Saturday, May 24, 2025

మోసం చేసే వాళ్ల 10 లక్షణాలు గుర్తుపెట్టుకో #motivation #selfhelp #lifestyle

మోసం చేసే వాళ్ల 10 లక్షణాలు గుర్తుపెట్టుకో #motivation #selfhelp #lifestyle



హలో ఫ్రెండ్స్ నిన్ను ఎవరు మోసం చేయకూడదు అనుకుంటే నీ కళ్ళు చెవులు మైండ్ ఎప్పుడూ తెరిచి ఉంచు అవతలి వాళ్ళను నమ్ము కానీ వాళ్ళు నిన్ను స్వార్ధంతో వాడుకునేంత నమ్మొద్దు నీకు సంబంధించిన ముఖ్య కార్యాలను నియంత్రించే హక్కు నీ వద్దనే పెట్టుకో నీ జీవితాన్ని అవతల వాళ్ళ చేతుల్లో పెట్టొద్దు అలాగే అప్పుడప్పుడు నిన్ను నువ్వు కూడా గమనించుకుంటూ ఉండు నిన్ను ఎలా అయితే అవతలి వాళ్ళు మోసం చేయకూడదు అనుకుంటున్నావో అలా నువ్వు ఎవరినైనా మోసం చేస్తున్నావేమో గమనించుకో అయినా సరే నిన్ను ఎవరైనా మోసం చేస్తే బాధపడకు ఎందుకంటే ప్రతి మోసం మనిషికి ఏదో ఒక పాఠం నేర్పిస్తుంది అంతేకాకుండా మోసపోయిన తర్వాత మనిషి ముందు కంటే ఎక్కువ చలాకీగా తెలివిగా తయారవుతాడు ఒకసారి మోసపోయినందుకు నీ జీవితాన్ని అంతం చేసుకోవాల్సిన పని లేదు దీన్ని ఒక పాఠంగా నేర్చుకొని ముందుకు సాగిపో మోసం చేయాలనుకున్న నమ్మక ద్రోహం చేయాలనుకున్న వ్యక్తిలో ఈ 10 లక్షణాలు ఉంటాయి ఇవి గుర్తుపెట్టుకుంటే నువ్వు జీవితంలో ఎవరి చేతిలోనూ మోసపోకుండా జాగ్రత్త పడగలవు కాబట్టి జాగ్రత్తగా విను ఆ మనిషి నీ దగ్గర అన్ని విషయాలు దాస్తాడు అతని గురించి నీకు అవతలి వాళ్ళు చెప్తే గాని తెలియదు అంతేకాకుండా నువ్వు అడిగినప్పుడు సింపుల్ గా చెప్పడం మర్చిపోయాను అని అంటాడు అలాంటి వ్యక్తితో నీకు ఎంతగా కాలం నుండి పరిచయం ఉన్న అతని గురించి నీకు పూర్తిగా తెలియదు అతని లైఫ్ లో ఏం జరుగుతుంది నీ గురించి ఏమనుకుంటున్నాడు ఇవేమీ తెలియవు నువ్వు ఎప్పుడూ కన్ఫ్యూషన్ లోనే ఉంటావు ఎందుకంటే అతను నీ దగ్గర ప్రతి విషయం దాచి ఉంచుతాడు ఎందుకంటే అతను నిజమైన వ్యక్తి కాదు కాబట్టి ఒక నిజమైన వ్యక్తి ఎప్పుడూ అతని గురించి అన్ని చెప్పుకోవడం దానికి భయపడడు ఒక మోసగాడు మాత్రమే తన గురించి అన్ని విషయాలు తెలియకుండా జాగ్రత్త పడతాడు కాబట్టి దాన్ని తెలివిగా గమనించుకోవాల్సిన బాధ్యత నీదే నువ్వు ఎవరినైతే ఎక్కువ నమ్ముతున్నావో నీ ప్రేమని నీ జీవితాన్ని పంచాలి అనుకుంటున్నావో నువ్వు ఎవరితో అయితే ఒక బంధంలో అది ఏదైనా సరే ముడిపడాలి అనుకుంటున్నావో వారు నీ దగ్గర ఒక తెరిచిన పుస్తకంలా ఉన్నారా లేదా అని నువ్వే గమనించాలి ఒకవేళ అతను నీ దగ్గర దాస్తున్నాడు అంటే అతను మోసగాడు అని అర్థం 

