Tuesday, June 2, 2020

భగవద్గీత Bhagavad Gita.

భగవద్గీత
Bhagavad Gita.

1. ఆత్మ నిత్య సత్యమైనది మరియు చావు లేనిది. మృత్యువు వారిని శరీరాల నుండి వేరు చేస్తుందే కానీ ఆత్మను చంపదు.
(అది ఎలానో తెలిపేదే ఈ భగవద్గీత)

2. సత్యమైన జ్ఞానము ఆత్మ జ్ఞానమే అంటే తనను తాను తెలుసుకోవడమే, తనలోని అంతరాత్మను గురించి తెలుసుకోవడమే.
(ఎలా తెలుసుకోవాలో తెలిపేదే ఈ భగవద్గీత)

3. ఒక యోగి అభ్యాస వైరాగ్యముల ద్వారా, వస్తు ప్రపంచాన్ని వదలి సర్వోత్కృష్టమైన పరబ్రహ్మాన్ని చేరగలడు.
(ఏవిధంగా చేరవచ్చునో చెప్పేదే ఈ భగవద్గీత)

4. భక్తి, కర్మ, ధ్యాన మరియు జ్ఞాన మార్గాలలో భగవంతుని చేరవచ్చును.
(ఆ జ్ఞానం భోదించేదే ఈ భగవద్గీత)

5. మనిషి కర్మ చేయకుండా ఉండడం సాధ్యం కాదు. అయితే కర్మలవలన దోషాలు కూడా తప్పవు.
(ఆ కర్మలను దోషాలు తప్పించేదే ఈ భగవద్గీత)

6. సత్పురుషుల ద్వారా జ్ఞానాన్ని సంపాదించి, సత్కర్మలు ఆచరించాలి. కర్మలపై ప్రతిఫలాన్ని ఆశించరాదు. అన్ని కర్మల ఫలాన్ని భగవంతునకు ధారపోయాలి.
(కర్మ ఫలం ఎలా ధారపోయల్లో తెలిపేదే ఈ భగవద్గీత.)

7. కృష్ణుడే పరబ్రహ్మము. సృష్టిలోని సకలము భగవంతుని అంశతోనే ఉన్నవి. అన్ని పూజల, యజ్ఞాల ఫలాలు ఆ దేవదేవునకే చెందుతాయి. బ్రహ్మ తత్వాన్ని తెలుసుకోవడానికి శ్రీకృష్ణుడు అర్జునునకు తాత్కాలికముగా దివ్య దృష్టిని ప్రసాదించాడు.
(ఆ దివ్య దృష్టే ఈ భగవద్గీత)

8. అనంతము, తేజోమయము, సర్వవ్యాప్తము, కాల స్వరూపము అయిన ఆ శ్రీకృష్ణుని విశ్వ రూపాన్ని చూసి తరించండి.
(విశ్వ రూపాన్ని తరించడానికి మార్గమే ఈ భగవద్గీత)

9. ప్రకృతిలో సకల జీవాలు సత్వ,రజ,తమోగుణాలచే నిండి ఉన్నాయి. భగవంతునకు శరణాగతుడైనవాడికి ఈ గుణాల బంధం నుండి విముక్తి లభిస్తుంది.
(ఆ విముక్తి ఎలానో తెలిపేది ఈ భగవద్గీత)

ఆత్మ తత్వము,
జీవన కర్తవ్యము,
యోగ సాధన,
కర్మ,
జ్ఞానము,
భక్తి,
భగవత్తత్వము,
శ్రద్ధ,
గుణము..ఇలా ఎన్నెన్నో...
ఎన్నని చెప్పను..!!
అవి అన్ని మనకు తెలియచేసే...
దైవ గ్రంథం
పరిశుధ గ్రంథం
పవిత్ర గ్రంథం
ఈ భగవద్గీత.

No comments:

Post a Comment