*ఈరోజు పురాణ కథ బ్రహ్మదత్తుడు గురించి:*
ఇతడు అనఘుడను రాజు కుమారుడు. ఇతడికి పశుపక్ష్యాదుల భాషలన్నియు
తెలుసును. ఒక రోజితడు తన భార్యతో అరణ్యమునకేగి ఓ జంట పక్షులు మాట్లాడుకొనుట విని నవ్వెను. భార్యతనను చూసి హేళనగా భావించి ఇతనితో
మాట్లాడుట మానివేసెను. ఇతడేడు రాత్రులు విష్ణుమూర్తిని ప్రార్ధించగా కలలోకి విష్ణుమూర్తి వచ్చి మరునాడు బ్రాహ్మణులను కలుసుకొమ్మని చెప్పెను. మరునాడు సభలోనికి ఓ బ్రాహ్మణుడు వచ్చి ఓ శ్లోకము చదివెను. దాని అర్ధము
"మొదట బ్రాహ్మణ పుత్రులైరి, తర్వాత గుప్తవ్యాధులై ఆ తర్వాత చక్రవాకములైన వారు ఇప్పుడు ఏమయిరో"
అను అర్థమురాగా రాజుకు పూర్వజన్మ గుర్తుకు వచ్చెను.
పూర్వజన్మమున ఇతడిపేరు పితృవర్తి. కౌశికుడను బ్రాహ్మణుని ఏడుగురు కుమారుల్లో ఒకడు. వీరు గర్గుని శిష్యులు. ఆహారలేమి వల్ల గురువు మేపుకు రమ్మన్న గోవునే వధించి భుజించి గురువుతో ఓ సింహము తినివేసినదని అబద్ధము చెప్పిరి. అందువల్ల ఇతడు రెండు జన్మలు దాటి మూడవ జన్మమున బ్రహ్మదత్తుడను రాజయ్యెను. మరి ఇద్దరు ఇతడి మంత్రులైరి. తక్కిన నల్గురును రాజసభకు వచ్చి శ్లోకము చెప్పినవానికి పుత్రులుగా జన్మించి
తపస్సున కేగిరి. విష్ణు నామ స్మరణ సర్వదా శుభదాయకం. విష్ణు పూజ పూర్వజన్మ పాపాలన్నీ కూడా హరించివేస్తుంది.
- మత్స్వవురాణం.
No comments:
Post a Comment