Wednesday, July 27, 2022

ఈరోజు మంచి మాట...లు🦜🦜🦜🦜

[24/07, 10:50] P.Srinivasa Rao: 🙏🏽🙌🏿 లక్ష్మిశ్రీవేంకటేశ్వరస్వామి జ్ఞానపీఠం రేణిగుంటరోడ్డు.తిరుపతి
వ్యవస్థాపకులు .ధర్మఛారౄ
'తిరుపతి' శ్రీనివాసరావు
కర్మయోగి..ప్రధాన నిర్వహకులు
9390216263..9550804092 🙏🏽🙌🏿🌹🙊🙉🙈 🌹🙌🏿🙏🏽
ఈరోజు మంచి మాట...లు🦜🦜🦜🦜🦜

నువ్వు చేసేపని ఎంతమంది చూస్తారన్నది కాదు ముఖ్యం..అది ఎంతమందికి ఉపయోగపడింది అనేదే ముఖ్యం. మంచిపని చేసేటప్పుడు మనిషి కనబడాల్సిన అవసరం లేదు . మంచితనం కనబడితే చాలు .

మనిషి కాదు మారాల్సింది మనసు మారాలి ఆలోచించే విధానం మారాలి మంచిగా ఆలోచిస్తే అన్నీ మంచిగా కనిపిస్తాయి చెడుగా ఆలోచిస్తే అన్నీ చెడుగానే అర్థమవుతాయి .

కష్టపడుతు పైకి ఎదిగిన వాడికి విలువలతో కూడుకున్న సంస్కారం ఉంటుంది . ఒక్కసారిగా పైకెదిగిన వాడికి నువ్వెంత అనే అహంకారం ఉంటుంది .

అదృష్టంతో వచ్చినది అహంకారాన్ని కలిగిస్తుంది తెలివితో సంపాదించింది సంతోషాన్నిస్తుంది
కష్టపడి సంపాదించింది సంతృప్తినిస్తుంది

🕉️🙏 అందరు మన జీవితంలో మంచి వ్యక్తులే తారసపడాలని లేదు. పాఠాలు నేర్పే గురువులు కొంత మంది, గుణపాఠాలు నేర్పేవారు మరి కొంతమంది ఉంటూనే ఉంటారు.
ఒకరిపై ఒకరికి విశ్వాసమే మనిషి జీవితానికి బాసటగా నిలిపే నిజమైన శక్తి.
శక్తిని ప్రదర్శించడం కన్న, సహనంతో ఉండడం కొన్ని సమయాల్లో మంచి ఫలితం ఉంటుంది.
మనుసు ద్వేషపూరితమైతే ఇతరుల మంచితనం గుర్తించలేని అంధకారం అలుముకుంటుంది.
గొప్పగా బ్రతకడం అంటే... సమాజం ఏమనుకుంటుందో ఆ విదంగా బ్రతకడం కాదు.నీ కేది ఆనందాన్ని, సంతృప్తిని ఇస్తుందో... ఆ విదంగా బ్రతకడం నిజమైన గొప్పతనం.
నీ వడిగింది నీ వనుకున్న సమయంలో దేవుడు నీకు ఇవ్వకపోవొచ్చు కానీ,.. నీకు ఏది అవసరమో, నీకు ఏది మేలుకరమో అది తగిన సమయంలో తప్పకుండా ఇస్తాడు.దైవంపై విశ్వాసం ఉంచు.
పుట్టేవరకు తపన, పెరిగినతర్వాత కోరిక, పెద్దయ్యాక ఆశ, అభివృద్ధి చెందాక ఆరాటం, ఎన్నో తీరని కోరికలు, ఎన్నెన్నో చెప్పలేని ఆలోచనలు. ప్రారంభం ఎక్కడైనా వీటన్నిటికీ ముగింపు మాత్రం చావుతోనే...💥☝

ఇదే నిజమైన నామస్మరణ..

 *🌺🙏ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏🌺*

 _*🌴జ్ఞానం కన్నా, అనుభవం గొప్పది. అనుభవం కన్నా ఆచరణ గొప్పది. మంత్రాలు , శ్లోకాలు నోటికి వస్తే చాలదు , వాటిని ఆచరణలోకి తేవాలి. అదీ కీలకం. మంత్రోచ్ఛరణ చేసేటపుడు దాని తాలుకా దైవీ రూపం పై భావం కేంద్రీకృతమవ్వాలి. రూపం ఎక్కడ ఊహించబడితే అక్కడ ఆయా నామం స్మరించబడాలి. ఎక్కడ నామం స్మరించబడితే అక్కడ ఆయా రూపం ప్రత్యక్ష పరచబడాలి. ఇదే నిజమైన నామస్మరణ..🌴*

కార్యదుఃఖం

 🙏🕉🙏 ..... *"శ్రీ"*

     💙 *"గురుతత్వం"* 💙

          💙 *"మహత్యం"* 💙

💙💙 *"119వ భాగం"* 💙💙

*"చివరిగా ఒక చిన్న మాట" -3"*

**************************

*"అజ్ఞానం పోతేనే మనకు ఇప్పుడు కలుగుతున్న కార్యదుఃఖం కూడా పోతుంది. అది వెలుతురు రాగానే చీకటి పోయినంత సహజంగా జరిగిపోతుంది. అవగాహన, జ్ఞానంతో కార్యదుఃఖం పోతుంది. అప్పుడు కార్యానికి, కార్యానికి మధ్యఉన్న సంబంధం పోతుంది. అప్పుడు అతడు సాక్షిగా ఉంటాడు. మనలో నిరంతరాయంగా ఉంటున్నది అజ్ఞాన దుఃఖమే అయినా అది తెలియదు. అది అజ్ఞానంచేత కలిగే దుఃఖంగా అనిపించదు. కార్యదుఃఖంగా కనిపిస్తుంది. అదే నిరంతరం మనల్ని వెంటాడుతుంది !"!*

*"{గురుతత్వం : మహత్యం}"*

                 🌼🕉🌼

            

మంచి మాట.. లు(27-07-2022)

బుధవారం --: 27-07-2022:-- ఈరోజు AVB మంచి మాట ..ల మూటలు

నేను బాగుండాలి అనుకోవడం స్వార్థం, నాతో పాటు అందరూ బాగుండాలి అనుకోవడం మంచితనం, నేను ఎలా ఉన్నా ఎదుటివారు బాగుండాలి అనుకోవడం గొప్పతనం..

ఉన్నదానిని వదులుకొని లేనిదేనికోసమో ఆశపడటం మూర్ఖుల లక్షణం,, మనకున్న దానితో తృప్తి పడటం వివేకుల లక్షణం.... పాచిపోయినా కూడా పొరుగింటి పుల్లకూర ఎప్పుడు రుచిగానే ఉంటుంది,,

జీవితంలో అతి ప్రమాద కరమైనది దుఃఖం దాన్ని దిగమింగటం కష్టం అయినా అలవాటుపడటం నేర్చుకో,,,
ఇంకా భయంకరమైనది నిరాశ,, దాన్నిఅసలు నీ దరి దాపులకు కూడా రానీయకు ,
ఇంకా నీచమైనది అసూయ దానికి ఏ మాత్రం అవకాశం ఇవ్వకు .

కోపం అసూయతో తీసుకున్న నిర్ణయాలు ఎప్పటికీ సత్ఫలితాలివ్వవు పైగా కొత్త సమస్యలు ఏర్పడతాయి మంచి నిర్ణయాలు మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు మాత్రమే తీసుకోవాలి.

లక్షలు ఉన్న వారి సాంగత్యం కాదు,,, మనకు కావలసింది మంచి లక్షణాలు ఉన్న వారి సాంగత్యం కావలి .

బాధ మనకి బలమంతులు ఎలా అవ్వాలో నేర్పుతుంది,,,
భయం మనకీ చురుగ్గా ఎలా ఉండాలో నేర్పుతుంది,, మోసం మనకి తెలివిగా ఎలా ఉండాలో నేర్పుతుంది,, జీవితం అంటేనే అన్ని రకాల అనుభవాలా సమ్మేళనం,ఈ రోజు నేర్చుకున్న పాఠం అయినా, గుణపాఠం అయినా రేపటి ప్రశ్నలకు సమాధానం .

సేకరణ ✒️
AVB సుబ్బారావు💐🤝🙏

Tuesday, July 26, 2022

మంచి మాట...లు(26-07-2022)

మంగళవారం --: 26-07-2022 :-- ఈరోజు మంచి మాట...లు

శుభోదయం ఇది పొద్దునే ఒకరిని పలకరించే పదమే కాదు . నేనింకా ఈ ప్రపంచంలోనే ఉన్నాను నీకెప్పుడు ఆత్మీయంగా తోడుంటాను . ఎవరున్నా లేకున్నా ఒక మిత్రునిగా వెన్నంటి ఉంటానని ఆత్మీయంగా దైర్యం చెప్పే రక్షణ పదం .

ఏ బంధం అయినా పరిచయం అయిన కోత్తలో చూపించే అభిమానం కడదాకా ఉండదు, దీనికి కారణం మారిపోయే మనషులదో లేదా కొత్తగా చేరిన పరిచయాలదో తెలియదు .

విలువ అనేది మనకు మనం నిర్మించుకున్న కంచుకోట లాంటిది,,. ఒక్కో మాట జారిన ప్రతి సారీ ! కోట బిటలు వారి ఒక్కో రాయి కింద పడి చివరికి కోట కూలే ప్రమాదం ఉంది, మాట్లాడేముందు జాగ్రత్త ఉండాలి,,,అంటే మనం మాట్లాడే మాట అవతలివారిని ఇబ్బంది పెట్టేలా కాకుండా జాగ్రత్తగా ఉండాలి .

ఈ ప్రపంచంలో
అత్యంత స్వార్థపూరిత జీవి ఏదైనా ఉందంటే అది మనిషే . అవసరాన్ని బట్టి మనుషులు మారతారు ఎప్పుడైతే మన అవసరం తీరిపోతుందో మనతో మాట్లాడే విధానం కూడా మారిపోతుంది

మరిగే
వేడి నీటిలో మన ప్రతిబింబం ఎలా కనబడదో పరిష్కారం కూడా అలాగే కనిపించదు . మనకు సమస్యలు ఎన్ని ఉన్నా ప్రశాంతతమైన మనస్సు తో ఆలోచిస్తే పరిష్కారం తప్పకుండా దొరుకుతుంది .

సేకరణ ✒️
మీ ...AVB సుబ్బారావు *9985255805💐🤝🙏

పీర్ల పండుగ ఒక అజ్ఞానం

 పీర్ల పండుగ ఒక అజ్ఞానం :


ఇస్లాం మతం వ్యాప్తి కోసం వేల మంది ఆడవాళ్ళని ఎత్తుకుపోయిన ఇమామ్ హుస్సేన్ ఇస్లాం స్థాపనకోసం చనిపోయిన  వ్యక్తి. అతన్ని  చంపినందుకు ఒకరివర్గం ఆనందంగా ముస్లింలు ఏడుస్తూ చేసుకొనే దానినే పీర్లపండుగ అంటారు.మనం చిన్న దినాలు,పెద్ద దినాలు  ఎలా చేసుకొంటామో అవే చిన్న సరిగెత్తు, పెద్ద సరిగెత్తు

.

ఇంకా ఎన్ని సంవత్సరాలు ఇలా బానిసత్వం బుర్రతో ఆలోచిస్తారు ఒక్కసారి ఈ పోస్ట్ చదవండి 

 @@మొహర్రం@@


## పీర్ల పండుగ ##


అసలు ఇదీ ఎవరి పండుగ, దేనికి ఈ పండుగ.

హిందు సమాజానికీ ఈ పండుగకు ఏంటి సంబంధం.


అని మనం చెప్పుకున్నటువంటి

 ఇది నిజంగా పండుగ కాదు .


కేవలం సంతాపదినాలు మాత్రమే.


 హజరత్ హసన్ హుస్సేన్ ఇద్దరి 

ప్రాణ త్యాగానికి గుర్తుగా ఈ పండుగ. ముస్లిం లో ఒక తెగవారు పీర్లను పది రోజుల పాటు ఒక స్థలంలో ఉంచి

 గుండెలు బాదుకుంటూ,

 రక్తాన్ని చిందిస్తూ(మాతమ్)

 ఊరేగింపు నిర్వహించడం ముస్లింలు మాత్రమే నిర్వహించే సంతాప కార్యక్రమం.


 హసన్ హుస్సేన్ బలిదానం జరిగింది ఇరాక్ లోని కర్బలా మైదానంలో.


 దురదృష్టవశాత్తు

 నైజాము పరిపాలనలోని

 మన తెలంగాణ కర్ణాటక ప్రాంతాలలో 

ఈ సంతాప దినాలు పండుగల చేసుకోవడం బంధువులను పిలిచి *పీర్ల పండుగ* సందర్భంగా

 పీరీల కు మొక్కుబడులు తీర్చుకుని 

 దట్టి లను సమర్పించడం .

ఒక వారం రోజుల పాటు ఈ గ్రామీణ ప్రాంతాలలోని విద్యార్థులు 

బడులకు వెళ్లకుండా

 ఈ సంతాప దినాలు పీరీల దగ్గరికి వెళ్లడం. 10వ రోజున అదే పీర్ల పండుగ 

అని మనం పిలుచుకునే మొహర్రం రోజున బంధువులతో ఈ ఊరేగింపులో

 పాల్గొనడం చేస్తున్నారు.


నిజాం నిరంకుశ పరిపాలనలో

 ఖాశీం రజ్వీ అనుయాయులతో

 మన ఆడవాళ్లను 

 బరి బత్తెల బతుకమ్మ ఆడించి

 బలవంతాన ఈ పీర్ల పండుగ 

 మన నెత్తిన రుద్ధి 

అమాయకులైన గ్రామీణ ప్రాంతాలలోని ప్రజలను మోసం చేసి 

వారి మత ప్రచారానికి వాడుకున్నారు.


 మన ప్రాంతానికి, మన దేశానికి,

  మన సంప్రదాయానికి  ఏ మాత్రం సంబంధం లేని.....

  కేవలం ముస్లింలకు మాత్రమే పరిమితమైన  ఈ మొహరం పండగల చేసుకోవడం  చాలా సిగ్గుచేటైన విషయం .


ఇప్పటి నుండి.  ఇది పండుగ కాదు.

 మనకు ఏమాత్రం సంబంధం లేదు  .

అని  వారికి స్పష్టంగా తెలియజేసి  

మన పండుగల ప్రాముఖ్యతను తెలియడం.  ఇంకొంచెం విస్త్రుతంగా ,సహేతుకంగా.....

 మొహర్రం  ముస్లింల లోని  ఒక తెగ వారికి సంతాపదినాలు మాత్రమే....

 ఇది పండుగ కానేకాదు .

అని కరపత్రాల రూపంలో  సామాజిక, ఎలక్ట్రానిక్, మాస్ మీడియా లో  ప్రచారం కల్పించడం తప్పనిసరిగా చేద్దాము ...


--సేకరణ

మంచి మాట..లు(24-07-2022)

ఆదివారం --: 24-07-2022 :-- ఈరోజు AVB మంచి మాట..లు

కాలం మారుతుందో లేదో తెలియదు కానీ మనుషులు మాత్రం కచ్చితంగా మారుతున్నారు,,ఎదురుగా ఉన్నప్పుడు ఒకలా లేనప్పుడు మరోలా ఉంటున్నారు,,ఎవరిని నమ్మాల్లో నమ్మకూడదో తెలియని పరిస్థితులు

మంచి తనానికి విలువ లేదు అన్నది ఎంత నిజమో,,,అలాగే మన మంచితనమే మనల్ని కాపాడుతుంది
అన్నది కూడా అంతే నిజం..

జీవితంలో ఒక్కసారి నిర్ణయం తీసుకున్న తరువాత మళ్లీ వెనక్కి తిరిగి చూడకూడదు . ఎందుకంటే ప్రతిసారి గతం
గురించి ఆలోచించే వాళ్ళు జీవితంలో ముందడుగు వేయలేరు .

మనసు ఆరోగ్యంగా ఉంటేనే మనిషి ఆరోగ్యంగా ఉంటాడు మనసు ఆరోగ్యంగా ఉండాలంటే గతాన్ని తక్కువగా ఆలోచించు భవిష్యత్తు ను ఎక్కువగా ప్రేమించు .

ఎదుటి వారు మిమ్మల్ని తలిచినా తలవక పోయినా మీరు మాత్రం తలుచుకోండి ఎందుకంటే బంధం చాలా అందమైనది అందులో పోటి ఉండకూడదు,,ప్రేమ అప్యాయతలు మాత్రమే ఉండాలి .

