Tuesday, May 9, 2023

సో, ఆరోగ్యంగా ఉండండి… ఆనందంగా ఉండండి…

 👉ఈ సందేశం తప్పక చదవండి.

ఎవరో చెప్పినట్టు… ఏముంది..? 
ఓ దశ దాటాక… కావల్సింది ఒక మంచం… ఓ గది… అత్యవసరాలు… మిగిలినవన్నీ గురుతులు మాత్రమే… ఇప్పుడు అర్థమవుతుంది మనకు… మనకు పెద్దగా ఏమీ అక్కర్లేదు… మనం ఇకపై సంతోషంగా ఉండేందుకు మనకు ఇక ఎటూ పనికిరానివాటిని సంకెళ్లుగా మిగుల్చుకోవద్దు… వదిలేయాలి… వదిలించుకోవడమే…

కీర్తి, సంపద, భవిష్యత్తు… అన్నీ ఓ ట్రాష్… లైఫ్ అంటే చివరికి ఓ పడకమంచం మాత్రమే… నిజంగా అంతే… అరవై ఏళ్లు పైబడ్డామంటే ఆలోచన మారాలి… ప్రపంచంతో అనుబంధం ఏమిటో తెలుసుకోవాలి… అంతిమ గమ్యం ఏమిటో, భవబంధాలేమిటో అర్థమవ్వాలి… మన ఫాంటసీలు, మన బ్యాగేజీతో పాటు మనం ఇక తినలేని, అనుభవించలేని, ఉపయోగించలేనివి వదిలేయక తప్పదు…

అందుకే బంధం పెంచుకోవడమే వృథా… సో, ఆరోగ్యంగా ఉండండి… ఆనందంగా ఉండండి… ఏదీ మనది కాదు… ఎవరూ మనవాళ్లు కారు… మనిషి ఒంటరి… మహా ఒంటరి… వచ్చేటప్పుడు, పోయేటప్పుడు’’..!!  
 🙏 .......
 🌴సమస్త లోకానామ్ సుఖినోభవంతు🌴
 🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾
 👉इस संदेश को अवश्य पढ़ें।

 जैसा किसी ने कहा... क्या हाल है..?
 एक पड़ाव के बाद... हमें बस एक बिस्तर... एक कमरा... जरूरी सामान... बाकी सब तो बस तौल है... अब हम समझ गए हैं... हमें ज्यादा जरूरत नहीं है... हम नहीं अब और खुश नहीं रहना चाहते... हमें जाने देना चाहिए... इससे छुटकारा पाना चाहिए...

 शोहरत, दौलत, भविष्य... सब रद्दी... जीवन अंत में बस एक बिछौना है... सच में यही है... साठ साल की उम्र के बाद हमें अपनी सोच बदलनी होगी... हमें यह जानना होगा कि क्या दुनिया से हमारा नाता है... हमें यह समझने की जरूरत है कि हमारी अंतिम मंजिल क्या है, हमारी भावनाएं क्या हैं... हमारी कल्पनाओं के साथ-साथ हमारा सामान हम अब खा नहीं सकते, अनुभव कर सकते हैं, जिसे आप नहीं छोड़ सकते उसे न छोड़ें उपयोग...

 इसलिए रिश्ते बनाना बेकार है... इसलिए स्वस्थ रहिये... खुश रहिये... अपना कुछ नहीं... अपना कोई नहीं... आदमी अकेला है... बहुत अकेला है... जब आये तो , जब वो जाता है''..!!
  🙏...
  🌴समस्थ लोकनाम आनंददायक🌴 है
  🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾

చాలా విషయాలను ఒక వయసు వచ్చాక మనం వదిలేయాలి!

 *చాలా విషయాలను ఒక వయసు వచ్చాక మనం వదిలేయాలి!*
*వయసు పెరిగితే మనకేమీ కొమ్ములు పొడుచుకుని రావు. చాలా విషయాలను మనం వదిలేయాలి.*
*ప్రఖ్యాత రచయిత చలంగారు తానూ, తన స్నేహితుడూ ముచ్చటించుకుంటూ ఉండగా పిల్లలు వాళ్ళ ఇంట్లోని వంటపాత్రలతో ఆడుకుంటూ ధ్వనులు చేస్తుండగా స్నేహితుడా పిల్లలను వారించాడు. అప్పడు చలం “మనకు మన ముచ్చట్లు ఎంత ముఖ్యమో, ఆ పిల్లలకు వాళ్ల ఆటా అంతే ముఖ్యం. వయసులో పెద్దవాళ్లమైనంత మాత్రాన వాళ్ల ఆటలను ఆపెయ్యమనడానికి మనకు హక్కెక్కడిదీ ?” అన్నారు. ఇలాంటి ఉన్నతాలోచనా పథాన్ని అలవరచుకునే ప్రయత్నంలో కొంత విజయం సాధించాలి.*
*వాణీ జయరామ్ గారు చిన్న పిల్లలను సైతం “మీరు” అనే సంబోదించేవారు.*
*ఎస్పీ బాలు గారు శబరిమలకు డోలీలో వెళ్ళిన సందర్భంలో డోలీ మోసినవాళ్ళ కాళ్ళకు మోకరిల్లారు. అది వాళ్ళ వృత్తికావచ్చుగాక. వాళ్ళు ఆ పని చేసినందుకు డబ్బులిస్తుండ వచ్చుగాక. వాళ్ళే లేకపోతే మనవద్ద డబ్బులుండీ లాభమేమిటి?*
*మనమెలాగూ ఎస్పీలాగా పాదాభివందనం చేసేంత గొప్పవాళ్లం కాలేం. కనీసం “థాంక్స్” చెప్పొచ్చు కదా. కాగా ఒక సందర్భంలో “మన శరీరంలో తగినంత శక్తి ఉండగా ఇతరులకు డబ్బులిచ్చే అయినా బ్యాగులు మోయించొద్దు” అనీ “ఎవరిచేతనైతే నీ లగేజీని మోయిస్తావో వాళ్ళ పదింతల లగేజీని వచ్చే జన్మలో నీవు మోయక తప్పదు” అన్నారు శ్రీకంచి కామకోటి పీఠాధిపతి స్వామి గారు. చాలా మటుకు దీనికీ కట్టుబడి ఉండే ప్రయత్నము చేయాలి. మనం చాలా విషయాలను పట్టుకోవటం కష్టం కానీ వదిలేయడంలో బాధ ఏమిటీ ?*

*ఏం వదిలివేయాలో చూద్దాం:*
*"అమ్మాయీ గ్యాసు కట్టేసావా ! గీజర్ ఆఫ్ చేసావా ? ఏ.సి ఆన్ లో ఉన్నట్లుంది. పాలు ఫ్రిజ్ లో పెట్టావా ?లాంటి ఎంక్వయిరీలు వదిలేద్దాం. చేతనైతే సహాయం చేద్దాం. అవి మన ఇంట్లో మన పనులు. మన ప్రాధాన్యాలు అవతలవారిపై మోపడం అంత మంచిది కాదు. సహాయం అడగడం కూడా ఆప్యాయంగా ఉండాలి.*
*”మా కొడుకూ, కోడలూ పట్టించుకోరు" అంటూ తామేదో పర్వతాలను మోస్తున్నట్లు బిల్డప్ ఇస్తూ తమ పరువు తామే తీసుకుంటున్న తలిదండ్రులున్నారు. వాళ్ళ హయాంలో వాళ్ళిష్టం. కష్టనష్టాలు కూడా వాళ్ళవే వదిలివేయండి. ఎవరితో ఏపనీ చేయించుకోకుండా, ‘ప్రతీపనీ’ “మన పనే” అనుకుంటే ఎంత ప్రశాంతంగా, ఆరోగ్యంగా ఉండగలమో కదా ! ”నా అభిప్రాయం ఏమిటంటే" అని అనటం తగ్గించి.. నీ ఇష్టం, నువ్వు చెప్పు" అని వాళ్ళ ఇష్టాయిష్టాలతో వాళ్ళని బ్రతకనిస్తే గృహమే ఔతుంది కదా స్వర్గసీమ. ’నాకూ తెలుసు'తో పాటు “నాకు మాత్రమే తెలుసు” అనే ఆలోచనను తగ్గించుకుని, వాళ్ళకి చాలా విషయాలు, టెక్నాలజీ ‘నాకంటే ఎక్కువ తెలుసు' కదా అనే నిజాన్ని ఒప్పేసుకుంటే చాలు. మన పిల్లలకోసం వచ్చేవారితో మనం మితంగా మాట్లాడాలి. “వాళ్ళు మనకోసం రాలేదు” అని గుర్తుంచుకుని కాసేపు కర్టెసీకి మాట్లాడి లేచి మన గదిలోకి మనం వెళ్ళిపోగలగాలి. వాళ్ళ లోకం వాళ్ళది. మనది గతించిన యుగం. వదిలేయాలి. పెద్దవారిని పలకరించే మర్యాదతో ఎవరైనా సహజంగా అడుగుతారు “ఆరోగ్యం బాగుంది కదా" అని. దయచేసి వెంటనే అతిగా స్పందించవద్దు. మన బి.పి, షుగర్, కీళ్ళనొప్పులు, నిద్ర పట్టకపోవటం. నీరసం అంత రసవత్తరమైన విషయాలుకావు కదా. “బాబోయ్ ! ఎందుకు అడిగామా" అనే పశ్చాత్తాపం వారికి కలిగించవద్దు. అందరికీ అన్నీ ఉన్నాయి. మనకి ఉన్నాయి అనుకోవాలి. పాజిటివ్ గా స్పందించాలి.*
*కాలం మారింది, మారుతున్నది శరవేగంగా. టెక్నాలజీ అన్నింటా చోటు చేసుకుంటున్నది. విమానంలో ప్రయాణించే వారికి ఎర్రబస్సులో సీటెలా సంపాదించామొ చెప్పడం అనవసరం ఆ కష్టాలు చెప్పొచ్చు  కానీ వారికి లేవని అనద్దు. టెక్నాలజీ కష్టాలు ఉన్నాయన్న విషయం గ్రహించాలి. పెద్దతనంలో మన పరువును కాపాడుకోవటం పూర్తిగా మన చేతుల్లోనే ఉందని ఘంటాపథంగా చెప్పగలను. అనవసరవిషయాల్లో జోక్యం చేసుకోకుండా మితభాషిగా వుంటూ మన ఆర్థిక స్వాతంత్య్రం కోల్పోకుండా, ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ, జిహ్వచాపల్యం తగ్గించుకుని. అన్నింటికంటే ముఖ్యమైన విషయం "నన్ను ఎవరూ గౌరవించటంలేదు" అనే ఆత్మన్యూనతాభావం దరికి చేరకుండా జాగ్రత్తపడాలి. భవబంధాలు, అంత తేలికగా తగ్గించుకోలేము. కనీసం కొన్ని విషయాలను వదిలివేద్దాం. ప్రతీ విషయాన్నీ పాజిటివ్ గా చూడాలి. ఉద్యోగానికి పరిగెత్తాలనే హడావిడి లేదు. మొత్తం సంసారాన్ని లాగే బాధ్యతా లేదు. పిల్లలకి సహకరిస్తున్నామనే తృప్తి ఉండనే ఉంది. రోజూ అనుకుందాం ఇలా :~ "I love my self. I respect my self,అందరూ మనవారే, మనం అందరికీ ఉపయోగపడాలి, అందరూ మనలను పలకరించాలి." మన ఆత్మవిశ్వాసాన్ని పెంచే మంత్రాలివి. చివరగా మనం దిగవలసిన స్టేషన్ దగ్గరౌతూనే వుంది.సమయం దగ్గర పడుతూనే ఉంది. మన నిష్క్రమణ అందరికీ  అయ్యో అనిపించాలి తప్ప అమ్మయ్య అనుకోకూడదు కదా. మన బోగీలో ఉన్న మన తోటి ప్రయాణీకులతో తగువులు, మనస్పర్థలు, ఎత్తిపొడుపు మాటలు అవసరమా ? మనం దిగుతుంటే వారి ముఖాల్లో 'హమ్మయ్య' అనే భావం కనిపించాలో లేక 'అయ్యో అప్పుడే వీళ్ల స్టేషన్ వచ్చేసిందా' అనే భావం కనిపించాలో నిర్ణయం మన చేతిలోనే ఉంది. పెద్దతనం మనకో వరం. అది మన 'అహం' తగ్గించి మనకి జీవితం అంటే ఏమిటో, మన నిజమైన విలువ ఏమిటో సరియైన అవగాహన కల్పిస్తుంది. నస అనిపించుకునే కంటే నైస్ అనిపించుకోవడం మంచిది కదా! సర్వకాల సర్వావస్తేషు ఘంటాపథంగా చెప్పగలను. మన గౌరవం మన చేతుల్లోనే ఉంది. మనం చేయగలిగినంత చేయాలి. కానీ ఇతరులను కొడుకూ కోడళ్లనైనా, కూతురూ అల్లుళ్లనైనా సరే “చేయలేదు,” “చేయడంలేదు” అనవద్దు. అంటే విలువ తగ్గడమే ఖాయం. విలువను పెంచుకోవడమైనా, ఉంచుకోవడమైనా, తుంచుకోవడమైనా ఖచ్చితంగా మన చేతుల్లోనే ఉన్నదనేది మాత్రం సత్యం!*

ఎందుకంటె ఈ మన యాత్ర చాలా చిన్నది.* *ఎవరి జీవితం ఎప్పుడు ముగుస్తుందో ఎవరికీ తెలియదు..* *ఇది మూన్నాళ్ళ ముచ్చటే.. విర్రవీగవద్దు

 *🌹జీవితమనే మన ఈ ప్రయాణం చాలా చిన్నది.*

ఒక వృద్ధుడు బస్సులో ఎక్కి కూర్చున్నాడు. 
తరువాతి స్టాప్ వద్ద, ఒక బలమైన, 
క్రోధస్వభావం,శాడిజం గల  యువకుడు పైకి ఎక్కి, వృద్ధుడి పక్కన కూర్చుని కాస్త ప్రక్కకి జరిగి తిరిగి సర్దుకు కూర్చున్నను అహంకార ధోరణితో 
ఆతనిని  తన సంచులతో కొట్టినంత పని చేసాడు
వృద్ధుడు
మౌనంగా ఉండిపోవడాన్ని చూసిన యువకుడు
తన సంచులు తగిలినందుకు కోపం రాలేదా అని అడిగాడు.?
వృద్ధుడు ఒక చిరునవ్వుతో ఇలా సమాధానమిచ్చాడు: లేదు,

*ఎందుకంటె ఈ మన యాత్ర చాలా చిన్నది.* 

నేను తరువాతి స్టాప్లో దిగబోతున్నాను కాబట్టి, 
ఈ కొంత సమయానికి *అసభ్యంగా* ప్రవర్తించాల్సిన అవసరం లేదు.

ఈ సమాధానం *బంగారు* *అక్షరాలతో* *వ్రాయడానికి* *అర్హమైనది* :
*అంత ముఖ్యమైనవి కాని వాటి గురించి చర్చించాల్సిన అవసరం లేదు* 
ఎందుకంటే 

*ఈ మన యాత్ర చాలా చిన్నది.*

ఈ ప్రపంచంలో మనముండే సమయం చాలా తక్కువ అని 
మనలో ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి. 
పనికిరాని వాదనలు, *ఈర్ష్య* 
*అసూయలతో* , ఇతరుల మీద చాడీలు చెప్పడం,  లేనివి సృష్టించి వారి మనసులను బాధపెట్టడం,శతృవులతో చేయికలిపి అన్యాయంగా హానితలపెట్టడం
ఇతరులను క్షమించకపోవడం, అన్నీ సక్రమంగా ఉన్నను,లాభం జరుగుతున్నను
ఎంత ఉన్నా అసంతృప్తి
మరియు చెడువైఖరి ద్వారా సమయం మరియు 
శక్తి హాస్యాస్పదంగా వృధా అవుతాయి.
మీ హృదయాన్ని ఎవరైనా విచ్ఛిన్నం చేశారా? 
ప్రశాంతంగా ఉండు. 
“అంత ముఖ్యమైనవి కాని వాటి గురించి చర్చించాల్సిన అవసరం లేదు”. ఎందుకంటే  మనం ఊరుకున్న భగవంతుడు ఊరుకోడు,మంచివారిని భాధకు గురిచేసిన వారికి భయంకర భాధ భవిష్యత్తులో తప్పదు శాంతంగా ఉండు

*ఎందుకంటె ఈ మన యాత్ర చాలా చిన్నది.*

ఎవరైనా మీకు 
ద్రోహం చేశారా, 
బెదిరించారా, 
మోసం చేశారా లేదా 
అవమానించారా? 
విశ్రాంతి తీసుకోండి. 
ఒత్తిడి కి గురికావొద్దు.
“అంత ముఖ్యమైనవి కాని వాటి గురించి చర్చించాల్సిన అవసరం లేదు”. 

