*"మంచిమాటలు"*
*జీవితంలో ఎదగాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. ఉన్న స్థానం నుంచి ఉన్నత స్థానానికి చేరుకోవాలన్న తపన చాలామందిలో ఉంటుంది. కానీ ఇదెలా సాధ్యమవుతుంది? అనుకున్నదే తడవుగా మనం ఉన్నత స్థానానికి చేరుకోగలమా? ప్రకృతిలో ప్రతి దానికి ఎదిగేందుకు నిర్దిష్ట కాల వ్యవధి ఉంటుంది. మన పెరటిలో మనం కొన్ని విత్తనాలు చల్లాం, మర్నాడు వెళ్ళి చూస్తే మొక్కలు వచ్చేస్తాయా? పుష్పాలు కన్పిస్తాయా?*
*అన్యులతో కాకుండా మనతో మనల్ని పోల్చుకుంటూ నిన్నటికంటే నేడు మెరుగ్గా.....నేటికంటే రేపు మెరుగ్గా ఎదిగేందుకు సాధన చెయ్యాలి.*
*పదివేల మైళ్ళ ప్రయాణమైనా ఒక అడుగుతోనే ప్రారంభం అవుతుంది. లక్ష్యమేదైనా, ఆరంభించి, రోజుకు కనీసం ఒక్క శాతం మెరుగుదల అయినా సాధించే దిశలో నిరంతర సాధన సాగించాలి.*
*ఎన్ని మెట్లు ఎక్కావని కాదు, ఎంత ఎత్తు ఎదిగావని, ఎన్ని మునకలు వేశామని కాదు, ఎంత లోతులు చూశావని.*
*కడుపులోకి వెళ్ళిన విషం ఆ ఒక్క మనిషిని మాత్రమే ఇబ్బంది పెడుతుంది, కానీ చెవిలోకి వెళ్ళిన విషయం ఒక కుటుంబాన్నంతా అతలా కుతలం చేస్తుంది.*
No comments:
Post a Comment