సేకరణ ✒️మీ ... AVB సుబ్బారావు 9985255805💐🤝🙏

మంచి మాట...లు(23-07-2022)

శని వారం --: 23-07-2022 :-- ఈరోజు మంచి మాట...లు

నిరంతరం వెలిగే సూర్యున్ని చూసి చీకటి భయపడుతుండి,,అలాగే నిరంతరం శ్రమించే వారిని చూసి ఓటమి భయపడుతుంది .

మన పెద్ద వాళ్లు ఎప్పుడూ ఒక విషయం చెబుతుంటారు,,,ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు బంధాలని కాపాడుకోవటానికి ఒక మెట్టు దిగి ఆలోచించు అంటారు,,,అర్థం చేసుకునే వారి కోసం ఎన్ని మెట్లు దిగి నా తప్పు లేదు,, కానీ ఎన్ని మెట్లు దిగినా మనల్ని అర్థం చేసుకొని వారి కోసం ఆలోచించి ఏం లాభం,, వాళ్ల దృష్టిలో మనం దిగజారడం తప్ప,, నోటికి ఏదొస్తే అది మాట్లాడే వాళ్లతో దూరంగా ఉండటమే మంచిది ఎందుకంటే అటువంటి వారు ఎన్నాళ్ల బంధాన్ని అయినా ఒక్కమాటతో తేoచెయ్యగలరు ...

నేను అనే ఆత్మాభిమానం మనిషిని ఎంతగా పైకి తీసుకు వస్తుందో,,, నేనే అనే అహంకారం మనిషిని అంతగా కిందికి దిగజారుస్తుంది .

మనం మనశ్శాంతిగా బతకాలంటే ఏదీ ఎక్కువ తెలుసుకోకూడదు
ఎవరినీ ఎక్కువగా తెలుసుకునే ప్రయత్నం చేయకూడదు... అన్నిట్లో వేలు పెట్టేవారు ఎప్పుడు ఆందోళన తోనే ఉంటారు.. తన పని తాను చూసుకునేవారు.. ఎప్పుడు సంతోషం గా ఉంటారు

సేకరణ ✒ AVB సుబ్బారావు

మనకు దుఃఖం కలగటానికి పెద్దలు రెండు రకాల కారణాలు చెప్తున్నారు.

 💙 *"గురుతత్వం"* 💙

          💙 *"మహత్యం"* 💙

 💙💙 *"118వ భాగం"* 💙💙

*""చివరిగా ఒక చిన్న మాట" -*

******


 *"మనకు దుఃఖం కలగటానికి పెద్దలు రెండు రకాల కారణాలు చెప్తున్నారు.*

*1. తృష్ణచేత కలిగే దుఃఖం.*

*2. అజ్ఞానంచేత కలిగే దుఃఖం.*

*మనతో తృష్ణ ఎప్పుడూ ఉండదు. కాబట్టి తృష్ణవల్ల కలిగే దుఃఖం ఎప్పుడూ బాధించటంలేదు. కానీ అజ్ఞానంచేత కలిగే దుఃఖం మాత్రం నిరంతరం మనతో ఉంటుంది. తృష్ణను జయిస్తే దానిద్వారా వచ్చే దుఃఖం పోతుంది. కానీ అజ్ఞానాన్ని పూర్తిగా దాటకపోతే ఆ దుఃఖం మనతోనే ఉంటుంది. అజ్ఞానం ద్వారా వచ్చే దుఃఖం దాటితేనే మనకు సంపూర్ణ ఆనందం లభిస్తుంది !!"*


*"{గురుతత్వం : మహత్యం}"*

          

🪔🪔అంతర్యామి 🪔🪔 🌺🌺జీవితం అంటే..🌺🌺 🦋జీవితంలో నిజంగా మనం జీవిస్తున్నామా?

 🪔🪔అంతర్యామి 🪔🪔
     🌺🌺జీవితం అంటే..🌺🌺
🦋జీవితంలో నిజంగా మనం జీవిస్తున్నామా? 
🎈ఇది అంతుచిక్కని ప్రశ్న. 
🍁వ్యధలతో, బాధలతో, అసంతృప్తులతో, నిరాశా నిస్పృహలతో జీవితమంతా గడిచిపోయింది. 
🍁వెనక్కి తిరిగి చూసుకుంటే చివరకు మిగిలేది ఏమిటి? అనంతమైన పశ్చాత్తాపం కళ్ల ముందు సాకారమవుతుంది.
🌿 దేవుడిచ్చిన బహుమానమైన ఈ జీవితం ఇలా నిష్ఫలంగా ముగిసిపోతుందనే చింతన చరమాంకంలో వేధిస్తుంది. అందుకే ముందే మేల్కోవాలి. జీవితాన్ని సార్థకం చేసుకోవాలి. 
🍁శాశ్వతంకాని దేహం మీద మమత్వాన్ని వదిలిపెట్టి శాశ్వతుడైన పరబ్రహ్మను భజించమని జగద్గురువు ఆదిశంకరులు మహోపదేశం చేశారు. 🍁అవిద్య, రాగద్వేషాలు, జీవితంపట్ల నిర్లక్ష్యం, మానవీయత లేకపోవడం, జడత్వం- వీటిని పంచ మహాదుఃఖాలుగా పతంజలి మహర్షి అభివర్ణించారు. 🍁జీవితమంటే చావు వచ్చేంతవరకు కొనసాగించే పయనం ఎంత మాత్రమూ కాదు. 
🍁‘మృత్యువు నిన్ను నీడలా ఎల్లప్పుడూ అనుసరిస్తుంది. అది నిన్ను అక్కున చేర్చుకోకముందే, దాన్ని జయించాలి. 🍁మరణించే నువ్వు జీవించాలి’ అని ఉపనిషత్తులు ప్రబోధించాయి. 
🍁అన్ని దుఃఖాలకంటే మరణ దుఃఖం అతి భయంకరమైనది. 
🍁మరణ దుఃఖాన్ని, మృత్యుభీతిని అధిగమించడం ఎలా? 
🌺పరమాత్ముడికి ప్రియమైన రీతిలో మనం జీవన సంవిధానాన్ని అవలంబించడం ద్వారా మృత్యువునైనా ప్రియమైన మిత్రుడిగా మార్చుకోవచ్చు. 
🍁నిష్కామ భావంతో కర్మాచరణ చేస్తూ, ధర్మపథంలో పయనించడం ద్వారా, చింతనామృతాన్ని నిరంతరం ఆస్వాదించడం ద్వారా జీవన మార్గాన్ని సుగమం చేసుకోవచ్చు. 
🍁మాననీయమైన మానవీయ విలువలతో కూడిన జీవితాన్ని గడిపినవారే చిరంజీవులు. అలాంటివారే అసలైన కీర్తిశేషులు! 
🍁మనిషి తన జీవితాన్ని ధర్మానికి అనుగుణంగా మలచుకుంటే మరణ భయం నుంచి బయట పడవచ్చు.
🍁 తన కోసం, సమాజం కోసం, దైవం కోసం ఎలాంటి కర్తవ్యాల్ని ఆచరించి తరించాలో తెలుసుకుని మసలుకోవచ్చు.
🍁 తనను తాను తెలుసుకోలేనివాడు సామాన్యుడు. 
🍁ఆ జ్ఞానాన్ని పొందినవాడు మాన్యుడు.
🍁 సమస్త ప్రాణులపట్ల అనురక్తిని ప్రదర్శిస్తూ, సర్వభూతాల పట్ల మిత్రత్వాన్ని కలిగి ఉంటూ, సకల జనుల పట్ల దయాభావాన్ని ప్రకటిస్తూ, అహంకార రహితులై, సుఖదుఃఖాల్లో సమభావం కలవారే తనకు ప్రియమైనవారని భగవద్గీతలో శ్రీకృష్ణుడు స్పష్టం చేశాడు.
🍁 క్షమ, నిగ్రహం, ప్రేమ, సత్యసంధత, రుజువర్తన, వినయం, భూతదయ, సేవాతత్పరత ఈ అష్టసూత్రాల్ని జీవితానికి అనుసంధానించుకోవడం ద్వారా లోకాన్ని వశం చేసుకోవచ్చని భాగవతం ప్రతిపాదించింది. 
🍁జీవన రథానికి ఇంధనం ఆత్మవిశ్వాసం. 🍁‘బతుకు అనేది మెతుకుల కోసం పోరాటం కాదు. 🍁బతుకు గతుకుల మయం కాకూడదు. 
🍁బతుకు అతుకుల బొంతగా కనిపించకూడదు. 
🍁ఈ బతుకు దయగల భగవంతుడిచ్చిన అపురూప అవకాశం.
 🍁దాన్ని అందిపుచ్చుకో. 
🍁చరితార్థుడిగా మిగిలిపో!’
🍁- ఓ సూఫీ కవిత వెల్లడించిన జీవన సత్యమిది. 
🍁జీవితం పట్ల భయం ఉండకూడదు. భక్తి ఉండాలి. 🍁శేష ప్రశ్నగా మిగిలే భవిష్యత్‌ జీవితంపట్ల వర్తమానంలో ఆందోళన అనవసరం. 
🍁ధీరచిత్తంతో ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి సదా సమాయత్తంగా ఉండాలి. 
🍁ఇదే ఉదాత్త చరితుల ఉత్తమలక్షణం. 
🍁ధైర్యం, నిర్భయత్వమనేవి ఆత్మజ్ఞానంతోనే సిద్ధిస్తాయి. 
🍁సర్వశుభంకరమైన ధర్మకర్మల్ని ఆచరిస్తూ కర్మసాక్షి అయిన భగవంతుడు మనల్ని గమనిస్తున్నాడనే ఎరుకను కలిగిఉండాలి. 
🍁తరతరాలుగా అనుసరిస్తున్న ఆధ్యాత్మిక జీవన సంవిధానాన్ని పాటించాలి. 
🍁నైతికశీల సంపత్తితో వేదవిహితమైన విధివిధానాలతో జీవన సంగీతపు మధురిమల్ని ఆస్వాదించాలి. 
🍁జీవితనౌకను వెలుగు తీరానికి చేర్చాలంటే ముందు అంతర్వీక్షణతో మనలో కాంతిని నింపుకోవాలి. 
🍁హృదయాలయంలో జ్ఞానజ్యోతుల్ని ప్రజ్వలింపజేసుకోవాలి! 

శ్రీ రమణ మహర్షి సూక్తులు

 అరుణాచలరమణ👏


పునర్జన్మ ఉన్నట్టా, లేనట్టా? 

(రమణ మహర్షి వృత్తాంతాలు)


రచయిత : నీలంరాజు లక్ష్మి ప్రసాద్ 


కథ : ఈ పుస్తకంలోని వ్యాసాలు పలు పత్రికల్లో ప్రచురిత మయినవి.  ఇందులోని సూక్తులు కమలాకర వెంకటరావు గారు సంకలనం చేసి అనువదించిన "శ్రీ రమణ మహర్షి సూక్తులు" పుస్తకం నుండి సంగ్రహించ బడినవని రచయిత తెలిపారు. 


కథానిక :

1) గతాన్ని ముట్టుకోకు, తవ్వకు.  కోరికలు గతం నుండి పుట్టుకిచ్చినవే. గతం, భవిష్యత్తు రెంటినీ వదిలేసి వర్తమానంలో జీవించడమే ఆనందం. 

2) ప్రపంచంలో ప్రతి మనిషి తనకు అందుబాటులో వనరులను అతి వేగంగా వ్యర్థ పరుస్తున్నాడు.  అవే వనరులను తయారు చేయడానికి ప్రకృతికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. 

3) భౌతిక ప్రపంచంలోని భాగ్యం ఎంత సమకూర్చుకున్నా మనకు కొరత తీరేది కాదు. సంపన్నులైన ఇంకొంత సంపద కోసం ప్రయత్నిస్తూనే ఉంటారు. కానీ హృదయ సంపద ఉన్నవారు భౌతిక వస్తువులకు దూరంగా ఉంటారు. 

4) తాను కర్తను అనుకోకుండా కర్మ చేయడమే కర్మ యోగం 

5) పాండిత్యానికి ఉండే ప్రయోజనాలు దానికి ఉన్నాయి. కానీ ఆత్మజ్ఞానం వల్ల లభించే అత్యంత సుఖం సాఫల్యం వేరు. 

6) సాధన లక్ష్యం అజ్ఞాన నివృత్తి కొరకై ఉండాలి.  జ్ఞానం అనేది మనలోనే ఉంది.  దాన్ని వెలికి తీసే ప్రక్రియే సాధన. 

7) భక్తితో, సంపూర్ణ ఓరిమతో పెట్టేది ఏదయినా తిన్న వారికీ, పెట్టినవారికి ఆత్మ సంతృప్తిని ఇస్తుంది. 

8) నిజంగా మీ మేలు కోరేవారు ఎవరు కూడా తాము మీకన్న అధికులమైనట్లు మాట్లాడరు. 

9) భూమి మీద పుట్టిన సామాన్య మానవులందరికీ శత్రువులుంటారు. 

10) గురువులను తలకెత్తుకునే ముందు వారు ఇలాంటి బరువు మోపుతున్నారో తెలుసుకోవాలి. 

11) ఆత్మకంటే వేరుగా చూడబడినప్పుడు జగత్తు అసత్యం, ఆత్మను ఆత్మగా చూసినపుడు జగత్తు సత్యం. 

12) మహాత్ముల హృదయమెప్పుడు శాంతంగానే ఉంటుంది. 

13) మోక్షం అంటే నీవు మరల పుట్టని వాడని తెలుసుకో 

14) జ్ఞానీ నిశ్చలంగా కనిపిస్తాడు (జడత్వం ల), కానీ వారిలో అంతులేని జ్ఞానముంది. 

15) ఆలోచనలను జయించినవాడే యోధుడు 

16) మానవ జన్మదిన ఎత్తిన తరువాత దూషించబడని వాడుండడు. 

17) ఉపనిషత్తులు మనదేశంలో పుట్టినవి అని చెప్పుకోవడం కాదు, వాటిని ఎంతవరకు ఆచరిస్తున్నాం అనేది ముఖ్యం 

18) భగవంతుడున్నాడా లేదా అనేది కాదు ముఖ్యం, నీ గురించి నీవు ముందు తెలుసుకుంటే భగవంతుని గురించి నీకే తెలుస్తుంది 

19) భగవద్దర్శనం మనస్సులో కలిగేది, బాహ్యంగా కనిపించేది కాదు 

20) మనిషి మనిషికి శ్రధశక్తుల్లో తేడా ఉంటుంది. వాటిని కొలిచి చూసుకువడం మంచిది 

21) ఆనందం అనేది ఆశతో, కోరికతో కాక ఉన్నది ఉన్నట్లుగా స్వీకరించాలి 


 రమణ మహర్షి తన జీవితంలో వివిధ సందర్భాల్లో వ్యక్త పరచిన నిజాలు.  వీటిలో మనం నమ్మనివి, నమ్మేవి..  ఆచరించలేనివి, ఆచరించదగినవి ఎన్నో ఉన్నాయి.  వారి జీవితం పూర్తిగా చదవాలన్న మన జీవితం సరిపోదు. 

🇮🇳🌹కార్గిల్ విజయ వీరుల స్ఫూర్తిని కొనసాగిద్దాం🌹🇮🇳

🇮🇳🌹కార్గిల్ విజయ వీరుల స్ఫూర్తిని కొనసాగిద్దాం🌹🇮🇳

వెరపులేని మీ అసమాన శౌర్యం
వెన్నుచూపని మీ అప్రతిహ ధైర్యం
భారత సరిహద్దువీరులారా వందనం దుష్టశత్రు...
వెరపులేని మీ అసమాన శౌర్యం
వెన్ను చూపని మీ అప్రతిహ ధైర్యం
భారత సరిహద్దువీరులారా వందనం
దుష్టశత్రు సంహారకులారా వందనం
శతృదేశాలకి మీరు శతఘ్నులు దేశప్రజలకి మీరు రియల్ హీరోలు భారత యువతకి ప్రేరకులయ్యారు కార్గిల్ విజయానికి సాధకులయ్యారు

కార్గిల్ యుద్ధం: దీని ప్రస్తావన వస్తే 130 కోట్ల మంది భారతీయుల హృదయాలు పులకించిపోతాయి. దాయాది పాకిస్థాన్ పై మనం సాధించిన విజయం సామాన్యమైనది కాదు. మంచుకొండలపై మాటు వేసి భారత్ దొంగ దెబ్బ తీయాలన్న పాక్ పన్నాగాన్ని మన సైన్యం సమర్థంగా ఎదుర్కొని ఆ దేశాన్ని చావుదెబ్బ కొట్టింది. కార్గిల్ యుద్ధంలో మన జవాన్లు చూపిన అసమాన పోరాటమే భారత్ విజయాన్ని అందించింది. అమర జవాన్ల పోరాటాన్ని స్మరించుకునేందుకు భారత్ ఏటా జులై 26న 'విజయ్ దివస్' నిర్వహిస్తోంది. కార్గిల్ యుద్ధంలో విజయం సాధించి నేటికి 23ఏళ్లు పూర్తయ్యింది.

