*# నమ్మితే... వదలడు!...*
🍁జీవితం మనకు ఎన్నో నేర్పుతుంది... అవి తెలుసుకోవాలి. దైవం మనకు ఎన్నో అనుగ్రహిస్తాడు... అవి అందుకోవాలి. ప్రకృతి ఎన్నో విశదీకరిస్తుంది... అవి నేర్చుకోవాలి. 'సృష్టి ధర్మం' నుంచి మనిషి దృష్టి మారనంత వరకు అంతా సవ్యంగానే జరుగుతుంది.. కానీ అలా ఉండలేం.
🍁మాయకు లొంగని జీవుడు ఉండడు. భ్రాంతికి గురికాని ప్రాణి ఉండదు. జీవులు కర్మ బద్ధులు. ఎంతటి వారైనా కర్మఫలాన్ని అనుభవించక తప్పదు. అయితే భగవదాశ్రయంలో ఉన్నవారిని కర్మలు • అపసవ్య మార్గంలోకి తీసుకెళ్తున్నా... బుద్ధి కర్మానుసారం పయనిస్తున్నా... భగవంతుడు భక్తుడి చేయి పట్టుకుని తన వైపు లాక్కుంటాడు.
🍁'అనన్యాశ్చిన్తయంతో మాం యే జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహమ్..' అని భగవద్గీత ద్వారా భగవంతుడు చెప్పింది అదే. పూర్వం ఒక ఊళ్లో ఆధ్యాత్మిక జీవనం గడుపుతున్న వృద్ధ దంపతులు ఉండేవారు. జీవన భారమంతా భగవంతుడి పై మోపి వారు నిరంతరం భగవన్నామస్మరణలో గడుపుతూ ఉండేవారు.
🍁శారీరక శ్రమ చేయలేని అశక్తులు కావడంతో నారాయణుడే తమను ఆదుకుంటాడనే విశ్వాసంతో రోజులు గడిపేవారు. మనసా వాచా కర్మణా తనను నమ్మినవారిని భగవంతుడు ఎన్నడూ వదలడుగా!
🍁వారికీ అదే జరిగింది. ఆ గ్రామస్థులు నిత్యం వారికి కావాల్సిన ఆహార పదార్థాలను అరుగుమీద పెట్టి వెళ్లేవారు. అంతా నారాయణుడి దయ అనుకుంటూ వారు వాటిని తిని భగవధ్యానంలో ఉండేవారు.
🍁ఉదయాన్నే లేచి దేవాలయానికి వెళ్లి అర్చన చేసేవారు. అలా కొన్ని రోజులు గడవగా ఒక రోయి వారి అరుగుమీద ఎవరూ ఆహారపదార్థాలు ఉంచలేదు.
🍁గీతలోని పై శ్లోకాన్ని తలచుకుంటూ 'పరమాత్ము మాట తప్పాడు' అనుకున్నాడా వృద్ధుడు. బొగ్గు ముక్కతో ఆ మాటే అరుగు మీద రాసి ఆచమనం చేసి ఖాళీ కడుపుతో నిద్రపోయారు. పొద్దున్నే లేచి తయారై దేవాలయానికి వెళ్లి అర్చన ఆరంభిస్తూ స్వామి వంక చూడగా... ఆయన ముఖంపై నల్లని గీతలు కనిపించాయి. అవి తన రాతలాగే ఉండటం చూసి తన తప్పును గ్రహించి స్వామి పాదాలపై పడి మన్నించమని ప్రార్ధించాడా వృద్ధుడు. అపరాధ భావంతోనే అర్చన పూర్తిచేసి బాధతో ఇంటికి చేరిన ఆయనకు ఇంటి అరుగుపై అనేక ఆహార పదార్థా కనిపించాయి.
🍁నమ్మినవారిని పరమాత్ముడు ఎన్నడూ వదలడని, నిరంతరం వారి రక్షణ బాధ్యత వహిస్తాడని, ఏ యుగంలోనైనా తన మాటకు కట్టుబడి ఉంటాడని చెప్పే కథ ఇది. వాస్తవంగా జరిగిందని కంచి కథల్లో చెబుతారు. జీవుడు పరమాత్ముడి చింతనలో గడపడానికే ఈ దివ్య గుణలీలలు... పురాణ గాథలు. దైవస్మరణలో స్థిరత్వం దొరికితే... బాధలే బోధలుగా మారిపోతాయి.🙏
శ్రీ రామ జయ రామ జయజయ రామ
🌹🌹🌹🌹
No comments:
Post a Comment