Thursday, June 4, 2020

జనరిక్ మందులు నిజాలు

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺


జనరిక్మందులు గురించి ఒక మిత్రుడు చాలా గొప్పగా నిజాలను చెప్పాడు..శ్రద్ధ గా చదవండి... 👍డబ్బులు ఎవరికి ఊరికే రావు . 👌
బ్రాండెడ్
మందులు
➖➖➖✍


ఒక కొత్త మందును కనుగొనడానికి ఫార్మా కంపెనీలు అనేక పరిశోధనలు, పరీక్షలు చేసి మందును మా‌ర్కెట్ లోకి తీసుకొస్తాయి.

అందుకు ప్రతిఫలంగా ఆ మందు తయారీ పై ఆ కంపెనీకి కొంత కాలం పాటు ( 20 సం.లు) పేటెంట్ హక్కులు ఉంటాయి..

అలా తయారు చేసిన మందులను బ్రాండెడ్ డ్రగ్స్ లేదా స్టాండర్డ్ డ్రగ్స్ అంటారు.

ఆ మందు యొక్క ఫార్ములా తెలిసినా ఏ ఫార్మా కంపెనీ అయినా సరే, దానిని పేటెంట్ ఉన్న కాలంలో పెటెంట్ పొందిన కంపెనీ అనుమతి లేకుండా ఆ మందు తయారు చేయకూడదు.

అలా పేటెంట్ లో ఉన్న మందులను ఇతరులు ఎవరైనా తయారు చేసి అమ్మితే వారు శిక్షార్హులౌతారు. అంటే ఆ మందుపై, మొట్ట మొదట తయారు చేసిన కంపెనీకే 20 సంవత్సరాల పాటు గుత్తాది పత్యం ఉంటుంది.

నిజానికి ఆ మందును తయారు చేయడానికి అయ్యే ఖర్చుకూ, ఆ మందుపై కంపెనీ వసూలు చేసే అమ్మకపు ధరకు ఏ మాత్రం పొంతన ఉండదు. తయారీ ఖర్చు కంటే మందు యొక్క అమ్మకపు ధర అనేక రెట్లు అధికంగా ఉంటుంది.

ఎందుకంటే ఆ మందు తయారీ కోసం "పరిశోధనలు మరియూ క్షేత్ర స్థాయి పరీక్షల (Clinical Trials)" నిమిత్తం మాకు చాలా డబ్బు ఖర్చైందని సదరు కంపెనీ వాదిస్తుంది.. కాబట్టి ఓ 20 సంవత్సరాల పాటు ఆ మందుపై దానిని తయారు చేసిన కంపెనీకి పేటెంట్ హక్కులు కల్పించి, పెట్టుబడి సొమ్మును రాబట్టుకోడానికి, ఆ మందును మొట్టమొదట తయారు చేసిన కంపెనీకి అవకాశం ప్రభుత్వం కల్పిస్తుంది.

మందు పై #మొట్టమొదటి తయారు చేసిన కంపెనీ యొక్క పేటెంట్ కాలం ముగిసిన తర్వాత, అవే కెమికల్స్ ను ఉపయోగించి, అదే ఫార్ములాతో, అదే మందును ఏ కంపనీ అయినా తయారు చేసి, మార్కెట్ లోకి విడుదల చేయొచ్చు.. అలా తయారు చేసిన మందులను " జనరిక్_డ్రగ్స్" అంటారు.

జనరిక్ డ్రగ్స్ తయారు చేయటానికి ఫార్మా కంపెనీలు ఎటువంటి పరిశోధనలు కాని క్లినికల్ ట్రయల్స్ గాని జరపవలసిన అవసరం లేదు. అందువలన జనరిక్ డ్రగ్స్ ధరలు, బ్రాండెడ్ డ్రగ్స్ ధరలతో పోలిస్తే 30 నుండి 80 శాతం తక్కువ ధరలలో లభిస్తాయి. వీటిపై ముద్రించబడే యం.ఆర్.పీ కంటే చాలా తక్కువ రేటుకే వాటిని మనకు అమ్ముతారు.

తక్కువ ధరకు లభిస్తున్నాయి కాబట్టి నకిలీ మందులు అని, సరిగా పని చేస్తాయో చేయవో అని భయపడవలసిన అవసరం లేదు. బ్రాండెడ్ మందుల తయారీలో పాటించాల్సిన ప్రమాణాలన్నీ జనరిక్ మందుల తయారీలోను పాటిస్తారు. బ్రాండెడ్ మందులెలా పనిచేస్తాయో, జనరిక్ మందులు కూడా ఖచ్చితంగా అలానే పనిచేస్తాయి.

👉 కాని ప్రజలు జనరిక్ మందులకు అలవాటు పడితే ఫార్మాస్యూటికల్స్ కంపెనీలకూ, ఫార్మా ఏజెన్సీలకూ, మందుల షాపులకూ, అందరికీ నష్టమే కదా.

అందుకనే జనరిక్ మందులపై, అవి బ్రాండెడ్ మందుల్లా పనిచేయవన్న పుకార్లు లేవదీస్తున్నారు.. అది నిజం కాదు జనరిక్ మందులు బ్రాండెడ్ మందులతో సమానంగా పని చేస్తాయి.