*ఎందుకంటె ఈ మన యాత్ర చాలా చిన్నది.*

కారణం లేకుండా ఎవరైనా మిమ్మల్ని అవమానించారా? 
దాన్ని వదిలేయండి. 
దాన్ని విస్మరించండి.

*బాగవతోత్తములను భాధ పెట్టిన వారిని భగవంతుడు తప్పక శిక్షిస్తాడు*  

వారి ఉసురు తరతరాలను కట్టి కుదిపేస్తుంది 

“అంత ముఖ్యమైనవి కాని వాటి గురించి చర్చించాల్సిన అవసరం లేదు”. 

*ఎందుకంటె ఈ మన యాత్ర చాలా చిన్నది.*

ఎవరైనా మీతో విభేదించారా, 
బాగా ఆలోచించండి...? 
గట్టిగా ఊపిరి తీసుకోండి. 
అతన్ని / ఆమెను *విస్మరించండి* . 
మన్నించి మరచిపోండి. 
“ఎంత ముఖ్యమైనా 
మీ మనసుకు నచ్చని, 
నీ మనసు మెచ్చని వాటి గురించి చర్చించాల్సిన అవసరం లేదు, 
వారితో ప్రతిరోజూ తగవు పెట్టుకోకుండా. 

*వారికి* *దూరంగా* *మనశ్శాంతి* *తో* *ఉండండి* ,

కొంత ఇబ్బంది కలిగినా అలవాటైతే ఏదీ ఇబ్బంది కాదు” 

*ఎందుకంటె ఈ మన యాత్ర చాలా చిన్నది.*

ఎవరైనా మనకు ఏదైనా సమస్య కలగచేసినా, 
“అంత ముఖ్యమైనవి కాని వాటి గురించి చర్చించాల్సిన అవసరం లేదు”. 

*ఎందుకంటె ఈ మన యాత్ర చాలా చిన్నది.*

ఈ మన యాత్ర యొక్క పొడవు ఎవరికీ తెలియదు. 
దాని స్టాప్ ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలియదు. 
“అంత ముఖ్యమైనవి కాని వాటి గురించి చర్చించాల్సిన అవసరం లేదు”. 

*ఎందుకంటె ఈ మన యాత్ర చాలా చిన్నది.*

మనకు అన్ని సమయాలలో అండగా ఉండే 
స్నేహితులను అభినందిద్దాం.
మనం 
గౌరవంగా, 
దయగా, 
క్షమించేలా ఉందాం.
తద్వారా, 
మనం కృతజ్ఞత 
మరియు 
ఆనందంతో నిండిపోతాము. 
చివరికి గుర్తుంచుకోవాల్సింది. 
“అంత ముఖ్యమైనవి కాని వాటి గురించి చర్చించాల్సిన అవసరం లేదు”. 

*ఎందుకంటె ఈ మన యాత్ర చాలా చిన్నది.*

మీ చిరునవ్వును అందరితో వెంటనే పంచుకోండి. 
“అంత ముఖ్యమైనవి కాని వాటి గురించి చర్చించాల్సిన అవసరం లేదు”. 

*ఎందుకంటె ఈ మన యాత్ర చాలా చిన్నది.*

*ఎవరి జీవితం ఎప్పుడు ముగుస్తుందో ఎవరికీ తెలియదు..* 
*ఇది మూన్నాళ్ళ ముచ్చటే.. విర్రవీగవద్దు🌹

:::::తనకు తానే సమస్య అయిన మనస్సు:::::

 *తనకు తానే సమస్య అయిన మనస్సు*
     మనస్సు అనేక పనులు చేస్తుంది. ఉదా.. గ్రహిస్తుంది, గమనిస్తుంది, గుర్తిస్తుంది. ఇంద్రియాల ద్వారా ఆయా విజ్ఞానాలు పొందుతుంది.
    అవసరాన్ని బట్టి, పరిస్థితిని బట్టి, ఎదురైన ప్రేరణను బట్టి,  పనులను ఎరుక తో చేస్తుంది.
  . మనస్సు పనులు చేసి ఊరుకోదు. నేను చేసానంటుంది. మనస్సు పని చేసి ఊరు కోదు. ఆ పనిని ఇష్ట పడుతుంది. మనస్సు పని చేసి ఊరుకోదు. నేను సరిగ్గా చేసానా?, ఇంకా చేయనా ? అంటుంది.
    సమస్య పనులు చేయడం కాదు. ఇవన్నీ నేను నాది ,నా అనుకోవడం. ఇలా అనుకోవడానికి మనస్సు తాను చేసే పనులు ఆపి  తాను మనస్సుగా కాక  చేసిన పనిగా మారి , తిరిగి మనస్సు గా మారుతుంది.
   ఇలా మనస్సు తన స్వరూపాన్ని మార్చుకోనుటే సమస్య.  ఎరుకను కోల్పోయి, మారి, పర్యవసానాలు ఎదుర్కొని, దుఃఖించి, తనకు తానే సమస్య అయినది. ధ్యానం మనస్సుని మారనివ్వదు.
*షణ్ముఖానంద 98666 99774*

:::::: తెలుసు కోవడం :::::::

 *::::::: తెలుసు కోవడం :::::::*
       మనస్సు   ఎప్పుడూ క్రొత్తగా తెలుసు కోవడానికి ఇష్ట పడుతుంది. అయితే మనస్సుకి తెలియడం అంటే తెలిసిన దానితో పోల్చడం, లేదా అంతకు ముందే తెలిసిన దాని సరసన చేర్చడం, అనే ఈ రెండు పనులు చేస్తూ తెలుసుకోవడానికి తనకు తానుగా  అడ్డు పడుతుంది.
     నిజమైన తెలుసుకోవడం ఎలా వుంటుంది? తెలుసు కోవడం అంటే
 1) ప్రతి క్షణం అనుభూతి చెందుతూ వుండటం.
2)పోల్చడం , కొలవడం, తీర్పు చెప్పడం, వాచీకరణ(verbalisation) మొదలగు నవి చేయకుండా వుండటం.
 3)వర్తమాన క్షణంలో పొందుతూ వున్న అనుభూతి తో సహా కాలంతో పాటు కొనసాగడం.
4) జ్ఞాపకంగా మార్చక పోవడం.
5)నేను తెలుసు కుంటున్నాను అన్న భావన జొరబడకుండా వుండటం 
6) అనుభూతి చెందుతూ వున్న విషయంతో తాదాత్మ్యం చెందక పోవడం 

*షణ్ముఖానంద 98666 99774*

మానవులుగా బతకటం కాదు.మానవత్వంతో బతకాలి.

 *గుర్తుంచుకో ! ఇది నీజీవితం !!*
*0>=<>=<>=<>=<>=<>=<0*

*జనరల్ బోగీలో వెళ్ళినా, ఫస్ట్ క్లాస్ లో ప్రయాణించినా స్టేషన్ రాగానే*—ఒకేసారి దిగిపోతారు.

*పక్కనెంత మందున్నా, ఎంత సంపదున్నా ఏంటి ?30 లక్షల కారైనా, 3 వేల సైకిలైనా రోడ్డు ఒకటే.. పదంతస్తుల మేడైనా, పూరిగుడిసైనా*—వదిలేసే పోవాలి !

*ఇద్దరు కొట్టుకుంటే.. ఒక్కరే గెలుస్తారు. రాజీపడితే...*—ఇద్దరూ గెలుస్తారు 

ఐకమత్యం అంటే మనం కుక్కమీద రాయి విసిరితే కుక్కపారిపోతుంది. అదే.. తేనెతుట్టి మీద విసిరితే మనమే పారిపోవాలి

దేవుడి కోసం తీర్ధాలు, పుణ్య క్షేత్రాలంటూ తిరుగుతావ్, ఆయనెక్కడో లేడు. శ్వాస తీసుకుంటూ సృష్టితో నువ్వేసుకున్న 'లంకె'లోనే వున్నాడు.

కష్టమొస్తే భగవంతుణ్ణి కొలుస్తావు. ఆయన నీకు రాబోయే కష్టాన్ని ఆపడు. నిత్యం స్మరిస్తే కొండంత కష్టాన్ని గోరంత చేసి, సులువుగా దాటే శక్తి నీకిస్తాడు. కష్టాలు కుంభవృష్టిలా నిన్ను ముంచేస్తే... నీకు గొడుగుపట్టి కాపాడతాడు... గుర్తుంచుకో 

కొబ్బరిచెట్టు పెరిగే కొద్దీ పాత మట్టలు రాలిపోతాయి. జ్ఞానం కలిగే కొద్దీ తన పర భేదాలు తొలగి పోతాయి.

పుండు మానితే పొలుసు అదే పోతుంది. పుండు మానకుండానే పొలుసు పీకేస్తే… పుండు తీవ్రమై రక్తం కారుతుంది  జ్ఞానసిద్ధి అంచెలంచెలుగా కలగాలి. ఆత్రపడితే లాభం లేదు !

సముద్రమంత సమస్యొచ్చిందని దిగులుపడకు. ఆకాశమంత అవకాశం కూడా వుంది. తలెత్తి చూడు ముందు. నీపై నీకు నమ్మకం కావాలి.

నీపై నమ్మకం నీకు బలం. నీపై అపనమ్మకం అవతలివారికి బలం !నీ బలం ఎవరికీ తెలియక పోయినా నీవు బ్రతికేయవచ్చు.. నీ బలహీనత మాత్రం ఎవరికీ తెలియనివ్వకు నిన్ను నిన్నుగా బ్రతకనివ్వరు !

మరణం అంత మధురమైనదా ? ఒక్కసారి దాన్ని కలిసిన వారు వదిలిపెట్ట లేరు ?ప్రకృతికి కూడా అదంటే ఎంత పక్షపాతం ! ప్రాణం పోయిన జీవుల్ని నీళ్ళలో తేలుస్తుంది. ప్రాణమున్న జీవుల్ని నీళ్ళలో ముంచుతుంది 

నీ పరిసరాలనెంత శుభ్రంగా వుంచినా నీకు అనారోగ్యం రావచ్చు. బుద్ధి అనే ఆసుపత్రిలో ఆలోచనలు అనే వైద్యుడు నీ రోగాలను తగ్గించగలడు. వాటిని ఆరోగ్యంగా వుంచుకో._

వెంటరాని ఇంటిని, ఒంటిని రోజూ కడుగుతావ్.. నీవెంట వచ్చే మనసునెప్పుడు కడుగుతావు ?

నిజాయితీపరులు సింహం లాంటి వాళ్ళు. సింహం కూర్చోటానికి సింహాసనమెందుకు ? అదెక్కడ కూర్చుంటే అదే సింహాసనం. నిజమైన నిజాయితీపరులకు గుంపు అక్కర్లేదు !

ముని-మహర్షి-తపస్వి-యోగి.. వీరు వేరు వేరు._
మౌనంగా వుండేవాడు ముని._
నియమ నిష్టలతో తపింప చేసుకునే వాడు తపస్వి._ 
అతీంద్రియ శక్తుల్ని ఆకళింపు చేసుకున్నవాడు ఋషి._ 
ధ్యానంలో మునిగి వుండేవాడు యోగి._

పండు తింటే అరిగిపోతుంది. తినకపోతే ఎండిపోతుంది. జీవితం నువ్వు ఖుషీగా గడిపినా, భయపడుతూ గడిపినా కరిగిపోతుంది !

ఇప్పటిదాకా ఇతరుల కోసమే (నా వాళ్ళనుకుంటూ) బతికేశావు. ఇప్పటికైనా ఆరోగ్యంగా, ఆనందంగా నీకోసం నువ్వు బతుకు

వచ్చే జన్మలో నువ్వెవరో, ఎక్కడ, ఎలా పుడతావో, అసలు జన్మ వుందో లేదో తెలీదు._

నువ్వు 'నా వాళ్ళు నా వాళ్ళు' అనుకుంటుంటే వాళ్ళు తర్వాత 'వాళ్ళ వాళ్ళ కోసమే' బతుకుతారు. నీకంటూ ఎవరూ ఉండరు. ఏమీ మిగలదు !

అర్ధం చేసుకుంటే.. పుట్టిందగ్గర్నుంచీ- పోయేందుకే మన ప్రయాణం ! ఈ మాత్రం దానికి పుట్టటమెందుకో తెలియదు. తెలుసుకోటం లోనే వుంది కిటుకంతా.. అందుకే ఈ జీవితమంతా !

మరణం దగ్గర పడితేనే మహా సత్యాలు బోధపడ్తాయ్.

పని చేయటానికి పనిమనిషి దొరుకుతుంది. వంట చెయ్యటానికి వంటవాళ్ళు దొరుకుతారు. రోగమొస్తే నీ బదులు భరించటానికి ఎవరూ దొరకరు.

వస్తువుపోతే దొరకచ్చు.. జీవితం పోతే మళ్ళీ దొరకదు తెరపడే రోజు ఏం తెలిసినా ప్రయోజనమేంటి ?

*మానవులుగా బతకటం కాదు.మానవత్వంతో బతకాలి.*

****మానవ సంబంధాలు -* *చేదు నిజాలు - 2

 🔅🔅🔅🔷🔷🔷🔷🔅🔅🔅

*మానవ సంబంధాలు -*    
               *చేదు నిజాలు - 2*

🔅🔅🔅🔷🔷🔷🔷🔅🔅🔅

*మానవ సంబంధాల్లో తరుచు .....జరిగే పొరపాటు...*

*ఎదుటివారు చెప్పేది సగం ...వినడం...*

*అందులో సగం ...అర్థం చేసుకోవడం...*

*అసలేమి... ఆలోచించకుండా* .....

*పరిస్థితులను అర్థం.. చేసుకోకుండా*....

*పదిరెట్లు స్పందించడం....*

*ఉన్నవాడు...నాలుగు రకాలుగా మాట్లాడతాడు.......* 

 *బాధతో ఉన్నవాడు...భావంతో మాట్లాడతాడు..* 

 *ప్రేమతో* *ఉన్నవాడు...చనువుతో మాట్లాడతాడు.....*
 

 *కోపంతో ఉన్నవాడు...కేకలు వేసి మాట్లాడతాడు......* 

 *మంచివాడు మార్పుకోసం మాట్లాడతాడు....* 

 *అసూయతో ఉన్నవాడు చులకనగా మాట్లాడతాడు......* 


 *కానీ*

*జ్ఞానం కలవాడు      మౌనంగా ఆలోచించి మాట్లాడతాడు.......* 

 *మాట మనిషిని మారుస్తుంది..* 

 *మౌనం మన మనస్సుని మారుస్తుంది.......* 

*నిన్న ఏమి తీసుకురాకుండానే వచ్చాము*......

*నేడిక్కడ చాలానే సంపాదిస్తున్నాం*.....

*రేపు ఏమి తీసుకుపోకుండానే వెళ్తాము*......

*అసలు లెక్కంతా తప్పే...*


*మనమిక్కడ వున్నందుకు ఎంతో కొంత కిరాయి....* *ఇవ్వాలి*.......

కాని......

*మనం కూడబెడుతున్నాం*......

*తీసుకురానప్పుడు*.......

*తీసుకుపోనప్పుడు*.....

*ఎందుకీ అనవసరపు అత్యాశలు..ద్వేషాలు*......

*ఈ ప్రపంచానికి నువు కొంత బారంగా*....

*కొన్నేళ్ళు బతికి నప్పుడు ఏమిచ్చావు*......

*ఈ ప్రపంచానికి* 
*ఈ లోకానికి......నువ్వు*
*ఏం చెల్లించావు ...* *రుసుము*.....

