*🔊insurance: ఆరోగ్య బీమా అన్ని దశల్లో ఆదుకునేలా*
*🍥ఆరోగ్య బీమా పాలసీ తీసుకోవాలనుకున్నప్పుడు ఎన్నో సందేహాలు.. ఎంత విలువైన పాలసీ తీసుకోవాలి? ఏ సంస్థ నుంచి ఎంచుకోవాలి? కుటుంబానికి అంతటికీనా?వ్యక్తిగత పాలసీనా? ఇలాంటి ప్రశ్నలు మనల్ని గందరగోళానికి గురిచేస్తాయి. వయసు, బాధ్యతలు, జీవన శైలి మారే కొద్దీ మన బీమా అవసరాలూ భిన్నంగా ఉంటాయి. అందుకే, ప్రతి దశలోనూ ఎలాంటి బీమా రక్షణ అవసరమో తెలుసుకొని, దానికి అనుకూలంగా ఉండేలా పాలసీని తీసుకోవడం ఎంతో ముఖ్యం.*
*💥ఇరవై... ఇదే సరైన ఆరంభం*
*◾ఈ వయసులో చాలామంది ఆరోగ్యంగా ఉంటారు. కాబట్టి, ఆరోగ్య బీమాను తేలిగ్గా తీసుకుంటారు. కానీ, తక్కువ వయసులో పాలసీ తీసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.*
*🔆తక్కువ ప్రీమియం: చిన్న వయసులో ప్రీమియం చాలా తక్కువగా ఉంటుంది. ఇది దీర్ఘకాలంలో ప్రయోజనం చేకూరుస్తుంది.*
*❇️వేచి ఉండే వ్యవధి: పాలసీ తీసుకున్న వెంటనే అన్ని రోగాలకూ రక్షణ లభించదు. కొన్ని వ్యాధులకు రెండు నుంచి నాలుగేళ్ల వరకూ వేచి ఉండే వ్యవధి (వెయిటింగ్ పీరియడ్) ఉంటుంది. మీరు 20లలో పాలసీ తీసుకుంటే, మీకు అవసరమయ్యే సమయానికి ఈ వ్యవధి పూర్తవుతుంది.*
*💠ఏం చేయాలి?: ఒక ప్రాథమిక ఆరోగ్య బీమా పాలసీని కనీసం రూ.5-10 లక్షల కవరేజీతో తీసుకోవాలి. రూ.30 లక్షల వరకూ వ్యక్తిగత ప్రమాద బీమా పాలసీ ఉండాలి. జీవన శైలి వ్యాధుల ప్రమాదం ఉంటే.. క్రిటికల్ ఇల్నెస్లాంటి పాలసీలను తీసుకోవడం మంచిది.*
*💥ముప్పై.. అందరికీ భరోసా*
*🌀ఈ దశలో వివాహం, పిల్లలు వంటి కొత్త బాధ్యతలు వచ్చి చేరతాయి. మీ ఒక్కరి కోసమే కాకుండా, మొత్తం కుటుంబం ఆరోగ్యం గురించి ఆలోచించాలి. కనీసం రూ.10లక్షలకు తక్కువ కాకుండా పాలసీ ఉండేలా చూసుకోవడం మేలు.*
*🥏ఫ్యామిలీ ఫ్లోటర్:మీతోపాటు మీ జీవిత భాగస్వామి, పిల్లలకూ రక్షణ కల్పించేలా ఫ్యామిలీ ఫ్లోటర్కు మారడం ఉత్తమం. ఒకే పాలసీ కింద అందరికీ రక్షణ లభిస్తుంది.*
*💫టాపప్ ప్లాన్: అధిక బీమా రక్షణ కావాలనుకుంటే, ఒకేసారి పెద్ద మొత్తంలో పాలసీ తీసుకుంటే ప్రీమియం అధికంగా ఉంటుంది. దీనికి బదులుగా ప్రాథమిక పాలసీకి అనుబంధంగా ఉండేలా సూపర్ టాపప్ పాలసీ తీసుకోవడం మంచిది. దీనివల్ల తక్కువ ఖర్చుతో మంచి రక్షణ పొందొచ్చు.*
*➡️ఉద్యోగం చేస్తున్న చోట బృంద బీమా పాలసీ ఉన్నప్పటికీ, సొంతంగా ఒక పాలసీ తీసుకోవడం ఎప్పుడూ శ్రేయస్కరం. ఉద్యోగం మారినప్పుడు ఇది అండగా ఉంటుంది. క్రిటికల్ ఇల్నెస్ పాలసీని తీసుకోవడం మర్చిపోవద్దు.*
