ళపైబడి "ఆ పాపాత్ముణ్ణి నేనే. ఈ విపరీత పరిస్థితికి నేనే కారణం. అహంకారం ఆవరించుకుపోయింది. నన్ను రక్షించి ఆశీర్వదించు ప్రభూ" అని వేడుకున్నాడు.

🥀సాధువు రాజును ఆశీర్వదించాడు. సత్యధర్మి నడవడి మారిపోయింది. రాజ్యాన్ని తిరిగి ధర్మయుక్తంగా పాలించడానికి ప్రారంభించాడు. సకాలంలో వర్షాలు పడ్డాయి. పంటలు పుష్కలంగా పండాయి. చెట్లు మధురమైన పళ్ళను ఫలింపచేసాయి. రాజ్యం సౌభాగ్యంతో వర్ధిల్లుతోంది. ఏ మూల చూసినా ప్రజలు రాజు గొప్పతనాన్ని గురించి చెప్పుకోవడం ప్రారంభించారు.

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️

భేతాళ కథలు💦* *🌻3వ కథ ఆగ్రహించిన దేవత

 *💦భేతాళ కథలు💦*

*🌻3వ కథ ఆగ్రహించిన దేవత🌻*


♦️పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి, చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని, ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం వైపు రాసాగాడు. 

♦️అప్పుడు శవంలోని బేతాళుడు, "రాజా, ఏ దేవతను తృప్తి పరచటానికి గాను నీవీ నిశిరాత్రి వేళ ఈ విధంగా శ్రమపడుతున్నావో నాకు తెలియదు గాని, దేవతలను తృప్తి పరచటం మానవులకు సాధ్యమైన పని కాదు.. ఒక్కొక్కసారి మానవులు చూపే భక్తి వాళ్ళకు ఆగ్రహం కూడా తెప్పిస్తుంది. అందుకు తార్కాణంగా నీకు చెప్పులు కుట్టే మల్లడి కథ చెబుతాను విను." అంటూ ఈ విధంగా చెప్పసాగాడు.

♦️ఒకప్పుడు నరకంలో యమకింకరులు ఒక పాపిని ముళ్ళ మీదుగా నడిపించి, కాళ్ళూ, చేతులూ విరిచి కట్టి కాలిన ఇసుక దిబ్బ మీద పడేసి వెళ్ళిపోయారు. పాపి బాధకు తట్టుకోలేక గట్టిగా ఏడుస్తున్నాడు.

♦️అప్పుడు ఆకాశమార్గాన వెళుతున్న ఒక దేవతాస్త్రీ వాడి ఆక్రందన విని, జాలిపడి, వాడున్న చోటికి దిగి వచ్చి, వాడి కాళ్ళలో గుచ్చుకున్న ముళ్ళన్నీ తీసేసి, వాడి బాధ కొంత తగ్గించి, తన దారిన తాను స్వర్గానికి వెళ్ళిపోయింది.

♦️అయితే, నరకంలో ఒక పాపి కాళ్ళు తాకినందున ఆమె చేతి వేళ్ళకు నరక మలినం అంటుకున్నది. ఎంత ప్రయత్నించినా అది పోలేదు. ఆమె వేళ్ళకు అంటుకున్న మాలిన్యాన్ని గురించి దేవతా స్త్రీ లందరికీ త్వరలోనే తెలిసిపోయింది. చివరకు ఆ సంగతి దేవేంద్రుడి దాకా వెళ్ళింది.

♦️దేవేంద్రుడు ఆమెను పిలిపించి, ఆమె వేళ్ళు. పరీక్షించి, " ఈ నరక మాలిన్యం నీ కెలా సోకింది ?" అని అడిగాడు. 

♦️ఆమె జరిగిన సంగతంతా దేవేంద్రుడికి చెప్పింది.

♦️అంతా విని దేవేంద్రుడు, దేవతవై ఉండి నీవు నరకానికి వెళ్ళటమే తప్పు. అక్కడ ఒక పాపి తాను చేసిన పాపాలకు శిక్ష పొందుతూంటే నీవు జోక్యం కలిగించు కోవటం మరింత తప్పు. ఈ నరక మాలిన్యం వదిలిన దాకా నీవు భూలోకంలోకి వెళ్ళి అక్కడ చెప్పులు కుట్టుతూ ఉండు. నీ తప్పుకదే శిక్ష!" అన్నాడు.

♦️దేవత తన మాలిన్యం సాధ్యమైనంత త్వరలో వదిలేటట్టు అనుగ్రహించమన్నది. ఒక వెయ్యి జతల చెప్పులు కుట్టే సరికి నీ మాలిన్యం దానంతట అదే పోతుంది,” అన్నాడు దేవేంద్రుడు.

♦️దేవత భూలోకానికి వచ్చేసి ఒక చెప్పులు కుట్టే వాళ్ళు ఎన్నుకుని, రాత్రివేళ వాడికి కొన్ని జతల చెప్పులు కుట్టి తెల్లవారే సరికల్లా సిద్ధంగా ఉంచింది.