రెండు ఎవరైతే నిన్ను మోసం చేయాలి నమ్మక ద్రోహం చేయాలి అనుకుంటున్నారో వాళ్ళకి నీ పట్ల శ్రద్ధ ఉండదు వాళ్ళ కోసం నువ్వు ఎంతైనా చెయ్యి కానీ వాళ్ళు మాత్రం కేర్ లెస్ గానే ఉంటారు ఇలా ఒకసారి కాదు చాలాసార్లు జరుగుతుంది కానీ మనం దాన్ని చూసి చూడనట్లు వదిలేస్తాం అది మన తప్పు మనం వాళ్ళతో అంత అటాచ్మెంట్ పెట్టుకుంటాం మన కళ్ళ ముందే వాళ్ళు మనల్ని పట్టించుకో పోవట్లేదు అని తెలిసినా గుర్తించం అది ముమ్మాటికే మన తప్పు మనం కొంచెం అలర్ట్ గా ఉండి గమనిస్తే అర్థమవుతుంది అతనికి మన పట్ల కొంచెం కూడా కేరింగ్ లేదు అని 

మూడు మోసం చేసే వాళ్ళు ఎప్పుడూ అబద్ధాలు చెప్తూ ఉంటారు అతను చెప్పే మాటలకు చేసే పనులకు పొంతన ఉండదు అతను నిమిషానికి ఒక మాట మారుస్తూ ఉంటాడు చెప్పిన మాట మీద అసలు నిలబడటం మనం అతని మాటలలో దాగున్న అబద్ధాన్ని గుర్తించలేం అతను చెప్పే నిజమని నమ్మేస్తాం అలాంటి వాళ్ళను గుర్తించలేకపోతాం 

నాలుగు ఒక అబద్ధపు మనిషి మన ముందు ఎప్పుడూ మనల్ని పొగిడినట్టే ఉంటాడు కానీ మన వెనక నలుగురిలో మనల్ని పొగడడు అలాగే గౌరవించడు కూడా మనం వాళ్లకు మన జీవితంలో ఇచ్చే ఇంపార్టెన్స్ వాళ్ళు మనకి ఇవ్వరు ఎందుకంటే ఒకరోజు అతను మనల్ని నమ్మక ద్రోహం చేయడానికి సిద్ధంగా ఉంటాడు కాబట్టి దానికంటే మంచిది ముందుగా మనమే అతన్ని గమనించి వాళ్లకు ఎంత దూరంగా ఉంటే అంత మనకే మంచిది 

ఐదు వాళ్ళు నీకు ఏం చెప్తున్నారో దాన్ని అంత సీరియస్ గా తీసుకోకు వాళ్ళు చెప్పిన దాంట్లో ఎంత చేస్తున్నారో అది గమనించు చాలా వరకు మనం వాళ్ళ మాటల్లో చిక్కుకొని ఉంటాం కానీ మాటలు చెప్పినంత ఈజీ కాదు చేసి చూపించడం కాబట్టి వాళ్ళు ఎన్ని మాటలు చెప్పినా ఎన్ని ప్రమాణాలు చేసినా వాళ్ళు అది చేసి చూపించే వరకు వాళ్ళని నమ్మకు 

ఆరు ఇది తరచు లవ్ రిలేషన్షిప్ లో చూడటానికి దొరుకుతుంది ఒక మోసం చేయాలి అనుకున్న వ్యక్తి అవతలి వాళ్ళను వీళ్ళు ఎక్కడికి పోతారులే నా కోసం ఎప్పుడూ అందుబాటులో ఉంటారు అని చాలా తేలిగ్గా తీసుకుంటారు ఒకవేళ ఒక సంబంధంలో నువ్వు అవతలి వాళ్ళను నీతో మాట్లాడమని నీ కోసం సమయం కేటాయించమని అడగాల్సి వస్తుంది అంటే ఇంకా దానికంటే దారుణం ఏదీ ఉండదు ఎందుకంటే నిన్ను నిజంగా ప్రేమించే వ్యక్తి నీతో ఎప్పుడూ ఉండాలి నీతో మాట్లాడాలి అని నీతో ఎక్కువ సమయం గడపాలి అని అనుకుంటాడు కాబట్టి నీకోసం సమయం కేటాయించు అని నువ్వు అడగాల్సి వస్తుందంటే నీ మీద నిజమైన ప్రేమ లేదు అని గమనించుకో 

