Wednesday, March 4, 2026

అందరికీ నచ్చాల్సిన అవసరం లేదు! మీలా మీరు ఉండండి | Be Your Authentic Self Always | Satyagrahi

అందరికీ నచ్చాల్సిన అవసరం లేదు! మీలా మీరు ఉండండి | Be Your Authentic Self Always | Satyagrahi

Author Name:Satyagrahi

Youtube Channel Url:https://www.youtube.com/@satyagrahistories

Youtube Video URL:https://www.youtube.com/watch?v=hdNuYFqVtxQ



Transcript:
(00:00) అందరినీ సంతోష పెట్టాలని చూస్తున్నారా అయితే మీరు మీ జీవితాన్ని మీరే నాశనం చేసుకుంటున్నారు. పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు మీ ఆలోచనలన్నీ వేరే వాళ్ళ చుట్టూనే తిరుగుతున్నాయా నేను ఇది చేస్తే వాళ్ళు ఏమనుకుంటారు వాళ్ళు అడిగింది చేయకపోతే వాళ్ళ కోపం వస్తుందేమో నన్నందరూ మంచివాడని అనుకోవాలి. ఈ ఆలోచనలతోనే మీ రోజంతా గడిచిపోతుందా? మనం చాలా మందికి సహాయం చేయాలనుకుంటాం.
(00:23) అందరితో మంచిగా ఉండాలనుకుంటాం. ఇది మంచిదే కానీ ఎదుటి వాళ్ళని సంతోష పెట్టే క్రమంలో మిమ్మల్ని మీరు పూర్తిగా మర్చిపోతున్నారు. మీకు ఇష్టం లేకపోయినా సరే అని తలపుతున్నారు. లోపల ఏడుపోస్తున్న బయటకి మాత్రం ఒక నకిలి నవ్వుని పులుముకుంటున్నారు. దీన్ని పీపుల్స్ ప్లీజింగ్ అంటారు. అంటే ఇతరుల ఆమోదం కోసం మన ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టడం.
(00:44) కాకపోతే మీరు గమనించని విషయం ఏంటంటే మీరు ఎంతమందిని సంతోష పెట్టినా ఎక్కడో ఒక చోట ఎవరో ఒకరు మీ మీద అసంతృప్తిగానే ఉంటారు. ఎందుకంటే అందరినీ మెప్పించడం అనేది ఈ ప్రపంచంలో అసాధ్యమైన పని. మీరు ఒకరి కోసం మీ ఇష్టాన్ని చంపుకుంటే మరొకరు ఇంకోటి ఆశిస్తారు. ఇలా చేస్తూ పోతే అసలు మీరు ఎవరు? మీకంటూ ఒక ఇష్టం ఉందా? మీకంటూ ఒక వ్యక్తిత్వం ఉందా? రమణ మహర్షి గారు ఎప్పుడూ ఒక మాట అడిగేవారు నువ్వు ఎవరు? ఈ ప్రశ్న వేసుకుంటే మీరు ఇతరుల అభిప్రాయాల మూట అని చెప్పేసి మీకు అర్థం అవుతుంది.
(01:14) మీరు మీలా లేరు ఎదుటి వాళ్ళు మిమ్మల్ని ఎలా చూడాలనుకుంటున్నారో అలా నటిస్తున్నారు. ఈ నటన మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతుంది. ఆ విషయం మీకు కూడా తెలుసు. మరి ఈ సమస్య మనక ఎందుకు వస్తుంది? మనకఎందుకు ఈ జబ్బు ఎందుకు మనం అందరి ముందు మంచి అనిపించుకోవడానికి ఇంతలా తాపత్రాయ పడతాం. దీనికి కారణం భయం ఒంటరి అయిపోతామేమో అన్న భయం.