బ్రాండెడ్ మందులు తయారు చేసే ఫార్మా కంపెనీలు మెడికల్ రిప్రజెంటేటివ్స్ ద్వారా డాక్టర్లకు తమ బ్రాండెడ్ ఔషధాల గురించి ఎప్పటికప్పుడు తెలియజేస్తూ వాటిని సూచించమని కోరుతుంటాయి. డాక్టర్ ఎంతమేర రాస్తే.. అంతమేర ప్రతిఫలాలను ముట్టజెబుతాయి. ఈ ఫలాలు ఉచిత విదేశీ పర్యటనలు, చెక్, బహుమతులు ఇలా పలు రూపాలుగా ఉంటాయి. అందుకే బ్రాండెడ్ ఔషధాలు చాలా ఖరీదుగా ఉంటాయి.

కొంత మంది వైద్యులు జనరిక్ మందులను సూచిస్తుంటారు. అవి వారి ఆస్పత్రి ప్రాంగణంలోనే లభిస్తాయి. వాటి ధర వాస్తవానికి చాలా తక్కువగా ఉన్నప్పటికీ వాటి మీద మీద ముద్రించబడిన ధర చాలా ఎక్కువగా ఉంటుంది. కస్టమర్ అడిగితే ఒక 10 శాతం తగ్గిస్తారు. దాంతో కస్టమర్ సంతోషిస్తాడు. కాని ముద్రిత ధర కంటే 50 నుంచి 80 శాతం వరకు తక్కువ ధర ఉంటుంది.

ఉదాహరణకు జ్వరానికి సాధారణంగా డాక్టర్ వద్దకు వెల్లకుండానే చాలా మంది వాడే మందు "డోలో 650" (పారసెటమాల్ 650 మి గ్రా.) దీని ధర 15 టాబ్లెట్లకు 29 /- రూపాయలు. ఇదే టాబ్లెట్ ను సిప్లా కంపని "పారాసిప్ 650" పేరుతో తయారు చేసి అమ్ముతుంది , దాని ధర 10 టాబ్లెట్ లకు 18/- రూపాయలు. నిజానికి జనరిక్ మెడికల్ షాపులలో పారసెటమాల్ 650 మి గ్రా.
రూ. 4.50 /- లకు పది టాబ్లెట్ లభిస్తాయి.

నొప్పి నివారణకు వాడే డైక్లో ఫెనాక్ సోడియం ఎస్ఆర్ బ్రాండెడ్ (వోవిరాన్)10 మందుల ధర 51.91. కానీ ఇదే ఔషధం 10 మందుల జనరిక్ ధర జనఔషధి స్టోర్ లో Rs. 3.35 మాత్రమే. 100 ఎంఎల్ కాఫ్ సిరప్ బ్రాండెడ్ వి అయితే 33 రూపాయలు పైనే. జనరిక్ దగ్గు మందు జనఔషధి స్టోర్ లో 13 రూపాయలకే లభిస్తుంది. జ్వరం తగ్గడానికి వాడే ప్యారాసిటమాల్ 500 మి గ్రా. 10 మాత్రల ధర బ్రాండెడ్ అయితే 13 రూపాయలు. జనరిక్ అయితే 2.45రూపాయలే.

👉 సూక్ష్మంగా చెప్పాలంటే బేసిక్ ఫార్ములా ప్రకారం తయారైన మందును జనరిక్ మందు అంటారు. ఇదే సూత్రంతో కార్పొరేట్ కంపెనీలు పేరు మార్చి మందులు ఉత్పత్తి చేస్తున్నాయి. ధరలో తేడా తప్పితే మందు పనిచేయడంలో ఎలాంటి వ్యత్యాసం ఉండదు. మందు పరిమాణం, రసాయనిక నామం, నాణ్యత ఒక్కటే గానీ.. లేబుల్, దానిపై బ్రాండ్ పేరు మారుతుంది.

జనరిక్ మందుల పట్ల సామాన్య ప్రజలకు చాలా అపోహలు అనుమానాలున్నాయి. వాటిని గూర్చి వివరించి ఉపయోగించేలా చేసే వ్యవస్థలు లేవు. ఇటీవల కాలంలో వీటిపట్ల ప్రజలకు కొంత అవగాహన పెరిగింది.

జన ఔషధి పధకం ద్వారా దేశంలో కొత్తగా 5000 మెడికల్ షాపులను ఏర్పాటు చేసారు. ఇలా ఎంతో మందికి ఉపాధి లభించడమే కాకుండా పేదలకు మందుల ఖర్చు మిగులుతుంది.

అందరికీ జనరిక్ మందుల పట్ల అవగాహన పెంచి మనం కూడా వీలైనంత ఆ మందులు వాడి డ్రగ్ మరియు ఫార్మా మాఫియా దోపిడీ ని అరికట్టాలి.


మురళీధర్
పోలీస్ నిఘా వరంగల్ స్టాఫర్



🌷🙏🌷

🙏🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺

No comments:

Post a Comment