#వసుధ
వసుధకు పెళ్లయి చాలా ఏళ్లయినా పిల్లలులేరు ... భర్త ఎక్కడికి రమ్మంటున్నా భర్తతోపాటుగా వెళ్ళదు ఏదో ఒక కారణం చెప్పి భర్తతో కలిసి ఎక్కడికి వెళ్లకుండా తప్పించుకుంటుంది ...
రానురాను అలా తప్పించుకోవడం ఎక్కువైపోయింది... శరత్ ఒకసారి
వసుధను గట్టిగా అడిగితే ...
శరత్ తో వసుధ నాకు పిల్లలులేరనే విషయం ప్రతివాళ్లు నా మొహానే గుర్తుచేయడం నాకిష్టం ఉండదని అక్కడికివెళ్లి ప్రతివాళ్ళతో అలా మీకింకా పిల్లలులేరా అని అనిపించుకుంటూ ఇబ్బందిపడటం నాకిష్టంలేదని ఒక్కమాటలో చెప్పేది ...
వసుధ ప్రవర్తనతో శరత్ విసిగిపోయాడు ...
ఒకరోజు బాగా ముఖ్యమైన ఫంక్షనోకటి ఉండడంతో వసుధను కూడారమ్మని అడిగాడు శరత్ వసుధ ఎప్పటిలాగే చెప్పి తప్పించుకోవాలని చూస్తుంది ...
శరత్ కి ఆ విషయం అర్థమయింది ఎన్ని రోజులని ఇలాగే ఇట్లాగే ఉండిపోవాలని నిర్ణయించుకున్నావు అదికూడా చెప్పు అనరిచాడు కోపంగా ... కోపం తగ్గించుకొని నెమ్మదిగా బ్రతిమిలాడుతున్నట్టుగా మాట్లాడుతూ శరత్ వసుధతో ...
నేను ఈ ఫంక్షన్ కి రమ్మంటున్నది ...నేను పనిచేస్తున్న ఆఫీస్ బాస్ అవడంతో నిన్నింతగా బతిమాలాల్సి వస్తుంది ... లేదంటే ఎప్పటిలాగా ఒక్కడినే వెళ్లి వచ్చేవాడిని అని అంతలోనే సహనం లేక మళ్లీ అరిచినట్టుగా మాట్లాడడంతో మాటమాటా పెరిగిపెద్దదైన ఆ గొడవతో మొదటిసారిగా శరత్ వసుధను చేయిచేసుకునేవరకు వెళ్ళింది ...
ఉన్నట్టుండి ఊహించని విధంగా శరత్ ఒక్కసారిగా అలా వసుధమీద చేయిచేసుకోవడంతో వసుధ ఎక్కిళ్ళుపెట్టి పెద్దగాఏడ్చింది శరత్ చేసినపనికి ...
బాగాకోపంతో అసలే అసహనంగా ఉన్న శరత్ కి చిరాకనిపించి అక్కడనుండి వెళ్ళిపోయాడు...
శరత్ అలా చేయిచేసుకుని వెళ్లడంతో వసుధకు దిగులుగా అనిపించింది కన్నీళ్లు ఆగలేదు ... ఏదో తెలియనీరసంగా... శరత్ చేసిన పనికి మనసంతా బాధగా ఉండడంతో, వసుధ వంటచేసుకోలేదు కడుపులో ఆకలికి పేగులు మేలిపెడుతున్నట్టుగా అనిపించింది ... ఆకలి బాధ మహాదారుణం ...
అదే ఆకలివేయలేదంటే ఏమి తినాలనిపించదు... దారుణంగా ఆకలివేస్తే ... ఆ ఆకలిని ఆపుకోవాలంటే చాలా కష్టం అలా ఆకలిని చంపేసుకుంటూ కూడా ఉండిపోయేలాంటి ఆ బాధే మిగిలిందని అనిపించింది వసుధకి తన జీవితంలో ... అందుకే ఖాళీ కడుపుతో అలా పడుకుండిపోయింది ...
శరత్ అలా చేసినందుకు బాధతో పాటుగా ...
ఎప్పుడూ లేనంతగా ఏదో తెలియని నీరసంకూడా వెంటాడుతుంది... కొంతసేపటి వరకలా ఆకలిని అదిమేసుకుంటూ ముడగసుకొని పడుకుంది ...
అది చాలా కష్టమనిపించింది ... ఇక ఆకలికి ఆగలేననిపించి ... ఆకలికిఆగలేని వసుధ ఏమైనా చేసుకుతిందామని లేస్తూనే వసుధ కళ్ళుతిరిగి స్పృహతప్పి కిందపడిపోయింది ...
