*_జీవితంలో... అహంకారాన్ని దరిచేరనీయకండి. నాకు ఎవరి అవసరం లేదు, నాకు ఎవరితో పనిలేదు. అనే భారీ భారీ డైలాగులు వద్దు. ఎవరి అవసరం లేదని నీవనుకుంటావో... వారి అవసరమే రేపటి రోజు రావచ్చు._*
*_కొన్ని, కొన్ని సందర్భంలో ఒక పనిలో విజయాన్ని సాధించాలంటే, అందరి సహకారం, సమిష్టి కృషి అవసరం ఉండొచ్చు. ఎవరి అవసరం ఎలా ఉంటుందో చెప్పలేం._*
*_కాలం శక్తివంతమైనది. ఎవరిని తక్కువగా అంచనా వేయకండి. పనికి రాదని విసిరేసిన వస్తువే రేపు పనికి రావచ్చు. అది వస్తువైనా, మనిషైనా. చివరికి గడ్డి పోచైనా..._*
*_అందుకే ప్రతి వ్యక్తిని ప్రేమతో పలకరించండి, ప్రేమను పంచండి. వీలైతే మీకున్న దాంట్లో డబ్బు సహాయం లేదా మాట సహాయాన్ని అందించండి. చిన్న, పెద్ద, పేద, ధనిక అనే బేదభావము లేకుండా అందరితో మనసారా నవ్వుతూ, నవ్విస్తూ... కలిసిపోండి._*
*_మిత్రమా... నాదో... చిన్న మాట..._*
*_జీవితమనేది అశాశ్వతం. ఎప్పటి వరకు శ్వాస ఉంటుందో... ఎప్పటి వరకు తుది శ్వాస విడుస్తామో... తెలియని సందిగ్ధత. అలాంటిది గర్వము, పగ, ప్రతీకారంతో నిరంతరం రగులుతూ నీకు నీవు కోల్పోకు._*
*_కొన్ని సమయములలో ప్రశాంతంగా ఉంటూ సహనం వహించు. నీవే శాశ్వతము కానప్పుడు... ఈ పగలు, ప్రతీ కారాలతో... ఇప్పుడున్న నీ ఆనందాలను ఎందుకు పోగొట్టుకుంటావు.?_*
*_కొన్ని సందర్భాల్లో శత్రువుని, శత్రువులాగా చూడకు. నీ శత్రువు యొక్క ప్రతి చర్యకు స్పందించకు. ఎందుకంటే నువ్వు స్పందిస్తేనే అతను ఇంకా రెట్టింపు హాని తలపెట్టడానికి ప్రయత్నిస్తాడు._*
*_ప్రశాంతంగా నవ్వుతూ పలకరించు. పోయేదేముంది మాటే కదా.! ప్రయత్నించండి. అవసరమైతే మారిపోతాడు. లేని పక్షంలో సరైన సమయంలో... సరైన విధంగా నీ బుద్ధిని ఉపయోగించి... సరైన విధంగా బుద్ధి చెప్పు తప్పులేదు._*
*_కానీ, నీ శత్రువుకు కూడా కొన్ని సందర్భాలలో ఓ... అవకాశం మాత్రం ఇవ్వు. శత్రుత్వం పెంచుకోవాలన్నా, మిత్రుత్వం పెంచుకోవాలన్నా అంతా మన చేతుల్లోనే ఉంది. ఇది నిజం కాదంటారా.? కాస్త ఆలోచించండి.☝️_*
*_~సదా మీ శ్రేయోభిలాషి...👏_*
🦚❤️🦚 🌹🙇🏻♂️🌹 🦚❤️🦚
No comments:
Post a Comment