(01:34) మనల్ని ఎవరు ప్రేమించరేమో అన్న ఆందోళన. చిన్నప్పటి నుంచి మనక ఏం నేర్పించారంటే అందరూ చెప్పింది వింటేనే నువ్వు మంచి బాలుడివి లేకపోతే మంచి అమ్మాయివి మనకంటూ ఒక ఆలోచన ఉండకూడదు. కేవలం పెద్దలు లేదా సమాజం గీసిన గేదలో నడవడమే క్రమ శిక్షణ అని నమ్మగలికారు. కానీ ఒక్కసారి ఆలోచించండి. రమణ మహర్షి గారు తన 16వ ఏట మరణం గురించి ఆలోచించినప్పుడు ఆయనకు అర్థమైంది ఏంటంటే ఈ శరీరం ఈ బంధాలు ఈ లోకం ఇచ్చే సర్టిఫికెట్లు అన్నీ తాత్కాలికమే అని.
(02:02) ఆయన తన ఇంటిని వదిలి అరుణాచలం వెళ్ళినప్పుడు లోకం ఏమనుకుంటుందో అని భయపడలేదు. ఎందుకంటే ఆయనకి తన మీద తనకు క్లారిటీ ఉంది. మన సమస్య ఏంటంటే మన విలువని ఇతరుల చేతుల్లో పెడతాం. వాళ్ళు నువ్వు గొప్పడివ అంటే మనం సంతోషపడతాం. వాళ్ళు నువ్వు వేస్ట్ అంటే మనం కుంగిపోతాం. అంటే మన రిమోట్ కంట్రోల్ వాళ్ళ చేతుల్లో ఉంది. వాళ్ళు ఏ బటన్ నొక్కితే ఆ ఎమోషన్ లోకి వెళ్ళిపోతాం.
(02:24) ఇలా ఉండటం వల్ల మీకంటూ ఒక స్వతంత్రమైన గుర్తింపు ఉండదు. అవసరం తీరిపోయాక ఈ లోకం మిమ్మల్ని చాలా తేలికగా విస్మరిస్తుంది అంటే మర్చిపోతుంది. అప్పుడు మీకు మిగిలేది కేవలం అలసట అసంతృప్తి మాత్రమే. మీరు అందరికీ అన్ని చేశారు కానీ మీకు మీరు ఏం చేసుకున్నారు? మీ ఆత్మను మీరు ఎంతవరకు ప్రేమించారు? సరే అసలు ఈ సమస్యని ఎలా అధిగమించాలి? ఇవన్నీ కాదు అనుకుంటే మాత్రం మీరు ఈ యూబు లో నుంచి బయటపడాలంటే దీనికి మొదటి మెట్టు నో చెప్పడం నేర్చుకోవాలి.
(02:52) ఇది చాలా సింపుల్ అనిపించొచ్చు కానీ చేయడానికి చాలా ధైర్యం కావాలి. ఎవరైనా మీకు ఇష్టమైన వాళ్ళు వచ్చేసి మీ దగ్గర నాకు పని చేసి పెట్టవా అని చెప్పి అంటే ఫస్ట్ మీరు నో చెప్తారా కొంచెం మోడ పడతారా ఆ తర్వాత మళ్ళీ సరి చేస్తానులే అని చెప్పేసి అయిష్టంగా ఒప్పుకుంటారా చెప్పండి మీరు కచ్చితంగా అయిష్టంగా ఒప్పుకుంటారు. కాకపోతే మీకు ఇష్టం లేని పని అడిగినప్పుడు మొహమాటం లేకుండా కానీ చాలా ప్రశాంతంగా క్షమించండి నేను ఇది చేయలేను అని చెప్పండి.
(03:20) మీరు నో చెప్పినప్పుడు అవతల వ్యక్తికి కోపం రావచ్చు కానీ అది వాళ్ళ సమస్య మీది కాదు కదా సో రమణ మహర్షి గారు ఎప్పుడు ఒక మాట అనేవారు ప్రశాంతత అనేది మన లోపలే ఉంది. దాన్ని బయట వెతకడం మానేయండిఅని మీరు ఇతరుల మెప్పుతో శాంతిని వెతుకుతున్నారా అది ఎప్పటికీ దొరకదు. మీ విలువను మీరు గుర్తించడమే అసలైన విలువ. మీరు ఇతరుల కోసం పుట్టలేదు. మీరు మీలోని ఆ పరమాత్మని లేదా మీలోని అసలైన స్వభావాన్ని తెలుసుకోవడానికి పుట్టారు.
