Pasupula Pullarao...8919291603..
పంచ భూతాలు ఆకాశతత్వం, భుమితత్వం, అగ్ని తత్వం, నీటి తత్వం, వాయు తత్వం లో సమస్త మానవాళి శ్వాస ద్వారానే జీవన మనుగడ... జీవించి ఉండడం జరుగుతుంది... మిగతా తత్వాలు అవసరాన్ని బట్టి ఉపయోగించడం జరుగుతుంది...
భూమ్మీద మనుగడ కొనసాగిస్తూ శ్వాసతో జీవిస్తూ ఉంటారు.
అందుకే గురువులు, పురాణ ఇతిహాసాలు, అధ్యాత్మిక గ్రంధాలు శ్వాస కు అంత ప్రాముఖ్యత ఇవ్వడం జరిగింది.
ధ్యాన గురువులు అయితే ఏకంగా శ్వాస గురువునే పట్టుకోమన్నారు..
శ్వాస మీద ధ్యాస పెడితేనే కదా ధ్యాన సాధన యొక్క విశిష్టతను గురించి అనుభవ పూర్వకంగా తెలుసుకునే అవకాశం కల్గేది...
సాధన చేయకుండా మౌనంగా ఉండగలరా... ధ్యానం అంటేనే మౌనం... దానికి మౌన ధ్యానం అనే tyagulu ఎందుకు?
సాధన చేయకుండా మనసును నిలకడగా ఉంచగలరా.
సరైన సాధన చేయకుండా నాడీమండలం శుద్ది జరుగుతుందా.
మద్యలో వచ్చిన నడమంత్రపు పుస్తకాలు, మిడి మిడి జ్ఞాన ప్రచారాలు పక్కన బెట్టి సరైన సాధన చేయడానికి ప్రయత్నం, ప్రాముఖ్యత ఇవ్వాలి. ఒకే ఒక్క శ్వాస మీద ధ్యాస ద్వారా అన్ని తత్వాలు అందుబాటులోకి వస్తాయి.
No comments:
Post a Comment