Wednesday, November 5, 2025

 💐1శ్రీ లింగ మహాపురాణం💐
     
     🌼లింగోద్భవ ప్రతిజ్ఞ🌼

        #మొదటి భాగం#
 నేటినుండి
వేదవ్యాస ప్రణీతమైనపదకొం డవదగునదియు, సూత మహర్షి చే శౌనకాది మునులకు చెప్పబడినశ్రీలింగమహాపురాణం చదువుదాం,
పెండ్యాల ఉపేంద్ర రావు. 

వేదవ్యాస మహర్షి చేత రచించబడిన బడిన అష్టాదశ పురాణములలో శ్రీ లింగ మహా పురాణం పదకొండవది.  
సృష్టి స్థితి లయ కర్తలైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు పురాణ ప్రారంభం చేస్తూ నమస్కరించు దాం! శ్రీ లింగ మహాపురాణం రచించిన వ్యాస మహర్షికి నమస్కారించుదాం!

పూర్వం నారద మహర్షి   శైలేశ, సంగమేశ్వర, పాశుపత, కేదార, హిరణ్యగర్భ, త్రివిష్టపమొదలైన శివపుణ్యక్షేత్రాలలోమహేశ్వరునిదర్శించి,పూజించినైమిశార్యణం చేరుకున్నాడు.  నైమిశా ర్యణంలో నివసించే శౌనకాది మునులు నారద మహర్షికి స్వాగతం పలికి అర్ఘ్యపాద్యాది సత్కరాలు చేసి ఉచితాసనుని చేశారు.

ఉభయకుశలోపరి ప్రశ్నలు అయిన తరువాత నారదుడు తాను దర్శించిన క్షేత్రములలో గల మహిమాన్వితాలైన లింగ ముల విశేషాలు  వివరించాడు. అదే సమయంలో పురాణ కథలలో నిష్ణాతుడైన సూత మహర్షి అక్కడకు విచ్చేశాడు. శౌనకాదులు సూత మహర్షిని స్వాగతించి అతిథి మర్యాదలు చేసిన తరువాత నమస్కరించి  "పౌరాణికోత్తమా! నీవు వ్యాస మహర్షి నుంచి సకల పురాణ జ్ఞానము పొందినవాడవు. ఇప్పుడే  నారద మహర్షి పుణ్య క్షేత్రాలలోమహిమాన్వతములైన లింగములను దర్శించి అర్చించి వచ్చి వాటి విశేషాలు మాకు తెలిపారు.

వినిన మాకందరికి లింగ మహత్మ్యముల కథలు గల శ్రీ లింగ మహాపురాణం వినాలని కుతూహలం కలిగింది. తమరు రుద్రుడైన శివుని మహాభక్తులు. మేము,నారదమహర్షిఈశ్వరుని భక్తులం. నారద మహర్షి సమ క్షంలో మాకు లింగముల మహత్మ్యం తెలిపే శ్రీ లింగ మహాపురాణం వినిపించండి! మేము ధన్యులు అవుతాము" అని కోరారు.

పౌరాణికోత్తముడు, మహా ప్రతిభావంతుడు అయిన రోమహర్షణ (సూత) మహర్షి సంతోషించి ముందుగా బ్రహ్మ మానస పుత్రుడైన నారదునికి నమస్కారం చేసి అనుమతి కోరాడు.  నారదుడు చిరునవ్వు తో అనుమతి ఇచ్చాడు. అక్కడ ఆసీనులైన శౌనకాది మునులకు నమస్కరించి చెప్పడం ఆరంభించాడు.

"లింగ పురాణం ప్రారంభించే ముందు త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు, మా గురువు గారు, పురాణ రచయిత అయిన వ్యాస మహర్షికి నమస్కరిస్తున్నాను. మహాశివ లింగానికిప్రణామాలు అర్పిస్తూ చేసే శివ లింగోద్భవ ప్రతిజ్ఞను మొదట వివరిస్తాను.

"శబ్ద బ్రహ్మాము ఎవరి శరీరమో, శబ్దబ్రహ్మాన్ని ఎవరు ప్రకాశింప చేస్తారో, ఎవ్వరిశరీరఅంగములే అక్షరాలో,ఎవ్వరిఅంగములు
అవ్యక్తముగా లైనప్పటిక అనేక విధములవ్యక్తమచేయబడినవోఎవరుఆకారఉకారమకారములఓంకారము)చేతతెలియబడుతారో,ఎవ్వరు స్థూలము, సూక్ష్మము తానే అవుతాడో, ఎవ్వరు మహత్తము, మహత్తుడు తానే అవుతాడో, ఎవ్వని ఆకారం ఓంకారమో, ఎవ్వరి ముఖము ఋగ్వేదము, జిహ్వా (నాలుక) సామవేదము, యజుర్వేదము మహాగ్రీవము, అధర్వణ వేదము హృదయము అవుతున్నదో, ఎవ్వరు పురుషులకు అతీతుడైన ప్రధాన పురుషుడో, ఎవరు జన్మమృత్యు రహితుడో,
ఎవ్వరు తామస గుణము వహించుట చేత కాలరుద్రుడు, రజో గుణము వహించుట చేత బ్రహ్మ,సత్త్వగుణమువహించుట చేత విష్ణువు అని పిలువ బడుతున్నాడో, ఎవ్వరు త్రిగుణ రహితుడైనమహేశ్వరుడో,ఎవ్వరు ప్రధాన ఆకారము (విశ్వ రూపము) ధరించక ముందు. మొదట ఏడు విధములుగా, తరువాత షోడశ (పదహారు) విధములుగా, చివరకు ఇరవై ఆరు విధములుగా వ్యక్తపరుచు కుని ఉన్నాడో,ఎవ్వరు బ్రహ్మకు ఆధారభూతుడో, ఎవ్వరు సృష్టి చేయుట, పాలించుట,లయము చేయుటఅనేలీలలనిర్వహణకు లింగాకారము దాల్చినాడో, అట్టి పరమేశ్వరునికి భక్తి శ్రద్థ లతో నమస్కరించి శ్రీ లింగ మహాపురాణం కథనము చేయుచున్నాను"

లింగోద్భవ ప్రతిజ్ఞ అని ఈ స్తుతిని పిలుస్తారు.

*తరువాత కధ రేపటి భాగంలో చదువుదాం*.
🌹శ్రీకాంత్ గంజికుంట 
కరణంగారి సౌజన్యంతో🌹
సేకరణ'::పెండ్యాల ఉపేంద్ర రావు
💜   ఓం శ్రీఉమా 
మహేశ్వరాయ నమ:💜
🙏లోకా:సమస్తాః 
సుఖినోభవన్తు🙏
రేపటి తరానికి బ్రతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.
     (సర్వం శ్రీశివార్పణమస్తు) 
                🌷🙏🌷

శుభమస్తు 🌹 🌷 ♥️ 🙏 స్వస్తి.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺

No comments:

Post a Comment