💐19శ్రీలింగమహాపురాణం💐
🌼శివునికి విష్ణువు చేసిన విష్ణు స్తవము🌼
#పందొమ్మిదవ భాగం#
లింగము నుండి ఉద్భవించిన ఓంకారము నుండి ప్రత్యక్షమైన పరమేశ్వరునికివిష్ణువునమస్క రించి స్తుతించాడు. ఈ స్తుతి విష్ఙుస్తవముగాప్రసిద్ధిచెందినది.
"ఏకాక్షరరుద్రునికినమస్కారముఆత్మస్వరూపునికినమస్కారం! ఎవరి దేహం విద్యయో అట్టి 'ఉ' కార దేవునికి నమస్కారం! అగ్ని సూర్య చంద్రులు రూపాలలో గల పరమాత్మ శివునికి నమస్కారం!
రుద్రాగ్నిరూపునకునమస్కారం! సృష్టికర్తకు నమస్కారం!
సద్యోజాతునకు నమస్కారం! వామదేవునకు నమస్కారం! అఘోరునకు నమస్కారం! తత్పురుషునకు నమస్కారం! ఈశానునికి నమస్కారం!
ఆదిఅంతములేనిలింగరూపునకు నమస్కారం!
స్వర్ణ లింగ, జల లింగ, వాయు లింగ, ఆకాశ లింగ రూపునకు నమస్కారం!-ఆకాశమంతా వ్యాపించిన వానికినమస్కారం! వాయువుగా ప్రపంచమంతా వ్యాపించిన వానికినమస్కారం! అగ్నికి ప్రభువై అగ్ని యందు వ్యాపించిన వానికినమస్కారం! జలము,జలమందువ్యాపించిన వానికి నమస్కారం!
పృథ్వికి ప్రభువై, పృథ్వి అంతా వ్యాపించిన వానికినమస్కారం!
అనంతునికి, రూపరహితునకు నమస్కారం!
శాశ్వతునకు నమస్కారం! సాగర మధ్యమున నాకు బ్రహ్మకు మధ్య నిలిచి దర్శనమిచ్చిన శివునకు నమస్కారం!
నాగధారి జటాధారి పాశధారికి నమస్కారం!
మూడులోకములునివాసముగా గలవానికి నమస్కారం! త్రిగుణాత్మునకు,యుగాత్మునకునమస్కారం
జగత్తుఅస్తిత్వం,వినాశనమునకుహేతువైనవానికినమస్కారం! మోక్షస్వరూపునకు,మోక్షదాతకు నమస్కారం!
ఓంకారునకు, సర్వజ్ఞునకు నమస్కారం!
సర్వమయుడు,నారాయణుడు, హిరణ్యగర్భుడు అయిన ఆదిదేవునకు నమస్కారం!
మహాదేవునకు, దేవతాధిపతికి నమస్కారం!
శర్వునకు, సత్యమునకు, శమనునకు, బ్రహ్మకు నమస్కారం!
సర్వ ప్రాణుల యందు ఆత్మలుగా సర్వవ్యాపియైన వానికి నమస్కారం!
చేతన, స్మృతి, జ్ఞాన రూపునకు నమస్కారం! అర్థనారీశ్వరునకునమస్కారం!
శాంతునికి, సర్వేశ్వరునికి నమస్కారం!
నీలకంఠునకు, నీలకేశునకు నమస్కారం!
అంబికాపతికి, ఉమాపతికి నమస్కారం!
చేతిలో పరశువుతో శ్రీకంఠుడు అనేపేరుగలవానికినమస్కారం! సర్పములను యజ్ఞోపవీతంగా, కుండలాలుగా, మాలలుగా, నడుము చుట్టూ వడ్డాణముగా ధరించిన వానికి నమస్కారం! భువనేశునకు నమస్కారం! వేదశాస్త్రరూపునకునమస్కారం!సారంగహస్తునకునమస్కారం!