అప్పుడే వసుధని చూడడానికి వచ్చిన బెస్ట్ ఫ్రెండ్
రమకి నేలమీద పడిపోయి ఉన్న వసుధని కదిపి చూసింది ... ఎలాంటి స్పందనా లేదు ... రమకేమో
వసుధ పరిస్థితిచూసి చాలా భయంవేసింది... ఒక్క క్షణం కూడా వేరే ఏమీ ఆలోచించకుండా గబగబా తానే స్వయంగా కార్ డ్రైవ్ చేసుకుంటూ వసుధని హాస్పిటల్ కి తీసుకువెళ్ళింది రమ ...
శరత్ అక్కడ బాస్ పిలిచిన ఫంక్షన్కు వెళ్ళాడన్నమాట కానీ వసుధే గుర్తొస్తుంది ...
నేనలా చేసి ఉండకూడదు ... వసుధ పైన చేయిచేసుకుని ఉండకూడదు శరత్ ఇలా అనుకోవడం వందోసారి ...శరత్ అలా అదే ఆలోచనలో ఉండిపోయి డల్ గా ఉండడంతో
అది గమనించిన శరత్ బాస్ శరత్ కి దగ్గరగా వచ్చి ఎందుకలా ఉన్నావని అడిగాడు ? ...
ఇంతకు మీ వైఫ్ ఎక్కడ పార్టీకి రాలేదా ? అని కూడా అడిగాడు ... లేదు తనకి ఒంట్లో బాలేదని చెప్పి ఆ కారణంతోనే త్వరగా వెళ్ళాలి నేను అని చెప్పేసి అక్కడినుండి వచ్చేసాడు శరత్ ... అలా వస్తు దారి మధ్యలో వసుధ గురించి ఆలోచిస్తుంటే తానెంత బుద్ధితక్కువ పనిచేశాడని పూలీష్ గా అనిపించింది శరత్ కి తాను చేసినపని తనకే ...
ఇంటికి ఎలా వచ్చి చేరాడో శరత్ కే తెలియదు ...
చాలా వేగంగా వచ్చేసాడు ... ఎప్పుడైనా అర్జెంటు పని ఉండి ఇలా వస్తే వసుధకు తెలిస్తే చాలా కోప్పడుతుంది దిగులుపడుతుంది ... మనకంటూ మన ఇద్దరమే మిగిలాము ... మీ వాళ్లకు మా వాళ్లకు దూరంగా ...మనకి పిల్లలుకూడా లేరు ... నువ్వు ఇలాంటివన్నీ చేసి ఏదైనా ప్రమాదం కొనితెచ్చుకుంటే నా పరిస్థితి ఏం కాను నేను ఒంటరి దాన్నయి పోతాను శరత్ ... నువ్వు లేకుండా నేనేం చేయాలి శరత్ అని ఏడ్చేస్తుంది వసుధ చిన్నపిల్లలాగా ... అవే
గతంలోని తమ జీవితంలోని ఆలోచనలు మరింతవేగంగా శరత్ మనసుని కమ్మేస్తున్నాయి...
తామిద్దరం ఒకరినొకరు ఇష్టపడి పెద్దవాళ్ళ అనుమతి లేకుండా పెళ్లిచేసుకొని వాళ్ళందరికీ దూరంగా వచ్చేసినతరువాత ... మొదట్లో నాకు ఏ జాబ్ లేనప్పుడు ... వసుధ ఏ కదా జాబ్ చేస్తూ ఇంటిని సరిదిద్దుకుంటూ అప్పటికి ఎంత ప్రయత్నిస్తున్నా జాబ్ దొరకగా నాకు మూర్ఖంగా వచ్చే కోపాన్ని సరి చేస్తూ ... ఇన్నేళ్లుగా జాబ్ చేస్తూ ఇప్పుడు తన మనసుకు ప్రశాంతతలేకే ఆ జాబ్ మానేసి ... కేవలం మానసిక ప్రశాంతతకోసం ఇంట్లోఉంటుంటే ... తాను ఎందుకు ఆ జాబ్ మానేయాల్సి వచ్చిందోనని నాకు ఆ కారణం వివరించి చెప్పినా ...
నేనది అర్థంచేసుకోకపోగా తనమీదే చేయి చేసుకోవడమంటే నామీద నాకే అసహ్యంగా అనిపిస్తుంది శరత్ అలా అనుకుంటూ ఆ ఆలోచనలతోనే ఇల్లుచేరాడు ... ఇంటికి వచ్చిన తరువాత మూసిఉన్న తలుపులవైపు చూసిన శరత్ కి అవి లాక్ చేసి ఉండడంతో... వసుధ ఇంట్లో లేక పోవడం ఏమిటి ...అసలు ఏమైందోనని శరత్ కి గుండె గుభీలుమంది ...
