🙏🕉️ హరిఃఓం 🕉️🙏
పూజ్యశ్రీ చిన్మయానందగారి "ఒక మహాత్ముని జీవనయానం"అనే గ్రంథం నుండి :-(285వ రోజు):--
29. మతం
ప్రశ్న :- స్వామీజీ, మీ అభిప్రాయం లో మతానికి ప్రయోజనం ఏమిటి?
స్వామీజీ :- జీవితాన్ని వివేకవంతం గా అనుభవించి, జీవితంలో జరిగిన సంఘటనలను జాగరూకతతో, విమర్శ నాత్మకంగా పరిశీలించిన ప్రతి అనుభవ యోగ్యుడైన వ్యక్తికీ అంతరంగం పరిపక్వమై, మనసులో ఒక విధమైన అలజడి మొదలౌతుం ది. కావలసిన వన్నీ ఉన్నా, అతడికి పరిపూర్ణమైన తృప్తి లేదు. "ఎక్కడి నుంచి వచ్చాన్నేను?", "ఎక్కడకు వెళ్తాను చివరికి?", "ఈ జీవితం ప్రమాద వశాత్తూ సంభవించిన అర్థం లేని, సారం లేని దుర్ఘటన మాత్రమేనా?", "జీవితాని కేదైనా ప్రయోజనం ఉందా?" - తనలో చిన్నగా వినవస్తున్న ఈ ప్రశ్నలను వింటాడతను.
మతం కావలసినది అటువంటి వ్యక్తికే. అతడికి నమ్మిక కలిగించి, అతనిలో జనించిన ఈ ప్రశ్నలకు సమాధానం కనుగొనే దారిని చూపుతుందది.
ప్రశ్న :- మతం చాలా మంచి దన్నట్లు మాట్లాడుతున్నారు మీరు. కాని మతం పేరుతో ఎన్నో అన్యాయా లూ, యుద్దాలూ జరిగాయి. పరిపక్వ త చెందిన, వివేక వంతులైన, నిశితంగా ఆలోచించే వ్యక్తులందరూ ఈ కారణం వల్లనే మతాన్ని వ్యతిరేకిస్తున్నారు.
స్వామీజీ :- మతం ముసుగులో దౌష్ట్యం, అత్యాశ, ఉన్మాదం, వీటన్ని టితో పాటు యుద్దాలు కూడా సంభవించి ప్రజా జీవితాన్ని అస్తవ్యస్తం చేశాయనేది నిజమే. ఈ రోజుల్లో కూడా మతోన్మాదం తో యుద్దానికి బయలుదేరి దోపిడీలూ, హత్యలూ, మానభంగాలూ చేస్తూ మనను మనమే అవమాన పరుచు కొనటం చాలా శోచనీయమైన వైపరీత్యం. ప్రశాంతంగా, గౌరవ ప్రదంగా జీవించాలను కొనేవారికి మతం ఒక ప్రమాద సంకేతంగా తయారైంది. కాని, ఇది మతం కాదు. ఈ ఉన్మాదులు తమ మారణా యుధాలను వెలికి తీసి బలహీను లనూ, నిస్సహాయులనూ చంపడం మతంలో వారికున్న విశ్వాసం వలన కాదు, పవిత్రమైన మతవస్త్రాల మరుగున దాచిన వారి క్షుద్రమైన, హీనమైన పశు ప్రవృత్తి వలననే.
ప్రశ్న :- మీరు చెప్పినది నిజమే. కాని, చర్చిల వంటి మతసంస్థల్లో పనిచేస్తూ, ఆధ్యాత్మికత అణుమాత్ర మైనా లేనివారి సంగతేమిటి? వారికి ప్రేమ, దయ వంటి మంచి స్వభావాలు లేవు ; నిజానికి వారిది కొంతవరకైనా సంకుచిత మనస్తత్వమే.
స్వామీజీ :- న్యాయవర్తనులై జీవిస్తూ, జీవితంలో ఎదురైన అను భవాలను పరిశీలనా పూర్వకంగా చూచే పరిపక్వ మనస్కులకే మతం ఉందని నేను చెప్పిన విషయాన్ని గుర్తుకు తెచ్చుకోండి. ఐతే, చాలా మంది తమ శరీరం, మనసు పొందే వ్యథలు ఎందుకొస్తున్నా యని ప్రశ్నించరు. దానికి బదులు, ఆకర్షించి రంజించే విషయాల వైపు మనసును మరలుస్తారు. మతాచా రాల ననుసరించి లాంఛన ప్రాయం గా చర్చికి వెళ్లడమో, ఆలయ నిర్మాణమో చేయవచ్చు ; కొందరు ప్రతి ఆదివారం చర్చికి వెళ్తారు, మరి కొందరు ప్రతి రోజూ గుడికి వెళ్తారు. కాని, ఇవన్నీ కూడా మనసు తన వైపు చూచుకోకుండా ఉండటం కోసం వేరే దిశలోకి మరల్చి, ఆ విధం గా దుఃఖం నుంచి పారిపోవాలనే ఉద్దేశంతో చేసే వృథా ప్రయత్నాలే.
🙏🕉️ హరిఃఓం 🕉️🙏
🙏👣శ్రీగురుపాదసేవలో👣🙏
🌺 సరళ 🌺
No comments:
Post a Comment