🤯WIFE vs HUSBAND:Who Sacrifices More? | Highly Controversial | LOVE Marrige |Madan Gupta
https://youtu.be/cdgFXrlqrtk?si=OmkBvsNzBvDWW6GA
కుటుంబాలు విచ్చిన్నం కావడానికి కారణాలు క్షణికావేశంలో భార్యతో గొడవపడిన భర్త ఆమెను అత్యంత కిరాతకంగా చంపేశాడు. మృదేహాన్ని ముక్కలుగా నరికేసి కుక్కర్లో ఉడికించి దంచి చెరువులో విసిరేసాడు. దేశవ్యాప్తంగా ఎన్నో కుటుంబాలు కూలుతున్నాయి. ఎన్నో కాపురాలు చిద్రమవుతున్నాయి. నేవీ ఆఫీసర్ అయిన భర్తను చంపిన భార్య ఆయన్నను 15 ముక్కలు చేసి ఒక డ్రమ్‌లో సిమెంట్ వేసి పెట్టింది. షిలాంగ్‌లో దంపతుల హనీమూన్ మోర్డర్ కేసులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. భర్త రాజా రఘువంశీని భార్య సోనమే చంపేసినట్లుగా పోలీసులు ప్రకటించారు. నేటి విద్యా వ్యవస్థ ప్రపంచీకరణ పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థ విదేశీ సంస్థల ప్రవేశం పాశ్చాత్య సంస్కృతి అవి చెడ్డవి అని నేను చెప్పడం లేదు ఇప్పుడు ఉన్నటువంటి ఈ విద్యా వ్యవస్థ మనకు సంస్కృతి సాంప్రదాయాల గురించి నేర్పించడం లేదు. నైతిక విలువలకు స్థానమే లేదు మానవ సంబంధాలకు అసలు తావే లేదు ఇప్పుడు మనం ఒక పెద్ద ప్రశ్న వేసుకుందాం మానవ జీవిత గమ్యం ఏమిటి ప్రశ్న చాలా చిన్నదే కానీ సమాధానం జీవితం అంతా ఒకసారి ఆలోచించండి డబ్బు వలన ఆనందాన్ని పొందగలమా ఎంత ఎక్కువ సంపాదించాలి ఎలా సంపాదించాలి అనే ఆలోచనే తప్ప మనిషి జీవితంలో ఆనందంగా ఎలా జీవించాలి అలా జీవించడానికి ఎంత ఆర్థిక వర్ణనరులు అవసరం అనే విధానం లో ఎవ్వడు ఆలోచించడం లేదు.ఇన్ 2025 nనియర్lyీ 1.36 మిలియన్ డివోర్సస్హ ఆల్reడీ beన్ఫైల్డ్ ఓover 4% ఆఫ్ అour peopleీపల్ are devోస్డ్వాట్సరిీహపంగ్టరిelationన్‌షిప్స్ టుడే నేను గొప్ప అంటే నేను గొప్ప అనే పద్ధతిలో కుటుంబం చిద్రం వివాహ బంధం ఎందుకు చెడిపోతుందో విపరించారు కానీ భార్యా భర్తలు విడిపోకుండా ఉండడానికి ఏం చేయాలి ఎలా నడుచుకోవాలి అనేది చెప్పలేదు. నా దేశపు కుటుంబాలు విడిపోకుండా కలిసి ఉండాలి అనే ఆలోచనతో ఈ వీడియో చేస్తున్నాను. నమస్తే సదా వత్సలే మాతృభూమే నమస్కారం మిత్రులారా నేను మీ మదన్ గుప్త మిత్రులారా ఒక 10 సంవత్సరాల క్రితం నా పెద్ద కుమార్తె ప్రజ్ఞ వివాహ సమయంలో వచ్చిన అతిథులకు రిటర్న్ గిఫ్ట్ ఏమఇవ్వాలి అనే ఆలోచనలో రూపుదిద్దుకున్నదే ఈ వివాహ స్ఫూర్తి. ఈ సందర్భంలో నేను చాలా పుస్తకాలు చూశాను వివాహ బంధం ఎందుకు చెడిపోతుందో వివరించారు కానీ భార్యాభర్తలు విడిపోకుండా ఉండడానికి ఏం చేయాలి ఎలా నడుచుకోవాలి అనేది చెప్పలేదు నేను ఈ వీడియోలో ఈ రెండు విషయాలు చర్చించడం జరిగింది. నా దేశపు కుటుంబాలు విడిపోకుండా కలిసి ఉండాలి అనే ఆలోచనతో ఈ వీడియో చేస్తున్నాను. ఈ అంశాన్ని వివాహ సమయంలో సిడీలుగా చేసి అతిథులందరికీ ఇచ్చాను. అది చాలా ఆదరణ పొందింది. ఇప్పుడు అదే విషయాన్ని మీతో పంచుకోవడానికి ఈ అంశాన్ని రెండు భాగాలుగా అందిస్తున్నాను లేదా ఒకే భాగంగా కూడా అందించవచ్చు. మొదటి భాగం కుటుంబాలు విచ్చిన్నం కావడానికి కారణాలు రెండవ భాగం కుటుంబాలు కలిసి ఉండడానికి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు అందరూ ఆదరిస్తారని అనుకుంటాను. ఈ విషయంలో ఇక ముందుకు నడుద్దాం. మనది వేదభూమి మనది కర్మభూమి ఈ పుణ్యభూమిలో పుట్టిన ప్రతి ఒక్కరు ధర్మ అర్థ కామ మోక్షాలనే చతుర్విద ఫల పురుషార్థాలను సాధించాలని కోరుకుంటారు. మనది హిమగిరి శృంగమంత దేవభాషా సంస్కృతి ఆశవిద్యా సాంప్రదాయాలను మన ముందు తరాల వారికి వంటబట్టించి దేదీప్యమానమైన మన సంస్కృతి సాంప్రదాయాలను నలుదిశలా చాటి చెప్పాలి అనే ప్రయత్నమే ఇది. మన భారతీయ వైవాహిక వ్యవస్థ ఉత్తుంగ తరంగ సాగర మేఖల సదాశయాన్ని సమాజ శ్రేయస్సును స్వీయ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని ఏర్పరచబడింది. ఈ కళ్యాణ వ్యవస్థ ధర్మ అర్ధ కామ మోక్ష చతుర్విద ఫల పురుషార్థాలను సాధించుకునే ధర్మ మార్గం కళ్యాణ మార్గం కలి ప్రభావ విలయ తాండవం ఈ ధర్మగంటిగా రావాలా సవ్వడిలో తుడిచి పెట్టుకుపోవాలి. భారతీయ వైవాహిక వ్యవస్థను గురించి మాట్లాడుకుంటే ఎంతో ఉంది ప్రపంచ వ్యాప్తంగా మన భారతీయ వైవాహిక వ్యవస్థకు అద్భుతమైన ఆదరణ ఉంది. మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు ఈ వ్యవస్థ మీదనే ఆధారపడి ఉన్నాయి. ఈ వ్యవస్థను గురించి ముందు తరాలకు తెలియజేయడం మన బాధ్యత. అద్భుతమైన ఈ వ్యవస్థను కాపాడుకోవలసిన అవసరం బాధ్యత మన భుజస్కంధాల పైనే ఉంది. ఇంత గొప్ప ఈ వైవాహిక వ్యవస్థ అనేక ప్రతిబంధాలకు లోనవుతూ ఉంది. మన కాపురాలు గృహాలు ఆనందంగా ఉండడానికి పటిష్టంగా ఉండడానికి కారణం ఈ వైవాహిక వ్యవస్థే ఇప్పుడు ఈ వ్యవస్థ చాలా విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటూ ఉంది. దేశవ్యాప్తంగా ఎన్నో కుటుంబాలు కూలుతున్నాయి. ఎన్నో కాపురాలు చిద్రమవుతున్నాయి మారుతున్న వ్యవస్థ మారుతున్న కాలమాన పరిస్థితులు అద్భుతమైన ఈ గృహ వ్యవస్థ పైన విపరీతమైన ప్రభావాన్ని చూపిస్తున్నాయి ఈ పరిస్థితులన్నింటిని అధిగమించడం ఎలా మరల మన గృహ వ్యవస్థకు జవం జీవం సమకూర్చడం ఎలా మన కుటుంబాలు మన కాపురాలు చల్లగా పది కాలాల పాటు సుఖశాంతులతో వర్ధిల్లాలి అంటే మనం ఏం చేయాలి ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా మనల్ని మనం ఎలా తీర్చి దిద్దుకోవాలో ఆలోచిద్దాం ఇప్పుడు మన ముందున్న కాలం మారుతున్న సమాజం మనక ఎన్నో సవాళ్లను విసిరింది. ఎన్నో ప్రతిబంధకాలని మన ముందు ఉంచింది అవేంటో కొద్దిగా ముందు పరిశీలించి తర్వాత ముందుకు నడుదాం. మొట్టమొదట మన విద్యా విధానం ఎడ్యుకేషనల్ సిస్టం ఇప్పుడు ఉన్నటువంటి ఈ విద్యా వ్యవస్థ మనకు సంస్కృతి సాంప్రదాయాల గురించి నేర్పించడం లేదు. నైతిక విలువలకు స్థానమే లేదు. మానవ సంబంధాలకు అసలు తావే లేదు. ఈ విద్యా వ్యవస్థ మనకు కొంత విషయ పరిజ్ఞానాన్ని మాత్రమే అందిస్తుంది. భౌతిక విషయాల గురించి మాత్రమే నేర్పిస్తుంది. ఇందువలన మన సంస్కృతి సాంప్రదాయాలు మనకు తెలియకుండా పోతున్నాయి. ఇళ్లలో కూడా వీటిని గురించి చెప్పేవారు కరువయ్యారు. విద్య పూర్తి చేసుకోవడం ఉద్యోగాలకు పరుగులెత్తడం ఎంత ఎక్కువ సంపాదించాలి ఎలా సంపాదించాలి అనే ఆలోచనే తప్ప మనిషి జీవితంలో ఆనందంగా ఎలా జీవించాలి అలా జీవించడానికి ఎంత ఆర్థిక వర్ణలు అవసరం అనే విధానంలో ఎవ్వడు ఆలోచించడం లేదు పూర్వం మన వ్యవస్థలో ఒక విధానాన్ని అనుసరించేవారు ఒక రోజును ఐదు భాగాలుగా విభజించి తమ కార్యాలను నెరవేర్చుకునేవారు ఒక భాగం కుటుంబం కోసం ఒక భాగం తన ఆనందం అభివృద్ధి అంటే దైవ పూజ గ్రంథ పఠనం ఇప్పటి కాలంలో అయితే పర్సనల్ డెవలప్మెంట్ ఒక భాగం నిద్రకు ఒక భాగం సమాజానికి ఇవి ఈ ఐదు భాగాలు ఉండడం వలన మనకు పరిపూర్ణమైన సమాజం ఉండేది ఇప్పుడు ఎక్కువ భాగం సంపాదనకు తక్కిన నాలుగు భాగాలకు చాలా తక్కువ సమయం లేదా కొన్ని భాగాలకు అసలు సమయమే కేటాయించకపోవడంతో అసలు సమస్యలు మొదలవుతున్నాయి. ఒక్క విద్యా వ్యవస్థను గురించే మాట్లాడుకుంటూ ఉంటే అసలు విషయం మరుగున పడుతుంది కాబట్టి దీన్ని ఇక్కడితో ఆపి మరో కారణాన్ని ఆలోచిద్దాం. రెండవది ప్రపంచీకరణ గ్లోబలైజేషన్ ఈ నేపథ్యంలో ప్రపంచం చాలా చిన్నది అయిపోయింది. అనేక సంస్కృతులతో అనేక నాగరికతలతో మనకు సాన్నిహిత్యం ఏర్పడింది. అవి చెడ్డవే అని నేను చెప్పడం లేదు. స్వధర్మో నిధనం శ్రేయః పరధర్మో భయావహః అని శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో ప్రవచించాడు. చెడ్డదైనా నీ ధర్మాన్ని అనుసరించు అని అతి గొప్ప సంస్కృతిగా ప్రపంచ ప్రజల చేత కీర్తించబడిన నీ ధర్మం ఈ సనాతన ధర్మం చెడ్డదని