హిమాలయ పర్వతాల్లోని ఘర్కోం అనే గ్రామంలో తషీ నామ్యాల్ అనే గొర్రెల కాపరి తప్పిపోయిన తన గొర్రెలను వెతుక్కుంటూ భారత్-పాక్ సరిహద్దుల వరకు వెళ్లాడు. అక్కడ చాలామంది సైనిక దుస్తుల్లో భారత్ భూభాగంలోకి కంచెను దాటుకుని వచ్చి బంకర్లు తవ్వడాన్ని గమనించాడు. వారి దుస్తులను బట్టి పాకిస్థాన్ సైనికులని నిర్ధారించుకున్న తషీ వెంటనే భారత సైనిక శిబిరం వద్దకు వెళ్లి విషయాన్ని చెప్పాడు. దీంతో కెప్టెన్ సౌరభ్ కాలియా ఐదుగురు సైనికులతో కలిసి అక్కడికి చేరుకోగా పాక్ సైన్యం వారిని బంధించి తీసుకుపోయి చిత్రహింసలకు గురిచేసి చంపేసింది. ఈ ప్రాంతం కార్గిల్ కు 60 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. రెండు దేశాల మధ్య యుద్ధానికి పడిన తొలి అడుగు ఈ ఘటన.

శత్రు దేశం- నమ్మకద్రోహం:

భారత్-పాక్ నియంత్రణ రేఖ వెంబడి హిమాలయ పర్వత శిఖరాలపై ఉన్న శిబిరాలను శీతాకాలానికి ముందు రెండు దేశాలు ఖాళీ చేస్తుంటాయి. భూభాగానికి 14-18వేల అడుగుల ఎత్తులో ఉండే ఆ ప్రదేశంలో ఉండే అత్యంత శీతల వాతావరణం మనుషులు జీవించడానికి అనుకూలంగా ఉండదు. దీంతో ఆ కాలంలో సైనిక శిబిరాలు ఖాళీ చేయాలన్నది రెండు దేశాల మధ్య కుదిరిన ఒప్పందం. అయితే 1999లో ఈ పరిస్థితిని పాక్ సొమ్ము చేసుకుని భారత్ ను దోంగ దెబ్బతీయాలని పన్నాగం పన్నింది. ఆ ఏడాది కూడా శీతాకాలానికి ముందు ముష్కో, ద్రాస్, కార్గిల్, బతాలిక్, తురుక్ సబ్ సెక్టార్ల నుంచి భారత బలగాలు వైదొలగడంతో పాక్ కుయుక్తులు పన్నింది. దాయాది సైన్యం భారత భూభాగంలోకి 4-5 కిలోమీటర్ల మేర చొచ్చుకుని వచ్చి 130 భారత శిబిరాలను ఆక్రమించింది. 1999 ఫిబ్రవరిలో భారత ప్రధాని అటల్ బిహారీ వాజ్ పెయీ, పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ లు రెండు దేశాల మధ్య శాంతి కోసం 'లాహోర్ ప్రకటన' చేసిన సమయంలోనే ఆ దేశ సైన్యాధ్యక్షుడు ముషారఫ్ ఈ కుట్రకు తెరదీశారు.

ఆపరేషన్ విజయ్: భారత సైనిక శిబిరాల నుంచి ఎన్ని హెచ్చరికలు చేసినా, పాక్ సైన్యం పట్టించుకోకపోవడంతో భారత్ సైనిక చర్య చేపట్టింది. 'ఆపరేషన్ విజయ్' పేరుతో 1999, మే 3న రంగంలోకి దిగిన భారత సైన్యం శత్రువుల కాల్పులను ఎదుర్కొంటూనే అత్యంత ఎత్తుగా ఉన్న పర్వత శ్రేణుల్లోని శిబిరాలను చేరుకునేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలోనే వందల సంఖ్యలో సైనికులు ప్రాణాలు కోల్పోయారు. పాక్ సైనికులతో పాటు ఉగ్రవాదులు కూడా శిబిరాల్లో ఉన్నారని నిర్ధారించుకున్న భారత్ 'ఆపరేషన్ సఫేద్ సాగర్' పేరుతో ఎయిర్ ఫోర్స్ ను రంగంలోకి దించింది.

అయితే 32వేల అడుగుల ఎత్తులో పోరాటం చేయాల్సి రావడంతో ఎయిర్ ఫోర్స్కు ఎదురుదెబ్బలు తగిలాయి. శత్రువుల దాడిలో రెండ్రోజుల్లోనే మూడు యుద్ధ విమానాలు నేలకూలాయి. దీంతో దెబ్బతిన్న బెబ్బులిలా లేచిన వాయుసేన మిరాజ్-2000 యుద్ధవిమానాల ద్వారా శత్రవులపై బాంబుల వర్షం కురిపించింది. భారత సైన్యం వరుస దాడులతో పాక్ సైన్యం కకావికలమైంది. దీంతో సైనిక శిబిరాలు ఒక్కొక్కటిగా భారత వశమయ్యాయి. దీనికి తోడు అంతర్జాతీయంగా దేశాలన్నీ పాక్ కు వ్యతిరేకంగా సైన్యం కకావికలమైంది. దీంతో సైనిక శిబిరాలు ఒక్కొక్కటిగా భారత్ కు వశమయ్యాయి. దీనికి తోడు అంతర్జాతీయంగా దేశాలన్నీ పాకు వ్యతిరేకంగా మారేలా భారత్ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. దీంతో దారికొచ్చిన పాక్ శిబిరాల నుంచి తన సైన్యాన్ని వెనక్కి తీసుకుంది.

మన సైనికుల వీర పోరాటంతో హిమాలయ పర్వత శ్రేణుల్లో త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. ఈ యుద్ధం అధికారికంగా 1999 జులై 26న ముగిసింది. ఈ పోరులో 559 మంది భారత సైనికులు వీర మరణం పొందగా, 1536 మంది గాయపడ్డారు. పాకిస్థాన్ చెందిన దాదాపు 3వేల మంది సైనికులు, ఉగ్రవాదులు హతమయ్యారు. కార్గిల్ యుద్ధంలో వీరమరణం పొందిన సైనికుల త్యాగాలను స్మరించుకుంటూ భారత్ ఏటా జులై 26న 'విజయ్ దివస్' నిర్వహిస్తోంది.. ఈ వేళ మనమూ వీర సైనికుల త్యాగాలను స్మరించుకుందాం. ప్రభుత్వాలు సైనికుల త్యాగాలకి తగిన ప్రాధాన్యతనివ్వాలి. వీరమరణం పొందిన కుటుంబాలకి సంపూర్ణతోడుగా నిలవాలి. అలాగే యువతరం సినిమాల్లో నటించే వారిని కాకుండా, సైనికుల్ని స్ఫూర్తిగా తీసుకోవాలి. ప్రతి ఇంట్లోని చిన్న పిల్లలకి రియల్ హీరోలుగా మన వీర సైనికులను చూపెడుదాం. దేశ సార్వభౌమత్వాన్ని భారత్ సైనికులను స్మరించుకుందాం ప్రభుత్వాలు సైనికుల త్యాగాలకి తగిన ప్రాధాన్యతనివ్వాలి. వీరమరణం పొందిన కుటుంబాలకి సంపూర్ణతోడుగా నిలవాలి. అలాగే యువతరం సినిమాల్లో నటించే వారిని కాకుండా, సైనికుల్ని స్ఫూర్తిగా తీసుకోవాలి. ప్రతి ఇంట్లోని చిన్న పిల్లలకి రియల్ హీరోలుగా మన వీర సైనికులను చూపెడుదాం. దేశ సార్వభౌమత్వాన్ని నిలబెట్టటంలో "జనశక్తి" అత్యావశ్యకమైనది. ఆ జనశక్తిలో జాతీయభావాలు పరిపుష్టం కావాలి. అప్పుడే దేశం యొక్క సైన్యం, ఆయుధ సంపత్తి, దౌత్యనీతి, పాలనా వ్యవస్థ అన్నీ సఫలం అవుతాయి.

🙏జై హింద్🙏

⚜జై భారత్⚜

🚩భారత్ మాతా కీ జై 🚩

సేకరణ

నేటి మంచిమాట.

నేటి మంచిమాట.

మనకు ఇష్టం ఉన్న చోట కష్టం ఉంటుంది కష్టం ఉన్న చోట బాధ ఉంటుంది కష్టం బాధ ను అర్థం చేసుకున్న చోట ప్రేమ ఉంటుంది వీటన్నీటిని అర్థం చేసుకునే మంచి మనసుంటే జీవితం అద్భుతంగా ఉంటుంది .

నీకు కావాలి అనుకున్నప్పుడు ఏది నీ దగ్గరకురాదు , నీ సొంతం అనుకున్నది ఎప్పటికి నిన్ను విడిచిపెట్టి పోదు , నీకు రావాలని , నీకే చెందాలని రాసిపెట్టింది రాకుండా ఆగదు . ఇప్పటి వరకు జరిగేవన్నీ నీ తలరాతలో నీ కర్మ లో భాగమే,, అంతా నీ మంచికే నేస్తమా .

మనలో మనం గొడవ పడినంత మాత్రాన విడి పోయేంత బలహీనమైంది కాదు బంధం,అంటే మనం ఎదుటి వారితో గొడవ పడిన ప్రతీసారి ఆ బంధం మరింత గట్టిగా అవుతుంది . బంధానికి అలవాటు పడినవారికే తెలుస్తుంది ఆ బంధం విలువ , ప్రేమించిన వారికే తెలుస్తుంది ఆ ప్రేమ విలువ . లేనిపోని అనుమానాలు లేనిపోని ఆవేశాలతో మీ బంధం,, బంధుత్వాన్ని వదులు కోకండి .

మనం ఎడుస్తూ కూర్చుంటే మనలో కన్నీళ్ళు కరిగిపోతాయి . కాలం కదిలి పోతుంది కష్టం మిగిలిపోతుంది , అందుకే ఎడుపుని గుండెలో దాచిపెట్టు గెలుపు కోసం పరిగెత్తు , అలుపు లేకుండా ప్రయత్నించు నీ ఏడుపుకి కారణం ఐన వాళ్ళే నీ గెలుపునీ చూసి తలదించుకోవాలి . నీ జీవితం నీవ్వు నిర్ణయించుకో .

రాయి లాగా కూర్చోకు భూమికి భారం అయ్యేలా, గడియారం లాగా పని చేస్తూండండి, విజయం ఏదోనాడూ తప్పక నిన్ను వరించకమానదు.. నేటి ఆధునిక సమాజంలో జీవించాలంటే పరిగెత్తాలి.. కుదరకపోతే నడవాలి.. అది కుదరకపోతే.. పాకుతూ అయినా పోవలిసిందే.. మంచం అసహ్యించుకునేలా పరుండితే బతకడం కష్టం

సేకరణ. మానస సరోవరం 👏

ఈ క్షణం మాత్రమే మనది... మరుక్షణం అనేది కేవలం ఆశ , ఊహ మాత్రమే.....

 ఈ క్షణం మాత్రమే మనది... మరుక్షణం అనేది కేవలం ఆశ , ఊహ మాత్రమే.....


హషీమ్ రజా(hashim raza)... ( పాకిస్ధాని ) 


పొత్తికడుపు క్యాన్సర్ 4th స్టేజ్ లో ఉన్నాడు....

పాకిస్దాన్ సోషల్ మీడియాలో హషీమ్ రజా అంటే తెలియనివాళ్లు ఉండరు..

కేవలం రెండు,మూడు నెలల వ్యవదిలోనే హషీమ్ ఇలా అయిపోయాడు...

తన ఫ్రెండ్స్ & కమ్యునిటి అందరూ దాదాపు 7,8 కోట్లు ఫండ్స్ వసూలు చేసినా కూడా తనని కాపాడలేకపోతుంది.....

పాకిస్ధాన్ టాప్ డాక్టర్స్ & ఫారెన్ డాక్టర్స్ కూడా ఈ కేస్ డీల్ చేస్తున్నారట.....

మనిషి జీవితం నీటి బుడగ..... డబ్బు , పలుకుబడి కేవలం చావుని రోజుల వరుకు పోస్ట్ పోన్ చేయగలవేమోగాని చావును తప్పించలేవు.....

జస్ట్ మనం ఈ భూమ్మీదకి ట్రావెలర్స్ గానే వచ్చాం... ఎంజాయ్ చేసి తిరిగి వెళ్లిపోవడమే...

ఇక్కడే ఉండిపోవాలనే ఆశలు పెట్టుకుంటే చావు అంటే భయంగా బ్రతకాలి.....

.

.

.

.

#Note:

ఇవాళ చూసిన మనిషి రేపు ఉండడు...

( కరోనా టైమ్ లో చూశాం )

 అయినా కూడా పక్కనోడి ఏడుపులు ,

చాడీలు ,

తొక్కేయడాలు ,

 నొక్కేయడాలు మాత్రం ఆపరు.....!!

తెలివంటే ... ?

 తెలివంటే ... ?  

 ఆమె ఐఐఎం లో ఎంబీఏ చేసి క్యాంపస్ ఇంటర్వ్యూ లో నెలకు ఆరు లక్షల జీతం పొందే ఉన్నతోద్యాగాన్ని సాధించింది  . ఉద్యోగం వచ్చాక ఒక అబ్బాయిని రెండేళ్లపాటు  ప్రేమించింది . తల్లితండ్రులను ఒప్పించి పెళ్లిచేసుకుంది . పెళ్ళయాక ఆరునెలల్లో విడాకులు తీసుకొంది. అప్పటికి తాను నాలుగు నెలల గర్భవతి . అబార్షన్ చేయించుకొని విడాకులు తీసుకొన్న ఆమె ఇప్పుడు డిప్రెషన్ లో ఉంది. ఇక జీవితం లో  పెళ్లిచేసుకోను అంటోంది . 

      మరో చోట మరో అమ్మాయి . అమెరికా లో అత్యున్నత సంస్థ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి అటుపై పెద్ద ఉద్యోగం సాధించింది . ఈమె సంపాదన పై కన్నేసిన ఒక యువకుడి ప్రేమ వలలో చిక్కి చిత్రయాతన అనుభవించి ఎలాగో ఒకలా బయటపడింది .

   మరో చోట ఐఐటీ చదివే విద్యార్ధి యూట్యూబ్ వీడియోలు    చేస్తూ దానికి ఆదరణ లేదని { మరి కొన్ని కారణాలు } ఆత్మ హత్య చేసుకొన్నాడు .చదువు సంధ్య లేని వారు యు ట్యూబ్ వీడియో లు చేస్తున్నారు { అంటే యూట్యూబ్ చేసేవారందరూ అలాంటి వారు అని కాదు } .  నువ్వు   చదివే చదివేంటి ? చేస్తున్న వీడియో లు ఏంటి ? అంతకు మించి వీడియో ల కు జనాదరణ ఎలా పెంచుకోవాలో తెలియక పోవడం .. పోనీ రాలేదు . అదే జీవితం అనుకొని తనువు చలించడం . ఏంటిది ? 

లక్షమంది పోటీ పడితే వందమందికి కూడా సీట్ దక్కని ఐఐటీ,  ఐఐఎం లాంటి సంస్థల్లో సీట్ సాధించిన వారు నిస్సందేహంగా తెలివైన వారే !

కానీ రెండేళ్లు ప్రేమించినా అబ్బాయి తత్త్వం అర్థం చేసుకోలేని బేలతనం  . ఒక సారి అబార్షన్ అయితే అటుపై పుట్టే పిలల్లకు మానసిక వైకల్యం వచ్చే ప్రమాదం పెరిగిపోతుంది అని తెలుకోలేని అజ్ఞానం . అవతలి వాడు ప్రేమిస్తున్నది తన జీతాన్ని తనకు కంపెనీ  ఇచ్చిన షేర్ ల ని అని తెలుసుకోలేని అమాయకత్వం  .. ఏంటివన్నీ? 