వసుధ ఎక్కడికి వెళ్లింది ? ...
ఇల్లు ఇలా లాక్ చేసుకొని తనకో మాటచెప్పకుండా ఎప్పుడూ ఎక్కడికివెళ్ళదు ... శరత్ మనసంతా ఆందోళనే నిండిపోయింది ... ఏదో తెలియని భయం పిచ్చిపిచ్చి ఆలోచనలు ఆ ఊహలతో శరత్ అక్కడ నిలబడలేక ఇంటి ముందున్న మెట్లమీద అచేతన స్థితిలో కూర్చుండిపోయాడు ...
మనుషులు దగ్గరగా ఉన్నప్పుడు ఏ విలువా తెలియదు ...దూరమయ్యాకే అన్ని విలువలు తెలుస్తాయి కొంతమందికి ... ఇప్పుడు శరత్ కూడా అంతే ... వసుధ గురించితప్ప ఏదిఆలోచించలేక పోతున్నాడు ...ఏదోతెలియని భయం చుట్టూ ముట్టేసింది శరత్ ని ...ఫోన్ చేసిచూశాడు ... ఫోన్ రింగ్ అవుతూ తనకిదగ్గరగా వినిపిస్తుందా శబ్దం ...
వసుధ ఫోన్ ఇంట్లో ఉండటం ...ఆ ఫోన్ శబ్దం ఇంట్లో నుండే వినిపిస్తుంటే వసుధ తన ఫోన్ తనతోపాటుగా తీసుకువెళ్ళలేదా శరత్ లో భయంకంగారు ఆందోళన అన్ని రకాలుగా ఏమీ ఆలోచించలేకుండా మనిషిని భయంతో నిలువెల్లా వణికిపోయేలాగా చేశాయి ... నేను చెయ్యిచేసుకున్నందుకు వసుధ ఏమైనా ? ... భయంతో ఇంకక్కడి నుంచి ఒక్క ఆలోచనకూడా ముందుకు చేయలేకపోయాడు ...
మనసులో భగవంతునికి ఎన్నోసార్లు వేడుకున్నాడు వసుధ నా కళ్ళకుకనిపిస్తే ఇంకెప్పుడూ ఇలా చేయనని కనిపించని దేవుళ్లకు మొక్కుకుంటూ
అలా కొంతసేపటివరకు వేచిచూశాడు. ఏమీఅర్థం కావడంలేదు ఇంకా వసుధగురించి ఆలోచిస్తూనే...
వసుధను వెతకడానికి బయలుదేరాడు శరత్... ఎవరి దగ్గరకైనా ఫ్రెండ్ ఇంటికైనా వెళ్ళిందేమో ఫోన్ చేసి అడుగుదామని అనుకున్నవాడల్లా... నేనీలా కంగారుగా వాళ్ళనడగడంతో ఏం జరిగిందని వాళ్ళు అడిగేప్రశ్నలకు వాటికిసమాధానాలు చెప్పలేను ఈ పరిస్థితుల్లో ... కొంతవరకు వెతికినతరువాత ఆ పని చేద్దామనుకుంటూ వసుధ ఎక్కడికివెళ్లిందో తెలియక సతమతయిపోయాడు శరత్ ...
అక్కడ హాస్పటల్లో రమకూడా అంతే కంగారుపడింది వసుధగురించి డాక్టర్ చెక్ చేసిన తర్వాత మంచి శుభవార్త చెప్పారు వసుధకు మెలకువ రాగానే...
ఆ విషయం చెప్పగానే తన బెస్ట్ ఫ్రెండ్ ని కౌగిలించుకున్నంత పని చేసింది రమ ... వసుధని రమ శరత్ గురించి అడగగానే వాళ్ళ బాస్ ఇస్తున్న పార్టీకి వెళ్లాడని రమతో చెప్పిన వసుధ ముందుగా శరత్ కి ఈ విషయం చెప్పాలి నేను ఫోన్ చేసి అర్జెంటుగా ఈ విషయం చెప్పాలి అని ఫోన్ కోసం చూసుకుంటూ ఉంటే ...
రమ వసుధతో నీకే స్పృహ లేనప్పుడు నీ ఫోన్ నీ దగ్గర ఎలా ఉంటుంది ? .. ఆ కంగారులో నాకు ఏం చేయాలో అర్థంకాక ముందు నిన్నీలా హాస్పిటల్కు తీసుకువచ్చాను ...
