🙏🕉️ హరిఃఓం 🕉️🙏
పూజ్యశ్రీ చిన్మయానందగారి "ఒక మహాత్ముని జీవనయానం"అనే గ్రంథం నుండి :-(263వ రోజు):--
26. అంతిమ పయనం
ఈ శరీరం నేను కాదని ఇంత కాలమూ బోధిస్తూనే ఉన్నాను. ఇప్పుడు కూడా, నేను ఈ శరీరమే నని నాకు బోధించటానికి ప్రయత్నిస్తున్నారు మీరు.
-స్వామి చిన్మయానంద, 72 వ జన్మదిన సమారంభంలో.
స్వామి చిన్మయానంద చేపట్టిన 'దైవకార్యం' చాలా దశలను దాటింది. 1950 లలో భారతదేశం లోని ముఖ్యనగరాల్లోనూ, పట్టణా ల్లోనూ ఆయన స్వయంగా యజ్ఞో పన్యాసాలిచ్చారు. 1960 లలో ఆయన అతి ముఖ్యమైన లక్ష్యంగా పెట్టుకున్నది వేదాంతాన్ని బోధించ డానికి ఒక సంస్థను స్థాపించి, దానిని బోధించేవారికి పటిష్టమైన శిక్షణ నీయడం. 1970 లలో విదేశా లకు విస్తరించిన ఆయన కార్యక్రమా లు సంస్థలుగా రూపుదిద్దుకున్నాయి భారతదేశంలో స్థాపించిన మిషన్ కేంద్రాలు చిలవలు పలవలుగా వ్యాపించి వివిధ సాంస్కృతిక కార్య క్రమాలనూ చేపట్టసాగాయి.
ఏళ్ళు గడచిన కొద్దీ స్వామీజీ తన శ్రోతలను గమనించి వారికి తగినట్లు తన కార్యక్రమాలలో కొన్ని మార్పులు తెచ్చారు. తొలిదశలో నిర్వహించిన యజ్ఞాలలో వంద రోజులు సాగిన బోధన కార్యక్రమా నికీ, సాధనకూ గృహస్థులు అంత సుముఖంగా లేరని గ్రహించి, కార్య క్రమపు నిడివి తగ్గించారు. మొదటి ఐదేళ్లలో ఉపనిషత్తులను మాత్రమే బోధించినప్పటికీ, ఈనాటి ప్రపంచం లో జీవించడానికీ, సేవించడానికీ భగవద్గీతా పఠనమే సరైన త్రోవ చూపుతుందని ఆయన గ్రహించారు. సాందీపని సాధనా లయపు మొదటి శిక్షణ కార్యక్రమం లో విద్యార్థులకు బ్రహ్మచర్యదీక్ష మొదట్లోనే ఇచ్చారు. ఇది సరైన పద్దతి కాదని గ్రహించి, శిక్షణ పూర్తయ్యాక విద్యార్ధి కోరితేనే దీక్ష నీయటం మొదలుపెట్టారు. 1960, 70 లలో యజ్ఞ కార్యక్రమాలను పది రోజులకు తగ్గించడం ద్వారా స్వామీజీ ఇంకా ఎక్కువ పట్టణాలకు వెళ్ళటం సాధ్యమైంది. 1980 లలో కూడా నిలుపు లేకుండా ఉపన్యాసా లిస్తున్నప్పటికీ, మిషన్ కేంద్రాల సేవాపథకాల విషయంలో సలహా లివ్వటానికీ, వివిధ కేంద్రాల కార్య క్రమాలను సమన్వయ పరచడానికీ ఎక్కువ సమయం కేటాయించారు.
సభ్యులు స్వతంత్రంగా తమ అభివృద్ధికి కృషిచేయటాన్ని స్వామీజీ ఎప్పుడూ ప్రోత్సహించేవారు. దీపావళి పండుగ సందర్భంలో ఈ సందేశాన్నిచ్చారు :
దీపావళి, అంతఃకరణ పరిశుద్ధ తకూ, ఔదార్యానికీ అంకితమైన శుభదినం. సద్గుణాల నలవరచు కోవటం దేశ పురోభివృద్ధి సాధించ డానికి మొదటి మెట్టు. రాజకీయ చైతన్యం, ఆర్థిక పురోభివృద్ధి, సంఘ సంస్కరణలు, విద్యాపథకాలు - ఇవన్నీ మంచివే ; కాని, వీటి సాఫల్య తకు జనుల నడవడి సరైనది కావటం అతి ముఖ్యమని గుర్తుంచు కోవాలి.
దీపావళి, మన హృదయ కవాటాలను తెరవటానికి అంకిత మైన మంగళకరమైన సమయం. అందరూ స్నేహితులతోనూ, ఇరుగు పొరుగు వారితోనూ కలిసి విందార గించండి. విద్వేషాలన్నిటినీ మరిచి పోండి ; అన్యాయాలను క్షమించండి ఈ ఒక్కరోజు నైనా మన నీచప్రేరణ లను అధిగమించి, ఆధ్యాత్మిక దీపిక తో మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని వెలిగిద్దాం.
🙏🕉️ హరిఃఓం 🕉️🙏
🙏👣శ్రీగురుపాదసేవలో👣🙏
🌺 సరళ 🌺
No comments:
Post a Comment