ఫిజిక్స్ , కెమిస్ట్రీ , మానేజ్మెంట్ , మెడికల్ సైన్స్ , ఇంజనీరింగ్ , మాథ్స్ లాంటి సబ్జెక్టు ల లో నైపుణ్యం  సాధిస్తే అకాడమిక్ లేదా డొమైన్ ఇంటలిజెన్స్ అంటారు . సంగీతం లో పట్టుంటే మ్యూజిక్ ఇంటలిజెన్స్ . భాషపై పట్టుంటే లింగ్విస్టిక్ ఇంటలిజెన్స్ . 

శ్రీదేవి . ఒక నాటి యువకుల కళల రాణి . అద్భుత నటి. కానీ అదివరకే పెళ్ళైన ఒక వ్యక్తిని పెళ్లి చేసుకొని,  అప్పుల్లో ఇరుక్కొని చిత్రవధ అనుభవించి చివరకు ఇన్సూరెన్సు అమౌంట్ కోసం ప్రాణాలు పోగొట్టుకొనే స్థితి .  సావిత్రి ఎలా మోసపోయిందో మహానటి సినిమా పుణ్యమా అని చాలామందికి తెలిసింది . తెలివైన వారు ప్రతిభావంతులు ఇలా మోసపోతారెందుకు ? 

చాల మందికి అర్థం కాని విషయం ఒకటుంది . తెలివంటే కేవలం పాఠ్యఅంశాలపై పై పట్టుసాధించి మార్కు లు ర్యాంకు లు కొట్టడం కాదు .

మీకందరకు ఒక కాలేజీ మిత్రుడుంటాడు . కాలేజి ఎగ్గొట్టి జులాయి లా బలాదూర్ తిరిగేవాడు . కాలేజీ లో పుస్తకాలతో కుస్తీ పట్టే వారెందరో ఇప్పుడు సర్కారీ క్లర్క్ లైతే,  ఆ జులాయి కాంట్రాక్టర్ గానో బిజినెస్ మాన్ గానో అవతరమెత్తి కోట్లు కూడబెట్టివుంటాడు . కేవలం లక్ లేదా పలుకుబడి అనుకొంటే అది మీ అమాయకత్వం అవుతుంది . ఆలోచించండి . ఇదెలా సాధ్యం ?

సోషల్ ఇంటలిజెన్స్ .. సామజిక తేలితేటలు . ఎమోషనల్ ఇంటలిజెన్స్ .. భావోద్వేగ తెలివితేటలు.  

ఈ రెండూ లేకపోతే ఎన్ని  మార్కులు వచ్చినా,  ఎంత సంపద ఉన్నాఅన్ని బండి సున్నాయే . ఎలాగంటారా ?

మార్కు లు , జీతం , సంపద ఇవన్నీ లక్షల్లో . సామజిక తేలితేటలు జీరో . ఇప్పుడు ఈ జీరో తో ఆస్తిని సంపాదనను గుణించండి. ఏమొచ్చింది ? బండి సున్నా . అవునా కదా ? సామజిక తెలివితేటలు ఉంటే ఆ సంఖ్య ను ఆస్థి / జీతం తో గుణించండి . అనేక రెట్లు అయిపోతుంది . 

సామాజిక తేలితేటలు లేక మలిముఘల్ చక్రవర్తులైన ఫారూఖ్ షియార్,  రఫీ ఉద్ డారాజ్ , రఫీ ఉద్దీన్    లాంటి  వారు సయ్యిద్ సోదరుల చేతిలో చిక్కి విలవిలలాడి,   చరిత్ర మరుగయ్యారు   .  ఎమోషనల్ ఇంటలిజెన్స్ లేక  పెద్ద హీరో గా నటించినా అటు పై  అవకాశాలు రావడం లేదని  ఆత్మ హత్య చేసుకొన్న వారొకరు. డిప్రెషన్ లో మరొకరు .  దీర్ఘ కాలం కోమా .. బాత్ టబ్ .. ఉరి.. ఇలా మరణాన్ని పొందిన వారు   ఇంకొందరు .    తాత సంపాదించిన ఆస్తిని తగలెట్టేసి వ్యాపారాన్ని దివాళా తీయించిన వారు ఎందరో ! 

ఇప్పుడు మీరు ఆలోచించాల్సింది బాత్ టబ్ ఏంటి ? ఇన్సూరెన్సు అమోంట్ ఏంటి ? కోమా లో ఎవరు ? అని కాదు .  ఎమోషనల్ సోషల్ ఇంటలిజెన్స్ ను పిలల్లకు ఎలా నేర్పాలి ? ఇందులో స్కూల్ , కాలేజీ పాత్ర ఏంటి ? తల్లితండ్రులుగా మన పాత్ర ఏంటి అని . 

ఆయన నాలుగో పెళ్ళానికి మూడో భర్త ఎవరు ? ఆ వీడియో లో ఆమె   ఒయ్యారాన్ని ఒలక పోసిందా ? ఇలాంటి విషయాల పై మీరు ఆసక్తి ప్రదర్శిస్తూ సమయాన్ని వినియోగిస్తుంటే .. మీ పిలల్లు ఇంటర్ నెట్ చీకటి ప్రపంచం లో దొరికే వీడియో లు,  ఫిల్ములు కు బానిసలై మీ చేయి దాటి పోతారు .  ఆవు / ఎద్దు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా ? 

పిల్లలకు సోషల్ ఇంటలిజెన్స్ ఎమోషనల్ ఇంటలిజెన్స్ ఎలా నేర్పాలో ఆలోచిస్తూ ఉండండి. ఇదే విషయం పై మరో పోస్ట్ ద్వారా మళ్ళీ కలుద్దాము .

అహంకారాన్ని పక్కకు పెట్టాలి

 అహంకారాన్ని పక్కకు పెట్టాలి

                     ➖➖

*మనలో ప్రేమ, స్ఫూర్తి లేనిదే దివ్యానుగ్రహమునకు మనం నోచుకోలేము.*

*మనకు మనం హృదయంలో నుంచి వచ్చిన భావనతో భగవంతుని సేవ ఒనర్చితే మనల్ని ఏదీ అడ్డుకోలేదు.*

*’నేను’ను ప్రక్కన పెట్టి ఏ పని చేసినా దానికి తిరుగులేదు.*

*మనలో దయార్ధ్రత, భక్తి భావన ఉంటే మన ప్రయత్నంలో విజయం తప్పక చేకూరుతుంది.*

*ఆధ్యాత్మికత నిగూఢ రహస్యాలను వెలికితీస్తుంది.*

*అది కేవలం మత గురువులకి, బోధకులకి మాత్రమే కాదు, అణకువ, సహనం, నిస్వార్థత కలిగిన భక్తులకు కూడా అన్వయిస్తుంది.*

*మనలో ఆధ్యాత్మిక దృక్పథం ఉంటే తప్ప ప్రాపంచిక కష్టాలను ఎదుర్కొనలేము.*

*అందు వలన జ్ఞాన కవచం ధరించి మనల్ని మనం కాపాడుకోవాలి. అది శాశ్వతంగా కాపాడుతుంది, సదా నిలిచి ఉంటుంది.


హితోక్తులు

 🙏🏽🙌🏿 లక్ష్మిశ్రీవేంకటేశ్వరస్వామి జ్ఞానపీఠం రేణిగుంటరోడ్డు.తిరుపతి 
వ్యవస్థాపకులు .ధర్మఛారౄ            
'తిరుపతి' శ్రీనివాసరావు
కర్మయోగి..ప్రధాన నిర్వహకులు
9390216263..9550804092 🙏🏽🙌🏿 హితోక్తులు
     మాటలతో తీపిగా చక్కర కలిపినట్లు మాట్లాడుతూ మోసం చేసే వారిని మాత్రమే అందరూ ప్రేమిస్తారు. వాస్తవం గా మాట్లాడుతూ నిజాయితీ గా ఉండేవారిని అందరూ ద్వేషిస్తారు .
       ఎవరో కాదు అన్నీ తెలిసిన మన వారే మనకే నమ్మక ద్రోహం చేస్తారు.
*_జీవితంలో మనకెదురైయ్యేవారు, మనలను విమర్శించేవారు, మనలను ఇబ్బంది పెట్టేవారు, మనలను తక్కువచేసి మాట్లాడేవారు,మనకు సమస్య సృష్టించే వారు వీరందరూ మనకు గురువులే._*
*_ఎందుకంటే, వీరందరి వలనే నీకు జీవితమంటే తెలుస్తుంది.అంతర్లిలంగా నీ వికాసానికి కారకులు వారే.. కసిగా ప్రయత్నిస్తే విజయుడవు అవుతావు.ఆగిపోయి వారినే గుర్తుంచుకుంటూ, నిందిస్తూ కాలం వెళ్లబుచ్చువంటే పతనమౌతావు._*
*_మాటకు మాట, దెబ్బకు దెబ్బ_*
*_అన్నిచోట్లా పనిచేసే చిట్కా కాదది.._*
*_ముఖ్యంగా బంధాలలో అదో విషపు చుక్క అవుతుంది..!_*
*_కాలాన్ని బట్టి కన్నీళ్లు పెరగొచ్చు తరగొచ్చు._*
*_జీవితం చెదిరిపోతుంది. కలలు వాడిపోతాయ్._*
*_బ్రతుకు బలహీనమైపోతుంది._* 
*_అన్నింటికీ కారణం మనమున్న పరిస్థితులే._*
*_అవి అర్థం కావు, ఒక్క ఎదుర్కొనే మనసుకు తప్ప.._*
*_కానీ, లోకానికి అవేం పట్టవు._*
*_ఈ ప్రపంచంలో బ్రతకాలి అంటే,_*
*_మంచితనం, మొండితనం రెండూ ఉండాలి..☝_*
👉కన్నీటినుండే కసి పుట్టాలి.. అవమానలనుండే అనుకున్న లక్ష్యాన్ని సాధించాలనే పట్టుదల రావాలి.. 
👉ఎవరైతే ఎగతాళి చేసారో వారే మనకోసం ఎదురుచూసేలా ఉన్నత శిఖరాలకి ఎదగాలి.. 
👉ఒకరి నీడలో ఎదగాలి అనుకోకు కష్టమైన సరే సొంతంగా ఎదగడం అలవాటు చేసుకో. 
ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి *నీడలో మొక్కలే ఎదగవు మనుషులం మనం ఎదుగగలమా*
👉ప్రతి పుస్తకం ఒక కొత్త విషయాన్నీ తెలియచేస్తుంది. 
ఎలా బ్రతుకాలో తెలుపుతుంది ఎలా నడుచుకోవలో తెలియచేస్తుంది. 
*చదువు అనేది కేవలం జ్ఞానాన్ని పెంచడమే కాదు సంస్కారాన్ని కూడా పెంచుతుంది.*
👉మనలోనుండి వచ్చే ప్రతి ఆలోచన మరి మనిషికి వెలుగులు చూపించేదిగా ఉండాలి, 
కానీ 
చీకట్లోకి నెట్టేసిదిగా ఉండకూడదు.
👉మనలోని రాక్షసుని బలం రోజు మొత్తం మీదా ఒక నిమిషం కన్నా తక్కువగానే ఉంటుంది. 
ఆ ఒక్క నిమిషం మనం కష్టాలను ఎదుర్కోగలిగిన మహనీయులుగా మిగిలిపోతాం. 
👉కాల గమనం లో ప్రతివారి వ్యక్తిత్వం పరీక్షించబడుతుంది. నిలబడి నెగ్గిన వాడు రాజమా ర్గం లో గమ్యం చేరుతాడు.. తప్పించుకోచూసి పక్క దారి పట్టినవాడు కొంత దూరం పొయ్యాక దారిలేక అర్ధంతరంగా ఆగిపోతాడు.. 
మనం ప్రారంభన్ని సరిగ్గా ఆరంభిస్తే ఫలితం దానంతట అదే వస్తుంది.. (*Start the work end in mind and in rt time*)
👉మన సామర్ధ్యం మీద మనకు నమ్మకం ఉన్నప్పుడు ఎంత కష్టమైన మన్ముందుకు సాగగలం
*जीना हय थो करण सीखों
कदम कदम पर मरना सीखों*
👉Be so Rich that You can buy the most Expensive thing You Desire. 
But 
Be so Expensive that No Richness on the Earth can buy You. 

సవికల్ప సమాధి, నిర్వికల్ప సమాధి, సహజ సమాధి, కుండలినీశక్తి అనేవాటికీ మనసుకు సంబంధం ఉన్నదా ?

 🙏🕉🙏 ...... *"శ్రీ"*


                 💖💖💖

       💖💖 *"290"* 💖💖

💖💖 *"శ్రీరమణీయం"* 💖💖              


*"సవికల్ప సమాధి, నిర్వికల్ప సమాధి, సహజ సమాధి, కుండలినీశక్తి అనేవాటికీ మనసుకు సంబంధం ఉన్నదా ? "*

**************************


*"మన శరీరం అంతా వ్యాపించివున్న మనసునే యోగంలో కుండలిని అన్నారు. మనసును తెలుసుకోవటమే సాధనలోని ప్రధానాంశం. పరిపరి విధాలుగా వెళ్ళే మనసును దైవంపైకి ప్రయత్నపూర్వకంగా లగ్నంచేసే ప్రయత్నం సవికల్పసమాధి. మనసులోని ఆలోచనలను తగ్గించేందుకు మనంచేసే నామజపం సవికల్పసమాధి అవుతుంది. దైవచింతనలో దేహాన్ని, ప్రపంచాన్ని మరిచి ఉండటం నిర్వికల్పసమాధి. ఏ చింతన లేకుండా దేహాన్ని, ప్రపంచాన్ని మర్చిపోవటమే నిద్ర. నిరంతరం చైతన్యభావనతో ఉంటూనే ఈ ప్రపంచంలో జీవనం సాగించటం సహజసమాధి. ఇక భక్తిలో మనసుపొందే తాదాత్మ్యతనే యోగంలో ఊర్ధ్వముఖమైన కుండలినిగా చెపుతారు. కుండలినిశక్తిని 'చుట్టుకొనివున్న పాము'తో పోలుస్తారు. మనం పాముతోకను కదిలించినా, తలను కదిలించినా అది బుసకొడుతుంది. అలాగే మనలోని చైతన్య స్రవంతి శరీరమంతా ఒకే విధంగా వ్యాపించి ఉంది "!*


*"{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}"*

           🌼💖🌼💖🌼

                 🌼🕉🌼

          

పరిమితితోనే ఆనందం - శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి వారు.

 పరిమితితోనే ఆనందం

- శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి వారు.


ఆధునికుల కాలమంతా ధనార్జనతోనే గడచిపోతూంది. సంపాదించిన ఆ ధనాన్ని కూడా సక్రమంగా ఖర్చు పెడుతున్నారా అంటే, అదీ సందేహమే!


 మనం ఏ వస్తువునూ అవసరానికి మించి కోరకూడదు. ఒక వస్తువును కొనేటప్పుడు, మనం బేరం చేసి ఎంత తక్కువ ధరలో కొనవచ్చో అంత తక్కువ ధరలో కొంటాం. కానీ ఆ వస్తువు మనకు అవసరమో, కాదో ఆలోచిస్తున్నామా? వస్తు సముదాయాన్ని వృథా చేసుకుంటూ పోవడం వల్ల మనకు సుఖం అధిక మవుతుందని అనుకోవడం ఒక భ్రమ.


 జీవితం సుఖంగా గడవాలంటే కొన్ని ముఖ్యమైన వస్తువులుంటే చాలు. దానికి కావాల్సిన ధనం మాత్రం ఆర్టిస్తే చాలు. ఈ విషయం మనం గుర్తించగలిగితే మన ఆచారాలు, అనుష్టానాలు వదులుకొని దెశాంతరాలకు పోయి మరి విస్తార ధనార్జన చేయవలసిన అవసరం ఏర్పడదు.


 ఆత్మవిచారానికీ, ఈశ్వరధ్యానానికీ, పరోపకారానికీ మనకు కావలసినంత సమయం కావాలంటే అవసరాలకు మించి వస్తువులను సముపార్దించే లౌల్యాన్ని వదిలిపెట్టాలి.


అంతటా ఆడంబరమే!: 


మనం రెండు విధాలుగా కాలాన్ని వ్యయం చేస్తున్నాం. ఒకటి ధనార్జన కోసం, రెండవది ఆ ధనార్దనతో సంపాదించిన వస్తువుల రక్షణ కోసం!