చెప్పలేము కానీ కాలానుగుణంగా మన సమాజంలో కొన్ని కుతులు కొన్ని చెడ్డ సాంప్రదాయాలు వచ్చి చేరి ఉండవచ్చు వాటిని సరిచేసుకుని మన ధర్మాన్ని పటిష్ట పరుచుకోవడం మన కర్తవ్యం. ఇతర దేశాల సంస్కృతికి మన దేశపు సంస్కృతికి ఉన్న తేడాను జాగ్రత్తగా గమనిస్తే ఇతర దేశాల సంస్కృతులు భౌతిక విషయాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాయి. మన సంస్కృతి ఆధ్యాత్మిక విషయాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంది. భారతీయుడు ప్రధాన లక్ష్యం భగవంతుని చేరడమే అంటే తాను భగవంతుడిగా మారడం దైవీ లక్షణాలను దైవిక గుణాలను తనలోకి ఆవాహన చేసుకోవడం ఇది భారతీయుడి ప్రధాన ఆదర్శం. ఇక మూడవ అంశం చూద్దాం. ఇది పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థ. ఈ ఆర్థిక వ్యవస్థకు పెట్టుబడి పెట్టి పెట్టిన పెట్టుబడికి వేల రెట్లు ఆదాయం సంపాదించడం ఇదొక్కటే వాటి లక్ష్యం పూర్వం ఈ పంపినీ వ్యవస్థను వయసు సమాజం నిర్వహించేది అతి తక్కువ శాతం 20 30 శాతం లాభాపేక్షతో ఈ వ్యవస్థ నడిచేది. వారి లాభాల్లో కొంత శాతం ధర్మ కార్యాలకు సమాజ హితానికి కూడా ఉపయోగించేవారు. ఇప్పుడు కార్పొరేట్లు ఉత్పత్తి వ్యవస్థలు దళారులు కలిసి ఉత్పత్తి వ్యయం మీద మార్కెట్ ఖర్చులు ఇవన్నీ కలిపి 800% వరకు ఎంఆర్పి అంటే మాక్సిమం రిటైర్డ్ ప్రైస్ నిర్ణయిస్తున్నారు. దీంతో అనేక వస్తువులు మార్కెట్ లోనికి ప్రవేశించి ప్రకటనల ద్వారా మనలోని కోర్కెలను రెచ్చగొట్టి మనల్ని భౌతిక సుఖాల వైపు సంపాదన వైపు మళ్ళస్తున్నాయి. పూర్వకాలంలో మనిషికి ఎంత అవసరమో అంత మాత్రమే ప్రకృతి సంపదను వాడుకునేవాడు ఇక్కడ మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్పాలి కుశ అంటే దర్భ కౌశలము కుశలత అంటే నిపుణత నిపుణతను కౌశలము అని ఎందుకు అన్నారు అంటే పురాతన కాలంలో వటువులు దర్భను కోసేటప్పుడు ఎంతవరకు దర్భ అవసరమో అంతవరకు మాత్రమే దర్భను కోసేవాళ్ళు అంటే నిపుణత కోయడంలో చూపించేవాళ్ళు అందుకనే నైపుణ్యాన్ని కౌశలము అని పేరు వచ్చింది. పూర్వం విద్యా విధానంలో ప్రకృతిని ప్రకృతి వనరులను మనకు ఎంతవరకు అవసరమో అంత మాత్రమే వాడుకునేవాళ్ళం అది నేర్పించారు మనకి అది మన విద్యా విధానం మనకు నేర్పించేది కానీ ఇప్పుడు మనం ప్రకృతి వనరులను విచక్షణ రహితంగా వాడుకోవడం బాధాకరం. ఇలా వాడుకోవడం వల్ల మన భావి తరాలకు మనం మిగిల్చేది ఏమిటి చెత్త చెదారం వ్యర్థాలతో కూడిన భూమిని ఈ విషయం మీరు గుర్తుంచుకోండి నాలుగవది విదేశీ సంస్థల ప్రవేశం ఈ వ్యవస్థలు తమతోటి తమ దేశపు సంస్కృతిని కూడా మన భారతదేశంలోకి దిగుమతి చేశయి. వ్యాపార దృక్పదంతో వచ్చిన సంస్థలకు ఇక్కడ ఉన్న సమాజం ఇక్కడ ఉన్న సంస్కృతితో పనే ఉంటుంది. లాభాపేక్ష వాళ్ళ లక్ష్యం ఇక్కడ ఉన్న అధిక జనాభా వాళ్ళ పెద్ద మార్కెట్ మాత్రమే తక్కినవన్నీ వారికి అనవసరమైన విషయాలు వారానికి ఐదు రోజులు పని చేయి రెండు రోజులు వీకెండ్ పార్టీలు అనుభవించు మగవాళ్ళు తాగుడుకు బానిసలుయితే ఇంట్లో భార్యకు హింస భార్యకు కూడా ఉద్యోగస్తురాలు అయితే అదే కల్చర్ లో ఉంటే భారతకు హింస అనుమానాలు ఆర్థిక స్వావలంబన వలన గర్వాతిశయం ఇక కాపురాలు ఎక్కడ నిలుస్తాయి నేను గొప్ప అంటేనేను నేనుప్ప అనే పద్ధతిలో కుటుంబం చిద్రం బిడ్డలపైన ప్రభావం ఎంత ఉంటుందో ఆలోచించండి. 100కి 50% కార్పొరేట్ కంపెనీల్లో పనిచేసే వారి కుటుంబాలు చిద్రం అవుతున్నాయి. ఇలా చాలా త్వరగా విడాకులు బాటపడుతున్నాయి ఇవి. ఉద్యోగంలో వారిపై పడే వర్తిడి ఇంట్లో వారికి సరైన ఆదరణ లభించకపోవడం వీటన్నిటికీ ముఖ్య కారణాలు. ఇక ఐదవది పాశ్చాత్య నాగరికత గత 15200 సంవత్సరాలుగా పాశ్చాత్య నాగరికత పై మోజు మనల్ని దిగజారుస్తూ ఉంది. ఇక్కడ మీకు ఒక చిన్న సంఘటన గురించి వివరిస్తాను గొప్ప సాధకుడు గొప్ప యోగి స్వామి రామ ఈయన జీవితాన్ని ఈయన సాధనను గురించి హిమాలయ పరమ గురువులతో అనే పుస్తకం మనకు తెలియజేస్తుంది. ఈయన ఒకసారి జపాన్ లోని టోక్యో వీధుల్లో నడిచి వెళ్తున్నప్పుడు ఆయనకు ఒక దృశ్యం చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. అక్కడ పెద్ద పెద్ద వృక్షాలు మొరగుజ్జు వృక్షాలుగా షాపుల్లో అమ్మకానికి దర్శనం ఇచ్చాయి. స్వామి రామ ఆ షాపు వాడి దగ్గరికి వెళ్లి ఇది ఎలా సాధ్యం అని అడిగాడు. దానికి ఆ షాపు వాడు స్వామి ఇది చాలా సులభం చెట్టు పైకి ఎలా పెరుగుతు పోతుందో అలాగే దాని వేళ్ళు భూమిలో పెరుగుతూ పోతాయి. వాటిని కత్తిరిస్తే భూమిపైన ఉన్న చెట్టు ఎదుగుదల కూడా తగ్గిపోతుంది అని సమాధానం ఇచ్చాడు. స్వామి రామ బసకు తిరిగి వచ్చి తన డైరీలో ఇలా రాసుకున్నాడు. చెట్లకే కాదు మానవులకు కూడా ఇది వర్తిస్తుంది. మానవుల విషయంలో సంస్కృతి అనే వేళ్ళను కత్తిరిస్తే ఆ జాతి ఎదుగుదల ఆగిపోతుంది. ఇది ఎంత సత్యమో గమనించండి. మన సనాతన ధర్మం మన సంస్కృతి మన జాతీయత అనే వేర్లు కత్తిరించబడ్డాయి. కనుకనే భరత జాతి ఎదుగుదల లేక మొరగుజ్జు వృక్షంగా తయారయింది. ఆచారాలను తిరస్కరించే విమర్శించే ఆధునికులు అంటే ఆచారాలను పాటించే సనాతన ధర్మాన్ని పాటించే మూర్ఖుడే గొప్పవాడని వివేకానందుల వారు చెప్తారు పాశ్చాత్య దేశాల్లో ఉండే ఆనందం అనుభవం అంతా పైపైన మెరుపులే లోపల అంతా దుఃఖమే అంతా రోలనే కానీ మన దేశంలో పైకి దుఃఖం ఆవేదన కనిపించినా లోపల అంతా ఆనందమే మన ఆధ్యాత్మిక విద్యకు సాటి రాగల విద్య ప్రపంచంలో లేదు ఋషులు మునులు తత్వదర్శులు నిస్వార్థంగా మానవజాతి కళ్యాణానికి నిర్దేశించిన సంస్కృతి మనది ఇక్కడ ఉన్న ఆచారాలు సాంప్రదాయాలు మానవ సమాజ శ్రేయస్సును ఉపలక్షించేవి ఇంత అద్భుతమైన సంస్కృతికి వారసులం మనం పాశ్చాత్య జీవనంఅంతా భౌతికత మీదే ఆధారపడి ఉంటుంది. భారతీయ జీవనంఅంతా ఆధ్యాత్మికత మీద ఆధారపడి ఉంటుంది. అక్కడ తాత్కాలిక సుఖం ఇక్కడ శాశ్వత ఆనందానుభూతి ఇప్పటివరకు మనం చెప్పుకున్న విషయాలన్నీ మన మూల వ్యవస్థ అయిన వివాహ వ్యవస్థపై ప్రభావాన్ని చూపుతున్నాయి. నేటి విద్యా వ్యవస్థ ప్రపంచీకరణ పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థ విదేశీ సంస్థల ప్రవేశం పాశ్చాత్య సంస్కృతి ఇవి ఐదు మనక ఇచ్చిన వరాలు ఏంటంటే అశాంతి ధనదాహం భౌతిక లాలసత అవినీతి సంస్కృతి పట్ల తిరస్కార భావం అభద్రత ఇవి ఇవి మన కుటుంబ వ్యవస్థ మీద జీవన శైలి మీద విపరీతమైన ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ఇప్పుడు మనం ఒక పెద్ద ప్రశ్న వేసుకుందాం. మానవ జీవిత గమ్యం ఏమిటి ప్రశ్న చాలా చిన్నదే కానీ సమాధానం జీవితంంతా ఒక మనిషి తన జీవిత కాలంలో కోరుకునేది ఏమిటి? పుట్టిన ప్రతివాడు మరణిస్తాడు జీవించి ఉన్న కాలంలో తను ఎంత పొందాడు ఏం పొందాడు మరణించిన తర్వాత ఏం పొందుతాడు ఈ ప్రశ్నలకు సమాధానాన్ని వెతికింది మన సనాతన ధర్మం మన ఋషులు తమ అంతఃచేతనంలో దర్శించిన సత్యాలను ఆ పరమాత్ముడు పలికించిన విషయాలను మానవజాతికి అందించారు. అదే వేదం అదే భారతీయ జీవన నాదం బ్రతికి ఉన్నప్పుడు ఆనందంగా జీవించాలి ఆ పుట్టుకకు ఆ జీవితానికి ఒక ప్రయోజనం ఉండాలి చనిపోయిన తర్వాత భగవంతుని చేరాలి బ్రతికి ఉండగా భగవత్ సాన్నిధ్యాన్ని సాన్నిహిత్యాన్ని అనుభవించాలి ఇవే మౌలికమైన సమాధానాలు ఈ సమాధానాలను సహకారం చేసుకోవడానికి నిత్య జీవితంలో మానవుడు ఎలా ప్రవర్తించాలో వేదాలు శాస్త్రాలు నిర్దేశించాయి సంఘజీవి అయిన మానవుడు ఆనందంగా జీవిస్తూ జీవితాన్ని అనుభవిస్తూ భగవంతుని చేరే మార్గమే భారతీయ వైవాహిక వ్యవస్థ ఒకసారి ఆలోచించండి డబ్బు వలన ఆనందాన్ని పొందగలమా ధనం కోసం వెచ్చించే సమయంఅంతా ఎంతో మానసిక ఆందోళనంతో గడుస్తుంది. ఆ వచ్చిన ధనాన్ని ఖర్చు పెట్టడానికి మనసు అంగీకరించదు. ఇక అటువంటి డబ్బు అటువంటి సంపాదన వల్ల ప్రయోజనం ఏముంది ఇక్కడ నా ఉద్దేశం డబ్బు సంపాదించడం తప్పు అని కాదు మనకు కావలసినంత మన అవసరాలకు సరిపోయినంత భవిష్యత్తులో మన మౌలిక అవసరాలు తీరే అంత మనిషి తప్పక సంపాదించాలి. కానీ భవిష్యత్ తరాలకు కావలసినంత మాత్రం కాదు మీరు బాగా సంపాదించి పెడితే మీ భవిష్యత్ తరాలు ఎందుకు కొరకాకుండా పోతాయి. మరి మీరు వారికి సంపాదించి పెట్టింది ఏమిటి మీ పిల్లలకు సాంప్రదాయాలను చిన్నప్పటి నుంచే నేర్పించండి. స్వతంత్రంగా ఎలా బ్రతకాలో బోధించండి. జీవించడానికి కష్టపడడంలో ఉన్న ఆనందాన్ని తెలియజేయండి. సమాజం పట్ల వారికి కర్తవ్యాన్ని బోధించండి. మీరు మీ పిల్లలు ఆనందంగా జీవిస్తారు అప్పుడు మార్పు అనేది ఎక్కడి నుంచో రాదు మార్పు మనతోనే మొదలవ్వాలి. ఇప్పటివరకు నేటి మన సమాజ పరిస్థితులను చర్చించాం. ఇప్పుడు భారతీయ వైవాహిక వ్యవస్థ విచ్చిన్నానికి గల మౌలికమైన ప్రధానమైన కారణాలను గురించి చర్చించుకుందాం. వీటిలో ప్రధానమైనది మొదటిది మనం మన సాంప్రదాయాలను సంస్కృతిని గౌరవించకపోవడం. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు చాలా గొప్పవి కానీ ఈ సాంప్రదాయాల గురించి ఎంతమందికి తెలుసు మన సాంప్రదాయాల పట్ల మనకే చిన్నచూపు మనం తెలుసుకోము మనం పాటించము ఇక మన పిల్లలక ఎలా తెలుస్తాయి మన సాంప్రదాయాల గురించి తెలిస్తే మన వైవాహిక వ్యవస్థ గురించి తెలుస్తుంది. తన కుటుంబాన్ని ఎలా సరిదిద్దుకోవాలో తెలుస్తుంది. భార్యా భర్తల కర్తవ్యాలు బాధ్యతలు హద్దులు హక్కులు అన్ని తెలుస్తాయి. వాటికి అనుగుణంగా నడుచుకోవడానికి ప్రయత్నం చేస్తారు. మన భారతీయ వైవాహిక వ్యవస్థ ఎంత పటిష్టమైందో ఒక్క ఉదాహరణతో తెలియజేస్తాను. బహుభార్యాత్వం ఉన్న ముస్లిములు కూడా భారతదేశంలోని వివాహ వ్యవస్థను గౌరవిస్తారు. తలాక్ తలాక్ తలాక్ అని మూడు సార్లు ఉచ్చరిస్తే వారి వివాహం రద్దవుతుంది కానీ భారతీయ ముస్లింలలో దాదాపు 80% ముస్లింలు ఒక్క భార్యతోనే జీవితాంతం గడుపుతారు. ఇక క్రిస్టియన్ల వైవాహిక వ్యవస్థ కూడా అంతే. ఎప్పుడు పడితే అప్పుడు పురుషులు వారి వివాహాన్ని రద్దు చేసుకొని ఇంకొక వివాహం చేసుకోవచ్చు. కానీ భారతదేశంలో క్రిస్టియన్లు దాదాపు 80 శాతం మంది ఇక్కడి వ్యవస్థలను గౌరవిస్తూ ఈ సాంప్రదాయాన్నే పాటిస్తున్నారు. ఈ ఒక్క ఉదాహరణ చాలు మన వివాహ వ్యవస్థ ఎంత గొప్పదో ఎంత పటిష్టమైందో తెలుసుకోవడానికి కానీ హిందూ సమాజంలో పుట్టిన మన బిడ్డలు మాత్రం ఈ వ్యవస్థ యొక్క గొప్పతనాన్ని తెలుసుకోకుండా వారి ఇంటికి వారే నిప్పంటించుకుంటున్నారు. ప్రతి మనిషి జీవితంలో మూడు అవస్థలు ఉంటాయి బాల్యం యమనం వార్ధక్యం ఇవి తప్పవు బాల్యంలో నైతిక ఆధ్యాత్మిక వృత్తి విద్యలను అభ్యసించాలి. యవ్వనంలో పెళ్లి చేసుకొని సమాజానికి ఉత్పత్తి విషయంలో వంశానికి అభివృద్ధి విషయంలో ధర్మబద్ధంగా వ్యవహరిస్తూ జీవించాలి. ధర్మ అర్థ కామ మోక్షాల అనే చతుర్విద ఫల పురుషార్థాల కొరకు కష్టించాలి. వార్ధక్యంలో తన అనుభవాలను ముందుతరాలకు అందిస్తూ దైవ సాన్నిధ్యాన్ని దైవ సాన్నిహిత్యాన్ని అనుభవిస్తూ జీవితాన్ని సార్ధకం చేసుకోవాలి. ఇక రెండవది మనకు ఆధ్యాత్మిక విద్య లోపించడం పూర్వకాలంలో మన విద్యా వ్యవస్థ మొత్తం గురుకుల విధానాన్ని అనుసరించేది. నాటి గురువులు వృత్తి విద్యలతో పాటుగా ఆధ్యాత్మిక విద్యను కూడా బోధించేవారు. గురుకులాల నుండి బయటకు వచ్చి వివాహం చేసుకున్న వారు తమ తమ వృత్తుల్ని చేసుకుంటూ తమకు కావలసిన ధనాన్ని సంపాదించుకుంటూ దైవమార్గంలో కాలాన్ని గడిపేవారు. ఈ విధానం భారతీయ సమాజాన్ని కొన్ని వేల సంవత్సరాలు పటిష్టంగా ఉంచింది. ఆనందం ప్రశాంతత జీవన లక్ష్యాలుగా ఉండేవి. కానీ ఆంగ్లేయుల సమయంలో ఈ వ్యవస్థను పూర్తిగా విచ్ఛందం చేశారు వారు మెకాలే విద్యా విధానంతో నైతికత లోపించిన విద్యార్థులు సమాజంలోకి రావడం మొదలైంది. సంస్కృతి సాంప్రదాయాలకు కిలోదకాలిచ్యం ఆధ్యాత్మిక విద్య మత విద్య మన విద్యా విధానం నుండి దూరమైనాయి. భౌతిక విద్య విషయలాలసత అనైతిక ప్రవర్తన మన సమాజంలో ప్రవేశించాయి. దీంతో మనిషి ఆనందాన్ని ఆధ్యాత్మికతను జీవన మాధుర్యాన్ని అన్నింటిని కోల్పోయాడు. మన బిడ్డలకు రామాయణ మహాభారతాలు భగవద్గీత యోగులు మునులు వీరి కథలు ఇంకా ఆధ్యాత్మిక విషయాల గురించి చెప్పండి రోజు 10 నిమిషాలు ఇంట్లో సత్సంగానికి కేటాయించండి. ఇంట్లోని అందరూ కూర్చొని మంచి విషయాలు మాట్లాడుకోండి. ఈ ఒక్క విషయం ఇంట్లోని అనేక సమస్యలను పరిష్కరిస్తుంది. పిల్లల్లో ఆధ్యాత్మిక భావనలు సున్నితమైన మనసు ఏర్పడతాయి. తర్వాత అంశం వైవాహిక వ్యవస్థ పట్ల అవగాహన లేకపోవడం మీ పిల్లలకు చిన్నతనం నుండే వివాహ వ్యవస్థ మీద అవగాహన కల్పించండి. మా చిన్నతనంలో పిల్లలు బొమ్మల పెళ్ళీళ్లు చేసేవాళ్ళు అటువంటి ఆటలు ఇప్పటి పిల్లలు ఆడడం లేదు. వీడియో గేములు టీవీలు సీరియల్లు సెల్ ఫోన్లు ఇక పిల్లల్లో సున్నితమైన భావాలు ఎలా చోటు చేసుకుంటాయి మన సాంప్రదాయాలకు సంబంధించిన అనేక ఆటలు కార్యక్రమాలు పండుగలు జరుపుకునేవారు అవన్నీ ఒక్కొక్కటే మాయం అవుతున్నాయి అట్లతద్ది ఆడపిల్లలు మంచి భర్త రావాలని కోరుకుంటూ జరుపుకునే పండుగ పట్టణాల్లో అసలు వీటి పేర్లు కూడా తెలియని వారు 99 శాతం మంది ఇక్కడ ఇంకొక ప్రధాన విషయం మనం చర్చించుకోవాలి పిల్లల ముందు తల్లిదండ్రులు పోట్లాడు ఆడుకోవడం వాదులాడుకోవడం వల్ల పిల్లల మీద ఈ ప్రభావం చాలా ఎక్కువగా పడుతుంది. ఈ కారణంగానే చాలా మంది పిల్లలు పెళ్లి పట్ల విముఖత చూపిస్తున్నారు. ఒకప్పుడు 16 22 సంవత్సరాల లోపు పెళ్ళీళ్లు చేసేవాళ్ళు ఇప్పుడు 30 40 ఏళ్ల వరకు పెళ్లి గురించి ఆలోచించడం లేదు. ప్రతివాళ్ళు కెరీర్ గురించి ఆలోచిస్తూ విలువైన జీవన మాధుర్యాన్ని కోల్పోతున్నారు. ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి. సరైన వయసులో పిల్లలకు పెళ్లి చేస్తే వారు వృద్ధులయ్యే లోపల పిల్లలు ఎదిగి వారి చేతికి వస్తారు. సరైన సమయంలో పిల్లల పెళ్లి చేయడం తల్లిదండ్రుల బాధ్యత. మరో ముఖ్యమైన అంశం ధనదాహం భౌతిక విషయలాలసత అనైతిక ప్రవర్తన ధనదాహం అనే దుర్నీతి మన వైవాహిక వ్యవస్థ మీద చాలా బలమైన ప్రభావాన్ని చూపిస్తుంది. ఇప్పటి పెళ్లి మాటలు మనం ఒకసారి గమనిస్తే వ్యాపారం జరుగుతున్న ఒక సన్నివేశం సాక్షాత్కరిస్తుంది తప్ప ఒక కొత్త జంట రూపుదిద్దుకునే సమయం ఒక నూతన కుటుంబానికి పునాది పడుతుంది అనే పవిత్రమైన ఆలోచన ఎవ్వరి మనసుల్లో లేకుండా పోయింది. వాళ్ళకనం ఎంత ఇస్తారు అమ్మాయికి నగలన్ని పెడతారు అబ్బాయికి మర్యాదలు ఏం చేస్తారు మావాళ్ళు మీవాళ్ళు ఈ గొడవలు తప్ప పవిత్రమైన భావనలు పిల్లల ఆనందం వాళ్ళ భవిష్యత్తు వాళ్ళ అభిరుచులు కుటుంబాల వంశాల పరువు ప్రతిష్టలు ఇవి ఆలోచించే సాంప్రదాయం అడుగంటింది. ప్రేమ అభిమానం ఇవి లోపించాయి. వివాహ స్ఫూర్తి మృగ్యం అయింది. ఇక పెళ్లి జరిగే తంతు చూద్దాం ఎవరి గొప్పలు వాళ్ళు చూపించుకోవడానికి తహతహలాడుతుంటారు తప్ప వివాహ పవిత్రతను గురించి ఎవ్వరూ ఆలోచించడం లేదు. సాక్షాత్తు విష్ణు స్వరూపుడైన వరునికి లక్ష్మీదేవిని ఇల్లాలుగా చేసే పవిత్రమైన తంతుగా వివాహం నడుస్తుంది. పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె పీటల మీద ఉండగానే వాళ్ళ వ్యాపార ఒప్పందం సరిపోయిందా లేదా ఇది ఆలోచన. పెళ్లికి వచ్చేవాళ్ళు ఇక నడిచే నగల కొట్లే ఎవరెవరికి ఎంతెంత ఆస్తులు ఉన్నాయో దానికి తగ్గట్టుగా వేషధారణ మగపెళ్లి వాళ్ళు మాకు అది జరగలేదు ఇది జరగలేదు అనే గిల్లి గజ్జాలు రణగుణ ధ్వనులతో పెళ్లి అనే వ్యాపారం ముగుస్తుంది. ఆ మంత్రాలు ఏం చదివారో వాటి అర్థాలు ఏమిటో పెళ్లి యొక్క పవిత్రత ఏమిటో ఎవ్వరికీ పట్టదు. ఎన్ని వంటకాలు చేశారు ఎంత గొప్పగా మంటపం