 *పనికొచ్చే నాలుగు మాటలు*...... *ఇవి.... పొట్ట నింపవని* .... *తెలుసు*

కాకపోతే

*కొన్ని*... *మనసుల్లో ....సంతోషాన్ని నింపేస్తాయి*.....

*కొన్ని గుండెల బరువును ఖాళి చేస్తాయి*..... *ఖచ్చితంగా*...


*నువ్వు కూడా ఏదో ఒకటి చేయి* .......

*తెలుసు మీరు..... చేస్తారని*...


*మీకు అడ్డు పడే స్వార్థాన్ని* ....

*కొంచెం కొంచెం.... జరుపండి*...

*ఈ ప్రపంచం మిమ్మల్ని చాల చాల దగ్గర చేసుకుంటుంది......నిజం*....
                  
" *ఒకరికి మేలు చేసే పని ఏదైనా గొప్పదే*.....

*అలాంటి ఒక గొప్ప పని*....

 *నిజాయితీగా ....చేయాలని ప్రయత్నించే.. ప్రతి మనిషి ....గొప్పవాడే*."
       

" *లోకులు తొందరగా నిందిస్తారు*....

*లేదా తొందరగా అభినందిస్తారు*....

అందుచేత.....

 *ఇతరులు నిన్ను అనే మాటలను పెద్దగా పట్టించుకోవద్దు*....."

*కర్తవ్యం కళ్ళెదుట ఉన్నపుడు ఆలస్యం చేయటం అనర్థం* .
   
*కల్లోలంగా ఉన్న కొలనులో నిశ్చలమైన ప్రతిబింబం కనపడదు* .
     
*నిలకడ లేని మనసులో శాంతి నిలబడదు* .
          
*చాలినంత పనిలేని మానవ మస్తిష్కం పిశాచాల విచ్చలవిడి ఆటలకి... నెలవైపోతుంది*..
                   
*ప్రపంచంలో పెద్దవారి పిర్యాదులను అందరు ఆసక్తిగా వింటారు*......

అదే

*సామాన్యుడివి ...... విన్నపాలు సైతం .....ఎవడూ పట్టించుకోడు* .
                        
*ఒక వ్యక్తి సమాజంలో ఏ హోదాలో ఉన్నప్పటికీ*....

*తోటివారిలోని లోపాలను తొలగించి వారిని చక్కదిద్దడానికి తోడ్పడేవాడే..... మానవజాతికి నిజమైన ఉపకారి*  

*"చేసిన తప్పుకు క్షమాపణ ఆడిగినవాడు ధైర్యవంతుడు*......

*ఎదుటివారి తప్పును కూడా క్షమించగలిగిన వాడు మహాత్ముడు....."*
       

*"మన దగ్గర ఏముంది, ఏమి లేదు అని ఆలోచించడం కంటే*...

*మనకోసం ఎవరున్నారు .....అని ఆలోచించడం*

*నిజంగా కోటి కష్టాలను కూడా మరచిపోయేలా చేస్తుంది...."*


" *గతాన్ని తలపోస్తూ*
          *భవిష్యత్తును* *ఆలోచిస్తూ*
                 *ఈ క్షణాన్ని* *వదిలివేయరాదు*.

*ప్రతీరోజును జాగ్రత్తగా స్వీకరించి సద్వినియోగం చేసుకోవాలి*."
       
" *స్నేహం,ప్రేమ అనేవి దీపంలాంటివి*.

*వెలిగించడం చాలా సులభం*.

కానీ

*ఆరిపోకుండా కాపాడు కోవడంలోనే ఉంది అసలైన గొప్పతనం*.

🔅🔅🔅🔷🔷🔷🔷🔅🔅🔅

Sunday, May 7, 2023

63 లో 36 లా ఉండాలంటే* పాటించాల్సిన పది చిట్కాలు. ( *63 దాటిన వారికి మాత్రమే అనుకోవద్దు ఇవి అందరికీ కూడా..* )

 *63 లో 36 లా ఉండాలంటే* పాటించాల్సిన పది చిట్కాలు.

( *63 దాటిన వారికి మాత్రమే అనుకోవద్దు ఇవి అందరికీ కూడా..* ) 

*63 దాటారంటే మీరు చాలా అదృష్టవంతులు* ఎందుకంటే 100 కి   11 మంది మాత్రమే 63 దాట గలుగుతున్నారు. ఏడు మంది మాత్రమే 65 దాటి 70 చేర గలుగు తున్నారు.
 మీరు ఆనందంగా ఉండడానికి పది చిట్కాలు

 1. దప్పిక అనిపించినా లేకున్నా *నీరు తాగుతూ ఉండాలి*. రోజు కనీసం రెండు లీటర్ల నీళ్లు తాగాలి.

 2. ఆడతారో, తిరుగుతారో, నాట్యం చేస్తారో  మీ ఇష్టం కదులుతూ ఉండండి. లేకపోతే కీళ్ల న్నీ బిగుసుకుపోతాయి .

3 . బ్రతకడానికి తినండి తినటానికి బ్రతకకండి పిండి పదార్థాలు బాగా తగ్గించి ప్రోటీన్లు ఎక్కువగా ఉన్న పోషకాహారం తినండి. ముఖ్యంగా *రాత్రిపూట పిండి పదార్థాలు బాగా తగ్గించాలి*.

 4.  *వీలైనంత వరకు నడవండి* లేదా సైక్లింగ్ చేయండి 100 నుంచి 200 మీటర్ల దూరం వాహనం వాడకండి, నడవండి. అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళు ఎలివేటర్ వాడొద్దు రైల్వేస్టేషన్లలో ఎస్క లేటర్లు వాడొద్దు వాహనాలు వాడొద్దు. *మెట్లు ఎక్కండి రాంప్ పై నడవండి*.

 5. కోపం తగ్గించండి. తక్కువ మాట్లాడండి. మీ నివాస ప్రాంతంలో *" కోప నిషేధ స్థలం "* బోర్డు పెట్టండి. అది  మీకు కోపం రాకుండా ఉంచుతుంది.  మీ చుట్టూ ఉన్నవారికి కూడా గుర్తు చేస్తూ ఉంటుంది.

 6. ధనం పై  వ్యామోహం వదిలిపెట్టండి జీవనానికి అవసరమైనంత వరకు మాత్రమే సంపాదించాలి డబ్బు వెంట మీరు పరిగెత్తకండి,  డబ్బు మీ వెంట పరిగెత్తాలి .

7 మీరు కోరుకున్నది  దక్కకపోతే బాధపడకండి. నిన్ను నీవు దూసించుకో వద్దు. దానిని మర్చిపోండి.

8 *డబ్బు, తెలివి, సౌందర్యం, అధికారం, కులం, పదవి వీటి వల్ల అహంకారం పెరుగుతుంది*. దీనిని *వదిలిపెట్టాలి* దీనికోసం పై వాటిపై  నియంత్రణ సాధించాలి‌. వినయంగా ప్రజలతో ప్రేమగా ఉండాలి. ఆనందంగా నవ్వుతూ గడపాలి అప్పుడే నువ్వు ఆరోగ్యంగా ఆనందంగా ఉంటావు.

 9. తెల్ల జుట్టు గురించి ఆందోళన వద్దు. *కాళ్లు అనుమతించి నంతకాలం యాత్రలు చేయండి* ఆనందంగా ఉండండి తెల్లజుట్టు వార్దక్యానికి సంకేతం కాదు. 

10. అందరితో స్నేహంగా కలిసి మెలిసి ఉండండి ఒక్కోక్కప్పుడు చిన్నవారే మనకు ఎన్నో విషయాలు నేర్పిస్తారు . నేను పెద్దవాడిని *అందరు నాకు నమస్కరించాలి, గౌరవించాలి అని ఆశించకండి‌* నిశ్శబ్దంగా ఉన్న వారిని కూడా ఆప్యాయంగా పలకరించండి.

 ఈ 10 చిట్కాలు పాటించండి. 
గమనించండి మీ జీవితం ఎంత హాయిగా, ఆనందంగా, యవ్వనంగా గడిచిపోతుందో...

:::::: వ్యక్తీకరణ. ::::::

 *::::::::: వ్యక్తీకరణ. ::::::::::*

       మనం మన ఆలోచనలను, భావాలను ఇతరులతో పంచుకుంటాము. దీనినే వ్యక్తీకరణ అనవచ్చు.

      మనకు మనమే ఒకొక్క సారి చెప్పు కుంటాము.

  ఇలా మనం వ్యక్తీకరించే టప్పుడు ఉద్వేగాలను కూడా జత చేస్తాము. ఎందుకంటే వ్యక్తీకరణ రసవత్తరంగా వుండటం కోసం.

   ఇది అలవాటుగా మారి ఉద్వేగ పడకుండా వ్యక్తీకరణ చేయ లేకుండా వున్నాము.

   దీని అర్ధం మన ఉద్వేగాలు చాలా మటుకు నేర్చు కున్నవి, అలవాటు చేసుకున్నవి.

    వాస్తవాన్ని గ్రహించడానికి మరియి వ్యక్తీకరించడానికి ఉద్వేగాలు అవసరం లేదు.
  యథాభూత జ్ఞాన దర్శనం లో ఉద్వేగాలకు చోటు లేదు. ఇదే ధ్యానం.

*షణ్ముఖానంద 98666 99774*

ఆయుషు నిర్ణయం

 *🕉️ఆయుషు నిర్ణయం* 


 *"ఓ ఉయ్యాలలో ఓ పాపని పడుక్కోబెట్టి బలంగా ఊపితే ఆ ఊపు బలాన్ని బట్టి ఎన్ని సార్లు ఆ ఉయ్యాల ఊగాల్సి ఉందో అన్ని సార్లూ అది ఊగాల్సిందే. దాన్ని మధ్యలో ఆపగల శక్తి ఉయ్యాలలోని పసి పాపకి లేదు. ఉయ్యాల - జీవితం,  ఉయ్యాలలోని పసిపాప - పుట్టిన మనిషి , ఊపు - ప్రారబ్ధ కర్మలు. ఓ సారి కొన్ని ప్రారబ్ధ కర్మలతో పుట్టాక వాటిని తొలగించే శక్తి వాటితో పుట్టిన ఎవరికీ ఉండదు అని ఈ పోలికతో చెప్పచ్చు. మనం చేసిన పాప, పుణ్య కర్మలకి ఆనుగుణంగా ఈ జన్మని ఎత్తాం. మన ప్రారబ్ధ కర్మలన్నీ అంతం అయేదాకా అంటే, ఉయ్యాల ఊగే బలం తగ్గేదాకా పాప ఊగినట్లుగా మనం వాటిని అనుభవిస్తూ జీవించాల్సిందే."*

 *"గడియారానికి కీ ఇస్తే, స్ప్రింగ్ చుట్టుకుని, మరలా ఆ కీ శక్తి అయిపోగానే గడియారం తిరగడం ఆగిపోయినట్లుగా, మనిషి ప్రారబ్ద కర్మలన్నీ అనుభవించి ఇంక కర్మలు మిగిలి లేనప్పుడు మనిషి ప్రాణాలు పోయి దేహం పడిపోతుంది."*

 *స్వకర్మ వశతః సర్వ జంతూనాం ప్రభవాప్యయౌః* *తమ తమ కర్మలని అనుసరించి సకల ప్రాణుల చావు పుట్టుకలు ఉంటాయి."*

            *కర్మ-మరణం* 

 *"నిరుక్తం అనే వేదనిఘంటువులో యాస్కుడు ప్రపంచంలోని సర్వ వస్తువులకు ఆరు స్థితులుంటాయని చెప్పాడు. అవి..."*

1. *జాయతే* = *పుట్టడం (శిశువు)*

2. *అస్తి* = *అనుభవంలో వుండటం (కనిపించడం)*

3. *వర్ధతే* = *పెరగడం*

4. *విపరిణమతే* = *మార్పుని పొందడం (గడ్డం మీసాలు, ముడతలు)*

5. *అపక్షీయతే* = *క్షీణించడం (బట్టతల, చెముడు, దృష్టిదోషం)*

6. *నశ్యతి* = 
*నశించడం (కనిపించక పోవడం)*

 *"దీన్ని బట్టి మనిషితో సహా కనిపించకపోవడం లేదా మరణం లేని వస్తువు ఈ భూతలంలో లేనే లేదు అని తెలుస్తోంది."*

 *ధృవం హ్యకాలే మరణం న విద్యతేః* -  *కాలం తీరనిదే చావు రాదు."*

 *"ఇక్కడ కాలం అంటే ఆయుష్షు అని కాక ప్రారబ్ద కర్మలని భావం. కర్మ ఫలానికి, జీవి ఆయుష్షుకి దగ్గర సంబంధం ఉంది. ఆయువు అంటే ప్రారబ్దాన్ని అనుసరించి ఈ శరీరంతో సుఖ దుఃఖ కర్మ ఫలాలన్నిటిని అనుభవించడానికి సరిపడే కాలమే. కొందరు వృద్ధులుగా మరణిస్తే కొందరు బాల్యంలోనే మరణిస్తారు. కాని వారంతా సరైన వయసులోనే మరణించినట్లు."* 

 *"కర్మ సిద్ధాంతం ప్రకారం అకాల మృత్యువు అన్నదే లేదు. ఈ జన్మలో తీర్చుకోవాల్సిన ప్రారబ్ద కర్మలు ఎక్కువ ఉన్నవారు వృద్ధాప్యంలో, తక్కువ ఉన్నవారు బాల్యంలో మరణిస్తారు. మరణించాక మళ్ళీ మిగిలిన కర్మలని అనుభవించడానికి తిరిగి పుడతారు."* 

*"జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ* 
*తస్మాదపరిహార్యేథ్రో న త్వం శోచితుమర్హసి"*
                                   - *గీత 2-27*

 *భావం:-* 

 *"పుట్టినవానికి మరణం తప్పదు. మరణించిన వానికి పునర్జన్మ తప్పదు. కనుక అపరిహార్యాలైన ఈ విషయంలో నువ్వు శోకించ తగదు. ప్రతీ జీవి జీవితంలోని మృత్యువు ఆఖరి ప్రారబ్ద కర్మ అవుతుంది. ప్రారబ్ద కర్మలన్నీ తీరాకే, ఈ పాంచభౌతిక శరీరాన్నించి జీవాత్మని మృత్యువు విడదీస్తుంది."*

 *"మరణించాక యమ యాతనలు అనుభవించకుండా ఉండటానికి ఓ మహాత్ముడు ఇచ్చిన సలహా ఇది."*

*"కర్మణా మనసా వాచా సర్వ వనెను సర్వదా |* 
*పరపీడాం న కుర్వంతి న తే యాంతి యమాలయం ||"* 

 *భావం:-* 

*"ఆలోచన ద్వారా, మాట ద్వారా, కర్మ (పని) ద్వారా ఎవరైతే ఎప్పుడూ పరప్రాణులకి కష్టాన్ని కలిగించరో, అట్టి వారు ఎప్పుడూ యమయాతనలు అనుభవించరు."*
          
🕉️🙏

భాషణం - భూషణం

 *అంతర్యామి - 25*
         *భాషణం - భూషణం*

             ✍️ *గుజ్జుల వీర నాగిరెడ్డి* 
✍️🌹🌹🌹🙏💐🙏🌹🌹🌹✍️

ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచనల్ని, నలుగురిలో ఉన్నప్పుడు నాలుకను అదుపులో ఉంచు కోగలిగితే మన జీవితం అదుపు తప్పకుండా ఉంటుంది. నాలుకను అదుపు చేసుకోగల విద్య తెలిస్తే, అనేక విద్యలు అవలీలగా ఒంటపడతాయి. నోటిని అదుపులో పెట్టుకుని అందరితో మర్యాదగా మాట్లాడుతూ, పద్ధతిగా నడుచుకుంటూ ఉంటే ఎక్కడైనా, ఎప్పుడైనా మంచే జరుగుతుంది.

చెట్టు సారం పండులో వ్యక్తమైనట్లుగా, మనిషి సారం అతడి మాటలో తొంగి చూస్తూ ఉంటుంది. మంగళకరమైన మాటతీరు మనిషి సంస్కారానికి గీటురాయి.

మనిషికి నిజమైన అలంకారం అతడి మాట తీరే. *'వాగ్భూషణ మొక్కటే మనిషికి సుభూషణం'* అన్నాడు భర్తృహరి. సంభాషణం -  మితభాషణం, హిత భాషణం, స్మిత భాషణం, ప్రియ భాషణం, పూర్వ భాషణం, సత్య భాషణం అయినప్పుడు అంతకన్నా భూషణం మరొకటి లేదు.