 ఈ రెండింటి నుంచి కాస్త మనస్సును మళ్ళించ గలిగితే, ఆత్మ తుష్టికరములైన సాధనలు చేసి జీవితాన్ని శాంతంగానూ, సుఖంగానూ, ఆనందంగానూ, తృప్తి గానూ గడపవచ్చు.


ఈ పొదుపు వస్తువుల విషయంలోనే కాదు సంభాషణల్లోనూ అలవరచుకోవాలి. 


పదిమాటల్లో చెప్పవలసిన విషయాన్ని ఒక్కమాటలో చెప్పగల సామర్ధ్యాన్ని పెంపొందించుకోవాలి. ఎప్పుడు మనకు ఈ విధమైన వాచా సంయమనం కలుగుతుందో, అప్పుడు బుద్ధిలో తీక్టమూ, వాక్కులో ప్రకాశమూ మనం చూడగలం. మన వాక్కులు వ్యర్థం కాకూడదు.


 'మౌనేన కలహం నాస్తి; 


మౌనం వల్ల కలహాలు పొడసూపే అవకాశమే ఉండదు కదా! 


మితభాషణ వలన మనశ్శాంతి, ఆత్మశ్రేయస్సూ వృద్ధి చెందుతాయి. కానీ ఈ కాలంలో మనం చూస్తున్నదంతా వాగాడంబరమే! 


పొదుపు ఒక్క చేతల్లోనే కాకుండా మాటల్లో కూడా ఉండాలి. భాషణలో కూడా పరిమితిని పాటిస్తే ప్రశాంతంగా ఉండగలం.


దాతృత్వంతోనే లక్ష్మీకటాక్షం: 


నిజానికి అన్ని కోరికలూ సంకల్పం వల్లనే ఉద్భవిస్తున్నాయి. కొత్త, కొత్త సంకల్పాలు ఉదయించకుండా చూసుకుంటే కోరికలూ క్రమక్రమంగా క్షీణిస్తాయి. కోరికలు క్షీణించే కొద్దీ మన కార్యక్రమాలు, ధనార్జన, వస్తు సంపాదన తగ్గుతూ వస్తాయి. సంకల్పాలు క్షీణించాలంటే సద్వస్తువులపై దృష్టి నిలపాలి. అప్పుడు చిత్తవృత్తులు సమసిపోయి, ఏకాగ్రత సిద్ధిస్తుంద


 ఏకాగ్రతకు అపరిగ్రహం అత్యవసరం. మనం సంపాదించే ధనమంతా స్వార్థం కోసమే కాక దానధర్మాలకు కూడా వెచ్చించాలి. మన సమాజంలోనే సత్కార్యాల కోసం దానధర్మాలు చేసే సుకృతులు ఎంతో మంది ఉన్నారు.

లోకంలో ఎంతోమంది దుఃఖితులూ, దరిద్రులూ ఉంటే, వారు కష్టపడుతూ ఉంటే, మనం వృథాగా ధనాన్ని ఖర్చుపెట్టడం పాపం. మన ధనంతో దీనుల దుఃఖా శ్రువులను తొలగించగలిగితే అంతకన్నా పుణ్యకార్యం వేరే ఉండదు. 


సంపద ఉండగానే సరిపోదు! దాన్ని సద్విని యోగం చేస్తున్నామా? పరోపకారానికి అది ఉపయోగ పడుతుందా? దీనజనోద్ధరణకు సహాయపడుతుందా\ అని జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. ఇలా సంపద సద్విని యోగమయ్యే కొద్దీ మనకు లక్ష్మీకటాక్షం కూడా సమృద్ధిగా లభిస్తుంది. 

ఆత్మ సాక్షాత్కారం

 ఆత్మ సాక్షాత్కారం

ఆత్మ సాక్షాత్కారం పొందిన మహాత్ముల స్థితి ఎట్లా వుంటుందో, తక్కినవారు గ్రహించలేరు. విచక్షణతో చూస్తే ఈ విభేదమంతా వారు వారు కల్పించుకున్నది కాదనీ, వారి మాటల, చేతల, ప్రోద్బలమంతా ఈశ్వర చోదితమని తెలుస్తుంది. అరుణాచల శ్రీరమణ భగవాన్ జీవితంలో భక్తులకు, మేధావులకు, ఆధ్యాత్మిక సంపన్నులకు కూడా ఎన్నో విషయాలు అర్థం కావు. ఆయన ఈ సమాజంలోని ఈ ద్వందాలు దాటిన మహర్షి అనీ, సర్వేశ్వరుడే అని నమ్మినవారినీ, నమ్మనివారికి కాని భగవాన్ ఏ మనిషికి, ఏ పరిస్థితులలో ఏ విధంగా మాట్లాడుతారో, ఏవిధంగా బోధనలు చేస్తారో అంతుపట్టని విషయం. శ్రీరమణాశ్రమంలో భగవాన్ చుట్టూ జరిగే వాటిలో ఆయనకు ఎంత సంబంధంవుందో చెప్పలేం. సంబంధం వుండనూ వుంది, ఉండనూ లేదు. ఉందంటే వుంది, లేదంటే లేదు.

శ్రీరమణ మహర్షి ఆశ్రమంలో తరుచూ జరిగే లోపాలు, పక్షపాతాలు, ఘోరాలు అన్యాయాల్ని ప్రశ్నించిన భక్తుల్ని ఒక్కోసారి సుతిమెత్తగా మరోసారి మేఘ గర్జనగల భీర స్వరంతో మీరు ఆశ్రమాన్ని సంస్కరించడానికి వచ్చారా? ఈ మాత్రం దానికి అంత దూరం నుండి రావడం దేనికి? మీమీ దేశాలలో సంస్కరించడానికి ఏమీ లేవా? మీరు వచ్చిన పని ఏదో చూసుకొని వెళ్లరాదా? అంటూ భగవాన్ నర్మగర్భంగా ప్రశ్నిస్తే ఆయనను అర్థం చేసుకొన్న వారు మహాగీతోపనిషత్తుగా భావించి నమస్కరించేవారు. అర్థంకానివారు అంధకారంలో పడి తమను తామూ సమర్థించుకొంటూ తమ మార్గమే సరైన మార్గమని అహంభావం ప్రదర్శించేవారు. తాను మనసారా విశ్వసించని విషయాన్ని కూడా భక్తుల వత్తిడితో ‘సరే’ అని ఆమోదించేవారు.

ఆదరించి, ఆశ్రయం కల్పించాల్సిన భక్తులను స్వాప్నిక దృష్టితో కలల్లో కనబడి రమ్మంటారు. భగవాన్ పిలుపుకు ఆగలేని ఆతృతా, ఎప్పుడు దర్శన భాగ్యం కలుగుతుందా అని సుదూర ప్రాంతాలనుంచి పరుగు పరుగున దరిచేరితే భాగవాన్ ఆత్మీయతతో ఆదరించి కరుణారసం కురిపిస్తాడని ఆశిస్తే భగవాన్ అటువైపు కూడా తల తిప్పని పరిస్థితి. ఎదుట వున్నా పలుకరించని పరిస్థితి. ఆతురతతో ఎదురుచూసిన భక్తుని పలుకరించరు. చిరునవ్వు నవ్వరు. కొన్ని రోజులైనా నెలలయిన అతని కోసం అహర్నిశలూ ఆత్రతతో ఎదురుచూస్తున్నా పలుకరించరు? అనుగ్రహించరు? భగవాన్ ఎప్పుడు అక్కున చేర్చుకుంటారో? అసలు పట్టనట్లే ఆవలకు నెట్టివేస్తాడో అంతా ఈశ్వరేచ్ఛ. భగవాన్ వైఖరి ఎప్పటికప్పుడు మారేది. ఆయన ఏ ఆనంద నిబిడీకృతమైన తేజోశూన్యంలోకో, కిటికీలోనుంచి అనంతపుదిక్కుల అంచుల్ని దాటి చూస్తున్నపుడు, ఆయన ధ్యాన ముద్రలో కూర్చున్నపుడు సాక్షాత్ దక్షిణామూర్తిని తలపించేవారు. భక్తులు ఆ దివ్యానంద స్థితిని పరికించి అరుణాచల పరమేష్టి ఆత్మసాక్షాత్కారం కళ్ళకు అగుపించేది.

మృత్యువువాతన పడిన దేహాన్ని కాల్చి బూడిద చేస్తారు. అంతటితో అంతవరకు నిత్యం అనుసరిస్తున్న నేను అనేది అంతమైనట్లేనా? ‘నేను’ అనేది అనంతంగా సాక్షాత్కరిస్తుంటే ఆ ‘నేను’ ఎవరో తెలుసుకో. నేను, నాది అనే విషయాన్ని విస్మరించు. నేను అనే బ్రహ్మపదార్థాన్ని తెలుసుకోవడమే ఆత్మ సాక్షాత్కారం. కనుక నేను అనేది ఈ దేహంకాదు. నాకు మృత్యువు లేదు అని భావించేటప్పటికి అతనికి జ్ఞానోదయమయింది. నేను అనేది మనసు ఆలోచన కాక, అది అనుభవమైపోయింది. మన మనసుగాక మనలో ఆత్మ అనేది వుందనీ, ఆ ఆత్మను తలచుకుంటే మనకింక బాధలుండవనీ ‘నేనెవరు?’ అనే విచార మార్గం వల్ల ఆ ఆత్మని తెలుసుకోగలమనీ భగవాన్ అంటారు. శ్రీరమణ మహర్షి ఆశ్రమానికి ఒక భక్తుడు వెళ్ళారు. భగవాన్‌ను ఉద్దేశించి ‘‘స్వామీ! నా మనస్సు నేను చెప్పినట్టు దాని ఇష్టం వచ్చినట్లు విచారిస్తోంది. అందువల్ల నాకు అశాంతి కలుగుతోంది. నా మనసును స్వాధీనంలోకి తెచ్చుకొనేందుకు మార్గం ఏదీ? అని భక్తుడు ప్రశ్న ముగించకముందే భగవాన్ కరుణారసమైన వాక్కులతో జీవితంలో సాధకుల యత్నమంతా అందుకోసమే. ఆ మనసుని అరికట్టడానికే, జ్ఞాన, భక్తి, కర్మ మార్గములన్నీ దానికోసమే. జ్ఞాన మార్గం ద్వారా మనసును నేను కాను అని తెలుసుకుని మనసును నిరోధించవచ్చు.

కర్మమార్గంలో- ఏదో ఒక కర్మయందు మనసును లగ్నం చెయ్యడంవల్ల మనసు నిలిచిపోతుంది. భక్తిమార్గంలో మనసుని సర్వదా ఇష్టదైవం మీదికి పోనిచ్చి, ఆ ప్రార్థన పూజ సేవలలో మనసుని వుంచడంవల్ల కొంతకాలానికి ఆ మూర్తియందే లగ్నమై నిలబడిపోతుంది. అన్ని మార్గాలలో భక్తి మార్గం సులభం. నీ ఇష్టదైవం పటంగాని, విగ్రహం గాని, నీ మనసులో తీరికైనప్పుడల్లా ధ్యానించుకో- దానివల్ల నీ మనసు నిలబడిపోతుంది 

మనసును ప్రశాంత స్థితిలో ఉంచడానికి మార్గం ఒకటే ఉంది.

 🌹🌹🌹🌹


మనసును ప్రశాంత స్థితిలో ఉంచడానికి మార్గం ఒకటే ఉంది. కోరికల వల నుంచి దాన్ని బయటకు పడవెయ్యాలి. ప్రపంచ మహాసాగరంలో ఊగిసలాడే పడవ వంటిది మానవ శరీరం. కర్మానుభవాలనే గాలులే ఆ నావను నడుపుతుంటాయి. 


దేహమనే పడవకు తొమ్మిది రంధ్రాలు ఉన్నాయి. ఆ పడవ నడిపే సరంగు నిమిత్తమాత్రుడు. ఈ చిల్లుల పడవను సాక్షిగా నడిపిస్తుంటాడు. ఈ తొమ్మిది రంధ్రాలను చూసుకొంటూ జీవన ప్రయాణం సాగించకపోతే, పడవలోకి నీళ్లు వచ్చేసి, అది మునిగిపోతుంది. అనుభవశాలి అయిన సరంగు పడవను ఆవలి గట్టుకు భద్రంగా చేరుస్తాడు. ఇంద్రియ నిగ్రహంతోటే ఇది సాధ్యం.


పరస్త్రీలను కోరడం మహాపాపం. తెలిసి కూడా కోరికలను వదలకపోతే మనసు పాపపంకిలమైపోతుంది. ఇతరుల్ని తిట్టడం, లేక వారి తిట్లను వినడం రెండూ నిరర్థకమే! నిందించడానికి అలవాటుపడిన నాలుక సాధించుకొనేదేదీ ఉండదు... పోగొట్టుకోవడం తప్ప.


వస్తువుల మీద ఉన్న అభిమానం, దురదృష్టానికి దారి తీస్తుంది. వస్తువును పొంది, తరవాత పోగొట్టుకొంటే అది మహాబాధ కలిగిస్తుంది. వివేకవంతమైన మనసు, తనకేది కావాలో తేల్చుకోగలదు. అశాశ్వతమైన వస్తువులకు అది ఎప్పుడూ దూరంగా ఉంటుంది.


పామునోట సగం శరీరంతో ఇరుక్కొన్న కప్ప, తనను మింగబోతున్న మృత్యువును గ్రహించలేదు. పైగా అది తన ముందున్న కీటకాలను తినాలని తాపత్రయ పడుతుంది. అదే చిత్రం. దీనిని దురాశ కాక మరేమిటని అంటారు? 


ఇలాంటి మనసును అదుపులో ఉంచుకోవడం ఎలా? తన ప్రయాణాన్ని ప్రారంభించిన నది, మూలం వదిలి సముద్రం చేరేదాకా, పల్లంవైపుగా సాగుతుంది. వర్షకాలంలో అధికంగా నీరుచేరితే బావిలోని నీరు తీపితనాన్ని కోల్పోతుంది. ఆ బావి నీరే వేసవిలో తియ్యగా మారిపోతుంది.


‘అతిసర్వత్రవర్జయేత్‌’ అన్నారు. అధికం ఎప్పుడూ అనర్థమే! అధికమైన కోరికలతో తామసగుణం పెరిగిపోతుంది. అవి లేకపోతే తామసం నశించి సత్త్వగుణం పెరుగుతుంది. సత్త్వ రజస్తమో గుణాలు మూడూ ప్రకృతి సహజమైనవే!


పవిత్రత, వివేకం, విజ్ఞానం- ఇవన్నీ సత్త్వగుణాలు. ఆందోళన, ఆగ్రహం, అస్తిమతత్వం- ఇవన్నీ రజోగుణాలు. జడత్వం, అజ్ఞానం, భ్రాంతి- ఇవన్నీ తమోగుణాలు.


మనసుకు ఉన్న మొదటి లక్షణం- అన్నీ పొందాలనుకోవడం. పోగొట్టుకోవడానికి అది ఇష్టపడదు. పైగా అవమానకరంగా భావిస్తుంది. వస్తువును పొందే ప్రయత్నం అంతా నిజానికి ఒక యాతన వంటిది. సత్సంగం, సత్సాంగత్యం, సజ్జనమైత్రి... మనసుకు ఎంతో స్తిమితాన్ని ఇస్తాయి...

🌹🌹🌹🌹🌹🌹🌹  

🪔🪔అంతర్యామి 🪔🪔 🌺🌺విజేత🌺🌺

 🪔🪔అంతర్యామి 🪔🪔


          🌺🌺విజేత🌺🌺


🌿జీవితం బహు చిత్రమైనది. ఒడుదొడుకులు, ఆరాటం, పోరాటం మనిషి మనసును మధించి అశాంతికి గురిచేస్తాయి. గెలుపు, ఓటములు, కష్టసుఖాలు ఉంటాయి. మనసును సమాధానపరచుకొని ముందుకు సాగాలి.


🌿 సాధారణంగా ఆటల్లో నెగ్గినవారిని, పాటల్లో గెలిచినవారిని విజేతలంటారు. కంటికి కనిపించకుండా మనల్ని ఆడిస్తుంది మనసు. దాని ఆట కట్టించగలిగితేనే మనిషి విజయం సాధించినట్లు!


