Friday, May 1, 2020

మనం చేసే చిన్న చిన్న సాయాలు ఒకరి జీవితాన్ని నిలబెట్టవచ్చు

రాము రోజు కూలీగా,
నగరంలో బ్రతుకుతున్న
ఒక చిరుద్యోగి,
తన జీతం తీసుకుందామని తన యజమాని దగ్గరకు వెళ్ళాడు

ఆ యజమాని, బాబూ ఈరోజుతో మన దుకాణం మూసివేస్తున్నాం
రోడ్డు వెడల్పు కార్యక్రమంలో మన దుకాణం కూల్చేస్తున్నారు ఈ రోజు అని
చివరి రోజు జీతాన్ని ఇచ్చాడు

దాన్ని చాలా పదిలంగా పట్టుకుని దీనితో తన జీవితం ముగియనుందా, రేపు ఎలా అని భగవంతుని ప్రార్ధిస్తూ ఉన్న డబ్బులతో బన్ను కొనుకుని నడుస్తూ ఆలోచిస్తూ బయలు దేరాడు

ఇంతలో ఒక ముసలాయన, అతని ఇద్దరు మనుమలతో బాబూ మేము గత రెండు రోజుల నుండి ఏమీ తినలేదు మాకు ఏమయినా సాయం చేయగలవా అని చాలా దీనంగా అడిగాడు

వారి మొహం చూస్తుంటే చాలా బాధ కలిగి తన చేతుల్లో ఉన్న బన్నును వారికి ఇచ్చాడు

ఆ పిల్లలు దానిని చాలా అత్రంగా తిని కడుపునిండా నీళ్ళుతాగారు

ఆ ముసలాయన కృతజ్ఞతా భావంతో తన చేతుల్లో ఉన్న ఒక పురాతన నాణాన్ని అతనికి ఇచ్చి బాబూ
దీని విలువ చాల ఉంటుంది
నీకు మరీ అవసరమయితేనే
ఖర్చు చేయి
అని అతని చేతిలో పెడతాడు

నిజానికయితే అది ఒక చెల్లని నాణెం అయినా దానిని తన జేబులో వేసుకుని తన ఇంటికి చేరుకుని నిద్రకుపక్రమిస్తూ భగవంతుని వేడుకుంటాడు తనకు ఒక దారి చూపమని

అలా ఆలోచిస్తూ పడుకున్న రామూకు, సడన్ గా గుర్తుకొస్తుంది
పాత వార్తాపత్రికలో పురాతన నాణేలకు తగు డబ్బులిస్తాం అనే ప్రకటన

దానిని తీసుకొని, చాలా జాగ్రత్తగా ఆ చిరునామా భద్రపరచుకొని తెల్లవారిన తర్వాత ఒక దుకాణాదారుని దగ్గరకు వెళ్ళి తన నాణాన్ని ఇస్తాడు

ఆ నాణాన్ని చూసిన
ఆ దుకాణాదారుడు ఆనందానికి,
ఆశ్చర్యానికి గురవుతూ

బాబూ
నేను ఈ నాణెంకోసం
చాలా రోజుల నుండి వెతుకుతున్నాను
ఈ నాణెం విక్రమాదిత్యుల కాలంనాటిది
ఇది ఎక్కడ ఉంటే అక్కడ అదృష్టం వెల్లి విరిస్తుంది

దీని మార్కెట్టు విలువ ౩,౦౦,౦౦౦ రూపాయలు
అని ఒక గంటలో దానికి సంబంధించిన డబ్బులు ఇస్తాడు

రాముకు సంతోషం ఆగలేదు తన డబ్బుకు వాస్తవ యజమాని అయిన ఆ ముసలి తాతకు కొంత డబ్బు ఇద్దామని తిరిగి నిన్న బన్ను కొన్న
ఆ హోటల్ దగ్గరకు వెళ్ళి
ఆ ముసలాయన గురించి అడుగుతాడు.

అప్పుడు ఆ హోటల్ యజమాని రామూతో
నిన్న నీవు బన్ను ఇచ్చిన తాత కృతజ్ఞతగా ఈ ఉత్తరం
నీకు ఇవ్వమని వేరే ఊరు వెళ్ళిపోయాడు అని
ఒక ఉత్తరం ఇస్తాడు

దానిలో ఇలా ఉంటుంది "రామూ! నీ దగ్గర ఉన్నదంతా మాకు ఇచ్చావు

నేను కేవలం నా దగ్గర ఉన్నదాంట్లో కొంచెమే
నీకు ఇచ్చాను
దానిని జాగ్రత్తగా వాడి
మంచి పేరు తెచ్చుకో
అని ఉంది

ఇది భగవంతుడు నిజంగా
ఆ తాత రూపంలో వచ్చి
తనకు ఇచ్చిన వరమని

తాను తన చివరి జీతాన్ని పూర్తిగా వారి కడుపునింపినందువల్ల
తనకు లభించిన వరమని అర్ధమవుతుంది

నీతి: మనం చేసే చిన్న చిన్న సాయాలు ఒకరి జీవితాన్ని నిలబెట్టవచ్చు

అందుకే మన చేతనయిన సాయాన్ని అందించే అవకాశం వచ్చినపుడు దానిని వదులుకోకండి

భగవంతుడు మనకు ఒక అవకాశాన్ని ఏ రూపంలో సృష్టిస్తున్నాడో మనకు తెలియదు.


No comments:

Post a Comment