♦️ఆ చెప్పులు కుట్టే వాడు చాలా సత్పురుషుడు, దైవ భక్తి కలవాడు. అందుకే ఆమె వాణ్ణి ఎన్నుకొనింది. కానీ వాడు చాలా పేదవాడు. వాడు కుట్టే చెప్పులు మోటుగా ఉండేవి. ధనికులు ధరించే చెప్పులు కుట్టటం వాడికి చేత కాదు. దేవత వాడికి చాలా నాజూకైన చెప్పులు కుట్టి ఇచ్చింది.

♦️మర్నాడు ఉదయం వాడా చెప్పులు చూసుకుని తన కళ్ళను తానే నమ్మలేక పోయాడు. అవి ఎవరు కుట్టారో, ఎలా వచ్చాయో వాడికి తెలియదు. కాని అవి మటుకు తాను సిద్ధం చేసి ఉంచుకున్న తోలుతో కుట్టినవే. వాడు ఆ చెప్పులను ఆమ్ము కుందామని నగరంలోకి వెళ్ళాడు. అవన్నీ ఆతి శీఘ్రముగా అమ్ముడయ్యాయి. డబ్బు కూడా బాగా వచ్చింది. అందులో తన అవసరానికి కొద్దిగా ఉంచుకుని మిగిలినది పెట్టి మేలైన తోళ్ళు కొనుక్కుని, వాడు ఇంటికి తిరిగి వచ్చాడు.

♦️ఆ రాత్రి దేవత వాడు తెచ్చిన తోళ్ళ నన్నిటినీ ఎంతో అందమైన చెప్పుల జతల కింద మార్చేసింది.

♦️ఏ దేవతో తనకు సహాయ పడుతున్నట్టు చెప్పులు కుట్టేవాడికి అర్ధమయింది. ఆరోజు కారోజు వాడు హెచ్చు డబ్బు సంపాదిస్తున్నాడు. పెద్ద మొత్తాలలో తోళ్ళు కొంటున్నాడు. ఎంత తోలు కొన్నా అంతా మర్నాటికి దివ్యమైన పాదరక్షలుగా తయారై సిద్ధంగా ఉంటున్నది.

♦️కొద్ది రోజుల్లోనే వాడు సుఖంగా బతికే స్థితికి వచ్చాడు. వాడి చెప్పులకు మంచి గిరాకీ, మంచి పేరుకూడా వచ్చింది. తనకు సహాయం చేస్తున్న దేవత పట్ల వాడికి భక్తి పొంగి పొర్లసాగింది. ఆ దేవత కోసం వాడు రాత్రివేళ పూజాద్రవ్యాలూ, గంధమూ, పుష్పాలూ, తాంబూలమూ, ధూపమూ, దీపారాధనా ఉంచసాగాడు.

♦️చెప్పులైతే మామూలు ప్రకారం తయారవుతూనే ఉన్నాయి గానీ, తన పై ఇంత అనుగ్రహం గల ఆ దేవత తాను సమర్పించే వస్తువులలో ఒక్కటి తాక లేదు. దేవత అరగింపు కోసం ఫలాలు మొదలైనవి నైవేద్యం ఉంచాడు. వాటినీ దేవత తాక లేదు. 

♦️ఒక నాడు కొత్త బట్టలుకొని తాంబూలంతో సహా దేవతకు అర్పించాడు. దేవత తీసుకోలేదు. 

♦️ఒకరోజు పళ్ళెంలో కొన్ని రూపాయలు పోసి ఉంచాడు. మర్నాడు ఉదయం, పోసిన రూపాయలు పళ్ళెంలో పోసినట్టుగానే ఉన్నాయి.

♦️చెప్పులు కుట్టేవాడు ఆ దేవతను ప్రార్థించాడు, "ఓ దేవతా, నీ వల్ల ఎంతో లాభం పొందుతున్నాను. అందుకు కృతజ్ఞతగా నేను ఇచ్చేది ఏదీ ముట్టవెందుకు ? నా మీద ఎంతో దయలేకపోతే ప్రతి రాత్రి నా కోసం చెప్పులు తయారు చేస్తావా? నేను భక్తితో ఇస్తున్న వాటిలో కనీసం ఒక పుష్పమో, ఫలమో స్వీకరించి నాకు ఆనందం చేకూర్చు! నీవు నా నుంచి ఏదో ఒకటి తీసుకుని అనుగ్రహించిన దాకా నా మనస్సుకు శాంతి ఉండదు.” అంటూ వాడు రోజూ దేవతను ప్రార్థించసాగాడు.

♦️చెప్పులు కుట్టేవాడు చేసేదంతా దేవత గమనిస్తూనే ఉంది. వాడి భక్తి శ్రద్ధలకు ఆమె తనలో తాను నవ్వుకున్నది. కాని వాడు ప్రార్థనలు మొదలు పెట్టాక ఆమె సహించ లేకపోయింది. రెండు మూడు రోజులు ప్రార్థించి, విసిగి, వాడే మానేస్తాడేమోనని ఆమె ఆనుకున్నది. 

♦️కాని ఆ రోజు కారోజు వాడి ఆరాటం జాస్తి అవుతున్నది. వాడి ప్రార్థనలు దేవతను కలవరపరచ సాగాయి.