*'మితంగా, హితంగా మాట్లాడాలి. మనిషికి గౌరవం తెచ్చేవి ఇవే'* అనేవారు గాంధీజీ. ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ మాట్లాడుతూ ఉండాలి. మధురభాషణం వల్ల మర్యాద లభిస్తుంది. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది కదా. ప్రియంగా మాట్లాడాలి. ఎదుటివారిని
ముందుగా మనమే పలకరించడం పూర్వ భాషణం. రాముడు స్మిత పూర్వ భాషి- మాట కన్నా ముందు ఆయన చిరు నవ్వు ఎదుటివారిని పలకరించేది. సత్యమే సర్వోన్నతమైంది. కనుక నిర్భయంగా సత్యాన్ని పలుకు. ఆ సత్యాన్ని ప్రేమగా, నేర్పుగా చెప్పాలి. మర్యాదగా, హుందాగా మాట్లాడాలి.

ఆలోచించకుండా మాట్లాడటం, గురి చూడకుండా బాణం వేయడంలాంటిది. మాట్లాడిన తరవాత ఆలోచించాల్సిన అవసరం రాకూడదు. కాబట్టి ఆలోచించి ఆచి తూచి మాట్లా డాలి. *'తాను ఏం మాట్లాడాలో తెలిసినవాడు తెలివైనవాడు. తాను ఏం మాట్లాడకూడదో తెలుసుకోగలిగినవాడు వివేకవంతుడు'* అన్నారు స్వామి వివేకానంద. 

ఎవరైతే తమ మాటలవల్ల, చేతల వల్ల ఇతరులకు బాధ కలిగించకుండా ఉంటారో వారే ఉత్తములు. ఆచరిస్తూ చెప్పే మాటలకు ఆదరణ ఎక్కువ. ఆదరణపూర్వకంగా చెప్పే మాటలకు ఆచరణ ఎక్కువ. ఆకట్టుకునేలా మాట్లాడటం ఓ కళ. అయితే ఆ మాటలను ఎప్పుడు మొదలు పెట్టాలో, ఎప్పుడు ఆపాలో తెలియడం మరీ గొప్ప కళ. మాటలే మంత్రాలు, చెట్లే ఔషధాలు. మాటలు చాలా పదునైనవి కనుక జాగ్రత్తగా వాడాలి, బలమైనవి కనుక సున్నితంగా వాడాలి, ఖరీదైనవి, కనుక పొదుపుగా వాడాలి. మాట్లాడటం అందరూ చేస్తారు. అయితే అందరిలాగా కేవలం నోటితో మాట్లాడితే సరిపోదు. మరింత ప్రభావాన్వితంగా ఉండాలంటే మనసుతో, శరీరంతో మాట్లాడాలి.

మాటే సంపదలకు, మానవ సంబంధాలకు మూలం. మాటే స్నేహితుల్ని సంపాదించిపెడుతుంది, శత్రువుల్ని తయారు చేస్తుంది. *'నొప్పింపక తానొవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు.'* అలాంటివారికి శత్రువులే ఉండరు. మాటలు గాయపరచగలవు, అదే గాయాన్ని నయం చేయనూగలవు. సరైన మాటతీరు- చంపడానికి వచ్చిన శత్రువు మనసునైనా మార్చగలదు.

మాటల మధ్యలో సందర్భానుసారంగా సామెతలు, లోకోక్తులు వాడితే పాయసంలో జీడిపప్పులా మరింత మధురంగా, వినసొంపుగా అనిపిస్తుంది. సంభాషణ సరసచతురత కలిగి ఉండాలి. తిడుతూనే నవ్వించే హాస్య కుశలత కలిగి ఉండాలి.

ఎవరితో, ఎప్పుడు, ఎలా మాట్లాడాలో తెలిసి ఉండాలి. ఈ విషయంలో రామాయణంలో నాయకుడైన మర్యాదా పురుషోత్తముడు శ్రీరామచంద్రుడు, సుందరకాండకు నాయకుడైన సుందరమూర్తి హనుమంతుడు మనకు ఆదర్శం కావాలి.

మనిషికి భావవ్యక్తీకరణ గొప్ప ఆస్తి. ఏం చెప్పారనేదానికన్నా, ఎలా చెప్పారనే దాన్నిబట్టి భావప్రసరణ మరింత ఆకర్షణీయంగా ఉంటుంది. భావవ్యక్తీకరణ ఎంత గొప్పగా ఉంటే ఫలితం అంత మహత్తరంగా ఉంటుంది!

*లోకాస్సమస్తా సుఖినోభవంతు*

*Courtesy* : *ఈనాడు*

 🙏 *సర్వే జనాః సుఖినోభవంతు* 


*సేకరణ:* 
✍️🌹🌹🌹🙏💐🙏🌹🌹🌹✍️

శ్రీరమణీయం: ధ్యానానుభవాన్ని ఏ విధంగా ఆవిష్కరించుకోవచ్చు ?

 🙏🕉🙏                    ...... *"శ్రీ"*

                 💖💖💖
       💖💖 *"545"* 💖💖
💖💖 *"శ్రీరమణీయం"* 💖💖
     🌼💖🌼💖🌼💖🌼
           🌼💖🕉💖🌼
                 🌼💖🌼
                       🌼
*"ధ్యానానుభవాన్ని ఏ విధంగా ఆవిష్కరించుకోవచ్చు ?"*

*"భగవంతుడు అందరినీ ధ్యానం అనే గుణంతోనే పంపాడు. అది కూడా సర్వకాల సర్వావస్థల్లో ఉండే విధంగా నింపాడు. మనతోనే ఉన్న వస్తువు మనకు ఎప్పుడంటే అప్పుడు అందుబాటులో ఉంటుంది. ఏదో ఒక వస్తువు సహాయంతోనో, వ్యక్తుల సహాయంతోనో, ఒకానొక భంగిమలోనో మాత్రమే వచ్చేదే ధ్యానం అయితే అది మనకి పరాయిది అవుతుంది. ప్రశాంతంగా నిద్ర లేచిన రోజున నిద్రలో మనం పొందిన హాయిని అనుభవిస్తూ లేస్తాము. హడావుడిగా నిద్రలేచిన రోజు ఆ హాయిని గుర్తించకుండానే పనిలో పడిపోతాం. ధ్యానం కూడా అంతే మనం దానికి తగిన సమయం, శ్రద్ధ కేటాయిస్తే ధ్యానానుభవం తప్పకుండా ఆవిష్కృతమవుతుంది !"*

*"{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}"*
             
 అరుణాచల ఈశ్వరాయ నమః 🌹🙏

కాంతపాళ్యం శ్రీ ఆది శివలింగాచార్య సీనందల్ విశ్వబ్రాహ్మణ పీఠం - తిరువణ్ణామలై నంది

తమిళనాడులోని తిరువణ్ణామలై  కి దగ్గరలో ఉన్నటువంటి కాంత పాళ్యం అనే ప్రాంతంలో విశ్వబ్రాహ్మణ సాంప్రదాయ గురు పీఠం ఉన్నది.ఇది చాలా ప్రాచీనమైనది.మహాభారత కాలము నాటి ఋషుల తపస్సులు ఆచరించిన అరణ్యం గా ప్రసిద్ధి.

తిరువన్నామలై ప్రాంతమును మొఘల్ లు పరిపాలచేసే రోజుల్లో తిరువణ్ణామలై లోని అరుణాచలేశ్వర స్వామి దేవస్తానమ్ లో ఉన్న పెద్ద నంది కి నంది పూజ చేస్తున్నారు.

అప్పుడు అక్కడికి వచ్చిన మొఘల్ రాజు మేము ఆహారం గా స్వీకరించే జీవిని మీరు పూజ చేస్తున్నారు అని అక్కడ పూజ నిర్వహణ చేస్తున్న ఒక 5గురు భక్తులను ని అపహాస్యం గా అంటే ఆ 5 గురు కూడా ఇది మీరు ఆహారం గా స్వీకరించే ఎద్దు కాదు మా సంప్రదాయం లో నందిని అరుణాచలేశ్వర స్వామి  వాహనము గా భావిస్తాము అని చెప్పారు.

ఆ సందర్భములో అక్కడికి ఒక తేజస్సుకలిగిన  బాలుడు వచ్చాడు.

ఈ బాలుడికి మొఘల్ రాజు కి కాస్త వాగ్వివాదాము జరిగినది.మొఘల్ రాజు ఇచ్చిన మాంసమును పువ్వులు గా మార్చాడు.

ఈ మాయలు నేను సహించను అని ఆ మొఘల్ రాజు ఈ అరుణాచలేశ్వరుడి ఎదురుగా ఉన్న నంది నేను రెండు ముక్కలు చేస్తాను అని ప్రయత్నం చేయబోయాడు

అప్పుడు ఆ బాలుడి తపస్సు కి నంది సహజముగా తన కూర్చున్న స్థితిని కుడి కాలము మడిచి ఎడమ కాలు ముందుకు పెట్టింది.....

ఈ సంఘట చూసిన అక్కడి వారు అందరూ ఆశ్చర్యం కు లోనయ్యారు.

కళ్ళముందు రాతి నంది అలా మార్చుకున్న స్థితిని చూసిన ఆ మోఘల్ రాజు.....

ఆ పిల్లవాడిని క్షమించమని వేడుకొని అక్కడనుంచి వెళ్ళిపోయాడు.

ఆ పిల్లవాడే విశ్వబ్రాహ్మణ వంశీయడు సిద్ధపురుషుడు అయినాడు.

ఆయనే శ్రీ ఆది శివలింగాచార్య స్వామి.

వీరు సజీవ సమాది చెందిన ప్రాంతం.....

తిరువణ్ణామలై కి 40 కిలోమీటర్ల దూరం లో ఉన్న కాంతపాళ్యం.

ప్రస్తుతం 8 వ తరానికి చెందిన శ్రీ శివ జ్ఞాన స్వామి 6382658268 వారు పీఠమును నిర్వహణ చేస్తున్నారు.

🙏🏻అరుణాచలశివ 🙏🏻

ఆశావహ జీవితం* ✍️ డా. యం. ఎన్. చార్య

 *ఆశావహ జీవితం* 
               ✍️ డా. యం. ఎన్. చార్య
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺

✳️  *పుట్టిన ప్రతి ప్రాణికీ పూర్తికాలం జీవించాలన్న కోరిక ఉంటుంది. చరాచరాలకూ అలాగే ఉంటుంది.*

✅  *చెట్టును కాండం మొదలు వరకు నరికినా అది మళ్ళీ చిగురించాలన్న కాంక్షతో ఉంటుంది.*

✳️ నిత్యం పారే నదికి ఓ కొండ అడ్డుపడ్డప్పుడు అది కొద్దిసేపు ఆగి సేదదీరుతుంది. పల్లం ఎటువైపుందో తెలిసేదాకా నిరీక్షిస్తుంది. ఆ తరవాత దారి చూసుకొని ముందుకు ప్రవహిస్తుంది.

✳️ అడవిలో మొలిచే మొక్కలకు నీళ్లు పోసేవారెవరూ ఉండరు. అలాగని అవి నిరాశకు లోనుకావు. వర్షాల ఆగమనానికై ఆశగా ఎదురుచూస్తాయి. వీలుకానప్పుడు పులి కూడా రెండు అడుగులు వెనక్కి వేస్తుంది. దానికీ మరణభయం ఉంటుంది. ఆయుష్షు తీరేదాకా బతకాలన్న బలమైన వాంఛా ఉంటుంది.
ఒక్కోసారి వెనక్కి రావడము కూడా ముందుకు పోవడంలో భాగం అవుతుంది. వాస్తవానికి అది సార్వజనీనం! 

✳️ జీవన పయనం - ఏ దిశలో సాగుతోంది అన్నది ముఖ్యం కాదు. అది ఆరోహణా భావనతో ఉందా లేదా అన్నదే ప్రధానం. జీవచైతన్యానికి నిర్విరామంగా విస్తృతం కావడమే తెలుసు. ఆ సహజాతి సహజ గమనం పటాటోప ప్రదర్శన కాదు. ఎవరి మెచ్చుకోలు కోసమో చేసే పని అంతకన్నా కాదు.
పశు పక్ష్యాదులు, ఎడారుల్లో సంచరించే జీవులు, ఉభయచరాలు ఎంతో ఓర్పు, సహనంతో కాలం వెళ్ళ బుచ్చుతాయి. 

✳️ మున్ముందు కాలం అనుకూలంగా ఉంటుందన్న ఆశతో ప్రతికూల పరిస్థితుల్ని తట్టుకొని జీవిస్తాయి. జీవకోటిలో తెలివితేటలున్న మనిషి మాత్రం అనుకున్నదే తడవుగా ఫలితం వెంటనే కనబడాలని చూస్తాడు.

✳️ ఒక పేదవాడు తన ఇంటిముందు ఓ మొక్క నాటాడు. కొన్ని రోజులకు అది పెరిగి పెద్దదయింది. అది పండ్లు ఇచ్చి ఆకలి తీర్చుతుందని ఆశపడ్డాడు. చాలా రోజులు ఎదురు చూశాడు. కాని, అలా జరగలేదు. తగినంత ఆహారం అందక శరీరంతోపాటు మనసూ బలహీనపడింది. ఫలితంగా, అతడి నిరీక్షణ- కాలాన్ని మరింత పొడిగించిన భావన కలగజేసింది. విసుగు తెప్పించింది. కోరిక నెరవేరలేదని అతడిలో కోపాగ్ని రగిలింది. విచక్షణా జ్ఞానం కోల్పోయాడు. పూత, కాత రెండూ లేని చెట్టు ఎందుకని దాన్ని నరికివేశాడు. మరుసటి రోజు తెల్లవారి లేచి చూస్తే పడిపోయిన చెట్టుకు ఒక పువ్వు పూసి ఉంది. ఆ సన్నివేశం చూశాక అతడిలో దుఃఖం పొంగుకొచ్చింది. ఆ చెట్టును పట్టుకుని విలపించాడు. తొందరపడ్డానని బాధపడ్డాడు. 

✳️ జీవితం ఇలాగే అనూహ్య తీర్పునిస్తుంది. కారణం, అది నిత్యనూతనం. అందువల్లే *‘ఫలితం పని చేసేవాడి చేతిలో లేదు. అది కాలపురుషుడి నిర్ణయం’* అని గీత చెబుతుంది.

✳️ అనుకూలించని పరిస్థితుల్లో ఆకలిగొన్న జంతువు ఒకటి ఎత్తున ఉన్న కొమ్మ ఆకులు తిందామనుకుంది. అందుకోసం దాని పొట్టి మెడ సాచడం మొదలు పెట్టింది. కాళ్లూ పొడుగుంటే బాగుండేదని భావించింది. రోజూ దాని ప్రయత్నాలు సానుకూల వైఖరితో సాగేవి. కొంత కాలానికి దాని మెడ పొడుగ్గా సాగింది. కాళ్లూ పెద్దగా అయ్యాయి. అదే జిరాఫీగా రూపాంతరం చెందింది. మానసిక భావాలకు అనుగుణంగా శరీరం స్పందిస్తుంది. అది ప్రాకృతిక నియమం. అమీబా నుంచి చింపాంజీ దాకా జరిగిన జీవ పరిణామ క్రమంలో *‘ఆశావహ దృక్పథం’* కీలకం. అందువల్లే, *‘యద్భావం తద్భవతి’* అన్నారు వేదాంతులు. 

✳️ *‘నీ ఆలోచనే (సంకల్పం) నువ్వు’* అని బుద్ధుడూ ప్రబోధించాడు. దుందుడుకు వైఖరితో ఏ ప్రయోజనాలూ సిద్ధించవు. సానుకూల ధోరణితోనే మానవుడు ముందుకు వెళ్ళగలడు!


