Sunday, February 1, 2026

 *_స్వరాజ్యమే ఊపిరి.._*
*_పంజాబ్ కేసరి..!_*

_______________________

_లాలా లజపతిరాయ్ జయంతి_
       28.01.1865
++++++++++++++++++

*_లాల్ బాల్ పాల్.._*
ఈ త్రయం..
స్వరాజ్య సాధనే తాపత్రయం..
లాల్ అంటే లాలా లజపతి
తిరుగుబాటే
ఆయన పరిణితి..
ఆవేశమే ఆకృతి..
ఆయన నోటి నుంచి వెలువడిన 
ఒక్క మాట
మహోద్యమమై..
తెల్లోళ్ళ గుండెల్లో 
దిగిన బల్లెమై..
బ్రిటిష్ అధికారమే కల్లోలమై..
నిజానికి ఆ మాట..
పేలిన తూటా..
అదే అదే..
*_సైమన్ గో బ్యాక్..!_*

*అది 30 అక్టోబర్..1928..*
దేశంలో రాజకీయ పరిస్థితులపై నివేదనకు
సైమన్ కమిషన్ రాక..
అప్పుడే వినిపించింది 
లాలా లజపతి పొలికేక..
*_వెనక్కి పో సైమన్_*
ఆ వెంటనే మొదలైంది
లాఠీల వీరవిహారం..
తెల్ల దొరల విధ్వంసం..
తళతళమంటున్న ఎండలో
ఫెళఫెళమన్న లాఠీలు..
లజపతి అంతమే లక్ష్యంగా
చెలరేగిన స్కాట్ క్రౌర్యం..
వెన్నుచూపని లాలా శౌర్యం..
ఒంటినిండా రక్తం..
అది పొగలు కక్కుతూ
నినదిస్తూనే ఉంది
*_వందేమాతరమని..!_*

పోలీసు దెబ్బలే 
మాయని గాయాలై..
జేమ్స్ స్కాట్ వ్యక్తిగత దాడి
మృత్యురూపమై..
స్వరాజ్యం..స్వతంత్రం అని
నినదిస్తూ *_పంజాబ్ కేసరి_*
వదిలాడు ఊపిరి..
మాకేమి సంబంధం లేదన్న
బ్రిటీష్ అహంకారం..
సాక్షీభూతుడై నిలిచిన
భగత్ సింగులో
వెల్లువెత్తిన ఆవేశం..
లజపతి మరణానికి
ప్రతీకారం తప్పదన్న
శపథం..
అదే స్వరాజ్యసాధనకు
వేసింది సిసలైన పథం..!

లాఠీ దెబ్బలు తింటూ
లాలా చెప్పిన మాటలు..
తెల్లదొరల కోటలకు బీటలు..
_*ఈరోజు నాపై పడిన దెబ్బలు*_
*_నా దేశంలో బ్రిటిష్ పాలన_*
*_శవపేటికకు చివరి మేకులు.._*
అవి పిడిబాకులు..!

      *_సురేష్ ఎలిశెట్టి_*
        9948546286
        7995666286

No comments:

Post a Comment