Wednesday, November 26, 2025

 *తండ్రి పరమేశ్వర ! నాకు మాత్రం ఒకటి పూర్తిగా అర్ధమైంది. నాలో ఉన్న ఆత్మకు ఏ చిన్నపాటి కష్టమొచ్చినా, పరిగెత్తుకుంటూ పరమాత్మయైన నీ దగ్గరకే చేరుకుంటున్నాది. నీతో మొర పెట్టుకుంటున్నాది.* 

మరి తండ్రి ఉమామహేశ్వర ! దీనిని బట్టి చూస్తే నీది నాది ఎన్నో జన్మ జన్మల ఋణానుబంధమయ్యా. ప్రతి కష్ట కాలంలో నన్ను కన్నతండ్రి వలే ఆదరిస్తున్నావు. అక్కున చేర్చుకుని నాలో ఆత్మస్థైర్యం నింపుతున్నావు. బ్రతుకు పోరాటమనే యుద్ధంలో విజేతగా గెలువమని, మళ్ళీ మళ్ళీ ముందుకు పంపుతున్నావు. 

*తండ్రి బోలాశంకర ! మీకు కృతజ్ఞతగా ఏమీవ్వగలను, ఇవ్వడానికి నాదంటూ ఏముంది, ఉంది నీవే, ఉన్నది నీదే. మీ పాదపద్మములేనయ్యా ఎల్లవేళలా నాకు శరణాగతి. నమో హార పార్వతీ పతియే హర హర మహాదేవా శంభో శంకర, ఓం  నమఃశివాయ.

No comments:

Post a Comment