Einstein చెప్పిన Love Philosophy | Science vs Human Emotion | Nagna Satyam Telugu Podcast
Author Name:Nagna Satyam
Youtube Channel Url:https://www.youtube.com/@Nagnasatyam
Youtube Video URL:https://www.youtube.com/watch?v=DD6ehz-l6S0
Transcript:
(00:05) మనిషిని అసలు నడిపించేది ఏమిటి? బాడీనా బ్రెయిన్ డిజైరా లేక లవ్ నా ఫిజికల్ వరల్డ్ లో ప్రతి కదలికకు ఒక కారణం ఉంటుంది. ఒక రాయి పై నుంచి కింద పడుతుంది. ఎందుకు? గ్రావిటీ వలన ఒక గ్రహం సూర్యుడు చుట్టూ తిరుగుతుంది. ఎందుకు? గ్రావిటీ వల్లనే ఒక వస్తువు బరువు ఉందంటే అది భూమి వైపు లాగుతుంది. సో ఈ ప్రపంచం మొత్తం కనిపించని ఫోర్స్ చేతుల్లో కట్టుబలంది.
(00:36) ఆ ఫోర్సెస్ కి కొన్ని రూల్స్ ఉన్నాయి ప్రిన్సిపుల్స్ ఉన్నాయి కొలతలు ఉన్నాయి. కానీ మరి ప్రేమకు అది కూడా ఒక ఆకర్షణే కదా మరి ప్రేమను కూడా గురుత్వాకర్షణ లాగే కొలవలేమా? ఒక మనసు మరొక మనసు వైపు ఎందుకు జారుతుంది? కానీ దాన్ని ఈక్వేషన్ లో పెట్టగలమా? గ్రావిటీ పడేస్తుంది. ప్రేమ కూడా పడేస్తుంది. మనం ప్రేమలో పడతాం అంటాం పైకిఎక్కం దిగిపోతాం.
(01:04) ఇది భాషలో వచ్చిన యాదృచ్చిక పదమా లేక మన అనుభవానికి దగ్గరైన ఉపమానమా ప్రేమలో పడిన మనిషి తన కంట్రోల్ ని కోల్పోతాడు. తన లాజిక్ టెంపరరీగా నిలిచిపోతుంది. అతను తన ప్రపంచాన్ని వదిలి వేరొకరి చుట్టూ తిరగడం మొదలు పెడతాడు. ఇది కూడా ఒక రకమైన కక్షలోకి ప్రవేశించడమే కానీ ఇక్కడ గ్రహం లేదు సూర్యుడు లేదు కేవలం రెండు మనసులు ఉన్నాయి రెండు అంతరంగాలు ఉన్నాయి వాటి మధ్య కనిపించని ఒక బంధం ఉంది అంతే సైన్స్ చెప్పేది ఏంటంటే ప్రతి ఆకర్షణకు కారణం ద్రవ్యరాశి అంటే మాస్ అని అర్థం కానీ ప్రేమలో మాస్ అవసరం లేదు అందం ఉండొచ్చు లేకపోవచ్చు దూరం ఉండొచ్చు లేకపోవచ్చు ఒక మనిషి వేల కిలోమీటర్ల
(01:47) దూరంలో ఉన్నవాడిని ప్రేమించగలడు. మరొకడు తన పక్కనఉన్న వాడిని ఎప్పటికీ గమనించకపోవచ్చు. సో గ్రావిటీ దూరం పెరిగే కొద్ది తగ్గుతుంది. ప్రేమ మాత్రం కొన్నిసార్లు దూరం పెరిగే కొద్దీ పెరుగుతుంది. ఇది శాస్త్రానికి విరుద్ధం. కాబట్టి ఐన్స్టైన్ చెప్పింది ఒక సరదా మాట మాత్రమే కాదు. అదొక గుర్తింపు లాంటిది. విశ్వాన్ని అర్థం చేసుకున్నా మనసును పూర్తిగా అర్థం చేసుకోలేమనే వినమ్రత ఒప్పుకోలు అందులో దాగి ఉంది.
(02:15) మనిషి జీవితం రెండు అంతస్తుల మీద నిర్మించబడింది. కింద అంతస్తు శరీరం పై అంతస్తు చైతన్యం శరీరం ప్రకృతి నియమాలకు బానిస ఆకలి వేస్తే తినాలి. అలసట వస్తే నిద్రపోవాలి. వృద్ధాప్యం వస్తే క్షీణించాలి. ఇది గ్రావిటీకి లొంగిన శరీరం. కానీ చైతన్యం అది తిరుగుబాటు చేస్తుంది. అది కలలు కంటుంది. అది పరిమితులను దాటాలని కోరుతుంది.