వేదములు ముఖమందే కల వానికి, సమస్త విశ్వమును తన యందే ధరించినవానికి నమస్కారం!
ఓంకార స్వరూప! శివా! నీకు నమస్కారం!" అని విష్ణువు పరమశివుని స్తుతించాడని బ్రహ్మ దేవతలకు చెప్పాడు.
దేవతలారా! విష్ణువు చేసిన ఈ విష్ణుస్తవముపరమపవిత్రమైనది. సర్వపాపములను నాశనం చేస్తుంది. ఈ స్తోత్రం చదివిన వానికి, ఇతరులకు వినిపించిన వానికిబ్రహ్మలోకప్రాప్తికలుగుతుంది అని బ్రహ్మదేవుడు తరు వాత వృత్తాంతంచెప్పసాగాడు.
పరమేశ్వరుడు ప్రసన్నుడై బ్రహ్మ విష్ణువుల వంక చూసి "నేను మీ స్తుతి స్తోత్రాలకు ప్రసన్నుడయ్యాను. నేను మహేశ్వరుడను. మీ భయ సందేహాలను వదలి వేయండి. మీరిరువురు నా నుంచేఉత్పన్న మయ్యారు. బ్రహ్మదేవుడు నా శరీర కుడిభాగము నుండి, విష్ణువు నా శరీర ఎడమభాగం నుండి ఉద్భవించారు. రుద్రుడు నా మధ్యభాగం నుండి ఉద్భ వించాడు. మీరు కోరిన వరము లిస్తాను. కోరుకోండి" అనగా బ్రహ్మ విష్ణువులు నమస్కరించి "మహేశ్వరా! మా ఇరువురి హృదయములలో నీ పై భక్తి స్థిరముగా ఉండేటట్టు వరము ప్రసాదించుము" అని కోరారు.
దేవతలారా! అప్పుడు పరమే శ్వరుడు నాకువిష్ణువుకిఅచంచ లమైన శివభక్తి ఉండేటట్టు వర మిచ్చాడు. తరువాతమమ్మల్ని చూసి "మీరు రుద్రునితో కలసి ఈ చరాచర సృష్టికి సృష్టికర్తలు, పాలనకర్తలు, సంహార కర్తలు అవుతారు. రూపరహితుడైన నేనేబ్రహ్మవిష్ణురుద్రుడిగామూడురూపములలోవిభజించుకున్నాను.
ఓ విష్ణూ! రాబోయే పద్మ కల్పంలో ఈ బ్రహ్మ నీకు పుత్రుడిగా జన్మిస్తాడు. ఆ బ్రహ్మను నీవే రక్షించి కాపాడి సృష్టికర్తను చేయాలి. అప్పుడు మీకు ఈ రూపంలోనే దర్శన మిచ్చింది కర్తవ్యం బోధిస్తాను" అని అంతర్ధానమయ్యాడు.
దేవతలారా! అప్పటి నుండి శివునికి లింగ రూపంలో లింగార్చనము ఆరంభమైంది. లింగము స్వయముగా మహేశ్వరుడు, మహాదేవి లింగావేదిక అనగా జలోకారి అవుతుంది" అని బ్రహ్మదేవుడు లింగోద్భవ వృత్తాంతం దేవతలకు చెప్పాడు.
*తరువాత కధ రేపటి భాగంలో చదువుదాం*.
🌹శ్రీకాంత్ గంజికుంట
కరణంగారి సౌజన్యంతో🌹
💜 ఓం శ్రీఉమా
మహేశ్వరాయ నమ:💜
🙏లోకా:సమస్తాః
సుఖినోభవన్తు🙏
రేపటి తరానికి బ్రతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
(సర్వం శ్రీశివార్పణమస్తు)
🌷🙏🌷
శుభమస్తు 🌹 🌷 ♥️ 🙏 స్వస్తి.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺
No comments:
Post a Comment