♦️ఆ బాధ పడలేక దేవత వాడి ఇల్లు వది లేసి మరొక ధనికుడైన చెప్పులు కుట్టేవాడి ఇంటిని ఆశ్రయించింది. ఆమె చేతి మాలిన్యం చాలావరకు పోయింది. ఇంకా కొద్ది వందల చెప్పుల జతలు మాత్రమే కుట్టవలిసి ఉన్నది. ఈ రెండో చెప్పులు కుట్టేవాడింట చెప్పులు కుట్టే తోళ్ళు గుట్టలు గుట్టలుగా ఉన్నాయి. ఒక్క రాత్రిలో దేవత వాటన్నిటినీ చెప్పుల జతల కింద మార్చేసి, తన నరక మాలిన్యం పూర్తిగా పోగొట్టుకుని, స్వర్గానికి వెళ్ళి పోయింది.

♦️ఇక్కడ మొదటి చెప్పులు కుట్టేవాడు, దేవత తనను విసర్జించి పోయినట్టు తెలుసు కున్నాడు. తాను కొన్న తోళ్ళు చెప్పులుగా మారటం నిలిచిపోయింది. దేవత తనపై ఆగ్రహించింది. తన వల్ల ఏమి అపచారం జరిగినది. వాడికి తెలియదు. వాడా దిగులుతో మంచం పట్టి తీసుకుని, కొంత కాలానికి చనిపోయాడు.

♦️బేతాళుడు ఈ కథ చెప్పి, "రాజా, నా కొక సందేహం. బీదవాడైనప్పటికీ, సత్పురుషడనే కదా దేవత మొదటి చెప్పులు కుట్టే వాళ్లు ఎన్నుకుని వాడిపై అనుగ్రహించింది? మంచి వాళ్ళకు దైవభక్తి ఉండటం సహజం. తమ భక్తుల కోరికలు తీర్చటం దేవతలకు కూడా సహజమే. అటువంటప్పుడు దేవత వాడు సమర్పించిన కానుకలలో ఏ ఒకటి ముట్టక, వాళ్ల అసంతృప్తి పరచటానికి, వాడి న్యాయమైన కోరిక తీర్చక నిరుత్సాహ పరచటానికి ఏమిటి కారణం ? ఈ సందేహానికి జవాబు తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలి పోతుంది,” అన్నాడు.

♦️దానికి విక్రమార్కుడు, దేవత కోరినది చెప్పులు కుట్టే వాణ్ణి అనుగ్రహించటమూ, వాడికి లాభం చేకూర్చటమూ కాదు. తన మాలిన్యాన్ని పోగొట్టుకొనటం. తాను కుట్టిన చెప్పులతో మంచివాడు బాగు పడితే ఆమెకేమీ అభ్యంతరం లేదు. కాని చెప్పులు కుట్టేవాడు మూఢుడై దేవతకే ప్రత్యుపకారం చేయబోయాడు. వాడిచ్చిన వస్తువులలో దేన్ని తాకినా, నరక మాలిన్యం పోయేలోపుగా భూలోక మాలిన్యం అంటు కుంటుందేమోనని దేవత భయపడింది. చెప్పులు కుట్టేవాడి కోరికను దేవత అందుకే తీర్చలేదు,” అన్నాడు.

♦️రాజుకు ఏ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు.