ఏడు మోసం చేయాలి అనుకునే వాళ్ళు నీ విషయం దగ్గరకు వచ్చేసరికి చాలా బిజీ అయిపోతారు వాళ్ళ దగ్గర అన్ని పనులు చేయడానికి టైం ఉంటుంది కానీ నీ కోసం టైం ఉండదు అలాంటి వాళ్ళు నిన్ను వదులుకోవడానికి అయినా సిద్ధపడతారు కానీ నీ కోసం వాళ్ళ లైఫ్ లో ఏదీ వదులుకోవడానికి సిద్ధంగా ఉండరు వాళ్లకు నీతో మాట్లాడాలి అనిపిస్తేనే మాట్లాడతారు వాళ్ళ అవసరం కోసం మాట్లాడతారు అంతేగాని నీ గురించి ఆలోచించి నీకు వాళ్ళ అవసరం ఉన్నప్పుడు కాదు వాళ్ళ పక్కన నీ స్థానంలో ఇంకొకళ్ళను మారుస్తారేమో కానీ నీ కోసం మాత్రం వాళ్ళ అలవాట్లు వాళ్ళ బిహేవియర్ ఏవి మార్చుకోరు 

ఎనిమిది వాళ్ళు ఎప్పుడూ నీ పట్ల సమర్పిత భావంతో ఉండరు ఏదేమైనా విని నేను నిన్ను వదులుకోను నీతోనే ఉంటాను ఎలాంటి సిచుయేషన్ లో అయినా సరే నేను నీకే సపోర్ట్ చేస్తాను ఇలా పై పై మాటలు చెప్తారు వాళ్లకు నీతో మంచిగా అనిపించినంత వరకే నీతో ఉంటారు ఎప్పుడైతే వాళ్లకు కొంచెం తేడాగా అనిపిస్తుందో నిన్ను వదిలి వెళ్ళిపోతారు ఎందుకంటే వాళ్ళు వాళ్ళ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి నీ కోసం ఏమి చేయరు కాబట్టి 

తొమ్మిది వీళ్ళు ఎప్పుడూ నిన్ను బాధ పెడుతూనే ఉంటారు కొన్నిసార్లు కావాలని బాధ పెడితే ఇంకొన్ని సార్లు తెలియకుండానే నిన్ను బాధ పెడతారు నీ మనసుకి ఎంత బాధ కలుగుతుందో అని కూడా ఆలోచించరు నిన్ను నిజంగా ప్రేమించే వాళ్ళతో నువ్వు ఉన్నప్పుడు నువ్వు చాలా సంతోషంగా ఉంటావు నీకు చాలా తేలికగా గాలిలో తేలుతున్నట్టు ఉంటుంది అదే నువ్వు ఒక మోసగాడితో ఉన్నప్పుడు నీకు చాలా భారంగా తల బరువుగా ఇబ్బందిగా ఉంటుంది ఏం బాగోలేదు ఏంటో తేడాగా ఉంది ఏం మంచిగా అనిపించట్లేదు నాకు అనిపిస్తుంది నీ లోపల నుండి ఇది నీకు కరెక్ట్ కాదు అని ఒక శబ్దం వినిపిస్తుంది నువ్వు అది విని కూడా దాన్ని పట్టించుకోలేదు అంటే అది నీ తప్పు 

10 వాళ్ళ లైఫ్ లో నీకంటూ ఒక ప్రత్యేకత ఉండదు నీకంటూ ఒక ప్రత్యేకత స్థానం ఉండదు వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు నిన్ను వాళ్ళ లైఫ్ నుండి తీసి పక్కన పడేస్తారు వాళ్లకు కొంచెం కూడా మనసు ఉండదు కావాలంటే రోజులు నువ్వే వాళ్ళ లైఫ్ లో నుండి వెళ్ళిపోయి చూడు వాళ్ళు ఒక తలకాయ నొప్పి పోయిందిలే అనుకుంటారు ఇంకా చెప్పాలంటే నువ్వు లేకపోతే వాళ్ళు ఇంకా ఫ్రీగా ఇప్పుడు నేను ఏమైనా చేయొచ్చు అని ఆనందంగా ఉంటారు ఇలాంటి వ్యక్తితో ఎటువంటి రిలేషన్షిప్ లో ఉన్నా సరే మీరు సఫర్ అవ్వకముందే అలర్ట్ అయిపోండి

No comments:

Post a Comment