🙏 *సర్వే జనాః సుఖినోభవంతు* 

*సేకరణ:* 
 గంగాధరుని ఫాలభాగంపై విబూధి రేఖలు జీవాత్మ, ఆత్మ, పరమాత్మలకు సంకేతాలు. జీవాత్మ తనలోని ఆత్మ స్వరూపాన్ని తెలుసుకుని పరమాత్మతో కూడి ఉండాలన్నదానికి నిదర్శనం. జీవాత్మేపరమాత్మ అన్న సత్యాన్ని,
జ్ఞానాన్ని తెలియజేసేదే త్రినేత్రం. అది మనపాలిట జ్ఞాననేత్రం. వేదములు, పురాణ ములు ఏకకంఠముతో విభూతి మహిమను చాటి చెబుతాయి. భస్మస్నానము చేసినవారు సర్వతీర్ధ దర్శనం చేసినవారితో సమానం. భస్మధారణ చేసిన వారిని దుష్ట గ్రహములు, పిశాచములు, సర్వరోగములు, పాపములు సమీపించవు. ధర్మబుద్ధి కలుగుతుంది. బాహ్య ప్రపంచజ్ఞానము కలుగుతుంది. ఏ విధంగా అర్చించినా, ఏ రీతిగా అలంకరించినా, పరతత్వం ఒకటే. అందుకే లింగమూర్తికి అవయవాలు లేవు. ఈ సత్యాన్ని తెలియజేసే తత్వస్వరూపమే 'లింగ స్వరూపం
 'రంగమార్తాండ' సినిమా సాయంత్రం అమెజాన్ ప్రైమ లో చూసాం. మీరంతా కూడా చూసారనే అనుకుంటా. సినిమా ఎలా ఉంది అనేకంటే తల్లిదండ్రులు కు ఒక అంకుశం లాంటి సందేశం చెప్పాడు. ఇవి అందరిళ్ళలో సహజంగా జరిగేవే ఐనా సినిమా ద్వారా చెప్పిన సందేశం పెద్దలు తప్పక అన్వయించుకోవాలని నా ఉద్దేశం.
ఇక రివ్యూ విషయానికి వస్తే పిల్లల దగ్గర ఉండేటప్పుడు కొన్ని విషయాలు అవి చేదు అని నేననను కానీ అవి అర్థం చేసుకొని జీర్ణించుకుంటే తల్లిదండ్రులు జీవితం సాఫీగా సాగిపోతుంది.
పిల్లలు కొడుకులైనా కూతుర్లైనా పెళ్ళిళ్ళు అయ్యాక వాళ్ళ రూట్ వేరే ఉంటుంది. వాళ్ళ ప్రాధాన్యాలు, ఉద్యోగాలు, విందులు వినోదాలు, వాళ్ళ పిల్లల పెంపకాలు వేరే ఉంటాయి. వాటిలో మన ప్రమేయం ఎంత పరిమితిగా ఉంటే అంత మనకి సుఖం. మన అభిప్రాయాలు, సలహాలు, సూచనలు, మన ఆస్తిపాస్తులు వాళ్ళకి తృణప్రాయం. మనల్ని ఆదరంగా  చూస్తుంటే అదే పదివేలు. వాళ్ళ భాగస్వాముల దగ్గర వాళ్ళకి కొన్ని మొహమాటాలు ఉంటాయి. అవి మనం గుర్తెరిగి మసలుకోవాలి.
ఈ సినిమాలో తల్లితండ్రులు కొడుకు, కోడలు వల్ల  ఇమడలేక వేరే ఉండ వలసి వచ్చినప్పుడు కూతురు చేరదీస్తుంది. అది బాగానే చూపించాడు కానీ ఒక సందర్భంలో కూతురు కూడా తండ్రి కి దొంగతనం అంటగడుతుంది. తరువాత నిజం తెలుసుకొని క్షమాపణ అడుగుతుంది కానీ అప్పటికి పరిస్థితి చేయ్యిదాటి పోతుంది. 
కోడలు సూటిపోటి మాటలంటే కూతురు ఐతే డైరెక్ట్ గా మొహం మీద అనేస్తుంది. తల్లిదండ్రులు లంటే ఒక విధమైన చులకన భావం ఉంటుంది. మీరు ఊరుకోండి మీకేమీ తెలియదు లాంటి మాటలు కూడా వినవలసి వస్తుంది.
చివరిగా ఏతావాతా అర్థమైందేమిటంటే కడుపున పుట్టిన పిల్లలకి తల్లిదండ్రులు పానకంలో పుడకల్లా అనిపిస్తారని నాకర్థమైంది.
కాబట్టి తల్లిదండ్రులు ఎంత ఒబ్బిడిగా పిల్లలతో మసలుకుంటే వారి శేష జీవితం అంత సుఖమయం అవుతుంది. 
చిట్టచివరి గా ఆస్తిపాస్తులు ఏమైనా ఉంటే పెద్దల తదనంతరమే రాయాలి అంటాడు దర్శకుడు. నాకా విషయం నా మధ్య వయసులో నే ఒక కొలీగ్ జీవితం ద్వారా అవగతమైంది.
ఇదీ సినిమా రివ్యూ. మీలో ఎవరైనా చూడకపోతే చూడండి.
 1...కామ,, క్రోధ ,,మోహ ,,లోభ ,,మద ,,మాస్తార్యాలు జయిస్తేనే మోక్షం వస్తుంది....?

2.... enlightenment కర్మపరిధిలోనిదా లేక కర్మకు సంబంధం లేదా...?

కామ,, క్రోధ,, మోహ,, లోభ,, మద,, మాస్తార్యాలు జయిస్తేనే మోక్షం వస్తుందా...? ఇది అసత్యం...అరిషడ్వర్గాలను మోక్షానికి సంబంధం లేదు..
మోక్షం అనేది ఒక దాన్ని జయిస్తేనో,,,,లేదా ఓడిస్తేనో వచ్చేది కాదు...

️ ""యోగం అంటే విషయ లోలత్వమూ కాదు... విషయ రహితమూ కాదు... అది విషయాతీతము..""

అరిషడ్వర్గాలన్నీ విషయాలే...కానీ యోగం అంటే 
విషయము లేకపోవడమూ కాదు విషయంలో ఉండడమూ
కాదు...విషయాయంలో మేల్కొని వుండడం...విషయానికి అతీతంగా వుండడం...

దీన్నే   ️,,""పద్మపత్ర మిభాంశస "" అన్నాడు కృష్ణుడు

తామరాకు  నీళ్ళల్లోనే వుంటుంది నీళ్లకు అంటదు..
సంసారం అంటేనే అరిషడ్వర్గాలు....అవి లేకుండా సంసారం ఎక్కడ వుంది...?

కొలను అంటేనే నీళ్ళు...నీళ్ళు లేకుండా కొలను ఎక్కడుంది...?  .ఆ కొలను లోనే కదా తామరాకు వుండేది..మరి తామరాకు నీళ్ళల్లో వున్నా నీళ్లకు అంటిందా .? లేదు....

అలాగే అన్ని విషయాల్లో ఉంటున్నా  ఏ విషయానికి అంటకుండా వుండడం నేర్చుకోవాలి..దీన్నే
మోక్షం అంటారు...

కామం లేకపోతే ఎలా..? క్రోధం లేకపోతే ఎలా..? మదం లేకపోతే ఎలా..? ఇలా అన్నీ తగు పాళ్ళల్లో వుండాల్సిందే...లేకపోతే జీవితం నిస్తేజం అవుతుంది..
సరైన కామం వుండాలి...సరైన కోపం వుండాలి..సరైన మదం వుండాలి...ఇలా అన్నీ వుండాలి...అన్నీ సమపాళ్లలో వుంచుకుంటూనే అవి ""నేను ""కాదు అన్న స్పృహలో జీవించాలి...

మీరు ఒక ఎర్ర లైటు కిందికి వెళితే మీరు మొత్తం ఎర్రగా మారుతారు...మారినంత మాత్రాన మీరు ఎర్రగా వున్నాట్టా..? లేదా మీరు ఎరుపు అయిపోయినట్టా..?
ఆ ఎర్ర లైట్ కింద వుండడం వల్లా ఎర్రగా వున్నట్టు కనబడినా మీరు అసలుగా ఎరుపు కాదు...

అలాగే కోపం కిందికి మీ చైతన్యం వెళ్ళినా...మీరు కోపం కాదు...కామం కిందికి వెళ్ళినా మీరు కామం కాదు... మాత్సర్యం కిందికి వెళ్ళినా మీరు మాత్సర్యం కాదు..
ఈ సత్యాన్ని సదా జాగృతి లో వుంచుకుంటే మనం ఏ అరిషడ్వ్గాలలో వున్నా వాటికి ఏ మాత్రం అంటనట్టే..

తామరాకు నిలవాలంటే నీళ్ళు కావాలి...కానీ నీళ్లకు అంటదు....

అలాగే  ఆత్మ,, ఈ  శరీరాన్ని కొంత కాలం ,,కొంత కారణం కోసం  నిలవాలంటే అరిషడ్వ్గాలు కావాలి....కానీ అరిశడ్వర్గాలకు అంటకుండా వుండాలి..ఆ తామరాకు లాగా...

కాబట్టి ,,,సత్యం ఏమిటంటే ,,,,మెల్కున్నామా..? లేదా..? 
అన్నదే ముఖ్యం...

️వున్నది ఒక్కటే ఒక్కటి....స్వప్నం 
వున్నది ఒక్కటే ఒక్కటి...మెలకువ

మన జీవితంలోకి ఏది వచ్చినా..మనం ఎందులోకి వెళ్ళినా ,,.దానికి ప్రభావితం అయితే ,,,అదే మనం అయిపోతే...దాన్ని స్వప్నం అంటారు...

మన జీవితంలోకి ఎది వచ్చినా..మనం  ఎందులోకి వెళ్ళినా...దానికి ప్రభావితం కాకుండా,,,అదే మనం అవ్వకుండా వుంటే దాన్ని మెలకువ అంటాం...,

ధర్మవ్యాధుడు మాంసపు వ్యాపారి...కానీ మహా ముక్తిలో జీవించాడు కదా...!

స్వప్నమే,,,,మాయ
మెలకువే....మోక్షం...

తెలిస్తే ,,నీళ్లకు నీళ్ళే,,పాలకు పాలే..తెలియక పోతే మాయపాలే..,

దేవుడూ...,
🕉️ *నమో భగవతే శ్రీ రమణాయ* 🙏🙏
*భగవాన్ శ్రీ రమణ మహర్షి* ఉవాచ:
🔅"మనస్సు యొక్క స్వభావంపై స్థిరమైన మరియు నిరంతర పరిశోధన ద్వారా, మనస్సు ' *నేను*' సూచించే *అది*( _తత్_ ) కి రూపాంతరం చెందుతుంది; మరియు అదియే నిజానికి *ఆత్మ* ."
🙏🌷🙏 *శుభం భూయాత్*🙏🌷🙏

ఏది లాభము - ఏది నష్టము

 *ఏది లాభము - ఏది నష్టము*

మనము ప్రతిజన్మలో ఏమి నష్ట పోతున్నామో ఏమీ కోల్పోతున్నామో చూడలేక తెలుసుకోలేక ఉన్నాము. మానవజన్మ తెలుసుకుంటే అద్భుతమైన జీవితం తెలుకోకపోతే అజ్ఞాన భాదాకర జీవితం.గడిచిన 30 లేదా 50 యేండ్లు చూస్తే జీవితం క్షణకలమేనా అనిపిస్తుంది అందుకే జీవితం క్షణ భంగురమన్నారు. దైవచింతన, శ్రద్ధ,కొరికలు లేని వాని పుణ్యం భగవదర్పితమై ఫలసిద్ధి కలుగును. లౌకికుని పుణ్యం జన్మజన్మకు రంద్రాల గల పాత్రలో చేరి హృదావుతుంది. ఒకే జన్మలో ఏవరు మహాజ్ఞాని మహాభోగి కాలేరు అది ఏన్నో జన్మల శ్రమ ఫలితం. ఒకటి వెలుగు,పది మందికి ఫలాలను ఇస్తుంది. మరొకటి చీకటి, ఉనికిని కోల్పోతుంది. 

మనం ప్రతి జన్మలో అల్ప సుఖాలనే కోరికల కోసం జన్మను,కష్టాన్ని కాలాన్ని,పుణ్యాన్ని ప్రతిసారి ప్రతిజన్మలో కోల్పోయి వృథా చేసుకొని నష్టపోతున్నాము. 100 రూ:లు లేదా వస్తువు పగిలిపోయిన పోగొట్టుకున్న  తెగ భాధపడి పోతాము. బజారులో ఒక వస్తువు కోసం అన్ని చోట్ల విచారిస్తాము బేరమాడుతాము. అసలు మన జన్మ అనే జీవితంలో ఏమేమి యేనేన్ని కోల్పోయి ఏన్నిసార్లు మోసపోతున్నమో  బాగా విచారించి తెలుసుకోవడానికి ప్రయత్నించడం లేదు. వీటికి కాలేజీలు యూనివర్సిటీలు లేక పోవడమే కారణం.

జన్మే లేకుంటే ఒకే జన్మే అవుతే సంతోషంగా మనకు నచ్చినట్లు జీవించచ్చు.దైవం,భక్తి ,భయం పూజ అవసరం లేదు కదా ! కానీ ఒక పద్ధతిగా కొంతలో కొంతైన కొన్ని పాటిస్తున్నాము ఆంటే పాప పుణ్యాల,మంచి చెడు గురించి అలోచిస్తున్నమంటే తెలియకుండానే సనాతన ధర్మాన్ని నమ్ముతున్నాము. కొందరు మరోజీవితాన్ని  ఏవరు చూశారు  అనుకోవచ్చు.కానీ భౌతికమైన జీవనమార్గంలో చక్కగా చూస్తూ మాట్లాడుతూ తిరుగుతూ తెలివి,బుద్ధిని ఇచ్చినందుకు తృప్తిపడి దైవాన్ని గుర్తించి ఋణం తీర్చుకోవాలి. భౌతికంగా ఏంత ఏదిగిన అంతే నష్టం కలుగుతుంది. 

ప్రపంచమనే ఎండమావిలో ఎప్పటికి ఏజన్మకు దాహం తీరదు.ఎంత అవసరమో అంతే నడవాలి లేదా కోటి జన్మలైన తెచ్చిపెడుతుంది.ఏది లాభమో ఏది నష్టమో ఏది శాపమో ఏది అదృష్టమో ముందు చక్కగా గ్రహించాలి. కాలము,జీవితం ఏంతో విలువైనది కొంత దైవచింతనతో గడపడం సముచితం. కలియుగంలో ఒకటి లేదా రెండు సార్లే మానవజన్మ లభిస్తుంది. గతంలో ఏ వసతులు లేకుండా తిండి కోసమే కష్టపడి పనిచేసి జీవించేవాండ్లు.ఇప్పుడు అన్ని వస్తువులతో సంతోషంగా ఉండే కాలంలో భగవంతుడు జీవితాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతతో రోజుకు కొంత సమయం  దైవానికి కేటాయించి సత్యాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్థాము.

జ్ఞాన సిద్ధి, మోక్ష సిద్ధి... ఒకటేనా?* ✍️ దాసు కిరణ్‌

 *జ్ఞాన సిద్ధి, మోక్ష సిద్ధి... ఒకటేనా?*
                          ✍️ దాసు కిరణ్‌
💫🌈💫🌈💫🌈💫🌈💫🌈💫🌈

💐 జ్ఞాన సిద్ధిని గురించి వివరించే లోక ప్రసిద్ధమైన ఒక ఉపమానం వేదాంతంలో ఉంది. అదే... *‘రజ్జు సర్ప భ్రాంతి’.* చీకటిలో తాడును చూసి ‘పాము’ అని భ్రాంతి చెందుతాం. ఆ భ్రాంతి కారణంగా భయం ఏర్పడుతుంది. ఇక్కడ పాము అంటే ‘నేను’ అనే భావన. ఆ భావన ఉన్నంత వరకూ... కోరికలు, బాధలు ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ ‘జ్ఞాన సిద్ధి’ అనే వెలుగులో ‘నేను’ అనే భావన కరిగిపోయినప్పుడు (‘పాము కాదు తాడే’ అని తెలిసినప్పుడు) అవన్నీ పటాపంచలవుతాయి. నిరంతరం ఈ స్థితిలో ఉండడమే మోక్ష సిద్ధి. 

💐 *జ్ఞాన సిద్ధి* ఒక ఘటన. చాలా సందర్భాలలో అది ఆకస్మికంగా జరుగుతుంది. ఈ విషయంలో చాలా ప్రఖ్యాతి పొందిన ఉదంతం శ్రీ రమణ మహర్షిది. 