*💥నలభై.. విలువ పెంచుకోండి*
*🛟నడి వయసు ఎంతో కీలకం. రక్తపోటు, మధుమేహం, గుండె సంబంధిత సమస్యలువంటి జీవనశైలి వ్యాధులు మొదలయ్యే అవకాశాలు ఎక్కువ. అందుకే, ఆరోగ్య బీమా పాలసీని ఒకసారి పూర్తిగా సమీక్షించుకోవాలి. ఇప్పటికే తీసుకున్న పాలసీలకు వేచి ఉండే వ్యవధి, ముందస్తు వ్యాధుల నిబంధనలాంటివి ముగిసిపోతాయి.*
*➡️ప్రాథమిక పాలసీ రూ.10లక్షలకు తక్కువ కాకుండా ఉండాలి. సూపర్ టాపప్ పాలసీ రూ.40లక్షల వరకూ తీసుకోవాలి. తీవ్ర వ్యాధుల కోసం క్రిటికల్ ఇల్నెస్ రైడర్ జోడించుకోవాలి. క్యాన్సర్, గుండెపోటు వంటి 30-40 తీవ్ర వ్యాధులకు ప్రత్యేక ఆర్థిక రక్షణ కల్పిస్తుంది. అవసరమైతే, పాలసీ విలువను పెంచుకోండి. ఎక్కువగా ప్రయాణం చేస్తుంటే, వ్యక్తిగత ప్రమాద బీమా పాలసీని మీ ఆదాయానికి తగ్గట్టుగా పెంచుకోండి.*
*💥50 ఏళ్లకు.. గరిష్ఠ హామీ*
*✳️పదవీ విరమణకు దగ్గరవుతున్న ఈ దశలో ఆరోగ్యపరంగా మరింత జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యపరమైన సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి, పాలసీ విలువ వీలైనంత మేరకు పెంచుకునే ప్రయత్నం చేయాలి. ప్రాథమిక, సూపర్ టాపప్ పాలసీలు కలిసి కనీసం రూ.50లక్షలకు తక్కువ కాకుండా ఉండాలి. పిల్లలు ఆర్థికంగా స్థిరపడితే, వారిని మీ పాలసీ నుంచి వేరు చేయొచ్చు. వారు ఉద్యోగాల్లో చేరితే, వారి బృంద పాలసీల్లో మిమ్మల్నీ చేర్చే అవకాశం ఉందా చూసుకోండి. మీ అవసరాలకు అనుగుణంగా వ్యక్తిగత ప్రమాద బీమా పాలసీని కొనసాగించండి. అవకాశం ఉన్నంత వరకూ క్రిటికల్ ఇల్నెస్ పాలసీని తీసుకోండి.*
*💥పదవీ విరమణ తర్వాత*
*✴️పదవీ విరమణ తర్వాత ఆదాయం ఆగిపోతుంది. కానీ, ఆరోగ్య సమస్యలు, వైద్య ఖర్చులు పెరుగుతాయి. ఈ సమయంలో ఆరోగ్య బీమా లేకపోతే, ఆర్థికంగా చాలా కష్టం.*
*➡️మీ కంపెనీ అందిస్తోన్న బృంద ఆరోగ్య బీమా పాలసీని వ్యక్తిగత పాలసీగా మార్చుకునే అవకాశం ఉంటే దానిని వినియోగించుకోండి. మీ వ్యక్తిగత పాలసీని కొనసాగించడం మర్చిపోవద్దు.*
*➡️మీకు ఇప్పటివరకూ బీమా లేకపోతే, కొత్తగా పాలసీ తీసుకోవడం కష్టం కావచ్చు. సీనియర్ సిటిజన్ పాలసీలున్నా, అధిక ప్రీమియం ఉంటుంది. సహ-చెల్లింపు, కొన్ని ఉప పరిమితులున్న పాలసీని ఎంచుకునే ప్రయత్నం చేయొచ్చు. దీనివల్ల ప్రీమియంలో కొంత రాయితీ లభిస్తుంది.*
*➡️ఆరోగ్య అత్యవసర నిధిని ఎప్పుడూ అందుబాటులో ఉంచుకోవడం శ్రేయస్కరం.*
No comments:
Post a Comment