ఏర్పాటు చేశారు ఇవి తప్ప ఆ ఇద్దరు పిల్లల జీవితం ఎలా ఉంటుంది వాళ్ళు కలకాలం చల్లగా కాపురం చేయాలి అనే నిండు మనసుతో ఆశీర్వదించేటటువంటి పెద్దలే కరువయ్యారు. సంభావనల గొడవలో పురోహితులు ఫోటోలు వీడియోల గొడవలో పెళ్లివారు ఇది టోటల్‌గా పెళ్లి మనుషుల అనైతిక ప్రవర్తన ఎంత దూరం వెళ్ళింది అంటే లేని ఆస్తుల్ని లేని గొప్పల్ని చెప్పి ఎక్కువ కట్నం గుంచుదాం అనేదాకా వెళ్ళింది. మన ఇంట్లో పిల్లలకు మనం ఏం నేర్పిస్తున్నాం పై సంపాదన ఉండే ఉద్యోగం అయితే తొందరగా డబ్బు సంపాదించవచ్చు అలాంటి ఉద్యోగం కోసం పిల్లల్ని ప్రోత్సహిస్తున్నాం. డబ్బు మోజులో పడిన పిల్లలు తల్లిదండ్రులని వృద్ధాశ్రమానికి పంపిస్తారు. భార్యకు తెలియకుండా అనేక అనైతిక కార్యాలు చేస్తారు. భార్య నిలదీస్తే గొడవలు విడాకులు అబద్ధాలు అన్యాయాలతో మొదలైన పెళ్ళీళ్లు గొడవలు విడాకులతో ముగుస్తాయి. మీ కుటుంబం ఒక్కటే కాదు మీరు నివసించే సమాజం పట్ల కూడా మీ బాధ్యత ఉంది అని గుర్తించండి. సమాజం అంటే పెద్ద కుటుంబం అనే భావన మీలో మేలుకొలపండి. ఈ కుటుంబం ఈ సమాజం నాది అనుకుంటే చాలా దురాచారాలు గ్రూప్ మాసిపోతాయి. అద్భుతమైన సమాజం ఆనందమైన కుటుంబాలు సార్ధకమైన జీవితాలు వెల్లివిరుస్తాయి. ప్రేమ వివాహాలు ఇటీవల కాలంలో ఎక్కువైనాయి కానీ అవి కూడా విఫలం అవుతున్నాయి. మొట్టమొదట యువతీ యువకులు ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. వివాహం అనేది కేవలం యువతీ యువకులకు సంబంధించింది మాత్రమే కాదు వివాహం అనేది ఒక సామాజిక బాధ్యత. రెండు కుటుంబాలు రెండు వంశాలు కలిసే అపురూప సంగమం అది మొట్టమొదట యువకులు గ్రహించాల్సిన విషయం ఏమిటంటే యుక్త వయసులో కలిగేది ప్రేమ కాదు ఆకర్షణ అని అతి పవిత్రమైన పదం ప్రేమ ప్రేమ అనేది చాలా విశాలమైన అర్థం ఉన్న పదం స్వార్థం లేకుండా ఇచ్చేదే ప్రేమ సరే ఇష్టపడి పెళ్లి చేసుకున్న జంటలు ఎందుకు విడిపోతున్నాయి అనేది ఒకసారి మనం అవలోకన చేద్దాం. పెళ్లి అయిన వెంటనే ఇద్దరి మధ్య ఉన్న ఆకర్షణ తగ్గి వాస్తవాలు తమ ముందు సాక్షాత్కరిస్తాయి. పురుషాహంకారం పడగవిప్పుతుంది. ఈ మధ్యకాలంలో స్త్రీలు కూడా సంపాదనాపరులైన కారణంగా ఆమెకున్న ఆర్థిక స్వావలంబన ఆమెకు అనకువ ఆత్మవిశ్వాసం కంటే అహంకారాన్ని ఇస్తుంది. ఇక ఇద్దరి మధ్య ఎవరు గొప్ప అనే యుగో అప్పటిదాకా ఎదుటి వారిలో కనిపించని లోపాలు ఒక్కొక్కటే బయటకు రావడం మొదలెడతాయి. సహజంగా ఇద్దరు వ్యక్తులు కలిసినప్పుడు వచ్చే పొరపత్యాలు పెద్దలు ఉంటే సరిదిద్దుతారు. కానీ ఈ రకమైన వివాహాల విషయంలో జరగదు. పెద్దల అండ లేకపోవడం వలన పిల్లలు చేసే తప్పులు సరిదిద్దే అవకాశం ఉండదు. ఇక ఈ జంటకు మిగిలేది స్నేహితులే. వాళ్ళలో పరిణతి ఎంత ఉంటుంది ఎవరి తరపు స్నేహితులు వాళ్ళని సమర్ధిస్తారు. పెళ్లి చేసుకున్న జంటకు అవగాహన ఉండదు. వీళ్ళను ప్రోత్సహించి పెళ్లి చేసిన స్నేహితులకు అవగాహన ఉండదు. ఒక చిన్న నిప్పు రవ్వ దూది కొండను దహించినట్లు ఒక చిన్న పొరపాటు వాళ్ళ జీవితాలను చిద్రం చేస్తుంది. భార్యా భర్తలు ఒకరినొకరు గౌరవించుకుంటూ వాళ్ళ జీవితాలను సుఖమయం చేసుకోవాలి. ఈ విషయంలో ఉన్న మరో ఇబ్బందిని మనం ఇప్పుడు ఆలోచిద్దాం. మన భారతదేశంలో కుల వ్యవస్థ చాలా పటిష్టంగా వేళ్ళనుకొని ఉంది. రెండు కులాలకు సంబంధించిన వాళ్ళు పెళ్లి చేసుకుంటే రేపు వాళ్ళకు పుట్టే బిడ్డలు ఏ కులానికి సంబంధించిన వారు అవుతారో తెలియదు. రేపు వాళ్ళ వివాహ విషయం వచ్చేసరికి దాంట్లో వచ్చే ఇబ్బందులు ఇప్పుడు వీళ్ళు గ్రహించలేరు. సంఘాన్ని ఎదిరించి చేసుకునే వివాహాలు జీవితాంతం చింతను మిగులుస్తాయి. జీవితంలో పెళ్లి ఒక్కటే ప్రధానమైనది కాదు పెళ్లి జీవితంలో ఒక భాగం మాత్రమే అనేది గుర్తించండి. యువకులు తాత్కాలికమైన ఆకర్షణకు జీవితాన్ని బలి చేయకుండా ఒక మహత్కార్యానికి మీ జీవితాన్ని ఉపయోగించండి. తాత్కాలికమైన తుచ్ఛమైన సుఖాలకు పరుగులెత్తకుండా వివాహ స్ఫూర్తిని చెడగొట్టకుండా సమాజం పట్ల గౌరవంతో బ్రతకాలి. అప్పుడే మీ జీవితాలు సుఖ సంతోషాలతో ఆనందంగా ప్రయోజనకరంగా మారుతాయి. ఇప్పటివరకు ప్రేమ వివాహాలు ఎందుకు విఫలం అవుతున్నాయో గమనించాం. ఇప్పుడు పెద్దలు కుదిర్చిన వివాహాల గురించి ఆలోచిద్దాం. ప్రేమ వివాహాలను తప్పును పట్టినప్పుడు పెద్దలు కుదిర్చిన వివాహాలు సమ్యంగా ఉండాలి కదా మరి అవి ఎందుకు చూడుతున్నాయి దీనికి ప్రధాన బాధ్యత పెద్దలే వహించాలి. మీరు కుదిర్చిన వివాహం దెబ్బ తిన్నది అంటే తప్పు మీది పిల్లలది ఎంత మాత్రం కాదు ఈ వివాహాలు దెబ్బ తినడానికి కొన్ని ముఖ్యమైన కారణాలు ఉన్నాయి. మొట్టమొదట పిల్లల అభిప్రాయాలు అభిరుచులు తెలుసుకోకుండా వివాహాలు నిర్ణయించడం. అబ్బాయి ఎలాంటివాడు సమర్ధుడా అమ్మాయికి అబ్బాయి నచ్చాడా లేదా అబ్బాయికి అమ్మాయి నచ్చిందా లేదా అనేది మొట్టమొదటగా ఆలోచించాలి. ఇక రెండవది డబ్బు ప్రాధాన్యం కట్నాలు కానుకలు అంటూ వాటికి ప్రాధాన్యం ఇచ్చి వివాహాన్ని వ్యాపారం చేయడం ఒకనాటి కాలంలో కట్న కానుకల రూపం మరో విధానంలో ఉండేది. ఒక కొత్త జంట రూపుదిద్దుకుంటుంది. తన కూతురు సుఖాన్ని కాంక్షించి కన్యాదాత కొంత ధనాన్ని తన శక్తి కొలది అమ్మాయికి స్త్రీధనంగా ఇచ్చేవాడు. ఈ స్త్రీధనం మీద అత్తవారింటికి ఎటువంటి అధికారం ఉండదు. విపత్కర పరిస్థితులు ఏర్పడినప్పుడు ఈ స్త్రీధనం ఆ అమ్మాయి పోషణకు ఉపయోగపడుతుంది. స్త్రీ ధనాన్ని బంధువులు ఎవరైనా అపహరిస్తే వారికి కఠిన దండన విధించమని మనువు ఆదేశించాడు అబ్బాయి ఇంటికి భవిష్యత్తులో ఆ ఇంటిని సంరక్షించే ఇల్లాలు వస్తుంది కాబట్టి వారి వంశం అభివృద్ధి చెందడానికి సాక్షాత్తు లక్ష్మీదేవి తమ ఇంటికి వస్తుందని భావించేవాళ్ళు ఎప్పుడైతే ఈ ప్రక్రియ వ్యాపార రూపం దాల్చిందో ఇంటికి వచ్చే అమ్మాయి మనసులో తన పెళ్లికి తన తల్లిదండ్రులు ఎంత బాధను అనుభవించారో ఆ బాధను మరో రకంగా వ్యక్తం చేస్తుంది. జాగ్రత్త పెళ్లికి వచ్చిన బంధువులు ఆ కొత్త జంట కాపురానికి కావలసిన గ్లాసులు చెంబులు కాంచాలు ఇలాంటి ఇంటికి పనికి వచ్చే వస్తువులు కానుకగా ఇచ్చేవారు కానీ ఇప్పుడు ఎందుకు పనికిరాని అలంకరణ సామగ్రిని కానుకలుగా ఇస్తున్నారు. పెళ్లి చేసేవాళ్ళు పెళ్లికి వచ్చిన వాళ్ళు ఒక్క విషయాన్ని గుర్తించండి ఒక కొత్త జంట రూపుదిద్దుకుంటుంది వాళ్ళ భవిష్యత్తును గురించి ఆలోచించండి పెళ్లి వ్యాపారం కాదు పెళ్లి సామాజిక బాధ్యత ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి. ఇక మరో సమస్య నేటి సమాజంలో సంపాదన మార్గాలు ఎక్కువైనాయి. సంపాదనకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవారు ఎక్కువ సమయాన్ని సంపాదనకు ఖర్చుపెట్టి అతి తక్కువ సమయాన్ని కుటుంబానికి కేటాయిస్తున్నారు. ప్రధానంగా ఈ సమస్య కుటుంబంలోని వ్యక్తుల మధ్య అంతరాన్ని సృష్టిస్తుంది. మరో సమస్య వరుడు వధువు డిగ్రీలు సంపాదన ప్రధాన భూమికను పోషిస్తున్నాయి. ఇద్దరి మధ్య ప్రేమ కొరబడి డిగ్రీల కాపురం మొదలవుతుంది. ముల్లు జీరో డిగ్రీకి చేరగానే కాపురం జీరో అయిపోతుంది. పిల్లలకు చెప్పండి మీరు చదివిన చదువుల కంటే మీరు సంపాదించిన డిగ్రీల కంటే మీరు సంపాదించే డబ్బు కంటే మీ మధ్య ప్రేమ అభిమానం అవగాహన ముఖ్యం అనే సంగతి తెలియజేయండి. సంపాదన అనేది కేవలం మనం నిత్యావసరాలు తీర్చుకోవడానికి మాత్రమే కానీ అది మీ మధ్య అడ్డుగూడ కాకూడదు అని వివరించండి. పెద్దలు కుదిరిచిన వివాహాలు విఫలం కావడానికి ముఖ్య కారణం పెళ్లి అయిన తర్వాత పెద్దలతో కలిసి ఉండకపోవడం ఉద్యోగ రిచ్చ వేరే ఊర్లో కాపురం పెట్టాలి. ఇద్దరి మధ్య సమస్య వస్తే మొగ్గలోని పించి వేయడానికి పెద్దల మార్గదర్శనం కరువవుతుంది. అది రాజుకుని రాజుకునే పెద్ద మంట అయినప్పుడు