🌼🌼🍒🍒🍒🌻🍒🍒🍒🌼🌼
 నిజాల వేట - సాక్షి పత్రికలో వచ్చిన బాలల కథ డా.ఎం.హరికిషన్-9441032212-కర్నూల్
**************************
       మహారాజు సింహాసనం అధిష్టించి పది సంవత్సరాలు పూర్తి అయింది. దాంతో తన పరిపాలన ఎలా వుందో తెలుసుకోవాలనుకున్నాడు. అంగరంగ వైభవంగా సమావేశం ఏర్పాటు చేశాడు. సామంతులు, సైన్యాధికారులు, వ్యాపారస్తులు, కళాకారులు, పుర ప్రముఖులు అందరినీ ఆహ్వానించాడు. మహారాజు వచ్చిన వాళ్లందరినీ చిరునవ్వుతో చూస్తూ "నా పాలనలో రాజ్యమంతా సుభిక్షంగా ఎలా వుందో తెలుసుకోవడానికి ఈ సభ ఏర్పాటు చేశాను. బాగుంటే బాగుందనండి. లేదంటే లేదనండి. సరిదిద్దుకోవల్సిన అంశాలు వుంటే తెలియచేయండి. రాజ్యం మరింత సుసంపన్నం కావడానికి సలహాలు ఇవ్వండి" అన్నాడు.
    ఒక పది నిమిషాలు అక్కడ మౌనం తాండవించింది. "మహారాజా... మీరు మాకు దేవుడిచ్చిన వరం. ఎన్ని జన్మలైనా మీరే మాకు రాజుగా ఉండాలి. అదే మా అందరి కోరిక" అంటూ నోరిప్పారు సామంతులు.
    "మీ పాలనలో ఎటువంటి తిరుగుబాట్లు లేవు. రాజ్యమంతా ప్రశాంతంగా సుఖసంతోషాలతో నిండి వుంది. ప్రజలు ఆరుబయట మంచాలు వేసుకొని, తలుపులకు తాళాలు కూడా వేసుకోకుండా పడుకుంటున్నారు" అన్నారు సైన్యాధికారులు.
    "వ్యాపారాలు పుష్కలంగా జరుగుతున్నాయి. గల్లాపెట్టెలు గలగలలాడుతున్నాయి. నగరంలో దొరకని వస్తువంటూ ఏదీ లేదు. ఎగుమతులు కూడా రోజురోజుకీ పుంజుకుంటున్నాయి" అన్నారు వ్యాపారస్తులు.
    "రాజ్యంలో ఎక్కడ చూసినా సభలు, సమావేశాలు, నాటక ప్రదర్శనలు, కవితా పఠనాలు, కొత్త గ్రంథాల ఆవిష్కరణలు, పురస్కారాలు, సన్మానాలతో ఆ శ్రీకృష్ణదేవరాయలే మళ్లీ జన్మించాడా అన్నట్టుంది ప్రభూ మాకు" పొగిడారు కళాకారులు.
    ఒక్కొక్క మాటకు రాజు ఛాతి ఒక్కొక్క అంగుళం సంతోషంతో పెరిగిపోసాగింది. మొహంలో కోటి నక్షత్రాల కాంతులు వెదజల్లసాగాయి. వచ్చిన వారందరికీ దేశదేశాల నుండి తీసుకొని వచ్చిన, రకరకాల ఆహార పదార్థాలతో విందు భోజనం ఏర్పాటు చేసి కానుకలతో సత్కరించి పంపించాడు.
    రాత్రి అంతఃపురంలో తూగుటుయ్యాల మీద ఊగుతూ మహారాణితో "చూశావా రాణీ... నా పరిపాలనలో రాజ్యం ఎలా సుభిక్షంగా కళకళలాడిపోతున్నదో. ఎక్కడా ఆకలికేకలు లేవు. తిరుగుబాట్లు లేవు. అందరూ నన్నే మరలా మరలా రాజు కావాలంటూ నింగిని తాకేలా కీర్తిస్తున్నారు" అన్నాడు సంబరంగా.
    రాణి చిరునవ్వుతో "అలాకాక ఇంకెలా చెబుతారులే మహారాజా మీ వద్ద. రాజంటే ఆ మాత్రం భయం ఉండాలి కదా" అంది తాంబూలం అందిస్తూ.
    ఆ మాటల్లో ఏదో వ్యంగ్యం కనబడింది రాజుకు.
    "అంటే... ఆ పొగడ్తలన్నీ కేవలం భయం వల్ల వచ్చినవి అంటావా" ప్రశ్నించాడు నవ్వు ఆపి.
    "భయం వల్లనే కాకపోవచ్చు. మీతో వారికున్న అవసరాల వల్ల కూడా కావచ్చు" అంది రాణి.
    "విషయం సూటిగా చెప్పు" ఊగుతున్న ఊయలను ఆపి అడిగాడు మహారాజు.
    "రాజా... మీ ముందు నిలబడి మీకు వ్యతిరేకంగా మీ కింద పనిచేసే అధికారులు ఎవరైనా నోరు విప్పగలరా. మనసులో మాట చెప్పగలరా. మీరు మంచి పనులు చేసినా, పిచ్చి పనులు చేసినా ఆహా... ఓహో... అని ఆకాశానికి ఎత్తేసేటోళ్ళే తప్ప విమర్శించేటోళ్లు ఎవరు" అంది.
    "అయితే వాళ్ళందరూ అలా అబద్ధాలు ఆడుతూ నన్ను వూరికే పొగుడుతున్నారని నిరూపించగలవా" అన్నాడు రాజు.
    "తప్పకుండా మహారాజా... మీకు అసలు రాని కళ ఏదైనా వుంటే చెప్పండి" అంది.  మహారాజు కాసేపు ఆలోచించి "నీకు తెలియనిదేముంది రాణీ... సంగీతమంటే నాకు ప్రాణం. మిగతా లలిత కళల్లో కూడా ఎంతో కొంత ప్రావీణ్యం వుంది. కాకపోతే అసలు రానిది, ఎప్పుడూ ముట్టుకోనిదీ చిత్రలేఖనం ఒక్కటే" అన్నాడు.
