Monday, June 15, 2020

భగవద్గీతలో ఈ ఐదు శ్లోకాలు ఎప్పుడు గుర్తు చేసు కుంటే చాలు

🧘‍♀️🧘‍♂️🧘‍♀️🧘‍♂️🧘‍♀️🧘‍♂️🧘‍♀️🧘‍♂️


🧘‍♀️ భగవద్గీత !🧘‍♂️

✿భగవద్గీతలో
ఈ ఐదు శ్లోకాలు ఎప్పుడు గుర్తు చేసు కుంటే చాలు✿

మనం ఎక్కడి నుంచి వచ్చాం,

ఎక్కడికి వెళు తున్నాం,

ఏం చేస్తున్నాం,

ఏం ప్రతిఫలం అందు కుంటున్నాం?

అందుకు ప్రతిగా ఏం చేయాలి?

కన్ ఫ్యూజన్ లేకుండా భగవద్గీతను మూడు ముక్కల్లో చెప్పా లంటే-

ఇంత కంటే పెద్ద సెంటెన్సులు లేవు.

కొందరు అను కున్నట్టుగా,

భగవద్గీత ఎట్టి పరిస్థితుల్లో మతగ్రంథం కానే కాదు.

కురుక్షేత్ర సంగ్రామంలో అందరినీ చంపడం అధర్మం అనే చింత.

అందరూ చచ్చి పోతారనే బాధ.

ఈ రెండింటి గురించి మథన పడే అర్జునుడికి- శ్రీకృష్ణుడు విడ మరిచి చెప్పిన సారాంశమే భగవద్గీత

బేసిగ్గా ఒక సినిమా పాట -మూడు నెలలకు పాతదై పోతుంది.

ఒక కథ-ఆర్నెల్లకు పాచి పోతుంది.

ఒక నవల -ఏడాది తర్వాత కను మరుగై పోతుంది.

కానీ వేల ఏళ్లుగా ప్రపంచ వ్యాప్తంగా నిత్య చైతన్య ప్రవాహమై,

దారి మరిచిన బాట సారికి కరదీపికై,

సమస్త భూ మండలాన్ని దివ్యశక్తితో ముందుకు నడిపిస్తున్న ఏకైక గ్రంథం - ఇగిరిపోని గంధం - భగవద్గీత.

ఇదేదో మతోద్బోధ అనుకునే వాళ్ల మైండ్ సెట్ మార్చలేం.

ఆధ్యాత్మిక ప్రవచనమైనా,

వ్యాపార సూక్తులైనా,

మేనేజ్మెంట్ కోర్సులైనా,

వ్యక్తిత్వ వికాస శిక్షణా తరగతులైనా,

ఆటలో గెలవాలన్నా, పరీక్షలో పాస్ కావాలన్నా,

జీవితంలో ఏదో ఒకటి సాధించాలన్నా,

ఎక్కడో చోట ఏదో సందర్భంలో గీతను కోట్ చేస్తాం.

గీత గురించి చర్చిస్తాం.

ఆది శంకరాచార్య దగ్గర్నుంచి స్వామీ వివేకానంద,

మాక్స్ ముల్లర్ దాకా భగవద్గీత గొప్ప దనాన్ని వే నోళ్లా చాటిన వారే.

వందల శ్లోకాలు ఔ పోసన పట్టాల్సిన పనిలేదు.

బట్టీ పట్టి కంఠ శోష తెచ్చు కోమనడం లేదు.

ఒక నాలుగైదు శ్లోకాలు చాలు.

ప్రతి వ్యాపారి ,
ఉద్యోగి అనుస రించ వలసిన #విద్యుక్త్ధర్మాలు

భగవద్గీత లోని 5 simple management skills

✿భగవద్గీతలో
ఈ ఐదు శ్లోకాలు డీకోడ్ చేసు కుంటే చాలు✿

.#1.

కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన |
మా కర్మ ఫలహేతుర్భూ: మాతే సంగోఅస్త్వకర్మణి ||

అంటే,
నువ్వు కర్మలు చేయడానికి మాత్రమే.

ఆ కర్మ ఫలాలకు అధికారివి కాదు.

ప్రతిఫలాపేక్షతో ఎట్టిపరిస్థితుల్లో కర్మలు చేయకు.

అలాగని చేయడం మానకు అని అర్ధం.

ప్రతీ ఆంట్రప్రెన్యూర్ కు ఈ శ్లోకం వర్తిస్తుంది.

