🦚జ్ఞాన ప్రసూనాలు 🚩
02/11/25
1) మౌనం అంటే మాట్లాడకపోవడం కాదు, మాట్లాడాలని అనిపించకపోవడం.
2) నేను తెలుసుకోవడం వేఱు. “నేను”ను తెలుసుకోవడం వేఱు. నేను తెలుసుకునేది - విజ్ఞానం.
నేనును తెలుసుకునేది - జ్ఞానం.
3) అంతరాత్మే పరమాత్మ
4) అది నీవే'
అని గుర్తుకు తెచ్చేవాడు గురువు.
5) ఒక దీవిలో ఒకడే ఉన్నాడనుకో వాడు అబద్ధం ఎలా చెప్పగలడు? నిజమైనా ఎలా చెప్పగలడు?
అసలు ఎవరితో చెప్పగలడు?
సరిగ్గా జ్ఞాని పరిస్థితి కూడా అలానే ఉంటుంది. వానికి అన్యం ఉండదు.
అందుకే అతడు సత్యమూ పలుకడు, అసత్యమూ పలుకడు. అతడు కేవలుడు.
మౌన స్వరూపుడు.
6) ‘ఉండేది భగవంతుడొక్కడే' అన్నాక అన్నిటికీ కర్త ఆయనే అవుతాడుగాని వేఱకరు ఎట్లా అవుతారు?
No comments:
Post a Comment