🌿మనసును అదుపులో పెట్టడం అంత సులభం కాదు. దానికి తగిన సాధన చెయ్యాలి. మనసును జయించడానికి ముందు ఇంద్రియ నిగ్రహం అలవరచుకోవాలి. మనసును మన చెప్పుచేతల్లో ఉంచుకోవాలి. అంతేకాని, దాని చేతుల్లో కీలుబొమ్మ కారాదు. అభ్యాస వైరాగ్యాల ద్వారా మనసును స్వాధీనం చేసుకోవచ్చని గీతాచార్యులు వెల్లడించారు.


🌿‘దేవుడి కృపను పొందవచ్చు. గురువు కృపను, సాధుజనుల కృపను పొందవచ్చు. కాని మనసు కృపను పొందలేక నాశనమవుతాడు’ అని సామెత ఉంది. ‘వెయ్యిసార్లు వెయ్యిమందిని యుద్ధంలో ఓడించిన వాడికన్నా తన మనసును జయించినవాడే పరాక్రమవంతుడు’ అంటుంది ధమ్మపద. 


🌿మనసును స్వాధీనం చేసుకోవడం ప్రపంచంలో అన్నింటికన్నా కష్టమైన పని.

 🌿స్వాధీనం తప్పిన మనసు మనిషి వ్యక్తిత్వం సమగ్రంగా వికసించకుండా అడ్డుపడుతుంది. 

🌿మనోనిగ్రహం లేని వ్యక్తి విపరీతమైన పోకడలకు, ఎడతెరిపి లేని అంతర్మథనం వల్ల కలిగే మానసిక పతనానికి గురవుతాడు.


🌿ఈ స్థూల శరీరంలో మనసు ఒక సూక్ష్మమైన భాగం మాత్రమే. 

🌿భౌతికమైన స్థూల శరీరం మనసుకు పైన ఒక పొర.

🌿 మనసు వెనక ఆత్మ ఉంది.

🌿 మనసు సర్వ స్వతంత్రమైనది కాకపోయినా, దానికున్న శక్తులు అపారమైనవి. 

🌿ఆ శక్తులను జయించడానికి మనిషి విశ్వప్రయత్నం చేయాలి. 

🌿అప్పుడే అతడు విజేత కాగలడు. 

🌿మనసెప్పుడూ ఒకేలా ఉండదు. 

🌿మూడు బలమైన శక్తుల కలయికే దానికి కారణం. 🌿అవి సత్వం, రజస్సు, తమస్సు అనేవి.


   🌿శ్రీ రామకృష్ణ ‘పరిశుద్ధమైన మనసే పరిశుద్ధమైన బుద్ధి. అదే పరిశుద్ధమైన ఆత్మ’ అన్నారు.


 🌿మనసు నాలుగు విధాలైన విధులను కలిగి ఉంటుంది. అవి: మది, బుద్ధి, అహంకారం, చిత్తం. ఇవన్నీ అంతఃకరణ తాలూకు వేర్వేరు రూపాంతరాలు. 


🌿‘మది’ ఒక వస్తువు. మంచి చెడులను అంచనా వేస్తుంది. 

🌿‘బుద్ధి’ మంచి చెడులను నిర్ణయిస్తుంది. 

🌿చిత్తం జ్ఞాపకశక్తిని కలిగిస్తుంది. 

🌿‘నేను’ అనే భావాన్ని కలిగించేది ‘అహంకారం’. 🌿మనసును స్వాధీనం చేసుకోవాలంటే అది పవిత్రంగా ఉండాలి. 


🌹మనం తినే ఆహారం పరిశుద్ధంగా ఉంటే మనసు పవిత్రమవుతుంది.


🌿మనసును గెలవాలనుకునేవారు తమ కలతలు, కక్షలు, స్పర్థలు లోలోపలే దాచుకోరాదు. మనసుకు సృజనాత్మకమైన, ఆరోగ్యకరమైన కాలక్షేపం కల్పించాలి. శ్రీమద్భాగవతం ‘దానం, కర్తవ్య నిష్ఠ, వ్రతాలు, పురాణ శ్రవణం, పుణ్యకర్మలు ఇత్యాది పనులు మనసును స్వాధీనపరచుకోవడానికి దోహదం చేస్తాయి’ అని చెబుతోంది. 


🌿ముఖ్యంగా భగవంతుడి గురించి ధ్యానం చేయాలి. 

🌿గాయత్రీ మంత్రాన్ని అనునిత్యం జపిస్తే, మనసు మీ ఆధీనంలోనికి రావడానికి తోడ్పడుతుంది. 

🌿పతంజలి ఓంకారాన్ని జపించడం ద్వారా మనసును స్వాధీనం చేసుకోవచ్చని సూచించారు.


🌿‘వివేక చూడామణి’లో శంకరాచార్యులు ‘మెట్లపై నుంచి జారవిడిచిన బంతి ఏ విధంగా ఒక్కొక్క మెట్టుమీద నుంచి దొర్లుతూ కిందికి పడిపోతుందో అలాగే, మనసు తన ఆదర్శం నుంచి ఏ కొంచెం పక్కకు తప్పుకొని భోగవస్తువుల మీదకు మరలినా క్రమక్రమంగా అది మరీ హీనస్థితికి జారిపోతుంది’ అన్నారు. 


🌿మన సంకల్ప శక్తితో మనసు మీద పట్టు సాధించి నిలకడగా భగవంతుని ధ్యానించేటట్టు చెయ్యాలి. 

🌿మనసును సుశిక్షితుడైన సైనికుడిలా మలచి మాట వినేలా చేయగలిగినవాడే విజేతగా విలసిల్లుతాడు. 

🍀 నూతనత్వం 🍀

 *🍀 నూతనత్వం 🍀*


*🕉. మార్పు అనేది జీవితం అని గుర్తుంచుకోండి. ప్రతి క్షణంలో మార్పు నూతనత్వంగా అందుబాటులో ఉంటుంది. 🕉*

 

*మనుషులు పాతవాటికి అతుక్కుపోతే మార్పు ఆగిపోతుంది. కొత్తదనంతో మార్పు వస్తుంది. పాతదానితో ఎటువంటి మార్పు ఉండదు, కానీ ప్రజలు పాతదాన్ని అంటిపెట్టుకుని ఉంటారు ఎందుకంటే ఇది సురక్షితంగా, సౌకర్యవంతంగా, సుపరిచితమైనదిగా కనిపిస్తుంది. మీరు దానితో జీవించారు, కాబట్టి మీకు అది తెలుసు, మీరు దానిలో నైపుణ్యం కలిగి ఉన్నారు, దాని గురించి జ్ఞానం కలిగి ఉన్నారు. మళ్లీ కొత్తదనంతో మీరు అజ్ఞానులుగా ఉంటారు. కొత్తదానితో మీరు తప్పులు చేయవచ్చు; కొత్తదానితో, అది ఎక్కడికి దారితీస్తుందో ఎవరికి తెలుసు? అందువల్ల భయం పుడుతుంది, మరియు ఈ భయం వల్ల మీరు పాతదానికి కట్టుబడి ఉంటారు. మరియు మీరు పాతదాన్ని పట్టుకోవడం ప్రారంభించిన క్షణం, మీరు ప్రవహించడం ఆగిపోయారు. కొత్తదనానికి అందుబాటులో ఉండండి. ఎప్పుడూ గతానికి చచ్చిపోతూనే ఉండండి. అది పూర్తయింది!*


*నిన్నటిది నిన్న. అది ఎప్పటికీ తిరిగి రాదు. మీరు దానిని అంటిపెట్టుకొని ఉంటే మీరు దానితో చనిపోతారు; అది నీ సమాధి అవుతుంది. రాబోయే దానికి హృదయాన్ని తెరవండి. ఉదయించే సూర్యుడికి స్వాగతం పలకండి. ఎల్లప్పుడూ అస్తమించే సూర్యుడికి వీడ్కోలు చెప్పండి. కృతజ్ఞతతో అనుభూతి చెందండి, ఇది చాలా ఇచ్చింది అని. కాని కృతజ్ఞతతో, దానికి అతుక్కోవడం ప్రారంభించ వద్దు. మీరు దీన్ని గుర్తుంచుకోగలిగితే, మీ జీవితం పెరుగుతూనే ఉంటుంది, పరిపక్వం చెందుతుంది. ప్రతి కొత్త అడుగు, ప్రతి కొత్త సాహసం కొత్త సంపదను తెస్తుంది. జీవితమంతా ఒక కదలిక అయినప్పుడు, మరణం వచ్చే సమయానికి ఒక వ్యక్తి చాలా ఉన్నతుడిగా మారతాడు. అంతిమంగా చాలా గొప్పగా తెలుసుకుంటాడు. మరణం దేనినీ తీసివేయదు. చావు పేదవారికి మాత్రమే వస్తుంది - జీవించని వారికి మాత్రమే వస్తుంది.💐


మంత్రం, దేహభావన, సమాధి, స్పిరిచ్యువాలిటీ సమన్వయం ఏమిటి ?

 💖💖💖

       💖💖 *"289"* 💖💖

💖💖 *"శ్రీరమణీయం"* 💖💖

     

*"మంత్రం, దేహభావన, సమాధి, స్పిరిచ్యువాలిటీ సమన్వయం ఏమిటి ?"*

**************************


*"శరీరాన్ని దాటి వెళ్ళటం సమాధి కాదు. శరీర భావనను దాటటం సమాధి ! ప్రాణ స్వరూపులమైన మనకు నిజానికి ఏదీ అవసరంలేదని, అవసరాలన్నీ దేహానివేనని అర్థం కావడమే దేహభావనను దాటటం అంటే. ఆ ప్రాణ భావనలో కర్మలు ఆవిరైపోతాయి. స్పిరిట్ సీసా మూతతీస్తే అది ఎలా ఆవిరైపోతుందో అలా మనకర్మలు ఆత్మభావనలో ఆవిరైపోతాయి. అందుకే ఆత్మను స్పిరిట్ అంటారు. ఆధ్యాత్మికత అంటే స్పిరిట్ లోని రిచ్యుయల్ కనుకనే అది స్పిరిచ్యుయల్ అయ్యింది. మనసు నామజపంలో లీనమైనప్పుడు ఆ మంత్రం, మనం చదవడం లేదని, కేవలం అది మనకు వినపడుతుందని తెలుస్తుంది ! ఆ తర్వాత అది వినపడటం కూడా కేవలం కలలోలాగా భావనేకానీ సత్యం కాదని తెలుస్తుంది. మనలో శబ్దంలేని వినికిడి, రూపమేలేని దృశ్యం జరుగుతున్నాయని సాధనలో దశలవారీగా అనుభవంలోకి వస్తుంది. సత్యావలంబనమే సమాధి. అంటే ఎల్లప్పుడూ లోపలి చైతన్యంతో మనసు కలిసి ఉండటమే సమాధి @ మనసును భక్తి ఆవహించటమే సమాధి !"*


*"{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}"*

             🌼💖🌼💖🌼

                   🌼🕉🌼

           

సంస్కారం – నాగరికత

 *సంస్కారం – నాగరికత*


వాసు, వీణ గుజరాత్‌ లోని ఒక నగరంలో నివసిస్తున్నారు. ఒకే మెడికల్ కాలేజీలో కలిసి చదువుకున్న వీరిద్దరి స్నేహం ప్రేమగా మారింది. రెండేళ్ల క్రితం కుటుంబసభ్యుల ఆమోదంతో పెళ్లి చేసుకున్నారు. పెళ్లయ్యాక బ్యాంకులో లోన్ తీసుకుని సొంతంగా ఒక ఆసుపత్రి తెరవాలని నిర్ణయించుకున్నారు. వీణ గైనకాలజిస్ట్, వాసు డాక్టర్ ఆఫ్ మెడిసిన్. వారి నైపుణ్యాల వల్ల ఆసుపత్రి బాగానే నడుస్తూ ఉంది. వారికి ఇంకా పిల్లలు లేరు, కాబట్టి వారు సరదాగా చిన్న చిన్న ప్రయాణాలు చేస్తున్నారు.

వారు వృత్తిరీత్యా వైద్యులు అవడం వల్ల తరచుగా సెలవలు తీసుకోలేరు. అయితే రెండు మూడు రోజులు విరామం దొరికినప్పుడల్లా చిన్నపాటి ప్రయాణాలు చేస్తూ ఎదో ఒక చోటికి వెళ్లేవారు. ఈసారి వారికి మూడు రోజుల విరామం లభించడంతో ఇండోర్, ఉజ్జయిని వెళ్లాలని అనుకున్నారు.


వారు ప్రయాణానికి బయలుదేరినప్పుడు, ఆకాశమంతా మేఘావృతమై ఉంది. మధ్యప్రదేశ్ సరిహద్దు దాదాపు 200 కి.మీ దూరంలో ఉండగా వర్షం ప్రారంభమయింది. మధ్యప్రదేశ్ సరిహద్దుకి 40 కి.మీ దూరంలోనే ఓ చిన్న గ్రామాన్ని దాటడానికి వారికి చాలా సమయం పట్టింది. బురదమయమైన రోడ్లు, విపరీతమైన ట్రాఫిక్ మధ్య, వారు అతికష్టం మీద ఆ గ్రామాన్ని దాటగలిగారు.

మధ్యప్రదేశ్ చేరుకున్న తర్వాత భోజనానికి ఆగుదామని నిర్ణయించుకున్నారు, కానీ ఇప్పుడు సాయంత్రపు టీ సమయం అయింది. ఆ చిన్న ఊరు నుండి 4-5 కి.మీ దూరం వెళ్లాక రోడ్డు పక్కన చిప్స్ ప్యాకెట్లు వేలాడదీసి ఉన్న ఒక చిన్న ఇల్లు కనిపించింది. టీ కొట్టు అనుకుని, వాసు అక్కడ కారు ఆపి షాప్ లోకి వెళ్ళాడు, అక్కడ ఎవరూ లేరు. 


ఎవరైనా ఉన్నారా అని పిలిచాడు! ఒక స్త్రీ బయటకు వచ్చి "ఏం కావాలి అన్నా?" అనడిగింది.


వాసు రెండు చిప్స్ ప్యాకెట్లు, ఒక బిస్కెట్ ప్యాకెట్ తీసుకుని, "అక్క, రెండు కప్పులు టీ ఇవ్వరా, దయచేసి కొంచెం త్వరగా చేయండి, మేము ఇంకా చాలా దూరం ప్రయాణించాలి." అన్నాడు. ప్యాకెట్లు తీసుకుని కారు దగ్గరకు వెళ్లాడు. ఇద్దరూ చిప్స్, బిస్కెట్లు తిన్న తర్వాత కూడా టీ ఇంకా రాలేదు. కారు దిగి షాపు వద్ద ఉన్న కుర్చీలపై కూర్చున్నారు. వాసు మళ్ళీ పిలిచాడు.

కొద్దిసేపటికి ఆ స్త్రీ బయటకు వచ్చి, "అన్నా! పెరట్లో తులసి ఆకులు తీసుకురావడానికి వెళ్ళాను, దానికి కొంచెం సమయం పట్టింది, టీ తయారవుతోంది." అంటూ కొద్దిసేపటి తర్వాత ప్లేట్‌ లో రెండు పాత కప్పుల్లో వేడి వేడి టీ తెచ్చింది.

మురికిగా ఉన్న ఆ పాత కప్పులను చూసి, వాసు పూర్తిగా నిరాశ చెంది, ఏదో అనాలనుకున్నాడు; కానీ వీణ చేయి నొక్కి, అతనిని ఆపింది. కప్పులు తీసుకోగానే తులసి, అల్లం సువాసన వెదజల్లింది. ఇద్దరూ టీ తాగారు. వారు తమ జీవితంలో ఇంత రుచికరమైన, సువాసనగల టీ మొదటిసారిగా తాగారు, ముందున్న సంకోచం అంతా మాయమైపోయింది.


టీ తాగిన తర్వాత, వారు ఎంత ఇవ్వాలని ఆ మహిళను అడిగారు. "ముప్పై రూపాయలు" అని బదులిచ్చింది. వాసు ఆమెకి వంద రూపాయల నోటు ఇచ్చాడు. ఆ స్త్రీ, "అన్నా, నా దగ్గర చిల్లరలేదు, దయచేసి నాకు ₹30 చిల్లర ఇవ్వండి" అని చెప్పింది.


 డాక్టర్ వాసు ఆమెకు చిల్లర ఇవ్వడంతో, ఆ మహిళ వంద రూపాయల నోటును తిరిగి ఇచ్చేసింది.


"చిప్స్, బిస్కెట్లు కూడా కొన్నాం కదా !" అన్నాడు వాసు. 

"ఈ డబ్బు దాని కోసమే, టీ కోసం కాదు" అని ఆ మహిళ చెప్పింది.

