*"నువ్వు చేసే "మంచిని" నువ్వు మరిచిపోయినా - దైవం మరిచిపోదు..!!*
*'నువ్వు చేసే "చెడుని" దైవం మరిచిపోయినా- "కర్మ" మరిచిపోదు..!!*
*"మనం చేసే ఏ పనైనా వృథా పోదని చెబుతోంది. మనం చేసే మంచి పనులను దైవం గుర్తుంచు కుంటుందని.."'*
*"అలాగే మనం చేసే తప్పుల నుండి '"కర్మ'" సిద్ధాంతం నుండి ఎవరూ తప్పించుకోలేరని.. ఎంతటి వారినైనా "కర్మ" వదిలిపెట్టదు అని ఇది హెచ్చరిస్తోంది. అంటే ప్రతి పనికీ "ప్రతిఫలం.." ఖచ్చితంగా ఉంటుందని దీని అర్థం."*
*"మనుషులు సృష్టించిన కంప్యూటర్, ఇంటర్ నెట్, cc కెమెరాలు, ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ (AI), వాట్సాప్ మొదలగునవి.. వాటిని కనిపెట్టిన మనుషులకే ఇంత శక్తి సామర్థ్యాలు ఉంటే.. మనుషులను సృష్టించిన భగవంతునికి🕉️ సర్వశక్తివంతునికి ఎంత నెట్వర్క్ ఉంటుందో.. ఎంత అనంతమైనశక్తి సామర్థ్యాలు ఉంటాయో కొద్దిగా అర్దం చేసుకోండి..."*
*"ఎవరూ చూడరు, ఎవరూ వినరు అని.. ఎన్నో ఎన్నెన్నో చెడు కర్మలు చేస్తుంటే సృష్టి కర్త- పరంపిత పరమాత్మ- ప్రకృతి మాత చూస్తూ ఉండాలా..."*
*"చేసే మంచి చెడు కర్మల ఫలితాలు ఏదో ఒకరోజు అనుభవించి తీరవలసిందే..."*
*"దైవానికి' కాదు 'కర్మకు' 'భయపడు"*
*"దైవం' క్షమించినా 'కర్మ' అనుభవించి తీరాల్సిందే!!!*
*పాప-పుణ్యాలు నిర్ణయించేది శివచైతన్య 🎇శక్తి.. అది ఏ సన్నివేశాన్ని, ఏ కర్మణి మర్చిపోదు.. శివ చైతన్య🎇 శక్తికి అనంతమైన జ్ఞాపకశక్తి ఉన్నది.. కాలం నీ కర్మని వడ్డీతో సహా నీకే తిరిగి ఇచ్చేస్తుంది.*
*చిన్న🌰విత్తనం పెరిగి మహా వృక్షం🌳అవుతుంది. అదే విధంగా మనం చేసిన కర్మలకు ఫలితంగా కాలక్రమంలో విధిని అనుసరించి కర్మఫలం (కర్మ ఫలితం) లభిస్తుంది.*
*ఆ కర్మఫలాన్ని సరైన సమయంలో, తగిన విధంగా అందించే ఏకైక స్వాభావిక శక్తి ఈశ్వరుడు (🕉️భగవంతుడు శివ పరమాత్మ🎇). సకల జగత్తుకూ తండ్రి అయిన ఆయనకు ఒకరి మీద ఇష్టం, మరొకరి మీద ద్వేషం ఉండవు.*
*ప్రతి కర్మకు కర్మానుగుణంగా ఫలాన్ని ఇచ్చేదే భగవంతుని శక్తి, దీన్ని మనం ఈశ్వర శక్తి -శివశక్తి
గా భావిస్తాం.*
*శాస్త్రాల్లో దీన్ని విధి లేదా కాలం అని పేర్కొన్నారు. ఏది ఎప్పుడు జరగాలో దాన్ని నిర్ణయించేది నియతి లేదా విధి.. దీన్ని నియమబద్ధంగా నడిపించేది కాలం*
*"ఇప్పుడు సరైన సాధన ద్వారా మనసును అందాల బృందావనం గా మార్పు చేసుకోవాలి..."*
*"భగవంతుడు మానవ జన్మ ఉత్తమమైన జీవన విధానము కొరకే ఇచ్చాడు.. మహనేయమైన మానవ జన్మ ను మహోన్నతంగా తీర్చి దిద్దుకోవాలి..."*
*"అది నీ చేతుల్లోనే నీయొక్క పాజిటివ్ ఆలోచనలు లోనే ఉంది..."*
*"అందుకే నిత్యం, నిరంతరం నీలోకి నీవు ప్రవేశించాలి.. అలా ప్రవేశించే అవకాశం, మార్గం సరైన సాధన ద్వారానే సాధ్యం..."*
*"ముందుగా నిన్ను మనిషిగా పుట్టించిన భగవంతునికి ధన్యవాదములు, కృతజ్ఞతలు తెలియజేయాలి..."*
*"సక్రమమైన పద్ధతిలో జీవించడానికి మార్గం చూపిన గురువులకు, జన్మ నిచ్ఛిన తల్లి దండ్రులకు కూడా ధన్యవాదములు కృతజ్ఞతలు తెలపాలి..."*
*"విశ్వాని ప్రకృతి తల్లిని (మాతని) చేసిన తప్పులకు క్షమాపణ కోరాలి..."*
No comments:
Post a Comment