Wednesday, November 26, 2025

 📖✒️ప్రపంచ సాహిత్యంలో అత్యుత్తమ రచయిత, మానవతావాది-"లియో టాల్ స్టాయ్" గారి వర్ధంతి సందర్భంగా.....✒️📖

["*నీకు బాధ కలినట్లు అనిపిస్తే, నువ్వు ప్రాణంతో ఉన్నట్లు.. ఇతరులు పడుతున్న బాధలు కూడా నీకు బాధగా అనిపిస్తే, నువ్వు  మనిషిగా బ్రతికి ఉన్నట్లు.*"
      -లియో టాల్‌స్టాయ్

"If you feel pain, you're alive. If you feel other people's pain, you're a human being."
      -Leo Tolstoy]

#టాల్ స్టాయ్ ఓ సుప్రసిద్ధ రచయిత మాత్రమే కాదు ఓ ఉన్నత #మానవతావాదికూడా. ఆయన ప్రతి ఒక్కరితోనూ ఎంతో ప్రశాంతంగా, సహనంతో నడచుకుంటూ ఉండేవారు. తన పట్ల దారుణంగా ప్రవర్తించేవారిని సైతం మన్నించేవారు. 
గౌరవనీయమైన పెద్ద కుటుంబంలో పుట్టి  జీవితంలో #సామాన్య మానవుని కష్టాలు అనుభవించాడు.

#మహామేధావి, సంఘసంస్కర్త, ప్రపంచ ప్రసిద్ధి పొందిన రష్యన్ రచయుత టాల్ స్టాయ్. ఇతని పూర్తిపేరు నకోలోవిక్ టాల్ స్టాయ్. ఇతని కాల్పనిక రచనలలో 1869 సం.లో వ్రాసిన యుద్దం – శాంతి గొప్పనవల. 1877 సంవత్సరంలో వ్రాసిన ‘అనాక రెనీనా’ టాల్ స్టాయ్ కు కీర్తి తెచ్చిన ప్రేమ గాథ.

లియో టాల్ స్టాయ్ రష్యన్ పట్టణమైన “తుల”కు దగరలో గల యసనాయా పోలోనయ అను ఎస్టేట్ లో 09 సెప్టెంబర్ 1828న జన్మించాడు. ఇతడి తండ్రి మొదటి జార్ పీటర్ కి మిక్కిలి సన్నిహితుడిగావుండే టాల్ స్టాయ్ వంశానికి చెందినవాడు. తల్లి రెండవ కేథరిన్ రాజ్యంలో సుప్రసిద్ధ రాజనీతిపరుడైన నికోలస్ వ్లకొనస్కీ వంశానికి చెందినది. 
రష్యన్ చక్రవర్తి పీటర్ ది గ్రేట్ లియో టాల్ స్టాయ్ #ముత్తాతను 'కౌంట్' బిరుదుతో సత్కరించాడు. అలా జార్ చక్రవర్తుల దర్బారుతో టాల్ స్టాయ్ వంశీకులకు సన్నిహిత సంబంధాలేర్పడ్డాయి.

టాల్ స్టాయ్ చిన్నతనంలో తన తల్లిదండ్రులు ఇద్దరు మరణించారు. టాల్ స్టాయ్ తన దురపుబంధువుచేత పెంచిపెద్దచేయబడ్డాడు.

లియో టాల్ స్టాయ్ చిన్నతనంలో #పాఠశాలకు వెళ్లి చదువుకోలేదు అతను సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తి కనుక ఇంటివద్దనే ట్యూషన్ చెప్పించి చదివించారు. ఆతరువాత కాజాన్ యూనివర్సిటీ లో టర్కీ, అరబ్ భాషలను నేర్చుకోడానికి చేరిన ఉత్తీర్ణుడు కాలేదు. ఆతరువాత అతడు యూనివర్సిటీని వదిలి మాస్కోకు వెళ్లి అక్కడ చేదు వ్యసనాలకు బానిసగా మారిపోయాడు. ఈ సమయంలో అతని మనసు సమాజంలో సంపన్నవరాగాల జీవన విధానానికి విసుగుచెంది నిరసలోనికి జారిపోయాడు. విరక్తి తో 1851 లో ఆ దేశ  సైన్యం లో చేరాడు.
సైన్యం లో ఉంటూ ఒకవైపు పలు యుద్ధాలలో పాల్గొంటున్నా… 3 గ్రంధాలను రచించాడు వాటిలో మొట్టమొదటిది ” చైల్డ్ హుడ్ “ ఈ పుస్తకాన్ని చుసిన రష్యా డైసపు సుప్రసిద్ధ కవి నీకొలాయ్ నెక్రోసోవ్ మెచ్చుకొని యంతగానో గౌరవించాడు. ఆ తరువాత టాల్ స్టాయ్ “బాయ్ హుడ్ ” “యూత్ “ అనే కథలను పూర్తిచేసాడు తాను మొదట రాసిన ఈ 3 గ్రంధాలలో బాల్యం మరియు యవ్వన కాలాల లో ఉండే అనేక గంభీరంగా వాస్తవాలను వివరించాడు.

