ఇంటింటికి కట్టుకోవాల్సింది పూజా గదులు కాదు!
పుస్తకాల గదులుండాలి.
మన దేశానికైనా దేహానికైనా కావాల్సింది పూజలు కాదు పుస్తకాలు కావావి.
చదువు విజ్ఞానాన్ని పెంచుతుంది. విజ్ఞానం నుంచి వివేకం పెంచుతుంది. మనకిప్పుడు వివేకం గలవాళ్ళు కావాలి.
ఏ విషయాన్నైనా వివేకంతో ఆలోచించి, సహేతుకతతో తర్కించి నిజానిజాలను నిర్దారించుకోవాలి.
మనం నేడు నమ్మకాల యుగంలో లేము! నిజనిర్ణారణ యుగంలో ఉన్నాము. గుడ్డి నమ్మకాలు వ్యవస్థను బాధిస్తాయి. సమాజాన్ని విచ్ఛిన్నం చేస్తాయి.
తరతరాలుగా మన పూర్వికుల నుంచి మన తండ్రుల వరకు ఏవో కొన్ని నమ్మకాలు, ఆచారవ్యవహారాలు మనకు వరసత్వంగా వెంబడించవచ్చు! వాళ్ళలో విద్య లేకపోవడం వల్ల వాటిని అనుసరిస్తూ అనుకరిస్తూ రావచ్చు!
మనం పెద్దలను గౌరవిస్తూనే వారితో వచ్చిన నమ్మకాలు నిజమా కాదా? సత్యమా? అసత్యమా? వాటి వలన మనకు ఎంత మేరకు ఉపయోగం ఉంది? నష్టం ఉంది అంటూ హేతుత్వ కోణంలో వివేకించి విశ్లేషించి సరైనా శాస్త్రీయమైన జీవన విధానాన్ని అలవర్చుకోవాలి.
ఇలా హేతువాదాన్ని భుజానేసుకుని ప్రయాణిస్తున్నపుడు కుటుంబం నుంచి, బంధువుల నుంచి స్నేహితుల నుంచి ఇరుగు పొరుగువారి నుంచి ఏన్నో ప్రశ్నలు మరెన్నో చీత్కారాలు, దూషణలు, వినాల్సివస్తుంది. అయినా మనం సరైనా శాస్త్రీయమైన దారిలో ప్రయాణిస్తున్నామనే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లో ముందుకు సాగాలి.
No comments:
Post a Comment