💐 ఆయనకు ఒక రోజు మధ్యాహ్నం... కొన్ని గంటల వ్యవధిలోనే ఆత్మతత్త్వం తెలిసిపోయింది. కానీ జ్ఞాన సిద్ధి చాలా నెమ్మదిగా జరిగిన సందర్భాలూ ఉన్నాయి. ఆకస్మికంగా జరిగినా, నెమ్మదిగా జరిగినా... జ్ఞానసిద్ధి కలిగిన తరువాత... ‘ఏదో జరిగింది’ అని మాత్రం కచ్చితంగా తెలుస్తుంది. అది ఎప్పుడు, ఎలా అవుతుందో ఎవరూ చెప్పలేరు. *సృష్టి, స్థితి, లయ*... వీటికి అదనంగా మరో రెండు పార్శ్వాలు ఉన్నాయంటారు. అవి.. *మాయ, అనుగ్రహం.* ఏ కొందరికో, ఎప్పటికో... కృప ద్వారా ‘మాయ’ అనే పొర తొలగిపోవడం జరుగుతుంది. 

💐 ఈత కొట్టడం వచ్చిన తరువాత... ఈత రాని స్థితి ఇక ఎప్పటికీ ఎలా ఉండదో... జ్ఞాన సిద్ధి పొందిన తరువాత పూర్వపు స్థితి ఉండదు. ఇది వినగానే... సాధకులకు తప్ప... చాలామందికి భయం కలుగుతుంది. ‘అదేమిటి? నేను లేకపోతే ఇంకేం ఉంటుంది? జీవితం అన్న తరువాత బాధలు ఉండడం సహజం. అన్నీ వదిలేస్తే జీవితానికి గమ్యం, సార్థకత ఏముంటాయి? బతుకు నిస్సారం అవుతుంది కదా?’... ఇలా సాగుతాయి ఆలోచనలు. 

💐 కుటుంబంలో ఎవరైనా ఆధ్యాత్మికత వైపు ఆసక్తి చూపిస్తూ ఉంటే... ‘సన్యాసుల్లో కలిసిపోతాడో ఏమిటో?’ అని కూడా భయపడుతూ ఉంటారు. ఈ ఆలోచనలకు కారణం అజ్ఞానం. నిజానికి జ్ఞానుల్లో సన్యాసుల కన్నా గృహస్తులే అధికం. జ్ఞాన సిద్ధి పొందిన తరువాత... సాధారణ జీవితాన్ని ఇంకా ఆనందంగా గడుపుతున్నవారు ఎంతోమంది ఉన్నారు. దీనికి శ్రీ రమణ మహర్షి ఒక ఉపమానం చెప్పారు... *‘‘కాలిన తాడు ఆకారం తాడులాగే ఉంటుంది, కానీ దానికి బిగువు ఉండదు. అలాగే జ్ఞానులను బంధాలు కట్టివెయ్యలేవు. కానీ బంధాలకు దూరంగా ఉండడం కూడా జరగదు’’* అని.


🙏 *సర్వే జనాః సుఖినోభవంతు* 🙏

*Courtesy:* ఆంధ్రజ్యోతి నవ్య
*సేకరణ:* .

" PROBLEM-- -SOLVING" ( సమస్య - దాని పరిష్కారము)

 "👍👍👍👍👍"
" PROBLEM-- -SOLVING"
( సమస్య - దాని పరిష్కారము)
        🙏🙏🙏
🚩"సమర్పణ & సేకరణ:-
MAZUMDAR BANGALORE Karnataka
87925-86125.
"Impact Foundation"
 సౌజన్యంతో,
       🌷🌷🌷
    🌹" సమస్య:- ఇది సహజంగా ప్రతి ఒక్కరికి ఉండును.  కానీ కొందరు భయపడతారు.  మరికొందరు "సాధన" ద్వారా పరిష్కారము చేసుకుంటారు.   మరికొందరు "బ్యాలెన్స్" చేసుకుంటారు.

   🔥" అసలు "సమస్య" అంటే ఏమిటి?  ఇవి ఎందుకు వస్తాయి? అని ఆలోచించితే!
     మనకు నచ్చని విషయాలు అన్నీ మనకు సమస్యగా" ఫీల్" అవుతాము.  అసలు కొన్ని సమస్యలను మనము మార్చలేము, కొన్ని సమస్యలకు అలవాటు పడతాము.  కొన్ని సమస్యలు వయసుతో అనుసంధానమై కొన్ని ఉండును, మరికొన్ని మీరు పెరిగిన వాతావరణం బట్టి, కొన్ని సమస్యలు మనం పెట్టుకునే  "గోల్ టార్గెట్' "కూడా సమస్యగా ఫీల్ అయ్యే వాళ్ళు ఉన్నారు.
ఆడవారికి వంట చేయుట సమస్య, కొన్ని సమస్యలకు" చిట్కాలు" గలవు.
      🔥 " మనుషులు వస్తువులు,  ఆలోచనలు, జంతువులు వాతావరణం చెట్లు , ప్రకృతి ,నీరు ,అగ్ని గాలి, భూమి "పంచభూతాలు" కూడా సమస్యగా పరిగణిస్తాయి కూడా!  అవి ఎక్కువ అయినా? తక్కువ అయినా? సమస్యలు అనిపిస్తాయి.
 Speed గా, ఆగ్రిసివ్ ( aggressive)గా, న్యాయబద్ధంగా, క్రమబద్ధంగా, ధర్మబద్ధంగా వుండాలి.
"  PROBLEMS " లో చిన్నవి, మద్యస్థము, పెద్దవి ఉండును, వీటిని "ఊహాత్మక పద్ధతి" లో ఎదుర్కోవాలి.  ఇవి ఒక గంటలో, ఒకరోజు, మరికొన్ని దినాలు, దీర్ఘకాలము పట్టవచ్చు.
( Limited partnership,. కలిగి ఉంటారు.     Physically, mentally,  బాధలతో సమస్యలను పరిష్కరించాలి) సమస్య ఏమిటి? ఇది ఎక్కడ ఉన్నది, ఉత్పన్నమైన మూలం , కనుక్కొని పరిష్కారము కొనుక్కోగలిగిన దీర్ఘకాలంపాటు ఆనందంగా ఉండవచ్చు.  
కొన్నిసార్లు ఉపశమనం లభించవచ్చు , దానివల్ల తాత్కాలిక శాంతి కలుగును.   మరికొన్నిటికి సమాధానము లభించును.                  Eg: Bank లో 
Cash book , bank book , Pass Book, లలో మన డబ్బు సరిగా నమోదు కాని వాటికి,
వాటిని "Tally " చేసి గ్రహించిన సరైన సమాధానము లభించువరకు ఉండి పరిష్కరించి, మేనేజర్ ఇంటికి వెళ్ళుటకు ఆలస్యమైన సందర్భాలు chaala  మీరు గుర్తించగలరు.

     🙏" మరికొన్నిచోట్ల పరిష్కారము "సామెత" ల ద్వారా బోధించబడును.
" పుండు"  ఒకచోట అయితే "మందు" మరియొక చోట అంటారు గా,

   🔥"0 నుండి 3 సంవత్సరాల పిల్లలకు మాటలు సరిగా రావు. వారి సమస్యలు చెప్పలేరు , పెద్దలు అర్థం చేసుకోవాలి పాలు కొరకు, డైపర్ కొరకు తీయమని ఏడుపు,.  కొన్ని సమయాలలో వారు చిరునవ్వు ద్వారా తెలుపగలరు.

     🔥" 13  నుండి 18 సం. మధ్య వయస్సు వారికి , సమస్యలనుంచి సమాధానము కుతుహోలముగా ఉండును .  ప్రమాదాలకు గురికావడం జరుగుతుంది.  కూడా!

     🔥25సం!! వారు వారి సమస్యలను సమర్థంగా , సొంతంగా పరిష్కారము చేసుకొనగలరు.

    👍" Problem' మన నుండి వచ్చినదా? ఎదుటి వారి నుండి ఉత్పన్నమైనదా? "Individual group of people Health Family"
కి సంబంధించినదా?  సదరు సమస్యలు గ్రామ, దేశ ,నకు సంబంధించినవా?  స్వల్పకాలిక, దీర్ఘకాలిక సమస్యలు కూడా ఉండును.   పర్యావరణం, ఆరోగ్యము ,విద్య , రవాణాశాఖ , నిరుద్యోగము , ఇది సమస్యల వలయము సమస్యలు విశ్లేషించి మన మోడీ గారు  నేడు చట్టాలని మార్చడం, తన ప్రత్యేకశైలి తో, ధైర్యము, పట్టుదల, దేశభక్తి, మనము చూస్తున్నాము.   కొన్ని సమస్యలు సమసిపోయి చిన్నదిగా ఉండును.  " మానవ జీవన పరిణామ క్రమం" లో  సమస్యలు రావటం సహజము.  నిత్య జీవితంలో, యధాస్థితి నుండి కోరుకున్న అనుకున్న స్థితికి చేర్చుట, ఆకులు రాలును., తర్వాత చిగురించును చీకటి- వెలుగులు, అనేవి" కమల పిల్లల "లాంటివి అని అర్థము చేసుకోవలెను.

🧤" మీరు సమస్యలను ఎదుర్కొనుటకు సూచనలు, సలహాలు వాటికి సరైన "పరిష్కార మార్గాలు" సాధన ద్వారా, పరిష్కారము చేసుకో వచ్చు.

🌷1" మీరు మీ సమస్యలను కొన్ని పార్ట్స్ గా విభజించి, ప్రయారిటీలో  క్లారిటీగా మార్గాలు అన్వేషణ చెయ్యండి.

🌷2. " మీరు పరిష్కారము చెప్పినప్పుడు ఒకసారి రివ్యూ చేయండి.

🌷3." Organise the solution, " అనేది ఒక క్రమ పద్ధతిలో పెట్టుకోండి.

🌷4)" Believe yourself"
   మిమ్ములను మీరు నమ్మాలి ,అదికమించాలి.

🌷5)" Lead" చేసేముందు మనం
     Depend కాకుండా అవ్వాలి.

🌷6)" Energetic & Mentally సమస్యలను
Face చేయగలగాలి.

🌷7)" Measurable(కొలమానంగా) "గా వుండాలి.
  "Effective"గా అంచనా వేయగలగాలి.

🌷8)" మీరు మీ సమస్యకు "కాల వ్యవధి" పెట్టుకోండి.

🌷9)" మీ యొక్క అనుభవం కూడా ఉపయోగపడును.

🇮🇳10)" పరిస్థితులను అర్థం చేసుకొని, పరిష్కార దిశగా అడుగులు వేయాలి.

🚩11)" కొన్ని వాతావరణము ఆధారముగా పరిష్కారము లభించును.

🚩12)" టీ.వీలో,  సోషల్ మీడియాలో చెప్పుట తేలిక, కానీ ఆచరించుట చేయాలి.

💧13)" మీ మైండ్ తో ఆలోచించి మనసుతో చేయాలి.

💦14)" Silent" గా ఉండవలసి రావచ్చు,
      Cool గా ఆలోచనలు చేయాలి.

🦜15)" ఎప్పుడు "Opportunity" ఎదుటివారికి ఇవ్వాలి.
అవకాశం, అభిప్రాయం పొందుట ముఖ్యం.

🌷16)" list out, unity,
Loyal గా, ఇతరులతో        compare చేయకుండా

🌷17)" Responsibility Feel అవ్వాలి.

🌷18)" సమస్య పరిష్కారానికి ఒక్కొక్కసారి ఎక్కువ సమయం పట్టును, ఒకళ్ళను ఒకరు అర్థం చేసుకోవడం ముఖ్యము.

🌷19)" చిరునవ్వు భూషణంగా, మనలో భావనలే సాధన ద్వారా పరిష్కరించబడును.

🇮🇳20)" Sorry 
   Simple problems, solution critical (Fire,
Floods, Earthquake)
మరియు యుద్ధ సమయాల యందు. కీలక నిర్ణయాలు, సమస్యకు అవసరముంది.

🌷21)" ఐడెంటిఫై" కారణం ఎవరి నుండి ఎక్కడ ప్రారంభమైంది.  ఇది ఒక్కటే పరిష్కారము కాదు, చాలా ఉండును (ఆలోచన స్రవంతి) ఏది
అమలు చేయాలి, వేచి చూడాలి.

🌷22)" Tools,(అవతల వారి అభిప్రాయము).(   Teamwork, Logical problems,

🌷23)" Focus on the 
  Situation, Suffering,
గురించిన ఆలోచన,

🌷24)" ఎదుటివారు చెప్పినది పూర్తిగా వినాలి,
కంపేర్ చేసుకో,  సమస్యకు పరిష్కారం చెయ్యి.

🌷25)" Analyse." చేసి, Review చేయుట,
Relevant, గా దాని గురించి మాత్రమే ఆలోచించు,
"Conflict." రావాలి.      Root Cause తెలుసుకొని  దానికి తగు "మందు " వెయ్యండి.

🌷26)" పాజిటివ్"  గా ఆలోచించండి.

🌷27)" సమస్యలు అనేవి మన ఇంటికి వచ్చి బంధువులు కారు ,వారు,
అలాగే సమస్యలు అంతే,

💧28)" బాధపడి ఇంట్లో కూర్చుంటే పరిష్కారము కాదు, ఒంటరితనము వీడండి!

🌷29)" ఏ సమస్యకైనా మూలాలు కనుక్కోండి? విశ్లేషించి, పరిష్కరించి చిన్నదిగా ఉన్నప్పుడే పరిష్కారించు,

💧30)" అవసరమైతే, డబ్బు, పలుకు బడి, స్నేహము, బుద్ధి, నీ టాలెంట్, ఉపయోగించు!

🌷31)"సమస్యకు భయపడి తలవంచిన (అతిగా ఆలోచన పనికిరాదు.)

🌷32)" Life  is challenges" గా పాల్గొనాలి.  మనకు మనమే" ఇన్స్పైర్" కావాలి.

💧33)" చిన్నపిల్లలకి ఒక రకమైన, పెద్దలకు వేరొక రక మైన, సమస్యలు వచ్చును.   కోర్కెలు పెరిగిన సమస్యలు పెరుగును.

🚩34)" సంబంధం లేని వాటిని, కొన్ని ప్రభుత్వ చట్టాల వల్ల, మరికొన్ని ప్రకృతి వల్ల, సెంటిమెంట్ ఆధారంగా సమస్యలు కూడా వస్తాయి.   మన కుల, మత వ్యవస్థలోని వ్యక్తులు మనస్తత్వాలనుండి ఉద్భవిస్తాయి.  కొన్ని సమాజం నుండి రావచ్చు!

🇮🇳35)" సమస్య"ను ముందు చూపుతో ఎదుర్కొనే ధైర్యం ఉండాలి.  సమస్య మూలాలకు సమస్య బరువు అనుకుంటే, "బరువు " తేలిక అంటే "తేలికే " మనది కాదు అనుకుంటే "ఈజీ" పరిష్కారములు కొరకు శత్రువుల వద్ద వెళ్లి తీసుకోకూడదు.

🌷36)" నీవు చేయు పరిష్కారము వేరే వారి మనసు నొప్పించకూడదు.  వేరే వారి ధనము కొరకు ఆశపడకూడదు, అనవసరమైన విషయాలలో తల దూర్చకుండా సమస్యను "చిన్నగా" చూడు-  పరిష్కారము మాత్రము 
" పెద్దది"గా ఆలోచించు.

💧37)" మీ "Mind Control" ( warning, guidance, phone charging, Discuss, 
చేసి పరిష్కరించు 55 నిమిషాలు ఆలోచించు,
పరిష్కారము మాత్రము ఐదు నిమిషాలు మాత్రమే పట్టును.

🚩38)" Complaint Nature "( eg: పెట్రోల్ బంక్, రైలు నందు, బస్సులో కనీస మౌలిక సదుపాయాలు లేకపోయిన "కంప్లైంట్ బాక్స్" నందు ఒక లెటర్ పోస్ట్ చేసిన, దానికి తగు అధికారులు తన చర్యల ద్వారా పరిష్కారము తప్పక చేయగలరు.