"ఐతే టీకి డబ్బులు ఎందుకు తీసుకోలేదు?" అని అడిగాడు.

"మేము టీ అమ్మం. ఇది హోటల్ కాదు" అని ఆమె సమాధానం ఇచ్చింది.


"మరి టీ ఎందుకు చేసిచ్చావు?" అడిగాడు వాసు.


"మీరు మా అతిధులుగా వచ్చి... టీ అడిగారు !! మా వద్ద పాలు కూడా లేవు. పిల్లాడి కోసం ఉంచిన కాసిని పాలు మాత్రమే ఉన్నాయి, నేను మిమ్మల్ని కాదనలేక, ఆ పాలతో టీ చేసి ఇచ్చాను."


"ఇప్పుడు నువ్వు పిల్లవాడికి ఏమి ఇస్తావు ?" అడిగాడు .

ఒక్కరోజు పాలు తాగకపోతే ఏమీ అవదు. బాబు తండ్రికి అనారోగ్యంగా ఉంది, లేకుంటే ఊళ్లోకి వెళ్లి పాలు తెచ్చేవాడు. కానీ అతనికి నిన్నటి నుంచి జ్వరం. ఈరోజు తగ్గితే రేపు పొద్దున్నే వెళ్లి పాలు తెస్తాడు", అంది.


ఆమె మాటలు విని వాసు, వీణ ఇద్దరూ నిశ్చేష్టులయ్యారు. నోరు మెదపలేకపోయారు!


వాసు ఇలా అనుకున్నాడు, “వాళ్ళు టీ అమ్మకపోయినా, ఈ అమ్మాయి తన బిడ్డ కోసం ఉంచిన పాలతో మనకు టీ చేసి ఇచ్చింది, అది కూడా నేను అడిగానని .... ఒక అతిధిగా అనుకుని? సంస్కారంలో, నాగరికత చూపడంలో ఈ మహిళ నాకంటే చాలా ఎత్తులో ఉంది."


"మేమిద్దరం డాక్టర్లం, మీ భర్త ఎక్కడ ఉన్నాడు ?" అనడిగాడు వాసు.


స్త్రీ వారిని లోపలికి తీసుకువెళ్లింది; ఆ ఇంట్లో ప్రతీది 'పేదరికం' తో అరుస్తోంది. ఒక పెద్దమనిషి మంచం మీద పడుకుని ఉన్నాడు; అతను చాలా సన్నగా ఉన్నాడు. డాక్టర్ వాసు వెళ్ళి అతని నుదుటి మీద చెయ్యి వేసాడు. అతని నుదురు, చేతులు చాలా వేడిగా ఉంది, వణుకుతున్నాడు కూడా.


డాక్టర్ వాసు కారు దగ్గరకు వెళ్లి మందుల బ్యాగ్ తీసుకొచ్చాడు. రెండు-మూడు మాత్రలు ఇచ్చి, "ఈ మాత్రలు వల్ల అతనికి పూర్తిగా నయం అవదు, నేను నగరానికి తిరిగి వెళ్లి ఇంజెక్షన్లు, మందు బాటిల్ తీసుకొస్తాను" అని చెప్పాడు. వీణను పేషెంట్ దగ్గరే ఉండమన్నాడు.


అతను తన కారును తీసుకొని అరగంటలో, సిటీ నుండి మందు సీసాలు, ఇంజెక్షన్లు, కొన్ని పాల ప్యాకెట్లతో పాటు తిరిగి వచ్చాడు. పేషెంట్ కి ఇంజెక్షన్ ఇచ్చాడు, డ్రిప్ బాటిల్ పెట్టాడు. సెలైన్ బాటిల్ ఖాళీ అయ్యే వరకు ఇద్దరూ అక్కడే కూర్చున్నారు. ఆ స్త్రీ తులసి అల్లం టీ మరోసారి తయారు చేసింది. ఇద్దరూ టీ తాగి, దానిని మెచ్చుకున్నారు. రెండు గంటల్లో పేషెంట్ కాస్త బాగుపడడంతో అక్కడి నుంచి ఇద్దరూ వెళ్లిపోయారు.


ఇండోర్ - ఉజ్జయినిలో మూడు రోజులు ఉండి తిరిగి వచ్చిన తర్వాత, వారు ఆ పిల్లాడి కోసం కొన్ని బొమ్మలు, పాల ప్యాకెట్లు తీసుకువచ్చారు. వారు ఆ దుకాణం ముందు ఆగి ఆ మహిళను పిలిచారు. భార్యాభర్తలిద్దరూ బయటకు వచ్చి వారిని చూసి చాలా సంతోషించారు. “మీ మందులతో ఆ మరుసటి రోజే అతను పూర్తిగా కోలుకున్నాడు’’, అని ఆ మహిళ చెప్పింది.

డాక్టర్ వాసు చిన్నారికి బొమ్మలు, పాల ప్యాకెట్లు ఇచ్చారు. మళ్ళీ టీ తయారుచేయబడింది, సంభాషణలు జరిగాయి, స్నేహం ఏర్పడింది. వాసు తన అడ్రస్ ఇచ్చి, "నువ్వు మా ఊరు వచ్చినప్పుడల్లా నన్ను కలువు", అన్నాడు.


 ఆపై వారిద్దరూ వారి నగరానికి చేరుకున్నారు.


సిటీకి చేరుకోగానే డాక్టర్ వాసు ఆ మహిళ మాటలు మరిచిపోకుండా ఓ నిర్ణయం తీసుకున్నాడు. అతను తన ఆసుపత్రిలోని రిసెప్షనిస్ట్‌ తో ఇలా చెప్పాడు, "ఇక నుండి ఎవరైనా పేషెంట్లు వచ్చినప్పుడు, వారి పేర్లు రాయండి, ఎటువంటి రుసుము వసూలు చేయవద్దు, ఇక నుండి ఫీజులు నేనే వసూలు చేసుకుంటాను."


అప్పటి నుండి పేద పేషెంట్ల వద్ద నుంచి ఫీజులు వసూలు చేయడం మానేశాడు. పేషెంట్లు సంపన్నులు అని తెలిస్తే మాత్రం ఫీజు వసూలు చేసేవాడు.

క్రమంగా, అతను నగరం అంతటా ప్రసిద్ధి చెందాడు. ఇతర వైద్యులు తెలుసుకుని, ఇది మా ప్రాక్టీస్ ను తగ్గిస్తుందని, ప్రజలు తమని విమర్శిస్తారని వారు భావించారు. వైద్య సంఘం ప్రెసిడెంట్ ని కలిసి వారు ఆందోళనకు దిగారు.


అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ వాసుని కలవడానికి వచ్చి "ఎందుకు ఇలా చేస్తున్నావు?" అనడిగాడు.


  కానీ డాక్టర్ వాసు చెప్పిన సమాధానం విని అతను ఆశ్చర్యపోయాడు.


డాక్టర్ వాసు మాట్లాడుతూ.." జీవితంలో ప్రతి పరీక్షలోనూ మెరిట్‌ లో ఫస్ట్‌ ర్యాంక్‌ సాధిస్తూ వచ్చాను .... ఎంబీబీఎస్‌, ఎండీ చదివే సమయంలోనూ గోల్డ్‌ మెడలిస్ట్‌ నే.. సభ్యత, సంస్కారం, ఆతిథ్యంలో మాత్రం ఆ గ్రామానికి చెందిన ఆ పేద మహిళ నాకంటే ముందున్నది, ఇప్పుడింక నేను ఎలా వెనుకబడి ఉండగలను?అందుకే నేను ఆతిథ్యం, మానవ సేవలో కూడా గోల్డ్‌ మెడలిస్ట్‌ ని అవుదామనుకుంటున్నాను. అందుకే నేను ఈ సేవను ప్రారంభించాను. నిజానికి, మన వృత్తి మానవాళికి సేవ చేయడానికి కానీ, డబ్బు సంపాదించడానికి కాదు. మానవాళికి సేవ చేసే అవకాశాన్ని భగవంతుడు మనకు ఇచ్చాడు", అన్నాడు.


"ఇకపై నేనూ అదే స్ఫూర్తితో వైద్యసేవ చేస్తాను’’ అంటూ సంఘం అధ్యక్షుడు డాక్టర్ వాసుకు నమస్కరించి కృతజ్ఞతలు తెలిపారు.


♾️


మనం చేసే సేవలో ఉత్సాహం ఉండాలి; మనం ఏమి చేసినా, ప్రతిఫలంగా ఏమీ పొందాలనే ఉద్దేశ్యం లేకుండా హృదయపూర్వకంగా  చేయాలి. 🌼

 *సేకరణ..,...* 

 *గంగిశెట్టి మనోజ్ కుమార్.*

|| మరణం లేని Patriji || మరణం అంటే ఏంటి ?

 || మరణం లేని Patriji ||


మరణం అంటే ఏంటి ? 


అప్పటి వరకు ఉన్న ఉనికి ఇకపై ఉండక పోవడమే మరణం అంటే.


భూమి మీద ఏ ఆధ్యాత్మిక గురువు చెయ్యని విధంగా తాను ఒక్కనే కాదు చాలా మంది జ్ఞానోదయం పొందిన వారు ఉన్నారు అందరి దగ్గర నుండి జ్ఞానాన్ని పొందాలి అని చెప్పిన ఆయనకు మరణం ఎక్కడిది.


మానం లేదు, అవమానం లేదు అన్నింటినీ ఆస్వాదించాలి అని చెప్పిన ఆ వాక్కుకి మరణం ఎక్కడుంది.


ఆధ్యాత్మిక అందరికీ ఒకటే అని చెప్పి ఆవిధంగానే పల్లే, పల్లే కు ధ్యానాన్ని చేర్చిన ఆయనకు మరణం లేదు. 


అజ్ఞానాన్ని జ్ఞానం అనే విచ్చుకత్తులతో తెగ నరికిన బ్రహ్మజ్ఞాని.


మానవులకు " శ్వాస మీద ధ్యాస " అనే అమృత కలశాన్ని అందించిన అపర బుద్దుడు.


మాంసాహారం తినే వాడు రాక్షసడు, శాకాహారం మాత్రమే మానవుల ఆహారం నిక్కచ్చిగా చెప్పిన ధీరుడు.


ఆయన ఒక మహా జ్ఞానసముద్రం.

ఆయన ఒక ఆద్యాత్మిక విస్పోటనం.

ఆయన ఆద్యాత్మిక విప్లవానికి ప్రాణం పోసిన యోధుడు.

ఆయన చీకటిలో ఉన్న వాళ్ళకు వెలుగు.


ఆయన చేసిన కృషి మాటల్లో చెప్పడానికి ప్రయత్నిస్తే మాటలు అలిసిపోతాయి.

ఆయన అందించిన స్నేహం ఎడారిలో మంచి నీటి సరస్సు లాంటిది.

బరువెక్కిన హృదయలను సేద తీర్చిన మహా వృక్షం ఆయన.

మోడు బారిపోయిన జీవితాలలో ఆహ్లాదాన్ని తెచ్చిన వసంతం ఆయన.

అందరినీ నక్షత్ర వాసులుగా చూసిన ఆకాశం ఆయన.

అందరూ దేవుల్లే అని చెప్పిన సత్యం యొక్క గొంతుక ఆయన.


విప్లవం ఆయనే

విప్లవకారుడు ఆయనే

జననమూ ఆయనే

మరణమూ ఆయనే

జనన, మరణాల మద్యన జీవితము ఆయనే 

దారి ఆయనే 

గమ్యము ఆయనే

నడిచేది ఆయనే, నడిపించింది ఆయనే

ప్రశ్న ఆయనే, సమాధానము ఆయనే


అన్నీ తానై కొన్ని వేలమంది జీవితాల్లో గురువుగా, స్నేహితుడిగా, మార్గదర్శి గా, ఆత్మజ్ఞానిగా, బుద్దుడిగా ఉండి ఎవరూ బర్తీ చేయలేని పాత్రని మా అందరి జీవితాల్లో జీవించిన మీకు తిరిగి కృతజ్ఞతలు ఏలా తెలియజేయాలి sir. 


మా జీవితాలకు సమాధానము మీరు.

మా అభివృద్ధికి మైలురాయి మీరు.

మా ఆద్యాత్మిక అవగాహనకు కొలమానం మీరు.

మా తలరాతలకు శిల్పులు మీరు.

మా జ్ఞానోదయానికి దిక్సూచి మీరు.


మీరే మా మార్గం

మీరే మా గమ్యం


మీకు మాకు వీడ్కోలు లేదు, ఉండదు.

మీ ఈ భూప్రయాణం అప్పుడే ముగిసిందా?


మీరు నేర్పిన Acceptence లేకపోయి ఉంటే మీరు లేరన్న విషయాన్ని విని మా హృదయాలు బద్దలు అయ్యేవి. 


మీరు చెప్పిన మరణం ఒక సంబరం అనే విషయం మాకు తెలియక పోయింటే మా కళ్ళు కన్నీళ్ళతో గోషించేవి.


మాకొసం ఆద్యాత్మిక వాతావరణాన్ని సృష్టించిన మీకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలం. 


మీరు ఆశించిన ధ్యాన జగత్, పిరమిడ్ జగత్, శాకాహార జగత్ స్థాపించడానికి మా చివరి శ్వాస వరకు పని చెయ్యడం మేము మీకు చెప్పగలిగే కృతజ్ఞత, ఇవ్వగలిగే బహుమతి. 


మీరు అందిచిన స్ఫూర్తిని భవిష్యత్ తరాలకు అందిస్థాము. 

మీరు ఇచ్చిన జ్ఞానాన్ని విశ్వవ్యాప్తం చేస్తాం.

ప్రపంచాన్ని ధ్యాన మయం, శాకాహార మయం చేస్తాం.

భూమిని స్వర్గంగా చేస్తాం.

మనుషులను దేవుళ్ళుగా తెలుసుకునేలా చేస్తాం.


మరో ప్రయాణానికి, మరో ఉద్యమానికి, మరో విప్లవానికి నాంది పలుకుతాం.


జైహో Patriji జై జై Patriji


అమరులు మీరు మరణం మీకు మణిహారం. 


మనిషి నుండి భగవాన్ గా ఎదిగిన మీకు మా ప్రణామాలు, కృతజ్ఞతలు. 

 బ్రహ్మర్షి  పితామహ సుభాష్ పత్రిజీ🙏

Sunday, July 24, 2022

దేవునికి మన హృదయమే అసలైన నివాసస్థలం అని మనం నమ్మాలి.

 *🕉️ జై శ్రీన్నారాయణ🕉️🌺🙏ఓం నమో భగవతే వాసుదేవాయ🙏🌺*


*_🌴దేవునికి మన హృదయమే అసలైన నివాసస్థలం అని మనం నమ్మాలి. హృదయం నుండి వచ్చే బోధనను అనుసరించాలి. వాటిని అనుసరించడానికి మంచి పద్ధతులను అవలంబించాలి. మన పూర్వీకులు చెడును అధిగమించడానికి, మన ఇంద్రియాలపై నియంత్రణ పొందడానికి ధ్యానము, యోగా వంటి ఆధ్యాత్మిక పద్ధతులను, పవిత్ర మార్గాలను ఇచ్చారు. ఆ మార్గం గుండా జీవనం సాగించదానికి మనం ప్రయత్నం చేయాలి. కోపం మరియు ద్వేషాన్ని నియంత్రించడానికి నాడు ఋషులు తమ గ్రామాలను వదిలి అడవికి వెళ్లారు. ఈ రోజు కోపం, ద్వేషాన్ని వదిలించుకోవడానికి అడవికి పోనవసరంలేదు. ఉన్నచోటనే ఉంటూ సాధన చేసుకోవచ్చు. మనం కోపంనకు ఆస్కారమున్న వాతావరణంలో జీవిస్తూ దానిని నియంత్రించగలగాలి. అది అసలైన సాధన. అది అసలైన ఘనమైన విజయము!. అంతేకాని కోపానికి ఆస్కారం లేని అడవిలో నివసిస్తూ మన కోపాన్ని నియంత్రించామని చెబితే అది అర్థవంతమైనది కాదు. అందువల్ల కోపం, ద్వేషం వంటి భావోద్వేగాల పెరుగుదలకు తగినంత అవకాశం ఉన్న ప్రపంచ పరిసరాలలోనే ఉంటూ ధ్యానము, స్మరణ, జపం, యోగము వంటి ఏదో ఒక సాధన చేసి వాటిని నియంత్రించడం నేర్చుకోవాలి. అది ఒక ఘనమైన విజయం అవుతుంది.🌴_* 

భగవంతుని కోసం అన్వేషిస్తున్నాను.... అనుకునే సాధకుని కోసం రమణుని సమాధానం.

