Tuesday, November 4, 2025

 *కాకర కాయ.*
                
*కాకర  కాయ  జ్యూస్ తాగండి.. ‘వంద’రోగాలను తరిమికొట్టండి.*
```
కాకరకాయ  రసం చేదుగా ఉన్నా.. ఈ చేదే ‘ఎన్నో ఔషాధాల సమ్మేళనం!’ అని వైద్యులు నొక్కి వక్కాణిస్తున్నారు.   

ఎన్నో ఔషధ ప్రయోజనాలు దాగి ఉన్న కాకరకాయను పండు వలే సేవించమని సలహా ఇస్తున్నారు.

కాకరకాయ  జ్యూస్‌ను  రోజూ తాగితే డయాబెటిస్‌ను అదుపులో ఉంచుకోవచ్చని తెలిసిందే. కాకరకాయ జ్యూస్‌ను రోజూ ఉదయాన్నే పరగడుపునే తాగడం వల్ల రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలు కంట్రోల్ అవుతాయి. కాకరకాయ జ్యూస్‌లో ఉండే ఔషధ గుణాలు ఇన్సులిన్‌లా పనిచేస్తాయి. అందువల్ల షుగర్ స్థాయిలు అదుపులో ఉంటాయి.

అనారోగ్య సమస్యలను తగ్గించడంలో అయితే కేవలం షుగర్‌నే కాదు, పలు ఇతర అనారోగ్య సమస్యలను తగ్గించడంలోనూ   కాకరకాయ జ్యూస్ ఉత్తమంగా పనిచేస్తుంది. 

ఈ క్రమంలో కాకర జ్యూస్‌ను రోజూ తాగడం వల్ల ఇంకా ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..```

*1. ”పరగడుపునే తాగితే":*```
కాకరకాయ జ్యూస్‌ను రోజూ ఉదయాన్నే పరగడుపునే తాగితే అధిక బరువు తగ్గుతారు. శరీరంలో అధికంగా ఉన్న కొవ్వు కరిగిపోతుంది. జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. జీర్ణాశయం, పేగులు శుభ్రమవుతాయి. కాకరకాయల్లో సమృద్ధిగా ఉండే ఫైబర్ మలబద్దక సమస్యను పోగొడుతుంది. గ్యాస్, అసిడిటీ, అజీర్ణం ఉండవు.
```
*2. “శరీరాన్ని శుభ్రం చేస్తాయి:”*
```
కాకరకాయలో ఉండే ఔషధ పదార్థాలు శరీరంలోని విష, వ్యర్థ పదార్థాలను బయటకు పంపి శరీరాన్ని శుభ్రం చేస్తాయి. చర్మం కాంతివంతంగా, మృదువుగా మారుతుంది. శిరోజాలు దృఢంగా మారుతాయి. కాకరకాయ జ్యూస్‌ను రోజూ తాగడం వల్ల శరరీంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ పోయి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. గుండె సమస్యలు రావు.*```

*మన ఈ గ్రూపులలో పెట్టే సమచారమంతా*
*సభ్యులకు అవగాహన కొరకు మాత్రమే!ఇవి డాక్టర్స్ కు ప్రత్యామ్నాయం కాదు.*
*మీ సమస్యలన్నిటినీ మీ డాక్టర్ ని సంప్రదించి వారి సలహామేరకు వైద్యం పొందుట మంచిది.*

*మా ద్వారా వచ్చే మెసేజ్ లన్నీ….సేకరించినవి, ఫార్వర్డెడ్ మెసేజస్ మాత్రమే!* 

. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
                   🌷🙏🌷```

No comments:

Post a Comment