పెద్దలకు తెలుస్తుంది. ఆ మంటను ఆర్పడం కష్టం అవుతుంది. చేతులు కాలేక ఆకులు పట్టుకున్న చందాన అవుతుంది. పిల్లలకు చెప్పండి ఏ సమస్య వచ్చినా సర్దుకుపోయే మనస్తత్వం అలవర్చుకోమని సమస్య గురించి తెలియజేయమని చెప్పండి వాళ్ళ కాపురాలు నిలిచే విధంగా సలహా ఇవ్వండి ఇగోను రెచ్చగొట్టొద్దు కొడుకు కోడలు ఇద్దరు మీ బిడ్డలే గుర్తుంచుకోండి మీరు ఒక్కొక్క సలహ ఆలోచించి మరి ఇవ్వండి తల్లిదండ్రులు పిల్లలు ఒక్క విషయం గుర్తుంచుకోండి ఆనందంగా జీవించడానికి డబ్బే ప్రధానం కాదు డబ్బే ప్రధానం అయితే పేదవారి కాపురాలు అన్నీ కూలిపోయేవి వాళ్ళు కాయక కష్టం చేస్తూ కూడా భార్యా భర్తలు ఆనందంగా జీవిస్తారు. వాళ్ళ మనసులు స్వచ్ఛంగా ఉంటాయి. మానవ సంబంధాలకు పెద్ద పీఠ వేయండి. భార్యను స్నేహితురాలుగా భావిస్తే ఆ భర్త సుఖ సంతోషాలను పొందుతాడు. భర్తను స్నేహితుడిగా భర్త కుటుంబాన్ని తన కుటుంబంగా భావిస్తే స్త్రీకి ఆ ఇల్లు స్వర్గమే. పెద్దలు మీ అహంకారాన్ని పిల్లలపై రుద్దకండి. మీ గొప్పలు మీ అహంకారాలు, మీ ఆడంబరాలు పిల్లల జీవితాల్ని దుర్భరం చేస్తాయి. ఇక మరో అంశం అనైతిక ప్రవర్తన భార్యా భర్తలు తమలో ఉన్న లోపాలని గుర్తించి ఒకరితో ఒకరు పంచుకోండి అన్ని విషయాలను భార్యతో పంచుకోండి మీ బలహీనతలను గురించి చర్చించుకోండి అప్పుడు మీ మధ్య అవగాహన సానుభూతి అర్థం చేసుకునే మనస్తత్వం అలవడుతుంది. అనైతికమైన పనులు చేసే అవకాశమే ఉండదు. మరో ప్రధాన కారణం గృహ హింస. తన వాళ్ళందరినీ వదులుకొని మీ ఇంటికి వచ్చే అమ్మాయి పట్ల ఎలా ప్రవర్తించాలో గుర్తెరిగి ప్రవర్తించండి. ఆడపిల్లను పెళ్లి చేసుకునేందుకు అబ్బాయి ఆడపిల్ల ఇంటికి బంధుమిత్ర సమేతంగా మేళతాళాలతో పెద్ద సమూహంతో వస్తాడు. అదే ఆడపిల్ల ఒంటరిగా అత్తవారి ఇంటికి వస్తుంది. ఆడపిల్లల గుండె ధైర్యం ఎంతటితో ఇక్కడ మనం గమనించవచ్చు. అత్తలు జాగ్రత్త అత్త ఒకంటి కోడలే అనే విషయం మరువద్దు. తల్లిగా కోడల్ని ఆదరిస్తే కొడుకు జీవితం నందనమనం అవుతుంది. అత్తలో తల్లిని చూడండి ఇక ఆ ఇల్లు స్వర్గమే గయ్యాళి అత్తలు గయ్యాళి కోడళ్ళు మీ భర్తలను కొడుకులను ఇరుకొను పెడుతున్నారు అని గ్రహిస్తే సర్దుకుపోయే మనస్తత్వం అలవడుతుంది. ఆధిపత్యం కోసం కాక ఆదరణ ప్రేమ కోసం ప్రయత్నం చేయండి. మీరు ఏది ఇస్తే అదే పొందుతారు ద్వేషాన్ని ఇస్తే ద్వేషాన్ని ప్రేమను ఇస్తే ప్రేమనే పొందుతారు. విత్తఒకటి నాటితే చెట్టుఒకటి వస్తుందా ఇక మరొక అంశం వత్తిడి అన్ని సమస్యలు ఈ వత్తిడి వల్లే ఉత్పన్నం అవుతున్నాయి. ప్రస్తుతం ఉన్న సామాజిక పరిస్థితులు మనిషి మీద విపరీతమైన వత్తిడిని సృష్టిస్తున్నాయి. వత్తిడితో ఇల్లు చేరిన భార్య లేదా భర్త చాలా చిన్న చిన్న విషయాలకు చాలా పెద్దగా స్పందిస్తూ జీవితాన్ని నరకం చేసుకుంటున్నారు. భార్యా భర్తలు ఇద్దరూ ధ్యానం చేసే అలవాటు చేసుకోండి. దీనివల్ల ప్రశాంతమైన మానసిక స్థితి అలవడుతుంది. ఏ నిర్ణయాన్నైనా వత్తిళ్లో తీసుకోవద్దు. అది మీకు మరిన్ని కష్టాలను కొనితెస్తుంది. చివరిగా అవగాహన లోపం ఇది మన కుటుంబాలను చిద్రం చేస్తుంది. నేను దేశంంతా పర్యటించాను. మన గృహాలు చిద్రం అవుతున్నాయి. మన కుటుంబ వ్యవస్థ నాశనం అవుతుంది. కుటుంబం అనేది మన సమాజంలో ఒక చిన్న భాగం. కుటుంబాలు విచ్చిన్నం అయితే సమాజం ఎక్కడ ఉంటుంది? విచ్చిన్నమైన కుటుంబాలతో సమాజం ఎంతకాలం నడక కొనసాగిస్తుంది అసలైన కారణం నేను ఒకటి గ్రహించాను. అది అవగాహన లోపం ఈనాడు సమాజంలో ఎవ్వరు ఎవరిని అర్థం చేసుకోవడం లేదు. అన్నదమ్ముల మధ్య అవగాహన లోపం తల్లిదండ్రులు బిడ్డల మధ్య అవగాహన లోపం యజమాని పనివాళ్ళ మధ్య అవగాహన లోపం భార్య భర్తల మధ్య అవగాహన లోపం అవగాహన స్ఫూర్తి లేకపోవడమే మన కుటుంబాలు విచ్చిన్నం కావడానికి ప్రధాన కారణం ఒకరినొకరు అర్థం చేసుకుంటే ప్రతి ఒక్కరు అవతలి వాళ్ళను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే ఈ ప్రపంచంఅంతా అద్భుతమైన ప్రపంచం మరొకటి ఉండదు ఒక ఆమె రోడ్లో నడిచిపోతూ ఉంది. రోడ్డు పక్కన ఇంటి గార్డెన్ లో ఒక వ్యక్తి కుర్చీలో కూర్చుని చెట్లకు నీళ్లుు పోస్తున్నాడు. ఆ దృశ్యాన్ని చూసిన ఆమె ఈ వ్యక్తి ఎంత సోమరిపోతూ కుర్చీలో కూర్చొని చెట్లకు నీళ్లుు పోస్తున్నాడు అనుకుంది. కొంచెం ముందుకు నడిచింది. నడిచి చూస్తే ఆ కుర్చీకి చక్రాలు ఉన్నాయి అంటే ఆ వ్యక్తి కాళ్ళు లేని వికలాంగుడు ఆ దృశ్యాన్ని చూసిన ఆమె ఒకసారిగా పశ్చాత్తాపానికి లోనైంది. అయ్యో ఆయన్ని అనవసరంగా అపార్థం చేసుకున్నాను. కాళ్ళు లేకపోయినా ఆ వ్యక్తి కష్టపడడం చాలా గొప్ప విషయం. ఇక నుండి విషయం పూర్తిగా తెలుసుకోకుండా ఒక నిర్ణయానికి రాకూడదు అని నిర్ణయించుకుంది. ఇంకో సంఘటన చూద్దాం. మరో ఆవిడ కూరగాయల కోసం ఒక వ్యక్తిని నియమించుకుంది. ఆ వ్యక్తి రోజు కూరగాయలు తెచ్చి ఇచ్చేవాడు. ఒకరోజు ఆమె ఇంటికి బంధువులు వచ్చారు. అదే రోజున కూరగాయలు తెచ్చే వ్యక్తి రాలేదు. ఆమె కోపం పారా స్థాయికి చేరింది ఛి ఎవరిని నమ్మకూడదు సరైన సమయంలో అవసరమైన సమయంలో వీడు రాలేదు అనుకుంది. రెండో రోజు కూరగాయలవాటు రాగానే గట్టిగా ఆమె నువ్వు ఎంతో నమ్మకమైన వాడివని అనుకున్నాను సరిగ్గా అవసరమైన సమయంలో రాకుండా పోయావు నీలాంటి వాడిని నమ్మడం నాది బుద్ధి తక్కువకు నిదర్శనం అని కఠినంగా మాట్లాడింది. అందుకు ఆ కూరగాయలవాడు అమ్మ క్షమించండి అమ్మ నిన్న నా ముసలి తల్లి కాలం చేసింది. ఆమె అంత్యక్రియలు చేయవలసి రావడం వల్ల నేను రాలేకపోయాను. మీకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాను అన్నాడు. అంతే ఆమె మనసులో పశ్చాత్తాపం చోటు చేసుకుంది. ఇక నుండి నా జీవితంలో పూర్తిగా విషయం తెలుసుకోకుండా ఒక నిర్ణయానికి రాకూడదు అని నిర్ణయించుకుంది. తొందరపాటు ఎటువంటి పరిస్థితులను తెస్తుందో గమనించండి. వ్యక్తుల మధ్య అవగాహన ఇరుగు పొరుగుల మధ్య అవగాహన పిల్లలు తల్లిదండ్రుల మధ్య అవగాహన భార్యా భర్తల మధ్య అవగాహన దేశాల మధ్య అవగాహన ఉండాలి. మనుషుల మధ్య అవగాహన లేకపోతే ఇక దేశాల మధ్య అవగాహనను ఎలా సాధిస్తాం విశాల దృక్పదం అలవడాలి అప్పుడే శాంతి వెల్లువిరుస్తుంది. దేశ ప్రజల హృదయాలు అగ్ని పర్వతంలా ఉంటే ఇక అంతర్జాతీయ అవగాహన ప్రపంచ శాంతి ఎలా సాధ్యమవుతుంది ఒక గొప్ప ఋషికి ఒక కుమారుడు ఉన్నాడు. ఆ అబ్బాయి తన తండ్రి దగ్గరకు వచ్చి నాన్న నాకు విజ్ఞానాన్ని నేర్పించండి అని అడిగాడు. అందుకు ఆ మహాత్ముడు నాయనా ముందు అర్థం చేసుకోవడం అనేది నేర్చుకో అన్నాడు. అందుకు ఆ అబ్బాయి నాన్న విజ్ఞానం అనేది ఒక గొప్ప శక్తి ఆ శక్తి వస్తే అన్ని వచ్చినట్లే కదా అన్నాడు అందుకు ఆ తపస్సు చూడు తండ్రి మొట్టమొదట అవగాహన స్ఫూర్తిని అలవాటు చేసుకోకును విజ్ఞానం మంచిదే శక్తి గొప్పదే కానీ అవగాహన అర్థం చేసుకోవడం అనే లక్షణం లేకపోతే నీలో ఉన్న విజ్ఞానం నీకున్న శక్తి సమాజానికి హాని చేస్తుంది. ఈనాడు తెలివితేటలు పెరిగాయి సైన్సు అభివృద్ధి చెందింది సాంకేతిక విప్లవం నడుస్తుంది కానీ మనుషుల మధ్య దేశాల మధ్య ఉన్న సమస్యల్ని బుద్ధి తెలివితేటలు మాత్రమే తీర్చలేకపోతున్నాయి. ఈరోజు మానవుడు చంద్రుడి పైన కాలు మోపగలిగాడు. ఇతర గ్రహాల పైకి రాకెట్లు పంపగలుగుతున్నాడు. అంతరిక్షంలోకి సాటిలైట్లను పంపగలుగుతున్నాడు. ఇంత తెలివి ఉన్న దేశాల మధ్య మనుషుల మధ్య ఉన్న అంతరాలని తొలగించలేకపోతున్నాడు. దీనికి ప్రకాశవంతమైనటువంటి వికసించిన హృదయాలు కావాలి. అవగాహన కొరబడిన హృదయాల వల్ల పరిస్థితి మరింత జటిలం అవుతుంది. రష్యన్ లీడర్ మాక్సిమం గోర్డ్కి ఒకసారి పబ్లిక్ మీటింగ్‌లో మాట్లాడుతూ మనిషి సైన్స్ ద్వారా ఎన్నో అద్భుతాలు ఆవిష్కరించగలిగాడు. సైన్స్ మనిషికి గాలిలో పక్షిలా ఎగరడం నేర్పింది సాగర