Tuesday, June 2, 2020

దేవుడా ఓ మంచి దేవుడా, అర్థం అవుతుందా?

దేవుడా ఓ మంచి దేవుడా
అర్థం అవుతుందా

దేవుడు ఎందుకింత లోభి
అయన చేసిన మనుషులకు
మంచితనాన్ని మానవత్వాన్ని
చాలా తక్కువగా ఇస్తాడు

దేవుడుఎందుకింత పక్షపాతి
న్యాయానికి నిజాయితీకి
అవమానాన్ని మిగిల్చి
అన్యాయాన్ని అవినీతిని
అందల మెక్కించేస్తాడు

దేవుడు ఎందుకింత గుడ్డివాడు
పరీక్షలు మంచివారికి పెట్టి
పరీక్షలకు హాజరుకానివారికి
బహుమతులను అందిస్తాడు

దేవుడు ఎందుకింత కఠినాత్ముడు

తప్పు చేసినవారికి స్వేచ్ఛను ఇచ్చి

తప్పు చేయని వారికి శిక్షను వేస్తాడు

నిజాయితీ అనే పొగరు ఉంటె నిందించి

తలపొగరు ఉన్నవారికి కిరీటాన్ని పెడుతున్నాడు

దేవుడు ఎందుకింత పిరికివాడు

పూజించేవారికి వరాలు ఇవ్వకుండా

శపించే వారికి వరాలను అందిస్తాడు

నిందించే వారికి నిత్యం తోడుపోతాడు

దేవుడు ఎందుకింత మోసగాడు
నమ్మిన వారిని మోసం చేస్తాడు

మనసుతో పూజించేవారికి వ్యధను మిగిల్చి

మనీతో పూజించేవారికి మంచిని చేస్తాడు

దేవుడు ఎందుకింత స్వార్థపరుడు

అన్నదానం చేసేవారికి
ఆకలిని మిగిల్చి

ఆకలికి విలువ ఇవ్వని వారికి
ఆస్తులను పెంచిపెడుతున్నాడు

దేవుడా ఎందుకిలా మారిపోయావు

కలియుగంలో మనుషులు మారిపోతారని

పూర్వీకులు రాసిపెట్టారుగాని
పాపం

దేవుడు కూడా మారిపోతాడని వారికి తెలియలేదు

దేవుడా ఓ మంచి దేవుడా
నీకు అర్థం అవుతుందా


🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

No comments:

Post a Comment