#టాల్ స్టాయ్ 1855లో సైన్యం నుంచి బయటకు వచ్చి పూర్తి సమయాన్ని రచనలు రాయడానికి అంకితమయ్యాడు. తన స్వస్థలానికి వచ్చి సోఫియా అండ్రివా బేర్స్ ను వివాహమాడి సంతోషంగా చాల సృజనాత్మకమైన జీవిత్తాన్ని గడిపాడు. అలాగే తన ఎస్టేట్ లో పేద రైతులకు వారి స్థితిగతులను అభివృద్ధి చేసాడు, పిల్లలకు పాఠశాలలను నిర్మించాడు. ఆ పాఠశాలలో తాను స్వయంగా పాటలు భోధించేవాడు. ఈ సమయంలో తన సుప్రసిద్ధ “వార్ అండ్ పీస్ ” (1863-1869) రచించాడు దీనిలో యుద్ధం వలన సామాన్యుల పై పడే ఫలితాలను వివరించాడు. ” అన్నకారేనేనా ” (1873-1877) అనే విషాదమైన ప్రేమకథ ను కూడా రచించాడు. ఇతని సుప్రసిద్ధ నవల “రెసారెక్షన్” (1899) ఆధ్యాత్మక చింతనతో కూడినది. అపూర్వమైన ఈ మూడు రచనలలోనూ మానవ మనుగడను అవగాహనా చేసుకొనుటకు రచయిత చేసిన తీవ్రమైన పరిశోధన కనిపిస్తుంది.
టాల్‌స్టాయ్ కంటే ముప్పై సంవత్సరాల ముందు మరణించిన ఫ్యోడర్ దోస్తోవ్స్కీ , టాల్‌స్టాయ్ యొక్క నవలలను మెచ్చుకున్నాడు మరియు ఆనందించాడు.

1901, 1902, 1909 #సంవత్సరాల్లో నోబెల్ శాంతి బహుమతి కోసం అతని పేరు ప్రతిపాదించబడింది. కానీ ఒక్కసారి కూడా ఆయనకు బహుమతి రాలేదు.

#టాల్ స్టాయ్ ఆఖరి నవల "హాజీ మురాద్":

               భీకర యుద్ధం! తుపాకులు పేలుతున్నాయి. సైనికులు నేలకోరుగుతున్నారు. ఇరుపక్షాలది ఒకటే లక్ష్యం! ఎదుటివారిని ఓడించాలి. తామే విజయభేరి మోగించాలి. ఓ పక్షంలో వేల సైనికులు! మరో పక్షంలో కేవలం ఐదుగురు! అయినా తామే గెలుస్తామన్న నమ్మకం. వారి నాయకుడు హాజీమురాద్! అదే వారి ధైర్యం.

#లియో టాల్ స్టాయ్ లేఖకు వేలంలో రూ.13.94 లక్షలు:

ప్రఖ్యాత రష్యా రచయిత లియో టాల్‌స్టాయ్‌ రాసిన అరుదైన లేఖ వేలంలో రూ.13.94 లక్షలు (21,450 డాలర్లు) పలికింది. దీనిపై టాల్‌ స్టాయ్‌ సంతకముంది. 

#తాను రాసిన పుస్తకాలు ప్రపంచమంతా హాట్ కేక్స్ లాగా సేల్ అవుతున్నా, ఆయన కాపిరైట్ కూడాతీసుకోలేదు.

#వృధాప్యం సమీపిస్తున్నకొద్దీ ఇతనిలో ధనం, ఆస్తి, ప్రభుత్వం, మరియు నియమనిభందణలతో కూడిన ధర్మం, అనేవి మనిషిని దుర్మార్గునిగా చేస్తాయి అనే భావం అలుముకుంది. తాను ఒక సాధారణ మనిషిగానే జీవించాలి అనే నిర్ణయానికి వచ్చాడు కానీ అప్పటికే తనకు కావలసినంత ఆస్తి సమాజంలో మంచి పేరు సకల స్వకార్యాలు ఉన్నకారణంగా తన భార్య అందుకు ఒప్పుకోలేదు. వృద్దుడైన టాల్ స్టాయ్ తన వైదునితో తన చిన్నకుమర్తిను వెంటబెట్టుకొని ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. ఈ ప్రయాణం మధ్యలో న్యూమోనియా జ్వరం తో 20నవంబర్ 1910 లో ఒకచిన్న ఆష్టాపోవో అనే రైల్ స్టేషన్ లో మరణించాడు.

టాల్ స్టాయ్ తన #ఆశయాలను కధలుగా, నాటకాలుగా, వ్యాసాలుగా, రచించాడు. దుర్మార్గులైన పాలకులను, పరిపాలన విధానాలను విమర్శిస్తూ సమాజాన్ని మేల్కొలుపుటలో ముఖ్య పాత్ర పోషించాడు. గ్వరవనియ్యమైన గొప్ప కుటుంభంలో పుట్టి ఆస్తి అంతస్తు గొప్ప పేరు సంపాదించి స్వార్ధంతో గాక తన జీవితాన్ని మనకు మాదిరిగా చూపిన గొప్ప రచయిత టాల్ స్టాయ్.

#టాల్ స్టాయ్ జీవితం మనకు ఒక గొప్ప పాఠం, సమాజానికి నీ చదువు, ఆస్తి అంతస్తు పలుకుబడికన్నా నీ జీవన విధానం ( పద్దతి ) చాల ప్రభావం చూపుతుంది. చెప్పడం మాత్రమే కాదు చేసి చూపాలి అదే మన జీవితాలను సార్ధకం చేస్తుంది.ప్రపంచ సాహిత్యంలో అత్యుత్తమ రచయిత టాల్ స్టాయ్"  అన్నారు పండితులు. ఆయన 'యుద్ధము - శాంతి', 'అన్నా కరేనినా' చదివని నవలా ప్రియులుండరు.
🙏🙏🌷🌺🌹🙏🙏
Collected by
Dr.A.Srinivasa Reddy
9912731022
Zphs 75 Tyallur,
Pedakurapadu mandal, Palanadu district.

No comments:

Post a Comment