 భగవంతుని కోసం అన్వేషిస్తున్నాను.... అనుకునే సాధకుని కోసం రమణుని సమాధానం.
        🌼🌼🌼🌼🌼
ఎక్కడ భగవంతుని అన్వేషిస్తున్నావు ?,
బయట వున్నాడా భగవంతుడు ?
 లేక లోపల వున్నాడా భగవంతుడు .?
 ఎక్కడవున్నాడు అని వెతుకుతున్నావు ?
ఉన్నది అంతా ఒక శక్తిమాత్రమే .ఈ సృష్టిని నడిపిస్తున్నది ఒక శక్తి మాత్రమే.
 దానిని కను గొనడము ,
అన్వేషించడము ఎవ్వరితరము కాదు .
సాక్షాత్ ఆ పరమేశ్వరుని 
తరము కూడా కాదు .
ఎందుకంటే ....
ఆది ,
అంతమూ ,
చావు ,
పుట్టుక ,
అందము ,
వికారము ,
స్వార్ధము ,
నిస్వార్ధము ,
కోరిక ,
కోరిక లేకపోవడము ,
సుఖము ,
దుఃఖము ,
ఆనందం ,
విచారం - ....
ఇలా చెప్పుకుంటూ పోతే చాలావున్నాయి గుణాలు .
ఈ గుణాలులో ఎదో ఒక గుణము ఆ భగవంతునికి వున్నా ఆ భగవంతుని 
కోసం సాధకుడు అన్వేషించవచ్చును.
కాని ఏగుణాలు లేని ,ఏ ఆకారము లేని ఆ భగవంతుని కోసం ఎక్కడ ఉన్నాడని వెతుకుతావు ?
ఉన్నదంతా ఒక శక్తి మాత్రమే అదే నీవనుకునే భగవంతుడు .
ఆ శక్తి నీవు 
ఈ భౌతిక కనులతో చూడలేవు .
నీయొక్క దివ్య చక్షువుతో మాత్రమే అనుభూతిని పొందగలవు .
భగవంతుడు కాంతి స్వరూపుడూ ఆ కాంతి ఇలావుంటుంది అనిచెప్పడానికి ఈ శరీరాన్ని పొందిన మానవునికి , ఆ భగవంతుని అనుభూతి పొందిన సాధకుడు చెప్పలేడు .
ఎందుకంటే చెపితే అర్థం చేసుకునే స్థితిలో నీవు లేవు .
ఎందుకంటే నీవు భగవంతుడిని 
నీ ఇంటిలో ఉన్న ఫోటోలోనో ,
లేక నీ ఇంటిలో ఉన్న దేవుని మందిరంలోనో ,
లేక బయట ఉన్న గుడిలోనో ,
లేక కొండల్లోనో ,
లేక కోనల్లోనో వున్నాడని వెతుకుతున్నవు ?
ఎక్కడ వున్నాడని వెతుకుతావు ?
ఎక్కడా నీకు కనబడడు నీ సమయం వృదా !
వెతక వలసినది నీలోపల ! 
 వేసుకోవాల్సినది ప్రశ్న నీలోపల .
నేనెవరు ?
 భగవంతుడెవరు ?
 ఎలా వుంటాడు ?
 ఎక్కడ వుంటాడు ?
అసలు ఉంటే ఎలావుంటాడు ?
 అసలు నేను ఈ భూమి మీదకు ఎందుకు వచ్చాను ?
 ఏ పని నిమిత్తమై వచ్చాను ఈ సంసారం చెయ్యడానికి వచ్చానా ? 
ధనము సంపాదించడానికి ,
పేరుప్రతిష్టలు ,
ఆస్తి ,
అంతస్తులు ,
హోదా ,
సంపాదించడానికి వచ్చానా ? 
అసలు దేనికోసం వచ్చాను ?
ఇవేమి నిర్దారించు కోకుండా ,
నీకు నీవు ప్రశ్నించుకోకుండా ,
నీప్రశ్నకు సమాధానం తెలుసుకోకుండా ,
భగవంతుని 
కోసం అన్వేషణ చేస్తున్నాను......
అంటావేమిటి ?
అసలు నిన్ను నీవు ప్రశ్నించుకున్నవా?  
నేను ఎవరు ?
నేను ఎక్కడనుండి వచ్చాను ?
ఏపని నిమిత్తమై వచ్చాను ?
అసలు నా నిజమయిన లక్ష్యం ఏమిటి ?
నా లక్ష్యానికి నేను పొందుతున్న దానికీ గల సంబందం ఏమిటి ?
 ప్రశ్నించుకో ?
 సమాధానాలు పొందు .అప్పుడు అన్వేషించు భగవంతునికోసం....
నీ ప్రశ్నలకు సమాధానాలు దొరికేంతవరకు భగవంతుని జోలికి వెళ్ళమాకు ,
 నీకు తెలియదు
భగవంతుని గురించి.
మరల ,నీ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవడం గురించి పురోహితుల వద్దకు ,
జోతిష్య సిద్ధాంతుల వద్దకు ,
గుడిలో ఉన్న భగవంతుని ఆకారంలో ఉన్న విగ్రహంవద్దకు వెళ్ళకు అక్కడ సమాధానం దొరకదు .
అక్కడ దొరికేది నీ యెక్క భౌతికంగా వచ్చిన సమస్యకు పరిష్కారము ,లేక మనసు ప్రశాంతత దొరుకుతుంది .
అంతే కానీ నీ ప్రశ్నకు సమాధానము దొరికేది నీలోపలే ,
నీ అంతరంలోనే ,
అన్వేషించు,
శోధించు ,
ప్రశ్నించు ,
నిరంతరం కనుల మూసినా ,
తెరచిన ,
కూర్చున్న ,
నిలబడిన ,
పడుకున్నా ,
నడుస్తున్నా ,
ఏమిచేస్తున్న 
ఇదే ఆలోచన -
నేను ఎవరు ? 
అని ప్రశ్నించుకో 
అదే సాధన....
ముందు నీకోసం అన్వేషించు ,
తరువాత భగవంతునికోసం 
నీకే అర్థమవుతుంది .
సమయము వృధా పోని యకు,సమయము చాలా తక్కువ ఉంది .
సమయము మించి పోనియ్యకు... ప్రశ్నించు ,
శోధించు..... 
నేను ఎవరు ?????అని...

మనసు నిర్మలంగా వుంటే జీవితం, భవిష్యత్ సాఫీగా సాగుతుందని పెద్దలంటారు.

 చిగురించిన వెదుళ్ళు

🚩🚩

మనసు నిర్మలంగా వుంటే జీవితం, భవిష్యత్  సాఫీగా సాగుతుందని పెద్దలంటారు.

 అంతరంగంలో చెడు ఆలోచనలు

పేరుకోకుండా చూసుకోవాలి. 


ఈ సందేశాన్ని బోధిస్తూ శుక మహర్షి పరీక్షిత్ మహారాజుకు ఒక కధ

చెప్పారు

ఒక ముని  వెదురు  చెట్లతో నిండిన అడవి మార్గం గుండా

వెడుతూవున్నాడు.  ఆ సమయంలో అకస్మాత్తుగా

రెండు వెదురు చెట్లు బలంగా ఒకదానితో ఒకటి రాసుకున్నాయి. ఆ రాపిడికి 

మంటలు లేచాయి. అదే సమయాన తీవ్రమైన గాలి   వీచడంతో  ఆ అడవి మొత్తం

మంటలలో భస్మమైపోయింది. 

పచ్చ పచ్చగా వున్న ఆ ప్రదేశమంతా  మండి

మసి అయిపోయింది. 

ఇది చూసిన ఆ మునీశ్వరుడి హృదయం ద్రవించిపోయింది. 


కొన్ని మాసాలు గడిచిపోయాయి. 

ఆ ముని మళ్ళీ అదే  అడవి మార్గం గుండా వెళ్ళాడు.  మండి బూడిదైపోయిన అయిన  ఆ వనమంతొ

తిరిగి చిగురించి  పచ్చగా దట్టంగా

ఎదిగింది.


ఈ పరిణామం చూసాక ఆ మునికి ఒక   సంగతి అర్ధమైనది.

నేలమీద మట్టికి పైన వున్న చెట్ల భాగాలు మాత్రం  అగ్నిజ్వాలలో భస్మమయ్యాయి.  

భూమికి అడుగున కనపడకుండా వుండే చెట్లవేళ్ళను అగ్ని  జ్వాలలు  ఏమీ చేయలేదు. 

అందువలన వానలు పడగానే చెట్లు మరల

చిగురించాయి. అడవి పునర్జీవం పొందింది. 


మనిషి మనసు అంతే. చెడు ఆలోచనలు మనసు లోతుల్లోకి

వెళితే జీవితం అతలాకుతలం అవుతుంది.


మనసును నిర్మలంగా వుంచుకుంటే

జీవితంలో సుఖ  సంతోషాలు వృధ్ధి చెందుతాయి. మనం నిర్మలమైన

మానసిక శక్తిని వృధ్ధి చేసుకునేందుకు

ప్రయత్నించాలి. చెడును దరి చేరనీయకూడదు. 

Friday, July 22, 2022

😏 బోరు కొడుతోందా…???

 *😏 బోరు కొడుతోందా…???*


📚✍️ మురళీ మోహన్ 


*సద్గురు* :- ‘విసుగుతో చచ్చిపోతున్నాను!’ అని చాలా మంది అంటుంటారు. నన్నడిగితే ఎలా అయినా చావవచ్చునేమో కాని విసుగుతో మాత్రం చావ కూడదు అంటాను. మీ చుట్టూ జీవితం ఇంత బ్రహ్మాండంగా పరుగెడుతూ ఉంటే మీకు విసుగెలా వస్తుంది? ఒక్కసారి కళ్ళు పూర్తిగా తెరిచి ఈ సృష్టి మొత్తం తేరిపారా చూసి, ‘ఇంక చూడడానికి ఏమీలేదు’ అని మీరు అనగలిగితే,అప్పుడు విసుగు చెందడాన్నినేను ఒప్పుకుంటాను. కానీ మీ పరిస్థితి అలా లేదు కదా! కనీసం మీ శరీరంలో ఉన్న ఒక్క కణమైనా ఎలా పనిచేస్తోందో మీకు తెలియదు. అటువంటప్పుడు ‘విసుగొస్తోంది, బోరు కొడుతోంది’ అని ఎలా అంటారు?


ఒక్కసారి కళ్ళు పూర్తిగా తెరిచి ఈ సృష్టి మొత్తం తేరిపారా చూసి, ‘ఇంక చూడడానికి ఏమీలేదు’ అని మీరు అనగలిగితే, అప్పుడు విసుగు చెందడాన్నినేను ఒప్పుకుంటాను.


సూర్యుడు రోజూ ఉదయిస్తాడు, మనకిదేమి విసుగ్గా అనిపించదే! మరి మీకు ఇంకొకటేదో విసుగు అనిపిస్తోందంటే మీరు మీ మనసుకి పూర్తిగా బానిస అయిపోయారు అని, మీ మనసు మిమ్మల్ని పూర్తిగా కబళించి వేస్తోంది అని అర్ధం. ఇలాగే కొనసాగితే మీ మనసు మిమ్మల్ని పూర్తిగా పతనం చేస్తుంది.


నిజానికి విసుగు మీ మనసుకు సంబంధించినది. ఎందుకంటే నిన్నా, మొన్నా జరిగిన సంఘటనల జ్ఞాపకాలు మీ మనులో మాత్రమే ఉంటాయి. ఈ సృష్టిలో ముందు జరిగిన సంఘటనల జ్ఞాపకాలు ఎక్కడా వ్రాసి ఉండవు. జ్ఞాపకాలు కేవలం మీ జ్ఞాపక శక్తికి, మనసుకి సంబంధించినవి. అలాంటపుడు మీకు కావలిసిందే మీరు సృష్టించుకోవచ్చు కదా? ఎలాగు బాహ్య ప్రపంచాన్ని మీ ఇష్ట ప్రకారం మార్చలేరు, సరిదిద్దలేరు. ఉదాహరణకి మీకు మీ ఆఫీసు నచ్చలేదు, సరే ఇంకో ఆఫీసు వెతుక్కుని మారుతారు. అలాగని మీ కుటుంబం మీకు కావలసినట్లు లేకపోతే కుటుంబాన్ని మార్చలేరు కదా? అలా మార్చలేనప్పుడు అది ఒక అంతులేని సమస్యగా మిగిలిపోతుంది. బయటవాటిని అన్నంటిని ఎల్లకాలం మార్చలేము; అందుకే మార్పు అనేది మీలోనే రావాలి. మీలో పరివర్తన వస్తేనే, మీ చుట్టూ ఉన్నవన్నీ మారే అవకాశముంది.


అందుకే మీ మనసుని ఏదోవిధంగా ధ్యానంపై లగ్నం చేస్తే ఈ విసుగనేది ఉండదు. మనసు గత జ్ఞాపకాలపై ఆధారపడి పనిచేస్తోంది కాబట్టే ఈ తిప్పలు. మీ మనసులో నుంచి పుట్టే ఉహలూ, నిన్న మొన్నటి జ్ఞాపకాలూ, వీటితోనే మీ జీవితం నడుస్తుంది. నిన్న జరిగిన జ్ఞాపకాలకు పునర్జీవనమిస్తుంది మనసు. నిన్న జరిగిన సంఘటనలను గుర్తుతెచ్చుకోవడం మళ్ళీ ఆ సంఘటనను జీవించినట్లే కదా? అలా చేసిన పనినే మళ్ళీ మళ్ళీ గుర్తుతెచ్చుకోవడంతొ విసుగు మొదలవుతుంది.


ఎన్నో కోణాలుండే ఈ జీవితంలో విసుగు అనేది రావడానికి ఆస్కారమే లేదు. జీవితం ఎంత బ్రహ్మాండమైనదంటే ఇది మీ తర్కానికి అందదు, మీ మనసులో ఇమడదు.


మీకు ఎప్పుడూ విసుగొస్తోంది అంటే మీరు జీవితాన్ని పూర్తిగా వృధా చేస్తున్నారు అని అర్థం. మీ ఆలోచనలతో మీరు విసుగు చెందవచ్చేమో కాని మీచుట్టూ జరుగుతున్న జీవితం వల్లనైతే కాదు. ఎందుకంటే జీవితం ఎంతో ఉల్లాసభరితమైనది. ఎన్నో పోగులతో నేసిన వస్త్రంలాంటిది. ఎన్నో కోణాలుండే ఈ జీవితంలో విసుగు అనేది రావడానికి ఆస్కారమే లేదు. జీవితం ఎంత బ్రహ్మాండమైనదంటే ఇది మీ తర్కానికి అందదు, మీ మనసులో ఇమడదు. మీ శక్తిసామర్ధ్యాలన్నీ ఉపయోగించినా, శాయశక్తులా ప్రయత్నించినా, ఎన్ని తంటాలు పడినా మీరు జీవిత ప్రక్రియలను గ్రహించలేరు. మీరు వేయి సంవత్సరాలు జీవించినా కూడా వాటిని గ్రహించలేరు. ఎంత కాలం గడిచినా మీరింకా సంభ్రమాశ్చర్యాలకు గురవుతూనే ఉంటారు. ఇంకా జీవితం మొట్టమొదటి పేజీలోనే ఉంటారు. ఇంకా జీవితం యొక్క మూల సిద్ధాంతాలను గురించే ఆలోచిస్తూ ఉంటారు. ఇది ఎలాగంటే ఒక అంతులేని పొరలున్న ఉల్లికి పొరలెన్ని వొలచినా, ఇంకా పొరలు వస్తూనే ఉంటాయి. అదొక అంతులేని ప్రక్రియ. జీవితం కూడా ఒక అంతులేని ప్రక్రియ.


అందుకే ఈసారి మీకు విసుగనిపించినప్పుడు హాయిగా ధ్యానం చేసుకోండి. ఆధ్యాత్మిక మార్గంలో నడవటమంటే మనసు, శరీరం అనే ఈ రెండింటి వలయంలోనే మీ జీవితం గడిపేయకుండా, మీ మనసునీ, శరీరాన్నీఉపయోగించి మీరనుకున్న చోటికి వెళ్ళగలగడం అని అర్ధం. మీ శరీరాన్నీ, మనసునీ కావలసిన విధంగా మలచుకో గలిగితే, అప్పుడిక విసుగు అనే సమస్య ఉత్పన్నం కాదు ! 👍