(03:46) ఆ విషయం మీకేం తెలియట్లేదు. ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు అందరికీ నచ్చాల్సిన అవసరం లేదు. ఈ ప్రపంచంలో గొప్ప గొప్ప మహానుభావులనే విమర్శించిన వాళ్ళు ఉన్నారు. మరి మనం ఎంత కాబట్టి ఎవరైనా మిమ్మల్ని ఇష్టపడకపోయినా పర్వాలేదని గట్టిగా అనుకోండి. మీ సమయాన్ని, మీ శక్తిని మీ ఎదుగుదల కోసం ఉపయోగించుకోండి. ఎదుటి వాళ్ళని గౌరవించండి.
(04:06) కానీ వాళ్ళ కోసం మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోకండి. మీకు మీరు గౌరవం ఇచ్చుకోకపోతే ఈ లోకం మీకు అస్సలు గౌరవం ఇవ్వదు. మీ మీద మీకు నమ్మకం ఉన్నప్పుడు 10 మంది ఏమనుకున్నా మీకు అనవసరం. ఆ క్లారిటీ మిమ్మల్ని ఒక గొప్ప వ్యక్తిలా మారుస్తుంది. చాలా మంది ఏంటంటే తిట్టిన వెంటనే బాధపడిపోతారు. ఏదనా అంటే మాత్రం ఫీల్ అయిపోతారు. వాళ్ళ స్టామినా ఏంటి వాళ్ళ స్ట్రెంత్ ఏంటి అసలు అన్నవాడికి ఉన్న కెపాసిటీ ఏంటో కూడా తెలుసుకోవాలి కదా దీనికి పనికి రాని వాళ్ళు కూడా వచ్చి మనకి సలహాలు ఇస్తూ ఉంటారు.
(04:34) ఇక్కడ ఒక హైలైట్ విషయం ఏంటంటే వాటిని కూడా మనం సీరియస్ గా తీసుకుంటాము. మనం ఏంటి మన కెపాసిటీ ఏంటి? మనకున్న నాలెడ్జ్ ఏంటి మన సత్త ఏంటి ఇవన్నీ మనకి తెలియకపోవడం వల్ల జరిగే దారుణాలు ఇవి. నేను ఏమంటానంటే మీరేంటో మీకు తెలియాలి. మీ సత్తా ఏంటో మీకు తెలియాలి. మీకు ఏం వచ్చో మీకు తెలియాలి. అవతల వాళ్ళు వచ్చి చెప్తే తెలుసుకునే రోజుల్లో మనం ఇంకా ఉన్నాము అంటే ఇంకా మీ గురించి మీరు తెలుసుకోలేదని అర్థం.
(04:57) కాబట్టి మీ గురించి మీరు తెలుసుకోండి. మీ గురించి మీరు తెలుసుకున్నప్పుడు ఈ ప్రపంచంలో మీకు ఇంకొకరు వచ్చి చెప్పే సలహాలు మీకు అసలు ఎక్కనే ఎక్కవు నాకు తెలుసు లేరా బాబు నా గురించి అని చెప్పేసి మీకు ఖచ్చితంగా అనిపిస్తుంది. సరిదంతా బాగానే ఉంది. మన జీవితాన్ని ఎలా మెరుగుపరుచుకోవాలి అంటే మాత్రం జీవితం అనేది ఒక ప్రయాణం.
(05:16) ఇందులో మనం ఎవ్వరికో నిరూపించుకోవడానికి ఏమీ లేదు. రమణ మహర్షి గారు తన జీవితం అంతా ఒక మౌనమునిలా గడిపారు. ఆయన ఎవరికీ ఏమి నిరూపించుకోవాలని చూడలేదు. అందుకు ఆయన దగ్గరికి వేల మంది వెళ్ళారు. మీరు ఎప్పుడైతే మిమ్మల్ని మీరు ప్రేమిస్తారో మీ పనిని మీరు నిజాయితిగా చేస్తారో అప్పుడు ప్రపంచమే మీ వెనకాల వస్తుంది. ఈ రోజు నుంచి ఒక చిన్న ప్రాక్టీస్ మొదలు పెట్టండి.