గర్భంలో చేపలా ఏదడం నేర్పింది అని సైన్స్ గురించి అనర్గళంగా మాట్లాడుతున్నాడు. మధ్యలో ఒక సాధారణ వ్యక్తి లేచి నిలబడి సైన్స్ మనిషికి అన్నీ నేర్పించింది కానీ మనిషి మనిషిగా బ్రతకడం నేర్పించలేదు మనిషి మనిషితో ఎలా బ్రతకాలో నేర్పించలేదు అన్నాడు. ఈ సంఘటన విఖ్యాతం కాలేదు కానీ జరిగిన సంఘటన. సైన్స్ తో ఉన్న సమస్య దాన్ని మిస్యూస్ చేయడమే సైన్స్ మనిషికి ఎన్నో సుఖాలను ఇచ్చింది ఎన్నో వరాలను ఇచ్చింది. సైన్స్ పురుగుల్ని చంపే క్రిమి సంహారకాలను ఇచ్చింది. ఎలుకుల్ని చంపే మందుల తయారీ నేర్పించింది. దాంతో పాటుగా mసి స్క్వేర్ అనే ఈక్వేషన్ కూడా నేర్పింది. ఈ ఈక్వేషన్ తో మానవుడు అణువును ఎలా విచ్ఛేదం చేయాలో నేర్చుకున్నాడు. ఫలితం పురుగుల్ని, ఎలుకల్ని చంపినట్లు మానవుల్ని చంపుతున్నాడు. గొప్ప ప్రవక్త జోరాస్టర్ అంటాడు 100 ఆలయాలు నిర్మించేందుకు కావలసిన కొయ్యలు రాళ్ళు కూడా ఒక్క అర్థం చేసుకునే మనసుకు సాటి రావు అని కింగ్ సాల్మన్ దేవుని ఇలా ప్రార్థిస్తాడు భగవాన్ అన్ని సౌఖ్యాలు నాకు ఇచ్చావు రాజ్యాలు సైన్యం సేవకులు సంపద అన్ని ఇచ్చావు ఇంకొక్క వరం కూడా ప్రసాదించు ఇతరులను అర్థం చేసుకునే మనసుని అని మీరు ఒక భార్యా భర్త వాదులాడుకుంటుంటే వినండి చెవిటి వాళ్ళు వాదులాడుకుంటుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఆమె చెప్పేది అతడు వినడు ఇతడు చెప్పేది ఆమె వినదు ఎవరికి వారు వాదనలో గెలవాలని శేత విధాలా ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఒకరికంటే ఒకరు గొప్ప అనిపించుకోవాలని తాపత్రయం వాళ్ళు గొడవపడే వాదులాడుకునే విషయాలు గమనిస్తే నవ్వు వస్తుంది. చాలా చిన్న చిన్న విషయాలు పనికి రాని విషయాల కోసం గొడవ పడుతూ ఉంటారు. ఇలాంటివి ప్రతి ఇంట్లోనూ చూస్తూ ఉంటాం. అవి ఎలా ఉంటాయో కూడా ఒకటి రెండు విషయాలు చూద్దాం ఒక ఆవిడ ఉండేది ఆవిడకు రాత్రిపూట పడుకోబోయే ముందు కొద్దిగా చదువుకొని పడుకుంటుంది. అందుకోసం లైట్లు వేసుకొని చదువుకుంటుంది. లైట్ ఉంటే భర్తకు నిద్రపట్టదు. ఆమె లైట్ వేయడం ఈయన లైట్ ఆర్పడం ఇక గొడవ మొదలు తెల్ల వార్లు నిద్ర లేకుండా పోట్లాడుకుంటూనే ఉంటారు. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది వెతకడమే మన పని పుస్తకం మీద మాత్రమే లైట్ పడే స్పాట్ లైట్ ని ఏర్పాటు చేసుకుంటే ఇద్దరి సమస్య తీరిపోతుంది. కానీ ఇక్కడ సమస్య లైట్ కాదు ఈగో అహం మరో శ్రీమతి ఓరోజు బాత్్రూమ్ లోకి వెళ్ళే ముందు చాలా ఆనందంగా ఉంది. కానీ బాత్్రూమ్ నుండి బయటకి వచ్చేటప్పుడు రసరసలాడుతూ వచ్చింది. ఆమె భర్త ఆమెతో ఓ నా ప్రియమైన భార్యమడి బాత్్రూమ్లోకి వెళ్ళే ముందు సరదాగా జోకులు వేస్తూ నవ్వుతూ ఉన్నావు ఇంతలో ఏమైంది అని అడిగాడు అందుకు ఆమె రుసురసలాడుతూ మీకు ఎన్నిసార్లు చెప్పాను పేస్ట్ ట్యూబ్ అడుగు భాగాన్ని వత్తమని మీ అలవాటు మానుకోరు ఎప్పుడు ట్యూబ్ మధ్యలోనే ఒత్తుతుంటారు. ఎందుకు అని కసిపెట్టుకుంది. ఇప్పుడు ఏమైంది నేను మధ్యలో వత్తితే వచ్చిన నష్టం ఏంది అన్నాడు ఇక గొడవ మొదలు ఈ గొడవ సాయంత్రం వరకు కొనసాగుతుంది. పరిష్కారం చాలా సులువు మరో పేస్ట్ కొని ఆమెకి ఇచ్చినా లేదా తాను వాడినా సరిపోతుంది. అసలు సమస్య అది కాదు పేస్ట్ కాదు ఇగో అహం భార్యా భర్తల గొడవలు ఇలానే ఉంటాయి. చాలా చిన్న చిన్న విషయాలు చాలా పెద్ద పెద్ద గొడవలకు దారి తీస్తుంటాయి. భావోద్వేగాలను అదుపు చేసుకోలేకపోతున్నారు అంటారు. ఈ భావోద్వేగాలను అదుపు చేసుకోలేకపోవడం అనే విషయమే లేదు ఈ పదాన్ని కోర్టులో వాదించడానికి లాయర్లు కనిపెట్టారు. భావోద్వేగాలను అదుపు చేసుకోలేకపోవడం కాదు అర్థం చేసుకోలేకపోవడం మాత్రమే తప్పులు జరుగుతాయి. వాటిని సవరించుకోవచ్చు కానీ సవరించుకోవడానికి మనసు ఉండాలి. ఎంతో మంది స్త్రీలు నన్ను కలిసినప్పుడు చెబుతుంటారు నా భర్త ఇంత ముందులా లేడండి ఇంతకుముందు ఎంతో ప్రేమగా వ్యవహరించేవారు ఎన్నో వాగ్దానాలు చేసేవారు కానీ ఇప్పుడు అలా లేరు ఆయన మారిపోయారు. నన్ను లెక్క చేయడం లేదు నాతో ఎక్కువసేపు గడపడం లేదు ఇలాంటి ఫిర్యాదులే చిన్న చిన్న విషయాలు ఇగో అహం కారణంగా మన కుటుంబాలు చిద్ధమైపోతున్నాయి. వీటన్నిటికీ మూల కారణం అవగాహన స్ఫూర్తి కొరబడడం ఒకరినొకరు అర్థం చేసుకోలేకపోవడం నేను ఇక్కడ పండంటి కాపురానికి 10 సూత్రాలు చెబుతున్నాను. వీటన్నింటిని లేదా వీటిలో కొన్నింటిని మీ జీవితంలో సాధన చేయండి. మీ వైవాహిక జీవితం ఆనందంగా గడుస్తుంది. మొదటి సూత్రం వీలైనంతవరకు తగాదా లేదా గొడవలకు దూరంగా ఉండండి. అవాయిడ్ నెక్స్ట్ క్వారల్ ఒకరు గొడవ పడుతూ ఉంటే రెండో వారు గమ్ముగా ఉండడానికి ప్రయత్నించండి. వీలైనంతవరకు తగాదా పడడానికి దూరంగా ఉండండి. ఏ గొడవ అయినా సూర్యాస్తమయానికి ముందే పూర్తఅయ్యేటట్లుగా ప్రయత్నించండి. మీరు సరిగ్గా మాట్లాడలేదు తప్పుగా మాట్లాడాను అని మీరు భావిస్తే మీరు అవతలి వాళ్ళను సరిగ్గా అర్థం చేసుకోలేదని మీరు రియలైజ్ అయితే అది మీకు చిన్నతనం కాదు మీ జంటలో ఒకరికొకరు సారీ లేదా క్షమాపణ చెప్పుకోవడం కోరడం చిన్నతనం అనిపించుకోదు. ఒక చిన్న కథ మనం ఇక్కడ చెప్పుకుందాం. ఒక ఊర్లో ఇద్దరు యువతీ యువకులు ఉండేవాళ్ళు ఇద్దరు చాలా షార్ట్ టెంపర్ చాలా చిన్న విషయాల కూడా ఇతరులతో గొడవపడుతూ ఉండేవారు. అలాంటి వారిద్దరికీ పెళ్లిఅయింది ఊరంతా అనుకున్నారు వీళ్ళ కాపురం ఎక్కువ రోజులు నిలవదు అని ఆశ్చర్యకరంగా వాళ్ళ కాపురం 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. వాళ్ళ 25వ వివాహ వార్షికోత్సవం నాడు ఊరంతా వాళ్ళ కాపురం ఇన్నేళ్ళు సభ్యంగా నడపడంలో నడవడంలో ఉన్న రహస్యాన్ని వెల్లడించమని అడిగారు. అందుకు భర్త మేము మా మొదటి రాత్రి ఒక నిర్ణయం తీసుకున్నాం. ఒకరు టెంపర్ గా లేదా కోపంగా ఉన్నప్పుడు లేదా అరిచేటప్పుడు రెండవ వారు గమ్ముగా ఉండాలి అని ఆ కట్టుబాటుకు నిలబడ్డాం. అందుకే ఏ గొడవ లేకుండా 25 సంవత్సరాలు హాయిగా సంసారం చేశం అని రహస్యాన్ని వెల్లడించాడు. ఇంకో సంఘటన చూద్దాం ఒక స్త్రీ ఒక గొప్ప గురువుగారి దగ్గరికి వచ్చి చెప్పింది స్వామి మా వారు ఎప్పుడూ గొడవ పడుతూ ఉంటారు చీటికి మాటికి అరుస్తూ ఉంటారు. నేను ఆయనను భరించలేకపోతున్నాను అని అప్పుడు ఆ గురువుగారు ఒక బాటిల్లో నీళ్లుు తెప్పించి ఆమె చేతిలో ఉంచాడు. ఆమె అడిగింది స్వామి ఆయన కోపంగా ఉన్నప్పుడు ఈ నీళ్ళు ఆయన చేత తాగించమంటారా అని అందుకు స్వామీజీ చెప్పారు కాదమ్మా మీ ఆయన గొడవ పడుతూ ఉన్నప్పుడు అరుస్తూ ఉన్నప్పుడు ఈ నీళ్ళు ఒక గుక్కెడు నీ నోట్లో పోసుకొని పుక్కిట్లో ఉంచుకో మీ ఆయన కోపం తగ్గేదాకా నీళ్ళను ఉయడం గాన మింగడం గాన చేయకు అని సలహా ఇచ్చాడు. అంటే ఇక రెండవ వారు దగ్గర నుంచి రెస్పాన్స్ లేకపోతే అవతల వారు కొంతసేపు వాక్కొని వెళ్ళిపోతారు. ప్రఖ్యాత సైంటిస్ట్ ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ తన 25వ వివాహ వార్షికోత్సవం నాడు ఆయన వైవాహిక జీవిత సాఫల్య రహస్యాన్ని వెల్లడించాడు. మా మొదటి రాత్రి ఒక నిర్ణయం తీసుకున్నాం. ఒక చిన్న చిన్న నిర్ణయాలన్నీ మా ఆవిడ తీసుకునేటట్లు పెద్ద పెద్ద నిర్ణయాలన్నీ నేను తీసుకునేటట్లు అయితే పెద్ద నిర్ణయం తీసుకునే అవకాశం నాకు ఇప్పటివరకు రాలేదు అని రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు ఇక రెండవ సూత్రం మీ జీవిత భాగస్వామి నుండి పరిపూర్ణతను ఆశించవద్దు. డోంట్ ఎక్స్పెక్ట్ పర్ఫెక్షన్ ఫ్రమ యువర్ స్పౌస్ ఈ ప్రపంచంలో పరిపూర్ణమైన మనుషులు ఎవ్వరూ లేరు అని గుర్తించండి. జీసస్ క్రైస్ట్ చెప్తాడు ఈ ప్రపంచంలో పరిపూర్ణులు ఎవ్వరూ లేరు స్వర్గంలో ఉన్న నా తండ్రి తప్ప పెళ్లి అనేది ఇద్దరు అపరిపూర్ణ వ్యక్తుల కలయక ఎవరైనా