    "అయితే ఒక పని చేయండి మహారాజా. ఒక్కరోజులో చిత్రలేఖనం గురించి తెలుసుకొని మీకు ఎలా తోస్తే అలా రకరకాలుగా చిత్రాలు చిత్రించండి. అవన్నీ ప్రదర్శనకు పెడదాం. ఇప్పుడు పిలిచిన వాళ్లందరినీ అప్పుడు కూడా ఆహ్వానిద్దాం. తెలుస్తుంది ఎవరు ఏమంటారో" అంది.
    మహారాజు సరే అని ఒక ప్రముఖ చిత్రకారున్ని పిలిపించి ఒక రోజంతా చిత్రకళ గురించి తెలుసుకున్నాడు. తర్వాత రోజు నుంచి బొమ్మలు గీయడం మొదలుపెట్టాడు. కుడి చేత్తో కొన్ని, ఎడం చేత్తో కొన్ని, నోటితో పట్టుకొని కొన్ని, వెనక్కి తిరిగి కొన్ని, ఆఖరికి పడుకొని, కూర్చుని, నుంచుని రకరకాలుగా వారం రోజుల్లో వంద చిత్రాలు పూర్తి చేశాడు. వాటన్నింటినీ ప్రదర్శనకు పెట్టాడు. అందులో కొన్ని చిత్రాలను తిరగేసి కూడా పెట్టాడు. సామంతులను, అధికారులను, పుర ప్రముఖులను, వ్యాపారవేత్తలను, కళాకారులను అందరినీ తన చిత్రకళ ప్రదర్శనకు ఆహ్వానించాడు.
    ప్రదర్శనా ప్రాంగణమంతా నగర ప్రముఖులతో నిండిపోయింది. ఏ చిత్రం చూసినా రంగులు ఒకదానితో ఒకటి కలసిపోయి కనిపించాయి. దేనిలో ఏముందో, అందులో భావమేమో ఎంత ఆలోచించినా ఎవరికీ అంతుచిక్క లేదు. అర్థం కానిదంతా అద్భుతమే అని తీర్మానించుకున్నారు. అవతల ఉన్నది మహారాజు. తప్పు పట్టినా, బాగా లేదన్నా కొరడా దెబ్బలు శరీరం మీద భరతనాట్యం చేస్తాయి. దాంతో ఎందుకైనా మంచిదని 'ఆహా' అన్నారు కొందరు. వెంటనే 'ఓహో' అన్నారు మరికొందరు. 'అద్భుతం. మీకు మీరే సాటి' అంటూ అందుకొన్నారు ఇంకొందరు.
    ఇలా పొడి పొడి మాటలైతే లాభం లేదనుకొని ఇంకొకరు ముందడుగు వేసి "మహారాజా... ఇంత వేగంగా ఇన్ని చిత్రాలు గీయడం మామూలు మానవులకు సాధ్యం కాదు. మీలాంటి కారణజన్ములు ఏడేడు పద్నాలుగు లోకాల్లో ఎక్కడా ఉండరు. మీకు చిత్రరత్న పురస్కారం ఖచ్చితంగా ఇచ్చి తీరవలసిందే" అన్నాడు.
    అది విన్న మరికొందరు తాము ఎక్కడ వెనుకబడి పోతామో అనుకుంటూ "మహారాజా... ఈ చిత్రాలు మీరు గనుక మాకు ఇస్తే మా భవనాలలో అందరికీ కనపడేలా అలంకరించుకుంటాం. వీటివల్ల మా ఇంటి అందం రెట్టింపు అవుతుంది" అన్నారు. ఒకరిని చూసి మరొకరు పొగడ్తలలో పోటీపడ్డారు. వాళ్ళలా పొగడ్తల వర్షం కురిపిస్తా వుంటే మహారాజు తన పక్కనే ఉన్న మహారాణికి మొహం చూపించలేక సిగ్గుతో చితికిపోయాడు.
    ప్రదర్శన పూర్తయి అందరూ వెళ్ళిపోయాక "అర్థమైంది కదా రాజా ప్రముఖుల సంగతి. మీ పాలన గురించి నిజానిజాలు తెలియాలంటే ధనవంతులను కాదు కలవాల్సింది పేద ప్రజలను. అధికార దర్పంతో రాజుగా కాదు వాళ్లలో ఒకరిగా మారిపోవాలి. అప్పుడే మీ లోటుపాట్లు తెలుస్తాయి. సరిదిద్దుకోవలసినవి అర్థమవుతాయి" అంది. మహారాజు చిరునవ్వు నవ్వి మహారాణి నుదుటిపై చిరుముద్దు పెట్టాడు. తర్వాతరోజే సాధారణ పల్లెమనిషిగా మారువేషం వేసుకొని కాలినడకన నగర సంచారానికి బయలుదేరాడు. నిజాల వేటకై.
**************************
డా.ఎం.హరికిషన్-9441032212-కర్నూల్
**************************
కథ నచ్చితే *SHARE* చేయండి. రచయిత పేరు మార్చకండి. తీసేయకండి.
 *చిలుకముక్కు చిన్నోడు* - సంయుక్త అక్షరాలు లేని కథ - డా.ఎం.హరికిషన్- కర్నూలు-9441032212
*****************************
          ఒక అడవిలో ఒక పిల్లోడు వుండేవాడు. వాడు చానా మంచోడు. బాగా చదువుతాడు. మంచి ఎత్తు. చక్కని రంగు. రింగులు తిరిగిన జుట్టు వుండేది. కానీ పాపం వాని ముక్కు కొంచెం పెద్దగా వుండి, ముందు భాగం వంపు తిరిగి అచ్చం చిలకముక్కులా వుండేది. దాంతో అందరూ వాన్ని ''రేయ్‌... చిలకముక్కోడా'' అని బాగా ఎగతాళి చేసేవాళ్ళు. వానికి అద్దంలో తన ముక్కు చూసుకున్నప్పుడల్లా చానా బాధ కలిగేది. ఒక్కడే కూచోని కళ్ళనీళ్ళు పెట్టుకునేవాడు. ఎప్పుడూ అదే ఆలోచన. ఒకటే బాధ. దాంతో నెమ్మదిగా చదువు అటకెక్కింది. బడిలో బాగా వెనుకబడిపోయాడు.

