Monday, November 24, 2025

 అమ్మ-తరువు.

ఒకరు బ్రతుకు నిచ్చేది,
 మరొకరు బ్రతకనిచ్చేది,
వీళ్లు లేకుంటే ఈ సృష్టి లేదు..
జీవనం లేదు...

 బ్రతుకు నిచ్చేది
నువ్వు ...
గర్భంలో 
నవమాసాలు మోసి,
 బ్రతుకు నిచ్చావు...
మొదటి శ్వాస,
 మొదటి పలుకు నువ్వే,
మా ప్రాణం లోకి ప్రాణం పోశావు..

నెలవుగా  నీ ఒడి,
 అమ్మ ప్రేమ వీడి,
ఎదిగే కొద్దీ నేర్చుకున్న పాఠాలు అన్నీ...
క్షమ,
 త్యాగం, 
అనురాగం నీ రూపం,
ప్రేమతో లోకాన్ని చూపి
 మొదటి గురువు నువ్వు...
కన్నీరు కనబడకముందే,
 కడుపు చూసే తల్లి..
నీ ఉనికి లేని లోకం
 ఊహకు అందనిది..

  బ్రతకనిచ్చేది తరువు
 నిలబడి బ్రతకనిచ్చే
 తరువు...
ఆకుపచ్చని 
రంగుతో భూమికి శోభ...
గాలి స్వచ్ఛత నింపి...
 శ్వాస నిచ్చావు...
నీ ఆశ్రయం లేకుంటే..
 కదపలేము అడుగు.

ఎండకు గొడుగు,
 వానకు నివాసం..
నిస్వార్థంగా
 పంచి ఇచ్చే 
నీ పచ్చని హృదయం...

పండు ఇస్తావు... 
పువ్వు ఇస్తావు, 
నీడ ఇస్తావు..
జీవన చక్రాన్ని తిప్పే
 మూల కారణం నువ్వు...
కట్టెలై కాలిపోయినా..
 కట్టడానికి నిలిచినా..,
నీ త్యాగం విలువ
 కట్టలేనిది.

అమ్మ 
తరువు
 సృష్టిలో ...
రెండు శక్తి రూపాలు..

ఒకరు మనల్ని కంటారు,
 మరొకరు మనల్ని..
 కాపాడతారు.

రెండు మహత్తుల
 సంరక్షణలోనే...
మనిషి జీవితం..
 ధన్యమై 
ముందడుగు వేస్తుంది.
Bureddy blooms.

No comments:

Post a Comment