Wednesday, November 26, 2025

 సృష్టి నియమం..
సృష్టిలో సమస్యలు 
లేని జీవి లేదు...
శూన్యం సైతం 
తన ఉనికి కోసం... పోరాడాలి.
ఆకు రాలని చెట్టూ లేదు,
తన్నుతాను తెలుసుకొని గెలవని రాయి లేదు.
ఎంతటి సమస్య నైనా,,,
పరిష్కరించుకునే ప్రాణి కూడ లేదు ...
మనిషి పరిష్కారాలకై తపించే అసంపూర్ణ జీవి...
ప్రతి విజయమూ ఓ పరిష్కారం కాదు...
కేవలం తాత్కాలిక
 ఉపశమనం....
 పోరాటానికి సన్నాహం...
గుర్తింపు రహస్యం...
జీవితం నిండా 
జీవం లేని అడ్డంకులే...
ఆశయాన్ని అడ్డగించే
 నిశ్చల శిలలు...
ప్రాణమున్న మనిషి
 గమనం ఆపాలని...
కాలం వేసిన నిశ్శబ్ద
 సవాళ్లు ...
అప్పుడే ...
ఈ జీవం లేని సమస్యలను ఎదుర్కొంటున్నప్పుడే,,,,
ప్రాణమున్న మనకు గుర్తింపు,,,,
ఆ శిలను చెక్కిన 
శిల్పం
 మనదే..
ఆ సవాలును 
దాటిన 
ప్రయాణం మనదే...
సమస్యల సముద్రంలో
 మునగడం కాదు వీరత్వం..
మునగకుండా పడవ నడపడమే ...
అస్తిత్వ వేట...
నిన్నటి చింత...
నేటి చిరునవ్వుకు వారధి..
రేపటి భయం..
నేటి పోరాటానికి ఇంధనం...
సమస్య లేకపోతే మనిషి
 జీవించి ఉండడు..
పోరాటం 
లేకపోతే నిజమైన మనిషి గుర్తించబడడు...
సమస్య-పరిష్కారం, 
ఒక చక్రభ్రమణం..
 ఆగితే జీవితానికే విరామం...
శ్రమకు ఓదార్పు ఇచ్చే శక్తి
 కాదు కావాల్సింది..
శ్రమను ప్రేరేపించే శక్తే
 జీవన సత్యం...
నువ్వు నిలబడాలంటే,
 సమస్య 
నీ ఎదురుగా 
నిలబడాలి..
Bureddy blooms.

No comments:

Post a Comment