Saturday, November 1, 2025

 *_🦚 శ్రీరమణమహర్షి 🦚_*
꧁┉┅━❀🔯❀━┅┉꧂
*_🧘🏼‍♂️ భక్తుడు : భగవాన్ ! విధి (పూర్వజన్మల కర్మల ఫలం) అనేది ఉన్నదా ? ఏది ఎట్లా జరుగవలెనని ఉన్నదో అట్లాగే జరిగేటట్లయితే ఇక మన ప్రార్థనల వలన ప్రయత్నాల వలన ప్రయోజనం ఏమైనా ఉన్నదా ?_*
*_🦚 శ్రీరమణమహర్షి : ఉన్నది. అందుకు రెండు మార్గాలు. మొదటిది విధిని జయించడం. రెండవది వాని నుంచి స్వతంత్రంగా ఉండడం._*

*_🦚 మొదటిది : (ఆత్మ) విచారణ మార్గం. (జ్ఞాన మార్గం) ఈ విధి ఎవరికి ? అని విచారించి, అహం మాత్రమే విధికి లోబడి ఉన్నదనీ.. ఆత్మకు, విధి అన్నదే లేదనీ... నిజానికి అహంకారానికి అసలు ఉనికే లేదని తెలుసుకోవడం !_* 

*_🦚 రెండవది : శరణాగతి మార్గం. (భక్తి మార్గం)_* 
*_తన నిస్సహాయతను గుర్తించి ఎల్లవేళలా "భగవంతుడా ! నీవే సర్వమూ, నేనుకాదని అనుకుంటూ నేను-నాది అన్న భావాన్ని వదలి, నిన్ను దైవానికి ఇష్టమైన విధంగా చేసుకోమనీ,_* 
*_అహాన్ని త్యజించి దైవానికి శరణాగతి కావడం. కానీ దైవం నుండి అది కావాలి, ఇది కావాలి అని అనుకున్నంత కాలం శరణాగతి పూర్ణం కాదు. దైవం ఎడల అనన్య భక్తియే శరణాగతి._*
*_"విధిని జయించడానికి అహంకార నాశనం అత్యవసరం. అది నీవు విచారమార్గం ద్వారా అందుకున్నా, భక్తి మార్గం ద్వారా సాధించినా ఒకటే "!!_*
*_🧘🏻 ఓం నమో భగవతే_* 
*_శ్రీరమణాయ 🧘🏻‍♀️_*
                  *_అరుణాచల శివ.._*
                  *_అరుణాచల శివ.._*
                  *_అరుణాచల శివ.._*
                  *_అరుణాచలా...!_* 
🙏🇮🇳🎊🪴🦚🐍

No comments:

Post a Comment