ఆ పిల్లోని ఇంటి వెనుక పెరడులో ఒక మామిడిచెట్టు వుంది. దాని మీద ఒక అందమైన రామచిలుక గూడు కట్టుకుంది. ఒకరోజు ఆ పిల్లోడు పెరటిలో మంచమేసుకొని పడుకున్నాడు. ఎదురుగా కనబడిన చిలుకను చూసి ''ఏయ్‌... చిలుకా.. నీ ముక్కు నా ముక్కు ఒకేలా వున్నాయి. కానీ నీ ముక్కు చూసి అందరూ అబ్బ... ఎంత ముచ్చటగా వుంది అని పొగుడుతారు. నా ముక్కు చూసి 'ఛీ...ఛీ... ముక్కెలా వుందో చూడు అచ్చం చిలకముక్కులా అంటూ తిడతారు. ఈ ముక్కు వంకర పోయి చక్కగా ఎప్పుడు మారతాదో ఏమో'' అన్నాడు.

ఆ మాటలకు చిలుక చిరునవ్వు నవ్వి ''ఈ లోకంలో అందరికీ అన్నీ వుండవు. ముక్కు బాగుంటే మూతి బాగుండదు. కన్ను బాగుంటే కాలు బాగుండదు. కొందరు ఎత్తుగుంటే ఇంకొందరు పొట్టిగుంటారు. కొందరు లావుగుంటారు. మరికొందరు బక్కగా వుంటారు. కొందరికి అవయవాలన్నీ బాగున్నా అందమైన మనసు వుండదు. సరే ఇవన్నీ ఎందుకుగానీ నా మీద ఎక్కి కూచో. నీకు కొన్ని చూపించాలి'' అంది.

వాడు పకపక నవ్వి ''నువ్వుండేదేమో జామకాయంత. నేనుండేదేమో పనసకాయంత. ఎలా కూచుంటా నీమీద'' అన్నాడు.

''అదా నీ అనుమానం. పరవాలేదు. నేను అలాంటిలాంటి అల్లాటప్పా చిలుకను గాదు. దేవలోకంలో దేవతల దగ్గర పెరిగినదాన్ని. కొంతకాలం ఈ అందమైన భూమి ఎలా వుంటుందో చూద్దామని వచ్చా. నేను కావాలంటే ఏనుగంత పెద్దగా మారగలను. చీమంత చిన్నగా కాగలను. ఒక్క నిమిషం ఆగు'' అంటూ నెమ్మదిగా పెరగడం మొదలు పెట్టింది. ముందు పావురమంత అయ్యింది. తరువాత కోడిపుంజంత అయ్యింది. మరునిమిషం నెమలంత అయ్యింది. ఇంకో నిమిషంలో నిప్పుకోడంత అయ్యింది. ఆ మరునిమిషమే గండభేరుండమంత అయ్యింది. అది చూసి వాడు సంబరంగా దాని మీదకు ఎక్కాడు.

రామచిలుక రివ్వున గాల్లోకి ఎగిరింది. అలా ఎగురుతా... ఎగురుతా... ఒక పెద్ద ఆఫీసు మీద వాలింది. ''ఆ కిటికీలోంచి కిందికి తొంగిచూడు'' అంది. వాడు తొంగి చూశాడు. అక్కడ ఒక బెంచీ మీద చూడముచ్చటైన ఒక యువకుడు కూచొని వున్నాడు. ఆరడుగుల ఎత్తు, తెల్లని ఛాయ, ముద్దొచ్చే మొగం, రింగుల రింగుల జుట్టు.... చూడడానికి సినిమా హీరోలెక్క వున్నాడు. పెళ్ళయిన ఆడవాళ్ళు చూసినారంటే చాలు... అబ్బ... కంటే ఇలాంటి కొడుకునే కనాలి అనుకుంటారు. అదే పెళ్ళికాని అమ్మాయిలు చూసినారంటే చాలు... అబ్బ! చేసుకుంటే ఇలాంటి చూడచక్కనోన్నే మొగునిగా చేసుకోవాలి అనుకుంటారు. అంత చక్కనోడు వాడు.

''ఎలా వున్నాడా యువకుడు'' అంది చిలుక.

''అబ్బ... ఆకాశంలో మెరిసే చుక్కలా వున్నాడు. అడవిలో పురి విప్పి తిరిగే నెమలిలా వున్నాడు. గాలిలో ఎగిరే సీతాకోకచిలుకలా వున్నాడు. నేను గూడా అలా వుంటే ఎంత బాగుండో'' అన్నాడు.

అంతలో ఆఫీసు లోపలి నుంచి ఒకతను బైటకు వచ్చాడు. పొట్టిగా, నల్లగా, బట్ట నెత్తితో, అందవికారంగా వున్నాడు. అతను బైటకి రాగానే ఈ ఆరడుగుల అందగాడు ఒక్కసారిగా పైకిలేచి ''సార్‌... సార్‌...'' అంటూ భయంభయంగా వంగి వంగి సలాములు చేసుకుంటూ, వణుకుతున్న చేతులతో అతని చేతిలోని సంచీని అందుకొని అతని వెనుకనే పరుగులాంటి నడకతో వినయంగా బైలుదేరాడు. అతను హుందాగా అడుగులో అడుగు వేసుకుంటూ పోతుంటే ఎక్కడివాళ్ళక్కడ లేచి నిలబడి వినయంగా తల వంచి నిలబడుతున్నారు. అతను కారు దగ్గరికి పోగానే ఒకడు వురుక్కుంటా పోయి కారు తలుపు తెరిచి నిలబడ్డాడు. అతను అందులో ఠీవిగా కూచోని వెళ్ళిపోయాడు.

