Thursday, May 1, 2025

 *శ్రీ గురుభ్యోనమః* 

      *ఓం నమో భగవతే శ్రీ రమణాయ*
                      
*నేను ఎవరు ?*

*9.  మనస్సు  స్వరూపమును  విమర్శించి  తెలిసికొను  మార్గమేమి ?*

*జ.*  ఈ శరీరంలో  *నేను*  అని  తోచేదే  మనస్సు.  *నేను*  అనే  తలపు  దేహంలో  ఎక్కడ  మున్ముందుగా  స్పురిస్తుందని  విచారిస్తే  హృదయంలో  అని  తెలుస్తుంది.  అదే  మనస్సు  పుట్టు  చోటు.
*'నేను  నేను'*  అంటూ  స్మరణ  చేసినా  అక్కడికే  చేర్చుతుంది.

మనస్సుకు  తోచే  తలపులన్నిటిలో  *నేను*  అనే  తలపే  మొదటిది.  ఇది  లేచిన  తరువాతే  ఇతరమైన  తలపులు  పుడుతుంటాయి.  ఉత్తమ  పురుష  లేకపోతే  మధ్యమ,  ప్రధమ  పురుషలు  ఉండవు.

*10.  మనస్సు  ఎట్లు  అణుగును ?*

*జ.  నేనెవడను?*  అనే  విచారణ  చేతనే  మనస్సు  అణిగేది.  *నేనెవడను?*  అను  తలపు  ఇతర  ఆలోచనలను  అన్నింటిని  నాశనంచేసి  శవదహనంలో  చితిని  ముట్టించే  కట్టెవలె  తాను  కూడా  నశిస్తుంది.  ఆ తర్వాత  స్వరూప  దర్శనమవుతుంది.
            
*"భగవాన్ శ్రీ రమణ మహర్షి"*🙏🏻

No comments:

Post a Comment