Friday, March 12, 2021

జాగరణ ఉద్దేశం ఏంటో మీకు తెలుసా?

జాగరణ ఉద్దేశం ఏంటో మీకు తెలుసా?

"శివరాత్రి"లో రెండు ముఖ్యమైన అంశాలున్నాయి.
ఒకటి: "ఉపవాసం"
రెండు: "జాగరణ"
"ఉపవాసం" అంటే .. "మానసిక పరమైన లంఖణం"
"ఉపవాసం" అంటే .. "ధ్యానంలో మనస్సును శూన్యపరచుకోవడం"
"ఉపవాసం" అంటే కడుపుకు ఏమీ పెట్టకపోవడం కాదు
"జాగరణ" అంటే .. "దివ్యచక్షువు యొక్క జాగరణ"
"జాగరణ" అంటే .. "ఆత్మ యొక్క జాగరణ"
"జాగరణ" అంటే .. రాత్రంతా మేల్కొని "శివుడి సినిమాలు" చూడడం కాదు
ప్రొద్దుటినుంచీ "ఉపవాసం" ఉంటేనే .. రాత్రి "జాగరణ" అయ్యేది
ప్రొద్దుటి నుంచీ ధ్యానాభ్యాసంలో అంటే .. శ్వాసానుసంధానంలో ఉంటేనే
రాత్రికి దివ్యచక్షువు యొక్క ఉద్దీపనం అయ్యేది
"ఉపవాసం" లేకుండా "జాగరణ" అన్నది అసంభవం
"ఉపవాసం" యొక్క ధ్యేయమే .. "జాగరణ"
"జాగరణ"కు కావలసింది ముందుగా "ఉపవాసం"
ఇదీ అసలు కథ.
కడుపులో ఏమీ పెట్టకపోవడం వల్ల మనోనాశనం కాజాలదు
రాత్రి అంతా శివుడి యొక్క సినిమాలు చూడ్డం ఆత్మోద్దీపనం కాజాలదు
ఒక్క పగలైనా నిజమైన "ఉపవాసం"లో ఉండి
ఒక్క రాత్రంతా అయినా "నిజమైన జాగరణ"లో ఉంటే
ఆ ఒక్క రోజు చాలు..
ఆ రోజు "మహాశివరాత్రి" అవుతుంది
.. "జన్మకో శివరాత్రి" అంటారు..
ఒక్క రాత్రి "నిజమైన శివరాత్రి" అయితే .. ఇక జన్మంతా "నిజమైన జాగరణే"
ఒక్క పగలు "నిజమైన ఉపవాసం"లో ఉండగలిగితే ఇక జన్మంతా "నిజమైన ఉపవాసమే
సదా మీ సేవలు మీ విశ్వ..🙏

Source - Whatsapp Message

No comments:

Post a Comment