🇮🇳39)" మొదట నీ "Attitude Change"
చేసుకొనగలిగితే ప్రతిదీ మారును.

🙈40)" ఎప్పుడు నిన్ను నీవు నిందించుకోకూడదు.  ఒక మార్గము మూసుకున్న,
వేరొక దారి కొరకు అన్వేషణ చెయ్యి!  మన సమస్యలను బాధ్యతతో పరిష్కరించుకొని, ఇతరుల సమస్యలు, బాధగా వదిలి పెట్టవద్దు.
చిన్నవి పట్టుకోండి, పెద్దవి తట్టుకుంటాము అనే విధంగా ప్రవర్తించండి!
       🌹🌹🌹
     🙏" మీ సమస్యలు-
 వాటి వల్ల వచ్చే లాభాలు"
       🙏🙏🙏
🧤1)" మీయొక్క "నాలెడ్జి" పెరుగుతుంది.  ఇది ఒక సాధనా మార్గము.

🧤2)" మీరంటే " గౌరవం" పెద్దరికం,
తప్పక పెరుగుతుంది.

🧤3)" మీరంటే ఒక ప్రత్యేక నమ్మకం ఏర్పడుతుంది.

🧤4)" ఎదుటివారిలో మీ
యెడల
"దృడ సంకల్పం" ఏర్పడును.

🧤5)"advance development"

🌹6")" understand levels" పెరుగును

🧤7)" communication skills" బాగా పెరుగును.

🧤8)" Economic "గా  "Energy" పెరుగును

🧤9)" కొత్త విషయాలు నేర్చుకుంటాము.

🧤10)" కొన్ని గుణ పాఠాలు వల్ల పొరపాట్లు సరిదిద్దుకోవచ్చు.

🧤11)" కరోనా లాంటి ప్రకృతి సమస్యల వల్ల కొన్ని దేశాల ప్రజలు చాలా విషయాలు ( క్రమశిక్షణ నేర్చుకున్నారు)

🧤12)" ముందుచూపు కలుగుతుంది.

🧤13)" ప్రశ్నించే తత్వము" "ధైర్యము" కలుగుతాయి.

🧤14)" మీ మాట తీరు, మీ ఆలోచన తీరు, మీ నడవడిలో మార్పులు,
Lifestyle, లో కొత్తదనము స్పష్టముగా కనబడును.

🧤15)"  నీవు భగవద్గీత చదివి, నీ తలరాత మార్చుకొని,  సమాజానికి మార్గదర్శివి, తప్పక అవుతావు.
       💧💧💧
🙏" సమస్యల పరిష్కారములు నీకు కలిగే నష్టాలు"
      🔥🔥🔥
🧡1)" డిప్రెషన్కు" లోన అవుతావు.
 
💙2)" Dependent" భావాలతో నిండి ఉంటావు.

💜3)" ఒక్కొక్కసారి చులకనై అయిపోతావు.

💛4)"మానసిక దౌర్భాగ్యం అనుభవించాలి.

💚5)" నీలో ఉన్న అహం, అసూయ ,స్వార్థము, బయటకు వచ్చును.

❤️6)" అతివాగుడు తో ప్రవర్తించిన నీ విలువ తగ్గిపోవును.
    🙏🙏🙏
 👍" సమస్య పరిష్కారములు తీసుకో తగ్గ జాగ్రత్తలు ఏమిటి?
        🙏🙏🙏
1)" నిన్ను నీవు నిందించుకోవద్దు.

2)" అతివాగుడు పనికిరాదు.

3)" అతి ఆలోచన పనికిరాదు
.
4)" బాధ్యత లేకుండా ఉండకు.

5)" అహం అసూయ స్వార్థం వీడు.

6)" నెగిటివ్ ఆలోచనలు" పనికిరావు.

7)"అతి ప్రేమ చూపించిన న్యాయం చేయలేము.

8)" ఒంటరితనము వీడండి.

9)"పరుల సొమ్ముకు ఆశపడవద్దు.

10) "శత్రువుల వద్దకు పరిష్కారము కొరకు వెళ్ళవద్దు.

11)"ఊపికించుకోవటం వస్తువులను పగలకొట్టుట మత్తు పదార్థాలకు బానిసవుట సానుభూతి కోరుకొనుట మాటతీరు తురుసుతనము వదలక విషయాలు ఆత్మనుండుతా భావము కలిగి ఆత్మహత్యకు పాల్పడుట చేయరాదు సుమా!

12)" ఆత్రుత ఉండకూడదు

13)" భయంగా భారంగా మీరు  ఆలోచనలు చేయకండి.

14)" సమస్యలను భూతద్దంలో 70 ఎంఎం లో చూడ వద్దు.

15)" సమస్యలను వేరే వాడి మీదకు నెట్టి వేయవద్దు , నీ విలువ దిగదార్చుకునే పని, అసమర్ధుడిగా ఉండే అవకాశం ఉంది.

16)" ఫెలోభాలకు గురి కాకుండా ఉండాలి. పొగడ్తలకు దూరంగా ఉండండి.

17)" సమస్యల పట్ల వాయిదా వేస్తూ కాలం గడపకండి.

18)" మీ కుటుంబ విషయాలు బయట వారికి చెప్పరాదు
.
19)" అందరూ నా మాటే వినాలి అనే పంతము ఉండకూడదు.

20)" మీలో మొండితనము, వస్తు బ్రాంతి ,వ్యామోహము, పనికిరాదు.
🎷"సమర్పణ:' మజుందార్ బెంగళూరు
జై భారత్, వందేమాతరం
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

Saturday, May 6, 2023

:::: ధ్యానం అంటే వదిలి పెట్టడం ::::

 *:::::: ధ్యానం అంటే వదిలి పెట్టడం :::::*

   క్రింద చెప్పినవి వదలడమే ధ్యానం. ఎందుకంటే ఇవి దుఃఖ జనితాలు

*1 ఇష్టాలు.*. వీటి వల్ల ఉపయోగం లేదు. అన్నింటిని అంగీకరించిండి.
*2ఎంపికలు*...ఏవి అయితే మనలను ఎంపిక చేసుకొని వచ్చినవో అవే మన ఎంపికలు.
*3ఊహలు.* . ఊహించినట్లు జరగవు 
*4గతం.*..శవం తో సమానం. పార వేయండి 
*5) ఆశలు..*.నెరవేరవు
6)రిహార్సల్స్. ..సమయస్ఫూర్తి కలిగి వుంటే రిహార్సల్స్ తో పని లేదు 
*7) బంధాలు.*..భౌతికంగా వుంచు కోవచ్చు 
*8)అంటి పెట్టుకున్నవి..*. బరువు. లెస్ లగేజ్, మోర్ కంఫర్ట్ 
*9) భద్రత.*..ఎవరికి లేదు భరోసా

  కనుక అన్నింటిని వదిలితే హాయి గా వుంటుంది.

*షణ్ముఖానంద 98666 99774*

*::::: బుద్ధ జయంతి స్పెషల్ :::::::* *::: బుద్ధుడు అంటే ఒక ఫాక్టర్ ::::::*

 *::::: బుద్ధ జయంతి స్పెషల్ :::::::*

*::: బుద్ధుడు అంటే ఒక  ఫాక్టర్ ::::::*

    మానసిక స్థితి ని బట్టి మనస్సు పని చేస్తుంది.
  మానసిక స్థితి అనేది కొన్ని రకాల కారకాలు(factors) కలయిక  వలన ఏర్పడుతుంది.
  ఎలాంటి కారకాలు కలిసినవి అనే దానిని బట్టి మానసిక స్థితి, దీనిని అనుసరించి  ప్రవర్తన వుంటుంది.
  కుశల కారకాలు అయితే శీలవంతమైన ప్రవర్తన  ప్రదర్శించ బడుతుంది.

   బుద్ధుడు అంటే మనిషి కాదు . ఒక కారకము.FACTOR

 ఎప్పుడైతే బుద్ధ ఫాక్టర్ ని మనస్సు గ్రహించిందో అలాంటి మనస్సు నిర్వాణం వైపు పయనిస్తుంది.

*షణ్ముఖానంద 98666 99774*

Thursday, May 4, 2023

మంచి ఆలోచనలు, చేతలు చెడు ఫలితాలను ఇవ్వలేవు. అలాగే చెడు ఆలోచనలు,ఆచరణలు, చర్యలు సత్ఫలితాలను ఇవ్వలేవు.

 *🕉️మంచి ఆలోచనలు, చేతలు చెడు ఫలితాలను ఇవ్వలేవు. అలాగే చెడు ఆలోచనలు,ఆచరణలు, చర్యలు సత్ఫలితాలను ఇవ్వలేవు. అంటే వరి విత్తితే వరే వస్తుంది గానీ, జొన్న రాదు. ముళ్ల చెట్లు నాటితే ముళ్ల కంపే వస్తుంది కానీ మరొకటి రాదు*. *తెలిసి కానీ,తెలియక కానీ ఏది విత్తామో అదే మొలకెత్తుతుంది.*

*ప్రకృతిలోని ఈ న్యాయ సూత్రాన్ని మనం సులువుగా అర్ధం చేసుకుని దానితో సహకరించి పనిచేస్తాం. కానీ,నైతిక,మానసిక ప్రపంచం విషయానికి వస్తే ఈ మౌలిక సూత్ర రహస్యాన్ని బహు కొద్దిమంది మాత్రమే గుర్తిస్తారు*. *భౌతిక ప్రపంచంలో ఈ సూత్రం ఎంత సూటిగా,సరళంగా ఉందో,మానసిక ప్రపంచంలో కూడా అంతే సూటిగా,సరళంగా వుంది. కాని దానిని గ్రహించలేక పోవడం వలన దానితో సహకరించరు. బాధలు,కష్టాలు ఎల్లప్పుడూ ఏదో తప్పుడు ఆలోచనల ఫలితమే. మనతోనూ,మన వునికిని నిర్దేశించే మౌలిక నియమంతోను మనం సామరస్యాన్ని కోల్పోయాం అనడానికి కష్టాలు ఒక సంకేతం*. మనలో వ్యర్థమైన,మాలిన్యమైన దాన్నంతిటిని కా ల్చి, భస్మం చేసి మనల్ని శుద్ధి పరచటమే కష్టాల ఏకైక మహత్తరమైన ఉపయోగం. నిర్మల మనస్కులకు కస్టాలుండవు. శుద్ధి పరచిన బంగారాన్ని కాల్చడం వలన.ప్రయోజనం ఏముంటుంది? నిర్మలమై,జ్ఞానోదయం చెందిన వ్యక్తి కష్టాల పాలు కాలేడు.

🕉️🙏

అనన్య భక్తి

 ⚛️⚛️ *""అనన్య భక్తి""*  ⚛️⚛️
      ❤‍🔥⚛️❤‍🔥⚛️❤‍🔥⚛️❤‍🔥
            ❤‍🔥⚛️🕉️⚛️❤‍🔥
                  ❤‍🔥⚛️❤‍🔥
                        ❤‍🔥
*"భక్తికి సాధన తోడైతే అంతర్యామి పరిష్వంగంలో జీవించడం సులభతరమవుతుంది. భక్తిలో మూడు స్థాయులున్నాయి. అవి వైధిభక్తి, రాగాత్మక భక్తి, అనన్య భక్తి. ఇవి- ఒకదాని కంటే మరొకటి అధికంగా భగవంతుడితో మమేకత్వానికి దోహదం చేస్తాయి. రాగం అంటే ఒకరి పట్ల ప్రేమ.""*

*"భక్తికి సాధన తోడైతే అంతర్యామి పరిష్వంగంలో జీవించడం సులభతరమవుతుంది. భక్తిలో మూడు స్థాయులున్నాయి. అవి వైధిభక్తి, రాగాత్మక భక్తి, అనన్య భక్తి. ఇవి- ఒకదాని కంటే మరొకటి అధికంగా భగవంతుడితో మమేకత్వానికి దోహదం చేస్తాయి. రాగం అంటే ఒకరి పట్ల ప్రేమ. ఏదైనా ఒక దేవతను గురించి ఇష్టాపూర్వకంగా ధ్యానిస్తూ, నిరతిశయమైన భక్తిని కలిగి ఉండటాన్ని రాగాత్మక/రాగానుగ భక్తి అంటారు."*

*"విధి అంటే తప్పక చేయదగింది.దీనికే చట్టం, నియమం, శాసనం అనే అర్థాలున్నాయి. వైధిభక్తి అనేది బాధ్యత అనే భావనమీద ఆధారపడి ఉంటుంది. భగవంతుడి అనుగ్రహం పొందడానికి తనవంతు బాధ్యతగా వినడం, కీర్తించడం, స్మరించడం సహా తొమ్మిదిరకాల బాధ్యతల్ని నిర్వర్తించడమే వైధిభక్తిలోని ప్రధాన నియమం. వాటినే నవవిధ భక్తిమార్గాలని పురాణాలు చెబుతున్నాయి. అవి- శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చన, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదన ఎవరి శక్త్యానుసారం వారు నియమపూర్వకంగా అవలంబించి తరించే భక్తి మార్గాన్ని చూపుతాయవి. వీటన్నింటి కంటే అతీతమైనది అనన్య భక్తి. మనసులో ఇతర ఆలోచనలకు చోటు లేకుండా భగ వంతుడి పట్ల మాత్రమే దృష్టి కలిగి ఉండటం దీని లక్షణం. దీనికే శుద్ధ భక్తి, ఏకాగ్రతా భక్తి అనే నామాం తరాలూ ఉన్నాయి. జగత్తులో దైవం తప్ప మరొకటి ఏదీ లేదు అనే విశ్వాసం కలిగి ఉండటమే అనన్య భక్తి అని వేదాంతులు చెప్పిన మాట. ‘అన్యథా శరణం నాస్తి, త్వమేవ శరణం మమ’ అని వైదిక మంత్రం చెబుతోంది. ఇదే భావాన్ని పోతన ‘నీవే తప్ప నితఃపరంబెరుగ’ అని చెప్పాడు. కాబట్టి ఈ విశ్వమంతా భగవత్స్వరూపమే అనే భావాన్ని కలిగి ఉండాలి. ఏది చూసినా దైవస్వరూపమే అనుకోవాలి. ఏది చేసినా దైవసేవే, ఎక్కడ నడిచినా దైవప్రదక్షిణమే... అనే భావంతో జీవితాన్ని గడపాలి. ఇదే అనన్యభక్తి ముఖ్య లక్షణం."*

*"దేవుడి సర్వవ్యాపకత్వం ఒక్కసారి అనుభవంలోకి వస్తే ప్రపంచ విషయాల మీద ఆసక్తి తగ్గిపోతుంది. అది భక్తిలో మొదటి లక్షణం. ఆ స్థితికి చేరిననాడు అందరూ దైవస్వరూపులే. కాబట్టి ఎవరినీ ద్వేషించకూడదు. ఏ జీవికి సేవచేసినా దైవసేవ చేసినట్టే. ఏ జీవిని తిరస్కరించినా దైవాన్ని తిరస్కరించినట్టే అని భావించగలగాలి. అదే అనన్య భక్తికి తొలిమెట్టు."*

*"సర్వవ్యాపకత్వాన్ని అనుసరించడం చాలా కష్టం. అంతరాంతరాల్లో ఒక భయం వెంటాడుతూనే ఉంటుంది. అదేమిటంటే... ఎదురుగా నా బంధువులు, ఆప్తులు, నా వాళ్లందరూ ఉన్నారు. వారందరినీ కాదని దేవుడినే నమ్ముకున్నానని తెలిస్తే, వాళ్లు చేసే ఆ మాత్రం సాయం కూడా చేయరేమోననే భయం. వాళ్లు కనీసం కనిపిస్తున్నారు. భగవంతుడు అలా కనిపించడు. ఎలా ఆదుకుంటాడు? ఇది వారి లోలోపలి అనుమానం."*

