కార్తీక మాసంలో శ్రవణ నక్షత్రం ఉన్న రోజును కోటి సోమవారమని అంటారు...
శ్రవణ నక్షత్రం కలిసివస్తున్న ఈ రోజు ఉపవాసం చేస్తే కోటి సోమవారాలు ఉపవాస ఫలితం దక్కుతుంది.
ఈ 2025 సంవత్సరం #కోటిసోమవారం
శ్రవణ నక్షత్రం ప్రారంభం: అక్టోబర్ 29, 2025 సాయంత్రం 05:29 గంటలకు (సుమారు)
శ్రవణ నక్షత్రం ముగింపు: అక్టోబర్ 30, 2025 సాయంత్రం 06:33 గంటలకు (సుమారు)
మన పురాణాలు మరియు సంప్రదాయాల ప్రకారం ఏ తిథి అయిన సూర్యోదయం తర్వాతే ప్రామానికంగా తీసుకోవాలి. కావున ఈ 2025 సంవత్సరం కోటి సోమవారం అక్టోబర్ 30 గురువారం రోజున జరుపుకోవాలి.
ఈ కోటి సోమవారం రోజున శివాలయ సందర్శనం, అభిషేకం, ఉపవాసం లేదా నక్తం లేదా ఏకభుక్తం ఎవరి శక్తి అనుసారం వారు చేస్తే మంచిది. అదేవిధంగా ఈ రోజు దీపారాధన, ఆకాశదీప దర్శనం, దానాలు, ధర్మాలు చేస్తే ఆ ఫలితం రెట్టింపు అవుతుందని శాస్త్ర ప్రవచనం.
అందుకే ఈ అక్టోబర్ 30 న వచ్చే కోటి సోమవారం రోజు ఉపవాసం ఉండి ఆ పరమేశ్వరుడి అనుగ్రహం పొందండి.
కోటి సోమవారం అయిన రోజున ఉదయం శివాలయానికి వెళ్లి శివునికి అభిషేకం చేసి ఉపవాసం ఉండాలి. సాయంత్రం ప్రదోష కాలమందు భక్తుల ఇంట్లో దీపారాధన చేసి పూజ ముగించుకుని శివాలయానికి వెళ్లి మరోసారి ఈశ్వరుడిని దర్శించుకోవాలి. ఆలయంలో దీపారాధన చేయాలి.
అనంతరం ఇంటికి వచ్చి భోజనం చేస్తే కోటి సోమవారాలు ఉపవాసమున్న పుణ్య ఫలితం లభిస్తుందని శాస్త్రాలు చెప్తున్నాయి.
కోటి సోమవారం నాడు ఉపవాసం ఉండి నియమ నిష్టలతో కోటి సోమవారం దీక్ష పూర్తి చేస్తే స్వామివారి అనుగ్రహం పొందుతారని ప్రతీతి.
ఉపవాస దీక్ష చేపట్టిన భక్తులు ఓం నమఃశివాయ పంచాక్షరితో భక్తి ప్రపత్తులతో ఉపవాసం చేయాలి.
ఈ కార్తీకమాసం మహత్యాన్ని మొదటగా వశిష్ట మహర్షి జనక మహరాజునకు వివరించగా శౌనకాది మునులకు సూతుడు మరింత వివరంగా చెప్పాడు. ఈ మాసంలో ప్రతీరోజూ పుణ్యప్రదమైనదే. కార్తిక మాసంలో అర్చనలు, అభిషేకాలతో పాటు స్నానాదులు అత్యంత విశిష్టమైనదే. నదీ స్నానం, ఉపవాసం, దీపారాధన, దీపదానం, సాలగ్రామ పూజ, వన సమారాధనలు ఈ మాసంలో అచరించదగ్గ విధులు. కార్తిక మాసంలో శ్రీమహా విష్ణువు చెరువులలో, దిగుడు బావులలో ,పిల్లకాలువలలోనూ నివసిస్తాడు. అందుకే ఈ మాసంలో వాపీ, కూప, తటాకాదులలో స్నానం చేయడం ఉత్తమం. కుదరని పక్షంలో సూర్యోదయానికి ముందే మనం స్నానం చేసే నీటిలో గంగ, యమున, గోదావరి, కృష్ణ, కావేరి, నర్మద, తపతి, సింధు మొదలైన నదులన్నింటి నీటిలో స్నానం చేస్తున్నట్లు భావించాలి.
ఓం నమో శివకేశవాయ
🙏 ఓం నమఃశివయ 🙏
No comments:
Post a Comment