శరత్ కి నీకు మీ ఇద్దరికీ మీ ఆశలు ఎదురుచూపులు ఫలించాయి నువ్విక ఏ బాధపడక్కర్లేదు పదిమంది లోకి వెళ్ళినప్పుడు ఎవరైనా ఏమైనా అంటారని ఆలోచించక్కర్లేదు ...' బిడ్డలు లేని గొడ్రాలని ఎవరైనా అంటారేమో అని నీకు నువ్వు మానసికంగా శిక్ష వేసుకొని శరత్ ని కూడా హింసించకు ... నీ బాధ చూసి శరత్ ఎవరైనా పిల్లల్ని అడాప్ట్ చేసుకుందామనే విషయంలో జరిగిన ఆ పెద్దగొడవను కూడా మీరిక వదిలేయవచ్చు ...ఇక మీకిలాంటి బాధలకు కాలం చెల్లిపోయిందంటూ సంతోషంగా తన ఫ్రెండ్ వసుధని కౌగిలించుకొంది రమ ...
రమతో వసుధ అవును నేను ఎంతో బాధపడి ఈ విషయంలోనే చాలాసార్లు ఇలాగే బాధపడి శరత్ ని అసహనానికి గురిచేసి మొదటిసారిగానన్ను కోపంలో శరత్ చేయిచేసుకునేలా చేశాను... శరత్ కి బయట ఉండే టెన్షన్లు ఆఫీస్వి ఉంటుంటాయి కదా ... అంది రమతో వసుధ దిగులుగా ...
నువ్విక దిగులుపడకూడదు అని చెప్పింది రమ చెప్పినమాటలకు సరే అనిచెప్పింది వసుధ...
శరత్ నీ కూడా నువ్వు అర్థం చేసుకోవాలి వసుధా అంది రమ ... రమ చెప్పిన మంచిమాటలకు ...
అవునే రమా ...నేను కూడా శరత్ ని అర్థం చేసుకోవాలిసింది అని అంటూనే శరత్ కి ఎప్పుడెప్పుడు ఈ విషయం చెబుతానని ఆత్రుతగా ఉంది ..శరత్ కి ఈ విషయం చెప్పడానికి మనం త్వరగా ఇంటికివెళ్దామని ,డాక్టర్ జాగ్రత్తగాఉండాలని చెబుతూ..ఇచ్చిన ఆ అడ్వైస్లని తీసుకొని ఇంటికి బయలుదేరారు వసుధా ... రమ ...
ఇంటికివెళ్లి శరత్ ఇంటికివచ్చిన తర్వాత నేరుగా ఈ విషయం చెప్పి సంతోష పడాలనుంది వసుధకు కానీ అంతవరకు ఆగలేకపోయింది ... దారిమధ్యలో రమ ఫోన్ తీసుకొని రమా ఫోన్ నుండి శరత్ కి ఫోన్ చేయడానికి చూసింది వసుధ ...
చార్జింగ్ తక్కువగా ఉన్న ఫోన్ తో శరత్ వసుధని వెతకడంలో బిజీగా ఉండి చూసుకోక శరత్ ఫోన్ పూర్తిగా చార్జింగ్ అయిపోవడంతో స్విచ్ ఆఫ్ అయి పోవడంతో వసుధ శరత్ తనమీద కోపంతో ఆ పని చేశాడనుకుంది ...
ఇంటికివచ్చిన తర్వాత రమా ఏం జరిగిందని అడిగితే ... ఆ జరిగిన విషయం అంతా రమతో మొత్తం పూసగుచ్చినట్టు చెప్పింది వసుధ ... అయితే నేను శరత్ వచ్చేవరకు ఉండే శరత్ వచ్చిన తరువాతే నేను మా ఇంటికి వెళ్తానని రమచెప్పడంతో ... వసుధ రమతో ...
అలా వద్దులే రమా ఇంటిదగ్గర పిల్లలు నీకోసం ఎదురు చూస్తుంటారు నువ్వు ఇలా రావడం... కరెక్ట్ గా టైం కి హాస్పటల్ తీసుకువెళ్లి నీ ద్వారా ఈ విషయం మంచిగా నాకు తెలియడం ఇది చాలులేవే అంటూ రమను సున్నితంగావారించి పిల్లల కోసమని ఇంటికి పంపేసి శరత్ కోసం ఆలోచనలతో ఎక్కడికి వెళ్లి ఉంటాడు శరత్ అని గడ్డం కింద చేయి పెట్టుకుని దీర్ఘాలోచనలో శరత్ గురించే ఆలోచిస్తూ ... శరత్ ఇంటికి ఎంత త్వరగావస్తే అంతబాగుండని కళ్ళు కాయలుకాచేలాగా ఎదురుచూస్తుంది వసుధ ...