*"ఈ భావాలు, భయాలు, అనుమానాలు అన్నింటికీ భగవంతుడే స్వయంగా పరిష్కారం చెప్పాడు. వేరే ఆలోచనలు లేకుండా, నిత్యమూ తననే నమ్ముకుంటే వారి యోగక్షేమాలను తానే చూస్తానని. కాబట్టి మనసును సర్వాంతర్యామి మీద స్థిరంగా ఉంచి, తన సర్వస్వాన్నీ ఆయనకు అప్పగించగలిగితే... నిస్సందేహంగా ఆ అంతర్యామి పరిష్వంగంలో జీవించగలం."*
                  ❤‍🔥⚛️❤‍🔥⚛️❤‍🔥
                        ❤‍🔥🕉️❤‍🔥
 🕉️ *నమో భగవతే శ్రీ రమణాయ* 🙏💥🙏
*భగవాన్ శ్రీ రమణ మహర్షి* ఉవాచ:
🔅"మీ ఆలోచనలను నమ్మవద్దు. నేను శరీరాన్ని అనేదో ఒక ఆలోచన. నేనే మనస్సు అనేది ఒక ఆలోచన. నేనే చేసేవాడిని ఒక ఆలోచన. చింత ఒక ఆలోచన మాత్రమే. భయం  ఒక ఆలోచన . 
 *మరణం కూడా ఒక ఆలోచన మాత్రమే."🔅* 
🙏🌷🙏 *శుభం భూయాత్*🙏🌷🙏
 ఓం నమో భగవతే శ్రీ రమణాయ. పుట్టిన ప్రతి జీవికి ప్రారబ్దము తప్పదు. ఈ మాయలో పిడికెడు  ప్రారబ్ధం తో ప్రతిఒక్కరూ వస్తున్నారు. అందులో పుట్టుక మరణం స్థితి గురించి నిర్ధారించి ఉంటుంది. ముఖ్యంగా ఏ ఏ కర్మలను ఆచరించాలి ,అనుభవించాలి, అనేది తెచ్చుకున్న టువంటి కర్మ లో అది ఏర్పడుతుంది .ఈ జన్మలో నీవు కొత్తగా ఏది తీసుకోవు. యేది జరగవలసి వున్నదో అది జరిగి తీరుతుంది. నీవు వద్దన్నా అది ఆగదు, మారదు అయితే నీవు దేహము కాదని .నేనంటే ఆత్మ  జ్ఞానం అని నీవు గుర్తించినప్పుడు, దేహం స్ఫురణ పూర్తిగా కోల్పోయి, నీవు ఆత్మగానే నిలిచి ఉంటావు. ఇక్కడ ప్రారబ్ద కర్మలు మార్చటానికి  ఈ మాయలో నీకు వీలు లేదు. అవకాశమూ లేదు. ఉదాహరణకి దేహము ,తల్లిదండ్రులు ,సంసారం, పరిసరాలు . వీటిని ఎలా మారుస్తారు?  అది ఎట్లా ఉంటుంది అంటే విల్లుని విడిచిన బాణం అలాంటిది. దానికి చికిత్స లేదు .ఎన్ని పూజలు చేసినా, ఎన్ని  వ్రతములు ఆచరించినా, , ఎన్ని క్రతువులు చేసినా మారదు. మారదు మారదు .అయితే నీవు దేహము కాదు .నేనంటే జ్ఞానమని తీవ్ర వైరాగ్యముతో, ఇది అసత్యమని గుర్తించి ,ఆత్మ విచారము చేసినప్పుడు ,అంటే నేను ఎవరిని? అని విచారించినప్పుడు, అక్కడ ఆలోచించే వాడు గానీ, ఆలోచనలు కానీ , ఇతరులు గానీ  మరేదీ కానీ , ప్రపంచము గాని, సంసారము  కానీ  యేదీ ప్రకాశించదు. కారణం అవన్నీ ఆలోచనలు. అన్యత్వం  ఏ ఒక్కటి ప్రకాశించదు. అంతా  అదృశ్యమైపోతుంది . నీవు నీవు గా నిలిచి ఉంటావు.  అహం స్ఫురణ గా జ్ఞానమే నిలిచి ప్రకాశిస్తుంది.  ముఖ్యంగా ఇప్పుడు నీవు ఒక పని కొట్టు అనుకున్నప్పుడు ఇది ఎటు పోతే నీకెందుకు ? ఎందుకు నీకు దేహం మీద అభిమానం?  పూర్తిగా అదృశ్యమై పోతుంది.  జనన మరణాలకి అతీతంగా ఉంటావు. అంటే జ్ఞాన స్వరూపము గా  ,నేను అహం స్ఫురణ ప్రకాశిస్తుంది. ఆ ఉన్నాను అన్న ఎరుక  కి ఉదయా స్తమానములు లేవు. .కనుక ప్రతి ఒక్కరూ ఏమంటున్నారు  అంటే, నాకు,  నేను ఏమి అనుకోకపోయినా ఆలోచనలు వస్తూనే ఉన్నాయి ఎందుకు? కారణం నీ మనస్సు లో ఇదంతా నిజము అని, వాటి వెంట పరిగెడుతుంది. ఈ దేహానికి మరణము తప్పదు.  అది నీవు కానప్పుడు ఎందుకు దాని గురించి  యోచన? పుట్టిన దానికి మరణము తప్పదు .సరే గతించిన  దానికి తిరిగి పుట్టక తప్పదు.  అని కూడా కృష్ణ పరమాత్మ చెప్పుడం జరిగింది కదా!  కనుక రమణ మహర్షి వారి చేతి మీద ఒక వ్రణం వచ్చింది. మీరు దీన్ని నయం చేసుకో లేరా? అంటే , చెప్పేవాడు  లేదన్నారు. అటువంటి స్థితిని ఏర్పడటానికి కారణం స్వరూప జ్ఞానం తప్ప మరొకటి లేదు  వారికి. నాయనా నీ ప్రారబ్ధం ని  ఎవరు మార్చలేరు. దాని జోలికి పోవద్దు .నీవు నీవుగా మిగిలి వున్నప్పుడు ,ఆత్మ స్థితిలో  నిలిచి ఉన్నప్పుడు ,ఈ దేహము మనసు జరుగుతున్నటువంటి మార్పులు నిన్ను అంటవు. తెరమీది బొమ్మలలాగా!  రమణ మహర్షుల వారు ఈ సందర్భంలో ఒక విషయాన్ని ప్రస్తావించడం జరిగింది అదేమిటంటే పరమేశ్వరుడు జీవులను కర్మానుసారముగా ఆడిస్తాడు. ఏది జరగ వలది వుందో  అది జరిగి తీరుతుంది. నీవు ఎంత ప్రయత్నం చేసినా అది ఆగదు. మరి ఏం చేయాలి ? మౌనమే శరణ్యం అని చెప్పుకొచ్చారు .నీతో కలిపి నీవు చూస్తున్నదంతా అసత్యమని గుర్తించు .అంతేగాని ఈ దేహాన్ని ఎ లా నిలబెట్టుకోవాలి?రోగాల నుంచి  ఎలా బయటపడాలి ?  అన్న ఆందోళనపడి ప్రయోజనం లేదు. ఎందుకు అంటే  నీవు దేహం  కాదు. నీవు నీవు గా నిలిచి ఉండ టమే. మౌనమే శరణ్యం.

శ్రీరమణీయం: మంత్రం చాలా శక్తివంతం అంటారు.. దాని స్వభావ, స్వరూపాలు ఏమిటి ?

 🙏🕉🙏                    ...... *"శ్రీ"*

                 💖💖💖
       💖💖 *"544"* 💖💖
💖💖 *"శ్రీరమణీయం"* 💖💖
     🌼💖🌼💖🌼💖🌼
           🌼💖🕉💖🌼
                 🌼💖🌼
                       🌼
*"మంత్రం చాలా శక్తివంతం అంటారు.. దాని స్వభావ, స్వరూపాలు ఏమిటి ?"*

*"మనం మంత్రం అనే మాటను చాలా గంభీరంగా భావిస్తాం. నిజానికి అది మన ఇష్టదైవాన్ని భక్తితో పిలిచే పేరు. ఆ పేరుకు ముందు ఓం, శ్రీం, హ్రీం అని చేర్చే బీజాక్షరాలు మనలోని రకరకాల సంకల్పాలను తెలిపేందుకే కానీ అవి దైవాన్ని పిలిచేందుకు కాదు. ఆంజనేయ అని ఆర్తితో పిలిచినా అది మంత్రమే అవుతుంది. ఎవరెవరు ఏఏ పేరుతో తమ ఇష్టదైవాన్ని పిలిచినా పలికే ఒకానొక వస్తువునే దైవనామం అంటున్నాం. దైవనామం అంటే అది ఫలానా పేరు అని అర్థంకాదు. పుట్టిన తర్వాత మనకు చేసే నామకరణం కూడా మనలోని ఆ దైవనామానికి అప్పటి కారణం కోసం పెట్టే పేరు మాత్రమే. మనని ఎవరైనా పిలిచినప్పుడు మనలోనుండి పలికే శక్తికి 'దైవనామం' అని పేరు. మనలోని ప్రతి కదలికకూ, ఈ సృష్టిలోని ప్రతి కదలికకూ కారణమైన వస్తువు అదే. దాన్ని గుర్తించటమే ధ్యానం. మంత్ర జపాన్ని భక్తి మార్గమని, ఆత్మ విచారణను జ్ఞాన మార్గమని మనం అనుకుంటాం. కానీ అవి రెండూ ఒకదానికొకటి భిన్నం కాదు. తత్వాన్ని అర్థం చేసుకోవడానికే. పూలదండలోని దారంలా ఉన్న తత్వం అర్ధం కావటానికే ఏ సాధనా మార్గమైనా !"*

*"{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}"*
               

:::: వాస్తవికత VS మానసికత ::::

 *:::: వాస్తవికత VS మానసికత ::::::*

1) భౌతికమే వాస్తవం 
  భావాలన్నీ మానసికం
2)జరిగిన సంఘటన వాస్తవం
 సంఘటన పట్ల అభిప్రాయం మానసికం .
3)భౌతిక విజ్ఞానం వాస్తవం
విజ్ఞానం పట్ల వైఖరి మానసికం.
4)జరుగుతున్నదంతా వాస్తవం.
జరిగింది కలిగించే ఉద్వేగాలు మానసికం.
5)స్పందన వాస్తవం.
అనుభవాలు మానసికం.
6)జ్ఞానేంద్రియాల విజ్ఞానం వాస్తవం.
తిమ్మిని బొమ్మని చేయడం మానసికం.
7)మెదడు వాస్తవం
మనస్సు మానసికం.
8) బాధ వాస్తవం
దుఃఖం మానసికం.
9) వర్తమానం వాస్తవం
గత భవిష్యత్ లు మానసికం
10) శరీరానికి గాయం వాస్తవం
మనస్సుకి గాయం మానసికం.

*షణ్ముఖానంద 98666 99774*

Wednesday, May 3, 2023

 ఓం నమో భగవతే శ్రీ రమణాయ. పుట్టిన ప్రతి జీవికి ప్రారబ్దము తప్పదు. ఈ మాయలో పిడికెడు  ప్రారబ్ధం తో ప్రతిఒక్కరూ వస్తున్నారు. అందులో పుట్టుక మరణం స్థితి గురించి నిర్ధారించి ఉంటుంది. ముఖ్యంగా ఏ ఏ కర్మలను ఆచరించాలి ,అనుభవించాలి, అనేది తెచ్చుకున్న టువంటి కర్మ లో అది ఏర్పడుతుంది .ఈ జన్మలో నీవు కొత్తగా ఏది తీసుకోవు. యేది జరగవలసి వున్నదో అది జరిగి తీరుతుంది. నీవు వద్దన్నా అది ఆగదు, మారదు అయితే నీవు దేహము కాదని .నేనంటే ఆత్మ  జ్ఞానం అని నీవు గుర్తించినప్పుడు, దేహం స్ఫురణ పూర్తిగా కోల్పోయి, నీవు ఆత్మగానే నిలిచి ఉంటావు. ఇక్కడ ప్రారబ్ద కర్మలు మార్చటానికి  ఈ మాయలో నీకు వీలు లేదు. అవకాశమూ లేదు. ఉదాహరణకి దేహము ,తల్లిదండ్రులు ,సంసారం, పరిసరాలు . వీటిని ఎలా మారుస్తారు?  అది ఎట్లా ఉంటుంది అంటే విల్లుని విడిచిన బాణం అలాంటిది. దానికి చికిత్స లేదు .ఎన్ని పూజలు చేసినా, ఎన్ని  వ్రతములు ఆచరించినా, , ఎన్ని క్రతువులు చేసినా మారదు. మారదు మారదు .అయితే నీవు దేహము కాదు .నేనంటే జ్ఞానమని తీవ్ర వైరాగ్యముతో, ఇది అసత్యమని గుర్తించి ,ఆత్మ విచారము చేసినప్పుడు ,అంటే నేను ఎవరిని? అని విచారించినప్పుడు, అక్కడ ఆలోచించే వాడు గానీ, ఆలోచనలు కానీ , ఇతరులు గానీ  మరేదీ కానీ , ప్రపంచము గాని, సంసారము  కానీ  యేదీ ప్రకాశించదు. కారణం అవన్నీ ఆలోచనలు. అన్యత్వం  ఏ ఒక్కటి ప్రకాశించదు. అంతా  అదృశ్యమైపోతుంది . నీవు నీవు గా నిలిచి ఉంటావు.  అహం స్ఫురణ గా జ్ఞానమే నిలిచి ప్రకాశిస్తుంది.  ముఖ్యంగా ఇప్పుడు నీవు ఒక పని కొట్టు అనుకున్నప్పుడు ఇది ఎటు పోతే నీకెందుకు ? ఎందుకు నీకు దేహం మీద అభిమానం?  పూర్తిగా అదృశ్యమై పోతుంది.  జనన మరణాలకి అతీతంగా ఉంటావు. అంటే జ్ఞాన స్వరూపము గా  ,నేను అహం స్ఫురణ ప్రకాశిస్తుంది. ఆ ఉన్నాను అన్న ఎరుక  కి ఉదయా స్తమానములు లేవు. .కనుక ప్రతి ఒక్కరూ ఏమంటున్నారు  అంటే, నాకు,  నేను ఏమి అనుకోకపోయినా ఆలోచనలు వస్తూనే ఉన్నాయి ఎందుకు? కారణం నీ మనస్సు లో ఇదంతా నిజము అని, వాటి వెంట పరిగెడుతుంది. ఈ దేహానికి మరణము తప్పదు.  అది నీవు కానప్పుడు ఎందుకు దాని గురించి  యోచన? పుట్టిన దానికి మరణము తప్పదు .సరే గతించిన  దానికి తిరిగి పుట్టక తప్పదు.  అని కూడా కృష్ణ పరమాత్మ చెప్పుడం జరిగింది కదా!  కనుక రమణ మహర్షి వారి చేతి మీద ఒక వ్రణం వచ్చింది. మీరు దీన్ని నయం చేసుకో లేరా? అంటే , చెప్పేవాడు  లేదన్నారు. అటువంటి స్థితిని ఏర్పడటానికి కారణం స్వరూప జ్ఞానం తప్ప మరొకటి లేదు  వారికి. నాయనా నీ ప్రారబ్ధం ని  ఎవరు మార్చలేరు. దాని జోలికి పోవద్దు .నీవు నీవుగా మిగిలి వున్నప్పుడు ,ఆత్మ స్థితిలో  నిలిచి ఉన్నప్పుడు ,ఈ దేహము మనసు జరుగుతున్నటువంటి మార్పులు నిన్ను అంటవు. తెరమీది బొమ్మలలాగా!  రమణ మహర్షుల వారు ఈ సందర్భంలో ఒక విషయాన్ని ప్రస్తావించడం జరిగింది అదేమిటంటే పరమేశ్వరుడు జీవులను కర్మానుసారముగా ఆడిస్తాడు. ఏది జరగ వలది వుందో  అది జరిగి తీరుతుంది. నీవు ఎంత ప్రయత్నం చేసినా అది ఆగదు. మరి ఏం చేయాలి ? మౌనమే శరణ్యం అని చెప్పుకొచ్చారు .నీతో కలిపి నీవు చూస్తున్నదంతా అసత్యమని గుర్తించు .అంతేగాని ఈ దేహాన్ని ఎ లా నిలబెట్టుకోవాలి?రోగాల నుంచి  ఎలా బయటపడాలి ?  అన్న ఆందోళనపడి ప్రయోజనం లేదు. ఎందుకు అంటే  నీవు దేహం  కాదు. నీవు నీవు గా నిలిచి ఉండ టమే. మౌనమే శరణ్యం.