చిలుక ఆ పిల్లోని వంక తిరిగి ''చూశావా... అతడంత అందవికారంగా వున్నా... అందరూ ఎలా గౌరవం ఇచ్చారో. దీనికంతా కారణం చదువే. నిజమైన గౌరవం అందం నుంచి రాదు. తెలివితేటలు, అధికారం, నిజాయితీ నుంచే అందుతుంది. ఈ వెక్కిరించడాలు, వేళాకోలాలు అన్నీ చిన్నతనంలోనే. నువ్వు బాగా చదివి పెద్ద అధికారిగా మారావనుకో... గౌరవం దానంతటదే పరుగెత్తుకొని వచ్చి నీ కాళ్ళ దగ్గర చేరుతుంది. ఈ నడుమ నువ్వు అనవసర ఆలోచనలతో చదువులో బాగా వెనుకబడుతున్నావట గదా. పనీపాటాలేని వాళ్ళ మాటలను పట్టించుకోకుండా మనసంతా చదువు మీదే వుంచు. ఏం సరేనా'' అంటూ అక్కడి నుంచి ఎగిరిపోయింది.

''అలాగే ... ఆగు. నువ్వు చెప్పినట్టే వింటాను. నన్ను ఇంటి దగ్గర దించు. ఇలా వదిలి వెలితే ఎలా'' అంటూ ఆ పిల్లోడు గట్టిగా అరిచాడు. ఆ అరుపుకు అప్పుడే అక్కడకు వచ్చిన వాళ్ళ అమ్మ ''ఏరా... హాయిగా చెట్టు కింద పడుకోని పగటిపూటనే భలే కలలు కంటున్నావే. లెయ్‌లెయ్‌. ఇంక పడుకుంది చాలు'' అంటూ కుదుపుతూ లేపింది.

''ఇంతసేపూ వచ్చింది కలనా. కానీ అది కల కాదు. నిజం. చిలక చెప్పిన నిజం. ఇకపై చదువులో అస్సలు వెనుకబడగూడదు'' అనుకుంటూ మంచం మీద నుంచి కిందికి దిగాడు.
*****************************
డా.ఎం.హరికిషన్-కర్నూలు-9441032212
*****************************
కథ నచ్చితే *SHARE* చేయండి. రచయిత పేరు మార్చకండి. తీసేయకండి.
 *💪🏻ధైర్యం చెప్పండి* 
 🦚🌻🌹💎🔰🌈

*🍁ఊరి బయట పొలం దగ్గర ఇద్దరబ్బాయిలు పరుగులు పెట్టి అడుకుంటున్నారు.* 

 *ఒకడు పదేళ్ల వాడు.* 

 *ఇంకొకడు ఆరేళ్ల వాడు.* 

 *చిన్నోడు ముట్టుకునేందుకు వస్తున్నాడు.* 

*పెద్దోడు వాడికందకుండా వెనక్కి చూస్తూ వేగంగా పరుగెడుతున్నాడు.* 

 *ముందు పెద్ద బావి ఉంది.* 

 *పెద్దోడు చూసుకోలేదు.* 

 *అందులో పడిపోయాడు.* 

 *వాడికి ఈత రాదు.* 

 *బావి చాలా లోతు.* 

 *చుట్టుపక్కల ఎవరూ లేరు.* 

 *అరిచినా సాయానికి వచ్చేందుకు నరప్రాణి లేదు.* 

 *చిన్నోడికి ఒక తాడు కట్టిన బొక్కెన కనిపించింది. తాడును పట్టుకుని బొక్కెనను బావిలోకి విసిరాడు.* 

 *"అన్నా... దీన్ని పట్టుకో" అన్నాడు.* 

 *నీట మునిగి తేలుతూ కేకలేస్తున్న పెద్దవాడు తాడును పట్టుకున్నాడు.* 

 *చిన్నోడు తన శక్తినంతా కూడగట్టుకుని తాడును పైకి లాగడం మొదలు పెట్టాడు.* 

 *"అన్నా ... భయపడకు..!* 
 *జాగ్రత్తగా పట్టుకో..!* 
 *పడిపోకుండా చూసుకో" అని అరిచాడు.* 

 *తాడు చివరను ఒక చెట్టుకి కట్టాడు. నెమ్మదిగా లాగుతూనే ఉన్నాడు.* 
🦚🌻🌹💎🔰🌈

 *ఒక అరగంట పెనుగులాడిన తరువాత పెద్దోడు సురక్షితంగా బయటకి వచ్చాడు.* 

 *ఆ తరువాత పెద్దోడు చిన్నోడు ఊళ్లోకి పరుగెత్తారు. ఊళ్లో వాళ్లకి జరిగింది చెప్పారు. చిన్నోడు పెద్దోడిని ఎలా కాపాడాడో చెప్పారు.* 

