*_నిజంగా నాకు నచ్చినట్లు, నేను మెచ్చినట్లు నేను అంతలా ప్రేమిస్తే... నా జీవిత పర్యంతరం వరకు వారిని వదిలిపెట్టను._*
*_ఒక్కసారి నాకు అసహ్యం వేసేలా... వారి ప్రవర్తన ఉందని నేను భావిస్తే, వారి నుండి నేను దూరంగా ఉండే ప్రయత్నం చేస్తాను._*
*_నేను పెద్దపెద్ద చదువులు చదవలేదు అనుకుంటా కానీ... అవసరాన్ని బట్టి నాటకాలు వేసే మనుషులను అర్థం చేసుకోవడంలో... PH.D. Complete చేశా.!!_*
*_కాలం నేర్పిన పాఠాల కంటే, నమ్మిన నా వారు నేర్పిన గుణపాఠాలే ఎక్కువ నా జీవితంలో..._*
*_అందుకే "నిజం" నా వైపు ఉన్నప్పుడు మౌనం వహించడమే మంచిది అని భావించా. "అబద్ధానికి" మాత్రమే... కొనసాగింపులు, వివరణలు ఉంటాయి కానీ... నిజాన్ని ఒప్పుకున్నప్పుడే దానికి ముగింపు ఉంటుంది.!!_*
*_ఆస్తులు, అంతస్తులు ఎవరైనా... ఎలాగైనా... సంపాదిస్తారు కానీ, సమాజంలో "నమ్మకం" సంపాదించాలి అంటే..."క్యారెక్టర్ "ఉండాలి. క్యారెక్టర్ లేకుంటే నాదృష్టిలో అన్ని కోల్పోయినట్టే..._*
*_గుర్తించలేని గుడ్డితనం ముందు..."నిజాన్ని" నిరూపించుకోవాల్సిన అవసరం లేదు._*
*_అందుకే... నేను తినే మెతుకుమీద దెబ్బకొట్టిన వారినైనా క్షమిస్తాను కానీ... నా బ్రతుకు మీద దెబ్బకొట్టిన వారిని మాత్రం జీవితంలో అస్సలు క్షమించను._*
*_నా జీవితం నా ఇష్టం. నా బ్రతుకు నాది. నేను ఎలా ఉండాలో నా జీవితాన్ని ముందే డిజైన్ చేసుకున్నా... ప్రయత్నం నాది ఫలితం ఆ దైవానిది మధ్యలో వారెవరు.☝️_*
*_- సదా మీ శ్రేయోభిలాషి...👏_*
🌹🌹🌹 🪷🙇🪷 🌹🌹🌹
No comments:
Post a Comment