Wednesday, March 5, 2025

 * *శివ కీర్తన...!!*

చాలదా ఈ జన్మ చాలదా...శివ కీర్తన చేయ ఈ జన్మ చాలదా...!!

కైలాసవాసుని గళమెత్తి కీర్తింప ఈ జన్మ చాలదా..
ఈ జన్మ చాలదా..ఈ జన్మ చాలదా....ఈ జన్మ చాలదా..

చాలదా ఈ జన్మ చాలదా...శివ కీర్తన చేయ ఈ జన్మ చాలదా...

విభూతి ధారణతో  గరలమున కపాలముతో
కంఠాన నాగులతో
అస్తికల మాలలతో ఆకాశమంత ఎత్తు వ్యాపించినా శివ

అన్ని లోకాలను పాలించు పరమేశ 

నా మది లో నీవయ్య శ్రీశైల మల్లేశ

చాలదా...ఈ జన్మ...చాలదా..

చాలదా ఈ జన్మ చాలదా...శివ కీర్తన చేయ ఈ జన్మ చాలదా...


వేదముతో కానీ ..యాగము తో గానీ

అర్చన తో కాని ..జపతపముతో కానీ

నిను గాంచలేరయ్య శ్రీశైల మల్లయ్య.

విశ్వమంతా విస్తరించిన  విశ్వేశా..

భక్తి భావము చేత పిలిచినా చాలయ్య..

చాలదా ఈ జన్మ చాలదా...శివ కీర్తన చేయ ఈ జన్మ చాలదా...   

No comments:

Post a Comment