 *ఊళ్లో ఎవరూ నమ్మలేదు.* 

 *ఆరేళ్ల వాడేమిటి..!?* 

 *పదేళ్ల వాడిని లాగడమేమిటి ..!?* 

 *అందునా బావి నుంచి లాగడమేమిటి ..!?* 

 *అసాధ్యం..!* 

 *వాడు చేయలేడు అని అన్నారు.* 

 *ఎంత చెప్పినా ఎవరూ నమ్మలేదు.* 

 *సంగతి ఆ నోటా ఈ నోటా పాకింది.* 

 *ఆ ఊరు పెద్దమనిషికి విషయం తెలిసింది.* 

 *"మీరు నమ్ముతారా అని అడిగారు* 

 *"నమ్ముతాను" అన్నాడు.* 

 *"ఎలా?"* 

 *"చిన్నోడు లాగి పెద్దోడిని బావి నుంచి బయటకి తీసి రక్షించాడు."* 

 *"అదెలా సాధ్యం...* 

 *అంత చిన్నోడు ఎలా చేయగలడు?"* 

"*తనకి అంత బలం లేదన్న సంగతి, వాడు పెద్దోడిని బావినుంచి లాగలేడన్న సంగతి చిన్నోడికి తెలియదు.*

 *"ఒరేయ్..! నీకంత బలం లేదురా,* 

 *నువ్వు చేయలేవురా,* 

 *అది నీవల్ల సాధ్యం కాదురా.* 

 *అని చెప్పేవారెవరూ కూడా...* 

 *ఆ పరిసరాల్లో లేరు, కాబట్టి వాడు చేయగలిగాడు."* 

"*నీవల్ల కాదని చెప్పే వాళ్లుంటే వాడు ప్రయత్నించేవాడే కాదు. ఏడుస్తూ ఊళ్లోకి పరిగెత్తుకు వచ్చేవాడు. మనం బావి దగ్గరికి వెళ్లే సరికి పెద్దోడు శవమై తేలి ఉండేవాడు.* "

 *ప్రశ్నవేసిన వాడు మాట్లాడలేకపోయాడు.* 

*"నీవల్ల కాదు అని చెప్పేవాడు లేకుంటే మనిషి ఎంత పనైనా చేస్తాడు. అది బావైనా, బతుకైనా అంతే..." అన్నాడు పెద్దమనిషి.*

*మనం ఎదుటివారికి ధైర్యం చెప్పకపోయినా పర్లేదండి . అంతేకానీ నిరుత్సాహ పరచడం , భయపెట్టడం చెయ్యకూడదు* .

🌹🌻🦚💎🔰🌈
 ఆత్మీయ బంధుమిత్రులకు  శుభోదయ శుభాకాంక్షలు.  మీరు మీ కుటుంబసభ్యులు ఆయురారోగ్యాలతో  సుఖసంతోషాలతో  ఆనందంగా జీవించాలని భగవంతుని ప్రార్థిస్తూ 💐💐💐🤝

      *ఇల్లు* చిన్నదైనా *మనసు* పెద్దదిగా ఉండాలి, *గుండె గుప్పెడంత* అయినా *కొండంత ప్రేమ* ఉండాలి, *డబ్బులో పేద* అయినా *గుణంలో శ్రీమంతులుగా* ఉండాలి.

         *కట్టె కాలి బూడిద* అయినా *మాట మండుతూ బ్రతికే* ఉంటుంది. కనుక *ఆలోచించి* ఆచి తూచి మాట్లాడుదాం..*మాట* అన్న తరవాత..ఆ *మాటే* మన *సంస్కారం*  ఏమిటో *నలుగురికి* తెలియటానికి *కారణం* అవుతుంది 

   తన వృత్తిని *పవిత్రంగా* భావించే వ్యక్తి ఒక్క *క్షణం* కూడా *సోమరిగా* ఉండలేడు.

     *మంచిది చెడ్డది* అని ఏ రోజు పేరు తగిలించుకొని *రాదు* రోజు *మంచిగా* మారాలన్న *చెడ్డగా* మారాలన్న *నీ ఆలోచనలే* కారణం ఏం జరిగినా *పాజిటివ్* గా ఆలోచిస్తే *ప్రతిరోజు* మంచిదే..

       మానవుడు *ద్వేషంతో ధనవంతుడు* కాలేడు *కోపంతో గుణవంతుడు* కాలేడు,,కానీ *మంచితనంతో* మాత్రం మాధవుడు కాగలడు.

     *పుష్పం* వికసిస్తే *తుమ్మెదలు* వెతుక్కుంటూ అవే వస్తాయి..*నిజంగా* ఒకరు మహాత్ములయితే వారికి *సొంత చాటింపు, పబ్లిసిటీ* అవసరం ఉండదు,, నిజమైన *తపన* ఉన్నవాళ్లు వారిని వెతుక్కుంటూ చేరుతారు..
 ఇది *సృష్టి* నియమం.

       కష్టాలను ఎప్పుడూ *సవాల్* గా స్వీకరించు,, *నీ కష్టాలు* తీరే మార్గం *నీ ధైర్యమే* నీకు చూపుతుంది. మీ అందరి వాడు 🙏
 *ఓం* *నమో శ్రీ వేంకటేశాయ* 🙏🙏