ఇంతకుముందు ఉన్నట్లు ఇప్పుడు ఉండరు. ఇప్పుడు ఉన్నట్లు భవిష్యత్తులో ఉండరు. మనిషి ఎప్పుడు మార్పుకు గురి అవుతూ ఉంటాడు. మార్పు అనేది ఈ సృష్టి సహజ గుణం మూడవ సూత్రం ఎదుటివాళ్ళు చెప్పేది శ్రద్ధగా వినండి. బి ఏ గుడ్ లిసనర్ మీరు ప్రపంచంలో దేన్నైనా సాధించగలరు శ్రద్ధగా వినేవాళ్ళం తప్ప నేను చాలా సమావేశాల్లో గమనించాను ఎవరైనా మాట్లాడుతూ ఉన్నప్పుడు మధ్యలో లేచి ఏదో ఒకటి అడిగేవాళ్ళను మాట్లాడుతున్న వ్యక్తి మొత్తుకుంటూ ఉంటాడు నేను చెప్పదలుచుకున్న విషయాన్ని పూర్తిగా చెప్పనివ్వండి పూర్తి చేయనివ్వండి అని మొదట అవతలి వాళ్ళు చెప్పేది శ్రద్ధగా వినండి. ఇంకొకరు మాట్లాడుతున్నప్పుడు మధ్యలో కల్పించుకుంటే ఎలా ఉంటుందో మీరు ఎప్పుడైనా అనుభవంలో గ్రహించారా మీరు మాట్లాడుతుంటే అవతల వ్యక్తి జోక్యం చేసుకుంటే ఎలా ఉంటుందో ఆలోచించండి. బ్రిటిష్ నాయకుడు బెంజమిన్ డిజ్రయిల్ అంటాడు. భగవంతుడు రెండు కళ్ళు రెండు నాసికారంద్రాలు రెండు చెవులు ఇచ్చాడు కానీ నోరు మాత్రం ఒకటే ఇచ్చాడు. అది రెండు చెవులకు మధ్యలో నోటిని అమర్చాడు. ఎందుకో తెలుసా ఎక్కువగా విను ఎక్కువగా చూడు తక్కువగా మాట్లాడు అని ఎక్కువగా మాట్లాడడం దేవుడికి ఇష్టమైతే చెవుల స్థానంలో నోళ్ళను ఉంచేవాడు. అప్పుడు మనం ఎలా ఉంటామో ఒకసారి ఊహించుకోండి మంచి వక్తగా కంటే మంచి శ్రోతగా ఉండండి. నోటి విషయంలో భగవంతుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నాడో చూడండి. హృదయం నుండి విలబడే భావం గొంతులో నుండి బయటకు వచ్చి నాలుక పళ్ళు పెదవులు వీటిని దాటుకొని బయటపడాలి. అదే చెవులు నిరాటంకంగా వినే అవకాశం ఉంటుంది. కాబట్టి మంచి శ్రోతగా ఉండండి బి ఏ గుడ్ లిజనర్ మీ నాలుక విషయంలో జాగ్రత్తగా ఉండండి అది తేమ ఉండే ప్రదేశంలో ఉంటుంది. ఎప్పుడైనా జారే అవకాశం ఉంటుంది. ఒక్క మాట స్నేహితుల్ని విడదీస్తుంది బంధుత్వాలని చెడుపుతుంది కాపురాలని కూలుస్తుంది యుద్ధాలు సృష్టిస్తుంది అదే మాట స్నేహితుల్ని దరిచేస్తుంది బంధువుల్ని కలుపుతుంది కాపురాలని నిలబెడుతుంది యుద్ధాలని నివారిస్తుంది. మాటే మంత్రం మాట్లాడిన మాట విడిచిన బాణం లాంటిది దాన్ని వెనక్కు తీసుకోలేము. మాట్లాడని మాట సద్ది మూట కాబట్టి శ్రద్ధగా వినండి ఆలోచించి మాట్లాడండి. నాలుగవ సూత్రం అందరినీ అభినందించండి పొగడండి గ్రో ఇన్ ది స్పిరిట్ ఆఫ్ అప్రిసియేషన్ అందరిని పొగుడుతూ ఉండండి మీ భార్యని పొగడండి మీ పిల్లల్ని పొగడండి మీ స్నేహితులని పొగడండి మీ ఆఫీస్ లో మీ సహచరులని పొగడండి పిల్లల్ని అభినందించండి వాళ్ళని కోప్పడద్దు మీరు పిల్లల్ని కోప్పడితే వారిలో వికాసం అడుగంటిపోతుంది. ఒక సంఘటన చూద్దాం ఒక చిన్న అబ్బాయి ఉండేవాడు ఆ అబ్బాయి నీ పేరఏంటి అని అడిగాను. స్కూల్లో నన్ను రమేష్ అని పిలుస్తారు కానీ ఇంట్లో రమేష్ డోంట్ అని పిలుస్తారు. అలా ఎందుకు అని అడిగాను. స్కూల్లో అందరూ రమేష్ అనే పిలుస్తారు నన్ను ఇంటికి వెళ్ళగానే రమేష్ డోంట్ సిట్ లైక్ దిస్ రమేష్ డోంట్ టాక్ లైక్ దిస్ రమేష్ డోంట్ డ లైక్ దిస్ అని అంటూ ఉంటారు. అందుకని నేను ఇంట్లో రమేష్ డోంట్ పిల్లల్ని ఎదగనిచ్చే పద్ధతి ఇది కాదు. పిల్లల్ని ఎప్పుడూ తిడుతూ ఉంటే వారు పెద్ద నిషేధ మూర్తులుగా తయారవుతారు. పిల్లల్ని మెచ్చుకుంటూ ఉంటే వారిలో వికాసం ఎక్కువగా ఉంటుంది. ఒక అమెరికా తత్వశాస్త్రవేత్త విలియం జేమ్స్ అంటాడు మానవ హృదయం మెప్పును కోరుతుంది. మీరు ఎవరినైనా మెచ్చుకుంటే పైకి సిగ్గు నెటించిన లోపల పొంగిపోతారు. ఇంకొక తత్వశాస్త్రవేత్త ఇలా అంటాడు మానవులు రెండు విషయాలు తప్పనిసరిగా కోరుకుంటారు. ఒకటి సెక్స్ రెండవది మనీ డబ్బు అని అందరూ అనుకుంటారు కానీ మరో రెండు విషయాలు కూడా మనిషి కోరుకుంటాడు అవి ఒకటి మెప్పు రెండు గుర్తింపు లియోనార్డ్ డావెన్సీ అంటాడు నీ స్నేహితుల గురించి గాని నీ జీవిత భాగస్వామిని గురించి గాని ఇతరుల ముందు విమర్శించకు వాళ్ళ పొరపాట్లు ఏవైనా ఉంటే వారి ముందే సౌమ్యంగా చెప్పండి అని ఇక ఐదవ సూత్రం మీలో క్షమా గుణాన్ని పెంపొందించుకోండి గ్రో ఇన్ ది స్పిరిట్ ఆఫ్ ఫర్గివ్నెస్ వివాహం యొక్క ప్రధాన సూత్రం ఒకటే ఇవ్వు ఇవ్వు ఇవ్వు నువ్వు ఇచ్చిన దానికి ఫలితాన్ని ఆశించకు క్షమించు క్షమించు క్షమించు ఎన్నిసార్లు క్షమించావో లెక్కించకు జీసస్ ఆయన భక్తులని అడిగారు ఎవరైనా ఎన్నిసార్లు క్షమించాలి అని జీసస్ చెప్పాడు లెక్క లేకుండా క్షమించడం అలవాటు చేసుకోండి అని ఇద్దరు చిన్ననాటి స్నేహితులు చాలా కాలం తర్వాత బజార్లో కలుసుకుంటారు. పొద్దుపోయే వరకు ఒక రెస్టారెంట్ లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు. వారికి సమయమే తెలియలేదు. ఇంతలో వారిలో ఒకరికి ఇంటి నుండి ఫోన్ వచ్చింది. దాంతో ఆయన కంగారుగా పరిగెడుతూ ఇంటికి వెళ్ళాడు. మర్నాడు స్నేహితుడు ఫోన్ చేసి అడిగాడు రాత్రి ఇంటికి పరిగెడుతూ వెళ్ళవ ఏమైనా సీరియస్ అని దానికి ఆయన అదేం లేదు రాత్రి మా ఆవిడ హిస్టారికల్ గా మారింది అన్నాడు అవతల స్నేహితుడికి అర్థం కాలేదు. హిస్టరికల్ గానా అని అడిగాడు కాదు కాదు హిస్టారికల్ గానే రాత్రి ఆమె గత చరిత్రనంతా విప్పింది పెళ్లయినప్పటి నుండి ఇప్పటివరకు జరిగిన తప్పులన్నీ రాత్రి ఏకరవు పెట్టింది అన్నాడు క్షమించడం అంటే ఇలా కాదు షేక్స్పియర్ అంటాడు క్షమ అనేది మనల్ని కష్టపెట్టే విషయం కాదు క్షమ అనేది స్వర్గం నుండి భగవంతుడు కురిపించే సన్నటి చిరుజల్లు లాంటిది ఇతరుల తప్పులని క్షమించలేని వాడు భగవంతుడు కురిపించే దయా వర్షానికి గొడుగు అడ్డం పెట్టుకున్నవాడే అవుతాడు. వినయం నమ్రత విధేయతలు మీలో పెంపొందించుకోండి. ఇది ఆరవ సూత్రం గ్రో ఇన్ ది స్పిరిట్ ఆఫ్ హూమిలిటీ చాలా అవసరమైన గుణం మీరు స్వర్గ తుల్యమైన గృహాన్ని నిర్మించుకోవాలి అంటే వినయాన్ని అలవర్చుకోండి అండర్స్టాండింగ్ అంటే అర్థం ఏమిటి అండర్స్టాండింగ్ అనే పదం ఏ సందేశాన్ని ఇస్తుంది అండర్‌స్టాండ్ కింద నిలబడండి ప్రతివాళ్ళు పైన నిలబడాలని చూస్తారు కింద నిలబడడానికి అణగి మణగి ఉండడానికి ఎవ ఎవరు ప్రయత్నించరు అలా ఉన్నందువల్ల మీ గొప్పతనం ఏం తగ్గిపోదు. అనువు గాని చోట అధికులమనరాదు కొంచెం ఉండుటెల్ల కొదువ కాదు కొండ అద్దమందు కొంచెమై ఉండదా విశ్వదాభవిరామ వినురవేమ ఎప్పుడు మీరు గొప్పలు చెప్పుకోకండి నేను అది చేశాను నేను ఇది చేశాను నేనే అంతా సంపాదించాను అంటూ గొప్ప గొప్పలకు పోకండి. మేరీ అండర్సన్ ఎప్పుడు తన ఉపన్యాసంలో నేను అనే పదాన్ని వాడలేదు. ఒకసారి ఒక సభలో ఇదే ప్రశ్నను ఒక విలేగరు అడిగాడు. మీరు ఎప్పుడు నేను అనే పదాన్ని వాడలేదు కారణం ఏమిటి? అందుకు ఆమె ఇచ్చిన సమాధానం అద్భుతం ఈ ప్రపంచంలో ఏదైనా ఒక్కరే సాధించలేరు. ప్రతి కార్యం సమిష్టి కృషి అని అలాగే ఇల్లు సభ్యంగా నడవాలి అంటే భార్య, భర్త, పిల్లలు, తల్లిదండ్రులు, బంధువులు, మిత్రులు అందరి సహకారం ఆ కుటుంబ అభివృద్ధికి కారణం. భార్య ప్రోత్సాహం భర్తను అభివృద్ధి పదాన ముందుకు నడిపిస్తుంది. భర్త ప్రోత్సాహం భార్య ఆనందానికి కారణం అవుతుంది. తల్లిదండ్రుల ప్రోత్సాహం పిల్లల అభివృద్ధికి కారణం అవుతుంది. కాబట్టి సమిష్టి కృషి ఏదైనా కార్యాన్ని సాకారం సాఫల్యం చేస్తుంది. నేను అనే ఇగో అహాన్ని వదిలి అనగుగా ఉండడం అలవాటు చేసుకుంటే మన ఇల్లు స్వర్గాలే సెంట్ ఫ్రాన్సిస్ ని ఒకసారి కొందరు మిత్రులు అడిగారు నువ్వు అందగాడివి కాదు గొప్ప శక్తివంతుడివి కాదు గొప్ప తెలివిగలవాడివి కాదు బాగా చదువుకున్న వాడివి కాదు కానీ ప్రజలందరూ నిన్ను గొప్పగా ఎందుకు గౌరవిస్తారు అని అడిగాడు అందుకు ఆయన ఇచ్చిన సమాధానం ఆ భగవంతుడు తన దయ యొక్క మహత్యాన్ని చూపించాలని తలంచాడు మానవుల్లో ఎందుకు పనికి రానివాడు