🦚జ్ఞాన ప్రసూనాలు 🚩
29/10/25
1. మేఘరూపంగా వర్షించేది సముద్రుడే. గురురూపంగా బోధించేది పరమేశ్వరుడే.
2. 'జగన్మాత' అంటే- జగత్తుకు మాత అని కాదు. జగత్తే మాత అని అర్థం.
3. సత్ అనిలాచలశివుడు. చిత్ - జ్ఞానప్రసూనాంబిక. ఆనందం - విఘ్నేశ్వరుడు.
4. 'నేను' అంటే మొత్తం. 'బాబు మాత్రమే నేను' అనేది పోయి, 'ఉన్నదంతా నేను' అనేది స్థిరమైపోవాలి.
5. అన్ని నేనులు నేనే అయి ఉన్న నేను 'నేను'.
6. మొత్తం కలిపితే, అదే 'గురువు'.
7. ఎందులోనూ, ఎవరిలోనూ 'ప్రత్యేకత' లేదు అని చెప్పినవానిని ప్రత్యేకం చేస్తున్నాం.
8. నీకు అన్యం తోస్తే అది - కల. అన్యం తోయకుంటే అది - మెలకువ.
9. సీన్ - కల. స్క్రీన్ - మెలకువ.
10. ఆధ్యాత్మికమంత స్పష్టమైనది మరేదీ లేదు. అందుకే అది అంత కష్టమైపోయింది.
No comments:
Post a Comment