(05:37) ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని మిమ్మల్ని మీరు అడగండి. ఈ పని నేను మనస్ఫూర్తిగా చేయాలనుకుంటున్నానా లేక కేవలం వాళ్ళ కోసం వీళ్ళ కోసం చేస్తున్నానా అని చెప్పేసి మీ మనసుని ఒక్కసారి అడగండి. అప్పుడు మీ మనసు ఇచ్చే సమాధానాన్ని గౌరవించండి. ఎందుకంటే చాలా మంది ఏమనుకుంటారంటే చాలా మంది ఫారెన్ ఉద్యోగాలు చేస్తున్నారు నేను కూడా వెళ్ళిపోవాలి.
(05:57) చాలా మంది సినిమా డైరెక్షన్ కోసం ట్రై చేస్తున్నారు నేను కూడా వెళ్ళిపోవాలి. చాలా మంది ఆ ఫీల్డ్ లో ఎక్కువ డబ్బులు సంపాదిస్తున్నారు నేను కూడా వెళ్ళిపోవాలని చెప్పేసి వేరే వాళ్ళని చూసి వాళ్ళకి ఆ పని ఇష్టమో కాదో తెలుసుకోకుండా ముఖ్యంగా చుట్టూ ఉన్న వాళ్ళ ప్రెషర్ కూడా ఎక్కువ ఉంటుంది బాగా చదువుకో వేరే ఊర్లో ఉద్యోగం చేసుకో అని చెప్పేసి ఇంట్లో వాళ్ళు అవ్వచ్చు ఫ్రెండ్స్ అవ్వచ్చు బయట వాళ్ళు అవ్వచ్చు అందరూ ఇచ్చే సలహాలను తీసుకొని వాళ్ళ నిర్ణయాన్ని వీళ్ళ నిర్ణయంగా మార్చేసుకుంటారు నేనేమంటున్నానంటే పెద్ద వాళ్ళ మాటలు వినకూడదు మీకు నచ్చింది మీరు
(06:26) చేయండి అని నేను అనట్లేదు కానీ మీకంటూ ఒక పని మీద ఇష్టం ఉంటుంది. మీకంటూ ఒక పని మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. ఆ పనిలో కనుక మీరు వెళ్ళితే మీకు పని చేసినట్లు ఉండదు అందులోనూ మీరు ఆ పనిలో నెక్స్ట్ లెవెల్ కి వెళ్తారు. నేను చెప్పొచ్చే పాయింట్ అదే బేసికల్ గా మీకు ఒక పని చేయాలనిపిస్తే నేను ఈ పనిని మనస్ఫూర్తిగా చేస్తున్నానా లేకపోతే వేరే వాడి వల్ల ఇన్ఫ్లయెన్స్ అయి చేస్తున్నానా ఒకవేళ వేరే వాళ్ళు ఇన్ఫ్లయెన్స్ చేసినా సరే నాకు ఈ పనిఅంటే ఇష్టమా లేదా అని చెప్పేసి మీరు మొహమాటలన్నీ పక్కన పెట్టి నిజాయితిగా ఉంటే మాత్రం ఎదుటి వాళ్ళతో ఏ సమస్య రాదు
(07:00) అందులోనూ ఎదుటి వాళ్ళతో మాత్రమే కాదు మొదట మీతో మీరు నిజాయితీగా ఉంటారు కాబట్టి మన జీవితాన్ని అవతల వాళ్ళ చేతుల్లో పెట్టకుండా మన జీవిత జీవితాన్ని మన చేతుల్లోనే ఉంచుకుందాం. సో మొహమాటం పోయి అవతల వాళ్ళకి నో చెప్పడం చేతగాక ఇష్టం లేక చాలా పనులు చేస్తూ ఉంటారు. అక్కడే మనిషికి సమస్యలు మొదలవుతూ ఉంటాయి. అది మానసిక సమస్యలు అవ్వచ్చు, శారీరక సమస్యలు కూడా అవ్వచ్చు.