చేయాల్సిన పని గురించి
రెండే రెండు ముక్కల్లో నిక్షిప్తమైన సార్వ జనీన సత్యం ఇది.

ప్రతీ వ్యాపారి లేదా ఉద్యోగి ఇదే సూత్రం మీద పనిచేయాలి.

ప్రతి ఫలం గురించి ఆశించ కుండా చేసు కుంటూ పోవడమే.

ప్రాసెస్ ఎంజాయ్ చేసు కుంటూ తీరం చేరుకోవాలే తప్ప..

ఎంతసేపూ ఫైనల్ ఔట్ పుట్ మీదనే ఏకాగ్రత చేయొద్దు.

అలా అని పూర్తిగా ఆశావాదం లేకుండా పని చేయమని కాదు.

ఆశ పడటం తప్పు కూడా కాదు.

కానీ ఎలాంటి చర్యా లేకుండా- గాల్లో దీపం పెట్టే దేవుడా నీవే దిక్కు అంటే మాత్రం కష్టం.

చేయాల్సింది చేయాలి.

ఫలితం సంగతి తర్వాత.

ముందు ధైర్యంగా అడుగేయాలి.


#2.

వాసాంసి జీర్ణాని యథా విహాయ
నవాని గృహ్ణాతి నరోపరాణి |
తథా శరీరాణి విహాయ జీర్ణాని
అన్యాని సంయాతి నవాని దేహీ ||

అంటే,"చిరిగి పోయిన బట్టలను పడేసి,

మనం కొత్తబట్టలు ఎలా కట్టు కుంటామో, జీర్ణమైన శరీరాన్ని వదిలిన
ఆత్మ కూడా- మరో కొత్త దేహం లోకి ప్రవేశిస్తుంది" అని అర్ధం.

ఆంట్రప్రెన్యూర్లు కూడా అంతే.

వెర్సటాలిటీ చూపించాలి.

దేన్నయినా స్వీకరించేలా ఉండాలి.

అవే సక్సెస్ రుచి చూపిస్తాయి.

ముఖ్యంగా మార్పును ఎప్పటి,కప్పుడూ గమనించాలి.

కొత్త ట్రెండ్ ఫాలో అవ్వాలి.

నా ఇష్టం - నాకు ఇదే ఇష్టం అంటే- వాళ్లు అక్కడే ఉండి పోతారు.

అలా కాకుండా కొత్త దాని కోసం అన్వేషించాలి.

కొత్త దనాన్ని చది వేయాలి.

కొత్త అవకాశాల కోసం ఎదురు చూడాలి.

అదే నిజమైన ఆంట్రప్రెన్యూర్ లక్షణం.

బిజినెస్ అంటేనే నిరంతర ప్రయాణం.

వ్యాపారి నిరంతర పథికుడు.

నాలుగు గోడల మధ్యనే ఉంటే ప్రపంచం ఏ నాటికీ అర్ధం కాదు.

మొండిగా ఉండొద్దు.

ఆవిష్కరణల దిశగా అడుగులు వేయాలి.

సంకుచిత భావాలు వదిలేయాలి.

స్పాంజి నీళ్లను పీల్చు కున్నట్టు అనుభవాల్ని పాఠాలుగా మలుచు కోవాలి.

అప్పుడే గమనం వేగం అందు కుంటుంది.

#3.

క్రోధాద్భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమ
స్మృతిభ్రంశాద్బుద్ధినాశో బుద్దినాశాత్‌ప్రణశ్యతి||

అంటే,
కోపం వల్ల అవివేకం,
అవివేకం వల్ల మతిమరుపు, మరుపుతో బుద్ధినాశనం, బుద్ధినాశనంతో మనిషే నాశనం.

ఇదొక యాంగర్ మేనేజ్‌మెంట్ లాంటిది.

అంట్ర ప్రెన్యూర్లకు మస్టుగా ఉండాల్సిన లక్షణం.

లేకుంటే చెప్పుడు మాటలు విని, వాస్తవాలతో పని లేకుండా ఆలోచించి బుర్రపాడు చేసు కుంటారు.

మైండ్ లో ఒక రకమైన కన్ ఫ్యూజన్ క్రియేట్ అవు తుంది.

దాంతో సహజం గానే మతి,మరుపు వస్తుంది.

ఆటోమేటిగ్గా లక్ష్యం నుంచి తప్పు కుంటాం.

అందరి ముందు నవ్వుల పాలవుతాం.

అందుకే కోపాన్ని జయించాలి.