(02:42) ప్రేమ ఈ చైతన్యపు లోపక భాగమే అది శరీరానికి అతీతం అందుకే ప్రేమలో ఉన్నవాళ్ళు ఆకలిని సమయం మరిచిపోతారు. ప్రపంచాన్ని మర్చిపోతారు. ఈ గ్రావిటీ వాళ్ళని నేల మీద ఉంచినా వాళ్ళ అంతరంగం ఎక్కడో తేలుతూ ఉంటుంది. ప్రేమను సైన్స్ ఎలా చూడగలదు అంటే డోపమైన్, ఆక్సిటోసిన్, సెరటోనిన్ వంటి కెమికల్స్ ఆడుకునే ఒక ఆట అని చెప్పగలదు. మెదడులోని న్యూరాన్ల మధ్య విద్యుత్ తరంగాల కదలిక అని చెప్పగలదు.
(03:08) కానీ ఆ కెమికల్ రియాక్షన్స్ మధ్య తలిత్తే అనుభూతిని ఎవ్వరూ కొరవలేరు. ఒక వ్యక్తి నువ్వు లేకుంటే నేను లేను అని అనిపించే క్షణాన్ని ఎలాంటి యంత్రం రికార్డ్ చేయలేదు. అది అనుభవించాల్సిందే. ప్రేమ ఒక అనుభవ సత్యం అది ప్రయోగశాల సత్యం కాదు ప్రేమలో పడటం అంటే మన అహంకారం కరగడం సాధారణంగా మనిషి నేను అనే గోడలతో జీవిస్తాడు.
(03:36) నా ఆలోచనలు నా లక్ష్యాలు నా స్వప్నాలు అని కానీ ప్రేమలో ఆ గోడల్లో పగుళ్లు వస్తాయి. నేనులో మనము ప్రవేశిస్తుంది. గ్రావిటీ వస్తువులను ఒకదానికొకటి దగ్గర చేస్తుంది. కానీ ప్రేమ మనసులను ఒకదానికిఒకటి తెరుస్తుంది. ఇది కేవలం దగ్గర కావడం కాదు ఇది మార్పు కూడా ప్రేమలో ఉన్న మనిషి మారిపోతాడు. అతని ప్రాధాన్యతలు మారతాయి. అతని భయాలు మారతాయి. అతని ధైర్యం కూడా మారుతుంది.
(04:01) అతను తనకోసం కాదు ఇంకొకరి కోసం జీవించడం నేర్చుకుంటాడు. ఇది భౌతిక శక్తి వల్ల సాధ్యం కాదు ఇది అంతరంగిక పరివర్తన వల్ల మాత్రమే సాధ్యం అన్నమాట. ఆల్బర్ట్ ఐన్స్టైన్ తన జీవితంంతా యూనివర్స్ ని ఒక సింగిల్ ఈక్వేషన్ లో బైండ్ చేయాలని ట్రై చేశాడు. స్పేస్, టైం, ఎనర్జీ ఇవన్నీ ఒకే ఫ్యాబ్రిక్ లో వీవై ఉన్నాయని చూపించాడు. రిలేటివిటీ ద్వారా గ్రావిటీ కూడా జామెట్రీ లాగే బిహేవ్ అవుతుందని ఎక్స్ప్లెయిన్ చేశాడు. కానీ లవ్ ఆ ఈక్వేషన్ లోకి రాలేదు.
(04:31) ఎందుకంటే లవ్ మ్యాథమెటిక్స్ కి లొంగదు. అది అన్సర్టెనిటీ రిస్క్ ఇంకా అది నిరూపించలేని ఒక నమ్మకం ప్రేమలో పడిన మనిషి ఒక రకంగా తన భద్రతను వదిలేసి అతను గాయపడే ఛాన్స్ ఉందని తెలిసినా కూడా దాన్ని యక్సెప్ట్ చేస్తాడు. ఇది గ్రావిటీ చేసే పని కాదు గ్రావిటీ ఎప్పుడూ ఒకేలా పని చేస్తుంది. ప్రేమ మాత్రం ఎప్పుడూ ఒకేలా ఉండదు.
(04:56) ఇట్ ఇస్ డైనమిక్ ఇట్ చేంజెస్ ఇట్ గ్రోస్ సం టైమ్స్ ఇట్ బ్రేక్స్ సం టైమ్స్ ఇట్ హీల్స్ ఇక్కడ ఈ ప్రపంచంలో ఫిజిక్స్ కి ఫార్ములా ఉంటుంది. బట్ లవ్ కి ఫీలింగ్ ఉంటుంది. కానీ లవ్ మాత్రం ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. మనం దాన్ని డిఫైన్ చేయలేం. మనిషి ఎందుకు లవ్ లో పడతాడు ఒంటరితనం నుంచి బయట పడడానికా తనలోని ఎంటీనెస్ ని ఫిల్ చేసుకోవడానికా లేక తనను తాను మర్చిపోవడానికా బహుశా ఇవన్నీ అనుకుంటా లవ్ మనిషికి ఒక మీనింగ్ ఇస్తుంది.