(07:25) ఎందుకంటే చాలా మందికి నో చెప్పడం చేత కాదన్నమాట. సో దాని వల్ల వాళ్ళ లైఫ్ లో చాలా ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేస్తారు. అంత ఎందుకండీ చాలా మంది విడిపోతారు కూడా. అదే నో అనే ఒక్క ముఖ ముందు గనుక చెప్పుఉంటే అది కూడా సారీ అని చెప్పేసి ఆ తర్వాత నో అనే పదాన్ని చెప్తే అప్పటికప్పుడు విడిపోవచ్చు కానీ తర్వాత మళ్ళీ కలుసుకుంటారు. ఎందుకంటే జస్ట్ నోే కదా చెప్పింది.
(07:44) కానీ నువ్వు చెప్పకుండా పనిలో ఇన్వాల్వ్ అయిపోయి అది సరిగా రాక నువ్వు చేయలేక వాళ్ళని సంతోష పెట్టలేక నువ్వు సంతోషంగా ఉండలేక జీవితం నరకంలా మారుతుంది. అది ఏదైనా అవ్వచ్చు పని అవ్వచ్చు, రిలేషన్షిప్ అవ్వచ్చు, ఎడ్యుకేషన్ అవ్వచ్చు, కెరియర్ అవ్వచ్చు ఏదైనా సరే ఫైనాన్షియల్ గా కూడా అవ్వచ్చు. చాలా మంది అప్పటికితే డబ్బులు లేకపోయినా సరే అప్పులు తీసుకొచ్చి మరి ఇస్తూ ఉంటారు.
(08:05) నా దగ్గర డబ్బులు లేవు నో అన్నారనుకోండి ఏ గోల ఉండదు కానీ మీరు ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఆ డబ్బులన్నీ అవతల వాళ్ళకి ఇచ్చి వాళ్ళు ఏమనుకుంటారు అని చెప్పేసి అప్పులు చేసి మరి అప్పులు ఇచ్చారు అనుకోండి చివరికి ఎవరు నష్టపోతారు మనమే నష్టపోతాం. కాబట్టి నువ్వు చెప్పడం నేర్చుకోండి. ఎందుకంటే మనిషి జీవితంలో ప్రతి నిమిషం చాలా విలువైంది.
(08:24) ఇతరుల అభిప్రాయాల కోసం దాన్ని వృధా చేయకండి. మీరు మీరులా ఉండటమే ఈ ప్రకృతికి మీరు ఇచ్చే అతి పెద్ద గిఫ్ట్ ఈ క్షణం నుంచే ఆ మార్పు మొదలవ్వాలి. అనవసరమైన భారాలను వదిలేయండి తేలికవ్వండి. మీలో ఉన్న ఆ ప్రశాంతతని అనుభవించండి. మీరు మీరులా ఉండటానికి ఎవ్వరి అనుమతి అక్కర్లేదు. చివరిగా ఒక ప్రశ్న మీ గురించి మీరు ఆలోచించకుండా కేవలం ఇతరుల కోసం బతుకుతూ మీరు సాధించింది ఏంటి? ఆ ప్రయత్నంలో మీరు కోల్పోయిన మీ అసలైన రూపం ఏంటో ఒక్కసారి గుర్తు చేసుకోగలరా మీ సమాధానాన్ని కింద నాతో కామెంట్స్ లో పంచుకోండి.
(08:57) మీ ఆలోచన మరొకరికి ఇన్స్పిరేషన్ అవ్వచ్చు. ఏదేమైనా సరే ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా ఈ వీడియో ఎండ్ కాకర్ట్ సెక్షన్ లో మీకోసం రెండు అద్భుతమైన వీడియోలు పిన్ చేసి పెట్టాను వాటిని కూడా చూడండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను మీకు చెప్పవచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి బాయ్

No comments:

Post a Comment