*ఆలోచన అనేది మనది. మరి మన ఆలోచన మనల్నే ఎందుకు తప్పుదోవ పుట్టిస్తుంది?*
*ఆలోచన స్వయంగా ఏమీ చెయ్యదు. మనసు చెప్పినట్టు చేస్తుంది.*
*మనసూ మనదేగా...అది దురాలోచన ఎందుకు చేస్తుంది?*
*మనసుది ఏమీ లేదు పాపం. బుద్ధి చెప్పినట్టు వింటుంది. బుద్ధి ఎలా అంటే అలా.*
*ఇది మరీ బాగుంది. బుద్ధి నాదేగా, నేనేగా. నాగురించి నేను ఎందుకు వ్యతిరేకంగా చెబుతాను?*
*ఓరి నాయనోయ్!! ఏవిఁటో అంతా అయోమయంగా ఉంది. ఎలా స్వామీ? అంతా నాదే. నాలోని భాగాలే. ఒకరికొకరు ఏమీ తెలీనట్టు కూడబలుక్కుని చేస్తున్నారా? అన్నీ కలిసి నన్నే ముంచేస్తున్నాయా?*
*దిగులు పడకండి నాయనా!!! భగవంతుని సూచిక ఇలాగే ఉంటుంది. తెలుసుకో లేకపోవడం నీ అజ్ఞానం. నువ్వు ఒంటరివి. నీలోని ఆ భాగాలే ఈ బంధువులు. నీ చుట్టూ ఉన్నట్టే ఉంటారు. నీ వారు అనే భ్రమలో ఉంటావు. ఎవరూ నిన్ను ఏకాకిని చేసి మోసం చెయ్యరు. అందరూ నా వాళ్ళే అని నమ్మి నిన్ను నువ్వే మోసం చేసుకుంటున్నావు.*
*నీవి అనుకునే నీ ఆలోచన, మనసు, బుద్ధి లాగే, నీ బంధువులు. నీకు కష్టం, నష్టం వాటిల్లితే, ఫలితం కూడా అంతే. ఏ ఒక్కరూ బాధ్యత తీసుకోరు.*🙆♂️
No comments:
Post a Comment