🚩🚩 హృదయనివాసి 🚩🚩
నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు భగవంతుడే తనకు తోడని భావించి, ద్రౌపది ఇలా పరమాత్మను ప్రార్థించింది—
"కృష్ణా! ద్వారకావాసీ! నీవెక్కడున్నావయ్యా?
నన్ను కాపాడవయ్యా!
నా మానాన్ని రక్షించు స్వామీ!"
ఆ ఆమె పిలుపు విని భగవంతుడు సహాయానికి వచ్చాడు; అయినప్పటికీ కొద్దిపాటి ఆలస్యం కనిపించింది.
ఆ తర్వాత ఒక సందర్భంలో ద్రౌపది ప్రశ్నించింది:
"కృష్ణా! నేను పిలిచిన వెంటనే ఎందుకు రాలేదు?
అది ఎందుకు కొన్ని క్షణాలు ఆలస్యమైంది?"
అప్పుడు శ్రీకృష్ణుడు మందహాసంతో ఇలా జవాబిచ్చాడు:
"నీ పిలుపుతోనే నీకు సహాయపడటానికి సిద్ధమయ్యాను.
కానీ నువ్వు నన్ను ‘ద్వారకావాసీ’ అని సంబోధించావు.
అంటే నన్ను నీవు సర్వాంతర్యామి, నీ హృదయనివాసి అని భావించలేదు.
అప్పుడే ఎలా వెంటనే వచ్చేది?
నువ్వు నన్ను ‘హృదయవాసీ!’ అని పిలిచినట్లైతే,
నీ పిలుపు వచ్చిన క్షణానికే నీ పక్కన ఉండేవాడిని."🙏
No comments:
Post a Comment