ఎవరైనా ఉన్నారా అని వెతికి వెతికి నన్ను పట్టుకున్నాడు. ఈ కీర్తి ఈ ప్రఖ్యాతి అంతా ఆయన దయావర్షమే అని సమాధానం ఇచ్చాడు. అంతటి గొప్పవాడు తనను తాను ఎలా చూసుకుంటున్నాడో గమనించండి. అంతటి అనుకువ మనదిగా చేసుకుందాం. ఇక ఏడవ సూత్రం చర్చించండి వాదించవద్దు డిస్కస్ బట్ నాట్ ఆర్గ్యూ మీరు ఏదైనా విషయాన్ని చర్చించండి వాదించవద్దు మీరు ఎప్పుడూ వాదించడం వల్ల గెలవలేరు అవతలి వారిని మీ వాదన పటిమతో అలసిపోయేటట్లు చేసి వారు వాదనను వదులుకునేటట్లు మాత్రమే చేయగలరు. ఇఫ్ యు విన్ ద ఆర్గ్యుమెంట్ యు లూస్ ద పర్సన్ మీ కుటుంబంలో వాదనకు తావిస్తే మీరు కుటుంబంలోని సభ్యులను కోల్పోతారు. సమస్య ఉన్నప్పుడు దాని మీద చర్చించండి మీ అభిప్రాయాలు తెలియజేయండి. మీ అభిప్రాయమే గెలవాలని మీ నిర్ణయమే అమలు కావాలని పట్టుదలకు పోకండి. చాలా కాపురాలు కోలడానికి కారణాలు పట్టుదల వాదించుకోవడాలు. ఇక ఎనిమిదవ సూత్రం మీలో హాస్యరసాన్ని కాస్త అభివృద్ధి చేసుకోండి. డెవలప్ ఏ హెల్దీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ నవ్వడం నేర్చుకోండి నవ్వడం శరీరానికి మంచి టానిక్ లాంటిది అది శరీరానికి మనసుకు ఆధ్యాత్మికతకు బలాన్ని ఇస్తుంది. నవ్వడం వలన లంగ్స్ బాగా పనిచేస్తాయి రక్త ప్రసరణ బాగా జరుగుతుంది తిన్నది బాగా అరుగుతుంది. మీ బుద్ధికి బలం చేకూరుతుంది. మీరు నవ్వడం నేర్చుకోండి మనం హాయిగా నవ్వడం మర్చిపోయి ఎంత కాలం అయింది నవ్వలేని వాడు బ్రతుకు అందం ఎరుగలేడు నవ్వలేని వారు జీవితంలో ఆనందంతో పాటు అన్ని కోల్పోయినట్లే ఇతరుల నిస్సహాయత మీద ఇతరులను కించపరచడానికి నమ్మకండి. హాస్యం నవ్వు ఈ రెండు మనకు అద్భుతమైన ఆనందాన్ని ఇస్తాయి. ఆడం గాడ్ ని అడిగాడు ఈవుని ఎందుకు అంత అందంగా సృష్టించావు అని గాడ్ సమాధానం నువ్వు ఆమెను ప్రేమించడానికి ఈవు అడిగింది ఆడమని ఎందుకు అంత తెలివి తక్కువ వాడిగా సృష్టించావు అని గాడ్ సమాధానం అతడు నిన్ను ప్రేమించడానికి అని ఇంకొక సరదా విషయం ఓ జంట భర్త పొడుగ్గా భార్య పొట్టిగా ఉంటుంది. ఒకరోజు ఇద్దరు వాదనకు దిగారు భర్తకు బాగా కోపం వచ్చి నిన్ను మింగేస్తాను అన్నాడు భార్య కాస్త సరదా మనిషి నన్ను మింగితే మీకు తలలో కంటే కడుపులోనే మెదడు ఉంటుంది అన్నది ఇంకొక సరదా జోక్ చెప్పుకుందాం. ఒక భర్త తన భార్యను గురించి ఒక స్నేహితుడిని చెప్తున్నాడు. ఇంతకుముందు నా భార్య నాకు బూట్లు తెచ్చిచ్చేది మా కుక్క అరుస్తూ ఉండేది. ఇప్పుడు సీన్ మారింది సీన్ రివర్స్ అయింది నా కుక్క బూట్లు తెరుచుతుంది నా భార్య అరుస్తూ ఉంది అని ఆమె కాస్త సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎక్కువ ఎందుకు మీరు అలా చెప్తారు మీకు ఇప్పుడు కూడా రెండు లభిస్తున్నాయి కదా ఊట్లు లభిస్తున్నాయి అరుపులు లభిస్తున్నాయి ఇలా ఇంకొక సరదా విషయం చూద్దాం ఒక జంట వార్షికోత్సవం జరుపుకుంటూ ఉంది. భర్త చాలా విచారంగా కూర్చొని ఉన్నాడు. ఎందుకు మీరు దిగులుగా ఉన్నారు అని భార్య అడిగింది. మీకు గుర్తుందా పెళ్లికి ముందు మనం ఒకే మంచం మీద ఉండంగా మీ నాన్నగారికి పట్టుబడ్డాం. తర్వాత ఆయన నన్ను కూర్చోబెట్టి నేను ఈ విషయం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తే నీకు 20 సంవత్సరాలు జైల్ శిక్ష పడుతుంది. కాబట్టి మా అమ్మాయిని పెళ్లి చేసుకో అన్నాడు. ఆ రోజు నిరాకరించినా బాగుండేది ఈ పాటికి జైల్ నుంచి బయట పడేవాడిని అని వాపోయాడు. హాస్యం జీవితంలో ఒక భాగంగా ఉండాలనుకున్నాం కాబట్టి కొన్ని జోక్స్ చెప్పుకున్నాం కొన్ని సరదా విషయాలు మాట్లాడుకున్నాం. తొమ్మిదవ సూత్రం మీ హృదయాలు ప్రేమతో నింపండి ఫిల్ యువర్ హార్ట్స్ విత్ లవ్ మీ కుటుంబ సభ్యులను ప్రేమించండి మీ చుట్టూ ఉన్న సమాజాన్ని ప్రేమించండి ప్రేమ అనేది మీ మనసులో చోటు చేసుకుంటే మీ హృదయం సున్నితం అవుతుంది. ఎవరిని నొప్పించడానికి ఇష్టపడరు. ఈ ప్రేమ నిస్వార్థంగా ఉండాలి. ఎదుటి వారి నుంచి ఏమి ఆశించకుండా ప్రేమించగలగాలి. మీరు ఇతరులను ఎంత ప్రేమిస్తారో ఇతరులు మిమ్మల్ని అంతగా ప్రేమిస్తారు. ద్వేషం ద్వేషాన్ని తెస్తుంది ప్రేమ అనేది మీ మనసులో ఉంటే మీ కుటుంబ సభ్యులు చేసే చిన్న చిన్న పొరబాట్లు మీకు కనిపించవు. మీ ప్రేమ అందరినీ మీకు దగ్గర చేస్తుంది. ప్రేమ అనే ఒక్క పదాన్ని గురించి చెప్పాలి అంటే రోజులు తరబడి చెప్పొచ్చు కాబట్టి ఆఖరి అంశాన్ని చూద్దాం. 10వ సూత్రం భగవంతుని మళ్లా మీ ఇంట్లోకి తీసుకురండి. బ్రింగ్ గాడ్ ఇన్ యువర్ హోమ మనం ఇవాళ ఇళ్ల నుంచి భగవంతుని తోసి వేసాం. ఆ ఖాళిని దెయ్యాలు ఆక్రమించుకున్నాయి ఇది ఎంత నిజమో ఆలోచించండి దెయ్యాలు భూతాలు ఎన్ని ఇళ్ల మీద స్వారీ చేస్తున్నాయో చూడండి. స్పిరిచువల్ థాట్స్ కు దూరమైతే ఆ గ్యాప్ ని ఈవిల్ థాట్స్ భర్తీ చేస్తాయి. మీ గృహాలు మీ కుటుంబాలు చల్లగా ఆనందంగా ఉండాలి అంటే మళ్లా మీరు దేవుని ఇంట్లోకి ఆహ్వానించండి. దేవుని ఆరాధించండి ప్రతిరోజు అందరూ కలిసి దేవుడి పటం ముందు కూర్చొని 10 నిమిషాలు ప్రార్థన చేయండి. మీరు ఏ దేవుడినా పూజించండి శివుడు విష్ణువు దుర్గ రామ కృష్ణ అల్లా యెహోవా బుద్ధుడు ఏ దేవుడైనా లేదా ఏ సాధు పురుషుల మహాత్ముల చిత్రపటాన్ని శిరిడి సాయి పుట్టపర్తి సాయి బుద్ధుడు గురునానక రమణ మహర్షి మెహర్ బాబా ఎవరైనా గాన మీ ఇంట్లో ప్రతిష్టించండి. మీ ఇంట్లో ప్రధానమైన చోట చిత్రపటాన్ని పెట్టండి. మీరు బయటకి వెళ్ళేటప్పుడు ఇంట్లోకి వచ్చేటప్పుడు ఒక్కసారి ఆ చిత్రపటానికి నమస్కరించండి. రోజులో ఒక్క పూట ఇంట్లో అందరూ కలిసి భోం చేయండి ఈ రెండు విషయాలు మీ గృహాన్ని స్వర్గతుల్యం చేస్తాయి. ఆనందాన్ని ప్రశాంతతను మీ సొంతం చేస్తాయి. ఇది మిత్రులారా ఈ 10 సూత్రాలను పాటిస్తారని లేదా 10లో కొన్ని సూత్రాలనైనా పాటించి మన జీవితాలను మన కాపురాలను బాగుపరుచుకుంటారని ఆశిస్తున్నాను. ఈ మంచి కార్యానికి నన్ను ప్రోత్సహించిన నా తల్లిదండ్రులు శ్రీ పచ్చిములుసు వెంకటేశ్వరులు గారు శ్రీమతి ప్రమీల గారుల పాదపద్మాలకు నమసులు మిత్రులారా ఇప్పటివరకు మనం మాట్లాడుకున్న విషయాలు మీ కుటుంబాలు మీ గృహాలు స్వర్గధామాలు కావాలనే గాఢమైన కోరిక ఎన్నో కుటుంబాలు విచ్చిన్నం అవుతున్నాయ అనే బాధ వివాహ స్ఫూర్తి లోపిస్తుందని లోపిస్తుందనే ఆర్తి సంస్కృతి సాంప్రదాయా యాలు అడుగంటి పోతుంటే చూస్తూ పడుతున్న ఆవేదన ఈ పనికి పురికొలిపింది. మీ కాపురాలు మీ గృహాలు మీ కుటుంబాలు కలకాలం చల్లగా ఆనందంగా ఉండాలని సుఖ సంతోషాలతో వర్దిల్లాలని కాంక్షిస్తూ మీ మదన్ గుప్త మరో మంచి విషయంతో మీ ముందుకు వస్తాను అప్పటివరకు సెలవా మరి మిత్రులారా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే మన ది మదన్ గుప్త ఛానల్ ను సబ్‌స్క్రైబ్ చేయండి లైక్ చేయండి, షేర్ చేయండి బెల్ ఐకాన్ నొక్కండి మీ మిత్రులకు కూడా ది మదన్ గుప్త ఛానల్ ను పరిచయం చేయండి. మిత్రులారా మనకున్న సబ్స్క్రైబర్స్ కంటే చూస్తున్నటువంటి వ్యూయర్స్ దాదాపు 70% మంది సబ్‌స్క్రైబ్ చేసుకోవడం లేదు. ఈ విషయాన్ని గుర్తించి మీరు సబ్‌స్క్రైబ్ చేసుకుంటే మాకు ఎక్కువ ఉత్సాహం వస్తుంది ఎక్కువ పని చేయడానికి అవకాశం ఉంటుంది. వీడియోలో చెప్పుకున్నట్టు మీరు ప్రోత్సాహం ఇస్తే ఇంకా ఎక్కువగా పని చేయడానికి మాకు స్ఫూర్తి లభిస్తుంది. మీకు ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాం చాలా ఆర్థిక ఒడుదుడుకులకు తట్టుకుంటూ ఈ వీడియోలు మీ దగ్గరకు తీసుకొస్తున్నాం. స్క్రీన్ మీద చూపించినటువంటి నెంబర్లకు గాని లేదా బార్కోడ్ ని స్కాన్ చేసి గాని మీ సహాయ ధనరాశిని మాకు పంపించవచ్చు. జై హింద్ జై మాభారతి. నమస్కారం మిత్రులారా మీ మదన్ గుప్త
No comments:
Post a Comment