(05:26) యు మేటర్ అని చెప్పే మరో హార్ట్ మన జీవితంలోకి వచ్చినప్పుడు మన ఎగ్జస్టెన్స్ మరింత డీప్ గా అనిపిస్తుంది. మనలోని సైలెంట్ స్పేస్ ను మాటలు కాదు ప్రెసెన్స్ నింపుతుంది. గ్రావిటీ మనల్ని భూమికి కట్టి పడేస్తే ఈ లవ్ మనల్ని ఒకరితో ఒకరు కట్టేస్తుంది. ఈ రెండిటిలో ఏది పవర్ఫుల్ అనేది చెప్పడం కష్టమే. ఇక్కడ ఈ ప్రపంచంలో ఫిజిక్స్ కి ఫార్ములా ఉంటుంది.
(05:47) బట్ లవ్ కి ఫీలింగ్ ఉంటుంది. కానీ లవ్ మాత్రం ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. మనం దాన్ని డిఫైన్ చేయలేం. ప్రేమలో పడటం అంటే ఒక రకంగా స్వేచ్ఛను కోల్పోవడం. ఎందుకంటే ఇప్పుడు నీ భావోద్వేగాలు ఇంకొకరి చేతుల్లో ఉంటాయి. అతను నవ్వితే నువ్వు సంతోషిస్తావ్ అతను దూరమైతే నువ్వు బాధపడతావ్. ఇదొక స్వచ్ఛంద బానిసత్వం కానీ ఇదే బానిసత్వం మనిషికి ఆనందాన్ని ఇస్తే ఇది విరుద్ధం కానీ జీవితంంతా ఇలాంటి విరుద్ధాలతోనే నిండి ఉంది.
(06:18) గ్రావిటీ ఒక నిర్దిష్ట దిశలో లాగుతుంది కిందకి ప్రేమ మాత్రం ఎప్పుడూ కిందకి లాగదు. కొన్నిసార్లు కింద పడేస్తే కొన్నిసార్లు పైకి లేపుతుంది. కొన్నిసార్లు పూర్తిగా విరగగగుడుతుంది. కొన్నిసార్లు మళ్ళీ కొత్తగా నిర్మిస్తుంది. నిజమైన ప్రేమను అనుభవించిన మనిషి మాత్రమే ఈ మాట యొక్క లోతును అర్థం చేసుకోగలడు. గ్రావిటీ ఇస్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ఫాలింగ్ ఇన్ లవ్ అంటే ప్రేమను భౌతిక కారణాలకు పరిమితం చేయొద్దు.
(06:43) అది మనిషి అంతరంగానికి చెందినది. అదొక రహస్యం అది అనుభవం అది ప్రమాదం అది విముక్తి ఇది ఒకే సమయంలో బంధం కూడా విముక్తి కూడా మనిషి జీవితం ఒక కంటిన్యూస్ సర్చ్ లాంటిది అతను బయట ప్రపంచాన్ని అర్థం చేసుకోవాలని అనుకుంటాడు అలాగే తనలోని ఇన్నర్ వరల్డ్ ని కూడా తెలుసుకోవాలనుకుంటాడు. సైన్స్ బయట ప్రపంచాన్ని ఇల్యూమినేట్ చేస్తుంది.
(07:06) గ్రహాలు ఎలా తిరుగుతాయి వెలుగు ఎలా ప్రయాణిస్తుంది విశ్వం ఎలా విస్తరిస్తుంది అన్నది చూపిస్తుంది. కానీ లవ్ మనలోని లోకాన్ని వెలిగిస్తుంది. అది మన భావాలను మన బలహీనతలను మన అసలు స్వరూపాన్ని బయటకు తీస్తుంది. ఆల్బర్ట్ ఐన్స్టైన్ వంటి గొప్ప శాస్త్రవేత్త కూడా లవ్ ముందు ఒక ఆర్డినరీ హ్యూమన్ గానే మిగిలిపోతాడు.
(07:27) అందుకే అతను చెప్పిన మాటల్లో ఒక జెంటిల్ స్మైల్ ఉంటుంది. ఒక సైలెంట్ యక్సెప్టెన్స్ ఉంటుంది. విశ్వాన్ని అర్థం చేసుకున్నా లవ్ ను పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయలేమని వినమ్రత ఒప్పుకోలు అందులో దాగి ఉంటుంది. సో గ్రావిటీ వస్తువులను పడేస్తుంది. ప్రేమ మనిషిని విప్పేస్తుంది. అలాగే గ్రావిటీ శరీరాన్ని కంట్రోల్ చేస్తుంది. ఈ ప్రేమ మాత్రం ఆత్మను కదిలిస్తుంది.
(07:49) సో ఆల్బర్ట్ ఐన్స్టీన్ అసలు పాయింట్ ఏంటంటే గ్రావిటీతో మన ప్రేమని కలిపి చూడలేం. గ్రావిటీ ఒక ఫిజికల్ ఫోర్స్ అయితే లవ్ మాత్రం ఒక ఎమోషన్ తో అట్రాక్షన్ తో మిస్టరీతో కూడిన ఒక రకమైన అనుభూతి అదిఒక విచిత్రమైన ప్రపంచంలో దూకినట్టే ఆ
No comments:
Post a Comment