శరత్ కి మళ్ళీ ఫోన్ చేస్తేనో అనుకుంటూ మళ్లీ ఒకసారి తిరిగి ఫోన్ చేసింది నో రెస్పాన్స్... అదే సమాధానం కాల్ రీచ్ అవ్వట్లేదు ... పోనీ శరత్ పార్టీలో లేట్ అవుతుందని నాకు చెప్పడానికి కాల్ చేసాడా అనుకుంటూ ఫోన్ తీసుకొని ఒకసారి చూద్దాం అనుకుంటూ అలసట వల్ల ఫోన్ చూడకుండా అలాగే నిద్రపోయింది వసుధ ...
వసుధను వెతికివెతికి అలసిపోయి రమకు ఫోన్ చేద్దామనుకొని తన ఫోన్ చూసుకున్న శరత్ కి ఫోన్ చార్జింగ్ లేదని అర్థమయ్యింది ... పోనీ వసుధ ఎక్కడికైనా వెళ్లి తిరిగి ఇంటికి వచ్చిందా ? ... అనుకుంటూ
ఇంటికి వెళ్లి ఒకసారిచూసి మళ్లీ ఇంట్లో లేకపోతే ఏం చేయాలో అప్పుడు ఆలోచిద్దాం అనుకుంటూ ఇంటికి వచ్చిన శరత్ కు అలసటగా నిద్రపోతూ కనిపించింది వసుధ ... ఇంట్లోనే అలా ప్రశాంతంగా నిద్రపోతున్న వసుధనిచూడగానే శరత్ కి పోయినప్రాణం లేచి వచ్చినట్లయి... భార్య దగ్గరకువెళ్లి పాదాలుతాకుతూ మనస్ఫూర్తిగా క్షమాపణ చెబుతూ తన మనసులో ఏమనుకున్నాడో అవే చెబుతున్నాడు భర్త చేస్తున్న పనికి శరత్ మాట్లాడుతున్న ఆ మాటలకు అప్పుడే పట్టిన మగతనిద్రలో చిన్నపాటి కునుకుతీస్తున్న వసుధ ...ఆ నిద్రలో నుండి లేచి ఏమైంది శరత్ అలా ఉన్నావు అని అడగడంతో ...వసుధకు జరిగినదంతా శరత్ చెప్పేయడంతో ... వసుధే ముందుగా సారీ రా శరత్ అని చెప్పింది మనస్ఫూర్తిగా శరత్ కి ...
ముందుగా వసుధే శరత్ కు సారీ చెప్పి మామూలుగా ఎప్పటిలా ఉన్నందుకు శరత్ హమ్మయ్య అని ఊపిరి పీల్చుకొని ఆనందంతో భార్యని గట్టిగా కౌగిలించుకొని మరొకసారి సారీ చెప్పేసి తన మనసులో అప్పటి వరకు పడిన బాధ వేదన .. మనసులోని ఆ బాధను దింపేసుకున్నాడు శరత్ ... వసుధకూడా శరత్ ని మరింతగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది ...
ఒకరినొకరుమరింతబాగా అర్థంచేసుకున్న తరువాత..
తమ జీవితాల్లోకి రాబోయే కొత్తదనం సంతోషంకోసం ఎదురుచూస్తున్నారు ఆ భార్యాభర్తలు ...
దారం ఎప్పుడు తెగేవరకు లాగకూడదు ...
రెండువైపులా పట్టుకొని గట్టిగాలాగితే ఆ దారం తెగిపోతుంది ... మళ్లీ ఆ దారం కలవాలంటే ముడులు వేయాల్సిందే ... మూడేసిన ఆ దారం సరైన దారంలా కాక ముడులతో గజిబిజిగా ఉన్నట్టుగా ఉండిపోతుంది ... మనస్పర్ధలతో ఒకరిపై ఒకరు ఆధిపత్యం చలాయించుకుంటూ ఒకరి నోకరు గెలవాలనికాకుండా ఒకరినొకరు అర్థంచేసుకోవడానికి ప్రయత్నిస్తే ఏ బంధమైనా పదికాలాలపాటుపదిలంగా నిలబడుతుంది ...
శరత్ వసుధల బంధంలా ...
నా స్వంతరచన - #విశ్రీజ
24 - 11 - 2025 సోమవారం
🙏🙏
No comments:
Post a Comment