టెంపర్ ని అదుపులో ఉంచు కోవాలి.

ఎట్టి పరిస్థితుల్లో సహనం కోల్పోవద్దు.
#4.

తస్మాదసక్త స్సతతం కార్యం కర్మ సమాచార |
ఆసక్తో హ్యాచరన్ కర్మ పర మాప్నోతి పూరుష: ||

కాబట్టి,
చేసే పని,
దాని ఫలితము మీద అదే పనిగా ఆసక్తి ఉండొద్దు.

కర్మ ప్రకారం చేసు కుంటూ పోవా లంతే అంటాడు శ్రీకృష్ణ భ‌గ‌వానుడు
వ్యాపారమూ అంతే.

ఓ పెన్ మైండెడ్ గా ఉండాలి.

అవసరమైతే జత కలవాలి.

బలం పెంచు కోవాలి.

అత్యాశకు పోవద్దు.

వీలైనంత క్రియేటవివ్ గా ఉండాలి.

ఇన్నవేటివ్ గా ఆలోచించాలి.

మార్కెట్ మార్పులను ఎప్పటి కప్పుడు నిశితంగా గమనించాలి.

అంతేగానీ బైనాక్యులర్ పట్టుకుని ఎలుకను వేటాడినట్టుగా ఉండొద్దు.

#5.
ధూమేనావ్రియతే వహ్నిర్యథాదర్శో మలేన చ|
యథోల్యేనావఈతో గర్భస్తథా తేనేదమావృతమూ ||

అంటే- పొగ చేత నిప్పు,

ధూళి చేత అద్దం,

మావి చేత గర్భస్త పిండం కప్ప బడినట్లే,

కోరికల చేత జ్ఞానం కూడా కప్ప బడినట్లే,

కోరికల చేత జ్ఞానం కూడా కప్పబడి వుంటుంది అని అర్ధం.

ఆంట్రప్రెన్యూర్లు వెతుక్కో వాలే గానీ ఇందులో బోలె డంత నిగూఢార్ధం దాగి వుంది.

కప్పేసే ప్రతీదీ మనల్ని మిస్ లీడ్ చేస్తుంది.

ఫర్ ఎగ్జాంపుల్.. ఒకచోట మంట అంటు కుంది అను కుందాం. వెంటనే పొగ దాన్ని కప్పేస్తుంది.

ఎదురుగా వుండే అద్దం మీద ధూళి- నిప్పును,
పొగను రెండింటినీ దాచేస్తుంది.

అంతు లేని కోరికలు నాలెడ్జ్ ని కిల్ చేస్తాయి.

అంతే కదా మరి.

ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గాలి.

ఎక్కడ నెగ్గాలో అక్కడ నెగ్గాలి అన్న విచక్షణా జ్ఞాన‌మే ఉద్యోగ మైనా లేదా వ్యాపార మైనా...

మాష్టర్స్ & ఫ్రెండ్స్

మీ...

వెంకట రమణ ( మాష్టర్ )

🦚🐉🐲🦃🦜🐍🦎🐛

ప్రకృతి ని పరి రక్షిధ్ధాం

పర్యావరణమును కాపాడు కుందాం

ధ్యానం శరణం గఛ్ఛామి

🌴🌾🌲🌱🌳🌵🎋🎄

వృక్షో రక్షతి రక్షితః

🐏🐄🐬🐟🐪🐓🐐🕊️

శాకాహారమే -- అమృతాహారం

అహింసా పరమో ధర్మః

జీవా సమస్తా స్సుఖినో భవంత్

శాకాహారం శరణం గఛ్ఛామి

🧚‍♀️🧚‍♂️🧚‍♀️🧚‍♂️🧚‍♀️🧚‍♂️🧚‍♀️🧚‍♂️

ఆనందో బ్రహ్మ ధ్యానం గ్రూప్స్

శాకాహారం,ధ్యానం,జ్ఞానం

ఆధ్యాత్మిక విజ్ఞాన వాట్సాప్ గ్రూప్స్ లో
జాయిన్ కావాలను కుంటున్నారా

అయితే

ఈ క్రింద నెంబర్ కు
9032555166
మీ పేరు
మీ వూరు
మీ జిల్లా తెలియ జేయగలరు
హైదరాబాద్

🧘‍♀️🧘‍♂️🧘‍♀️🧘‍♂️🧘‍♀️🧘‍♂️🧘‍♀️🧘‍♂️

No comments:

Post a Comment